‘పిల్లలు స్కూల్‌ను నడుచుకుంటూ వెళ్లి... పరిగెత్తుకుంటూ ఇంటికొస్తారు’ అని ΄త రోజుల్లో అనుకునేవారు. ఇప్పుడు చాలామంది పిల్లలు నడవడం లేరు. బస్, ఆటో, వ్యాన్ వస్తుంది. లేదా నాన్నో, అమ్మో, ఇంటి కారో దింపుతుంది. మళ్లీ పికప్ చేసుకుంటుంది. అయితే ఇలా కాకుండా చాలామంది పిల్లలు తమ సొంతగా స్కూలుకు వెళ్లాల్సి ఉంటుంది. వీళ్లు సైకిల్ తొక్కుకుంటూ వస్తారు. లేదా షేర్ ఆటో ఎక్కి వస్తారు. లేదా ఆర్టీసి బస్ ఎక్కి వస్తారు. నడవడం ఇష్టం ఉన్నవాళ్లు నడుస్తారు.
కాని కొందరు మాత్రం ‘అంకుల్... లిఫ్ట్’ అని రోడ్డు మీద నిలబడి టూవీలర్ ఎక్కి దిగుతారు. ఉదయం స్కూలు మొదలయ్యే టైమ్‌లో, సాయంత్రం స్కూల్ విడిచే టైములో అమ్మాయిలు, అబ్బాయిలు ‘లిఫ్ట్’ అడగడం చాలాఊళ్లలో కనపడుతుంది. పల్లెటూళ్లలో, సిటీల్లో కూడా ఇలాంటి పిల్లలు ఉంటారు. వీరిని చూసిన వాహనదారులు ‘΄ాపం చిన్నపిల్లలు కదా’ అని లిఫ్ట్ ఇస్తారు. ఈ లిఫ్ట్ ఇచ్చేవాళ్లు మంచివాళ్లైతే సరే. చెడ్డ వాళ్లయితేనో? అందుకే పోలీసులు స్కూలు పిల్లలను లిఫ్ట్ అడిగి రాక΄ోకలు చేయవద్దని గట్టిగా హెచ్చరిస్తున్నారు. అందుకే ఇక్కడున్న విషయం మీరు చదివి, మీ అమ్మానాన్నలకు, స్కూల్ టీచర్లకు కూడా చూపించండి.
రోడ్డు మీద అపరిచితులను లిఫ్ట్ అడగకూడదు. ఎందుకంటే వాళ్లు హెల్మెట్‌లో ఉంటారు. వెనుక కూచున్న మీకు ఇవ్వడానికి వాళ్ల దగ్గర హెల్మెట్ ఉండదు. వాళ్లు పొరపాటున యాక్సిడెంట్ చేస్తే వాళ్లకు ఏమీ కాక΄ోయినా మీకు దెబ్బలు తగులుతాయి.
లిఫ్ట్ అడిగితే వచ్చే ప్రమాదాలు:
లిఫ్ట్ ఇచ్చే వాళ్లకు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ప్రమాదం. వాహనానికి ఇన్సూరెన్స్ లేకపోతే ప్రమాదం. వారు మద్యం సేవించి ఉంటే బండిని పడేసే చాన్సులే ఎక్కువ.
లిఫ్ట్ ఇచ్చే వాళ్లు నేరస్తులైతే? మీకై మీరు ఎక్కిన బండిని వారు వేగంగా నడుపుతూ మిమ్మల్ని కిడ్నాప్ చేస్తే? ఆ ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. అప్పుడు బండి మీద నుంచి ఎలా దిగి బయటకు పడాలో మీకు తెలియదు. భయంలో బుర్ర పని చేయదు.
లిఫ్ట్ ఇచ్చేవాళ్లు ‘బ్యాడ్ టచ్’ చేసే వారైతే. మీరు భయంతో వాళ్ల బ్యాడ్ టచ్‌ను స్టాప్ చేయక΄ోతే మరుసటి రోజు అదే సమయానికి వాళ్లు లిఫ్ట్ ఇవ్వడానికి వస్తారు. మెల్లగా మీ ఫోన్ నంబర్ తీసుకుని పరిచయం పెంచుకుంటారు. ఆ తర్వాత స్కూల్‌కి కాకుండా మరెక్కడెక్కడికో మిమ్మల్ని తీసుకెళతారు.
ఇటీవల డ్రగ్స్ ఎక్కువయ్యాయి. పోలీసుల నిఘా ఎక్కువైంది. వాహనదారులు సేఫ్టీ కోసం మీ స్కూల్ బ్యాగ్‌లో ప్యాకెట్ ఉంచి మిమ్మల్ని ఎక్కించుకుని డ్రాప్ చేయవచ్చు. ఆ సమయంలో దొరికితే ఇంకా ప్రమాదం.
Comments
Please login to add a commentAdd a comment