Community
-
Student Tribe: స్టూడెంట్ ట్రైబ్..
మారుతున్న కాలానికి అనుగుణంగా అధునాతన సాంకేతికత, వినూత్న నైపుణ్యాలను అందిపుచ్చుకుంటోంది ఈతరం యువత. ఇటు చదువుకుంటూనే అటు భవిష్యత్ ప్రణాళికల గురించి మార్గ నిర్దేశం చేసుకుంటోంది. ఇలాంటి తరుణంలో విద్యార్థులకు అత్యున్నత భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తోంది ‘స్టూడెంట్ ట్రైబ్‘. ఒక స్టార్టప్ లాంటి ఈ వేదిక ఏదైనా డిగ్రీ, ఆ పైన చదువులు చదువుతున్న విద్యార్థులకు ఈ తరం సాంకేతికతకు అనుగుణంగా నైపుణ్యాలను అందజేస్తూ.. మరోవైపు పరిశ్రమలో వారికి అవకాశాలను చేరువ చేస్తోంది. 6 లక్షలకుపైగా స్టూడెంట్ నెట్‌వర్క్‌తో విభిన్న వేదికల్లో విద్యార్థులకు అవగాహన అవకాశాలను కల్పిస్తోంది. స్టూడెంట్ ట్రైబ్ అనేది స్టూడెంట్ కమ్యూనిటీ ప్లాట్‌ఫామ్. ఈ వేదిక దాదాపుగా 6 లక్షలకు పైగా విద్యార్థులతో, రెండు తెలుగు రాష్ట్రాల్లో 500 పైగా కాలేజీలతో అనుసంధానమై ఉంది. సోషల్ మీడియా వేదిక ఇన్‌స్ట్రాగామ్‌లో 4.5 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. విద్యార్థులను నైపుణ్యాలకు అనువైన బ్రాండ్స్‌కు అనుసంధానం చేస్తోంది. గిగ్ వర్క్ ఇంటరీ్నíÙప్, వలంటీర్, ఫుల్‌టైమ్‌గా ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. విద్యార్థులు చదువుకుంటూనే సంపాదన, స్కిల్స్ మెరుగు పర్చుకోవడంతో పాటు సరి్టఫికెట్లు పొందవచ్చు. స్థిరమైన భవిష్యత్ వృద్ధికి అంతులేని అవకాశాలను సృష్టిస్తోంది. టెక్నాలజీ నుంచి మార్కెటింగ్, డిజైన్ వరకు ప్రతి అవకాశాన్ని దగ్గర చేరుస్తోంది. టైర్–2, టైర్–3 నగరాల్లో సేవలు అందించడంతో పాటు వారికి అవసరమైన నైపుణ్యాలు, అవకాశాలను అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. విద్యార్థులు సంపాదించిన డబ్బు అటు చదువు, ఇటు ప్యాకెట్ మనీకి ఉపయోగపడుతుంది. బ్రాండింగ్, ఉపాధి అవకాశాలు, నైపుణ్యం అభివృద్ధి అనే మూడు అంశాలపై సేవలు అందిస్తున్నారు. ప్రత్యేకంగా ఒక యాప్ ఆవిష్కరించి అవకాశాలు, వర్క్‌షాప్‌లు, వెబినార్స్ తదితర కార్యక్రమాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందులో పొందుపరుస్తున్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటారు. బీబీఏ, బీకాం, బీఎస్సీ, ఇంజినీరింగ్ వంటి ఏదైనా డిగ్రీ చేసిన విద్యార్థులు ఈ సేవలను ఉచితంగానే పొందవచ్చు.అవకాశాలకు పుష్పకవిమానం.. నేను 2024లో డిగ్రీ బీకాం పూర్తి చేశాను. డిగ్రీ చేస్తున్న సమయంలోనే స్టూడెంట్ ట్రైబ్‌ను ఫాలో అవుతున్నాను. దీనికి సంబంధించిన యాప్‌లో ఎప్పటికప్పుడు అవసరమైన అవకాశాలు, వర్క్‌షాప్స్ గురించి తెలుసుకున్నాను. ఇందులో భాగంగానే స్టూడెంట్ ట్రైబ్లో అకౌంట్ మేనేజర్‌గా ఫుల్‌టైమ్ జాబ్ పొందాను. నాలాంటి ఎంతోమంది విద్యార్థులకు ఈ వేదిక పుష్పక విమానంగా సేవలందిస్తోంది. – కీర్తనకార్పొరేట్ స్థాయి నైపుణ్యం విద్యార్థులు చదువుకుంటూనే అందుబాటులో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునేలా ఈ వేదికను ప్రారంభించాం. వారి కోసం ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ యాకథాన్ నిర్వహించాం. ఇందులో ప్రముఖ సినీ తార సమంత వంటి సెలబ్రిటీలు పాల్గొన్నారు. ఈ మధ్యనే అప్ స్కిల్లింగ్ అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. జావా మెకానికల్ ఇంజినీరింగ్ వంటి విభిన్న నైపుణ్యలపై అవగాహన కల్పిస్తున్నాం. ఇందులో ప్రత్యేకంగా విద్యార్థినులకు కార్పొరేట్ స్థాయి నైపుణ్యాలను అందిస్తున్నాం. దీనికోసం వివిధ కార్పొరేట్ సంస్థలకు చెందిన నిపుణులు, ప్రతినిధులు, సీఈవోలను ఆహ్వానించి విద్యార్థులకు అనుసంధానం చేస్తున్నాం. ఇప్పటి వరకు రెండు బ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాయి. ఏఐ, బ్లాక్‌చెయిన్ వెబినార్, మెకానికల్ ఇంజినీరింగ్ వర్క్‌షాప్స్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ మార్కెటింగ్ వర్క్‌షాప్ వంటివి నిర్వహించాం. – చరణ్ లక్కరాజు, స్టూడెంట్ ట్రైబ్ వ్యవస్థాపకులు. -
‘మీరు ముసలాడవ్వకూడదు’
వృద్ధాప్యం దరిచేరనివ్వకూడదంటూ ప్రచారం సాగిస్తున్న ఓ ప్రముఖ కంపెనీ సహవ్యవస్థాపకుడు బ్రయాన్ జాన్సన్ తాజాగా తాను రాసిన పుస్తకంతోపాటు ‘డోంట్ డై’ అనే కమ్యునిటీని ప్రమోట్ చేసే పనిలో పడ్డారు. ప్రతివ్యక్తి వేగంగా వృద్ధాప్యం బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని బ్రయాన్ జాన్సన్ కోరుతుంటారు. ఈమేరకు ‘బ్లూప్రింట్’ ప్రాజెక్ట్‌లో భాగంగా రివర్స్ ఏజింగ్(పెద్ద వయసులోనూ యువకుడిలా కనిపించేలా)ను ప్రమోట్ చేస్తున్నారు.బ్రయాన్ జాన్సన్ ఇటీవల తాను రాసిన పుస్తకంతో పాటు ‘డోంట్ డై’ అనే కమ్యునిటీని ప్రమోట్ చేసేందుకు భారత్‌లో ఆన్లైన్ పుడ్ డెలివరీ సేవలందిస్తున్న జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్‌ను కలవనున్నట్లు సమాచారం. బ్రయాన్ జాన్సన్ వెన్మో సంస్థ సహవ్యవస్థాపకుడు. అయితే ఈయన తన కంపెనీను సుమారు రూ.6,640 కోట్లకు పేపాల్‌కు విక్రయించారు. ఈ డీల్‌తో భారీగా నగదు పోగు చేసుకున్న జాన్సన్ వైద్య నిర్ధారణలు, చికిత్సలు, తన లక్ష్యాలను సాధించడానికి కఠినమైన జీవనశైలి కోసం ఏటా 2 మిలియన్ డాలర్లు(రూ.16.6 కోట్లు) పైగా ఖర్చు చేస్తున్నారు.‘హలో ఇండియా. డోంట్ డైపై నమ్మకం ఉన్న ఏకైక వ్యక్తి పూనమ్‌పాండే. తనకు దాని గురించి చెప్పాను. నేను డిసెంబర్ 1-3 వరకు ముంబైలో, డిసెంబర్ 4-6 వరకు బెంగళూరులో ఉంటాను’ అంటూ జాన్సన్ తన ఎక్స్ ఖాతాలో తెలియజేస్తూ ‘మర్నామత్(చనిపోకండి)’ అనే హ్యాష్‌ట్యాగ్‌ని ఉంచారు.ఇదీ చదవండి: రూ.1.82 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లుజాన్సన్ వృద్ధాప్య చాయలు దరిచేరకూడదని తన టీనేజ్ కుమారుడి నుంచి రక్త మార్పిడి చేసుకున్నారు. జన్యుపరమైన ఇంజెక్షన్లు చేయించుకోవడం, కఠినమైన ఆహార విధానాన్ని అనుసరించడం, రోజూ 100కి పైగా సప్లిమెంట్లను తీసుకోవడం, కఠోర వ్యాయామం.. వంటివి చేస్తూంటారు. -
అమ్మవారికి కష్టాలు చెప్పుకుంటూ.. ట్రాన్స్జండర్ల పూజలు
జంషెడ్పూర్: దేశంలోని పలు ప్రాంతాల్లో దుర్గామాత పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఇదే నేపధ్యంలో జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో ట్రాన్స్‌జంటర్లు దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గత ఎనిమిదేళ్లుగా వీరు నవరాత్రులలో దుర్గామాతను ఘనంగా పూజిస్తున్నారు.ఈ ట్రాన్స్‌జండర్లు దుర్గామాత విగ్రహం తయారీకి పశ్చిమ బెంగాల్ నుండి గంగానది మట్టిని తీసుకువచ్చి తమ చేతులతో విగ్రహాన్ని తయారు చేస్తారు. తాము చేసే ఆరాధన మిగిలినవారి ఆరాధనకు భిన్నంగా ఉంటుందని ఈ కమ్యూనిటీకి చెందిన అమర్జీత్ సింగ్ గిల్ తెలిపారు. తమ కమ్యూనిటీకి చెందినవారు ఈ తొమ్మిది రోజులు దుర్గా అమ్మవారి విగ్రహం ముందు కూర్చుని, తాము తమ జీవితంలో ఎదుర్కొన్న కష్టనష్టాలను చెప్పుకుంటారు. అలాగే ప్రపంచశాంతి కోసం ప్రార్థిస్తారు.ప్రతి సంవత్సరం దేశంలోని పలు ప్రాంతాల నుంచి ట్రాన్స్‌జండర్లు ఇక్కడికి తరలివచ్చి, దుర్గమ్మవారి పూజల్లో పాల్గొంటారు. ఇక్కడ జరిగే పూజల్లో మతపరమైన నియమాలను అనుసరించడంతో పాటు ట్రాన్స్‌జండర్లు తమ భావోద్వేగాలను అమ్మవారితో పంచుకుంటారు. ఇది కూడా చదవండి: అమెరికా వర్జీనియా నగరంలో వైభవంగా దసరా, బతుకమ్మ వేడుకలు! -
చంద్రబాబుకు ఆర్యవైశ్యులు వార్నింగ్
-
వైఎస్సార్సీపీకి మద్దతు ప్రకటించిన ఆర్య వైశ్య సంఘం
-
27న సింగరేణి ఎన్నికలు
శ్రీరాంపూర్ (మంచిర్యాల), గోదావరిఖని, సింగరేణి (కొత్తగూడెం): హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 27న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి సోమవా రం హైదరాబాద్‌లోని డిప్యూటీ సీఎల్సీ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనివాసులు కార్మిక సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యా రు. మొత్తం 13 కార్మిక సంఘాల నాయకులు, కంపెనీ అధికారులు పాల్గొన్నారు. ఇప్పటివరకు ఎన్ని కల షెడ్యూల్ ప్రకారం నామినేషన్ల పర్వం, స్క్రూటి నీ పూర్తయిన విషయం తెలిసిందే. కోర్టుకు వెళ్లిన కారణంగా విడుదల చేయని ఓటరు జాబితాను కంపెనీ విడుదల చేసింది. జాబితా ప్రతుల ను రిటర్నింగ్ అధికారి కార్మిక సంఘాలకు అందజేశారు. 8న తుదిజాబితా ఈనెల 6లోగా అభ్యంతరాలు స్వీకరిస్తారు. 8న తుదిజాబితా ప్రచురించనున్నారు. బీఆర్ఎస్ అను బంధ టీబీజీకేఎస్‌తోపాటు ఐదు జాతీయ కార్మిక సంఘాలు ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్, బీఎంఎస్, సీఐటీయూ, ఏఐటీయూసీ సహా 13 సంఘాలు బరిలో ఉంటున్నాయి. గుర్తింపు, ప్రాతినిధ్య సంఘం కోసం ఒకే ఓటు పద్ధతి అమలు చేస్తారు. ఎన్నికల నిర్వహణకు ఆరు జిల్లాల కలెక్టర్ల ద్వారా రెవెన్యూ యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని కోరా రు. గుర్తులను రిటర్నింగ్ అధికారి శ్రీనివాసులు ఇప్పటికే కేటాయించారు. ఈ ఎన్నికల్లో 39748 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకో నున్నారు. శాశ్వత ఉద్యోగులు మాత్రమే ఓటు హ క్కు వినియోగించుకుంటారు. సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిన ఈనెల 27న పోలింగ్ నిర్వహిస్తారు. అదేరోజు రాత్రి 7గంటల నుంచి ఓట్లు లెక్కిస్తారు. సమావేశంలో ఏఐటీయూసీ అధ్యక్షుడు వి.సీతారామయ్య, టీబీజీకేఎస్ అధ్యక్షుడు బి.వెంకట్రావు, ఐఎనీ్టయూసీ సెక్రటరీ జనరల్ బి.జనక్‌ప్రసాద్, హెచ్ఎమ్మెస్ అధ్యక్షుడు రియాజ్ అహ్మద్, బీఎంఎస్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య, సీఐటీయూ కార్యదర్శి మంద నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు. ఏరియాల వారీగా ఓటర్లు బెల్లంపల్లి ఏరియాలో 985 మంది ఓటర్లు, మందమర్రిలో 4876, శ్రీరాంపూర్‌లో 9124, కార్పొరేట్లో 1192, కొత్తగూడెంలో 2370, మణుగూరులో 2414, ఎల్లందులో 603, నైనీబ్లాక్‌లో 2, భూపాలపల్లిలో 5350, ఆర్జీ 1లో 5430, ఆర్జీ 2లో 3479, అడ్రియాలాలో 944, ఆర్జీ 3లో 3063 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నెల ఒకటి నాటికి రిటైర్డ్ అయిన వారు పోనూ మొత్తం 39748మంది ఉన్నారు. -
ప్లాస్టిక్‌పై కొత్త ఉద్యమం బర్తన్ బ్యాంక్!
పెళ్లి అనగానే డిస్పోజబుల్ ప్లాస్టిక్‌ను విపరీతంగా వాడాల్సి వస్తుంది. ఇది పర్యావరణానికి హాని. అంతే కాదు పల్లెల్లో వాటి వల్ల పేరుకున్న చెత్తతో ఎక్కడలేని మురికి. జబ్బులు. అందుకే ఉత్తరాదిలో చాలామంది మహిళా సర్పంచ్‌లు ‘బర్తన్ బ్యాంక్’ను ఏర్పాటు చేస్తున్నారు. ఊరికి ఇంతని స్టీలు పెళ్లి సామాను ఇచ్చి అందరూ వాటిని ఫ్రీగా వాడుకునేలా చేస్తున్నారు. ఇది దక్షిణాదికి అందుకోవాల్సి ఉంది. ఇండోర్‌లో మునిసిపల్ అధికారులు రెగ్యులర్‌గా కేటరింగ్ వాళ్లను, పెళ్లిళ్లు జరిగే ఫంక్షన్ హాళ్లను, రెస్టరెంట్లను సందర్శిస్తారు. ఎక్కడైనా ప్లాస్టిక్ వాడితే మొహమాటం లేకుండా ఫైన్ వేస్తారు. ఈ ఫైన్ ఐదు వందలతో మొదలయ్యి 12 లక్షల వరకూ ఉంటుంది. హోటళ్ల వారికి వాళ్లు ఒకటే చెబుతారు– ‘మీరు రోజూ వన్ టైమ్ యూజ్ ప్లాస్టిక్ వాడటం వల్ల చేసే ఖర్చును స్టీలు వాడకం ద్వారా పూర్తిగా తగ్గించవచ్చు’ అని. ఇండోర్‌కు క్లీన్ సిటీగా పేరు ఉంది. ఆ పేరును నిలబెట్టాలని అధికారుల తాపత్రయం. అంతే కాదు, వారు ఒక ‘బర్తన్ బ్యాంక్’ను కూడా ఏర్పాటు చేశారు. బర్తన్ అంటే గిన్నెలు. పెళ్లికి కావాల్సిన వంట, వడ్డన కోసం కావాల్సిన అన్ని పాత్రలు, గ్లాసులు, ప్లేట్లు, గరిటెలు అన్నీ ఒక చోట పెడతారు. 24 గంటల ముందు చెప్పి ఎవరైనా ఉచితంగా తీసుకెళ్లవచ్చు. ఉపయోగించుకున్నాక శుభ్రం చేసి తిరిగి చెల్లించాలి. ఏవైనా డ్యామేజీ అయినా పోయినా డబ్బు కట్టాలి. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వారు ఈ బ్యాంక్‌కు పోటెత్తుతున్నారు. ఇదంతా ఎలా మొదలైంది? రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిషా తదితర రాష్ట్రాలలో కొత్తగా పదవుల్లోకి వచ్చిన మహిళా సర్పంచ్‌లు పల్లెల్లో చెత్తగా పేరుకు పోతున్న ప్లాస్టిక్‌ను చూసి ఇది మొదలెట్టారు. రాజస్థాన్‌లోని జున్జును అనే పల్లెకు నీరూ యాదవ్ అనే ఆవిడ సర్పంచ్ అయ్యాక ఈ సంవత్సరం మొదలులో ‘బర్తన్ బ్యాంక్’ మొదలెట్టింది. ఊరి పెద్దలను ధిక్కరించి నిధులను ఇలాంటి పనులకు ఉపయోగించడం మొదలెట్టిన నీరూ యాదవ్ ‘బర్తన్ బ్యాంక్’ వల్ల ఊరు ఎంత శుభ్రంగా ఉంటుందో ప్రాక్టికల్‌గా చూపించాక అందరూ ఆమె నిర్ణయాన్ని అంగీకరించారు. అలా ఈ ఉద్యమం రాజస్థాన్ నుంచి ఇతర రాష్ట్రాలకు వ్యాపించింది. ‘ప్లాస్టిక్ వద్దు చెత్త వద్దు’ నినాదంతో మహిళా సర్పంచ్‌లు తమ గ్రామాల్లో బర్తన్ బ్యాంక్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో గ్రామానికి 1000 స్టీలుప్లేట్లు, రెండు వేల కూర గిన్నెలు, రెండు వేల స్టీలు గ్లాసులు, 2 వేల స్పూన్లు, 50 మంచి నీటి జగ్గులు, ఐదారు వంట డేగిసాలు ఏర్పాటు చేస్తూ... గ్రామంలో ఎవరి ఇంట ఏ శుభకార్యం జరిగినా ఈ బ్యాంక్ నుంచి ఉచితంగా గిన్నెలు పొందే సదుపాయం కల్పిస్తున్నారు. . దీదీ బర్తన్బ్యాంక్ చత్తిస్‌గఢ్‌లోని సర్గుజా జిల్లా అంబికా పూర్లో స్వయంఉపాధి మహిళా బృందాలు తమ ఇళ్లల్లో శుభకార్యాల కోసం ‘దీదీ బర్తన్ బ్యాంక్’ ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఈ మహిళల ఈ బ్యాంక్‌లో ఏర్పాటు చేసుకున్న పాత్రలను ఉచితంగా వాడుకోవచ్చు. అయితే రాను రాను జిల్లా అంతా అందరు ప్రజలూ వాడుకునేలా ఈ ‘దీదీ బర్తన్ బ్యాంక్’లు విస్తరించాయి.‘ప్లాస్టిక్ చెత్త మురుగు నీటికి పెద్ద ప్రతిబంధకం. అది మట్టిలో కలవదు. దానిని రీసైకిల్ చేయడం కూడా వృథా. ఇలాంటి ప్లాస్టిక్‌కు స్టీలు వస్తువులతో విరుగుడు చెప్పాలి’ అంటారు ఈ మహిళలు. ఒడిస్సాలో ఒడిస్సాలో బర్తన్ బ్యాంక్ ఉద్యమం జోరు మీద ఉంది. నౌపాడ జిల్లాలో భలేస్వర్ అనే పంచాయితీ సర్పంచ్ అయిన సరోజ్ దేవి అగర్వాల్ ఊరి పెద్దలను ఎదిరించి మరీ పంచాయితీ నిధుల నుంచి 75 వేలు మంజూరు చేసి ‘బర్తన్ బ్యాంక్’ ఏర్పాటు చేసింది. ‘ప్రతి ఊళ్లో ఇలాంటి బ్యాంక్ ఉండాలి’అంటుందామె. అయితే ఈ బర్తన్ బ్యాంక్‌లు రెండు విధాలుగా పని చేస్తున్నాయి. కొన్ని చోట్ల కామన్‌గా పాత్రలను ఉంచేస్తే మరికొన్ని చోట్ల ఇంటికి ఇన్నని స్టీలు సామాన్లు ఇచ్చేస్తున్నారు. అంటే పెళ్లికి ఎవరికి పళ్లాలు వాళ్లు తెచ్చుకుని తిని తీసుకెళ్లిపోయేలా. ఇది కూడా బాగానే ఉందంటున్నారు కొందరు. ఏమైనా ఉత్తరాది సంప్రదాయం దక్షిణాదికి కూడా వ్యాపిస్తే బాగుండు. (చదవండి: ఎవరీ గుర్మిత్ కౌర్!..ఆమె గురించి యూకేలో ఎందుకు పోరాటం..? -
పాక్‌లో బరేల్వీ వర్గంపై దాడులు ఎందుకు పెరిగాయి?
సున్నీ దేశమైన పాకిస్తాన్లో అదే ముస్లిం మతానికి చెందిన అహ్మదీయ, షియాల తర్వాత తాజాగా బరేల్వీ ముస్లిం వర్గంపై దాడులు పెరిగిపోయాయి. పాకిస్తానీ వార్తాపత్రిక ‘డాన్’లోని ఒక నివేదిక ప్రకారం గత నెలలో బలూచిస్తాన్‌లోని మస్తుంగ్ జిల్లాలో జరిగిన ఆత్మాహుతి దాడి తర్వాత బరేల్వి కమ్యూనిటీపై తరచూ దాడులు చోటుచేసుకుంటున్నాయి. పాకిస్తాన్లో అహ్మదీయ ముస్లింలను హింసించడం అనేది ఎప్పటి నుంచో జరుగుతోంది. పలుమార్లు వారి మసీదులు, ఆస్తులపై దాడులు జరిగాయి. అహ్మదీయ ముస్లింల సంఖ్య పాకిస్తాన్లో దాదాపు 40 లక్షలు. గత నెలలో బలూచిస్థాన్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 55 మంది చనిపోయారు. బలూచిస్థాన్‌లోని మిలిటెంట్ గ్రూపులు షియా కమ్యూనిటీని, వారి ముహర్రం ఊరేగింపులను లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ దాడి వెనుక ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐ) హస్తం ఉందని భద్రతా అధికారులు భావిస్తున్నారు. తాలిబాన్ చేతిలో ఓడిపోయిన ఐఎస్ఐ ఇప్పుడు బలూచిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో విధ్వంసం సృష్టిస్తోంది. ఇస్లామాబాద్‌కు చెందిన భద్రతా విశ్లేషకుడు ముహమ్మద్ అమీర్ రానా తెలిపిన వివరాల ప్రకారం ఐఎస్‌కు చెందిన స్థానిక అనుబంధ సంస్థల ఉగ్రవాదులు షియా వర్గాలను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. ఆమధ్య ఐఎస్ఐ అనుబంధ సంస్థ ఐఎస్కేపీ అధిపతి షహబ్ అల్-ముహాజిర్ బరేల్వి కమ్యూనిటీపై పలు విమర్శలు గుప్పించాడు. అందుకే ఇప్పడు బరేల్వీ కమ్యూనిటీ అనేది ఉగ్రవాదుల టార్గెట్‌గా మారింది. బరేల్వీతో పాటు ముస్లిమేతర మైనారిటీలు, ఇతర మైనారిటీ ముస్లిం వర్గాలు, క్రైస్తవులు, సిక్కులపై దాడి చేయడం ద్వారా అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించాలని ఐఎస్ఐ ప్రయత్నిస్తోందని ముహమ్మద్ అమీర్ రానా తెలిపారు. పాకిస్తాన్లో ముఖ్యంగా బలూచిస్థాన్‌లో ఐఎస్ఐ దాడులు పెరగడానికి, పొరుగున ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌లో ఐఎస్ఐపై ఆఫ్ఘన్ తాలిబాన్ల దాడులకు ప్రత్యక్ష సంబంధం ఉందని నిపుణులు అంటున్నారు. రెండేళ్లలో తాలిబాన్.. ఐఎస్ఐపై పలుమార్లు దాడిచేసి వారి వెన్ను విరిచింది. ఇది పాకిస్తాన్‌కు చేటు తెస్తుందనే అనుమానాలు నెలకొన్నాయి. ఈ నేపధ్యంలో ఇక్కడ మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇది కూడా చదవండి: ఈ నేతల స్నేహం ఎందుకు గట్టిపడింది? -
ఆ పార్కులో మాట్లాడుకోడాల్లేవ్! అంతా సైలెంట్..
పెద్దగా మాటలుండవు. ఒక పదీ పదిహేనుమందివచ్చి పార్కులో కలుస్తారు. అందరి చేతుల్లో వారికి నచ్చిన పుస్తకాలు ఉంటాయి. తలా ఒకచోట కూచుని పుస్తకాన్ని నిశ్శబ్దంగా చదువుకుంటారు. వీడ్కోలుకు ముందు కాసిన్ని కబుర్లు... ఒక చాయ్... ఒకరి పుస్తకం మరొకరికి అరువు...ఒక ఆరోగ్యకరమైన వ్యాపకం ఆరోగ్యకరమైన బృందం...సెల్ఫోన్ల కాలుష్యంలోముంబైలో తాజా ట్రెండ్ ‘సైలెంట్ రీడింగ్‘. శనివారం సాయంత్రం 5 గంటలు. ముంబైలోని జుహూలో కైఫీ ఆజ్మీ పార్క్. మెల్లమెల్లగా కొంతమంది నడుచుకుంటూ వచ్చి ఒకచోట జమయ్యారు. వారి చేతుల్లో పుస్తకాలు, చాపలు, దుప్పట్లు, చిరుతిండ్లు ఉన్నాయి. ఒక్కొక్కరు వారికి నచ్చినచోట దుప్పటి పరిచి పుస్తకం తెరిచి కూచున్నారు. దూరం నుంచి చూస్తే ఒక పదిహేను ఇరవై మంది శిలల్లా కూచుని చేతుల్లో పుస్తకాలు చదువుతూ కనిపిస్తారు. మంచి ప్రకృతిలో, మంచి సమయంలో, నచ్చిన పుస్తకాన్ని, తమలా పుస్తకాలను ఇష్టపడేవారి సమక్షంలో చదువుకోవడం ఎంత బాగుంటుంది? పుస్తకాన్ని మించిన స్నేహితుడు లేడు. పుస్తకాలను చదివేవారితో స్నేహానికి మించింది లేదు. అందుకే ఇప్పుడు ముంబైలో ‘సైలెంట్ రీడింగ్’ అనేది ఒక ట్రెండ్‌గా మారింది. కొత్త స్నేహితులను పరిచయం చేస్తోంది. సైలెంట్ రీడింగ్ ఎందుకు? పుస్తకాభిమానులు బుక్ రిలీజ్ ఫంక్షన్లకు వెళ్లినా, ఆథర్ టాక్‌కు వెళ్లినా ఏదో రణగొణధ్వని. పుస్తకం గురించి తక్కువ... మెరమెచ్చులు ఎక్కువ. అంతేకాదు, కొంతమంది పుస్తకాన్ని తప్ప దానిని రాసినవారిని కలవాలనుకోరు. మరికొంతమంది ఇంట్రావర్ట్‌లు తాము నిశ్శబ్ద స్నేహితులుగా ఉండాలనుకుంటారు. ఇలాంటి వారంతా ఏ గోలా లేని ‘సైలెంట్ రీడింగ్’ని ఇష్టపడుతున్నారు. ఈ సైలెంట్ రీడింగ్ గ్రూపుల్లో వాగుడుకాయలకు ప్రవేశం లేదు. హాయిగా నిశ్శబ్దంగా చదువుకోవడమే. మంచి పుస్తకాన్ని ఒకరితో మరొకరు పంచుకోవడమే. బెంగళూరులో మొదలు బెంగళూరులోని కబ్బన్ పార్క్‌లో శ్రుతి షా, హర్ష్ స్నేహాన్షు ఇద్దరు పుస్తక ప్రేమికులు ‘కబ్బన్ రీడ్స్’ పేరుతో ‘సైలెంట్ రీడింగ్’ని 2022 డిసెంబర్లో మొదలెట్టారు. కబ్బన్ పార్క్‌లో పుస్తక ప్రేమికులు విశేషంగా వచ్చి వారానికి ఒకసారి పుస్తకాలు చదువుకుని వెళ్లడం అందరినీ ఆకర్షించింది. దాని ప్రభావంతో ముంబైలోని జుహూలో దియా సేన్‌గుప్తా, రచనా మల్హోత్రా అనే ఇద్దరు స్నేహితురాళ్లు ‘జుహూ రీడ్స్’ పేరుతో ఈ సంవత్సరం మేలో ‘సైలెంట్ రీడింగ్’ను మొదలెట్టారు. వెంటనే జుహూలోని పుస్తక ప్రేమికులను ఇది ఆకర్షించింది. అన్ని వయసుల వాళ్లు ఇక్కడికి వచ్చి కూచుని ప్రశాంతంగా పుస్తకాలు చదవసాగారు. అంతేనా? వీల్‌చైర్‌లో ఉండేవారు కూడా వచ్చి పుస్తకంలో, పుస్తకాన్ని ఇష్టపడేవారి సమక్షంలో ఓదార్పు పొందసాగారు. ‘సెల్ఫోన్లు వచ్చాక పుస్తకం చదివే అలవాటు తగ్గింది. మనుషులు సెల్ చూసుకుంటూ కనిపించడమే అందరికీ తెలుసు. కాని ఒకప్పుడు పుస్తకం చదువుతూ కనిపించేవారు. సైలెంట్ రీడింగ్ వల్ల పుస్తకం చదువుకుంటూ కనిపించేవారు అందరినీ ఆకర్షిస్తున్నారు. దానివల్ల పుస్తకాలు చదవాలన్న అభిలాష పెరుగుతోంది. మేము ఆశిస్తున్నది అదే’ అని జుహూ రీడ్స్ నిర్వాహకులు అన్నారు. దేశ, విదేశాల్లో... బెంగళూరు కబ్బన్ పార్క్‌తో మొదలైన సైలెంట్ రీడింగ్ ఉద్యమం ఇప్పుడు ముంబైలో బాంద్రా, దాదర్, కొలాబా లాంటి ఐదారు చోట్లకు విస్తరించింది. ఇక మన దేశంలోని ఢిల్లీ, పూణె, చెన్నై, కొచ్చి, హైదరాబాద్‌లకు కూడా వ్యాపించింది. సోషల్ మీడియా ద్వారా కబ్బన్ రీడ్స్ గురించి తెలుసుకున్న వారు న్యూయార్క్, లండన్, దుబాయ్, మెల్బోర్న్లలో కూడా సైలెంట్ రీడింగ్ సమూహాలను తయారు చేస్తున్నారు. ‘ఈ రీడింగ్స్‌కు వచ్చినవారు మంచి స్నేహితులుగా మారుతున్నారు. బిజీ లైఫ్‌లో మనిషి ఒంటరితనాన్ని ఫీలవుతున్నాడు. ఆ ఒంటరితనం పోగొట్టేందుకు సైలెంట్ రీడింగ్ గ్రూపులు సాయం చేస్తున్నాయి’ అని నిర్వాహకులు అభిప్రాయ పడుతున్నారు. వాట్సాప్ యూనివర్సిటీ నుంచి వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చే నానా చెత్త ప్రభావంలో పడి అనవసర భావోద్వేగాలకు లోను కావడం కన్నా వికాసం, జ్ఞానం, జీవితానుభవం, ఆహ్లాదం పంచే పుస్తకాన్ని అక్కున చేర్చుకోవడం నేటి తక్షణావసరం. పుస్తకాలు చదివే వారితోనే నాగరిక సమాజం ఏర్పడుతుంది. ఆ విధంగా సైలెంట్ రీడింగ్ గ్రూపులు సమాజాన్ని మరింత అర్థవంతం చేస్తున్నాయి. ఇలాంటి ఉద్యమాల్ని పుస్తకాభిమానులు ఎక్కడికక్కడ అందుకోవాల్సిన అవసరం ప్రతి ఊళ్లో, పట్టణంలో ఉంది. (చదవండి: మహిళ మెదడులో.. కొండచిలువలో ఉండే..) -
వామ్మో..! అల్లుళ్లకు కట్నంగా 21 పాములు..
రాయ్‌పుర్: ఆడపిల్లకు పెళ్లి చేయాలంటే వధువు తల్లిదండ్రులు తోచినంత కట్నం ఇవ్వడం సాంప్రదాయంగా వస్తోంది. సాధారణంగా మనం చూసినంతవరకు కట్నంగా డబ్బులు, బంగారం, భూములు వంటి ఆస్తులను వరునికి కానుకగా ఇస్తుంటారు. కానీ ఛత్తీస్‌గఢ్‌లో ఓ తెగ ప్రజలు చాలా వింత ఆచారం ఇప్పటికీ పాటిస్తున్నారు. కట్నంగా వారు పాములను వరునికి కట్నంగా ఇస్తారు. ఛత్తీస్‌గఢ్‌లో కన్వారా తెగ ప్రజలు వింతైన ఆచారం పాటిస్తున్నారు. ఆడపిల్లకు పెళ్లి చేసేప్పుడు వరునికి పాములను కట్నంగా ఇస్తారు. కనీసం తొమ్మిది రకాలకు చెందిన 21 పాములను కట్నంగా ఇచ్చేస్తారు. కట్నంగా పాములను ఇవ్వలేని ఆడపిల్లలను ఎవరూ వివాహం చేసుకోరు. తమ పూర్వికులు కనీసం 60 పాములను కట్నంగా ఇచ్చేవారని ప్రస్తుతం ఆ సంఖ్య క్రమంగా తగ్గినట్లు ఆ తెగకు చెందిన ఓ సభ్యుడు కటంగీ తెలిపారు. పాములను కట్నంగా ఇవ్వండం తమ ఆచారంగా వస్తోందని వెల్లడించారు. కన్వారా తెగ ప్రజలు తమ పూర్వికుల నుంచి కూడా పాములను ఆడిటడం జీవనాధారంగా చేసుకున్నారు. వివిధ రకాల పాములను పట్టుకుని వాటిని ఆడిస్తూ వచ్చిన డబ్బులతోనే జీవనం సాగిస్తారు. పాములనే తమ ఆస్తిగా భావిస్తారు. అందుకే ఆడపిల్లకు కట్నంగా పాములనే ఇస్తుంటారు. విషరహిత పాములనే పట్టుకుని జీవనం సాగించాలని అటవీ అధికారులు తెగ ప్రజలకు సూచించారు. స్థానిక సంప్రదాయాలను గౌరవించి ప్రభుత్వం కూడా అనుమతులు ఇస్తోందని అటవీ రేంజి అధికారి సియారామ్ కర్మాకర్ తెలిపారు. ఇదీ చదవండి: ఇలాంటి వారితో జాగ్రత్త.. బైక్ బుక్ చేసుకున్న మహిళకు చేదు అనుభవం -
కరీంనగరా మజాకా! ఇక్కడ పార్టీలతో పనిలేదు.. కాపు వర్సెస్ వెలమ, తగ్గేదేలే
రాజకీయాలు సహజంగా పార్టీల వారీగా నడుస్తుంటాయి. కాని తెలంగాణలో ఒక జిల్లాలో పార్టీల కంటే సామాజిక వర్గాలకే ప్రాధాన్యత కనిపిస్తుంది. అక్కడ పార్టీలు ఒక భాగమైతే.. సామాజికవర్గాలు మరో భాగంగా ఉన్నాయి. పార్టీ ఏదైనా ఒక ప్రధాన సామాజికవర్గం నేతలు అన్ని పార్టీల్లోని తమవారు గెలవాలని కోరుకుంటారు. ఎవరిని ఎలా గెలిపించాలా? ప్రత్యర్థి సామాజికవర్గాన్ని ఎలా దెబ్బ తీయాలా అని ప్లాన్స్ వేస్తుంటారు. ఇంతకీ ఆ జిల్లా ఎక్కడుంది? ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో ఆది నుంచీ వెలమ సామాజికవర్గం కీలక పాత్ర పోషిస్తోంది. అయితే ఓటింగ్ పరంగా అధికంగా ఉన్న మున్నూరు కాపు వర్గం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ మరోసారి కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీగా ఉన్నారు. పార్లమెంట్ పరిధిలోని ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లోనూ నిత్యం ఏదో ఒక కార్యక్రమానికి హాజరవుతూ తన బలాన్ని పెంచుకుంటున్నారు. రాబోయే ఎన్నికల కోసం అందరి కంటే ముందుగానే సిద్దమవుతున్నారు. అయితే గత ఎన్నికల్లో ఏఏ అసెంబ్లీ నియోజకవర్గాల్లో అయితే వినోద్‌కు దెబ్బ పడిందో ఈసారి కూడా అవే నియోజకవర్గాల్లో నష్టం జరుగుతుందనే ప్రచారం మొదలైంది. ఇందుకోసం సామాజిక వర్గ లెక్కలు వేస్తున్నారు స్థానిక నాయకులు. బోయినపల్లి వినోద్‌కు దక్కుతున్న ప్రాధాన్యాన్ని భరించలేకే మున్నూరు కాపు వర్గానికి చెందిన కొందరు నేతలు పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఈ వ్యవహారమంతా ఇప్పుడిప్పుడే బయటకు వస్తోంది. కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా మున్నూరు కాపు వర్సెస్ వెలమ సామాజికవర్గం మధ్య గ్యాప్ కొనసాగుతోంది. గతంలో వెలమ సామాజికవర్గం వారే కరీంనగర్ అసెంబ్లీ సీటుకు ప్రాతినిథ్యం వహించగా.. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి గంగుల కమలాకర్ హ్యాట్రిక్ సాధించడంతో.. వెలమ సామాజికవర్గానికి స్కోప్ లేకుండా పోయింది. ఈ క్రమంలో.. పార్లమెంట్ సెగ్మెంట్ లో వినోద్ తో పాటు.. కరీంనగర్ అసెంబ్లీలోనూ ఆ సామాజికవర్గాలకు సందు ఇవ్వొద్దనే రీతిలో మరి కొన్ని సామాజికవర్గాలు.. ఏకంగా పార్టీలకతీతంగా కంకణం కట్టుకోవడం.. కరీంనగర్ లో కనిపించే విభిన్న రాజకీయ తంత్రం. రాజకీయాలంటేనే వ్యూహ, ప్రతివ్యూహాలుగా భావించే రోజుల్లో.. నేతల స్వయంకృతాపరాధాలు కూడా ప్రత్యర్థి పార్టీలకు..అలాగే సొంత పార్టీలోని ప్రత్యర్థులకూ అడ్వాంటేజ్ గా మారుతాయి. గత పార్లమెంట్ ఎన్నికలే అందుకు నిదర్శనం. కరీంనగర్‌కు ఎన్నో పనులు చేసినా తనను ఓడించారని మాజీ ఎంపీ వినోద్ భావిస్తుండగా... ఎన్ని చేశామన్నది కాదు..ప్రజలేం కోరుకుంటున్నారో తెలుసుకుని వాటిని చేశారా అని పార్టీలోని ఆయన ప్రత్యర్థులు కామెంట్ చేశారు. చదవండి: మాటిస్తున్నా మహేంద్రా!.. వచ్చేది మనమే.. అటుఇటు వెళ్లి ఆగం కావొద్దు పైగా ప్రస్తుతం అధికారంలో లేనప్పుడే వినోద్ శైలి డామినేటింగ్ గా ఉందని ఫీలవుతున్న కొందరు కీలక ప్రజాప్రతినిధులు.. మరోసారి ఎంపీగా గెలిస్తే.. ఇక తమ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా తమకు ప్రాధాన్యత లేకుండా పోతుందనే భావన కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో కనిపిస్తోంది. కరీంనగర్ రాజకీయాల్లో ఒక పార్టీవారంతా ఒకే తాటిపైన ఉన్నారనుకుంటే పొరపాటే. ఒక సామాజికవర్గం వారైతే మాత్రం కచ్చితంగా ఒక్క తాటిపైనే ఉన్నట్టు సామాజిక విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మరి రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీది పై చేయి అనేకంటే.. ఏ సామాజికవర్గానిది పైచేయి అవుతుందని మాట్లాడుకోవాల్సిన భిన్నమైన పరిస్థితి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కనిపిస్తోంది. -
కామన్వెల్త్, కర్రీ, క్రికెట్.. మన రెండు దేశాలను కలుపుతున్నాయి: మోదీ
భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా చేయడమే తన కల అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడ ఆపద ఉన్నా భారత్ స్పందిస్తోందని.. సమస్య ఏదైనా పరిష్కారానికి భారత్ ముందుంటుందని తెలిపారు. అందుకే ప్రస్తుతం భారత్‌ను విశ్వగురు అంటున్నారని పేర్కొన్నారు. సిడ్నీలో మంగళవారం జరిగిన ప్రవాస భారతీయుల ఆత్మీయ సమ్మేళనంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ప్రవాస భారతీయులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా సాంస్కృతిక ప్రదర్శనలతో ఉత్సాహంగా కార్యక్రమం ప్రారంభమైంది. Immense enthusiasm in Sydney for the community programme, which begins soon… pic.twitter.com/K3193pYLEZ — PMO India (@PMOIndia) May 23, 2023 అనంతరం ప్రవాస భారతీయులను ఉద్ధేశించి మోదీ మాట్లాడారు. తనతోపాటు ఈ కార్యక్రమానికి వచ్చిన ఆస్ట్రేలియా ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. తాను మళ్లీ ఆస్ట్రేలియా వస్తానని 2014లోనే వాగ్దానం ఇచ్చానని, ఇచ్చిన మాట ప్రకారం మళ్లీ ఇక్కడకు వచ్చానని తెలిపారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య మంచి స్నేహం ఉందని ఆయన పేర్కొన్నారు. సిడ్నీలో పర్యటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. చదవండి: ఆస్ట్రేలియాలో మోదీ మ్యాజిక్.. ఓ రేంజ్లో భారతీయుల స్వాగతం! భారత్, ఆస్ట్రేలియా బంధాలను 3 సీలు ప్రభావితం చేస్తుంటాయన్నారు. కామన్వెల్త్, కర్రీ, క్రికెట్ మన రెండు దేశాలను కలుపుతున్నాయని తెలిపారు. ఎనర్జీ, ఎకానమీ, ఎడ్యుకేషన్ కూడా మన రెండు దేశాలను ఏకం చేస్తున్నాయని పేర్కొన్నారు. భారత్, ఆస్ట్రేలియాలను కలిపి ఉంచే మరో బంధం యోగా.. రెండు దేశాల మధ్య నమ్మకమే ప్రధాన వారధి అని అన్నారు. కరోనా సమయంలో ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రోగ్రాం భారతదేశంలో జరిగిందన్నారు. ఒక్క క్లిక్‌తో డీబీటీ సాధ్యమైందన్నారు. పర్యావరణ పరిరక్షణకు సౌర విద్యుత్‌ను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. రెండు దేశాలను కలిపే అంశాల్లో క్రికెట్ కూడా ఉందని ప్రధాని అన్నారు. Special connect between India and Australia... pic.twitter.com/JlMEhGv8sv — PMO India (@PMOIndia) May 23, 2023 ‘ప్రపంచంలో ఎక్కడ ఆపద ఉన్నా భారత్ స్పందిస్తోంది. సమస్య ఏదైనా పరిష్కారానికి భారత్ ముందుంటుంది. అందుకే ప్రస్తుతం భారత్‌ను విశ్వగురు అంటున్నారు. టర్కీలో భూకంపం వస్తే భారత్ అండగా నిలిచింది. భారత్, ఆస్ట్రేలియా మధ్య సంబంధాలు మరింత బలపడనున్నాయి. రెండు దేశాల మధ్య వలసల ఒప్పందం జరిగింది. ఇది రెండు దేశాల విద్యార్థులకు ఎంతో ఉపయోగకరం. త్వరలోనే బ్రిస్బెన్లో భారత కాన్సులేట్ ఏర్పాటు చేయబోతున్నాం. రెండు దేశాల మధ్య మరిన్ని విమాన సర్వీసులు ఏర్పాటు చేస్తాం’ అని మోదీ తెలిపారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోని అల్బనీస్ కూడా మోదీతోపాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంటోని మాట్లాడుతూ.. మోదీ ప్రజాదరణను ప్రముఖ రాక్‌స్టార్ బ్రూస్ స్ప్రింగ్స్టీన్తో పోల్చారు. ఆయన్ని అభిమానులు ప్రేమగా ‘ది బాస్’ అని కూడా పిలుస్తారు. ‘నేను ఈ వేదికపై చివరిసారిగా బ్రూస్ స్ప్రింగ్స్టీన్ను చూశాను. ప్రధాని మోదీకి లభించిన స్వాగతం అతనికి కూడా లభించలేదు. ‘ప్రధాని మోదీ ది బాస్’ అని ఆస్ట్రేలియా ప్రధాని కొనియాడారు. An absolute delight connecting with the Indian diaspora at the community programme in Sydney! https://t.co/OC4P3VWRhi — Narendra Modi (@narendramodi) May 23, 2023 -
కీలక నిర్ణయం.. ఇకపై ఖరీదైన పెళ్లిళ్లు, వేడుకలు వద్దు!
జైపూర్: పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన వేడుక. ఇద్దరు వ్యక్తులు కలిసి ఏడడుగులు నడిచి జీవితాంతం ఒక్కటిగా ఉండాలని తెలిపే వేడుక వివాహం. అందుకే యువత వివాహం అనగానే, ఫోటో షూట్, సంగీత్, అంటూ బోలెడు ప్లాన్లు చేసుకుంటారు. దీని కోసం వాళ్లు ఎంతటి ఖర్చైన చేయడానికి వెనుకాడరు. ఇంకొందరైతే తమ స్థోమతకు మించి అప్పులు చేసి మరీ ఘనంగా జరుపుకుంటారు. వివాహం అనంతరం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. వీటికి చెక్ పెట్టాలనే ఉద్దేశ్యంతో భిల్వారా జిల్లాకు చెందిన జాట్ కమ్యూనిటీ పెళ్లి వేడుకల నిర్వహణపై ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా, రాజస్థాన్ మేవార్ జాట్ మహాసభ భిల్వారా ఆధ్వర్యంలో జాట్ సొసైటీ సమావేశం నిర్వహించారు. దీని ప్రకారం.. రాజస్థాన్ మేవార్ జాట్ మహాసభ ప్రధాన కార్యదర్శి శోభరామ్ జాట్ మాట్లాడుతూ సమాజంలో ఎక్కువగా జరుగుతున్న పెళ్లిళ్లు, ఇతర ఖర్చులను తగ్గించాలని నిర్ణయించారు. వివాహాలతో పాటు ఇతర వేడుకలలో.. మౌసర్లో కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొంటారు. వీటితో పాటు కార్యక్రమాలకు హాజరుకావాల్సిన సంఖ్యను కూడా పరిమితి చేశారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఇకపై గరిష్టంగా 500 నుంచి 700 మంది పురుషులు హాజరుకావచ్చు. అంతే కాకుండా నగదు పరంగా కూడా కొన్ని పరిమితులు విధించుకున్నారు. వీటితో పాటు పెళ్లికి భారీ మొత్తంలో వెచ్చిస్తున్న ఖర్చుకు అడ్డుకట్ట వేస్తూ సమాజంలో సామూహిక వివాహాలను ప్రోత్సహించనున్నారు. అదే విధంగా.. ఇతర వేడుకల విషయంలో కూడా ఆయా కుటుంబాలు వారికి తాహాతులో ఖర్చు చేయాలని కమిటీ సూచించింది. -
సీఎం జగన్ కలిసిన మున్నూరు కాపు సంఘం నేతలు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని విలీన మండలాల మున్నూరు కాపు సంఘం నేతలు సోమవారం కలిశారు. తమకు బీసీ-డీ సర్టిఫికెట్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కాపు కార్పొరేషన్ ఛైర్మన్ ఆధ్వర్యంలో సీఎం జగన్‌ను నేతలు కలిశారు. చదవండి: మా ప్రజలు ఎప్పటికీ కూలీలుగానే ఉండాలా? చంద్రబాబుపై మంత్రి ధర్మాన ఫైర్ అనంతరం.. కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు మీడియాతో మాట్లాడుతూ, విలీనం తర్వాత ఎన్ని సార్లు చంద్రబాబుకి చెప్పుకున్నా ఫలితం లేదన్నారు. వరద పర్యటన సమయంలో సీఎం జగన్‌ను కలిసిన మున్నూరు కాపులు.. బీసీ-డీ కింద చేర్చాలని, తెలంగాణలో ఉన్న పరిస్థితిని విన్నవించారన్నారు. విలీన మండలాల్లో ఉన్న మున్నూరు కాపులను బీసీ-డీ కిందకు తీసుకురావాలని సీఎం ఆదేశాలు ఇచ్చారన్నారు. కాపు నేస్తం రూపకర్త సీఎం వైఎస్ జగన్.. ఆర్థికంగా వారిని పైకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారన్నారు. సీఎం ఇలా అన్ని సమస్యలు తీరుస్తుంటే ప్రతిపక్షాలు కులాల మధ్య చిచ్చు పెడుతున్నాయన్నారు. జనసేన పార్టీ నాయకుడు ఎక్కడా కాపుల కోసం పోరాడింది లేదని.. చంద్రబాబు కాపుల ఆత్మగౌరవాన్ని రోడ్డుకు ఈడ్చాడని ఆయన దుయ్యబట్టారు. బతికున్నంత వరకూ సీఎం జగన్ వెంటే.. మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు ఉమాశంకర్ మాట్లాడుతూ, బతికున్నంత వరకూ సీఎం జగన్ వెంటే నడుస్తామన్నారు. సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఆశలు చిగురించాయి.. మున్నూరు కాపు నాయకుడు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక.. మాలో ఆశలు చిగురించాయన్నారు. తమకు మున్నూరు కాపు సర్టిఫికేట్ బీసీ-డీ కింద వచ్చిందన్నారు. -
హవ్వా! అక్కడ మహిళలను మహిళలే పెళ్లాడతారు.. ఎందుకంటే?
సాధారణంగా పెళ్లీడుకు వచ్చిన అబ్బాయికి, అమ్మాయికి వివాహం చేస్తారు. కానీ ప్రేమ అనేది ఒక అమ్మాయి, అబ్బాయి మధ్య ఏర్పడేదే కాదు.. ఇద్దరు అబ్బాయిలు. ఇద్దరు అమ్మాయిల మధ్య కూడా పుట్టొచ్చని ఇటీవల జరుగుతున్న స్వలింగ సంపర్కుల వివాహాలు నిరూపిస్తున్నాయి. ధైర్యం చేసి, సమాజంలోని మూస పద్దతులను బద్దలు కొట్టి చాలా మంది స్వలింగ సంపర్కులు ఒకటవుతున్నారు. విదేశాల్లో ఎక్కువగా చూసే ఇలాంటి పెళ్లిళ్లు ప్రస్తుతం భారత్‌లోనూ అక్కడక్కడ దర్శనమిస్తున్నాయి.. అయితే కర్నాటకకు చెందిన ఒక గిరిజన కమ్యూనిటీ మాత్రం చాలా కాలంగా మహిళలు మహిళలనే పెళ్లి చేసుకోవడం (లెస్బియన్ మ్యారేజ్) మతపరమైన విశ్వాసంగా అనుసరిస్తుంది. అయితే ఈ పద్దతి ఎప్పుడు ఎలా మొదలైందో ఇప్పటి వారికీ తెలియదు. ఇద్దరు ఆడవాళ్లు చేసుకునే ఈ పెళ్లిని దద్దువే మదువే (దద్దువే వెడ్డింగ్) అని పిలుస్తారు. ఈ వివాహాన్ని కర్నాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలోని హలక్కీ వొక్కలిగ వర్గంలో ఘనంగా జరుపుకుంటారు. ఇద్దరు ఆడవాళ్లు చీర కట్టుకొని.. ఒకరు వరుడిగా మరొకరు వధువుగా ముస్తాబవుతారు. చదవండి: షాకింగ్: సామాన్య పౌరుడిగా.. లండన్ మెట్రోలో దుబాయ్ యువరాజు సాధారణ పెళ్లిళ్లలాగే అన్ని ఆచారాలను పాటిస్తారు. ఊరేగింపుగా తీసుకు రావడం, పూజలు చేయడం, నూతన వధూవరులను అందరూ ఆశీర్వదించడం అన్నీ అచ్చం మామూలు పెళ్లిలాగే ఉంటాయి. అంతేనా.. పెళ్లికి వచ్చిన అతిథులు బహుమతులు కూడా తీసుకొస్తారు. పెళ్లిలో సంగీతం, డ్యాన్స్‌లు ఉంటాయి. ఇక వచ్చిన గెస్ట్‌లకు మంచి రుచికరమైన విందు వడ్డిస్తారండోయ్. తాజాగా అలాంటి దద్దువే మదువే వివాహం ఒకటి కర్కివినాయక, కరియమ్మ దేవాలయంలో జరిగింది. హలక్కీ తెగలో ఈ దేవతలకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ పెళ్లిలో ఎంతో సరదా కూడా ఉంటుంది. నూతన వధూవరుల మెడలో చిప్స్ ప్యాకెట్ల దండలు వేసి, వారి చుట్టూ అతిథులు డ్యాన్స్ చేస్తారు. చివరికి అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత అందరూ(పెళ్లి చేసుకున్న ఇద్దరు ఆడవాళ్లతో సహా) వారి ఇళ్లకు తిరిగి వెళ్తారు. అంటే ఇప్పటికే మీకు సీన్ అంతా అర్థమయి పోయి ఉండాలి. ఇది నిజమైన పెళ్లిలా జరుపుకునే మాక్ వెడ్డింగ్ అన్నమాట. అయితే ఇలా ఊరికే పెళ్లిళ్లు చేయరట.. దీని వెనక ఓ కారణం ఉందని చెబుతున్నారు సదరు గ్రామస్తులు. వర్షాలు కురువాలని ఇంద్రుడిని ప్రార్థిస్తూ ఈ స్వలింగ వివాహాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తారట. హలక్కీ తెగ వాళ్లు వర్షాన్ని ప్రత్యేకంగా భావిస్తారు. గౌరవిస్తారు. అందుకే ప్రతి ఏడాది ఈ మాక్ వెడ్డింగ్ ఆచారాన్ని జరుపుకుంటారు. అంతేగాక వర్షాలు అవసరానికి మించి కురవకూడదని కూడా వీళ్లు ఇలా వేడుకుంటారు. -
సామాజిక వ్యాప్తి దశలో ఒమిక్రాన్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వేరియెంట్ సామాజిక వ్యాప్తి స్థాయికి చేరుకుందని కోవిడ్‌పై అధ్యయనం చేసే కేంద్ర సంస్థ ఇన్సాకాగ్ హెచ్చరించింది. మెట్రో నగరాల్లో ఒమిక్రాన్ కేసులు అత్యధికంగా వెలుగులోకి వస్తున్నాయని వెల్లడించింది. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై నగరాల్లో ఈ కేసులు తారా స్థాయికి చేరుకున్నాయని చెప్పింది. సార్స్–కోవిడ్ జన్యుక్రమాన్ని విశ్లేషించడంతో పాటు వైరస్ వ్యాప్తిపై అవగాహన, దాని కట్టడికి మార్గాలు, ప్రజారోగ్యంపై సూచనలు సలహాలు ఇన్సాకాగ్ ఇస్తూ ఉంటుంది. ఒమిక్రాన్ కేసుల్లో స్వల్ప లక్షణాలు, లేదంటే లక్షణాలు లేకుండా ఉన్న కేసులే ఎక్కువగా వస్తున్నాయని జనవరి 3, 10 తేదీలలో విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. ఆ బులెటిన్‌లో వివరాలను కేంద్ర ప్రభుత్వ అధికారులు ఆదివారం వెల్లడించారు. ఆస్పత్రిలో చేరే కేసులు, ఐసీయూ కేసులు ఎక్కువగా లేకపోయినప్పటికీ ముప్పు మాత్రం పొంచి ఉందని, అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. ‘‘భారత్‌లో ఒమిక్రాన్ ప్రస్తుతం సామాజికంగా వ్యాప్తి చెందే దశలో ఉంది. పలు మెట్రో నగరాల్లో ఈ కేసులు అత్యధికంగా వెలుగులోకి వస్తున్నాయి. ఒమిక్రాన్ సబ్ వేరియెంట్ బీఏ.2 కేసులు కూడా వ్యాపిస్తున్నాయి’’ అని ఆ బులెటిన్‌లో వెల్లడించింది. అంతర్గతంగా వ్యాప్తి విదేశీ ప్రయాణికుల నుంచి కాకుండా అంతర్గతంగానే ఒమిక్రాన్ అధికంగా వ్యాప్తి చెందుతోందని ఇన్సాకాగ్ తన బులెటిన్‌లో పేర్కొంది. వైరస్‌లో జన్యుపరమైన మార్పులు అధికంగా చోటు చేసుకుంటూ ఉండడంతో నిరంతరం అందులో జరిగే మార్పుల్ని పర్యవేక్షిస్తున్నామని ఇన్సాకాగ్ స్పష్టం చేసింది. కరోనా వైరస్‌లో ఎన్ని రకాల జన్యు మార్పులు జరిగినప్పటికీ కోవిడ్ నిబంధనల్ని తు.చ తప్పకుండా పాటించడం, వ్యాక్సిన్ తీసుకోవడమే మనకి రక్షణ కవచాలని వివరించింది. తగ్గిన ఆర్ వాల్యూ : మద్రాస్ ఐఐటీ కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో మద్రాస్ ఐఐటీ చేసిన అధ్యయనంలో కాస్త ఊరటనిచ్చే అంశం వెల్లడైంది. . కోవిడ్–19 వ్యాధి ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే తీవ్రతను వెల్లడించే ఆర్ వాల్యూ 1.57కి తగ్గింది. ఆర్ వాల్యూ 1 కంటే ఎక్కువ ఉంటే ప్రమాద ఘంటికలు మోగుతున్నట్టుగానే భావించాలి. ఆర్ వాల్యూ 1 కంటే తక్కువ ఉంటే వ్యాధి తగ్గుముఖం పడుతున్నట్టు లెక్క. జనవరి 14–21 మధ్య ఆర్ వాల్యూ 1.57 ఉన్నట్టుగా ఐఐటీ మద్రాస్ అధ్యయనం నివేదిక వెల్లడించింది. జనవరి 7–13 మధ్య ఆర్ వాల్యూ 2.2 ఉండగా జనవరి మొదటి వారంలో అత్యధిక స్థాయిలో ఆర్ వాల్యూ 4కి చేరుకుంది. ఇక డిసెంబర్ 25 నుంచి 31 మధ్య ఆర్ వాల్యూ 2.9గా ఉంది. ఐఐటీ మద్రాస్ డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ కంప్యూటేషనల్ మోడల్ ద్వారా కరోనా వ్యాప్తిపై అధ్యయనం చేసింది. ప్రొఫెసర్ నీలేష్ ఎస్ ఉపాధ్యాయ, ప్రొఫెసర్ ఎస్. సుందర్‌లు ఈ అధ్యయనానికి నేతృత్వం వహించారు. దీని ప్రకారం ఆర్ వాల్యూ ముంబైలో 0.67, ఢిల్లీలో 0.98, చెన్నైలో 1.2, కోల్‌కతాలో 0.56గా ఉంది. ఇక వచ్చే 14 రోజుల్లో ఒమిక్రాన్ కేసులు గరిష్ట స్థాయికి చేరుకుంటాయని ఆ అధ్యయనం అంచనా వేసింది. 3.33 లక్షల కేసులు నమోదు దేశంలో వరసగా నాలుగో రోజు 3 లక్షలకి పైగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 3,33,533 కేసులు నమోదయ్యాయి. ఇక క్రియాశీల కేసుల సంఖ్య 21, 87,205కి చేరుకుంది. తాజాగా ఒకే రోజు 525 మంది కరోనాతో మరణించారు. కరోనా రికవరీ రేటు 93.18గా ఉంది. కేరళలో కేసుల కట్టడికి ఆదివారం ఒక్క రోజు సంపూర్ణ లాక్డౌన్ విధించారు. అత్యవసరాలకి తప్ప మరి దేనికి ఎవరూ బయటకు రాకుండా చర్యలు చేపట్టారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు లాక్డౌన్ అమలు చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా నిర్మానుష్య పరిస్థితులు నెలకొన్నాయి. -
నవశక రాజకీయానికి సీఎం జగన్ శ్రీకారం: సజ్జల
సాక్షి, అమరావతి: అట్టడుగు వర్గాలకు సాధికారిత కల్పించే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగులు వేస్తున్నారని.. ఆ వర్గాల సమస్యల పరిష్కారానికి వైఎస్సార్సీపీ ద్వారాలు తెరిచే ఉంటాయని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చాత్తాద శ్రీ వైష్ణవ కార్పొరేషన్ ఛైర్మన్ టి.మనోజ్‌కుమార్ అధ్యక్షతన శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన చాత్తాద శ్రీ వైష్ణవ కులస్తుల రాష్ట్ర స్థాయి నేతల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రజాసేవకులుగా పేరుతెచ్చుకునే అట్టడుగు వర్గాల నేతలను నాయకులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్ పనిచేస్తున్నారన్నారు. సీఎం వైఎస్ జగన్ నవశక రాజకీయానికి శ్రీకారం చుట్టారన్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా నాయకులు పేరు తెచ్చుకోవాలి గాని అధికారం ఉంది కదా అని జులుం ప్రదర్శించే విధానానికి కాలం చెల్లిందని అన్నారు. వైఎస్ జగన్ నవశక రాజకీయానికి శ్రీకారం చుట్టారని తెలియచేశారు. కొందరి రాజకీయ నేతల మాదిరిగా ఎన్నికల సమయంలో ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకునే తత్వం వైఎస్ జగన్‌ది కాదని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. -
ఒకే కులం, చాన్స్ ఇప్పించవూ? దిమ్మ తిరిగే రిప్లై ఇచ్చిన బ్రహ్మాజీ
Brahmaji: నేటి సమాజంలో కులం ఎంతగా వేళ్లూనుకుపోయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతి రంగంలోనూ ఈ కులరక్కసి నాటుకుపోయింది. మా కులపు హీరో, మా కులపు సర్పంచ్, మా కులప్ సీఎం అంటూ అభిమానాన్ని పెంచుకోవడం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ కులపిచ్చితో సినిమా అవకాశం ఇవ్వమని అడిగిన ఓ నెటిజన్‌కు దిమ్మతిరిగే సమాధానమిచ్చాడు నటుడు బ్రహ్మాజీ. 'అన్నా.. నేను మన కమ్యూనిటీకి చెందినవాడిని. నాకు సినిమా ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం. మీ తరుపున ఏ చిన్న అవకాశం ఉన్నా నాకు ఏదో పాత్రలో నటించే అవకాశాన్ని కల్పించగలరు అని మిక్కిలి కోరుకుంటున్నాను' అంటూ ఓ వ్యక్తి సోషల్ మీడియాలో బ్రహ్మాజీని అభ్యర్థించాడు. అవకాశం ఇవ్వమని అడగడంలో తప్పు లేదు కానీ ఇలా ఒకే కులం కాబట్టి తనను పట్టించుకోమని చెప్పడం బ్రహ్మాజీకి ఏమాత్రం నచ్చలేదు. దీంతో బ్రహ్మాజీ తనదైన స్టైల్లో నెటిజన్ రిప్లై ఇచ్చాడు. 'నేను ఇండియన్ని.. తెలుగోడిని.. అదే నా కమ్యూనిటీ' అని పేర్కొన్నాడు. 'అయినా అవకాశం కావాలంటే ఏదో రిక్వెస్ట్ చేయాలి కానీ, మధ్యలో ఈ కులం, గిలం ఏంట్రా?' అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మీ రిప్లైతో అతడు మరోసారి కులం మాటెత్తడంటూ బ్రహ్మాజీని పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. -
రసవత్తరంగా బెంగాల్ రాజకీయం
సాక్షి, న్యూఢిల్లీ: బెంగాల్ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఎవరికి వారు సామాజిక వర్గాల ఆధారంగా ప్రజలకు తాయిలాలు ప్రకటిస్తూ తమవైపు ఆకర్షించుకునే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే గెలుపే లక్ష్యంగా బిహార్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా పశ్చిమ బెంగాల్లో కుల సమీకరణాలే కీలక పాత్ర పోషించే పరిస్థితి ఏర్పడింది. దీంతో బెంగాల్ గద్దెనెక్కేందుకు రాజకీయ పార్టీలు తమ వ్యూహాలను అమలు చేస్తున్నాయి. తృణమూల్ కాంగ్రెస్‌కు దూరంగా ఉన్న మతువా, ఆదివాసీ, రాజవంశీ, బౌరి, బాగ్డి వంటి కులాల ప్రజలకు తాయిలాలు ప్రకటించడం ద్వారా తమవైపు తిప్పుకునేందుకు మమతా బెనర్జీ ప్రయత్నిస్తోంది. బీజేపీ నాయకులు కూడా ఈ వర్గాలను ఆకర్షించేందుకు తీవ్రంగా కృషిచేస్తున్నారు. ముఖ్యంగా రాజవంశీలు, మతువాలపై కమలదళం ప్రత్యేక దృష్టిపెట్టింది. మతువాలకు సంబంధించి అనేక అంశాల్లో కీలక ప్రకటనలు, 2019 సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్ని అమలు చేసే ప్రక్రియపై కమలనాథులు ప్రణాళికలు అమలు చేస్తున్నారు. ఇటీవల పశ్చిమబెంగాల్ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. మతువా సామాజిక వర్గానికి పౌరసత్వం ఇచ్చేందుకు సవరించిన పౌరసత్వ చట్టం(సీఏఏ)ను అమలు చేయడంపై హామీ ఇచ్చారు. బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే ముఖ్యమంత్రి శరణార్థుల సంక్షేమ పథకం, మాతువా వర్గంలోని వృద్ధులకు పింఛన్, యువతకు స్కాలర్షిప్ వంటి ఇతర పథకాలను అమలు చేస్తామని బీజేపీ నాయకులు ఇప్పటికే ప్రకటించారు. గుడాకాందీకి ప్రధాని మోదీ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో ముఖ్యమైన పాత్ర పోషించే 70కిపైగా స్థానాల్లో కీలక ఓటుబ్యాంక్‌గా ఉన్న మతువా సామాజిక వర్గాన్ని ఆకర్షించేందుకు కమలదళం మరో మాస్టర్ స్ట్రోక్ ఆడనుంది. మతువా సామాజిక వర్గం తీర్థస్థలంగా భావించే ప్రాంతాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించనున్నారు. బెంగాల్లో మార్చి 27న తొలిదశ ఓటింగ్ ప్రక్రియతో మొత్తం ఎనిమిది దశల పోలింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంంది. తొలిదశ పోలింగ్‌కు ఒక్కరోజు ముందు 26న బంగ్లాదేశ్‌కు మోదీ వెళ్లనున్నారు. 27న మతువా సామాజిక వర్గం దైవంగా కొలిచే హరిచంద్ ఠాకూర్ జన్మస్థలం, మతువాలకు తీర్థస్థలం అయిన గుడాకాందీని మోదీ సందర్శిస్తారు. ప్రధాని పర్యటనపై కమలదళం పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే ఈ ప్రాంతాన్ని సందర్శించే తొలి భారత ప్రధానిగా మోదీ నిలువనున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐదు కోట్లకుపైగా మతువా సామాజిక వర్గ ప్రజల మనసుల్లో మోదీ చోటు సంపాదించగలరని బీజేపీ నాయకత్వం, మాతువా మహాసంఘ్ నాయకులు భావిస్తున్నారు. ప్రధానితో పాటు బెంగాల్‌లోని మాతువా వర్గానికి చెందిన బీజేపీ పార్లమెంట్ సభ్యుడు శాంతను ఠాకూర్ సైతం గుడాకాందీని సందర్శించే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మతువా సామాజిక వర్గాన్ని తమవైపు తిప్పుకొనేందుకు 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో కమలదళం చేసిన ప్రయత్నాలు సఫలయ్యాయి. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా మతువా సమాజ పెద్ద, 100 ఏళ్ల బోరో మా బీనాపాణి దేవి ఆశీర్వాదం తీసుకొని ప్రధాని మోదీ తన బెంగాల్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత బోరో మా మనవడు శాంతనును బొంగావ్ లోక్‌సభ స్థానంలో నిలబెట్టి, మతువా ఓటుపై దృష్టి పెట్టిన బీజేపీ, తమ వ్యూహంలో సఫలీకృతమైంది. బీజేపీ తొలిసారిగా ఈ లోక్‌సభ స్థానాన్ని కైవసం చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో అదే వ్యూహాన్ని అమలు చేయడం ద్వారా మమతా దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు కమలదళం సంసిద్ధమైంది. ఎవరీ మతువాలు? ఎస్సీలుగా ఉన్న మతువాలు దశాబ్దాల క్రితమే పొరుగున ఉన్న బంగ్లాదేశ్ నుంచి పశ్చిమబెంగాల్‌కు వలస వచ్చిన హిందూ శరణార్థులు. ప్రస్తుతం మతువాలు పశ్చిమ బెంగాల్లో రెండో అతిపెద్ద షెడ్యూల్డ్ కుల జనాభా. మతువాలు ఎక్కువగా ఉత్తర, దక్షిణ 24 పరగణాల్లో నివాసం ఉన్నారు. నాడియా, హౌరా, కూచ్ బెహార్, ఉత్తర– దక్షిణ దినజ్‌పూర్, మాల్డా వంటి సరిహద్దు జిల్లాల్లోనూ వీరు విస్తరించి ఉన్నారు. మొత్తం ఎస్సీ జనాభాలో మతువాల జనాభా 17.4 శాతం. బెంగాల్లో 1.8 కోట్ల ఎస్సీ జనాభా కారణంగా రాష్ట్రంలోని 42 లోక్‌సభ స్థానాల్లో 10 స్థానాలను షెడ్యూల్డ్ కులాల కోసం రిజర్వ్ చేశారు. వీటిలో కూచ్ బెహార్, జల్పాయిగురి, బిష్ణుపూర్, బొంగావ్ లోక్‌సభ స్థానాలను 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ కైవసం చేసుకుంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్సీల్లో తమకున్న పాపులారిటీని సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ తీవ్రంగా కృషిచేస్తోంది. -
కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరగలేదు
సాక్షి, ముంబై: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పంజా విసురుతోంది. వాణిజ్య రాజధాని ముంబైలో పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. అధిక పాజిటివ్ కేసుల నమోదులో ముంబై మొదటి స్థానంలో ఉంది. ఈ క్రమంలో మహారాష్ట్రలో వైరస్ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ స్టేజ్‌కి వచ్చిందని ప్రజలు భయందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్ తోపే గురువారం స్పందించారు. రాష్ట్రంలో వైరస్‌కు సంబంధించి కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరగలేదని స్పష్టం చేశారు. ఇక వైరస్ బారిన పడిన బాధితులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాల్లో, హోం క్వారంటైన్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. (ప్లాస్మా బ్యాంక్‌ను ప్రారంభించిన కేజ్రీవాల్) అదే విధంగా కరోనా చికిత్సలో ప్లాస్మా థెరఫి కీలక పాత్ర పోషిస్తోందని రాజేష్ తోపే తెలిపారు. ఈ చికిత్సలో సుమారు 10 మంది కరోనా బాధితుల్లో 9 మంది కోలుకుంటున్నారని చెప్పారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 93 వేల మంది కరోనా పేషెంట్లు వ్యాధి నుంచి కోలుకున్నారని వెల్లడించారు. చాలామంది పాజిటివ్ బాధితుల హిస్టరీ గమనిస్తే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కరోనా కేంద్రాల్లో, హోం క్వారంటైన్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో వైరస్ తీవ్రతను గమనిస్తే కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ స్టేజ్‌కి చేరలేదని వెల్లడించారు. ఇక రెమిడిసివిర్, ఫావిపిరవిర్ మందులు మరో రెండు రోజుల్లో అన్ని జిల్లాల్లో లభిస్తాయని తెలిపారు. ధనిక, పేద తేడాలు లేకుండా ప్రజలందరికీ ఈ మందులను అందుబాటులోకి తీసుకువస్తామని రాజేష్ తోపే చెప్పారు.(కరోనా : 30 రోజుల్లో 3,94,958 కేసులు ) -
కరోనా : గోవా సీఎం సంచలన వ్యాఖ్యలు
పనాజి : కరోనా తీవ్రతరం అయ్యిందని ఇప్పటికే రాష్ట్రంలో సామాజిక వ్యాప్తి మొదలైందని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో సావంత్ మాట్లాడుతూ.. 'గోవా అంతటా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఒక రోగి నుంచి మరొకరికి వైరస్ వేగంగా వ్యాపిస్తుంది. కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ (సామాజికవ్యాప్తి) మొదలైందనే నిజాన్ని అంగీకరించక తప్పదు' అంటూ పేర్కొన్నారు. అయితే వైరస్ కట్టడికి ప్రభుత్వం అన్ని కఠినమైన చర్యలు చేపడుతుందని అన్నారు. అంతేకాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారిని తప్పనిసరిగా 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉంచుతున్న ఏకైక రాష్ట్రం గోవానే అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. (పంజాబ్ సీఎస్‌గా ఎన్నికైన మొట్టమొదటి మహిళ ) రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నందున మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం లాంటి కఠిన నిబంధనలు అమలు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. అయితే ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా దానికి ప్రజలు కూడా అదే స్థాయిలో స్పందించాలని లేదంటే అధికారులు పడే కష్టమంతా వృధానే అని అన్నారు. ప్రజలు అధికంగా గుమికూడే ప్రాంతాల్లో తప్పనిసరిగా నిబంధనలు పాటించేలా చూడాలని పోలీసులను ఆదేశించారు. మే చివరి నాటికి కోవిడ్ ఫ్రీగా ఉన్న గోవా రాష్ట్రంలో క్రమంగా కేసులు అధికమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వాస్కోలోని మాంగోర్ హిల్, సత్తారి తాలూకాలోని మోర్లెం ప్రాంతాలను కంటైనేషన్ జోన్లగా ప్రకటించగా,మరికొన్ని ప్రాంతాలను మినీ కంటైన్మెంట్ జోన్లుగా అధికారులు ప్రకటించారు. శుక్రవారం ఒక్కరోజే 44 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని రాష్ట్రం వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసులు 1,039 కాగా ప్రస్తుతం 667 యాక్టివ్ కేసులున్నాయని ప్రకటించింది. కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటివరకు మరణించిన ఇద్దరు మరణించినట్లు పేర్కొంది. వైరస్ వ్యాప్తిని ఎదుర్కోవడానికి అవసరమైన సదుపాయాలను ప్రభుత్వం సిద్ధం చేసిందని ఆరోగ్యశాఖ మంత్రి విశ్వజిత్ రాణె అన్నారు. అవసరమైతే కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న ఉత్తర గోవా జిల్లాల్లో ఈఎస్ఐ హాస్పిటల్ తరహాలో ప్రత్యేకంగా ఆసుపత్రి నిర్మాణం చేస్తామని తెలిపారు. వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి అవరమైన అన్ని రకాల సౌకర్యాలను సృష్టించడానికి సిద్ధంగా ఉన్నట్లు మంత్రి పేర్కొన్నారు. (సోషల్ మీడియాలో టీచర్ల మార్ఫింగ్ ఫొటోలు ) -
ఏపీలో కరోనా సామూహిక వ్యాప్తి 8 శాతమే
సాక్షి, అమరావతి: అత్యధిక టెస్టులు నిర్వహించడం ద్వారా కోవిడ్–19 సోకిన వారిని త్వరగా గుర్తించి వైరస్ వ్యాప్తిని నిరోధించాలన్న రాష్ట్ర ప్రభుత్వ విధానం సత్ఫలితాలనిస్తోంది. కమ్యూనిటీ స్ప్రెడ్ (సామూహిక వ్యాప్తి) జరిగే అవకాశాలు చాలా తక్కువ ఉన్న పెద్ద రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంది. ఇండియా డాట్ ఇన్ పిక్సెల్స్ సంస్థ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల సమాచారాన్ని తీసుకొని కమ్యూనిటీ స్ప్రెడ్‌కు ఉన్న అవకాశాలను పరిశీలించి నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం.. మన రాష్ట్రంలో కోవిడ్–19 కమ్యూనిటీ స్ప్రెడ్‌కు 8 శాతం మాత్రమే అవకాశముంది. 7,000 కేసులు దాటిన రాష్ట్రాల్లో కమ్యూనిటీ స్ప్రెడ్ అత్యల్పంగా ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కావడం గమనార్హం. రాష్ట్రాల్లో నమోదైన కేసులు, కోలుకున్న వారు, క్వారంటైన్లో ఉన్న వారి వివరాల ద్వారా కమ్యూనిటీ స్ప్రెడ్ అవకాశాలకు ఒక ఫార్ములా రూపొందించారు. దీని ప్రకారం 100 శాతం దాటిన రాష్ట్రాల్లో కమ్యూనిటీ స్ప్రెడ్ తప్పనిసరి. ఇలా చూస్తే ఢిల్లీ 143 శాతంతో మొదటి స్థానంలో ఉండగా, 122 శాతంతో తెలంగాణ రెండో స్థానంలో ఉంది. గుజరాత్ 45 శాతం, మహారాష్ట్ర 65 శాతం, రాజస్తాన్, పశ్చిమబెంగాల్ 24 శాతం, తమిళనాడు 38 శాతాలతో కమ్యూనిటీ స్ప్రెడ్‌కు అవకాశాలు అధికంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అత్యధిక టెస్టులు నిర్వహించడం ద్వారా కమ్యూనిటీ స్ప్రెడ్‌ను అరికట్టామంటూ పలువురు అధికారులు ట్వీట్ చేస్తున్నారు. 7 లక్షలకు చేరువలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు 7 లక్షలకు చేరుకోనున్నాయి. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 16,704 మందికి పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటివరకు చేసిన మొత్తం పరీక్షల సంఖ్య 6,93,548కి చేరింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సోమవారం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొన్న ప్రకారం కొత్తగా 443 మందికి వైరస్ సోకడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 9,372కు చేరింది. ఈ కేసుల్లో 1,584 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కాగా, 337 మంది ఇతర దేశాల నుంచి వచ్చిన వారు. కొత్తగా 128 మందిని డిశ్చార్జి చేయడంతో మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 4,435కి చేరింది. కృష్ణా, కర్నూలు, అనంతపురం, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 111కి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 4,826కి చేరింది. ఇన్ఫెక్షన్ రేటు -1.35% రికవరీ రేటు -47.32% మరణాల రేటు -1.18% -
కరోనా: ఢిల్లీలో కమ్యూనిటీ ట్రాన్సిమిషన్ లేదు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ అధికారులతో మంగళవారం సమావేశం అయ్యారు. ఈ సమావేశం లెఫ్ట్‌నెంట్ గవర్నర్, విపత్తు నిర్వాహణ శాఖ చైర్మన్ అనిల్ బైజాల్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మాట్లాడుతూ.. ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు వేగంగా పెరగడానికి కారణం కమ్యూనిటీ ట్రాన్సిమిషన్ కాదంటూ కేంద్ర అధికారులు పేర్కొన్నారని వెల్లడించారు. గతవారం నుంచి పాజిటివ్ కేసులు పెరుగుతున్నప్పటికీ కమ్యూనిటీ ట్రాన్సిమిషన్ జరగలేదని అధికారులు తెలిపారని అన్నారు. జూలై నెల చివరికల్లా 5.5 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావచ్చని, కరోనా బాధితులకు వైద్యం అందిచడానికి 80 వేల బెడ్లు కావాలని పేర్కొన్నారు. (జ్యోతిరాదిత్య సింధియాకు కరోనా పాజిటివ్) ఈ సమావేశానికి ముందు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ మాట్లాడుతూ.. ఢిల్లీలో నమోదవుతున్న కరోనా కేసుల్లో 50 శాతం మందికి వ్యాధి ఎలా సంక్రమిస్తోందో సరైన సమాచారం లేదని తెలిపారు. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అనారోగ్యం బారిన పడిన విషయం తెలిసిందే. ఆయనకు కరోనా లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో ముందస్తుగానే సెల్ఫ్ ఐసోలేషన్‌కి పరిమితమయ్యారు. ఇప్పటివరకు ఢిల్లీలో కొత్తగా 1007 కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడి ఇప్పటివరకు 874 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. (24 గంటల్లో 9,987 కేసులు, 331 మరణాలు) -
డాక్టర్ దంపతులకు కరోనా పాజిటివ్..
-
డాక్టర్ దంపతుల నుంచి మరెంత మందికో..?
సాక్షి, హైదరాబాద్: ఒకరి తర్వాత మరొకరు కరోనా లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరుతుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. తెలంగాణలో ఇప్పటి వరకు 45 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా వీరిలో 27 కేసులు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోనే కావడం విశేషం. విదేశాలకు వెళ్లి వచ్చిన నేపథ్యం లేకపోయినప్పటికీ ఒక భార్య....ఒక కుమారుడు....ఇంకొక తల్లి ....ఇలా కరోనా వైరస్ భారిన పడ్డారు. తాజాగా దోమలగూడకు చెందిన డాక్టర్ దంపతులు కరోనా బారిన పడ్డారు. వీరితో పాటు శంషాబాద్‌లో డిప్యూటేషన్‌పై విధులు నిర్వహించే మరో స్టాఫ్ నర్సు కూడా కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్నట్లు తెలిసింది. (డాక్టర్ దంపతులకు కరోనా పాజిటివ్) స్వీయ నియంత్రణ పాటించక పోవడం, నిర్లక్ష్యంగా ఉండటం మూలంగా పలు థర్డ్ కాంటాక్ట్ కేసులకు కారణమైంది. కుటుంబ సభ్యుల ప్రాణాలను పణంగా పెడుతుంది. ఇంట్లోని వారు ఒకరి తర్వాత మరొకరు ఆస్పత్రుల్లో చేరుతుండటం, వీరిలో ఇప్పటికే చాలా మంది విచ్చలవిడిగా బయట తిరగడం, బంధువులు, స్నేహితులు, ఇతరుల మధ్య గడపడంతో ఈ వైరస్ మరెంత మందికి విస్తరించి ఉంటుందనే విషయాన్ని క్లోజ్ కాంటాక్ట్ కేసులను పరిశీలిస్తున్న వైద్యులు కూడా అంతుబట్టడం లేదు. మార్కెట్లు, నిత్యవసరాలంటూ స్వీయ నియంత్రణ పాటించకుండా ఇలాగే విచ్చలవిడిగా తిరిగితే..భవిష్యత్తులో భారీ విపత్తులనే చవిచూడాల్సి వస్తుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. (కరోనా మూడో దశకు చేరుకుంటే?) డాక్టర్ దంపతుల నుంచి మరెంత మందికో..? తాజాగా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన డాక్టర్ దంపతులు దోమలగూడలో ఉంటున్నారు. నిజానికి వీరు కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న గాంధీ, ఫీవర్, ఛాతి ఆస్పత్రుల్లో పని చేయడం లేదు. సోమాజిగూడలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో పని చేస్తున్నారు. కరోనా బాధితులకు చికిత్స చేయకుండా, విదేశాలకు వెళ్లి వచ్చిన నేపథ్యం కూడా లేకుండా వీరికెలా వైరస్ సోకిందనేది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది. ఆస్పత్రిలో వీరు ఎంత మందితో కలిసి పని చేశారు? ఎంత మంది రోగులను పరీక్షించారు? ఏ ఏ రోగులు ఎక్కడెక్కడ ఉంటున్నారు? ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు? కుటుంబ సభ్యుల్లో ఎంత మంది వీరికి క్లోజ్ కాంటాక్ట్‌లో ఉన్నారు..? వంటి ప్రశ్నలకు వైద్య ఆరోగ్యశాఖ వద్ద ఇప్పటి వరకు సమాధానం లేదు. (మీకు అర్థమవుతోందా?) నిర్లక్ష్యానికి భారీ మూల్యం చెల్లించక తప్పదు నగరానికి నాలుగు వైపులా ఉన్న విజయవాడ, వరంగల్, బెంగళూరు, ముంబై జాతీయ రహదారులపై పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా సరిహద్దు జిల్లాల నుంచి కూడా ఇతరులెవరూ సిటిలోపలికి రాకుండా ఎక్కడిక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. శివారుల్లోనే కాదు కోర్ సిటీల్లోనూ ఎక్కడిక్కడ దార్లను మూసివేశారు. శివార్లలోని పలు కాలనీల్లో రోడ్లకు అడ్డంగా పెద్దపెద్ద రాళ్లు, చెట్ల కొమ్మలు నరికి వేశారు. అయినప్పటికీ కొంత మంది యువకులు ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్నారు. కనీసం మాస్క్ కూడా ధరించడం లేదు. వైరస్‌పై అంతో ఇంతో అవగాహన ఉన్నవాళ్లు...ఉన్నత చదువులు చదు వుకున్న యువతే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే....వైరస్‌ను ఎలా నియంత్రించగలమని వైద్యనిపుణులు ప్రశ్నిస్తున్నారు. (లాక్డౌన్: ఏంటి సర్.. మీకిది కూడా తెలియదా?) గాంధీ ఎమర్జెన్సీ కేసులు ఉస్మానియాకు షిఫ్ట్ః గాంధీ జనరల్ ఆస్పత్రిలో కరోనా నోడల్ సెంటర్ ఉండటం, అనుమానిత లక్షణాలతో బాధపడుతూ చికిత్స కోసం వస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటం, ఐసోలేషన్ వార్డులో 30కిపైగా పాజిటివ్ ఉన్నవారు చికిత్స పొందుతుండటం, అత్యవసర విభాగానికి వచ్చే రోగులకు వైరస్ విస్తరించే ప్రమాదం ఉండ టంతో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. వివిధ రోడ్డు, ఇతర ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులు సహా గుండె, కాలేయ, మూత్రపిండాల సంబంధిత సమస్యలతో బాధపడుతూ చికిత్స కోసం అత్యవసర విభాగాలకు చేరుకుంటున్న రోగులను ఇకపై ఉస్మానియాకు తరలించాలని నిర్ణయించింది. ఆ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. -
శ్రీ శివకుమారస్వామి
సామాన్యప్రజల సేవయే పరమార్థంగా మఠాన్ని నడిపిన మానవతావాది. నిరక్షరాస్యులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దిన విద్యాప్రదాత. మనుషుల్లో దేవుడిగా పూజలందుకున్న ఈ ధార్మికవేత్త తుమకూరు సిద్ధగంగ మఠాధిపతి డాక్టర్ శ్రీశివకుమార స్వామి. 111 ఏళ్ల తమ సుదీర్ఘజీవనంలో ఆధ్యాత్మిక బోధలతో జాతిని చైతన్యవంతం చేసి అభినవ బసవణ్ణగా అందరి మన్ననలను పొందారు. ఆధ్యాత్మిక శక్తి పుంజం 1908 సంవత్సరంలో పటేల్ హోనప్ప, గంగమ్మ దంపతులకు చివరి సంతానంగా జన్మించిన ఒక సామాన్యుడు ఆధ్యాత్మిక బాటపట్టి ఉద్ధాన శివయోగి వద్ద శిష్యుడిగా చేరాడు. తన సాధనాసంపత్తిని ధారపోసి అతనిని ఆధ్యాత్మిక శక్తిపుంజంగా తయారు చేసి ‘శివకుమార స్వామి’గా లోకానికి అందించారు గురువులైన శ్రీ ఉద్ధాన శివయోగి. గురువుల ఆదేశానుసారంగా తుమకూరులో సిద్ధగంగ మఠాన్ని స్థాపించారు శివకుమారస్వామి. భక్తినావ–సామాజిక తోవ 9 దశాబ్దాల పాటు సిద్ధగంగ మఠాధిపతిగా బాధ్యతలు నిర్వహించిన శివకుమారస్వామి ఆధ్యాత్మిక, భక్తి బోధలకే పరిమితం కాకుండా సమాజసేవనూ బాధ్యతగా స్వీకరించి సంఘసేవకుడిగానే ఎక్కువ ప్రాచుర్యం పొందారు. కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో విద్యాసంస్థల్ని నెలకొల్పి లక్షలాదిమంది విద్యార్థులకు ఉచితంగా విద్యనందించి గొప్ప విద్యాదాతగా పేరుగాంచారు. విద్యతోపాటు క్రమశిక్షణను, సత్ప్రవర్తనను పెంపొందించేందుకు కృషి చేసిన ఈ మహనీయుడు లక్షలాదిమంది అభాగ్యుల ఆకలి బాధలు తీర్చిన అన్నదాత కూడా. వరించిన పురస్కారాలు శ్రీ శివకుమారస్వామిని వివిధ పురస్కారాలు కోరి వరించాయి. వీరి సేవలకు గుర్తింపుగా 2007లో కర్ణాటక ప్రభుత్వం కర్ణాటక రత్న అవార్డునిచ్చి గౌరవించగా, భారత ప్రభుత్వం 2015లో పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. సామాన్యుడే మాన్యుడు వీరి ఆశీస్సుల కోసం ఉన్నత పదవులలో ఉన్న రాజకీయ నాయకులు, ప్రభుత్వాధినేతలు సైతం పరితపించేవారు. వీరిమాటను శిరోధార్యంగా భావించేవారు. కానీ వీరు అతి సామాన్యుడిలా శతాధిక వయసులో కూడా రోజూ శిష్యులను కలుసుకుని మాట్లాడేవారు. వారి దైనందిన సమస్యలకు ఆధ్యాత్మిక మార్గంతో పరిష్కారాలను సూచించేవారు. ఆధ్యాత్మికతతో క్రమశిక్షణ ‘వ్యక్తిగత క్రమశిక్షణ ఎవరికైనా అవసరం. వ్యక్తిగత క్రమశిక్షణకు బాటలు వేసేది ఆధ్యాత్మిక మార్గం. అదే మన జీవితాలను సరైన దారిలో నిలబెడుతుంది. సమాజంలోని ప్రతీ వ్యక్తి సత్యనిష్టాగరిష్టుడైతే సమస్యలన్నవే ఎదురుకావు. సమాజం ఉన్నతంగా పురోగమించాలంటే మనిషి సరైన దారిలో నడవాలి‘ అంటూ అలాంటి మార్గాన్ని ఆచరణలో చూపించి చైతన్యజ్యోతులను ప్రసరింపజేసిన మహనీయుడు శివగంగస్వామి. – అప్పాల శ్యామప్రణీత్ శర్మ అవధాని, వేదపండితులు -
సవాళ్లకు సమాధానం
అందమైన చిరునవ్వుతో ఇట్టే ఆకట్టుకునే ఆత్మవిశ్వాసంతో కనపడుతున్న ఇరవైమూడేళ్ల ఈ యువతి పేరు చాందిని నాయర్. అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తున్నా సరైన అవకాశాలు అందిపుచ్చుకోలేని యువతకి చాందిని ఎదుగుదల ఒక స్ఫూర్తి పాఠమవుతుంది. వీల్ చెయిర్‌కే పరిమితమైనా ఫార్మసీలో డిగ్రీ చేస్తోంది. అంతేకాదు, ఇప్పుడు ఆమె ఇంటర్నెట్ స్టార్ కూడా. ‘నా ఎదుగుదల ప్రతీ దశలో చేసిన పోరాట ఫలితమే ఈ జీవితం’ అంటూ వైకల్యం ఉన్నవారిపట్ల సమాజం చూపే వైఖరిని ఎండగడుతోంది. ఎదుగుదలలో ఒకదారి మూసుకుపోయినప్పుడు మరో దారి తప్పక మనకోసం ఉంటుందని నమ్మకంగా చెబుతోంది. ‘ప్రజల మనస్తత్వం ప్రతి చోటా, ప్రతీదశలో ఒకే విధంగా ఉంటుంది అనడానికి నాకు ఎన్నో ఉదాహరణలు కనిపించాయి. నేను చిన్నప్పుడు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాను. మిగతా కాన్వెంట్లు వీల్‌చెయిర్‌లో ఉన్న అమ్మాయికి సీట్ ఇవ్వలేమన్నారు. పన్నెండవ తరగతిలో 90 శాతం మార్కులు సాధించాను. ఆ తర్వాత మెడిసిన్ చేయాలనుకున్న నా కలలపై కాలేజీ అధికారులు నీళ్లు చళ్లారు. నా చిన్నప్పటికీ ఇప్పటికీ రోజులు మారాయి, ప్రజల్లో మార్పు వచ్చింది అని ఊహించాను. కానీ, మళ్లీ అదే తిరస్కరణలను ఎదుర్కొన్నాను. నా పరిస్థితి చూసి కాలేజీ అధికారులు కష్టంగా లేని కోర్సులను చదవమని సూచించారు’ అంటూ చెప్పిన చాందిని మరో దారిని ఎలా నిర్మించుకున్నదో కళ్లకు కట్టింది. పక్షపాతాన్ని పక్కన పెట్టి డాక్టర్ కావాలని కలలు కన్న అమ్మాయి సమాజం చూపిన పక్షపాతాన్ని పక్కన పెట్టేసి తన జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి ఏం చేయాలో దృష్టి పెట్టింది. చాందిని చిన్ననాటి నుంచి మంచి గాయని. చిన్నప్పుడు టీవీలో వచ్చే పాటల ప్రోగ్రామ్‌లను మ్యూట్‌లో పెట్టి తను దానికి తగ్గట్టుగా పాటలు పాడేది. ఇది గమనించిన ఆమె తల్లిదండ్రులు చాందినికి శాస్త్రీయ సంగీతం నేర్పించారు. అయితే, వేదికలపై ప్రదర్శనలు ఇవ్వకపోయినా డబ్‌స్మాష్‌తో సోషల్ మీడియా ద్వారా పేరు పొందింది. ‘30 సెకన్ల వీడియోలను తయారు చేసి వాటిని ఇంటర్నెట్లో అప్లోడ్ చేసేదాన్ని. ఫేస్బుక్లో ‘వెరైటీ మీడియా’ అనే గ్రూప్‌లో నా వీడియోను షేర్ చేశాను. అది నా జీవితాన్ని ఒక మలుపు తిప్పింది. కేవలం నాలుగే నాలుగు రోజుల్లో నాలుగు మిలియన్లమంది చూశారు. నా ప్రతిభను మెచ్చుకున్నాను. అది నాకు చాలా ప్రోత్సాహాన్నిచ్చింది’ అంటూ చెప్పుకొచ్చింది చాందిని. స్థానిక టెలివిజన్ కార్యక్రమానికి చాందినిని ఆహ్వానించినప్పుడు నెటిజన్లు ఆమె వైకల్యం గురించి మొదటిసారి తెలుసుకున్నారు. ‘నేను నా ముఖం మాత్రమే ఫ్రేమ్‌లో ఉండేలా వీడియోలను తయారుచేస్తుంటాను. దాంతో నా వైకల్యం అందులో ఎవరికీ తెలియదు. అయినా, నా వీడియోలు వైరల్ అయ్యాయి’ అంటూ సంతోషంగా వివరిస్తుంది. కిందటేడాది టిక్‌టాక్ వీడియోలతో నెట్లో మరింత యాక్టివ్‌గా మారింది. దీంతో చాందిని కథను చెప్పపడానికి ఆమెను ఆహ్వానించే టెలివిజన్ కార్యక్రమాల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం చాందిని వీడియోలకు 8 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. చాందిని కేరళవాసి అయినా ఎక్కువభాగం తమిళనాడులోనే పెరిగింది. కష్టంపై సవాల్ చాందినికి మయోపతి ఉందని ఆమె ఏడాది వయసులో తల్లిదండ్రులకు తెలిసింది. కండరాల బలహీనతతో బాధపడే స్థితి. కొందరిలో స్వల్పంగా, మరికొందరిలో అసలు వైకల్యం ఏర్పడకపోవచ్చు. కొందరిలో మాత్రం వయస్సు పెరుగుతున్నకొద్దీ జబ్బు కూడా తీవ్రమవుతుంది. చాందిని ఆరోగ్యపరిస్థితి రెండవకోవకు చెందింది. ఎంతో మంది వైద్యులను కలిశారు. కానీ, ఆమెను నిలబెట్టలేకపోయారు. చాందిని తనకు ఉన్న జబ్బును చూసి భయంతో కుంగిపోలేదు. ఉన్నంతంగా జీవించడానికి తన కష్టాన్ని చిరునవ్వుతో ఎదుర్కొంటోంది. తనలోని సామర్థ్యానికి సరైన వేదిక ఏర్పాటు చేసుకుంటుంది. చదువుతో సరైన సమాధానం చాలా మంది చాందిని పరిస్థితిని సానుభూతితో చూస్తే కొందరు చూళ్లేమంటూ తలతిప్పుకునేవారు. బహిరంగ ప్రదేశాల్లో వికలాంగులకు సరిపడే మౌలికసదుపాయాల ఏర్పాటు లేకపోవడంతో బడి రోజుల నుంచి చాందిని అవస్థలుపడుతూనే పెరిగింది. ఆమె కోసం ఖర్చుపెట్టే ప్రతి రూపాయి వృధాయే అని చాలామంది చాందిని ముందే తల్లిదండ్రులకు చెప్పేవారు. ‘చాలా బాధనిపించేది. కానీ, నా తల్లిదండ్రులు నన్ను వేరుగా చూడలేదు. బయటకి తీసుకెళ్లడానికి వాళ్లెప్పుడూ వెనకంజ వేయలేదు. ఆరోగ్యకారణాల వల్ల కొన్ని పరిమితులు ఉంటే ఉన్నాయి. కానీ నా స్వంత నిర్ణయాలు తీసుకునేంత స్వేచ్ఛ నాకు కల్పించారు’ అని తల్లిదండ్రుల గురించి గొప్పగా చెబుతుంది చాందిని. ఎనిమిదేళ్ల క్రితం చాందిని 10వ తరగతిలో ఉన్నప్పుడు ఆమె వీపు భాగం బాగా వంగిపోయి ఉండేది. ఎనిమిది గంటల ఆపరేషన్ చేసి వెన్నెముకను సవరించారు. ఆపరేషన్ అయింది. డాక్టర్లు ఆరునెలలు బెడ్‌రెస్ట్ చెప్పారు. పది నిమిషాలు పుస్తకం పట్టుకొని కూర్చోవాలన్నా కష్టమయ్యేది చాందినికి. దీంతో బోర్డు పరీక్షలు రాయొద్దని అంతా చెప్పారు. కానీ, వినిపించుకోలేదు ఆమె. తల్లీతండ్రి పుస్తకాలు ముందు అమర్చి, ఒక్కోపేజీ తిరగేయడానికి సాయం చేశారు. అలాగే ఎక్కువసేపు కూర్చునేందుకు సహాయపడే వ్యాయామాలపై దృష్టిపెట్టారు. మూడు నెలల వ్యవధిలో పదవతరగతి పరీక్షలు రాసి, 88 శాతం మార్కులు తెచ్చుకుంది. అప్పుడే డాక్టర్ చదవాలనుందనే తన ఆశను బయటపెట్టింది. తల్లిదండ్రులూ ప్రోత్సహించారు. అయితే, ఏ కాలేజీ ఆమెకు మెడిసిన్‌లో సీటు ఇవ్వలేదు. తక్కువ కష్టపడే కోర్సులు చేయమని సూచించారు. బెంగుళూరులోని ఆక్స్ఫర్డ్ కాలేజీ ఆఫ్ ఫార్మసీలో సీటు లభించింది. కళాశాల వికలాంగులకు అనుకూలమైన మరుగుదొడ్డి, అనువైన దారిని ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఫార్మసీలో డాక్టరేట్ సాధించాలని, అలాగే వినోదరంగంలో తనదైన ముద్రవేసుకోవాలనేది ఆశయం అని, అందుకు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాను’ అని చెప్పింది చాందిని. ‘ప్రజలు గుర్తుపట్టి నాతో ఫొటోలు తీసుకున్నప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ ప్రపంచంలో మనకంటే ఏదీ ఎక్కువ కాదు. జీవితమే మనకు అన్నీ నేర్పిస్తుంది. ఆశను కోల్పోకుండా నిరంతరం ప్రయత్నించడమే మనం చేసే పని’ అంటోంది చాందిని. – ఆరెన్నార్ -
ఒక్కరే సంతానమా?!
పై చదువులు, ఉద్యోగాల పేరుతో చాలా జంటలు ఒక్క సంతానానికే మొగ్గు చూపుతున్న ధోరణి సమాజంలో నేటికీ కొనసాగుతూనే ఉందని తాజాగా ‘ఇండియా హ్యూమన్ డెవలప్మెంట్’ (ఐహెచ్డి) సర్వే వెల్లడించింది. ఒకే సంతానంగా ఉన్నవాళ్లు ఎప్పుడూ ఒంటరితనంతో బాధపడటమే కాక, తోబుట్టువులు ఉన్నవారితో పోల్చితే ఒంటరి పిల్లలు నలుగురితో సరిగా కలవలేరన్న సామాజిక అభిప్రాయానికి కూడా ప్రాధాన్యం ఇస్తూ.. తల్లిదండ్రులకు ఉపయోగపడే కొన్ని సూచనలను కూడా ఐహెచ్డి తన సర్వే నివేదికలో పొందుపరిచింది. మీరు కూడా ఒకే సంతానం కలవారైతే మీరు ఈ సూచనల గురించి తప్పక తెలుసుకోవలసిందే. స్నేహితులను పెంచుకోనివ్వాలి తల్లిదండ్రులుగా మీరు మీ ఒకే ఒక్క బిడ్డ పట్ల శ్రద్ధ చూపుతూనే ఉండవచ్చు. అయితే కనిపించని ఆ ఒంటరితనం వెనక ఒక నిర్వికార స్థితి మొదలవకుండా చూడవలసింది కూడా మీరే. మీ బాబు / పాప వీలైనన్ని సామాజిక సమావేశాలకు హాజరయ్యేలా, స్నేహితులను పెంచుకునేలా చూడండి. నలుగురిలో కలవడం కోసం ఉదయం, సాయంత్రం మీ బిడ్డను పార్క్‌లో తిరగడానికి తీసుకెళ్లండి. తరచుగా బంధువులతో కలిసేలా, వేడుకలలో పాల్గొనేలా అవకాశం ఇవ్వండి. జాగ్రత్త పేరుతో అతిగా ర క్షణలో ఉంచాలనుకోవద్దు. వారికి స్నేహితులున్న ప్రదేశాలలో కొంతసేపు గడిపేలా అవకాశం ఇవ్వండి. వేసవి శిబిరాల్లో చేర్చండి. నియమాలు బాగుండాలి అమ్మాయి / అబ్బాయి మీ మొదటి ఏకైక సంతానం అయినందున మీ పిల్లలు తమ ప్రతి ఉత్సాహాన్ని మీతో పంచుకోవడానికి మొగ్గుచూపుతారు. దానిని నిరుత్సాహపరచకండి. అలా చేస్తే ‘లిటిల్ ఎంపరర్ సిండ్రోమ్’ అనే ఒక ప్రవర్తన వల్ల తల్లిదండ్రులతో వారు ఒక ఆదేశపూరిత బంధాన్ని మాత్రమే ఏర్పరచుకుంటారు. కాబట్టి మీ బిడ్డ అంచనాలను నిజం చేయడానికి, ఇతర అవసరాలకు ప్రతిస్పందనగా ఉండటానికి కొన్ని నియమాలు పెట్టుకోండి. అయితే ఆ నియమాలు ఆ బిడ్డను కట్టడి చేయాలనే ఆలోచన మాత్రంతో కాదని గ్రహించాలి. ‘షేర్ అండ్ కేర్’ తప్పనిసరి ఒకే బిడ్డ భిన్నమైన సర్దుబాట్లు చేసుకోవడం కష్టం అని నిపుణుల అభిప్రాయం. ఫలితంగా వాళ్లు తమకు తాము కొన్ని కఠినమైన అభిప్రాయాలను ఏర్పరుచుకుంటారు. ఇతరుల పట్ల తక్కువ సానుభూతిని చూపిస్తారు. దీన్ని నివారించడానికి జట్టుగా ఉండటంలోని బలం ఏమిటో మీ బిడ్డ తెలుసుకునేలా చేయాలి. అందుకు పాఠశాల, ఇతర చోట్ల జట్టు కార్యకలాపాల్లో భాగం కావాలని వారిని ప్రోత్సహించాలి. అలాగే, ఆ సింగిల్ చైల్డ్‌ను తనకు ఇష్టమైన కొన్ని బొమ్మలను స్నేహితులతో, బంధువుల పిల్లలతో పంచుకోనివ్వాలి. – ఆరెన్నార్ -
రెండో పెళ్లయితే?
సమాజం దారి ఏర్పాటు చేస్తుంది. ఆ దారినే మళ్లీ ప్రశ్నిస్తుంది. చిన్నచూపు చూస్తుంది. హేళన చేస్తుంది. సమాజంలో మొదటి పెళ్లికి ఉన్న గౌరవం రెండో పెళ్లికి ఉందా? రెండో పెళ్లి చేసుకోవడం వల్ల అన్యాయం జరిగినట్టేనా? ఈ భావనలు ఒకమ్మాయి మనసులో తుఫాను రేపితే? ఫస్ట్ జరుగుతున్నది ఆ అమ్మాయి బాబాయ్ కనిపెట్టాడు. అతను కనిపెట్టకపోతే కథ ఎక్కడి దాకా పోయేదో. ఆ రోజు సాయంత్రం ఆఫీసు దగ్గర వసుధ బాబాయ్‌ని చూసి శ్రీకాంత్ ఆశ్చర్యపోయాడు. ‘నమస్తే మావయ్యా... ఇలా వచ్చారేమిటి?’ అన్నాడు. ‘నీతో మాట్లాడాలి శ్రీకాంత్’ అన్నాడు బాబాయ్. ఇద్దరూ దగ్గరలో ఉన్న కాఫీషాప్‌లో కూచున్నారు. ‘శ్రీకాంత్... వసుధ మీద నీ ఒపీనియన్ ఏమిటి?’ అడిగాడు బాబాయ్ ‘మంచమ్మాయి. ఆ అమ్మాయిని చేసుకొని నేను సంతోషంగా ఉన్నాను. ఎందుకలా అడిగారు?’ ‘ఆ అమ్మాయి హ్యాపీగా ఉందనుకుంటున్నావా?’ ‘ఉందనే అనుకుంటున్నాను’ అయోమయంగా అన్నాడు శ్రీకాంత్. ‘కాని ఆ అమ్మాయి లేదు. లేనని అనుకుంటోంది. ఎంతగా అంటే తన కాలేజీ నాటి ఫ్రెండ్‌తో డీప్‌గా ఫ్రెండ్షిప్ చేసేంత అనుకుంటోంది. రెండు రోజుల క్రితం తను అతనితో నాకు రెస్టరెంట్లో కనిపించింది’ బాబాయ్ చెప్పింది విని శ్రీకాంత్ ఒక నిమిషం బిగుసుకుపోయాడు. ‘ఇందులో మన తప్పు కూడా ఉంది. ఆ అమ్మాయిని నీతో పెళ్లికి సరిగ్గా ప్రిపేర్ చేయలేదు. ఇప్పుడు ఆలస్యమైపోయింది. ఒకసారి మనం వసుధను సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్లాలి. ఏమంటావ్?’ ‘మావయ్యా... నాకు వసుధ అంటే నిజంగానే ప్రేమ ఉంది. తప్పకుండా తీసుకెళదాం’ అన్నాడు శ్రీకాంత్. వసుధ ప్రవర్తన గురించి తనకు తెలిసిన విషయాన్ని పట్టుకుని ఆ రాత్రి ఇంట్లో రాద్ధాంతం చేయలేదు శ్రీకాంత్. కూల్‌గా వసుధతో మాట్లాడాడు. ‘వసుధ... నువ్వు నీ కాలేజ్ మేట్ సాగర్‌తో క్లోజ్‌గా ఉంటున్నావా?’ ఒక్క క్షణం వసుధ తుళ్లిపడింది. అప్పటి వరకూ ఏదో కన్ఫ్యూజన్లో ఉన్నట్టు, తన ప్రవర్తన గురించి తనకే డౌట్ ఉన్నట్టు, తాను చేస్తున్నది సరైనదో కాదో తేల్చుకోలేనట్టు, ఒకవేళ భర్తకు తెలిస్తే జరిగే పరిణామాలను ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నానో లేనో తెలియనట్టు... వసుధ సడన్‌గా ఏడ్వడం మొదలుపెట్టింది. ‘ఏడవకు... ఏడవకు’ ఊరడించాడు శ్రీకాంత్. ‘నేనేం చేస్తున్నానో నాకే అర్థం కావడం లేదండీ’ అంది వసుధ సిన్సియర్‌గా. ‘సరే... మనం ఒకసారి సైకియాట్రిస్ట్‌ను కలుద్దాం’ అన్నాడు శ్రీకాంత్. వసుధ చక్కగా ఉంటుంది. బాగా చదువుకుంది. ఎవరైనా సరే ఇష్టపడి పెళ్లి చేసుకునేలా ఉంటుంది. వాళ్లది మధ్యతరగతి కుటుంబం. తన కంటే ముందు ముగ్గురు అక్కలు ఉన్నారు. ఆ ముగ్గురికీ పెళ్ళిళ్లయ్యేలోపు వసుధకు ఒకటి రెండు మంచి సంబంధాలు వచ్చాయి. కాని పెద్దపిల్లల పెళ్లి అయ్యేంత వరకూ చివరి పిల్ల వసుధకు పెళ్లి చేయడం సాధ్యం కాదని తల్లిదండ్రులు ఊరుకున్నారు. ముగ్గురి పెళ్లిళ్లు అయ్యేసరికి ఆర్థికంగా పెద్దగా ఏం మిగల్లేదు. సరిగ్గా అప్పుడే తమ బంధువుల్లో ఉన్న శ్రీకాంత్ సంబంధం వచ్చింది. శ్రీకాంత్ ఆర్థికంగా బాగా సెటిల్ అయ్యాడు. మంచి ఉద్యోగం ఉంది. కాని పెళ్లయిన నాలుగునెలలకే భార్య నుంచి విడిపోయి సంవత్సరం తర్వాత విడాకులు తీసుకున్నాడు. అతను మంచివాడేనని ఆ అమ్మాయి ఎందుకో అతనితో అడ్జెస్ట్ కాలేకపోయిందని అతడు కూడా ఆ అమ్మాయితో హ్యాపీగా ఉండలేకపోయాడని వసుధ తల్లిదండ్రులకు సంబంధం తెచ్చినవారు చెప్పారు. వసుధను శ్రీకాంత్‌కు ఇచ్చి చేయడానికి తల్లిదండ్రులకు అభ్యంతరం ఏమీ కనిపించలేదు. వసుధను మంచి సంబంధం అని ఒప్పించారు. వసుధకు కూడా అంతా బాగానే ఉన్నట్టు అనిపించింది. ఓకే అంది. ‘కాని అందరూ నన్ను బాగా హింస పెట్టారు డాక్టర్’ అంది వసుధ సైకియాట్రిస్ట్‌తో. ‘ఎలా?’ అని అడిగాడు సైకియాట్రిస్ట్. ‘పెళ్లికి నా ఫ్రెండ్స్‌ని పిలిచాను. అందరూ వచ్చారు. వెళ్లారు. పెళ్లి బాగా జరిగింది. కాని ఒకరోజు ఒక ఫ్రెండ్‌తో నేను చేసుకుంది రెండో పెళ్లి అతన్ని అని చెప్పాను. క్యాజువల్‌గా అవునా అంది. కాని మా సర్కిల్ అంతా ప్రచారం చేసింది. అందరూ నాకు ఫోన్లు చేసి ఒకటే సానుభూతి చూపడం. నీకేం తక్కువని... నీకేం అవసరమని... మమ్మల్ని అడిగితే రాజాలాంటి సంబంధం తెచ్చేవాళ్లం... పోయిపోయి రెండో సంబంధంవాణ్ణి చేసుకుంటావా... అయ్యో రెండో సంబంధమా... మొదటి భార్య ఎందుకు వెళ్లిపోయిందో... వాడు శాడిస్ట్ ఏమో... నిన్ను కూడా సరిగ్గా చూసుకోడులే ఇలా నా మనసు నిండా విషం నింపారు. నాకు రాను రాను అవన్నీ నమ్మాలనిపించింది. అవి నమ్మిన వెంటనే నాకు రెండో పెళ్లివాడికిచ్చి చేసిన నా తల్లిదండ్రులపై పీకల్దాకా కోపం వచ్చింది. మా ముగ్గురక్కలు ఈ పెళ్లి వద్దన్నారట. అంటే వాళ్లు వద్దనేంత అన్యాయం ఏదో నాకు జరిగిపోయినట్టే కదా. ఇవన్నీ ఆలోచించి డిస్ట్రబ్ అయ్యాను’ అంది వసుధ. బయట ఆమె భర్త, బాబాయ్ కూచుని ఉన్నారు. ‘తర్వాత’ అన్నాడు సైకియాట్రిస్ట్. ‘నా మనసు నిండా మొదటి పెళ్లివాణ్ణి చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో అన్న ఆలోచన నిండిపోయింది. ఈలోకానికి ఎలాగైనా మొదటిపెళ్లివాణ్ణి చేసుకొని చూపించాలన్నంత కోపం, కసి వచ్చాయి. అప్పుడే నా కాలేజ్‌మేట్ సాగర్ కనిపించాడు. అప్పట్లో అతను నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. నేను నో చెప్పాను. కాని నా సంగతి విని ఇప్పుడైనా మించిపోయింది లేదు చేసుకుంటాను అని మాటలు మొదలెట్టాడు. ఒకటి రెండుసార్లు అతన్ని కలిశాను. కాని నాకు అది కరెక్టో కాదో అని అనిపించేది. ఇటు శ్రీకాంత్.. అటు సాగర్... మెడలో తాళి... ఇదంతా నరకంగా ఉంది డాక్టర్’ అంది వసుధ. ‘ఇప్పుడు నీ మనసులో ఏముంది?’ ‘నాకు మంచి జీవితం పొందాలని ఉంది’ ‘మంచి జీవితం శ్రీకాంత్ నీకు ఇస్తున్నాడు కదా. అతను నీ కన్ఫ్యూజన్ గురించి తెలిసినా రాద్ధాంతం చేయకుండా నా దగ్గరకు తీసుకొచ్చాడంటేనే నువ్వంటే ఎంత గౌరవమో అర్థమవుతోంది. సెకండ్ మేరేజ్ రాంగ్ మేరేజ్ అనే భావన నీ మనసులో తీసేయ్. నువ్వు ప్రేమించగలిగే నిన్ను ప్రేమించగలిగేవాడు దొరికిన పెళ్లే మంచి పెళ్లి. అది మొదటిదా రెండోదా అని లెక్కలు ఎందుకు? జనానిదేముంది... ప్రతిదానికీ మాట్లాడతారు. శ్రీకాంత్ మొదటిపెళ్లి నుంచి బయటపడి అలాగే ఖాళీగా ఉండిపోతే జనం ఊరుకుంటారా? రాజాలా ఉంటావు... రాణిలాంటి సంబంధం తెస్తాము చేసుకో అని వారే అంటారు. చేసుకున్నాక ఆ వచ్చిన అమ్మాయికి వాళ్లే పుల్లలు పెడతారు. కాబట్టి మనకు ఏది మంచో అది ఎంచుకుని ముందుకెళ్లాలి. నీకు నిజంగా శ్రీకాంత్ అంటే ఇష్టమేనా?’ ‘ఇష్టం సార్’ ‘ఇంకా సాగర్‌తో మాట్లాడాలని ఉందా?’ ఆ అమ్మాయి మెల్లగా ఫోన్ తీసి సాగర్ నంబర్ బ్లాక్ చేసింది. కాసేపటికి బాబాయి, శ్రీకాంత్, వసుధ డాక్టర్‌కు థ్యాంక్స్ చెప్పి ఒక నిశ్చింతతో ఇంటికి మరలారు. – కథనం: సాక్షి ఫ్యామిలీ ఇన్పుట్స్: డాక్టర్ కల్యాణ చక్రవర్తి, సైకియాట్రిస్ట్ -
వినయమే రక్షణ కవచం
విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్తకు మతం లేదు. అతడు ఏ మతానికీ చెందిన వాడు కాదు. అతడు కాలానికి అతీతుడు. జనన మరణ చక్రానికి మించినవాడు. సృష్టికర్త ఈ విశ్వంలో ప్రతి ఒక్కరికీ ఆహారమూలాన్ని సృష్టించాడు. రాతిలోని పురుగుకు కూడా ఆహారాన్ని ఉంచాడు. మనిషికి పుట్టుక ఎంత సహజమో మరణమూ అంతే సహజం. ఈ ప్రపంచం తాత్కాలిక నివాసం... అని సృష్టికర్త తత్వాన్ని బోధించాడు గురు నానక్. గురు నానక్ దేవుడిలో ఏకత్వాన్ని విశ్వసించాడు. నానక్ గొప్ప కవి, సంగీతకారుడు, తత్వవేత్త, శాస్త్రాలను ఔపోశన పట్టిన వాడు.నానక్ హిందూ కుటుంబంలో పుట్టాడు. అయితే ఆయన తనను తాను ఒక మతానికి పరిమితం చేసుకోలేదు. అన్ని మతాలలో ఉన్న మంచి బోధనలను స్వీకరించి తనను తాను మహోన్నతమైన వ్యక్తిగా మలుచుకున్నాడు. తాను నమ్మిన మంచిని ఇతరులకు బోధించాడు. ‘మనం తినే దాన్ని ఇతరులతో పంచుకోవాలి. అవసరమైన వ్యక్తికి సహాయం చేయాలి. మనిషి తాను బతకడానికి డబ్బు సంపాదించాలి. అయితే అది దోపిడీ, మోసాలతో కూడుకున్నది కాకూడదు. నిజాయితీతో కూడిన సంపాదనతోనే జీవించాలని చెబుతూ... మానవులందరూ సమానమే. కులం, మతం, మత వివక్ష ఉండరాదని గురు నానక్ బోధించాడు. వివిధ వర్గాల ప్రజలను కలిసి కూర్చోమని ప్రోత్సహించాడు. సమసమాజాన్ని ఆకాంక్షించాడు. తాను నమ్మిన విలువలతో కూడిన సమాజ నిర్మాణం కోసం జీవితాన్ని అంకితం చేశాడు. సృష్టికర్తను నిత్యం ప్రార్థించాలి మనిషి తన సొంత ప్రయోజనం కోసం తోటి వ్యక్తిని మోసం చేయకూడదు. అందం, యవ్వనం పట్ల మితిమీరిన మక్కువను పెంచుకోరాదు. అలా మక్కువ పెంచుకున్నవాడు మలమూత్రపు పురుగుగా పుడతాడని హెచ్చరించాడు నానక్. మనిషి తన సంపద, బలం, శక్తి సామర్థ్యాలను చూసుకుని గర్వించరాదని కూడా చెప్పాడు గురునానక్. అలా అహంకరించిన మనిషి విషయంలో అతడి అహంకారమే అతడిని మింగేసే రాక్షసునిగా మారుతుందని చెప్పాడు. నిత్యం సృష్టికర్తను ప్రార్థిస్తూ వినయంగా జీవించాలి.ఆ వినయమే మనిషిని కాపాడే రక్షణ కవచమవుతుందని కూడా బోధించాడు. మనిషి గురువును ఎంచుకోవడంలో విజ్ఞత చూపించాలి. ఇక ఆ గురువే అతడిని నడిపిస్తాడు. సామాన్యుడికి సృష్టికర్తను బోధపరచగలిగిన వాడు గురువు. మనిషి గొప్ప మార్గంలో నడవడానికి, ‘దేవుడు ఉన్నాడు’ అని అనుకోవటానికి అవసరమైన విశ్వాసాన్ని మనిషిలో పాదుకొల్పగలిగిన వాడే గురువు అని గురువు ప్రాధాన్యతను వివరించాడు గురునానక్. – రవీందర్ కౌర్ -
చీకట్లను చీల్చిన దివ్యజ్యోతి
మానవజాతి సంస్కరణ కోసం ప్రపంచంలో అనేకమంది సమాజోద్ధారకులు ప్రభవించారు. వారిలో చివరిగా వచ్చినవారు ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం. మనందరి ప్రవక్త ఒక్కరే, మనందరి గ్రంథం ఒక్కటే. మనందరి ధర్మం ఒక్కటే. మనమంతా ఒక్కటే. సమస్త మానవజాతీ ఒక్కటే.. అనిఎలుగెత్తి చాటేరోజు మిలాదున్నబీ. ప్రవక్త జననానికి ముందు నాటి సమాజంలో ‘కర్రగలవాడిదే బర్రె’ అన్నట్లుగా బలవంతుడు బలహీనుణ్ణి పీక్కు తినేవాడు. స్త్రీల హక్కుల విషయం కాదుగదా అసలు వారికంటూ ఓ వ్యక్తిత్వం ఉన్న విషయాన్నే వారు అంగీకరించేవారు కాదు. స్త్రీని విలాస వస్తువుగా, అంగడి సరుకుగా భావించేవారు. అలాంటి జాతిని అన్ని విధాలా సంస్కరించి, వారిని మంచి మనుషులుగా తీర్చిదిద్దిన ఘనత ముహమ్మద్ ప్రవక్తదే. నాటిసమాజంలో లేని దుర్మార్గమంటూ లేదు. అలాంటి ఆటవిక సమాజాన్ని నిరక్షరాస్యులైన ముహమ్మద్ ప్రవక్త సమూలంగా సంస్కరించి, ఒక సత్సమాజంగా ఆవిష్కరించారు. దురదృష్టవశాత్తూ ఈనాటి మన నాగరిక, విజ్ఞాన సమాజ స్థితిగతుల్ని విశ్లేషిస్తే మనకు నిరాశే మిగులుతుంది. నైతికంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా, రాజకీయంగా మనం పతనం అంచుల్లో ఉన్నాం. సమాజంలో నైతిక విలువలు అడుగంటి, పాశ్చాత్య పోకడలు, పబ్ క్లబ్ సంస్కృతి వెర్రితలలు వేస్తున్నది. తత్ఫలితంగా అశ్లీలత, అనైతికత, అమానవీయత, ప్రబలి సాంస్కృతిక విధ్వంసానికి దారితీస్తున్నాయి. చివరికి ఆధ్యాత్మిక రంగంలోనూ అతివాదం ముదిరి మతోన్మాదంగా రూపాంతరం చెందింది. మతం మనిషిని మంచివైపుకు మార్గదర్శకం చేసే బదులు అసహనం, హింసవైపు తీసుకుపోతోంది. సమాజంలో సామాజిక, ఆర్థిక అసమానతలు కొంతమందిని తీవ్రవాదం, ఉగ్రవాదం వైపుకు తీసుకువెళుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో నేటి మన సమాజానికి కూడా ముహమ్మద్ ప్రవక్తవారి బోధనల అవసరం ఉంది. ఆయన బోధనల ప్రకారం... మానవులు తమ సృష్టికర్తను మాత్రమే ఆరాధించాలి. తోటిమానవుల్ని, సమాజాన్ని ప్రేమించాలి. స్త్రీలను గౌరవించాలి. ఎలాంటి స్థితిలోనూ నీతినీ, న్యాయాన్ని విస్మరించకూడదు. అనాథలను, వృద్ధులను ఆదరించాలి. తల్లిదండ్రులను సేవించాలి. వారిపట్ల విధేయత కలిగి ఉండాలి. బంధువులు, బాటసారులు, వితంతువులు, నిస్సహాయుల పట్ల తారసిల్లే బాధ్యతలను సక్రమంగా నెరవేర్చాలి. సంఘంలో ఒక మనిషికి మరో మనిషిపై పడే విధ్యుక్త ధర్మాల పట్ల ఉపేక్ష వహించకూడదు. అన్యాయం, అధర్మ సంపాదనకు ఒడికట్టవద్దు. ధనాన్ని దుబారా చేయవద్దు. వ్యభిచారం దరిదాపులకు కాదుగదా.. దానికై పురిగొలిపే అన్నిరకాల ప్రసార ప్రచార సాధనాలను రూపుమాపాలి. నిష్కారణంగా ఏ ప్రాణినీ చంపవద్దు. ప్రజల ధన, మాన, ప్రాణాలు సురక్షితంగా లేని సమాజం ప్రగతిని సాధించలేదు. సదా సత్యమే మాట్లాడాలి. చేసిన వాగ్దానాలు నెరవేర్చాలి. వాగ్దాన భంగానికి పాల్పడకూడదు. పలికే ప్రతి మాటకూ, చేసే ప్రతి పనికీ సమాధానం చెప్పుకోవలసి ఉంటుంది. వ్యాపార లావాదేవీల్లో, ఇచ్చి పుచ్చుకోవడాల్లో లెక్కా పత్రాలు, కొలతలు, తూనికలు ఖచ్చితంగా, నికార్సుగా ఉండాలి. స్వార్థాన్ని, అహాన్ని త్యజించాలి. తోటివారిని తమకన్నా తక్కువగా చూడకూడదు. స్త్రీ జాతిని గౌరవించాలి. వితంతువుల్ని చిన్నచూపు చూడకూడదు. సమాజంలో వారికి గౌరవప్రదమైన స్థానం దక్కాలి. ప్రతి తల్లీదండ్రి తమ సంతానానికి విద్య నేర్పాలి. భావితరాల సంక్షేమానికి ఇది చాలా అవసరం. అధికార దుర్వినియోగం చేయకూడదు. పరిపాలన అంటే కేవలం ప్రజాసేవ మాత్రమే.. పాలకుడు అంటే ప్రజలకు సేవకుడు అని భావించాలి. ప్రతినిత్యం ప్రజలకు జవాబుదారుగా దైవానికి భయపడుతూ జీవించాలి. ఇక్కడ మనం పలికే ప్రతి మాటకు, చేసే ప్రతి పనికీ రేపు దైవం ముందు సమాధానం చెప్పుకోవాలన్న భావన కలిగి ఉండాలి. ఇలాంటి భావనలే మానవులను మంచివారుగా, నిజాయితీ పరులుగా, సౌశీల్యవంతులుగా తీర్చిదిద్దుతాయి. . మానవ సహజ దౌర్బల్యాల వల్ల చిన్నా చితకా పాక్షిక విభేదాలు ఉన్నప్పటికీ మనందరి విశ్వాసం కూడా ఒక్కటే అనడానికి ప్రబల తార్కాణం ఈ పండుగ. మౌలిక విశ్వాసం పరంగా ఒక్కటిగానే ఉన్న మనం పాక్షిక పొరపొచ్చాలను విస్మరించి తోటి సోదరుల్ని గుండెలకు హత్తుకోవాలి. ఈ పర్వదినం మన కిచ్చే మరో సందేశం ఏమిటంటే, సమాజాన్ని కలుపుకు పోకుండా, సాటి ప్రజల పట్ల ప్రేమ, త్యాగం, సహనం, పరోపకారం లాంటి సుగుణాలను అలవరచు కోకుండా ఏ సంతోషమయినా, ఎంతటి ఆనంద మైనా పరిపూర్ణం కాజాలదు. ఏ సంతోష కార్యమైనా సమాజంతో పంచుకోవాలని, కేవలం మన గురించి మాత్రమే కాకుండా సంఘం గురించి, సమాజం గురించి ఆలోచించాలని చెబుతుంది ప్రవక్త పుట్టినరోజైన మిలాదున్నబీ. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ అజ్ఞానాంధకార విషవలయంలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్న మానవ జాతిని మహోన్నతంగా తీర్చిదిద్దారాయన. దాదాపు 1450 సంవత్సరాల క్రితం అరేబియాదేశంలోని మక్కానగరంలో ఆయన జన్మించారు. ఆమినా, అబ్దుల్లా తల్లిదండ్రులు. పుట్టకముందే తండ్రినీ, ఆరేళ్ళ ప్రాయంలో అమ్మనూ కోల్పోయారు. తాతయ్య ఆయన్ని పెంచి పెద్దచేశారు. చిన్నతనం నుంచే అనేక సుగుణాలను పుణికిపుచ్చుకున్న ముహమ్మద్ ప్రవక్త, ‘అమీన్’ గా, షసాదిఖ్’గా వినుతికెక్కారు. ఆయన గొప్ప మానవతావాది. సంస్కరణాశీలి.ఉద్యమనేత. అతి సాధారణ జీవితం గడిపిన సామ్రాజ్యాధినేత. జ్ఞానకిరణాలు ప్రసరింపజేసిన విప్లవజ్యోతి. ప్రాణశత్రువును సైతం క్షమించిన కారుణ్య కెరటం. ఇటువంటి బాధ్యతాభావాన్ని, జవాబుదారీతనాన్ని ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం ప్రజల మనసుల్లో నూరిపోసి, మానవీయ విలువలతో తులతూగే ఓ చక్కని సత్సమాజాన్ని ఆవిష్కరించారు. అందుకే ఆయన మానవాళికి ఆదర్శమయ్యారు. -
వీరంతా మూడో లింగం అట!
సాక్షి, న్యూఢిల్లీ: దక్షిణ పసిఫిక్ దీవుల సముదాయంలో భాగంగా ఉన్న పొలినేసియన్ దీవి ‘తహితీ’. ఆ దీవిలో ప్రాచీన ఆధ్యాత్మిక ‘మహు’ జాతి మనుషులు ఇప్పటికీ నివసిస్తున్నారు. వారు తమ శరీరాలకు ముదురు నీలం, ముదురు గులాబీ, చిక్కటి పసుపు రంగులు వేసుకొని మెడలో, జుట్టుపై ఆకులు, పూలతో కూడిన దండలు ధరిస్తారు. సముద్రపు ఒడ్డున దొరికే గవ్వలు, కౌశిప్పులు, చిప్పలను కూడా దండలుగా ధరిస్తారు. మొల చుట్టూ ఆకర్షణీయమైన డిజైన్ రంగుల గుడ్డలు ఆడవాళ్ల మాదిరిగా ధరిస్తారు. అయితే వారు ఆడవారు కాదు, మగవారు కాదు. మూడవ లింగం అన్న మాట. ఆ ప్రాంతంలో జరిగే అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో వారు పాల్గొంటారు. డ్యాన్సులు కూడా చేస్తారు. వారిని దైవ సమానులుగా ఇతర జాతి ప్రజలు వారిని పూజిస్తారు. వాస్తవానికి వారు ‘మహు’ జాతిలో మగవారిగానే పుడతారు. ఆ విషయాన్ని వారి తల్లిదండ్రులు దాచేసి, మూడవ లింగమంటూ ఈ విచిత్ర వేషధారణను చిన్నప్పటి నుంచే అలవాటు చేస్తారు. ఇక వారి జీవనాధారం. ఆ వేషధారణే. వారికి కావాల్సిన ఆహారాన్ని అన్ని జాతుల ప్రజలు సమకూర్చి పెడతారు. వారు ఇళ్ల వద్ద పెద్దలు, పిల్లల సంరక్షణ బాధ్యతలను చిత్తశుద్ధితో చూసుకుంటారు. స్విస్–గినియన్ ఫొటోగ్రాఫర్ లమ్సా లియూబా ఇటీవల ఆ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు వారి ఫొటోలను తీశారు. ఫొటోల కోసం వారిని ఒప్పించడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని, ఒక్కొక్కరితో గంటలపాటు మాట్లాడితేగానీ ఫొటోల కోసం వారు ఒప్పుకోలేదని ఆమె తెలిపారు. స్విడ్జర్లాండ్‌లో జరిగే ఫొటో ఎగ్జిబిషన్లో ‘ఇల్యూషన్’ పేరిట వీటిని ప్రదర్శిస్తానని ఆమె చెప్పారు. -
మాట్లాడితే రూ.1500 జరిమానా
సాక్షి, సిరిసిల్ల: అందరూ కలిసి మెలిసి ఉండాల్సిన పరిస్థితులు పోయి మాకు మేము.. మీకు మీరన్న చందంగా ఒకే కులంలోని వాళ్లే రెండు గా విడిపోతున్నారు. అంతేకాదు ఇలా విడిపోయిన వాళ్లు గ్రూపులుగా మారి ఒక గ్రూప్ వాళ్లు ఇంకో గ్రూప్‌లో వాళ్లతో మాట్లాడితే చాలు జరిమానా చెల్లించాల్సిన దుస్థితి నెల కొంది. నిబంధనలను అతిక్రమించి ఒకసారి మాట్లాడితే రూ.500 నుంచి 1500 జరిమానా. మళ్లీ అదే పనిగా రెండోసారి మాట్లాడితే ఇక ఏకంగా రూ.10 వేల జరిమానా చెల్లించాలి. ఈ వివాదం ఇప్పటిది కాదట 2016లో ప్రభుత్వ భూమిలో ఉన్న చెట్లను కొట్టిన వ్యవహారంలో పెద్దలకు, చెట్టుకొట్టిన వ్యక్తిని నిలదీయడంలో చెలరేగిన సంఘంలోని సంఘర్షణ నేటికీ చల్లారడం లేదు. ఒక కూతురు గర్భసంచి ఆపరేషన్ జరిగితే ఆమెను చూడడానికి వెళ్లిన తల్లికి జరిమానా వేసే స్థాయికి చేరింది. ఇలాంటి జరిమానా మేము భరించలేమని ఆ ఊరిలో బాధితులుగా ఉన్న కొందరు ఆదివారం సిరిసిల్ల డీఎస్పీ కార్యాలయానికి వచ్చారు. డీఎస్పీ లేకపోవడంతో దీనిపై ఇక ఈ నెల 24న జిల్లా ఎస్పీ ఏర్పాటు చేసిన ప్రజలతో ముఖాముఖీలోనే తమ గోడు వెల్లబోస్తామని ఆవేదనతో వెనుదిరిగారు. కులంలో కలహాలకు మూలమిదీ.. రాజన్న సిరిసిల్ల ముస్తాబాద్ మండలం పొతుగల్‌లో 2016లో వరద కారణంగా చెరువు కట్ట తెగింది. ఈ క్రమంలో అక్కడ చెట్లు ఓ వ్యక్తి కొట్టుకోవడం చూసిన కొందరు ఒక వర్గానికి చెందిన కులస్తులు అవి అందరికీ చెందినవని దానిని ఒక వ్యక్తి ఎలా కొట్టుకెళ్తాడన్న విమర్శలు చేశారు. దీంతో సంఘంలో పెద్దమనిషి జంగం బూమ్‌రాపుకు, కులస్తులు కలిసి అతనిని అందరి సమక్షలో చెట్లను కొట్టిన విషయమై ప్రశ్నించారు. ఇదే క్రమంలో కులంలో సదరు వ్యక్తి దురుసుగా, దుర్భాషలాడడంతోపాటు పెద్దమనిషిని కొట్టేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పెద్దమనిషి అతనిపై రాయిని విసిరినట్లు బాధిత కుటుంబాలు వెల్లడించాయి. దీం తో భూంరాజుపై కేసు నమోదు జరిగి నేటికీ కోర్టుకు హాజరవుతున్నట్లు కులస్తులు తెలి పారు. ఇదే విషయాన్ని మనసుల్లో పెట్టుకున్న కొందరు కులపెద్దగా ఉన్న అతనిపై వారి సన్నిహితులతో ఎవరూ సుఖ సంతోషాలతో పాలుపంచుకోకూడదని అదే కులంలోని కొందరు హెచ్చరించినట్లు ఆవేదనగా ప్రస్తుతం బహిష్కరణ, జరిమానా చెల్లించిన కుటుంబీకులు వెల్లడిస్తున్నారు. భార్యను చూడ్డానికి వస్తే జరిమానా నా భార్యకు ఇటీవల గర్భసంచి ఆపరేషన్ జరిగింది. ఈ విషయం తెలిసి నా అత్తవాళ్లు వస్తే వాళ్లకు సంఘంలో జరిమానా వేశారు. దీంతో ఇక మా అత్తవాళ్లు రావడం లేదు. నా బిడ్డనే నా భార్యకు సేవలు చేస్తోంది. ఉన్న ఊళ్లో మాకు మా సంఘంలో జరిమానా వేయ డంఏంది. కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నారు. – కొప్పు ప్రభాకర్, బాధిత సంఘ సభ్యుడు, పోత్గల్ అల్లుడితో మాట్లాడితే జరిమానా వేశారు నాకు అన్నీ మా అల్లుడి వాళ్లే చూసుకుంటరు. నాకు చేయి విరిగితే అన్ని తానై చూసిండు. ఇప్పుడు సంఘం రెండుగా మారడంతో ఒక దానిలో నా చిట్టీ ఉంది. మరో దానిలో అల్లుడు ఉన్నడు. మొన్న మాట్లాడినందుకు నాకు జరిమానా అన్నరు. ఎందుకు కట్టాలి జరిమానా. అందరూ కలిసి ఉండాలనే చెప్పిన. – యెంకవ్వ, పోత్గల్, ముస్తాబాద్ అధికారులను కలిశాం చెట్లు కొట్టిన విషయంలో సంఘంలో అందరి సమక్షంలోనే నేను రాయితో కొట్టిన ఘటనలో నాపై కేసు నడుస్తోంది. నేను చట్టంలో తప్పు తేలితే శిక్ష అనభవిస్తా. నాతోపాటు మరికొంత మందిని సంఘం నుంచి తీసేయడం సరికాదు. అధికారులు చర్యలు తీసుకోవాలి. దీనిపై ఇప్ప టికే పలుమార్లు పోలీస్ అధికారులను కలిశాం. ఎస్పీని కలవాలని ఆలోచనలో ఉన్నాం. – భూంరాజు, సంఘం పెద్ద మనిషి, పోత్గల్ -
సర్పంచ్ అయినా.. కుల వృత్తి వీడలే..
సాక్షి, కోటపల్లి(చెన్నూర్): ఏదైనా పదవి రాగానే కులవృత్తిని పక్కనబెట్టివారిని చూస్తున్నాం.. పదవి పోగానే అయిష్టంగానైనా.. మళ్లీ తమ వృత్తిని కొనసాగించేవారిని చూశాం. కానీ.. ఈయన మాత్రం ఓ గ్రామానికి సర్పంచ్ అయినా కులవృత్తిపై మాత్రం మమకారం వీడలేదు. ఉదయాన్నే లేవగానే ఎప్పటిలాగే ప్రజలకు క్షౌ వరం.. షేవింగ్ చేస్తున్నాడు. ఎలాంటి మొహమాటం లేకుండా తన పనిని సాఫీగా చేసుకుంటూపోతున్నాడు కోటపల్లి మండలం లింగన్నపేట పంచాయతీ సర్పంచ్ దాగామ రాజు. రాజు ఇటీవల ఎన్నికల్లో సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. అంతకుముందు ఎల తన కులవృత్తి చేసుకున్నారో.. ఇప్పుడూ అలాగే తన కులవృత్తిని వదలకుండా గ్రామంలోని చిన్నాపెద్దా తేడా లేకుండా క్షౌవరాలు చేస్తున్నాడు. రాజును చూసి ప్రజలు ‘ఆదర్శంగా నిలుస్తున్నారు..’ అంటూ కితాబునిస్తున్నారు. -
మున్సిపల్ రిజర్వేషన్లపైనే ..అందరి దృష్టి!
సాక్షి, నల్లగొండ: మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కోసం చేపట్టిన వార్డుల పునర్విభజన, సామాజిక వర్గాల వారీగా ఓటర్ల గణనతో పాటు వార్డు ఓటరు జాబితా ముసాయిదా సైతం పూర్తి కావడంతో ఇక అందరి దృష్టి వార్డుల రిజర్వేషన్లపై పడింది. ఏ వార్డు ఏ సామాజిక వర్గానికి రిజర్వు అవుతుందో అన్న ఉత్కంఠతో ఆశావహులు ఎదురు చూస్తున్నారు. తాజా మాజీ కౌన్సిలర్లతోపాటు ఈసారి పోటీ చేసి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్న వారు సైతం అనుకూల రిజర్వేషన్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో నిలబడి సత్తా చాటాలని భావిస్తున్న ఆశావహులు తాము పోటీ చేద్దామనుకుంటున్న వార్డులు తమకు అనుకూల రిజర్వేషన్ వస్తుందా, లేక ఇతర సామాజిక వర్గాల వారీకి రిజర్వు అవుతుందా అన్న అంచనాల్లో మునిగిపోయారు. నల్లగొండ మున్సిపాలిటీ 40 వార్డుల నుంచి 48 వార్డులకు పెరిగింది. పట్టణంలో 1,24,117 మంది ఓటర్లు ఉన్నారు. వార్డుల వారీగా ఓటర్లను పరిగణనలోకి తీసుకుంటారు. ఆయా సామాజిక వర్గాలకు చెందిన ఓటర్ల సంఖ్య ప్రకారం వార్డు రిజర్వేషన్లు ఖరారు అవుతాయి. 24 వార్డులు జనరల్..! నల్లగొండ మున్సిపాలిటీలో 48 వార్డులు ఉన్నందున 24 వార్డులు జనరల్ కేటగిరీలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఏ సామాజిక వర్గం జనాభా ఎంత ఉన్నా రిజర్వేషన్లు 50 శాతం మించవద్దని ఉన్న సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో 24 వార్డులు మాత్రం వివిధ సామాజిక వర్గాలకు రిజర్వు అవుతాయి. పట్టణంలో తక్కువ సంఖ్యలోనే దాదాపు 1400 వరకు గిరిజన ఓటర్లు ఉన్నందున వారికి ఒక వార్డు రిజర్వు కానుంది. 48 వార్డులలో 24 జనరల్, ఒకటి ఎస్టీలకు రిజర్వు కానుండగా ఇంకా 23 వార్డుల ఉంటాయి. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ 23 వార్డులలో 7 వార్డులు ఎస్సీ సామాజిక వర్గానికి రిజర్వు అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మిగిలిన 16 వార్డులు బీసీ సామాజిక వర్గాలకు రిజర్వు అవుతాయని అంచనా వేస్తున్నారు. ఒక వేళ ఎస్సీలకు 1 వార్డు పెరిగి 8 అయితే బీసీలకు 1 వార్డు తగ్గి 15 వార్డులు రిజర్వు అయ్యే అవకాశం ఉంది. ఎస్సీ, బీసీలకు కేటాయించే వార్డుల్లో ఒకటి అటు, ఇటు అయినా.. దాదాపు ఈ సంఖ్య ప్రకారమే వార్డుల రిజర్వేషన్ పూర్తయ్యే పరిస్థితి కనిపిస్తోంది. భారీగా పెరిగిన బీసీ ఓటర్లు 2014 మున్సిపల్ ఎన్నికలతో పోలిస్తే.. ఈ సారి పట్టణంలో బీసీ ఓటర్ల సంఖ్య ఎక్కువగా పెరిగింది. ముస్లిం ఓటర్లను ఎక్కువ సంఖ్యలో బీసీ సామాజిక వర్గంలో కలపడంతోనే బీసీ ఓటర్లు ఎక్కువగా పెరిగాయని అంటున్నారు. దీంతో పట్టణంలో ఓసీ ఓటర్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఇటీవల పెరిగిన ఓటర్ల ప్రకారం ప్రస్తుతం మున్సిపాలిటీలో సుమారుగా ఓసీ ఓటర్లు 27 వేలు, బీసీ ఓటర్లు 77,350, ఎస్సీ ఓటర్లు 18,750, ఎస్టీ ఓటర్లు 1450 మంది ఉన్నట్లు సమాచారం. -
ఇలా చేసిన అత్తను చూశారా?
ఆడదంటే ఆడదానికి శత్రువు కాదని అత్త గుండెలో కూడా అమ్మ ఉన్నదన్నాడో సినీకవి. చంపాబాయీ అనే మహిళ ఈ మాటలను అక్షరాలా నిజం చేసి చూపించింది. భర్తను కోల్పోయిన తన కోడలికి తానే తల్లిగా మారి రెండోపెళ్లి చేసి మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.ఛత్తీస్‌గఢ్‌లోని హీరాపూర్‌కు చెందిన చంపాబాయీకి చిన్నతనంలోనే పెళ్లైంది. ఓ కొడుకు పుట్టిన కొన్నేళ్ల తర్వాత ఆమె భర్తను కోల్పోయింది. ఇక అప్పటినుంచి కొడుకే లోకంగా బతుకుతూ అతడిని పెంచి పెద్ద చేసింది. ఓ మంచి ముహూర్తం చూసి కొడుకు పెళ్లి జరిపించింది. తన కష్టాలు తీరినట్టేనని, కొడుకు, కోడలు, రాబోయే మనవలతో సంతోషంగా జీవితాన్ని గడపవచ్చని ఆశపడింది. కానీ దురదృష్టం.. ఒక్కగానొక్క కొడుకు రెండేళ్ల క్రితం హఠాన్మరణం చెందడంతో ఆమె ఆశలన్నీ అడియాసలయ్యాయి. అమ్మ మనసు.. అర్థం చేసుకున్న కోడలు ఓ పెళ్లివేడుకలో చోటుచేసుకున్న ప్రమాదంలో చంపాబాయి కొడుకు డోమేంద్ర సాహు తీవ్ర గాయాల పాలయ్యాడు. ఆస్పత్రికి తీసుకువెళ్లేలోపే అతడు మరణించడంతో తన కోడలి జీవితం ఒక్కసారిగా తలకిందులైనట్లుగా చంపాబాయి భావించింది. జీవితభాగస్వామిని కోల్పోయిన స్త్రీగా సమాజంలో తానెలా బతికిందీ ఒంటరి తల్లిగా కొడుకును పెంచేందుకు పడిన కష్టాలు ఒక్కసారిగా ఆమె కళ్ల ముందు కదలాడాయి. అన్నింటికంటే... చిన్నతనంలోనే భర్తను కోల్పోయిన కోడలు ఙ్ఞానేశ్వరి పరిస్థితి ఏమవుతుందోనన్న వేదనే చంపాబాయి మనసును కలచివేసింది. తాను పడిన కష్టాలు కోడలు పడకకూడదనే ఆమెకు మళ్లీ పెళ్లి చేయాలని నిశ్చయించుకుంది.అయితే హీరాపూర్ ప్రజలకు చంపాబాయి తీసుకున్న నిర్ణయం అంతగా నచ్చలేదు. ‘‘ఇలా చేయడం సంప్రదాయ విరుద్ధం.. అసలు నువ్విలాంటి ఆలోచన చేస్తావని అనుకోనేలేదు..’’ అంటూ ఈటెల్లాంటి మాటలతో ఆమెను ఉక్కిరిబిక్కిరి చేశారు. అయినప్పటికీ చంపాబాయి ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. కోడలి కోసం వరుడి వేట మొదలుపెట్టింది. తమ గ్రామానికి దగ్గర్లోనే ఉండే కమల్ సాహు అనే డివోర్సీతో కోడలి పెళ్లి ఖాయం చేసింది. అత్తగారు తన కోసం పడుతున్న తపన చూసిన ఙ్ఞానేశ్వరి ఆమె నిర్ణయాన్ని గౌరవించింది. భార్యతో విడిపోయినప్పటికీ.. ఇద్దరు ఆడపిల్లల బాధ్యతను తలకెత్తుకున్న కమల్ వ్యక్తిత్వానికి ముగ్ధురాలై.. అతడిని పెళ్లి చేసుకునేందుకు మనస్ఫూర్తిగా అంగీకారం తెలిపింది. ఈ క్రమంలో ఈనెల 24న కొంతమంది సన్నిహితుల సమక్షంలో నిరాడంబరంగా వారి పెళ్లి జరిగింది. కోడలు కాదు.. తను నా కూతురు.. కోడలు ఙ్ఞానేశ్వరికి రెండో పెళ్లి చేయడం గురించి చంపాబాయి మాట్లాడుతూ..‘మా ఇంట్లో అడుగు పెట్టిన నాటినుంచే కోడలిగా కాకుండా తనను కూతురిగా భావించాను. నా ఒక్కగానొక్క కొడుకు భార్య కాబట్టి వారిద్దరికీ నా ప్రేమను సమానంగా పంచాను. కానీ దురదృష్టవశాత్తూ 2017, ఏప్రిల్ 20న డోమేంద్ర మాకు శాశ్వతంగా దూరమయ్యాడు. ఆ బాధను మరచిపోయేందుకు నా కోడలికి ఏ లోటు రాకుండా చూసుకోవాలని నిర్ణయించుకున్నాను. భర్తను కోల్పోయిన స్త్రీగా ఎంత వేదన అనుభవించానో నాకు తెలుసు. ఙ్ఞానేశ్వరి జీవితంలో చోటుచేసుకున్న విషాదాన్ని తీర్చాలంటే పెళ్లి ఒక్కటే మార్గంగా తోచింది. అందుకే ఎవరేమనుకున్నా లెక్కచేయక ఆమెకు మళ్లీ పెళ్లి చేశాను’ అంటూ తల్లి మనసు చాటుకున్నారు. మా వియ్యంకురాలు బంగారం.. ‘మా వియ్యపురాలు ధైర్యం చేశారనే చెప్పాలి. ఆమె నా కూతురిని తన కూతురిలా భావించారు. తనకు రెండోపెళ్లి చేసి కొత్త జీవితాన్నిచ్చారు. వైధవ్యంలో మగ్గిపోకుండా తనను కాపాడారు. అందరూ మా వియ్యపురాలిలా ఆలోచిస్తే ఆడవాళ్ల పరిస్థితి మెరుగవుతుంది. స్త్రీ పునర్వివాహం నేరం కాదనే భావన సమాజంలో నాటుకుపోతుంది. ఇందుకు నా కూతురి పెళ్లి ఆదర్శంగా నిలుస్తుంది’ అంటూ ఙ్ఞానేశ్వరి తల్లి ఆనందభాష్పాలు పెట్టుకున్నారు. అవును... భార్య చనిపోయిన రెండో రోజే వధువు కోసం వెదికే భర్తలున్న ఈ సమాజం భర్త చనిపోయిన తర్వాత స్త్రీ జీవితం అక్కడితోనే ఆగిపోవాలని ఎన్నో ఆంక్షలు విధించింది.దక్షిణాదిన కందుకూరి వీరేశలింగం వంటి సంఘసంస్కర్తలు వీటన్నింటినీ అధిగమించి వితంతు పునర్వివాహాలు జరిపించినప్పటికీ ఉత్తరాది సమాజంలో చంపాబాయి లాంటి వాళ్లు అరుదుగానైనా కన్పిస్తుండటం ఊరట కలిగించే విషయమే కదా! – సుష్మారెడ్డి యాళ్ల, సాక్షి వెబ్‌డెస్క్ -
నిలబడే ఉన్నారా!?
ఒకసారి ప్రవక్త ముహమ్మద్ (స) ఏదో పని మీద బజార్ వెళుతున్నారు. అంతలో ఒక వ్యక్తి కనబడి, ‘ఓ ప్రవక్త (స) మీతో కాస్త పని ఉంది ఇక్కడే ఉండండి ఇప్పుడే వస్తాను’ అని వెళ్లాడు.‘‘అలాగే తొందరగా రా’’ అని ప్రవక్త అక్కడే నిలబడ్డారు.వెళ్ళిన వ్యక్తి ఆ విషయం మరచిపోయాడు.ఇచ్చిన మాట ప్రకారం ప్రవక్త (స) చాలా సేపు అలాగే నిరీక్షిస్తూ నిలబడ్డారు. చాలాసేపటికి మళ్ళీ ఆ వ్యక్తి అటుగా వచ్చి, ‘‘అయ్యో! మీరు ఇంకా ఇక్కడే నిలబడి ఉన్నారా? క్షమించండి. నేను ఈ విషయం మరిచే పోయాను’’‘‘ఇచ్చిన మాట తప్పితే శిక్ష ఏమిటో తెలుస్తే, నువ్వు కూడా ఎన్ని రోజులైనా ఇలాగే నిలబడి ఉంటావు తెలుసా?’’ అన్నారు. ‘‘మీరు చేసే అర్థం లేని ప్రమాణాలను గురించి అల్లాహ్ మిమ్మల్ని పట్టుకోడు. కాని మీరు బుద్ధిపూర్వకంగా చేసే ప్రమాణాలను గురించి ఆయన మిమ్మల్ని తప్పకుండా ప్రశ్నిస్తాడు. ప్రమాణ భంగానికి పరిహారం ఏమిటంటే మీరు మీ ఆలుబిడ్డలకు తినిపించే మామూలు భోజనం పదిమంది పేదలకు పెట్టడం లేదా వారికి కట్టుబట్టలు ఇవ్వడం లేదా ఒక బానిసను స్వతంత్రునిగా చెయ్యడం. ఈ స్తోమత లేనివారు మూడు రోజులపాటు ఉపవాసం ఉండాలి. మీరు ప్రమాణం చేసి భంగపరిస్తే, మీ ప్రమాణాలకు పరిహారం ఇది. మీరు మీ ప్రమాణాలను కాపాడుకోండి.’(ఖురాన్:5:89)మనిషి సంఘజీవి. సమాజంలో ఒకరిమీద మరొకరికి నమ్మకం లేకపోతే మనుషులు నమ్మకంతో సత్సంబంధాలు కలిగి జీవించడం కష్టం. అందుకే మాట ఇచ్చేముందు ఆలోచించి ఇవ్వాలని, వాగ్దానం చేసే ముందు ‘ఇన్షాల్లహ్’ అంటే అల్లాహ్ తలిస్తే అని అనాలని ప్రవక్త (స) తెలిపారు.నిజమే కదా. ఏ క్షణాన మృత్యువు కౌగిట్లోకి ఒదిగిపోతామో మనకు తెలియదు. మాట ఇచ్చి, నెరవేర్చకుండా మరణిస్తే? రేపు పరలోకంలో పట్టుబడిపోతాం. జవాబు దారితనాన్ని పటిష్టం చేసుకోవడానికే కదా ఈ రమజాన్‌లో కఠోర ఉపవాస దీక్ష పాటిస్తున్నాం. కనుక వాగ్దానం చేసి మరచిపోకుండా ఉండేందుకు కూడా ప్రయత్నం చేయాలి. –షేక్ అబ్దుల్ బాసిత్ -
రాహాబును ధన్యజీవిని చేసిన దేవుడు...
శారా, రేచెల్, రూతు, మేరీ, సలోమి... లాంటి బైబిల్ స్త్రీల పేర్లున్న వాళ్ళు మనకు కనిపిస్తారు కానీ రాహాబు అనే పేరు కూడా బైబిల్ స్త్రీదే అయినా ఆ పేరు మనకు వినిపించదు. ఎందుకంటె ఆమె యెరికో పట్టణానికి చెందిన ఒక వేశ్య. నిజమే, ఒక వేశ్య పేరు ఎవరు పెట్టుకుంటారు? సమాజం అత్యంత హీనమైన జాతికి చెందిన స్త్రీల జాబితాలో రాహాబును ఆమె వృత్తిని బట్టి చేర్చింది కాని యెరికోలో ఆమె చేసిన పరిచర్యను బట్టి, దేవుడామెను కొత్తనిబంధనలో అబ్రాహాము, నోవహు, ఇస్సాకు, యాకోబు, దావీదు వంటి మహా విశ్వాసవీరులతో సమానంగా వారి జాబితాలో చేర్చి అత్యున్నతమైన జాతికి చెందిన స్త్రీగా హెచ్చించాడు (హీబ్రు 11:31). ఇశ్రాయేలీయులైన ఇద్దరు విశ్వాసులు యెరికో పట్టణానికి వేగు చూసేందుకు వస్తే వారికి తన ఇంట్లో ఆశ్రయమిచ్చి, యెరికోపై విజయం సాధించడానికి అవసరమైన సమాచారాన్ని, స్ఫూర్తిని అందించి సహకరించింది రాహాబు. నిజానికి ఆ కాలంలో, శత్రువులైన వేగుల వాళ్ళపై ఒక కన్నేసి, వారి సమాచారాన్ని రాజుగారికి అందిస్తూ వారిని అప్పగించే నియమం వేశ్యలకుండేది. అందుకు వారికి బోలెడు బహుమతులు, నగదు దొరికేది.. అందువల్ల రాహాబు ఎదుట ఆనాడు రెండు మార్గాలున్నాయి. ఆ ఇద్దరు వేగులనీ యెరికో రాజుకు అప్పగించి ఆర్థికంగా లాభపడి, రాజుగారి చేత ’శభాష్’ అనిపించుకోవడం మొదటిదైతే, వారిని దాచిపెట్టి, కాపాడి, వారికవసరమైన సమాచారాన్నిచ్చి, రాబోయే ఇశ్రాయేలీయుల దండయాత్రలో మృత్యువాత పడకుండా తనను, తన వారిని కాపాడుకోవడమనేది రెండవమార్గం. లోకపరంగా ఆలోచిస్తే మొదటిమార్గంలో బోలెడులాభముంటే, రెండో మార్గంలో బోలెడు నష్టముంది, పైగా ప్రాణహాని కూడా ఉంది. వేగులవాళ్ళు తన ఆతిథ్యం పొంది వెళ్లారన్న విషయం తెలిసిన మరుక్షణం యెరికో రాజు తనకు మరణశిక్ష విధించే ప్రమాదం ఎంతో ఉంది. ఆమె స్థానంలో ఉంటే మనమేం చేస్తాం? డబ్బుకోసం కాకపోయినా, ప్రాణగండం నుండి తప్పించుకునేందుకైనా, నా ఓటు రాజుగారికే అంటాం. దేవుని కోసం, ఎప్పుడో ఎవరో మన పట్టణాన్ని గెలిచినప్పుడు. వాళ్ళు మనల్ని చంపకుండా ఉండేందుకు, ఇప్పుడు ప్రాణాలకు ‘రిస్కు’ తెచ్చుకోవడం అవివేకమనుకుంటాం. దేవుని పనిని గాలికొదిలేసి, చేతికందిన అవకాశాన్ని వాడుకొని, అందినంత సంపాదించి మనల్ని మించిన తెలివైన వారు లేరనుకుంటాం.ఏది చేపట్టినా ఇందులో మనకెంత లాభం? అని మాత్రమే ఆలోచించే సమాజంలో, ప్రాణాలకు ముప్పు తెచ్చుకొని మరీ వేగులవాళ్ళను కాపాడి యెరికో జైత్రయాత్రలో తనదంటూ ఒక పరోక్ష పాత్రను పోషించాలన్న నిర్ణయం తీసుకున్న రాహాబు లాంటి వాళ్ళు పిచ్చివాళ్ళు, నష్టజాతకులు, తెలివితక్కువదద్దమ్మలే!!! జీవితమంతా అప్రతిష్టతో వేశ్యగా బతికిన రాహాబు ముంగిటికి దేవుడొక జీవితకాలపు సువర్ణావకాశాన్ని ఆనాడు తెచ్చిపెట్టాడు. రాహాబు ఆ అవకాశాన్ని రెండు చేతులతో ఒడిసిపట్టుకుని, జీవితమంతా తాను అపవాది గుప్పిట్లో బతికినా, ఇకనుండైనా దేవుని పక్షంగా ఆయన ప్రియమైన కుమార్తెగా బతుకుతానని నిర్ణయించుకొని ధైర్యంగా ముందుకు సాగి జీవన సాఫల్యాన్ని పొందింది. అలా తననీ, తన కుటుంబాన్నీ దేవుని కృపావలయంలో నిలబెట్టి ఆశీర్వాదాలు పొందింది. చివరికి తన వంశావళిలోనే దేవుడామెను చేర్చాడంటే, ఆమెను, ఆమె పరిచర్యను ఎంతగా ప్రేమించాడో మనం అర్థం చేసుకోవచ్చు. దేవుని పిల్లలమని చెప్పుకొంటూ ఒక్కరోజైనా, ఒక్కటైనా దేవుణ్ణి ప్రసన్నపర్చే పనిచెయ్యకుండా, దేవునిపక్షం వహించకుండా తటస్థంగా, నామకార్థంగా బతకడంకన్నా, రాహాబులాగా ప్రాణాలకు తెగించి ఒక్కరోజైనా దేవుని పక్షంగా నిలబడటం ఎంత మహా భాగ్యమో తెలిపే గొప్ప ఉదంతమిది. క్రియలులేని విశ్వాసం మృతమని బైబిల్ స్పష్టంగా చెబుతూ ఉంటే, కేవలం చర్చలు, ప్రసంగాలు, ప్రగల్భాలు, సిద్ధాంతాలు, కొత్తభాష్యాలు, వివరణలతో పరలోకానికి వెళ్లిపోదామనుకోవడం కేవలం ఒక భ్రమ. కాణీ ఖర్చు, రవ్వంత ‘రిస్కు’ లేకుండా దేవునిసేవ ‘బహు గొప్పగా’ చేసి, పరలోకంలో ప్రథమ స్థానాన్ని కొట్టేయాలన్నది చాలామంది ప్రయాస. రాహాబునే రక్షించిన దేవుడు నన్ను రక్షించడా? అనుకోకుండా. నన్నే రక్షించిన దేవుడు రాహాబును రక్షించడా? అనుకునే తగ్గింపుతో కూడిన జీవిత విధానం మాత్రమే మనల్ని దేవుని సర్వసత్యానికి దగ్గరగా తీసుకెళ్తుంది, అంటే రాహాబులాంటి పాపిని నేను కాదని అతిశయించడం కాదు, నావంటి పాపి ఈ లోకంలోనే లేడు అనుకోవడం వల్ల పరలోకం మనకు మరింత దగ్గరవుతుంది. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
గజల్ గమనం
నేలతల్లి ఒడిలో ‘సాగు’ సమయాన కాయకష్టాన్ని మరపించేందుకు అమ్మ పాడిన ముడుపుపాటలే అతనికి ఊపిరి పోసాయి. నాన్న భజన పాటల ఆలంబనలో పాటగాడ్ని చేశాయి.సరదాగా తీసే కూని రాగం జానపదాల వైపు నడిపించింది. ఓ చిన్ని ఆలాపనే అతనిని గాయకుణ్ణి చేసింది. నడకతో ఎన్నో నేర్చుకుని.. ప్రకృతిని తన పాటలో కలుపుకునిఅందంగా వినిపిస్తూ పదేళ్లుగా అతని పాటల ప్రస్థానం సాగుతోంది. దేశభక్తి గీతాలు,సామాజిక గేయాలు, జానపదాలు, గజల్స్ అతని గానంలో భాగమయ్యాయి. అమ్మానాన్నలే గురువులుగా.. పాట, మాట, గేయం, గజల్ ఏదైనా విని నేర్చుకున్న ఆ యువకుడు గజల్‌నే తన ఇంటిపేరుగా మార్చుకుని గజల్ వినోద్‌గా గుర్తింపు పొందాడు. అతని గజల్ సవ్వడుల ప్రస్థానం అతని మాటల్లోనే.. అమ్మానాన్నలే నా గురువులు విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం నా జన్మ స్థలం. నా భార్య స్రవంతి. అమ్మ గేదెల చింతల్లి, నాన్న గేదెల దుర్గారావు, అన్నయ్య, తమ్ముడు ఉన్న మాది రైతు కుటుంబం. అమ్మ పొలం పనులకు వెళుతుండేవారు. ఆమె జానపదాలు పాడుతుంటే విని నాకూ వాటిపై ఇష్టం ఏర్పడింది. నాన్న భజన పాటలు పాడుతుంటే చూసి లయబద్ధంగా పాటలు పాడటం నేర్చుకున్నాను. సాహిత్యంలో గంటేడ గౌరీ నాయుడు, డాక్టర్ సినారె, సిరివెన్నెల, గోరేటి వెంకన్న, వంగపండు వంటి మహనీయులకు నేను ఏకలవ్య శిష్యుడిని. ఎం.ఏ తెలుగు, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పూర్తి చేశాను. గజల్స్ పాడుతూ సమాజ చైతన్యానికి నా వంతు కృషి చేస్తున్నాను.సరదాగా పాడుతున్న నన్ను కె. ఎస్. జన కళ్యాణ సమాఖ్య స్వచ్ఛంద సేవా సంస్థ వారు గుర్తించారు. ఆదరించారు. నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. డాక్టర్ వంశీ సహకారంతో ఫ్లాష్ టీమ్ ఏలూరు వారికి నేను పరిచయం అయ్యాను. దీంతో ఉత్తరాంధ్రకే పరిమితమైన నా పాట ఉభయ గోదావరి జిల్లాలను దాటుతూ రాష్ట్రమంతా పలికింది. మల్లం మహేష్ కళారత్న వారి ప్రోత్సాహంతో రవీంద్రభారతిలో నా పదేళ్ల ప్రస్థానం వేడుక జరుపుకోవడం జరిగింది. యూ ట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్ లాంటి సామాజిక మాధ్యమాల్లో కోట్లాది మందికి నేను దగ్గరయ్యాను. అందరూ నన్ను గుర్తించి పలకరించి ప్రోత్సహించడం.. ఇలా ఎన్నో మంచి మంచి అనుభవాల సాధనతో నా పదేళ్ల ప్రస్థానం పూర్తయింది. తోటికళాకారులతో సరదాగా ఉంటాను. అందుకే అందరూ ఇష్టపడతారు. గౌరవిస్తారు. ప్రపంచమంతా నా గజల్స్ వినిపిస్తాను తెనాలి స్వచ్ఛంద సేవా సంస్థ వారు గజల్ గాన కోయిల బిరుదును ఇచ్చి ప్రోత్సహించింది. రెండుసార్లు అమెరికా వెళ్లే అవకాశం వచ్చినా వీసా సమస్యల కారణంగా వెళ్ళలేకపోయాను. ఎప్పటికైనా ప్రపంచమంతా నా గజల్స్ వినిపిస్తాను. రెండుసార్లు జానపద గీతాలలో రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతి పొందాను. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య చేతుల మీదుగా జాతీయ పురస్కారం అందుకున్నాను. రవీంద్రభారతిలో సన్మానం మరువలేనిది. ఐ.ఎ.ఎస్‌ల చేతుల మీదుగా, యూత్ ఎక్స్‌లెన్స్ అవార్డులను అందుకున్నాను. మన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఒరిస్సా, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు వంటి ప్రాంతాలలో ఎన్నో ప్రదర్శనలు ఇవ్వగలిగాను. మార్పు రావాలి నేను స్వయంగా కొన్ని పుస్తకాలు రాసాను. కొన్ని ఆల్బమ్స్ కూడా రిలీజ్ చేశాను. వాటికి మంచి స్పందన వచ్చింది. కళాకారునిగా ఈ సమాజం నన్ను గుర్తించింది. మంచిని పంచే బాధ్యతను అప్పగించింది. అయితే దురదృష్టవశాత్తూ ఈ సమాజంలో కళ అంటే గౌరవం ఉంది. కళాకారుడు అంటే చిన్న చూపు ఉంది. కొందరి తప్పిదాలు అందుకు కారణం కావచ్చు. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. బోణం గణేష్, సాక్షి, విజయనగరం ఫొటో: డి.సత్యనారాయణమూర్తి పేరు తెచ్చిన పాటలు నేను పాడిన వాటిలో ‘నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో’ అంటూ బాల కార్మిక గీతం. ఇది ఊరేనా.. నే నడిచిన నేలేలా అన్న పల్లె పాట.. కమ్మనైన అమ్మ పాట అంటే ఎంతో మధురము వంటి పాటలు నాకు ఎంతో పేరు తీసుకుని వచ్చాయి. గజల్స్ పాడటం వలన గజల్ వినోద్ గా ప్రసార మాధ్యమాలు నన్ను చూపించాయి. నా వంతుగా సమాజాన్ని చైతన్యం చేసే చాలా పాటలు పాడాను, రాసాను. విద్యార్థులను, మహిళలను, రైతులను, చైతన్యం చేస్తున్నాను. నాపైనా, కళలపైనా అందరి ఆశీర్వాదం ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. -
నిర్భయ భారత్
సమాజం.. మహిళను తన బతుకు తనను బతకనివ్వదా?ముఖ్యంగా మగ సమాజం కళ్లు ఆడవాళ్ల మీదనే ఉంటాయా?ఆడవాళ్లు.. కాకపోతే...ఆ డేగ కళ్లు పసిపిల్లల మీద!!‘అమ్మాయిని భద్రంగా పెంచుకోవాలి... అబ్బాయిని బాధ్యతగా పెంచాలి’.అమ్మానాన్నలు. ఈ నినాదాన్ని ఒంటపట్టించుని ఉంటే...‘అత్యాచార రహిత భారత్’ అనే నినాదం పుట్టాల్సిన అవసరమే ఉండేది కాదు. మరేమిటి పరిష్కారం? ఉద్యమించక తప్పదా?!అవును.. ఉద్యమించకపోతే... మహిళకు జీవితం ఉండని సమాజంలో..ఉద్యమించకపోతే...పిల్లలకు భవిష్యత్తు మిగలని సమాజంలో..ఊపిరిపోసుకున్న మరో ఉద్యమమే‘రేప్ ఫ్రీ ఇండియా’. అత్యాచార రహిత భారతదేశం, అత్యాచార ముక్త్ భారత్... భాష ఏదైనా నినాదం ఏదైనా భావం ఒక్కటే. అత్యాచారాలు లేని భారతదేశ నిర్మాణం జరగాలి. అత్యాచారాలు జరుగుతున్నాయని ఆవేదన చెందడం కాదు మేధావులు చేయాల్సింది. అత్యాచార బాధితులు న్యాయం కోసం పోరాటం చేయడానికి వెసులుబాటు కల్పించడం కాదు ప్రభుత్వం చేయాల్సింది. ఇంకా విస్తృతంగా చర్చించాలి, ఇంకొంత తీక్షణంగా చర్యలు తీసుకోవాలి. మెదడుకు పట్టిన మకిలిని వదిలించే స్వచ్ఛ భారత్ చేపట్టాలి. సత్యార్థి ఫౌండేషన్ చేపట్టిన స్వచ్ఛభారత ఉద్యమమే అత్యాచార రహిత భారత్. ఈ లక్ష్యాన్ని సాధించడానికి దేశంలోని ప్రతిరాష్ట్రం నుంచి భావసారూప్యం కలిగిన సామాజిక కార్యకర్తలు కలిసి ఉద్యమిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి గొంతు కలుపుతున్న వారిలో మమతా రఘువీర్ ఉన్నారు. ఆమె ‘తరుణి’ స్వచ్ఛంద సంస్థను స్థాపించి బాల్య వివాహాలను అరికడుతున్నారు. ప్రస్తుతం నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి స్థాపించిన సత్యార్థి ఫౌండేషన్‌తో కలిసి అత్యాచార రహిత సమాజం కోసం కృషిచేస్తున్నారు. పిల్లలు దేశ సంపద ‘‘పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. బాల్యం పువ్వులాంటిది. రెక్కలు రాలిపోకుండా అందంగా విచ్చుకుంటేనే వికాసం. అది పువ్వైనా, బాల్యమైనా. పిల్లలను నిర్లక్ష్యం చేస్తే ఆ నష్టం తల్లిదండ్రులకు, ఆ పిల్లల భవిష్యత్తుకు మాత్రమే కాదు. అసలైన నష్టం దేశానిది. బాల్యాన్ని చిదిమేస్తే ఆ పీడన వాళ్లను వెంటాడుతూనే ఉంటుంది. పెద్దయిన తర్వాత కూడా వాళ్ల వ్యక్తిత్వం ఆరోగ్యకరంగా విచ్చుకోదు. వ్యక్తిత్వలోపం ఉన్న సమాజంతో దేశం అభివృద్ధి చెందదు. అందుకే పిల్లల్ని కాపాడుకోవడం అమ్మానాన్నల బాధ్యత మాత్రమే కాదు దేశం బాధ్యత కూడా’’ అన్నారు మమతా రఘువీర్. మనిషి మారాలి ‘‘మేము డీల్ చేసిన కేసులు కొన్ని హృదయవిదారకంగా ఉన్నాయి. ఓ కుటుంబం తిరుమల దర్శనానికి వెళ్లి తిరిగి వస్తోంది. అందరూ తిరుపతిలో రైలెక్కారు. ఎనిమిదేళ్ల పాప బాత్రూమ్కి వెళ్లాలని అడిగింది. పెద్దవాళ్లెవరూ తోడు వెళ్లకుండా పాపను పంపించారు. బాత్రూమ్లో పాప మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడో దుండగుడు. పాప అరుపు ఎవరికీ వినిపించలేదు. ఎంతటి దారుణం అంటే.. పాప పేగులు బయటికొచ్చేశాయి. ఆ తర్వాత రెండేళ్ల వరకు కూడా ఆ పాపకు ఆపరేషన్లు జరుగుతూనే ఉన్నాయి. ఓ తొమ్మిదేళ్ల కుర్రాడు ఇళ్ల మధ్యలోనే అబ్యూజ్‌కు గురయ్యాడు. అతడు తండ్రితోపాటు ఉదయాన్నే పాల ప్యాకెట్లు వేస్తుంటాడు. అపార్ట్మెంట్లో తండ్రి ఒక వరుసలో పాలు వేస్తూ కొడుకుని మరో వరుసలో వేయమని పంపించాడు. ఓ మధ్యవయస్కుడు ఆ కుర్రాడిని ఇంట్లోకి లాగి తలుపేసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ కుర్రాడు ఏడాదిపాటు సెకండరీ ఇన్ఫెక్షన్తో బాధపడ్డాడు. ఇదంతా ఒక ఎత్తయితే అఘాయిత్యానికి గురైన బాధితులకు ఐడెంటిఫికేషన్ పెరేడ్ మరో నరకం. ఒక పాపకయితే మతి చలించినంత పనైంది. ‘ఆ అంకులే అలా చేసింది’ అనే ఒక్క మాట తప్ప మరో మాట మాట్లాడేది కాదు. ఆ బిడ్డను మామూలు స్థితికి తీసుకురావడం ఎలాగో తెలియక ఆ తల్లిదండ్రులు పడిన వేదనను వర్ణించడానికి మాటలుండవు. మరీ చిన్న పిల్లల్లో ఇలా ఉంటే.. టీనేజ్‌లో ఉన్న ఓ అమ్మాయి అబ్యూజ్‌కు గురైన తర్వాత తన దేహాన్ని తాను అసహ్యించుకుంటూ ఆత్మహత్య చేసుకుంది. ఇలాంటివి తెలిసినప్పుడు సమాజం మారాలి... అని చాలా సింపుల్‌గా అనేస్తుంటారు. కానీ నిజానికి మారాల్సింది మనిషి. విచక్షణగల దేశాలు లైంగిక వాంఛలు తీర్చుకోవడానికి పిల్లల్ని పావులుగా వాడుకోవాలనే ఆలోచన రావడమే పెద్ద మానసిక లోపం. యూరోపియన్ దేశాల్లో ఈ విషయంలో చాలా పరిణతి కనిపిస్తుంది. తమలో అలాంటి ఆలోచనలు కలుగుతుంటే అది మానసిక లోపమని గుర్తిస్తారు. వెంటనే కౌన్సెలింగ్‌కు వెళ్తారు. తమలో ఇటువంటి మానసికలోపం ఉన్నట్లు గుర్తించిన వాళ్లను స్వచ్ఛందంగా పేరు నమోదు చేసుకోవలసిందిగా పిలుపునిచ్చినప్పుడు ఏడాదికి 250 మంది రిజిస్టర్ చేసుకున్నారు. మనిషి తనను తాను సంస్కరించుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. అంతే తప్ప తమ ఆలోచనలను దాచిపెట్టుకుని పెద్దమనిషి ముసుగు వేసుకుని సమాజంలో గౌరవంగా చెలామణి అవుతూ, అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండి, నిస్సహాయులు దొరకగానే రాక్షసత్వానికి పాల్పడడం వంటి అవాంఛిత ధోరణులు పాశ్చాత్య దేశాల్లో దాదాపుగా కనిపించవు. మహిళలు, పిల్లలు వస్తువులు కాదు, వాళ్లూ మనుషులే అనే సత్యాన్ని గ్రహించగలిగితే మనిషి తనంతట తానే సంస్కరణ చెందుతాడు. ఆ రకంగా సమాజాన్ని సెన్సిటైజ్ చేయడం కోసమే ‘రేప్ ఫ్రీ ఇండియా’ ఉద్యమం. ఈ ఉద్యమం గత నెలలో మొదలైంది. ఐదో తరగతిలో భార్య.. ఏడో తరగతిలో భర్త..! నేను సోషల్ యాక్టివిస్టుగా మారడానికి వేదిక వరంగల్‌లో నివసించడమే. రఘువీర్‌కి హన్మకొండ పోస్టింగ్ వచ్చింది. మేము అక్కడ ఉన్నప్పుడు మహిళా సమతా సొసైటీతో పనిచేశాను. నేను పెరిగిన వాతావరణానికి అక్కడి సామాజిక పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉండేవి. స్కూలు పిల్లల్లో భార్యాభర్తలు కనిపించేవారు. హెల్త్ అవేర్నెస్ పట్ల ఆడపిల్లలను చైతన్యవంతం చేయడానికి ఓ స్కూలుకి వెళ్లినప్పుడు ఐదో తరగతిలో ఉన్న అమ్మాయి మెడలో పుస్తెలు, కాళ్లకు మట్టెలు చూసి ఆశ్చర్యపోయాను. అదేమని అడిగితే తనకు పెళ్లయిందని భర్త అదే స్కూల్లో ఏడో తరగతిలో ఉన్నాడని చెప్పింది. మరికొందరమ్మాయిల విషయంలో అమ్మాయికి పదేళ్లుంటే భర్తకు పాతికేళ్లుంటాయి. అతడు ఎక్కడో ఉద్యోగమో, వ్యవసాయమో చేస్తూ ఉంటాడు. ఈ అమ్మాయిని స్కూలుకి పంపించేది కూడా మెచ్యూర్ అయ్యే వరకే. ఆ తర్వాత అత్తగారింటికి పంపేస్తారు. ఒక అమ్మాయికైతే పెళ్లి పీటల మీద కూర్చోక పోతే, ఐస్‌క్రీమ్ ఇచ్చి కూర్చోబెట్టి పెళ్లి చేశారు. 1929లో బాల్య వివాహ నిరోధక చట్టం వచ్చింది. మనదేశంలోని సామాజిక పరిస్థితులను గమనించిన బ్రిటిష్ పాలకులు ఈ రుగ్మతను నివారించడానికి చట్టాన్ని తెచ్చారు. కానీ అలాంటి చట్టం ఒకటుందనే ఆలోచనే లేదక్కడ. టీచర్లను అడిగితే ‘ఇక్కడిది మామూలే’ అనేశారు. మనం చేయగలిగిందేమీ లేదనే నిస్పృహ వాళ్ల మాటల్లో! దేహారోగ్యం గురించి చైతన్యవంతం చేయడం కాదు మానసిక ఆరోగ్యం కోసం పని చేయాల్సింది చాలా ఉందనిపించింది. ‘తరుణి’ స్వచ్ఛంద సంస్థ స్థాపించి బాల్య వివాహాలను నివారించడానికి పని చేశాను. మూడు నెలలు ప్రచారం వరంగల్ జిల్లా అంతటా పర్యటించి సర్వే చేశాం. బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్న 82 గ్రామాలను గుర్తించి కళాజాతలతో ప్రచారం చేశాం. బాల్య వివాహాల నివారణ గురించి ఆడపిల్లలకు శిక్షణ ఇచ్చి వాళ్ల చేతనే గ్రామసభల్లో మాట్లాడించాం. ఆ జిల్లాలో అప్పుడు నలభై పెళ్లిళ్లు ఆపగలిగాం. అయితే తదనంతర పరిణామాలు కొన్ని చూసిన తరవాత పీటల మీద పెళ్లిళ్లు ఆపడం వల్ల ఉపయోగం ఉండదని తెలిసింది. అప్పటికే డబ్బు ఖర్చయి ఉంటుంది. పెళ్లి కోసం అప్పు తెచ్చి ఉంటారు. పైగా పీటల మీద పెళ్లి ఆగిపోతే మళ్లీ పెళ్లయ్యేదెలా అనే ఆందోళన ఒకటి. దాంతో పెళ్లిని ఆ క్షణానికి ఆపేసి మేమటు వెళ్లగానే ఏ గుళ్లోనో రహస్యంగా మూడుముళ్లు వేయించేసే వాళ్లు. ఆ తర్వాత ఓ నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ముందుగా సమాచారం అందుకుని వెళ్లి, పెళ్లి కుదురుతున్న దశలోనే కౌన్సెలింగ్ ఇచ్చే వాళ్లం. ఖాతరు చేయకుండా పెళ్లి చేస్తే కేసవుతుందని కూడా హెచ్చరించేవాళ్లం. అలా ఓ అరవై పెళ్లిళ్ల వరకు ఆపేసి ఆ అమ్మాయిలను మళ్లీ చదువులకు పంపించగలిగాం. అయినప్పటికీ కొంతమంది పెళ్లి చేసేవాళ్లు. అలా జరిగిన పెళ్లిళ్ల విషయంలో 56 కేసులు వేశాం. ఒక్కో కేసులో ఆ పెళ్లి జరిపించిన పురోహితుడి నుంచి గ్రామ ప్రతినిధి వరకు దాదాపుగా పదిహేను మంది మీద కేసులు పెట్టాం. అయితే ఆ కేసుల్లో ఏ ఒక్కరికీ శిక్ష పడలేదు. కానీ బాల్య వివాహాలు చట్టవిరుద్ధం అని, కేసులు పడతాయనే భయం మొదలైంది. 2000 నుంచి ఇప్పటి వరకు మొత్తం పీటల మీద పెళ్లిళ్లు రెండు వేలు, మాటల దశలో ఉండగా ఆపినవి పదిహేను వేలు ఉంటాయి. పెళ్లి కుదుర్చుకుంటున్న ఇళ్లలో ముసలి వాళ్లలో చైతన్యం తీసుకురావడం మంచి ఫలితాలనిచ్చింది. వెయ్యి అబద్ధాలాడి అయినా ఒక పెళ్లి చేయాలంటారు, కానీ నేను ఇన్ని వేల పెళ్లిళ్లు ఆపానని చెప్పుకోవడం వినేవాళ్లకు నవ్వులాటగా అనిపిస్తుందేమో కానీ నాకు గర్వంగానే ఉంది. ఇప్పుడు మేము చేపట్టిన రేప్ ఫ్రీ ఇండియా ఉద్యమాన్ని విజయవంతంగా పూర్తి చేయగలమనే నమ్మకం కూడా ఉంది’’ అన్నారు మమత.దూరదర్శన్ నుంచి ‘సప్తగిరి సబల’, వరంగల్ జిల్లా కలెక్టర్ నుంచి ‘ఉత్తమ కార్యకర్త’, యూఎస్ కాన్సులేట్ జనరల్ నుంచి ‘ఉమన్ ఆఫ్ ది హిస్టరీ మంత్’ పురస్కారాలను అందుకున్నారు మమతా రఘువీర్. యూరప్ దేశాల్లో సామాజిక స్థితిగతులను అధ్యయనం చేసిన మమత ప్రస్తుతం హైదరాబాద్ నగర పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన ‘భరోసా’ కమిటీలో సలహాదారుగా, తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థలో సభ్యురాలిగా కూడా సేవలందిస్తున్నారు. వాకా మంజులారెడ్డి ఫొటోలు : జి.అమర్ చట్టం కోసం ఎంపీల సంతకాలు మనదేశంలో జరుగుతున్న అత్యాచారాలు తక్కువేమీ కాదని, మరే దేశంలోనూ ఆ స్థాయిలో జరగడం లేదని గణాంకాలు చెప్తున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదికలు చూస్తే ఏడాదికి అటూఇటూగా పాతికవేల అఘాయిత్యాలు కనిపిస్తాయి. ఇవి నమోదైన కేసులు మాత్రమే. కేసులు పెట్టకుండా నోరు నొక్కిన సంఘటలను మరెన్నో ఉంటాయి. ఇలాంటి తరుణంలో ‘అత్యాచార ముక్త్ భారత్’ ఉద్యమం అవసరం ఎంతో ఉంది. అక్రమ రవాణా నిరోధక బిల్లు పార్లమెంట్లో పెండింగ్‌లో ఉంది. ఈ బిల్లు చట్టసభల ఆమోదం పొంది చట్టంగా రూపొందాలి. ఇండియన్ పీనల్ కోడ్, 1860, ద ట్రాఫికింగ్ ఆఫ్ పర్సన్ (ప్రివెన్షన్, ప్రొటెక్షన్ అండ్ రీహాబిలిటేషన్) బిల్, 2018 ప్రకారం అక్రమ రవాణా నేరానికి పాల్పడితే శిక్షలు కఠినంగా ఉంటాయి. ఒక వ్యక్తిని అక్రమంగా రవాణా చేసిన నేరానికి ఏడు నుంచి పది సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా ఉంటాయి. ఇద్దరు అంతకంటే ఎక్కువ మందిని రవాణా చేస్తే పదేళ్లు జైలు, జరిమానా. ఒక మైనర్ బాలికను అక్రమంగా తరలించినప్పుడు పదేళ్ల నుంచి జీవిత ఖైదు, జరిమానా ఉంటాయి. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది మైనర్లను అక్రమంగా రవాణా చేసినప్పుడు జీవిత ఖైదు, జరిమానా ఉంటాయి. అక్రమ రవాణాకు పాల్పడిన వ్యక్తి ప్రజా ప్రతినిధి లేదా ప్రభుత్వ ఉద్యోగి అయితే శిక్ష మరింత కఠినంగా ఉంటుంది. ఇంతటి కీలకమైన బిల్లు చట్టంగా రూపొందితే మహిళలు, బాలికల పట్ల అఘాయిత్యాలు గణనీయంగా తగ్గిపోతాయి. ఆ బిల్లు పాస్ కావలసి ఉంది. ఈ ఉద్యమ కార్యకర్తలు ‘రేప్ ఫ్రీ ఇండియా ఉద్యమంలో మా వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాం’ అని పార్లమెంటు సభ్యులందరి చేత సంతకాలు చేయిస్తారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఎన్నికల బరిలో దిగిన ప్రధాన పార్టీల అభ్యర్థుల సంతకాల సేకరణ కొన్ని రాష్ట్రాల్లో మొదలైంది. న్యాయం కోసం ‘నీలా’ నేను పుట్టింది నల్గొండ, పెరిగింది హైదరాబాద్‌లో. నాన్న డిస్ట్రిక్ట్ జడ్జి, అమ్మ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్స్‌లో ప్రొఫెసర్. ఎమ్మెస్సీలో ఉన్నప్పుడు రఘువీర్‌తో పెళ్లయింది. ఆయన ఐఎఫ్ఎస్ ఆఫీసర్. సివిల్స్ రాయాలనే నా కోరికకు పెళ్లి కారణంగా ఫుల్స్టాప్ పడలేదు. ప్రిపరేషన్ కంటిన్యూ చేశాను. కానీ పిల్లల కారణంగా పరీక్షలు రాయలేకపోయాను. పెళ్లి తర్వాత న్యాయశాస్త్రం, హ్యూమన్ రీసోర్స్ మేనేజ్మెంట్లో పీజీ డిప్లమో, ఎంబీఏ చేశాను. పిల్లలు పెద్దయిన తర్వాత నాకిష్టమైన సోషల్ వర్క్ మీద దృష్టి పెట్టాను. స్వచ్ఛంద సంస్థలలో పని చేశాను. తరుణి సంస్థను స్థాపించి బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, మహిళలపై లైంగిక వేధింపులు రూపు మాపడానికి పని చేస్తున్నాను. ‘నీలా’ (నెట్వర్క్ ఆఫ్ ఇంటర్నేషనల్ లీగల్ యాక్టివిస్ట్) ద్వారా న్యాయసహాయం అందిస్తున్నాను. ఇప్పుడు సత్యార్థి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చందనతో కలిసి రేప్ ఫ్రీ ఇండియా ఉద్యమాన్ని చేపట్టాను. -
నిజామాబాద్‌లో.. కుల రాజకీయం !
మోర్తాడ్(బాల్కొండ): పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించడానికి ఎత్తులకు పైఎత్తులు వేస్తున్న రాజకీయ పార్టీల నాయకులు కుల సంఘాల్లో పట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలోని వివిధ గ్రామాలలో కుల సంఘాల ప్రభావం తీవ్రంగా ఉంది. ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు ఓటములను శాసించే సత్తా కులసంఘాలపై ఉండడంతో కులాలకు గాలం వేసే పనిలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు నిమగ్నమయ్యారు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలో బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్, బోధన్, నిజామాబాద్ అర్బన్, కోరుట్ల, జగిత్యాల్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ అన్ని నియోజకవర్గాల పరిధిలో కుల సంఘాల ప్రభావం అధికంగా ఉంది. అయితే పసుపు బోర్డు ఏర్పాటు, ఎర్రజొన్నలకు మద్దతు ధర కోసం జాతీయ స్థాయిలో చర్చను లేవనెత్తడం కోసం రైతులు 175 మంది పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఎన్నికల బరిలో నిలిచిన రైతుల్లో ఎక్కువ మంది రెండు సామాజిక వర్గాలకు చెందిన వారు ఉన్నారు. అయితే రైతులు పోటీలో ఉండడంతో వారి సామాజిక వర్గాలకు చెందిన ఓట్లు తమకు రావనే ఉద్దేశ్యంతో ఇతర సామాజిక వర్గాల ఓట్ల కోసం నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. ఈ పార్లమెంట్ స్థానం పరిధిలో అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసే వాటిలో గురడి కాపు, మున్నూర్‌కాపు, గౌడ, దళితులు, ముదిరాజ్, పద్మశాలి, ముస్లిం, యాదవ, గిరిజనులు తదితర కుల సంఘాలు ఉన్నాయి. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, మెట్పల్లి, కోరుట్ల, జగిత్యాల్ పట్టణ ప్రాంతాల్లో అభ్యర్థుల విజయావకాశాలను ప్రభావితం చేసేంత మెజారిటీ ఓటర్లు వైశ్యులలో ఉన్నారు. ఈ కుల సంఘాల పెద్దమనుషులతో చర్చలను సాగిస్తున్న నాయకులు కుల సంఘాల మద్దతును కూడగట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కుల సంఘాల మద్దతును కూడగట్టుకుంటే ఎక్కువ ఓట్లను రాబట్టుకోవచ్చని భావిస్తున్నారు. కుల సంఘాలకు తాయిలాలను ప్రకటిస్తూ ఏకగ్రీవ తీర్మానాలను చేయిస్తున్నారు. ముందస్తు శాసనసభ ఎన్నికల్లో కుల సంఘాల మద్దతును కూడగట్టుకోవడానికి అన్ని పార్టీల నాయకులు ఎవరి ప్రయత్నం వారు చేశారు. కుల సంఘాలను తమవైపు తిప్పుకుంటే సభలు, సమావేశాలకు జన సమీకరణ సులభంగా ఉండడమే కాకుండా ఎన్నికల్లో గెలుపు సునాయసం అవుతుందని నాయకులు భావిస్తున్నారు. అయితే ఏ పార్టీ అభ్యర్థి వచ్చినా అందరికి కులసంఘాలు జై కొడుతున్నాయి. దీంతో ఫలితాలు ఎలా ఉంటాయో అని ఉత్కంఠ నెలకొంది. -
భయధైర్యాలు
చెయ్యి వేసినా ఏం కాదనే ధైర్యం, చెయ్యి వేస్తే ఏమౌతుందోనన్న భయం.. ఈ భయ ధైర్యాలను.. స్త్రీలపై లైంగిక నేరాలు జరగడానికి, జరగకపోవడానికి కారణాలు కానివ్వని సంస్కరణ అయితే సమాజానికి ఒకటి అవసరం. మాధవ్ శింగరాజు మనుషులు ఎవరి పని వారు చేసుకుపోతే, చట్టానికి తన పని తాను చేసుకుపోయే అవసరం ఉండదు. చట్టం తన పని తాను చేసుకుపోతోందంటేనే.. ‘ఓరి దేవుడా’ అనుకోవాలి.. మనుషులెవరో తాము చేయవలసిన పని చేయకుండా ఉండడమో, చేయ తగని పనిని చేసి ఉండడమో జరిగిందని! బిహార్‌లోని బుద్ధగయలో ఒక కేసు విషయంలో చట్టం ఇప్పుడు తన పని తను చేసుకుపోతోంది. బుద్ధగయలోని మహాబోధి ఆలయం ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేతం. ఆలయ దర్శనానికి దేశవిదేశాల నుంచి భక్తులు వచ్చివెళుతుంటారు. ఇటీవల 32 ఏళ్ల చైనా మహిళ ఒకరు షాంఘై నుంచి ఒంటరిగా ఈ పుణ్యక్షేత్రానికి వచ్చినప్పుడు గైడ్‌నని చెప్పుకున్న పాతికేళ్ల యువకుడు ఆమెతో అభ్యంతరకరమైన రీతిలో ప్రవర్తించాడు. ‘‘మీరిక్కడ చూడవలసినవి, చాలామందికి తెలియనివి అనేకం ఉన్నాయి’’ అని తీసుకెళ్లి సీసీ కెమెరాల లేని ప్రదేశంలో ఆ మహిళ చెయ్యి పట్టుకున్నాడు. ఆమె నిర్ఘాంతపోయారు. పవిత్ర బుద్ధ భగవానుని సన్నిధిలోనూ ఇలా చేసేవాళ్లుంటారా అని నిశ్చేష్టులయ్యారు. ఆలయ నిర్వహణ కమిటీ కార్యదర్శి ఎన్.దోర్జే వెంటనే విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు ఆమె చేత కంప్లయింట్ రాయించుకుని, కేస్ ఫైల్ చేశారు. బుద్ధగయలో అధికారిక గైడ్లు ఉంటారు. కానీ ఎలాగో ఆమె ఆ నకిలీ గైడ్ ట్రాప్‌లో పడిపోయారు. బహుశా అధికారిక గైడ్ నిర్లక్ష్యానికి భిన్నంగా అతడు ఎంతో మర్యాద ఇచ్చి, ఆమెకు నమ్మకాన్ని కలిగించి ఉంటాడు. చాలాసార్లు ఇలాగే జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న గైడ్లు ఉద్యోగానికి అలవాటు పడిపోయి, టూరిస్టులతో.. ‘వస్తే వచ్చారు... పోతే పోయారు’ అన్నట్లు వ్యవహరిస్తుంటారు. ప్రైవేటు గైడ్లు అలా కాదు. శ్రద్ధ తీసుకుంటారు. దగ్గరుండి అన్నీ చూపిస్తారు. డబ్బెంత తీసుకుంటారన్నది ముఖ్యంగా కనిపించదు. విధేయంగా ఉన్నాడా లేదా అన్నదే భాష తెలియనివారికి ముఖ్యం అవుతుంది. షాంఘై మహిళ నుంచి కంప్లయింట్ తీసుకున్నాక బుద్ధగయ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. రిమాండ్‌లో పెట్టారు. ఇక అతడికి శిక్ష వేస్తారు అనుకుంటుండగా.. షాంఘై వెళ్లిపోయిన ఆ మహిళ నుంచి ఇక్కడి పోలీసులకు ఒక లెటర్ వచ్చింది. యువకుడిని శిక్షించవద్దని, అతడిలో పరివర్తన తెచ్చే ప్రయత్నాలు చేయమని ఆమె అభ్యర్థన! ‘‘నేను బౌద్ధమతాన్ని విశ్వసిస్తాను. అందుకే అంతదూరం వచ్చాను. కానీ ఒక చేదు అనుభవం ఎదురైంది. అపరాధిని క్షమించమని బౌద్ధం చెబుతోంది. మీరు ఇప్పుడు అతడిని శిక్షిస్తే సంస్కరణ అతడితో ఆగిపోతుంది. శిక్షించకుండా సత్ప్రవర్తనపై శిక్షణ ఇప్పిస్తే అతడు మారడమే కాదు, మరికొందరిలో మార్పునకు కారణం అవుతాడు. అధికారులను నేను ఒకటే కోరుతున్నాను. అతడికి మంచి చదువును అందించండి. జీవితంలో మంచి పనులు చేసేలా అతడిలో ఆలోచన కలిగించండి. ఆ విధంగా బుద్ధగయను దర్శించుకునే ఒంటరి మహిళలకు, ఒంటరిగా ప్రయాణించి వచ్చే మహిళలకు భద్రతను, భరోసాను కలుగజేయండి’’ అని రాశారు షాంఘై మహిళ. అయితే ఆమె కోరినట్లు ఇప్పుడేమీ జరగబోవడం లేదు. డిస్ట్రిక్ట్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్.ఎస్.పి) రాజీవ్ మిశ్రా.. చట్టం తన పని తను చేసుకుపోయే యంత్రాంగంలో ఉద్యోగధర్మగ్రస్తుడైన ఒక నిమిత్త మాత్రపు చోదకశక్తిగానే ఉండబోతున్నారు. ‘‘భావోద్వేగాలకు చట్టంలో చోటు ఉండదు. తప్పు చేసిన వ్యక్తికి శిక్ష పడి తీరవలసిందే. బాధితురాలు క్షమాభిక్ష ప్రసాదించినప్పటికీ, బాధితురాలి తరఫున క్షమాభిక్ష ప్రసాదించడానికి చట్టానికి హక్కు లేదు’’ అని ఆయన నిక్కచ్చిగా చెప్పేశారు. నేడో రేపో ఆ యువకుడిపై చార్జిషీటు వేయబోతున్నారు. దానిని కోర్టుకు సమర్పించగానే శిక్ష ఖరారవుతుంది. ఉరిశిక్షేం వెయ్యరు కానీ.. శిక్షయితే వేస్తారు. చట్టం తన పని తాను చేసుకుపోవడానికి ఒక కంప్లయింట్ అయితే అవసరమే కానీ, కంప్లయింట్‌ని వెనక్కు తీసుకుని చట్టం చేత ఆ పనిని ఆపించడం తేలిక కాదు. పోలీసులు నిందితుడి పట్టుకుని, కోర్టులో నిందితుడిని హాజరు పరిచి, కోర్టు రెండు వైపుల వాదనలు వినీ.. ఇన్ని జరగడానికి ఎంతో విలువైన వివిధ శాఖల సమయం ఖర్చవుతుంది. తీరా శిక్ష విధిస్తున్నప్పుడు.. ‘స్టాప్.. ఆపండి’ అని వస్తే ఆ శాఖలు మందలిస్తాయి. ఒక్కోసారి ఆగ్రహిస్తాయి. షాంగ్ మహిళ రాసిన లెటర్లో ఒక పాయింట్ ‘అవున్నిజమే’ అనిపించేలా ఉంది. ‘అపరాధిని శిక్షిస్తే అతడొక్కడే మారతాడు. అపరాధిని సంస్కరిస్తే ఎందరినో మారుస్తాడు’ అని ఆమె రాశారు. చట్టానికి కావలసిందీ అదే. నేరం జరగకుండా ఉండడం. అయితే ఇదే విషయాన్ని చట్టం మరోలా చెబుతుంది. ‘అపరాధిని శిక్షిస్తే భయంతో సమాజం మారుతుంది. అపరాధిని సంస్కరించి వదిలేస్తే శిక్ష ఉండదన్న ధైర్యంతో మారాల్సి అవసరం లేదనుకుంటుంది’ అని! ఎవరి పాయింట్ కరెక్ట్? రెండు పాయింట్లూ కరెక్టే. అయితే చెయ్యి వేసినా ఏం కాదనే ధైర్యం, చెయ్యి వేస్తే ఏమౌతుందోనన్న భయం.. ఈ భయ ధైర్యాలను.. స్త్రీలపై లైంగిక నేరాలు జరగడానికి, జరగకపోవడానికి కారణాలు కానివ్వని సంస్కరణ అయితే సమాజానికి ఒకటి అవసరం. ఆ సంస్కరణను శిక్షే తెచ్చినా, శిక్షణే తెచ్చినా. -
దారుణం..పాఠశాలకు వెళుతుందని..
సాక్షి, పట్నా: ఆడపిల్ల చదువు ఇంటికి వెలుగు అంటారు. కానీ ఆ చదువే ఓ ఇంటి దీపాన్ని ఆర్పేసింది. కేవలం కట్టుబాట్లను కాదన్నందుకు 17 ఏళ్ల అమ్మాయిని అతి దారుణంగా చంపేశారు. తమ కుల నియమానికి విరుద్ధంగా పాఠశాలకు వెళుతుందని కక్ష పెంచుకొన్న ఏడుగురు వ్యక్తులు.. 17 ఏళ్ల బాలికను కిరాతకంగా హతమార్చారు. బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లోని సాన్‌పురా గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది. తమ కుల కట్టుబాటు ప్రకారం పదో తరగతి తర్వాత అమ్మాయిలను ఉన్నత చదువుల కోసం పంపించడం నేరంగా పరిగణిస్తారని, ఈ నియమాన్ని ఉల్లంఘించి.. బాధిత బాలిక వెళుతుందని గ్రహించిన ఏడుగురు వ్యక్తులు... ఈ విషయమై బాలిక కుటుంబాన్ని బెదిరించారని గ్రామస్తులు తెలిపారు. అయినా, బాలిక స్కూలుకు వెళుతుండటంతో.. ఆమెను అంతమొందించాలని నిర్ణయించుకున్నారని, పథకం ప్రకారం బాలిక సోదరుడిని, వదినను వారింట్లోనే బంధించిన నిందితులు అనంతరం బాలికను చంపేశారని వారు తెలిపారు. బాలిక సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏడుగురు నిందితుల్లో నలుగురిని అదుపులోకి తీసుకున్నామని, కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ కేఎం ప్రసాద్ తెలిపారు. -
సగం కాదు సమం కావాలి
అవకాశం, అధికారం..పురుషుడి చేతుల్లో ఉన్నాయి.స్త్రీకి దక్కవలసిన వాటిని కూడా పురుషుడు తన చేతుల్లోనే బిగించి పట్టుకున్నాడు. సగమిస్తాం, శాతాలిస్తాం అని దశాబ్దాలు గడిపేస్తున్నాడు. ఈ సగాలూ, శాతాలు కాదు..సమ విభజన జరగాల్సిందేనని ‘ఆల్ ఉమెన్ పార్టీ’సమ(ర)శంఖారావం పూరిస్తోంది. ‘‘భూమి లోపల గింజ నాటుతున్నాం. అది మొలకెత్తుతుంది. మహావృక్షమవుతుంది. మొలకెత్తే వరకు అక్కడ ఒక గింజ నాటి ఉన్న సంగతి కూడా బయటకు తెలియకపోవచ్చు. మనకు తెలియలేదంటే అర్థం భూమిలో బీజం లేదని కాదు, భూమిలో బీజం ఉన్న సంగతిని మనం గుర్తించలేదని మాత్రమే. మేము ఇప్పుడు మహిళలకు రాజ్యాధికార బీజాలు నాటుతున్నాం. అవి మొలకెత్తిన రోజున సమాజం గుర్తిస్తుంది. అలాగని మా ప్రయత్నం.. మేము బీజం వేశామని సమాజం గుర్తించడం కోసం కాదు, సమాజంలో మహిళలు సగభాగం ఉన్నారనే వాస్తవాన్ని సమాజం గ్రహించడం కోసం. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే సమాజంలో మహిళలు సగభాగం ఉన్నారనే వాస్తవాన్ని సమాజానికి గుర్తు చేయడం కోసమే ఈ రాజకీయ మహోద్యమానికి బీజం వేశాం. పాపులేషన్లో సగం ఉన్న మేము పార్లమెంట్లో పది శాతానికి పరిమితం కావడమేంటి! పార్లమెంట్లో కూడా సగభాగం మహిళలే ఉండాలి’’ అన్నారు డాక్టర్ శ్వేతాశెట్టి. ఢిల్లీలో ఇటీవలే కొత్తగా ఆవిర్భవించిన ‘నేషనల్ ఉమెన్స్ పార్టీ’ అధ్యక్షురాలు ఆమె. దక్కన్ లీడర్ డాక్టర్ శ్వేతా శెట్టి హైదరాబాద్‌లో పుట్టి పెరిగారు. హైదరాబాద్‌లోని దక్కన్ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఎంబీబీఎస్ చదివారు. కొంతకాలం కర్మాన్‌ఘాట్‌లో ప్రాక్టీస్ చేశారు. గత ఏడాది డిసెంబర్ 18వ తేదీన న్యూఢిల్లీలో ‘నేషనల్ ఉమెన్స్ పార్టీ’ పేరుతో రాజకీయ పార్టీని స్థాపించారు. పార్టీ ఆఫ్ మదర్స్ అనే ట్యాగ్‌లైన్, ముకుళిత హస్తాలతో ఉన్న మహిళ లోగోతో ఆవిర్భవించిన ఆ మహిళల రాజకీయ పార్టీ ఒక్కసారిగా దేశమంతటినీ ఆకర్షించింది. మహిళల కోసం జాతీయస్థాయిలో ఒక రాజకీయ పార్టీని స్థాపించాల్సిన ఆవశ్యకత, అనివార్యతల గురించి సాక్షితో తన ఆలోచనలను పంచుకున్నారు డాక్టర్ శ్వేతాశెట్టి. భిన్నత్వంలో ఏకత్వం ‘‘ఎన్నికలొచ్చిన ప్రతిసారీ వార్తాపత్రికలు, ఇతర ప్రసార సాధనాల్లో హడావుడి మొదలవుతుంది. పోటీలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థుల జాబితాలను ప్రచురిస్తారు. పోటీలో నిలుచున్న మహిళలపై ప్రత్యేక కథనాలుంటాయి. నాకు తెలిసినప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లోనూ గమనిస్తూనే ఉన్నాను. అభ్యర్థుల జాబితాలో మహిళల సంఖ్య వేళ్ల మీద లెక్కకు మించేది కాదు. మరికొంచెం లోతుగా అధ్యయనం చేసినప్పుడు ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. మనదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరవాత మొదటి పంచవర్ష ప్రణాళికల నుంచి ప్రస్తుత ‘నీతి అయోగ్’ వరకు ప్రతిసారీ మహిళల అభ్యున్నతి గురించి మాట్లాడుతున్నాయి ప్రభుత్వాలు. మహిళల స్వయం స్వావలంబన గురించి, సాధికారత గురించి కూడా మాట్లాడుతున్నాయి. అయితే మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ గురించి మాత్రం మాట్లాడడం లేదు. ఒకసారి అటకెక్కిన మహిళా బిల్లును అటక దించే ప్రయత్నం ఏ ప్రభుత్వమూ చేయడం లేదు. బహుళ పార్టీ విధానం అమలులో ఉన్న మనదేశంలో రాజకీయ పార్టీల మధ్య భావసారూప్యతల కంటే భావ వైవిధ్యతలే ఎక్కువ. అయితే మహిళా రిజర్వేషన్ బిల్లు దగ్గరకొచ్చేటప్పటికి అన్ని పార్టీలూ ఒకటే రకంగా స్పందిస్తున్నాయి. ఎన్నికలొచ్చే సరికి నాయకులు ‘మా పార్టీ అధికారంలోకి వస్తే అవి చేస్తాం... ఇవి చేస్తాం’ అని హామీలు గుప్పిస్తుంటారు. ఒక్క జాతీయ నాయకుడైనా ‘మా పార్టీ అధికారంలోకి వస్తే చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం తెస్తాం’ అని వాగ్దానం చేయట్లేదు. అధికారమే పరమావధిగా ఎన్నికలకు ముందు– తర్వాత పొత్తులు కుదుర్చుకుని ఏర్పడే సంకీర్ణ ప్రభుత్వాల్లోని పార్టీలు... అనేక అంశాల మీద విభేదించుకుంటూ, సర్దిచెప్పుకుంటూ భిన్నత్వంలో ఏకత్వాన్ని పాటిస్తూ బిల్లులు పాస్ చేసుకుంటున్నాయి. కానీ మహిళాబిల్లు కోసం ఒక్క మగ గొంతు కూడా పెగలట్లేదు. అందుకే మహిళల కోసం ఒక పార్టీ ఉండాల్సిన అవసరం ఉందని ఈ పార్టీని స్థాపించాం’’ అన్నారు నలభై రెండేళ్ల శ్వేత. రాజ్యాంగం అలా చెప్పలేదు ‘‘మహిళల కోసం రిజర్వేషన్ అనగానే అందరికీ 33 శాతం గుర్తొస్తుంది. నిజానికి ఆ నిబంధన మహిళల స్థానాలను 33 శాతానికి పరిమితం చేయమని కాదు. లింగ వివక్షలేని సమాజ నిర్మాణం కోసం మహిళలకు సగభాగం ప్రాతినిధ్యం ఉండాలని చెప్పింది. పరిపాలన, నిర్ణయాధికారంలో మహిళల భాగస్వామ్యం కనీసం 33 శాతానికి తగ్గకుండా ఉండాలని చెప్పింది. పురుషాధిక్య భావజాలంలో నడుస్తున్న రాజకీయ పార్టీలు ‘కనీసంగా 33 శాతం’ అనే నిబంధనను తమకు అనుకూలంగా ‘మహిళలకు 33 శాతం స్థానాలను కేటాయించడం’గా మలుచుకున్నాయి. రాజ్యాంగం కల్పించిన సమ భాగస్వామ్యం గురించి సమాజానికి తెలియచేయడం, చట్టసభలతోపాటు, పబ్లిక్, ప్రైవేట్ సెక్టార్లలో కూడా మహిళలకు సమ భాగస్వామ్య సాధనే మా నేషనల్ ఉమెన్స్ పార్టీ లక్ష్యం’’ అన్నారు శ్వేత. ఆల్ ఉమెన్ అసోసియేషన్ ‘‘మహిళల కోసం రాజకీయ పార్టీ స్థాపన అనేది పదేళ్ల కిందట నాకు వచ్చిన ఆలోచన. 2012లో పార్టీని రిజిస్టర్ చేశాను. అప్పటికే నాకు నాలుగేళ్ల పాప ఉంది. ఆ తర్వాత రెండేళ్లకు బాబు పుట్టాడు. పిల్లల బాధ్యత కారణంగా కొంత విరామం తీసుకోవాల్సి వచ్చింది. అయితే ఆ సమయంలో ‘తెలంగాణ మహిళా సమితి’ పేరుతో ఎన్జివో ప్రారంభించాను. భావసారూప్యం కలిగిన మహిళలతో నా ఆలోచనను పంచుకున్నాను. వాళ్లందరూ మహిళాభ్యుదయం కోసం కృషి చేస్తున్న వాళ్లే. ‘ఐద్వా’లో చురుగ్గా ఉన్న మహిళలతో కలిసి కార్యాచరణ రూపకల్పన చేసుకున్నాను. ఇదంతా పూర్తయిన తర్వాత గత డిసెంబర్లో న్యూఢిల్లీలో జానకీ రాజారామ్‌తో కలిసి పార్టీని ప్రారంభించాను. ఆ వెంటనే దక్షిణాది రాష్ట్రాలన్నింటితోపాటు ఉత్తరాదిన మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్‌లలో ప్రాంతీయ విభాగాలు కూడా ప్రారంభమయ్యాయి. యూపీలో రుచికపూర్, ముంబయిలో భావనా జడేజా పార్టీ కార్యకలాపాలు చూసుకుంటున్నారు. దేశంలోని దాదాపుగా కొన్ని రాష్ట్రాల్లో పార్టీ లాంఛనంగా ప్రారంభం కాకపోయినప్పటికీ జమ్ముకాశ్మీర్, ఉత్తరప్రదేశ్ వంటి మరికొన్ని రాష్ట్రాల్లో కమిటీలు పనిచేస్తున్నాయి. మా పార్టీకి వెబ్సైట్, ఫేస్బుక్ పేజీ ఉన్నాయి. వీటిని నిర్వహించడానికి టెక్నికల్ టీమ్ పనిచేస్తోంది. నామినేషన్లు వేశాం ఎన్నికల్లో 283 లోక్‌సభ స్థానాలకు పోటీ చేయడం, గెలిచి పార్లమెంట్లో అడుగు పెట్టడం మా పార్టీ లక్ష్యం. అందుకోసం ప్రతి రాష్ట్రంలోనూ ఆయా రాష్ట్రాల లోక్‌సభ స్థానాల సంఖ్యలో సగం స్థానాలకు పోటీ చేస్తున్నాం. రాజస్థాన్‌లో పాతిక స్థానాలకు గాను పదమూడు స్థానాల్లో మా పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో కూడా నామినేషన్లు వేశారు. తెలంగాణలో ఇప్పటి వరకు ఐదుగురు, ఆంధ్రప్రదేశ్‌లో 13 స్థానాలకు పోటీ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ స్థానాల పోటీలో కూడా మా అభ్యర్థులుంటారు. ఈ ఎన్నికల్లో నేను పోటీ చేయడం లేదు. ఇప్పుడు నాటిన బీజం మొలకెత్తి, చివుర్లు తొడిగి, చెట్టంత ఎదగడానికి సమయం పడుతుంది. నా పూర్తి సమయాన్ని పార్టీని విస్తరింప చేయడానికే కేటాయించాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో నేను ఒక నియోజకవర్గానికి పరిమితమైతే లక్ష్యం నెరవేరడం కష్టం. అందుకే 2024 టార్గెట్‌గా పని చేస్తున్నాం. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల తర్వాత పార్టీని క్షేత్రస్థాయికి తీసుకెళ్లడం మీద దృష్టి పెడతాం. ప్రతి అసెంబ్లీ నియోజక వర్గంలోనూ దాదాపుగా రెండు వందల మంది కార్యకర్తలు రిజిస్టర్ అయి ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి కసరత్తు మొదలు పెడతాం.ఎన్నికల కమిషన్ గుర్తించిందిమా పార్టీకి ఎన్నికల కమిషన్ గుర్తింపు వచ్చింది. జాతీయ స్థాయిలో కామన్‌గా గ్యాస్ స్టవ్ గుర్తును కేటాయించింది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్ మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లోనూ మా అభ్యర్థులు ఈ గుర్తు మీద పోటీ చేస్తారు. ఆ మూడు రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ గుర్తును ఇతర ప్రాంతీయ పార్టీలకు కేటాయించి ఉండడంతో ఆ రాష్ట్రాల్లో మాకు గాజుల గుర్తు ఇచ్చారు. మహిళలకు రాజ్యాధికారం కోసం చేస్తున్న పోరాటంలో మాకు వంటింటి గుర్తును కేటాయించారని మగవాళ్లు ఎగతాళి చేయడానికి అవకాశం ఉంది. కానీ, అది రెండు బర్నర్లున్న గ్యాస్ స్టవ్. ఒక పనిని మహి మగవాడు ఇద్దరూ చేయగలగాలని చెప్పడానికి ప్రతీక ఆ చిహ్నం. ఎన్నికల కమిషన్ దగ్గర ఉన్న చిహ్నాల జాబితా నుంచి నాగలి, దీపం, తల్లీబిడ్డ, గ్యాస్‌స్టవ్ వంటి పదిహేను గుర్తులను ఎంపిక చేసుకున్నాం. అందులో మాకు గ్యాస్‌స్టవ్‌ని కేటాయించింది ఎన్నికల కమిషన్. ఆధిక్యం కోసం కాదు భారత మాజీ రాష్ట్రపతి ఆర్. వెంకట్రామన్ గారి అమ్మాయి పద్మా వెంకట్రామన్ నేషనల్ ఉమెన్స్ పార్టీలో సౌత్ జోన్ నిర్వహణ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. వెస్ట్ జోన్ బాధ్యతలను క్రికెట్ క్రీడాకారుడు రవీంద్ర జడేజా సోదరి భావనా జడేజా చూస్తున్నారు. మా పార్టీలో రిటైర్ అయిన మహిళా ఐఏఎస్ అధికారులు, న్యాయవాదులు, ఇతర ప్రభుత్వ సర్వీసుల్లో సేవలందించి రిటైర్ అయిన ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. వారంతా స్థానిక నిర్వహణ బాధ్యతలకు అవసరమైన ఖర్చులు సొంతంగా పెట్టుకుంటున్నారు. దాంతో మా పార్టీకి నిధుల సమీకరణ బాధ లేదు. ఇప్పటి వరకు చేరిన వాళ్లంతా శాసననిర్మాణంలో మహిళల భాగస్వామ్యం, ఆవశ్యకతల గురించి సంపూర్ణ అవగాహన ఉన్న మహిళలే. మేమంతా కలిసి ఇక నుంచి క్షేత్రస్థాయిలో మహిళల్ని చైతన్యవంతం చేయాలి. ఈ లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆ పనికి పూనుకుంటాం. మా పార్టీ సిద్ధాంతాలు మగవారిని కూడా ఆకట్టుకుంటున్నాయి. పార్టీలో చేరడానికి ముందుకు వస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే... ఇది మహిళాధిక్యతను ప్రదర్శించడానికి స్థాపించిన పార్టీ కాదు, మహిళలకు సమభాగస్వామ్యాన్ని కోరుతూ స్థాపించిన పార్టీ. కాబట్టి మగవాళ్లు ఉండకూడదనే నియమమేదీ లేదు. వాళ్లు కూడా సగభాగం ఉంటారు. అయితే మగవాళ్ల కోసం మహిళలు పోటీ చేసే స్థానాలను త్యాగం చేయడం వంటివి ఉండవు’’ అని ముగించారు శ్వేతాశెట్టి. ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి ఫొటోలు : ఎస్.ఎస్.ఠాకూర్ మా ఎజెండా మేము అధికారంలోకి వస్తే... మొదటి ప్రాధాన్యం మహిళల చదువు, రెండవది మహిళలకు ఉద్యోగం, మూడు మహిళల క్షేమం, ఆ తర్వాత వ్యవసాయరంగం, రక్షణ రంగాలుంటాయి. ఓ యాభై ఏళ్ల కిందట మహిళలు చదువుకోవడానికి ఇంటి నాలుగ్గోడల మధ్యనే మౌనపోరాటం చేయాల్సి వచ్చింది. ముప్పై ఏళ్ల కిందట ఉద్యోగాలు చేయడానికి అనుమతి కోసం మెల్లగా గొంతు విప్పింది. ఇప్పుడు శాసన నిర్మాణంలో అడుగు పెట్టడానికి ఉద్యమించాల్సిన సమయం వచ్చింది. ఇప్పటికే చట్టసభల్లో ఉన్న వాళ్లలో ఎక్కువ మంది రాజకీయ కుటుంబాల నేపథ్యం ఉన్న వాళ్లే. ఫలానా వారమ్మాయి, ఫలానా వారింటి కోడలు, ఫలానా వ్యక్తి భార్య... ఈ గుర్తింపుతోనే వస్తున్నారు, వచ్చిన తర్వాత కూడా వాళ్లింటి మగవాళ్ల నిర్ణయాలను అమలు చేస్తూ కొనసాగుతున్నారు తప్ప స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడానికి ధైర్యం చేయడం లేదు. మనదేశంలో ఒక ఇండిపెండెంట్ మహిళ రాజకీయ రంగంలో అడుగుపెట్టే పరిస్థితి లేదిప్పుడు. అరకొరగా ఉన్నప్పటికీ వాళ్లను కార్యకర్త స్థాయికి మించి నాయికగా ఎదగనివ్వడం లేదు. అందుకే మా పార్టీ అవసరం చాలా చాలా ఉందని నమ్ముతున్నాం. బేటీ బచావోలు, బేటీ పఢాలోలు ఉన్నప్పటికీ ఫిమేల్ ఫోటిసైడ్, ఉమెన్ ట్రాఫికింగ్, మహిళల మీద దాడులు తగ్గడం లేదు. వాటిని రూపుమాపగలిగింది మహిళలే. బాలికా విద్యం కోసం ఉద్యమించిన సావిత్రిబాయిఫూలే స్ఫూర్తితో మొదలు పెట్టిన ఉద్యమం మాది. ఇందులో మేము కూడా ఆమెలాగానే విజయవంతం అవుతాం. పొలిటికల్ ఎంపవర్మెంట్ మాత్రమే పరిపూర్ణమైన సాధికారత’’ అన్నారు శ్వేతాశెట్టి. -
చేత వెన్న మనసు
చిన్నికృష్ణుని చేతిలో ఎప్పుడూ వెన్నముద్ద ఉంటుంది. అందుకే ‘చేత వెన్నముద్ద’ అనే మాటతో ఆయన వర్ణన మొదలౌతుంది. శ్రీకృష్ణుని చేతిలో ఉన్నట్లే.. పుష్ప చేతిలోనూ ఎప్పుడూ వెన్న ఉంటుంది. అయితే అది వెన్నముద్ద కాదు. వెన్న లాంటి మనసు! ఆమె పేరు పుష్ప, వయసు 31. బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఆమె ఏటా యాభై నుంచి అరవై పరీక్షలు రాస్తుంటుంది. గడచిన పన్నెండేళ్లుగా ఇదే వరుస. ఆమె ఇన్నిన్ని పరీక్షలు రాస్తున్నది తన కెరీర్ కోసం కాదు. ఇంకా పెద్ద జీతం కోసం పెద్ద కంపెనీలో ఉద్యోగం ఆశించి కూడా కాదు. పరీక్షలు రాయలేని పిల్లల కోసం రాస్తోందామె. ఇప్పటికి ఏడు వందలకు పైగా పరీక్షలు రాసింది. ఏడాదికి యాభై నుంచి అరవై అంటే నెలకు సరాసరిన నాలుగు లేదా ఐదు పరీక్షలు రాయాల్సి ఉంటుంది. పరీక్షకు మూడున్నర గంటలు, పరీక్ష కేంద్రానికి ప్రయాణం చేసే టైమ్ అంతా కలుపుకుంటే ఆ రోజు ఆరేడు గంటలకు పైగానే కేటాయించాలి. పరీక్షల టైమ్ ఆఫీస్ టైమ్ ఒకే టైమ్‌లో ఉంటాయి. ఆమె స్వచ్ఛందంగా చేస్తున్న సేవను గుర్తించిన కంపెనీ పుష్పకు ఆ మేరకు వెసులుబాటు కల్పిస్తోంది. పరీక్ష రాయాల్సిన రోజు, పరీక్ష పూర్తయిన తర్వాత ఆఫీసుకు వెళ్లగలిగినట్లు షిఫ్ట్ మార్చుకోవడానికి అనుమతించింది. పుష్ప నిస్వార్థమైన సేవను గుర్తించిన భారత ప్రభుత్వం ఆమెను నారీ శక్తి పురస్కారంతో గౌరవించింది. పరీక్షకు రానివ్వని రోజు ‘‘అప్పుడు ఏడవ తరగతిలో ఉన్నాను. క్లాసులో మిగిలిన వాళ్లంతా పరీక్షకు సిద్ధమవుతున్నారు. నన్ను మాత్రం పరీక్ష రాయడానికి వీల్లేదన్నారు. మా అమ్మానాన్న స్కూలు ఫీజు కట్టని కారణంగా నన్ను పరీక్ష రాయవద్దని చెప్పేశారు టీచర్లు. నా జీవితంలో అత్యంత దుర్దినం అది. ఆ రోజు మా పొరుగింటి వాళ్లు ఫీజు కట్టి ఆ గండాన్ని గట్టెక్కించారు. మరో నాలుగేళ్లకు పియుసిలో ఉన్నప్పుడు కూడా దాదాపుగా అదే పరిస్థితి. అప్పుడు ఒక పోలియో వ్యాధిగ్రస్థుడు ఆర్థిక సహాయం చేయడంతో ఆ కష్టం నుంచి బయటపడ్డాను. సమాజం నుంచి తీసుకున్నాను, సమాజానికి తిరిగి ఇవ్వాలి. నేను చేయగలిగింది చేయాలని మాత్రమే అనుకున్నానప్పుడు. ఇలా పరీక్షలు రాయాలనే నిర్ణయం తీసుకోలేదు. ఒకసారి ఎన్జీవో నడుపుతున్న మా ఫ్రెండ్ విజువల్లీ చాలెంజ్డ్ స్టూడెంట్‌కి పరీక్ష రాస్తావా అని అడగడంతో 2007లో పరీక్ష రాశాను. అప్పటి నుంచి సెరిబ్రల్ పాల్సీ, విజువల్లీ చాలెంజ్డ్, ఇతర ఇబ్బందులు ఉన్న వాళ్లకు స్క్రైబ్‌గా (పరీక్ష రాయలేని వాళ్లకు, వాళ్లు చెప్తుంటే పరీక్ష రాసి పెట్టడం) చేస్తున్నాను. ఎక్కువగా టెన్త్‌క్లాస్ వాళ్లకు స్క్రైబ్‌గా ఉన్నాను. చాలా ప్రశ్నలకు ఆన్సర్లు కంఠతా వచ్చేశాయి. స్టూడెంట్స్ సమాధానం చెప్పడంలో మధ్యలో తడుముకుంటున్నా సరే నాకు సమాధానం సాగిపోతుంటుంది. నిత్య విద్యార్థిని కదా మరి’’ అన్నారు పుష్ప సంతృప్తిగా నవ్వుతూ. – మంజీర -
మాటిస్తే కట్టుబడి ఉంటాం
ఒంగోలు సిటీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాటిస్తే అందుకు కట్టుబడి ఉంటుందని మాజీ మంత్రి, ఆ పార్టీ ఒంగోలు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. బీసీలకు ఇచ్చిన మాటపై వెనుకడుగు వేసేది లేదని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు రాజకీయాల్లో సముచిత ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ఆదివారం ఒంగోలులోని పార్టీ జిల్లా కార్యాలయం ఆవరణలో నూర్‌బాషాల సంఘ రాష్ట్రస్థాయి ఆత్మీయ సదస్సు ఆ సంఘ జిల్లా అధ్యక్షుడు ఎస్కే నాగూర్ అధ్యక్షతన జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బాలినేని మాట్లాడుతూ నూర్‌బాషాలకు తమ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. అనంతపురం పార్లమెంట్ స్థానాన్ని జగన్మోహన్రెడ్డి బీసీలకు కేటాయించినట్లుగా గుర్తు చేశారు. అవకాశం ఉన్న చోట తప్పని సరిగా నూర్‌బాషాలకు అవకాశం ఇస్తామని హామీ ఇచ్చారు. ఒంగోలు నగరంలోని కొణిజేడు బస్టాండ్ సెంటర్లో అబ్దుల్ కలాం విగ్రహాన్ని ఏర్పాటు చేయిస్తామని బాలినేని హామీ ఇచ్చారు. ప్రస్తుత ప్రభుత్వం నుంచి అనుమతులు లభించే అవకాశం లేనందున, పార్టీ అధికారంలోకి రాగానే ముందుగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయించడానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు దామచర్ల ఆంజనేయులు విగ్రహం ఏర్పాటుకు నాడు అధికారులు అంగీకరించకపోతే కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడి అనుమతులను ఇప్పించినట్లుగా గుర్తు చేశారు. ఆ విశ్వాసం కూడా ఆయన మనవడు, ప్రస్తుత ఎమ్మెల్యే జనార్దన్‌కు లేదన్నారు. పార్టీ «అధికారంలోకి రాగానే విగ్రహం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. జగన్ సీఎం అయితే సమస్యల పరిష్కారం.. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తాఫా మాట్లాడుతూ వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకోవడం అందరి బాధ్యతగా పేర్కొన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడే జగన్ ప్రభుత్వం అధికారంలో ఉంటే నూర్‌బాషాల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని చెప్పారు. టీడీపీ బీసీలను కరివేపాకులా వాడుకుందని విమర్శించారు. వారి అభివృద్ధికి తీసుకున్న చర్యలు శూన్యమన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా నూర్‌బాషాలు వైఎస్సార్ సీపీ గెలుపునకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. సినీ నటులు, వైఎస్సార్ సీపీ నాయకుడు భానుచందర్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి జగన్‌తోనే సాధ్యమన్నారు. ఒకసారి అవకాశం ఇస్తే పాతికేళ్ల పాటు జనం హృదయాల్లో చెరగని ముద్ర వేస్తారని అన్నారు. దివంగత వైఎస్సార్ లక్షణాలను పుణికి పుచ్చుకున్న జగన్ ప్రతి కుటుంబాన్ని సంతోషంగా ఉంచుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎవరికి ఏ కష్టమొచ్చినా ఆయన అండగా ఉంటారని వివరించారు. జగన్ ప్రభుత్వం ఏర్పాటులో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు. నూర్‌బాషా సంఘం ఉభయ రాష్ట్రాల వ్యవస్థాపక అధ్యక్షుడు ఓ.రసూల్ సాహెబ్, సంఘ నాయకులు పలు అంశాలను బాలినేని దృష్టికి తెచ్చారు. ఆయన ఈ సమస్యలన్నీ విని అధికారంలోకి రాగానే సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సంఘ నేతలు మస్తాన్(గుంటూరు), ఎస్ఎస్ బాబ్జి (ఉంగుటూరు), నిజాం (అనంతపురం), కరిముల్లా (చిత్తూరు), ఖాజా(కర్నూలు), మున్నీ(విశాఖ), రహీం(విజయవాడ)లు మాట్లాడారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ విభాగం కార్యదర్శి ఖాశింపీరా, పార్టీ నూర్‌భాషాల సంఘ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఉదయగిరి ఇమాంబాషా, చిన్నబాషా, హుస్సేన్ సైదులు, షేక్ శ్రీనుబాషా, మస్తాన్, లాల్, టైలర్ ఖాశిం తదితరులు పాల్గొన్నారు. నూర్‌బాషాల డిమాండ్లు ఇవీ.. నూర్‌బాషాలకు రూ.వెయ్యి కోట్లతో ప్రత్యేక కార్పొరేషన్ అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో అబ్దుల్ కలాం విగ్రహాల ఏర్పాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులు, నామినేటెడ్ పోస్టులతో పాటు వక్ఫ్‌బోర్డ్‌లో ప్రాధాన్యం రాజధానిలో 5 ఎకరాల స్థలం కేటాయించి అందులో సామాజిక భవన నిర్మాణం రూ.2 లక్షల సబ్సిడీతో బ్యాంకులతో సంబంధం లేకుండా రుణాలు 4 చక్రాల వాహనాలకు రుణ సదుపాయం 45 ఏళ్లు దాటిన దూదేకుల వృత్తి వారికి పింఛన్ ఇవ్వాలని కోరారు. -
మౌనం వద్దు.. జరిగింది చెప్పు
లైంగిక వేధింపులకు, అత్యాచారాలకు గురైన మహిళలు వారు ఎదుర్కొన్న ‘భయానక పరిస్థితి’ గురించి తలుచుకొని లోలోన కుమిలిపోకుండా గొంతెత్తి మాట్లాడాలి. సమాజం ఏమనుకుంటుందో అన్న భయం వీడాలి. ఇంట్లోవాళ్లు, బంధువులు ‘ఎవరికీ చెప్పొద్దు’ అన్నా, వారి మాటలు విని ఆగిపోవద్దు. ఆడదానిపై కర్కశత్వాన్ని, కామాన్ని ప్రదర్శించిన ఆ మగాడికి శిక్షపడాలి. సమాజం ఆ మృగాణ్ణి ఛీకొట్టాలి. దాని కోసమైనా నీవు మాట్లాడాలి. ధైర్యంగా నిలబడాలి. ఇదే లక్ష్యంతో రాష్ట్రీయ గరీమా అభియాన్ ‘డిగ్నిటీ మార్చ్’కు శ్రీకారం చుట్టింది. గత ఏడాది డిసెంబర్ 28 ముంబైలో ప్రారంభమైన ‘డిగ్నిటీ మార్చ్ 65 రోజుల్లో 24 రాష్ట్రాలు, 200 జిల్లాల మీదుగా సాగి వేలమంది బాధిత మహిళలను కలిసింది. వెళ్లిన ప్రతిచోట స్థానికంగా గృహహింస, దాడులకు గురవుతున్న మహిళలకు అండగా నిలిస్తున్న స్వచ్ఛంద సంస్థలను కలుపుకొని చైతన్య కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అఘాయిత్యాలకు గురైన బాధితులు గొంతెత్తి మృగాడిలా మీదపడ్డ మగాడిని ఎదురొడ్డి నిలబడేలా చైతన్యం కలిగిస్తూ వచ్చింది. అలా ‘సర్వైవర్స్’ ధైర్యంగా సమాజం గీసిన సరిహద్దులను చెరిపి ‘చూడాల్సింది నన్ను కాదు ఆ మృగాణ్ణి’ అంటూ గొంతెత్తేలా వారిలో చైతన్యం కలిగించింది. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా సాగిన డిగ్నిటీ మార్చ్ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ‘భూమికా విమెన్స్ కలెక్టివ్’ సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్, వికారాబాద్, విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రిలో చైతన్య కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. అలా ముంబైనుంచి ప్రారంభమైన ఆ చైతన్యం 24 రాష్ట్రాలు చుట్టి శుక్రవారం ఢిల్లీ చేరేవరకు సుమారు 5,000 మంది సర్వైవర్స్‌ను ముందుకు నడిపింది. చిన్నచూపు తగదు... సమాజంలో అత్యాచారానికి గురైన మహిళలపై చిన్నచూపు తగదు. నేరం చేసిన వారు సిగ్గుపడాలి. కానీ ఏ తప్పు చేయని బాధితులు కాదు. అత్యాచారాలకు, వేధింపులకు గురైన మహిళలు బయటకొచ్చి మాట్లాడాలి. న్యాయ పోరాటం చేసి సర్వైవ్ కావాలి అని చెబుతున్న భూమిక విమెన్స్ కలెక్టివ్స్ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. (‘భూమికా విమెన్స్ కలెక్టివ్’ సంస్థ నిర్వాహకులు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తూ సర్వైవర్స్‌కు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ‘డిగ్నిటీ మార్చ్’ ఇటీవల ఢిల్లీ చేరుకున్న సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అవార్డు అందుకున్నారు.) జావీద్ బాషా, సాక్షి న్యూఢిల్లీ -
మనం చూడని మనదేశం
చూడాలి.. తెలుసుకోవాలి.. వెలుగులోకి తేవాలి..స్ఫూర్తి చెందాలి.మనకు ఉన్నవన్నీ సవాళ్లే అనుకుంటే వీళ్ల జీవితాలు చూడాలి.. మనకు కనపడని దేశం ఇది..ఈ నెల పన్నెండున తెలంగాణ, సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్‌లో జరిగిన ‘జై చండీరాం మెమోరియల్ సెకండ్ నేషనల్ కమ్యూనిటీ మీడియా ఫెస్టివల్’లో ప్రదర్శించిన డాక్యుమెంటరీలు, షార్ట్ ఫిల్మ్స్‌లో మనం చూడని.. మనకు తెలియని దేశం కనిపించింది. మచ్చుకు మూడు.. సాల్ట్ ఇన్ మై విలేజ్ సముద్రపు నీటితోనే కాదు.. కొండవారగా పారే నీటితోనూ ఉప్పు తయారవుతుంది. అదే నాగాలాండ్ కథ.. సాల్ట్ ఇన్ మై విలేజ్. 1960ల్లో నాగాలాండ్‌లో జరిగిన ఘర్షణ, హింస నుంచి బతికి బయటపడ్డ మహిళలు ఇలా ఉప్పును తయారు చేసే నైపుణ్యాన్ని సంపాదించుకున్నారు. ముఖ్యంగా ప్హెక్ జిల్లాలోని మాతిక్రూ గ్రామంలోని ఆడవాళ్లకు ఇదే ప్రధాన ఆర్థిక వనరు. కొండ మీద నుంచి చిన్న చిన్న పాయలుగా పారుతున్న నీటిని వెదురు బుంగలు, క్యాన్లలో పట్టుకొని కడవల్లో పోసి కాస్తారు. నీరంతా మరిగి మరిగి... ఆవిరై అడుగున ఉప్పు తయారవుతుంది. వీటిని అచ్చులుగా చేసి (తాటి బెల్లంలా) చుట్టుపక్కల ఉన్న మార్కెట్లో అమ్ముతారు. డబ్బుతోపాటు ఆరోగ్యం అనీ చెప్తారు దీన్ని తయారు చేసే స్త్రీలు. మరుగుతున్న ఈ నీటి ఆవిరిని పీల్చుకోవడం వల్ల జలుబు, దగ్గు, కొన్ని శ్వాసకోశ వ్యాధులూ నయమయ్యాయని అంటారు. అంతేకాదు, ఈ ఉప్పు కూడా ఆరోగ్యకరమే అని చెప్తారు. ఉప్పు తయారీతో అల్లుకుని ఉన్న ఆ మహిళల జీవన విధానాన్ని చూపించిన తీరు ఆకట్టుకుంటుంది. ట్రేడింగ్ చైల్డ్‌హుడ్ ఛత్తీస్‌గఢ్‌లోని బరిమా గ్రామం. ఊళ్లో చాలా మంది పిల్లలు బాలకార్మికులే. పశువులు కాస్తూ, పొలాల్లో పనిచేస్తూ కనిపిస్తారు. వాళ్లందరి ఇంటర్వ్యూలతో ఆ ఊరి చిత్రాన్ని చూపించిన సినిమా ఇది. పేదరికం, వాటికి కారణమైన దేశ సామాజిక, రాజకీయ స్థితిగతులను పరోక్షంగా ప్రశ్నించిన ఈ ఫిల్మ్ పెద్దల బాధ్యతను గుర్తుచేస్తుంది. సమ్ఝౌతా.. సమ్ఝౌతా .. అంటే ఒప్పందం. ఎవరితో.. శవాలతో! అవును. ఇది ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ స్త్రీల జీవన చిత్రం. స్థానిక మీడియా చూసినా.. చదివినా.. బుందేల్‌ఖండ్‌లో ఒక్క నేర వార్త కూడా కనిపించదు. అసలక్కడ క్రైమ్ రేటే ఉండదు. మరి శవాలతో సమ్ఝౌతా ఏంటీ? అదే సినిమా! వరకట్నం వేధింపులు, వాటివల్ల ఆత్మహత్యలు, ఈవ్‌టీజింగ్‌లు, రేప్‌లు, హత్యలు.. ఏం జరిగినా బాధితుల తరపు కుటుంబ సభ్యులను పిలిచి నేరస్తుల కుటుంబ సభ్యులతో సమ్ఝౌతా కుదిరిస్తారు గ్రామ సర్పంచ్‌లు, పెద్దలు వగైరా! అవును, ఖాప్ పంచాయత్లే. నేరం ఎంత పెద్దదయినా సరే.. సమ్ఝౌతానే శరణ్యం. ఫిర్యాదులు నమోదు అవడానికి వీల్లేదు. విచారణ పేరుతో పోలీసులు ఆ ఊళ్లలోకి అడుగు పెట్టడానికి ఆస్కారం లేదు. అందుకే క్రైమ్ రిపోర్ట్‌లో... పోలీసుల వైపు కెమెరా పెడితే.. ‘‘ఫిర్యాదు రాదు.. ఎఫ్ఐఆర్ నమోదు కాదు. ఫిర్యాదు వస్తే... తప్పకుండా న్యాయం చేస్తాం’’ అంటారు. ఇదే సమ్ఝౌతా! చూస్తున్న వాళ్లకు షాక్. ‘సభ్య’ సమాజానికీ అశనిపాతం. ఇవన్నీ తీసినవి ఫిల్మ్‌మేకింగ్‌లో మాస్టర్స్ కాదు. కష్టాల బడిలో ఆరితేరిన వాళ్లు. ఆ డాక్యుమెంటరీల్లో వాళ్లు అనుభవించిన సమస్యలున్నాయి. అందుకే అవి మనసును తడి చేస్తాయి. ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌ను నిర్వహించిన మహిళా రైతుల గురించి చెప్పుకోవాలి. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ దగ్గర్లోని పస్తాపూర్‌కు చెందిన వాళ్లు. చిన నర్సమ్మ, లక్ష్మమ్మ ఇంకా కొందరు మహిళలు. బడుగు, బలహీన వర్గాలకు చెందినవాళ్లు. తమలా సమస్యల సవాళ్లతో జీవితంలో నెగ్గుతున్న వాళ్లు.. వాళ్ల కోణంలో.. వాళ్లు చూసిన సమాజాన్ని కెమెరాలో బంధించి.. డాక్యుమెంటరీలుగా.. షార్ట్ఫిల్మ్స్గా తీస్తే.. ఎందరికో స్ఫూర్తిగా ఉంటుందని ఈ బాధ్యతను చేపట్టారు. దూరదర్శన్ తొలితరం ప్రొడ్యూసర్లలో ఒకరైన మహిళ.. జై చండీరాం. ఆమె జ్ఞాపకార్థం ‘జై చండీరాం మెమోరియల్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’ పేరుతో 2017లో ప్రారంభించారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి జరుపుతున్నారు. ఇది రెండవ యేడాది. ఈ ఇద్దరూ బాల్యపు హక్కులు, ప్రత్యేకతలు, జ్ఞాపకాలు లేకుండా పెరిగారు. ‘రెలు’ కూడా వాళ్లకు అందమైన ఊహ. ఇప్పుడు ఫ్లయిట్లో ఈ ఫెస్టివల్‌కు వచ్చారు. ఆ మాటను మెరిసే కళ్లతో చెప్తారు. చిన నర్సమ్మ, లక్ష్మమ్మకు .. వాళ్ల నాయకత్వంలోని ఇతర మహిళలకూ చదువురాదు. అయితేనేం బతుకు తెలిసిన జ్ఞానవంతులు. అందుకే షూటింగ్‌కి చెందిన హై యాంగిల్, లో యాంగిల్, ఐ లెవెల్ షాట్స్ వంటి సాంకేతిక భాషకు ప్రత్యామ్నాయంగా వీళ్లు కొత్తపరిభాషను ఏర్పాటు చేసుకున్నారు. గాయ్దోళ్ల షాట్, పటేల్ షాట్, సంఘం షాట్‌గా! వాటిని కాయిన్ చేసుకోవడానికి వారి ప్రాంతపు సంస్కృతి, సామాజిక పరిస్థితులే ప్రేరణ, కారణం. దొరతనానికి బానిసలు, ఆర్థికలేమి, నిర్వాసితులుగా వాళ్లు పడ్డ కష్టాలు, అనుభవించిన బాధల్లోంచి పుట్టిన పదాలు అవి. పటేల్ అంటే దొర.. ఎప్పుడూ తన ఎదుట నేల మీద కూర్చుని ఉన్న కూలీలతో కిందకు చూసే మాట్లాడ్తాడు కాబట్టి లో యాంగిల్ షాట్‌ను తమకు అర్థమయ్యేలా పటేల్ షాట్ అని పిలుచుకుంటున్నారు. హై యాంగిల్ షాట్ గాయ్దోళ్ల షాట్ ఎందుకు అయింది? గాయ్దోళ్లు అంటే వెట్టి కూలీలు. తమ ముందు నిలబడి ఉన్న దొరకు సమాధానం ఇవ్వాలంటే పైకి చూస్తూనే మాట్లాడాలి. ఆ సన్నివేశాన్నే వాళ్లు ఊహించుకుని హై యాంగిల్ షాట్‌కి ఆప్ట్ అయ్యేలా గాయ్దోళ్ల షాట్ అని నామకరణం చేసుకున్నారు. సంఘం షాట్.. సంఘం లేదా... సమావేశంలో వాళ్లంతా ఒకచోటే కూర్చుని ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ మాట్లాడుకుంటారు. ఎవ్వరూ తల ఎత్తాల్సిన అవసరం లేదు. తలదించాల్సిన అగత్యం లేదు. అందుకే ఐ లెవెల్ షాట్... సంఘం షాట్లా అనిపించింది వాళ్లకు. ఇది వాళ్లు కల్పించుకున్న స్పృహ.. తెచ్చుకున్న అవగాహన. దక్కన్ రేడియోతో తెలుగు రాష్ట్రాల్లో తొలి కమ్యూనిటీ రేడియోను, వీడియో కెమెరా ఆపరేటింగ్‌తో డాక్యుమెంటరీ, షార్ట్ ఫిల్మ్స్నూ తీస్తున్నారు. తమను చూసి నొసటితో వెక్కిరించిన నోళ్లకు తమ చేతలతో మర్యాద నేర్పుతున్నారు. లక్ష్మణ్ మూడి.. ‘ట్రేడింగ్ చైల్డ్‌హుడ్’ దర్శకుడు. చిన్నప్పుడే అమ్మ చనిపోయింది. నాన్న పెంచి పెద్ద చేశాడు. లక్ష్మణ్ కూడా ఒకప్పుడు బాలకార్మికుడే. తొమ్మిదో తరగతి వరకు చదివి ఆపేశాడు. పెద్దవాళ్లకు తెలియకుండా.. తెలిసిన పెద్దలను ఒప్పిస్తూ ఈ డాక్యుమెంటరీ తీశాడు. బాగా చదువుకోవాలనేది లక్ష్మణ్ ఆశయం. థెనిలో.. ‘సాల్ట్ ఇన్ మై విలేజ్’ డాక్యుమెంటరీ దర్శకురాలు. పదో తరగతితో చదువు ఆపేసింది ఆర్థిక స్తోమత లేక. ఆమె చేనేత కార్మికురాలు కూడా. ఇప్పటికే నాలుగు షార్ట్‌ఫిల్మ్స్ తీసింది. స్క్రీనింగ్ కోసం పలు ప్రాంతాలకు వెళ్లింది. ‘‘మంచి ఫిల్మ్ మేకర్ కావాలనుకుంటున్నా’’ అంటుంది. – సరస్వతి రమ -
మాట వింటే దేవత.. మీటూ అంటే దెయ్యం
ఒక స్త్రీ.. పితృస్వామ్య సమాజం రూపొందించిన చట్రంలో ఇమిడిపోతే ఆమెను దేవతగా కొలుస్తారు. ఆమెను ఇంటికి దీపం అంటారు. అదే స్త్రీ తనకు తాను స్వతంత్ర అభిప్రాయాలతో, వ్యక్తిత్వంతో రాణిస్తుంటే దెయ్యం అనేస్తారు. మగ ఉద్యోగులు లేడీ బాస్‌లను భరించలేకపోవడానికి కారణం కూడా ఈ భావజాలమేనా? ‘ఎస్’ అంటున్నారు సుధా మీనన్. ‘ఉమెన్ ఆన్ టాప్’ అనే అంశం మీద గత నెలలో హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్లో ఒక చర్చాగోష్ఠి జరిగింది. మహిళలు ఎన్ని రంగాల్లో అభివృద్ధి సాధించారో తలుచుకుంటూ స్ఫూర్తిదాయకంగా సాగుతోంది చర్చ. ప్రపంచంలో స్త్రీ– పురుషుల మధ్య సమానత్వం అనేది ఎక్కడా ఆచరణలో లేదని, అవకాశాల్లో అది ప్రతిబింబిస్తూనే ఉంటుందని, అయినప్పటికీ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ ముందుకు సాగడంలో మహిళలు ఎక్కడా వెనుకడుగు వేయకపోవడం వల్లనే ఈ లక్ష్యాలు సాధ్యమయ్యాయని వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. సుధా మీనన్ వంటి రచయితలు తమ అనుభవాలను పంచుకున్నారు కూడా. ఇదే సభలో ఒక వ్యక్తి లేచి ‘ఒక వైపు ‘మీటూ’ ఉద్యమం ఉధృతంగా నడుస్తోంది. మరోవైపు ‘ఉమెన్ ఆన్ టాప్’ అని చర్చా వేదికలూ మీరే నిర్వహిస్తారు. దీనిని ద్వంద్వ వైఖరిగా చూడవచ్చా?’ అనే ప్రశ్న లేవనెత్తాడు. దీని మీద హక్కుల కార్యకర్త వసంత కన్నభిరాన్ స్పందిస్తూ ‘‘అది ద్వంద్వ వైఖరి కాదు, అవి రెండూ రెండు వేర్వేరు కోణాలు మాత్రమే’’ అన్నారు. ‘‘మీటూ ఉద్యమం పట్ల మగవాళ్ల అసహనం ఇలా బయటపడుతోందంతే. మగ సమాజం నుంచి ఎదురవుతున్న సవాళ్లకు బెంబేలు పడి వెనక్కిపోయే మహిళలకు ధైర్యం చెప్పడానికి ‘ఉమెన్ ఆన్ టాప్’ అనే అంశం మీద చర్చ చాలా అవసరం’’ అన్నారామె. ఇప్పటికీ చెప్పలేకపోతున్నారు ‘ఉమెన్ ఆన్ టాప్’ చర్చలో భాగంగా సుధా మీనన్.. మహిళలకు ఎదురయ్యే అనేక సామాజిక పరిమితులను ప్రస్తావించారు. వాటన్నింటినీ అధిగమించి సమాజంలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవడం, దానిని నిలబెట్టుకోవడంలో మహిళలకు తానే చక్కటి నిదర్శనమని కూడా చెప్పారామె. ‘‘చిన్నప్పుడు నేను చాలా ముభావంగా ఉండేదాన్ని. నా భావాన్ని బయటకు చెప్పడం వచ్చేది కాదు. బాల్యం అంతా బిడియంతోనే గడిచింది. మాట్లాడేటప్పుడు ఎదుటి వారి కళ్లలోకి చూడడానికి కూడా భయపడేదాన్ని. అమ్మ ఎప్పుడూ ‘చదువుని నిర్లక్ష్యం చేయకూడదు’ అని చెప్తుండేది. ఎందుకు? ఏమిటి? అని తెలియకపోయినప్పటికీ ఆమె మాటను పాటించడం ఒక్కటే నేను చేసింది. చదవడం వల్ల నాకు నా భావాలను వ్యక్తం చేయడానికి రచన అనే వేదిక దొరికింది. నేను రాసిన ఐదు రచనలకూ సమాజంలో స్త్రీనే ఇతివృత్తం. ఏదీ ఫిక్షన్ కాదు. ప్రతిదీ వాస్తవిక సంఘటనల ఆధారంగా మలిచిన కథనాలే. దశాబ్దాలు దాటినా ఆ రచనలు ఇప్పటికీ కాలదోషానికి గురికాలేదంటే... మన సమాజంలో మహిళ పట్ల మగవాళ్లు చూపిస్తున్న వివక్ష అలాగే ఉందని అర్థం. ఇప్పటికీ ఆడపిల్లలు తమ భావాలను మనసులో దాచుకోవడానికే మొగ్గు చూపుతున్నారు తప్ప వ్యక్తం చేయడానికి సాహసించడం లేదు. ఎందుకంటే సమాజం ఒక లేబిల్ వేస్తుంది. ఆ లేబిల్ని భరిస్తూ జీవించాల్సి వస్తుందనే భయం. చెప్పినట్లు వింటే దేవత. వినకుంటే దెయ్యం. ‘దేవి, దివా ఆర్ షీ డెవిల్’లో అదే రాశాను’’ అని తెలిపారు సుధా మీనన్. సర్దుబాట్లు మహిళకే! ‘‘ఒక మగవాడు కెరీర్లో బిజీ అయితే ఆ ఇంట్లో అందరూ అతడికి సహకరిస్తారు. బంధువుల ఫంక్షన్లకు అతడు హాజరుకాలేకపోతే భార్య, తల్లి, తండ్రి, పిల్లలు అందరూ ‘అతడి తీరికలేనితనాన్ని’ ఇంట్లో వాళ్లతోపాటు బంధువులు కూడా గౌరవిస్తారు. అదే ఒక మహిళ తన ఆఫీస్‌లో బాధ్యతల కారణంగా ‘ఫలానా ఫంక్షన్‌కి నేను రాలేను, మీరు వెళ్లండి’ అంటే ఇంటి నుంచే వ్యతిరేకత మొదలవుతుంది. ‘ఎలాగోలా సర్దుబాటు చేసుకుని రావాలి’ అని ఒత్తిడి చేస్తారు. ఈ పరిస్థితి చూస్తూ పెరిగిన ఆ ఇంటి ఆడపిల్లలు తమ ఇష్టాలను, అభిప్రాయాలను గొంతులోనే నొక్కేసుకుంటున్నారు. ఆడపిల్లలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే వాతావరణం కల్పించలేని ఇంటి నుంచి వచ్చిన అమ్మాయి తనకేం కావాలో సమాజంలో మాత్రం నోరు ఎలా తెరవగలుగుతుంది’’ అని ప్రశ్నించారు సుధ. ‘సమాజంలో అవరోధాలు ఎప్పుడూ ఉంటాయి. వాటిని ఎదుర్కొని నిలబడిన వాళ్లే టాప్‌లో నిలవగలుగుతారు. టాప్‌లో నిలవడానికి చేస్తున్న ప్రయత్నంలో లోపం ఉండరాదు’ అన్నారామె. అదే సందర్భంలో వ్యక్తం అయిన ‘మీటూ ఉద్యమం – ఉమెన్ ఆన్ టాప్’ అంశాల పట్ల విశ్లేషణాత్మక వాదన కొనసాగింది. అంతిమంగా... ‘మీటూ అంటూ ఉద్యమించాల్సిన పరిస్థితులు సమాజంలో అడుగడుగునా ఉన్నాయి. వాటన్నింటినీ ఎదుర్కొని పెద్ద స్థానాలను అధిరోహించిన మహిళలను గుర్తు చేసుకోవడం ఎప్పుడూ అవసరమే. ఇప్పుడు మరింత అవసరం. ఎందుకంటే ‘మీటూ’ ఉద్యమంలో బయటపడుతున్న భయానకమైన అనుభవాలను చూసి ఆడపిల్లలు చాలెంజింగ్ జాబ్స్‌లోకి రావడానికి జంకే ప్రమాదం ఉంటుంది. భయపడి దాక్కోవడం కాదు, బయటకొచ్చి నిలబడాలని చెప్పడానికి ‘ఉమెన్ ఆన్ టాప్’ అనే చర్చ ఎప్పుడూ అవసరమే. మీటూ ఉన్నంతకాలం ఈ చర్చకు ప్రాసంగికత ఉంటూనే ఉంటుంది’ అనే ముగింపుతో గోష్ఠి ముగిసింది. మీటూపై పురుషుల అసహనం లైంగిక వేధింపులకు గురవుతున్న మహిళలు ‘మీ టూ’ అంటూ ముందుకు రావడంతో ఎంతోమంది ప్రముఖుల ముసుగులు తొలిగాయి. ఇలా ఇంకా ఎన్ని తలలు రాలుతాయోననే భయం మగ సమాజాన్ని వెంటాడుతోందిప్పుడు. ఆ అభద్రతలో నుంచి వస్తున్న వితర్క వాదనలే ఇవన్నీ. ఆడవాళ్లకు ఇంత ధైర్యం వచ్చిందేమిటి... అనే అసహనం కూడా పెరిగిపోతోంది. మహిళలు లక్ష్యాలను సాధిస్తున్నారు, టాప్‌లో నిలుస్తున్నారనే వాస్తవాన్ని జీర్ణించుకోవడానికి కూడా అహం అడ్డు వస్తోంది. తనకు ఇంత వరకు తెలిసిన సమాజం తమకు ఫ్రెండ్లీగా ఉంది, ఇప్పుడు మహిళలు గళమెత్తితే వచ్చే మార్పు తమకు అనుకూలంగా ఉండకపోవచ్చు.. అనే ఆందోళన మగవాళ్ల చేత ఇలా మాట్లాడిస్తోంది. చలనశీలి సుధా మీనన్.. బిజినెస్ జర్నలిస్టు, రచయిత, మోటివేషనల్ స్పీకర్. మహిళల్లో నాయకత్వ లక్షణాలు, స్త్రీ–పురుష వైవిధ్యతల ఆధారంగా కార్పొరేట్ సంస్థలు, విద్యాసంస్థల్లో తలెత్తే అంశాలను చర్చించి పరిష్కరించడంలో ఆమె నిష్ణాతురాలు. నాన్ఫిక్షన్ రచనలు ఐదు చేశారు. అవి ‘ఫైస్టీ యట్ ఫిఫ్టీ’, ‘దేవి, దివా ఆర్ షీ డెవిల్’, ‘గిఫ్టెడ్: ఇన్స్పైరింగ్ స్టోరీస్ ఆఫ్ పీపుల్ విత్ డిసేబిలిటీస్’, ‘విరాసత్’, ‘లెగసీ: లెటర్స్ ఫ్రమ్ ఎమినెంట్ పేరెంట్స్ టు దెయిర్ డాటర్స్’. వీటితోపాటు ఆమె ‘గెట్ రైటింగ్’, ‘రైటింగ్ విత్ ఉమెన్’ పేరుతో రైటింగ్ వర్క్‌షాపులు నిర్వహించారు. - వాకా మంజులారెడ్డి -
వైఎస్ జగన్ బీసీ గర్జనకు విశ్వబ్రాహ్మణ సంఘం మద్దతు
-
పాపం
పాపం అన్నవారికి సిగ్గులేదు...అయ్యో పాపం అన్నవారికి బుద్ధిలేదు.అతడే డిసైడ్ చేస్తాడు...ఆమె ఎలా బతకాలన్నది!తల్లయినా చెల్లయినా భార్యైనా...ప్రియురాలైనా స్నేహితురాలైనా...అతడే నిర్ణయిస్తాడు వాళ్లెలా బతకాలన్నది.ఎలా బతకడం అన్నది నా హక్కయినప్పుడు... బతికి ఉండటం నా హక్కు కాదా?పోనీ... పుట్టడం అయినా నా హక్కు కాదా?పుట్టనివ్వకపోవడం పాపం కాదా?ఆ పాపం చేసిన మనిషి అపరాధి అయితే...చూసి ఏమీ చేయని మనిషి మహాపరాధి..!! ప్రపంచంలో జనాభా ఎంత పెరిగినా..ఒక మనిషి మిస్ అవడం పెద్ద విషయం.వెంటనే ఫిర్యాదు వెళుతుంది.వెంటనే పోలీస్ హంట్ మొదలౌతుంది. చుట్టాలు ధైర్యం చెబుతారు. చుట్టుపక్కల వాళ్లు ఓదార్పు ఇస్తారు. కానీ అమ్మ కడుపులోనే‘మిస్’ అయిపోయే ఆడగుడ్డు మాటేమిటి?ఫిర్యాదు చేసేదెవరు? ఉరుకులు, పరుగులు మీద వెదికేదెవరు? ‘నన్ను బతకనివ్వండి ప్లీజ్’ అని పితృస్వామ్య సమాజంలో స్త్రీ ఇంకా ఆక్రోశిస్తూనే ఉంది.‘నన్ను వేధించకండి, ఉద్యోగం చేసుకోనివ్వండి ప్లీజ్’ అని ఉద్యోగిని మౌనంగా రోదిస్తోంది.‘నన్ను చదువుకోనివ్వండి ప్లీజ్’ అని కుగ్రామంలో బాలిక కన్నీళ్లు పెట్టుకుంటోంది. ఇవన్నీ పుట్టిన తర్వాత సమాజంలో మనుగడ కోసం ఏడ్చే ఏడుపులు. ఆడపిల్లకు ఏడుపు.. పుట్టిన తర్వాతే... ఇంకా చెప్పాలంటే పుట్టుకతోనే మొదలవుతుంది అనుకుంటాం. అంతకంటే అమాయకత్వం మరోటి ఉండదు. ఆడపిల్ల పుట్టుక కోసం కూడా ఏడవాల్సి వస్తోందిప్పుడు. పుట్టింది ఆడపిల్ల అని తెలియగానే ఇంట్లో శవం లేచినట్లు ముఖాలు నల్లగా పెట్టుకునే రోజులుండేవని అప్పట్లో చదివాం. ఆ బిడ్డను బతకనివ్వకుండా గొంతులో విషపు చుక్క వేసి చంపేసే కర్కశత్వం గురించి తెలిసి చివుక్కుమన్న మనసుని చిక్కబట్టుకున్నాం. ఇప్పుడు టెక్నాలజీ అభివృద్ధి చెందింది. టెక్నాలజీని అడ్డుపెట్టుకుని అమానుషత్వం వికృతహాసం చేస్తోంది. ఆడపిల్లను పుట్టనివ్వకుండానే కడుపులోనే చిదిమేయడం వెనుక ఆ కరడుకట్టిన నిర్ణయం ఎవరిది? మన రాష్ట్రాలు ‘మగ’రాష్ట్రాలు! తెలుగు రాష్ట్రాల్లో తల్లుల గర్భాల్లో ఊపిరి పోసుకున్న నలుగురు ఆడపిల్లల్లో ముగ్గురే భూమ్మీద పడుతున్నారు. ఆ ఒక ఆడబిడ్డ పుట్టకుండానే మరణిస్తోంది! ‘సెక్స్ రేషియో ఆఫ్ బర్త్’ గణాంకాల ప్రకారం రాజస్తాన్, ఆంధ్రప్రదేశ్‌లలో వెయ్యిమంది మగపిల్లలు పుడితే ఆడపిల్లలు 806కే పరిమితమవుతున్నారు. ఈ తేడా ప్రకృతి వివక్ష కాదు, సమాజం వివక్ష. 2016 నాటి ఈ లెక్కల్లో ఈ రాష్ట్రాలు జాతీయ సరాసరి సంఖ్య 877 కంటే చాలా తక్కువలో ఉన్నాయి. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే అట్టడుగు స్థానంలో ఉన్నాయి. అంతకు మునుపు దాదాపు ఒక దశాబ్దం వెనక్కు వెళ్లినట్లయితే ఆంధ్రప్రదేశ్‌లో వెయ్యి మంది మగపిల్లలు పుడితే, ఆడపిల్లల సంఖ్య 974గా ఉంది. 2007 నాటికి కూడా వ్యత్యాసం ఉంది. అయితే అప్పటికే లింగ నిర్ధారణ చేసే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేసింది. ప్రీనాటల్ డయాగ్నోసిస్‌ను అరికట్టే చట్టమూ వచ్చేసింది. పెరిగిన విజ్ఞానంతోపాటు మనుషుల్లో జ్ఞానం, సంస్కా రం కూడా పెరిగి ఉంటే మగపిల్లలు– ఆడపిల్లల పుట్టుక మధ్య వ్యత్యాసం తగ్గిపోయేది. విజ్ఞానాన్ని కూడా మేల్ డామినేషనే ప్రభావితం చేస్తోంది కదా.. 2016 నాటికి తేడా ఏపీలో ఏకంగా 17 శాతానికి పడిపోయింది. తెలంగాణలో 2013 లో వెయ్యికి మగపిల్ల లకు 954 మంది ఆడబిడ్డలు పుట్టారు, 2016 నాటికి ఆ సంఖ్య 881కి పడిపోయింది. 2007కి– 2016కి మధ్య 2011లో ఏపీలో ఊహించని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో 993 కి చేరింది. కేరళ(954) కంటే మెరుగ్గా ఉంది. ఆ తర్వాత మళ్లీ తగ్గుతూ వస్తోంది! తల్లిపై మెట్టినింటి ఆంక్షలు ఆడపిల్ల... తాను పుట్టిన తర్వాత అయితే తన ఉనికి కోసం తానే పోరాడుతుంది. పుట్టక ముందే పిండాలను ఛిద్రం చేసే చేతుల నుంచి కాపాడేది ఎవరు? కడుపున ఆడపిల్ల పుట్టింది అంటే... అదనపు భారం అనుకున్నా, అంత్యకాలంలో అన్నానికి భరోసా ఇచ్చేది ఆడపిల్లే. అయినా... బిడ్డ పుట్టిన తర్వాత మాయమైతే ‘మిస్సింగ్’ కేసు పెట్టి వెతుక్కోవచ్చు. కడుపులోనే కనుమరుగవుతున్న బిడ్డల కోసం ఎక్కడ వెతకాలి? తల్లి కడుపులో ఛిద్రమవుతున్న బిడ్డను వెతికిపెట్టడం ఏ పోలీస్ వ్యవస్థకు చేతనవుతుంది. అసలు ఫిర్యాదు చేసేదెవరు? బిడ్డను కడుపులోనే చిదిమేస్తున్న పాపం ఎవరిదో కాదు, పూర్తిగా అమ్మానాన్నలదే. అంతకంటే సూటిగా చెప్పాలంటే... ఆ తల్లిని ఆంక్షల వలయంలో బంధిస్తున్న పురుష సమాజానిది. ‘ఆడపిల్ల పుడితే ఇంట్లో అడుగుపెట్టనివ్వం’ అని కళ్లురిమే మెట్టినింటిది. – మంజీర -
ప్రవక్త దృక్కోణంలో హక్కులు... బాధ్యతలు
సమాజంలో ప్రతి ఒక్కరికీ కొన్ని హక్కులు, బాధ్యతలు ఉంటాయి. ముహమ్మద్ ప్రవక్త(స), ప్రజల సామాజిక బాధ్యతలను గుర్తుచేస్తూ, ధర్మం వారికిచ్చినటువంటి హక్కులను కూడా విశద పరిచారు. ముఖ్యంగా మానవ హక్కులను గురించి, వ్యక్తిగత స్వేఛ్ఛను గురించి విడమరిచి చెప్పారు. పరుల సంపదను హరించడం గురించి ఖురాన్ ఆదేశాలను వివరిస్తూ, ‘మీలో మీరు ఒకరి ఆస్తిని మరొకరు అన్యాయంగా, అక్రమంగా కబళించకండి’. అని చెప్పారు. అల్లాహ్ ఆదేశం ఇలా ఉంది. ‘ఒకజాతి ప్రజలు మరోజాతి ప్రజలను అవహేళన చేయవద్దు. ఒకరికొకరు తమ ప్రతిష్టలకు భంగం కలిగించుకో వద్దు. మారుపేర్లతో ఒకరినొకరు పరిహసించుకోవద్దు. ఒకరి వెనుక ఒకరు చెడుగా మాట్లాడుకోవద్దు. నిందలు వేసుకోవద్దు. ప్రవక్త మహనీయులు తమ చివరి హజ్ యాత్ర సందర్భంగా చేసిన ప్రసంగం కూడా చరిత్రాత్మకమైనది:’ప్రజలారా! బాగా వినండి. అజ్జానకాలపు దురాచారాలన్నీ అంతమైపొయ్యాయి. అరబ్బు వ్యక్తికి అరబ్బేతరునిపై, అరబ్బేతరునికి అరబ్బుపై, తెల్లవారికి నల్లవారిపై, నల్లవారికి తెల్లవారిపై ఎలాంటి ఆధిక్యతా లేదు. మీ సేవకులను తక్కువ దృష్టితో చూడకండి. మీరు తినేలాంటి భోజనమే వారికి పెట్టండి. మీరు ధరించే లాంటి బట్టలే వారికీ సమకూర్చండి. మహిళలూ మీలాంటివారే. మీకు వారిపై ఏవిధంగా హక్కులున్నాయో, అదేవిధంగా వారికీ మీపై హక్కులున్నాయి. పరస్పరం హాని తలపెట్టుకోరాదు. ప్రాణాలు తీసుకోరాదు. ప్రళయకాలం వరకు కూడా..నేను మీకోసం రెండువస్తువులు వదిలి వెళుతున్నాను. మీరువాటిని దృఢంగా పట్టుకోండి. ఎన్నటికీ దారి తప్పరు. ఒకటి పవిత్రఖురాన్, రెండవది సున్నత్, అంటే నా సాంప్రదాయం’. అంతేకాదు, మీరు ఇతరుల వ్యక్తిగత జీవితాల్లో కల్పించుకోకండి. ఇతరులపై గూఢచర్యానికి పాల్పడకండి. మీ స్వగృహం తప్ప ఇతరుల ఇళ్ళలోకి వారి అనుమతి లేకుండా ప్రవేశించకండి’’ అని హితవు చేశారు. ఏవ్యక్తినైనా శిక్షించాలంటే, న్యాయస్థానంలో అతడి నేరం రుజువుకావాలి. ఇతరుల మతవిశ్వాసాలను గౌరవించాలని ఆదేశిస్తూ, వారి మతవిశ్వాసాలకు, హక్కులకు భంగం కలిగే చర్యలన్నిటినీ ఆయన నిషేధించారు. ఈ విధంగా ప్రవక్తమహనీయులు సమస్త హక్కులనూ నిర్వచించారు. మానవులు ఆ అమృత ప్రవచనాలను అర్ధం చేసుకొని ఆచరించగలిగితే, సమాజం అన్నిరకాల అసమానతలకు, లోపాలకు అతీతంగా విశిష్ట సత్సమాజంగా రూపుదిద్దుకుంటుంది. అల్లాహ్ మనందరికీ విజ్ఞానాన్ని, సద్బుద్ధినీ ప్రసాదించాలని కోరుకుందాం. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
తాడిపత్రిలో జేసీ వర్గీయుల దౌర్జన్యం
-
అమ్మ... ఆయా... ఓ కథ
సినిమాల్లో హీరోయిన్ ఎప్పుడూ హీరోకి చెవిలో తల్లవుతున్న సంగతి చెబుతుంది. పాటలో ఆమెకు నవమాసాలు నిండటం, మొదటి చరణంలో పిల్లాడు పుట్టడం, రెండవ చరణంలో ఎనిమిదేళ్ల వాడయ్యి బెలూన్లు పట్టుకుని పరుగుతీయడం... అంతా హ్యాపీగా జరిగిపోయినట్టు చూపిస్తారు. నిజంగా అంత హ్యాపీనా? మాతృత్వం చుట్టూ మధుర భావనలే సృష్టించింది ఈ ప్రపంచం. ఏ ప్రపంచం? మగ ప్రపంచం. తల్లి కావడం స్త్రీ జీవితానికి ధన్యత అన్నారు. తల్లి వల్లే సమాజం అన్నారు. తల్లి పూజ్యనీయురాలు అన్నారు. తల్లి పాదాల వద్దే స్వర్గం ఉందన్నారు. స్త్రీ వేరు. తల్లి వేరు. తల్లి అయిన స్త్రీకే ఈ సమాజంలో సమ్మతి. లేదంటే ఈసడింపులు. అందుకే స్త్రీలు తల్లులు కావడానికి తహతహలాడతారు. తల్లి కావాలనే సహజాతం వారిలో ఉంటుంది. తల్లి కావాల్సిన భౌతిక అవసరం ఉంటుంది. ఈ రెంటికీ పురుషుడి ప్రోత్సాహం ఉంటుంది. కాని తల్లి అయ్యే సమయంలో, తల్లి అయ్యాక, బిడ్డను, పెంపకాన్ని నిర్వహించాల్సిన సమయంలో తల్లికి పురుషుడి తోడ్పాటు ఎంత? సహకారం ఎంత? సహానుభూతి ఎంత? సినిమాల్లో హీరోయిన్ ఎప్పుడూ హీరోకి చెవిలో తల్లవుతున్న సంగతి చెబుతుంది. పాటలో ఆమెకు నవమాసాలు నిండటం, మొదటి చరణంలో పిల్లాడు పుట్టడం, రెండవ చరణంలో ఎనిమిదేళ్ల వాడయ్యి బెలూన్లు పట్టుకుని పరుగుతీయడం... అంతా హ్యాపీగా జరిగిపోయినట్టు చూపిస్తారు. నిజంగా అంత హ్యాపీనా?హాలీవుడ్లో కూడా సినిమాలు ఇలాగే ఉండేవి.కాని ఆ పరంపరను బ్రేక్ చేస్తూ అక్కడ తాజాగా రాబోతున్న సినిమా ‘టాల్లీ’.ఈ టాల్లీ అనేది ఆయా పేరు. ఈమె ఎవరికి ఆయా? ఈ సినిమాలోని ‘మార్లో’ అనే గృహిణి పిల్లలకు ఆయా. మార్లో న్యూయార్క్ శివార్లలో ఉండే గృహిణి. భర్త ఇద్దరు పిల్లలు ఉన్నారు. మూడో బిడ్డకు జన్మనివ్వనుంది. నిండు గర్భిణి. మాతృత్వం గొప్పదే కావచ్చు. పిల్లలకు జన్మనివ్వడం స్త్రీ జన్మకు సార్థకత కావచ్చు. కాని ఏమేమి కోల్పోతే ఒక స్త్రీ ఈ మాతృత్వ దశకు చేరుకుంటుంది? ఈ సినిమాలో ఇద్దరు పిల్లలతో, కడుపులో ఉన్న బిడ్డతో మార్లో సతమతమవుతుంటుంది. గర్భం వల్ల బరువు పెరిగి ఉంటుంది. అందం చందం పట్ల ఆసక్తి ఉండదు. ఏదో ఆందోళన. భర్త మంచివాడే కాని అతడు తన కెరీర్లో తాను బిజీగా ఉంటాడు. మహా అయితే పిల్లల హోమ్ వర్క్‌లో సాయం చేస్తుంటాడు. కాని ఇంట్లో ఇరవై నాలుగ్గంటలు ఉండే భార్య ఇరవై నాలుగ్గంటల పాటు చిన్నా పెద్ద పనులను చక్కబెట్టుకుంటూ తనను తాను ఎలా మిగుల్చుకోగలదు? ఇండియా నుంచి అమ్మలో అత్తలో ఫ్లయిట్ ఎక్కి అమెరికా చేరుకుంటారు కాన్పు సమయంలో సహాయానికి. అమెరికా వాళ్లకు అలా కుదరదు. పైగా న్యూయార్క్‌లో అది చాలా ఖర్చు. మార్లో కష్టాన్ని గమనించిన ఆమె తమ్ముడు తన సొంత ఖర్చుతో ఆమెకు ఒక ఆయాను ఏర్పాటు చేస్తాడు. దీనిని ముందు మార్లో నిరాకరిస్తుంది. కాని తర్వాత ఆ ఆయాను అంగీకరిస్తుంది. పిల్లల బాగోగులు చూడటానికి రోజు రాత్రి వచ్చి నైట్ డ్యూటీ చేసే ఆ ఆయా మార్లో జీవితంలో ఒక పెద్ద సమీరంలా వీస్తుంది. నిద్ర లేచే పిల్లలతో, డైపర్లు మార్చాల్సిన పసి బిడ్డతో, నిద్రే కరువైన మార్లో ఆయా రావడంతో కంటి నిండా నిద్ర పోగలుగుతుంది. కాన్పయ్యాక కూడా ఆమె డెలివరీ తాలూకు బరువైన శరీరంతో కష్టపడుతుంటుంది. పాలు పొంగి వక్షోజాలు సలపరించినప్పుడల్లా బిడ్డ వక్షాన్ని నోటికి అందుకోకపోతే ఏం చేయాలి? ఆ పాలను బాటిళ్లలో పడుతుంటుంది. ఈ సందర్భాలన్నింటిలో ఆయా ఆమె మానసికంగా గట్టి సమర్థింపు ఇస్తుంది. ఒక స్త్రీ కష్టం ఇంకో స్త్రీకే తెలుస్తుందంటారు. అసలు స్త్రీ కష్టం మగ ప్రపంచానికి ఎప్పటికి తెలియాలి?ఈ సినిమా గొప్పతనం ఏమంటే ఇందులో మార్లోగా నటించిన చార్లెజ్ థెరాన్ నిజ జీవితంలో ఎప్పుడూ తల్లి కాలేదు. కాని ఆమె నటన చూసినవారు అవన్నీ అనుభవించి చేస్తున్నట్టుగా భావిస్తారు. ఇక ఆయాగా నటించిన మెకంజీ డేవిస్‌కు ఒక గర్భిణీ స్త్రీ భావోద్వేగాలను గమనించే వీలు గతంలో లేదు. అయినప్పటికీ వీళ్లిద్దరూ అద్భుతంగా ఆ సన్నివేశాలను రక్తి కట్టించి విమర్శకుల ప్రశంసలు పొందుతున్నారు. ఇవాళ నగరాల్లో, పట్టణాల్లో, పల్లెల్లో కూడా మైక్రో ఫ్యామిలీలను ఇష్టపడుతున్నారు. పెళ్లయ్యి విడి కాపురం ఆ తర్వాత గర్భం...గర్భ సమయంలో స్త్రీ గురించి ఆమె మానసిక ప్రపంచం గురించి ఆకాంక్షలు అభిరుచులు గురించి ఆలోచించే అవసరాన్ని ఆమెకు ఎలా ఇష్టమైతే అలా మారాల్సిన మగ ప్రపంచం గురించి మరింత చర్చ జరగాల్సి ఉంది. లైట్ పడాల్సి ఉంది.ఇలాంటి సినిమాలు అందుకు సహకరిస్తాయని ఆశిద్దాం.టాలీ మే 4న అమెరికాలో రిలీజవుతుంది. ఇండియాకు వస్తే తప్పక చూడండి. -
రేవు బాబురావు మృతిపట్ల వైఎస్ జగన్ సంతాపం
సాక్షి, అమరావతి: మత్స్యకార వర్గ నాయకుడు రేవు బాబురావు మృతికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం ప్రకటించారు. మత్స్యకార వర్గానికి ఆయన మృతి తీరని లోటు అని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ద్వారకానగర్(విశాఖ దక్షిణ): మత్స్యకార సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ రేవు రత్నకుమారి భర్త రేవు బాబూరావు(77) అనారోగ్యంతో శనివారం విశాఖపట్నంలోని రైల్వే న్యూకాలనీలోని ఆయన స్వగృహంలో మృతిచెందారు. ఆయన కనకమహాలక్ష్మి కో–ఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్‌గా కూడా ఉన్నారు. అంత్యక్రియలు సోమవారం ఉదయం 8 గంటలకు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. మత్స్యకార సంఘం సంతాపం కోస్తా మత్స్యకార సంఘం ఆధ్వర్యంలో ఎంవీపీ కాలనీలో ఏర్పాటు చేసిన సమావేశంలో బాబూరావు మృతికి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఎస్టీ సాధన సమితి కన్వీనర్ మూగి శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ బాబూరావు మత్స్యకారులకు ఎంతో సేవ చేశారని, ఆయన మృతి మత్స్యకారులకు తీరని లోటన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు తెప్పల శాంతారాం, కె.తాతారావు, కదిరి రాము, తెడ్డు శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
పిల్లలకు మంచిమాటలు నేర్పిస్తున్నారా?
సమాజం అభివృద్ధి అనుకరణతోనే సాగింది. ముఖ్యంగా భాష పెంపొందేది దీనితోనే. పిల్లలు ‘అమ్మ’ అనమంటే ‘అమ్మ’ అంటారు. ‘ఆవు’ అనమంటే ‘ఆవు’ అంటారు. ఇంటిలోనే భాష సరిగా లేకుంటే పిల్లలకు ఎలా వస్తుంది? కొన్నిసార్లు ఇంటిలో ఎలాంటి తప్పుమాటలు మాట్లాడకపోయినా పిల్లలు అక్కడక్కడ విని నేర్చుకుంటారు. ఇలాంటి అలవాటును మొదటిలోనే మాన్పిస్తే పిల్లలకు మంచి భాష అలవడుతుంది. మీ పిల్లలూ ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే మాన్పించే ప్రయత్నం చేస్తున్నారా? 1. పిల్లలు తప్పు మాట్లాడిన వెంటనే దాన్ని సవరిస్తారు. ఎ. అవును బి. కాదు 2. తప్పు మాటలు మాట్లాడేటప్పుడు పట్టించుకోకుండా, వారిని మీ అటెన్షన్లోకి తెచ్చే ప్రయత్నం చేస్తారు. ఎ. అవును బి. కాదు 3. పిల్లలకు చెప్పే ముందు మీరూ అలాంటి మాటలు మాట్లాడరు. ఎ. అవును బి. కాదు 4. చెడ్డమాట స్థానంలో మంచిమాట మాట్లాడిన ప్రతిసారీ ఏదైనా బహుమతి ఇస్తామని ప్రామిస్ చేస్తారు. ఎ. అవును బి. కాదు 5. పిల్లలు ఇలాంటి మాటలను చాలా చోట్ల నుంచి వింటారు కాబట్టి వారిని అర్థం చేసుకొని, అలాంటి పదాల నష్టం ఏమిటో వివరిస్తారు. ఎ. అవును బి. కాదు 6. పిల్లల ప్రవర్తనలో మార్పు రాకపోతే కొంచెం ఘాటుగా స్పందించటానికి వెనకాడరు. ఎ. అవును బి. కాదు 7. తప్పు మాట్లాడిన ప్రతిసారీ ఒక రూపాయి కాయిన్, రూమ్‌లో అమర్చిన జార్లో వేయాలని చెప్తారు. (దీన్నో గేమ్లాకాక పనిష్మెంట్లా ఉపయోగిస్తారు) ఎ. అవును బి. కాదు 8. చెడ్డమాటలకు బదులు నవ్వు తెప్పించే పదాలు ఉపయోగించటం నేర్పిస్తారు. ఎ. అవును బి. కాదు 9. పిల్లలు అలాంటి మాటలను ఎక్కడనుంచి నేర్చుకుంటున్నారో గమనించి ఆ సోర్సును ఆపేస్తారు. ఎ. అవును బి. కాదు 10. మాట్లాడకూడని మాటలు మాట్లాడినప్పుడు నవ్వరు. నవ్వు వారిని ఎంకరేజ్ చేస్తుందని మీకు తెలుసు. ఎ. అవును బి. కాదు ‘ఎ’ లు ఏడు దాటితే పిల్లల తప్పుమాటలు మాన్పించటానికి ప్రయత్నిస్తారు. ఇదేవిధంగా వారిలో మంచి ప్రవర్తన కలగటానికి ప్రయత్నించండి. ‘బి’ లు ‘ఎ’ ల కన్నా ఎక్కువగా వస్తే పిల్లల్లో మంచిమాటలు నేర్పించటానికి ఎలాంటి ప్రయత్నాలు చేయరు. ‘ఎ’ లను సమాధానాలుగా చేసుకొని పిల్లల ప్రవర్తనలో మార్పు తీసుకురావటానికి ప్రయత్నించండి. -
మీ ఇల్లు బంగారం కానూ..!
ఏ ఇంట్లో అయినా ఆడపిల్ల బంగారం కావాలి. అదేంటో... ఆ బంగారమే బరువైపోతోంది! పుట్టింటికేనా? మెట్టినింటికీ బరువే! ఈ ఇంటి బంగారాన్ని తీసుకెళ్లిన ఆ ఇంటి వాళ్లు కూడా.. అదేదో ‘మీ బరువు తగ్గించడానికే’ అన్నట్లు ఫీలైపోతారు. ఆడపిల్లంటే ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవరికైనా భారమేనా? అందుకేనా ఆడపిల్లపై ఇంత హింస!అసలు.. కడుపులో ఉన్నప్పుడే ఆడపిల్లను భారం అనుకునేవాళ్లూ ఉన్నారు. తల్లి మోయడానికి సిద్ధంగా ఉన్నా, మిగతా వాళ్లకు ఆయాసం వచ్చేస్తుంది. నేరమనీ, పాపమనీ తెలుసు. అయినా కడుపులోనే బరువును ఆవిరి చేసేస్తారు. కుదరకపోతే, పుట్టాక చెత్తకుండీలో పడేస్తారు. కసి తీరకపోతే ముళ్లపొదల్లో విసిరేస్తారు. మానవత్వానికే ముళ్ల కిరీటం పెట్టేస్తారు! ముళ్లబాట పరిచేస్తారు.పుట్టడానికే గతిలేని బంగారానికి ఇక బతికే భాగ్యం ఎక్కడిది?బతికి బట్టకట్టినా... డొమెస్టిక్ వయలెన్స్ నుంచి బయటపడే దారెక్కడిదీ?! ‘ఏం మాట్లాడుతున్నారు! సమాజం మారింది. ఇప్పుడు మరీ అంత క్రూరంగా ఏం లేదు’ అని ఎన్ని వాదనలు వినిపించినా, వినిపించనివి.. కడుపులో దాచిపెట్టుకున్న ఆడపిల్లల బాధలు, ఆవేదనలే! గర్భంలో బిడ్డ చనిపోయిన ట్లే.. కాలగర్భంలో ‘సమాజం మారిందనే’ వాదనలూ కలిసి పోతున్నాయి. గృహహింసకు గురైన అమ్మాయికి మాట్లాడే హక్కు ఉంది. మనమే ధైర్యం కలిగించాలి. ఇంటా బయటా చాకిరీ చేస్తూ, దుర్భాషలకు, దుర్మార్గాలకు గురవుతున్న ఆడపిల్లకు మనమే అండ కావాలి. మనమే భరోసా ఇవ్వాలి. సమాజం మారిందని చెప్పుకోగల మార్పుకు మన ఇల్లు మాత్రమే వేదిక అయిపోతే సరిపోదు. మన ఇంటి బిడ్డలాగే ప్రతి ఇంటి కోడలికి, తల్లికి, భార్యకు, చెల్లికి గృహహింస లేకుండా చూడాలి. ప్రతి ఇంట్లోనూ ఆడపిల్ల సుఖంగా ఉంటే.. మెట్టినింట్లో మన బిడ్డా సుఖంగా ఉంటుంది.అప్పుడు కొత్త బంగారు లోకం... బరువనిపించని బంగారు లోకం.. పుడుతుంది. - మర్ర రామ్ ఎడిటర్, ఫన్డే – ఫ్యామిలీ -
పులిరాజా వారి సత్యశోధన
ఒక పులి ముసలితనంలో తొందరపడి సన్యాసం తీసుకుంది. బొమికలు కొరకాల్సిన చేతుల్తో రుద్రాక్షమాల గిరగిరా తిప్పడం మొదలెట్టింది. కమండలాన్ని ఊతకర్రగా పెట్టుకొని, గతంలో తాను వేటాడి చంపిన జింక చర్మంపై కూచుని తాపీగా ధర్మబోధలు ప్రారంభించింది. జంతువులు ఎందుకైనా మంచిదని దూరంగా ఉండి ప్రవచనాలు వినసాగాయి. దగ్గరికెళితే మోక్షం లభించినా లభించవచ్చని వాటి నమ్మకం.ఇంటర్వ్యూలకి మనుషులెవరూ మిగలకపోయేసరికి టీవీ చానళ్ల వాళ్లు అడవి మీద పడి ఎలాగో సన్యాస పులిని వాసన పట్టారు. ఆ సమయానికి చెట్టుమీద పులి నిద్రపోతూ ఉంది. నిచ్చెనలేసుకుని మరీ దాన్ని గోకారు. పులి భయంతో కిందపడి గాండ్రుమంది. ఒకరిద్దరు విలేకరులు జడుసుకున్నప్పటికీ న్యూస్ మిస్సయితే గర్జించే బాస్ మొహం గుర్తొచ్చి తమాయించుకున్నారు.స్పిరిట్కైనా, స్పిరిచ్యువాలిటీకైనా ఈ రోజుల్లో పబ్లిసిటీ అవసరం. కెమెరాలు చూడగానే పులి మీసాలు దువ్వుకుంది. ఒకరిద్దరు వచ్చి దాని మొహానికి పౌడర్ అద్ది, మైక్‌ని పంజాకి తగిలించి వెళ్లారు. ఇంటర్వ్యూ ప్రారంభమైంది. ‘‘చెప్పండి పులిరాజా, మీరు సన్యాసం ఎందుకు స్వీకరించారు?’’ ‘‘పులికి, పులిస్తారకుకి తేడా తెలియని లోకమిది. టైని మెడకి కట్టుకున్న ప్రతివాణ్నీ టైగర్ అనుకునే కాలమిది. సత్యానికి, అసత్యానికి సరిహద్దురేఖ చెరిగి పోయినపుడు సన్యాసమే పరమధర్మమని గ్రహించాను’’‘‘మీరు సన్యాసం స్వీకరించాక సన్యాసిగా మారారా? సన్యాసి అని మనస్ఫూర్తిగా నమ్మిన తర్వాత సన్యాసం స్వీకరించారా?’’ఈ ప్రశ్నకి పులి పులిగోరుతో బుర్రని గోక్కుంది.‘‘వేటాడే శక్తి లేనివాళ్లని మా పులి కమ్యూనిటీలో సన్యాసి అని అంటారు. అనివార్యత సంభవించినపుడు సన్యాసాన్ని యోగం అనుకోవాలి’’ అని చెప్పింది పులి.‘‘అంటే మీరిప్పుడు కందమూలాల్ని తింటారా?’’‘‘కందమూలాల్ని తినడం మా పులి మూలాల్లోనే లేదు. సన్యాసానికి ముందు జంతువుల్ని నమిలి తినేదాన్ని. ఇప్పుడు పళ్లు లేవు కాబట్టి నమలకుండా తింటున్నాను.’’‘‘అది హింస కాదా?’’‘‘తెలిసి చేస్తే హింస, ఆకలేసి చేస్తే అహింస’’‘‘ఏంటో తేడా?’’‘‘నేను జంతువుల్ని వేటాడితే హింస, నా దగ్గరకొచ్చిన జంతువుల్ని తింటే అహింస. అహింసా పద్ధతుల్లో వేటాడ్డం సన్యాసుల లక్షణం’’ఈసారి విలేకరులు బుర్రగోక్కుని టాపిక్‌ను డైవర్ట్ చేయాలనుకుని‘‘ఈ సమాజంపై మీ అభిప్రాయం?’’ అని అడిగారు.‘‘పులి వేషగాళ్లని పులులనుకుంటుంది. పులిని చూసి పులేషమనుకుంటుంది’’ ‘‘జంతు స్వామ్యం గురించి చెప్పండి’’ ‘‘జంతువులకి కూడా హక్కులుంటాయని జంతువులు నమ్మడం జంతుస్వామ్యం. పులికి అంతకుమించి హక్కులుంటాయని పులి నమ్మడం పులిస్వామ్యం. రాజ్యమెప్పుడూ పులిస్వామ్యం పక్షానే ఉంటుంది. హక్కులు పుస్తకాల్లో ఉంటాయి. కోరలు పులికి ఉంటాయి. పులిపేరుతో నువ్వు పులిహోరను తినగలవు. పేరులో పులి ఉందని పులి ఎప్పుడూ పులిహోర తినదు.’’ ‘‘పాలిటిక్స్ ఎందుగ్గానీ సినిమాలు చూస్తారా?’’ ‘‘పులి క్షణాల్లో చంపితే, సినిమా రెండున్నర గంటలు చంపుతుంది’’ ‘‘అడవిలో ఎందుకు ఉండడం? జనజీవన స్రవంతిలో కలిసిపోవచ్చుగా..’’‘‘పిచ్చోడా, పులులు మనుషులుగా మారి చాలా కాలమైంది. జాగ్రత్తగా గమనించి చూడు.. మీ పక్కింట్లో, ఎదురింట్లో కూడా పులులుంటాయి. ప్లాస్టిక్ సర్జరీతో చారలను మాయం చేసుకుని ఉంటాయి’’‘‘మీ సందేశమేమిటి?’’ ‘‘ఈ ప్రపంచమొక అడవి. నువ్వు పులివో, జింకవో నిర్ధారించుకో. పులివైతే జింకను వేటాడు. జింకవైతే పులినుంచి పారిపో. పారిపోవడం కూడా యుద్ధం లాంటిదే. ఆయుధం లేకుండా యుద్ధం చేయడమే జీవితం.’’ ఒక విలేకరిని అందుకొని నమలబోతే మింగుడుపడలేదు. ‘‘విలేకరులంటే కొరకని కొయ్యలు పులిరాజా!’’ అంటూ కెమెరాలు సర్దుకొని వెళ్లిపోయారు. – జి.ఆర్.మహర్షి -
అభినందించటానికి మీరెంత దూరం?
సెల్ఫ్ చెక్ ఆటల్లో గెలిచినవారు, చదువులో ర్యాంకులు సాధించినవారు, సమాజం కోసం కష్టపడి పనిచేసేవారు... ఎవరైనా ఒక మంచిపని చేసినా లేదా ఏదైనా సాధించినా కోరుకొనేది చిన్నపాటి అభినందన. ఇది లభించినప్పుడు వారు పడిన శ్రమనంతా మరచిపోతారు. అభినందించే తత్వం ఉండాలంటే ప్రేమ ఉండాలి. అసూయద్వేషాలకు దూరంగా ఉండాలి. ఇతరులను అభినందించాలంటే మీ అహం మీకు అడ్డుగా ఉందేమో ఒకసారి పరిశీలించుకోండి. 1. ఎవరైనా మంచిపని చేసినప్పుడు తప్పకుండా అభినందిస్తారు. ఎ. కాదు బి. అవును 2. మీ అభినందనలు ఎవరికైనా తెలియచే యలేకపోతే, అంతటితో వదిలేయరు. ఎంతకాలం గడిచినా ఎప్పటికైనా వారితో మీ మనసులోని మాటను చెబుతారు. ఎ. కాదు బి. అవును 3. మనిషి కోర్కెలకు అంతం ఉండదని మీకు తెలుసు. మీ కోర్కెలను అదుపులో పెట్టుకుంటారు. ఇతరులనుంచి ఏదీ ఆశించరు. ఎ. కాదు బి. అవును 4. ఎదుటివారి ఎదుగుదలను ఓర్వలేరు. వారు అలా ఎందుకు అభివృద్ధి చెందాలి? అని ఆలోచిస్తుంటారు. ఎ. అవును బి. కాదు 5. ఆనందం విలువ మీకు తెలుసు. అందుకే ఇతరులు ఏదైనా సాధించినప్పుడు మీ అభినందనల ద్వారా వారికీ సంతోషాన్ని ఇవ్వాలనుకుంటారు. ఎ. కాదు బి. అవును 6. మీకు లభించే ప్రతివస్తువు (విద్యుత్తు, ఎలక్ట్రానిక్ వస్తువులు, హోమ్ అప్లికేషన్స్, ప్రకృతి ద్వారా లభించేవి మొదలైనవి)ను గౌరవిస్తారు. వాటిద్వారా లభించే సౌకర్యాలను అప్రిషియేట్ చేస్తారు. ఎ. కాదు బి. అవును 7. మీరు సాధించలేని వాటి కారణాలను విశ్లేషిస్తారేకాని, వాటిగురించి ఆందోళన చెందరు. మీరు సాధించిన దానికి మిమ్మల్ని మీరే అభినందించుకుంటారు. ఎ. కాదు బి. అవును 8. మీ దగ్గరకు ఎవరైనా సహాయం కోరి వస్తే తప్పకుండా హెల్ప్ చేస్తారు. ఎదుటివారి స్కిల్స్‌ను బయటపెట్టడానికి ట్రై చేస్తారు. వారిని ఎంకరేజ్ చేస్తారు. ఎ. కాదు బి. అవును 9. ఇతరుల తప్పొప్పులను ఎంచటమే పనిగా పెట్టుకుంటారు. ఎదుటివారు ఎంత గొప్పపని చేసినా అది మీ దృష్టిలో చాలా చిన్నదిగా కనిపిస్తుంది. ఇతరుల మనసు గాయపరచటం మీకలవాటు. ఎ. అవును బి. కాదు 10. ఆత్మతృప్తి మీకుంటుంది. గడచిన జీవితం ఆనందంగానే సాగిందని నమ్ముతారు. మీకు సహాయంగా నిలిచిన అందరికీ మనసులో కృతజ్ఞతలు తెలుపుతారు. ఎ. కాదు బి. అవును ‘బి’ సమాధానాలు ఏడు దాటితే మీలో అభినందించే తత్వం బాగా ఉంటుంది. స్వార్థంతో ఉండకుండా ఏదైనా సాధించిన వారిని అప్రిషియేట్ చేయగలరు. దీనివల్ల నలుగురితో మీకు పరిచయాలు ఏర్పడతాయి. మీపై మంచి అభిప్రాయం కలుగుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మీకు సంతృప్తి మిగులుతుంది. ‘ఎ’ లు ఆరు దాటితే ఇతరులను అభినందించాలంటే మీకసలు నచ్చదు. అందరినీ అభినందించటం తెలుసుకోండి. చిన్న ప్రశంస గొప్ప ఆనందాన్నిస్తుంది. -
టీడీపీకి కమ్మ సామాజిక వర్గం షాక్
– కార్పొరేషన్ ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయించకపోవడంపై అగ్రహం – ఎమ్మెల్యేల తీరుపై తీవ్ర ఆవేదన – మాజీ ఎమ్మెల్సీ భాస్కర రామారావు ఆధ్వర్యంలో సమావేశం – పెద్దపీట వేసిన వైఎస్సార్ సీపీకి ఓటేద్దామని నిర్ణయం సాక్షి ప్రతినిధి, కాకినాడ : టీడీపీకి కమ్మ సామాజిక వర్గం షాకిచ్చింది. 10వేలకు పైగా ఓటర్లున్న తమ సామాజిక వర్గానికి టీడీపీ, బీజేపీ మొండిచేయి చూపాయని కమ్మ సామాజిక వర్గ నేతలు మండిపడుతున్నారు. ఒక్క డివిజన్ కూడా కేటాయించకుండా తమను పూర్తిగా విస్మరించారని కమ్మ సామాజిక వర్గమంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. వైఎస్సార్ సీపీ తమ సామాజిక వర్గానికి పెద్దపీట వేసిందని, ఆ పార్టీకే మద్దతు తెలపాలని దాదాపు నిర్ణయించుకున్నారు. కమ్మ సామాజికి వర్గానికి పోటీ చేసే అవకాశాన్ని టీడీపీ ఇవ్వలేదు. వారికి ఒక్క సీటు కూడా కేటాయించలేదు. వేలాది ఓట్లు ఉన్న తమపై ఎందుకంత చిన్న చూపని ఆ సామాజిక వర్గ నేతలంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు మంగళవారం కాకినాడలోని ఎన్ఎఫ్సీఎల్ రోడ్డులోని ఈటూ రెస్టారెంట్లో కమ్మ సామాజిక వర్గ నాయకులంతా సమావేశమయ్యారు. తమకు టిక్కెట్ ఇవ్వకపోగా ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, పిల్లి అనంతలక్ష్మి ప్రవర్తన సరిగా లేదని, తమపై నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని సమావేశంలో ప్రస్తావించారు. ఎన్నికల్లో ప్రభావం చూపే ఓట్లు ఉన్న తమను చిన్న చూపు చూడటం సరికాదని, ఎన్నికల్లో టీడీపీ, బీజేపీకి తగ్గిన బుద్ధి చెప్పాలని సమావేశంలో నిర్ణయించారు. టీడీపీ, బీజేపీ అనుసరించిన తీరుకు నిరసనగా ఎన్నికల్లో వ్యతిరేకంగా పనిచేయాలని నిర్ణయించారు. దీనిపై సమగ్రంగా చర్చించేందుకు బుధవారం మరోసారి నాగమల్లి తోట జంక్షన్ వద్ద సమావేశమవ్వాలని నిర్ణయించారు. మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో గుణ్ణం చంద్రమౌళి, బోళ కృష్ణమోహన్, గోళ్లమూడి అజయ్‌కుమార్, రావిపాటి రామరాయచౌదరి, గారపాటి రాయుడు పాల్గొన్నారు. -
మన్నించు ఇర్ఫాన్...
జీవన ప్రవాహం జూన్, 8, 2014. పనికిరాని చదువులకు బైబై చెప్పి జర్నలిజంలో చేరిన తొలి రోజులు. అప్పుడప్పుడే పుస్తకాల విలువ తెలిసింది. ఆదివారం కావడంతో గురువుగారి ఆదేశం గుర్తొచ్చింది. తొలిసారి శ్రీశ్రీ మహాప్రస్థానం, దేవరకొండ బాలగంగాధర తిలక్ అమృతం కురిసిన రాత్రి వరస పెట్టి చదివాను. సందర్భం వచ్చింది కాబట్టి ఈ పుస్తకాల గురించి ఒక్క వాక్యంలో చెప్పాలి. 21వ శతాబ్దపు సమాజంలో బతకాలంటే దయచేసి ఈ పుస్తకాలు చదవకపోవడమే ఉత్తమం. ఎందుకంటే ఇప్పుడిప్పుడే మనిషిలో సమాధి అవుతున్న నీతి, నిజాయతీ, ప్రేమ, కరుణ లాంటి ఈ సమాజానికి సరిపడని ఎన్నో ‘అవలక్షణాల’కు ఈ రెండు పుస్తకాలు మళ్లీ ఊపిరి పోస్తాయి. ఒక్కమాటలో చెప్పాలంటే మనిషిలోని మనిషితనాన్ని మళ్లీ తట్టిలేపుతాయి. అంతే జీవితం నాశనం. సంపాదన అనే ప్రవాహంలో ఈదడం చేతకాక, విలువలు, సమాజం అని ‘పనికిరాని’ వాటి గురించి ఆలోచించడం మొదలు పెట్టేస్తాం. సరే అవన్నీ పక్కనపెడితే.. శ్రీశ్రీ విప్లవ సాహిత్యం తాలూకు ఆవేశమో లేక తిలక్ భావ కవిత్వంలోని ఆవేదనో మనసు భారంగా, మెదడు దూరంగా వెళుతున్నాయి. ఇలా అయితే కష్టమని తలచి, వెంటనే జన జీవన స్రవంతిలో కలవాలని నా వసతి గృహానికి రెండు కిలోమీటర్ల దూరంలో సరూర్ నగర్ చెరువు అంచున ఉన్న ప్రియదర్శిని ఉద్యానవనానికి సాయంకాలపు వ్యాహ్యాళికి బయలు దేరా. మధ్యలో శివ టీ స్టాల్లో ఛాయ్ అదనపు ఖర్చు. అలా చెరువు అంచున ఉన్న ప్రేమ జంటల్ని ఓ కంట కనిపెడుతూ మొత్తానికి పార్కుకు చెరుకున్నా. టికెట్ తీసుకొని అలా లోపలికి వెళ్లి పచ్చని గడ్డిలో కూర్చొని సేద తీరుతున్నా. అన్ని కథల్లోలాగే ఆకాశం కూడా నిర్మలంగానే ఉంది. ఆదివారం, పైగా వేసవి సెలవులు కూడా దగ్గర పడటంతో పార్క్ అంతా పిల్లలు, వారి తల్లిదండ్రులతో నిండిపోయింది. తుప్పల్లో ప్రేమ జంటల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరో చివర కాస్త ఓపెన్ ప్లేస్‌లో వృద్ధులంతా ఒక చోట చేరి ఆ మధ్యే వచ్చిన ఎన్నికల ఫలితాలతో పాటు రాజకీయాలు, సినిమాలు, అవి చేస్తున్న చేటు, చెడిపోతున్న యువత అంటూ వాళ్ల రొటీన్ కబుర్లలో మునిగిపోయారు. మళ్లీ అదే గోల ఎందుకని వారికి కాస్త దూరంగా వెళ్లి పచ్చని గడ్డిలో పడుకొని, ఏవో కాలేజీ రోజుల జ్ఞాపకాలు నెమరు వేసుకుంటున్నా. ఇంతలో ఒక చెయ్యి నా భుజాన్ని తడుతున్నట్లు అనిపించింది. కళ్లు తెరచి చూస్తే ఒక బాలుడు. భుజాల దగ్గర కిందికి చిరిగిన చొక్కా. మూమూలు పాత ప్యాంటు. దరిద్ర నారాయణుడికి బ్రాండ్ అంబాసిడర్లా ఉన్నాడు. ఏడెనిమిదేళ్లుంటాయి అనుకుంటా. ఏదో చెబుతూ చివర్లో ఏక్ రూప్యా దేదోనా భయ్యా.. అని అన్నాడు. అదొక్కటే స్పష్టంగా అర్థమైంది. సరే ఒక్కణ్నే ఉన్నా కదా. కాసేపు వాడితో సంభాషించాలని డిసైడ్ అయ్యా. అదే నా మొదటి ఇంటర్వ్యూలా భావించి మాటలు కలిపా. నాకు ఉర్దూ రాదు. కానీ వాడికి తెలుగు వచ్చు. హమ్మయ్య అనుకున్నా. అలా మా మధ్య జరిగిన సంభాషణ.. నీ పేరేంటి తమ్ముడు? ... ఇర్ఫాన్ అన్నా. ఎక్కణ్నుంచి వచ్చావు?... భగత్‌సింగ్ నగర్. మీ అమ్మా నాన్న ఏం చేస్తారు?... మా నాయిన సచ్చిపోయిండు. అయ్యో ఎలా? మాది మహబూబ్‌నగర్ అన్నా. రెండేండ్ల కింద అణ్నే ఉంటుండే. మా నాయిన కిరాయి ఆటో నడుపుతుండే. ఒక రోజు రాత్రి ఆటో కిరాయికి వోయి మళ్ల ఇంటికి వస్తుండు. మందు తాగి నడిపిండంట. లారీ గుద్ది సచ్చిపోయిండు. ఆడ బత్కనీకి ఏం లే. అందుకే ఈడొచ్చి ఉంటున్నాం. మరి ఇక్కడేం చేస్తుంది మీ అమ్మ? మా గల్లీ దగ్గర పెద్ద బిల్డింగ్ ఉంది. దాంట్ల పనిచేస్తది. ఏం చేస్తుంది? పెద్దొళ్లు ఉంటరు కదా. వాళ్ల ఇంట్ల గిన్నెలు కడిగి, బట్టలు ఉతుకుద్ది. మీ ఇంట్ల ఎవరెవరు ఉంటారు? అమ్మ, ఇమ్రాన్, నేను. సరే. మరెందుకు ఇలా డబ్బులు అడుక్కుంటున్నవ్? మా అమ్మ అడుకొచ్చుకోమన్నది. ఇయ్యాల జరమొచ్చి పనికి పోలే. ఎవలు అన్నం పెట్టలే. పైసల్ అడుకొచ్చుకొని ఏమన్న కొనుకోమని చెప్పింది. మరి రోజూ ఎలా తింటారు? పొద్దున మా అమ్మ ఎంట నేను తమ్ముడు పోతం. ఆడ ఆళ్లు కొంచెం అన్నం పెడ్తరు. మధ్యానం మళ్ల ఉస్కూల్ పోత కదా. ఆడ తింట. మళ్ల పొద్దూకంగ మా అమ్మ ఎంట పోతం మళ్ల ఆళ్లు ఏమన్న పెడ్తరు. మరి ఎవరూ డబ్బులు ఇవ్వకపోతే? మా అమ్మ నీళ్లు తాగి పండుకోమంటదన్నా. ఏమన్న పెట్టమంటె పైసల్లేవంటది. మాకు మస్తు ఆకలైతదన్నా. మా తమ్ముడు మస్తేడుస్తడన్నా. అంతే నా నోటి నుంచి మరో ప్రశ్న రాలేదు.. కళ్ల వెంట రెండు చుక్కలు తప్ప. వాడు అలా చెప్పగానే రోజూ నేను వృథా చేస్తున్న వాటిని తలుచుకుంటే సిగ్గేసింది. ఆ క్షణం నేనేం చేయ్యలేకపోయా.. నా జేబులో ఉన్న పది రూపాయల నోటు వాడికి ఇవ్వడం తప్ప. ఇక అక్కడ ఒక్క క్షణం కూడా ఉండాలనిపించలేదు. అలా ఖాళీ జేబుల్లో చేతులు పెట్టుకొని వెళ్లిపోయా.. ‘అన్నార్థులు అనాథలుండని ఆ నవయుగమదెంత దూరం.. కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడో’ అని ఆవేశాన్ని, ఆవేదనను కలిపి దాశరథి రాసిన కవితను గుర్తుతెచ్చుకుంటూ. ఇర్ఫాన్ విషయాన్ని కొద్ది రోజుల తర్వాత కొంతమంది మిత్రులతో కూడా పంచుకున్నా. చాలా మంది హేళనగా మాట్లాడారు. ‘కష్టం చేతగాని వాళ్లు అలా అడుక్కొని తింటారు అని ఏవోవో చెప్పారు. ఏమో నిజమే కావచ్చు. వాళ్లకు తారసపడిన వాళ్లు అలాంటి వాళ్లే అయ్యుండొచ్చు. కానీ, ఇర్ఫాన్ మాత్రం అలా కాదు. తనతో మాట్లాడుతున్నంత సేపు వాడి మాటల్లో నిజాయతీ వినిపించింది. కళ్లల్లో ఆకలి స్పష్టంగా కనిపించింది. ఆ తర్వాత పార్కుకు వెళ్లినప్పుడు వాడు రాలేదు. కానీ, అలాంటి ఇర్ఫాన్‌లు మాత్రం చాలా మంది కనిపించారు. ‘మన్నించు ఇర్ఫాన్ నేను నీకేం చేయలేనా?’ అంటూ ఆ పార్కుకు వెళ్లినప్పుడల్లా గుర్తు చేసుకుంటున్నా. - శివశంకర్ -
దేవాంగులు ఉన్నత పదవులు చేపట్టాలి
రాజమహేంద్రవరం కల్చరల్ : దేవాంగులు విద్యావంతులై, ఉన్నత పదవులు చేపట్టాలని ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి ఆశపు రామలింగేశ్వరరావు ఆకాంక్షించారు. జాంపేట ఉమారామలింగేశ్వరస్వామి కల్యాణమండపంలో ఆదివారం జరిగిన రాష్ట్ర దేవాంగ సంఘం ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశానికి నగర దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బొమ్మన రాజకుమార్ అధ్యక్షత వహించారు. సంఘం నగర కార్యదర్శి కాలెపు సత్యనారాయణ మాట్లాడుతూ త్వరలో 13 జిల్లాలకు చెందిన దేవాంగ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. బళ్లా శ్రీనివాస్, పడాల వీరభద్రరావు,కె.విశ్వేశ్వరరావు తదితరులు న్యాయమూర్తి ఆశఫు రామలింగేశ్వరావు దంపతులకు వారి చిత్రపటాన్ని బహూకరించారు. కార్పొరేటర్ ద్వారా పార్వతీసుందరి పాల్గొన్నారు. -
వైష్ణవ సంఘం ఆధ్వర్యంలో ఉపకార వేతనాలు
కోదాడ: ప్రతిభ ఉన్న శ్రీవైష్ణవ విద్యార్థులను ప్రోత్సహించడానికి దాతలు ముందుకు రావాలని శ్రీవైష్ణవ సంఘం నాయకులు కోరారు. ఆదివారం కోదాడలోని రంగనిగుడిలో జరిగిన సమావేశంలో నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు చెందిన ఉత్తమ ప్రతిభ చూపుతున్న శ్రీ వైష్ణవ విద్యార్థులకు సంఘం ఆధ్వర్యంలో ఉపకారవేతనాలను అందజేశారు. పేదరికం ప్రతిభకు అడ్గుగా మారకూడదని,పేద విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా వారికి తగిన ప్రోత్సహాన్ని అందించడానికి శ్రీవైష్ణవ తెలంగాణ శాఖ సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీవైష్ణవ తెలంగాణ శాఖ అధ్యక్షుడు శృంగార తిరువెంగళాచార్యులు, కోదాడ శాఖ అధ్యక్షుడు చించాపట్టణం రజనీకాంతచార్యులు, కృష్ణమాచార్యులు, యాదగిరిచార్యులు, లక్ష్మణాచార్యులు, భరద్వాజ్, రాధాదేవి, వరదాచార్యులు తదితరులు పాల్గొన్నారు. -
సమాజంలోని అసమానతలు రూపుమాపాలి
బామ్సెఫ్ రాష్ట్ర అధ్యక్షులు చెన్నయ్య కరీంనగర్: సమాజంలోని అసమానతలు రూపుమాపాలని బామ్సెఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బి.చెన్నయ్య అన్నారు. ఆదివారం రెవెన్యూ గార్డెన్లో జరిగిన తెలంగాణ రాష్ట్ర బామ్సెఫ్ మూడో రాష్ట్ర మహాసభలో ఆయన మాట్లాడుతూ బహుజన పితామహులు మహత్మా జ్యోతిబాపూలే, సాహుమహారాజ్, అంబేద్కర్ సిద్ధాంతాలను నిమ్నవర్గాలకు అందజేస్తూ సమాజ రుగ్మతలను పారదోలేందుకు విద్యావంతులు ముందుకు రావాలని సూచించారు. సమాజాన్ని చైతన్యపర్చడంలో బామ్‌సేప్ కార్యకర్తలు అగ్రభాగాన నిలవాలని కోరారు. బ్రిటిష్ ప్రభుత్వం, బ్రాహ్మణులతో పోరాడి బాబాసాహెబ్ అంబేద్కర్ కమ్యూనల్ అవార్డును సాధించారని, పూనా ఒప్పందం పేరుతో గాంధీ సాధించిన హక్కులను లాక్కున్నారని ఆరోపించారు. ఎస్సీ,ఎస్టీ,బీసీలు హక్కుల సాధన కోసం దమాషా ప్రకారం పోరాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బామ్‌సేఫ్ ప్రతినిధులు జనాబ్ ఆహ్మద్ మహ్మద్ సాహెబ్, దాసురాం నాయక్, రేవెల్లి శంకర్, ప్రొఫెసర్ ఎల్లన్నయాదవ్, ఎన్.దేవేందర్(ఎస్టీఓ), అమరేందర్, నాగెల్లి దేవేందర్, సుదర్శనం, కట్టెకోల లక్ష్మణ్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు. -
కులాంతర వివాహం చేసుకుందని బహిష్కరణ
యువతి అంత్యక్రియలకు రాని కులస్తులు ఫిర్యాదు చేసిన బాధితులు మద్దూరు : ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించినందుకు మద్దూరు మండలం కూటిగల్ గ్రామానికి చెందిన వడ్ల సౌం దర్య మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే బుధవారం ఆమె దహన సంస్కార కార్యక్రమాలకు సౌందర్య కులస్తులు ఎవరూ రాలేదు. ‘సౌందర్య అక్క లా వణ్య పెద్దలను కాదని అదే గ్రామానికి చెందిన వ్యక్తిని కులాం తర వివాహం చేసుకుంది.. అందుకోసం మీ ఇంటికి మేం ఎవ్వరం రాము’ అని కులస్తులు చెప్పారని మృతురాలి సోదరుడు రాజు తెలిపారు. అంత్యక్రియలకు డప్పుల వాళ్లను సైతం రానివ్వలేదని చెప్పారు. ఈ విషయమై మద్దూరు పోలీసులకు సమాచారం ఇవ్వగా కానిస్టేబుళ్లు వచ్చి వివరాలు సేకరించారు. ప్రస్తుతం సౌందర్య దహన సంస్కారాలు నిర్వహించండని, గురువారం ఈ విషయాలను పరిష్కరిస్తామని పోలీసులు తెలుపడంతో మృతురాలు సౌందర్య కుటుంబ సభ్యులు, బంధువు లు అంత్యక్రియలు నిర్వహించారు. -
నిరుపయోగంగా కమ్యూనిటీ భవనాలు
నడిగూడెం: మండల పరిధిలోని పలు గ్రామాల్లో పదేళ్ల క్రితం కమ్యూనిటీల ఐఖ్యత, అభివద్ధి కోసం లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన కమ్యూనిటీ భవనాలు నేడు నిరుపయోగంగా మారాయి. సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యంతోనే ఆ భవనాలు నిరుపయోగంగా ఉంటున్నాయని ప్రజలు అంటున్నారు. ఆ భవనాలను నిర్మించిన నాటి నుంచి ప్రారంభించకపోవడంతో నేడు పలు గ్రామాల్లో కమ్యూనిటీ భవనాలు పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. నిర్మాణ సమయంలో పలు మౌలిక సౌకర్యాలు కల్పించకపోవడంతోనే ఉపయోగించుకోలేక పోతున్నామని ప్రజలు వాపోతున్నారు. ప్రధానంగా మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ఆరు లక్షల రూపాయలతో నిర్మించిన కమ్యూనిటీ భవనం నేడు పూర్తిగా శిథిలావస్థకు చేరింది. దర్వాజలు, కిటికీలు దొంగలపాలు.. బృందావనపురం ఎస్సీ కమ్యూనిటీ భవనంలో దర్వాజలు, కిటికీలు దొంగలపాలయ్యాయి. రత్నవవరం, కాగితరామచంద్రాపురం, సిరిపురం, శ్రీరంగాపురం, రామాపురం, గ్రామాల్లోని ఎస్సీ కమ్యూనిటీ భవనాలు, శ్రీరంగాపురం, తెల్లబెల్లి, త్రిపురవరం, గ్రామాల్లోని బీసీ కమ్యూనిటీ భవనాలు పరిస్థితి కూడా అదేవిధంగా ఉంది. ఆరు నెలల కిందట వేణుగోపాలపురంలో ఎనిమిది లక్షల రూపాయలతో నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ భవనం ప్రారంభానికి నోచుకోలేదు. సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి మండలంలో నిరుపయోగంగా ఉంటున్న కమ్యూనిటీ భవనాలను పరిశీలించి, దినపత్రికలు, మాస పత్రికలు, ఫ్యాన్లు, కుర్చీల ఏర్పాటు తదితర సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఉపయోగంలోకి తీసుకరావాలి.....ఎల్.వీరబాబు, మా గ్రామంలో బీసీ, ఎస్సీ కాలనీల్లో నిర్మించిన కమ్యూనిటీ భవనాలు నిరుపయోగంగా ఉంటున్నాయి. లక్షల రూపాయల వ్యయంతో ఆ భవనాలను నిర్మించారు. కానీ ఉపయోగయోగ్యంగా లేవు. సంబంధిత అధికారులు స్పందించి కమ్యూనిటీ భవనాలను ఉపయోగంలోకి తీసుకరావాలి. మౌలిక సౌకర్యాలు కల్పించాలి.......కాసాని కిషోర్, నిరుపయోగంగా ఉంటున్న కమ్యూనిటీ భవనాల్లో ప్రజలకు కావాల్సిన దినపత్రిలు, వారపత్రికలు, మాస పత్రికలతో పాటు ఫ్యాన్లు, కుర్చీలు ఏర్పాటు చేయాలి. దీంతో కమ్యూనిటీల్లో ఐక్యత పెరుగుతుంది. యువతకు కావాల్సిన పరిజ్ఞానం అందుతుంది. -
సంయమనం పాటించండి: సీఎం
హర్యానా: రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు అందరూ సహకరించాలని ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కోరారు. జాట్ల రిజర్వేషన్ అంశంపై శుక్రవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఖట్టర్ మాట్లాడుతూ.. రిజర్వేషన్ అంశంపై ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక మార్చి 31 వరకు వస్తుందని, అప్పటి వరకు హింసాత్మక ఘటనలకు పాల్పడకుండా అందరూ సహకరించాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం జాట్ కమ్యూనిటీ తీవ్రస్థాయిలో ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. గురువారం పలు హింసాత్మక ఘటనలతో రోహ్తక్ ప్రాంతంలో 15 మందికి పైగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అక్కడ మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపేసింది. -
వెంచర్ ఫండ్స్‌కు ప్రోత్సాహం..!
నారాయణ మూర్తి సంఘంకీలక సిఫారసులు ♦ ప్రైవేటు ఈక్విటీ, వెంచర్ కేపిటల్ ఫండ్స్‌ను ఆకర్షించేలా చర్యలకు సూచనలు ♦ సానుకూల పన్ను విధానాలకు సలహా న్యూఢిల్లీ: ప్రైవేటు ఈక్విటీ (పీఈఎఫ్) అలాగే వెంచర్ క్యాపిటల్ (వీసీఎఫ్) నిధులకు సంబంధించిన నిబంధనల్లో పెద్ద ఎత్తున మార్పులు తీసుకురావాలని ఇన్ఫోసిన్ వ్యవస్థాపకులు ఎన్ఆర్ నారాయణ మూర్తి నేతృత్వంలోని కమిటీ పేర్కొంది. దేశీయంగా, అంతర్జాతీయ ఇన్వెస్టర్ల నుంచి దీర్ఘకాలిక నిధులను ఆకర్షించేలా చర్యలు తీసుకోవాలని మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఏర్పాటుచేసిన అత్యున్నత స్థాయి కమిటీ సిఫారసు చేసింది. ముఖ్యంగా ఇందుకు తగిన సానుకూల పన్ను వ్యవస్థ ఉండాలని సూచించింది. కొత్తగా పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి కల్పన లక్ష్యంగా కేంద్రం ప్రతిష్టాత్మక ‘స్టార్టప్ ఇండియా’ కార్యక్రమాన్ని నేపథ్యంలో కమిటీ ఈ కీలక సిఫారసులు చేయడం గమనార్హం. సెబీకి సమర్పించిన కమిటీ సిఫార్సుల్లో ముఖ్యాంశాలు చూస్తే... దేశంలో ఫండ్ నిర్వహణా వ్యవస్థలను ప్రోత్సహించాలి. పీఈఎఫ్, వీసీఎఫ్కు సంబంధించి ప్రస్తుత ప్రత్యామ్నాయ పెట్టుబడుల ఫండ్ (ఏఐఎఫ్) వ్యవస్థను సంస్కరించాలి.ప్రైవేటు ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ పెట్టుబడులకు తగిన సెక్యూరిటీ లావాదేవీల పన్నును ప్రవేశపెట్టాలి. తద్వారా ఆదాయాలకు సంబంధించి ఒక పటిష్ట పన్ను విధానాలు అమలు చేయాలి. పెట్టుబడులు సుదీర్ఘకాలం సుస్థిరంగా కొనసాగేందుకు పన్ను ప్రోత్సాహకాలు అవసరం. విదేశీ ఫండ్స్‌ను ఆకర్షించడంలో తీవ్ర వైఫల్యం నెలకొంటోంది. ఏఐఎఫ్స్లో ప్రవాసభారతీయుల పెట్టుబడులకు సంబంధించి నిబంధనలను సరళతరం చేయాలి. ఆయా అంశాల్లో సంక్లిష్టతలు తొలగించాలి. ఈ నివేదికపై ఫిబ్రవరి 10 వరకూ సంబంధిత వర్గాలు సలహాలు, సూచనలు ఇవ్వాలని సెబీ విజ్ఞప్తి చేసింది. 15 ఏళ్లలో 103 బిలియన్ డాలర్లు... 2001-2015 మధ్య దాదాపు 103 బిలియన్ డాలర్ల విలువైన వెంచర్ కేపిటల్, ప్రైవేటు ఈక్విటీ నిధులు భారత కంపెనీల్లోకి వచ్చాయి. దాదాపు 12 ప్రధాన రంగాల్లోని 3,100కుపైగా సంస్థలు ఈ తరహా నిధులను అందుకున్నాయి. -
రెండు మూడు నెలల్లో ఇక్కడికి వచ్చేస్తాం..
విజయవాడ : హైదరాబాద్ నుంచి రెండు మూడు నెలల్లో ఇక్కడికి అందరం తరలి వచ్చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇక్కడ నుంచే ప్రభుత్వ కార్యకలాపాలు సాగిస్తామన్నారు. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశాలు నిర్వహించారు. రాత్రి జరిగిన విలేకరుల సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. విజయవాడకు రాజధాని కళ వచ్చేసిందని ఆయన ప్రకటించారు. ఈ ప్రాంతంలో రాజధానిని వ్యతిరేకించినవారే ఇప్పుడు సమర్థిస్తున్నారని తెలిపారు. రాజధాని నిర్మాణంపై కూడా పూర్తిస్థాయిలో దృష్టిసారిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే 90 శాతం భూసమీకరణ పూర్తయిందని, మిగిలిన 10 శాతం కోసం అవసరమైతే భూసేకరణ చట్టం ప్రయోగిస్తామని స్పష్టం చేశారు. మంగళవారం రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై కేంద్ర మంత్రులు రాజనాథ్సింగ్, అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడులతో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు బుధవారం ప్రధాని నరేంద్రమోదీతో రాష్ట్ర సమస్యలపై మాట్లాడారు. ఇదే విషయాన్ని ఆయన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుపై సమీక్ష ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎస్ఎల్జీ గ్రూపు చైర్మన్ డాక్టర్ సుభాష్ చంద్ర సీఎంతో భేటీ అయ్యారు. నూతన రాజధాని నిర్మాణం, పరిశ్రమలకు రాష్ట్రంలో కల్పిస్తున్న అవకాశాలను చంద్రబాబు ఆయనకు వివరించారు. ఉదయం రాష్ట్రంలో కొత్త పరిశ్రమల ఏర్పాటు, పరిశ్రమలకు కావాల్సిన నీరు తదితర అంశాలపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇదే సమయంలో రాజధాని కోసం ఇప్పటివరకు జరిగిన భూసమీకరణ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో పాఠశాలల అభివృద్ధి, రేషనలైజేషన్ తదితర అంశాలపై విద్యాశాఖాధికారులతో సమీక్షించారు. పర్యాటక రంగంలో ఏపీకి ఉజ్వల భవిష్యత్తు ఉందని జీ గ్రూపు చైర్మన్ సుభాష్‌చంద్ర అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఆయన మాట్లాడుతూ అవకాశమిస్తే తాము తూర్పు ఆసియా దేశాల మధ్య జలమార్గాలలో క్రూయిజ్ వసతులు కల్పించి టూరిజంలో ఏపీని హబ్‌గా చేసుకుంటామని తెలిపారు. ఏపీలో పెట్టుబడులకు సిద్ధమేనని ప్రకటించారు. ఏపీతో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. శ్రీసిటీలో సౌరవిద్యుత్ పరికరాల ఉత్పత్తి ప్రారంభించేందుకు ఆయన ఆసక్తి కనబరిచారు. రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలకు ముఖ్యమంత్రి బుధవారం రాత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనికి సంబంధించి త్వరలో గైడ్‌లైన్స్ విడుదల చేస్తారు. -
హక్కులు జిందాబాద్
-
రింగ్‌టోన్ రూపంలోనూ కులమే..
గత నెలలో సాగర్ షే జ్వాలా అనే 21 ఏళ్ల వయసుగల దళితుడిని, షిర్డీలో ఓబీసీ కులానికి చెందిన యువకులు దారుణంగా కొట్టి చంపారు. అతడు చేసిన నేరమేమిటంటే డా॥బి.ఆర్.అంబేద్కర్ రింగ్‌టోన్ పెట్టుకోవడమే. దళితులపై జరిగే క్రూరదాడులకు ఇదొక ఉదాహరణ. గతంలో వేదాలు విన్నారని చెవుల్లో సీసం పోశారు. వేదాలు చదివారని నాలు కలు కోశారు. మనుధర్మం పాటించనందుకు, దళితులను తరతరాలుగా అవమానాలకు గురిచేస్తూ వచ్చారు. ఇప్పుడు మాత్రం దళితులపై జరిగే దాడులపట్ల కుహనా సానుభూతి ప్రకటిస్తూ, కులతత్వ విషకోరలను దాచి పెడుతున్నారు. కాగా రింగ్‌టోన్ రూపంలో కూడా మన దేశంలో కుల ప్రభా వం ఉందని ఈ ఘటన నిరూపించింది. ప్రపంచదేశాలకు భారతీయులు వెళితే వారు అక్కడే స్థిరపడితే, ఆ దేశాలలో కూడా కులవ్యవస్థ ఆవిర్భవిస్తుందని డా॥బాబా సాహెబ్ అంబేద్కర్ ఎన్నడో చెప్పారు. ఇది అక్షరాల నిజం. ఈ రోజు భారతీయులు ఇతర దేశాలలో కులాల పేర్లతో ఎన్నో కార్య క్రమాలు చేస్తూ, వారి అగ్రకులతత్వాన్ని నిలబెట్టు కుంటు న్నారు. ఇంకా దేశంలో కులం పెచ్చురిల్లుతూ, కులాల పేరుతో, కుల రాజ్యాన్ని ఏలుతూ అగ్రకులతత్వాన్ని నిల బెట్టుకుంటున్నారు. ‘సాగర్ షే జ్వాలా’ మరణం ఆధునిక ‘మనుతత్వం’. తరతరాల నుంచి దళిత జాతులపై జరిగే దాడులకు ఇది ప్రతిరూపం. దళితులు, అగ్రవర్ణం వారు ఉండే వీధిలోకి వస్తే ఒకప్పుడు రచ్చబండ కింద కొరడా దెబ్బలతో కొట్టి, వెలివేసే వాళ్లు. ఇప్పుడు కులతత్వం ఆధు నిక హంగులు దిద్దుకుంది. నాగరికత అభివృద్ధి చెందేకొద్దీ, కులతత్వం కూడా ఆధునిక రూపం సంతరించుకుంటోంది. ఈ రోజు దళితులను కుల సర్టిఫికేట్లతో గుర్తిస్తూ, ప్రైవేట్ రాజ్యాన్ని, అగ్రవర్ణం వారు ఆక్రమించి, ఇతర ఏ రంగంలో నైనా అగ్రవర్ణం వారికి ప్రాధాన్యతనిస్తూ, ఆ తరువాతే దళి తులకు, అవకాశాలు ఇస్తున్నారు. ‘సాగర్ షే జ్వాలా’ హత్య కుల తత్వం ఎంత తీవ్రస్థాయిలో ఉందో మరోసారి మనకు గుర్తుకు తెస్తోంది. డా॥బి.ఆర్. అంబేద్కర్ చెప్పినట్లు ‘కుల నిర్మూలన’ జరిగితేనే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. ‘కులనిర్మూలన’ తోటే దళితులపై జరిగే దాడులు ఆగు తాయి. ఇది జరగాలంటే.. డా॥బి.ఆర్. అంబేద్కర్ చెప్పిన ‘మానసిక విప్లవం రావాలి’ - తంగిరాల సోని కంచికచర్ల -
తలుగు: నిరుపేదల బతుకుచిత్రం
కథ బోరేవాలా అనే ఒక సామాజిక వర్గం ఉన్నట్టుగా చాలామందికి తెలియకపోవచ్చు. రాయలసీమలో ముఖ్యంగా కడపజిల్లా చుట్టుపక్కలా పశుమాంసం విక్రయాన్ని జీవనాధారం చేసుకుని బతికే నిరుపేద ముస్లింలు బోరేవాలాలు. అయితే వారిని సొంతవర్గం వారే పూర్తిగా స్వీకరించరు. పరాయివర్గాలవారు అంతగా గౌరవించరు. ఇరువైపులా సంఘర్షణను ఎదుర్కొంటూ జీవిస్తున్న ఈ వర్గం గురించి మాట్లాడేవారే లేరు. కాని ఎవరూ మాట్లాడనప్పుడు కథో కవిత్వమో అలాంటి వారి తరపున వకాల్తా పుచ్చుకుంటుంది. వారి వైపు దీపం వేసి లోకాన్ని అటువైపు చూడమని చూపిస్తుంది. అలా చూపించే కథ వేంపల్లె షరీఫ్ రాసిన ‘తలుగు’. ఈ ఒక్క కథే ఒక పుస్తకంగా వెలువడింది. ‘దౌలూ’ అనే బోరేవాలా కథ ఇది. ‘గొడ్డుసీలు కొట్టుకుని బతికే నా కొడుకువు... నువ్వు కూడా నాకు నీతులు సెప్పబడ్తివే’.... అని మోతుబరి వెంకటప్ప చేత చీదరింపు ఎదుర్కొనే బక్కప్రాణి. వీళ్లిద్దరి మధ్య వచ్చిన తగువు ఎలా పరిష్కారం అయ్యిందనేదే ఈ ‘తలుగు’. నోరు లేనివాడు అన్నిసార్లూ దోపిడికి గురవ్వాల్సిందే. మరికొందరు నోరులేనివాళ్లు అతడికి తోడు నిలిచినా సరే... బలవంతుడు సులభంగా నలిపి పారేస్తాడు. అయితే అన్నీసార్లూ కాదు. కొన్నిసార్లు చలిచీమలు సంకెలలుగా మారతాయి. ఆ మారే సందర్భాన్ని కూడా ఈ కథ చూపించే ప్రయత్నం చేస్తుంది. సులభమైన కథనం... రాయలసీమ భాష... ఒక వర్గపు వేదనా ఈ కథ. తప్పక పరిశీలించదగ్గది. సుప్రసిద్ధ కథకులు షేక్ హుసేన్ ఇచ్ఛాగ్ని ఈ కథకు వెనుకమాట రాయడం విశేషం (అందులోని ఒక జ్ఞాపకాన్ని గతవారం ఇదే పేజీలో చూశారు). షేక్ హుసేన్తో మొదలైన తెలుగు ముస్లిం కథ విస్తరించి మరింత విశాలమై కొనసాగుతున్నదనడానికి మరో ఉదాహరణ వేంపల్ల్లె షరీఫ్- తలుగు. -
బుల్లితెర అధికారంపై కన్ను
బుల్లితెర అధికారంపై నటి నళిని కన్నేశారు. ఈ సంఘం అధ్యక్ష పదవి కోసం ఎన్నికల బరిలోకి దిగారు. బుల్లితెర నటీనటుల సంఘం ఎన్నికలు మూడేళ్లకొకసారి జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఆదివారం ఈ సంఘం ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి నటి నళిని, నటుడు రాజేంద్రన్, శివ శ్రీనివాసన్ పోటీ పడుతున్నారు. నటి నళిని ప్యానల్లో కార్యదర్శి పదవికి పూవిళరసు, మోహన్, కోశాధికారిగా విటి, త్యాగరాజన్, ఉపాధ్యక్ష పదవికి మనోబాల, రాజాకాంత్ పోటీచేస్తున్నారు. ఉప కార్యదర్శి పదవికి బాబూస్ భరత్, కన్యభారతి, సాధన బరిలో ఉన్నారు. రాజేంద్రన్ జట్టులో కార్యదర్శి పదవికి రవివర్మ, కోశాధికారి పదవికి కెఎస్‌సీ వెంకటేశ్, ఉపాధ్యక్ష పదవికి విన్సెంట్రాయ్, రాజశేఖర్, ఉప కార్యదర్శి పదవికి సతీష్, దేవానంద్, మీనాకుమారి పోటీ చేస్తున్నారు. ఇక శివన్ శ్రీనివాసన్ జట్టులో కార్యదర్శి పదవికి ఎం.టి.మోహన్, కోశాధికారి పదవికి భరత్ కల్యాణ్, ఉపాధ్యక్ష పదవికి భువనేశ్వరి, గజేష్, ఉప కార్యదర్శి పదవికి రిషి, రమ్య, శంకర్, శివకుమార్ పోటీ చేస్తున్నారు. దర్శకుడు లియాఖత్ అలీఖాన్ ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్నారు. ఈ ఎన్నికలు ఆదివారం ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరగనున్నాయి. -
కాఫీ తోటలపై మావోయిస్టుల దృష్టి
చింతపల్లి: ఏజెన్సీలో ఏపీఎఫ్డీసీ సాగు చేస్తున్న కాఫీ తోటలపై మావోయిస్టుల మరోసారి దృష్టి సారించారు. చింతపల్లి, జీకేవీధి మండలాల్లోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న ఈ తోటలను మరికొందరికి పంపిణీకి దళసభ్యులు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం. ఏజెన్సీ వ్యాప్తంగా ఏపీఎఫ్డీసీ సుమారు 4 వేల హెక్టార్లలో కాఫీ తోటలు సాగు చేస్తున్నది. చింతపల్లి, జీకేవీధి మండలాల్లోనే 3,600 హెక్టార్లలో సంస్థకు చెందిన కాఫీ తోటలు ఉన్నాయి. ఏజెన్సీలో ప్రభుత్వపరంగా సాగవుతున్న కాఫీతోటలను 1/70 యాక్టు ప్రకారం గిరిజనులకే పంపిణీ చేయాలని ఏడేళ్ల నుంచి మావోయిస్టులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో జీకేవీధి మండలంలోని మర్రిపాకలు ఎస్టేట్‌లో ఉన్న 60 హెక్టార్ల తోటలను భూమి లేని ఆదివాసీ గిరిజనులకు, మూడేళ్ల క్రితం చింతపల్లి మండలం బలపం ప్రాంతంలోని 100 హెక్టార్ల కాఫీ తోటలను ఆ ప్రాంత గిరిజనులకు పంపిణీ చేశారు. ఈ క్రమంలోకాఫీతోటల ఆక్రమణలకు సంబంధించి సుమారు 100 మంది గిరిజనులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అనంతరం దేవరాపల్లి, ఈతదొరబ్బలు, చెరపల్లి ప్రాంతాల్లో మళ్లీ కాఫీతోటలను గిరిజనులకు పంపిణీకి మావోయిస్టులు సిద్ధమైనప్పటికి పోలీసుల కేసుల కారణంగా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో కాఫీతోటల పంపిణీ జరగలేదు. ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాల ప్రకటనతో మరోసారి మావోయిస్టులు ఉద్యమాలకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వపరంగా సాగవుతున్న కాఫీ తోటలను గిరిజనులకు అప్పగించడం ద్వారా బాక్సైట్ ఉద్యమాన్ని బలోపేతం చేయవచ్చని భావిస్తున్నట్లు తెలిసింది. పలు గ్రామాల్లో భూమిలేని ఆదివాసీలకు కాఫీతోటలు పంపిణీకి రంగం సిద్ధం చేస్తున్నారు. దీంతో ఏపీఎఫ్డీసీ అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. -
పుచ్చుకునేది మాత్రమే కాదు
గౌరవం సముద్రాలు మేఘాలకు ఆవిరి రూపంలో జలాన్ని అందిస్తాయి. ప్రతిగా మేఘాలు జల నిధులను ధారబోస్తాయి. ఇచ్చిపుచ్చుకునే ధోరణి ప్రకృతిలోనే ఉంది. గౌరవం కూడా ఇచ్చిపుచ్చుకునే ఓ సద్గుణమని మానవుడు ప్రకృతి నుండి నేర్చుకోవాలి. ప్రతి వ్యక్తీ తనను ఎదుటివారు గౌరవించాలని, తనకు ఇతరుల కన్నా ఎక్కువ ప్రాముఖ్యం లభించాలని కోరుకుంటాడు. తనకు తోటివారిని గౌరవించే అలవాటు ఉన్నా లేకపోయినా అతడి ఆలోచన ఇందుకు భిన్నంగా ఉండదు! ప్రస్తుత సమాజంలో గౌరవించడానికి సంపద, హోదా అవసరమౌతున్నాయి. నిజానికి తోటి మానవుల పట్ల ప్రేమ చూపడం అనే సుగుణం అలవరచుకుంటే గౌరవం దానికదే సాధ్యమౌతుంది. ద్రోణాచార్యుని వద్ద విలువిద్య నేర్చుకోవాలనుకున్నాడు ఏకలవ్యుడు. శూద్రుడు అన్న ఒకే ఒక కారణంతో విలువిద్య నేర్పించడానికి నిరాకరించాడు ద్రోణుడు. అప్పుడు ద్రోణుని మట్టిబొమ్మను ఎదురుగా పెట్టుకుని విలువిద్య సాధన చేశాడు ఏకలవ్యుడు. శ్రద్ధ, ఏకాగ్రతలతో అర్జునుణ్ని మించిన విలుకాడిగా రూపొందాడు. ద్రోణుడి కాపట్యం వల్ల గురుదక్షిణగా బొటనవేలు సమర్పించిన ఏకలవ్యుడు విలువిద్యకు దూరం కావడం వేరే సంగతి. ‘గురు’ శబ్దం పట్ల గురి, గౌరవం, అచంచల విశ్వాసం వల్లనే ఏకలవ్యుడికి మాత్రమే విలువిద్యా రహస్యాలన్నీ కూలంకషంగా బోధపడ్డాయన్నది వాస్తవం. శ్రీరమణులు జంతువులను కూడా ‘వారు’, ‘వీరు’ అని సంబోధించేవారట! ఎదుటి వారిని గౌరవించడం వల్ల మనకు గౌరవం లభిస్తుంది. సముద్రాలు మేఘాలకు ఆవిరి రూపంలో జలాన్ని అందిస్తాయి. ప్రతిగా మేఘాలు జల నిధులను ధారబోస్తాయి. ఇచ్చిపుచ్చుకునే ధోరణి ప్రకృతిలోనే ఉంది. గౌరవం కూడా ఇచ్చిపుచ్చుకునే ఓ సద్గుణమని మానవుడు ప్రకృతి నుండి నేర్చుకోవాలి. మన ఆత్మగౌరవాన్ని మనకై మనం పోగొట్టుకుంటే తప్ప ఎవరూ మనల్ని గౌరవించకుండా ఉండలేరు అనేవారు గాంధీజీ. అనేక కారణాల వల్ల, గౌరవానికి యోగ్యత కలిగి ఉండికూడా కొందరు గౌరవాన్ని పొందలేరు అన్నది అల్ఫ్రెడ్ నోబెల్ సూత్రీకరణ. ఎదుటి వారిని గౌరవించే గుణం వల్ల మనం కోల్పోయేదేమీ ఉండదు. బదులుగా ఇబ్బడి ముబ్బడిగా మనకూ గౌరవాభిమానాలు లభిస్తాయి. సమాజం గౌరవించే వ్యక్తి నాయకుడి గా పరిణతి చెందుతాడు. తల్లిదండ్రులను పిల్లలు గౌరవించడంలో ప్రేమ, ఆత్మీయబంధం అంతర్లీనంగా ఉంటాయి. పెద్దలు వాత్సల్య రూపంలో పిన్నలకు గౌరవాభిమానాలు అందిస్తారు. మనిషి ఆత్మగౌరవం కలిగి ఉండడం మంచిదే, కానీ నశ్వరమైన దేహానికి అమిత ప్రాధాన్యం ఇవ్వడం వలన కొత్త సమస్యలు తలెత్తవచ్చు. సూర్యవంశ చక్రవర్తి త్రిశంకుడు తన అందమైన దేహాన్ని ఎంతో ప్రేమించేవాడు. ఎంతగానంటే మరణం వల్ల ఆత్మదేహాన్ని వీడటం ఊహించలేకపోయాడు. అందుకే సశరీరంగా స్వర్గానికి వెళ్లాలని ఉబలాట పడి కడకు విశ్వామిత్రుడిని ఆశ్రయించి అంతిమంగా చతికిల పడడం మనం కథగా చదువుకున్నదే. ఆత్మగౌరవం కలిగి ఉండడం మంచి లక్షణమే గానీ, తన గురించి తాను చెప్పుకోవడం అహంకారానికి చిహ్నం. మంధర మాటలు విని రాముడిని అరణ్యవాసానికి పంపి, భరతుడికి పట్టాభిషేకం చేయాలనే కోరికను భర్త దశరథ మహారాజు ముందు వ్యక్తపరచిన కైకేయిని కన్నకొడుకు భరతుడు కూడా మన్నించలేకపోయాడు. స్వార్థ చింతన, ఇంద్రియ వ్యామోహం వలన మనిషి గౌరవ మర్యాదలు కోల్పోతాడు. అహంకారాన్ని ఆత్మగౌరవంగా పొరపడిన మనిషికి పతనం తప్పదు. తనను, తన కుటుంబాన్ని ప్రేమించడం వ్యక్తి స్వవిషయం. అయితే సమాజాన్ని గౌరవించడం వ్యక్తి బాధ్యత. నోరు మంచిదైన వాడిని సమాజం గౌరవిస్తుంది. అక్కున చేర్చుకుంటుంది. ఎదలోని దైవాన్ని ఎదుటి మనిషిలో చూడగల సత్పురుషుడికి సంఘ గౌరవం అప్రమేయంగా లభిస్తుంది. - శొంఠి. విశ్వనాథం -
కులం అడిగినందుకు దర్శకుడి ఆగ్రహం!
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకం చేపట్టిన సమగ్ర సర్వేలో పలువురు సినీ ప్రముఖులు సమగ్రంగా తమ వివరాలు అందిస్తే, మరికొందరు కొన్ని వివరాలు మాత్రమే ఇచ్చారు. ప్రముఖ దర్శకుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు సర్వే సందర్భంగా కులం వివరాలు ఇచ్చేందుకు నిరాకరించినట్లు సమాచారం. ఎన్యుమరేటర్లు ఆయనను కమ్యూనిటీ వివరాలు అడగగా.... ఆ వివరాలు ఇచ్చేందుకు తిరస్కరించినట్లు తెలుస్తోంది. అదంతా ముఖ్యం కాదని, ఆ కాలమ్‌ను వదిలేయాలని దాసరి ఎన్యుమరేటర్లను సూచించినట్లు సమాచారం. ఇక సినీనటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి....ఎన్యుమరేటర్లకు పూర్తి వివరాలు అందించారు. అలాగే నటుడు శ్రీకాంత్ కూడా సమగ్రంగా వివరాలు అందించి ఎన్యుమరేటర్లకు సహకరించారు. షూటింగ్ నిమిత్తం స్విజ్జర్లాండ్‌లో ఉన్న హీరో మహేష్ బాబు కూడా కుటుంబ వివరాలను తన సహాయకుల ద్వారా ఎన్యుమరేట్లకు అందచేశారు. అల్లు అరవింద్ కుటుంబంతో పాటు దగ్గుబాటి రామానాయుడు కుటుంబం కూడా ఈ సర్వేలో పాల్గొని వివరాలు ఇచ్చారు. కాగా పవన్ కళ్యాణ్ ఈ సర్వేలో పాల్గొనలేదు. అతను ప్రస్తుతం హాలిడే నిమిత్తం బెంగళూరులో ఉన్నట్లు సమాచారం. ఇక సూపర్ స్టార్ కృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, మాజీ ఎమ్మెల్యే, సినీనటి జయసుధ, తనికెళ్ళ భరణి తదితరులు తమ వివరాలు అందించి సర్వేకు సహకరించారు. -
వెబ్‌లో విద్యాలయం!
సమాజసేవ అంటే దానికి ప్రత్యేకమైన సమయం కేటాయించనక్కర్లేదు, రోడ్లపై తిరగాల్సిన అవసరం లేదు, ఒకవైపు మన పని మనం చేసుకొంటూనే ఏదో రకమైన సేవాకార్యక్రమాన్ని చేపట్టవచ్చు. చేసే ఆ సేవలో నవ్యత ఉండాలే కానీ... దానికి మంచి గుర్తింపు కూడా లభిస్తుంది. మనసుంటే మార్గం ఉంటుంది. అలాంటి మనసున్న వారిలో డేనియల్ ఫ్రీడ్మన్ ఒకరు. చదువు సంధ్యలు లేకపోయినా చదువుకొనే ఉత్సాహం ఉన్న వాళ్లకు డేనియల్ అందిస్తున్న సహకారం అంతా ఇంతా కాదు. ‘థింక్‌ఫుల్’ అన్న తన ప్రయత్నంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకొని, గౌరవం పొందుతున్న 22 ఏళ్ల యువకుడితను. ‘థింక్‌ఫుల్’ పేరుతో ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించి తనలాంటి కొంతమంది ఉత్సాహవంతమైన యువతీయువకులను ఒక వేదిక మీదకు తీసుకొచ్చి ఆన్లైన్ ద్వారా విద్యార్థులకు చదువు చెప్పే ఏర్పాట్లు చేశాడు డేనియల్. డేనియల్ టీమ్ ఆన్లైన్ ద్వారా విద్యార్థులకు గెడైన్స్ ఇవ్వడమేగాక వివిధ స్థాయిల్లోని పిల్లలకు ఆన్లైన్క్లాసులు అందుబాటులో ఉంచింది. ఇది ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయుల్లో కొన్ని వేల మంది విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంది. ఇంటర్నెట్లో తరచి చూడాలి కానీ ట్యూటర్లుగా ఉపయోగపడే వెబ్సైట్లు అనేకం అందుబాటులో ఉన్నాయి. అయితే అలాంటి వాటిలో థింక్‌ఫుల్ ప్రత్యేకమైనది, నవ్యతాపూరితమైనది. ఎప్పుడూ ట్యూటర్లు అందుబాటులో ఉంటారు! థింక్‌ఫుల్ వెబ్సైట్లోకి లాగిన్ అయితే అనునిత్యం కొంతమంది ట్యూటర్లు అందుబాటులో ఉంటారు. వారిని సంప్రదించి సందేహాలను నివృతి చేసుకోవచ్చు, క్లాస్‌లను వినవచ్చు. నిపుణులైన ట్యూటర్స్ టీమ్ ఈ వెబ్సైట్లో ఉంటుంది. వేరే వృత్తుల్లో ఉన్న అనేక మంది యువతీయువకులు రోజుకు గంటా, రెండుగంటల సేపు ఈ సైట్‌కు అందుబాటులో ఉంటారు. ఇలాంటి వారు రకరకాల విభాగాల్లో నిపుణులు, పెద్ద చదువులు చదివిన వారు కాబట్టి ఈ సైట్లోకి లాగిన్ అయ్యే విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అతడికి చదువు లేదు... డేనియల్ సంగతికొస్తే అతను యేల్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్‌లో చేరి మధ్యలో ఆపేశాడు. గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేయకుండా మధ్యలో చదువు ఆపేసిన వ్యక్తిగా గుర్తింపు పొందాడు. అయితే అతడి మెదడులో చదువుకు సంబంధించి ఇంతమంచి ఆలోచన మెదలడం చాలా ఆసక్తికరం. ఇదొక విద్యాలయం... అమెరికా స్థాయిలో పీసీ, ఇంటర్నెట్లు చాలా సాధారణమైన అంశాలు కాబట్టి అనేక మంది విద్యార్థులకు ఈ వెబ్సైట్ ఒక వరంగా మారింది. కేవలం విద్యార్థులు అనే కాదు. వివిధ రంగాల్లో సమాచారం కోసం వివరణల కోసం ఈ వెబ్సైట్లో ప్రశ్నలు పోస్టు చేసే వాళ్లు అనేక మంది ఉన్నారు. ఆన్లైన్ ట్యుటోరియల్స్ విషయంలో యూట్యూబ్ వంటి సైట్ల కన్నా దీటైన స్థాయిలో ఉంది డేనియల్ వెబ్సైట్. ఏకవ్యక్తి సైన్యంగా ఈ స్థాయి విజయాన్ని సాధించిన డేనియల్ నిజంగానే చాలా గ్రేట్ కదూ! ఫోర్బ్స్ జాబితాలో... డేనియల్ సోషల్ఎంటర్ప్రెన్యూరర్గా పెద్ద పేరు సంపాదించాడు. ప్రఖ్యాత ఫోర్బ్స్ పత్రిక డేనియల్ను సామాజిక సేవ విషయంలో ప్రభావాత్మకమైన ‘30 అండర్ 30’ విభాగంలో ఎంపిక చేసింది. చేసింది చిన్న ప్రయత్నమే అయినా అది సూపర్ సక్సెస్ కావడంతోపాటు ఇలాంటి గౌరవం దక్కడం కూడా డేనియల్‌కు చక్కటి అనుభూతిగా మారింది. -
పెద్ద కూలీ ఐఏఎస్సే
ప్రేమతోనే సివిల్స్‌లోకి రావాలి సీనియర్ ఐఏఎస్‌ల ఉద్ఘాటన సాక్షి,సిటీబ్యూరో: సమాజంలో అతి పెద్ద కూలీ ఐఏఎస్ అధికారే.. ప్రజలపై విపరీతమైన ప్రేమ, సమస్య-పరిష్కారాలే శ్వాస ధ్యాసగా భావించే మనస్తత్వం, జన శ్రేయస్సే లక్ష్యంగా ఉన్నప్పుడు మాత్రమే సివిల్ సర్వీస్‌లోకి అడుగుపెట్టాలని సీనియర్ ఐఏఎస్ అధికారులు పేర్కొన్నారు. బుధవారం రవీంద్రభారతి తెలుగు అకాడమీ ఆధ్వర్యంలో సివిల్ సర్వీసులపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఉన్నత విద్య ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ మిశ్రా మాట్లాడుతూ దేశంలో అన్నింటి కన్నా విలువైన పరీక్ష నేడు సివిల్స్ ఎగ్జామ్ అని తెలిపారు. ప్రపంచాన్ని అర్థం చేసుకునే క్రమంలో తెలిసి వచ్చే ప్రతి అంశం సివిల్ సర్వీస్‌లో ఒక పాఠం లాంటిదనే విషయం ప్రతి గ్రాడ్యుయేట్ గుర్తెరగాలని కోరారు. మున్ముందు తెలుగువారు అత్యధికులు సివిల్ సర్వీస్ పరీక్షకు హాజరై, ఉత్తీర్ణులు కావాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. సీనియర్ అధికారులు డాక్టర్ ఏ అశోక్, డాక్టర్ పి.వి.లక్ష్మయ్యలు నేటి తరం విద్యావంతులను సివిల్ సర్వీసుల వైపు కార్యోన్ముఖులను చేసేందుకు పుస్తకాలు రాయటం, అవగాహన కల్పించటం ఆదర్శ ప్రాయమన్నారు. భాషా సాంస్కృతిక శాఖ కార్యదర్శి ఎన్. ముక్తేశ్వరరావు మాట్లాడుతూ 120 కోట్ల మంది ఉన్న దేశంలో అటు సమాజాన్ని, ఇటు జన జీవితాన్ని ప్రభావితం చేసే అతి గొప్ప సర్వీసు సివిల్స్ అని తెలిపారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ అధర్ సిన్హా మాట్లాడుతూ సివిల్స్‌లో పద్ధతి ప్రకారం చదివితే విజయం సొంతమన్నారు. సభకు అధ్యక్షత వహించిన తెలుగు అకాడమీ సంచాలకులు ఆచార్య కె.యాదగిరి మాట్లాడుతూ విద్యార్థులకు అవసరమయ్యే సమాచారం ఇస్తే మరిన్ని పుస్తకాల్ని తాము అచ్చు వేస్తామన్నారు. పుస్తకరచయితలు కార్మిక శాఖ కమిషనర్ డాక్టర్ ఏ అశోక్, పశువైద్య విద్య అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పి.వి.లక్ష్మయ్యలు మాట్లాడుతూ డిగ్రీ పూర్తి చేసుకొని సివిల్ సర్వీసు పరీక్షలు రాయాలనే కోరిక ఉన్నవారు ఎవరైనా తమను సంప్రదిస్తే కెరీర్‌పై అవగాహన కల్పించేందుకు ఎల్లవేళలా తాము సిద్ధమేనని చెప్పారు. అనంతరం ‘మీరు ఐఏఎస్ కావాలనుకుంటున్నారా?’ అనే పుస్తకాన్ని అజయ్ మిశ్రా ఆవిష్కరించారు. ఆంత్రోపాలజీకల్ తాట్, సోషియో కల్చరల్ ఆంత్రోపాలజీ పుస్తకాలను కళాశాల విద్య కమిషనర్ కె. సునీత ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఐఏఎస్ అధికారులు ఎల్. శశిధర్రావు, ఎ.దినకర్ బాబు, డాక్టర్ ఎం జగన్మోహన్, డాక్టర్ యు.వెంకటేశ్వర్లు, వాణీ ప్రసాద్ కార్మికశాఖ కమిషనర్ డాక్టర్ ఏ. అశోక్, పశువైద్య విద్య అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పి.వి.లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
సామాజిక సువార్త బోధించాలి
బిషప్‌లకు కేంద్ర మంత్రి జేడీ శీలం పిలుపు సీఎస్ఐ-సినాడు కమిటీ బాధ్యతల స్వీకారం విజయవాడ, న్యూస్‌లైన్ : సమాజంలో అసమానతలను రూపుమాపేందుకు సంఘాలకతీతంగా బిషప్‌లు సామాజిక సువార్త బోధించాలని కేంద్ర సహాయ మంత్రి జేడీ శీలం చెప్పారు. దక్షిణ ఇండియా సంఘం (చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా-సీఎస్ఐ) సినాడు నూతన కమిటీ బాధ్యతల స్వీకారోత్సవం ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. స్థానిక బిషప్ అజరయ్య గ్రౌండ్లో జరిగిన ఈ కార్యక్రమంలో జేడీ శీలం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ బిషప్‌ల సందేశం గ్రామీణ ప్రాంతాలకు చేరాలన్నారు. గ్రామీణులను శక్తిమంతులుగా తీర్చిదిద్దేందుకు క్రైస్తవ మత గురువులు కృషి చేయాలని కోరారు. మంచి మనసున్న దేవుని బిడ్డలుగా తీర్చిదిద్దేందుకు సువార్త ప్రచారం చే యాలన్నారు. క్రైస్తవ సంఘాలన్నీ కలిసి మంచి శక్తిగా ఎదగి సమర్ధ నాయకత్వాన్ని ఏర్పరచుకోవాలని చెప్పారు. సామాజిక సేవలో సైతం ముందుం డాలని ఆకాంక్షించారు. మోడరేటర్ (మహా పీఠాధిపతి)గా ఎన్నికైన కృష్ణా-గోదావరి అధ్యక్ష ఖండం బిషప్ గోవాడ దైవాశీర్వాదాన్ని దుశ్శాలువాతో సత్కరించారు. ఆర్సీఎం విశాఖపట్నం ఆర్చ్ బిషప్ మల్లవరపు ప్రకాష్ మాట్లాడుతూ మోడరేటర్‌గా ఎన్నికైన దైవాశీర్వాదంతో తనకు పదేళ్లుగా మంచి అనుబంధం ఉందన్నారు. ఆయన మోడరేటర్‌గా సీఎస్‌ఐని మరింత ముందుకు నడిపించగలరన్న ఆశాభావం వ్యక్తంచేశారు. ఇప్పటి వరకు మోడరేటర్‌గా వ్యవహరించిన ది మోస్ట్ రెవరెండ్ దైవకడాశం మాట్లాడుతూ సీఎస్ఐ ఆధ్వర్యాన విద్యాసంస్థలు, ఆస్పత్రుల ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. తాను మోడరేటర్‌గా వ్యవహరించిన రెండేళ్లలో చేపట్టిన కార్యక్రమాలు సంతృప్తినిచ్చాయన్నారు. అనంతరం డెప్యూటీ మోడరేటర్ రైట్ రెవరెండ్ థామస్ కె.ఒమ్మెన్, జనరల్ సెక్రటరీ డానియేల్ రత్నాకర సదానంద, కోశాధికారి రాబర్ట్ బ్రౌన్లను ఘనంగా సత్కరించారు. చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా మహా పీఠాధిపతి పీసీ మరాండి, జబల్పూర్ బిషప్ పీసీ సింగ్, జాప్నా బిషప్ డాని యేల్ త్యాగరాజ్, సైప్రస్ బిషప్ మైకేల్ లూయిస్, నేషనల్ చర్చెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతినిధి తారానాథ్ సాగర్ ప్రసంగించారు. భక్తులు ఆలపించిన గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు నుంచి 20 మంది బిషప్‌లు, 200 మందికి పైగా ప్రతినిధులు, నగర ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాసరావు, వేలాది మంది భక్తులు హాజరయ్యారు. -
ఉద్యోగుల డేటా రూపొందించాలి
=ద్యోగులు 24లోగా వివరాలు అందించాలి =నవరి 5 లోగా వెబ్సైట్లో పెట్టాలి =డియోకాన్ఫరెన్స్లో ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేసే ప్రతి ఉద్యోగీ తమ పూర్తి వివరాలను నిర్ణీత పట్టికలో వారి కార్యాలయ డ్రాయింగ్, డిస్బర్స్మెంట్ అధికారులకు ఈ నెల 24లోగా తప్పక అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వ ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ పీవీ రమేష్ బాబు ఆదేశించారు. గురువారం సాయంత్రం ఆయన హైదరాబాద్ నుంచి జిల్లా అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ప్రతి ఉద్యోగి సమగ్ర డేటాను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ప్రతి అధికారీ తమ కార్యాలయాల్లో పనిచేసే అన్ని తరగతుల ఉద్యోగుల పూర్తి సమాచారాన్ని సేకరించుకుని, వెబ్సైట్లో డేటా ఎంట్రీ జనవరి ఐదో తేదీ నాటికి పూర్తిచేయాలని చెప్పారు. సేకరించిన సమాచారాన్ని ధ్రువీకరించిన తర్వాతే వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని స్పష్టం చేశారు. కలెక్టర్ ఈ విషయంలో జిల్లా ఖజానాధికారులను పూర్తి బాధ్యతలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ట్రెజరీ ద్వారా జీతాలు డ్రా చేసే అధికారులు, సిబ్బంది వారి డేటాను సమ్రగంగా సేకరించారో లేదో గమనించాలని చెప్పారు. అలవెన్స్‌ల నుంచి ఆధారపడినవారి వివరాల వరకు... ఉద్యోగులకు వర్తించే 49 రకాల అలవెన్సులు, జీతభత్యాల నుంచి మినహాయింపులు, వారిపై ఆధారపడుతున్న వారి వివరాలు కూడా సమగ్రంగా సేకరించాల్సి ఉందని రమేష్‌బాబు చెప్పారు. 1993 నవంబరు 25 నాటికి ఐదేళ్లు పూర్తి చేసిన కంటింజెంట్ ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరించనున్నందున ఈ వివరాలు తప్పనిసరని తెలిపారు. జిల్లా గ్రామీణాభివృద్ధి, డ్వామా తదితర సంస్థలలో కమ్యూనిటీ బేస్‌పై పనిచేస్తున్న ఉద్యోగులకు వేరుగా ఉత్తర్వులు జారీచేస్తామని కలెక్టర్ రఘునందనరావు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ట్రెజరీ జిల్లా అధికారులకు కలెక్టర్ ఆదేశాలు... జిల్లాలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో ట్రెజరీ ద్వారా జీతాలు చెల్లిస్తున్న సిబ్బంది వివరాలు సేకరించడానికి తగిన శిక్షణ అందించాలని విజయవాడ డీటీవో ప్రసాదబాబును కలెక్టర్ రఘునందనరావు ఆదేశించారు. ప్రభుత్వం అన్ని కార్యాలయాలలో, అన్ని కేడర్లలో పనిచేసే వారి సమగ్ర వివరాలు సేకరిస్తున్నందున, బాధ్యతతో వ్యవహరించి జిల్లా డ్రాయింగ్ అధికారులకు తగిన సూచనలు ఇవ్వాలన్నారు. ఈ విషయంలో తగిన సూచనలను రూపొందించి సర్క్యులర్ రూపంలో పంపాలని, నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ట్రెజరీ అధికారులకు సూచనలిచ్చారు. ఈ నెలాఖరు నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్ సీహెచ్ సరస్వతి కుమార్, డీసీపీ ఏఎస్ ఖాన్, జెడ్పీ సీఈఓ సుబ్బారావు, ఏటీవో ఎస్.రవికుమార్, ఎస్టీవో సి.వసంత తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ దర్శకుల సంఘం ప్రారంభం
‘‘చిత్రపరిశ్రమలో తెలంగాణ కళాకారులు వివక్ష ఎదుర్కొంటున్నారు. దాన్ని ప్రశ్నిస్తూనే తెలంగాణ సంస్కృతిని నిలబెట్టుకుంటూ ముందుకు సాగాలన్నదే మా ఆకాంక్ష. ఎలాగూ తెలంగాణ రాష్ర్టం ఏర్పడబోతోంది కాబట్టి ఈ సంఘం ఏర్పాటు చేశాం’’ అన్నారు ప్రేమ్‌రాజ్. అల్లాణి శ్రీధర్ అధ్యక్షుడిగా శనివారం తెలంగాణ దర్శకుల సంఘం ఏర్పాటైంది. ప్రేమ్‌రాజ్ ఉపాధ్యక్షుడు. ఈ సంఘం ఏర్పాటు గురించి ప్రేమ్‌రాజ్ మరిన్ని విషయాలు చెబుతూ -‘‘విజయవాడకు చెందిన ఓ వ్యక్తి తెలంగాణ కళా దర్శకుల సంఘం ప్రారంభించి, డబ్బులు వసూలు చేస్తున్న విషయం మా దృష్టికొచ్చింది. అందుకే అధికారికంగా ఈ తెలంగాణ దర్శకుల సంఘాన్ని ఏర్పాటు చేశాం’’ అన్నారు. ప్రస్తుతం ఉన్న దర్శకుల సంఘానికి ఈ సంఘాన్ని పోటీగా భావించడంలేదని జితేందర్ చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో మురళీకృష్ణ, రవీందర్, చంద్రకాంత్‌రెడ్డి, శ్రీధర్ బీచ్రాజ్ తదితరులు పాల్గొన్నారు.