ostrich
-
వారి ‘నిప్పు కోడి పాదాల’ రహస్యం ఏమిటి? ఈ తెగ ఎక్కడుంది?
ఈ ప్రపంచం మన ఊహకందేటంతటి చిన్నదేమీ కాదు. ఇక్కడ వివిధ రకాల ప్రజలు నివసిస్తున్నారు. వీరిమధ్య మనకు తెలియని వింతలు ఎన్నో దాగివున్నాయి. ప్రపంచంలోని భిన్న సంస్కృతిని ఒకేచోట కూర్చుంటే అర్థం చేసుకోలేమని చాలామంది చెబుతుంటారు. ప్రపంచంలోని ఒక వింత తెగ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆ తెగకు ఉన్నది ఒక ప్రత్యేకతనో లేదా లోపమో.. ఏదో ఒకటి అనుకోవచ్చు. ఆ తెగ మొత్తం ఈ వింత సమస్యను ఎదుర్కొంటోంది. వారి రూపురేఖలు మనుషులను పోలి ఉంటాయి. కానీ వారి పాదాలను చూడగానే ఎవరికైనా దిమ్మతిరిగిపోతుంది. వీరి పాదాల తీరు మన పాదాల మాదిరిగా 5 వేళ్లతో ఉండదు. వారికి కేవలం 2 వేళ్లు మాత్రమే ఉంటాయి. ఇది ఎవరినైనా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. డైలీ స్టార్ తెలిపిన వివరాల ప్రకారం డొమా తెగగా పేరొందిన ఈ తెగ ప్రజలను వడోమా లేదా బంట్వానా తెగ అని కూడా పిలుస్తారు. వారి కాళ్లు ఆస్ట్రిచ్( నిప్పు కోడి లేదా ఉష్ట్రపక్షి) కాళ్ల మాదిరిగా ఉంటాయి. అందుకే వారిని ఆస్ట్రిచ్ ప్రజలు అని కూడా పిలుస్తారు. ఈ తెగ జింబాబ్వేలోని కన్యెంబా ప్రాంతంలో కనిపిస్తుంది. ఈ కమ్యూనిటీ అరుదైన జన్యుపరమైన రుగ్మతను ఎదుర్కొంటోంది. వీరు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యను ఎక్ట్రోడాక్టిలీ అని అంటారు. ఈ పరిస్థితి కారణంగా వారి పాదాలకు 5 వేళ్లకు బదులుగా 2 వేళ్లు మాత్రమే ఉంటాయి. ఈ తెగకు చెందిన జనాభాలో ప్రతి నాల్గవ వ్యక్తి ఇటువంటి సమస్యను ఎదుర్కొంటున్నారు. ఫలితంగా ఈ తెగకు చెందిన వారు ఇతర వర్గాలలోని వారిని వివాహం చేసుకోలేని పరిస్థితి ఉంది. వారు ఇతర వర్గాలలోనివారిని వివాహం చేసుకోవడంపై చట్టరీత్యా నిషేధం అమలులో ఉంది. ఈ తరహా వ్యక్తులు సరిగా నడవలేరు. బూట్లు ధరించలేరు. కేవలం చెట్లు ఎక్కే విషయంలో మాత్రం చురుకుగా ఉంటారు. ఇది కూడా చదవండి: ఆమె రూ. 6 లక్షలుపెట్టి బొమ్మలను ఎందుకు కొంది? డైపర్లు ఎందుకు మారుస్తుంది? -
నిప్పుకోడిపై యువతి సవారీ.. వీడియో చూస్తే నవ్వాపుకోలేరు..
-
ఆస్ట్రిచ్ పక్షిలా దుస్తులు ధరించి... జూలో హల్చల్! ఎందుకలా చేశాడంటే...
థాయిలాండ్‌లో ఒక అపరిచిత వ్యక్తి ఆస్ట్రిచ్ పక్షిలా దుస్తులు ధరించి జూలో హల్చల్ చేశాడు. చివరికి ఒక పెద్ద ఫిషింగ్ నెట్ వలకి చిక్కుతాడు. అసలు ఇదంతా ఏంటి? ఎందుకిలా సంచరించాడనే కదా! వివరాల్లోకెళ్తే...ఆ వ్యక్తి యానిమల్ ఎస్కేప్ డ్రిల్‌లో భాగంగా ఇలా చేశాడు. ఆస్ట్రిచ్ పక్షులు చాలా వైల్డ్‌గా ఉంటుంది. పైగా అది ఎప్పుడైన అనుకోని పరిస్థితుల్లో జూ నుంచి తప్పించుకుంటే జూ సిబ్బంది అప్రమత్తమై పట్టుకోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో చాలా తెలివిగా వ్యవహరించి దాన్ని పట్టుకోవాలి లేదంటే అది ఎవరిపైన ఐనా దాడి చేస్తే ఇక అంతే సంగతులు. ఈ నేపథ్యంలోనే జూ అధికారులు వైల్డ్ యానిమల్ మేనేజ్మెంట్ ప్లాన్ అనే డ్రిల్‌ని నిర్వహించారు. అందులో భాగంగా ఆ వ్యక్తి ఆస్ట్రిచ్ పక్షిమాదిరిగా దుస్తులు ధరించి జూలో అటు నుంచి ఇటూ పరిగెడుతుంటాడు. మిగతా ముగ్గురు జూ సిబ్బంది అప్రమత్తమై ఒక పెద్ద వలతో సదరు ఆస్ట్రిచ్ వేషధారణలో ఉన్న వ్యక్తిని పట్టుకుంటారు. పక్షులలో అతిపెద్ద పక్షి అయిన ఆస్ట్రిచ్ని పట్టుకోవాలంటే జూ పరిసరాలను సిబ్బంది తమ నియంత్రణలోనికి తెచ్చుకుని మరీ పట్టుకునేందుకు యత్నించాలి. పైగా ఆ పక్షి గంటకు 70 కి.మీ వేగంతో పరిగెత్తుతుంది. ఆ విపత్కర సమయంలో ఏ మాత్రం భయపడినా చాలు మన పని అయ్యిపోతుంది. అది సింహం వంటి పెద్ద పెద్ద జంతువులనే దాడి చేసి హతమార్చగలదు. (చదవండి: ఆ జర్నలిస్ట్ వర్క్ డెడికేషన్ని చూసి... ఫిదా అవుతున్న నెటిజన్లు) -
కరోనా సోకితే.. మాస్క్ చెప్పేస్తుంది!
కరోనా సోకినా చాలా మందిలో పెద్దగా లక్షణాలు కనిపించవు. వారు టెస్టులకు వెళ్లరు, కరోనా ఉన్నట్టు వారికే తెలియదు. కానీ అలాంటి వారి నుంచి ఇతరులకు వైరస్ సోకుతుంది. మరి ప్రత్యేకంగా టెస్టులేమీ అవసరం లేకుండా.. మనం పెట్టుకున్న మాస్కే కరోనా ఉందో లేదో గుర్తించగలిగితే చాలా మేలు కదా.. అలాంటి మాస్కులు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. మరి ఆ మాస్కులేమిటి? కరోనాను ఎలా గుర్తిస్తాయి? వంటి వివరాలు తెలుసుకుందామా? – సాక్షి సెంట్రల్ డెస్క్ సులువుగా పరీక్షించేందుకు.. కరోనా వ్యాప్తి మరింతగా పెరుగుతున్న నేపథ్యంలో.. దానిని సులువుగా గుర్తించడంపై ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. అందులో భాగంగా జపాన్‌లోని క్యోటో ప్రిఫెక్చురల్ యూనివర్సిటీ శాస్త్రవేత్త యసుహిరో సుకమొటో నేతృత్వంలోని బృందం ప్రత్యేక మాస్కులపై దృష్టిపెట్టింది. ఆస్ట్రిచ్ పక్షులు కరోనా వైరస్‌ను బలంగా ఎదుర్కొంటున్నాయని ఇటీవల గుర్తించిన నేపథ్యంలో.. దీనిని తమ పరిశోధనకు ఆధారంగా తీసుకుంది. ఆస్ట్రిచ్ పక్షి ‘యాంటీబాడీ’లను ఉపయోగించి.. కరోనాను గుర్తించగల మాస్కులను అభివృద్ధి చేసింది. యూవీ లైట్లో మెరుస్తూ.. సుకమొటో బృందం ఆస్ట్రిచ్ పక్షుల గుడ్లను తీసుకుని, వాటిల్లోకి బలహీనపర్చిన కరోనా వైరస్‌ను ఇంజెక్ట్ చేసింది. అందులో ఏర్పడిన యాంటీబాడీలను సేకరించింది. ఒక సన్నని ఫిల్టర్ (మాస్కు వంటి ఒక పొర)పై ఆ యాంటీబాడీలను స్ప్రే చేసి.. సాధారణ మాస్కులో అమర్చింది. కొందరు కరోనా రోగులకు ఈ మాస్కులు ఇచ్చి.. కొద్ది గంటల పాటు ధరించాలని సూచించింది. ►రోగులు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, శ్వాసించినప్పుడు విడుదలయ్యే కరోనా వైరస్.. ఈ మాస్కుల్లోని ఫిల్టర్పైకి చేరింది. ఆ ఫిల్టర్‌పై ఉన్న ఆస్ట్రిచ్ యాంటీబాడీలు కరోనా వైరస్‌ను గుర్తించి అతుక్కుపోయాయి. ►శాస్త్రవేత్తలు కొద్దిగంటల తర్వాత రోగుల నుంచి ఆ మాస్కులను సేకరించారు. వాటిలోని ఫిల్టర్లపై.. యాంటీజెన్లకు అంటుకునే ఫ్లోరోసెంట్ డై (కాంతి పడితే మెరిసే పదార్థం)ను స్ప్రే చేశారు. తర్వాత ఆ మాస్కులపై అల్ట్రా వయోలెట్ (యూవీ) కాంతిని ప్రసరింపజేస్తే.. కరోనా వైరస్ ఉన్న ప్రాంతాలన్నీ మెరుస్తూ కనిపించాయి. ఏడాదిలో అందుబాటులోకి.. ఈ మాస్కులను మరింతగా అభివృద్ధి చేస్తున్నామని.. స్ప్రే అవసరం లేకుండానే, కేవలం సెల్‌ఫోన్ లైట్ ఆధారంగా మెరిసేలా మార్చుతున్నామని పరిశోధనకు నే తృత్వం వహించిన సుకమొటో తెలిపారు. తక్కువ ఖర్చుతో ఎక్కడైనా కరోనా నిర్ధారణ పరీక్ష చేయడానికి ఈ మాస్కులు వీలు కల్పిస్తాయని.. ఈ విధానంలో కచ్చితత్వం కూడా ఎక్కువని వెల్లడించారు. త్వరలోనే వీటిని జపాన్‌లో ప్రవేశపెడతామని, ఏడాదికల్లా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని వివరించారు. అయితే దీని ధర ఎంత ఉంటుందన్నది వెల్లడించలేదు. ఆస్ట్రిచ్ ‘యాంటీబాడీ’ల స్పెషాలిటీ ఏంటి? భూమ్మీద ప్రస్తుతం జీవించి ఉన్న పక్షి జాతుల్లో అతి పురాతనమైనవి ఆస్ట్రిచ్‌లు. ఈ క్రమంలోనే వాటిలో అత్యంత సమర్థవంతమైన రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందింది. ముఖ్యంగా ఆడ ఆస్ట్రిచ్ పక్షులకు ఈ సామర్థ్యం మరింత ఎక్కువ. భారీ సంఖ్యలో వైరస్లు, బ్యాక్టీరియాలకు అత్యంత వేగంగా యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి. దీనిపై శాస్త్రవేత్తలు చాలాకాలంగా పరిశోధనలు చేస్తున్నారు. ఆస్ట్రిచ్‌ల యాంటీబాడీలను ఉపయోగించి.. వివిధ రోగాలకు వ్యాక్సిన్లు తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. -
లాహోర్ రోడ్లపై పరుగెత్తిన నిప్పుకోడి.. వీడియో వైరల్
లాహోర్: ఎగరలేని పక్షి జాతుల్లో నిప్పుకోడి అతిపెద్దది. ఆకర్షణీయమైన ఈకలు, చర్మం కలిగి ఉండే ఈ పక్షి ఎక్కువగా ఆఫ్రికా దేశాల్లో కనిపిస్తూ ఉంటుంది. అయితే తాజాగా పాకిస్తాన్ రోడ్లపై దర్శనమిచ్చింది ఒక ఆస్ట్రిచ్. లాహోర్ సమీపంలోని అడవుల నుంచి తప్పించుకొని రెండు ఆస్ట్రిచ్‌లు రోడ్ల మీదకు వచ్చాయి. కెనాల్ రోడ్లో వాహనదారులకు పోటీగా వేగంగా పరుగెత్తుతూ అందరినీ ఆశ్చర్య పరిచింది. కొందరు వాహనదారులు వాటిని పట్టుకొని ఫోటోలు తీసుకోడానికి ప్రయత్నించడంతో మెడకు గాయమై ఒకటి మృత్యువాత పడినట్లు పాక్ న్యూస్ వెబ్సైట్ తెలిపింది. చదవండి: Viral Video: అరె.. ఏం చేస్తున్నావ్.. ఛీ! డ్రైనేజీ వాటర్‌తోనా.. దీనికి సంబంధించిన ఓ వీడియోను ట్విటర్లో పోస్టు చేయగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మిలియన్ వ్యూవ్స్‌తో దూసుకుపోతుంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘చాలా వేగంగా పరుగెత్తుతుంది. ట్రాఫిక్‌లో ప్రతి రోజు ఉదయం బస్‌ను అందుకోవాడనికి నేను అలాగే పరుగెత్తుతాను. ఈ సందర్భాన్ని కేవలం కవ్బాయ్ మాత్రమే హ్యండిల్ చేయగలడు’ అంటూ కామెంట్ చేస్తున్నారు. చదవండి: కిరీటం, చెప్పు జారిపోయిన బెదరలేదు.. 5 మిలియన్ల మంది ఫిదా -
లాహోర్ లోని కెనాల్ రోడ్ లో ఆస్ట్రిచ్ పరుగులు
-
ఆకట్టుకుంటున్న ఆస్ట్రిచ్ రేస్...
ఒకప్పుడు కార్టూన్లలో చూసి థ్రిల్ గా ఫీల్ అయిన రోడ్ రన్ షో... ఇప్పుడు కళ్ళెదుటే కనిపించింది. తోడేలు నుంచి తప్పించుకునేందుకు కార్టూన్లో పరిగెట్టిన పక్షి... దక్షిణాఫ్రికాలోని సైక్లిస్టుల ముందు నిజంగానే ప్రత్యక్షమైంది. అనుకోని సన్నివేశం ఎదురవ్వడం వారికి ఓ ప్రత్యేక అనుభూతిని కూce కలిగించింది. అందుకే ఆ దృశ్యాన్ని వీడియోలో బంధించిన ఒలేక్సియ్ మిశ్చెంకో అనే ఓ వినియోగదారుడు మార్చి 5న యూట్యూబ్ లో పోస్టు చేశాడు. ఇప్పుడు ఆ వీడియో యూజర్లను అమితంగా ఆకట్టుకుంటోంది. దక్షిణాఫ్రికాలోని కోప్ ఆఫ్ గుడ్ హోప్ ప్రాంతంలో సైక్లిస్టుల ట్రైనింగ్ జరుగుతున్న సమయంలో ఓ ఆస్ట్రిచ్ వారిని వెంబడించింది. అనుకోని సన్నివేశం ఎదురైనా కాస్త తేరుకున్న సైకిలిస్టు... అతివేగంగా పరిగెట్టే ఆ పక్షితోనే పోటీ పెట్టుకున్నాడు. ఆ వీడియో ఇప్పుడు వీక్షకులను కట్టి పడేస్తోంది. మనుషులైతే నాకేంటి అంటూ ఆ పక్షి.. సైకిలిస్టును ఛేజ్ చేయడం యూట్యూబ్ లో కనువిందు చేస్తోంది. అయితే కాళ్ళు కూడదీసుకొని సైకిల్ పై వెళ్ళే ఇద్దరిని ఎంతోదూరం వెంబడించిన ఆ పక్షిరాజం... ఇక లాభం లేదనుకుందో ఏమో చివరికి కాస్త వెనక్కి తగ్గినట్లుగా వీడియోలో కనిపిస్తోంది. ప్రపంచంలోనే అతి పెద్ద సైకిల్ రేస్ జరుగుతున్న కోప్ ఆర్గస్ టూర్ ప్రాంతంలో ఆస్ట్రిచ్.. మిశ్చెంక్ కళ్ళపడింది. ఇలా పక్షిని గమనించానో లేదో అలా సెకన్లలో రోడ్డుపైకి దూకి వెంటనే సైకిల్ తో స్నేహితుల వెంటపడ్డానని, ఆ తర్వాత ఎంతో నవ్వొచ్చిందని మిశ్చెంక్.. తన యూట్యూబ్ పోస్ట్ లో రాశాడు. అయితే గంటకు సుమారు 50 కిలోమీటర్ల వేగంతో వెళ్ళే రైడర్స్ కు ఆస్ట్రిచ్ వల్ల పెద్దగా భయం లేదన్నాడు. అదృష్టం కొద్దీ అది పరుగు విరమించుకొని పక్కదారి పట్టిందని, 'కోప్ ఆఫ్ గుడ్ హోప్' దగ్గర మార్గం ముగిసిపోతుందని, నిజంగా ఆ పక్షి తనను వెంబడించి ఉంటే ఏమయ్యుండేదో అంటూ ఒకింత భయాన్ని వ్యక్తం చేశాడు. అయితే ఇటువంటి సందర్భం ఎదురైనప్పుడు చాలామంది నిజంగానే భయపడతారు. కానీ మిశ్చెంక్ మాత్రం దానికి కాస్త హ్యూమరసాన్ని జోడించాడు. కచ్చితంగా ఆ పక్షి.. తన గాల్ ఫ్రెండ్ కు సత్తా చూపించేందుకే తనతో పోటీ పడిందని, ఆమె నిజంగానే ఫ్లాట్ అయిపోయి ఉంటుందంటూ కామెంట్ చేశాడు. అంతేకాదు... అది తన సత్తా చూపించుకుందో లేదోగాని, ప్రపంచంలోనే అతి వేగంగా పరిగెత్తే ఆస్ట్రిచ్ తో పోటీపడి తాను మాత్రం మంచి ట్రైనింగే తీసుకున్నానన్నాడు. -
అరణ్యం: ఆస్ట్రిచ్‌లు రాళ్లెందుకు తింటాయి?
సాధారణంగా జంతువులు, పక్షులు వెనక్కి తన్నుతాయి. కానీ ఆస్ట్రిచ్‌లు మనుషుల మాదిరి కాళ్లతో ముందుకు తన్నుతాయి. పొరపాటున శత్రువు ఎదురుగా వచ్చిందో... దాన్ని తన్నుకు పడి చావాల్సిందే! ఇవి ఆహారాన్ని నమలలేవు. అమాంతం మింగేస్తాయి. ఆ తరువాత చిన్న చిన్న గులకరాళ్లను మింగి, అటూ ఇటూ వడివడిగా తిరుగుతాయి. అప్పుడా రాళ్ల మధ్య ఆహారం నలిగి జీర్ణమవుతుందన్నమాట! ఆస్ట్రిచ్‌లు ఎంత బలంగా ఉంటాయంటే... సింహాలతో సైతం తలపడగలవు. మనిషిని సైతం చంపగలవు. కానీ వీటి తల చాలా బలహీనంగా ఉంటుంది. కాస్త గట్టి దెబ్బ తగిలినా చాలు... ప్రాణాలను కోల్పోతాయివి! ఆస్ట్రిచ్‌లు నీళ్లు తాగకుండా చాలాకాలం ఉండగలుగుతాయి. ఎందుకంటే తనంతట తానుగా తేమను సృష్టించుకునే లక్షణం వీటి శరీరానికి ఉంది. అందుకే నీళ్లు కనిపిస్తే ఇవి వాటిని తాగవు. ముందు నీటిలోకి దిగి తనివి తీరా స్నానం చేస్తాయి. తర్వాతే తాగుతాయి! వీటికి ఎరుపు రంగు అంటే అస్సలు నచ్చదు. ముఖ్యంగా మగ ఆస్ట్రిచ్‌లు ఎరుపును చూస్తే కోపంతో రెచ్చిపోతాయి! ఆడ ఆస్ట్రిచ్‌లు మహా తెలివైనవి. తాము పెట్టిన గుడ్లు... కొన్ని వందల గుడ్లలో కలిసిపోయినా కూడా అవి గుర్తించేస్తాయి! ఆస్ట్రిచ్ గుడ్డు ఎంత ఉంటుందో తెలుసా? దీని ఒక్క గుడ్డు, రెండు డజన్ల కోడిగుడ్లతో సమానం! ఏడెనిమిది ఆస్ట్రిచ్‌లు గుంపుగా ఏర్పడతాయి. వీటిలో ఒకటి తప్ప అన్నీ ఆడ పక్షులే ఉంటాయి. మగది లీడర్‌గా ఉంటుంది. ఇది ఆ గుంపులోని ఒక ఆడపక్షిని ఎంచుకుని జతకడుతుంది. అది లీడర్‌గారి భార్య అన్నమాట! నాలాంటిది మరోటి లేదు తెలుసా! తెల్లగా, ముద్దుగా ఉన్న ఈ బుజ్జి జీవి... కోయలా బేర్. ఎలుగు జాతికి చెందినదే అయినా ఎలుగుబంటి లక్షణాలు ఏమాత్రం ఉండని సాధు జంతువులు కోయలాలు. అయితే ఇవి సాధారణంగా నలుపు, తెలుపు రంగులు కలగలిసి ఉంటాయి. కానీ ఇది ఎంత తెల్లగా ఉందో చూశారుగా! అందుకే మరి దీని గురించి అందరూ స్పెషల్‌గా మాట్లాడుకునేది! 1997వ సంవత్సరంలో శాన్ డీగో జూలో జన్మించింది ఈ తెల్లటి కోయలా. పుట్టినప్పుడు ఇది అన్నిటిలాగే నలుపు, తెలుపు రంగులు కలగలిపి ఉంది. కానీ ఆరు నెలలు గడిచేసరికి ఇలా పూర్తిగా తెల్లగా అయిపోయింది. సాధారణంగా ఎక్కడా తెల్ల కోయలాలు కనిపించవు. దట్టమైన అడవుల్లో ఎక్కడైనా ఒకటీ రెండూ ఉండవచ్చు అని జీవ శాస్త్రవేత్తలు అంటుంటారు తప్ప ఎవరూ ఎప్పుడూ ఎక్కడా చూసింది లేదు. అందుకే దీన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతుంటారు. దీనికి జూ అధికారులు ఒన్యా బిర్రీ అని పేరు పెట్టారు. అంటే ‘ఘోస్ట్ బాయ్’ అని అర్థమట. ఇప్పటి వరకూ బిర్రీయే అందరికీ తెలిసిన తెల్ల కోయలా. అందుకే దీన్ని అందరూ ప్రత్యేకంగా చూస్తుంటారు, మాట్లాడుకుంటారు!