లాహోర్: ఎగరలేని పక్షి జాతుల్లో నిప్పుకోడి అతిపెద్దది. ఆకర్షణీయమైన ఈకలు, చర్మం కలిగి ఉండే ఈ పక్షి ఎక్కువగా ఆఫ్రికా దేశాల్లో కనిపిస్తూ ఉంటుంది. అయితే తాజాగా పాకిస్తాన్ రోడ్లపై దర్శనమిచ్చింది ఒక ఆస్ట్రిచ్. లాహోర్ సమీపంలోని అడవుల నుంచి తప్పించుకొని రెండు ఆస్ట్రిచ్‌లు రోడ్ల మీదకు వచ్చాయి. కెనాల్ రోడ్‌లో వాహనదారులకు పోటీగా వేగంగా పరుగెత్తుతూ అందరినీ ఆశ్చర్య పరిచింది. కొందరు వాహనదారులు వాటిని పట్టుకొని ఫోటోలు తీసుకోడానికి ప్రయత్నించడంతో మెడకు గాయమై ఒకటి మృత్యువాత పడినట్లు పాక్ న్యూస్ వెబ్‌సైట్ తెలిపింది.
చదవండి: Viral Video: అరె.. ఏం చేస్తున్నావ్.. ఛీ! డ్రైనేజీ వాటర్‌తోనా..
దీనికి సంబంధించిన ఓ వీడియోను ట్విటర్‌లో పోస్టు చేయగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మిలియన్ వ్యూవ్స్‌తో దూసుకుపోతుంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘చాలా వేగంగా పరుగెత్తుతుంది. ట్రాఫిక్‌లో ప్రతి రోజు ఉదయం బస్‌ను అందుకోవాడనికి నేను అలాగే పరుగెత్తుతాను. ఈ సందర్భాన్ని కేవలం కవ్‌బాయ్ మాత్రమే హ్యండిల్ చేయగలడు’ అంటూ కామెంట్ చేస్తున్నారు.
చదవండి: కిరీటం, చెప్పు జారిపోయిన బెదరలేదు.. 5 మిలియన్ల మంది ఫిదా
Comments
Please login to add a commentAdd a comment