
నైపుణ్యం, అవకాశాలకు వేదిక
వర్క్‌షాప్‌లో వెబినార్లు తదితర కార్యక్రమాలతో సేవలు
6 లక్షలకుపైగా అతి పెద్ద స్టూడెంట్ నెట్‌వర్క్
టాప్ బ్రాండ్లు, పరిశ్రమలకు విద్యార్థుల అనుసంధానం
మారుతున్న కాలానికి అనుగుణంగా అధునాతన సాంకేతికత, వినూత్న నైపుణ్యాలను అందిపుచ్చుకుంటోంది ఈతరం యువత. ఇటు చదువుకుంటూనే అటు భవిష్యత్ ప్రణాళికల గురించి మార్గ నిర్దేశం చేసుకుంటోంది. ఇలాంటి తరుణంలో విద్యార్థులకు అత్యున్నత భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తోంది ‘స్టూడెంట్ ట్రైబ్‘. ఒక స్టార్టప్ లాంటి ఈ వేదిక ఏదైనా డిగ్రీ, ఆ పైన చదువులు చదువుతున్న విద్యార్థులకు ఈ తరం సాంకేతికతకు అనుగుణంగా నైపుణ్యాలను అందజేస్తూ.. మరోవైపు పరిశ్రమలో వారికి అవకాశాలను చేరువ చేస్తోంది. 6 లక్షలకుపైగా స్టూడెంట్ నెట్‌వర్క్‌తో విభిన్న వేదికల్లో విద్యార్థులకు అవగాహన అవకాశాలను కల్పిస్తోంది.
స్టూడెంట్ ట్రైబ్ అనేది స్టూడెంట్ కమ్యూనిటీ ప్లాట్‌ఫామ్. ఈ వేదిక దాదాపుగా 6 లక్షలకు పైగా విద్యార్థులతో, రెండు తెలుగు రాష్ట్రాల్లో 500 పైగా కాలేజీలతో అనుసంధానమై ఉంది. సోషల్ మీడియా వేదిక ఇన్‌స్ట్రాగామ్‌లో 4.5 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. విద్యార్థులను నైపుణ్యాలకు అనువైన బ్రాండ్స్‌కు అనుసంధానం చేస్తోంది. గిగ్ వర్క్ ఇంటరీ్నíÙప్, వలంటీర్, ఫుల్‌టైమ్‌గా ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. విద్యార్థులు చదువుకుంటూనే సంపాదన, స్కిల్స్ మెరుగు పర్చుకోవడంతో పాటు సరి్టఫికెట్లు పొందవచ్చు. స్థిరమైన భవిష్యత్ వృద్ధికి అంతులేని అవకాశాలను సృష్టిస్తోంది. టెక్నాలజీ నుంచి మార్కెటింగ్, డిజైన్ వరకు ప్రతి అవకాశాన్ని దగ్గర చేరుస్తోంది. టైర్–2, టైర్–3
నగరాల్లో సేవలు అందించడంతో పాటు వారికి అవసరమైన నైపుణ్యాలు, అవకాశాలను అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. విద్యార్థులు సంపాదించిన డబ్బు అటు చదువు, ఇటు ప్యాకెట్ మనీకి ఉపయోగపడుతుంది. బ్రాండింగ్, ఉపాధి అవకాశాలు, నైపుణ్యం అభివృద్ధి అనే మూడు అంశాలపై సేవలు అందిస్తున్నారు. ప్రత్యేకంగా ఒక యాప్ ఆవిష్కరించి అవకాశాలు, వర్క్‌షాప్‌లు, వెబినార్స్ తదితర కార్యక్రమాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందులో పొందుపరుస్తున్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటారు. బీబీఏ, బీకాం, బీఎస్సీ, ఇంజినీరింగ్ వంటి ఏదైనా డిగ్రీ చేసిన విద్యార్థులు ఈ సేవలను ఉచితంగానే పొందవచ్చు.
అవకాశాలకు పుష్పకవిమానం..
నేను 2024లో డిగ్రీ బీకాం పూర్తి చేశాను. డిగ్రీ చేస్తున్న సమయంలోనే స్టూడెంట్ ట్రైబ్‌ను ఫాలో అవుతున్నాను. దీనికి సంబంధించిన యాప్‌లో ఎప్పటికప్పుడు అవసరమైన అవకాశాలు, వర్క్‌షాప్స్ గురించి తెలుసుకున్నాను. ఇందులో భాగంగానే స్టూడెంట్ ట్రైబ్‌లో
అకౌంట్ మేనేజర్‌గా ఫుల్‌టైమ్ జాబ్ పొందాను. నాలాంటి ఎంతోమంది విద్యార్థులకు ఈ వేదిక పుష్పక విమానంగా సేవలందిస్తోంది.
– కీర్తన
కార్పొరేట్ స్థాయి నైపుణ్యం
విద్యార్థులు చదువుకుంటూనే అందుబాటులో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునేలా ఈ వేదికను ప్రారంభించాం. వారి కోసం ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ యాకథాన్ నిర్వహించాం. ఇందులో ప్రముఖ సినీ తార సమంత వంటి సెలబ్రిటీలు పాల్గొన్నారు. ఈ మధ్యనే అప్ స్కిల్లింగ్ అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. జావా మెకానికల్ ఇంజినీరింగ్ వంటి విభిన్న నైపుణ్యలపై అవగాహన కల్పిస్తున్నాం. ఇందులో ప్రత్యేకంగా విద్యార్థినులకు కార్పొరేట్ స్థాయి నైపుణ్యాలను అందిస్తున్నాం. దీనికోసం వివిధ కార్పొరేట్ సంస్థలకు చెందిన నిపుణులు, ప్రతినిధులు, సీఈవోలను ఆహ్వానించి విద్యార్థులకు అనుసంధానం చేస్తున్నాం. ఇప్పటి వరకు రెండు బ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాయి. ఏఐ, బ్లాక్‌చెయిన్ వెబినార్, మెకానికల్ ఇంజినీరింగ్ వర్క్‌షాప్స్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ మార్కెటింగ్ వర్క్‌షాప్ వంటివి నిర్వహించాం.
– చరణ్ లక్కరాజు, స్టూడెంట్ ట్రైబ్ వ్యవస్థాపకులు.
Comments
Please login to add a commentAdd a comment