లిఫ్టులో చిక్కుకుని, స్టూలు ఎక్కి.. | Home Minister Rajnath Singh Stuck in Lift, Escapes From Roof | Sakshi
Sakshi News home page

లిఫ్టులో చిక్కుకుని, స్టూలు ఎక్కి..

Published Fri, Apr 10 2015 2:20 AM | Last Updated on Sun, Sep 3 2017 12:05 AM

లిఫ్టులో చిక్కుకుని, స్టూలు ఎక్కి..

లిఫ్టులో చిక్కుకుని, స్టూలు ఎక్కి..

న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఓ లిఫ్టులో ఇరుక్కుపోయారు. తర్వాత ఓ స్టూలు ఎక్కి , పైకప్పు గుండా బయటపడ్డారు. రాజ్‌నాథ్ గురువారం ‘శౌర్య దివస్’లో పాల్గొనేందుకు ఢిల్లీలోని సీఆర్‌పీఎఫ్ భవన సముదాయానికి వచ్చారు. గ్రౌండ్‌ఫ్లోర్ నుంచి తొలి అంతస్తులోని ఆడిటోరియానికి లిఫ్టులో వెళ్తూ అందులో చిక్కుకుపోయారు.

తనతోపాటు లిఫ్టులో చిక్కున్న తన ఓఎస్‌డీ బీకే సింగ్, హోం శాఖ సహాయ మంత్రి హరిభాయ్ చౌదురి, సీఆర్‌పీఎఫ్ చీఫ్ ప్రకాశ్ మిశ్రాలను ఖాళీ చేయించడానికి తానే చొరవ తీసుకున్నానని ఆయన తర్వాత జరిగిన కార్యక్రమంలో చెప్పారు. ‘బయటికి రావడానికి స్టూలు ఎక్కాల్సి వచ్చింది. తొలుత సీఆర్‌పీఎఫ్ డీజీ, తర్వాత చౌదరి బయటికి రావాలని, అందరినీ ఖాళీ చేయించాకే నేను రావాలని నిర్ణయించాను. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. ప్రతి ఒక్కరూ ఇతరుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పని చేయాలని, మంచి ఆలోచనలతో పని చేయాలని’ అని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement