ఈ ప్రపంచం మన ఊహకందేటంతటి చిన్నదేమీ కాదు. ఇక్కడ వివిధ రకాల ప్రజలు నివసిస్తున్నారు. వీరిమధ్య మనకు తెలియని వింతలు ఎన్నో దాగివున్నాయి. ప్రపంచంలోని భిన్న సంస్కృతిని ఒకేచోట కూర్చుంటే అర్థం చేసుకోలేమని చాలామంది చెబుతుంటారు. ప్రపంచంలోని ఒక వింత తెగ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఆ తెగకు ఉన్నది ఒక ప్రత్యేకతనో లేదా లోపమో.. ఏదో ఒకటి అనుకోవచ్చు. ఆ తెగ మొత్తం ఈ వింత సమస్యను ఎదుర్కొంటోంది. వారి రూపురేఖలు మనుషులను పోలి ఉంటాయి. కానీ వారి పాదాలను చూడగానే ఎవరికైనా దిమ్మతిరిగిపోతుంది. వీరి పాదాల తీరు మన పాదాల మాదిరిగా 5 వేళ్లతో ఉండదు. వారికి కేవలం 2 వేళ్లు మాత్రమే ఉంటాయి. ఇది ఎవరినైనా ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
డైలీ స్టార్ తెలిపిన వివరాల ప్రకారం డొమా తెగగా పేరొందిన ఈ తెగ ప్రజలను వడోమా లేదా బంట్వానా తెగ అని కూడా పిలుస్తారు. వారి కాళ్లు ఆస్ట్రిచ్( నిప్పు కోడి లేదా ఉష్ట్రపక్షి) కాళ్ల మాదిరిగా ఉంటాయి. అందుకే వారిని ఆస్ట్రిచ్ ప్రజలు అని కూడా పిలుస్తారు. ఈ తెగ జింబాబ్వేలోని కన్యెంబా ప్రాంతంలో కనిపిస్తుంది. ఈ కమ్యూనిటీ అరుదైన జన్యుపరమైన రుగ్మతను ఎదుర్కొంటోంది. వీరు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యను ఎక్ట్రోడాక్టిలీ అని అంటారు. ఈ పరిస్థితి కారణంగా వారి పాదాలకు 5 వేళ్లకు బదులుగా 2 వేళ్లు మాత్రమే ఉంటాయి.
ఈ తెగకు చెందిన జనాభాలో ప్రతి నాల్గవ వ్యక్తి ఇటువంటి సమస్యను ఎదుర్కొంటున్నారు. ఫలితంగా ఈ తెగకు చెందిన వారు ఇతర వర్గాలలోని వారిని వివాహం చేసుకోలేని పరిస్థితి ఉంది. వారు ఇతర వర్గాలలోనివారిని వివాహం చేసుకోవడంపై చట్టరీత్యా నిషేధం అమలులో ఉంది. ఈ తరహా వ్యక్తులు సరిగా నడవలేరు. బూట్లు ధరించలేరు. కేవలం చెట్లు ఎక్కే విషయంలో మాత్రం చురుకుగా ఉంటారు.
ఇది కూడా చదవండి: ఆమె రూ. 6 లక్షలుపెట్టి బొమ్మలను ఎందుకు కొంది? డైపర్లు ఎందుకు మారుస్తుంది?
Comments
Please login to add a commentAdd a comment