
సాక్షి, పట్నా: ఆడపిల్ల చదువు ఇంటికి వెలుగు అంటారు. కానీ ఆ చదువే ఓ ఇంటి దీపాన్ని ఆర్పేసింది. కేవలం కట్టుబాట్లను కాదన్నందుకు 17 ఏళ్ల అమ్మాయిని అతి దారుణంగా చంపేశారు. తమ కుల నియమానికి విరుద్ధంగా పాఠశాలకు వెళుతుందని కక్ష పెంచుకొన్న ఏడుగురు వ్యక్తులు.. 17 ఏళ్ల బాలికను కిరాతకంగా హతమార్చారు. బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లోని సాన్‌పురా గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది. తమ కుల కట్టుబాటు ప్రకారం పదో తరగతి తర్వాత అమ్మాయిలను ఉన్నత చదువుల కోసం పంపించడం నేరంగా పరిగణిస్తారని, ఈ నియమాన్ని ఉల్లంఘించి.. బాధిత బాలిక వెళుతుందని గ్రహించిన ఏడుగురు వ్యక్తులు...
ఈ విషయమై బాలిక కుటుంబాన్ని బెదిరించారని గ్రామస్తులు తెలిపారు. అయినా, బాలిక స్కూలుకు వెళుతుండటంతో.. ఆమెను అంతమొందించాలని నిర్ణయించుకున్నారని, పథకం ప్రకారం బాలిక సోదరుడిని, వదినను వారింట్లోనే బంధించిన నిందితులు అనంతరం బాలికను చంపేశారని వారు తెలిపారు. బాలిక సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏడుగురు నిందితుల్లో నలుగురిని అదుపులోకి తీసుకున్నామని, కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ కేఎం ప్రసాద్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment