tribe
-
వారి ‘నిప్పు కోడి పాదాల’ రహస్యం ఏమిటి? ఈ తెగ ఎక్కడుంది?
ఈ ప్రపంచం మన ఊహకందేటంతటి చిన్నదేమీ కాదు. ఇక్కడ వివిధ రకాల ప్రజలు నివసిస్తున్నారు. వీరిమధ్య మనకు తెలియని వింతలు ఎన్నో దాగివున్నాయి. ప్రపంచంలోని భిన్న సంస్కృతిని ఒకేచోట కూర్చుంటే అర్థం చేసుకోలేమని చాలామంది చెబుతుంటారు. ప్రపంచంలోని ఒక వింత తెగ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆ తెగకు ఉన్నది ఒక ప్రత్యేకతనో లేదా లోపమో.. ఏదో ఒకటి అనుకోవచ్చు. ఆ తెగ మొత్తం ఈ వింత సమస్యను ఎదుర్కొంటోంది. వారి రూపురేఖలు మనుషులను పోలి ఉంటాయి. కానీ వారి పాదాలను చూడగానే ఎవరికైనా దిమ్మతిరిగిపోతుంది. వీరి పాదాల తీరు మన పాదాల మాదిరిగా 5 వేళ్లతో ఉండదు. వారికి కేవలం 2 వేళ్లు మాత్రమే ఉంటాయి. ఇది ఎవరినైనా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. డైలీ స్టార్ తెలిపిన వివరాల ప్రకారం డొమా తెగగా పేరొందిన ఈ తెగ ప్రజలను వడోమా లేదా బంట్వానా తెగ అని కూడా పిలుస్తారు. వారి కాళ్లు ఆస్ట్రిచ్( నిప్పు కోడి లేదా ఉష్ట్రపక్షి) కాళ్ల మాదిరిగా ఉంటాయి. అందుకే వారిని ఆస్ట్రిచ్ ప్రజలు అని కూడా పిలుస్తారు. ఈ తెగ జింబాబ్వేలోని కన్యెంబా ప్రాంతంలో కనిపిస్తుంది. ఈ కమ్యూనిటీ అరుదైన జన్యుపరమైన రుగ్మతను ఎదుర్కొంటోంది. వీరు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యను ఎక్ట్రోడాక్టిలీ అని అంటారు. ఈ పరిస్థితి కారణంగా వారి పాదాలకు 5 వేళ్లకు బదులుగా 2 వేళ్లు మాత్రమే ఉంటాయి. ఈ తెగకు చెందిన జనాభాలో ప్రతి నాల్గవ వ్యక్తి ఇటువంటి సమస్యను ఎదుర్కొంటున్నారు. ఫలితంగా ఈ తెగకు చెందిన వారు ఇతర వర్గాలలోని వారిని వివాహం చేసుకోలేని పరిస్థితి ఉంది. వారు ఇతర వర్గాలలోనివారిని వివాహం చేసుకోవడంపై చట్టరీత్యా నిషేధం అమలులో ఉంది. ఈ తరహా వ్యక్తులు సరిగా నడవలేరు. బూట్లు ధరించలేరు. కేవలం చెట్లు ఎక్కే విషయంలో మాత్రం చురుకుగా ఉంటారు. ఇది కూడా చదవండి: ఆమె రూ. 6 లక్షలుపెట్టి బొమ్మలను ఎందుకు కొంది? డైపర్లు ఎందుకు మారుస్తుంది? -
అక్కడ భర్త ఎడ్డెం అంటే భార్య తెడ్డెం అనాల్సిందే, ఎందుకంటే..
భర్త ఎడ్డెం అంటే భార్య తెడ్డెం అనడం కామన్. కానీ, ఇక్కడ మాత్రం అన్నా, తమ్ముడు, స్నేహితుడు ఆఖరుకు నాన్న మాట్లాడినా కూడా వారితో పాటు సమానంగా అదే మాటను ఏ మహిళా అక్కడ పలకదు. ఆశ్చర్యపోకండి. అవును.. అక్కడి ప్రజల్లో ఏ జెండర్‌కు ఆ భాష నడుస్తోంది. అంటే అక్కడి మహిళలకు, పురుషులకు వేర్వేరు భాషలు ఉన్నాయి. ఉదాహరణకు దుస్తులను పురుషుడు ‘నికి’ అంటే, స్త్రీ ‘అరిగా’ అని.. చెట్టును ‘కిచి’ అంటే ‘ఓక్వెంగ్’ అనే భిన్న పదాలతో సంభాషిస్తారు. కేవలం వారి భాషలే కాదు, లిపులు కూడా వేర్వేరుగానే ఉంటాయి. తరతరాలుగా వారు ఇదే పద్ధతి అవలంబిస్తున్నారు. మరి, ఆ ప్రాంత ప్రజలు జీవనం ఎలా సాగిస్తున్నారు?, అక్కడ ఓ స్త్రీ మరో స్త్రీతో తప్ప.. ఒక పురుషుడు మరో పురుషుడితో తప్ప స్త్రీ, పురుషులు ఒకరితో ఒకరు మాట్లాడుకోరా? అని అనుకుంటే పొరపాటే.. ఇద్దరికీ రెండు భాషలు తెలుసు. కానీ, సంప్రదాయాన్ని గౌరవించి కేవలం వారు మాట్లాడే భాషల్లోనే మాట్లాడతారు. కేవలం వారి పిల్లలకు తప్ప మరో తెగతో కానీ, సమాజంతో గానీ వారి భాషలను నేర్పించడానికి ఇష్టపడరు. కారణం అక్కడి స్త్రీలు శుక్రగ్రహం నుంచి పురుషులు అంగారక గ్రహం నుంచి వచ్చారని, ఇది దైవ రహస్యం అని వారి నమ్మకం. విచిత్రంగా ఉన్నా ఇదే నిజం. ఇంతకీ వారు ఎవరో చెప్పలేదు కదా. నైజీరియా అడవుల్లో నివసించే ఓ ఆటవిక తెగ ప్రజలు. -
అక్కడ ఒక్కరూ ఓటెయ్యలేదు!
ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచడం కోసం ఎన్నికల సంఘం మహిళలు, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. అలాగే, అండమాన్ నికోబార్‌లో కూడా అతి పురాతన ఆదిమ తెగ అయిన షొంపెన్ల కోసం కూడా ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే, వాళ్లలో ఒక్కరూ ఓటు వేయడానికి ముందుకు రాలేదట. మంగోలాయిడ్ తెగకు చెందిన వీరు నాగరికులతో కలవడానికి బిడియపడతారు. అడవుల్లోంచి బయటకు రావడానికే ఇష్టపడరు. అడవుల్లో దొరికేవే తిని బతుకుతుంటారు. బాగా పరిచయం ఉన్న ఒకరిద్దరిని తప్ప ఇతరులెవరినీ వారు దగ్గరకి రానివ్వరు. అధికారులు అతి కష్టం మీద వీరికి ఓటరు కార్డులు జారీ చేశారు. వీరిలో 107 మంది ఓటర్లు ఉన్నారు. 2014 ఎన్నికల్లో వీరిలో ఇద్దరంటే ఇద్దరు (75 ఏళ్ల పురుషుడు, 32 ఏళ్ల మహిళ) మాత్రమే వచ్చి ఓటేశారు. ఈసారి మరింత ఎక్కువ మందిని రప్పించడం కోసం అధికారులు అవగాహన శిబిరాలు నిర్వహించారు. దానికి దాదాపు 35 మంది షొంపెన్లు ఓటరు కార్డులతో సహా హాజరయ్యారు. దాంతో అధికారులకు ఉత్సాహం కలిగింది. వారి కోసం ప్రత్యేకంగా రెండు పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. అయినా ఒక్కరు కూడా ఓటు వేయడానికి రాలేదు. ‘శిబిరాలకు వచ్చిన వాళ్లను చూసి సంతోషించాం. షొంపెన్ భాష తెలిసిన ఒక నికోబార్ జాతీయుడి సహాయంతో వాళ్లకు ఎన్నికల గురించి ఓటు’ గురించి అవగాహన కల్పించాం. వాళ్ల కోసం వారు నివసించే గుడిసెల్లాంటి పోలింగ్ కేంద్రాలనే ఏర్పాటు చేశాం. కొత్తగా ఉంటే రావడానికి భయపడతారని ఈ పని చేశాం. అయినా కూడా ఒక్కరూ ఓటు వేయడానికి రాలేదు’ అన్నారు కాంప్‌బెల్ బే అసిస్టెంట్ కమిషనర్ ప్రేమ్ సింగ్ మీనా. కాగా, ఇక్కడి ఓంగే, గ్రేట్ అండమాన్ తెగవాళ్లు కొన్నేళ్లుగా ఓటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈసారి 51 మంది ఓంగేలు, 26 మంది గ్రేట్ అండమానీస్ ఓటు వేశారు. -
మన కులతూరు భాష.. సాయిమంతే!
నీ పేరు ఏంటి అనడానికి ‘మీ పేదేరు బాత’, మీది ఏమి కూర అని అడగడానికి ‘మీ వాది బాత కూసీరి’, ఇటురా అని పిలవడానికి ‘ఇలావా’ అంటారు. ఇవన్నీ కోయ భాష పదాలు. అతి ప్రాచీన భాషలలో ఇది ఒకటి. మన తెలుగు భాషలాగే ద్రావిడ భాష నుంచి పుట్టింది. అందుకే ‘మన కులతూరు భాష సాయిమంతే..’ అని కోయ తెగవారు మురిసిపోతుంటారు. అంటే మన కోయ భాష మంచిది అని అర్థం.. – బుట్టాయగూడెం :భారత రాజ్యాంగంలో 5వ షెడ్యూల్లో పేర్కొన్న గిరిజన తెగల్లో కోయ తెగ ప్రధానమైనది. వీరి భాష, సంస్కృతి, సంప్రదాయ విధానం భిన్నంగా ఉంటుంది. కోయల భాషలో యాస అనేది స్పష్టంగా కనిపిస్తుంది. జిల్లాలో కోయ తెగ వాసులు ఎక్కువగా బుట్టాయగూడెం, పోలవరం, వేలేరుపాడు, కుక్కునూరు, జీలుగుమిల్లి మండలాల్లో ఉన్నారు. కోయలను రెండు విధాలుగా చెప్పుకుంటారు. మొదటి వర్గం దొరల సట్టం(కోయ తెగల్లో ఉన్నతులు–దేవుని వర్గం), రెండో వారు పుట్టదొరలు(నిజమైన దేవుళ్లుగా చెప్పుకుంటారు). గోండుల మాదిరిగానే తమను తాము వారి పరిభాషలో “కోయతూర్లు’గా చెప్పుకుంటారు. అలాగే కోయలు వారి వృత్తులను బట్టి రాచకోయ, గుమ్మకోయ, కమ్మరకోయ, ముసరకోయ, గంపకోయ, పట్టెడకోయ, వడ్డెకోయలు అనే 7 వర్గాలుగా ఉన్నారు. అలాగే కోయలుగా గుర్తింపు పొందిన మరో నాలుగు తెగలు ఉన్నట్టు భాషా పరిశోధకులు చెప్తున్నారు. డోలు కోయలు, కాక కోయలు, మట్ట కోయలు, లింగకోయలు అనే 4 తెగలను గుర్తించారు. అయితే కోయవారు కోయతూర్ భాషలో మాట్లాడతారు. కోయ భాషలో అన్నం తిన్నామా అనడానికి “్ఙదూడ తింతిన్ఙే్ఙ, నీ పేరు ఏంటి అనడానికి “మీ పేదేరు బాత’, మీది ఏమి కూర అని అడగడానికి “మీ వాది బాత కూసీరి’, నీకు జ్వరం వచ్చిందా అనడానికి “మీకు ఎరికి వత్తే ‘, ఇటురా అని పిలవడానికి “ఇలావా’ అని వారి భాషలో ఎంతో చక్కగా మాట్లాడేవారు. ఒక నాడు తెలుగు రాష్ట్రాల్లో ఉండే కోయలందరూ మాట్లాడ గలిగినా నేడు కొందరు మాత్రమే ఈ భాషలో మాట్లాడుతున్నారు. మరికొందరు భాష వచ్చినా మాట్లాడటానికి సిగ్గుపడుతున్నారని ఆ తెగకు చెందిన వారే చెప్తున్నారు. దీనికి కారణం అభివృద్ధి పేరుతో పరుగులు పెట్టడమేనని అంటున్నారు. జిల్లాలో గిరిజనులు సుమారు 97,929 వరకూ ఉండగా వీరిలో 70 శాతం కోయ భాష మాట్లాడే వారు ఉన్నారంటూ ఆ తెగకు చెందిన పెద్దలు చెప్తున్నారు. వీరిలో ఏజెన్సీ ప్రాంతంలో సుమారు 60 వేల మంది వరకూ గిరిజనులు నివసిస్తున్నారు. అతి ప్రాచీన భాషల్లో ఒకటి తాము ఎంతో అభివృద్ధి చెందుతున్నామని చెప్పుకోవడమే తప్ప తమ భాష, సంస్కృతి, సంప్రదాయం, అస్థిత్వం ప్రశ్నార్థకంగా మారుతోందని కోయ గిరిజనులు భావించలేకపోతున్నారని పలువురు కోయలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోయ భాష అత్యంత ప్రాచీన భాషల్లో ఒకటి. ద్రావిడ భాష నుంచి కోయ భాష పుట్టిందని చరిత్ర చెబుతోంది. అయితే కోయభాషను అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. కోయ భాష మీద ప్రధాన భాషల ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఆ తెగకు చెందిన నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాగరికత పేరుతో జరుగుతోన్న అభివృద్దిలో భాగంగా భాషలకు ముప్పు వాటిల్లుతుందని, ఆ ప్రభావం కోయభాషపై కనిపిస్తోందని గిరిజన సంఘాల నాయకులు తెలిపారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో కోయ భారతి విద్య కోయ భాషకు లిపి లేనప్పటికీ కేఆర్‌పురం ఐటీడీఏ ఆధ్వర్యంలో 2005లో కోయ భాషలో గిరిజన విద్యార్థులకు విద్యాబోధన జరిగే విధంగా ఏర్పాట్లు చేశారు. అనుభవజ్ఞులైన గిరిజన ఉపాధ్యాయుల ద్వారా కోయ భాషకు సంబంధించిన తెలుగు పదాలతో కోయ భారతి అనే పుస్తకాలను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకూ ప్రధాన భాషలతో పాటు కోయ భాషను కూడా బోధించే విధంగా ఏర్పాటు చేశారు. అయితే ఈ విధానం వల్ల కోయ విద్యార్థులో విద్యపై ఆసక్తి పెరుగుతుందని, ప్రాథమిక విద్యాభ్యాసం సులభతరం అవుతుందని అధికారులు అంటున్నారు. అయితే కోయ భాషకు లిపి లేనందున భాషా సంస్కృతి క్రమంగా తగ్గిపోతోందని ఆదివాసీ కోయతెగల మేధావులు అంటున్నారు. తమ తెగకు ప్రధానమైంది భాషేనని, దానిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఆదివాసీ గిరిజనులపై ఉందని పేర్కొంటున్నారు. -
సంచలన నిర్ణయం తీసుకున్నారు!
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని గిరిజనులు ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. స్వచ్ఛ భారత్ వైపు అడుగులు వేస్తూ దాదాపు పదివేల మంది కలిసి తమ ఆలోచనను అమలు చేయడానికి శ్రీకారం చుట్టారు. కనీస అవసరమైన మరుగుదొడ్డి లేని ఇంటికి తమ ఆడబిడ్డల్ని ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు. టాయిలెట్ సౌకర్యం ఉన్నకుటుంబాల్లో అబ్బాయిలకు మాత్రమే తమ బిడ్డల్నిచ్చి పెళ్లి చేయించాలని తీర్మానించుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని 52 గ్రామ పంచాయతీల్లో హర్బా తెగవారు ఒక దృఢమైన తీర్మానం చేసుకున్నారు. 'అగర్ శౌచాలయ్ నహీతో.. బేటీ నహీ ఔర్ రోటీ నహీ' అంటూ ఆదేశాలు జారీ చేశారు. గ్రామపంచాయతీల్లోని పారిశుధ్య పరిస్థితులను చక్కదిద్దడానికి, టాయిలెట్ల నిర్మాణం, వాడకంలో ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని గ్రామ పెద్దలు తెలిపారు. పరిశుభ్ర వాతావరణం, అందరికీ ఆరోగ్యం లక్ష్యసాధన కోసం ఈ ప్రతిజ్ఞ చేశామని హల్బా సమాజ్ ప్రతినిధి వీరేంద్ర మిశ్రా తెలిపారు. మిగిలినవారికి తమ నిర్ణయం స్ఫూర్తిగా నిలవాలని కోరుకున్నారు. మరోవైపు ఈ జిల్లా 100 శాతం బహిరంగ మలమూత్ర విసర్జన ఫ్రీ జిల్లాగా రికార్డు సొంతం చేసుకోనున్నట్టు సమాచారం.