school children
-
ఆ స్కూల్లో ఫీజు తీసుకోరు
మామూలుగా అయితే స్కూల్లో టీచర్లు పిల్లలకు పాఠాలు చెప్తారు. హోంవర్క్ రాసుకురమ్మని చెప్తారు. పరీక్షలు పెట్టి మార్కులు వేస్తారు. పైగా ఇవన్నీ చేసినందుకు ప్రైవేటు స్కూళ్లలో ఫీజు తీసుకుంటారు. అయితే థాయ్‌లాండ్‌లో ఉన్న ‘మెషై పట్టానా స్కూల్’(mechai pattana school) లో మాత్రం అందుకు పూర్తి భిన్నం. ఈ బడినే ప్రపంచవ్యాప్తంగా "Bamboo Sc-hool' అని కూడా అంటారు. ఇక్కడ పిల్లలకు పాఠాలతోపాటు సేవ చేయడం నేర్పిస్తాను. సమాజంలో ఎలా బతకాలో నేర్పిస్తారు. తోటివారిని ఎలా గౌరవించాలో, వృద్ధులతో ఎలా నడుచుకోవాలో, పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలో.. ఇవన్నీ నేర్పిస్తారు. ఇవన్నీ నేర్పినందుకు వారు ఫీజేమీ తీసుకోరు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కలిసి 400 చెట్లు నాటితే చాలు. థాయ్‌లాండ్‌కు చెందిన మెషై విరవైద్య అనే ప్రముఖ సామాజిక కార్యకర్త, న్యాయవాది 2008లో ఈ పాఠశాలను ్రపారంభించారు. స్కూళ్లలో పెరుగుతున్న పేద, ధనిక తారతమ్యం, పాఠశాలలు కేవలం పుస్తకాలు బట్టీ వేసే ప్రదేశాలుగా మారిపోవడం వంటివి గమనించి తాను ఈ స్కూల్‌ని స్థాపించినట్లు ఆయన వివరిస్తారు. బడిలో అందరూ ఒకచోట చేరి సంస్కారాన్ని, సామాజిక సేవనీ, పౌరబాధ్యతలనూ నేర్చుకోవాలని అంటారు. దానికి తగ్గట్టే ఈ పాఠశాల విధివిధానాలను ఆయన రూపొందించారు. ఇక్కడ మామూలు తరగతులతోపాటు కూరగాయలు పండించడం, పశువుల్ని పెంచడం, కళాకృతులు తయారు చేయడం, వంటలు చేయడం వంటివి నేర్పిస్తారు. దీంతోపాటు విద్యార్థులను బృందాలుగా ఏర్పరిచి, వారికొక నాయకుణ్ని నియమిస్తారు. వారిని సమన్వయం చేసుకుంటూ, వారిలో స్ఫూర్తి నింపుతూ సాగేలా అతనికి తర్ఫీదు ఇస్తారు. ఇక్కడ బాధ్యతలన్నీ విద్యార్థులే తీసుకుంటారు. కొత్తవారిని స్కూల్లో చేర్చుకోవడం, కొత్త టీచర్లను విధుల్లోకి తీసుకోవడం వంటి పనుల కోసం ‘స్టూడెంట్ బోర్డ్’ పని చేస్తుంది. స్కూల్‌కి కావాల్సిన వస్తువులు కొనడం, ఇచ్చిన నిధుల్ని సక్రమంగా ఖర్చుచేయడం కూడా వారి బాధ్యతే. ఇక్కడ వందలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వారు ఫీజు చెల్లించనవసరం లేదు. అయితే పాఠశాలల్లో జరిగే అన్ని కార్యక్రమాల్లో పాల్గొనాలి. ప్రతి విద్యార్థి ఏడాదిలో 400 గంటలు సమాజ సేవ చేయాలి. అది ఇక్కడ కచ్చితమైన నిబంధన. స్త్రీలను ఎలా అర్థం చేసుకోవాలి, వారి మానసిక పరిస్థితి, శారీరక ఇబ్బందులేమిటనే అంశాలపై ఇక్కడి విద్యార్థులకు ప్రత్యేక తరగతులుంటాయి. దీనివల్ల వారిలో తోటివారి పట్ల అవగాహన, ఆత్మీయత పెరుగుతాయని మెషై విరవైద్య వివరిస్తున్నారు. -
ప్రభుత్వ స్కూలు పిల్లలపై ఎందుకీ వివక్ష?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ బోధన రద్దుతో మీరు మరోసారి పేదల వ్యతిరేకిగా నిరూపించుకున్నారు అని సీఎం చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపడ్డారు. సీబీఎస్ఈ బోధన రద్దు ద్వారా నాణ్యమైన విద్యకు గండికొడుతున్నారంటూ ధ్వజమెత్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థుల భవితను అంధకారంలోకి నెట్టేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ‘ఎక్స్’ వేదికగా వైఎస్ జగన్ నిలదీశారు. సోమవారం ఎక్స్‌లో చేసిన పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..‘‘ముఖ్యమంత్రిగా మీరు, విద్యాశాఖ మంత్రిగా మీ కుమారుడు తిరోగమన నిర్ణయాలతో ప్రభుత్వ స్కూళ్లను మళ్లీ మొదటికే తీసుకెళ్తున్నారు. మీ ఇళ్లల్లో పిల్లలకు అత్యుత్తమ చదువులు అందించాలనుకుంటారు కానీ, గవర్నమెంటు స్కూలు పిల్లల విషయంలో వివక్ష ఎందుకు? వాళ్లు ఎప్పటికీ కింద స్థాయిలోనే ఉండిపోవాలా? వారి జీవితాలకు మీరు శాపంపెట్టిన మాదిరిగా ఈ నిర్ణయాలు ఏంటి?గవర్నమెంటు స్కూళ్ల పిల్లలను ప్రైవేటు బాట పట్టించే కుట్ర..గవర్నమెంటు స్కూళ్ల రూపురేఖలు మార్చే కార్యక్రమాలను రద్దు చేయడం ఎంతవరకు సమంజసం? ముఖ్యమంత్రిగా మీ 14 ఏళ్ల కాలంలో చేయలేని పనులన్నీ ఐదేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసింది. నాడు–నేడు, ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ, ఐబీవైపు అడుగులు, టోఫెల్, సబ్జెక్టు టీచర్ల కాన్సెప్ట్, తరగతి గదుల్లో 6వ తరగతి నుంచి ఇంటరాక్టివ్ ఫ్లాట్ పానల్స్, 8వ తరగతి వచ్చే సరికే ట్యాబుల పంపిణీ, విద్యాకానుక, రోజుకో మెనూతో గోరుముద్ద.. ఇలా పేద పిల్లల తలరాతలను మార్చే చదువులను అందించడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను తీసుకువచ్చింది. మీ హయాంలో ఇప్పుడు ఒక్కొక్కటిగా వీటిని రద్దుచేస్తూ వస్తున్నారు. గవర్నమెంటు స్కూళ్ల పిల్లలను ప్రైవేటు బాట పట్టించడానికి మీరు, మీ కుమారుడు కుట్రను అమలు చేస్తున్నారు. మీ పార్టీ నాయకులకు చెందిన ప్రైవేటు స్కూళ్లు బాగుండాలి? గవర్నమెంటు స్కూళ్లు నిర్వీర్యం అయిపోవాలి? మీ ఉద్దేశం అదేగా? తమ పిల్లలకు మంచి చదువులు అందించడం కోసం తల్లిదండ్రులు వారి సొంత జేబు నుంచి ఎందుకు ఖర్చుచేయాలి? అలాంటప్పుడు ఇక ప్రభుత్వాలు ఎందుకు? గవర్నమెంటు స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియంను వ్యతిరేకిస్తూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు, ఈ ‘‘ఈనాడు’’ కోర్టులకు వెళ్లి అడ్డుకున్న తీరును ఇప్పటికీ ప్రజల మరిచిపోలేరు.గవర్నమెంటు స్కూలు పిల్లలు, టీచర్లను తక్కువగా చూడొద్దు..మన గవర్నమెంటు స్కూలు పిల్లలు, అందులో పనిచేస్తున్న ఉపాధ్యాయులు దేనిలోనూ తక్కువ కాదు చంద్రబాబూ. వీళ్లంతా తెలివైన వారు. పైగా ప్రభుత్వ టీచర్లు లక్షల మంది పోటీపడే పరీక్షల్లో ఉత్తీర్ణులై, చక్కటి శిక్షణ కూడా పొందినవారు. ప్రైవేటు స్కూళ్లలో ఉన్నవారి కంటే గొప్ప చదువులు చదివినవారు, గొప్పగా చదువులు చెప్పగలిగినవారు. అలాంటివారిని తక్కువగా చూసే మీ మనస్తత్వాన్ని ముందు మార్చుకోండి. పిల్లలకు కావాల్సింది వారిలో ఆత్మవిశ్వాసం నింపడం, సరైన శిక్షణ, పటిష్ట బోధన. టీచర్లకు అందించాల్సింది ప్రేరణ, ప్రోత్సాహం, ఓరియంటేషన్. గడచిన ఐదేళ్లలో ఈ దిశగా వారు ఎంతో ప్రయాణంచేశారు. మళ్లీ ఇప్పుడు వారిని నిరుత్సాహపరిచి, ఉద్దేశపూర్వకంగా ఎందుకు దెబ్బతీస్తున్నారు చంద్రబాబూ? చదువుతోనే పేదరికం దూరంపేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించే ఆయుధం చదువు మాత్రమే. వెంటనే ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యంచేసే తప్పుడు పనులు మానుకోండి. మేం తీసుకొచ్చిన సంస్కరణలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లండి. గవర్నమెంటు స్కూళ్ల పిల్లలు ప్రపంచస్థాయి చదువులను చదువుకునే అవకాశాలను దెబ్బతీయకండి. లేదంటే మీరు పేదప్రజల వ్యతిరేకులుగా, చరిత్రహీనులుగా మిగిలిపోతారు’’ అని చంద్రబాబు విధానాలను ఎండగట్టారు. -
అంకుల్ ప్లీజ్ లిఫ్ట్ అని అడుగుతున్నావా చిన్నా..!
‘పిల్లలు స్కూల్‌ను నడుచుకుంటూ వెళ్లి... పరిగెత్తుకుంటూ ఇంటికొస్తారు’ అని ΄త రోజుల్లో అనుకునేవారు. ఇప్పుడు చాలామంది పిల్లలు నడవడం లేరు. బస్, ఆటో, వ్యాన్ వస్తుంది. లేదా నాన్నో, అమ్మో, ఇంటి కారో దింపుతుంది. మళ్లీ పికప్ చేసుకుంటుంది. అయితే ఇలా కాకుండా చాలామంది పిల్లలు తమ సొంతగా స్కూలుకు వెళ్లాల్సి ఉంటుంది. వీళ్లు సైకిల్ తొక్కుకుంటూ వస్తారు. లేదా షేర్ ఆటో ఎక్కి వస్తారు. లేదా ఆర్టీసి బస్ ఎక్కి వస్తారు. నడవడం ఇష్టం ఉన్నవాళ్లు నడుస్తారు. కాని కొందరు మాత్రం ‘అంకుల్... లిఫ్ట్’ అని రోడ్డు మీద నిలబడి టూవీలర్ ఎక్కి దిగుతారు. ఉదయం స్కూలు మొదలయ్యే టైమ్‌లో, సాయంత్రం స్కూల్ విడిచే టైములో అమ్మాయిలు, అబ్బాయిలు ‘లిఫ్ట్’ అడగడం చాలాఊళ్లలో కనపడుతుంది. పల్లెటూళ్లలో, సిటీల్లో కూడా ఇలాంటి పిల్లలు ఉంటారు. వీరిని చూసిన వాహనదారులు ‘΄ాపం చిన్నపిల్లలు కదా’ అని లిఫ్ట్ ఇస్తారు. ఈ లిఫ్ట్ ఇచ్చేవాళ్లు మంచివాళ్లైతే సరే. చెడ్డ వాళ్లయితేనో? అందుకే పోలీసులు స్కూలు పిల్లలను లిఫ్ట్ అడిగి రాక΄ోకలు చేయవద్దని గట్టిగా హెచ్చరిస్తున్నారు. అందుకే ఇక్కడున్న విషయం మీరు చదివి, మీ అమ్మానాన్నలకు, స్కూల్ టీచర్లకు కూడా చూపించండి.రోడ్డు మీద అపరిచితులను లిఫ్ట్ అడగకూడదు. ఎందుకంటే వాళ్లు హెల్మెట్‌లో ఉంటారు. వెనుక కూచున్న మీకు ఇవ్వడానికి వాళ్ల దగ్గర హెల్మెట్ ఉండదు. వాళ్లు పొరపాటున యాక్సిడెంట్ చేస్తే వాళ్లకు ఏమీ కాక΄ోయినా మీకు దెబ్బలు తగులుతాయి.లిఫ్ట్ అడిగితే వచ్చే ప్రమాదాలు:లిఫ్ట్ ఇచ్చే వాళ్లకు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ప్రమాదం. వాహనానికి ఇన్సూరెన్స్ లేకపోతే ప్రమాదం. వారు మద్యం సేవించి ఉంటే బండిని పడేసే చాన్సులే ఎక్కువ.లిఫ్ట్ ఇచ్చే వాళ్లు నేరస్తులైతే? మీకై మీరు ఎక్కిన బండిని వారు వేగంగా నడుపుతూ మిమ్మల్ని కిడ్నాప్ చేస్తే? ఆ ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. అప్పుడు బండి మీద నుంచి ఎలా దిగి బయటకు పడాలో మీకు తెలియదు. భయంలో బుర్ర పని చేయదు.లిఫ్ట్ ఇచ్చేవాళ్లు ‘బ్యాడ్ టచ్’ చేసే వారైతే. మీరు భయంతో వాళ్ల బ్యాడ్ టచ్‌ను స్టాప్ చేయక΄ోతే మరుసటి రోజు అదే సమయానికి వాళ్లు లిఫ్ట్ ఇవ్వడానికి వస్తారు. మెల్లగా మీ ఫోన్ నంబర్ తీసుకుని పరిచయం పెంచుకుంటారు. ఆ తర్వాత స్కూల్‌కి కాకుండా మరెక్కడెక్కడికో మిమ్మల్ని తీసుకెళతారు.ఇటీవల డ్రగ్స్ ఎక్కువయ్యాయి. పోలీసుల నిఘా ఎక్కువైంది. వాహనదారులు సేఫ్టీ కోసం మీ స్కూల్ బ్యాగ్‌లో ప్యాకెట్ ఉంచి మిమ్మల్ని ఎక్కించుకుని డ్రాప్ చేయవచ్చు. ఆ సమయంలో దొరికితే ఇంకా ప్రమాదం. -
స్కూల్లో చిన్నారులపై దారుణం.. ఆందోళనలతో ఆగిన రైళ్ల రాకపోకలు
థానే: ఓ వైపు ఆర్జీ కార్ ఆస్పత్రిలో జరిగిన ఉదంతంపై దేశ వ్యాప్తంగా ఆందోళలు కొనసాగుతున్న వేళ.. మరికొందరు చిన్నారుల పట్ల ఉన్మాదంగా ప్రవర్తిస్తున్నారు.ఆగస్టు 16న మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఓ స్కూల్లో దారుణం జరిగింది. స్కూల్లో చదివే ఇద్దరు బాలికలపై అదే స్కూల్లో క్లీనింగ్ విభాగంలో పనిచేసే ఓ యువకుడు అమానుషంగా ప్రవర్తించాడు. ఈ దారుణం వెలుగులోకి రావడంతో థానే జిల్లా నిరసన కారుల ఆందోళనతో అట్టుడికిపోయింది. #Maharashtra l Parents & residents in #Badlapur protest over the sexual exploitation of 2 minor girls, blocking the railway tracks. The accused sweeper has been arrested & the school has suspended staff & closed for 5 days.#Crime #Thane #WomenSafety#Justice #Assault #Protest pic.twitter.com/RClqTFyvwx— Lokmat Times Nagpur (@LokmatTimes_ngp) August 20, 2024 బాధితుల తల్లిదండ్రులు, స్థానికులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. స్థానిక బద్లాపూర్ రైల్వే స్టేషన్లో రైళ్ల రాకపోకల్ని నిలిపివేశారు. దీంతో రైల్వే రాకపోకలు స్తంభించిపోయాయి. ఈ సంఘటనతో స్కూల్ యాజమాన్యం ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేసింది. క్లాస్ టీచర్ని తొలగించినప్పటికీ తల్లిదండ్రులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లల భద్రతకు పూర్తి బాధ్యత వహించడంలో పాఠశాల విఫలమైందని, పాఠశాల యాజమాన్యం నుండి ఎలాంటి స్పందన లేకపోవడంపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. కాగా, బాధితుల ఆందోళనతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల దర్యాప్తులో పాఠశాల భద్రత విషయంలో లోపాలు బయటపడ్డాయి. బాలికల మరుగుదొడ్లు శుభ్రం చేసేందుకు మహిళా అటెండర్లు లేరని తేలింది. స్కూల్లో సీసీటీవీ కెమెరాలు పనిచేయకపోవడాన్ని పోలీసులు గుర్తించారు. స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించారు. -
హర్యానాలో బస్సు బోల్తా.. నలభై మంది పిల్లలకు గాయాలు
చండీగఢ్: హర్యానాలోని పంచకుల జిల్లా పింజోర్‌లో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 40 మంది స్కూలు పిల్లలు, ఇతరులకు గాయాలయ్యాయి. గాయపడ్డవారిని పంచకులలోని ఆస్పత్రికి తరలించి చికిత్సఅందిస్తున్నారు. తీవ్రంగా గాయపడ్డ ఓ మహిళను మాత్రం చండీగఢ్‌లోని పీజీఐ ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ అతివేగంగా బస్సు నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదస్థలికి వెంటనే చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. రోడ్డు సరిగా లేకపోవడం కూడా ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. -
మత్తు డేగ ఎగురుతోంది... జాగ్రత్త
వీధి చివర బంకుల్లో మత్తు చాక్లెట్లు కాలేజీ క్యాంపస్‌లో గంజాయి పొగ పబ్‌లో మాదకద్రవ్యాలు బుద్ధిగా చదువుకోవాల్సిన టీనేజ్ పిల్లల్ని మత్తులోకి లాగడానికి పొంచి ఉన్న డేగలు. జాగ్రత్త... తల్లిదండ్రులూ.. జాగ్రత్త. పిల్లలు తెలిసీ తెలియక చిక్కుకుంటారు. గమనించాలి. చర్చించాలి. కాపాడుకోవాలి.స్కూల్ వయసు పిల్లలు డ్రగ్స్ బారిన పడకుండా హర్యాణ రాష్ట్రంలో పోలీసులు ఆయా స్కూళ్లకెళ్లి వారిని చైతన్యపరిచే కార్యక్రమాలు చేస్తున్నారు. ‘క్యాచ్ దెమ్ యంగ్’ అనేది ఈ కార్యక్రమం పేరు. అంటే చిన్న వయసులోనే పిల్లల దృష్టిని ఆకర్షించి వారిని డ్రగ్స్ దుష్ప్రభావాల గురించి చెప్పాలి. ఇందుకు వారు అంబాలలోని ఒక ప్రయివేటు స్కూల్లో ప్రయోగాత్మకంగా ఒక ప్రయత్నం చేశారు. దాని పేరు ‘చక్రవ్యూహ్’. వరుసగా ఉన్న ఐదు గదుల్లో రకరకాల పజిల్స్ ఇచ్చి ఒక గదిలో నుంచి మరో గదిలోకి కేవలం తెలివితేటల ఆధారంగా తలుపు తెరుచుకుని ప్రవేశిస్తూ అంతిమంగా బయట పడాలి. ‘ఇది ఒక అద్భుత ప్రయోగం’ అని విద్యార్థులు అంటున్నారు.చక్రవ్యూహ్ ప్రయోగంచక్రవ్యూహ్ అనేది ఒక పజిల్ గేమ్. ఆటోమేటిక్ తాళాలు ఉన్న గదుల్లోకి నలుగురు విద్యార్థుల బృందాన్ని పంపిస్తారు. ఆ బృందం అక్కడ తమ జీవితంలో ఎదురయ్యే రకరకాల సమస్యలను పజిల్స్ రూపంలో ఎదుర్కొంటుంది. అంటే పరీక్షలో ఫెయిల్ కావడం, మంచి ర్యాంక్ రాకపోవడం, నిరుద్యోగం, ఒంటరితనం, తల్లిదండ్రుల కొట్లాట... ఇలాంటి సమయంలో ఆ సమస్యలను ఎలా దాటాలో అక్కడే క్లూస్ ఉంటాయి. ఆ క్లూస్ ద్వారా ముందుకు సాగితే తర్వాతి గదిలోకి తలుపు తెరుచుకుంటుంది. ఇదంతా íసీసీ టీవీల ద్వారా అధ్యాపకులు గమనిస్తూ ఉంటారు. అయితే ఈ ప్రతి సవాలు ఎదుర్కొనే సమయంలో ఆ సమస్య నుంచి పారిపోయి డ్రగ్స్‌ను ఎంచుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. కాని ఈ మొత్తం చక్రవ్యూహ్లో కలిగే అవగాహన ఏమిటంటే నిజ జీవిత సమస్యల్ని తల్లిదండ్రుల, స్నేహితుల సాయంతో దాటితే వచ్చే కిక్కు డ్రగ్స్ తీసుకొని జీవితాన్ని నాశనం చేసుకోవడంలో లేదని తెలియడం. ఇలాంటి చక్రవ్యూహ్ ప్రయోగాన్ని హర్యాణలోని స్కూళ్లల్లో విస్తృతంగా నిర్వహించాలని పోలీసులు భావిస్తున్నారు. జీవితపు చక్రవ్యూహంలో చిక్కుకుంటే బయటపడే దారి ఉంటుందిగాని డ్రగ్స్‌లో చిక్కుకుంటే దారి ఉండదు అని తెలియడం వల్ల విద్యార్థులు చిన్న వయసులోనే గట్టి సందేశం అందుకుంటారు.కుతూహలం, సాంగత్యంటీనేజీ పిల్లలు అయితే కుతూహలం కొద్దీ లేదా దుష్ట సాంగత్యంలోని ఒత్తిడి వల్ల డ్రగ్స్‌ను ట్రై చేస్తున్నారని డీ అడిక్షన్ థెరపిస్టులు అంటున్నారు. పిల్లలు డ్రగ్స్‌కు అలవాటు పడ్డారని తల్లిదండ్రులు గమనించే లోపు వారి ప్రవర్తన పూర్తిగా మారిపోయి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. సరదా షికార్లు, స్లీప్ ఓవర్ల సమయంలో సరదా కొద్ది సీనియర్లో స్నేహితులో డ్రగ్స్ ఇస్తున్నారు. మొదటి ఒక రకం డ్రగ్స్ తీసుకున్నాక మెదడు ఇంకా ‘హై’ కావాలని కోరుకుంటుంది. దాంతో పిల్లలు ఇంకా ఎన్ని రకాల డ్రగ్స్ ఉన్నాయో చూద్దామని వెతుకులాట సాగిస్తారు. ఇక అంతటితో వారి చదువు, ఆరోగ్యం, ఏకాగ్రత, వ్యక్తిత్వం మొత్తం ధ్వంసమైపోతాయని డ్రగ్స్‌కు బానిసలైన టీనేజ్ విద్యార్థులను పరిశీలిస్తున్న డీ అడిక్షన్ థెరపిస్టులు తెలియచేస్తున్నారు.బయట పడేయాలిడ్రగ్స్కు అలవాటు అయ్యారని తెలియగానే తల్లిదండ్రులు పిల్లల్ని మందలించడానికి చూస్తారు. వెంటనే ఆ పిల్లలు ‘మీరిలా తిడితే ఇల్లు విడిచి వెళ్లిపోతాం’ అని బ్లాక్మెయిల్ చేస్తారు. వీరిని చాలా ఓర్పుతో థెరపీల ద్వారా తిరిగి మామూలు మనుషుల్ని చేయాల్సి వస్తుంది. పోలీసుల గమనింపు ప్రకారం 18 నుంచి 25 ఏళ్ల లోపు వారిని డ్రగ్ పెడలర్స్ లక్ష్యం చేసుకున్నా నేడు 14 ఏళ్ల పిల్లలతో మొదలు ప్రతి టీనేజ్ అమ్మాయి అబ్బాయి డ్రగ్స్ డేగ రెక్కల కింద ఉన్నట్టే లెక్క.నెగెటివ్ కుటుంబ వాతావరణంటీనేజ్ పిల్లలు డ్రగ్స్ వైపు మొగ్గు చూపడంలో ప్రధానంగా నెగెటివ్ కుటుంబ వాతావరణం ఒక ముఖ్యకారణమని నిపుణులు అంటున్నారు. తల్లిదండ్రులు ఘర్షణతో ఉన్నా పిల్లలతో మంచి అనుబంధం ఏర్పరుచుకోకపోయినా ఆత్మీయంగా వారితో సమయం గడపకపోయినా ‘మనం పట్టని తల్లిదండ్రుల’ కంటే ‘మనకు కిక్ ఇచ్చే డ్రగ్స్ మేలు’ అనే భావనలో భ్రష్ట సాంగత్యాలలోకి పిల్లలు వెళతారు. ఆ సంగతి తెలియనివ్వరు. చదువుతో పాటు క్రీడలు, ప్రకృతి ప్రేమ, బంధుమిత్రులు, క్రమశిక్షణ గల ఆర్థిక పరిస్థితి, భావోద్వేగాలకు అయినవారు ఉన్నారన్న భరోసా, విలువలు లేదా ఏదో ఒక ఆధ్యాత్మిక ఆలంబన... ఇవి టీనేజ్ పిల్లల రోజువారీ జీవనంలో ఉంటే వారు డ్రగ్స్ బారిన ఏ మాత్రం పడరు. తల్లిదండ్రులూ బహుపరాక్.ఎలా గుర్తించాలి?మీ టీనేజ్ పిల్లలు డ్రగ్స్‌కు అలవాటు పడ్డారని ఎలా గుర్తించాలి?1. చాలా మూడీగా తయారవుతారు 2. సరిగా భోజనం చేయరు 3. సడన్‌గా కొత్త కొత్త స్నేహితులు ప్రత్యక్షమవుతుంటారు. తరచూ ఏవో పార్టీలున్నాయని వెళుతుంటారు. 4. గతంలో కంటే ఎక్కువ డబ్బు అడుగుతారు 5. పొడి పెదిమలు 6. ఎర్రబడ్డ కళ్లు 7. వాదనలకు దిగి ఆధిపత్యం ప్రదర్శించడం 8. కుటుంబంతో కలివిడిగా లేకపోవడం 9. అర్థం పర్థం లేని నిద్రా సమయాలు. -
బడి పిల్లలు..బలహీనం
సాక్షి, హైదరాబాద్: షోషకాహారలోపం, శారీరక శ్రమ లేకపోవడంతో జీవనశైలిలో చోటుచేసుకుంటున్న మార్పుల కారణంగా బడి పిల్లలు బలహీనంగా తయారవుతున్నారు. దేశంలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల్లో ఆరోగ్యం, ఫిట్నెస్ సామర్థ్యం తెలుసుకునేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద యూత్ స్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్ స్పోర్ట్స్ విలేజ్ సర్వే చేసింది. 250 నగరాలు, పట్టణాల్లో 7 –17 ఏళ్ల వయసు ఉన్న 73 వేల మంది విద్యార్థులపై సర్వే చేసి, 12వ వార్షిక ఆరోగ్య నివేదిక విడుదల చేసింది. దక్షిణాది విద్యార్థులు బలంగానే.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక వంటి దక్షిణాది రాష్ట్రాల్లోని విద్యార్థులు ఆరోగ్యకరంగా ఉన్నారు. ఈ రాష్ట్రాల్లోని పిల్లల్లో ఛాతీ, శరీర కింది భాగం బలంగా ఉన్నాయి. ఉత్తర రాష్ట్రాల పిల్లల్లో బలహీనమైన బీఎంఐ, కీళ్లు, ఉదర కండరాలు సమస్యలున్నాయి. తూర్పు రాష్ట్రాల్లో బీఎంఐ, ఫ్లెక్సిబులిటీ, ఛాతీభాగం ఆరోగ్యకరంగా ఉన్నాయి. ఇక పశ్చిమాది రాష్ట్రాల విద్యార్థులలో ఏరోబిక్ కెపాసిటీ, శరీర కింది భాగం, కీళ్ల కదలికలు మెరుగ్గా ఉన్నాయి. హైదరాబాద్ విద్యార్థులు హెల్తీ ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లోని పాఠశాలల విద్యార్థుల ఆరోగ్యం మెరుగ్గానే ఉంది. నగరంలోని 58 శాతం విద్యార్థుల శరీరంలో ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలుండగా, 49 శాతం మందికి బలమైన ఛాతీ, 84 శాతం సమర్థమైన ఉదర భాగాలున్నాయి. 46 శాతం మందిలో శరీర కింది భాగం బలంగా ఉండగా.. 64 శాతం పిల్లల్లో కీళ్ల కదలికలు చురుగ్గా ఉన్నాయి. 41 శాతం మందికి మెరుగైన ఏరోబిక్ సామర్థ్యం, 58 శాతం విద్యార్థుల్లో వాయురహిత జీర్ణక్రియ సమర్థంగా ఉంది. వారంలో రెండు ఫిజికల్ ఎడ్యుకేషన్ (పీఈ) తరగతులు ఉన్న స్కూళ్ల విద్యార్థుల్లో బలమైన ఛాతీ, ఉదర భాగంతో పాటు కండరాల కదలికలలో చురుకుదనం, గుండె, ఊపిరితిత్తుల పనితీరు మెరుగ్గా ఉన్నాయి. అమ్మాయిలే ఆరోగ్యంగా.. అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలే ఆరోగ్యంగా ఉన్నారు. 62 శాతం ఆడపిల్లల బీఎంఐ సూచీ ఆరోగ్యకరంగా ఉంది. 47 శాతం అమ్మాయిల్లో బలమైన ఛాతీభాగం, 70 శాతం మందికి కీళ్లు, శరీర కదలికల్లోనూ ఫ్లెక్సిబుల్‌గా ఉన్నాయి. అయితే 20 శాతం బాలికల్లో ఏరోబిక్ కెపాసిటీ, 37 శాతం మందిలో శరీర కింది భాగం బలంగా లేదు. ప్రభుత్వ పాఠశాల పిల్లలే బెటర్ ప్రైవేట్‌తో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల విద్యా ర్థులే ఆరోగ్యంగా ఉన్నారు. వీరిలో బీఎంఐ, ఏరోబిక్ కెపాసిటీ, కీళ్ల కదలికలు ఫ్లెక్సిబుల్‌గా ఉన్నాయి. అయితే 43 శాతం ప్రైవేట్ స్కూల్ పిల్లల్లో మాత్రం ఛాతీ భాగం సౌష్టవంగా ఉంది. గవర్నమెంట్ స్కూళ్ల విద్యార్థులలో 62 శాతం మందికి ఆరోగ్యకరమైన బీఎంఐ, 70 శాతం మందికి ఫ్లెక్సిబుల్ కీళ్లు, 73 శాతం పిల్లల్లో యాన్‌ఏరోబిక్ కెపాసిటీ, 31 శాతం మంది బలమైన ఛాతీ ఉంది. అదే ప్రైవేట్ పాఠశాలల పిల్లల్లో 58 శాతం మందికి బీఎంఐ, 64 శాతం ఫ్లెక్సిబుల్ కండరాలు, 55% యాన్‌ఏరోబిక్ కెపాసిటీ, 43 శాతం మంది విద్యార్థులకు ఛాతీభాగం బలంగా ఉంది. నివేదికలోని ముఖ్యాంశాలు ♦ ప్రతీ ఐదుగురు పిల్లల్లో ఇద్దరి శరీరంలో ఆరోగ్యకరమైన కొవ్వు (బాడీ మాస్ ఇండెక్స్– బీఎంఐ), వాయు రహిత జీర్ణక్రియ (యాన్‌ఏరోబిక్ కెపాసిటీ) ప్రక్రియ సరిగ్గా లేదు. ♦ ఐదుగురిలో ఒకరికి స్వేచ్ఛగా కీళ్లు కదిలే సామర్థ్యం లేదు. ♦ ముగ్గురికి గుండె, ఊపిరితిత్తుల కండరాలకుఆక్సిజన్ సరిగ్గా అందడం లేదు. ♦ ముగ్గురిలో ఒకరికి ఉదర కండరాలు బలహీనంగా ఉన్నాయి. ♦ ప్రతి ఐదుగురిలో ముగ్గురికి ఛాతీ భాగం బలహీనంగా ఉంది. -
AP Dussehra Holidays: నేటి నుంచి పాఠశాలలకు దసరా సెలవులు
చిలకలపూడి(మచిలీపట్నం): ఈ నెల 14 నుంచి 24వ తేదీ వరకు పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించినట్లు డీఈవో తాహెరాసుల్తానా శుక్రవారం తెలిపారు. మిషనరీ పాఠశాలకు ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు సెలవులు ఇచ్చినట్లు చెప్పారు. జిల్లాలోని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సెలవు దినాల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించకూడదని పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమించి ఎవరైనా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలోని అన్ని మేనేజ్మెంట్లకు చెందిన పాఠశాలలు నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖాధికారులను ఆదేశించారు. -
సర్కారు బడుల్లో అల్పాహారం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం విజయదశమి కానుక ముందుగానే ప్రకటించింది. ఉదయం వేళ విద్యార్థులకు అల్పాహారం అందించనుంది. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఉదయంపూట విద్యార్థులు ఖాళీ కడుపుతో వస్తుండడంతో చదువుపై ధ్యాస తగ్గుతోందని విద్యాశాఖ వర్గాల పరిశీలనలో తేలింది. దీనిని అధిగమించడంతోపాటు పిల్లలను శారీరకంగా మరింత పటిష్టంగా తయారు చేసే దిశగా సీఎం కేసీఆర్ అల్పాహార పథకం ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలల్లో అల్పాహారం పథకాన్ని అమలు చేస్తుండగా, అదే తరహాలో మన రాష్ట్రంలో కూడా అమలు చేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. అయితే కేవలం ప్రాథమిక పాఠశాల స్థాయిలోనే కాకుండా ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఒకటోతరగతి నుంచి పదోతరగతి వరకు ఈ పథకం అమలు చేస్తారు. ఇందులో భాగంగానే విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జీఓ 27 జారీ చేశారు. వచ్చే నెల 24 నుంచి అమల్లోకి... ముఖ్యమంత్రి అల్పాహార పథకం అమలుకు పక్కాగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాల్సి ఉంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులను డీటైల్డ్ యాక్షన్ ప్లాన్ తయారు చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. తమిళనాడులో అమలు చేస్తున్న అల్పాహార పథకాన్ని లోతుగా అధ్యయనం చేసి ప్రణాళిక తయారు చేయాలని స్పష్టం చేసింది. ఈ పథకం కేవలం పాఠశాలల పనిదినాల్లోనే అమలులో ఉంటుంది. మొత్తంగా దసరా కానుకగా అక్టోబర్ 24 తేదీన ఈ పథకం అమలు చేయనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. బడిపిల్లలకు వరం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థులంతా పేదపిల్లలే. వారికి మధ్యాహ్న భోజన పథకం ఎంతో ఉపయోగపడుతోంది. ఇక అల్పాహార పథకం వారికి సీఎం ఇస్తున్న వరంగానే చెప్పొచ్చు. ఈ పథకం అమలుకు కృషి చేసిన సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. – రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని స్వాగతిస్తున్నాం. బడికి వచ్చే పేదవిద్యార్థులకు ఎంతో ఉపయోగకరమైన ఆలోచనతో పథకాన్ని తీసుకురావడం శుభసూచకం. దీనిని శాశ్వతంగా అమలు చేయాలి. కార్యాచరణ ప్రణాళిక పకడ్భందీగా రూపొందించాలి. – కె.జంగయ్య, చావ రవి, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ప్రభుత్వ మానవీయకోణం సీఎం కేసీఆర్ మానవీయకోణంలో తీసుకున్న ఈ నిర్ణయం అద్భుతం. సీఎం నిర్ణయం పట్ల రాష్ట్రంలోని అన్ని వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. – జూలూరు గౌరీశంకర్, చైర్మన్, రాష్ట్ర సాహిత్య అకాడమీ ఇది కూడా చదవండి: ముగిసిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష -
నడీరోడ్డుపై స్కూల్ పిల్లలు చేసిన పనికి సబితా మేడం ఏమంటుందో మరి ?
-
తండ్రి ఆశయాలతో..పేద పిల్లల కోసం ఫ్రీ బోర్డింగ్ స్కూల్
మెరుపు మెరిస్తే, వాన కురిస్తే, హరివిల్లు విరిస్తే పిల్లల్లో ఒకరిగా మారి ఆనందించేవాడు.పేదపిల్లల కోసం ఏదైనా చేయాలనేది ఆయన కల. ఆ కల సాకారం కాకుండానే ఈ లోకాన్ని విడిచి వెళ్లాడు.తండ్రి కలను నెరవేర్చడానికి సేవాపథంలోకి వచ్చింది పోర్షియా పుటతుండ... ఝార్ఖండ్‌లోని రాంచీలో పుట్టిన పోర్షియా పుటతుండ కోల్‌కతా, దిల్లీ, నోయిడా, ముంబైలలో పెరిగింది. పోర్షియా తండ్రికి పిల్లలంటే ఎంతో ఇష్టం. పిల్లలతో కలిసి నర్సరీ రైమ్స్ పాడడం ఇష్టం. ఆటలు ఆడుతూ పాఠాలు చెప్పడం ఇష్టం. గ్రామీణ ప్రాంతాలలోని పేదపిల్లలకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు పంచేవాడు.పేద పిల్లల కోసం తనవంతుగా ఏదైనా చేయాలని నిరంతరం తపించేవాడు. తన కలలు సాకారం కాకుండానే ఆయన చనిపోయారు. తండ్రి జ్ఞాపకాల స్ఫూర్తితో ఆయన ఆశయాలను నెరవేర్చే క్రమంలో హిమాచల్‌ప్రదేశ్‌లోని కోమిక్ అనే గ్రామంలో అక్కడి అట్టడుగు వర్గాల పిల్లల కోసం ఫ్రీబోర్డింగ్ స్కూల్ ప్రారంభించింది పోర్షియా. ‘హైయెస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా’గా పేరున్న కోమిక్లోని ఎంతోమంది పేద పిల్లలకు పోర్షియా ఇప్పుడు తల్లి, గురువు, సంరక్షకురాలు. జర్నలిజంలో డిగ్రీ చేసిన పోర్షియా ఒక ప్రముఖ ఆంగ్ల పత్రికలో పనిచేసింది. ఆ తరువాత ‘సీఎన్ఎన్’లో న్యూస్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహించింది. కొంతకాలం తరువాత జర్నలిజాన్ని వదులుకొని సేవాదారిలోకి వచ్చింది. పోర్షియా ఈ గ్రామాన్ని ఎంచుకోవడానికి కారణం? ఆమెకు ప్రయాణాలు అంటే చాలా ఇష్టం. తొలిసారిగా హిమాచల్‌ద్రేశ్‌లోని స్పితి లోయకు వచ్చినప్పుడు తనకు ఎంతో మనశ్శాంతిగా అనుభూతి చెందింది. ఆ ప్రాంతంతో ఏదో అనుబంధం ఉన్నట్లు అనిపించింది. తండ్రి చనిపోయిన తరువాత పోర్షియాపై కుంగుబాటు నీడలు కమ్ముకున్నాయి. చీకట్లో నుంచి వెలుగులోకి రావడానికి తనకు ఇష్టమైన ప్రదేశం గురించి పోర్షియా ఆలోచిస్తున్నప్పుడు స్పితి గుర్తుకు వచ్చింది. అక్కడి పేదపిల్లలతో మాట్లాడుతున్నప్పుడు స్వయంగా తండ్రితో మాట్లాడినట్లే అనిపించింది. వారి కోసం ఏదైనా చేయాలనే ఆలోచన వచ్చింది. స్కూల్ ప్రారంభానికి ముందు కజా ప్రాంతంలోని ఒక స్థానిక కుటుంబంతో నెలరోజులు గడిపింది. ఆ కుటుంబంలోని పిల్లలకు పాఠాలు చెప్పింది. ప్రకృతి సోయగాలను ఆస్వాదించడం కోసం ఊళ్ల వెంట తిరుగుతున్నప్పుడు చదువుకు దూరమైన, సరైన చదువు లేని ఎంతోమంది పేదపిల్లలు కనిపించారు. వారిని విద్యావంతులను చేయాల్సిన అవసరం కనిపించింది. ‘ఉద్యోగాన్ని, ముంబైని విడిచి ఇక్కడకు రావడం అనేది సాహసంతో కూడుకున్న పని. కాని నేను ఇష్టంతో ఇక్కడకు వచ్చాను. ముంబైని విడిచి రావాలనే ఆలోచన నా స్నేహితులు, సన్నిహితులు ఎవరికీ నచ్చలేదు. తెలివి తక్కువ నిర్ణయం తీసుకున్నావు అని ముఖం మీదే చెప్పారు. గోడకు కొట్టిన బంతిలా తిరిగి వస్తావు అని కూడా అన్నారు. అయితే అవేమీ నా నిర్ణయాన్ని మార్చలేకపోయాయి. ఇక్కడికి వచ్చిన తరువాత నా జీవితానికి ఒక పరమార్థం దొరికినట్లు అనిపించింది’ అంటుంది పోర్షియా. తొలి అడుగులో భాగంగా.... పిల్లలు ఆడుకునే చోటుకు వెళ్లేది. ‘మీకు బొమ్మలు ఎలా వేయాలో నేర్పిస్తాను’ ‘కొత్త ఆటలు నేర్పిస్తాను’ ‘ఇంగ్లీష్‌లో మాట్లాడడం నేర్పిస్తాను’ అంటూ వారితో స్నేహం చేసేది. చెట్టు కింద కూర్చొని బొమ్మలు గీయడం, రైమ్స్ పాడడం నేర్పేది. ఒక్కరొక్కరుగా నలభై మంది పిల్లల వరకు ఆమెకు దగ్గరయ్యారు. ఆ సమయంలో తనకు ఫ్రీ బోర్డింగ్ స్కూల్ ఆలోచన వచ్చింది. కోమిక్‌లో ఒక ప్రదేశాన్ని అద్దెకు తీసుకొని ఫ్రీ బోర్డింగ్ స్కూల్ ప్రారంభించింది. ఇల్లు అలకగానే పండగ కాదు అన్నట్లు పెద్ద సమస్య వచ్చింది. ‘ఇప్పుడు మా పిల్లలు చదువుకొని ఏం చేయాలి? చిన్నాచితకా పనులు చేసుకుంటే ఏదో విధంగా బతుకుతారు’ అంటూ పిల్లలను బడికి పంపడానికి తల్లిదండ్రులు నిరాకరించేవారు. వారి ఆలోచన ధోరణిలో మార్పు తీసుకురావడానికి పోర్షియా చాలా కష్టపడాల్సి వచ్చింది.పాఠాలతో పాటు తోటపని నుంచి నృత్యం వరకు పిల్లలకు ఎన్నో నేర్పుతోంది పోర్షియా. ‘నా కల సాకారం అవుతుందా, లేదా అనుకునేదాన్ని. స్కూల్ ప్రారంభించిన తరువాత నా మీద నాకు, నా పై పిల్లల పేరెంట్స్‌కు నమ్మకం వచ్చింది. ఇది తొలి అడుగు మాత్రమే’ అంటుంది పోర్షియా పుటతుండ. -
స్కూలుకు లేదు డుమ్మా.. 50 దేశాలు చుట్టొచ్చిందమ్మా..!
10 ఏళ్ల చిన్నారి అదితి త్రిఫాఠి చిన్న వయసులోనే తన తల్లిదండ్రులతో పాటు 50 దేశాలు చుట్టివచ్చింది. ఈ నేపధ్యంలో అదితి ఒక్క రోజు కూడా స్కూలు మానకపోవడం విశేషం. యాహూ లైఫ్ యూకే తెలిపిన వివరాల ప్రకారం అదితి తన తండ్రి దీపక్, తల్లి అవిలాషలతో పాటు దక్షిణ లండన్‌లో ఉంటుంది. వారు యూకే అంతా చుట్టివచ్చారు. ఇప్పటివరకూ అదితి తన తల్లిదండ్రులతో పాటు నేపాల్, సింగపూర్,థాయ్‌లాండ్ తదితర ప్రాంతాలను కూడా సందర్శించింది. ప్రత్యేక ప్రణాళిక ప్రకారం.. అవుట్లెట్ తెలిపిన వివరాల ప్రకారం అదితి తల్లిదండ్రులు తమ కుమర్తెతో పాటు ప్రపంచం చుట్టిరావాలని నిశ్చయించుకున్నారు. తమ కుమార్తె చదువుకు ఆటంకం కలగకుండా, ప్రపంచంలోని వివిధ దేశాలను చూపిస్తూ, విభిన్న సంస్కృతులు ఆహారరుచులపై అవగాహన కల్పిస్తూ, వివిధ ప్రాంతాల ప్రజలను అర్థం చేసుకునే అవకాశం కల్పించాలని అతిధి తల్లిదండ్రులు భావించారు. ఇందుకోసం వారు ఒక ప్రణాళిక సిద్ధం చేశారు. అదితి స్కూలుకు సెలవులు ఇచ్చిన రోజుల్లో వీరు పర్యటనలు కొనసాగించారు. ఇందుకోసం వారు 20 వేల పౌండ్లు(రూ.21 లక్షలకు పైగా..)ఖర్చు చేశారు. విమానాశ్రయం నుంచి నేరుగా స్కూలుకు.. ‘యాహూ’తో త్రిపాఠి మాట్లాడుతూ ‘తాము నేపాల్, భారత్, థాయ్ల్యాండ్లలోని విభిన్ని సంస్కృతులకు ఎంతో ప్రభావితమయ్యామన్నారు. అదితికి మూడేళ్ల వయస్సు ఉన్నప్పుడే తాము ప్రపంచయాత్ర ప్రారంభించామన్నారు. అదితికి ప్రతీవారంలో రెండు రోజులు స్కూలుకు సెలవు ఉంటుందన్నారు. తాము ప్రతీ శుక్రవారం అదితిని స్కూలు నుంచే నేరుగా పర్యటనలకు తీసుకువెళతామన్నారు. తిరిగి ఆదివారం రాత్రి 11 గంటలకు ఇంటికి తిరిగి వస్తామన్నారు. ఒక్కోసారి తాము సోమవారం ఉదయం పర్యటనల నుంచి తిరిగివస్తుంటామన్నారు. అటువంటి సందర్బాల్లో తమ కుమార్తె విమానాశ్రయం నుంచి నేరుగా స్కూలుకు వెళుతుందన్నారు. పర్యటనల కోసం పొదుపు మెట్రో తెలిపిన వివరాల ప్రకారం అదితి తల్లిదండ్రులు అంకౌంటెంట్లుగా పనిచేస్తున్నారు. ఈ పర్యటల కోసం వారు తమ ఆదాయంలో నుంచి కొంతమొత్తాన్ని పొదుపు చేస్తుంటారు. ఇందుకోసం వారు బయటి ఆహారాన్ని తినరు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టులోనే ప్రయాణిస్తుంటారు. వారు కారు కూడా కొనుగోలు చేయలేదు. కాగా అదితి ఇప్పటికే యూరప్‌లోని దాదాపు ప్రతీదేశాన్ని సందర్శించింది. ఇది కూడా చదవండి: ఆమెకు 4 అడుగుల 7 అంగుళాల కురులు.. 100 ప్రపోజల్స్, రూ.2.6 కోట్ల ఆఫర్! -
పిల్లలు స్కూల్‌కి వెళ్లమని మారాం చేస్తున్నారా? ఇలా చేయండి
స్కూళ్లు ప్రారంభం అయ్యాయి. పొద్దున లేచి స్కూలుకు వెళ్లాలంటే భయం, బాధతో బడికెళ్లమని మారాం చేస్తుంటారు చిన్నారులు. మరికొంతమంది అయితే మొండికేసి ఏడుపు అస్సలు ఆపరు. ఇలాంటి పిల్లలను నవ్వుకుంటూ స్కూలుకు పంపాలంటే ఈ నాలుగు పాటిస్తే సరి... మానసికంగా సిద్ధం చేయాలి: ముందుగా పిల్లలతో పాటు తల్లిదండ్రులు స్కూలుకు వెళ్లి తరగతి టీచర్, తోటి విద్యార్థులు, ఇతర స్కూలు సిబ్బందితో మాట్లాడి, వారితో స్నేహంగా మెలగాలి. అప్పుడు అది దగ్గర నుంచి చూసిన పిల్లలు స్కూలు వాతావరణాన్ని కొత్తగా భావించరు. దీంతో పాటు వీలు చిక్కినప్పుడల్లా నవ్వు తెప్పించే కథలు చెబుతూ ఉండాలి. గట్టిగా అరవకూడదు : పిల్లలు స్కూలుకు వెళ్లను అని మారాం చేసినప్పుడు గట్టిగా తిట్టడం, ఆరవడం, కోప్పడటం చేయకూడదు. ఇలా చేస్తే వాళ్లు మరింత భయపడతారు. ఎందుకు స్కూలుకు వెళ్లనంటున్నారో బుజ్జగిస్తూ కారణాలు తెలుసుకోవాలి. కారణాన్ని బట్టి వాళ్లను స్కూలుకు వెళ్లడానికి అనుకూలంగా ఆలోచించేలా వివరిస్తూ, వాళ్లల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచాలి. అనుకూలంగా మాట్లాడాలి : స్కూలు ప్రారంభంలో పిల్లలను స్కూలో దింపడం, స్కూలు అయిపోయాక తీసుకురావడం చేయాలి. వాళ్లకిష్టమైన టిఫిన్ పెట్టాలి. స్కూలు నుంచి వచ్చాక ‘‘స్కూల్లో ఎలా గడిచింది? ఈ రోజు కొత్తగా ఏం నేర్చుకున్నావు? ’’ అని అడగాలి. స్కూల్లో తమ పిల్లలు ఎలా ఉంటున్నారో పిల్లలకు తెలియకుండా టీచర్‌ను అడిగి తెలుసుకుంటూ ఉండాలి. టీచర్ చెప్పిన సలహాలు సూచనలు పాటించాలి. ప్రోత్సహించాలి: స్కూలుకు వెళ్లేందుకు ఆసక్తి కలిగేలా పిల్లలను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తుండాలి. స్కూల్లో స్నేహితులను ఏర్పర్చుకోమని చెబుతుండాలి. ఇవన్నీ చేయడానికి తల్లిదండ్రులు కాస్త సహనం పాటిస్తే.. పిల్లలు సంతోషంగా స్కూలుకు వెళ్లి చదువుకుంటారు. -
16 ఏళ్లకే చదువుకు టాటా.. నేడు ఏటా రూ.100 కోట్లు సంపాదిస్తూ..
ఫొటోలో కనిపిస్తున్న ఈ వ్యక్తి బిజినెస్ స్టార్ట్ చేసేందుకు తన కారును అమ్ముకోవాల్సివచ్చింది. అయినా అతను బాధపడలేదు. ఎందుకంటే తన కల నెరవేర్చుకునేందుకు కారు అమ్మడం అతనికి తప్పనిసరి అయ్యింది. ఇప్పుడతను తన బిజినెస్ కారణంగా ఏటా 10 మిలియన్ పౌండ్లు(సుమారు రూ.103 కోట్లు) సంపాదిస్తున్నాడు. ఐటీ సొల్యూషన్ బిజినెస్ ప్రారంభించి.. బ్రిటన్‌కు చెందిన 40 ఏళ్ల రాబ్డెన్స్ జీసీఎస్సీ పూర్తి చేసిన తరువాత స్కూలుకు వెళ్లడం మానివేశాడు. బిజినెస్ చేసేందుకు ప్రణాళిక రూపొందించుకున్నాడు. డైలీ స్టార్ రిపోర్టులో తెలిపిన వివరాల ప్రకారం తన తల్లిదండ్రుల గ్యారేజీలో ఐటీ సొల్యూషన్ బిజినెస్ ప్రారంభించాడు. ఇందుకోసం రాబ్డెన్స్ 2008లో తన కారును వెయ్యి పౌండ్లకు అమ్మేశాడు. ఇప్పుడతను పెద్ద ఐటీ కన్సల్టెన్సీ కంపెనీకి సీఈఓ. ‘ఇన్నోవేటివ్‌గా ఉండేవాడిని’ ఈ కంపెనీలో వందమందికిపైగా సిబ్బంది ఉన్నారు. ఈ కంపెనీని నెలకొల్పి 15 ఏళ్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం రాబ్‌కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాబ్ మీడియాతో మాట్లాడుతూ ‘నేను స్కూలు చదువులో ప్రతిభ చూపలేకపోయేవాడిని. అయితే ఇన్నోవేటివ్‌గా ఉండేవాడిని. ఏ పరికరం ఎలా పనిచేస్తోందో తెలుసుకునేందుకు ఆసక్తి చూపేవాడిని. నేను వ్యాపారం ప్రారంభించినప్పుడు నాతో పాటు ఒకరు ఉండేవారు. అతను అడ్మిన్‌తోపాటు అకౌంట్స్ చూసుకునేవాడు. 18 నెలలకే మా సంస్థలో 10 మంది సిబ్బంది ఉండేవారు. కరోనా మహమ్మారి సమయంలోనూ మా వ్యాపారం అభివృద్ధిదాయకంగా ముందుకుసాగింది. ప్రస్తుతం మేము 10 మిలియన్ పౌండ్లకు పైగా బిజినెస్ చేస్తున్నాం. వ్యాపారరంగంలో మేము ఇంతలా రాణించిన నేపధ్యంలో పలు పురస్కారాలు అందుకున్నాం’ అని అన్నారు. -
ఘోర ప్రమాదం.. ఏడుగురు విద్యార్థులు మృతి..
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ కంకేర్ జిల్లా కోరార్ గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూల్ పిల్లలతో వెళ్తున్న ఆటోను ట్రక్కు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరో విద్యార్థి, ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషాద ఘటనపై సీఎం భూపేశ్ బఘేల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు. చదవండి: Cow Hug Day On Valentines Day: ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు కాదు.. 'కౌ హగ్ డే'..! -
కలిసి చదివి.. ఒకేచోట ఉద్యోగం
రంగారెడ్డి: ఆ ముగ్గురు చిన్నప్పుడు కలిసి చదువుకున్నారు.. ఉన్నత చదువుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లారు. చదువులు ముగించుకుని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. మళ్లీ ఆ ముగ్గురిని ప్రభుత్వ పాఠశాల కలిపింది. పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులుగా ఒక్కరు పాఠశాల సబార్డినేటర్గా విధులు నిర్వహిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా ముసాపేట మండల కేంద్రానికి చెందిన అస్కాని శ్రీనివాససాగర్, సుజాత, శంకరయ్యలు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలో పదో తరగతి వరకు కలిసి చదువుకున్నారు. 1985–86వ సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసుకుని ఉన్నత విద్యకు వేర్వేరు ప్రాంతాలకు వెళ్లారు. అనంతరం ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఒకరు సబార్డినేటగా ఉద్యోగాలు సాధించారు. రాష్ట్ర ప్రభుత్వం 317 జీఓలో గద్వాల జిల్లా నుంచి సుజాత, మహబూబ్‌నగర్ జిల్లా నుంచి శంకరయ్య మండల పరిధిలోని కొత్తపేట జెడ్పీహెచ్‌ఎస్‌కు బదిలీపై వచ్చారు. అప్పటికే ఇక్కడ విధులు నిర్వహిస్తున్న అస్కాని శ్రీనివాససాగర్తో కలిసి ఇదే పాఠశాలలో మిగతా ఇద్దరు చేరారు. బాల్య మిత్రులు మళ్లీ ఒకే పాఠశాలలో కలుసుకోవడం పట్ల పలువురు ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
సచివాలయ సిబ్బందికి ‘బోధనేతర’ బాధ్యతలు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లోని బోధనేతర కార్యక్రమాల నుంచి ఉపాధ్యాయులను మినహాయించిన రాష్ట్ర ప్రభుత్వం.. వాటిలో పలు బాధ్యతలను గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి అప్పగించింది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను గ్రామ, వార్డు సచివాలయ శాఖ తాజాగా విడుదల చేసింది. వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లేదా వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, మహిళా పోలీస్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్త, ప్రాథమిక వైద్యాధికారులు వివిధ పర్యవేక్షణ బాధ్యతల్లో పాల్గొంటారని పేర్కొంది. వారు తమ పరిధిలోని స్కూల్‌ను సందర్శిస్తూ బోధనేతర కార్యక్రమాల పర్యవేక్షణ కోసం ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక యాప్‌లో ఆ వివరాలను నమోదు చేయాలి. వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లేదా వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలు తమ పరిధిలోని పాఠశాలను కనీసం వారానికొకసారి సందర్శించి పిల్లల హాజరును పరిశీలించాలి. హాజరు తక్కువగా ఉన్న పిల్లల తలిదండ్రులతో మాట్లాడి.. వంద శాతం హాజరుకు అవసరమైన కృషి చేయాలి. పాఠశాలలోని పరిస్థితులే కారణమైతే.. వాటిని ప్రధానోపాధ్యాయుడి దృష్టికి తీసుకెళ్లాలి. పౌష్టికాహారం అందేలా.. మధ్యాహ్న భోజన రికార్డులను కూడా వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లేదా వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలే పరిశీలించాల్సి ఉంటుంది. వారానికొకసారి స్కూల్‌ను సందర్శించినప్పుడు మధ్యాహ్న భోజన రికార్డుల పరిశీలనతో పాటు మెనూ ప్రకారం భోజనం రుచిగా, శుచిగా ఉందా అనే వివరాలను సేకరించాలి. ఏదైనా సమస్య ఉంటే పేరెంట్స్ కమిటీతో కలిసి పరిష్కారానికి కృషి చేయాలి. ఏఎన్ఎంలు ప్రతి నెలా తమ పరిధిలోని స్కూళ్లను సందర్శించి.. పిల్లల పౌష్టికాహార పరిస్థితులు అంచనా వేయాలి. వ్యాధి నిరోధక టీకాలతో పాటు స్థానిక వైద్యాధికారి, ఆశా వర్కర్‌తో కలిసి పిల్లలకు వైద్య సహాయం అందించాలి. భద్రతపై విద్యార్థినులకు అవగాహన.. ప్రతి పాఠశాలలో ఫిర్యాదుల బాక్సు ఏర్పాటు చేసి.. దానిని సచివాలయ మహిళా పోలీస్ పర్యవేక్షించాలి. అలాగే విద్యార్థినులకు తరుచూ సమావేశాలు నిర్వహించి.. వారి భద్రతకు ప్రభుత్వం తీసుకున్న చర్యలపై అవగాహన కల్పించాలి. అలాగే నాడు–నేడు పనులను సంబంధిత పాఠశాల పేరెంట్స్ కమిటీ, ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ పర్యవేక్షిస్తారు. పిల్లల అభిప్రాయాల మేరకు పాఠశాలలో అవసరమైన మరమ్మతులను వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు గుర్తించి.. పేరెంట్స్ కమిటీ, ప్రధానోపాధ్యాయుల భాగస్వామ్యంతో నాడు–నేడులో ఆ పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలి. స్కూల్లోని మరుగుదొడ్ల పరిశుభ్రతపై నెలవారీ సమీక్ష బాధ్యత ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు అప్పగించారు. వీరు ఉన్నతాధికారుల సహాయంతో నీటి సరఫరాకు తగిన చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. -
తల్లిదండ్రుల కళ్ల ముందే తల తెగిపడింది! అంతలోనే..
శాన్ జోస్: అభం శుభం తెలియని ఓ చిన్నారి.. జలరాకాసి నోట చిక్కి దారుణ స్థితిలో ప్రాణం కోల్పోయాడు. అదీ అంతా చూస్తుండగానే!. కాపాడుకోలేని నిస్సహాయ స్థితిలో ఆ ఘోరాన్ని చూస్తూ ఉండిపోయి.. కడసారి చూపు కోసం బిడ్డ శవం కూడా దొరక్క తల్లడిల్లిపోయారు ఆ తల్లిదండ్రులు. అయితే తాజాగా ఈ విషాదంలో మరో పరిణామం చోటు చేసుకుంది. కోస్టారికా లిమన్ నగరంలో నెల కిందట ఘోరం జరిగింది. బటినా నది దగ్గర కుటుంబం, బంధువులతో పాటు చేపల వేటకు వెళ్లిన ఓ చిన్నారిని.. 12 అడుగుల భారీ మొసలి నోటి కర్చుకుని నీళ్లలోకి లాక్కెల్లే యత్నం చేసింది. ఈ ప్రయత్నంలో ఆ చిన్నారి తల తెగిపడడంతో.. అక్కడున్నవాళ్లంతా షాక్‌తో కేకలు వేశారు. తలతో పాటు అక్కడి నుంచి నీళ్లలోకి వెళ్లిపోయింది ఆ మొసలి. అక్కడున్నవాళ్లంతా ఆ పరిణామం నుంచి తేరుకునేలోపే.. నిమిషాల వ్యవధిలో మళ్లీ వెనక్కి వచ్చిన మొసలి.. ఈసారి బాలుడి మొండెంను లాక్కెల్లింది. ఈ హఠాత్ పరిణామంతో ఆ పేరెంట్స్ రోదనలు మిన్నంటయ్యాయి. స్థానిక అధికారులు బాలుడి శరీరాన్ని రికవరీ చేసే యత్నం చేసి.. విఫలం అయ్యారు. బాధితుడిని ఎనిమిదేళ్ల జూలియో ఒటేరియో ఫెర్నాండేజ్గా గుర్తించారు. అక్టోబర్ 30వ తేదీన ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే.. ఇది జరిగి దాదాపు నెల తర్వాత.. మొన్న శనివారం మరో ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఓ వేటగాడు ఒటినా నదిలో పశువుల మీద దాడికి వచ్చిన ఓ మొసలిని కాల్చి చంపాడు. స్థానికులు దానిని ఒడ్డుకు లాక్కొచ్చి పొట్ట చీల్చి చూడగా.. కడుపులో మనిషి జుట్టుతో పాటు ఎముకల శకలాలు బయటపడ్డాయి. డీఎన్ఏ పరీక్షల ఆధారంగా.. అవి ఎనిమిదేళ్ల చిన్నారి జూలియోకు చెందినవే అని తేల్చారు. దీంతో ఆ మృత శకలాలను జూలియో తల్లిదండ్రులకు అప్పగించారు. ‘‘ఆరోజు మధ్యాహ్న సమయంలో మోకాళ్ల నీతులో జూలియో ఉన్నాడు. కాస్త దూరంలో అతని అన్నదమ్ములు, ఇతర బంధువులు ఉన్నారు. చూస్తుండగానే ఓ మొసలి వచ్చి వాడ్ని లాక్కెళ్లింది. తల తెగి పడడంతో తల్లి మార్గిని ఫ్లోరెస్ కుప్పకూలిపోయింది. మళ్లీ నీటి నుంచి బయటకు వచ్చిన మొసలి మొండెం భాగాన్ని తీసుకెళ్లింది. అక్కడ ఉన్న గుహల్లోకి వెళ్లిపోయింది. అక్కడ చాలా మొసళ్లు ఉన్నాయి. అందుకే శవాన్ని రికవరీ చేయలేకపోయాం’’ అని అధికారులు వెల్లడించారు. మొసళ్ల జోన్‌గా ఆ ప్రాంతంలో చేపల వేటను నిషేధించినప్పటికీ.. కొంత మంది జాలర్ల అక్రమ వేటతో అక్కడున్న వార్నింగ్ ఫెన్సింగ్‌లు తొలగించారని, దీంతోనే చిన్నారి ప్రాణం కోల్పోవాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. ఇదీ చదవండి: లవర్‌పై అనుమానంతో ఏకంగా.. -
చన్నీటి స్నానం.. చిన్నారుల దైన్యం
అసలే చలికాలం. వేకువజామున మంచు కురుస్తూ గజగజ వణికిస్తోంది. మరోవైపు కనిష్ట ఉష్ణోగ్రత రోజురోజుకూ పడిపోతోంది. ఇంతటి చలిలోనూ విద్యార్థులు చన్నీటి స్నానం చేస్తూ అవస్థలు పడుతున్నారు. జిల్లా కేంద్రం ఆదిలాబాద్‌లోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం పక్కనే ఉన్న గిరిజన సంక్షేమ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలో ఒకే నల్లా ఉంది. ఈ నల్లా వద్ద శుక్రవారం ఉదయం పదుల సంఖ్యలో విద్యార్థులు చలిలో స్నానాలు చేస్తూ కనిపించారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ -
స్కూల్ పిల్లలకు లిఫ్ట్ ఇచ్చిన ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి
-
అంధుల స్కూల్లో అగ్ని ప్రమాదం.. 11 మంది దుర్మరణం
కంపాలా: అంధుల పాఠశాలలో భారీ అగ్ని ప్రమాదం సంభవించి 11 మంది ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన ఉగాండాలో జరిగింది. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వారి పరిస్థితి విషమంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉగాండా రాజధాని కంపాలాకు సమీప ముకోనో జిల్లాలో సలామా అంధుల రెసిడెన్షియల్ స్కూల్లో సోమవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దాంతో కంటిచూపు లేని చిన్నారులు అగ్నిలోనే ఆహుతయ్యారు. వసతి గృహంలో పిల్లలు నిద్రిస్తున్న సమయంలో మంటలు చెలరేగాయని పాఠశాల హెడ్మాస్టర్ ప్రాన్సిస్ కిరుబే తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన వారందరూ ఏడు నుంచి పదేళ్ల వయసు పిల్లలేనని.. వారి శరీరాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని మరో అధికారి వెల్లడించారు. స్కూల్ వద్దకు చేరుకున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు అందిరిని కలిచివేశాయి. తూర్పు ఆఫ్రికా దేశమైన ఉగాండాలో స్కూల్స్‌లో అగ్ని ప్రమాదాలు ఇటీవల ఎక్కువైనట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. కిక్కిరిసిపోయే తరగతి గదులు, విద్యుత్ కనెక్షన్లు సరిగా లేకపోవడం వంటివి అగ్ని ప్రమాదాలకు కారణమవుతున్నట్లు అధికారులు పేర్కొన్నాయి. నవంబర్, 2018లో దక్షిణ ఉగాండాలోని ఓ పాఠశాలలో అగ్ని ప్రమాదం జరిగి 11 మంది చిన్నారులు మరణించారు. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. 2006లో పశ్చిమ ఉగాండాలో ఇస్లామిక్ పాఠశాలలో 13 మంది చిన్నారులు దుర్మరణం చెందారు. ఇదీ చదవండి: ‘వరల్డ్ డర్టీ మ్యాన్’.. 67 ఏళ్ల తర్వాత స్నానం.. నెలల వ్యవధిలోనే మృతి -
బడులపైనా రాజకీయాలా?: విద్యాశాఖపై సమీక్షలో సీఎం జగన్
విద్య, వ్యవసాయం, ఆరోగ్య రంగాలకు గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈ మూడేళ్లలో ఈ మూడు రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చాం. ఇంత చేస్తున్నా.. ఓ వర్గం మీడియా ప్రభుత్వంపై నిరంతరం పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తోంది. ఇదంతా ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం లేకుండా చేసి, ఇదివరకట్లా పేదలకు మంచి విద్య అందకుండా దూరం చేయాలనే కదా! ఇంతటి దుర్మార్గపు రాజకీయాలు చేస్తుండటం దురదృష్టకరం. ఇలాంటి వాటిని ఎదుర్కొంటూనే మనం లక్ష్యాల వైపు అడుగులు వేయాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో రాజకీయాలు చాలా అన్యాయంగా నడుస్తున్నాయి. ఓ వర్గం మీడియా ప్రభుత్వంపై నిరంతరం దుష్ప్రచారం చేస్తోంది. చివరకు వారి స్వార్థం కోసం స్కూలు పిల్లలనూ రాజకీయాల్లోకి లాగుతున్నారు. విద్యార్థులని కూడా చూడకుండా వారి భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారు’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆయన తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యా రంగానికి సంబంధించిన అంశాలపై కొన్ని పత్రికలు తప్పుడు వార్తలతో ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్న విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. వీటిపై సీఎం స్పందిస్తూ ‘విద్యా సంబంధిత కార్యక్రమాలపై రాజకీయాలు దురదృష్టకరం. ముఖ్యంగా లక్షలాది మంది పేద, మధ్య తరగతి కుటుంబాల పిల్లలకు ఆసరాగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసేందుకు ఇలాంటి దుష్ప్రచారం సాగిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలపై వక్రీకరణలు ఒక స్థాయికి మించి చేస్తున్నారు’ అని అన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం చదవలేక మానేస్తున్నారన్నట్టుగా వక్రీకరణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వక్రీకరణల వెనుక వారి ఉద్దేశం ఏమిటో ప్రజలందరికీ తెలుసని.. మంచి మాటలు చెప్పి, పిల్లల భవిష్యత్తుకు నైతిక స్థైర్యాన్ని అందివ్వాల్సిన వాళ్లే ఇలాంటి వక్రీకరణలు చేస్తుండటం దారుణం అన్నారు. స్కూళ్ల నిర్వహణపై నివేదికలు స్కూళ్ల నిర్వహణ అంశాలపై క్రమం తప్పకుండా అధికారులతో పాటు సచివాలయ ఉద్యోగుల నుంచి కూడా నివేదికలు తెప్పించుకోవాలని, ఈ నివేదికలను అనుసరించి ఎలాంటి అలసత్వం లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. 8వ తరగతి పిల్లలకు ఇవ్వాల్సిన ట్యాబ్‌లు ప్రస్తుతం లక్షన్నరకు పైగా అందుబాటులో ఉన్నాయని అధికారులు చెప్పారు. అవసరమైనన్ని రాగానే, వాటిలో బైజూస్ కంటెంట్‌ను లోడ్ చేయాలని సీఎం చెప్పారు. 8వ తరగతి విద్యార్థులకు, టీచర్లకు కలిపి మొత్తం 5,18,740 ట్యాబ్‌లు పంపిణీ చేస్తున్నామని, ముందుగా టీచర్లకు పంపిణీ చేసి.. అందులోని కంటెంట్‌పై వారికి అవగాహన కల్పించడం మంచిదని సూచించారు. బైజూస్ కంటెంట్‌ను ప్రభుత్వ పాఠశాలల్లో 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు అందిస్తామని.. అందువల్ల ట్యాబ్‌లు పొందిన 8వ తరగతి విద్యార్థులే కాకుండా మిగతా తరగతుల్లోని విద్యార్థులందరికీ ఈ కంటెంట్‌ను అందుబాటులోకి తీసుకు వస్తున్నామని అధికారులు వివరించారు. ఆ విద్యార్థులు తమ ఇంట్లో ఉన్న సొంత ఫోన్లలో ఈ కంటెంట్‌ను డౌన్లోడ్ చేసుకొనేలా అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. ‘బైజూస్ కంటెంట్‌లోని అంశాలను పాఠ్య పుస్తకాల్లో కూడా పొందు పరచాలి. డిజిటల్ పద్ధతుల్లోనే కాకుండా హార్డ్ కాపీల రూపంలో కూడా ఈ కంటెంట్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. మార్కెట్లో వేల రూపాయలు ఖర్చయ్యే కంటెంట్‌ను విద్యార్థులకు ఉచితంగా అందిసున్నాం. దీన్ని డౌన్లోడ్ చేసుకొని అధ్యయనం చేయడం ద్వారా పిల్లలకు ఎంతో మేలు జరుగుతుంది’ అని సీఎం అన్నారు. ‘విద్యాకానుక’లో ఏ లోటూ ఉండకూడదు ‘నాడు – నేడుకు సంబంధించి ఆడిట్లో గుర్తించిన అంశాలన్నింపై కూడా దృష్టి పెట్టాలి. ఎక్కడ సమస్య వచ్చినా వెంటనే చర్యలు తీసుకునే విధానాన్ని అమలు చేయాలి. నాడు–నేడు కింద తొలి దశలో పనులు పూర్తి అయిన చోట్ల తరగతి గదులను డిజిటలైజేషన్ చేస్తున్నందున ప్రతి స్కూల్లో కూడా జనవరి, ఫిబ్రవరి నాటికి ఇంటర్నెట్ సౌకర్యం ఏర్పాటు చేయాలి. జగనన్న విద్యా కానుకకు సంబంధించి మరింత పకడ్బందీ చర్యలు తీసుకోవాలి. పిల్లలకు ఇచ్చే యూనిఫారం క్లాత్ సైజును అవసరమైన మేరకు పెంచండి. ప్రస్తుతం జతకు ఇస్తున్న కుట్టు కూలి రూ.40ని ఇకపై రూ.50కి పెంచుతున్నాం. స్కూలు బ్యాగు విషయంలో విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలి. వచ్చే ఏడాది నుంచి 1–6 తరగతుల వరకు మీడియం సైజు, 6–10 తరగతుల వారికి పెద్ద బ్యాగు ఇవ్వాలి. షూ సైజులు ఇప్పుడే తీసుకుని, ఆ మేరకు వాటిని నిర్ణీత సమయంలోగా తెప్పించాలి. ఎట్టిపరిస్థితిలో స్కూళ్లు తెరిచే నాటికే విద్యాకానుకను అందించాలి. పీపీ–1, 2 పూర్తి చేసుకున్న అంగన్వాడీ పిల్లలను తప్పకుండా స్కూళ్లలో చేర్పించేలా చర్యలు తీసుకోవాలి’ అని సీఎం అధికారులకు సూచించారు. నాణ్యత పరిశీలనకు థర్డ్ పార్టీగా కేంద్ర ప్రభుత్వ సంస్థ స్కూళ్ల నిర్వహణ మరింత మెరుగవ్వడం కోసం మండల విద్యా శాఖ అధికారితో పాటు మరో అధికారిని పెడుతున్నామని, దీని వల్ల పర్యవేక్షణ మెరుగై మంచి ఫలితాలు వస్తాయని సీఎం తెలిపారు. సెర్ఫ్‌లో పనిచేస్తున్న (ఏపీఎం) అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్లను నాన్ అకడమిక్ వ్యవహారాలను పర్యవేక్షించడానికి నియమిస్తున్నామని అధికారులు వివరించారు. అక్టోబర్ 17 నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందని చెప్పారు. ‘జగనన్న గోరుముద్దకు సంబంధించి నేరుగా స్కూళ్లకే సార్టెక్స్ బియ్యం పంపిణీ చేయాలి. కోడిగుడ్లు పాడవకుండా ఉండేందుకు అనుసరించదగ్గ విధానాలపై దృష్టి పెట్టాలి. మధ్యాహ్న భోజనం నాణ్యతను కచ్చితంగా పాటించాలి. ఇందుకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే ఫిర్యాదు చేయాల్సిన నంబర్ 14417 నంబర్‌ను అన్ని స్కూళ్లలో అందరికీ కనిపించేలా ప్రదర్శించాలి’ అని సీఎం ఆదేశించారు. నాడు–నేడు పనుల కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకూ రూ.1,120 కోట్లు విడుదల అయ్యాయని, పనులు పురోగతిలో ఉన్నాయని అధికారులు తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యాకానుక టెండర్ల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని వివరించారు. ఏప్రిల్ నాటికే కిట్లను సిద్ధం చేయనున్నామని, నాణ్యతను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థను థర్డ్ పార్టీగా పెడుతున్నట్టు సీఎంకు నివేదించారు. ఈ సమీక్షలో సమావేశంలో విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పాఠశాల విద్యా శాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యా శాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఎం వి శేషగిరిబాబు, స్టేట్ అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ (ఎస్ఎస్ఏ) బి శ్రీనివాసులు, విద్యా శాఖ సలహాదారు ఏ మురళి, నాడు–నేడు కార్యక్రమం డైరెక్టర్ డాక్టర్ ఆర్ మనోహరరెడ్డి, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ (ఎస్‌సీఈఆర్‌టి) బి ప్రతాప్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఇబ్రహీంపట్నంలో ఘోరం.. చిన్నారులపైకి దూసుకెళ్లిన స్కూల్ వ్యాన్
సాక్షి, రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం పరిధిలోని శేరిగుడలో మంగళవారం ఉదయం దారుణం జరిగింది. నడుచుకుంటూ వెళ్తున్న విద్యార్థులపైకి ఓ ప్రైవేట్ స్కూల్ వ్యాన్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒక చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే వ్యాన్‌ను అక్కడే వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు. మృతి చెందిన విద్యార్థి స్థానికుడు కాదని.. అతనిది బీహార్‌కు చెందిన కుటుంబంగా గుర్తించారు. మరో విద్యార్థికి తీవ్ర గాయాలయాలు కావడంతో చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించారు. మృతదేహంతో కుటుంబ సభ్యులు సాగర్ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ క్రమంలో భారీగా ట్రాఫిక్ జామ్ కాగా, పోలీసులు జోక్యం చేసుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఇదీ చదవండి: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. చిన్నారిపై కుక్క దాడి! -
హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. చర్లపల్లి జైలు సమీపంలో స్కూల్ ఆటోను ఢీ కొన్న లారీ
-
చిన్నారుల్ని చిదిమేసిన లారీ
కుషాయిగూడ (హైదరాబాద్): సాయంత్రం 5 గంటల సమయం. పాఠశాలలు వదిలేశారు. ఒకేచోట ఉన్న మూడు పాఠశాలలకు చెందిన విద్యార్థులు తాము రోజూ వచ్చే ఆటోలో ఎక్కారు. అందరిలోనూ ఇంటికి వె ళుతున్న సంతోషం. సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. అంతలోనే ఘోరం.. వారు ప్రయాణిస్తున్న ఆటోను లారీ ఢీకొట్టడంతో ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి కిందపడి పల్టీలు కొట్టింది. పిల్లలు చెల్లా చెదురుగా పడిపోయారు. అమ్మా అంటూ ఆర్తనాదాలు మిన్నంటాయి. ఇద్దరు విద్యార్థినులు అక్కడి కక్కడే మరణించారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. రక్తం మడుగులు కట్టింది. చర్లపల్లి చలించిపోయింది. స్థానికు లు హుటాహుటిన చిన్నారుల్ని సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు విద్యార్థినులు మరణించినట్లు ధ్రువీకరించిన వైద్యులు, ఒకరి పరిస్థితి విషమంగా ఉందని, ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు. కుషాయిగూడ పోలీ స్‌స్టేషన్ పరిధిలో గురువారం ఈ ప్రమాదం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఇళ్లకు చేరతారనగా.. చర్లపల్లి ప్రాంతానికి చెందిన తన్మయి (13) కోమలిత (11), రిషిప్రియ, రిషి వల్లభ్, రిషి కుమార్, వర్ణిక ఈసీఐఎల్‌లోని శ్రీ చైతన్య, నారాయణ, రవీంద్రభారతి పాఠశాలల్లో చదువుకుంటున్నారు. ఒకే ప్రాంతానికి చెందిన వారు కావడంతో వీరంతా రోజూ ఒకే ఆటోలో స్కూళ్లకు వచ్చి వెళ్తుంటారు. రోజులానే గురువారం ఉదయం కూడా స్కూల్‌కు వచ్చి సాయంత్రం ఇంటికి బయలుదేరారు. ఆటో బయలుదేరిన పది నిమిషాలకు, కాసేపట్లో ఇళ్లకు చేరతారనగా ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. చక్రిపురం చౌరస్తా మీదుగా చర్లపల్లి జైలు దాటి వెళ్తున్న క్రమంలో ఎదురుగా వచ్చిన లారీ (ఏపీ 28 టీడీ 0599) అదుపుతప్పి పిల్లలతో వెళ్తున్న ఆటోను (టీఎస్ 34 టీ 4311) వేగంగా ఢీ కొట్టింది. దీంతో ఆటో పల్టీలు కొడుతూ నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో నారా యణ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న తన్మయి (13), శ్రీ చైతన్య స్కూల్లో 7వ తరగతి చదువుతున్న కోమలిత (11) చనిపోగా మిగతా నలుగురు గాయపడ్డారు. రవీంద్రభారతి స్కూల్లో 7వ తరగతి చదువుతున్న వర్ణిక పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను యశోద ఆసుపత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ వినోద్‌కు కూడా తీవ్ర గాయాలు కాగా లారీ డ్రైవర్ పరారయ్యాడు. ఘోర దుర్ఘటనతో చర్లపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
స్కూళ్లలో బాలలపై లైంగిక వేధింపులకు చెక్
సాక్షి అమరావతి: సుప్రీంకోర్టు, హైకోర్టు జువెనైల్ జస్టిస్ కమిటీ ఆదేశాల మేరకు సూళ్లలో పిల్లలపై లైంగిక వేధింపుల నివారణకు పాఠశాల విద్యాశాఖ కఠిన చర్యలు చేపట్టింది. లైంగిక వేధింపులు, పోక్సో చట్టం గురించి పిల్లల్లో అవగాహన కల్పించాలని ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్లు, జిల్లా విద్యా శాఖాధికారులను ఆదేశించింది. రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల పరిధిలోని అన్ని పాఠశాలల్లో పోస్టర్లు, ఫిర్యాదు పెట్టెలు ఉంచాలని తెలిపింది. విద్యార్థులందరికీ కనిపించేలా పోస్టర్లు ఉంచాలని, తగిన పరిమాణంలో తగిన మెటీరియల్‌తో కూడిన ఫిర్యాదు పెట్టె హెడ్మాస్టర్ గది వెలుపల ఉంచాలని సూచించింది. ఫిర్యాదులను ఈ పెట్టెలో వేయవచ్చు. ఇతర ప్రధాన సూచనలు పోస్టర్లలో ఏకరూపత ఉండాలి. పోస్టర్ల ముద్రణ, ఫిర్యాదు పెట్టె కోసం పాఠశాల నిర్వహణ గ్రాంట్ నుండి నిధులు తీసుకోవచ్చు. తాళం ఉండే ఏదైనా చిన్న పెట్టెను ఫిర్యాదు పెట్టెగా ఉపయోగించవచ్చు మండల విద్యాధికారి, ఇతర విభాగాల అధికారుల సమక్షంలో సమీపంలోని పోలీస్ స్టేషన్ మహిళా కానిస్టేబుల్, ఏఎన్ఎం 15 రోజులకు ఒకసారి ఫిర్యాదు పెట్టెను తెరిచి, అందులో ఉన్న ఫిర్యాదులను చదవాలి ఫిర్యాదుపై అవసరమైన చర్యలకు వారు సంబంధిత శాఖకు తెలపాలి ఏ విధంగానూ, ఏ సమయంలోనూ ఫిర్యాదుదారు వివరాలను బహిర్గతం చేయకూడదు. అత్యంత గోప్యంగా ఉంచాలి. ఎంఈవోలు డీఈవోలకు రెగ్యులర్ రిపోర్టును పంపాలి డీఈవో ప్రతి నెలా 1, 15 తేదీల్లో ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌కి నివేదిక పంపాలి (చదవండి: ‘డిజిటల్’ ఫిష్: ‘ఫిష్ ఆంధ్ర’కు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం ) -
పిల్లలు 7 గంటలకే స్కూల్‌కు వెళ్తుంటే... మేం తొమ్మిదింటికి కోర్టుకు రాలేమా?
సాక్షి, న్యూఢిల్లీ: ‘మన పిల్లలు ఉదయం ఏడు గంటలకే పాఠశాలకు వెళ్తుంటే అప్పుడు మనం 9 గంటలకే కోర్టుకు రాలేమా?’’అని సుప్రీంకోర్టులో రెండో సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ పేర్కొన్నారు. శుక్రవారం జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ ఎస్.రవీంద్రభట్, జస్టిస్ సుధాంశు ధూలియాలతో కూడిన ధర్మాసనం ఉదయం 9.30 గంటలకే కోర్టు ప్రొసీడింగ్స్ ప్రారంభించింది. ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కావాల్సిన ప్రొసీడింగ్స్ 9.30 గంటలకే ప్రారంభం కావడాన్ని సీనియర్ న్యాయవాది ముకుల్ రొహత్గి ప్రశంసించగా జస్టిస్ లలిత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘పిల్లలు ఉదయం 7 గంటలకు స్కూల్‌కి వెళ్లగలిగినప్పుడు, 9 గంటలకు మనం ఎందుకు రాలేమని నేనెప్పుడూ అంటుంటాను. కోర్టుల్లో కార్యకలాపాలు ఉదయం 9.30 గంటలకు మొదలైతే మరీ మంచిది‘ అని ఆయన అన్నారు. ‘కోర్టులు ముందుగా మొదలైతే, విధులను కూడా తొందరగానే ముగించొచ్చు. తర్వాతి రోజు కేసుల అధ్యయనానికి సాయంత్రం ఎక్కువ సమయం ఉంటుంది’ అన్నారు. ఆగస్ట్ చివరికి ఈ ఏర్పాట్లు మొదలవుతాయని భావిస్తున్నానని రొహత్గి పేర్కొనగా, ఇవి కొన్ని మాత్రమేనని జస్టిస్ లలిత్ చెప్పారు. సుప్రీంకోర్టుల్లో విచారణలు సాధారణంగా ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు జరుగుతుంటాయి. ఆగస్ట్ 26వ తేదీన రిటైర్ కానున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ స్థానంలో జస్టిస్ లలిత్ బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. -
ధైర్యం చెప్పి.. థింసా స్టెప్పులేసి.. పిల్లలతో సరదాగా గడిపిన ఎస్పీ
భువనేశ్వర్: ఆమె ఓ జిల్లాకు పోలీస్ బాస్. నిత్యం నేర సమీక్షలు, శాంతి, భద్రతల పరిరక్షణ, సిబ్బంది విధులపై పర్యవేక్షణ, ఫిర్యాదుదారులతో నిత్యం క్షణం తీరికలేకుండా ఉంటారు. ఐపీఎస్‌గా ఉన్నా.. ఆశ్రమ చిన్నారులతో కలిసి ఆడిపాడారు. నేనున్నానంటూ వారిలో మానసిక ధైర్యం నింపారు. ఆమె.. నవరంగ్‌పూర్ జిల్లా ఎస్పీ ఎస్.సుశ్రీ. నవరంగ్‌పూర్ జిల్లా కేంద్రం సమీపం లోని ప్రభుత్వ ఆధ్యర్యంలో నిర్వహిస్తున్న దీనదయాల్ ఆశ్రమాన్ని ఎస్పీ గురువారం సందర్శించారు. ఆమెతో పాటు కలెక్టర్ కమలోచన్ మిశ్రా ఉన్నారు. వీరిద్దరూ బాలికలకు మిఠాయిలు, మామిడి పళ్లు పంచిపెట్టారు. ఎస్పీ చొరవ కల్పించుకొని బాలికలలో ఒకరిగా కలసిపోయి కులాశాగా కబుర్లు చెప్పారు. ఈ నేపథ్యంలో చిన్నారులంతా కొరాపుటియా థింసా నృత్యం చేయగా.. సుశ్రీ కూడా వారితో జత కలిసి, స్టెప్పులేశారు. స్వయానా జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ తమతో డ్యాన్స్ చేస్తుండటంతో బాలికలు మరింత ఉత్సాహంగా ఆమెకు సూచనలు చేస్తూ ముందుకు సాగారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చూసిన వారంతా ఎస్పీ చొరవను అభినందిస్తున్నారు. చదవండి: వింత ఆచారం: కొరడాతో మహిళలను కొట్టి, ఈలలు వేస్తూ.. -
తప్పు చేశాం.. టెక్సాస్ నరమేధంపై పోలీసుల ప్రకటన
టెక్సాస్ యువాల్డే రాబ్ ఎలిమెంటరీ స్కూల్ మారణహోమంపై టెక్సాస్ పోలీసులు కీలక ప్రకటన చేశారు. సుమారు గంటపాటు ఆగిన తర్వాత లోపలికి ప్రేవేశించడాన్ని తప్పుడు నిర్ణయంగా పేర్కొంటూ క్షమాపణలు తెలియజేశారు. టెక్సాస్ పబ్లిక్ సేఫ్టీ హెడ్ స్టీవెన్ మాక్క్రా ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన చేశారు. టెక్సాస్ స్కూల్ కాల్పుల ఘటన సమయంలో.. సుమారు గంటపాటు వేచిచూసే ధోరణి అనేది తప్పుడు నిర్ణయంగా అభివర్ణించారు ఆయన. ముందుచూపు లేకుండా తీసుకున్న నిర్ణయం ఘోరానికి కారణమైందని పేర్కొన్నారు ఆయన. దుండగున్ని కాల్పులు జరపకుండా కాసేపు నిలువరించగలిగినా సరిపోయి ఉండేదని ఆయన అభిప్రాయపడ్డాడు. ఘటన సమయంలో త్వరగా స్పందించి ఉండాలని మీరైతే ఎలా అనుకుంటున్నారో.. మేమూ అదే అనుకుంటున్నాం. ఒకవేళ అదే గనుక నష్టనివారణ మార్గం అనుకుంటే.. నేను మీకు క్షమాపణలు చెప్తున్నా.. అంటూ మీడియా సాక్షిగా బాధిత కుటుంబాలకు ఆయన క్షమాపణలు తెలియజేశాడు. టీచర్లతో పాటు కొందరు పిల్లలు కూడా 911 కి ఫోన్ చేసి సాయం కోసం ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పిల్లల్ని రక్షించే అవకాశాలు ఉన్నా సకాలంలో పోలీసులు స్పందించలేదని తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు. మంగళవారం రాబ్ ఎలిమెంటరీ స్కూల్లో నరమేధం సృష్టించిన సాల్వడోర్ రామోస్(18)ను మట్టుపెట్టడానికి.. ఒక గంట సమయం పట్టింది. ఆ సమయంలో కొందరు పోలీసులు బయట ఉండగా.. పేరెంట్స్ దూసుకెళ్లే ప్రయత్నాలు చేశారు. దీంతో పోలీసులు వాళ్లను అడ్డుకున్నారు. ఉదయం 11.30 గం. ప్రాంతంలో సాల్వడోర్ స్కూల్లోకి ప్రవేశించగా.. సుమారు 48 నిమిషాలపాటు కాల్పులు కొనసాగాయి. అయితే మధ్యాహ్నం 12.50 గం. ప్రాంతంలో యూఎస్ బార్డర్ పాట్రోల్ ఏజెంట్లు తలుపులు బద్ధలు కొట్టి కాల్చి చంపారు. చదవండి: ఆ చిన్నారి ఒంటికి రక్తాన్ని పూసుకుని బతికి బయటపడింది -
బడికెళ్లాలంటే కాలి నడకే శరణ్యం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 48 శాతం మంది విద్యార్థులు కాలినడకనే పాఠశాలలకు వెళ్తున్నట్లు కేంద్ర విద్యా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ అచీవ్మెంట్ సర్వే(ఎన్ఏఎస్)–2021లో తేలింది. 18 శాతం మంది సైకిళ్లపై పాఠశాలలకు చేరుకుంటున్నట్లు వెల్లడయ్యింది. స్కూల్ ట్రాన్స్‌పోర్టు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్టును ఉపయోగించకుంటున్నవారు కేవలం 9 శాతం మంది ఉన్నారు. 8 శాతం మంది సొంత వాహనం(టూ వీలర్)పై, 3 శాతం మంది సొంత కార్లలో స్కూలుకు వెళ్తున్నారు. పిల్లల విద్యాభ్యాసం విషయంలో కనీసం 25 శాతం స్కూళ్లకు విద్యార్థుల తల్లిదండ్రుల మద్దతు లేదని సర్వేలో గుర్తించారు. దేశంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 720 జిల్లాల్లో 1.18 లక్షల స్కూళ్లకు చెందిన 34 లక్షల మంది విద్యార్థులు ఈ సర్వే పాల్గొన్నారు. ఇందులో భాగంగా గత ఏడాది నవంబర్ 12న 3, 5, 8, 10 తరగతుల విద్యార్థులను ప్రశ్నించారు. ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్, ప్రైవేట్ స్కూళ్లలో సర్వే చేపట్టారు. చివరిసారిగా 2017లో ఎన్ఏఎస్ సర్వే జరిగింది. -
ఇదేం న్యాయం.. మా ఆడబిడ్డల సంగతి ఏంటి?
తాలిబన్ల బుద్ధి.. వంకర బుద్ధి. ఏం జరిగినా.. అది మారదు. ఈ మాట అంటోంది అఫ్గన్ పౌరులే. తాలిబన్ల పాలనలో గతంలో కంటే పరిస్థితి ఇంకా దిగజారుతోందనేది వాళ్ల ఆవేదన. ఇందుకు ఉదాహరణగా బాలికల విద్యను హరిస్తూ.. వాళ్ల హక్కులను కాలరాయడం గురించి ప్రస్తావిస్తున్నారు. ఆఖరికి ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకున్నా.. తాలిబన్లు మాత్రం వెనక్కి తగ్గట్లేదు!. ఇస్లామిక్ ఎమిరేట్ అలియాస్ తాలిబన్ సర్కార్.. అంతర్జాతీయ సమాజంలో గుర్తింపు కోసం ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. అది దొరికితేనే.. నిలిచిపోయిన నిధులు అఫ్గన్ గడ్డకు చేరేది, సంక్షోభం నుంచి తేరుకునేది. అయితే హేయనీయమైన తాలిబన్ల తీరు వల్లే అది జాప్యం అవుతోంది. మహిళలకు స్వేచ్ఛ, ప్రజాస్వామ్యయుతమైన విధానాలతో తమ పాలనలో కొత్త అఫ్గనిస్థాన్‌ను చూస్తారంటూ హామీలు ఇచ్చిన తాలిబన్లు.. నీటి మీద రాతల్లాగే ఉన్నాయి. తీరు మార్చుకోకుండానే ముందుకు పోతున్నట్లు తాలిబన్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అఫ్గనిస్థాన్‌లో అమ్మాయిలు.. విద్యాఉద్యోగాలు, క్రీడారంగానికి క్రమక్రమంగా దూరం అవుతున్నారు. అదే సమయంలో తాలిబన్ నేతలు మాత్రం వాళ్ల పిల్లలను విదేశాల్లో చదివిస్తూ.. స్వేచ్ఛగా బతకనిస్తున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న తాలిబన్ కేబినెట్లో పాతిక మంది దాకా తమ పిల్లలను పొరుగున ఉన్న పాక్‌లోని పెషావర్, కరాచీలో.. ఇంకొందరు దోహాలోని స్కూల్స్‌లో పిల్లలను చదివించుకుంటున్నారు. వాళ్లలో ఆరోగ్య మంత్రి ఖ్వాలందర్ ఎబాద్, విదేశాంగ ఉపముఖ్యమంత్రి షేర్ మహమ్మద్ అబ్బాస్ స్టానిక్జాయ్, తాలిబన్ అధికార ప్రతినిధి సుహెయిల్ షాహీన్‌లు ఉన్నారు. సుహెయిల్ షాహీన్ పిల్లలు ఏకంగా దోహాలోని ఇస్లామిక్ ఎమిరేట్స్ అధికారిక కార్యాలయంలో నివాసం ఉంటున్నట్లు తెలుస్తోంది. ఆయనగారి పెద్ద కూతురు ఏకంగా ఫుట్‌బాల్ టీంలో సభ్యురాలిగా ఉందట. ఖ్వాలందర్ కూతురు ఇస్లామాబాద్‌లో మెడిసిన్ చదువుతోంది. ఆమె టెన్నిస్ ఛాంపియన్. మరో ఇద్దరు కీలక నేతల కూతుళ్లు సైతం దోహాలోని ఓ ప్రముఖ విద్యాసంస్థలో చదువుతున్నారట. ఈ అంశాలనే ప్రస్తావిస్తూ.. తమకూ స్వేచ్చను ఇవ్వాలని ప్రధాన ప్రాంతాల్లో నిరసనలు కొనసాగిస్తున్నారు మహిళలు. అయితే.. ఈ అంశంపై నిర్ణయం తమ చేతుల్లో లేదని, త్వరలో భేటీ అయ్యి తుది నిర్ణయం తీసుకుంటామని తాలిబన్ ప్రతినిధులు చెప్తున్నారు. మార్చిలో బడులు తెరిచారని ఆనంద పడ్డ బాలికలకు.. ప్రవేశం లేదంటూ పిల్లలను వెనక్కి పంపి గట్టి షాకే ఇచ్చారు అక్కడి విద్యాశాఖ అధికారులు. మళ్లీ పెళ్లిళ్లు! ఇదిలా ఉంటే తాలిబన్ నేతలు ఓ కొత్త ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. చదువుకున్న మహిళలను రెండో వివాహం చేసుకుంటున్నారు. అజ్ఞాతంలో ఉన్నంత కాలం తాము నాగరికతలో వెనుకబడిపోయామన్న భావనలో ఉన్న వాళ్లు.. మొదటి భార్యలకూ లోక జ్ఞానం లేదనే నిర్ణయానికి వచ్చేసి.. చదువుకున్నవాళ్లను మళ్లీ పెళ్లి చేసుకుని పట్టణాలు, నగరాల్లో కాపురాలు పెడుతున్నారు. రాజకీయ నాయకులే కాదు.. సివిల్ సర్వెంట్లు, ఇతర అధికారులు కూడా ఇప్పుడు ఇదే ట్రెండ్‌ను ఫాలో అవుత్నున్నారు.. -
అదసలు ఆటోనేనా? స్కూల్ పిల్లలను కుక్కేసి మరీ..
చెన్నై: పిల్లలను బడులకు పంపే తల్లిదండ్రులు.. వాళ్ల భద్రత విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకుండా ఉంటారా?. అయినా కూడా ఎక్కడో ఒక దగ్గర నిర్లక్ష్యం, అజాగ్రత్త వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా తమిళనాడులో ఓ ఘటనకు సంబంధించిన వీడియో ట్విటర్, ఫేస్బుక్లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఒక స్కూల్ ఆటోలో పిల్లలను జంతువుల్లాగా కుక్కేసి మరీ తీసుకెళ్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. బయట గ్రిల్ నుంచి చూస్తే.. ఒకరిపై మరొకరు నిల్చుని, వేలాడుతూ బడికి వెళ్తున్నారు. మరోపక్క ఓపెన్ వైపు కూడా ఒకరి మీద మరొకరు ఇరుక్కుగానే కూర్చుని ఉన్నారు. ఇది చూసి ఓ వ్యక్తి.. అదంతా వీడియో తీశాడు. అంతటితోనే ఆగకుండా.. అక్కడే ఉన్న టీచరమ్మను ‘ఏంటి ఇదంతా?’ అని నిలదీశాడు. అయితే ఆమె మాత్రం ఏదో సర్దిచెబుతూ.. అక్కడి నుంచి నెమ్మదిగా జారుకుంది. టెంకాశీలో జరిగిన ఈ వీడియో వైరల్ అయ్యి.. మీడియాకు చేరింది. తమిళనాడులో తాజాగా ఓ విషాద ఘటన జరిగింది. చెన్నైలోని ఓ ప్రైవేట్ స్కూల్ ఆవరణలో.. మ్యూజిక్ వింటూ స్కూల్ బండి నడిపిన ఓ డ్రైవర్, ఎనిమిదేళ్ల చిన్నారిని చిదిమేశాడు. ఈ నేపథ్యంలో.. తాజా వీడియో ఘటన తల్లిదండ్రుల్లో మరింత ఆగ్రహానికి కారణమైంది. మరోపక్క వైరల్ అయిన ఈ వీడియోపై దర్యాప్తు చేయిస్తామని, స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. ఇంకోపక్క పిల్లలను ఇలా ప్రైవేట్ వాహనాల్లో పంపేటప్పుడు జాగ్రత్తగా పరిశీలించాలని పలువురు నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. సన్ న్యూస్ సౌజన్యంతో.. -
Sakshi Cartoon: పోలీసులకు ఫిర్యాదు చేసిన మూడో తరగతి విద్యార్థి
ఎంత సేపయినా ఆడుకోనివ్వండి.. హోం వర్క్ చేయనీ, చేయకపోనీ చెయ్ చేసుకోకండి! -
పిల్లలకు బోర్ కొట్టిస్తున్న సంక్రాంతి సెలవులు
సాక్షి, హైదరాబాద్: ‘సెల్ ఫోన్‌తో ఆడుకోవడం లేదా డల్‌గా పడుకోవడం’.. ప్రస్తుత సంక్రాంతి సెలవుల్లో పిల్లలు చేసేది ఇదే అంటున్నారు చాలామంది తల్లిదండ్రులు. కరోనా పుణ్యమాని ఉత్సాహంగా ఊరెళ్లే పరిస్థితి లేదు. ఆనందంగా అయిన వాళ్లను రమ్మనే అవకాశం లేదు. కనీసం పక్కింటి పిల్లలతో ఆడుకుందామన్నా ఆందోళన.. వెరసి సంక్రాంతి సెలవులు విద్యార్థులకు బోర్ కొట్టిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అర్ధరాత్రి వరకు సెల్ పట్టుకుని, అదే పనిగా ఆన్లైన్ గేమ్స్ ఆడుతుంటే మౌనంగా చూడటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడిందని తల్లిదండ్రులు వాపోయారు. సరే అని కట్టడి చేస్తే ఏదో కోల్పోయినట్టుగా ఉండిపోతున్నారని చెప్పారు. కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో విద్యార్థులు కనీసం పక్కింటి పిల్లలతో ఆడుకోవడానికి కూడా సంశయించాల్సి వస్తోంది. కరోనా పరిస్థితుల్లో వచ్చిన సంక్రాంతి సెలవుల్లో స్కూల్ పిల్లల దిన చర్యను ‘సాక్షి’క్షేత్రస్థాయిలో తెలుసుకునే ప్రయత్నం చేసింది. కొన్ని ప్రాంతాల్లోని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను పలకరించింది. ఇంట్లో బందీగా పిల్లలు ‘ఇది వరకు సంక్రాంతి సెలవులొస్తే చాలు పిల్లాడిని పట్టుకోవడం కష్టంగా ఉండేది. పొద్దున లేస్తే గాలి పటాల గోలే. ఇప్పుడు ఇల్లు కదలడం లేదు. బయట కూడా అంతా సందడిగా ఉండేది. ఇప్పుడా వాతావరణం లేదు..’ అని వరంగల్ పట్టణానికి చెందిన లలిత చెప్పారు. కరోనా భయంతో పిల్లల్ని ఇల్లు కదలనివ్వడం లేదు. ఇంటికి వేరే పిల్లల్నీ రానివ్వడం లేదు. పక్క పక్క ఇళ్ళవాళ్ళయితే కాస్త సర్దుకుపోతున్నారు. అదీకూడా వాళ్ళింటికి కొత్తవాళ్ళు ఎవరూ రాకపోతేనే. నిజానికి సంక్రాంతి పండగొస్తే పోస్టాఫీసు కాలనీ మొత్తం హడావిడిగా ఉంటుందని, ఎక్కడెక్కడి నుంచో గాలి పటాలు ఎగరెయ్యడానికి, ఆటల పోటీల్లో పాల్గొనడానికి వస్తుంటారని హన్మకొండ పోస్టాఫీసు కాలనీకి చెందని రవి తెలిపారు. ఇప్పుడు అవేవీ కన్పించడం లేదని అన్నారు. పక్క వీధిలోని ఫ్రెండ్ ఇంటికి తన కొడుకు వస్తానంటే, అతని తల్లిదండ్రులు ‘రోజులు బాగోలేవు కదా’అని సున్నితంగా వద్దని చెప్పారని వెల్లడించారు. రెండేళ్ళ క్రితం చూసిన ముగ్గుల పోటీలు, కబడ్డీ ఆటలు, కుస్తీ పోటీలు ఏవీ పిల్లలు ఎంజాయ్ చేసే పరిస్థితి కన్పించడం లేదని అన్నారు. అమ్మమ్మ ఇంటికెళ్ళినా అదే సీన్... ‘నేనొచ్చానని అమ్మమ్మ ఎన్నో పిండి వంటలు చేసింది. కొత్త దుస్తులూ కొన్నది. కానీ ఇల్లు మాత్రం దాటనివ్వడం లేదు..’అని కరీంనగర్ జిల్లా కమాన్‌పూర్‌లో అమ్మమ్మ ఇంటికొచ్చిన 9వ తరగతి విద్యార్థి రామకృష్ణ అసంతృప్తి వ్యక్తం చేశాడు. నిజానికి ఆ ఊళ్ళో వారం రోజులుగా పరిస్థితి బాగాలేదు. జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. కొన్నిచోట్ల మనవళ్లు, మనవరాళ్లు ఊరికి వస్తామన్నా వద్దన్న ఘటనలున్నాయి. ఖమ్మం పట్టణంలో ఉంటున్న చంద్రం దంపతులు.. తమ ఇంటికి హైదరాబాద్ నుంచి మనవడు, మనమరాలు సంక్రాంతికి వస్తామన్నా.. వద్దన్నారు. ‘రోజులు బాగోలేవు. ఇక్కడ వాళ్ళకు ఏవైనా వచ్చినా వాళ్ళనే అంటారు. వాళ్ళకు ఏమైనా అయినా మాటొస్తుంది’అని చంద్రం వ్యాఖ్యానించారు. కొత్త గేమ్స్ కోసం వేట లాక్డౌన్లో విద్యార్థులు ఆడే గేమ్స్‌పై సూపర్ స్కూల్స్ అనే సంస్థ ఓ సర్వే చేపట్టింది. ఆన్లైన్ గేమ్స్ విషయంలోనూ పిల్లల్లో ఒకింత అసంతృప్తి వ్యక్తమవుతోందని ఆ సంస్థ సీఈవో భానూ ప్రసాద్ తెలిపారు. పబ్జీ, క్యాండీ క్రష్, యాంగ్రీ బర్డ్, సబ్వే సర్ఫర్స్, టెంపుల్ రన్ వంటి ఆటలు వాళ్ళకు పెద్దగా కిక్కెకించడం లేదు. దీంతో కొత్త కొత్త గేమ్స్ ఏమొచ్చాయా అనే దిశగా నెట్లో వెతుకుతున్నారు. కరోనా కారణంగా బయటకెళ్ళే అవకాశం లేకపోవడంతో 24 గంటలూ సెల్‌ఫోన్ గేమ్స్‌పై ఆధారపడుతున్నారని సర్వేల్లో తేలింది. సంక్రాంతి సెలవుల్లోనూ ఇదే కన్పిస్తోందని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇక్కడే జాగ్రత్తగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. గేమ్స్ మోజులో నెట్ లింక్స్ తెలియకుండా క్లిక్ చేస్తే తలిదండ్రుల బ్యాంకు సమాచారం తెలుసుకుని, సైబర్ నేరగాళ్ళు దాడి చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. పిల్లల మానసిక స్థితిపై ప్రభావం కరోనా కాలంలో పిల్లలకు ఆన్లైన్ విద్య కోసం తల్లిదండ్రులే ఫోన్లు కొనిచ్చారు. ఇప్పుడు వాళ్ళ జీవితంలో అది అంతర్భాగమైంది. సెలవులొస్తే చాలు ఫిజికల్ గేమ్స్ గురించి వాళ్ళు అసలు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు కరోనా ఉధృతి దీనికి మరింత అవకాశం ఇచ్చింది. ఎంతసేపూ మొబైల్ పట్టుకుని కాలం గడిపేస్తున్నారు. ఇది విద్యార్థి మానసిక స్థితిలో మార్పు తెస్తుంది. తల్లిదండ్రులు ఈ విషయంలో జాగ్రత్త వహించాలి – పణితి రామనాథం (ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు, బూర్గుంపాడు, కొత్తగూడెం జిల్లా) సెల్ఫోన్లకు దూరంగా ఉంచాలి సెల్ ఆటలే విద్యార్థులకు శరణ్యం అయినట్టయ్యింది. అయితే ఇవి హద్దుమీరడానికి నియంత్రణ లేకపోవడమే కారణం. పిల్లల్ని తల్లిదండ్రులు అలా వదిలేయకూడదు. వాళ్ళ బాగుకోరి కొంతసేపైనా సెలవుల్లో పుస్తకాల పఠనం వైపు దృష్టి మళ్లించే ప్రయత్నం చేయాలి. తల్లిదండ్రులూ వాళ్ళతో ఆడుకుంటూ, సెల్ఫోన్లకు దూరంగా ఉండేలా చేయడం మంచిది. – శ్రీధర్ (భారత్ పబ్లిక్ స్కూల్, కోదాడ) -
15-18 యేళ్ల వయసు వారికి జనవరి 3 నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్!
Vaccine Registration For Children న్యూఢిల్లీ: 15 - 18 యేళ్లలోపు పిల్లలకు జనవరి 1 నుంచి కోవిడ్ - 19 వ్యాక్సిన్‌కు రిజిస్ట్రేయన్ చేసుకోవల్సిందిగా ప్రభుత్వం సోమవారం తెల్పింది. స్కూల్ ఐడీ కార్డులను ఉపయోగించి కోవిన్ యాప్‌లో నమోదు చేసుకోవాలని సూచించింది. ఇందుకోసం ఆన్లైన్ ప్లాట్‌ఫాంలో మరో స్లాట్ రూపొందించినట్లు కోవిన్ చీఫ్ డాక్టర్ ఆర్ఎస్ శర్మ మీడియాకు తెలిపారు. కాగా 15-18 మధ్య వయసున్న పిల్లలకు జనవరి 3 నుంచి తొలి రౌండ్ కోవిడ్ వ్యాక్సిన్లు వేయనున్నారు. అలాగే ఫ్రంట్‌లైన్, హెల్త్‌కేర్ వర్కర్లకు, 60 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోస్‌లు వేయనున్నారు. పిల్లలకు టీకాలు వేయడం ద్వారా స్కూళ్లు, విద్యార్ధులు సాధారణ స్థితికి చేరుకుంటారని, ఇప్పటికే అనేక దేశాల్లో ఈ ప్రక్రియ పూర్తచేశాయని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం పేర్కొన్న సంగతి తెలిసిందే. భారత్ బయోటిక్స్ డబుల్ డోస్ కోవాగ్జిన్ లేదా జీడస్ కడిలాస్ థ్రీ డోస్ జికోవ్-డి ఈరెండు వ్యాక్సిన్లలో ఒకటి 12 ఏళ్లు పైబడిన పిల్లలకు వేయబడతాయి. సిరమ్ ఇన్స్టిట్యూట్కు చెందిన ‘నోవావ్యాక్స్'ను 7 - 11 ఏళ్ల మధ్య పిల్లలపై, అలాగే బయోలాజికల్ ఈ కి చెందిన ‘కార్బెవ్యాక్స్'ను ఐదేళ్లు నిండిన పిల్లలపై ట్రయల్స్ పూర్తి చేసినట్లు డ్రగ్ కంట్రోలర్ ఇప్పటికే ధృవీకరించింది. ఐతే ఈ రెండు వ్యాక్సిన్లు ఉపయోగానికి ఇంకా అనుమతి పొందలేదు. పాఠశాలల్లో కోవిడ్ కేసులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో పిల్లలకు టీకాలు వేయడం ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించారు. మన దేశంలో ఇప్పటివరకు 141.7 కోట్ల వ్యాక్సిన్లు పూర్తి చేసింది. ఐతే 58.1 కోట్ల మందికి మాత్రమే రెండవ డోస్ పూర్తయ్యింది. కాగా గడచిన 24 గంటల్లో కొత్తగా 6,500 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే ఈ సంఖ్య 6.5 శాతం తక్కువ. అలాగే కొత్తవేరియంట్ ఒమిక్రాన్ కేసులు సోమవారం ఉదయం నాటికి 578కి పెరిగాయి. చదవండి: పరిస్థితి చేయి దాటుతోందా? ఒక్క రోజులోనే లక్ష కోవిడ్ పాజిటివ్ కేసులు.. -
మృత్యువుతో పోరాడుతున్న వరుణ్ సింగ్.. వైరలవుతోన్న లేఖ
న్యూఢిల్లీ: తమిళనాడు కూనూర్ వద్ద డిసెంబర్ 8న చోటు చేసుకున్న హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్ దంపతులతో సహా 13 మంది మృతి చెందారు. ప్రమాద సమయంలో హెలికాప్టర్లో 14 మంది ఉండగా.. వీరిలో గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వరుణ్ సింగ్ ప్రస్తుతం బెంగళూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో వరుణ్ సింగ్ రెండు నెలల క్రితం అనగా సెప్టెంబర్ 21, 2021న తాను చదువుకున్న పాఠశాల ప్రిన్సిపల్‌కు రాసిన ఓ లేఖ తాజాగా సోషల్ మీడియాలో వైరలవుతోంది. చండి టెంపుల్, ఆర్మీ పబ్లిక్ స్కూల్లో వరుణ్ సింగ్ చదువుకున్నారు. చదవులో సామాన్య ప్రతిభ కనబరిచే విద్యార్థులనుద్దేశించి ఈ లేఖ రాశారు వరుణ్ సింగ్. (చదవండి: బెంగళూరు ఆస్పత్రికి వరుణ్ తరలింపు.. 48 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేం) ‘‘మీరు చదువులో యావరేజ్ స్టూడెంట్స్ అని ఎప్పుడు బాధపడకండి. చదువులో సామాన్యమైన విద్యార్థిగా ఉండటం తప్పేం కాదు. ప్రతి ఒక్కరు 90 శాతం మార్కులు తెచ్చుకోలేరు. ఒకవేళ మీరు మంచి మార్కులు తెచ్చుకునే విద్యార్థులు అయితే మీకు నా అభినందనలు. ఒకవేళ మీరు ర్యాంకర్ కాకపోయినా బాధపడకండి. చదువులో సామాన్య విద్యార్థి అయినందున మీ జీవితం కూడా అలానే ఉంటుంది అని భావించకండి’’ అని వరుణ్ సింగ్ సూచించారు. ‘‘మీకు దేని మీద ఆసక్తో దాన్ని గుర్తించండి. సంగీతం, నటన, రచన ఏది అయినా కావచ్చు. దానిలో రాణించేందుకు శ్రమించండి. చదువులో నేనూ యావరేజ్ స్టూడెంట్‌నే. ఎప్పుడు టాప్ మార్కులు రాలేదు. ఇక తొలిసారి నన్ను స్క్వాడ్రన్‌లో యువ ఫ్లైట్ లెఫ్టినెంట్‌గా నియమించిన్పుడు చాలా కంగారు పడ్డాను. ఆ తర్వాత నాకు ఓ విషయం అర్థం అయ్యింది. నేను కనుక నా మనసు, బుద్ధిని దీని మీదే కేంద్రీకరిస్తే.. చాలా అద్భుతంగా పని చేయగలనని తెలిసి వచ్చింది. ఆ రోజు నుంచి నేను అత్యుత్తమంగా పని చేయడం ప్రారంభించాను’’ అని వరుణ్ సింగ్ రాసుకొచ్చారు. (చదవండి: ప్రమోషన్ వచ్చేలోపే ఒకరు.. 31 ఏళ్ల తర్వాత రాఖీ కట్టించుకుని మరొకరు) ‘‘నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఉన్నప్పుడు నేను చదువలో, క్రీడల్లో రాణించలేదు. కానీ ఫ్లైట్ లెఫ్టినెంట్‌గా నియమించినప్పుడు నేను దాని మీద మనసు పెట్టాను. ఆ తర్వాత నాకు విమానాల పట్ల మక్కువ పెరిగింది. అలా నేను మెరుగ్గా పని చేస్తూ.. జీవితంలో ఎదిగాను. తొలుత నేను నా వాస్తవ సామర్థ్యాలను విశ్వసించలేదు. ఈ విషయం నాకు అర్థం అయిన తర్వాత నేను వెనుతిరిగి చూడలేదు. మీరు కూడా మీ మీద నమ్మకం పెట్టుకొండి. మీకు నచ్చిన రంగంలో రాణించేందుకు కృషి చేయండి. మార్కులు మన జీవితానికి కొలమానం కాదు’’ అన్నారు వరుణ్ సింగ్. అంతేకాక తాను శౌర్య చక్ర అవార్డు అందుకోవడానికి ఆర్మీ స్కూలే కారణమని వరుణ్ సింగ్ తన లేఖలో తెలిపారు. విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేలా ఉన్న ఈ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. 'It's ok to be mediocre' Inspiring letter of Group Captain Varun Singh, lone survivor in helicopter crash, to principal of his school with request to share it with teenaged students to motivate them. Sharing the wonderful journey & beautiful thoughts of the braveheart with u. pic.twitter.com/vSpymhMg0p — Arun Bothra 🇮🇳 (@arunbothra) December 9, 2021 చదవండి: ఊరే అతడింటికి కదిలొచ్చింది -
కర్నూలు: ‘సార్ వీడు నా పెన్సిల్ తీసుకున్నాడు.. కేసు పెట్టండి’
సాక్షి, కర్నూలు: బాల్యం అంటే ఎన్నో మధురానుభూతుల సమ్మేళనం. కల్మషం లేని మనసు.. బోసి నవ్వులు, దోస్తనాలు, ఆటలు, బాల్యంలో చేసే ఆ అల్లరి.. అబ్బో చెప్పుకుంటూ పోతే ఇప్పట్లో ఆగదు. అయితే ఈ తరం పిల్లల బాల్యంలో ఇవన్ని కనుమరుగవుతున్నాయి. ఇక 10 ఏళ్ల క్రితం.. పిల్లలను భయపెట్టాలంటే తల్లిదండ్రులు వారి స్కూల్ టీచర్ల పేరో, పోలీసుల పేరో చెప్పి.. బెదిరించేవారు. మరీ ముఖ్యంగా ఖాకీల పేరు చెపితే.. గజ్జున వణికేవారు అప్పటి పిల్లలు. మరీ ఈ కాలం పిల్లలు.. అబ్బే వారికి పోలీసులంటే ఏమాత్రం భయంలేదు. పైగా తమకు సమస్య వస్తే.. పోలీసులే తీరుస్తారని కూడా తెలుసు. అందుకే డైరెక్ట్‌గా పోలీసు స్టేషన్‌కే వెళ్లి.. వారితో ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఈ తరహ సంఘటన ఒకటి కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. పట్టుమని పదేళ్లు కూడా లేని ఓ చిన్నారి.. తోటి విద్యార్థి తన పెన్సిల్, పుస్తకాలు తీసుకుంటున్నాడు.. రోజు ఇలానే చేస్తున్నాడని.. పోలీసులకు తెలిపాడు. అతని మీద కేసు పెట్టమని కోరాడు. చివరకు పోలీసులు ఇద్దరి మధ్య రాజీ కుదిర్చి పంపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. (చదవండి: Video: మరికొన్ని గంటల్లో పెళ్లి.. వధువు చేసిన పనికి అంతా షాక్!) చిన్నారి హన్మంతు తోటి విద్యార్థి మీద ఫిర్యాదు చేయడానికి పోలీసు స్టేషన్‌కు వెళ్లాడు. సదరు విద్యార్థి తన పెన్సిల్, పుస్తకాలు తీసుకుంటున్నాడని.. రోజు ఇలానే చేస్తున్నాడని హన్మంతు పోలీసులకు తెలిపాడు. విద్యార్థి మీద కేసు పెట్టాలని పోలీసులను కోరాడు. (చదవండి: నీ కడుపుకోత తీర్చలేం.. ‘జై హింద్ మాజీ’) చిన్నారి వాదన విన్న పోలీసులు కేసు పెట్టడం మంచి పద్దతి కాదని.. ఇద్దరు స్నేహంగా ఉండాలని హన్మంతుకు సూచించారు. అలానే వేరే వారి పెన్సిళ్లు, పుస్తకాలు తీసుకోకూడదని విద్యార్థికి చెప్పి.. ఇద్దరి మధ్య రాజీ కుదిర్చి పంపారు. చదవండి: రేయ్.. ఎవర్రా మీరు? ఎక్కడి నుంచి వచ్చార్రా? -
చిలుకలు ఎగరాలి.. నెమళ్లు పురివిప్పాలి! హాయిగా ఆడుకోనిద్దాం!
‘సప్త సముద్రాల అవతల మర్రిచెట్టు తొర్రలో ఉన్న చిలుకలో మాంత్రికుడి ప్రాణం ఉంటుంది’ అని కథలో వినగానే బాలల మనసు సప్త సముద్రాల అవతలకు చేరుకుంటుంది. వారి ఊహలో మర్రిచెట్టు కనిపిస్తుంది. దాని తొర్రలో ఎర్రముక్కుతో ఉన్న చిలుక. దానిని నులిమితే మాంత్రికుడి ప్రాణం పోతుంది. రాకుమారుడు ఆ సాహసం ఎలా చేస్తాడా అని వారి మనసు ఉత్సుకతతో నిండిపోతుంది. ఇవాళ కూడా బాలల చేతిలో ఒక చిలుక ఉంది. దాని పేరు సెల్‌ఫోన్. అది బాలల గొంతును పట్టుకుని ఉందా... బాలలు దాని గొంతును పట్టుకోబోతారా తేలాల్సి ఉంది. సాంకేతిక పరిజ్ఞానం విలువైనది. దాని అవసరం ఈ కరోనా సమయంలో విపరీతంగా తెలిసి వచ్చింది. పిల్లలు సెల్ఫోన్లు, లాప్టాప్ల ఆధారంగానే క్లాసులు విన్నారు. కొంతలో కొంతైనా తమ తరగతి స్వభావాన్ని నిలుపుకున్నారు. ఇది సాంకేతిక వల్లే సాధ్యమైంది. అదే సమయంలో ఆ సాంకేతికతే వారి ఊహా జగత్తు గొంతు నులుముతోంది. అనవసర వీడియోలకు, గేమ్‌లకు వారిని లొంగదీస్తోంది. పనికిమాలిన, ఎటువంటి వికాసం ఇవ్వని కాలక్షేపంలో కూరుకుపోయేలా చేస్తోంది. దేశంలో అలక్ష్యానికి గురయ్యే సమూహాలు తాము అలక్ష్యానికి గురవుతున్నామని గొంతెత్తుతాయి. లేదా ప్రభుత్వాలే తమ పాలసీ రీత్యానో వారికి ఓటు ఉంటుందన్న ఎరుక వల్లనో కొన్ని పనులు వారి కొరకు చేస్తాయి. కాని పిల్లలకు ఓటు ఉండదు. వారు ఏదైనా అరిచి చెప్పే వీలూ ఉండదు. దేశంలో వారికి మించిన నిర్లక్ష్యానికి గురయ్యే సమూహం ఉందా?... అందరూ ఆలోచించాలి. తాజా అధ్యయనాల్లో దేశంలో రోజుకు ముప్పైకి పైగా పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే ఇళ్లల్లో వారు ఎదుర్కొంటున్న ఒత్తిడి, చదువుకు సంబంధించి ఎదుర్కొంటున్న సవాళ్లు ఎలాంటివో ఎవరు పట్టించుకుంటున్నారు? ‘సాంకేతిక విద్య’ విప్లవం మొదలయ్యే వరకు బాలల వికాసం ఒకలా, ఆ విద్య వల్ల వస్తున్న ఉపాధి తెలిశాక ఆ వికాసం మరోలా మారిపోయింది. ఒకప్పుడు విద్యావిధానం, తల్లిదండ్రులు చదువుతో పాటు ఆటపాటలకు, కళలకు, కథలకు చోటు ఇచ్చేవారు. ‘ఆడుకోండ్రా’ అని అదిలించేవారు. కథల పుస్తకాలు తెచ్చిచ్చేవారు. నేడు ఐదవ తరగతి నుంచే భవిష్యత్తులో తేవలసిన ర్యాంకు గురించి హెచ్చరిస్తున్నారు. ఆటస్థలానికి, లైబ్రరీకి ఏ మాత్రం చోటులేని స్కూళ్లు పిల్లల్ని సిలబస్‌ల పేరుతో తోముతున్నాయి. పిల్లలకు పార్కులు అవసరం అని ప్రభుత్వాలు భావించనప్పుడు ఆటస్థలాలు అవసరం అని విద్యా సంస్థలూ భావించవు. ఇవాళ మున్సిపాల్టీలలో, నగరాలలో ఎన్ని పిల్లల పార్కులు ఉన్నాయో చూస్తే కాంక్రీట్ల మధ్య ఊపిరి పీల్చుకోవడానికి పెనుగులాడుతున్న బాలలు కనిపిస్తారు. పిల్లలు భయం వేస్తే అమ్మమ్మ కొంగు చాటుకు వెళ్లి దాక్కున్నట్టు వారికి ఆందోళన కలిగితే గతంలో ఏ చందమామనో పట్టుకుని కూచునేవారు. నేడు అన్ని పిల్లల పత్రికలూ మూతపడ్డాయి. వారికి కథలు చెప్పే అమ్మమ్మ, నానమ్మలు, తాతయ్యలు అనేక కారణాల రీత్యా వేరొక చోట్ల జీవిస్తున్నారు. ఒకవేళ వారు ఉన్నా ఫోన్లు, సీరియల్సు వారినీ ఎంగేజ్ చేస్తున్నాయి. పిల్లలతో మాట్లాడటానికి ఎవరికీ సమయం లేదు. పిల్లలు కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా సెల్ఫోన్లు అడ్డు నిలుస్తున్నాయి. వారి ఆందోళనకు ఓదార్పు ఏది? ఎగరని చిలుకలు, పురి విప్పని నెమళ్లు ఉంటే ప్రకృతి ఎంత నిస్సారంగా ఉంటుందో ఆటలాడని, నవ్వని, కథ వినని, వినిపించని, బొమ్మలేయని, పాట పాడని, నృత్యం చేయని పిల్లలు ఉంటే కూడా ప్రకృతి అంతే నిస్సారంగా ఉంటుంది. నవంబర్ 14 (బాలల దినోత్సవం) సందర్భంగా గతంలో తెలుగునాట వెలిగిన బాలల పత్రికల నుంచి ఏరి కూర్చిన సంజీవని పుల్లలతో ఈ సంచికను తీర్చిదిద్దాం. ఇలాంటివి కదా పిల్లలకు కావాలసింది అని అనిపిస్తే అవి ఎందుకు వారికి లేకుండా పోయాయో అందరూ ఆలోచిస్తారని ఆశ. చిలుకలను ఎగురనిద్దాం. నెమళ్లను పురివిప్పనిద్దాం. వారి ఆటస్థలాలను వారికి అప్పజెబుదాం. వారు ఆటలాడుకునే పిరియడ్లను స్కూళ్లలో వెనక్కు తెద్దాం. ర్యాంకులు అవసరమైన చదువులు మాత్రమే ఉండవని చెబుదాం. ఈ ప్రపంచం వారి కోసం ఎన్నో గండభేరుండ పక్షులను సిద్ధం చేసి వీపు మీద ఎక్కించి వారు కోరుకున్న విజయ తీరాలకు చేరుస్తుందని నమ్మకం కలిగిద్దాం. బాలల వికాసమే సమాజ వికాసం. – బాలల దినోత్సవం ప్రత్యేకం చదవండి: హెచ్చరిక!! ఈ శతాబ్దం చివరి నాటికి భూమిపై ఘోర మారణహోమం.. -
‘మా పిల్లలను ఆంధ్రాలో చదివించుకుంటాం’
సాక్షి,పర్లాకిమిడి(భువనేశ్వర్): ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాలల్లో తమ పిల్లలను చదివించుకుంటామని రాయఘడ సమితి, గంగాబడ పంచాయతీలోని మాణిక్యపట్నం గ్రామస్తులు తెలిపారు. ఇదే విషయమై మంగళవారం కలెక్టరేట్‌ని చేరుకుని, ఏడీఎం సంగ్రాం శేఖర పండాకి వినతిపత్రం అందజేశారు. అనంతరం పంచాయతీలో పాఠశాలలు సరిగా తెరవడం లేదని, ఒకవేళ తెరిచినా ఉపాధ్యాయులు తరగతులకు హాజరుకావడం లేదన్నారు. దీంతో ఏఓబీలోని శ్రీకాకుళం జిల్లా(ఏపీ), మందస మండలంలోని పాఠశాలలో పిల్లలను చేరి్పంచాల్సి వస్తుందని తెలిపారు. ఇప్పటికైనా పాఠశాలలు తెరిపించి, సరిపడ ఉపాధ్యాయులు లేనిచోట ఉపాధ్యాయులను నియమించాలని కోరారు. లేకపోతే తమకు దగ్గరలోని ఆంధ్రా పాఠశాలల్లో పిల్లలను చేర్పిస్తామని స్పష్టం చేశారు. చదవండి: Crime News: గట్టుపై బిడ్డను కూర్చోమని చెప్పి.. కుమార్తె కళ్లెదుటే.. -
ఆకతాయిల వేధింపులు.. సిగరెట్ తాగమని చెట్టుకు కట్టేసి..
బెంగళూరు(కర్ణాటక): చిన్న పిల్లలపై కొందరు అల్లరి మూకలు అమానుషంగా ప్రవర్తించారు. సిగరెట్ తాగాలని బలవంతం చేశారు. అంతటితో ఆగకుండా.. పాఠశాల ఆవరణలోనే చెట్టుకు కట్టేసి చితక్కొట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన క్లిప్పింగ్‌లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పోలీసులు తెలిపిన వివరాలు.. బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ) ఆధ్వర్యంలో నడుపుతున్న పాఠశాలలో 10-13 సంవత్సరాల మధ్య వయస్సు గల కొంతమంది విద్యార్థులను క్యాంపస్‌లో ప్రవేశించిన ఆరుగురు సభ్యుల ముఠా తరచుగా బెదిరింపులకు గురిచేస్తోంది. ఈ క్రమంలో గత శనివారం కూడా.. చిన్న పిల్లలను పట్టుకుని సిగరెట్ తాగాలని వేధింపులకు గురిచేశారు. అంతటితో ఆగకుండా పాఠశాల సమీపంలో ఉన్న దుకాణానికి వెళ్లి సిగరెట్లు తేవాలని చిన్న పిల్లలను బెదిరించారు. కాగా, నిందితులు... సమీపంలోని ఫ్యాక్టరీలో పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు.. పాఠశాలకు సమీపంలోని గ్రామానికి చెందిన వారు కావడంతో యాజమాన్యం కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నిందితులు పలుమార్లు ఉపాధ్యాయులను కూడా బెదిరించారని స్థానికులు తెలిపారు. కాగా, ఈ క్రమంలో కొంత మంది స్థానికులు.. పిల్లలను చెట్టుకు కట్టేసి కొడుతున్న క్లిప్పింగ్‌లను స్థానిక కార్పోరేటర్‌కు పంపించారు. కార్పోరేటర్.. పోలీసులకు, విద్యాశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో స్థానిక పోలీసులు ఆరుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేశారు. వారిలో ఐదుగురు మైనర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారిని జువైనల్ హోమ్‌కు తరలించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని చిన్న పిల్లల తల్లిదండ్రులు పోలీసులను కోరారు. కాగా, దీనిపై స్పందించిన డీసీపీ దేవరాజ్ మాట్లాడుతూ.. గ్రామంలో, పాఠశాల పరిసరాలలో అసాంఘిక చర్యలు జరగకుండా పెట్రోలింగ్ గస్తీని పెంచుతామన్నారు. చదవండి: భర్త పోస్టులకు మరో మహిళ లైక్‌లు .. చిర్రెత్తుకొచ్చిన ఆ భార్య.. -
పుస్తకాలు తెరవడం లేదు.. స్కూల్స్ ఓపెన్ చేయాల్సిందే!
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విద్యార్థుల జీవితాల్లో సృష్టించిన అగాధం ఇప్పుడిప్పుడే బయట పడుతోంది. గ్రామీణ విద్యార్థుల్లో చాలా మంది అసలు పదాలను కూడా గుర్తించలేని స్థితిలో ఉన్నారని తాజా అధ్యయనం వెల్లడించింది. స్కూల్ చిల్డ్రన్ ఆన్లైన్ అండ్ ఆఫ్‌లైన్ లెర్నింగ్ (స్కూల్) అనే సర్వేలో ఈ విషయాలు బయటపడ్డాయి. ఆగస్టు నెలలో 15 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో 1400 మంది విద్యార్థులపై ఈ అధ్యయనం సాగింది. పాఠశాల విద్యపై అత్యవసర నివేదిక అనే అంశంపై జరిగిన ఈ అధ్యయనం సోమవారం విడుదలైంది. (చదవండి: కేంద్రం కీలక నిర్ణయం: ఎన్డీఏలో మహిళల ప్రవేశాలకు అనుమతి) 37 శాతం మంది చదవట్లేదు.. గ్రామీణ ప్రాంతాల్లో 28 శాతం మంది విద్యార్థులు క్రమం తప్పకుండా చదువుతుండగా, 37 శాతం మంది మాత్రం అసలు చదవడం లేదు. ఇందులో దారుణమైన వాస్తవమేమిటంటే కొంత మంది విద్యార్థులు వాక్యంలోని పదాలను సైతం గుర్తించలేని పరిస్థితిలో ఉన్నారు. పట్టణ పఆరంతాల్లో క్రమం తప్పకుండా చదువుతున్న వారు 47శాతం, అసలు చదవని వారు 19శాతం, కొన్ని పదాలకు మించి చదవలేని వారు 42 శాత ఉన్నట్లు అధ్యయనం తేల్చింది. ఆన్లైన్ విధానం ద్వారా క్రమం తప్పకుండా చదివేవారు పట్టణాల్లో 24 శాతం కాగా, గ్రామీణ ప్రాంతాల్లో 8 శాతం మాత్రమే ఉన్నారు. ఆర్థికంగా స్థోమత లేకపోవడం, కనెక్టివిటీ సమస్యలు, స్మార్ట్ఫోన్లు అందుబాటులో లేకపోవడం వంటి వాటి కారణంగా విద్యార్థులు ఆన్లైన్ విద్యకు దూరమవుతున్నారని నివేదిక స్పష్టం చేసింది. ఎస్సీ/ఎస్టీల్లో పరిస్థితి ఘోరం.. దళితులు, ఆదివాసీ విద్యార్థులపై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. ఆన్లైన్ విద్యా విధానం, రెగ్యులర్ విద్య వంటి అంశాలన్నింటిలోనూ వారు వెనుకబడే ఉన్నారు. ఎస్సీ/ఎస్టీల్లో కేవలం 4 శాతం మంది విద్యార్థులు మాత్రమే ఆన్లైన్ విద్యను క్రమం తప్పకుండా అనుసరిస్తున్నారు. ఇది ఇతర విద్యార్థుల్లో 15 శాతంగా ఉంది. ఎస్సీ/ఎస్టీ విద్యార్థుల్లో తల్లిదండ్రుల్లో 98 శాతం మంది పాఠశాలలు వీలైనంత త్వరగా తెరవాలని అభిప్రాయపడ్డారు. సమయం పడుతుంది.. విద్యార్థులకు జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు చాలా కాలం పడుతుందని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు. విద్యార్థుల నైపుణ్యాలను మెరుగు చేయడంతో పాటు సామాజికంగా వారిని ముందుకు నడిపించడం, పాఠశాలల భవనాలకు అనుమతులు తీసుకోవడం, ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం ఇలాంటి వాటిని చక్కదిద్దేందుకు సంవత్సరాలు పట్టే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. అస్సాం, బిహార్, ఢిల్లీ, హరియాణా, జార్ఖండ్, మహారాష్ట్ర, పంజాబ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాల్లో మొత్తం 100 మంది వాలంటీర్ల ద్వారా ఈ అధ్యయనం జరిగింది. -
విషాదం: అక్కతో కలిసి పాఠశాలకు.. నీళ్లు పట్టుకుందామని వెళ్లి..
అడ్డాకుల: పాఠశాలలు తెరిచిన రెండో రోజే జరిగిన ఓ ప్రమాదం ఆ కుటుంబంలో విషాదం నింపింది. సంపు వద్ద నల్లా నీళ్లు పట్టుకుంటుండగా అందులో పడి ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలంలోని కందూర్ ప్రాథమిక పాఠశాలలో ఈ విషాదకర సంఘటన చోటు చేసుకుంది. కందూర్ గ్రామానికి చెందిన షాహీనాబేగం, మహ్మద్ రఫిక్ దంపతులకు ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అంగన్వాడీ కేంద్రానికి వెళ్లే చిన్న కుమార్తె షరీఫా (6) పాఠశాలలో చేరాల్సి ఉంది. కాగా, గురువారం అక్కతో కలసి పాఠశాలకు వెళ్లింది. మధ్యాహ్న భోజన సమయంలో నల్లా నీళ్ల కోసం వెళ్లి పాఠశాల ఆవరణలో ఉన్న సంపులో ప్రమాదవశాత్తు పడి చనిపోయింది. ఈ విషయం తెలియని తల్లిదండ్రులు ఊరంతా వెతికారు. శుక్రవారం ఉదయం సంపులో పాప మృతదేహం కనిపించడంతో కన్నీరు మున్నీరయ్యారు. అధికారుల విచారణ ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో సంఘటన స్థలాన్ని జిల్లా సంక్షేమ అధికారి రాజేశ్వరి, తహసీల్దార్ కిషన్, ఎంపీడీఓ మంజుల, ఎస్ఐ విజయకుమార్ తదితరులు పరిశీలించి విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. వాస్తవానికి ఈ పాఠశాలలోని ఓ గదిలో అంగన్వాడీ కేంద్రాన్ని కొనసాగిస్తున్నారు. లాక్డౌన్ కంటే ముందు షరీఫా అంగన్వాడీ కేంద్రానికి వెళ్లేది. ఈసారి పాఠశాలలో చేరాల్సి ఉన్నా తల్లిదండ్రులు ఇంకా చేర్పించలేదు. అక్కతోపాటు వెళ్లిన షరీఫా సంపులో పడి ప్రాణాలు కోల్పోయింది. -
వామ్మో.. ఆ దూకుడు ఏందిరా నాయనా!
కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో స్కూళ్లు లేకపోవడంతో పిల్లల ఆటపాటలతో భలే ఎంజాయ్ చేస్తున్నారు. పాఠశాలలకు వెళ్లే పనిలేకపోవడంతో ఆటలతో సేద తీరుతున్నారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గడ్పూర్ గ్రామ పంచాయతీ దుబ్బగూడెం వద్ద గల వ్యవసాయ బావిలో విద్యార్థులు ఇలా ఈత కొడుతూ కేరింతలు కొట్టారు. అయితే, బావుల్లో దిగడం, ఈత కొట్టడం ప్రమాదమనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి సుమా!. – గెల్లు నర్సయ్య యాదవ్, సాక్షి ఫొటోగ్రాఫర్, మంచిర్యాల అమ్మో డైనోసార్ సంగారెడ్డి రాజంపేట నుంచి నాగాపూర్ వెళ్లేదారిలో ఓ రైతు పొలం పక్కన పిచ్చిమొక్కల తీగలు చెట్టుపై డైనోసార్లా అల్లుకున్నాయి. దూరం నుంచి చూస్తే డైనోసార్ అనిపించేలా ఈ తీగలు అల్లుకున్నాయని స్థానికులు అంటున్నారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సంగారెడ్డి పొలం పచ్చగా..కడుపు నిండగా సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలో ఎటుచూసినా వరి పొలాలు పచ్చగా కళకళలాడుతున్నాయి. పొలాల మధ్యలో నల్ల తల కలిగిన పక్షులు సైతం తిరుగుతూ సందడి చేస్తున్నాయి. పొలం నీళ్ల మధ్య బురదలోని కీటకాలను తింటూ కడుపు నింపుకుంటున్నాయి. రైతుల చప్పుడు కాగానే గాలిలో రివ్వున ఎగిరిపోతున్నాయి. – బి.శివప్రసాద్, సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సంగారెడ్డి. -
Nadu Nedu: బడి భలేగుంది
నాడు ► ముళ్లకంపలు.. పరిసరాల్లో పందులు, కుక్కల విహారం.. విరిగిపోయిన తలుపులు.. పాడైపోయిన టీవీ.. పగుళ్లిచ్చిన గోడలు, పెచ్చులూడి బూజు పట్టిన శ్లాబ్.. పని చేయని ట్యూబ్ లైట్.. నీళ్లు, తలుపులు లేని టాయిలెట్.. ఇంటర్వెల్లో ఇంటికి పరుగెత్తే అమ్మాయిలు.. కిర్రు కిర్రుమని శబ్దం చేసే అయ్యవారు కుర్చీ.. ఇలా ఒకటా.. రెండా.. ప్రభుత్వ స్కూళ్లలో మొన్నటి దాకా అన్నీ సమస్యలే. నేడు ► రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు–నేడు కార్యక్రమంతో ప్రభుత్వ స్కూళ్లకు మహర్దశ మొదలైంది.. పది పన్నెండు రకాల వసతుల కల్పనతో ఇప్పుడవి కళకళలాడుతున్నాయి. బాల బాలికలకు వేర్వేరుగా టాయిలెట్లు నిర్మించారు. నిరంతరం నీరు, విద్యుత్ సరఫరా ఉంటోంది. చూడచక్కని రంగులతో అల్లంత దూరం నుంచే ఆకట్టుకుంటున్నాయి. కార్పొరేట్ విద్యా సంస్థలను మరిపించేలా ముస్తాబయ్యాయి. ‘అది మా ఊరి సర్కారు బడి’ అని సగర్వంగా చెప్పుకునేలా రూపురేఖలు మార్చుకున్నాయి. నాడు సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లా కేంద్రమైన కడప నగరం జయనగర్‌కాలనీలోని బాలికల హైస్కూల్‌కు రెండేళ్ల క్రితం వరకు ఓ మోస్తరు వర్షం వచ్చినా సెలవు ఇచ్చేవారు. ఏకంగా తరగతి గదుల్లోకి వర్షం నీరు వచ్చేది. 450 మందికి పైగా బాలికలు ఉన్న ఈ పాఠశాలలో కేవలం రెండు బాత్రూమ్లు మాత్రమే ఉండేవి. ఇంటర్వెల్లో పిల్లలు క్యూకట్టేవారు. నీళ్లు ఎక్కువగా తాగితే మూత్రం వస్తుందనే భయంతో చాలా మంది తక్కువగా తాగేవారు. ఒక్క పదవ తరగతి మినహా మిగతా తరగతుల వారందరూ కింద కూర్చొని విద్యనభ్యసించేవారు. వేసవిలో అయితే ఉక్కపోతతో పిల్లలు విలవిల్లాడిపోయేవారు. ఒక్క ఫ్యాన్ కూడా ఉండేది కాదు. ప్రహరీ ఉండేది కాదు. టీవీ ఒకటి ఉందనే విషయం కొద్ది మందికి మాత్రమే తెలుసు. విద్యార్థులకు సరిపడా తరగతి గదులుండేవి కాదు. ప్రహరీ లేనందున రాత్రిళ్లు ఆకతాయిలకు నిలయంగా ఉండేది. ఇంతటి దయనీయ పరిస్థితిలో ఉన్న ఈ పాఠశాల రూపురేఖలు ‘నాడు–నేడు’తో ఈ ఏడాది పూర్తిగా మారిపోయాయి. వర్షం నీరు లోపలకు రాకుండా మట్టి తోలించి సరిచేశారు. రూ.25,91,562తో ఎనిమిది టాయిలెట్లను తీర్చిదిద్దారు. రూ.43,20,753తో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. రూ.15,19,094తో అందరికీ çఫర్నిచర్ ఏర్పాటు చేశారు. మొత్తంగా రూ.1,09,97,028 నిధులతో తాగునీరు, ప్రహరీ, విద్యుత్, రంగులు, ల్యాబ్, అదనపు గదులు, ఇతరత్రా సౌకర్యాలన్నీ కల్పించారు. ఇలా ప్రతి ఊళ్లోనూ ప్రభుత్వ స్కూళ్లు సర్వాంగ సుందరంగా మారిపోతున్నాయి. రాజమహేంద్రవరం సీతంపేటలోని ప్రభుత్వ స్కూల్లో ఏర్పాటు చేసిన విద్యార్థుల ఆట వస్తువులు ప్రత్యక్ష తరగతుల నాటికి పనులు పూర్తి రాష్ట్రంలో విద్యా రంగ సంస్కరణల్లో భాగంగా ప్రభుత్వం చేపట్టిన ‘మనబడి నాడు–నేడు’ తొలి దశ పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. ఆగస్టు 16 నుంచి పాఠశాలల్లో విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు నిర్వహించాలని భావిస్తున్నందున ఆలోగా మొత్తం పనులు పూర్తి చేసేలా పాఠశాల విద్యా శాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటికే 97 శాతం పనులు పూర్తి చేసిన అధికారులు మిగిలిన పనులను నిర్ణీత కాలానికన్నా ముందే పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు ఆహ్లాదకర వాతావరణంలో ఆనందంగా తమ అభ్యసనం సాగించేలా స్కూళ్లను తీర్చిదిద్దారు. రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయి. ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ము కాసిన గత ప్రభుత్వం.. వేలాది పాఠశాలలను మూత వేయించడమే కాకుండా తక్కిన వాటిని కూడా నిర్వీర్యం చేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ జగన్ తొలి ప్రాధాన్యంగా విద్యా రంగంపై దృష్టి సారించారు. అధ్వాన దశలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను సర్వాంగ సుందరంగా తీర్చి దిద్ది, పిల్లలు ఆహ్లాదకర వాతావరణంలో చదువులు కొనసాగించేలా చర్యలు చేపట్టారు. తుది దశలో పనులు ► రాష్ట్రంలో 45 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటిలో విద్యార్థులు, టీచర్లకు అవసరమైన సదుపాయాలను కల్పించేందుకు ‘మనబడి నాడు–నేడు’ కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టారు. మూడు దశల్లో అన్ని స్కూళ్లను అభివృద్ధి చేసేలా ప్రణాళిక రూపొందించారు. ► తొలిదశలో 15,716 స్కూళ్లలో 1,14,903 పనులు చేపట్టారు. ఇప్పటి వరకు రూ.3,360 కోట్ల ఖర్చుతో 1,11,770 పనులు పూర్తి చేశారు. మిగిలిన పనులు కూడా చాలా వరకు చివరి దశకు చేరుకున్నాయి. రంగులు వేయడం వంటి పనులు మిగిలి ఉన్నాయి. వీటిని స్కూళ్లు తెరవడానికి ముందుగానే పూర్తయ్యేలా పాఠశాల విద్యా శాఖ చర్యలు చేపట్టింది. 4,171 స్కూళ్లకు ప్రహరీలను కూడా నిర్మించారు. ► ఈ పనులు త్వరితగతిన చేపడుతున్న జిల్లాలకు విద్యా శాఖ ర్యాంకులను ఇస్తోంది. ర్యాంకుల అగ్రస్థానంలో 1 నుంచి 5వ ర్యాంకు వరకు ప్రకాశం, కృష్ణా, వైఎస్సార్, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాలు ఉండగా.. చివరి మూడు స్థానాల్లో వరుసగా శ్రీకాకుళం, తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాలు ఉన్నాయి. ► నాణ్యతలో రాజీ లేకుండా పనులను చేయించారు. మరుగుదొడ్లలో వాడే పరికరాలు, మంచినీటి సరఫరా పరికరాలు, ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు వంటివన్నీ బ్రాండెడ్ వస్తువులను అమరుస్తున్నారు. ► నిర్మాణ పనుల్లోనూ పది కాలాల పాటు నిలిచి ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉత్తమ కంపెనీల టైల్స్, గ్రానైట్ వంటివి వినియోగించి పాఠశాలలకు కొత్త అందాలను సమకూర్చారు. చదువుల లక్ష్యం నెరవేరేలా సదుపాయాలు ► పాఠశాలలను విద్యార్థులకు నిజమైన అభ్యాస కేంద్రాలుగా, ఉన్నత ప్రమాణాలతో కూడిన జ్ఞానాన్ని అందించే పవిత్ర దేవాలయాలుగా ప్రభుత్వం భావిస్తోంది. ఆ లక్ష్యాన్ని సాధించేందుకు వీలుగా పాఠశాలల్లో చదువులకు అనువైన వాతావరణాన్ని కల్పించేలా ‘మనబడి నాడు–నేడు’ కార్యక్రమంలో అనేక మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది. ► రన్నింగ్ వాటర్ కలిగిన మరుగుదొడ్లు, మంచినీటి సదుపాయం, మేజర్.. మైనర్ రిపేర్లు, పెయింటింగ్.. ఫినిషింగ్, స్కూలు విద్యుదీకరణ, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్ల ఏర్పాటు, విద్యార్థులు, టీచర్లతో సహా పాఠశాలకు అవసరమైన ఫర్నిచర్, గ్రీన్ చాక్ బోర్డులు, ఇంగ్లిష్ ల్యాబ్‌లు, కాంపౌండ్ వాల్స్, కిచెన్ షెడ్లు, డైనింగ్ హాళ్లు.. తదితర వసతులను కల్పిస్తోంది. ► వివిధ యాజమాన్యాల స్కూళ్లు ఉండడంతో పాటు, వేలాది స్కూళ్లలో లక్షల్లో పనులకు సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షించాల్సి ఉండడంతో ప్రభుత్వం ఈ కార్యక్రమంలో పలు శాఖల ఇంజనీరింగ్ విభాగాలను భాగస్వాములను చేసింది. రెండో విడత పనులకు అనుమతులు మొదటి విడత పనులు దాదాపు పూర్తి కావస్తుండడంతో రెండో విడత నాడు–నేడు పనులకు విద్యా శాఖ చర్యలు ప్రారంభించింది. ఈ దశలో 16,345 స్కూళ్లలో రూ.4,446 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం మార్చి 30వ తేదీన పరిపాలనా అనుమతులను మంజూరు చేసింది. రెండో విడతలో 12,678 స్కూళ్లు, 1,668 ప్రభుత్వ హాస్టళ్లు, 473 జూనియర్ కాలేజీలు, 17 డైట్ సంబంధిత విద్యా సంస్థలు, 391 గురుకుల రెసిడెన్షియల్ స్కూళ్లు, 672 మండల రిసోర్సు కేంద్రాలు, 446 భవిత సెంటర్లలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు. ఈసారి కిచెన్ షెడ్లు, స్కూళ్ల ప్రహరీలు, అదనపు తరగతి గదులను కూడా నిర్మించేలా చర్యలు చేపడుతున్నారు. హాస్టళ్లలో ఫర్నిచర్ కింద విద్యార్థులకు మంచాలు, పరుపులు, బెడ్షీట్లు, బ్లాంకెట్లు, అల్మారాలు తదితరాలను సమకూర్చనున్నారు. జూనియర్ కాలేజీల్లో ల్యాబ్ పరికరాలు, ఫర్నిచర్‌ను ఏర్పాటు చేయనున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లిష్ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తారు. గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్టులో ఈ విద్యా సంస్థలను ఆహ్లాదకరంగా, సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దనున్నారు. విశాఖ జిల్లా గిడిజాల గ్రామంలోని పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన మంచినీటి కుళాయిలు నమ్మలేకపోతున్నా.. మా ఊరిలో విరిగిపోయిన పెంకులు, పగిలిన గచ్చులతో ఉండే పాఠశాల నేడు పెద్ద ఆఫీసు మాదిరిగా మారింది. మొన్నామధ్య అటుగా వెళ్లిన నేను పాఠశాలను చూసి ఆశ్చర్యపోయాను. చిన్నప్పుడు నేను చదువుకున్న పాఠశాల ఇదేనా.. ఇప్పుడు ఎంత అందంగా, అద్భుతంగా ఉందనిపించింది. నిజంగా సీఎం జగన్‌కు ఓ విద్యార్థి తల్లిగా వందనం చేస్తున్నా. ఇటువంటి ఆధునిక భవనాలలో ప్రశాంత వాతావరణంలో విద్యా బోధనకు శ్రీకారం చుట్టారు. ఈ వాతావరణం విద్యార్థులకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.– చోడి పార్వతి, వండవ, వీరఘట్టం మండలం, శ్రీకాకుళం ప్రైవేట్ స్కూల్ కంటే బావుంది మా ఊళ్లోని స్కూల్లో నా కుమారుడు రిçశ్వంత్ చదువుతున్నాడు. గతంలో స్కూల్లో బాత్రూములు, తాగునీరు, కరెంట్ లాంటివేమీ లేవు. ఇప్పుడు జగనన్న వచ్చాక రూపురేఖలు మారిపోయాయి. ఆడ పిల్లలకు, మగ పిల్లలకు వేర్వేరుగా మరుగుదొడ్లు వచ్చాయి. ఆర్ఓ ప్లాంట్ పెట్టారు. స్కూల్లో బల్లలు, ఫ్యాన్లు, బల్బులు వంటివి ఏర్పాటు చేశారు. ప్రైవేటు స్కూల్ కంటే మంచి వాతావరణం కనిపిస్తోంది. – నాగరాణి, పాపానాయుడుపేట, ఏర్పేడు మండలం, చిత్తూరు మా స్కూల్ ఇప్పుడు చాలా బావుంది మా స్కూళ్లో ఇదివరకు బాతు రూమ్ ఉన్నప్పటికీ శుభ్రంగా ఉండేది కాదు. డోర్లు ఊడిపోయి, విరిగిపోయి ఉండేవి. నాడు–నేడు పథకం కింద బాత్ రూములు చాలా బాగా కట్టించారు. టైల్స్, వెస్ట్రన్ మోడల్ కమోడ్, ట్యాపులు అన్నీ అందుబాటులో ఉన్నాయి. నీటి సౌకర్యం కూడా ఉంది. కొత్త బెంచీలు వేశారు. ఇప్పుడు మా స్కూల్ చాలా బాగుంది. – కర్రి శ్యామ్యూల్, 9వ తరగతి, జెడ్పీ ఉన్నత పాఠశాల, ఆకివీడు, పశ్చిమగోదావరి -
ఐదో తరగతి విద్యార్థులకు ఫ్రీ కండోమ్స్.. తల్లిదండ్రుల ఆగ్రహం
వాషింగ్టన్/చికాగో: యుక్త వయసులో పిల్లల్లో కలిగే శారీరక, మానసిక మార్పుల గురించి వారితో చర్చిస్తే ఎంతో మేలని మానసిక నిపుణులు సలహా ఇస్తుంటారు. ఈ క్రమంలో పాఠశాల విద్యాబోధనలో భాగంగా సెక్స్ ఎడ్యుకేషన్ గురించి ప్రత్యేకంగా బోధిస్తారు. అయితే దేని గురించి అయినా చెప్పే పద్దతిలో.. అవసరం ఉన్న వరకు తెలియజేస్తే తప్పులేదు. అలా కాదని అత్యుత్సాహం ప్రదర్శిస్తే అబాసు పాలవ్వాల్సి వస్తుంది. అమెరికాలోని చికాగో ఎడ్యుకేషన్ బోర్డు కూడా తాజాగా ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంటుంది. సెక్స్ ఎడ్యుకేషన్‌లో భాగంగా ఐదో తరగతి.. ఆపై విద్యార్థులకు పాఠశాలలో కండోమ్స్ ఇవ్వాలని చికాగో ఎడ్యుకేషన్ బోర్డ్ నిర్ణయించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేయడంతో ఈ నిర్ణయంపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు.. చికాగో పబ్లిక్ స్కూల్స్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ గతేడాది డిసెంబర్లో సెక్స్ ఎడ్యుకేషన్ పాలసీ రూపొందించింది. దీనిలో భాగంగా విద్యార్థులకు 'ఆరోగ్యకర సంబంధాలు-సమ్మతి, శరీర నిర్మాణ శాస్త్రం, శరీర ధర్మ శాస్త్రం, కౌమార యుక్త వయసులో శరీరంలో కలిగే మార్పులు, లైంగిక ధోరణులు, లైంగిక ఆరోగ్యం' తదితర అంశాలను విద్యార్థులకు బోధించనున్నారు. ఒకవేళ ఎవరైనా తల్లిదండ్రులకు దీనిపై అభ్యంతరం ఉంటే లిఖితపూర్వకంగా బోర్డుకు, స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఇక సెక్స్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం ఎలిమెంటరీ స్కూళ్లలో 250 వరకు, హైస్కూళ్లలో ఒక వెయ్యి వరకు కండోమ్స్‌ను ఎప్పుడూ అందుబాటులో ఉంచాలి. ఇవి పూర్తిగా ఉచితం. విద్యార్థుల్లో లైంగిక వ్యాధులు, అవాంఛిత గర్భాలను నిరోధించేందుకే ఈ పాలసీని తీసుకొచ్చినట్లు సీపీఎస్(చికాగో పబ్లిక్ స్కూల్స్) అధికారులు చెబుతున్నారు. అంతేకాక బోర్డు పరిధిలోని 600 స్కూళ్లకు కండోమ్స్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ కండోమ్స్ అయిపోతే ప్రిన్సిపాల్స్ సదరు ఉన్నతాధికారులకు తెలియజేసి.. తెప్పించుకోవాలని తెలిపింది. సెక్స్ ఎడ్యుకేషన్‌లో భాగంగా ఇలా ఐదో తరగతి విద్యార్థులకు కండోమ్స్ అందుబాటులో ఉంచాలన్న పాలసీని కొంతమంది తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఐదో తరగతి అంటే కేవలం 12 ఏళ్ల వయసు ఉంటుందని... అప్పటికీ వారు ఇంకా చిన్నపిల్లలే అని చెబుతున్నారు. పిల్లలకు కండోమ్స్ ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇది సరైన నిర్ణయం కాదని... దీనిపై మరోసారి ఆలోచన చేయాలని కోరుతున్నారు. కానీ వైద్యులు, మానసిక విశ్లేషకులు మాత్రం విద్యార్థుల ఆరోగ్య రీత్యా ఈ పాలసీ చాలా అవసరమని.. విద్యార్థులకు కండోమ్స్ అందుబాటులో ఉంచకపోతే... వారికి సరైన జాగ్రత్తలు చెప్పకపోతే... వారికి చెడు జరిగే అవకాశం ఉందన్నారు. ఆరోగ్యకర నిర్ణయాలు తీసుకునేందుకు కచ్చితమైన, స్పష్టమైన సమాచారాన్ని తెలుసుకునే హక్కు యువతకు ఉందన్నారు. తద్వారా వారితో పాటు ఇతరుల ఆరోగ్యాన్ని కాపాడగలుగుతారని పేర్కొన్నారు. -
మూసేసిన స్కూల్లో పిల్లల అస్థిపంజరాలు లభ్యం
ఒట్టోవా: కెనడాలో దారుణం చోటుచేసుకుంది. ప్రఖ్యాత కమ్లూప్స్ ఇండిజీనియస్ రెసిడెన్షియల్ స్కూల్లో సుమారు 215 మంది పిల్లల అస్థిపంజరాలు బయటపడడం కలకలం రేపింది. కాగా 1978లోనే ఈ పాఠశాలను మూసేశారు. తాజాగా బయటపడిన అవశేషాల్లో ఎక్కువ మంది మూడేళ్ల లోపు పిల్లలే ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. భూమిలోకి చొచ్చుకుపోయే ఒక ప్రత్యేకమైన రాడార్ సాయంతో పిల్లల అస్థిపంజరాలను గుర్తించినట్లు తెలిపారు. ఈ ఘటనపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో విచారం వ్యక్తం చేశారు. దేశ చరిత్రలోనే ఇది చాలా బాధకరమైన సంఘటన అని.. సిగ్గుతో తల దించుకోవాల్సిన రోజని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాగా 2015లో ట్రూత్ అండ్ రీకాన్సిలేషన్ అనే ఒక కమిటీ ఈ స్కూల్‌పై అధ్యయనం చేపట్టింది. ఆ రిపోర్టులో విస్తుపోయే విషయాలు వెలుగుచూడడం అప్పట్లో సంచలనంగా మారింది. 1840 నుంచి 1978 మధ్యలో పిల్లలను తల్లిదండ్రుల నుంచి బలవంతంగా వేరు చేసి క్రిస్టియన్ చర్చిలు ఆధ్వర్యంలో నడుసున్న కమ్లూప్స్ పాఠశాలలో చేర్పించేవారు. అలా దాదాపు 150,000 మంది పిల్లల్లో చాలామందిని శారీరక వేధింపులతో పాటు లైంగింకగా వేధించడం, సరిగ్గా ఆహారం ఇవ్వకపోవడం లాంటి దురాగతాలకు పాల్పడేవారని ఒక రిపోర్టులో బయటపడింది. స్కూల్ యాజమాన్యం ఆగడాలతో దాదాపు 3200 మంది చనిపోయారని.. అందులో 215 మంది పిల్లలను స్కూల్ గ్రౌండ్‌లోనే ఖననం చేసినట్లు తేలింది. చిన్నపిల్లల మృతికి సంతాపంగా నివాళి ప్రకటిస్తున్న కెనడా ప్రజలు అయితే 2008లో కెనడా ప్రభుత్వం అప్పట్లో ఈ ఘటనపై క్షమాపణలో కోరింది. ఇక ఈ విషయంపై 2015 నుంచి ఆరేళ్లుగా దీనిపై దర్యాప్తు కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు. బ్రిటీష్ కొలంబియా కార్యాలయంతో కలిసి విచారణ చేస్తున్నామని.. బయటపడ్డ పిల్లల అస్థిపంజరాలను భద్రపరుస్తామని వారు తెలిపారు. చదవండి: ప్రియురాలితో బోరిస్ రహస్య వివాహం! అమ్మ, నాన్న ఎక్కడ.. కంటతడి పెట్టిస్తున్న చిన్నారి -
మహానటి.. దాతృత్వ దివిటీ
రేపల్లె రూరల్ (గుంటూరు): ఆమె వెండి తెర సామ్రాజ్ఞి.. నిజ జీవితంలో మహా దాతృత్వం ఉన్న మహా మనీషి. తమిళ సీమలోనూ ‘నడిగర్ తిలగమ్’ (మహానటి) బిరుదాంకితురాలైన ఆమె దానధర్మాలు చేయటంలో చేతికి ఎముక లేదనే కీర్తి గడించారు. ఆమె పేరు వింటేనే గుంటూరు జిల్లా తీరం పులకించిపోతుంది. తీరంలోని కుగ్రామమైన వడ్డివారిపాలెం ఆమె తలంపు వస్తేనే మైమరచిపోతుంది. ‘గొప్ప వాళ్లను గౌరవించాలి.. గొప్పవాళ్లు సైతం సావిత్రమ్మను గౌరవించాలి’ అనేంత ఖ్యాతిని మాత్రమే చివరికి మిగుల్చుకున్న మహానటి సావిత్రి అడుగు జాడలు, ఆమె జ్ఞాపకాలు గుంటూరు జిల్లాలో నేటికీ సజీవమే. పేదరికంలో పుట్టి.. పేదరికంలోనే పెరిగి.. అనేక ఒడుదొడుకులు ఎదుర్కొన్న సావిత్రిని.. సాటి వారికి సాయం చేయడంలోనే సంతృప్తి, పరమార్థం ఉందని గ్రహించిన మహావ్యక్తిగా ఇక్కడి వారు కొలుస్తారు. గుంటూరు తీరంతో అనుబంధం సావిత్రి తల్లి సుభద్రమ్మ, పెద్దమ్మ దుర్గాంబలది వడ్డివారిపాలెం గ్రామమే. తల్లి సుభద్రమ్మకు తాడేపల్లి మండలం చిర్రావూరు గ్రామానికి చెందిన నిశ్శంకర గురవయ్యతో వివాహమైంది. పెద్దమ్మ దుర్గాంబకు కొమ్మారెడ్డి వెంకట్రామయ్య చౌదరితో వివాహమైంది. వడ్డివారిపాలెం గ్రామంలో పాఠశాల లేకపోవటంతో పెద్దమ్మ దుర్గాంబ కోరికతో తల్లిదండ్రుల జ్ఞాపకార్థం సావిత్రి గ్రామంలో స్థలాన్ని కొనుగోలు చేసి.. రూ.25 వేలు విరాళంగా ఇచ్చి.. 1962లో పాఠశాలను నెలకొల్పారు. పాఠశాల అభివృద్ధికి అనేక పర్యాయాలు సహకారం అందించారు. ఆ పాఠశాల ప్రభుత్వ గుర్తింపు పొందిన తరువాత కొన్ని కారణాల వల్ల ఉపాధ్యాయులకు వేతనాలు అందడంలో ఆలస్యం జరుగుతుండేది. దీనివల్ల ఉపాధ్యాయులు ఎన్నో ఇబ్బందులు పడేవారు. 1975లో ప్రభుత్వం నుంచి గ్రాంట్ రాకపోవటంతో ఆరు నెలలైనా ఉపాధ్యాయులకు జీతాలు అందని పరిస్థితులు నెలకొనగా.. సావిత్రి రూ.1,04,000 చెక్కు పంపించారు. అప్పట్లో రూ.1,04,000 అంటే ఇప్పుడు దాని విలువ రూ.కోటికి పైనే ఉంటుంది. ఇలా ఎన్నోసార్లు ఉపాధ్యాయులకు సావిత్రి చేసిన మేలు, పాఠశాల అభివృద్ధికి అందించిన విరాళాలు విద్యారంగంపై ఆమెకు ఉన్న మక్కువకు నిదర్శనాలు. అదే సంకల్పంతో ముందుకు.. ఏ సంకల్పంతో సావిత్రి పాఠశాలను స్థాపించారో.. ఆ సంకల్పం దిశగానే శ్రీమతి సావిత్రి జెమినీ గణేశన్ హైసూ్కల్ పరుగులు పెడుతోంది. ఉపాధ్యాయుల కృషితో పదేళ్లుగా ఈ పాఠశాల నూరు శాతం ఫలితాలు సాధిస్తోంది. తైక్వాండో, షటిల్, కబడ్డీ, ఖోఖో వంటి క్రీడల్లోనూ ప్రతిభ చాటుతున్నారు. ఈ పాఠశాలలో చదివిన వారెందరో ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు. సావిత్రి జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించిన ‘మహానటి’ చిత్ర నిర్మాతలు ప్రియాంకదత్, స్వప్నదత్, దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ పాఠశాలను సందర్శించి.. ఇతర గ్రామాల నుంచి వచ్చే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా బస్సును ఏర్పాటు చేశారు. దీనిని సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి చేతుల మీదుగా ప్రారంభించారు. నాడు–నేడు పనులతో మరింత అభివృద్ధి శ్రీమతి సావిత్రి గణేశన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇటీవల నాడు–నేడు కార్యక్రమానికి ఎంపికైంది. పాఠశాల అభివృద్ధికి రూ.42 లక్షల నిధులు మంజూరు కాగా.. తరగతి గదుల మరమ్మతులు, విద్యుదీకరణ పనులు, మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీటి ఏర్పాటు, బ్లాక్ బోర్డుల ఏర్పాటు పనులు శరవేగంగా సాగుతున్నాయి. నాణ్యమైన విద్య అందిస్తున్నాం మహానటి సావిత్రి దాతృత్వంతో ఏర్పాటైన పాఠశాలలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాం. ఉపాధ్యాయులంతా నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. విద్యార్థులు క్రీడల్లోనూ రాణిస్తున్నారు. ప్రభుత్వం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తోంది. – మట్టా జ్యోత్స్న, హెచ్ఎం -
ఆడ పిల్లల పేర్లు రెడ్ ఇంక్‌తో రాయొద్దన్నాం
సాక్షి, విజయవాడ: పిల్లల్లో సమైక్యతా భావాన్ని పెంచేందుకే స్కూల్ రిజిస్టర్లో మార్పులు తెచ్చామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చదువులమ్మ ఒడిలో పిల్లలందరూ సమానమే. చిన్న వయస్సులో పిల్లల్లో కులాలు, మతాల చర్చకు తావివ్వకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆ ప్రకారంగానే స్కూల్ రిజిస్టర్లో కులం, మతం రాయొద్దని అదేశాలిచ్చాం. ఆడ పిల్లల పేర్లు రెడ్ ఇంక్‌తో రాయొద్దని ఆదేశించాం. పిల్లల టీసీలు మాత్రం గతంలో ఇచ్చినట్టే ఇస్తాం. (స్కూల్ అటెండెన్స్ రిజిస్టర్‌పై కీలక ఉత్తర్వులు జారీ) సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. విద్యార్థులకు ప్రతి పథకాన్ని కులాలు, మతాలకు అతీతంగా ఇస్తున్నాం. సీఎం జగన్ పాలనలో అన్ని కులాలు, మతాలు సమానమే. సీఎం జగన్ గొప్ప మానవతా దృక్పథంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. పిల్లల్లో కుల, మత, లింగ వివక్షకు తావు లేకుండా చూడాలనే సీఎం వైఎస్ జగన్ ఈ ఆలోచన చేశారు' అని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. -
స్కూల్ అటెండెన్స్ రిజిస్టర్‌పై కీలక ఉత్తర్వులు జారీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్కూల్ అటెండెన్స్ రిజిస్టర్‌పై కీలక ఉత్తర్వులు జారీ అయ్యాయి. విద్యార్థుల అటెండెన్స్ రిజిస్టర్లో కుల, మత వివరాలు నమోదు చేయకూడదని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కొన్ని స్కూళ్లలో విద్యార్థుల కుల, మత వివరాలను రిజిష్టర్‌లో నమోదు చేస్తున్నట్టు సమాచారం రావడంతో స్పందించిన స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ వాటిని వెంటనే తొలగించాలని సర్క్యులర్ జారీ చేశారు. -
బాల్యాన్ని ‘నులి’పేస్తోంది..!
పాలమూరు: కడుపులో నులిపురుగులతో పిల్లలు అనేక అనారోగ్య సమస్యలతో సతమతమవుతుంటారు. రక్తహీనత, కడుపునొప్పి వాంతులు శారీరక, మానసిక ఎదుగుదల, ఇతర సమస్యలు ఎదురవుతాయి. ఈ నులిపురుగులను నివారించడమే లక్ష్యంగా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా 15 మండలాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లోని 1 నుంచి 19 సంవత్సరాలలోపు ఉండే చిన్నారులకు, యువతీ యువకులకు అల్బెండజోల్ మాత్రలు వేయాల్సి ఉండగా.. ఈ ఏడాది కరోనాతో పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలు బంద్ ఉండటంతో ప్రభుత్వం ఈ సారి ఈ కార్యక్రమం చేపట్టడం లేదు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం జిల్లాలో 1నుంచి 19ఏళ్ల మధ్య వయసున్న పిల్లలు 2,71,117 బాలబాలికలు ఉన్నారు. ఇందులో సుమారు లక్ష మంది పిల్లలు రక్తహినత, పోషకాహార లోపంతో పాటు ఇతర సమస్యలతో బాధపడుతున్నారు. రక్తహీనత ఉన్నవారిలో ఆకలి లేకపోవడం, బలహీనంగా, నీరసంగా, ఆందోళన ఉండటం లాంటి సమస్యలు వస్తాయి. తరచూ కడుపునొప్పి రావడం జరుగుతుంది. వికారంగా ఉండటం, మలంలో రక్తం వస్తుంది. మాత్రలతో ప్రయోజనాలు : నులి పురుగులను నిర్మూలించడానికి ప్రత్యేకంగా మందులు తీసుకోవడంతో వాటిని పూర్తిగా నాశనం చేస్తే ప్రత్యేక్షంగా రక్తహీనత సమస్య తీరుతుంది. రక్తహీనతను నియంత్రిస్తుంది, రక్తశాతం పెరుగుతుంది, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. విద్యార్థుల్లో ఏకాగ్రత్త పెరుగుతుంది. పోషకాహార లోపాన్ని నివారిస్తుంది. చిన్నారుల్లో పోషక విలువలు పెరుగుతాయి. పిల్లలు తీసుకునే పోషక, ఆహార పదార్థాలు వారి శరీరానికి సరిగ్గా అందుతాయి. పరోక్షంగా పిల్లల్లో వ్యాధి నిరధోక శక్తి పెరుగుతుంది. ఏకాగ్రత, అభ్యసన సామర్థ్యం పెరుగుతుంది. ఈ ప్రయోజనాలు సాధించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ, భారత కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రతి ఏడాది ఆగస్టు 10న జాతీయ నులిపురుగు నిర్మూలన దినం నిర్వహించాలని నిర్ణయించింది. నులిపురుగు నిర్మూలనకు ఒక్క అల్బెండజోల్ మాత్రను నోట్లో వేసుకొని చప్పరిస్తే చాలని వైద్యులు తెలియజేశారు. కరోనా వైరస్ వ్యాప్తితో చేయడం లేదు జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉండటంతో నులి పురుగు నివారణ దినం చేయడం లేదు. వైరస్ కారణంగా మాత్రల స్టాక్ కూడా రాలేదు. ప్రస్తుతం అన్ని రకాల పాఠశాలలు, కళాశాలలు మూతపడి ఉన్నాయి. పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత పిల్లలకు మాత్రలు పంపిణీ చేస్తాం. – డాక్టర్ కృష్ణ, డీఎంహెచ్ఓ ♦ అంగన్వాడీ సెంటర్లు 1,185 ♦విద్యార్థులు 43,353 ♦ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు 1,240 ♦విద్యార్థులు 2,02,220 ♦కళాశాలలు 30 ♦విద్యార్థులు 25,544 ♦జిల్లాలో 1 నుంచి 5 ఏళ్ల వారు 49,725 ♦6 నుంచి 9 ఏళ్ల వారు 1,04,567 ♦10 నుంచి 19 ఏళ్ల వారు 1,11,937 ♦బడిబయట చిన్నారులు 4,888 మంది -
చిన్నారుల్లో కరోనా ప్రభావం తక్కువే: సర్వే
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవంతో ప్రజలందరు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే పాఠశాల విద్యార్థుల్లో కరోనా ప్రభావం తక్కువేనని ఫ్రెంచ్కు చెందిన పాశ్చర్ ఇన్సిస్టిట్యూట్ సర్వే తేల్చింది. కాగా పారిస్‌లోని క్రెపి-ఎన్-వలోయిస్ పట్టణంలో 1,340 మంది ప్రజలతో పాశ్చర్ ఇన్సిస్టిట్యూట్ శాస్త్రవేత్తలు సర్వే నిర్వహించారు. అయితే వీరిలో ఆరు ప్రాథమిక పాఠశాలలకు చెందిన 510 మంది విద్యార్థులు పాల్గొన్నారు. తాజా అధ్యయనంలో 61శాతం మంది విద్యార్థుల తల్లిదండ్రులకు కరోనా సంక్రమించినట్లు సర్వే తేల్చింది. మరోవైపు ఆరోగ్యంగా ఉన్న 7శాతం మంది చిన్నారుల తల్లిదండ్రుల్లో వైరస్ వ్యాప్తి జరగలేదని, అంటే పెద్దల నుంచే ఎక్కువగా కరోనా సోకుతుందని సర్వే పేర్కొంది. తాజా సర్వేల నేపథ్యంలో డెన్మార్క్, స్విట్జర్లాండ్ దేశాలలో పాఠశాలలు(స్కూల్స్) ప్రారంభానికి యాజమాన్యాలు సిద్దమవుతున్నాయి. అయితే వివిధ ప్రాంతాలు, భౌగోళిక పరిస్థితులు, వ్యాధి సంక్రమణ తీవ్రత ఆధారంగా స్కూల్స్ ప్రారంభించే విషయంలో ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. మరోవైపు లాక్డౌన్ సడలింపుల కారణంగా దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల ఉదృతి వేగంగా పేరగుతున్నాయి. కాగా వైరస్ నియంత్రణలో భాగంగా కరోనా టెస్టులు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున చర్యలు చేపడుతున్నాయి. (చదవండి: కరోనా : విదేశాల్లో చిక్కుకున్న వారికి ఊరట) -
చైనా: నదిలో మునిగి 8మంది విద్యార్థుల మృతి
బీజింగ్: నదీ తీరంలో సరదాగా ఆడుకోవడానికి వెళ్లి 8 మంది విద్యార్థులు చనిపోయిన ఘటన చైనాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. చైనాలోని చోంగ్ కింగ్ నగరంలో ఆదివారం రోజున పాఠశాల విద్యార్థులు నది వద్దకు ఆడుకోవడానికి వెళ్లారు. సరదాగా ఆడుకుంటున్న సమయంలో ఓ విద్యార్థి నదిలో పడిపోయాడు. అతన్ని కాపాడేందుకు ఒకరి వెంట ఒకరు అలా మరో ఏడుగురు విద్యార్థులు నదిలోకి దూకారు. దీంతో 8 మంది విద్యార్థులు కూడా నీట మునిగిపోయారు. అయితే.. వీరి మృతదేహాలను సోమవారం ఉదయం నది నుంచి వెలికి తీశారు. కాగా.. వీరిని సిచువాన్ ప్రావిన్స్ సమీపంలోని మిక్సిన్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. ప్రమాద ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. చదవండి: భారత్, చైనాలతో మాట్లాడుతున్నాం: ట్రంప్ -
మన దగ్గర కూడా ఇలానే అవుతుందేమో..!
బీజింగ్: కరోనా.. కష్టాలతో పాటు మనిషి జీవితంలో మరేన్నో మార్పులు తీసుకువచ్చింది. కరోనా ఎఫెక్ట్‌తో ముఖ్యంగా మనందరికి వ్యక్తిగత పరిశుభ్రత బాగా అలవడింది. సామాజిక దూరం, మాస్కులు మన జీవితాల్లో భాగం కానున్నాయి. కరోనా కేవలం మన జీవన విధానాన్ని మాత్రమే కాక పని వేళలను, విధులను, చదువులను అన్నింటిని మార్చబోతోంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఈ మార్పులు ఆచరణలోకి వచ్చాయి. ప్రస్తుతం ఇలాంటి మార్పులకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరలవుతుంది. ప్రపంచానికి కరోనాను పరిచయం చేసిన చైనాలో ప్రస్తుతం సాధరణ పరిస్థితులు నెలకొన్నట్లు ఆ దేశం ప్రకటించింది. కొన్ని నెలల తర్వాత తాజాగా చైనాలో పాఠశాలలు తెరుచుకున్నాయి. ఇంతకు ముందు విద్యార్థులు జామ్మంటూ స్కూల్ లోపలకు పరిగెత్తుకెళ్లేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి కదా. అసలే కరోనా భయం.. ఈ మాయదారి రోగం తగ్గదు.. మన జాగ్రత్తలో మనం ఉండాలి అని భావించిన పాఠశాల యాజమాన్యాలు.. ఐదంచెల శుభ్రత వ్యవస్థను ప్రవేశపెట్టాయి.(వూహాన్లో అందరికీ పరీక్షలు) దీంట్లో భాగంగా ఓ విద్యార్థి పాఠశాల గేటు వద్దకు రాగానే అక్కడి సిబ్బంది విద్యార్థి షూస్‌ను శానిటైజ్ చేస్తారు. అనంతరం స్టూడెంట్ తన మాస్క్‌ను అక్కడే ఉన్న చెత్తడబ్బాలో వేసి లోపలికి వెళ్లాలి. అక్కడ చేతులను శుభ్రం చేసుకోవాలి.తర్వాత విద్యార్థి బట్టలు, బ్యాగ్‌ను శానిటైజ్ చేస్తారు. తర్వాత మరో పరీక్ష చేసి ఆరోగ్యంగా ఉన్నాడని తెలిస్తే అప్పుడు ఆ విద్యార్థిని పాఠశాలలోనికి అనుమతిస్తున్నారు. ఇంత తతంగం ముగిశాక పిల్లలు పాఠశాలలోనికి వెళ్తున్నారు. రెండు రోజుల క్రితం ట్విట్టర్లో షేర్ చేసిన ఈ వీడియో ఇప్పటికే 7 మిలియన్ల వ్యూస్ సాధించింది. మీరు ఓ సారి చూడండి... -
చేతిలో ఉంచండి
లాంగ్ బెల్ కొడితే స్కూల్ అయిపోతుంది. లాక్డౌన్లో ఇప్పుడు స్కూలే లేదు. కణ్ణగి మేడమ్ మనసు స్కూలు పిల్లల వైపు లాగుతోంది. పిల్లల్ని తప్ప బెల్ని చూసుకోలేదు తనెప్పుడూ. తిన్నారో లేదో! ఎలా ఉన్నారో ఏమో! అందరి తల్లిదండ్రులూ అంతంత మాత్రమే. పనులు ఉన్నప్పుడే పస్తులు తప్పనివాళ్లు. ఇప్పుడు పనులకీ పస్తులు పడి ఉంటారు. వాళ్లకేదైనా చేయాలనుకున్నారు. ఇంటింటికీ తిరిగి వెయ్యి రూపాయలిచ్చి వెళ్లారు. లాక్డౌన్లో పూట గడవని ఇళ్లు తుప్పాపురంలో చాలానే ఉండి ఉంటాయి. వాటిల్లో 41 ఇళ్లను మాత్రం ఎంపిక చేసుకోగలిగారు కణ్ణగి మేడమ్. అరియళూరు (తమిళనాడు) లోని ప్రభుత్వ పాఠశాల హెచ్.ఎం. ఆమె. అరియళూరుకు దగ్గర్లోనే ఉంటుంది తుప్పాపురం. బడిలో చదువుతున్న మొత్తం 62 మంది పిల్లలూ ఆ 41 ఇళ్లవాళ్లే. అదే బడిలో పరమేశ్వరీ వరదరాజన్ అనే టీచర్ పని చేస్తున్నారు. కణ్ణగి మేడమ్ అక్కడికి దగ్గర్లోని కొడంగుడి నుంచి, పరమేశ్వరి టీచర్ కళత్తూరు నుంచి రోజూ స్కూలుకు వచ్చి వెళుతుంటారు. కణ్ణగి మేడమ్ పన్నెండేళ్లుగా అక్కడ పనిచేస్తున్నారు. పరమేశ్వరి టీచర్ రెండున్నరేళ్లుగా ఉన్నారు. పాఠశాలలోని ప్రతి విద్యార్థి గురించి, వారి కుటుంబ పరిస్థితుల గురించి వారికి తెలుసు. అందుకే ఒక విద్యార్థి స్కూలుకు రాలేదంటే ఎందుకు రాలేదని కాకుండా, ఎందుకు రాలేకపోయారో తెలుసుకుంటారు. ఇప్పుడు పిల్లలెవరూ రావడం లేదు. ఎవరు ఎలా ఉన్నారో అడగడానికి ఎవరుంటారు? లాక్డౌన్ పరిస్థితుల్ని కళ్లారా చూస్తూ ఉన్నారు కనుక అడిగే అవసరం లేదు. పనుల్లేవు కాబట్టి పస్తులే. పిల్లల కుటుంబాలకు సహాయం చేయాలనుకున్నారు కణ్ణగి మేడమ్. ఇంటికి వెయ్యి రూపాయలు ఇవ్వాలని అనుకున్నారు. ‘‘ఇద్దరం కలిసి తుప్పాపురం వెళ్లి ఒక్కో ఇంటికి ఇచ్చి వద్దాం’’ అని పరమేశ్వరి టీచర్‌తో అంటే.. ‘‘మేడమ్.. నేను కూడా కొద్దిగా డబ్బు ఇస్తాను’’ అన్నారు. అక్కరలేదని సున్నితంగా చెప్పినా వినలేదామె. ఐదు వేలు తెచ్చిచ్చారు. మేడమ్‌వి 36 వేలు, టీచర్‌వి 5 వేలు కలిపి 41 వేలు నలభై ఒక్క ఇళ్లకూ వెళ్లి ‘చేతిలో ఉంచండి’ అని పంచిపెట్టారు. వాళ్లకు సహాయంగా పాఠశాల సిబ్బంది ఒకరిద్దరు ఉన్నారు. డబ్బులు చేతిలో పెడుతున్నప్పుడు చూడాలి ఆ తల్లిదండ్రుల సంతోషం. పిల్లలకు చదువు చెప్పి జీవితాన్నిచ్చే టీచర్లు పెద్దలకు బతుకునివ్వడానికి ఇంటికొచ్చారు. దండం పెట్టి, కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప ఆ పేదలు ఏం చెయ్యగలరు? ‘‘నాకూ ఈ ఆలోచన రాకపోయేది. మా అబ్బాయే అన్నాడు.. ‘మమ్మీ మీ స్కూల్లో అందరూ పేద పిల్లలే అన్నావు కదా.. వాళ్ల పేరెంట్స్‌కి ఈ లాక్డౌన్లో పనులు దొరకవు. మనం డబ్బులు ఇవ్వొచ్చు కదా’ అని. మంచి ఆలోచన అనిపించింది’’ అంటారు నవ్వుతూ కణ్ణగి మేడమ్. -
ఆ అమ్మాయి ఇంట్రావర్త్‌గా మారింది..
‘స్నేహ... నైంత్ క్లాస్ అమ్మాయి. స్కూళ్లు ఓపెన్ అయితే టెన్త్‌లో చేరుతుంది. కొద్ది రోజులుగాఅన్నం సరిగ్గా తినడం లేదు. ఆకలి ఉండటం లేదు. ముభావంగా ఉంటోంది. నిద్ర కూడా సరిగ్గా లేదు. ఎప్పుడు నిద్ర పోతుందో, ఎప్పుడు మేల్కొంటుందోతెలియదు. తల్లిదండ్రులు ఆన్లైన్లో మానసిక వైద్య నిపుణులను సంప్రదించారు. లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితం అవడం వల్ల ఆ అమ్మాయి ఇంట్రావర్త్ మారినట్లు డాక్టర్లు చెప్పారు. కౌన్సెలింగ్ ఇచ్చారు. ఒక్క స్నేహ మాత్రమే కాదు, చాలామంది పిల్లలపైన లాక్డౌన్ అనేకరకాలుగా ప్రభావంచూపుతోంది. ప్రత్యేకించి టీనేజ్ పిల్లలు వివిధ రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. సాక్షి, సిటీబ్యూరో :ఆడుతూ.. పాడుతూ.. గలగలా మాట్లాడుతూ.. స్కూళ్లు, కాలేజీల్లో స్నేహితులతో కలిసి సరదాగా కబుర్లు చెప్పుకొనే పిల్లలు ఇళ్లకే పరిమితం కావడంతో ఆకస్మాత్తుగా అంతర్ముఖులుగా మారుతున్నట్లు మానసిక నిపుణులు చెబుతున్నారు. ఉదయం నిద్రలేచింది మొదలు రాత్రి తిరిగి నిద్రకు ఉపక్రమించే వరకు కేవలం ఇంటికే పరిమితం కావడం, ఎలాంటి ప్రత్యేకత, ఎలాంటి మార్పు లేని రొటీన్ దినచర్య పిల్లలను ఒంటరితనానికి గురిచేస్తోంది. మరోవైపు తల్లిదండ్రులతో కలిసి ఇళ్లలోనే ఉంటున్నా వారి మధ్య స్నేహపూర్వ వాతావరణం లేకపోవడం వల్ల ఒకవిధమైన డిప్రెషన్‌కు గురవుతున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జీవన శైలిలో అనూహ్యమైన మార్పులు.. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం లాక్డౌన్ విధించినట్లుగానే తల్లిదండ్రులు పిల్లలను కట్టడి చేస్తున్నారు. ఇంట్లోనే ఉన్నప్పటికీ నిరంతర నిఘా నేత్రాల్లో వారిని కనిపెట్టుకొని ఉండటం, ఏం చేయాలో, ఏం చేయవద్దో పదే పదే చెప్పడం వల్ల స్వేచ్ఛయుత వాతావరణానికి దూరం అవుతున్నారు. ‘లాక్డౌన్ అనేదే ఒక శిక్ష లాంటిది అయితే తల్లిదండ్రుల ఆంక్షలు వారి పట్ల అదనపు శిక్షగా మారుతున్నాయి.’ అని చెప్పారు ప్రముఖ మానసిక నిపుణులు డాక్టర్ లావణ్య. ‘ఎప్పుడు తినాలి, ఏం తినాలి, ఏ టైమ్‌కు నిద్రపోవాలి, టీవీల్లో, నెట్లో, ఫోన్లలో ఎలాంటివి వీక్షించాలి వంటి అనేక అంశాలపై ఈ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ‘అలా కాకుండా పిల్లలు తమ అభిప్రాయాలను, ఆలోచనలను తల్లిదండ్రులతో స్వేచ్ఛగా పంచుకొనే స్నేహపూరితమైన వాతావరణం ఉండాలి.’ అని ఆమె అన్నారు. లాక్డౌన్ కారణంగా, పేరెంట్స్ ఆంక్షల వల్ల వచ్చిన మార్పుల్లో భాగంగా చాలామంది పిల్లలు పగటిపూట నిద్రపోతూ రాత్రుళ్లు ఎక్కువ సేపు మేల్కొని ఉంటున్నారు. మరోవైపు బయటకు వెళ్లి ఆడుకొనేందుకు కూడా అవకాశం లేదు. వీటికి తోడు 24 గంటలు ఇంట్లో ఉండటం వల్ల జంక్‌ఫుడ్, ఇతరత్రా మోతాదుకు మించి తీసుకొనే ఆహారం పిల్లలను స్థూలకాయంలోకి నెడుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. ఏమిటీ ఈ వైరాగ్యం.. నిజానికి ఆన్లైన్ శిక్షణ కార్యక్రమాలు, సమ్మర్ క్యాంపులు, టీవీల్లో సినిమాలు, ఇంటర్నెట్ వంటి అన్ని రకాల సదుపాయాలు ఇంట్లోనే ఉన్నప్పటికీ ఒకరకమైన వైరాగ్యం నెలకొంటోంది. ఇంట్లో అందరూ ఉంటున్నా ఎవరి ప్రపంచం వారిదే అన్నట్లుగా మారింది. ‘సాధారణంగా అయితే ఉదయం ఇళ్ల నుంచి బయటకు వెళ్లి తిరిగి సాయంత్రం ఇళ్లకు చేరుకున్నప్పుడు ఒకరికొకరు చెప్పుకునేందుకు చాలా విశేషాలు ఉంటాయి. పిల్లలు స్కూల్ విశేషాలను చెబుతారు. పెద్దవాళ్లు ఆఫీసు ముచ్చట్లు ఏకరువు పెడుతారు. దీంతో కుటుంబ సభ్యుల మధ్య కమ్యూనికేషన్స్ పెరుగుతాయ. ఏ రోజుకు ఆ రోజు కొత్తదనాన్ని సంతరించుకుంటుంది. కానీ లాక్డౌన్ కారణంగా జీవితంలో అలాంటి వైవిధ్యానికి అవకాశం లేకుండా పోతోంది.’ అని ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ సంహిత అన్నారు. పిల్లలు స్నేహితులతో, టీచర్లతో గడిపే సమయం ఎంతో విలువైంది. వారిలో సృజనాత్మకతను పెంచుతుంది. ఇలా చేస్తే కోపం..రమ్మన్నా రాదు.. ఒక్కోసారి భార్యాభర్తలపై ఒకరిపై ఒకరికి కోపం రావచ్చు.. ఇలాంటప్పుడు ఆ కోపం తగ్గాలంటే సాధారణంగా ఒకళ్లనొకరు తిట్టేసుకుంటారు. తర్వాత కోపం తగ్గాలంటే సరదాగా గడిపిన రోజులు, మధుర క్షణాలను గుర్తుచేసుకోండి.. అప్పుడు కోపం రమ్మన్నా రాదు.. తిట్టమన్నా తిట్టరు పైగా అయ్యో పాపం అనిపిస్తుంది. ఇలాంటి సమయంలో మీ పిల్లలకి మీ మీద గౌరవం పెరుగుతుంది. మీ మాట వింటారు.. కోపాన్ని బలవంతంగా నియంత్రించుకోవడం మంచిది కాదు.. అలాని కోపాన్ని ప్రదర్శించడం అసలే మంచిది కాదు. నేను చెప్పిన విధానంలో కోపం మంచులా కరిగి పోతుంది. – బి.మల్లిఖార్జున దీక్షిత్, కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ ఉచిత కౌన్సెలింగ్ 18 సంవత్సరాలలోపు అమ్మాయిలు, అబ్బాయిలు తమ అభిప్రాయాలు, ఆలోచనలు పంచుకునేందుకు వారు ఎదుర్కొంటున్న మానసిక సమస్యలను వారితోనే చర్చించి పరిష్కరించేందుకు టెలీకౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షులు అచ్యుతరావు తెలిపారు. డిప్రెషన్‌కు గురయ్యే పిల్లలకు ప్రముఖ సైకోథెరపిస్ట్ డాక్టర్ లావణ్య మిరియం ఫోన్ కౌన్సిలింగ్ ద్వారా సమస్యలకు పరిష్కారం చూపుతారు. ఈ సేవలు పూర్తిగా ఉచితం. పిల్లలు, వారి తల్లిదండ్రులు ప్రతిరోజు సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు ఫోన్: 99897 52455 లేదా 77300 73344 నెంబర్లలో సంప్రదించవచ్చు. -
పాఠశాలలోకి చిరుతపులి.. భయంతో పరుగులు
పిలిభిత్ : ప్రభుత్వ పాఠశాల ఆవరణలోకి ఒక చిరుతపులి ప్రవేశించి విద్యార్థులను భయబ్రాంతులకు గురి చేసిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని పిలిభిత్‌లో చోటుచేసుకుంది. పులిని చూసి హడలిపోయిన విద్యార్థులు తరగతి గదుల్లోకి పరుగులు తీశారు. అయితే చిరుతపులి పాఠశాల ఆవరణలో ఉన్న ఒక కుక్కపై దాడి చేసి దానిని పిలిభిత్ టైగర్ రిజర్వ్‌లోని బారాహీ అటవీ ప్రాంతంలోకి ఈడ్చుకుపోయింది.ఈ క్రమంలో పాఠశాల ప్రధనోపాధ్యాయురాలు రావడంతో విద్యార్థులు ఆమెకు జరిగిందంతా వివరించారు. దీంతో ఆమె ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు తెలపడంతో వారు వచ్చి పాఠశాలను సందర్శించి చిరుతపులి పాద ముద్రలు సేకరించారు. కాగా విద్యార్థుల భద్రతతో పాటు చిరుత కదలికలను గుర్తించేందుకు పాఠశాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీనియర్ పారెస్ట్ అధికారి అజ్మేర్ యాదవ్ తెలిపారు. అయితే చిరుతపులి ఒకట్రెండు రోజుల్లో తిరిగి అడవికి వెళ్లిపోతుందని అధికారులు భావిస్తున్నారు. -
బాంగ్రా డ్యాన్స్‌కు మెలానియా ట్రంప్ ఫిదా
న్యూఢిల్లీ : రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి వచ్చిన ఆయన సతీమణి మెలానియా ట్రంప్ మంగళవారం రాత్రి తిరిగి అమెరికా వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. రెండు రోజుల పర్యటనలో తన డ్రెస్సింగ్, హావభావాలు, మాట్లాడే తీరుతో అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్న మెలానియా వెళ్తూ వెళ్తూ ఎన్నో మధుర స్మృతులను తన వెంట తీసుకెళ్లారు. పర్యటనలో భాగంగా మంగళవారం ఢిల్లీలోని నానక్పూర్‌లో ఉన్న సర్వోదయా ప్రభుత్వ పాఠశాలను అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ సందర్శించారు. పాఠశాలలో అమలు చేస్తున్న హ్యాపినెస్ విద్యా విధానాన్ని మెలానియా స్వయంగా పరిశీలించారు. క్లాస్‌రూంలో చిన్నారులతో ముచ్చటించిన మెలానియా.. విద్యార్థులు వేసిన సూర్య నమస్కారాలు ఆసక్తిగా తిలకించారు. తరగతి గదిలో టీచర్‌గానూ మారిన మెలానియా చిన్నారులతో ముచ్చటించారు. (అందరి చూపులు ఆమె వైపే..!) ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల డ్యాన్స్‌ను చూస్తూ ఉత్సాహంగా గడిపారు. తర్వాత పాఠశాల ఆవరణలో స్టేజ్‌పైన కొంతమంది విద్యార్థినులు పంజాబీ పాటకు నృత్యం చేస్తుండగా మెలానియా విద్యార్థుల పక్కన కూర్చొని చప్పట్లు కొడుతూ వారిని ఎంకరేజ్ చేయడం ఆద్యంతం ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో ఒక పిల్లాడు యూఎస్ జెండాను తన చేతిలో పట్టుకొని బాంగ్రా డ్యాన్స్ చేయడం మెలానియాను విశేషంగా ఆకర్షించింది. మెలానియా ఒక గంట పాటు సర్వోదయా స్కూల్ విద్యార్థులతో ఆనందంగా గడిపారు. కాగా మెలానియా పిల్లలతో గడిపిన ఆనంద క్షణాలను ఏఎన్ఐ సంస్థ తన ట్విటర్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల్లో 'హ్యాపినెస్ విద్యా విధానాన్ని' అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమానికి కేజ్రీవాల్‌కు ఆహ్వానం లేకపోవడంపై పలువురు విమర్శలు వ్యక్తం చేశారు. (ట్రంప్ పర్యటన : మిడి డ్రెస్‌లో ఇవాంకా) #WATCH Delhi: First Lady of the United States, Melania Trump watches a dance performance by students at Sarvodaya Co-Ed Senior Secondary School in Nanakpura. pic.twitter.com/dBCuTzvymF — ANI (@ANI) February 25, 2020 -
టిఫిన్ తినకుంటే మార్కులు తగ్గుతాయి!
లండన్: పిల్లలు ఉపాహారం తినకుండానే స్కూల్‌కు వెళ్తున్నారా? అయితే పరీక్షల్లో వారి మార్కులు తగ్గే అవకాశాలు ఎక్కువంటున్నారు శాస్త్రవేత్తలు. బ్రిటన్‌లోని కొందరు ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులపై లీడ్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనం ఈ విషయం తేలింది. తగినన్ని పోషకాలు లేకపోవడం విద్యార్థుల మార్కులపై ప్రభావం పడుతుందని తాము గుర్తించామని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త కేటీ అడోల్ఫస్ తెలిపారు. పరిగణనలోకి తీసుకున్న విద్యార్థులందరి గ్రేడ్స్‌ను పాయింట్ల రూపంలోకి మార్చినప్పుడు బ్రేక్‌ఫాస్ట్ చేసే వారికి ఎక్కువ పాయింట్లు రాగా, మిగిలిన వారికి తక్కువ వచ్చాయి. సామాజిక, ఆర్థిక స్థితిగతులతోపాటు, వయసు, బీఎంఐ, ఆడ? మగ? అన్న ఇతర అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్నా ఫలితాల్లో మార్పేమీ లేదని వివరించారు. -
వామ్మో కుక్క
కుత్బుల్లాపూర్: నగరంలో వీధికుక్కలు చెలరేగిపోతున్నాయి. రాత్రి పగలు తేడా లేకుండా దాడులకు తెగబడుతున్నాయి. రెండేళ్ల క్రితం వరకు 3.5 లక్షలున్న వీటి సంఖ్య ఇప్పుడు అనూహ్యంగా 8 లక్షలకు పెరిగిపోయింది. నిధులు లేవన్న కారణంతో ప్రభుత్వం వీధి శునకాల సంతాన నిరోధక శస్త్ర చికిత్సలను తగ్గించడంతో వాటి సంతానం ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతోంది. మంగళవారం కుత్బుల్లాపూర్ పరిధి ప్రసూననగర్‌లోపాఠశాల నుంచి ఇంటికి వెళుతున్న ఏడుగురు చిన్నారులపై వీధికుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ప్రసూననగర్ రామాలయం వీధికి చెందిన చిన్నారులు జ్ఞానేశ్వర్, హరిణి, లీనా, శ్రవణ్ తదితరులు పాఠశాల నుంచి ఇంటికి వెళుతుండగావీధి కుక్క ఒక్కసారిగా దాడి చేసింది. దీంతో సురేష్‌కుమార్ అనే వ్యక్తి దానిని తరిమికొట్టి చిన్నారులను కాపాడారు. సంక్షేమ సంఘం ప్రతినిధులు నాగశేఖర్‌గౌడ్, నాగేశ్వరరావు, నారాయణలకు సమాచారం అందించడంతో వారు చిన్నారులను స్థానిక ఓ ప్రైవేట్ ఆస్పత్రికితరలించారు. -
గాంధీ ఎలా ఆత్మహత్య చేసుకున్నారు?
అహ్మదాబాద్: అదేంటి మహాత్మా గాంధీ ఆత్మహత్య చేసుకోవడమేంటి అనుకుంటున్నారా? గాంధీని గాడ్సే చంపారన్న విషయం అందరికీ తెలిసిందే కానీ, గుజరాత్‌లోని ఓ పాఠశాల ప్రశ్నపత్రంలో మాత్రం గాంధీ ఎలా ఆత్మహత్య చేసుకున్నారు? అనే ప్రశ్నను అడిగారు. ఈ ప్రశ్నను చూసి ఆశ్చర్యపోయిన విద్యాశాఖాధికారులు దీనిపై విచారణ జరపాలని ఆదేశించారు. ‘సుఫలాం శాల వికాస్ సంకుల్ పేరిట గుజరాత్‌లోని గాంధీనగర్‌లో నిర్వహిస్తున్న పాఠశాలలో 9వ తరగతి ఇంటర్నల్ పరీక్షలో ఈ ప్రశ్న అడిగారు’అని ఓ అధికారి తెలిపారు. కాగా, 12వ తరగతి విద్యార్థులకు ‘మీ ప్రాంతంలో మద్యం అమ్మకాలు పెంచడానికి ఏం చేయాలో తెలుపుతూ పోలీస్ ఉన్నతాధికారికి లేఖ రాయండి’అనే మరో విచిత్రమైన ప్రశ్న ఎదురైంది. దీనిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని గాంధీనగర్ జిల్లా విద్యాధికారి భరత్ వధేర్ వెల్లడించారు. -
ఐ గురు ఎలా పనిచేస్తుందంటే..
ఐ గురు (iguru) యాప్‌ను సృష్టించి స్కూల్లో చదివే పిల్లలకు, ముఖ్యంగా పేరెంట్స్‌కు ఎటువంటి సమస్యలు, ఇబ్బందులు లేకుండా పిల్లలు– పేరెంట్స్ మధ్య వారధిగా మార్చారు డాక్టర్ హర్షవర్ధన్ కృష్ణ. హాజరు నుంచి లీవ్ లెటర్ వరకు అన్నీ యాప్ ద్వారానే పొందేలా చేశారు. అంతేకాదు.. స్కూలుకు వెళ్లిన పిల్లలు ఎక్కడున్నారు.. ఇంటికి వచ్చేటప్పుడు ఏ ప్రాంతంలో ఉన్నారో కూడా సులభంగా తెలుసుకునేలా యాప్‌ను రూపొందించారు. శ్రీనగర్‌కాలనీ: అతనో డాక్టర్.. విదేశాల్లో పనిచేశారు. పేద విద్యార్థులకు స్కాలర్షిప్స్, ఉచిత వైద్య శిబిరాలు వంటి సామాజిక సేవల్లోనూ ముందున్నారు. అయినా ఆయనలో ఏదో వెలితి. తాను పుట్టిన గడ్డకు.. ఇక్కడి సమాజానికి సేవ చేయాలని పరితపించి తిరిగి భారత దేశం వచేంచశారు. ఇక్కడి పరిస్థితులపై అవగాహన ఉన్న ఆయన పర్యావరణానికి మేలు చేసేందుకు ‘పేపర్’ వినియోగాన్ని తగ్గించాలను నిర్ణయించుకున్నారు. చెట్లను నరికి కాగితాన్ని తయారు చేయడం వల్ల భూతాపం పెరిగిపోయిందని గ్రహించారు. ముఖ్యంగా స్కూళ్లు, కాలేజీల్లో పేపర్ వాడకం ఎక్కువగా మారిందని అంచనా వేసిన ఆయన ‘పేపర్‌లెస్’ విధానానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా దాదాపు అన్ని విధులకు ఉపయోగపడేలా సౌకర్యాలు, హుంగులతో సరికొత్త యాప్‌కు శ్రీకారం చుట్టారు నగరానికి చెందిన డాక్టర్ హర్షవర్ధన్ కృష్ణ. అంతేకాదు.. ఆ యాప్‌ను స్కూల్స్, కాలేజీలకు ఉచితంగా అందింది టెక్నాలజీ వైపు వారిని మార్చి పేపర్‌లెస్ విధానం అవలంబించేలా చేశారు. ఎంతోమంది పేరెంట్స్‌కు ఉపయోపడే యాప్‌ను అందించిన ఆయన తన ప్రస్థానాన్ని, యాప్ విశేషాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. పర్యావరణానికి మేలు చేయాలని.. మాది మహబూబ్‌నగర్ జిల్లా తాండ్ర గ్రామం. ఉస్మానియాలో ఎంబీబీఎస్ చేశాను. విదేశాల్లో 25 సంవత్సరాలు డాక్టర్‌గా సేవలందించాను. పేద విద్యార్థులకు స్కాలర్షిప్స్, సామాజిక సేవా కార్యక్రమాలను కుటుంబ సభ్యులు, సన్నిహితులతో దేశీ, విదేశాల్లో నిర్వహించేవాడిని. అయితే, పుట్టిన దేశానికి, సమాజానికి నా వంతు సాయం చేయాలన్న తపన నన్ను వెంటాడేది. అందుకోసం నగరానికి వచ్చేశాను. పర్యావరణ పరిరక్షణ అంటే నాకు చాలా ఇష్టం. మన దేశంలో పేపర్ కోసం చెట్లను అధికంగా నరికేస్తున్నారని తెలుసుకున్నాను. అందుకు అనుగుణంగా పేపర్‌లెస్ విధానం తీసుకు రావాలని భావించాను. ‘స్మార్ట్ టెక్నాలజీ’తోనే అది సాధ్యమవుతుందని.. అందుకు ‘ఐ గురు’ యాప్‌ను తయారు చేశాం. ఐ గురు ఎలా పనిచేస్తుందంటే.. స్కూల్స్, కాలేజీలతో పాటు పలు ఇనిస్టిట్యూషన్స్‌లో పేపర్‌ను పూర్తిస్థాయిలో తగ్గించేలా అన్ని సౌకర్యాలతో ఐగురు యాప్ రూపకల్పన చేశాం. విద్యార్థులకు కాకుండా పేరెంట్స్‌కు ఈ యాప్ చాలా ఉపయుక్తంగా ఉంటుంది. స్కూల్‌కు వెళుతూ, తిగిచి వచ్చే పిల్లలు ఎక్కడ ఉన్నారో స్పష్టంగా యాప్ జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. పిల్లలకు యాప్ ద్వారా క్షణాల్లో సెలవును తీసుకోవచ్చు. స్కూల్లో జరిగే ప్రతి విషయాన్ని, పిల్లల చదువుతో పాటు వారి రోజువారి దినచర్యలను ఈ యాప్‌తో తెలుసుకునే ఏర్పాట్లు కల్పించాం. ఇళ్లు, ఫోన్ నంబర్ మారినా సరే.. యాప్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు. విద్యార్థులు బోనఫైడ్‌తో పాటు ఎలాంటి సర్టిఫికెట్లను సులువుగా అప్లై చేయవచ్చు. ఫీజులు సైతం వాయిదాల పద్ధతిలో ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు కట్టవచ్చు. పేరెంట్స్‌కు సింహభాగంగా పెద్దపీట వేసే విధంగా అన్ని హంగులతో యాప్‌ను తయారు చేసి పేపర్‌లెస్ గో గ్రీన్ ఇనిస్టిట్యూషన్స్‌కు అందించాం. సామాజిక దృక్పథంతో స్కూల్స్, కాలేజీలకు ఏడాది పాటు ఉచితంగా యాప్‌ను అందించాం. వందలాది స్కూల్స్‌కు యాప్‌ను ఎలా వాడాలో తెలిపే టీమ్‌తో వారికి అవగాహన కల్పించాం. యాప్‌ను వాడిన ఇనిస్టిట్యూషన్స్ సంతృప్తి వ్యక్తం చేశాయి. ఏడాది తర్వాత కేవలం మెయింటనెన్స్ కోసం ఒక్కో విద్యార్థికి చాలా తక్కువ ఫీజుతో ఈ యాప్‌ను ఇనిస్టిట్యూషన్స్‌కు అందిస్తున్నాం. ఐ–గురు యాప్ వాడిన పేరెంట్స్ చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. నేను డాక్టర్‌గా పనిచేసినా ఓ సదుద్దేశంతో చేస్తున్న ఈ పని చాలా సంతృప్తినిస్తోంది.. అంటూ ముగించారు. -
పిల్లలకిస్తోన్న భోజనాన్ని ప్రశ్నించడం నేరమా?
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీర్జాపూర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఆగస్టు 22వ తేదీ మధ్యాహ్నం పిల్లలు ఓ రొట్టెముక్కను ఉప్పులో నంజుకుని తింటున్న వీడియో ఒకటి ఇటీవల మీడియాలో హల్చల్ చేసింది. ఇది ఆ ఒక్క రోజు కనిపించిన దశ్యం కాదని, ఎప్పుడూ జరిగేదేనని ఆ దశ్యాన్ని వీడియో తీసిన హిందీ వార్తా పత్రిక ‘జనసంఘర్ష్ టైమ్స్’ జర్నలిస్ట్ పవన్ జైస్వాల్ తెలిపారు. ఈ వీడియో వార్తా కథనంపై తక్షణమే స్పందించిన మీర్జాపూర్ జిల్లా మేజిస్ట్రేట్ దార్యాప్తు జరిపి ఆ పాఠశాల అధికారులను సస్పెండ్ చేశారు. సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని ఆదిత్యనాథ్ నేతత్వంలోని బీజేపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే ఆశ్చర్యకరంగా గత ఆదివారం నాడు యూపీ పోలీసులు జర్నలిస్ట్ పవన్ జైస్వాల్‌పై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. వీడియో కథనం వెనక ఆయన నేరపూరిత కుట్రపన్నారంటూ ఎఫ్ఐఆర్లో ఆరోపించారు. పాఠశాల ఉన్న సియూర్ గ్రామ పెద్ద ప్రతినిధి అయిన రాజ్‌కుమార్ పాల్‌తోపాటు ఓ గుర్తుతెలియని వ్యక్తిని కూడా ఇందులో నిందితులుగా చేర్చారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకంలో రోటి, సోయాబీన్, ఇతర కూరగాయలు, లేదా రోటి, దాల్ లేదా పలావును తప్పనిసరిగా సర్వ్ చేయాలంటూ యూపీ ప్రభుత్వం అధికారులకు మార్గదర్శకాలను సూచించింది. ప్రతి రోజు 450 గ్రాముల క్యాలరీలు, 12 గ్రాముల ప్రొటీన్లు విధిగా ఉండాలని కూడా నిర్దేశించింది. యూపీలో బడి పిల్లలు పౌష్టికాహార లోపంతో ఎక్కువగా బాధ పడుతున్నందున ఆహారం విషయంలో మార్గదర్శకాలు అవసరం అయ్యాయి. భారత దేశం మొత్తం మీద 4.66 కోట్ల మంది ఐదేళ్ల లోపు పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధ పడుతున్నారని, ఈ విషయంలో భారత్ ప్రపంచంలోనే దిగువ నుంచి మూడో స్థానంలో ఉందని 2018లో విడుదలైన ‘ప్రపంచ న్యూట్రిషన్ రిపోర్ట్’ తెలియజేస్తోంది. బడి పిల్లల్లో పోష్టికాహార లోపాన్ని సరిదిద్ది వారిని అంటు రోగాల బారిన పడకుండా నిరోధించడంతోపాటు వారిని పాఠశాలలకు ఆకర్షించడానికి, వారిలో కుల, మత భేదాలు లేకుండా సామరస్యం పెంపొందించడానికి 1995లో కేంద్ర మానవ వనరుల అభివద్ధి శాఖ ఈ ‘మధ్యాహ్న భోజన పథకం’ను దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్‌ను అమలు చేయడంలో కొన్ని రాష్ట్రాల్లో అప్పుడప్పుడు అవకతవకలు జరుగుతూనే ఉన్నాయి. 2013లో బీహార్‌లో విషాహారం సరఫరా వల్ల 23 మంది బడి పిల్లలు మరణించారు. పశ్చిమ బెంగాల్‌లోని ఓ పాఠశాలలో తనిఖీ నిర్వహించగా తెల్ల అన్నం, ఉప్పును మాత్రమే పెట్టిన ఘోరం బయట పడింది. యూపీలోని ఐదేళ్లలోపు పిల్లల్లో ఎక్కువ మంది పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధ పడుతున్నట్లు పలు నివేదికలు ఇప్పటికే బహిర్గతం చేశాయి. మధ్యాహ్న భోజనం పథకంలో లొసుగులను పూడ్చేందుకు కఠిన చర్యలు తీసుకోవాల్సిన యోగి ఆధిత్యనాథ్ ప్రభుత్వం, పథకం అమలు తీరును బయటన పెట్టిన జర్నలిస్టుపై చర్య తీసుకోవడం ఏమిటో ఎవరికి అర్థంకాని విషయం. -
సోషల్ మీడియా బూచోళ్లు..
సాక్షి,హైదరాబాద్ : వినోదం, ఆటలు, స్నేహం పేరిట సామాజిక మాధ్యమం వేదికగా చిన్నారులకు ‘సోషల్ కింకరులు’గాలాలు వేస్తున్నారు. వీరికి చిక్కితే అంతే సంగతులు. మెల్లిగా మాట్లాడి స్నేహం చేస్తారు. వ్యక్తిగత వివరాలు అడుగుతారు. నగ్నఫొటోలు సేకరిస్తారు. వాటితో బ్లాక్మెయిల్ చేస్తారు. పిల్లలతో చేయరాని పనులు చేయిస్తారు. వీరిని వినోదం పంచే వస్తువులుగా, కోరికలు తీర్చుకునే యంత్రాలుగా వాడతారు. వీరి వికృత చేష్టలకు అన్నెంపుణ్యం తెలియని టీనేజర్లు బలవుతున్నారు. రష్యాలో ఓ పిచ్చివాడు రూపొందించిన బ్లూవేల్ గేమ్ కారణంగా మన దేశంలో అనేకమంది చిన్నారులు ప్రాణాలు తీసుకున్నారు. పిల్లల తల్లులకు వాడు జీవితాంతం తీరని కడుపు కోత మిగిల్చాడు హైదరాబాద్‌లో ఓ కామాంధుడు ఫేస్బుక్ వేదికగా 15 ఏళ్ల బాలికకు ఎరవేసి, ఎత్తుకెళ్లి అత్యాచారయత్నం చేశాడు. ప్రతిఘటించడంతో బాలికను బండరాయితో మోది పొట్టనబెట్టుకున్నాడు హైదరాబాద్‌లోని ఓ కోచింగ్ సెంటర్లో చదువుకునే టీనేజీ కుర్రాడిని తప్పుడు చిరునామాతో ఓ మహిళ వలలో వేసుకుంది. ఆ కుర్రాడు పెళ్లికి కూడా సిద్ధమయ్యాడు. తల్లిదండ్రులకు తెలిసి నిలదీయడంతో రేప్ కేసు పెడతానని బెదిరించింది. గత్యంతరం లేక తల్లిదండ్రులు ఆమె అడిగినంత చెల్లించి, పిల్లాడిని మరో ఊరుకు మార్చారు. తియ్యటి మాటలతో వల.. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లో చాలామంది యువకులు టీనేజీ అమ్మాయిలు, అబ్బాయిలకు అమ్మాయిల ఫొటోలతో గాలం వేస్తున్నారు. తర్వాత బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజుతున్నారు. ఇంకొందరు మరో అడుగు ముందుకేసి ఏకంగా ప్రాణాలు తీసేస్తున్నారు. ఇటీవల సూర్యాపేటలో ఉండే ఓ బాలిక గోదావరిజిల్లాకు చెందిన ఓ యువకుడి వలలో పడింది. అతడి తియ్యటి మాటలకు పొంగిపోయింది. చెప్పినట్లు చేసింది. ఇంట్లో నగలన్నీ ఆ యువకుడికి ఇచ్చింది. ఆ నగలతో సదరు యువకుడు కారు కొనుక్కుని జల్సాలు చేశాడు. తల్లిదండ్రులు ఈ జాగ్రత్తలు పాటించాలి.. రోజులో 8 గంటలు నిద్రపోతే, 8 గంటలు కాలేజ్ లేదా స్కూల్లో ఉంటారు. ఇక మిగిలిన 8 గంటల సమయంలోనే కొత్త స్నేహాల కోసం వెదుకుతుంటారు. రోజువారీ పనులకు 2 గంటలు పోయినా.. ఇక మిగిలింది 6 గంటలు. ఈ సమయం చాలు.. సైబర్ కింకరులు పిల్లలను గద్దల్లా తన్నుకుపోవడానికి. సైబర్ వేధింపులకు గురైన పిల్లలు ముభావంగా, భయం భయంగా ఉంటారు. అన్నం సరిగా తినరు. రాత్రివేళల్లో నిద్రపోకుండా నిత్యం స్మార్ట్‌ఫోన్ చెక్ చేస్తుంటారు. అలాంటి వారిని ఏకాంతంగా అసలు వదలకండి. వారి ఫోన్‌కు లాక్ చేస్తామంటే ఒప్పుకోకండి. వారు ఏయే యాప్‌లు వాడుతున్నారో తెలుసుకుని ప్రమాదకర యాప్‌ల గురించి వివరించి హెచ్చరించండి. సాధారణ సోషల్ మీడియా వేదికలపై వారి ఫ్రెండ్లిస్టుల్లో మీరూ ఉండండి. వారికి ఒకటికి మించి ఖాతాలుంటే వాటి గురించి తెలుసుకోండి. నిత్యం ఫోన్లో తలమునకలవుతూ.. అకస్మాత్తుగా కోప్పడటం, చిరాకుపడటం చేసే పిల్లల్ని వారి రూముల్లో ఒంటరిగా పడుకోనివ్వద్దు. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు కనిపెట్టుకోవడం మంచిది. ఈ యాప్‌లతో జాగ్రత్త ! అంతా అనుకుంటున్నట్లుగా కేవలం ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, టిక్‌టాక్ యాప్‌లే కాదు. సోషల్ కింకరులు ఎవరికీ అనుమానం రాకుండా ఈ యాప్‌లను రూపొందిస్తున్నారు. విద్యార్థులు వారి ఉచ్చులో పడ్డాకఆ తతంగాన్ని తల్లిదండ్రులు గుర్తించకుండా ఉండేలా డిజైన్ చేస్తున్నారు. కాలిక్యులేటర్ : ఈ యాప్ చూసేందుకు కాలిక్యులేటర్‌లా ఉంటుంది. తల్లిదండ్రులు ఇదో ఎడ్యుకేషన్ యాప్‌లా భావిస్తారు. కానీ వాస్తవానికి ఇది రహస్యంగా ఫొటోలు షేర్ చేసుకునేందుకు ఉద్దేశించిన యాప్. ఓమిగిల్ : ఇది గణితశాస్త్రంలో వాడే ఒమేగాను పోలి ఉంటుంది. ఇది కొత్త వారితో, తెలియని వారితో స్నేహం చేసేందుకు వేదిక. ఇక్కడే చాలామంది పిల్లలు కొత్తవారితో చాట్ చేయాలన్న ఉత్సుకతతో తమ వ్యక్తిగత వివరాలు చెప్పేసి వారి వలలో చిక్కుతారు. విస్పర్ : ఈ యాప్ కొత్త వ్యక్తులను కలుసుకునేందుకు ఉద్దేశించింది. ఈ యాప్‌లో సమాచారం ద్వారా గాలాలు వేస్తుంటారు. ఆస్క్ ఎఫ్ఎమ్ : ఒకసారి డౌన్లోడ్ చేసుకున్నారంటే అంతే. దీన్ని అంత ప్రమాదకరంగా రూపొందించారు. ఒకసారి లాగిన్ అయ్యారో.. ఇక మీరు ఈ సైబర్ రాక్షసుల నుంచి తప్పించుకోలేరు. హాట్ ఆర్ నాట్ : ఈ యాప్‌తో ఇంకా ప్రమాదకరం. వ్యక్తిగత ఫొటోలు సహా వివరాలన్నీ సేకరిస్తారు. తర్వాత బ్లాక్మెయిల్ చేస్తారు. బెదిరింపులతో చిత్రవధ చేస్తారు. బర్న్ బుక్ : సమాజంలో వ్యక్తులపై వదంతులు పుట్టించేందుకు ఉద్దేశించిన యాప్ ఇది. దీని ద్వారా వ్యక్తిత్వాన్ని హరించేలా కామెంట్లు, ఆడియోలు సృష్టించి బజారు కీడ్చటమే వారి పని. విష్బోన్ : ఈ యాప్ పిల్లల మధ్య అసమాన తలను ఎత్తిచూపుతుంది. ఇందులో నమోదైన వారిని మిగిలినవారితో పోల్చి చూపిస్తుంటుంది. ఎదుటి వారి ముందు అసమానతలు బయట పడ్డందుకు చాలామంది మానసికంగా కుంగిపోతారు. కిక్ : ప్రపంచ వ్యాప్తంగా సైబర్ వేధింపుల ఫిర్యాదులు అధికంగా నమోదవుతున్న యాప్‌లో ‘కిక్’కూడా ఒకటి. టీనేజర్లే ఈ యాప్ లక్ష్యం. వారి వ్యక్తిగత వివరాలు, ఫొటోలు సేకరించి వేధింపులకు పాల్పడుతున్నారు. యెల్లో : టీనేజర్లను కామెంట్లు చేసేందుకు ఉద్దేశించిన యాప్. కొత్త పరిచయాలు, తెలియని వ్యక్తులతో చాటింగ్ దీని లక్ష్యం. ఇక్కడ కూడా పిల్లలు ప్రమాదాల బారిన పడే అవకాశాలు పుష్కలం. ఇన్స్టాగ్రామ్ : తప్పుడు వివరాలతో పలువురు పిల్లలు నకిలీ ఖాతాలు సృష్టించి కొత్తవారితో చాట్ చేసి చిక్కుల్లో పడుతున్నారు. -
విద్యాభివృద్ధిరస్తు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపర్చడం ద్వారా వాటి రూపురేఖలను పూర్తిగా మార్చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. మూడు దశల్లో అన్ని ప్రభుత్వ పాఠశాలల దశ, దిశ మార్చాలని ఆదేశించారు. తొలి దశలో 12,918 ప్రాథమిక పాఠశాలలు, 3,832 ఉన్నత పాఠశాలల్లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి శనివారం విద్యా శాఖపై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తొలి దశలో కచ్చితంగా ప్రతి పంచాయతీలో ఒక పాఠశాలను ఎంపిక చేయాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 16,750 పాఠశాలల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ప్రతి ప్రభుత్వ పాఠశాలలు గతంలో ఎలా ఉండేవో, సౌకర్యాలు మెరుగుపర్చిన తర్వాత ఎలా ఉన్నాయో వివరిస్తూ ‘నాడు–నేడు’ ఫొటోలను ప్రజలముందు ఉంచాలని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులతో పాఠశాల యాజమాన్య కమిటీలు రాష్ట్ర సర్కారు చేపట్టిన చర్యలతో ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్య భారీగా పెరిగిందని అధికారులు వివరించారు. ప్రైవేట్ విద్యా సంస్థల నుంచి 1,79,366 మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లలో చేరారని ముఖ్యమంత్రికి తెలియజేశారు. దీనిపై ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్పందిస్తూ.. ప్రజలకు ప్రభుత్వం పట్ల ఉన్న విశ్వాసానికి ఇది నిదర్శనమని వ్యాఖ్యానించారు. చాలాచోట్ల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా తరగతి గదులు లేవని, ఒకే గదిలో రెండు, మూడు తరగతులు నిర్వహించాల్సి వస్తోందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఇలాంటి పరిస్థితులు స్కూళ్లలో ఉండకూడదని సీఎం చెప్పారు. అవసరమైన చోట అదనపు తరగతి గదులు నిర్మించాలని, దీనిపై ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశించారు. విద్యార్థుల తల్లిదండ్రులతో పాఠశాల యాజమాన్య కమిటీలను ఏర్పాటు చేసి, వారి భాగస్వామ్యంతో అదనపు తరగతి గదుల నిర్మించాలన్నారు. వీలైనంత త్వరగా కమిటీలను ఏర్పాటు చేయాలని చెప్పారు. పాఠశాలల్లో పిల్లలకు రక్షిత తాగు నీరు సరఫరా చేయడానికి ప్రస్తుతమున్న ఆర్వో ప్లాంట్లను వినియోగించడంతో పాటు కొత్త ప్లాంట్ల ఏర్పాటుపైనా సమావేశంలో చర్చించారు. దీనిపై ఒక ప్రణాళిక తయారు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇప్పుడున్న ఆర్వో ప్లాంట్లను కచ్చితంగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా విద్యార్థుల కోసం చేయాల్సిందే.. రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ విద్యార్థులకు మంచి వసతులు కల్పించాలన్న ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామని, ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పునరుద్ఘాటించారు. ప్రస్తుతం కల్పిస్తున్న సదుపాయాలకు తోడు అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టాలని, వాస్తవంగా ఎంత ఖర్చవుతుందో చూసి అంచనాలు రూపొందించాలని, బడ్జెట్ పెరిగినా ఫర్వాలేదని చెప్పారు. ప్రభుత్వం పాఠశాలలను బాగుచేసే పనిని అంకిత భావంతో పూర్తిచేస్తే అధికారులకే మంచి పేరు వస్తుందని అన్నారు. ప్రజలకు అందుబాటులోకి స్కూళ్లు రాష్ట్రంలో 276 ప్రభుత్వ స్కూళ్లలో ప్రవేశాలు లేవని సమీక్షా సమావేశంలో అధికారులు వివరించారు. దీనిపై వెంటనే అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. జనాభా ఉన్న ప్రాంతాల్లో కూడా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరకపోవడం, అక్కడి పరిస్థితులపై స్వయంగా క్షేత్రస్థాయి పర్యటించి, అధ్యయనం చేయాలన్నారు. పాఠశాలలు గ్రామాలకు దూరంగా ఉంటే వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు ప్రారంభించాలని సూచించారు. విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా టీచర్లు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా ఉపాధ్యాయులను నియమించాలని సీఎం ఆదేశించారు. అన్ని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతున్నందున అందుకు అనుగుణంగా టీచర్ల ఎంపిక చేపట్టాలని అన్నారు. ఇప్పుడున్న టీచర్లకు మెరుగైన శిక్షణ ఇచ్చి, సర్టిఫికెట్లు అంజేయాలన్నారు. పాఠ్య ప్రణాళికలో(సిలబస్) చేపట్టాల్సిన మార్పులపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టినప్పటికీ తెలుగు సబ్జెక్టు తప్పనిసరిగా ఉంటుందని జగన్మోహన్రెడ్డి తేల్చిచెప్పారు. విద్యాశాఖ అధికారులతో జరిగిన సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక గదిలో ఒక తరగతి స్కూళ్లలో ఒక గదిలో ఒక తరగతి మాత్రమే ఉండాలని ముఖ్యమంత్రి చెప్పారు. తప్పనిసరిగా ఒక్కో తరగతికి ఒక టీచర్ ఉండేలా చూడాలన్నారు. లేకపోతే చేస్తున్న మనం చేస్తున్న ప్రయత్నాలకు ఫలితం లేకుండా పోతుందని పేర్కొన్నారు. టీచర్ పోస్టుల ఖాళీలను గుర్తించి, వెంటనే వాటిని భర్తీ చేసేలా క్యాలెండర్ రూపొందించాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజనం నాణ్యతపై రాజీ వద్దు పాఠశాల విద్యార్థులకు అందజేస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యతపై ముఖ్యమంత్రి సమీక్షించారు. పిల్లలకు పెట్టే భోజనం నాణ్యత విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీపడొద్దని స్పష్టం చేశారు. మధ్యాహ్న భోజనం సరుకుల పంపిణీ, వాటికి సంబంధించిన టెండర్ల ఖరారు బాధ్యతలను జిల్లా కలెక్టర్లకే అప్పగించామని, భోజనంలో నాణ్యత ఉండేలా వారే చూడాలని చెప్పారు. రూ.కోటి విలువ దాటే ఏ టెండర్ అయినా ఆన్లైన్లో పెట్టాలని, దీనివల్ల ఎక్కువ మంది పోటీపడి, తక్కువ ధరలో టెండర్ ఖరారయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయదలచుకున్న నైపుణ్యాభివృద్ధి కేంద్రానికి అవసరమైన కాలేజీలను గుర్తించాలని ఆదేశించారు. విద్యారంగంపై ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సమీక్షలో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రాధాన్యతా క్రమంలో పనులు ముఖ్యమంత్రి గతంలోనే జారీ చేసిన ఆదేశాల మేరకు విద్యాశాఖ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల ఫొటోలను చిత్రీకరించింది. రాష్ట్రంలో 44,512 పాఠశాలలకు గానూ 42,655 పాఠశాలల ప్రస్తుత స్థితిగతులపై సంక్షిప్త వీడియోలు, ఫొటోలు సేకరించారు. ఈ ఫొటోలను అప్లోడ్ చేయడానికి ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పటిదాకా మొత్తం 10.88 లక్షల ఫొటోలను అప్లోడ్ చేశారు. అంతేకాకుండా ప్రతి పాఠశాలలో ప్రాధాన్యతా క్రమంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టాలన్న దానిపై నివేదిక రూపొందించారు. ప్రాధన్యతా క్రమం.. 1. టాయిలెట్లు, బాత్రూమ్లు 2 యూనిట్ల చొప్పున. 2. ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు 3. తాగునీరు 4. ఇతర అవసరాల కోసం నీరు 5. ఫర్నీచర్ 6. తరగతి గదులకు రంగులు వేయడం 7. తరగతి గదులకు మరమ్మతులు 8. బ్లాక్‌బోర్డుల ఏర్పాటు విద్యా నవరత్నాలు విద్యాశాఖలో చేపడుతున్న మొత్తం కార్యక్రమాలను 9 భాగాలుగా అధికారులు విభజించారు. విద్యా నవరత్నాల పేరుతో ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి తెలియజేశారు. విద్యా నవరత్నాలు ఏమిటంటే.. 1. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన 2. స్కూళ్లలో బోధనా ప్రమాణాలు, విద్యా ప్రమాణాలు పెంచడం 3. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం 4. తెలుగు సబ్జెక్టును తప్పనిసరిగా బోధించడం 5. విద్యార్థులకు సకాలంలో పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ అందించడం 6. మధ్యాహ్న భోజనంలో నాణ్యత పెంచడం, సక్రమంగా అమలు చేయడం 7. విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా ఉపాధ్యాయుల నియామకం 8. విద్యార్థుల్లో నైపుణ్యాలను అభివృద్ధి పర్చడం 9. పాఠశాలలు, కళాశాలల్లో ఫీజుల నియంత్రణ, పర్యవేక్షణకు కమిటీ ఏర్పాటు. ప్రైవేట్ స్కూళ్ల టీచర్ల స్థితిగతులను మెరుగుపర్చడం -
తరగతి గదులే మందుబాబులకు సిట్టింగ్ రూములు
అది ఉదయం 8.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యార్థులు చదువుకునే బడి. సాయంత్రం ఐదు దాటితే విద్యాలయ ప్రాంగణం మందుబాబులకు అడ్డా. బడికి ఆనుకుని ఉన్న బెల్టుషాపుల్లో మద్యం కొనుగోలు చేసి తరగతి గదులను సిట్టింగ్ రూములకు మార్చేసుకుంటున్నారు. పీకల దాకా తాగి మత్తులో ఊగుతూ సీసాలను పగులగొట్టి ఇష్టమొచ్చినట్లు విసురుతున్నారు. ఉదయాన్నే బడికి చేరుకున్న పిల్లలు పగిలిన గాజుపెంకులు గుచ్చుకుని రక్తమోడుతూ బాధతో విలవిలలాడుతున్నారు. సాక్షి, హిందూపురం సెంట్రల్: హిందూపురం మండలం మనేసముద్రంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఇక్కడ ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు 100 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. గత టీడీపీ పాలనలో కొందరు నాయకుల అండదండలతో గ్రామంలో బెల్టుషాపులు వెలిశాయి. ప్రాథమికోన్నత పాఠశాలకు ఆనుకుని ఒకటి.. దాని సమీపంలో మరొకటి.. ఇలా నాలుగు ఏర్పాటు చేశారు. ఐదేళ్లూ విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగిస్తూ వచ్చారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక బెల్టుషాపులు సమూలంగా నిర్మూలించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో అప్పటి వరకు నిరాటంకంగా కొనసాగిస్తూ వచ్చిన బెల్టుషాపులను అధికారులు మూసివేయించాల్సి ఉంది. అయితే బెల్టుషాపుల నిర్వాహకులకు టీడీపీ నాయకులతో పాటు ఎమ్మెల్యే బాలకృష్ణ అండదండలు ఉన్నాయన్న కారణంతో అధికారులెవరూ పట్టించుకోలేదు. బడి ముగియగానే మందు శాల.. బడి వేళలు ముగియగానే సాయంత్రం నుంచి బెల్టుషాపులు తెరుచుకుంటాయి. అప్పటి వరకు ఇళ్లల్లో ఉంచుకున్న మద్యాన్ని నిర్వాహకులు బెల్టుషాపుల్లోకి తీసుకొచ్చి అమ్ముతున్నారు. ఇక్కడ మందు కొనుగోలు చేసిన బాబులు నేరుగా ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలోకి వెళ్తున్నారు. అక్కడి తరగతి గదిని ఏకంగా సిట్టింగ్ రూమ్‌గా మార్చుకున్నారు. అక్కడే పూటుగా తాగి తందనాలు ఆడుతున్నారు. అంతటితో ఆగకుండా మద్యం సీసాలను పగులగొడుతున్నారు. గాజు పెంకులు తరగతి గదులు.. ఆవరణల్లోనే ఎగిరిపడుతున్నాయి. పాఠశాలలో ఉన్న ఓవర్‌హెడ్ ట్యాంకు కింద మందు సీసాలు, గ్లాసులు, గాజు పెంకు గుచ్చుకోవడంతో కాలికి గాయమైందని చెబుతున్న విద్యార్థిని పసి మొగ్గలకు రక్తగాయాలు పాఠశాలకు చేరుకున్న పిల్లలు ఏమాత్రం అజాగ్రత్తగ ఉన్నా ప్రమాదాలకు గురవుతున్నారు. పాదరక్షలు లేకుండా గదిలోంచి బయటకు వస్తే గాజు పెంకులు గుచ్చుకుని విలవిలలాడుతున్నారు. పాఠశాల ఆవరణంలోనే మందుబాబుల సీసాలతో పాటు ప్లాస్టిక్ గ్లాసులు పడేస్తున్నారు. పాఠశాల ఆవరణలో ఉదయాన్నే శుభ్రం చేస్తున్నప్పటికీ సాయంత్రం మళ్లీ పగిలిన సీసాలు దర్శనమిస్తున్నాయి. బడి ఆవరణలో జరిగే అసాంఘిక కార్యకలాపాల గురించి ఉపాధ్యాయులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా ఎటువంటి ప్రయోజనమూ కనిపించలేదు. సీఎం ఆదేశాలు బేఖాతరు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బెల్టుషాపులను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసినా మనేసముద్రంలో బేఖాతరు చేస్తున్నారు. ఎక్సైజ్‌శాఖ అదికారులు, తహసీల్దార్ అక్కడ బెల్టు షాపులను ఎత్తివేయించకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. పాఠశాలలో ఉన్న పాత భవనాలు, క్రీడా ప్రాంగణం మొత్తం వేలాది మద్యం సీసాలతో దర్శనమిస్తున్నాయి. బెల్టుషాపులపై పలుమార్లు అదికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానిక వైఎస్సార్సీపీ కార్యకర్తలు తెలిపారు. ఎవరైనా ఎదురు తిరిగితే దాడులకు తెగబడుతున్నారన్నారు. ఫిర్యాదు చేసి అలసిపోయాం బెల్టుషాపులు తీసేయాలని పలుమార్లు విన్నవించుకున్నా వారు తొలగించుకోలేదు. ఇది పాఠశాలలాగా కాకుండా ఒక బారులా కనిపిస్తోంది. ఎంతని శుభ్రం చేయించగలం. ఎంత చేసినా రోజూ వందలకొద్దీ మందుబాటిళ్లు ఇక్కడ పడేస్తున్నారు. భయమేస్తోంది. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. విద్యార్థులకు, మాకు గాజు పెంకులు కాళ్లకు గుచ్చుకుంటూనే ఉన్నాయి. ప్రథమ చికిత్స కోసం ఫస్ట్ ఎయిడ్ కిట్‌ను అందుబాటులో ఉంచుకున్నాం. – జయమ్మ, హెచ్ఎం, ప్రాథమికోన్నత పాఠశాల వాటికి అనుమతుల్లేవు మనేసముద్రంలోని బెల్టుషాపులకు అనుమతులు లేవు. రెండేళ్లుగా వారు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. వారిపై కేసులు నమోదు చేశాం. ఫైన్లు వేశాం. వారిపై బైండోవర్లు కూడా ఉన్నాయి. మేము చాలా ప్రయత్నాలు చేశాం. తహసీల్దార్, ఎంపీడీఓల దృష్టికి తీసుకెళ్లాం. వారు నోటీసులు ఇచ్చినట్టు చెప్పారు. అక్కడ బెల్టుషాపులు నిర్వహిస్తున్నది మహిళలు. ఇక ఉపేక్షించబోము. విద్యార్థులున్న చోట అలాంటి కార్యకలాపాలకు చోటు కల్పించడం తీవ్ర నేరం. చర్యలు చేపడతాం. – ప్రతాప్‌రెడ్డి, ఎక్సైజ్ సీఐ, హిందూపురం -
బడి నాయకుడు నేనే
సాక్షి, వేపాడ (శ్రీకాకుళం) : ప్రజాస్వామ్య ఎన్నికల విధానంపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ఆదర్శ పాఠశాలలో సోమవారం రహస్య ఓటింగ్ పద్ధతిలో పాఠశాల విద్యార్థి నాయకుడ్ని ఎన్నుకున్నారు. విద్యార్థులను ఆకట్టుకున్న ఈ కార్యక్రమం వేపాడ సమీపంలోని ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ ఎ.ప్రభాకర్ నేతృత్వంలో సోమవారం జరిగింది. పాఠశాల విద్యార్థి నాయకుడు ఎన్నికను రహస్య బ్యాలెట్ పేపర్ పద్ధతిలో నిర్వహించారు. పాఠశాలలో చదువుతున్న 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులంతా రహస్య బ్యాలెట్ పద్ధతిలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. పాఠశాల విద్యార్థి నాయకుడు పదవికి (ఎస్పీఎల్) ఎం.ఎర్నాయుడు, జె.జగదీష్, జి.కన్నంనాయుడు, ఐ.చైతన్య పోటీ చేశారు. పీజీటీ, టీజీటీలైన పి.శివప్రసాద్, జె.అప్పారావు, ఎన్.హైమ, ఎస్కే పర్వీన్‌బేగం ఆధ్వర్యంలో మూడు బూత్‌లను ఏర్పాటుచేసి ఉపాధ్యాయులను బూత్ అధికారులుగా నియమించారు. ఓటింగ్ అనంతరం ఓట్లు లెక్కించగా జి.కన్నంనాయుడు 213 ఓట్లు సాధించి ప్రథమ స్థానంలో, 182 ఓట్లు సాధించిన ఎం.ఎర్నాయుడు రెండోస్థానంలో నిలిచారు. దీంతో పాఠశాల ఎస్పీఎల్గా జి.కన్నంనాయుడు, వైస్ ఎస్పీఎల్గా ఎం.ఎర్నాయుడులను విజేతలుగా ఎన్నికల అధికారి ప్రకటించారు. విజేతలను ప్రిన్సిపల్ ప్రభాకర్, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అభినందించారు. ఓటింగ్ పద్ధతిలో విద్యార్థి నాయకుడిని ఎన్నుకోవటంతో ప్రజాస్వామ్యంలో ఓటు వినియోగంపై అవగాహన కలిగిందని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్ ప్రభాకర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో ప్రజాస్వామ్య ఎన్నికలపై అవగాహన కల్పించి చైతన్యపరిచేందుకే ఈ కార్యక్రమం నిర్వహించినట్టు చెప్పారు. -
వద్దురా.. మత్తులో పడొద్దురా!
సాక్షి, హుస్నాబాద్(కరీంనగర్) : మత్తు ప్రదార్థాల సేవనం అత్యంత ప్రమాదకరం. ఒక్కసారి అలవాటైతే జీవితం నాశనమవుతుంది. అలాంటి మత్తు పదార్థాలు పాఠశాల స్థాయిలోనే విద్యార్థులు అలవాటు పడిన సంఘటన హుస్నాబాద్ పట్టణంలోని ఓ పాఠశాలలో చోటుచేసుకుంది. దీంతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుర్తించిన ఉపాధ్యాయులు.. పట్టణంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న కొందరు విద్యార్థులు మత్తు పదార్థాలు వాడుతుండగా, అక్కడి ఉపాధ్యాయులు రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకోవడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులు జెండా ఎగువేసేందుకు రాగా, అప్పటికే పాఠశాల తలుపులు పగులకొట్టి ఉన్నాయి. దీంతో వెలుపల చూడగా మైక్ సెట్‌ను మాయం కావడంతో అనుమానం వచ్చిన ఉపాధ్యాయులు పాఠశాల గదులను పరిశీలించారు. పాఠశాలపై అంతస్తులో బోనోఫిక్స్ ట్యూబ్‌లు, ప్లాస్టిక్ కవర్లు ఉన్నట్లుగా గుర్తించారు. కుర్చీలను తగటపెట్టినట్లుగా గుర్తించారు. ఈ విషయంపై స్థానికులు పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు. ఆలస్యంగా వెలుగులోకి... ఓ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న ఒక్కరిద్దరు విద్యార్థులు పాఠశాల వెనుకాల ఉన్న టాయిలెట్లో ప్లాస్టిక్ సంచుల నుంచి పీల్చుతుండగా బుధవారం కొంత మంది విద్యార్థులు చూశారు. ఈ విషయాన్ని ఉపాధ్యాయులకు చెబుతామని చెప్పాడు. దీంతో, మత్తును సేవిస్తున్న విద్యార్థి క్షణికావేశంలో సదరు విద్యార్థి షర్ట్ చింపి దాడి చేశారు. దాడికి గురైన విద్యార్థి స్థానిక హెచ్ఎం, ఉపాధ్యాయులకు చెప్పాడు. దీంతో దాడికి పాల్పడిన విద్యార్థులను విచారించగా అసలు విషయం బయటకు వచ్చింది. గంజాయి కంటే ప్రమాదం.. బోనోఫిక్స్ గంజాయి కంటే అతి ప్రమాదమని వైద్యులు చెబుతున్నారు. బోనోఫిక్స్‌ను కాల్చి అందులో నుంచి వచ్చే ఆవిరిని ప్లాసిక్ కవర్లో నింపుతారు. కవర్లో నింపిన ఆవిరిని పీల్చుతూ విద్యార్థులు మత్తులో ఊగిపోవడం, శరీరమంతా వారి ఆధీనంలో లేకపోవడం వంటి లక్షణాలతో విద్యార్థులు మత్తులో విహరిస్తున్నారు. ఈ చెడు అలవాటు పట్టణంలోని ఎల్లంబజార్‌కు చెందిన కొంత మంది యువత నుంచి విద్యార్థులకు పాకిందని ఇదే పాఠశాలకు చెందిన ఓ విద్యార్థి ఉపాధ్యాయులకు చెప్పినట్లు సమాచారం. బోనోఫిక్స్ అంటే. బోనోఫిక్స్ అనేది కేవలం ఇనుప దుకాణం, సైకిల్ స్టోర్లల్లో మాత్రమే విక్రయిస్తారు. ఇది సైకిల్ ట్యూబ్‌ను అతికించేందుకు బోనోఫిక్స్‌ను వాడుతారు. విద్యార్థులు బోనోఫిక్స్కు అలవాటు పడటంతో కొందరు డబ్బుల కోసం ఆఫీస్రోడ్లోని పలు దుకాణాల్లో బోనోఫిక్స్‌ను విక్రయించడం ప్రారంభించారు. దీనికి అలవాటు పడిన విద్యార్థులు ప్రతీ రోజు బోనోఫిక్స్‌ను కొనుగోలు మత్తులో జోగుతున్నారు. బోనోఫిక్స్తో అనర్థాలు.. బోనోఫిక్స్ అనే కెమిల్ పదార్థాన్ని వేడి చేస్తే ఆటోమెటిక్‌గా కార్బన్ మైనాక్సైడ్గా మరియు సైనేడ్‌గా మారే అవకాశం ఉంటుంది. బోనోఫిక్స్ ఆవిరి పీల్చడం వల్ల స్పృహ కోల్పోయి, ఉపిరితిత్తులు బ్లాక్ అయ్యే ప్రమాదం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా ఈ రసాయన పదార్థాన్ని పీల్చడం వల్ల మెదడ్లోని రక్త స్రావం గడ్డ కట్టి మనిషి ప్రాణానికే హాని కలిగించే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. బోనోఫిక్స్ పదార్థం నీటిని, భూమిని నాశనం చేసే శక్తి ఉంటుంది. ఊపిరితిత్తులపై ప్రభావం బోనోఫిక్స్ అనేది కెమిల్. ఈ కెమికల్‌ను కాల్చి దీని నుంచి వెలువడే ఆవిరిని పీల్చడం వల్ల అనేక సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. చిన్న వయస్సులో ఇలాంటి దురాలవాట్లకు పాల్పడితే అనారోగ్యాలకు గురవుతారు. ఈ కెమిల్ పీల్చడం వల్ల ఊపిరితిత్తులకు సోకి శ్వాస పీల్చుకోవడం కష్టమవువుతుంది. అలాగే జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. చిన్న వయస్సులో ఇలాంటి కెమికల్‌కు ప్రభావితమై. జీవితాలు నాశనం చేసుకోవద్దు. – డాక్టర్ ప్రసన్న, ప్రభుత్వ వైద్యాధికారి, హుస్నాబాద్ దురలవాట్లకు ప్రభావితం కావద్దు.. విద్యార్థులు చిన్న వయస్సులోనే దురాలవాట్లకు పాల్పడవద్దు. బోనోఫిక్స్‌ను పీల్చుతున్నారని ప్రచారం జరుగుతుంది. విద్యార్థులు ఇలాంటి మత్తు లాంటి కెమికల్స్ వాడితే తదుపరి, ఇతరాత్ర డ్రగ్స్‌కు ఆకర్షితులయ్యే ప్రమాదం ఉంటుంది. పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. – అయిలేని మల్లికార్జున్‌రెడ్డి, హుస్నాబాద్ -
అమ్మా...కడుపునొప్పి!
సాక్షి,సిటీబ్యూరో: మహానగరంలో జీవితాలు అన్నింటిలోనూ బిజీ అయిపోయాయి. చదువులోను.. సంపాదనలోను.. ఆహార్యంలోను.. అవకాశాలు అందుకోవడంలోనూ అంతా బిజీనే. ఇంట్లో ఎడాది వయసున్న పిల్లలు ఉంటే అప్పుడే ఏ స్కూల్లో జాయిన్ చేయాలి.. అక్కడ ఐఐటీ, అబాకస్ వంటి శిక్షణ ఇస్తున్నారా లేదా..! ఒలింపిక్స్‌కు శిక్షణనిస్తున్నా లేదా..!! ఇలాంటి విషయాలపై గంటల కొద్దీ ఆలోచించే తల్లిదండ్రులు పిల్లల ఆర్యోగం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నామనుకుంటూ వారిని సరిగా పట్టించుకోవడం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. నగరంలో చాలా మంది తల్లిదండ్రులు ఉద్యోగాలు చేస్తున్నారు. దంపతులిద్దరూ వారివారి పనుల్లో బిజీగా ఉండి స్కూలుకు వెళ్లే తమ పిల్లలను సరిగా పట్టించుకోవడం లేదు.. వేళకు సరైన ఫౌష్టికాహారం పెట్టడం లేదు. ఉదయం అల్పాహారంలో భాగంగా నూటికి 80 శాతం మంది తల్లిదండ్రులు గ్లాసు పాలతో కడుపు నింపి స్కూలుకు పంపుతున్నారని కొన్ని అధ్యయనాల్లో తేలింది. ఇంట్లో వంట చేసే సమయం లేక కొంతమంది.. ఓపిక లేక మరికొంత మంది తమ పిల్లలకు మార్కెట్లో రెడీమేడ్‌గా దొరికే ఫిజ్జాలు, బర్గర్లు, చిప్స్ ప్యాకెట్లు, ఎగ్, వెజ్ఫఫ్లు, సాండ్విచ్లు స్నాక్స్, లంచ్‌బాక్స్‌లో పెట్టి పంపుతున్నారు. రాత్రి డిన్నర్ తర్వాత ఉదయం ఫుల్మీల్కు బదులు.. గ్లాసు పాలతో సరిపెడుతుండటంతో తర్వాత కొద్దిసేపటికే కడుపు ఖాళీ కావడం గ్యాస్ట్రిక్ సమస్య తలెత్తి కడుపు నొప్పికి కారణమవుతున్నట్టు చిన్నపిల్లల వైద్యుల వద్దకు ఇటీవల పెరిగిన కేసుల సంఖ్యే చెబుతోంది. ఇది పిల్లల శారీరక ఆరోగ్యంపైనే కాకుండా మానసిక ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతోందంటున్నారు వైద్యులు. ఇటీవల కాలంలో ఈ తరహా కేసులు తమ దృష్టికి ఎక్కువగా వస్తున్నట్లు పౌష్టికాహార నిపుణులు చెబుతున్నారు. పిల్లల ఎదుగుదలకు ఆహారం ఎంతముఖ్యమో.. వేళకు నిద్ర కూడా అంతే ముఖ్యమంటున్నారు. సమతులాహారం అవసరం నిజానికి ఏ వయసు పిల్లలకు ఎంత ఆహారం, ఎన్నిసార్లు అందించాలి వంటి అంశాలపై తల్లిదండ్రులకు కనీస అవగాహన ఉండడం లేదు. ఉదయాన్నే పిల్లలను నిద్రలేపడం, హడావుడిగా స్కూలుకి రెడీ చేయడం, అల్పాహారంలో గ్లాసు పాలు తాగించడం, స్నాక్స్, లంచ్ బాక్స్‌ల్లో బిస్కెట్లు పెట్టి పంపుతున్నారు. ఈ ఆహారంలో సరిపడ కార్పొహైడ్రేట్స్, ప్రొటీన్లు, పీచుపదార్థం, విటమిన్లు, మినరల్స్ లేకపోవడంతో పిల్లల శారీక, మానసిక ఎదుగుదలపై పభావం పడుతోంది. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలన్నా.. బాగా చదువుకోవాలన్నా వారీకి వేళకు సమతుల ఆహారం పెట్టాలి. ఏది పడితే అది కాకుండా త్వరగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు తక్కువ కెలరీలు ఉండేవి పెట్టాలి. పాలు, పెరుగుతో పాటు ఆకు కూరలు, సీజనల్‌గా దొరికే పండ్లు, పప్పులు, కోడిగుడ్లు, డ్రైఫూట్స్‌ను స్నాక్స్‌గా అందించాలి. తద్వారా పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. – డాక్టర్ అశ్వినీసాగర్, పీడియాట్రిక్ న్యూట్రీషియన్ ఇలా అయితే భారీ మూల్యం తప్పదు సాధారణంగా పిల్లల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అసలే వర్షాకాలం తరచూ వర్షపు నీటిలో తడవడం, కలుషిత నీరు తాగడం, నిల్వ చేసిన ఆహారం తీసుకోవడం వల్ల త్వరగా జబ్బున పడే ప్రమాదం ఉంది. ఈ సీజన్లో పిల్లలు ఎక్కువగా దగ్గు, జలుబు, తలనొప్పి, టైఫాయిడ్, డెంగీ జ్వరం, వాంతులు, విరేచనాలు వంటి రోగాలకు గురవుతుంటారు. వీటిని నిర్లక్ష్యం చేయడం వల్ల క్రానిక్ డిసీజ్‌గా మారే ప్రమాదం ఉంది. తల్లిదండ్రులు ముఖ్యంగా ఈ సమయంలో పిల్లల ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సి ఉంది. వారి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు హైజీన్ పెంచాలంటున్నారు వైద్యులు. ఆహారం తీసుకునే సమయంలోనే కాదు.. తర్వాత కూడా చేతులను శుభ్రంగా కడగడం వారికి అలవాటు చేయాలి. కాచి, చల్లార్చిన నీరును తాగించడం ద్వారా డయేరియా ముప్పు నుంచి బయపడొచ్చు. ఎదిగే పిల్లలకు వేళకు సరైన ఆహారం అందించకపోవడం వల్ల వారి మానసిక, శారీర క ఎదుగుదలపై ప్రభావం పడటంతో పాటు చదువులోనూ వెనుకబడటం ఖాయమంటున్నారు వైద్యులు. లేదంటే తల్లిదండ్రులు తమ పిల్లల ఆరోగ్యంపై భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు. -
‘మోడల్’ కష్టాలు!
నారాయణఖేడ్: జిల్లాలోనే వెనుకబడిన మండలమైన నాగల్గిద్ద మండల పరిధిలోని మోర్గి మాడల్ స్కూల్ విద్యార్థులు నిత్యం సమస్యలతో సమతమతం అవుతున్నారు. తెలంగాణ, కర్ణాటక సరిహద్దున మోర్గి గ్రామంలో మోడల్ పాఠశాల నిర్మించిన నాటి నుంచి విద్యార్థులు నిత్యం నరకమే అనుభవిస్తున్నారు. మోర్గి మోడల్ స్కూల్, మరియు కళాశాలల్లో కలిపి మొత్తం 600మంది విద్యార్థుల వరకు నిత్యం విద్యాభ్యాసం చేస్తారు. దీంతో వివిధ ప్రాంతా నుంచి విద్యార్థులు పాఠశాలకు రావాలంటే వాహన సదుపాయాలు లేకపోవడంతో ఇబ్బందులుల ఎదుర్కొంటున్నారు. నాగల్గిద్ద మండలానికి మోర్గి మాడల్ పాఠశాల వచ్చిన కాడినుండి ఇబ్బందులు తప్పడంలేదు. గత పాలకుల తప్పిదమే.. మెర్గి మాడల్ స్కూల్‌ను నాగల్గిద్ద నుంచి మోర్గికి మార్చడంతో ఈ ఇబ్బందులు విద్యార్థులుకు శాపంగా మారినాయి. రూ కోట్లు వెచ్చింది మారుమూల గ్రామంలో భవనం నిర్మించడంతో ఇలాంటి పిరిస్థతులు నెలకొన్నాయి. నాటి పాలకుల తప్పిదం నిర్ణయంవల్లె నాగల్గిద్ద నుంచి పాఠశాలను మోర్గికి మార్చారు. అక్కడ అయిదు ఎకరాల ప్రభుత్వ భూమిని కెటాయించారు. రూ.కోట్లు వెచ్చించి భవనం నిర్మాణం చేపట్టారు. కాని విద్యార్థులకు మాత్రం సమస్యలు తీరండలేదు. కలెక్టర్ హామీ ఇచ్చినా తీరని రోడ్డు సమస్య.. గత ఏడాది ప్రారంభంలో విద్యార్థులు తమ పాఠశాలకు నాగల్గిద్ద పీడబ్యూడీ రోడ్డునుండి మోర్గి వరకు నాలుగు కిలోమీటర్ల బీటి రోడ్డు అవసరం ఉంది. గతంలో వేసిన పీఎంజీఎస్‌వై రోడ్డు పూర్తిగా చిద్రం కాగా గోతులు ఏర్పడినాయి. రోడ్డుకు మద్యన ఉన్న భారి కల్వర్టు సైతం శిథిలమై కూలిపోయింది. దీంతో వాహనాలు సైతం సక్రమంగా వెళ్లడం లేదు. విద్యార్థులకు తప్పని ఇబ్బందులు.. మోర్గి మాడల్ పాఠశాలకు నాగల్గిద్ద మండలంలోని కరస్‌గుత్తి, కారముంగి, ఔదత్పూర్, శేరిదామర్‌గిద్ద, గుడూర్, నారాయణఖేడ్, తదితర గ్రామాలనుండి నిత్యం వందాలాది విద్యార్థులు పాఠశాలకు చేరుకోవాల్సిన పరిస్థితి, దీంతో వారు వివిద ప్రైవేటు వాహనాలను ఆశ్రయించక తప్పడంలేదు. ఇక నారాయణఖేడ్నుండి ఆర్టీ అధికారులు ఒక్క పూట బస్సును రెండు ట్రిప్పులుగా ఎమ్మెల్యే చొరవతో వేసిన ఫలితం అగుపించడంలేదు. దీంతో విద్యార్థుల ఇబ్బందులు సైతం తీరడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
విద్యార్థులకు ఆర్టీసీ నజరానా
సాక్షి, రామచంద్రపురం(తూర్పు గోదావరి) : ఆర్టీసీ బస్సుల్లో విద్యాలయాలకు వెళ్లే విద్యార్థులకు ఆర్టీసీ చిరు కానుకగా ఏడాది బస్‌పాస్‌లను అందిస్తోంది. గతంలో విద్యార్థులు ప్రతినెలా బస్‌పాస్‌ల కోసం గంటల కొద్దీ క్యూల్లో వేచి ఉండాల్సి వచ్చేది. గత ఏడాది నుంచి ఏడాది మొత్తానికీ ఒక్కసారే బస్‌పాస్‌ను తీసుకునే వెసులుబాటు ఆర్టీసీ కల్పించింది. ఏపీఎస్ ఆర్టీసీలో విద్యార్థులకు అందించే ఉచిత పాస్‌లతో పాటు రాయితీ పాస్‌లు ఎలా పొందాలో రామచంద్రపురం ఆర్టీసీ డిపో మేనేజర్ కొడమంచిలి వెంకటేశ్వర్లు ‘సాక్షి’కి తెలియజేశారు. ఏడో తరగతి వరకు బాలురకు ఉచితం ఏడో తరగతి చదువు, 12 ఏళ్ల వయస్సు ఉన్న బాలురకు 20 కిలో మీటర్ల దూరం వరకు ఇంటి నుంచి పాఠశాలకు ఉచిత బస్‌పాస్ మంజూరు చేస్తారు. ఆర్టీసీ డిపోల్లోని ప్రత్యేక కౌంటర్లలో లేదా ఆన్లైన్లో వివరాలు నమోదు చేసి బస్‌పాస్ తీసుకోవచ్చు. రూ. 50 చెల్లించి ఈ పాస్ పొందవచ్చు. దాతల సహకారంతో కూడా ఈ ఉచిత బస్‌పాస్ పొందవచ్చు. 18 ఏళ్ల బాలికలకు ఉచితం ఎల్కేజీ నుంచి పదో తరగతి వరకూ 18 ఏళ్ల లోపు బాలికలు ఉచిత బస్‌పాస్‌లు పొందవచ్చు. 20 కిలోమీటర్ల వరకు ఇంటి నుంచి పాఠశాలకు ఈ బస్‌పాస్‌లను ఉపయోగించుకోవచ్చు. రాయితీ బస్‌పాస్ పొందడం ఇలా బాలురు ఎనిమిదో తరగతి నుంచి డిగ్రీ వరకు రాయితీ బస్‌పాస్‌లు పొందవచ్చు. 35 కి.మీ. వరకు ఇంటి నుంచి పాఠశాల, కళాశాల వరకు ఈ రాయితీ బస్‌పాస్‌లు ఉపయోగించుకోవచ్చు. గతంలో నెలకు ఇచ్చే పాస్‌లు ఇప్పుడు మూడు నెలలు, ఏడాది గడువుతో ఇస్తున్నారు. పదో తరగతి వరకు మూడు నెలలు 5 కిలో మీటర్ల వరకు రూ. 235, ఏడాదికి ఒక్కసారే తీసుకుంటే రూ. 850 చెల్లించాలి. ఇంటర్, పాలిటెక్నిక్ విద్యార్థులు మూడు నెలలకు ఒకసారి పాస్ తీసుకుంటే రూ. 935, డిగ్రీ అయితే రూ. 1020 చెల్లించాలి. 10 కిలోమీటర్ల వరకు 10 వ తరగతి వరకు మూడు నెలలలకు రూ.315, ఏడాదికి తీసుకుంటే రూ. 1050 చెల్లించాలి. ఇంటర్, పాలిటెక్నిక్ విద్యార్థులు మూడు నెలలకు పాస్‌కు రూ. 1155, డిగ్రీ అయితే రూ. 1260 చెల్లించాలి. 15 కిలోమీటర్లకు 10వ తరగతికి రూ. 385, ఇంటర్‌కు రూ.1350, డిగ్రీకి రూ.1415, 20 కిలోమీటర్లకు మూడు నెలలకు రూ.510, సంవత్సరానికి రూ.1,800, 25 కిలోమీటర్లకు రూ.645, ఏడాదికి రూ. 2250, 30 కిలోమీటర్లకు మూడు నెలలకు రూ. 705, ఏడాదికి రూ. 2500, 35 కిలోమీటర్లకు రూ. 775 వంతున చెల్లించి రాయితీపై బస్‌పాస్‌ను పొందవచ్చు. ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్‌లకు మూడు నెలలకోసారి, ఏడాది పాస్‌లు తీసుకుంటే రూ. 1155 నుంచి రూ. 3240 వరకు ఉంటుంది. ఆన్లైన్లో పొందడమెలా..? విద్యార్థులు కళాశాల ధ్రువీకరణ పత్రంతో ఆర్టీసీ ప్రత్యేక కౌంటర్లలో బస్‌పాస్ పొందవచ్చు.online. apsrtcpass. in వెబ్సైట్లోకి వెళ్లి పదో తరగతి పైబడిన విద్యార్థులు తమ తరగతిని క్లిక్ చేయాలి. గత ఏడాది బస్‌పాస్ నెంబరు ఉంటే నమోదు చేయాలి. లేదా కొత్త రిజిస్ట్రేషన్ ఎంచుకుని వివరాలు నమోదు చేయాలి. వివరాలు నమోదైన వెంటనే దరఖాస్తుదారు పేరు, చిరునామా, పాఠశాల, కళాశాల, ఆధార్ సంఖ్యలను నమోదు చేయాలి. ఫొటో అప్లోడ్ చేసి విద్యార్థి పయనించే రూట్ వివరాలు నమోదు చేయాలి. ఆన్లైన్లో ప్రింట్ తీసుకుని కళాశాల ప్రిన్సిపాల్, పాఠశాల ప్రధానోపాధ్యాయుని సంతకం చేసి ఆర్టీసీ బస్‌స్టేషన్‌లో కౌంటర్లో రుసుం చెల్లించి బస్‌పాస్ పొందవచ్చు. విద్యార్థుల కోసం ఆయా డిపోలు ప్రత్యేక బస్సులు కూడా నడుపుతున్నా యి. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ కొడమంచిలి వెంకటేశ్వర్లు సూచించారు. దివ్యాంగులకు రాయితీ బస్‌పాస్‌లు దివ్యాంగులు బస్ చార్జీలో 50 శాతం రాయితీతో ప్రయాణించేలా ఆర్టీసీ బస్‌పాస్‌లను మంజూరు చేస్తోంది. దీనికోసం దివ్యాంగులు ఎస్కార్ట్ అవసరం లేనివారు రూ. 50 తోను, ఎస్కార్ట్ అవసరం ఉన్నవారు రూ. 100 తోను బస్‌పాస్‌లను తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి సదరన్ మెడికల్ సర్టిఫికెట్లు (పెద్దది, చిన్నది) ఒక సెట్, ఆధార్ కార్డు జెరాక్స్‌లతో పాటు ఒక ఫొటో తీసుకువచ్చి బస్‌పాస్ కౌంటర్ల వద్ద ఈ రాయితీ పాస్‌లు తీసుకోవచ్చు. నియోజకవర్గంలోని దివ్యాంగులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. – కొడమంచిలి వెంకటేశ్వర్లు, డిపో మేనేజర్, రామచంద్రపురం ఆర్టీసీ డిపో -
అమ్మో.. జూన్!
పేద, మధ్య తరగతి కుటుంబాల వారి జేబులకు చిల్లుపడే మాసం వచ్చేసింది. ఇది సగటు మనిషి ఖర్చులను తలచుకుని వణికే కాలం.. తమ పిల్లలను బడి మెట్లు ఎక్కించేందుకు తల్లిదండ్రులు ఫీజులు చెల్లించేందుకు తంటాలు పడే కాలం.. పొలం పనులు సాగించేందుకు పెట్టుబడుల కోసం ఏం చేయాలా అని అన్నదాత ఆందోళన చెందే కాలం.. ఇలా ఖర్చులతో ముడిపడిన ఈ నెలను నెట్టుకువచ్చేందుకు దాదాపు అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతుంటారు. అమ్మో జూన్ అని భయపడుతుంటారు. బాన్సువాడ టౌన్: జూన్ అంటేనే మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇదే నెలలోనే విద్యా సంస్థలు, వ్యవసాయ పనులు ప్రారంభం అవుతాయి. అటు స్కూల్ ఫీజులు, పుస్తకాలకు, ఇటు విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల కోసం డబ్బులు అవసరం అవుతాయి. జిల్లాలో ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో ఫీజులు చుక్కలనంటుతున్నాయి. బుక్స్, యూనిఫాంలు, పెన్నులు, పెన్సిల్స్ ఇతరత్రా వస్తువుల ధరలు పెరిగిపోయాయి. వీటన్నింటిని పిల్లలకు సమకూర్చలేక సామన్య ప్రజానీకం సతమతం అవుతున్నారు. మరో వైపు ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో రైతులు పెట్టుబడి కోసం నానా తిప్పలు పడుతున్నారు. విత్తనాలు ఇతర ఖర్చుల కోసం డబ్బులు ఎలా సమకూర్చుకోవాలో అని ఆలోచిస్తున్నారు. అప్పుల కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తూనే బ్యాంకర్ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. బడిబాటలో.. వేసవి సెలవులు అయిపోవచ్చాయి. పిల్లలు ఆటపాటలు కట్టిపెట్టి బడిబాట పట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పటి వరకు సరదాగా గడిపిన పిల్లలు ‘అప్పుడే సెలవులు అయిపోయాయే’ అని నిట్టూరుస్తూ బడికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా.. ఫీజులు, పుస్తకాలు, బ్యాగ్, స్టేషనరీ, యూనిఫాం, షూస్.. ఇలా పిల్లల స్కూల్ ఖర్చులు చూసి తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ నెల 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభంకానున్నాయి. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలకు పుస్తకాలు, బట్టలు, యూనిఫారంలతో పాటు స్కూల్స్, కాలేజీలకు కట్టాల్సిన సొమ్ములను పోగుచేసుకునే పనిలో తల్లితండ్రులు తలమునకలయ్యారు. పిల్లల చదువుకు పెట్టే ఖర్చులపై విద్యార్థుల తల్లిదండ్రులు లెక్కలు వేసుకుంటున్నారు. కొత్తగా పిల్లలకు పాఠశాలల్లో అడ్మిషన్ తీసుకునే వారు.. ఆయా ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు బెంబేలెత్తించేలా వసూలు చేస్తున్న అడ్మిషన్, డోనేషన్ ఫీజులను చూసి సామాన్య ప్రజలు జంకుతున్నారు. ఇది వరకే చదువుతున్న వారికి పుస్తకాలు, యూనిఫాం, బెల్ట్, టై, షూ, వాటర్‌బాటిల్స్, పుస్తకాల బ్యాగు తదితర వస్తువుల కోనుగోలుతో తల్లిదండ్రులకు జేబులకు చిల్లుపడుతోంది. ఒక వైపు తమ పిల్లలను ఏ పాఠశాలలో చేర్చించాలి.. ఆయా పాఠశాలల్లో ఏ విధమైన బోధన అందుతోంది.. అక్కడి వాతవారణం, ఫీజులు తదితర అంశాలపై పిల్లల తల్లిదండ్రులు ఆలోచించుకుంటున్నారు. తమ ఆదాయ పరిమితి, చదువుకు ఖర్చు పెట్టే స్థాయిలను బేరీజు వేసుకుంటూ ఏ పాఠశాలలో తమ పిల్లల్ని చేర్చించాలనే విషయమై చర్చించుకుంటుండగా.. కొందరు ఇప్పటికే చదువుతున్న పిల్లలకు ఏ ఏడాది ఎంత ఖర్చు అవుతుందోనని భయందోళనకు గురవుతున్నారు. గుండె దడదడ పాఠశాలల పునఃప్రారంభం వార్త వినగానే సామన్య, మధ్య తరగతి ప్రజానీకం గుండె దడదడమని కొట్టుకుంటోంది. చిరు, ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్న వారు ఈ నెల పిల్లల చదువుల కోసం రూ. వేలల్లో ఖర్చులు చేయాల్సి వస్తోంది. పాఠశాలలకు ముందే తీసుకునే సామగ్రి ఒకటయితే, కొన్ని ప్రైవేటు పాఠశా>లల్లో ముందుగానే ఫీజుల వసూలు చేయడం భయందోలనకు గురిచేస్తుంది. పిల్లల యూనిఫాం, షూ, టై, బెల్ట్, నోట్ పుస్తకాలు తదితర స్టేషనరీ సామగ్రి ధరలను సైతం సీజన్‌ను చూసి అమాంతం పెంచుతున్నారు. గత్యంతరం లేక అప్పు చేసి అయినా పిల్లల ఉజ్వల భవిష్యత్ కోసం కొనుగోలు చేయక తప్పడం లేదు. చిరు ఉద్యోగి రెండు నుంచి మూడు నెలల వేతనం ఈ జూన్ మాసంలో పిల్లల ఖర్చులకు సైతం సరిపోని పరిస్థితి నెలకొంది. నర్సరీ పిల్లల నోటు పుస్తకాలు, ఇతర సామగ్రికి సైతం రూ. వేలు ఖర్చు చేయాల్సి వస్తుండడం ఆర్థిక భారానికి దారితీస్తోంది. భగ్గుమంటున్న ఫీజులు ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు ఆకాశాన్నంటుతున్నాయి. జిల్లాలో ప్రైవేటు పాఠశాలల సంఖ్య ఏడాదికి ఏడాదికి పెరిగిపోతుండగా, ఫీజులు సైతం అదే స్థాయిలో ఉంటున్నాయి. ప్రస్తుతం ఇంగ్లిష్ మీడియం చదువులకు ప్రాధాన్యత ఉండడంతో సామన్య, మధ్య తరగతి ప్రజానీకం పిల్లల్ని ప్రైవేటులో చేర్చించేందుకు మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో ఫీజుల రూపంలో నిలువు దోపిడికి గురవుతున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ లేకపోవడంతో యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నాయి. చిన్నచిన్న పట్టణాల్లోనూ ఎల్కేజీకి సైతం రూ. 8 వేల వరకు ఫీజు వసూలు చేస్తున్నారు. మండల స్థాయిలో ఒక తీరు, ముఖ్య పట్టణాల్లో ఒక తీరు ఫీజులు ఉంటున్నాయి. కాస్త పేరున్న పాఠశాలల వసూళ్లకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. ఈ ఫీజులకు తోడు తమ పాఠశాలల్లో చేరే విద్యార్థులకు యాజమాన్యాలే యూనిఫాం, టై, బెల్ట్, షూ, నోటు పుస్తకాలు విక్రయిస్తూ దండుకుంటున్నారు. ప్రైవేటును ఆశ్రయిస్తూ ఇలా విద్యార్థుల తల్లిదండ్రులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. స్కూలు ఫీజులకు తోడు రవాణా చార్జీలు అదనంగా వసూలు చేస్తున్నారు. కొన్ని పాఠశాలలు బస్ సౌకర్యం కల్పించగా కొందరు సొంతంగా ఆటోలు ఏర్పాటు చేసి పిల్లల్ని పంపుతున్నారు. ఈ క్రమంలో రవాణా చార్జీలు తడిసి మోపెడవుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మధ్యమం ప్రవేశపెట్టి సరిపడా ఉపాధ్యాయులను నియమిస్తే ఈ ఆర్థిక భారం తప్పేదని చాల మంది విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. ప్రైవేటులో ఫీజులు ఇలా.. అడ్మిషన్ ఫీజు : రూ. 2 వేల నుంచి రూ. 15 వేల వరకూ ఎంట్రెన్స్ ఫీజు : రూ. వెయ్యి వరకూ స్పెషల్ ఫీజు : రూ. 3 వేల నుంచి రూ. 10 వేల వరకూ తరగతులవారీగా ఫీజులు.. నర్సరీ : రూ. 8 నుంచి రూ. 40 వేలు ఎల్కేజీ : రూ. 10 వేల నుంచి రూ. 45 వేలు యూకేజీ : రూ. 10 వేల నుంచి రూ. 50 వేలు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు : రూ. 12 వేల నుంచి రూ. 75 వేలు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు : 17 వేల నుంచి రూ. లక్ష వరకు స్టేషనరీ నోటు పుస్తకాలు : రూ. 3 వేలు యూనిఫాం(2 జతలు) : రూ. 2 వేలు బ్యాగ్, బాటిల్ తదితర వస్తువులు : రూ. 2 వేలు -
బాబు చేసిన పాపం..సర్కారు బడులకది శాపం
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నాం, అన్ని పాఠశాలలకు మౌలిక వసతుల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వేదికలెక్కిన ప్రతిచోట ఊపదంపుడు ఉపన్యాసాలను చేస్తున్నారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల దుస్థితి చూస్తే మేడిపండు చందంగా ఉందనే విమర్శలు ఉన్నాయి. జిల్లాలో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపేందుకు ఇష్టపడటం లేదు. ఎందుకుంటే ప్రభుత్వ పాఠశాలల్లో çసరిపడా ఉపాధ్యాయులు లేకపోవడం, సరైన మౌలిక వసతులు కల్పించలేక పోవడంతోపాటు పిల్లల చదువుపై అంతగా భరోసా ఇచ్చే పాలకులు కానీ అధికారులు గానీ లేరు. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం అవుతున్నాయి. విద్యార్థులు లేని కారణంగా రేషనలైజేషన్ పేరుతో గత ఐదేళ్లలో జిల్లాలో 208 పాఠశాలలు మూతపడ్డాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రాథమిక విద్య పిల్లల భవిష్యత్తుకు పునాది లాంటిది. అలాంటి పునాదిగా ఉండే ప్రాథమిక విద్యాలయాలు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా మొక్కుబడులుగా మారాయి. దీంతో పేద వర్గాల తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చేందుకు ఇష్టపడడం లేదు. ఒకప్పుడు వందల సంఖ్యలో విద్యార్థులతో కళకళలాడుతున్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఈ రోజు పిల్లలు లేక కళావిహీనంగా మారాయి. ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టని కారణంగా ఏటేటా మూతపడే స్కూళ్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ప్రభుత్వ విద్యను పటిష్టం చేయకపోతే రానున్న రోజుల్లో మరిన్ని పాఠశాలలు మూతపడే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉన్న ఊరిలో బడులు మూసేయడంతో పొరుగు ఊళ్లకు పిల్లలను పంపడం భారంగా మారిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లోని కాన్వెంటులకు పంపుకునే స్థోమత లేని తల్లిదండ్రులు తమ పిల్లలు డ్రాపౌట్స్‌గా మారి బాల కార్మికులుగా మారుతున్నారని ఆందోళన చెందుతున్నారు. 2017 ఏడాదిలో 70 స్కూళ్లు జిల్లాలో 2017లో విద్యార్థుల సంఖ్య లేని కారణంగా 70 స్కూళ్లు మూతపడ్డాయి. ఇందులో బి.మఠం మండలంలో 3 స్కూళ్లు, కాశినాయనలో 3, టి.సుండుపల్లెలో 6, వేములలో 4, ఒంటిమిట్టలో 3, బి.కోడూరులో 2, సీకే దిన్నెలో 2, చక్రాయపల్లెలో 2, చిన్నమండెంలో 2, కలసపాడులో 2 కమలాపురంలో 2, ఖాజీపేటలో 2, ఎల్‌ఆర్‌పల్లెలో 2, నందలూరులో 2, పెండ్లిమర్రిలో 2, రాయచోటిలో 2, సంబేపల్లెలో 2, సిద్దవటంలో రెండు పాఠశాలలతోపాటు పలు మండలాల్లో పలు పాఠశాలలు మూతపడ్డాయి. కనుమరుగవుతున్న పాఠశాలలు: జిల్లాలోని పలు గ్రామాల్లో ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గటంతో రేషనలైజేషన్ పేరుతో 2015లో 136 పాఠశాలలు మూతపడ్డాయి. ఇందులో అట్లూరు మండలంలో 7 స్కూళ్లు, బి.మఠం మండలంలో 5, చక్రాయపేటలో 9, చిన్నమండెంలో 6, కడపలో ఒకటి, జమ్మలమడులో 3, కలసపాడులో 3, కొండాపురంలో 3, ఎల్‌ఆర్‌పల్లిలో 5, ముద్దనూరులో 5, మైదుకూరులో 6, పెనగలూరులో 8. పెండ్లిమర్రిలో 5, పులివెందులలో 3, పుల్లంపేటలో 8, రాజంపేటలో 6, రాయచోటి 3, కాశినాయనలో 3, సంబేపల్లెలో 5, సుండుపల్లెలో 8, వల్లూరులో 3 స్కూళ్లతోపాటు పలు మండలాల్లోని పాఠశాలలు మూతపడ్డాయి. రెండు హైస్కూళ్లు సైతం.. జిల్లాలో రెండు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలను కూడా విద్యార్థుల సంఖ్యలేని కారణంగా మూసివేశారు. ఇందులో రాయచోటి మండలంలోని బి. అంబవరం, కమలాపురం మండలంలోని సి. రాజుపాలెం మండలంలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలను మూసి వేశారు. 53 ప్రాథమికోన్నత పాఠశాల నుంచి ప్రాథమిక పాఠశాలలుగా డిమోషన్ ప్రాథమికోన్నత పాఠశాలలు మనుగడ సాగించడానికి ప్రధానం కారణం టీచర్ల కొరతే. 6, 7 తరగతులకు బోధించాల్సిన సబ్జెక్టు టీచర్లను నియమించకుండా ఒకరిద్దరితోనే నెట్టుకురావడంతో పిల్లల భవిష్యత్తు దృష్ట్యా తల్లిదండ్రులు ఆయా స్కూళ్లకు పిల్లలను పంపేందుకు విముఖత చూపారు. ఫలితంగా జిల్లాలో 53 ప్రాథమికోన్నత పాఠశాలలను ప్రాథమిక పాఠశాలలుగా డిమోషన్ చేశారు. ఇందులో అట్లూరు మండలంలో 3 యూపీ స్కూళ్లు, చాపాడులో 3, చిట్వేల్‌లో 4, కొండాపురంలో 4, పుల్లంపేటలో 3, తొండూరులో 4, బద్వేల్లో 2, గాలివీడులో 2, గోపవరంలో 2, లింగాలలో 2, మైలవరంలో 2, పులివెందులలో 2, సంబేపల్లెలో 2తో పాటు పలు మండలాల్లో ప్రాథమికోన్నత పాఠశాలలను ప్రాథమిక పాఠశాలలుగా డిమోషన్ చేశారు. ఏకోపాధ్యాయుడు ఉన్నపాఠశాలలు 485 జిల్లాలో 1 నుంచి 5వ తరగతి వరకు నిర్వహిస్తున్న ప్రాథమిక పాఠశాలల్లో ఏకోపాధ్యాయుడు ఉన్న పాఠశాలలు 485 ఉన్నాయి. ఈ పాఠశాలల్లో ప్రాథమిక విద్య బలోపేతం ఎలాగో పాలకులకు అధికారులకే తెలియాíల్సి ఉంది. ఈ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు వ్యక్తిగత కారణాల చేత సెలవును పెడితే మాత్ర ఈ పాఠశాలలకు సెలవులను ప్రకటించాల్సిందే. లేకుంటే పక్క గ్రామంలోని టీచర్లను పిలిపించుకుని పాఠశాలలను నిర్వహించాలి. డీఈఓ పూల్‌లో 256 మంది ఉపాధ్యాయులు జిల్లాలో ఉన్న ప్రాథమిక పాఠశాలలు రేషనలైజేషన్ పేరుతో మూతపడటంతో ఆయా పాఠశాలల్లో పనిచేసే 256 మంది ఉపాధ్యాయులు ప్రస్తుతం డీఈఓ పూల్‌లో ఉన్నారు. వీరందరు పని ఒక చోట చేస్తే వీరికి జీతం మరోచోట ఇవ్వాల్సిన పరిస్థితి. మొత్తానికి చంద్రబాబు ప్రభుత్వం పుణ్యమా అని జిల్లాలో సర్కారు చదువుకు తీవ్ర విఘాతం కలిగిందనడంలో ఎలాంటి సందేహం లేదు. బడులు మూత..విద్యార్థులకు వెత జమ్మలమడుగు: జమ్మలమడుగు పట్టణం కోటవీధిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటంతో ఆ పాఠశాల విద్యార్థులను సమీపంలో ఉన్న ఈడిగపేట పాఠశాలలో కలిపి కోటవీధిలో ఉన్న పాఠశాలను మూత వేసేశారు. గంగమ్మదేవాలయం వద్ద ఉన్న ప్రాథమిక పాఠశాలను, ఎస్టీలకోసం ఏర్పాటు చేసిన శబరి కాలనీలో ప్రాథమిక పాఠశాలను సైతం విద్యార్థులు లేరంటూ మూసివేశారు. మండల పరిధిలోని సలివెందుల, శేషారెడ్డిపల్లె, ఒంటిమిద్దె ప్రభుత్వ పాఠశాలలను మూత వేశారు. ఈడిగపేట ప్రభుత్వ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకున్నా మరమ్మత్తులకు, నూతన భవన నిర్మాణానికి నిధులు కేటాయించలేదు. సరైన మౌలిక వసతులు లేకపోవడంతోనే ప్రభుత్వ పాఠశాలల్లో సరైన మౌలిక వసతులు లేకపోవడంతోనే విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లడంలేదు. పాఠశాలలో ఏకోపాధ్యాయులు ఉండటంతో ఆయన సెలవు పెడితే ఆరోజు పాఠశాల మూత పడాల్సి వస్తోంది. – ఎం. ఆంజనేయులు, దళిత కాలనీ,జమ్మలమడుగు. పిల్లలు లేరని మూసేశారు పిల్లలు లేరనే నెపంతో ఉన్న స్కూల్‌ను మూతవేశారు. దీంతో మా ఊరి పిల్లలు చదువుకోవడానికి రెండు కిలో మీటర్ల దూరం పొలాల వెంట తిరుగుతూ వెళ్లాలి. లేదంటే ప్రైవేట్ పాఠశాలకు పంపాలి. ప్రైవేట్ పాఠశాలకు పంపాలంటే వేలకు వేలు డబ్బులు చెల్లించాలి. అంత డబ్బులు మా దగ్గర ఎక్కడి నుంచి వస్తాయి. జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే మా పిల్లలకు చదువులు వస్తాయేమోనని ఆశగా ఉన్నాము. – వి. రాజశేఖర్, చిన్నమండెం పేదల బిడ్డలకు చదువు దూరం చేస్తున్నారు పిల్లలకు తక్కువ ఉన్నారని పేరుపెట్టి పేద పిల్లలకు చదువు లేకుండా చేస్తున్నారు. ఇదేమని అడిగితే పిల్లలు తక్కువగా ఉన్నారు. ఇంత తక్కువ మంది పిల్లలు ఉంటే ఉపాధ్యాయులు ఎలా వస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు పిల్లల చదువు కోసం కూడా వేలకు వేలు అప్పులు చేయాలి. అదే ప్రభుత్వ పాఠశాలలు అయితే ఇంత ఇబ్బంది ఉండేది కాదు. ప్రభుత్వం మారితే కానీ మా పిల్లలకు చదువులు అబ్బే రకం కనిపించడం లేదు. – పి. శివ, కమ్మపల్లె ప్రైవేట్ పాఠశాలకు పంపుతున్నాము మా ఊరిలోని ప్రాథమిక పాఠశాల మూత పడటంతో వేరే గ్రామంలోని పాఠశాలకు వెళ్లాలంటే చాలా దూరం ఉంది. పిల్లలను చదివించుకోవాలనే ఆశతో వేరే గత్యంతరం లేక ప్రైవేట్ పాఠశాలకు పంపుతున్నాము. వైఎస్ జగన్ ప్రభుత్వం వస్తే మా ఊరి బడి మళ్లీ తెరుచుకొంటుందని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాము. – రామచంద్రయ్య, పాలంగొల్లపల్లె పడకేసిన ప్రభుత్వ విద్య రాజంపేట: రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలంలో రెండు, ఒంటిమిట్ట మండలంలో ఐదు పాఠశాలలు, సుండుపల్లెలో రెండు , నందలూరులో ఒకటి, రాజంపేట మండలంలో నాలుగు పాఠశాలలను ఎత్తివేశారు. పాఠశాలల ఎత్తివేసిన ప్రాంతాల్లోని పేద విద్యార్ధులు పొరుగు ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలకు వెళ్లలేక చాలామంది బడి మానేసుకున్నారు. ప్రభుత్వ విద్యకు జగన్ భరోసా.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రభుత్వ విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తానని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. తాను సీఎం కాగానే నవరత్నాలు పథకాన్ని అమలు చేయడంలో భాగంగా పేదవాడి విద్యకు అయ్యే ఖర్చును ప్రభుత్వం భరించేలా చూస్తానని, పేద వర్గాలకు ఉచిత విద్యను మరింత మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకుంటానని ప్రకటించారు. పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోపాటు వసతి, భోజన కోసం అదనంగా ప్రతి యేటా ప్రతి విద్యార్ధికి రూ.20వేలు అందజేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ విద్యకు మంగళం బద్వేలుఅర్బన్ : బద్వేలు మండలంలో 56 ప్రాథమిక పాఠశాలలు, 6 ప్రాథమికోన్నత పాఠశాలలు, మూడు ఉన్నత పాఠశాలలు ఉండగా గత విద్యా సంవత్సరంలో రెండు ప్రాథమిక పాఠశాలలు, ఈ విద్యా సంవత్సరంలో నాలుగు ప్రాథమిక పాఠశాలలు మూతబడ్డాయి. గత ఏడాది తిప్పనపల్లె, నందిపల్లె పాఠశాలలు మూతపడగా, ఈ ఏడాది గుండంరాజుపల్లె, విజయరామాపురం, అయ్యవారిపల్లె, వనంపుల పాఠశాలలు మూతపడ్డాయి. పిల్లలు చదువుకు దూరమవుతున్నారు విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందన్న సాకు చూపి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలను గత ఏడాది మూసివేశారు. దీంతో పిల్లలు చదువుకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. గ్రామంలో పాఠశాల ఉన్నప్పుడు రోజూ బడికి పోయేవాడు. ప్రస్తుతం దూరం కావడంతో బడికి సక్రమంగా వెళ్లడం లేదు. గ్రామంలోని పాఠశాలను తిరిగి తెరిపిస్తే ఉపయోగం ఉంటుంది.– మౌనిక, విజయరామాపురం -
దారుణం..పాఠశాలకు వెళుతుందని..
సాక్షి, పట్నా: ఆడపిల్ల చదువు ఇంటికి వెలుగు అంటారు. కానీ ఆ చదువే ఓ ఇంటి దీపాన్ని ఆర్పేసింది. కేవలం కట్టుబాట్లను కాదన్నందుకు 17 ఏళ్ల అమ్మాయిని అతి దారుణంగా చంపేశారు. తమ కుల నియమానికి విరుద్ధంగా పాఠశాలకు వెళుతుందని కక్ష పెంచుకొన్న ఏడుగురు వ్యక్తులు.. 17 ఏళ్ల బాలికను కిరాతకంగా హతమార్చారు. బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లోని సాన్‌పురా గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది. తమ కుల కట్టుబాటు ప్రకారం పదో తరగతి తర్వాత అమ్మాయిలను ఉన్నత చదువుల కోసం పంపించడం నేరంగా పరిగణిస్తారని, ఈ నియమాన్ని ఉల్లంఘించి.. బాధిత బాలిక వెళుతుందని గ్రహించిన ఏడుగురు వ్యక్తులు... ఈ విషయమై బాలిక కుటుంబాన్ని బెదిరించారని గ్రామస్తులు తెలిపారు. అయినా, బాలిక స్కూలుకు వెళుతుండటంతో.. ఆమెను అంతమొందించాలని నిర్ణయించుకున్నారని, పథకం ప్రకారం బాలిక సోదరుడిని, వదినను వారింట్లోనే బంధించిన నిందితులు అనంతరం బాలికను చంపేశారని వారు తెలిపారు. బాలిక సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏడుగురు నిందితుల్లో నలుగురిని అదుపులోకి తీసుకున్నామని, కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ కేఎం ప్రసాద్ తెలిపారు. -
ప్రాణం తీసిన ఈత సరదా
సాక్షి, నేరడిగొండ(బోథ్): ఈత సరదా బాలుడి ప్రాణం తీసింది. కుమురం భీం జిల్లా వాంకిడి మండలం నవేదిరిలో చెరువులో మునిగి విద్యార్థి మృతిచెందిన సంఘటన మరువక ముందే నేరడిగొండ మండలంలో మరో ఘటన చోటు చేసుకుంది. నేరడిగొండ మండలం చిన్నబుగ్గారం గ్రామానికి చెందిన చౌహాన్ దశరథ్(9), విజయ్, మహిపాల్, పవన్ స్నేహితులు. అదే గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి చదువుకుంటున్నారు. గురువారం ఒంటిపూట బడి అనంతరం వెంకటాపూర్ సమీపంలో గల కడెం వాగులో ఈత కోసం వెళ్లారు. ఈ నలుగురు విద్యార్థులు ఒడ్డుపై బట్టలు విడిచి వాగులోకి దిగారు. అదే సమయంలో దూరం నుంచి వీరిని గమనించిన మత్సకారుడు బట్ట ఆశన్న కేకలు వేస్తూ వెంటనే అక్కడకు చేరుకున్నాడు. కాని అప్పటికే నీటిలో మునిగిన దశరథ్ ఊపిరాడక మృతిచెందాడు. మిగతా వారిని కాపాడిన మత్స్యకారుడు.. విద్యార్థులు వాగులోకి దిగుతుండడాన్ని గమనించిన మత్స్యకారుడు బట్ట ఆశన్న కేకలు వేస్తూ వారిని హెచ్చరించాడు. నీటిలోకి దిగొద్దని అరిచాడు. కాని ఆశన్న అక్కడకు వచ్చే లోపే విద్యార్థులు నీటిలోకి దిగారు. ఆశన్న వెంటనే నీటిలోకి దిగి విజయ్, మహిపాల్, పవన్‌ను కాపాడాడు. ఊపిరాడక కొట్టుకుంటున్న దశరథ్ను పైకి లాగినా ఫలితం లేకుండా పోయింది. మత్స్యకారుడు బట్ట ఆశన్న గ్రామంలో విషాదం.. చిన్నబుగ్గారం గ్రామానికి చెందిన చౌహాన్ వందన– సంజుకు ఇద్దరు కుమారులు, కుమా ర్తె ఉన్నారు. వీరిద్దరు గ్రామంలో పాలేరుగా పనిచేస్తున్నారు. మొదటి సంతానం దశరథ్ చురుకుగా ఉండేవాడు. ప్రస్తుతం ఒంటిపూట బడులు నడుస్తుండడంతో మధ్యాహ్నం స్నేహితులతో కలిసి ఈత కోసం వాగుకు వెళ్లి ఇలా విగతజీవిగా తిరిగిరావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గ్రామస్తులు కంటతడి పెట్టారు. ఘటన స్థలానికి ఎస్సై భరత్‌సుమన్ చేరుకుని పంచనామా నిర్వహించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. -
బడి పిల్లలతో నాగినీ డ్యాన్స్‌లు
చిత్తూరు కలెక్టరేట్: జిల్లాలోని అధికారులందరూ జన్మభూమి– మాఊరు కార్యక్రమానికి ఓ నమస్కారం అనే పరిస్థితి నెలకొంది. కారణం టీడీపీ నేతల ఒత్తిళ్లతో సమస్యలు పరిష్కరించలేక, ప్రజలకు సమాధానం చెప్పలేక ఉద్యోగులు అడకత్తెరలో పోక చెక్కలా నలుగుతున్నారు. ఫలితంగా వారికి జన్మభూమి కార్యక్రమం అంటేనే ముచ్చెమటలు పడుతున్నాయి. జిల్లాలోని అన్ని స్థాయిల్లో ఉన్న అధికారులు తమకున్న అధికారాలను విని యోగించి పేద ప్రజలకు న్యాయం చేద్దామని ప్ర యత్నాలు చేస్తున్నారు. అయితే వారి ప్రయత్నాలను టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతలు అడ్డుకుం టున్నారు. వారిని సక్రమంగా విధులు నిర్వహించనీయకుండా సమస్యలు సృష్టిస్తున్నారు. దీంతో జన్మభూమి– మాఊరు గ్రామసభల్లో ప్రజలిచ్చే అర్జీలకు అధికారులు అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. అలా నిర్ణయం తీసుకునే కొందరి అధికారులపై అక్కడి టీడీపీ ప్రజాప్రతినిధులు తమ అక్కసు ప్రదర్శిస్తున్నారు. టీడీపీ నేతల ఆమోదం తప్పనిసరి ఉద్యోగులు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలకు దరఖాస్తు చేసుకున్న పేదలను గుర్తించి, వాటిని వారి చెంతకు చేర్చే బాధ్యత నిర్వహించాల్సి ఉంది. అయితే జిల్లాలో అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. ఏ శాఖలోనైనా ప్రభుత్వ పథకాల మంజూరుకు సంబంధించి టీడీపీ ప్రజాప్రతినిధుల ఆమోదం తీసుకోవాల్సి వస్తుందని కొందరు అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ప్రజాప్రతినిధులు సూచించే కార్యకర్తలకు మాత్రమే పథకాలు మంజూరు చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ పథకాల ఆశయం నిర్వీర్యం కావడమే గాక పేదలకు ఆ పథకాలు చేరడం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చౌడేపల్లె మండలం చారాలలో ప్రోటోకాల్ వివాదంతో నెలకొన్న ఉద్రిక్తత పోలీసు బందోబస్తు నడుమ జన్మభూమి క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. దీంతో ఆరో విడత జన్మభూమి– మా ఊరు కార్యక్రమ నిర్వహణకు వెళ్లిన అధికారులకు ఛీత్కారాలు, ప్రజల తిరుగుబాటు, ఆగ్రహజ్వాలలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ కార్యక్రమం పోలీసు బందోబస్తు నడుమ కొనసాగాల్సిన దుస్థితి నెలకొంది.అయితే జన్మభూమి – మా ఊరు కార్యక్రమం ద్వారా ప్రజల చెంతకే అధికారుల వచ్చి, ప్రజా సమస్యలు విని పరిష్కరిస్తారని రాష్ట్ర ప్రభుత్వం ఊదరగొడుతోంది. ఇందుకోసం రూ.కోట్ల ఖర్చు పెడుతోంది. కాగా ఇప్పటివరకు జరిగిన ఐదు విడతల జన్మభూమి–మా ఊరు కార్యక్రమాల్లో సమస్యలను పరిష్కరించాలని కోరుతున్న ప్రజలకు న్యాయం జరగలేదు. దీంతో గతంలో ఇచ్చిన అర్జీల పరిస్థితి ఏమిటని ప్రశ్నించిన వారిని ప్రభుత్వం పోలీసులతో బెదిరిస్తోంది. ఈ క్రమంలో జన్మభూమి సభల్లో అధికార పార్టీ నాయకులు, నేతలు మాట్లాడే ప్రసంగాలను ప్రజలు మౌనంగా వినడం తప్ప, మరో మార్గాంతరం లేకుండాపోతోంది. ప్రజలిచ్చే అర్జీలను తామైనా పరిష్కారం చేద్దామని అధికారులు భావిస్తున్న ఉద్యోగులపై టీడీపీ నేతలు ఒత్తిడి పెంచి, ఇబ్బందులు సృష్టిస్తున్నారు. సీఎం సభకు వచ్చిన అర్జీలే నిదర్శనం గత ఐదు విడతల జన్మభూమిలో ప్రజా సమస్యలు పరిష్కారం కాలేదనడానికి గురువారం కుప్పంలో జరిగిన సీఎం చంద్రబాబు పర్యటనలో వచ్చిన అర్జీలే నిదర్శనం. సీఎం కుప్పంలో జరిగిన జన్మభూమిలో పాల్గొన్న సందర్భంగా జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి 875 మందికి పైగా పాల్గొని, అర్జీలు అందజేసినట్లు అధికారులే చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కా రం కాకపోవడంతోనే ప్రజలు నేరుగా సీఎంకైనా తమ ఆవేదనను చెప్పుకుందామని వచ్చి, వినతులు ఇచ్చారనడానికి సాక్షం. ఈ పరిస్థితికి కారణం ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలు, టీడీపీ నేతలు అధికారులను బెదిరించడమే కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బడి పిల్లలతో నాగినీ డ్యాన్స్‌లు జన్మభూమిలో నిర్వాకం గంగవరం: మండలంలోని గండ్రాజుపల్లెలో జరిగిన జన్మభూమి– మా ఊరు కార్యక్రమంలో బడిపిల్లలతో నాగినీ డ్యాన్సులు వేయించారు. గురువారం గండ్రాజుపల్లె, కీలపల్లె పంచాయతీల్లో జన్మభూమి నిర్వహించారు. గండ్రాజుపల్లిలో జన్మభూమి కార్యక్రమం ప్రారంభానికి ముందు బడి పిల్లలతో నాగినీ డ్యాన్స్‌లు వేయించారు. ఇలా సభా ప్రాంగణం మధ్యలో బాల, బాలికలతో డ్యాన్స్‌లు వేయించడం విమర్శలకు దారితీసింది. బడిలో చక్కగా చదువుకోవాల్సిన పిల్లలను ఇలా జన్మభూమికి రప్పించి వారితో డ్యాన్సులు వేయించడం ఏమిటని పిల్లల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి వెలుగు మహిళలను రప్పించడానికి అధికారులు ముప్పుతిప్పలు పడ్డారు. ఆగ్రహజ్వాలలు.. ఆందోళనలు ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆరో విడత జన్మభూమి– మాఊరు కార్యక్రమంలో రెండో రోజైన గురువారం కూడా అధికారులు, ప్రజా ప్రతినిధులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనలు చేశారు. అధికారులను నిలదీశారు. గత ఐదు విడతల్లో ఇచ్చిన అర్జీల మాటేమిటని? వాటికే దిక్కులేదని, మళ్లీ ఇప్పుడు జన్మభూమి ఎందుకు నిర్వహిస్తున్నారని సభలను అడ్డుకున్నారు. జనాగ్రహం, నిలదీతలు, ఆందోళనలు ఎదుర్కొని, వారికి సంజాయిషీ చెప్పుకోలేక అధికారులకు ముచ్చెమటలు పట్టాయి. ♦ ప్రభుత్వం మంజూరు చేసిన పట్టాలకు స్థలాలు చూపకుంటే చంద్రగిరి మండలంలో జరిగే జన్మభూమిని అడ్డుకుంటామని మామండూరు గ్రామస్తులు అధికారులను హెచ్చరించారు. ♦ ప్రభుత్వ కార్యక్రమాలకు అధికారులు ప్రోటోకాల్ పాటిం చడం లేదని టీడీపీ జెడ్పీటీసీ సభ్యురాలు గీతాయాదవ్ ఎంపీడీఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం కార్వేటినగరం మండలం కేఎం పురంలో నిర్వహించిన జన్మభూమి–మా ఊరు సభలో అధికారకంగా స్టేజీపై కూర్చోవారిని పక్కనపెట్టి ఎలాంటి అర్హత లేని వారిని వేదికపై కూర్చోపెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ♦ నాలుగున్నరేళ్లలో టీడీపీ ప్రభుత్వం ప్రజాపాలనను విస్మరిం చింది. గతంలో జరిగిన ఐదు జన్మభూమి–మా ఊరు సభల్లో ఇచ్చిన ఫిర్యాదులకు ఇప్పటికీ పరిష్కారం చూపలేదు. మళ్లీ ఆరో విడత ఏం వెలగబెట్టడానికని జన్మభూమి గ్రామసభలు జరుపుతున్నారో ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి నిలదీశారు. ♦ చౌడేపల్లె మండలం చారాలలో ప్రోటోకాల్ పాటించకపోవడంతో ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు, టీడీపీ ఇన్చార్జి అనూషారెడ్డి, శ్రీనాథరెడ్డి గోబ్యాక్ అంటూ ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులు తదితరులు నినాదాలు చేశారు. అయినా వారు వేదికపైనే కూర్చోని ఉండడంతో ఉద్రిక్తతకు దారితీసింది. ♦ సమస్యలుంటే జన్మభూమి కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధుల సమక్ష్యంలోనే చెప్పమంటారు... తర్వాత అధి కారులు ఏమీ పట్టించుకోరు. ఇదేమిటని తవణంపల్లె మండలం చెర్లోపల్లె గ్రామ సభలో అధికారులపై డ్వాక్రా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ♦ కుశస్థలి నది కుడి, ఎడమ కాలువలు దురాక్రమణకు గురవుతున్నాయని ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన స్పందిం చడం లేదని సీపీఐ నాయకులు నగరిలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో అధికారులను నిలదీశారు. ♦ నాగలాపురం మండలం కడివేడులో జరిగిన జన్మభూమి– మా ఊరు గ్రామ సభను ఆ గ్రామ దళితులు బహిష్కరించారు. జన్మభూమి ప్రారంభంలో వైఎస్సార్ సీపీ బూత్ కమిటీ మండల కన్వీనర్ ఈశ్వరయ్య ఆధ్వర్యంలో దళితులు జన్మభూమి గ్రామసభను అడ్డుకున్నారు. ♦ తంబళ్లపల్లె మండలంలోని వేమారెడ్డిగారిపల్లె, పంచాలమర్రి గ్రామాల్లో జరిగిన గ్రామ సభలు రసాభాసగా సాగాయి. సమస్యలపై ప్రజలు అధికారులను నిలదీశారు. ప్రజలు అధికారులతో వాగ్వివాదానికి దిగారు. ♦ జన్మభూమి సభల్లో దరఖాస్తు చేస్తున్నా సమస్యలు పరిష్కారం కాలేదని స్థానికులు ఎమ్మెల్యేను నిలదీశారు. తిరుపతి నగరంలోని 2, 12, 22, 32, 42 వార్డుల్లో జన్మభూమి సభల్లో ఎమ్మెల్యే సుగుణమ్మకు ఈ అనుభవం ఎదురైంది. -
కులానికో సెక్షన్!
లాల్గంజ్: దేశ భవిష్యత్తు పార్లమెంటులో కాదు.. పాఠశాల గది గోడల మధ్య నిర్ణయించబడుతుందంటారు. రేపటి మన దేశం ఎలా ఉండాలని కోరుకుంటామో.. అందుకు అనుగుణంగా ఈ రోజే పాఠశాలలను తీర్చిదిద్దుకోవాలి. కులం, మతం, జాతి, ప్రాంతం.. ఈ భేదాలేవీ లేకుండా తరగతి గదిలో అందరూ సమానులేననే భావన విద్యార్థుల్లో కలిగించాలి. ఇది పాఠశాల బాధ్యత. కానీ ఇందుకు విరుద్ధంగా బిహార్‌లోని ఓ పాఠశాల మాత్రం ఇప్పటి నుంచే విద్యార్థుల్లో కులం, మతం, జాతి భేదాలను పెంపొందిస్తోంది. తరగతి గదిలోని విద్యార్థులను కులాల వారీగా, మతాల వారీగా విభజించి కూర్చోబెడుతోంది. ఒక్కో మతానికి ఒక్కో సెక్షన్ ఏర్పాటు చేసి, పాఠశాలను నిర్వహిస్తోంది. ఇదంతా చేస్తోంది ఏదో ఓ ప్రైవేటు పాఠశాల అనుకుంటే పొరపాటే. వైశాలి జిల్లా, లాల్గంజ్లోని ప్రభుత్వ పాఠశాల. ఈ విషయాన్ని రాష్ట్ర విద్యామంత్రి కృపానందన్ ప్రసాద్‌వర్మ కూడా అంగీకరించారు. ‘నిజమే.. ఆ పాఠశాలలో హిందూ, ముస్లిం విద్యార్థులకు వేర్వేరు సెక్షన్లు ఉన్నాయ’న్నారు. ఆ పాఠాశాలపై చర్యలు తీసుకునేందుకు నివేదిక తెప్పిస్తున్నామన్నారు. ఇక తరగతిలోనూ బీసీలు, ఎస్సీలను వేర్వేరుగా కూర్చోబెడుతున్నారని, రిజిస్టర్లు కూడా వేర్వేరుగా పెట్టినట్లు తమ ప్రాథమిక పరిశీలనలో తేలిందని లాల్గంజ్ విద్యాధికారి అరవింద్‌కుమార్ తెలిపారు. దీనిపై ప్రభుత్వానికి నివేదిక పంపుతున్నామని, తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇది దురదృష్టకరం, తప్పుడు విధానమని అన్నారు. -
ఆరోగ్యానికి బాల సురక్ష
ఏలూరు టౌన్ : చిన్నారుల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. చిన్నతనం కావటంతో శారీరకంగా ఏర్పడే చిన్నపాటి లోపాలను ఎవరితోనూ చెప్పుకోలేని పరిస్థితి. ఇంట్లో తల్లీదండ్రీ ఈ లోపాలను గుర్తించలేకపోవటం, మానసికంగా పిల్లల ను నలిపేస్తుంది. ఈ సమస్యలతో పిల్లలు అసాధారణంగా ప్రవర్తిస్తుంటారు. ఇక హైస్కూల్, ఇం టర్ స్థాయి చదివే విద్యార్థుల్లోనూ శారీరక లోపాలు, అనారోగ్యం బాధిస్తూ చదువుపై శ్రద్ధ చూ పించకపోవడానికి కారణాలవుతున్నాయి. వీటి నివారణకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ బాల స్వచ్ఛ కార్యక్రమం (ఆర్బీఎస్కే) అమలుచేస్తోంది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి బాల సురక్ష పథకంగా అమలుచేస్తూ పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తూ వారి ఆరోగ్య పరిస్థితిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. పథకంలో భాగంగా అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లోని విద్యార్థులకు వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లాకు ఈ పథకం కింద 30 బాల సురక్ష వాహనాలు ఏర్పాటుచేశారు. ఒక్కో వాహనంలో ఇద్దరు డాక్టర్లు, ఇద్దరు నర్సులు ఉంటారు. ఈ వాహనాలు పీహెచ్‌సీల పరిధిలో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, జూనియర్ కాలేజీలకు వెళ్లి వైద్యపరీక్షలు నిర్వహించి, పిల్లలకు ఆరోగ్య కార్డులు ఇస్తారు. ఏడాదికి రెండుసార్లు విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.ఆరోగ్య సమస్యలు గుర్తిస్తే వెంటనే పిల్లలను ఆయా ఆసుపత్రులకు రిఫర్ చేయడంతో పాటు శస్త్రచికిత్సలు చేయిం చాల్సిన బాధ్యత వారిదే. 1.70 లక్షల మందికి వైద్య పరీక్షలు జిల్లావ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లోని విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో సుమారు 5లక్షల మంది పిల్లలు ఉండగా ఈ విద్యాసంవత్సరంలో సుమారు లక్షా 70 వేల మంది పిల్లలు, విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. పిల్లలకు వైద్య పరీక్షలు ఇలా.. అంగన్వాడీ కేంద్రాలకు వెళ్లే బాలల నుంచి జూనియర్ కాలేజీల్లో చదివే విద్యార్థుల వరకూ ప్రతిఒక్కరికీ కొన్ని ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. లోపాలను గుర్తిస్తే వెంటనే ఏలూరులోని జిల్లా బాలల సత్వర చికిత్సా కేంద్రానికి (డీఈఐసీ) తరలించి, నిపుణులైన వైద్యులతో పరీక్షల అనంతరం అవసరమైతే ఆపరేషన్లు చేయిస్తారు. ఇక్కడ ప్రత్యేకంగా నలుగురు వైద్యులు, సైకాలజిస్టు, ల్యాబ్స్, పిల్లల మానసిక వికాసానికి ఆటగదులు వంటివి ఏర్పాటు చేశారు. పరీక్షలు ఇవే.. న్యూరల్ ట్యూబ్ లోపం, డౌన్స్ సిండ్రోమ్, గ్రహణం మొర్రి, పెదవి చీలిక, క్లబ్ ఫుట్, నడుం భాగం వృద్ధి లోపం, సంక్రమిక కంటిపొర, పుట్టుకతో వచ్చే చెవుడు, సంక్రమిక గుండె జబ్బులు, రెటినోపతి ఆఫ్ ప్రీ మెచ్యూరిటీ, రక్తహీనత, విటమిన్ల లోపం, పోషకాహార లోపం, చర్మవ్యాధులు, రుమాటిక్ గుండె వ్యాధి, శ్వాసకోశ వ్యాధులు, పిప్పి పళ్లు, మూర్చ వ్యాధి, దృష్టి సమస్యలు, మేధోపరమైన అసమానత, వయసుకు అనుగుణంగా మాటలు రాకపోవటం, ఆటిజమ్, అభ్యసనా సమస్యలు, థలసీమియా వంటి 30 రకాల వ్యాధులకు పరీక్షలు చేస్తారు. పిల్లల్లో లోపాలు గుర్తించాలి పిల్లల శారీరక, మానసిక సమస్యలను తెలుసుకోవాలి. ఇంట్లో తల్లీదండ్రీ పిల్లల సమస్యలపై శ్రద్ధ పెట్టాలి. పాఠశాలల్లో పిల్లల ఆరోగ్య సమస్యలను పరీక్షించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం. ఏవైనా సమస్యలు ఉండి ఆపరేషన్లు అవసరమని గుర్తిస్తే ఆయా వైద్య నిపుణులకు రిఫర్ చేస్తాం. ముఖ్యంగా పిల్లల ఎదుగుదలకు అవరోధాలుగా మారుతున్న ఆరోగ్య సమస్యలపై జాగ్రత్తలు వహించాల్సి ఉంది. జిల్లాలోని 30 బాల సురక్ష వాహనాల ద్వారా ఈ ఏడాది చివరి నాటికి ప్రతి విద్యార్థికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తాం.–కె.గణేష్, జిల్లా ఎగ్జిక్యూటివ్ -
బాత్రూమ్లో నీళ్లు పోయలేదని..
సాక్షి, నాగర్ కర్నూలు: జిల్లాలోని తెలకపల్లి మండల కేంద్రంలోని కేకే రెడ్డి స్కూల్లో దారుణం చోటుచేసుకుంది. క్రమశిక్షణ పేరుతో స్కూల్ వార్డెన్ విద్యార్థులను విచక్షణారహితంగా చితకబాదాడు. వివరాల్లోకి వెళితే.. కేకే రెడ్డి స్కూల్లో వార్డెన్‌గా పనిచేస్తున్న రవీందర్.. బాత్రూమ్లో నీళ్లు పోయలేదన్న కోపంతో 130 మంది విద్యార్థులను ఇష్టానుసారంగా చితకబాదాడు. ఈ దాడిలో పలువురు విద్యార్థులకు తీవ్రంగా గాయాలు కావడంతో వారిని నాగర్ కర్నూలులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మిగిలిన విద్యార్థులకు స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులపై విచక్షణారహితంగా దాడి చేసిన వార్డెన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం వార్డెన్ రవీందర్ పరారీలో ఉన్నారు. -
బాత్రూమ్లో నీళ్లు పోయలేదని..
-
మగ్గిపోతున్న ‘పసి మొగ్గలు’
ఆదిలాబాద్‌టౌన్ : పలకా బలపం పట్టాల్సిన చేతులు మెకానిక్ షెడ్లు, ఇటుక బట్టీల్లో పానలు, పారలు పడుతున్నారు. పుస్తకాలు చేతపట్టి అక్షరాలు దిద్దాల్సిన వీరు రోడ్లపై చిత్తుకాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నారు. జిల్లాలోని ఆయా పట్టణాల్లో రద్దీ ప్రదేశాల్లో బడీడు పిల్లలు భిక్షాటన చేసుకుంటూ పొట్టపోసుకుంటున్నారు. బస్టాండ్, రైల్వేస్టేషన్, హోటళ్లు, లాడ్జీల్లో దర్శనమిస్తున్నారు. విద్యాహక్కు చట్టం, కార్మిక శాఖ ఇటు వైపుగా చూస్తున్నట్లుగా కనిపించడం లేదు. ఫలితంగా బాల కార్మికులకు విముక్తి కలగడం లే దు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ప్రవేశ పెట్టిన పలు కార్యక్రమాలు, చట్టాలన్ని మొక్కుబడిగా అమలవుతున్నాయి. సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా పిల్లలు బందీలుగా మిగులుతున్నా రు. బాలల దినోత్సవం సందర్భంగా మొక్కుబడి కార్యక్రమాలు నిర్వహించడం తప్పా వారికి అక్షరాలు దిద్దించేలా పాఠశాలల్లో చేర్పించే కార్యక్రమాలు అమలుకు నోచుకోవడంలేదు. బాట పట్టినా.. బడికి రాని పిల్లలు సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం ప్రతియేటా బడిబాట కార్యక్రమాలను చేపడుతోంది. ఉపాధ్యాయులు చిన్నారుల ఇంటికి వెళ్లి వారి తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలపై అవగాహన కల్పించి చేర్పించేలా చూడాలని కోరుతున్నా పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. అనేక కార్యక్రమాలను చేపడుతున్నన్నా పిల్లలు బడిబాట పట్టడం లేదు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ఎన్రోల్మెంట్ డ్రైవ్, చదువుల పండుగ, బడిబాట, విద్యా పక్షోత్సవాలు, విద్యా సంబరాలు.. ఆచార్య జయ శంకర్ చదువుల పండుగ.. ఇలా గత పదేళ్లలో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో ఏ ఒక్కటైనా సరిగ్గా అమలైతే పిల్లలు బడిలోనే ఉండేవారు. కానీ అలా జరగడం లేదు. ప్రధానంగా విద్యాహక్కు చట్టం అమలుకు నోచుకోకపోవడం బాలలకు శాపంగా మారింది. ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 500లకు పైగా మంది చిన్నారులు బడిబయట ఉన్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆయా మండలాల్లో బాల కార్మికులు అధికంగానే ఉన్నట్లుగా అధికారులు కూడా గుర్తించారు. కాగా అధికారుల గణాంకాల ప్రకారం జిల్లాలో కేవలం 144 మంది పిల్లలు బడిబయట ఉన్నట్లు గుర్తించారు. గత మూడు నాలుగు నెలల క్రితం నిర్వహించిన బడిబాటలో పిల్లల్ని చేర్పించలేక పోయారు. విద్యాహక్కు చట్టంలో భాగంగా బాల కార్మికులను బడిలో చేర్పించేందుకు పట్టణ శివారు ప్రాంతంలో ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేసిన అధికారులు ఆ తర్వాత వాటిని పట్టించుకోకపోవడంతో అవి మూతబడ్డాయి. నెరవేరని విద్యాహక్కు చట్టం లక్ష్యం.. సంపూర్ణ అక్షరాస్యత లక్ష్యంగా ప్రభుత్వం రూపొందించిన విద్యాహక్కు చట్టంతోనైనా నిరుపేద కుటుంబాల్లోని పిల్లలకు విద్య అందించాలనే లక్ష్యం నెరవేరడం లేదు. కొన్నేళ్లుగా విద్యాహక్కు చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించింది. పిల్లలు బడికి.. పెద్దలు పనికి అనే నినాదంతో విద్యాహక్కు చట్టానికి మరింత పదును పెట్టి పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేస్తున్నా అనుకున్న లక్ష్యానికి చేరువ కావడానికి చట్టం తీసుకువచ్చిన విషయం విదితమే. లక్ష్యం సాధించకపోవడంతో విద్యావేత్తలు ఆందోళన చెందుతున్నారు. 2009 ఆగస్టు 27న పార్లమెంటులో విద్యాహక్కు చట్టాన్ని ఆమోదించింది. 2010 ఏప్రిల్ నుంచి ఈ చట్టాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేస్తోంది. చట్టాలు రూపొందించి అమలు చేయడంలో పాలక ప్రభుత్వాలు వివక్ష చూపడం వల్లే నేటికీ ఉచిత నిర్బంధ విద్య అమలు కావడం లేదు. ఈ పరిస్థితి ఇలాగే ఉంటే మరో విద్యా సంవత్సరంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించాలనేది కలగానే మిగిలిపోయే ప్రమాదం లేకపోలేదు. ఇదిలా ఉండగా, బడిబయట పిల్లల్ని బడిలో చేర్పించిన అధికారులు ఆ తర్వాత పిల్లలు బడికి వస్తున్నారో.. లేదో.. పర్యవేక్షించకపోవడంతో బడిలో చేరిన పిల్లలు తిరిగి బయటకు వెళ్లిపోతున్నారు. పిల్లల్ని బడిలో చేర్పించాలి బడి బయటి పిల్లల్ని ఉపాధ్యాయులు బడిలో చేర్పించాలి. జిల్లాలో 144 మంది పిల్లలు బడి బయట ఉన్నట్లు గుర్తించాం. 14 సంవత్సరాల వయస్సు లోపు పిల్లల్ని పనుల్లో పెట్టుకుంటే చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తల్లిదండ్రులు తమ పిల్లల్ని పనులకు పంపకుండా పాఠశాలలకు పంపించి వారి భవిష్యత్తుకు బాటలు వేసేలా కృషి చేయాలి. – డాక్టర్ రవీందర్‌రెడ్డి, డీఈఓ, ఆదిలాబాద్