
సాక్షి, తిరుమల: తిరుమలలో అతిథి గృహంలో భక్తులు లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు. గోవింద నిలయం అతిథిగృహంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అరగంట పాటు లిఫ్ట్‌లో ఐదుగురు భక్తులు ఉండగా, కరెంట్ వచ్చే వరకు ఏం చేయలేమంటూ సిబ్బంది పట్టించుకోలేదు.
తిరుమలో మరో ఘటన కలకలం రేపింది. కళ్యాణకట్టలో గుండు కొట్టేందుకు డబ్బులు డిమాండ్ చేసిన ఘటన వీడియో వైరల్‌గా మారింది. మహిళా క్షురకురాలు డబ్బులు వసూలు చేసే వీడియోను భక్తులు సోషల్ మీడియాలో పెట్టారు. వెంటనే ఆమెపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
