lift
-
అరుణవ్ చిరునవ్వులు.. ఇక కానరావు
నాంపల్లి: చిరునవ్వుల అరుణవ్ ఊపిరాగింది. ఇరు కుటుంబాల ఆశల కిరణం ఆరిపోయింది. లిఫ్టులో ఇరుక్కుని చావుబతుకుల నడుమ కొట్టుమిట్టాడుతూ నిలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆరేళ్ల బాలుడు అరుణవ్ శనివారం ఉదయం 11.30 గంటల సమయంలో మృతి చెందాడు. అరుణవ్‌ను బతికించడానికి నిలోఫర్ వైద్యులు శత విధాలా ప్రయతి్నంచినా ఫలితం దక్కలేదు. మెదడుకు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోవడంతో బాలుడు మృతి చెందినట్లు నిలోఫర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్.రవికుమార్ ప్రకటించారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించి బంధువులకు అప్పగించారు. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఒక్కగానొక్క కుమారుడు ఆరేళ్లకే కన్నుమూయడంతో అజయ్‌కుమార్ దంపతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. అత్తను చూసేందుకు వచ్చి.. గోడేఖీ ఖబర్ ప్రాంతానికి చెందిన అజయ్‌కుమార్ దంపతులకు ఒకే ఒక సంతానం. మగ పిల్లాడు పుట్టడంతో ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. అజయ్‌కుమార్ సోదరి, అరుణవ్ మేనత్త జయశ్రీ అలియాస్ ఆయేషా శాంతినగర్‌లో నివాసం ఉంటున్న ఇమ్రాన్‌తో ప్రేమ వివాహం చేసుకున్నారు. సోదరి ప్రేమ వివాహం చేసుకోవడంతో చాలా రోజులు అజయ్‌కుమార్ కుటుంబం జయశ్రీ అలియాస్ ఆయేషాతో దూరంగా ఉంటోంది. ఆయేషాకు ఇటీవల తన పుట్టింటితో బంధం మళ్లీ చిగురించింది. మాట్లాడుకోవడాలు, వచి్చపోవడాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే బాలుడు అరుణవ్ శుక్రవారం తన తాతయ్యతో కలిసి శాంతినగర్‌లోని మేనత్త ఇంటికి వచ్చి లిఫ్టులో ఇరుక్కుపోయాడు. అపస్మారక స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచాడు. రెండు కుటుంబాల మధ్య చిగురించిన బంధంలో బాలుడి మరణం విషాదాన్ని నింపింది. -
లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన లిఫ్ట్ టెక్నీషియన్
-
Hyderabad : లిఫ్ట్‌లో ఇరుక్కున్న బాలుడి పరిస్థితి విషమం
సాక్షి, హైదరాబాద్: మాసబ్‌ట్యాంక్ శాంతినగర్‌లోని ఓ అపార్ట్మెంట్లో లిఫ్ట్‌లో ఇరుక్కున్న బాలుడు ఆర్నవ్ (6) పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. నీలోఫర్ వైద్యులు బాలుడిని ఐసీయూలో ఉంచి చికిత్సనందిస్తున్నారు.పోలీసులు వివరాల మేరకు.. శుక్రవారం మాసబ్ ట్యాంక్‌కు చెందిన ఓ అపార్ట్మెంట్ లిఫ్ట్‌లో అర్నవ్ ఇరుక్కుపోయాడు. మూడో ఫ్లోర్ నుంచి కిందకు దిగే క్రమంలో లిఫ్ట్ ఆగిపోయింది. దీంతో లిఫ్ట్- స్లాబ్‌ల మధ్య ఇరుక్కున్న బాలుడు కేకలు వేశాడు. కేకలు విన్న అపార్ట్మెంట్ వాసులు పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక, డీఆర్ఎఫ్ సిబ్బంది సైతం ఘటనా స్థలికి చేరుకున్నారు. లిఫ్ట్-స్లాబ్‌ల మధ్య ఇరుక్కున్న బాలుడిని నాలుగు గంటల పాటు శ్రమించి వెల్డింగ్ మిషన్ల సాయంతో లిఫ్ట్ డోర్లు తొలగించి బయటకు తీశారు. అనంతరం, అత్యవసర చికిత్స నిమిత్తం నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం, బాలుడి పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు నీలోఫర్ వైద్యులు తెలిపారు. -
విద్యుత్ లేకుండా వాగు నీటిని ఎత్తిపోసే హైడ్రో లిఫ్ట్!
కొండ్ర ప్రాంత వాగుల్లో ఎత్తయిన ప్రాంతం నుంచి వాలుకు ఉరకలెత్తుతూ ప్రవహించే సెలయేళ్లు సందర్శకులకు కనువిందు చేస్తూ మనోల్లాసం కలిగిస్తుంటాయి. అయితే, ఆయా కొండల్లో వ్యవసాయమే జీవనాధారంగా బతికే రైతులకు మాత్రం ఈ సెలయేళ్లలో నీరు ఏ మాత్రం ఉపయోగపడదు. పొలాలు ఎత్తులో ఉండటమే కారణం. విద్యుత్ మోటార్లతో వాగుల్లో నిటిని రైతులు తోడుకోవచ్చు. అయితే, చాలా కొండ ప్రాంతాల్లో విద్యుత్ సదుపాయం ఉండదు. డీజిల్ ఇంజన్లు పెట్టుకునే స్థోమత రెక్కాడితే గాని డొక్కడని అక్కడి చిన్న, సన్నకారు రైతులకు అసలే ఉండదు. కళ్ల ముందు నీరున్నా ఆ పక్కనే కొద్ది ఎత్తులో ఉన్న తమ పొలాల్లో పంటలకు పెట్టుకోలేని అశక్తత ఆ రైతుల పేదరికాన్ని పరిహసిస్తూ ఉంటుంది. ఏజన్సీవాసులకు శాశ్వతంగా మేలు జరిగేలా వాగుల్లో పారే నీటిని విద్యుత్తు అవసరం లేకుండా ఎత్తిపోసేందుకు తన శక్తిమేరకు ఏదైనా ఉపాయం ఆలోచించాలని గ్రామీణ ఆవిష్కర్త పంపన శ్రీనివాస్(47) లక్ష్యంగా పెట్టుకున్నారు. కాకినాడ జిల్లా కైకవోలు ఆయన స్వగ్రామం. చదివింది ఐటిఐ మాత్రమే అయినా, లక్ష్యసాధన కోసం అనేక ఏళ్ల పాటు అనేక ప్రయోగాలు చేస్తూ చివరికి విజయం సాధించారు. వాగుల్లో నుంచి నీటిని విద్యుత్ లేకుండా పరిసర పొలాల్లోకి ఎత్తిపోయటంలో ఆయన సాధించిన విజయాలు రెండు: 1. పాతకాలపు ర్యాం పంపు సాంకేతికతను మెరుగుపరచి వాగుల్లో ర్యాం పంపులను ఏర్పాటు చేయటం. 2. హైడ్రో లిఫ్ట్ అనే కొత్త యంత్రాన్ని ఆవిష్కరించటం.హైడ్రో లిఫ్ట్ ఆవిష్కరణవాగులో 4–5 అడుగుల ఎత్తు నుంచి చెంగు చెంగున కిందికి దూకే నీటిని ఒడిసిపట్టి పరిసర పంట పొలాల్లోకి ఎత్తి΄ోసే ‘హైడ్రో లిఫ్ట్’ అనే వినూత్న యంత్రాన్ని శ్రీనివాస్ సొంత ఆలోచనతో, సొంత ఖర్చుతో ఆవిష్కరించారు. ఈ గ్రామీణ ఆవిష్కర్త రూపొందించిన చిన్న నమూనా ప్రొటోటైప్) యంత్రాన్ని ఉమ్మడి తూ.గో. జిల్లా దివిలికి సమీపంలోని ముక్కోలు చెక్‌డ్యామ్ వద్ద విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించారు. దీని పనితీరును నిపుణులు ప్రశంసించారు. ఇది మూడు అడుగుల పొడవు, ఒక డయామీటర్‌తో ఉంది. దీని చుట్టూతా అంగుళం బ్లేడ్లు వాలుగా అమర్చి వుంటాయి. నీటి ఉధృతికి లేదా వరదకు దుంగలు, రాళ్లు కొట్టుకొచ్చినా కదిలి΄ోకుండా ఉండేలా ఇనుప చట్రంలో ఈ చక్రాన్ని అమర్చారు. హైడ్రో లిఫ్ట్‌తో కూడిన ఈ చట్రాన్ని చెక్‌డ్యామ్ కింది భాగాన ఏర్పాటు చేశారు. సెకనుకు 20 లీటర్ల చొప్పున ఈ చక్రంపై పడేలా నీటి ప్రవాహం ఉంటే సెకనుకు 1 లీటరు నీటిని పొలంలోకి ఎత్తి΄ోయటానికి వీలవుతుందని శ్రీనివాస్ తెలి΄ారు. నీటి ప్రవాహ వేగం తక్కువగా వున్నా నిమిషానికి 40 సార్లు (ఆర్పిఎం) ఇది శక్తివంతంగా తిరుగుతోంది. ఈ బాక్స్ షాఫ్ట్నకు అమర్చిన పిస్టన్ 300 ఆర్పిఎంతో నడుస్తుంది. చిన్న హైడ్రో లిఫ్ట్‌తో ఎకరానికి నీరునిమిషానికి 60 లీటర్ల నీటిని వాగులో నుంచి 20 అడుగుల ఎత్తుకు (40 అడుగుల ఎత్తుకైతే నిమిషానికి 40 లీటర్లు) తోడే శక్తి ఈ ప్రోటోటైప్ హైడ్రో లిఫ్ట్‌కు ఉంది. ఈ నీరు పారగడితే ఎకరంలో కూరగాయల సాగుకు సరిపోతుందని, డ్రిప్ ఏర్పాటు చేసుకుంటే ఎకరానికి సరిపోతుందని శ్రీనివాస్ తెలిపారు. దీని తయారీకి రూ. 35 వేలు ఖర్చవుతుందని, వాగులో ఇన్స్టాల్ చేయటానికి అదనంగా ఖర్చవుతుందన్నారు. వాగు నీటి ఉధృతిని బట్టి, అధిక విస్తీర్ణంలో సాగు భూమి నీటి అవసరాలను బట్టి హైడ్రో లిఫ్ట్ పొడవు 9–16 అడుగుల పొడవు, 2–4 అడుగుల డయామీటర్ సైజులో తయారు చేసుకుంటే అధిక పరిమాణంలో నీటిని ఎత్తిపోయవచ్చునని శ్రీనివాస్ వివరించారు. గత అక్టోబర్‌లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో శోధాయాత్రలో భాగంగా పల్లెసృజన అధ్యక్షులు పోగుల గణేశం బృందం ఈ హైడ్రో లిఫ్ట్ పనితీరును పరిశీలించి మెచ్చుకున్నారన్నారు. పల్లెసృజన తోడ్పాటుతో పేటెంట్ కోసం దరఖాస్తు చేయబోతున్నాన్నారు. ప్రభుత్వం ఆర్థిక తోడ్పాటునందించి పెద్ద హైడ్రో లిఫ్టులను తయారు చేసి పెడితే కొండ ప్రాంతవాసుల సాగు నీటి కష్టాలు కొంతైనా తీరుతాయి. ర్యాం పంపుతో పదెకరాలకు నీరుఎత్తు నుంచి లోతట్టు ప్రాంతాలకు పారే వాగు నీటిని ఒడిసిపట్టే ర్యాం పంపు సాంకేతికత ఇప్పటికే అందుబాటులో ఉంది. ఏజన్సీవాసుల నీటి కష్టాలు తీర్చేందుకు విద్యుత్ అవసరం లేకుండా పనిచేసే ఈ ర్యాం పంపును మెరుగైన రీతిలో వినియోగంపై శ్రీనివాస్ తొలుత కృషి చేశారు. వివిధ సంస్థల తోడ్పాటుతో కొన్ని చోట్ల ర్యాం పంపులు ఏర్పాటు చేశారు. అయితే, ర్యాం పంపు సాంకేతికతకు ఉన్న పరిమితులు కూడా ఎక్కువేనని శ్రీనివాస్ గ్రహించారు. ర్యాం పంపు అమర్చాలి అంటే.. వాగులో 4 నుండి 6 అడుగుల ఎత్తు నుంచి నీరు కిందికి పారే చిన్నసైజు జలపాతం ఉండాలి. ఆ నీటిని ప్రవాహానికి ఎదురుగా పొడవాటి ఇనుప గొట్టాన్ని అమర్చి, ఆ గొట్టం ద్వారా ఒడిసిపట్టిన నీటిని పిస్టన్ల ద్వారా ఎత్తిపోసేందుకు ఏర్పాట్లు చేస్తారు. ఒక్కో ర్యాం పంపు బెడ్‌పైన రెండు పిస్టన్లు అమర్చుతారు. ఒక పిస్టన్ను కాలితో లేదా చేతితో రెండు మూడు సార్లు కిందికి నొక్కితే చాలా ఇక వాటంతట అవే రెండు పిస్టన్లు ఒకదాని తర్వాత మరొకటి, పైకి కిందకు లేచి పడుతూ ఉంటాయి. అలా పిస్టన్లు పనిచేయటం వల్ల నీరు వత్తిడి ద్వారా పక్కనే ఏర్పాటు చేసిన ఒక నాన్ రిటర్న్ వాల్వ్‌కు అమర్చిన పైపు ద్వారా పంట పొలాలకు నీరు ఎత్తి΄ోస్తారు. రెండున్నర అంగుళాల పైపు ద్వారా నీరు వెళ్తుంది. ర్యాం పంపు నెలకొల్పడానికి రూ. 2.5–3.5 లక్షలు ఖర్చవుతుంది. ఒకసారి పెట్టుబడి పెడితే రోజుకు కనీసం 10 ఎకరాలకు నీటిని పారించవచ్చు. విద్యుత్తు అవసరం లేదు. పిస్టన్లకు ఆయిల్ సీల్స్ లాంటి విడి భాగాలు ఏవీ ఉండవు కాబట్టి, నిర్వహణ ఖర్చేమీ ఉండదు. ర్యాం పంప్‌ల తయారీకి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ రీసెర్చ్ (సీడీఆర్), టాటా ట్రస్టు విసిఎఫ్, సిసిఎల్ తదితర సంస్థలు ఆర్థిక సహాయాన్నందించాయి. ర్యాం పంపుల పరిమితులు అయితే, కనీసం 8–10 అడుగుల ఎత్తు నుంచి కిందికి నీరు పారే చోట్ల మాత్రమే ర్యాం పంపును నిర్మించగలం. ఇందుకు అనుకూలమైన చోట్లు చాలా తక్కువే ఉంటాయి. దీన్ని నెలకొల్పడానికి సిమెంటు కాంక్రీటుతో పునాదిని నిర్మించాలి. బండ రాళ్లు అనువైన రీతిలో ఉంటేనే సివిల్ వర్క్ చేయడానికి అనుకూలం. అందువల్ల కాంక్రీట్ వర్క్ కొన్నిచోట్ల విఫలమవుతూ ఉంటుంది. ర్యాం పంపులకు ఉన్న ఈ పరిమితుల దృష్ట్యా తక్కువ ఎత్తు నుంచి నీరు పారే చోట్ల నుంచి నీటిని ఎత్తిపోసే కొత్త యంత్రాన్ని తయారు చేస్తే ఎక్కువ భూములకు సాగు నీరందించవచ్చన్న ఆలోచన శ్రీనివాస్ మదిలో మెదిలింది. అలా పుట్టిన ఆవిష్కరణే ‘హైడ్రో లిఫ్ట్’. ఇటు పొలాలకు నీరు.. అటు ఇళ్లకు విద్యుత్తు!రంపచోడవరం, చింతూరు, పాడేరు ఐటిడిఏల పరిధిలో కొండలపై నుంచి వాగులు, వంకలు నిత్యం ప్రవహిస్తున్నాయి. వాగు నీటి ప్రవాహ శక్తిని బట్టి వాగు ఇరువైపులా ఉన్నటు భూమి ఎత్తు, స్వభావాన్ని బట్టి తగినంత రూ. 15–20 లక్షల ఖర్చుతో 9–16 అడుగుల వరకు పొడవైన హైడ్రో లిఫ్ట్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. దీని ద్వారా 6 అంగుళాల పంపుతో విద్యుత్ లేకుండానే వాగు ఇరువైపులా 50 నుంచి 100 ఎకరాల భూమికి సాగు నీరు అందించవచ్చు. అంతేకాకుండా, ఒక్కో వాటర్ వీల్ ద్వారా 15 కెవి విద్యుత్‌ను తయారు చేసి సుమారు 20–30 కుటుంబాలకు అందించవచ్చు. ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి, సైన్స్ అండ్ టెక్నాలజీ, గిరిజనాభివృద్ధి శాఖలు, స్వచ్ఛంద సేవా సంస్థలు హైడ్రో లిఫ్ట్ పద్ధతిని ప్రోత్సహిస్తే నా వంతు కృషి చేస్తా. – పంపన శ్రీనివాస్ (79895 99512), గ్రామీణ ఆవిష్కర్త, కైకవోలు, పెదపూడి మండలం, కాకినాడ జిల్లా – లక్కింశెట్టి శ్రీనివాసరావు, సాక్షి, ప్రతినిధి కాకినాడ -
అంకుల్ ప్లీజ్ లిఫ్ట్ అని అడుగుతున్నావా చిన్నా..!
‘పిల్లలు స్కూల్‌ను నడుచుకుంటూ వెళ్లి... పరిగెత్తుకుంటూ ఇంటికొస్తారు’ అని ΄త రోజుల్లో అనుకునేవారు. ఇప్పుడు చాలామంది పిల్లలు నడవడం లేరు. బస్, ఆటో, వ్యాన్ వస్తుంది. లేదా నాన్నో, అమ్మో, ఇంటి కారో దింపుతుంది. మళ్లీ పికప్ చేసుకుంటుంది. అయితే ఇలా కాకుండా చాలామంది పిల్లలు తమ సొంతగా స్కూలుకు వెళ్లాల్సి ఉంటుంది. వీళ్లు సైకిల్ తొక్కుకుంటూ వస్తారు. లేదా షేర్ ఆటో ఎక్కి వస్తారు. లేదా ఆర్టీసి బస్ ఎక్కి వస్తారు. నడవడం ఇష్టం ఉన్నవాళ్లు నడుస్తారు. కాని కొందరు మాత్రం ‘అంకుల్... లిఫ్ట్’ అని రోడ్డు మీద నిలబడి టూవీలర్ ఎక్కి దిగుతారు. ఉదయం స్కూలు మొదలయ్యే టైమ్‌లో, సాయంత్రం స్కూల్ విడిచే టైములో అమ్మాయిలు, అబ్బాయిలు ‘లిఫ్ట్’ అడగడం చాలాఊళ్లలో కనపడుతుంది. పల్లెటూళ్లలో, సిటీల్లో కూడా ఇలాంటి పిల్లలు ఉంటారు. వీరిని చూసిన వాహనదారులు ‘΄ాపం చిన్నపిల్లలు కదా’ అని లిఫ్ట్ ఇస్తారు. ఈ లిఫ్ట్ ఇచ్చేవాళ్లు మంచివాళ్లైతే సరే. చెడ్డ వాళ్లయితేనో? అందుకే పోలీసులు స్కూలు పిల్లలను లిఫ్ట్ అడిగి రాక΄ోకలు చేయవద్దని గట్టిగా హెచ్చరిస్తున్నారు. అందుకే ఇక్కడున్న విషయం మీరు చదివి, మీ అమ్మానాన్నలకు, స్కూల్ టీచర్లకు కూడా చూపించండి.రోడ్డు మీద అపరిచితులను లిఫ్ట్ అడగకూడదు. ఎందుకంటే వాళ్లు హెల్మెట్‌లో ఉంటారు. వెనుక కూచున్న మీకు ఇవ్వడానికి వాళ్ల దగ్గర హెల్మెట్ ఉండదు. వాళ్లు పొరపాటున యాక్సిడెంట్ చేస్తే వాళ్లకు ఏమీ కాక΄ోయినా మీకు దెబ్బలు తగులుతాయి.లిఫ్ట్ అడిగితే వచ్చే ప్రమాదాలు:లిఫ్ట్ ఇచ్చే వాళ్లకు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ప్రమాదం. వాహనానికి ఇన్సూరెన్స్ లేకపోతే ప్రమాదం. వారు మద్యం సేవించి ఉంటే బండిని పడేసే చాన్సులే ఎక్కువ.లిఫ్ట్ ఇచ్చే వాళ్లు నేరస్తులైతే? మీకై మీరు ఎక్కిన బండిని వారు వేగంగా నడుపుతూ మిమ్మల్ని కిడ్నాప్ చేస్తే? ఆ ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. అప్పుడు బండి మీద నుంచి ఎలా దిగి బయటకు పడాలో మీకు తెలియదు. భయంలో బుర్ర పని చేయదు.లిఫ్ట్ ఇచ్చేవాళ్లు ‘బ్యాడ్ టచ్’ చేసే వారైతే. మీరు భయంతో వాళ్ల బ్యాడ్ టచ్‌ను స్టాప్ చేయక΄ోతే మరుసటి రోజు అదే సమయానికి వాళ్లు లిఫ్ట్ ఇవ్వడానికి వస్తారు. మెల్లగా మీ ఫోన్ నంబర్ తీసుకుని పరిచయం పెంచుకుంటారు. ఆ తర్వాత స్కూల్‌కి కాకుండా మరెక్కడెక్కడికో మిమ్మల్ని తీసుకెళతారు.ఇటీవల డ్రగ్స్ ఎక్కువయ్యాయి. పోలీసుల నిఘా ఎక్కువైంది. వాహనదారులు సేఫ్టీ కోసం మీ స్కూల్ బ్యాగ్‌లో ప్యాకెట్ ఉంచి మిమ్మల్ని ఎక్కించుకుని డ్రాప్ చేయవచ్చు. ఆ సమయంలో దొరికితే ఇంకా ప్రమాదం. -
గనిలో చిక్కుకున్న 14 మంది అధికారులు.. కొనసాగుతున్న సహాయక చర్యలు!
రాజస్థాన్‌లోని నీమ్ కా థానా జిల్లాలో మంగళవారం రాత్రి హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్‌లో ప్రమాదం సంభవించింది. సంస్థకు చెందిన 14 మంది అధికారులు, విజిలెన్స్ బృందం సభ్యులు గనిలో చిక్కుకున్నారు.ఉద్యోగులను గని లోపలికి, బయటికి తరలించేందుకు ఉపయోగించే వర్టికల్ షాఫ్ట్ పనిచేయకపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మైనింగ్ అధికారి ఒకరు తెలిపిన వివరాల ప్రకారం గనిలో చిక్కుకున్న అధికారులను బయటకు తీసుకువచ్చే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కోలిహన్ గని వద్ద విజిలెన్స్ బృందం కంపెనీ సీనియర్ అధికారులతో కలిసి తనిఖీలు చేసేందుకు వందల మీటర్ల మేర గనిలోకి దిగింది. వారు పైకి వస్తున్న సమయంలో షాఫ్ట్ (కేజ్) వైర్ తెగిపోయింది. దీంతో గని లోపల తనిఖీ చేయడానికి వెళ్లిన 14 మంది అధికారులు లోపలే చిక్కుకుపోయారు.సమాచారం అందుకున్న వెంటనే ఖేత్రికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే ధరంపాల్ గుర్జార్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలంలో పలువురు అధికారులతో పాటు ఏడు అంబులెన్స్‌లు ఉన్నాయి. అధికారులను బయటకు తీసుకువచ్చే పనిలో రెస్క్యూ టీమ్ నిమగ్నమైంది. ప్రస్తుతానికి ప్రాణనష్టం గురించి ఎలాంటి సమాచారం లేదు. -
లిఫ్ట్ లో ఇరుక్కుపోయి బ్యాంక్ సెక్యూరిటీ గార్డు
-
లిఫ్ట్‌లో ఇరుక్కుపోయి విలవిలలాడిన సెక్యూరిటీ గార్డు
నిజామాబాద్: కోటగల్లి షాపింగ్ కాంప్లెక్స్ లో దారుణం చోటుచేసుకుంది.. కోటగల్లి షాపింగ్ కాంప్లెక్స్ లిఫ్టులో బుధవారం హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ సెక్యూరిటీ గార్డు ఇరుక్కుపోయి రెండు కాళ్లు బయట బాడీ లోపల ఉండిపోవడంతో గంటకు పైగా ప్రాణపాయ స్థితిలో కొట్టుమిట్టాడు. ఈ ప్రమాదంలో సెక్యూరిటీ గార్డ్ మహేందర్ గౌడ్ రెండు కాళ్ళు బయట..బాడీ లిఫ్ట్ లో ఇరుక్కుపోడంతో కాళ్లు చేతులు విరిగి కొన ఊపిరి ఉండడంతో హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
లిఫ్ట్‌లోకి కుక్క.. మహిళతో రిటైర్డ్ ఐఏఎస్ డిష్యుం డిష్యుం
పెంపుడు కుక్క విషయంలో తలెత్తిన వివాదం.. ఓ మాజీ ఐఏఎస్ అధికారి, మహిళ మధ్య తీవ్ర గొడవకు దారి తీసింది. అపార్ట్మెంట్లోని లిఫ్ట్‌లోకి పెంపుడు కుక్కను తీసుకురావడంతో దాని మాజమాని, మరో నివాసితుడికి వాగ్వాదం జరిగింది. ఇరువురు విచక్షణ మరిచి తగువులాడుకున్నారు. ఏకంగా చెంప దెబ్బలు కొట్టుకున్నారు. ఈ ఘటన ఉత్తర ప్రధేశ్లోని గ్రేటర్ నోయిడాలోవెలుగుచూసింది. దీనికి సంబంధించిన దృశ్యాలు లిఫ్ట్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. వివరాలు.. నోయిడాలోని 108 సెక్టర్ పార్క్ లారేట్ సొసైటీలోని ఓ అపార్ట్మెట్లోని ఓ మహిళ కుక్కను పెంచుకుంటోంది. ఆమె ఆ కుక్కను ఇటీవల అపార్ట్మెంట్లోని లిఫ్ట్‌లోకి తీసుకెళ్లింది. అయితే ఓ మాజీ ఐఏఎస్ అధికారి ఒకరు అందుకు అంగీకరించలేదు. కుక్క విషయంతో రిటైర్డ్ అధికారి, మహిళ మద్య తీవ్ర వాగ్వాదం తలెత్తింది. లిఫ్ట్‌లో కుక్కను తీసుకొచ్చిన ఫోటోను తీస్తుండగా మహిళ అతని ఫోన్ లాక్కుంది. వెంటనే సదరు అధికారి కూడా మహిళ ఫోన్ లాక్కున్నాడు. ఇది ఇరువురి మధ్య ఘర్షణకు దారితీసింది. చెంపదెబ్బల వర్షం ఈ గొడవలో వ్యక్తి మహిళను చెంపదెబ్బ కొట్టినట్లు కనిపిస్తోంది. ఆమె కూడా వ్యక్తిని అడ్డుకొని దాడి చేసినట్లు తెలుస్తోంది. అంతేగాక మహిళ తనపై జరిగిన దాడి విషయాన్ని భర్తకు చెప్పడంతో ఆయన కూడా గొడవలోకి ప్రవేశించాడు. ఇతర నివాసితులు లిఫ్ట్‌లోకి రాకుండా మహిళ అడ్డుకోవడంతో ఆమె భర్త వ్యక్తిపై చెంపదెబ్బల వర్షం కురిపించాడు. చివరికి అపార్ట్మెంట్ సెక్యూరిటీ సిబ్బంది కల్పించుకొని ఇద్దరిని వీడదీయడంతో గొడవ సద్దుమణిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పోలీసులు అపార్ట్మెంట్ వద్దకు చేరుకొని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. అయితే తమపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఇరువర్గాలు పోలీసులకు లిఖితపూర్వకంగా రాసి ఇచ్చాయి. కానీ ఈ కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: ఆసుపత్రిలో బెడ్స్ కొరత.. మాజీ ఎంపీ కొడుకు కన్నుమూత Fight Over taking a Dog 🐕 inside Lift (Obviously in Noida). First Retired IAS Officer beat 👊 a Women Then her Husband beat 👊 that IAS Officer Dog 🐕 Enjoyed Both 🤗😅#UttarPradesh #NationalUnityDay #SardarVallabhbhaiPatel #राष्ट्रीय_एकता #SardarPatelJayanti… pic.twitter.com/H1J18BEEVO — Dr Jain (@DrJain21) October 31, 2023 పెరుగుతున్న గొడవలు పెంపుడు కుక్కులను లిఫ్ట్లలోకి తీసుకెళ్లవచ్చా అనే విషయంపై దేశవ్యాప్తంగా పెంపుడు జంతువుల యజమానులు, అపార్ట్మెంట్ నివాసితుల మధ్య చాలా కాలంగా వివాదం నడుస్తుంది. ఇటీవలి కాలంలో ఇలాంటి సమస్యలపై గొడవలు పెరుగుతున్నాయి. నోయిడాలోని అనేక అపార్ట్మెంట్లు పెంపుడు కుక్కలను లిఫ్ట్‌లోకి తీసుకెళ్లడాన్ని నిషేధించాయి. అయితే వాటి మాజమానులు మాత్రం అలాంటి ఆదేశాలు చట్టబద్దమైనవి కావని వాదిస్తున్నారు.. గతేడాది సైతం అపార్ట్మెంట్ లిఫ్ట్‌లో ఆరేళ్ల చిన్నారిని కరిచినందుకు పెంపుడు కుక్క మాజమానికి గ్రేటర్నోయిడా అడ్మినిస్ట్రేషన్ రూ. 10 వేల జరిమానా విధించింది. -
‘మూసీ’కి పెరిగిన ఇన్‌ఫ్లో.. ఒక గేటు ఎత్తివేత
కేతేపల్లి: నల్లగొండ జిల్లా కేతేపల్లి మండల పరిధిలోని మూసీ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో పెరిగింది. దీంతో మంగళవారం అధికారులు ప్రాజెక్టు ఒక గేటును ఎత్తి దిగువకు నీటిని వదిలారు. హైదరాబాద్ నగరంతో పాటు మూసీ ఎగువ ప్రాంతాల్లో అక్కడక్కడ కురుస్తున్న వర్షాలతో మూసీ ప్రాజెక్టుకు 892 క్యూసెక్కుల వరదనీరు వస్తోంది. మూసీ గరిష్ట నీటిమట్టం 645 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 644.10 అడుగులు ఉంది. దీంతో అధికారులు ఒక క్రస్టు గేటును ఒక అడుగు మేర ఎత్తి 609 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఆయకట్టులో పంటల సాగు కోసం ప్రాజెక్టు కుడి, ఎడమ ప్రధాన కాల్వల ద్వారా 509 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మూసీ రిజర్వాయర్‌లో పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 4.22 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు. -
లిఫ్ట్‌లో ఇరుక్కుంటున్నారు.. సర్వేలో ఆసక్తికర విషయాలు
సాక్షి, హైదరాబాద్: ఇటీవల కాలంలో బహుళ అంతస్తుల భవనాలు పెరిగాయి. గేటెడ్ కమ్యూనిటీల్లో 20 ఫోర్లకు పైనే నిర్మిస్తున్నారు. అపార్ట్మెంట్లలోనే కాకుండా ఇల్లు, కార్యాలయం, షాపింగ్ మాల్స్, ఫ్యాక్టరీలు ఇలా ఎక్కడయినా.. మెట్లపైనుంచి నడిచివెళ్లే వారికంటే.. లిఫ్ట్ ఎక్కడుందా అని వెతికేవారే ఎక్కువ. బహుళ అంతస్తుల భవనాల్లో ఇళ్లలో ఉండేవారు, కార్యాలయాల్లో పనిచేసేవారు వయసుతో సంబంధం లేకుండా దాదాపు ప్రతినిత్యం లిఫ్ట్‌లు వాడుతూనే ఉన్నారు. అయితే ఇటీవల లిఫ్ట్‌లు పనిచేయక అందులో ఇరుక్కుని ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఆగస్టు 3న ఢిల్లీలోని నోయిడా సెక్టార్ 137లో జరిగిన ఓ ఘటనలో 70 ఏళ్ల వృద్ధురాలు 45 నిమిషాలపాటు లిఫ్ట్‌లో ఇరుక్కుని తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చివరకు ప్రాణాలు కోల్పోయారు. లిఫ్ట్ వాడకం అన్నది నిత్య జీవితంలో భాగమైంది. అయితే లిఫ్ట్ వాడకం, దాని నిర్వహణ తదితర అంశాలపై లోకల్ సర్కిల్స్ సంస్థ దేశవ్యాప్తంగా 329 జిల్లాల్లో 42 వేల మందిని సర్వే చేసింది. ఇందులో 61 శాతం మంది పురుషులు, 39 శాతం మంది మహిళలు పాల్గొని వారి అభిప్రాయాలు వెల్లడించారు. ఈ సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. గత మూడేళ్లలో తమ గృహ సముదాయంలో లేదా కార్యాలయంలో తాము కానీ, తమ కుటుంబ సభ్యులు కానీ లిఫ్ట్‌లో ఇరుక్కుని ఇబ్బందిపడ్డారని 58 శాతం మంది అభిప్రాయం వెల్లడించారు. లిఫ్ట్‌ల నిర్వహణపై ప్రభుత్వం కచ్చితమైన నిబంధనలు నిర్ణయించాలా? కచ్చితమైన నిబంధనలు రూపొందించాలి 76 శాతం మంది అలా చేయడం వల్ల సమస్యలు పెరుగుతాయి... అమలు కూడా సాధ్యం కాదు 24 శాతం మంది -
దారుణం: మూడు రోజులపాటు లిఫ్ట్‌లో ఇరుక్కుని.. గొంతు పోయేలా అరిచినా..
ఉజ్బెకిస్థాన్‌లోని తాష్కెంట్లో దారుణం జరిగింది. ఓల్గా లియోన్టీవా(32) అనే మహిళ ప్రమాదవశాత్తు లిఫ్ట్‌లో ఇరుక్కుని ప్రాణాలు కోల్పోయింది. లిఫ్ట్‌లో ఇరుక్కున్న మహిళ మూడు రోజుల పాటు సహాయం కోసం దిక్కులు పిక్కటిల్లేలా అరిచినా ఎక్కడి నుంచి సహాయం అందలేదు. దీంతో చివరికి ప్రాణాలు కోల్పోయింది. భవంతి 9వ ఫ్లోర్లో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. తొమ్మిది ఫ్లోర్ల భవంతి నుంచి ఓల్గా లియోన్టీవా కిందకు దిగడానికి బయలు దేరింది. లిఫ్ట్‌లోకి ఎక్కే ప్రయత్నంలో ఆమె దానిలో ఇరుక్కుపోయింది. ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోయింది. ఎంత అరిచినా ఎవరూ గుర్తించకపోవడంతో సహాయం అందలేదు. జులై 24న ఈ ఘటన జరగగా.. ఆమె ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. గాలింపు చేపట్టిన పోలీసులు.. బాధితురాలు లిఫ్ట్‌లో ఇరుక్కుని చనిపోయినట్లు గుర్తించారు. చైనాలో తయారు చేసిన లిఫ్ట్‌గా గుర్తించిన పోలీసులు.. అది పనిచేయకపోవడమే కారణంగా గుర్తించారు. ఎలాంటి కరెంట్ కట్లు లేవని తేల్చారు. ఇలాంటి ఘటనే ఇటలీలోనూ ఇటీవల జరిగింది. కరెంట్ కట్ అయిన కారణంగా లిఫ్ట్ పనిచేయలేదు. దీంతో అందులో ఉన్న ఓ వ్యక్తి మృతి చెందాడు. ఇదీ చదవండి: నైగర్‌లో సైనిక తిరుగుబాటు.. ఫ్రాన్స్ దేశస్తులు తిరుగు టపా.. -
తలా లైఫ్ లో ఫస్ట్ టైం ఇలా...
-
లిఫ్టులో ఇరుక్కున్న మంత్రి.. ఎంత ఇబ్బంది పడ్డాడో
-
మంచితనమే శాపమైన వేళ.. లిఫ్ట్ ఇచ్చిన పాపానికి దోచేశారు!
విజయనగర్‌కాలనీ(హైదరాబాద్): లిఫ్ట్ ఇచ్చిన పాపానికి ఓ వ్యక్తిని చంపుతామని బెదిరించి అందినకాడికి దోచుకున్న సంఘటన ఆసిఫ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఏసీపీ ఆర్.జి.శివమారుతి తెలిపిన కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. చంద్రాయణగుట్టకు చెందిన కె.జయంత్ ప్రైవేటు స్కూల్ టీచర్, ఈ నెల 6న సాయంత్రం రాజేంద్రనగర్ నుంచి మెహిదీపట్నం వైపు బైక్‌పై వెళుతున్నాడు. పీవీ ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నెంబర్ 294 వద్ద ఆగాపురాకు చెందిన మహ్మద్ షాహిద్ అలియాస్ సైఫ్ అనే వ్యక్తి తన తల్లికి యాక్సిడెంట్ అయ్యిందని అర్జంట్‌గా వెళ్లాలని మోహిదీపట్నం వరకు లిఫ్ట్ అడిగి ఎక్కాడు. మెహిదీపట్నం పిల్లర్ నెంబర్ 28 వద్దకు రాగానే పక్కనే ఉన్న గల్లీలో దించాలని కోరాడు. అప్పటికే అక్కడ ఉన్న షాహిద్ స్నేహితులు షేక్ అక్రమ్, మహ్మద్ నసీర్ ముగ్గురు కలిసి జయంత్‌ను భోజగుట్ట స్మశానవాటిక వద్దకు తీసుకెళ్లారు. కొట్టి చంపుతామని బెదిరించి అతని వద్ద ఉన్న రూ.40 వేలు లాక్కున్నారు. అతని ఫోన్ నంబర్ తీసుకుని బెదిరించి పలు దఫాలుగా గూగుల్ పే ద్వారా రూ.51 వేలు బదిలీ చేయించుకున్నారు. ఈ నెల 13న బాధితుడు ఆసిఫ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ పుటేజీ ఆధారంగా గురువారం నిందితులను అరెస్ట్ చేశారు. సమావేశంలో ఆసిఫ్‌నగర్ ఇన్స్పెక్టర్ జీహెచ్.శ్రీనివాస్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్ రెడ్డి, ఎస్.ఐ. కె.శ్రీనివాసతేజ, క్రైమ్ సిబ్బంది టి.రవీంద్రనాథ్, బి.విద్యాసాగర్, జె.అచ్చిరెడ్డి, జి.రాహుల్, బి.సంతోష్ తదితరులు పాల్గొన్నారు. (చదవండి: చంపేసి శవాన్ని సొంతూరుకు సాగనంపి..) -
రూ. 10 వేలు కట్టండి.. ఖర్చులు భరించండి
నోయిడా: బహుళ అంతస్తుల భవంతి లిఫ్ట్‌లో ఆరేళ్ల విద్యార్థిపై పెంపుడు శునకం దాడి ఘటనలో కుక్క యజమానిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. చిన్నారి చేతికి గాయం కావడంతో చికిత్సకయ్యే ఖర్చంతా భరించాలని, మరో రూ.10,000 పరిహారంగా చెల్లించాలని ఆయనను గ్రేటర్ నోయిడా అథారిటీ ఆదేశించింది. గ్రేటర్ నోయిడా(పశ్చిమం)లోని విలాసవంత లా రెసిడెన్షియా సొసైటీలో మంగళవారం ఈ ఘటన జరిగింది. సొసైటీలో ఉండే ఒకావిడ తన కొడుకుతో కలిసి లిఫ్ట్‌లో వెళ్తుండగా అప్పుడే ఒకతను తన కుక్కతో సహా లిఫ్ట్‌లోకి వచ్చాడు. వచ్చీరాగానే బాలుడిని కుక్క కరిచేసింది. దీంతో సీసీటీవీ ఫుటేజీ సాక్ష్యంతో ఐపీసీ సెక్షన్ 289 కింద కేసు నమోదుచేసినట్లు పోలీసులు చెప్పారు. ‘కుక్కను అదుపుచేయడంలో మీరు విఫలమయ్యారు’ అని అతడికి పంపిన నోటీసులో గ్రేటర్ నోయిడా అథారిటీ ఆరోగ్యవిభాగాధిపతి డాక్టర్ ప్రేమ్‌చంద్ పేర్కొన్నారు. రూ.10వేలు, చికిత్స ఖర్చు ఏడు రోజుల్లో చెల్లించకపోతే చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. -
స్కూల్ పిల్లలకు లిఫ్ట్ ఇచ్చిన ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి
-
కాళ్లకు చెప్పులు లేవ్.. ‘కుటుంబం ఆకలి తీర్చాలిగా!’
వైరల్: మంచి కంటే చెడునే తొందరగా మనిషి దృష్టిని ఆకర్షిస్తుంది. అందునా సోషల్ మీడియాలోనూ అదే తరహా కంటెంట్‌పై ఎక్కువగా చర్చ నడుస్తుంటుంది కూడా. అలా చేశారు.. ఇలా చేశారు అంటూ డెలివరీ బాయ్‌లు/ఏజెంట్ల గురించి రకరకాల కథనాలు వైరల్ అవుతుంటాయి. ఎంతసేపు నెగెటివ్ విషయాలేనా? అప్పుడప్పుడు మంచిపై కూడా ఓ లుక్కేద్దాం. తారిఖ్ ఖాన్ అనే వ్యక్తి.. లింకెడ్ఇన్లో ఈమధ్య ఓ పోస్ట్ షేర్ చేశారు. ఎలివేటర్లో ఉండగా ఓ ఫుడ్ డెలివరీ ఏజెంట్ ఆయన దృష్టిని ఆకర్షించారట. అతని కాళ్లకు చెప్పులు, షూస్ లేకుండా కనిపించాడట. ఎందుకలా వచ్చావ్? అని అడిగితే.. దారిలో చిన్నయాక్సిడెంట్ అయ్యిందని, చెప్పులు ఎక్కడో పడిపోయాయని, పైగా కాలికి గాయంతో వాపు వచ్చిందని, అందుకే వేసుకోలేదని చెప్పాడు ఆ డెలివరీబాయ్. అలాంటప్పుడు పని ఆపి కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు కదా అని అతనికి సూచించాడు తారిఖ్. దానికి అతను నవ్వుతూ.. ‘నాకంటూ ఓ కుటుంబం ఉంది సార్. ఆ కుటుంబాన్ని పోషించుకోవాలి కదా’’ అంటూ లిఫ్ట్ బయటకు వెళ్లిపోయాడు. పోతూ పోతూ మర్యాదపూర్వకంగా శుభసాయంత్రం సార్ అని చెప్పివెళ్లిపోయాడు అని తారిఖ్ ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. కష్టపడి పనిచేయడానికి, అవసరమైన వేళలో నన్ను నేను ముందుకు వెళ్లడానికి ఇతనిలాంటి వ్యక్తులే నాకు స్ఫూర్తి అంటూ తారిఖ్ ఖాన్ లింకెడ్ఇన్లో ఆ పోస్ట్ షేర్ చేశారు. అంతేకాదు.. అతనికి సాయం కూడా అందించాడు. సదరు కంపెనీ కూడా ఆ డెలివరీ బాయ్ లాంటి వాళ్ల కష్టాన్ని గుర్తించాలని కోరాడు తారిఖ్. అతనికి ఎవరైనా సాయం చేయాలని అనుకుంటే.. తనకు సందేశం పంపాలని, ఆ డెలివరీ ఏజెంట్ పేటీఎం నెంబర్ ఇస్తానని చెప్పాడు తారిఖ్. ఎక్కడ జరిగిందో క్లారిటీ లేకపోయినా.. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియా దృష్టిని విపరీతంగా ఆకట్టుకుంది. -
జాన్సన్ లిఫ్టుల్లో ‘వాచ్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లిఫ్టులు, ఎస్కలేటర్స్ తయారీలో ఉన్న జాన్సన్ లిఫ్ట్స్.. వాచ్ పేరుతో ఐవోటీ ఆధారిత వైర్లెస్ సాఫ్ట్వేర్ పరికరాన్ని అభివృద్ధి చేసింది. లిఫ్ట్ స్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడమేగాక సమస్య తలెత్తితే ఈ పరికరం వెంటనే గ్రహించి డేటా సెంటర్‌కు సమాచారం చేరవేస్తుంది. సాంకేతిక సిబ్బంది రంగంలోకి దిగి సమస్యను త్వరగా పరిష్కరించేందుకు వాచ్ ఉపయోగపడుతుందని కంపెనీ ప్రకటించింది. చదవండి: ఒకటికి మించి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా? ఇలాగైతే సమస్యలు తప్పవ్! -
ముంబై: స్కూల్ లిఫ్ట్‌లో ఇరుక్కొని టీచర్ మృతి
ముంబై: స్కూల్ లిఫ్ట్‌లో ఇరుక్కొని 26 ఏళ్ల మహిళా టీచర్ మృతి చెందింది. ఈ విషాద ఘటన మహరాష్ట్ర రాజధాని ముంబై నగరంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నార్త్ ముంబై శివారు ప్రాంతమైన మలాడ్‌లోని సెయింట్ మేరీస్ ఇంగ్లీష్ హైస్కూల్లో జెనెల్ ఫెర్నాండేజ్ టీచర్‌గా విధులు నిర్వహిస్తుంది. శుక్రవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో ఆరో అంతస్తులో క్లాస్ పూర్తి చేసుకున్న జెనెల్.. రెండో అంతస్తులోని స్టాఫ్ రూమ్‌కు వెళ్లేందుకు లిఫ్ట్ కోసం వేచి ఉంది. లిఫ్ట్‌లోకి ఎక్కి రెండో ఫ్లోర్ బటన్ నొక్కింది. అయితే లిఫ్ట్ పపైకి వెళ్లడం గమనించిన జెనెల్ అప్పటికీ లిఫ్ట్ తలపులు మూసుకోకపోవడంతో వెంటనే బయటకు వచ్చేందుకు ప్రయత్నించింది. బయటకు వస్తుండగా ఆమె బ్యాగ్ లిఫ్ట్‌లో చిక్కుకుంది. బ్యాగ్‌ను తీసుకునేందుకు టీచర్ ప్రయత్నించగా.. లిఫ్ట్‌లో ఆమె తల ఇరుక్కుపోయింది. లిఫ్ట్ డోర్స్ మధ్యలో చిక్కుకొని జెనెల్ తల నుజ్జునుజ్జైంది. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. తీవ్రంగా గాయపడిన టీచర్ కేకలు విన్న పాఠశాల అధికారులు, సహోద్యోగులు ఆమెకు సాయం చేసేందుకు పరుగెత్తుకొచ్చారు. సుమారు 20 నిమిషాలు కష్టపడి లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన యువతిని బయటకు తీశారు. వెంటనే ఆమెను గోరేగావ్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదవశాత్తు మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ దుర్ఘటనపై మృతురాలి భర్తకు సమాచారం అందించారు పోలీసులు. ఫెర్నాండెజ్ ఈ ఏడాది జూన్‌లోనే ప్రైమరీ విభాగంలో అసిస్టెంట్ టీచర్‌గా చేరింది. మృతురాలి బంధువుల్లో ఒకరు కూడా అదే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. చదవండి: ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి.. 40 మందికి గాయాలు -
యజమాని ముందే పెంపుడు కుక్క దాడి... బాధతో విలవిల్లాడిన చిన్నారి: వీడియో వైరల్
యజమాని ముందే ఒక పెంపుడు కుక్క చిన్నారిపై దాడి చేసింది. ఈ ఘటన ఘజియాబాద్‌లోని హౌసింగ్ సొసైటి లిఫ్ట్‌లో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట హల్చల్ చేస్తుంది. ఆ వీడియోలో సదరు పెంపుడు కుక్క యజమాని చూస్తుండగానే ఒక బాలుడిపై కుక్క దాడి చేస్తుంది. దీంతో ఆ చిన్నారి బాధతో విలవిలాడుతూ లిఫ్ట్ ముందుకు వచ్చి నిలబడతాడు. కానీ ఆ యజమాని కనీసం ఆ బాలుడిని ఓదార్చడం గానీ, సాయం చేయడం గానీ చేయకుండా బండరాయిలా నుంచొని ఉంది. పైగా తన కుక్కకు ఏమైన జరిగిందేమోనని చూస్తుందే తప్ప ఆ బాలుడిని ఓదార్చే పని చేయదు. దీంతో ఆకాష్ ఆశోక్ గుప్తా అనే నెటిజన్ ఈ ఘటనకు సంబంధించిన వీడియోని ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ.. ఆ లిఫ్ట్‌లో వారిద్దరే ఉన్నారని, ఎవ్వరూ చూడలేదని ఇంతలా నైతిక విలువలు లేకుండా ప్రవర్తిస్తారా? అని ఆగ్రహంతో ప్రశ్నించారు. దీంతో ఘజియాబాద్ పోలీసులు వెంటనే స్పందించి....ఆ బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు తాము కేసు నమోదు చేసినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దీంతో నెటిజన్లు ఇలా దయాదాక్షిణ్యం లేకుండా ప్రవర్తించిన మహిళలను వదిలిపెట్టకూడదు...కఠినంగా శిక్షించాలి అంటూ ఫైర్ అయ్యారు. a pet dog bites a kid in the lift while the pet owner keeps watching even while the pet owner the kid is in pain! where is the moral code here just cos no one is looking? . . p.s: @ghaziabadpolice Location: Charms Castle, Rajnagar Extension, Ghaziabad Dtd: 5-Sep-22 | 6:01 PM IST pic.twitter.com/Qyk6jj6u1e — Akassh Ashok Gupta (@peepoye_) September 6, 2022 "दिनांक 05.09.22 को राजनगर एक्सटेंशन स्थित एक सोसाइटी की लिफ्ट में एक कुत्ते द्वारा अपने मालिक की मौजूदगी में बच्चे को काट लेने के वायरल वीडियो के सम्बन्ध में बच्चे के पिता की तहरीर पर थाना नंदग्राम पर अभियोग पंजीकृत करते हुए अग्रिम विधिक कार्यवाही की जा रही हैं" बाइट-सीओ सिटी-2 pic.twitter.com/dvLwBXyUaT — GHAZIABAD POLICE (@ghaziabadpolice) September 6, 2022 (చదవండి: మావగారిపై చేయిజేసుకున్న మహిళా పోలీసు: వీడియో వైరల్) -
ఏపీలో నిరంతరాయంగా విద్యుత్ పంపిణీ
-
ఏపీలో ఇక నిరంతరాయ విద్యుత్ సరఫరా
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా కానుంది. మరోవైపు పరిశ్రమలకు విద్యుత్ కోతల వేళలు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మే 9 నుంచి పరిశ్రమలకు పవర్ హాలిడే ఉపసంహరణ కొనసాగుతోందని ప్రభుత్వం తెలిపింది. అలాగే ఈ నెల 16వ తేదీ నుంచి పరిశ్రమలకు పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా ఇస్తున్నట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న బొగ్గు కొరత వలన కొద్దిరోజుల పాటు పరిశ్రమలకు విద్యుత్ పంపిణీ లో సమస్యలు తలెత్తాయని, ప్రస్తుతం పరిస్థితి మెరుగుపడటంతో అన్ని రంగాల వినియోగదారులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. -
111 జీవో ఎత్తివేత.. ఆంక్షలు తొలగిస్తూ జీవో నంబర్ 69 జారీ
సాక్షి, హైదరాబాద్/రంగారెడ్డి జిల్లా: రాష్ట్ర రాజధానికి తాగునీటిని అందించిన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాల పరిరక్షణ కోసం గతంలో జారీ చేసిన 111 జీవోను ప్రభుత్వం రద్దు చేసింది. ఆ రిజర్వాయర్ల ద్వారా నగరానికి సరఫరా అయ్యే తాగునీరు అతి తక్కువ అని, ఇకపై వాటిపై ఆధార పడాల్సిన అవసరం లేదని పేర్కొంది. అయినా జలాశయాల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ఈ మేరకు సీఎస్ సోమేశ్‌కుమార్ బుధవారం జీవో నంబర్ 69 జారీ చేశారు. ఈ జలాశయాల పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై మార్గదర్శకాలు రూపొందించేందుకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. అప్పట్లో పరిరక్షణ కోసం.. హైదరాబాద్ నగరాన్ని మూసీ వరదల నుంచి రక్షించేందుకు, అదే సమయంలో తాగునీటిని అం దించేలా నిజాం హయంలోనే ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాలను నిర్మించారు. అప్పటి నుంచీ హైదరాబాద్‌కు ప్రధాన నీటి వనరులుగా ఉన్న ఈ రిజర్వాయర్ల పరిరక్షణ కోసం 1996లో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జీవో 111ను జారీ చేసింది. జలాశయాలకు చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిలోని 84 గ్రామాల పరిధిలో ఉన్న 1,32,000 ఎకరాల విస్తీర్ణంలో.. పరిశ్రమలు, హో టళ్లు, వాణిజ్య సముదాయాలు, నివాసాలు, నిర్మా ణాలపై నియంత్రణలు విధించింది. కొన్నేళ్లుగా నగరం విపరీతంగా విస్తరించడం, తాగునీటి కోసం కృష్ణా, గోదావరి జలాలను తరలించడం నేపథ్యంలో.. 111 జీవో ఎత్తివేయాలన్న డిమాండ్ మొదలైంది. ఈ జీవోను సమీక్షిస్తామని టీఆర్ఎస్ సర్కారు కూడా పలుమార్లు ప్రకటించింది. తాజా గా జీవో ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సీఎస్ ఆధ్వర్యంలో కమిటీ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటైన కమిటీలో.. మున్సిపల్, ఆర్థిక, నీటిపారుదల శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, వాటర్ బోర్డు ఎండీ, కాలుష్య నియంత్రణ బోర్డు మెంబర్ సెక్రటరీ, హెచ్ఎండీఏ డైరెక్టర్ (ప్లానింగ్) సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ఏయే అంశాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలన్న దానిపై విధివిధానాలనూ ప్రభుత్వం ఖరారు చేసింది. రెండు రిజర్వాయర్ల పరిరక్షణ, కాలుష్య నివారణకు అవసరమైన చర్యలను సూచించాలని.. ప్రధాన మౌలిక సదుపాయాల కల్పనకు విధానాలు రూపొందించాలని ఆదేశించింది. మురుగు, వరద కాల్వల నిర్మాణం, అవసరమైన నిధుల సమీకరణ, లేఅవుట్లు, భవన నిర్మాణాల అనుమతికి విధించాల్సిన నియంత్రణలు, న్యాయపరమైన అంశాలను పరిశీలించాలని పేర్కొంది. సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని సూచించింది. 84 గ్రామాలకు విముక్తి: సబిత 111 జీవో ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయటంపై సీఎం కేసీఆర్‌కు విద్యాశాఖ మంత్రి సబిత ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకిచ్చిన మాట ప్రకారం ఇటీవల కేబినెట్లో తీర్మానం చేసి, 69 జీవో విడుదల చేయటంతో 84 గ్రామాల ప్రజలకు శాశ్వత విముక్తి లభించిందన్నారు. జంట జలాశయాలు కలుషితం కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటూ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కమిటీ వేయటం శుభ పరిణామమన్నారు. 111 జీవో ఎత్తివేస్తామని గత నెల 15న సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించడంతోనే ఈ ప్రాంతాల్లో ఒక్కసారిగా భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ప్రభుత్వం నుంచి స్పష్టత రావడంతో కొనుగోలుదారులు, రియల్టర్లు భూములు కొనేందుకు ఎగబడ్డారు. మరోవైపు ఇప్పటికే సంపన్న వర్గాలు, పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు, ప్రజాప్రతినిధులు జీవో 111 ప్రాంతాల్లో తక్కువ ధరకే భారీగా భూములు కొనుగోలు చేసి.. ఫామ్‌హౌజ్‌లు, రిసార్టులుగా మార్చుకున్నారు. వేల ఎకరాలు వారి చేతుల్లోనే ఉన్నట్టు అంచనా. అనధికారిక లేఅవుట్లు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. ఇప్పడు వీటి ధరలు చుక్కలను తాకనున్నాయి. మరోవైపు ఇప్పటివరకు కోట్లు పలికిన గచ్చిబౌలి, కొండాపూర్, కోకాపేట, నార్సింగి తదితర ప్రాంతాల్లో భూముల ధరల్లో కొంతకాలం స్తబ్దత నెలకొనే అవకాశం ఉందని రియల్ఎస్టేట్ వర్గాలు చెప్తున్నాయి. 1.32 లక్షల ఎకరాలు రెడీ... గ్రేటర్ హైదరాబాద్ విస్తీర్ణం 217 చదరపు కిలోమీటర్లుకాగా.. 111 జీవో పరిధిలోని భూమి విస్తీర్ణం 538 చదరపు కిలోమీటర్లు కావడం గమనార్హం. జీవో 111 కింద 84 గ్రామాల్లోని 1,32,600 ఎకరాల భూములు ఉన్నాయి. ఇందులో 32 వేల ఎకరాల ప్రభుత్వ భూమి కూడా ఉంది. ఆంక్షల ఎత్తివేతతో ఈ భూములన్నీ అందుబాటులోకి రానున్నాయి. 27 ఏళ్లుగా పోరాటాలు తమ అభివృద్ధి అడ్డంకి మారిందని, హైదరాబాద్‌ను ఆనుకుని ఉన్నా భూములకు ధరలేకుండా పోయిందంటూ 111 జీవో పరిధిలోని గ్రామాల ప్రజలు 27 ఏళ్లుగా ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. జీవోను రద్దు చేయాలంటూ అన్ని గ్రామాల సర్పంచులు రెండుసార్లు మూకుమ్మడిగా తీర్మానాలు చేసి పంపారు. ఇన్నేళ్ల తర్వాత గండిపేట, శంకర్పల్లి, శంషాబాద్, మొయినాబాద్, చేవెళ్ల, కొత్తూరు మండలాల ప్రజలకు ఊరట కలిగింది. భారీగా కంపెనీలు, నిర్మాణాలు.. జీవో ఎత్తివేత ద్వారా నిర్మాణాలపై ఆంక్షలు తొలగిపోవడంతో ఈ ప్రాంతంలో భారీగా పెట్టుబడులు రానున్నాయి. ఐటీ హబ్‌గా అవతరించిన గచ్చిబౌలికి ఈ ప్రాంతాలు చేరువలో ఉండటంతో ఐటీ కంపెనీల స్థాపనకు అవకాశం ఏర్పడనుంది. ఈ ప్రాంతాలకు బహుళ అంతస్తుల నిర్మాణాలు, జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు వస్తాయని.. భూముల ధరలు, ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయని అంటున్నారు. కోర్టును ఆశ్రయిస్తాం జంట జలాశయాల ఎగువన విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీలు, రిసార్ట్స్, పబ్స్, బార్లు, బహుళ అంతస్తుల భవంతులు, హోటళ్లు, పరిశ్రమలు ఏర్పాటైతే జలాశయాలు కాలుష్యకాసారంగా మారుతాయి. మరో మూసీలా మారే ప్రమాదం పొంచి ఉంది. జీవో 111 తొలగింపులో అనేక న్యాయపరమైన చిక్కులు కూడా ఉన్నాయి. ఈ అంశంపై కోర్టును ఆశ్రయిస్తాం. – సజ్జల జీవానందరెడ్డి, లుబ్నా సార్వత్ పర్యావరణవేత్తలు -
హిచ్ హైకింగ్: ఎవరెస్ట్ వరకూ లిఫ్ట్ అడిగింది
ఎవరెస్ట్ వరకూ వెళ్లాలంటే ఎవరైనా టూర్ ప్లాన్ చేసుకుంటారు. నలుగురితో కలిసి వెళతారు. ఆమె ఒక్కతే వెళ్లాలనుకుంది. అదీ లిఫ్ట్ అడుగుతూ వెళ్లాలనుకుంది. అలా ఒక్కరే ప్రయాణ ఖర్చులు లేకుండా దొరికిన వాహనంతో పర్యటించడాన్ని ‘హిచ్ హైకింగ్’ అంటారు. ఐదుగురు పిల్లల తల్లి నాజిరా నౌషాద్ సాహసంతో ఈ పని చేసి ‘ఈ దేశం స్త్రీలకు సురక్షితమైనదే’ అని సందేశం ఇస్తోంది. ఇది వింత సంగతి. ఘనంగా చెప్పుకోవలసిన సంగతి. లారీల్లో లిఫ్ట్ అడుగుతూ (హిచ్ హైకింగ్) కేరళ నుంచి ఒక ఒంటరి మహిళ ట్రావెల్ చేయగలదా? చేయగలదు అని నిరూపించింది నాజిరా నౌషాద్. ఫిబ్రవరి 9న బయలు దేరి కేరళ నుంచి నేపాల్‌లోని ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వరకూ వెళ్లిరావడానికి 50 రోజుల లక్ష్యం పెట్టుకుని ఆ లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. కేరళలోని కుట్టనాడ్‌లోని మన్‌కొంబు నాజిరా ఊరు. అది సముద్ర మట్టానికి 10 అడుగుల దిగువ. అక్కడి నుంచి బయలుదేరి సముద్రమట్టానికి 17,500 అడుగుల పైన ఉన్న ఎవరెస్ట్ బేస్‌క్యాంప్‌కు హిచ్ హైకింగ్ చేయాలని నిశ్చయించుకుంది నాజిరా. అలా చేయడంలో ఎంతో రిస్క్. ఒంటరి స్త్రీల మీద ఏ అఘాయిత్యం అయినా జరగొచ్చు. ‘లారీ డ్రైవర్ల మీద చాలా అపప్రథలు ఉన్నాయి. కాని నేను చూసిన లారీడ్రైవర్లు ఎంతో స్నేహపాత్రంగా ఉన్నారు. నా లక్ష్యం చేరుకోవడానికి సాయం చేశారు’ అంటుంది నాజిరా. షి కెన్ ట్రావెల్ అలోన్ ‘ఒంటరిగా స్త్రీ ప్రయాణించగలదు’ అనే స్లోగన్‌తో 33 ఏళ్ల నాజిరా ఈ యాత్ర మొదలెట్టింది. ఆమె భర్త ఒమన్‌లో ఉద్యోగం చేస్తాడు. ఆమెకు ఐదుగురు పిల్లలు. నాజిరా ట్రావెల్ వ్లోగర్. అంటే యాత్రా కథనాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది. ఆమెకు ఫాలోయెర్స్ ఉన్నారు. నాలుగేళ్ల క్రితం భర్త ఇండియా వచ్చినప్పుడు కారులో వాళ్లు టూరు చేశారు. అప్పుడే ఆమెకు తాను కూడా ప్రయాణాలు చేసి సోషల్ మీడియాలో పంచుకోవాలనిపించింది. ‘గత సంవత్సరం మరో ఇద్దరు మహిళలతో కలిసి లదాఖ్ వరకు యాత్ర మొదలెట్టాను రోడ్డు మార్గం ద్వారా. కాని 20 రోజులకే వారు వెనక్కు వెళ్లిపోయారు. నేను మాత్రం యాత్ర కొనసాగించాను. వెనక్కు తిరిగి వచ్చి ‘నేను చూసిన దేశం’ అనే పుస్తకం రాసి ప్రచురించింది. ఆ తర్వాత నెల రోజులకే కేవలం షిప్ చార్జీలు జేబులో పెట్టుకుని లక్షద్వీప్‌కు వెళ్లింది. 10 దీవులను 25 రోజుల్లో తిరిగి వచ్చింది. తన ఫాలోయెర్స్ ఇళ్లల్లో లేదా స్థానికుల ఇళ్లలో రిక్వెస్ట్ చేసి బస చేసేది. ఇప్పుడు ఈ ఎవరెస్ట్ యాత్ర చేసింది. మన దేశం సురక్షితమే ‘మన దేశం స్త్రీ పర్యాటకులకు సురక్షితమే అని చెప్పడమే నా ఉద్దేశ్యం. మన దేశాన్ని మనం చూడకుండా విదేశాలకు వెళ్లి అక్కడ భద్రత ఉంది అని చెప్పడం కరెక్ట్ కాదు’ అంటుంది నాజిరా. వీపుకు ఒక బ్యాక్‌ప్యాక్ తగిలించుకుని ఫిబ్రవరి 9న ఆమె కేరళలో బయలుదేరింది. పిల్లల్ని చూడటానికి ఇంట్లో తల్లి ఉంటుంది. ‘పిల్లల్ని అలా వదిలి బయలుదేరడం అందరికీ నచ్చదు. కాని మాటలు అనేవారిని నేను పట్టించుకోను’ అంటుంది నాజిరా. కేరళ నుంచి లారీలు, ట్రక్కులు పట్టుకుంటూ ఫిబ్రవరి 21కి ఆమె ఢిల్లీ చేరుకుంది. మరో లారీ దొరికే వరకు దిగిన ఊరులో ఏదో ఒక ఇంటి తలుపు తట్టి ఆ ఇంట్లో బస చేస్తూ వెళ్లింది. ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని సొనౌలీ చేరుకుని అక్కడి నుంచి నేపాల్‌లోని లుల్కాకు విమానంలో వెళ్లింది. రికార్డు జర్నీ ఎవరెస్ట్ బేస్‌క్యాంప్‌కు వెళ్లాలంటే లుల్కా నుంచి ట్రెక్ చేయాలి. అంటే కాలినడకన వెళ్లాలి. 2860 మీటర్ల ఎత్తున్న లుల్కా నుంచి 5364 మీటర్ల ఎత్తున్న బేస్‌క్యాంప్‌కు నడవాలంటే 8 రోజులు పడుతుంది. ‘కాని నేను ఐదురోజుల్లో చేరుకున్నాను. ఒక మహిళ ఇంత వేగంగా చేరుకోవడం రికార్డు’ అంటుంది నాజిరా. ఈ దారిలో ఆమె ప్రయాణించడానికి గైడ్‌ను మాట్లాడుకుంది. బేస్‌క్యాంప్ దగ్గర ఆమె దిగిన ఫొటో నిజంగానే ఒక సాహస చిహ్నం. కొంతమంది మరొకరు అనుకరించడానికి వీలులేని సాహసాలు చేస్తారు. నాజిరాను ఎంతమంది స్ఫూర్తిగా తీసుకోగలరు? అంత రిస్క్ ఎవరు చేయగలరు? కాని చేయాలనుకుంటే ఒక విజేత అంతకు ముందు దారి వేసింది అని చెప్పడానికి నాజిరా ఉంది. నాజిరా ఈజ్ గ్రేట్. -
పని మనుషులు లిఫ్ట్ ఉపయోగిస్తే రూ.300 ఫైన్! నెట్టింట దుమారం రేపుతున్న హైదరాబాద్ ఘటన
హైదరాబాద్‌లో ఓ ఆపార్ట్మెంట్ తీసుకున్న నిర్ణయం వివాస్పదంగా మారింది. అపార్ట్మెంట్ నిర్మాణాలు, మెయింటనెన్స్లపై సరికొత్త ప్రశ్నలను ఈ ఘటన లేవనెత్తింది. ప్రస్తుతం ఇంటర్నెట్ వేదికగా వందల కొద్ది వ్యక్తులు ఈ విషయంపై స్పందిస్తున్నారు. వివాదానికి కారణం హర్షవడ్లమాని అనే ట్విట్టర్ యూజర్ జనవరి 12న నగరంలో ఓ అపార్ట్మెంట్ లిఫ్టు దగ్గర అంటించి నోటీస్ పోస్టర్ని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఆ నోటీసులో ఇంటి పని చేసేవాళ్లు, డెలివరీ బాయ్స్, డ్రైవర్లు మెయిన్ లిఫ్టు ఉపయోగిస్తే రూ.300 జరిమానా విధిస్తామని పేర్కొన్నారు. Cyberabad, 2022. pic.twitter.com/4XrldTlEel — Harsha Vadlamani (@Hrsha) January 12, 2022 ఇది సరికాదు.. కేటీఆర్ స్పందించాలి ఇంట్లో పని చేసేవాళ్లు, డ్రైవర్లు, డెలివరి బాయ్స్ పట్ల సదరు అపార్ట్మెంట్ వాసులు వివక్ష చూపిస్తున్నారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. మనుషులందరు ఒకటే అని కానీ ఇలాంటి నిర్ణయాలు ఈ రోజుల్లో కూడా అమలు చేస్తున్నారా ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాటి మనుషుల పట్ల ఇలా వ్యవహరించిన వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. పని వాళ్లు వండిన తిండి తింటూ వారిని ఇలా అవమానించడం సరికాదంటున్నారు. వెంటనే ప్రభుత్వ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేయాలంటున్నారు. మరికొందరైతే ఏకంగా ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిందిగా మంత్రి కేటీఆర్ ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేస్తున్నారు. @cyberabadpolice @cpcybd should take action against the society, this is discrimination. — Bhushan (@kakollu_bhushan) January 12, 2022 @KTRTRS Sir pls take action. — Tejaaaa (@iamteja_8) January 12, 2022 మేము ఇలాగే చేస్తున్నాం పని మనుషులు లిఫ్ట్ ఉపయోగిస్తే రూ.300 ఫైన్ విధించే నిర్ణయంపై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తుంటే.. మరికొందరు ఆ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను వివరిస్తున్నారు. కరోనా వైరస్ భయం కారణంగా అపార్ట్మెంట్లో రాకపోకలు, కదలికపై ఆంక్షలు అమలు చేస్తున్నట్టు చెబుతున్నారు. మెయిన్ లిఫ్టు వాడకంపై ఆంక్షలు ఉండటం సరైనదే అని.. ఎక్కువగా ఫోకస్ అయ్యే పని వాళ్లు, డెలివరీ పర్సన్స్, డ్రైవర్లు తదితరుల కోసం సర్వీసు లిఫ్టు అందుబాటులో ఉంటుందని బదులిస్తున్నారు. మరికొందరు తమ అపార్ట్మెంట్లో రెండు లిఫ్టులు ఉంటే ఒకటి కోవిడ్ రిస్క్ ఎక్కువగా ఉండే వృద్ధులకు, మరొకటి మిగిలిన వాళ్లు ఉపయోగిస్తున్నామని వివరిస్తున్నారు. రిస్క్ ఎక్కువగా ఉన్నప్పుడు కఠిన నిర్ణయాలు తప్పడం లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. @cyberabadpolice @cpcybd should take action against the society, this is discrimination. — Bhushan (@kakollu_bhushan) January 12, 2022 భవిష్యత్తులో ఇవి తప్పవా? కోవిడ్ మహమ్మారి వచ్చిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా అనేక రంగాల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. మాస్క్, శానిటైజర్, ఫిజికల్ డిస్టెన్స్ వంటివి నిత్య జీవితంలో భాగమయ్యాయి. వర్క్ ఫ్రం హోం, హైబ్రిడ్ వర్క్లాంటి పని విధానాలు వచ్చాయి. కోవిడ్ ఎండెమిక్‌గా ఉండిపోయే అవకాశం ఉందని ఇప్పుడే శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీంతో కరోనా ఉన్నంత కాలం అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీ, హౌసింగ్ సొసైటీల్లో ఈ సమస్య పదే పదే ఉత్పన్నం అవుతుందంటున్నారు. ఇరు వర్గాల వాదనల్లో వాస్తవం ఉందంటున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా అపార్ట్మెంట్ల నిర్మాణంలోనే సర్వీస్ లిఫ్టులు, శానిటైజర్ ఛాంబర్స్, డెలివరీ గేట్‌వే తదితర ఏర్పాట్లు తప్పవా ? అనే చర్చ రియల్టీ వర్గాల్లో నడుస్తోంది. చదవండి: గృహ విక్రయాలు, లాంచింగ్స్‌లో హైదరాబాద్ రికార్డ్ -
55 నిమిషాల పాటు నరకం అనుభవించా: స్టీవ్ స్మిత్
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌పై వరుసగా మూడు టెస్టుల్లో విజయం సాధించి ఫుల్ జోష్‌లో ఉన్న ఆస్ట్రేలియా ఆటగాళ్లు మెల్బోర్న్ హోటల్ రూంలో సంబరాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే స్మిత్ కూడా వారి సంబరాలకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోవాలనుకున్నాడు. అయితే అనుకోకుండా తాను ఎక్కిన లిఫ్ట్ డోర్ ఇరుక్కుపోయింది. దీంతో ఈ వైస్ కెప్టెన్ సాంకేతిక కారణాలతో 55 నిమిషాల పాటు లిఫ్ట్‌లో గడపాల్సి వచ్చింది. తన సహచర క్రికెటర్ మార్నస్ లబుషేన్ స్మిత్‌ను బయటికి తీసే ప్రయత్నం చేసినప్పటికి లాభం లేకపోయింది. చివరికి లిఫ్ట్ టెక్నిషియన్ వచ్చి స్మిత్‌ను క్షేమంగా బయటికి తీశాడు. ఈ మొత్తాన్ని స్మిత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫన్నీవేలో చెప్పుకొచ్చాడు. చదవండి: Ashes Series 2021-22: ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్‌కు కరోనా.. '' లిఫ్ట్ ఎక్కిన తర్వాత నేను వెళ్లాల్సిన ఫ్లోర్ వచ్చినప్పటికి డోర్స్ ఓపెన్ కాలేదు. దీంతో బయట ఉన్న మార్నస్ లబుషేన్‌కు సమాచారం అందించాను. ఒకవైపు నేను ఓపెన్ చేయడానికి ప్రయత్నించగా.. అటువైపు లబుషేన్ కూడా ప్రయత్నించాడు. మా ప్రయత్నాలు ఫలించకపోవడంతో లిఫ్ట్ ఆపరేటర్ వచ్చి నన్ను కాపాడాడు. పోయిన ప్రాణం తిరిగివచ్చింది అనుకున్నా ఆ క్షణంలో.. ఇక 55 నిమిషాల పాటు లిఫ్ట్‌లో నరకం అనుభవించా. ఆ తర్వాత రూమ్‌లోకి వచ్చి రెస్ట్ తీసుకున్నా'' అంటూ రాసుకొచ్చాడు. ఇక యాషెస్ టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియా దుమ్మురేపుతుంది. వరుసగా మూడు టెస్టుల్లో భారీ విజయాలు అందుకున్న ఆసీస్ ఐదు టెస్టుల సిరీస్‌లో 3-0తో ఆధిక్యంలో ఉంది. ఇరుజట్ల మధ్య నాలుగో టెస్టు జనవరి 5 నుంచి 9 వరకు సిడ్నీ వేదికగా జరగనుంది. చదవండి: Year End 2021: నిజంగానే అపురూపం.. ఆటల్లో ఎన్నో అద్భుతాలు, మరెన్నో.. such incredible content from the big man stuck in a lift pic.twitter.com/5XtZasAMWk — Abi Slade (@abi_slade) December 30, 2021 -
పాపమని లిఫ్ట్ ఇచ్చిన పోలీసుకే షాకిచ్చిన యువతి!
సాక్షి, పంజగుట్ట(హైదరాబాద్): మానవత్వంతో లిఫ్ట్ ఇచ్చిన పాపానికి ఓ కానిస్టేబుల్ మెడలోని చైన్‌ను దొంగిలించిన సంఘటన పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. సన్‌సిటీలో నివాసం ఉండే ఈశ్వర్ ప్రసాద్ ఏఆర్ కానిస్టేబుల్. ఈ నెల 12న రాత్రి 8:30 సమయంలో విధులు ముగించుకుని ఇంటికి వస్తుండగా గ్రీన్‌ల్యాండ్స్ వద్ద ఓ యువతి లిఫ్ట్ అడగగా ఆమెకు లిఫ్ట్ ఇచ్చాడు. రాత్రి 9 గంటలకు ఆమెను పంజగుట్టలో దింపి ఇంటికి వెళ్లిపోయాడు. ఇంట్లో స్నానం చేసే సమయంలో తన బంగారు గొలుసు మాయమైనట్లు తెలుసుకున్నాడు. పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా నిందితురాలు మహంకాళి పోలీస్‌స్టేషన్ పరిధిలో కూడా ఇలానే దొంగతనం చేసేందుకు యత్నించగా అక్కడి పోలీసులు ఆమెను మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేయగా పంజగుట్టలో కానిస్టేబుల్ వద్ద కూడా చైన్ కొట్టేసినట్లు తెలిపింది. కాగా ఆమె ట్రాన్స్‌జెండర్‌గా పోలీసులు గుర్తించారు. బెంగళూరుకు చెందిన అంజూన్ అని నిర్ధారించారు. అంజూన్ బెంగళూరు నుండి హైదరాబాద్‌కు వచ్చి దొంగతనాలు చేసి తిరిగి వెల్లిపోతుందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
లిఫ్ట్ బటన్స్ గురించి తెలిపేలా లిఫ్ట్ టూర్! ..
పక్కనే మెట్లు ఉన్నా.. లిఫ్ట్‌ను ఉపయోగించే వారే ఎక్కువ. మరి, ఒక్కసారైనా.. లిఫ్ట్‌లోని బటన్స్‌ను పరిశీలించారా? వాటి పేర్లు, ఉపయోగాలను తెలుసుకునే ప్రయత్నం చేశారా? తెలుసుకోవడానికి ఏముంది? మహా అయితే, డోర్ క్లోజ్, డోర్ ఓపెన్, అలారమ్, అంతస్తులను సూచించే నంబర్ బటన్స్.. అంతే కదా! అని అనుకుంటే పొరపాటు. ప్రపంచంలోని అన్ని రకాల లిఫ్ట్ బటన్స్ గురించి తెలిపేలా జపాన్‌లోని ఓ పరిశ్రమ లిఫ్ట్ టూర్ నిర్వహిస్తోంది. ఇందుకోసం 1,048 బటన్స్‌తో కూడిన ఓ పెద్ద లిఫ్ట్ బటన్ డిస్ప్లే వాల్ ఏర్పాటు చేసింది. వాల్‌పై కనిపించే బటన్ నొక్కి, దాని పేరు, ఉపయోగం తెలుసుకోవచ్చు. ఎక్కువమంది ‘నెవర్ ప్రెస్’ బటన్ నొక్కారు. ఈ బటన్ లిఫ్ట్‌ను మధ్యలోనే ఆగిపోయేలా చేస్తుంది. తిరిగి పనిచేయాలంటే.. లాక్ ఓపెన్ చేసి, రీస్టార్ట్ చేయాల్సిందే. అయితే, అన్నింటిలోనూ ఈ బటన్ ఉండదు. భద్రత కోసం కొంతమంది వీఐపీలు వారి ఇళ్లల్లో వీటిని ఏర్పాటు చేయించుకుంటారట. ఇందుకోసం అధికారులకు సరైన కారణం, పత్రాలు కూడా సమర్పించాలి. ఇలా ఎంతోమంది లిఫ్ట్ బటన్స్‌పై సరైన అవగాహన లేక.. ప్రమాదాలకు గురవుతున్నారు. వీటిని అరికట్టడానికి ఈ టూర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. బాగుంది కదూ! మీరు కూడా ఈ టూర్‌కు వెళ్లాలనుకుంటే.. కాస్త వేచి చూడాల్సిందే. ఎందుకంటే, వచ్చే ఏడాది జూన్ వరకు ఈ టూర్ టికెట్స్ అన్నింటినీ జపాన్‌లోని వివిధ స్కూల్ యాజమాన్యాలు బుక్ చేసుకున్నాయి. చదవండి: ఇక చంద్రుడి మీద డుగ్గు డుగ్గు.. ‘నాసా’ కొత్త తరహా బుల్లెట్టు -
లిఫ్ట్‌లో బాలిక పట్ల బాలుడి అసభ్య ప్రవర్తన
సాక్షి, బంజారాహిల్స్(హైదరాబాద్): సినిమా హీరోలా తాను కూడా ఓ అమ్మాయిని ముద్దు పెట్టుకోవాలనుకున్న ఓ బాలుడు లిఫ్ట్‌లో ఒంటరిగా ఉన్న బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మైనర్ బాలుడిని విచారించగా తాను కొన్ని సినిమాలను చూశానని, ఓ హీరో ఆ సినిమాలో హీరోయిన్ను ముద్దు పెట్టుకునే సీన్ తనకు బాగా నచ్చిందని, తనలా నేను కూడా ఎప్పటికైనా చేయాలనే ఆలోచనతో ఇలా చేశానని చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. జూబ్లీహిల్స్ రోడ్ నెం.10లోని వెంకటగిరి సమీపంలో ఉన్న ఓ అపార్ట్మెంట్ వద్ద వాచ్మెన్ కుమారుడు(14) అదే అపార్ట్మెంట్లోని 3వ తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల బాలికను ఆరో అంతస్తులో ఎవరో పిలుస్తున్నారంటూ మంగళవారం సాయంత్రం బాలికను లిఫ్ట్‌లోకి రప్పించి ముద్దు పెట్టుకున్నాడు. లిఫ్ట్ ఆరో అంతస్తుకు వెళ్లే వరకు ఆ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. తన వద్ద ఉన్న ఫోన్‌తో బాధిత బాలిక తల్లికి ఫోన్ చేసింది. అప్రమత్తమైన తల్లి అక్కడికి చేరుకొని తన కూతురిని ఇంటికి తీసుకెళ్లింది. జరిగిన ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు బాలుడిని ఐపీసీ సెక్షన్ 354, పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి జువైనల్ హోంకు తరలించారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: Banjarahills: భార్యను చంపి.. గడ్డిలో చుట్టేశాడు -
24 ఏళ్ల తర్వాత తెరిచిన లిఫ్ట్.. భయపెట్టిన దృశ్యం
లక్నో: ఓ ఆస్పత్రిలో దాదాపు 24 ఏళ్లుగా మూసి ఉన్న ఎలివేటర్‌ని రెండు మూడు రోజుల క్రితం తెరిచారు. అయితే అనూహ్యంగా దానిలో వారికి ఓ అస్థిపంజరం కనిపించి భయభ్రాంతులకు గురి చేసింది. విషయం పోలీసులు తెలియడంతో వారు అక్కడకు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. ఉత్తరప్రదేశ్ బస్తి జిల్లా కైలీ ప్రాంతంలో 1991 సంవత్సరంలో 500 పడకలతో ఓపెక్ ఆస్పత్రిని ప్రారంభించారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో ఉన్న ఎలివేటర్ పాడు కావడంతో ఆరు సంవత్సరాల తర్వాత అనగా 1997లో మూసి వేశారు. అప్పటి నుంచి క్లోస్ చేసి ఉన్న ఈ ఎలివేటర్‌ని 24 ఏళ్ల తర్వాత అనగా ఈ ఏడాది సెప్టెంబర్ 1న తెరిచారు. ఈ క్రమంలో దానిలో వారికి ఓ అస్థిపంజరం దర్శనమిచ్చి భయభ్రాంతులకు గురి చేసింది. (చదవండి: ‘దృశ్యం’ సీన్: పోలీస్‌స్టేషన్‌లో అస్థిపంజరం) ఈ విషయం పోలీసులకు తెలియడంతో వారు ఆస్పత్రి వద్దకు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఫోరెన్సిక్ సిబ్బంది ఈ మిస్టరీని ఛేదించే పనిలో ఉన్నారు. ఈ అస్థిపంజరం పురుషుడిదిగా గుర్తించారు. ఇక పోలీసులు గత 24 ఏళ్లుగా ఈ ప్రాంతంలో నమోదైన మిస్సింగ్ పర్సన్స్ ఫిర్యాదులను పరిశీలిస్తున్నారు. (చదవండి: ముగ్గురు భార్యలు.. 3 అస్థిపంజరాలు: వీడిన మిస్టరీ) ప్రస్తుతం పోలీసులు పని చేయని లిఫ్ట్‌లోకి ఈ వ్యక్తి ఎందుకు వెళ్లాడు... అతడే లోపలికి వెళ్లాడా.. లేక ఎవరైనా అతడిని హత్య చేసి ఆ తర్వాత మృతదేహాన్ని తీసుకువచ్చి.. దీనిలో పడేశారా.. లేక పొరపాటున సదరు వ్యక్తి లిఫ్ట్‌లో ఇరుక్కుపోయి.. ఊపిరాడక చనిపోయి ఉంటాడా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. డీఎన్ఏ రిపోర్ట్ వస్తే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుస్తాయంటున్నారు పోలీసులు. (చదవండి: ఈ బుడ్డోడు సూపర్.. అస్థిపంజరంతో కలిసి) ఈ సందర్భంగా బస్తి జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. దీనికి సంబంధించి ఎవరైనా రాతపూర్వక ఫిర్యాదు ఇస్తే.. మేం కేసు నమోదు చేస్తాం. ప్రస్తుతం పోలీసులు పలు కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ మగ అస్థిపంజరం వెనక ఉన్న మిస్టరీని పరిష్కరించడానికి జిల్లాలోని 24 పోలీసు స్టేషన్ల పోలీసులు పని చేస్తున్నారు అని తెలిపారు. -
మియాపూర్: ఐదేళ్ల చిన్నారిని లిఫ్టులోకి లాక్కెళ్లి..
సాక్షి, మియాపూర్: అపార్ట్మెంట్లోకి దూరి అక్కడ ఆడుకుంటున్న ఐదేళ్ల బాలికను లిఫ్టులోకి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాధితులు, పోలీసులు తెలిపిన ప్రకారం.. రాజస్థాన్‌లోని గోరక్‌పూర్‌కు చెందిన గోరక్ ప్రసాద్, రేణుక పదేళ్ల నుంచి మియాపూర్ హాఫీజ్‌పేట్‌లోని మార్తాండనగర్ కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో నివాసముంటూ ఇంటిరీయర్ పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు. మూడో కుమార్తె(5) సోమవారం మధ్యాహ్నం దుకాణంలో చాక్లెట్ తీసుకొని అపార్ట్మెంట్ ముందు ఆడుకుంటోంది. ఓ గుర్తు తెలియని వ్యక్తి అపార్ట్మెంట్లోకి వచ్చి చిన్నారిని అపార్ట్మెంట్ లిఫ్టులోకి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడు. చిన్నారి ఏడ్చుకుంటూ తల్లిదండ్రులకు విషయం చెప్పింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు కావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. -
40 నిమిషాలు లిఫ్టులోనే.. ఉక్కిరిబిక్కిరైన అధికారులు
సాక్షి, హైదరాబాద్: సచివాలయంగా వినియోగిస్తున్న బీఆర్కేఆర్ బిల్డింగ్‌లో శుక్రవారం ఓ లిఫ్టు ఏడుగురు అధికారులను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఏకంగా 40 నిమిషాల పాటు రెండు అంతస్తుల మధ్యలో నిలిచిపోవటంతో గందరగోళం నెలకొంది. అంతసేపు లిఫ్టు ఆగిపోవటంతో అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ లిఫ్టు కంపెనీపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం నిర్మిస్తున్న ప్రభుత్వ కొత్త భవనాల్లో ఎక్కువగా ఇదే కంపెనీ లిఫ్టులు ఏర్పాటు చేస్తున్నారని, బీఆర్కేఆర్ భవనాన్ని సచివాలయంగా మార్చిన నేపథ్యంలో ఏడాది క్రితమే ఈ లిఫ్టు ఏర్పాటు చేశారని, ఇలాంటి నాసిరకం లిఫ్టులను ఇకపై కొత్తగా నిర్మించే భవనాల్లో అనుమతించవద్దని ఆ ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలిసింది. శంషాబాద్–అరాంఘర్ మధ్య ఆరువరుసల రోడ్డుకు సంబంధించి శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ సచివాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి రోడ్లు, భవనాల శాఖకు చెందిన నలుగురు అధికారులు, కేంద్ర ఉపరితల రవాణా శాఖకు చెందిన ముగ్గురు అధికారులు హాజరు కావాల్సి ఉంది. సీఎస్ కార్యాలయానికి వెళ్లేందుకు వారు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో లిఫ్టు ఎక్కారు. మొదటి–రెండో అంతస్తు మధ్యలోకి రాగానే సాంకేతిక కారణాలతో లిఫ్టు నిలిచిపోయింది. అది ఎంతసేపటికీ పనిచేయకపోవటంతో దాదాపు 40 నిమిషాల తర్వాత బలవంతంగా తలుపులు తెరిపించి చిన్న నిచ్చెన ద్వారా లోపల ఇరుక్కున్న వారిని అతికష్టంమీద బయటకు తీశారు. సాధారణంగా సమస్యలు తలెత్తితే లిఫ్టులు తదుపరి అంతస్తుకు వెళ్లి తలుపులు తెరుచుకునే సాంకేతికత ప్రస్తుతం అందుబాటులో ఉంది. కానీ ఏడాది క్రితమే ఏర్పాటు చేసిన ఈ లిఫ్టు అలా కాకుండా మధ్యలో నిలిచిపోవటం, కొంతసేపు ఫ్యాన్ కూడా ఆగిపోవటంతో లోపల ఉన్న అధికారులు ఉక్కిరిబిక్కిరయ్యారు. -
ఈజీ లిఫ్ట్.. ఎంతో సాఫ్ట్!
బంజారాహిల్స్: నిత్యజీవితంలో తనకు ఎదురైన సమస్యనే అనుభవంగా మార్చుకొని కొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టాడు. జూబ్లీహిల్స్ భారతీయ విద్యాభవన్ పబ్లిక్ స్కూల్ (విద్యాశ్రమం)లో 8వ తరగతి చదువుతున్న సింగం రవికర్‌రెడ్డి సత్తా చాటాడు. ఇన్స్పైర్ (2019– 20) రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు. తన అమ్మమ్మ రంగలక్ష్మి అనారోగ్యం కారణంగా మంచానికే పరిమితమై ఇబ్బందులకు గురవుతున్న దయనీయ పరిస్థితిని గమనించాడు రవికర్‌రెడ్డి. అన్నం తింటే బాత్రూంకు వెళ్లాల్సి వస్తోందని.. తనను పట్టుకోవడానికి ఇద్దరు ముగ్గురు అవసరమవుతున్నారని ఆమె బాధపడుతూ భోజనం చేయడమే మానేసింది. ఈ నేపథ్యంలో బ్రెయిన్‌డెడ్ అయి మృతి చెందింది. ఇవన్నీ ఆ చిన్నారిని ఆలోచనలో పడేశాయి. ఇబ్బందులను తొలగించి రోగులను సులువుగా బాత్రూంకు తీసుకెళ్లే యంత్రాన్ని తయారు చేయాలనుకున్నాడు. నెల రోజుల పాటు శ్రమించి సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టాడు. ‘ఈజీ లిఫ్ట్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పేషెంట్స్’ పేరుతో యంత్రాన్ని తయారు చేసి ఇన్‌స్పైర్‌లో ప్రదర్శించాడు. ఈ యంత్రం సహాయంతో రోగులకు సులువుగా సేవలు చేయొచ్చని, వేరొకరి అవసరం లేకుండా కాలకృత్యాలు తీర్చుకునేందుకు సహాయకారిగా ఉపయోగపడుతుందని రవికర్‌రెడ్డి చెప్పాడు. ఈ ఆవిష్కరణలో బీవీబీపీ స్కూల్ ప్రిన్సిపాల్ అరుణశ్రీ, ఇతర ఉపాధ్యాయుల ప్రోత్సాహం ఎంతో ఉందన్నాడు. -
లిఫ్టులో ఇరుక్కుపోయిన మంత్రి
సాక్షి, హైదరాబాద్ : మంత్రి కొప్పుల ఈశ్వర్ లిఫ్టులో ఇరుక్కుపోయారు. సిబ్బంది తీవ్రంగా శ్రమించిన అనంతరం 30 నిమిషాల తర్వాత సురక్షితంగా బయటపడ్డారు. వివరాలు.. శుక్రవారం సైఫాబాద్‌లోని ఓ కార్యక్రమానికి హాజరయ్యారు మంత్రి కొప్పుల ఈశ్వర్. కార్యక్రమం ముగించుకుని తిరిగివస్తూ అక్కడి లిఫ్ట్‌లోకి ఎక్కారు. అయితే ఆ లిఫ్ట్ మధ్యలోనే ఆగిపోయింది. అందులోనుంచి మంత్రిని బయటకు తీసుకువచ్చేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. దాదాపు 30 నిమిషాలు కష్టం అనంతరం లిఫ్ట్ లాక్ ఓపెన్ అయింది. దీంతో మంత్రి సురక్షితంగా బయటపడ్డారు. చదవండి : తెలంగాణాలో అమెజాన్ భారీ పెట్టుబడులు -
బరువులెత్తగలనే!
బరువులెత్తగలవా.. ఓ నారీ బరువులెత్తగలవా? అంటే.. బరువులెత్తగలనే అంటారు దిశా పటానీ. ఏంటీ.. ‘చెట్టులెక్కగలవా.. ఓ నరహరి..’ పాట గుర్తొస్తోందా? ఆ పాట గురించి పక్కన పెట్టి, దిశా గురించి చెప్పుకుందాం. ఈ బాలీవుడ్ బ్యూటీకి ఫిట్నెస్ మీద శ్రద్ధ ఎక్కువ. ఆమె సోషల్ మీడియాలో దాదాపు అన్నీ ఫిట్నెస్ పోస్ట్‌లే ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఎక్కువ బరువులు మోస్తూ ఎప్పటికప్పుడు తన రికార్డ్‌ను తానే దాటేస్తుంటారు. తాజాగా 75 కేజీల బరువును ఎత్తారామె. ఆ వీడియోను పంచుకుంటూ, ఇదంతా నాకు ‘జస్ట్ పీస్ ఆఫ్ కేక్’ (ఇవన్నీ నాకు కేక్ వాక్ లాంటివి అనే ఉద్దేశంలో) అన్నారామె. ఇటీవలే సల్మాన్ ఖాన్‌తో ‘రాధే’ సినిమాలో నటించారు. ఆ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నారు దిశా పటానీ. ప్రస్తుతం ‘కేటీనా’ అనే సినిమాలో నటిస్తున్నారు. -
వరద: లిఫ్ట్ డోర్లు మూసుకుపోవటంతో..
ముంబై : డోర్లు మూసుకుపోయిన లిఫ్ట్‌లోకి వరద నీరు చేరుకోవటంతో ఇద్దరు సెక్యూరిటీ గార్డులు మృతి చెందారు. ఈ సంఘటన ముంబైలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ముంబై, కాలా పానీ జంక్షన్‌లోని నతానీ రెసిడెన్సీ బిల్డింగ్‌లో జీమీర్ సోహన్, శెహజాద్ మీమన్‌లు సెక్యూరిటీ గార్డులుగా పని చేస్తున్నారు. గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వారు ఉంటున్న బిల్డింగ్ బేస్మెంట్ ఫ్లోర్లో నీళ్లు చేరసాగాయి. అది తెలియని ఇద్దరూ వాటర్ ట్యాంక్ మోటర్ ఆన్ చేయటానికి బేస్మెంట్కు వెళ్లారు. మెల్లమెల్లగా వరద నీళ్లు బేస్మెంట్ను నింపటం గమనించి, వచ్చిన లిఫ్ట్‌లోనే వెనక్కు వెళ్లటానికి ప్రయత్నించారు. పై ఫ్లోర్‌కు వెళ్లటానికి లిఫ్ట్ నెంబర్లు నొక్కారు. ( వెలుగుచూస్తున్న కైలాస్ నాయక్ లీలలు..) అయితే డోర్లు క్లోజ్ అయ్యాయి కానీ, లిఫ్ట్ పైకి పోలేదు. ఎమర్జన్సీ అలారం మోగించారు. అలారం విన్న బిల్డింగ్‌లోని కొందరు అక్కడికి చేరుకుని వారిని బయటకు లాగే ప్రయత్నం చేసినప్పటికి, లాభం లేకపోయింది. ఆ వెంటనే వారు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. అగ్నిమాసక సిబ్బంది అక్కడికి చేరుకుని లిఫ్ట్‌ను కత్తిరించి ఇద్దర్నీ బయటకు తీశారు. అయితే అప్పటికే వరద నీటిలో మునిగిపోయిన ఆ ఇద్దరు ఊపిరాడక చనిపోయారు. -
ప్రాణాంతకంగా ‘లిఫ్ట్ బటన్’
సాక్షి, హైదరాబాద్: నగరంలోని అపార్ట్‌మెంట్‌వాసులకు ‘‘లిఫ్ట్ బటన్’’ కాటేస్తుంది. ఫ్లాట నుంచి గడపదాటకుండానే కరోనా బారిన పడుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి తగ్గినట్లే కనిపిస్తున్నా... వైరస్ ఏ రూపంలో, ఏ మూల నుంచి దాడి చేస్తుందో ? తెలియని పరిస్థితి నెలకొంది. ఫ్లాట్ నుంచి బయటికి వెళ్లేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా... అపార్ట్‌మెంట్‌కు వచ్చే వారికి కట్టడి లేకపోవడం ప్రమాదకరంగా తయారైంది. రోగనిరోధక శక్తిని బట్టి కొందరికి వైరస్ సోకినా కరోనా లక్షణాలు కనబడవు. పైకి మాత్రం ఆరోగ్యంగానే కనిపిస్తారు. ఆలాంటి వారు అపార్ట్‌మెంట్‌కు వచ్చి లిఫ్ట్ వినియోగించడం ఫ్లాట్‌వాసుల పట్ల ప్రాణాంతకరంగామారుతోంది. కరోనా వ్యాధిగ్రస్తుడు లిఫ్ట్ బటన్ నొక్కి వెళ్లి పోగా ఆ తర్వాత లిఫ్ట్ బటన్ నొక్కే వారందరికీ వైరస్ సోకుతుంది. ఈ తరువాత వారి ద్వారా కుటుంబ సభ్యులకు, అ తర్వాత మిగితా ఫ్లాట్స్ వారు క్రమనంగా కరోనాబారిన పడుతున్న సంఘటనలు అనేకం. లోహంపై ప్రభావం అపార్మెంట్స్లలో లిఫ్ట్ బటన్ ప్రాణాంతకరంగా మారుతోంది. కరోనా సోకిన వ్యక్తి దగ్గినపుడు అతడి ముక్కు, నోటి నుంచి వచ్చిన చిన్న తుంపర్ల ద్వారా వైరస్ వ్యాపిస్తోంది. చిన్నగా దగ్గినా మూడు వేలకు పైగా తుంపర్లు బయటికి వస్తాయి. ఇవి మిగతావారిపై, చుట్టూ ఉన్న బట్టలు, వస్తువులు, ఇతర ఉపరితలాలపై పడతాయి కొన్ని చిన్న అణువులు ఇంకా గాల్లోనే ఉండిపోతాయి. కరోనా వైరస్‌లపై జరిగిన కొన్ని అధ్యయనాల్లో పూర్తిగా క్రిమిరహితం చేయనంతవరకూ అవి లోహం, గ్లాస్, ప్లాస్టిక్ మీద తొమ్మిది రోజుల వరకూ జీవించి ఉంటాయని, వాటిలో కొన్ని బయట కనిష్ట ఉష్ణోగ్రతల్లో 28 రోజుల వరకూ సజీవంగా ఉంటాయిని తెలుస్తోంది. దీంతో లిఫ్ట్ వినియోగం కూడా ప్రమాదకరంగా తయారైంది. 35 శాతం కుటుంబాలు హైదరాబాద్ మహా నగరంలోని సుమారు 35 శాతం పైగా కుటుంబాలు అపార్ట్‌మెంట్స్‌లో నివసిస్తున్నట్లు అంచనా. నగరంలో ఇండిపెండెంట్ గృహం కొనడానికి కానీ, అద్దెకు ఉండటానికి గాని సామాన్యులు, మధ్య తరగతి వారికి అందుబాటులో లేని కారణంగా ఆపార్ట్మెంట్ ఫ్లాట్స్పైనే ఆసక్తి కనబర్చుతుంటారు. కరోనా విశ్వ రూపం ప్రదరిస్తుండటంతో ఆదిలో అపార్ట్మెంట్లో రాకపోకలకు కట్టడి చర్యలు చేపట్టినా.. ఆ తర్వాత గాలికి వదిలేశారు.లాక్డౌన్ సడలింపు కొన్ని రంగాలు అన్‌లాక్‌గా మారడంతో అపార్ట్‌మెంట్స్‌కు రాకపోకలు అధికమయ్యాయి.దీంతో పలు అపార్ట్‌మెంట్‌వాసులు కరోనా బారిన పడుతున్నారు. కరోనా మృతుల్లో అపార్ట్మెంట్లలో నివసిస్తున్నవారే అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. బయటపడని వైనం అపార్ట్మెంట్స్లోని ఫ్లాట్స్‌లో నివాసం ఉండే వారిలో ఎవరి ప్రపంచం వారిది. ఇరుగు పోరుగు వారికి వరుసలు పెట్టి పిలువడం లాంటి పలకరింపులు దేవుడేరుగు కానీ, ఎదురు పడితే కనీస పలకరింపులు కూడా ఉండవు. ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారు...ఎప్పుడు ఎవరూ ఎక్కడి వెళ్తున్నారు తెలియదు. ఎవరికైనా ఆరోగ్యంలో ఏమైనా మార్పు కనిపిస్తే..అనుమానం ఉంటే ప్రయివేటు ఆసుపత్రికి వెళ్లి టెస్ట్‌లు చేయించుకోవడం.. పాజిటివ్ వస్తే గుట్టుచప్పుడు కాకుండా హోమ్ ఐసోలేషన్‌కు పరిమితం కావడం సర్వసాధరణమైంది. కనీసం పక్క ఫ్లాట్ వారికి కూడా తెలియకుండా జాగ్రత్త పడుతూ మేకపోతు గాంభీర్యం నటిస్తుంటారు. రోగనిరోధక శక్తితో కొందరు హోమ్ ఐసోలేషన్‌తోనే కోలుకుంటుండగా, మరికొందరు పరిస్ధితి విషమించి ఆసుపత్రికి వెళ్లడమో లేదా... ఫ్లాట్‌లోనే మృత్యువాత పడటం పరిపాటిగా తయారైంది. -
వామ్మో లిఫ్ట్ బటన్: అందరికీ పాజిటివ్
సాక్షి, ఖమ్మం : తెలంగాణ కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకూ పెరుగుతోంది. వైరస్ కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా ఏమాత్రం నియంత్రణలోకి రావడంలేదు. ప్రాణాంతక పురుగు ఏ మూల నుంచి దాడి చేస్తోందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మొదట్లో కేవలం జీహెచ్ఎంసీ పరిధిలోనే వ్యాప్తి చెందిన కరోనా రోజులు గడుస్తున్నా కొద్దీ జిల్లాలకు, పల్లెలకు పాకుతోంది. ఈ క్రమంలోనే ఖమ్మం పట్టణం సమీపంలో ఆపార్టమెంట్‌లో కరోనా కలకలం రేపింది. ఓ వ్యక్తి తెలియక చేసిన తప్పిదానికి ఓ అపార్ట్మెంట్లోని అందరికీ వైరస్ పాకింది. తొలుత లిఫ్ట్ బటన్ నొక్కిన వారంరికీ వచ్చిందని, ఈ తరువాత వారి ద్వారా అపార్ట్మెంట్లోని 20 ఫ్లాట్స్‌లో ఉన్న వారందరికీ వైరస్ పాకినట్లు స్థానికుల ద్వారా తెలిసింది. బాధితులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. (క్వారంటైన్ నిబంధనలు: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం) -
లిఫ్ట్‌లో నరకం అనుభవించిన చిన్నారి
బీజింగ్ : చేతికి కట్టిఉన్న సేఫ్టీ లీష్ (తీగ లాగా ఉండే ‘సేఫ్టీ లీష్’ను పిల్లలు తప్పిపోకుండా, ఎవరైనా ఎత్తుకుపోకుండా ఉండేందుకు తల్లిదండ్రులు దీని ఓ కొనను పిల్లలకు మరో కొనను తమకు కట్టుకుంటారు) కారణంగా ఓ చిన్నారి తీవ్ర ఇబ్బందికి గురైంది. లిఫ్ట్ తలుపుల మధ్య సేఫ్టీ లీష్ చిక్కుకుని కొన్ని క్షణాలు నరకం అనుభవించింది. చైనాలోని హ్యూబే ప్రావిన్స్‌లో చోటు చేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. డాయి సిటీకి చెందిన ఓ బాలిక గత గురువారం ఓ మహిళతో కలిసి బయటకు వచ్చింది. ఓ భవనంలోకి అడుగుపెట్టగానే బాలిక వెంటనే అక్కడి లిఫ్ట్‌లోకి వెళ్లింది. ఆ వెంటనే లిఫ్ట్ క్లోజ్ అయింది. ( వైరల్ వీడియో: ఇద్దరిపై చిరుత పంజా! ) లిఫ్టులో ఇరుక్కుపోయిన చిన్నారి అయితే చేతికి ఉన్న సేఫ్టీ లీష్ లిఫ్ట్ తలుపుల మధ్య చిక్కుకోవటంతో బాలిక లిఫ్ట్‌తో పాటు ఠక్కున పైకి వెళ్లిపోయింది. ఏం జరుగుతోందో అర్థంకాని పరిస్థితిలో చిన్నారి ఉక్కిరిబిక్కిరి అయింది. పైన ఉన్న లిఫ్ట్ తలుపుల కొనలకు అతుక్కుపోయింది. కొన్ని క్షణాల పాటు గాల్లోనే ఉండిపోయింది. కొద్ది సేపటి తర్వాత సేఫ్టీ లీష్ లూజ్ అవటంతో కిందకు పడింది. బతుకుజీవుడా అంటూ బయటకు వెళ్లడానికి లిఫ్ట్‌లో ఉన్న ఫ్లోర్ నెంబర్స్ నొక్కుతూ ఉండిపోయింది. -
లిఫ్ట్‌లో భయంకర క్షణాలు
-
లిఫ్ట్‌లో తండ్రీకూతుళ్ల నరకయాతన
సాక్షి, హైదరాబాద్ : తండ్రి కూతురు లిఫ్ట్‌లో ఇరుక్కుని నరకయాతన పడిన సంఘటన హైదరాబాద్‌లోని మణికొండలో చోటు చేసుకుంది. ల్యాంకో హిల్స్‌లో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి ఆదివారం తన కూతురుతో కలిసి లిఫ్ట్ ఎక్కాడు. అయితే సాంకేతిక లోపం కారణంగా లిఫ్ట్ ఆగిపోయింది. సహాయం కోసం 40 నిమిషాల పాటు అతడు ఆర్తనాదాలు చేశాడు. అయినా ఎవరూ రాకపోవడంతో స్వయంగా లిప్ట్ తలుపులు తెరిచేందుకు విశ్వప్రయత్నాలు చేశాడు. చివరకి తన ప్రయత్నం ఫలించి తలుపులు తెరచుకోవడంతో లిఫ్ట్ నుంచి కూతురితో క్షేమంగా బయటపడ్డారు. ఆ దృశ్యాలు ఆక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. -
యస్ బ్యాంకు : సత్వర చర్యలు, కస్టమర్లకు ఊరట
సాక్షి, ముంబై: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న యస్ బ్యాంకులో పునరుద్ధరణ చర్యలు చకా చకా జరిగిపోతున్నాయి. ఇప్పటికే ఆర్బీఐ పునరుద్ధరణ ప్రణాళిక ప్రతిపాదనలను ఆమోదించిన కేంద్ర కేబినెట్ తదుపరి చర్యల్ని కూడా అంతే వేగంగా పూర్తి చేస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటికే పాలనాధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రశాంత్ కుమార్‌ను సీఈవో, ఎండీగా ఎంపిక చేసింది. ఈ మేరకు ప్రభుత్వం శనివారం (మార్చి 14)న వెల్లడించింది. అంతేకాదు శుక్రవారం రాత్రి జారీ చేసిన నోటిషికేషన్ ప్రకారం పునరుద్ధరణ ప్రణాళిక అమల్లోకి వచ్చిన నేపథ్యంలో మార్చి 18, సాయంత్రం 6 గంటల నుంచి తాత్కాలిక నిషేధం రద్దు అవుతుంది. అంటే యస్ బ్యాంకు ఖాతాదారుడు రూ. 50వేల కు మించి నగదు ఉపసంహరించుకునే వెసులుబాటు కలుగుతుంది. పీఎన్బీ మాజీ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సునీల్ మెహతా యస్ బ్యాంకు నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. అలాగే మహేష్ కృష్ణమూర్తి, అతుల్ భేడా నాన్‌ఎగ్జిక్యూటివ్ డైరెర్టర్లుగా వ్యవహరించ నున్నారు. ఇదివరకే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన దాని ప్రకారం యస్ బ్యాంక్‌పై ప్రస్తుతం అమలు చేస్తున్ననిషేధాన్ని(మారటోరియం)ఎత్తివేసిన వారం రోజుల్లోగా వీరంతా బాధ్యతలు స్వీకరించ నున్నారు. తద్వారా యస్ బ్యాంకుకు కొత్త డైరెక్టర్ల బోర్డు ఏర్పాటు కానుంది. కాగా యస్ బ్యాంక్‌పై ఆంక్షలతోపాటు, ఖాతాదారుల నగదు ఉపసంహరణపై నెల రోజుల పాటు నిషేధాన్ని ఆర్బీఐ విధించింది. అలాగే స్టేట్ బ్యాంక్ మాజీ సీఎఫ్‌వో, డిప్యూటీ ఎండీగా పనిచేసిన ప్రశాంత్‌ను యస్ బ్యాంక్ పాలనాధికారిగా రిజర్వ్ బ్యాంక్ నియమించిన సంగతి తెలిసిందే. -
‘లిఫ్ట్ ప్లీజ్’ అని నగరాలను చుట్టొచ్చాడు!
సాక్షి, హైదరాబాద్: ఆ యువకుడు ‘లిఫ్ట్ ప్లీజ్’ అంటూ హైదరాబాద్ నుంచి బయలుదేరి ఏకంగా దేశంలోని ప్రధాన నగరాలను చుట్టి వచ్చేశాడు. డబ్బుల అవసరం లేకుండానే రెండు దఫాల్లో సుమారు 12 వేల కి.మీ. మేర పర్యటించి చరిత్ర సృష్టించాడు నగరానికి చెందిన గ్రాఫిక్ డిజైనర్ వంగవేటి కరుణాకర్. 29 రోజుల పాటు సాగిన తన సుదీర్ఘ పర్యటనలో మహోన్నతమైన భారతీయ ఆత్మను సమున్నతంగా ఆవిష్కరించాడు. వైవిధ్యభరితమైన సంస్కృతులు, జీవన విధానాలు ఎన్నెన్ని ఉన్నా అంతిమంగా భారతీయులంతా ఒక్కటేనని నిరూపించాడు. దేశంలో ఎక్కడికి వెళ్లినా అతిథిలా ఆదరించి అక్కున చేర్చుకుంటారని నిరూపించాడు. ట్రావెలింగ్‌పై మక్కువతో ప్రపంచమంతా పర్యటించాలనే చిన్నప్పటి తన కలను సాకారం చేసుకునే తొలి అడుగు పడిందంటున్నాడు కరుణాకర్. ఆయన ఫ్రీ ట్రావెలింగ్ ఎలా సాగింది.. తనకు ఎదురైన అనుభవాలేమిటి? తదితర అంశాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. అలా మొదలైంది.. ‘లిఫ్ట్ ప్లీజ్’ అంటే ఏ వాహనదారైనా ఐదారు కి.మీ వరకు తీసుకెళ్తాడు. కానీ ఊళ్లకు ఊళ్లు.. రాష్ట్రాలు దాటించడం సాధ్యం కాదు. దేశ సరిహద్దుల వరకు వెళ్లలేం కదా. అటు నేపాల్‌లోని ఖాట్మండూ. ఇటు పాక్ సమీపంలోని అనూబ్‌ఘర్ వరకు కేవలం ఇతరుల సహాయంతో చేరుకోలేం కదా. కానీ అలాంటి సాహసోపేతమైన పర్యటనే చేశాడు కరుణాకర్. ఏ మాత్రం పరిచయం లేని వ్యక్తుల సహాయంతో రోడ్డు మార్గంలో రకరకాల వాహనాలపై వెళ్లాడు. అలా వెళ్లే క్రమంలో కేవలం ఒక్క కి.మీ. తీసుకెళ్లినవారూ ఉన్నారు. 500 కి.మీ. వరకు దాటించినవారూ ఉన్నారు. నగరంలోని కృష్ణానగర్‌లో ఉన్న తన ఇంటి నుంచి ఓ బైక్ లిఫ్ట్ తీసుకొని బయలుదేరితే దారిలో ట్రక్కు, లారీ, కారు, సైకిల్, ఒంటెబండి.. ఇలా ఏ వాహనంలో చోటు లభిస్తే ఆ వాహనంలో వెళ్లాడు కరుణాకర్. సాహసమే ఊపిరిగా.. ప్రయాణం అంటేనే డబ్బులతో ముడిపడిన విషయం. అవి లేకుండా ప్రయాణం చేయడం సాహసమే. ‘మొదట మా ఊరికి వెళ్లాను. మాములుగా అయితే ఖమ్మం సమీపంలోని మా ఊరికి హైదరాబాద్ నుంచి 6 గంటల సమయం పడుతుంది. లిఫ్ట్ తీసుకొని వెళ్లడంతో 9 గంటలు పట్టింది. కానీ తిరుగు ప్రయాణంలో 5 గంటల్లోనే చేరుకున్నాను. ఈ అనుభవం నాకు గొప్ప దైర్యాన్ని ఇచ్చింది. ఆ స్ఫూర్తితోనే పర్యటన మొదలైంది అని చెబుతున్నాడు కరుణాకర్. అక్టోబర్‌లో 15 రోజుల పాటు రాజస్థాన్ ప్రయాణం చేశాడు. ఈ ప్రయాణంలో చుట్టూ పొలాల మధ్యలో ఉన్న ఓ ఇంట్లో, ఓ పంజాబీ ఫ్యామిలీ ఆతిథ్యం స్వీకరించడం గొప్ప అనుభూతిగా మిగిలింది. అహ్మదాబాద్‌కు, ఉదయపూర్ మధ్యలో రాత్రి 2గంటల సమయంలో ప్రయాణం చేయాల్సివచ్చినప్పుడు ఓ ఆర్టీఓ అధికారి లిఫ్ట్ ఇచ్చాడు. ఈ ట్రిప్‌లో కార్లు, బైక్‌లు, ట్రక్కులు, ట్రాక్టర్లు, ఒంటెల బండ్లు, సైకిల్, బస్సు, అన్ని రకాల వాహనాల్లో వెళ్లాడు. రెండు దఫాలుగా.. కరుణాకర్ భారత యాత్ర రెండు దఫాలుగా సాగింది. మొదట హైదరాబాద్– రాజస్థాన్ వరకు వెళ్లి వచ్చాడు. 15 రోజుల్లో మొత్తం3,500 కి.మీ చుట్టొచ్చాడు. ముంబై, జోధ్‌పూర్, ఉదయ్‌పూర్, బికనీర్, అనూబ్‌ఘర్, శ్రీగంగానగర్, జైపూర్ మీదుగా తిరిగి హైదరాబాద్ చేరుకున్నాడు. -
విధి ఆడిన ఆట
హస్తినాపురం: ఓ చిన్నారితో విధి ఆటాడింది. అభం శుభం తెలియని పాపను పొట్టన పెట్టుకుంది. ఆడుకుంటూ ప్రమాదవశాత్తు లిఫ్టులో ఇరుక్కుపోయి ఎనిమిదేళ్ల బాలిక మృతి చెందింది. ఈ హృదయ విదారక సంఘటన శుక్రవారం ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్తినాపురం నార్త్ ఎక్స్టెన్షన్ కాలనీలో జరిగింది. స్థానికులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం... హస్తినాపురం నార్త్ ఎక్స్టెన్షన్ కాలనీలో నివాసముంటున్న చంద్రశేఖర్ కుమార్తె లాస్య(8) సరూర్‌నగర్ మండలం నాదర్గుల్ గ్రామంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఒకటో తరగతి చదువుతోంది. సెలవులు కావడంతో శుక్రవారం మధ్యాహ్నం దాదాపు రెండు గంటల ప్రాంతంలో ఇంటి కింద ఆడుకుంది. పైకి వెళ్లేందుకు లిఫ్టులోకి వెళ్లిన చిన్నారి ప్రమాదవశాత్తు అందులో ఇరుక్కుపోయింది. తీవ్రంగాగాయపడిన పాప కేకలు వేయడంతో హుటాహుటిన వచ్చిన తండ్రి కష్టపడి బాలికను బయటకు తీశారు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు. దీంతో కన్నీరు మున్నీరైన తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరితరం కాలేదు. నాసిరకం లిఫ్టులతోనే ప్రమాదాలు.. చిన్నారి మృతిపై బాలల హక్కుల సంఘం గౌరవాధ్యక్షుడు అచ్యుతరావు ఓ ప్రకటనలో విచారం వ్యక్తం చేశారు. కొందరు భవన నిర్మాణదారులు నాసిరకం లిఫ్టు›లు ఏర్పాటు చేస్తుండడంతోనే తరుచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. అపార్ట్మెంట్లలో బ్రాండెడ్ లిఫ్టులనే అమర్చాలని, నాణ్యమైన వాటినే ఏర్పాటు చేసేలా మున్సిపల్ అధికారుల చర్యలు తీసుకోవాలని కోరారు. చిన్నారి మృతి ఘటనపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి లిఫ్టు బిగించిన నిర్మాణదారుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
లిఫ్ట్‌లో ఇరుక్కున్న మంత్రి
హిమాయత్‌నగర్: ఎమ్మెల్యే క్వార్టర్స్ నిర్మించి పట్టుమని 6 నెలలు కూడా గడవకముందే అప్పుడే సమస్యలు తలెత్తుతున్నాయి. రాష్ట్ర మంత్రే లిఫ్ట్‌లో అరగంట పాటు ఇరుక్కుపోయారు. ఈ ఘటన శుక్రవారం హైదర్‌గూడలోని ‘ఎంఎస్–3’(ఎమ్మెల్యే క్వార్టర్స్)లో చోటుచేసుకుంది. వివరాలు.. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ 8వ అంతస్థులోని 810 ఫ్లాట్ (క్వార్టర్)లో నివాసముంటున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంట ల ప్రాంతంలో తన అనుచరులు, వ్యక్తిగత సిబ్బందితో కలసి రేషన్ డీలర్ల సమావేశానికి హాజరయ్యేందుకు ఫ్లాట్ నుంచి బయలుదేరారు. లిఫ్ట్‌లోకి వెళ్లిన తర్వాత కిందకి వెళ్లే బటన్ నొక్కడంతో లిఫ్ట్ డోర్లు మూసుకుపోయాయి. లిఫ్ట్ ఎటూ కదలకపోవడం, డోర్లు కూడా తెరుచుకోకపోవడంతో ఆందోళన చెందిన మంత్రి సిబ్బంది క్వార్టర్స్ నిర్వహణాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో సిబ్బంది అక్కడకు చేరుకుని అరగంట పాటు నానా శ్రమ పడి గడ్డపార, స్కూ డ్రైవర్ ఉపయోగించి డోర్లు తెరిచారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే క్వార్టర్స్ అధికారులపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిమితికి మించిన బరువు వల్లే లిఫ్ట్ నిలిచిపోయిందని ఎమ్మెల్యే క్వార్టర్స్ సెక్షన్ అధికారి సునీల్ తెలిపారు. మంత్రితోపాటు ఆయన అనుచరులు, సిబ్బంది మొత్తం 13 మంది వరకు ఆ సమయంలో లిఫ్ట్ ఎక్కడం వల్ల ఇలా జరిగిందన్నారు. -
ఐదేళ్ల పాప తెలివికి నెటిజన్లు ఫిదా..
ఇస్తాంబుల్: ఐదేళ్ల బాలిక సమయస్ఫూర్తితో లిఫ్ట్‌లో తన తమ్ముడి ప్రాణాలను రక్షించిన సంఘటన ప్రస్తుతం ట్విట్టర్లో హల్చల్ చేస్తోంది. ఈ వీడియో చూసిన వారందరూ ఆ అమ్మాయిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఈ వీడియో చూస్తే మీరూ మెచ్చుకోకుండా ఉండరేమో. ఇస్తాంబుల్‌లో ఇద్దరు చిన్నారులు తన సోదరుడితో కలిసి లిఫ్ట్‌లోకి ప్రవేశించారు. ఆ సమయంలో బాలుడి కాలికి ఓ తాడు చుట్టుకొని ఉండగా దానిని గమనించకుండా అలాగే లిఫ్ట్‌లోకి వెళ్లారు. వెంటనే లిఫ్ట్ తలుపులు మూసుకోని పైకి వెళ్తుంటే తాడు చుట్టుకొని బాలుడు సైతం పైకి వెళ్లాడు. ఇదంతా గమనించిన సోదరి కంగారు పడకుండా వెంటనే బాలుడి కాళ్లు పట్టుకొని కిందకు లాగి, తన చేతిని తాడు మధ్యలో ఉంచింది. మరో చేతితో అత్యవసర బటన్‌ను నొక్కింది. అనంతరం నెమ్మదిగా తన తమ్ముడిని తాడు నుంచి కిందకు లాగింది. ఈ దృశ్యమంతా లిఫ్ట్‌లోని సీసీ టీవిలో రికార్డు అయ్యింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘‘క్లిష్ట పరిస్థితుల్లో చిన్నారి చూపించిన సమయస్ఫూర్తి గొప్పది’’ అంటూ కామెంట్ చేయగా ‘మరొకరు సోదరుడిని రక్షించడానికి అక్క చూపిన ధైర్య సాహసాలు గొప్పవి’ అంటూ పొగిడారు. Horrifying moment! Sister stayed calm and saved the boy who got hang by toy rope inside an elevator in Istanbul, Turkey. Please watch your children when using elevator. pic.twitter.com/NmZ2x5VwyE — People's Daily, China (@PDChina) August 1, 2019 -
లిఫ్ట్ ఇవ్వలేదని యువకుడి హత్య
చెన్నై ,టీ.నగర్: లిఫ్ట్ ఇచ్చేందుకు నిరాకరించిన యువకుడిని హత్య చేశారు. వివరాలు.. అరక్కోణం సమీపంలోని కీళ్ ఆవదం కాలనీకి చెందిన దక్షిణామూర్తి (32) చెన్నైలోని ప్రైవేటు సెల్‌ఫోన్ సంస్థలో పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన బంధువు నాగరాజ్‌తో బైక్‌పై ఆదివారం అన్వాదికాన్పేటైకు వెళ్లాడు. మదురా మాదిమంగళం బస్టాప్ వద్ద బైక్ నిలిపి దక్షిణామూర్తి పెరుగు కొనేందుకు దుకాణానికి వెళ్లాడు. నాగరాజ్ బైక్ సమీపంలో నిలుచుని ఉన్నాడు. ఆ సమయంలో బస్టాప్‌లో నిలుచున్న ఇద్దరు యువకులు తమను బైక్‌లో అన్వాదికాన్పేటైలో వదిలిపెట్టాలని కోరారు. ఇందుకు నాగరాజ్ నిరాకరించాడు. ఈలోగా అక్కడికి వచ్చిన దక్షిణామూర్తితో ఇద్దరు యువకులు గొడవకు దిగారు. ఆగ్రహించిన ఇద్దరు యువకులు కత్తితో దక్షిణామూర్తిపై దాడి చేశారు. ఆ తర్వాత అటువైపుగా బైక్‌పై వచ్చిన ఉలియనల్లూరు ప్రాంతానికి చెందిన వెంకటేశన్‌పై దాడి చేసి అతని బైక్‌ను లాక్కుని ఇద్దరు యువకులు పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన దక్షిణామూర్తి మృతిచెందాడు. దీనికి నిరసనగా మృతుడి బంధువులు, స్నేహితులు కీళ్ ఆవదం కాలనీ ప్రాంతం నుంచి అన్వాదికాన్పేటైకు వెళ్లే రోడ్డుపై రాస్తారోకో చేశారు. వారిని పోలీసులు సముదాయించి అక్కడి నుంచి పంపివేశారు. -
లిఫ్ట్‌లో తల ఇరుక్కుని బాలుడి మృతి
మేడ్చల్: లిఫ్ట్‌లో తల ఇరుక్కుని ఓ బాలుడు మృతి చెందిన సంఘటన మేడ్చల్, బాలాజీనగర్‌లో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ప్రకాశం జిల్లాకు చెందిన బాలచంద్రయ్య బాలాజీనగర్‌లోని తిరుమల నిలయం అపార్ట్మెంట్లో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. అతని కుమారుడు హేమంత్‌కుమార్(10) స్థానిక రోజరి కాన్వెంట్ స్కూల్లో 5వ తరగతి చదవుతున్నాడు. మంగళవారం సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన హేమంత్ ఆడుకుంటూ లిఫ్ట్ వద్దకు వెళ్లాడు. లిఫ్ట్ డోర్ తెరుచుకోవడంతో తల లోపలికి పెట్టి చూస్తుండగా అదే సమయంలో లిఫ్ట్ ఆన్ కావడంతో మధ్యలో చిక్కుకున్న అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మేడ్చల్ పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కి‘లేడీ’ అరెస్ట్
విశాఖపట్నం : అమె టిప్‌టాప్‌గా తయారవుతుంది. బ్యూటీపార్లర్‌లో పనిచేస్తున్నానని చెబుతుంది. మగవాళ్లను లిఫ్ట్ అడిగి, పరిచయం పెంచుకుంటుంది. తరువాత దొంగతనాలకు పాల్పడుతుంది. అటువంటి కి‘లేడీ’ని ఎంవీపీ క్రైం పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అనకాపల్లికి చెందిన గౌరి నగరంలోని సీతంపేట జీవీఎంసీ పాఠశాల సమీపంలో నివసిస్తుంది. ఆమె గతంలో భర్తతో గొడవపడి విడాకులు తీసుకుంది. ఆమెకు ముగ్గురు పిల్లలున్నారు. విలాసాలకు అలవాటు పడిన గౌరి దొంగతనాలకు పాల్పడుతోందని పోలీసుల విచారణలో తేలింది. శివాజీపాలెంలో నివసిస్తున్న పూసపాటి గోపాలకృష్ణ వర్మ (60) గతంలో కార్పొరేటర్‌గా పనిచేశారు. అతను కారులో వెళ్తుండగా మార్గమధ్యలో గుత్తుర్తి గౌరి (29) లిఫ్టు అడిగింది. దీంతో లిఫ్టు ఇచ్చిన వర్మ ఆమెతో కలిసి ఎంవీపీ కాలనీలో గల ఒక రెస్టారెంట్‌కి వెళ్లారు. కొంతసేపటికి వర్మ వాష్‌రూమ్‌కి వెళ్లగా అక్కడే ఉన్న కారు తాళాలు తీసుకుని గౌరి కారుతో సహా పరారైంది. దీంతో వర్మ ఎంవీపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఎంవీపీ క్రైం ఎస్ఐ సూరిబాబు పర్యవేక్షణలో టి.తులసీభాస్కర్, పి.నరేష్కుమార్, పీడీవీ ప్రసాద్ కలిసి గౌరిని అరెస్టు చేసి కారు స్వాధీనం చేసుకున్నారు. ద్వారకాజోన్ క్రైం సీఐ వి.బాబ్జీరావు పర్యవేక్షణలో కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రెండు నెలల్లో రెండుసార్లు..
సుల్తాన్‌బజార్: రాష్ట్రంలోనే పేరొందిన ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో లిఫ్ట్ పనిచేయకపోవడంతో డయాలసిస్ కోసం వచ్చిన రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ లిఫ్ట్ వాడకంలోకి వచ్చిన రెండు నెలల గడవక ముందే రెండోసారి మరమ్మతుకు గురికావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిత్యం వందలాది రోగులకు చికిత్సలు అందించే యురాలజీ, డిమిడ్ విభాగాలు ఆపరేషన్ థియేటర్లు ఉన్న భవనంలో లిఫ్ట్ పని చేయకపోవడంతో డయాలసిస్ సెంటర్‌కు వెళ్లేందుకు రోగులు గత కొంత కాలంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మూడో అంతస్తు వరకు ఇటీవల మరో లిఫ్ట్‌ను ఏర్పాటు చేశారు. అయితే రెండు నెలలు గడవక ముందే లిప్ట్ మరమ్మతులకు గురికావడంతో మళ్లీ సమస్య మొదటికి వచ్చింది. రెండో అంతస్తు వరకు కిడ్నీ వ్యా«ధిగ్రస్తులకు లిఫ్ట్‌లో తీసుకువెళ్లి అక్కడి నుంచి మూడో అంతస్తుకు వీల్‌ఛైర్‌లో తరలిస్తుండడంతో రోగులు, సిబ్బందికి ఇబ్బందులు తప్పడం లేదు. కొత్తదైనా ఇబ్బందులే.. ఉస్మానియా క్యూక్యూడీసీ భవనంలోని 3వ అంతస్తుకు రోగులను తీసుకువెళ్లేందుకుగాను 2017 జనవరిలో మరో లిఫ్ట్ ఏర్పాటుకు టీఎస్‌ఎంఎన్‌ఐడీసీ శ్రీకారం చుట్టింది. దాదాపు రూ. 30లక్షలతో లిఫ్ట్ నిర్మాణ పనులు ప్రారంభించగా, కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థ దాదాపు ఏడాదిన్నరపాటు పనులను సాగదీసింది. గత నవంబర్ 12న పనులు పూర్తికావడంతో డీఎంఈ డాక్టర్ రమేశ్‌రెడ్డి దీనిని ప్రారంభించారు. ప్రారంభమైన రెండునెలల్లోనే రెండోసారి మరమ్మతుకు గురికావడం అధికారుల టీఎస్‌ఎంఎన్‌ఐడీసీ పనితీరును చెప్పకనే చెబుతుంది. టీఎస్‌ఎంఎన్‌ఐడీసీ ఎలక్ట్రికల్ విభాగం అధికారుల నిర్లక్ష్యం కారణంగా పనులు నాసిరకంగా జరగడంతోనే రెండు నెలలకే లిప్ట్ పనిచేయకుండా పోయిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రూ. 30 లక్షలతో ఏర్పాటు చేసిన ఈ లిప్ట్ రెండునెలల్లో రెండు సార్లు రిపేరీ కావడం పట్ల అధికారుల నిర్లక్ష్యం స్పష్టమవుతుందని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా లిప్ట్ను బాగుచేసి డయాలసిస్ రోగులకు అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు. -
మహిళ పైశాచికం.. చెవి రింగుల కోసం
ముంబై : మానవత్వం మరిచిన ఓ మహిళ.. నాలుగేళ్ల చిన్నారిని దారుణంగా హింసించిన ఘటన ముంబైలో చోటు చేసుకుంది. వివరాలు.. రిజ్వానా బేగం అనే మహిళ నాలుగేళ్ల చిన్నారిని అత్యంత దారుణంగా కొడుతూ హింసించింది. నొప్పికి తాళలేక ఆ చిన్నారి కేకలు పెడుతున్నప్పటికి రిజ్వానా మనసు కరగలేదు. అంతటితో ఆగక చిన్నారి కేకలు బయటకు వినపడకుండా ఉండేందుకుగాను ఏకంగా ఆ చిన్నారిపై కూర్చుంది రిజ్వానా. ముంబై సబర్బన్ ట్రాంబే ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్ లిఫ్ట్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. రిజ్వానా బాలికను కొడుతున్న దృశ్యాలు లిఫ్ట్‌లోని సీసీటీవీలో రికార్డయ్యాయి. వీటి ఆధారంగా ముంబై పోలీసులు రిజ్వానాను అరెస్ట్ చేశారు. బాలిక చెవి రింగులు దొంగతనం చేయడం కోసమే రిజ్వానా ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. రిజ్వానా దగ్గర నుంచి బాలికకు చెందిన చెవి రింగులను స్వాధీనం చేసుకున్నారు. HORIBLE #crime! Rizwana Begum the woman in the CCTV footage brutally assaulted a 4-yr-old girl in the lift. She later sat on the girl & prevented people to rescue her too. @MumbaiPolice has arrested her. Hope she’s dealt severely for this inhuman behaviour. @ChemburChapters pic.twitter.com/rpA6NsT31h — #PotholeWarriors4SafeMumbai🇮🇳🕳🛵👷♂️🚧💡🕯👍🌴 (@PotholeWarriors) November 15, 2018 -
‘కల్వకుర్తి’ చివరి పంపు రెడీ
సాక్షి, హైదరాబాద్: కల్వకుర్తి ఎత్తిపోతల పథకం లిఫ్ట్–3లో ఐదో పంపు వెట్ రన్ విజయవంతమైంది. లిఫ్ట్–3లో ఇప్పటికే నాలుగు పంపులు పని చేస్తుండగా, ఐదో పంప్ వెట్ రన్‌ను ప్రాజెక్టు ఇంజనీర్లు ఆదివారం పూర్తి చేశారు. కల్వకుర్తి ఎత్తిపోతలలో మూడు లిఫ్టులున్నాయి. లిఫ్ట్–1, లిఫ్ట్–2లో మూడేసి చొప్పున పంపులు ఇప్పటికే పని చేస్తున్నాయి. ఒక్కో పంపు 800 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోయగలదు. కల్వకుర్తి కింది 0.35 టీఎంసీల సామర్థ్యం గల ఎల్లూరు రిజర్వాయర్, 0.55 టీఎంసీల సామర్థ్యం గల సింగోటం రిజర్వాయర్లను లిఫ్ట్–1 పంపులతో నింపుతున్నారు. లిఫ్ట్–2 ద్వారా 2.14 టీఎంసీల సామర్థ్యమున్న జొన్నల బోగడ రిజర్వాయర్ నిండుతోంది. ఇక లిఫ్ట్–3 ద్వారా 0.98 టీఎంసీల గుడిపల్లి గట్టు రిజర్వాయర్ నిండుతోంది. కానీ, ఐదో పంపు సిద్ధం కాకపోవడం వల్ల పూర్తి సామర్థ్యం మేరకు నీటి ఎత్తిపోత జరగడం లేదు. ఇప్పుడు ఐదో పంపు రన్ విజయవంతమైనందున పూర్తిగా నీటిని వినియోగించుకోవచ్చు. వర్షాలు బాగా కురుస్తుండటంతో శ్రీశైలం నుంచి అవసరమైన మేర నీరు తీసుకునే అవకాశం ఏర్పడింది. కల్వకుర్తి ప్రాజెక్టు కింది 3.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వడంతో పాటు ప్రాజెక్టు పరిధిలోని సుమారు 500 చెరువులను నింపాలని అధికారులు ప్రణాళిక రచించారు. లిఫ్ట్–3 ఐదో పంపు రన్ విజయవంతంగా నిర్వహించిన ఇంజనీర్లను రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అభినందించారు. -
లిఫ్ట్ ఇవ్వటం ‘మహా’ పాపం
పాపం పోనీ అని లిఫ్ట్ ఇవ్వటం ఆ వ్యక్తి పాలిటే శాపంగా మారింది. హఠాత్తుగా ఊడిపడ్డ ట్రాఫిక్ అధికారి చలాన్ రాసి చేతిలో పెట్టాడు. ముంబైకి చెందిన నితిన్ నాయర్ అనే వ్యక్తి తనకు ఎదురైన అనుభవాన్ని ఫేస్బుక్లో ఓ పోస్టు రూపంలో తెలియజేశాడు. జూన్ 18న ముంబై ఐరోలి సర్కిల్లో నితిన్ వెళ్తున్నాడు. ఆ సమయంలో వర్షం భారీగా పడుతుండటం, పైగా రవాణా సదుపాయం లేకపోవటంతో ముగ్గురు వ్యక్తులు కష్టపడుతుండటం అతని కంట పడింది. వెంటనే వారిని తన కారులో ఎక్కించుకున్నాడు. ఇది గమనించిన ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ వెంటనే నితిన్ వద్దకు వచ్చి రూ. 1500 చలాన్ రాసిచ్చాడు. అంతేకాదు నితిన్ డ్రైవింగ్ లైసెన్స్ లాక్కుని ఛలాన్ కట్టి వాహనం తీసుకెళ్లాలని సూచించాడు. అయితే ఆ టైమ్‌లోనూ నితిన్ సాయం చేయటం మానలేదు. వారిని వారి వారి గమ్యస్థానంలో వదిలి మరుసటి రోజు కోర్టుకు వెళ్లి ఫైన్ కట్టి బయటపడ్డాడు. తన అనుభవాన్ని నితిన్ ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. నితిన్‌కు ఎదురైన చేదు అనుభవాన్ని చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. సెక్షన్ 66/192 ప్రకారం అజ్ఞాత వ్యక్తులకు లిఫ్ట్ ఇవ్వడం నేరమని, అందుకే అజ్ఞాత వ్యక్తులకు లిఫ్ట్ పేరుతో సాయం చేసి తనలా బుక్ కాకండని సూచిస్తూ ఆ పోస్టును పెట్టాడు. ప్రస్తుతం ఆ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
ఆఫీస్ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన టీడీపీ నేతలు
-
లిఫ్ట్‌లో ఇరుక్కున్న టీడీపీ నేతలు.. పావుగంట ఉత్కంఠ
సాక్షి, విజయవాడ : పౌర సరఫరాలశాఖ కార్యాలయంలో లిఫ్ట్‌లో టీడీపీ నేతలు ఇరుక్కుపోవడం కలకలం రేపింది. పావుగంటపాటు నేతలు లిఫ్ట్‌లో ఉండిపోవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. టీడీపీ నేతలు బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, మీనాక్షి నాయుడు తదితరులు లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు. 15 నిమిషాలు లిఫ్ట్‌లోనే వారు బిక్కుబిక్కుమంటూ గడిపారు. చివరకు సెక్యూరిటీ సిబ్బంది రంగంలోకి దిగి.. ఎట్టకేలకు లిఫ్ట్ డోర్ తెరిచి నేతలను బయటకు తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ చైర్మన్‌గా చల్లా రామకృష్ణారెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, మంత్రులు ప్రతిపాటి పుల్లారావు, కాలువ శ్రీనివాసులు హాజరయ్యారు. వీరితోపాటు పలువురు టీడీపీ నేతలు కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు టీడీపీ నేతలు బుడ్డా రాజశేఖర్, మీనాక్షి నాయుడు, మరికొందరు నేతలు లిఫ్ట్ ఎక్కారు. వారు లిఫ్ట్ ఎక్కిన తర్వాత సాంకేతిక లోపంతో అది మధ్యలోనే ఆగిపోయింది. దీంతో 15 నిమిషాలపాటు నేతలు లిఫ్ట్‌లోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు. శ్వాస అందక ఒక దశలో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఈ క్రమంలో లిఫ్ట్‌లోని నేతలు ఫోన్ ద్వారా బయట ఉన్నవారికి సమాచారం అందించడంతో.. సెక్యూరిటీ సిబ్బంది రంగంలోకి దిగింది. లిఫ్ట్ డోర్‌ను తొలగించి.. వారిని బయటకు తీసుకురావడంతో నేతలు ఊపిరి పీల్చుకున్నారు. -
వైరల్.. లిఫ్ట్‌లో బాలుడి బిత్తిరి చర్య
బీజింగ్ : చైనాలో ఓ బాలుడు చేసిన బిత్తిరి చర్య ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియో చూస్తే మీరు కూడా నవ్వకుండా ఉండరు. ‘బాగైందంటూ.. భుజాలు ఎగురేస్తారు’. ఎవడు తీసుకున్న గొయ్యిలో వాడే పడ్డట్లుంది ఆ బాలుడి చేసిన పని. లిఫ్ట్‌లో ఒంటరిగా వెళ్తున్న ఆ బాలుడికి ఓ తీట పని చేయాలని తోచింది. లిఫ్ట్ బటన్స్‌ను ఇతరులు కూడా ఉపయోగిస్తారనే ఉద్దేశంతో వాటిపై టాయిలెట్ పోసాడు. తీరా ఆ బటన్స్‌ను తానే ఉపయోగించాల్సి వచ్చింది. తాను దిగాల్సిన ఫ్లోర్ వచ్చే సరికి బటన్స్ వాటంతటవే పని చేయడంతో లిఫ్ట్ ఒక్కసారిగా స్ట్రక్ అయింది. దీంతో లిఫ్ట్ డోర్ తెర్చుకోవడం.. మూసుకోవడంతో ఆ కుర్రాడు భయంతో అరవడం మొదలెట్టాడు. చివరకు తానే ఆ బటన్లను ప్రెస్ చేసి బయటకి వచ్చాడు. ఇతరులకు కీడు చేయాలనుకుంటే తనకే కీడు జరుగుతుందనే కర్మ సిద్దాంతం రుజువైంది. ఈ తతంగం అంతా అందులోని సీసీ టీవీలో రికార్డు అయింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా వైరల్ అయింది. -
లిఫ్ట్‌లో బాలుడి బిత్తిరి చర్య.. వీడియో హల్ చల్
-
మొబైల్ చూస్తూ కాలు పోగొట్టుకుంది!
-
మొబైల్ చూస్తూ కాలు పోగొట్టుకుంది!
షాంఘై : స్మార్ట్ ఫోన్ జీవితంలో ఒక భాగం అయిపోయింది. చేతిలో ఫోన్ ఉటే చాలు.. పక్కన ఏం జరుగుతోందన్న విషయాన్ని కూడా జనాలు గమనించడం లేదు. స్మార్ట్ మాయలో కొట్టుకుతున్న కుర్రకారు.. కొన్ని సందర్భాల్లో ప్రాణాలను కూడా పోగొట్టుకుంటున్నారు. ఇటువంటి ఘటనే చైనాలోని షాంఘైలో జరిగింది. స్మార్ట్ ఫోన్ మాయలో ఏం జరుగుతోందో కూడా పట్టించుకోక.. చివరకు అత్యంత దారుణ స్థితిలో కాలును కోల్పోయింది. షాంఘైలోని ఒక ప్రయివేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్న 28 ఏళ్ల యువతి ఆఫీస్ అయిపోయాక ఇంటికి వెళ్లే క్రమంలో లిఫ్ట్ దగ్గరకు వచ్చింది. అంతలోనే స్మార్ట్ ఫోన్ చూసుకుంటూ.. అడుగులు ముందుకు వేసింది. మొబైల్ చూసుకుంటూనే... లిఫ్ట్‌లోపలకు అడుగులు వేసింది. అయితే అప్పటికే లిఫ్ట్ డోర్లు మూసుకుపోతున్నాయి. ఈ విషయాన్ని గమనించని యువతి అలాగే లోపలకి వెళ్లింది. ఈ క్రమంలో ఆమె ఒక కాలు బయట ఉండగానే లిఫ్ట్ వేగంగా కదిలింది. లిఫ్ట్ వేగం అందుకోవడంతో.. ఆమె కాలు.. అక్కడే పచ్చడి అయిపోయింది. ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డవడంతో.. వెలుగులోకి వచ్చింది. -
లిఫ్ట్ ఫెయిల్: ఇద్దరు మృతి
హైదరాబాద్ : మాదాపూర్‌లోని ఎన్సీసీ కార్పొరేట్ కార్యాలయంలో విషాదం చోటుచేసుకుంది. లిఫ్ట్ ఫెయిల్ అవడంతో ఇద్దరు సాంకేతిక సిబ్బంది మృతిచెందారు. 11వ అంతస్తులో లిఫ్ట్‌ను నిలిపి గొలుసుతో వేలాడ దీసి మరమ్మతులు చేస్తుండగా గొలుసు తెగిపోయింది. దీంతో లిఫ్టు కిందకు పడిపోవడంతో అందులో ఇరుక్కుని వారిద్దరు మృతి చెందారు. సేఫ్టీ బెల్టులు లేకపోవడం వల్లనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మృతులను జాన్సన్ కంపెనీకి చెందిన లిఫ్ట్ మెకానిక్‌లు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని చిలుకూరుకు చెందిన రమేష్(21), ఖమ్మం జిల్లా కూసుమంచికి చెందిన నాగరాజు(28)గా గుర్తించారు.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
సెల్‌ఫోన్ చూస్తే.. ఇలాంటి చావులే?!
మొబైల్.. ఇప్పుడు హస్తాలంకార భూషణంగా మారిపోయింది. చిన్నాపెద్దా, ఆడమగా అన్నా తేడా లేకుండా.. స్మార్ట్‌ఫోన్ చూస్తూ పనులు చేస్తున్నాం. ఇంట్లో ఉన్నా.. ప్రయాణాల్లో ఉన్నా... ఎక్కడున్నా కళ్లు మాత్రం స్మార్ట్ ఫోన్ స్క్రీన్ మీదే. ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్న యువతి కూడా అచ్చం మనలాంటిదే. పేరు తెలియదు కానీ.. చైనాలోని నాన్జింగ్ సిటీలో నివసిస్తోంది. సఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి వెళ్లేందుకు పార్కింగ్ ప్లేస్‌కు వచ్చింది. అక్కడ కూడా కార్ పార్కింగ్‌ను గమనించకుండా.. స్మార్ట్ స్క్రీన్ మీద వేళ్లు టకటకలాడిస్తూ.. ముందుకు నడుస్తోంది. చైనాలోని కార్యాలాయాల్లో పార్కింగ్ మొత్తం అడ్వాన్స్డ్ స్థాయిలో ఉంటుంది. అండర్‌గ్రౌండ్‌లో కార్లను వరుసగా.. ఒకదానిమీద ఒకటి పేరుస్తారు. అవసరమైన కారును లిఫ్ట్ సహాయంతో బయటకు తెస్తారు. ఆ సమయంలో కార్ లిఫ్ట్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫొన్ చూసుకుంటున్న యువతి.. ఆ ధ్యాసలోనే కార్ లిఫ్ట్‌లోకి వెళ్లిపోయింది. లిఫ్ట్ డోర్లకు ఆటోమేటిక్ లాకింగ్ సిస్టం ఉండడంతో యువతి అక్కడే ఆగిపోయింది. ఇంతలో లిఫ్ట్ కిందకు దిగడం.. అదే సమయంలో.. వెంటనే ఎదురుగా కారు రావడం.. ఆమెను ఢీ కొట్టడం వేగంగా జరిగిపోయాయి. ప్రాణం పోయినంత పనైనా.. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. సీసీటీవీలో రికార్డయిన ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. -
లిఫ్ట్ ఇచ్చినా వద్దంటుందేం?
‘మసక్కలీ మసక్కలీ’ పాట వినే ఉంటారు. వినకపోతే యూట్యూబ్‌లో ఒకసారి వినేయండి. అనిల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్ ఉంటుంది ఆ పాటలో. అనిల్ కపూర్ గుర్తున్నాడుగా. ముప్పై ఏళ్ల నాటి ‘మిస్టర్ ఇండియా’ ఫేమ్. అలాంటి సూపర్ డూపర్, పవర్ఫుల్, డేరింగ్, డాషింగ్ డాడీకి ఇంత వణికింగ్ కూతురు పుట్టిందేం?! మేడమ్‌కి లిఫ్ట్ అంటే భయం. ‘పోకిరి’ సినిమాలో ఇలియానాకి లిఫ్ట్ అంటే ప్రేమ. ఎందుకంటే లవ్‌సీన్ అంతా అక్కడే స్టార్ట్ అయింది కాబట్టి. ఈవిడకి మహేశ్‌బాబులాంటి హీరోని ఇచ్చినా లిఫ్ట్‌లో మాత్రం షూటింగ్ వద్దని చెబుతోందట! ఓ పక్క వాళ్ల నాన్న మొత్తుకుంటూనే ఉన్నాడు. ‘‘ఇలాగైతే ఏం పైకొస్తావే! బాలీవుడ్లో మెట్లెక్కాలంటే తిరుమల మెట్ల కంటే టఫ్. నా మాట విని లిఫ్ట్ ఎక్కు. తొందరగా పైకి రా’’ అని ఎంత మొత్తుకున్నా లిఫ్ట్ ఎక్కే భయం దిగట్లేదట! -
అల్లుడా మజాకా...!
ఏదైనా పండగకి అల్లుడు ఇంటికొస్తున్నాడంటే చాలు.. మామగారి ఇంట్లో ఒకటే భయం.. ఎక్కడ అల్లుడికి మర్యాదల్లో లోటు వస్తుందో.. ఎప్పుడు అలిగి కూర్చుంటాడో అని ఎక్కడలేని రాచమర్యాదలు చేస్తుంటారు.. ఎన్ని మర్యాదలు చేసినా అప్పుడప్పుడు అల్లుడు అలకపాన్పు ఎక్కడం సహజమేననుకోండి.. మన దేశంలోనైనా.. విదేశాల్లోనైనా అల్లుడు ఎక్కడైనా అల్లుడే కదా.. అయితే సరిగ్గా ఇదే కోవకు చెందిన చైనాలోని ఓ మామ తన అల్లుడు ఆరంతస్తుల పైన ఉన్న ఇంటిలోకి ఎక్కలేకపోతున్నాడని ఏకంగా సొంత లిఫ్ట్‌నే ఏర్పాటు చేయించాడు.. చైనాలోని చోగింగ్లో ఒక అపార్ట్మెంట్ ఉంది. క్సాంగ్ అనే వ్యక్తి ఆ అపార్ట్మెంట్లోని ఆరో అంతస్తులో నివాసం ఉంటున్నాడు. తనకి ఏ అవసరం వచ్చినా మెట్లు దిగి కిందకు వచ్చి పనిచూసుకుని తిరిగి అదే మెట్లు ఎక్కి ఇంటికెళ్లేవాడు. అయితే గతేడాది తన ఏకైక ముద్దుల కూతురుకి ఘనంగా వివాహం చేశాడు. తన అల్లుడిని కూడా ఇల్లరికం తెచ్చుకున్నాడు. ఇక అప్పటి నుంచి సదరు మామకి అల్లుడి పోరు ప్రారంభమైంది.. తాను రోజూ ఆ మెట్లు ఎక్కిదిగలేకపోతున్నాను మొర్రో అంటున్నాడు మామ మీద కస్సుబుస్సులాడుతున్నాడు.. అల్లుడి కోపాన్ని తట్టుకోలేక క్సాంగ్ ఏదోఒకటి చేయాలని నిర్ణయించుకున్నాడు. అల్లుడిని ఇంట్లో నుంచి పంపించేస్తే తన కూతురు ఇబ్బందులు పడుతుందని ఆ ధైర్యం చేయలేకపోయాడు. దీంతో అల్లుడి కోసం అపార్ట్మెంట్కి పక్కన సొంతంగా లిఫ్ట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించాడు. గతేడాది నిర్మాణాన్ని ప్రారంభించి ఇటీవలే దాన్ని విజయవంతంగా పూర్తిచేశాడు కూడా.. ప్రస్తుతం ఈ లిఫ్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఇది కాస్తా ప్లానింగ్ అధికారుల చెవిన పడింది. ఎప్పుడో దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ అపార్ట్మెంట్కి నిబంధనల ప్రకారం లిఫ్ట్ అవసరం లేదు. ఒకవేళ అపార్ట్మెంట్ వాసులకు అవసరం అనిపిస్తే స్థానిక అధికారుల నుంచి అనుమతితో సొంత ఖర్చులతో లిఫ్ట్ ఏర్పాటు చేసుకోవచ్చు. దీంతో వీటన్నింటినీ లెక్కచేయకుండా అల్లుడి కోపాన్ని తగ్గించేందుకు క్సాంగ్ ఎలాంటి అనుమతులు తీసుకోకుండా లిఫ్ట్ నిర్మాణాన్ని పూర్తిచేశాడు. దీనిపై అక్కడి అధికారులు సైతం గుర్రుగా ఉన్నారు. -
ఇద్దరి ప్రాణాలు తీసిన లిఫ్ట్‌లు
రాజమహేంద్రవరం క్రైం/చీరాల రూరల్: మంగళవారం వేర్వేరు ఘటనల్లో లిఫ్ట్‌లు ఇద్దరి ప్రాణాలు తీశాయి. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జరిగిన ఘటనలో.. లక్ష్మీవారపు పేట చక్రవర్తి అపార్ట్మెంట్లోని లిఫ్ట్ కొంతకాలం క్రితం మరమ్మతుకు గురైంది. ఇది తెలియని పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం, కాల్ధారికి చెందిన యర్రంశెట్టి గంగరాజు (60) లిఫ్ట్ కదులుతుండగానే గేట్లు తెరుచుకోవడంతో లిఫ్ట్ ఆగి ఉందని లిఫ్ట్‌లోకి వెళ్లాడు. అక్కడ ఖాళీ ప్రదేశం ఉందన్న విషయం తెలియక కాలు పెట్టడంతో కింద పడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. లిఫ్ట్‌లో ఇరుక్కుపోయి పూజారి.. అలాగే ప్రకాశం జిల్లా చీరాలలో జరిగిన ఘటనలో.. అపార్టుమెంట్‌లోని లిఫ్ట్‌లో ప్రమాదవశాత్తు తల ఇరుక్కుపోవడంతో పూజారి మృతి చెందాడు. పాపరాజుతోట ప్రాంతంలో వేమూరి లక్ష్మీనారాయణ (55), భారతి దంపతులు ఉంటున్నారు. లక్ష్మీనారాయణ.. మేనల్లుడి పెళ్లికార్డులు బంధువులకు ఇచ్చేందుకు మంగళవారం తన మేనకోడలు లీలారాణితో కలసి ఆంధ్రాబ్యాంకు సమీపంలోని శ్రీరంగ సదన్ అపార్టుమెంట్‌కు వెళ్లాడు. ఇద్దరూ మూడో అంతస్తులోని బంధువు శ్రీనివాసరావును కలిసేందుకు లిఫ్ట్ ఎక్కారు. లిఫ్ట్ మొదటి గేటు మూసి రెండో గేటు మూసే క్రమంలో లీలారాణి లిఫ్ట్ బటన్ నొక్కింది. దీంతో లిఫ్ట్ పైకి వెళ్లడంతో లక్ష్మీనారాయణ తల లిఫ్ట్ గేటుకు గోడకు మధ్యలో ఇరుక్కుపోయింది. లిఫ్ట్ వేగానికి తల ఛిద్రమై తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. -
5వ అంతస్తునుంచి కూలిన లిఫ్ట్
లక్నో: ఉత్తర ప్రదేశ్ జిల్లా కోర్టులోని లిఫ్ట్ అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో 12మందికి గాయాలయ్యాయి. సోమవారం ఉదయం ఈ ప్రమాదం సంభవించింది. వజీర్‌గంజ్ జిల్లా కోర్టులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కోర్టు ఆవరణలోని లిఫ్ట్ సడెన్‌గా కూలిపోవడంతో భయాందోళణ వాతావరణం నెలకొంది. వైర్లు తెగిపడటంతో అయిదవ అంతస్తునుంచి లిఫ్ట్ కూలిపోయింది. ఈ ఘటనలో సుమారు 12మందిగాయపడ్డారు. వీరిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు అందాల్సిఉంది. -
15న ‘పురుషోత్తపట్నం’ నీరు విడుదల
కలెక్టర్ కార్తికేయ మిశ్రా సీతానగరం (రాజానగరం) : పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నీటిని ఈ నెల 15న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేస్తారని కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ను, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పనులు, గండికోట వద్ద నీటి డెలివరీ ఫాయింట్, పురుషోత్తపట్నం నుంచి సీతానగరం, నాగంపల్లి మీదుగా అచ్చయ్యపాలెం, గండికోట మార్గాలను ఆదివారం ఆయన పరిశీలించారు. ఏర్పాట్లు ముమ్మరంగా చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. పైలాన్ ఏర్పాటుపై అసహన వ్యక్తం పైలాన్ ఏర్పాటుపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. ఎత్తిపోతల పథకానికి కాస్త దూరంలో విద్యుత్ స్తంభాల వద్ద ఏర్పాటు చేసిన పైలాన్‌ను తక్షణమే తొలగించి, వేరే ప్రాంతంలో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రిమోట్ ద్వారా స్విచ్ ఆన్ చేసి మొదటి దశ నీరు విడుదల చేసేందుకు అవసరమైన అన్ని పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. వర్షం కురిసే అవకాశం ఉన్నందున టెంట్లు, షామియానాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీఎం సీతానగరం నుంచి పథకం వద్దకు కాన్వాయ్ ద్వారా చేరుకుని నీరు విడుదల చేస్తారని చెప్పారు. అనంతరం సీతానగరం చేరుకుని గండికోట వద్ద పోలవరం ఎడమ కాలువలో పథకం నీరు డెలివరీ పాయింట్‌ను పరిశీలిస్తారని తెలిపారు. అక్కడి నుంచి జగ్గంపేటలో నిర్వహించే సభకు వెళ్తారని చెప్పారు. కలెక్టర్ వెంట రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీ ఎస్.పి.బి.రాజకుమారి, సబ్ కలెక్టర్ వి.విజయరామరాజు, అసిస్టెంట్ కలెక్టర్ ఆనంద్, జలవనరుల శాఖ ఎస్ఈ ఎస్.సుగుణాకరరావు, ఈఈ శ్రీనివాసరెడ్డి, ఆర్అండ్బీ ఎస్ఈ సి.ఎస్.ఎన్.మూర్తి, విద్యుత్ శాఖ డీఈ రాజబాబు, ఏడీఈ కె.రత్నాలరావు, ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ టి.రమేష్ కిషోర్, అడిషనల్ ఎస్పీ ఆర్.గంగాధర్, డీఎస్పీలు జి.శ్రీనివాసరావు, కె.రామకృష్ణ, తహసీల్దార్ కె.చంద్రశేఖరరావు, టి.గోపాలకృష్ణ, కె.పోశయ్య, దేవి, ఎంపీడీఓ డి.శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. -
ఆ పొరపాటే ఎడమన కూడా
-మరో పట్టిసీమ కానున్న పురుషోత్తపట్నం ఎత్తిపోతలు – ఇంకా పనులు పూర్తికాకున్నా 15న నీరు తోడేందుకు సన్నాహాలు – కిలోమీటర్ మేర భూమిపైనే పైపులు – ప్రారంభ దశలోనే మురారి, మల్లేపల్లి బ్రిడ్జిలు – తాత్కాలిక ఏర్పాట్లకు అధికారుల యత్నాలు – నేడు ప్రాజెక్టు పనుల పరిశీలనకు సీఎం చంద్రబాబు సాక్షి, రాజమహేంద్రవరం / సీతానగరం : ‘పోలవరం ప్రాజెక్టు కుడి కాలువపై నిర్మించిన పట్టిసీమ ఎత్తిపోతల పథకంలాగే ఎడమ కాలువపై ఏర్పాటు చేస్తున్న పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం కూడా పూర్తి కాకముందే సీఎం చంద్రబాబు జాతికి అంకితం చేయనున్నారా? ఎక్కడికక్కడ తాత్కాలిక ఏర్పాట్లతో నీరు పారించాలని అధికారులు సన్నాహాలు చేస్తున్నారా?’ అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. పనులు పూర్తి చేయకుండానే ఈ నెల 15న అనుకున్న ప్రకారం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి కాకుండానే పట్టిసీమను ప్రారంభించి జాతికి అంకితం చేసినట్లుగా ఇప్పుడు పురుషోత్తపట్నం ప్రాజెక్టును కూడా ప్రారంభించనున్నారు. ప్రాజెక్టు పనులు ఈ నెల 15కి పూర్తి అయ్యే పరిస్థితి కనపడడంలేదు. అయితే అనుకున్న తేదీ ప్రకారం ఎలాగైనా ప్రారంభించేందుకు యంత్రాగం హడావుడిగా తాత్కాలిక ఏర్పాట్లు చేస్తోంది. హడావుడితో నాణ్యతకు తిలోదకాలు గోదావరి నుంచి పురుషోత్తపట్నం వద్ద పంప్‌హౌస్‌ల ద్వారా నీటిని తోడి 10.10 కిలోమీటర్ల దూరంలోని పోలవరం కాలువకు పంపించి అక్కడ నుంచి ఏలేరు ప్రాజెక్టుకు, ఆయకట్టును నీటిని అందించే లక్ష్యంతో రూ.1,638 కోట్లతో ఎత్తిపోతల పనులు ప్రారంభించారు. ఏలేరు జలాశయం నుంచి విశాఖకు గోదావరి నీటిని అందించేందుకు పురుషోత్తపట్నం స్టేజ్ -1, స్టేజ్ -2గా పనులు విభజించి చేపడుతున్నారు. స్టేజ్ -1లో పంప్‌హౌస్ వద్ద పది పంపులను ఏర్పాటు చేసి ఒకో పంప్ ద్వారా 350 క్యూసెక్కులు నీటిని తోడాలని ప్రతిపాదించారు. ఆ లెక్కన మొత్తం 3,500 క్యూసెక్కుల నీటిని తోడవచ్చు. స్టేజ్ -2లో రామవరంలో పోలవరం 50వ కిలోమీటరు వద్ద పంప్‌హౌస్ నిర్మించి 8 పంపుల ద్వారా 175 క్యూసెక్కుల చొప్పున మొత్తం 1,400 క్యూసెక్కుల నీటిని ఏలేరులోకి 13.12 కిలోమీటర్ల మేర రెండు లైన్లలో ఏర్పాటు చేసే పైపులైన్ల ద్వారా పంపింగ్ చేయాల్సి ఉంది. అలాగే 57.885 కిలో మీటరు కృష్ణవరం వద్ద క్రాస్ రెగ్యులేటరు నిర్మించి గ్రావిటీ ద్వారా నీటిని అందించేందుకు ప్రతిపాదించారు. ఆగస్టు 15కి నీటిని అందిస్తామని ప్రభుత్వం, ఇరిగేషన్ అధికారులు చెబుతుండగా పనులు మాత్రం పూర్తి కాలేదు. జగ్గంపేట మండలంలో ఒక వరస పైపులైన్ ద్వారా నీటిని పంపాలని చూస్తున్నారు. హడావుడి పనులతో నాణ్యతకు తిలోదకాలు ఇచ్చారు. పోలవరం కాలువ ద్వారా రామవరం వద్ద స్టేజ్ -2కు నీరు చేరేందుకు మురారి, మల్లేపల్లి వద్ద వంతెనలు పూర్తి కావాల్సి ఉంది. ఈ వంతెనల పనులు ప్రారంభ దశలో ఉన్నాయి. ఇవి పూర్తయితే కానీ నీరు పారేందుకు వీలులేదు. బ్రిడ్జి వద్ద తాత్కాలికంగా రోడ్డు కింద తూములు ఏర్పాటు చేసి నీరు పారించాలని అధికారులు భావిస్తున్నారు. తాత్కాలిక ఏర్పాట్లతో హడావుడిగా పనులు చేస్తే ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భూమిపైకి లేచిన పైపులు.. 10 పంపుల నుంచి ఐదు వరసలలోని తరలించేందుకు పైపులను అమర్చాల్సి ఉంది. మొదటి ఫేజ్‌లో రెండు వరసల మేర భూమిలో పైపులు వేశారు. అయితే గత నెల 18న ఈపథకంలో భాగంగా వేసిన 150 పైపులు భూమిలో నుంచి పైకి లేచాయి. దాదాపు కిలో మీటరు మేర లేచిన పైపుల్లో కొన్ని చోట్ల జాయింట్లు విడిపోయాయి. పైపులు వేయడానికి తీసిన గోతుల్లో ఈ మధ్య కురిసిన వర్షాలు, గోదావరిలో వరద వల్ల నీరు ఊరుతుండడంతో పైపులు పైకి ఉబికి వచ్చాయి. ఈ నెల 15 కల్లా నీరు తోడాలన్న ఉద్దేశంతో నాణ్యతా ప్రమాణాలు పట్టించుకోకుండా పైపులు అమర్చారు. పైపులు అమర్చే ముందు కాలువలో ఇసుక వేయలేదు. ఫలితంగా రామవరపు ఆవ వద్ద భూమిలో నీరు ఊరడంతో భూమిలోని పైపులు పైకి లేచాయి. ప్రారంభానికి తాత్కాలిక ఏర్పాట్లు... కాలువలో ఇసుక నింపి పైప్‌లైన్ వేయాల్సి ఉండగా, 15 కల్లా నీటిని విడుదల చేయాలనే ఉద్దేశంతో పనులలో తీసుకోవలసిన నాణ్యతా చర్యలను మమ అనిపించి, పైప్‌లైన్ వేశారని పలువురు ఆరోపించారు. పైకి లేచిన పైపులను యంత్రాల ద్వారా తీవ్ర ఒత్తిడితో కిందకు నొక్కినా ప్రయోజనం లేకపోయింది. ఒక వరస మేర కిలోమీటరు పొడవున పైప్‌లైన్ భూమి పైనే ఉంచి, ప్రారంభోత్సవానికి అడ్డంకి లేకుండా చేయడానికి ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. సీఎం చంద్రబాబు ప్రాజెక్టును ప్రారంభించిన తర్వాత రెండు మోటార్లను ఆఫ్ చేసి పైప్‌లైన్‌ను సరిచేయవచ్చని అధికారులు భావిస్తున్నారు. -
లిఫ్ట్ లో ఇరుక్కుని బాలిక మృతి
విశాఖపట్నం: విశాఖ నగరంలోని మధురవాడలో ఆదివారం ఉదయం దారుణం చోటుచేసుకుంది. తారకరామారావునగర్ లో కోటాస్ రెసిడెన్సీ అపార్ట్ మెంట్ లిఫ్ట్ లో చిక్కుకుని పిట్ట స్వాతి (9) అనే బాలిక మృతిచెందింది. సాంకేతిక లోపం తలెత్తినందు వల్లే బాలిక లిఫ్టులో ఇరుక్కుని మృతిచెందిందని అపార్ట్ మెంట్ వాసులు చెబుతున్నారు. వాచ్మెన్ కూతురైన స్వాతి లిఫ్టులో వెళుతుండగా లిఫ్టు ఒక్కసారిగా కిందికి పడిపోయింది. దాంతో బాలిక మృతిచెందినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
లిఫ్ట్‌లో ఇరుక్కొని పదేళ్ల చిన్నారి మృతి
-
పురుషోత్తపట్నం ‘ఎత్తిపోతలు’ అడ్డగింపు
–2013 భూసేకరణ చట్ట ప్రకారం పరిహారం ఇచ్చిన తర్వాతే పనులన్న రైతులు సీతానగరం (రాజానగరం) : మండలంలోని రామచంద్రపురం వద్ద పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పనులను రైతులు అడ్డుకున్నారు. హైకోర్టు సూచించిన ప్రకారం భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇచ్చాకే పనులు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. మంగళవారం ఉదయం 9 గంటలకు రామచంద్రపురం వద్ద గల తొర్రిగడ్డ పంపింగ్ స్కీమ్ ఎడమ కాలువ వద్ద ఎత్తిపోతల పథకం పనులు చేయడానికి పొక్లెయిన్ తరలివచ్చింది. కాలువ వద్ద పనులు చేయడానికి సిద్ధపడగా సమాచారం అందుకున్న రైతులు హుటాహుటిన తరలివెళ్లి పనులను అడ్డుకున్నారు. తొర్రిగడ్డ ఎడమ కాలువలో రామచంద్రపురం దూళ్ళపాటి డ్యామ్ వద్ద ఎత్తిపోతల పథకం పైప్‌లైన్ వేయడానికి పొక్లెయిన్‌తో తవ్వకాలు ప్రారంభించారు. రామచంద్రపురానికి చెందిన రైతులు కలగల బాలకృష్ణ, చల్లమళ్ల గాంధీ, కోడేబత్తుల దొరాజీ, చల్లమళ్ల ధర్మరాజు, చల్లమళ్ల విజయ్‌కుమార్ చౌదరి, కోడేబత్తుల శ్రీనివాసరావు, కోడేబత్తుల పెంటయ్య, ప్రసాద్‌తోపాటుగా అధిక సంఖ్యలో రైతులు తరలివెళ్ళి పనులను అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న మెగా ఇంజనీరింగ్ కంపెనీ అధికారులు ఘటనా స్థలికి తరలివచ్చారు. పొక్లెయిన్‌తో ప్రభుత్వ భూములలో పనులు చేస్తున్నామని, కాలువ వద్ద పైప్‌లైన్‌కు చెందిన పైప్‌లు ఏర్పాటు చేస్తే, ఖరీఫ్‌కు సాగునీటికి అంతరాయం కలగదని తెలిపారు. దీంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రామచంద్రపురం వద్ద పనులు చేయడానికి మేము ఎంతమాత్రం సుముఖంగా లేమని, హైకోర్టు తీర్పుననుసరించి 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారంతోపాటుగా వివిధ ప్రయోజనాలు కల్పించాకే ఇక్కడ పనులు చేయడానికి అంగీకరిస్తామని తెలిపారు. దీనితో పొక్లెయిన్ తీసుకుని అక్కడ నుంచి అధికారులు నిష్క్రమించారు. -
‘ఎత్తిపోతల’ పేరుతో దోపిడీ
- వైఎస్సార్ సీపీ యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా - కోర్టును ఆశ్రయించి, న్యాయం పొందిన రైతులు అభినందనీయులు - ప్రభుత్వం కళ్ళు తెరవాలని హితవు సీతానగరం (రాజానగరం) : ఎత్తిపోతల పథకాల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఆరోపించారు. సీతానగరం మండలం ఇనుగంటివారిపేటలో శుక్రవారం పర్యటించిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం పేరుతో ప్రభుత్వ పెద్దలు అందినకాడికి వేలాది కోట్లు దోచుకున్నారన్నారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పేరుతో తిరిగి దోపిడీకి పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. ఒకవైపు పోలవరం ప్రాజెక్ట్ పూర్తవుతుందంటూనే మరోపక్క ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేస్తున్నారని, సీఎం జేబులు నింపుకోవడానికే ఈ పథకాలని ఆరోపించారు. పోలవరం పూర్తయితే ఎత్తిపోతల పథకాలు దేనికని ప్రశ్నించారు. ఎత్తిపోతల పథకం పైపులైన్ మార్గంలో భూములు కోల్పొయే రైతులను అధికారులు, ప్రజాప్రతినిధులు భయాందోళనలకు గురి చేసి సంతకాలు చేయించారని విమర్శించారు. కొంతమంది రైతులు హైకోర్టును ఆశ్రయించి, న్యాయం పొందారన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూములు తీసుకోవాలని హైకోర్టు తీర్పు ఇచ్చిందని, తద్వారా రైతులు విజయం సాధించారని కొనియాడారు. ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడాల్సిన ప్రభుత్వం ప్రజలకు, రైతులకు వ్యతిరేకంగా పని చేస్తోందని, అధికార పార్టీ నేతలు ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని 2013 భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు పరిహారం అందించాలని, ఆ చట్టం ప్రకారం వర్తించాల్సిన అంశాలను అమలు చేయాలని రాజా కోరారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ పెదపాటి డాక్టర్‌బాబు, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి వలవల రాజా, చళ్ళమళ్ళ సుజీరాజు, జిల్లా కార్యదర్శి వలవల వెంకట్రాజు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు అంబటి రాజు తదతరులు పాల్గొన్నారు. -
రిజిస్ట్రేషన్ల నిలిపివేతను ఎత్తివేయాలి
–వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు విజయలక్ష్మి డిమాండ్ –రేపటి నుంచి పార్టీలకు అతీతంగా రిలే దీక్షలు -స్పందించకుంటే 8 నుంచి ఆమరణ దీక్ష కోరుకొండ (రాజానగరం) : మండల కేంద్రమైన కోరుకొండలో రైతులు, ప్రజల భూముల రిజిస్ట్రేషన్ నిలిపివేసి, ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ అన్నవరం దేవస్థానం ఈఓ కాకర్ల నాగేశ్వరరావుపై వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవాలయానికి వచ్చిన ఈఓ వద్దకు రైతులు, ప్రజలతో పాటు విజయలక్ష్మి వెళ్ళారు. గ్రామంలో గత కొన్నేళ్ళుగా అనుభవిస్తున్న పొలాలు, ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ కాకుండా చేయడంతో రైతులు, ప్రజలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికి సుమారు 11 వందల ఎకరాలకు పైగా రిజిస్ట్రేషన్లు కాకుండా నిలిపివేయడంతో అనేక మంది మంచాన పడ్డారని, వారి ఉసురు అన్నవరం దేవస్థానానికి, స్థానిక నియోజకవర్గ ప్రజాప్రతినిధికి, రాష్ట్ర ప్రభుత్వానికి తప్పక తగులుతుందని అన్నారు. బాధిత రైతులు, ప్రజల తరఫున ఈ నెల 3 నుంచి రిలే నిరాహార దీక్షను పార్టీలకు అతీతంగా చేపడతామని, అధికారులు స్పందించకపోతే మార్చి 8న ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. దీంతో ఈఓ మాట్లాడుతూ 11 వందల ఎకరాలలో 350 ఎకరాలకు రికార్డులు దొరికాయని, వాటికి రిజిస్ట్రేషన్లు జరిపేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీనికి అభ్యంతరం తెలిపిన విజయలక్ష్మి 11 వందల ఎకరాలకూ రిజిస్ట్రేషన్లు చేయడానికి అనుమతి వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ రైతులు, ప్రజలకు అండగా నిలుస్తుందన్నారు. ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ రైతులు, ప్రజల బాధలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు, రైతులు అయిల శ్రీను, తోరాటి శ్రీను, తాడి హరిశ్చంద్రప్రసాద్‌రెడ్డి, బొరుసు బద్రి, గరగ మధు, సలాది వెంకటేశ్వరరావు, వాకా నరసింహరావు, నీరుకొండ యుధిష్టర నాగేశ్వరరావు, మారిశెట్టి తేజోవీరన్ననాయుడు, ముద్దా అణు, వుల్లి గణనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
సంతకాలు సగమే
పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి ఆది నుంచీ అవాంతరాలు సంతకాలకు దూరంగా çసగం మంది సీతానగరం: పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నిర్మాణానికి ఆది నుంచీ అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. అంతా సాఫీగా సాగిపోతోందని ... రైతులంతా పూర్తి అంగీకారంగా ఉన్నారని ‘దేశం’ నేతలు ... అధికారులు ఓ వైపు చెబుతున్నా ఇంకోవైపు సగం మంది రైతుల నుంచి కూడా అంగీకార పత్రాలు చేతికి రాకపోవడంతో ప్రభుత్వ వర్గాల్లో ఆందోళన నెలకొంది. పలు పథకాల్లో తమ భూములను కోల్పోయామని, ఉన్న కొద్దిపాటి భూములు ఇచ్చేది లేదని ఎదురుతిరిగి పైప్‌లై¯ŒS మార్గంలో భూసేకరణ నిమిత్తం చేపట్టిన సర్వేలను అడ్డుకున్నారు. రాజకీయ ఒత్తిడితో, అధికారుల బెదిరింపులతో సగం మంది రైతులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. పథకంలో పురుషోత్తపట్నం, రామచంద్రపురం, వంగలపూడి, చినకొండేపూడి, నాగంపల్లి రైతులున్నారు. మొత్తం రైతులు 321 మంది ఉండగా, 203.62 ఎకరాలు భూసేకరణలో ఉంది. ఇప్పటికి 206 మంది రైతులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. తొలుత భూ సర్వేను రైతులు అడ్డుకుని నిలిపివేయడంతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించి రైతులతో సంప్రదించగా భూసర్వే సక్రమంగా జరిగింది. పరిహారం విషయంలో పలు సమావేశాలు, చర్చలు అనంతరం రూ.28 లక్షలు అందిస్తామని, నాగంపల్లి రెవెన్యూలో రూ.24 లక్షలు అందించడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు రైతులను ఒప్పించారు. దీంతో 206 మంది రైతులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. మిగిలిన 115 మంది రైతులు సంతకాలు చేయలేదు. వీరికి అధికారులు, ప్రజాప్రతినిధులు బుజ్జగింపు చర్యలు చేపట్టారని సమాచారం. రూ.28 లక్షలు నష్టదాయకమే... ప్రభుత్వం రైతులపై ఒత్తిడి తెచ్చి పరిహారం పెంచామని చెప్పి రూ.28 లక్షలు అందించడం కూడా కొంతమంది రైతులకు రుచించడం లేదు. మార్కెట్ ధర కూడా ప్రభుత్వం అందించడం లేదని, ఎకరానికి రూ.50 లక్షలు అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సగానికి పైగా ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసిన రైతులకు పరిహారం మార్చి నెలాఖరుకు అందించే అవకాశం ఉంది. భూ సేకరణ చట్టం ప్రకారం రూ.28 లక్షలు వస్తుందని, అదనంగా ఫల వృక్షాలకు, బోరులకు ధర చెల్లించాల్సి ఉంటుందని, రైతులకు పెంచి ఇచ్చింది ఏమీ లేదని రైతులు అభిప్రాయపడుతున్నారు. కోర్టును ఆశ్రయించే దిశగా అడుగులు.. ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయని రైతులు త్వరలో కోర్టును ఆశ్రయించేందుకు కసరత్తు చేస్తున్నారు. తెలంగాణలో రెండు ప్రముఖ ప్రాజెక్టులకు స్టే తీసుకువచ్చిన తెలంగాణా న్యాయవాదులను రైతులు సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది. -
కేసీ కాల్వకు నీటి విడుదల నిలిపివేత
పగిడ్యాల: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి కర్నూలు–కడప కాల్వకు నీటిసరఫరా నిలపివేసినట్లు ఎత్తిపోతల పథకం ఈఈ రెడ్డిశంకర్ తెలిపారు. మళ్లీ కలెక్టర్ నుంచి ఆదేశాలు వచ్చే వరకు ఈ నిలిపివేత కొనసాగుతుందని శుక్రవారం ఆయన విలేకరులకు వెల్లడించారు. -
కాలువ పనులు వేగవంతం చేయండి
జిల్లా కలెక్టర్ విజయమోహన్ కర్నూలు(అగ్రికల్చర్): సిద్ధాపురం ఎత్తిపోతల పథకం కాలువల తవ్వకం పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అధికారులను ఆదేశించారు. ఇంతవరకు పనులు జరుగకపోవడదానికి కారణాలు తెలుసుకొని పరిష్కరించేందుకు రెవెన్యూ సిబ్బందితో 9 బృందాలు ఏర్పాటు చేశారు. బుధవారం కలెక్టర్ తన సమావేశ మందిరంలో నీటిపారుదల అధికారులు, భూసేకరణ అధికారులతో కాలువ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ప్రతి గ్రామంలో మిషన్లు ఏర్పాటు చేసి కాలువ తవ్వకం చేపట్టాలని తెలుగుగంగ ప్రాజెక్టు ఎస్ఈ రాఘవరెడ్డిని ఆదేశించారు. సిద్దేపల్లి, కరివెన, కృష్ణాపురం, తదితర గ్రామాలకు ఒక జూనియర్ ఇంజనీర్‌ను నియమించి నిరంతరం పర్యవేక్షించాలన్నారు. గ్రామం వారిగా ఎన్ని క్యూబిక్ మీటర్లు తవ్వారు, ఇంకా ఎంత తవ్వాలనే దానిని పరిశీలించాలన్నారు. పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోయినా, ఽనిర్లక్ష్యం వహించినా షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఎస్ఈని ఆదేశించారు. రైతులందరికీ పరిహారం అందిందని, ఏ ఒక్కరూ పనులకు అడ్డు పడకుండా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కర్నూలు ఆర్డీఓ హుసేన్‌సాహెబ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సత్యం, తహసీల్దార్లు పాల్గొన్నారు. -
ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పరిశీలన
ముచ్చుమర్రి(పగిడ్యాల): మండల పరిధిలోని పాతముచ్చుమర్రిలో చేపట్టిన ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ను కృష్ణానది జలాల బోర్డు చీఫ్ ఇంజినీర్ విజయ్‌కుమార్ నాగ్పురే శనివారం పరిశీలించారు. నాలుగు రోజుల క్రితం కృష్ణాబోర్డు కమిటీ బృందం సందర్శించి టెలిమెట్రీ డిశ్చార్జ్ మీటర్ల ఏర్పాటుపై జలవనరులశాఖ, కేసీ కాలువ నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్షలు జరిపారు. అయితే ఆ రోజు చీకటిపడటంతో టెలిమెట్రీ మీటర్ల ఏర్పాటుపై అవగాహనకు రాలేని బోర్డు చీఫ్ ఇంజినీర్ రెండో విడతగా శనివారం ప్రాజెక్ట్‌ను సందర్శించి క్రాస్ రెగ్యూలేటర్ వద్ద ఉండే డిశ్చార్జ్ పాయింట్‌ను, వాల్వ్ ప్రదేశాలను పరిశీలించారు. కార్యక్రమంలో కృష్ణాబోర్డు సభ్యుడు చీఫ్ ఇంజినీర్ ఏ. బాలన్, డిప్యూటీ డైరక్టర్ ఆనంద్‌కుమార్, జలవనరుల శాఖ డీఈ ఆదిశేషారెడ్డి తదితరులు ఉన్నారు. -
‘ముచ్చుమర్రి’ పరిశీలన
పగిడ్యాల (నందికొట్కూరు): ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి వినియోగించే నీటిని లెక్కించేందుకు టెలిమెట్రి డిశ్చార్జ్ మీటర్లను అమర్చుతున్నట్లు కృష్ణా వాటర్ బోర్డు చీఫ్ ఇంజినీర్ విజయ్‌కుమార్ నాగపురి పేర్కొన్నారు. బుధవారం ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించారు. పంప్‌ల సామర్థ్యాలను జలవనరుల శాఖ ఎస్ఈ నారాయణస్వామి, ఈఈ రెడ్డిశేఖర్‌రెడ్డిలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో బోర్డు కమిటీ మెంబర్ అండ్ చీఫ్ ఇంజనీర్ ఏ. బాలన్, డిప్యూటీ డైరెక్టర్ ఆనంద్‌కుమార్, కేసీ కాలువ నీటిపారుదల శాఖ ఈఈ మల్లికార్జున, డీఈలు బాలాజీ, ఆదిశేషారెడ్డి పాల్గొన్నారు. -
పరిహారమిచ్చి పనులు చేయండి
- సిద్దాపురం ఎత్తిపోతల పథకం పనులను అడ్డుకున్న బాధితుడు – ఎస్డీసీ, తహసీల్దార్ చొరవతో సమస్య పరిష్కారం బాపనంతాపురం(ఆత్మకూరురూరల్): పరిహారం ఇచేంత వరకు పనులు జరగనిచ్చేది లేదని సిద్దాపురం ఎత్తిపోతల పథకంలో భూమి కోల్పోయిన రైతులు అధికారులకు తెగేసి చెప్పారు. మండల పరిధిలోని బాపనంతాపురం వద్ద బుధవారం రైతులు తమ పొలాల్లో పంట కాల్వలు తీయడానికి వచ్చిన జేసీబీలను అడ్డుకున్నారు. గ్రామానికి చెందిన శివప్రసాద్, ప్రమీలమ్మలకు చెందిన భూమిలో పంటకాల్వ తవ్వాల్సి ఉంది. వీరి భూమిని ప్రభుత్వం సేకరించింది. శివప్రసాద్‌కు చెందిన 1.58 ఎకరాల సేకరణ భూమిలో 58 సెంట్లకు రావాల్సిన పరిహారాన్ని(దాదాపు రూ 3.5 లక్షలు)అదే సర్వే నంబర్లో ఉన్న మరో రైతు శివయ్య బ్యాంకు ఖాతాలో వేశారు. జరిగిన పొరపాటును వివరిస్తూ తగు ఆధారాలతో రెండేళ్లుగా శివప్రసాద్ నంద్యాలలో ఉన్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. అయినప్పటికీ అతనికి జరిగిన లోటును అధికారులు సరిదిద్దలేదు. దీంతో తమ పొలంలో కాల్వలు తీయడానికి వచ్చిన జేసీబీని అడ్డుకున్నాడు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి బాధితుడితో ఫోన్లో మాట్లాడి పరిహారం సొమ్ము ముట్టేవరకు పొలంలో పనులు చేయనీయవద్దని తాను కలెక్టర్‌తో మాట్లాడతానని హామీ ఇచ్చారు. అయితే రెవెన్యూ అధికారులు పనులకు అడ్డు తగిలితే íపరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించినట్లు బాధిత రైతు తెలిపాడు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సత్యం, ఆత్మకూరు తహసీల్దార్ రాజశేఖరబాబు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని రైతులను సమావేశ పరచి శివప్రసాద్. సరోజమ్మలకు రావాల్సిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నారు. శివయ్యకు రావాల్సిన మరో చెక్‌ను బాధితులకు బదలాయించేందుకు అంగీకరించారు. మిగిలిన సొమ్మును నెలలోపు బాధిత రైతులకు ఇచ్చేలా శివయ్యతో అంగీకార పత్రం రాయించి ఇచ్చారు. -
ముచ్చుమర్రి ఘనత వైఎస్ఆర్దే
- ఈ విషయం చెబితే బాబు జీర్ణించుకోలేకపోతున్నారు - ప్రతి పక్ష పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడకుండా అడ్డుకుంటున్నారు – జిల్లాపై ప్రేమ ఉంటే ‘గుండ్రేవుల’తో పాటు పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలి – జేసీకి ప్రతిపక్ష నేతను గౌరవించే సంస్కారం తెలియదు – విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్సీపీ నేతలు ధ్వజం కర్నూలు(ఓల్డ్‌సిటీ): రాయలసీమను సస్యశ్యామలం చేయాలని ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టి నిర్మించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిదేనని వైఎస్ఆర్సీపీ నేతలు అన్నారు. ఈ విషయం మరచి టీడీపీ ప్రభుత్వం ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం తమ గొప్పతనంగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఎంత మభ్య పెట్టినా జిల్లా ప్రజలు నమ్మరని చెప్పారు. జిల్లాపై ప్రేమ ఉంటే ‘గుండ్రేవుల’తో పాటు పెండింగ్‌లో ఉన్న తొమ్మిది ఎత్తిపోతల పథకాలను పూర్తి చేయాలని అధికారపార్టీకి డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేతను గౌరవించే కనీస సంస్కారం ఆ పార్టీ నేతలకు లేదని మండిపడ్డారు. మంగళవారం స్థానిక కృష్ణకాంత్ ప్లాజాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో పాణ్యం, నందికొట్కూరు ఎమ్మెల్యేలులు గౌరుచరితారెడ్డి, ఐజయ్య, పార్టీ రాష్ట్ర ప్రధానా కార్యదర్శి బీవై రామయ్య విలేకరులతో మాట్లాడారు. మాట్లాడే హక్కును కాలరాస్తున్నారు ప్రతిపక్షపార్టీ ప్రతినిధుల మాట్లాడే హక్కును చంద్రబాబు కాలరాస్తునా్నరని పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి చెప్పారు. తడకనపల్లిలో నిర్వహించిన జన్మభూమి–మాఊరు కార్యక్రమంలో ఫలన విషయాలే మాట్లాడాలని తనను కట్టడి చేశారన్నారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ప్రారంభ సభలో నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య మైక్ కట్ చేయడం విచారకరమని, ఇది దళితులను అవమానించడమే అవుతుందన్నారు. స్థానిక ఎమ్మెల్యేకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వనప్పుడు జిల్లాకు సంబంధం లేని జేసీ దివాకర్‌రెడ్డితో ఎలా మాట్లాడిస్తారని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డిని వాడు–వీడని జేసీ సంభోదించడం తగదన్నారు. జిల్లాలో 14 సీట్లు గెలవాలనే ఉద్దేశంతోనే అభివృద్ధి పనులు చేపడుతున్నామని ముఖ్యమంత్రి చెప్పడం వెనుక దాగి ఉన్న ఆయన స్వార్థాన్ని తెలియజేస్తుందన్నారు. ముచ్చుమర్రి పథకంతో 300 రోజులు నీళ్లొస్తాయని జిల్లా కలెక్టర్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. జిల్లాలో సాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి గుండ్రేవుల రిజర్వాయర్‌ను పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. నిజాలు బయట పడతాయని: ఐజయ్య, నందికొట్కూరు శాసన సభ్యుడు ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకానికి పునాది వేసిన వైఎస్ఆర్ పేరున ఉచ్ఛరిస్తే సీఎం జీర్ణించుకోలేకపోయారని, అందుకే తనను మాట్లాడకుండా అడ్డుకున్నారని నందికొట్కూరు ఎమె్మల్యే ఐజయ్య అన్నారు. రాయలసీమలో వ్యవసాయ అభివృద్ధి కోసం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నిపుణులతో చర్చించి ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని రూపొందించారన్నారు. నాలుగు పంపులతో పనిచేయాల్సిన ఈ పథకాన్ని రెండు పంపులతోనే ప్రారంభించడం చంద్రబాబు తొందరపాటు చర్య అని అభివరి్ణంచారు. జిల్లాపై ప్రేమ ఉంటే లింగాల, ఇస్కాల వంటి తొమ్మిది ఎత్తిపోతల పథకాలను పూరి్త చేయాలని కోరారు. ఆరుసార్లు ఎమ్మెల్యే అయిన జేసీకి ఆ మాత్రం తెలియదా.. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేకు అవకాశం ఇవ్వకుండా అనంతపురం ఎమ్మెల్యే దివాకర్‌రెడ్డికి మాట్లాడే అవకాశం ఇవ్వడం న్యాయమా అని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. ఆరుసార్లు, ఎమ్మెల్యే ఒకసారి మంత్రి అయిన దివాకర్‌రెడ్డి సంస్కారం మరచి ప్రతిపక్ష నేతను వాడువీడు అని సంభోదించడం తగదన్నారు. తక్షణమే తమ పార్టీ అధినేతకు క్షమాపణ చెపా్పలని డిమాండ్ చేశారు. అలాగే నోటిదురుసును కూడా తగ్గించుకోవాలని జేసీకి హితవు పలికారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, రైతు విభాగం, లీగల్‌సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు వంగాల భరత్‌కుమార్‌రెడ్డి, కర్నాటి పుల్లారెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు పి.రాజావిష్ణువర్దన్‌రెడ్డి, నగర అధ్యక్షుడు పి.జి.నరసింహులు యాదవ్, మైనారిటీ, ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శులు ఎస్.ఎ.రహ్మాన్, సి.హెచ్.మద్దయ్య, మహిళా విభాగం అధ్యక్ష కార్యదర్శులు శౌరి విజయకుమారి, సలోమి, పార్టీ నాయకులు చంద్రమౌళి, రవికుమార్, రాజశేఖర్ పాల్గొన్నారు.