Lahore
-
Pakistan: ఊపిరాడక వేల మంది ఆస్పత్రులకు పరుగులు
కరాచీ: పొరుగుదేశం పాకిస్తాన్ వాయు కాలుష్యంతో విలవిలలాడిపోతోంది. ప్రపంచంలో తీవ్రమైన కాలుష్యం బారిన పడిన నగరాల్లో రెండవ స్థానంలో నిలిచిన లాహోర్‌లో ఇప్పుడు వాయు కాలుష్యం తారా స్థాయికి చేరింది. ఇక్కడి గాలి విషపూరితంగా మారింది. ఈ ప్రాంతానికి చెందిన 15 వేల మంది అనారోగ్య సమస్యలతో ఆస్పత్రులలో చేరారు.పాక్‌లోని లాహోర్ నగరంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ) 1900ను దాటింది. ఫలితంగా ఇక్కడి ప్రజలు ఆస్తమా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లాంటి తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముల్తాన్‌లో కూడా ఏక్యూఐ 750 దాటింది. నాసాకు చెందిన మోడరేట్ రిజల్యూషన్ ఇమేజింగ్ స్పెక్టర్ రేడియోమీటర్ ఉత్తర పాకిస్తాన్లో, ముఖ్యంగా లాహోర్, దాని పరిసరాలలో ఆకాశంలో వ్యాపించిన పొగమంచు చిత్రాలను షేర్ చేసింది.శీతాకాలం ప్రారంభమైనప్పటి నుండి అంటే నవంబర్ నుండి లాహోర్ ఆకాశంలో దట్టమైన పొగమంచు కనిపిస్తోందని, ఫలితంగా గాలి నాణ్యత గణనీయంగా పడిపోయిందని నాసా తెలిపింది. లాహోర్‌లో పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారింది. పాఠశాలలు మూసివేశారు. పొడి దగ్గు, శ్వాస ఆడకపోవడం, న్యుమోనియా, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, ఆస్తమా, గుండె సంబంధిత సమస్యలతో లాహోర్‌లోని మాయో ఆసుపత్రిలో 4,000 మంది బాధితులు చేరారు. అలాగే జిన్నా ఆసుపత్రిలో 3,500 మంది, పిల్లల ఆసుపత్రిలో 2,000 మందికి పైగా రోగులు చేరారు.ఆస్తమా, హృద్రోగులు బయటకు వెళ్ల కూడదని వైద్యులు హెచ్చరించారు. వాహనాల నుంచి వెలువడుతున్న విషపూరిత పొగ, నిర్మాణ స్థలాల నుంచి వెలువడుతున్న దుమ్ము మొదలైనవి లాహోర్‌లో వాయు కాలుష్యానికి కారణంగా నిలిచాయి. లాహోర్‌లో మూడు నెలల పాటు వివాహాలను నిషేధించారు. పాకిస్తాన్‌లోని తూర్పు పంజాబ్ ప్రావిన్స్‌లో తీవ్ర వాయు కాలుష్యం కారణంగా గత నెలలో 18 లక్షల మంది అస్వస్థతకు గురయ్యారు. దీనిపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది.ఇది కూడా చదవండి: పొగబారిన ఉత్తరాది.. 50 రైళ్లు, పలు విమానాలపై ప్రభావం -
పాక్ స్టేడియాల్లో కనీస వసతులు లేవు.. ఒక్కటీ..: పీసీబీ చీఫ్
పాకిస్తాన్ స్టేడియాలు అంతర్జాతీయ ప్రమాణాలకు తగిన విధంగా లేవని ఆ దేశ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ అన్నారు. చాలా స్టేడియాల్లో కనీస వసతులు కూడా లేవని పెదవి విరిచారు. చాంపియన్స్ ట్రోఫీ నాటికి ఈ దుస్థితిని మార్చే దిశగా ప్రక్షాళన చర్యలు చేపట్టామని తెలిపారు.వచ్చే ఏడాది మార్చిలో జరుగనున్న ఈ ఐసీసీ టోర్నీ నిర్వహణ హక్కులను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టేడియాలను పునరుద్దరించాల్సిన ఆవశ్యకతను గుర్తించిన పీసీబీ పనులు మొదలుపెట్టింది. ఈ క్రమంలో లాహోర్‌లో గల ప్రసిద్ధ గడాఫీ స్టేడియాన్ని పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ సందర్శించారు.మన స్టేడియాలు బాలేవుఈ సందర్భంగా నఖ్వీ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘మన స్టేడియాలకు.. అంతర్జాతీయ స్టేడియాలకు మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. మన స్టేడియాల్లో ఒక్కటీ అంతర్జాతీయ ప్రమాణాలకు తగిన విధంగా లేదు. ఆ పరిస్థితిని మార్చేందుకు మేము ప్రక్షాళన చర్యలు చేపట్టాం. ఫ్రాంటియర్ వర్క్స్ ఆర్గనైజేషన్ రాత్రిపగలూ తేడా లేకుండా ఎంతో కష్టపడుతోంది.ప్రథమ ప్రాధా న్యం అదేప్రపంచంలోని అత్యుత్తమ స్టేడియాలలో ఒకటిగా మన స్టేడియాలను తీర్చిదిద్దుతాం. అయితే, అంతకంటే ముందు పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించడమే మొదటి ప్రాధాన్యంగా పనిచేస్తున్నాం’’ అని పేర్కొన్నారు. కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025 నేపథ్యంలో క్రికెట్ స్టేడియాల పునరుద్ధరణలో భాగంగా పీసీబీ ఇప్పటికే 17 బిలియన్ల పాక్ రూపాయలను కేటాయించినట్లు సమాచారం.ఇక ఈ మెగా టోర్నీ నిర్వహణ కోసం ఐసీసీ పీసీబీకి 70 మిలియన్ అమెరికన్ డాలర్ల నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది. అయితే, ఈ ఈవెంట్లో పాల్గొనేందుకు టీమిండియా పాక్‌కు వెళ్లబోదని బీసీసీఐ పెద్దలు చెబుతుండగా.. హైబ్రిడ్ విధానానికి తాము ఒప్పుకోమని పీసీబీ అంటోంది. ఈ విషయంపై ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి!!చదవండి: చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ వేదిక అదే: పీసీబీ చీఫ్ -
చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ వేదిక అదే: పీసీబీ చీఫ్
చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్ వేదికను ఖరారు చేసినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ తెలిపాడు. లాహోర్ వేదికగా ఈ ఐసీసీ టోర్నీ తుది మ్యాచ్ నిర్వహించనున్నట్లు వెల్లడించాడు. గఢాఫీ స్టేడియంలో ఈ మ్యాచ్ నిర్వహణకు సర్వం సిద్ధం చేస్తున్నట్లు సోమవారం ప్రకటించాడు.కాగా చాంపియన్స్ ట్రోఫీ తాజా ఎడిషన్ హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ మెగా టోర్నీ కోసం టీమిండియా మాత్రం అక్కడికి వెళ్లే సూచనలు కనిపించడం లేదు. ఆసియా వన్డే కప్-2023 మాదిరిగానే హైబ్రిడ్ విధానంలో.. టీమిండియా మ్యాచ్‌లను తటస్థ వేదికల్లో నిర్వహించాలని బీసీసీఐ ఐసీసీని కోరినట్లు సమాచారం.ఫైనల్ వేదికపై పీసీబీ చీఫ్ ప్రకటనఇందుకు ఐసీసీ కూడా సానుకూలంగానే స్పందించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, పాకిస్తాన్ బోర్డు మాత్రం టీమిండియాను తమ దేశానికి రప్పించే బాధ్యత ఐసీసీదేనని.. హైబ్రిడ్ మోడల్‌కు ఒప్పుకొనే ప్రసక్తే లేదని స్పష్టం చేసినట్లు ప్రచారం జరిగింది. అంతేకాదు.. టీమిండియా మ్యాచ్‌లన్నీ లాహోర్‌లో నిర్వహించేందుకు పాక్ బోర్డు షెడ్యూల్ ఖరారు చేసినట్లు పాక్ మీడియాలో కథనాలు వచ్చాయి.ఆ మూడు మైదానాల్లోఅయితే, ఇందుకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. తాజాగా పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ మాత్రం ఫైనల్ వేదిక గురించి స్పష్టతనివ్వడం విశేషం. ఇక చాంపియన్స్ ట్రోఫీ-2025లో హాట్ ఫేవరెట్‌గా టీమిండియా బరిలోకి దిగనుంది. టైటిల్ రేసులో ముందున్న రోహిత్ సేనను దృష్టిలో పెట్టుకుని.. పాక్ బోర్డు ఈ మేరకు వేదికను ఫిక్స్ చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఈ మెగా టోర్నమెంట్ మ్యాచ్‌లకు లాహోర్, కరాచీ, రావల్పిండి ఆతిథ్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. టీమిండియాను పాకిస్తాన్‌కు పంపించే విషయంపై ఇంత వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని బీసీసీఐ కార్యదర్శి జై షా శనివారం పేర్కొన్నాడు.చదవండి: PAK Vs BAN Test Series: తొలి టెస్టుకు పాక్ తుదిజట్టు ప్రకటన.. యువ పేసర్ రీ ఎంట్రీ -
టీమిండియా మ్యాచ్‌లన్నీ అక్కడే!.. నో చెప్పిన ఐసీసీ!
చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆడేందుకు టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్తుందా? లేదా? ఈ ప్రశ్నలకు ఇంకా సమాధానం దొరకలేదు. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) సర్వసభ్య సమావేశంలో ఈ విషయంపై స్పష్టత వస్తుందని భావించినా.. అలా జరుగలేదు. రోహిత్ సేనను పాకిస్తాన్‌కు పంపేదేలేదని బీసీసీఐ పట్టుదలగా ఉన్న విషయం తెలిసిందే.అయితే, నిబంధనల ప్రకారం మ్యాచ్‌లన్నీ తమ దేశంలోనే నిర్వహించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఐసీసీకి విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. భారత జట్టును పాకిస్తాన్‌కు తీసుకువచ్చే బాధ్యత ఐసీసీకే అప్పగించినట్లు సమాచారం.టీమిండియా మ్యాచ్‌లన్నీ లాహోర్‌లోనే!ఈ విషయం గురించి పీసీబీ వర్గాలు మాట్లాడుతూ.. ‘‘చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య దేశంగా.. తమ కర్తవ్యాలకు అనుగుణంగా పీసీబీ డ్రాఫ్ట్ షెడ్యూల్‌తో పాటు టోర్నీ ఫార్మాట్‌కు సంబంధించిన వివరాలను ఐసీసీకి సమర్పించింది.ఈ అంశాల గురించి మిగతా దేశాల బోర్డులతో చర్చించి.. షెడ్యూల్‌ను ఖరారు చేయాల్సిన బాధ్యత ఐసీసీ మీద ఉంది. డ్రాఫ్ట్ షెడ్యూల్లో భాగంగా టీమిండియా మ్యాచ్‌లు అన్నీ(ఒకవేళ అర్హత సాధిస్తే సెమీ ఫైనల్, ఫైనల్‌లతో సహా) లాహోర్‌లో నిర్వహిస్తామని తెలిపింది.అంతేకాదు.. అక్కడి టాక్స్ విధానం, వేదికల ఎంపిక, టీమిండియా మ్యాచ్‌ల నిర్వహణకు ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సిన అనుమతుల గురించి కూడా రాతపూర్వకంగా వివరాలు అందించింది’’ అని తెలిపాయి.ఐసీసీ నో చెప్పినట్లే!చాంపియన్స్ ట్రోఫీ-2025లో తమ మ్యాచ్‌లకు వేదిక మార్చాలన్న బీసీసీఐ డిమాండ్‌కు ఐసీసీ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. సర్వసభ్య సమావేశంలో భాగంగా టోర్నమెంట్ నిర్వహణ కోసం అయ్యే ఖర్చుకు గతంలో కంటే అదనపు మొత్తాన్ని బడ్జెట్లో చేర్చినట్లు తెలుస్తోంది.ఒకవేళ ఇండియా మ్యాచ్‌లను హైబ్రిడ్ విధానంలో పాక్ వెలుపల నిర్వహిస్తే దాని పర్యవసనాలు, అందుకు అయ్యే ఖర్చు కోసం ఈ మొత్తాన్ని పక్కనపెట్టినట్లు సమాచారం. కాగా డ్రాఫ్ట్ షెడ్యూల్ ప్రకారం మార్చి 1న టీమిండియా- పాకిస్తాన్ మ్యాచ్‌కు ముహూర్తం ఖరారైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. -
నా జీవితంలో ఈ సినిమా చాలా ప్రత్యేకం: ప్రీతీ జింటా
ఆరేళ్ల తర్వాత బాలీవుడ్ నటి ప్రీతీ జింటా మళ్లీ తెరపై కనిపించనుంది. సన్నీడియోల్ హీరోగా రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘లాహోర్ 1947’. హీరో ఆమిర్‌ఖాన్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. అయితే, తాజాగా ఈ సినిమాలోని ప్రీతీ జింటా పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి కావడంతో ఆమె ఈ విషయాన్ని చెబుతూ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఓ వీడియోను షేర్ చేసింది.'లాహోర్ 1947'లో ప్రీతీ ఓ కీలక పాత్రలో నటిస్తుంది. ఆరేళ్ల తర్వాత వెండితెరపై కనిపించనున్నడంతో ఆమె ఇలా చెప్పింది. 'ఈ సినిమాలో నా పాత్రకు సంబంధించి నా షూటింగ్ ముగిసింది. నా జీవితంలో చాలా సినిమాల్లో నటించాను అయితే, ఈ సినిమా చాలా ప్రత్యేకం. ఇప్పటి వరకు నేను నటించిన ప్రాజెక్టుల కన్నా కఠినమైన సినిమా ఇదే. లాహోర్‌లో 1947లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. అభిమానులందరికీ సినిమా తప్పకుండా నచ్చుతుంది. నాకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు.' అని ఆమె తెలిపింది.ఈ సంగతి ఇలా ఉంచితే... 2018లో రిలీజైన హిందీ చిత్రం ‘భయ్యాజీ సూపర్‌హిట్’ మూవీలో సన్నీడియోల్, ప్రీతీ జింటా జోడీగా నటించారు. ఆ సినిమా తర్వాత మరో మూవీలో నటించలేదు ప్రీతీజింటా. మళ్లీ ఇప్పుడు ‘లాహోర్ 1947’కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారామె. ఇక ప్రీతీ జింటా తిరిగి సినిమాలు చేస్తున్నట్లు తెలిసిన రోజు నుంచి ఈ సినిమా కోసం ఆమె అభిమానులు ఎదురుచూస్తున్నారు. -
లాహోర్ ఒప్పందాన్ని ఉల్లంఘించటం పాక్ తప్పే: నవాజ్ షరీఫ్
లాహోర్: పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి నవాజ్ షరీష్ భారత్‌తో చేసుకున్న ఒప్పదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. 1999లో తాను,అప్పటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజపేయి సంతకాలు చేసిన ‘లాహోర్ డిక్లరేషన్’ఒప్పందం ఉల్లంఘించామని తెలిపారు. ఆయన మంగళవారం పాకిస్తాన్ ముస్లిం లీగ్(ఎన్) పార్టీ సమావేశంలో మాట్లాడారు.‘మే 28, 1998న పాకిస్తాన్ ఐదు అణుబాంబు పరీక్షలు చేపట్టింది. అనంతరం భారత్ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి లాహోర్‌కు వచ్చారు. ఆయన మాతో లాహోర్ ఒప్పందం చేసుకున్నారు. అయితే ఆ ఒప్పందాన్ని మేం ఉల్లంఘించాము. అది మా తప్పే. అప్పటి అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఉద్దేశపూర్వకంగా అగ్రిమెంట్‌ను అతిక్రమించారు’ అని అన్నారు.మార్చి,1999లో ముషారఫ్ పాక్ ఆర్మీకి ఫోర్ స్టార్ జనరల్‌గా ఉన్నారు. లడ్డాక్‌లోని కార్గీల్‌లో రహస్యంగా చొరబాడటానికి ఆదేశించారు. ఈ విషయంతో అప్రమత్తమైన ఇండియా యుద్ధం చేసి విజయం సాధించింది. ఆ సమయంలోనే తాను ప్రధానిగా ఉన్నానని నవాజ్ షరీఫ్ గుర్తుచేశారు. పాకిస్తాన్ మొదటి అణు బాంబు పరీక్షించి 26 ఏళ్లు అవుతోందని తెలిపారు.‘అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఆనాడు పాక్.. అణుపరీక్ష ఆపేందుకు 5 బిలియన్ డాలర్లను ఇస్తానని ఆఫర్ చేశాడు. కానీ, నేను అమెరికా అఫర్‌ను తిరస్కరించాను. ఆ సమయంలో మాజీ ప్రధానిగా ఇమ్రాన్ ఉండి ఉంటే క్లింటన్ ఆఫర్‌కు అంగీకరించేవాడు’అని ఇమ్రాన్‌పై విమర్శలు గుప్పించారు.లాహోర్ డిక్లరేషన్ ఇరు దేశాల మధ్య ఏర్పాటు చేసుకున్న శాంతి ఒప్పందం. ఈ ఒప్పందంపై ఇరు దేశాల ప్రధానులు 21, ఫిబ్రవరి 1999లో సంతాకాలు చేశారు. అనంతరం పాకిస్తాన్ జమ్ము కశ్మీర్‌లోని కార్గిల్‌లోకి చొరబడటంతో యుద్ధానికి దారి తీసింది. ఈ యుద్ధంలో భారత్ విజయం సాధించింది. ఇక..ద తాజాగా మంగళవారం నవాజ్ షరీష్ మరోసారి పీఎంఎల్-ఎన్ పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. -
Pak vs NZ: చావో రేవో.. గట్టెక్కిన పాకిస్తాన్! ఆఖరికి..
న్యూజిలాండ్‌తో ఆఖరి టీ20లో పాకిస్తాన్ గట్టెక్కింది. తొమ్మిది పరుగుల స్వల్ప తేడాతో గెలుపొంది సిరీస్‌ను సమం చేసుకుంది. కాగా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం కివీస్ జట్టు పాక్ పర్యటనకు వెళ్లింది.బాబర్ ఆజం కెప్టెన్‌గా తిరిగి పగ్గాలు చేపట్టిన తర్వాత పాకిస్తాన్‌కు ఇదే తొలి సిరీస్. అది కూడా సొంతగడ్డపై జరుగుతుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ క్రమంలో తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో మ్యాచ్‌లో ఆతిథ్య పాక్ విజయం సాధించింది. ఆ మరుసటి మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తు చేసిన కివీస్.. నాలుగో టీ20లో 4 పరుగుల తేడాతో గెలిచి షాకిచ్చింది. ఈ నేపథ్యంలో ఆతిథ్య జట్టు 1-2తో వెనుకబడింది. కివీస్ ద్వితీయ శ్రేణి జట్టు చేతిలో వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడిపోవడంతో బాబర్ ఆజం బృందంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో చావోరేవో తేల్చుకోవాల్సిన ఆఖరి టీ20లో పాక్ గెలుపొందింది. తద్వారా సిరీస్‌ను 2-2తో సమం చేయగలిగింది.లాహోర్‌లో టాస్ ఓడిన పాక్.. న్యూజిలాండ్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసింది. బాబర్ ఆజం(44 బంతుల్లో 69), ఉస్మాన్ ఖాన్(24 బంతుల్లో 31), ఫఖర్ జమాన్(33 బంతుల్లో 43), షాబాద్ ఖాన్(5 బంతుల్లో 15 నాటౌట్) రాణించారు.ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్తాన్ ఐదు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో కివీస్ తడబడింది. ఓపెనర్ టిమ్ సెఫార్ట్ (33 బంతుల్లో 52), జోష్ క్లార్క్సన్(26 బంతుల్లో 38 నాటౌట్) మాత్రమే మెరుగ్గా ఆడారు.మిగతా వాళ్లంతా చేతులెత్తేయడంతో 19.2 ఓవర్లలో 169 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో తొమ్మిది పరుగుల తేడాతో పాక్ విజయం సాధించింది. నాలుగు వికెట్లతో రాణించిన షాహిన్ ఆఫ్రిదికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో పాటు.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా దక్కింది. Scenes in Lahore following the fifth T20I as the series is squared 🏆🤝#PAKvNZ | #AaTenuMatchDikhawan pic.twitter.com/pBm4SmQi7j— Pakistan Cricket (@TheRealPCB) April 27, 2024 -
పెళ్లి వేడుకలో కాల్పులు.. పాక్ గ్యాంగ్‌స్టర్ మృతి
లాహోర్: పాకిస్థాన్‌లో మరో గ్యాంగ్‌స్టర్ దారుణ హత్యకు గురయ్యాడు. లాహోర్ అండర్‌వరల్డ్ డాన్, గూడ్స్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ చీఫ్ అమీర్ బలాజ్ టిపును ఓ దుండగుడు కాల్చివేశాడు. ఆదివారం లాహోర్‌లోని చంగ్ ప్రాంతంలో ఓ వివాహ వేడుకకు హాజరైన అమీర్‌తోపాటు మరో ఇద్దరు అతిథులపై గుర్తు తెలియని ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. దీంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అప్రమత్తమైన ఆమీర్ సహాయకులు ఎదురు కాల్పులు జరపగా ఆ కాల్పుల్లో షూటర్ అక్కడికక్కడే మరణించాడు. గాయపడిన వారిని హుటాహుటిన జిన్నా ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ అమీర్ ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఆయనపై దాడికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని వెల్లడించారు. కాగా 2010లో అల్లమా ఇక్బాల్ విమానాశ్రయంలో జరిగిన ఘోరమైన తుపాకీ కాల్పుల్లో ఆమీర్ తండ్రి ఆరిఫ్ అమీర్, అలియాస్ టిప్పు ట్రక్కన్వాలా మృతిచెందాడు. బలాజ్ తాత కూడా గతంలో గొడవలో పాత్ర ఉన్నవాడే. వీరి కుటుంబం మొత్తం హింసాత్మక చరిత్రను కలిగి ఉంది. -
బ్రైడల్ ఫ్యాషన్ షో.. ర్యాంప్ వాక్ తో అదరగొట్టిన మోడళ్లు (ఫొటోలు)
-
పాక్‌నూ కాటేస్తున్న వాయుకాలుష్యం.. లాహోర్ ప్రజలు విలవిల!
భారత్ మాత్రమే కాదు.. పాకిస్తాన్‌లోనూ గాలి అత్యంత విషపూరితంగా మారింది. పాక్‌లోని రెండో అతిపెద్ద నగరమైన లాహార్ పొగమంచు సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నగరంలోని లక్షలాది మంది ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. పలువురి జీవనోపాధి దెబ్బతింటోంది. స్విస్ ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం లాహోర్‌లో గాలి నాణ్యత ప్రపంచంలోనే అధ్వాన్నంగా ఉంది. ఇక్కడి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) ‘ప్రమాదకర’ స్థాయిని సూచిస్తూ 470 వద్ద ఉంది. పాక్ మీడియా డాన్ పేర్కొన్న వివరాల ప్రకారం వాహన ఉద్గారాలు, పారిశ్రామిక కాలుష్యం, పంటలను కాల్చడం కారణంగానే కాలుష్యం కమ్ముకుంది. పొగమంచు కారణంగా లాహోర్ నగరంలో దృశ్యమానత(విజిబులిటీ) తగ్గింది. వైమానిక కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. లాహోర్‌కు చెందిన పలువురు విషపూరితమైన గాలి కారణంగా శ్వాసకోశ సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు, చర్మ వ్యాధుల బారిన పడ్డారని తెలుస్తోంది. పొగమంచు నుండి తప్పించుకునేందుకు కొందరు నగరాన్ని విడిచిపెట్టారు. పాక్‌లోని లాహోర్, పంజాబ్‌లలో పొగమంచు సంక్షోభం కొత్త విషయం కాదు. ప్రతి సంవత్సరం అక్టోబర్, నవంబర్, డిసెంబర్లలో ఇటువంటి పరిస్థితులే కనిపిస్తుంటాయి. ఇది కూడా చదవండి: దక్షిణాసియాలోనే అధిక కాలుష్యం ఎందుకు? కట్టడి ఎలా? -
రాజస్థాన్ ఎన్నికలపై పాక్ కన్ను.. బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..
రాజస్థాన్ అసెంబ్లీకి ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సౌత్ ఢిల్లీ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి..మరోసారి నోరుజారి వార్తల్లోకెక్కారు. బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి.. రాజస్థాన్‌లోని టోంక్ నియోజకవర్గానికి ఎన్నికల ఇంచార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. ఈమేరకు ఆయన మంగళవారం ఓ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. భారతదేశంతోపాటు పాకిస్థాన్ కూడా రాజస్థాన్ ఎన్నికలపై కన్నేసి ఉంచిందని అన్నారు. టోంక్ స్థానంపై లాహోర్ కన్నేసిందన్నారు. నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) సభ్యులకు టోంక్ ప్రజలు ఆశ్రయం కల్పిస్తున్నరని ఆరోపించారు. ‘ఇక్కడి ఎన్నికలపై లాహోర్ నిఘా ఉంచింది. ఎన్నికల తర్వాత లాహోర్‌లో లడ్డూలు పంపిణీ చేయకుండా జాగ్రత్త వహించాలి. రాబోయే ఎన్నికల ఫలితాలపై హమాస్ వంటి ఉగ్రవాదుల కన్ను కూడా ఉంది’ అంటూ బిధూరి వ్యాఖ్యానించారు. కాగా టోంక్ స్థానం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలెట్ పోటీ చేస్తుండటం గమనార్హం. చదవండి: సుప్రీంకోర్టు మొట్టికాయ.. మరోసారి తమిళనాడు గవర్నర్ వివాదాస్పద నిర్ణయం అయితే బిధూరి ఈ విధమైన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలవడం ఇదేం తొలిసారి కాదు. గత పార్లమెంటు ప్రత్యేక సమావేశంలో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఎంపీ కున్వర్ డానిష్ అలీ గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో బిధురిపై క్రమశిక్షణా చర్య తీసుకోవాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలను సీరియస్‌గా పరిగణించిన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా.. ఇలాంటి ప్రవర్తన పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక 200 అసెంబ్లీ స్థానాలున్న రాజస్థాన్‌లో నవంబర్ 25న ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్న ఈ ఎన్నికలు అటు కాంగ్రెస్, ఇటు బీజేపీకి కీలకంగా మారాయి. మరోసారి అధికారాన్ని నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే రాజస్థాన్‌లో ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా వరసగా రెండుసార్లు అధికారాన్ని చేజిక్కించుకోలేకపోవడంతో.. ఈ అవకాశంతో ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతుంది. డిసెంబర్ 3న వెలువడబోయే ఫలితాలతో రాజస్థాన్ ఎవరి వశం కాబోతుందో తెలనుంది. -
Asia Cup 2023: అయ్యో అఫ్గనిస్తాన్.. సూపర్-4లో శ్రీలంక
లాహోర్: శ్రీలంకతో మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ విజయలక్ష్యం 292 పరుగులు... అయితే 37.1 ఓవర్లలో దీనిని ఛేదిస్తేనే ఆ జట్టు ‘సూపర్–4’కు చేరుతుంది. దీనిని సవాల్‌గా తీసుకొని బ్యాటర్లంతా విజృంభించారు. అందరూ దూకుడుగా ఆడి జట్టును విజయానికి చేరువగా తెచ్చారు. 37 ఓవర్లలో స్కోరు 289 పరుగులకు చేరింది. మరో బంతికి 3 పరుగులు తీస్తే గెలుపు సొంతమవుతుందనగా వికెట్ కోల్పోయింది. అయితే తర్వాతి 3 బంతుల్లో మరో 6 పరుగులు చేసినా విజయానికి లెక్క సరిపోయేది. కానీ అదీ సాధ్యం కాలేదు. చివరకు 2 పరుగులతో గెలిచిన శ్రీలంక ‘సూపర్–4’ దశకు అర్హత సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లంక 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. కుశాల్ మెండిస్ (92; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్ స్కోరర్. అనంతరం అఫ్గానిస్తాన్ 37.4 ఓవర్లలో 289 పరుగులకు ఆలౌటైంది. నబీ (32 బంతుల్లో 65; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు), హష్మతుల్లా (59; 3 ఫోర్లు, 1 సిక్స్), రహమత్ షా (45; 5 ఫోర్లు, 1 సిక్స్), రషీద్ ఖాన్ (16 బంతుల్లో 27 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. చదవండి: Asia Cup 2023: మొహమ్మద్ నబీ విధ్వంసం.. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు -
పీసీబీకి థాంక్స్.. ఇండియా- పాక్ మ్యాచ్ అంటే: పాకిస్తాన్ పర్యటనలో బీసీసీఐ బాస్
BCCI President Roger Binny Visit To Pakistan: పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడు రోజర్ బిన్నీ ధన్యవాదాలు తెలిపారు. తమను పాకిస్తాన్‌కు ఆహ్వానించినందుకు సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. కాగా ఆసియా కప్-2023 నిర్వహణ హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను అక్కడికి పంపేది లేదని బీసీసీఐ కార్యదర్శి, ఆసియా క్రికెట్ మండలి(ఏసీసీ) అధ్యక్షుడు జై షా స్పష్టం చేశారు. ఈ క్రమంలో చర్చోపర్చల అనంతరం శ్రీలంకతో కలిసి హైబ్రిడ్ విధానంలో ఈ వన్డే ఈవెంట్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు పీసీబీ సిద్ధపడింది. ఆ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలోనే ఇందుకు తగ్గట్లుగానే భారత జట్టు ఆడే మ్యాచ్లన్నింటితో పాటు ఫైనల్ కూడా శ్రీలంకలోనే జరుగనుంది. ఇదిలా ఉంటే.. ఏసీసీ సభ్యులు, ఆసియా కప్‌లో భాగమైన జట్ల క్రికెట్ బోర్డు మెంబర్స్‌ను పీసీబీ డిన్నర్‌కు ఆహ్వానించింది. PC: PCB ఈ క్రమంలో బీసీసీఐ బాస్ రోజర్ బిన్నీతో పాటు.. ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా సోమవారం నాటి పీసీబీ విందుకు హాజరయ్యారు. లాహోర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రోజర్ బిన్నీ మాట్లాడుతూ.. దాయాదుల పోరు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. థాంక్యూ పీసీబీ ‘‘మమ్మల్ని ఇక్కడకు ఆహ్వానించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు బీసీసీఐ తరఫున కృతజ్ఞతలు చెబుతున్నా. బీసీసీతో పాటు భారత్‌లో ఉన్న క్రికెట్ ప్రేమికుల తరఫున కూడా నేనే విష్ చేస్తున్నా. ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే అందరికీ పండుగ. రోడ్లు మొత్తం ఖాళీ అవుతాయి మ్యాచ్ మొదలైందంటే చాలు.. ప్రతి ఒక్కరు అలెర్ట్ అయిపోతారు. పనులన్నీ పక్కనపెట్టేస్తారు. రోడ్లు మొత్తం ఖాళీ అయిపోతాయి. ప్రతి ఒక్కరు క్రికెట్ చూసేందుకు టీవీ ముందు కూర్చుంటారు’’ అంటూ రోజర్ బిన్నీ చిరకాల ప్రత్యర్థుల క్రికెట్ పోరు గురించి కామెంట్ చేశారు. పల్లెకెలెలో మ్యాచ్ అద్భుతంగా సాగిందని.. వర్షం అంతరాయం కలిగించి ఉండకపోతే.. ఫలితం చూసే వాళ్లమని పేర్కొన్నారు. పీసీబీ ఆహ్వానం మేరకు సరిహద్దులు దాటి వచ్చామన్న బిన్నీ.. ఇదొక అద్భుతమైన అనుభవమని సంతోషం వ్యక్తం చేశారు. కాగా ఆసియా కప్-2023లో భారత్- పాక్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే. అది స్వర్ణయుగం ఇక రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. 2004 తర్వాత మళ్లీ పాకిస్తాన్‌కు రావడం ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు. అప్పట్లో ఇండియా- పాకిస్తాన్‌కు స్వర్ణయుగమని గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. కాగా పాకిస్తాన్ వేదికగా ఆగష్టు 30న ఆరంభమైన ఆసియా టోర్నీ సెప్టెంబరు 17న శ్రీలంకలో జరుగనున్న ఫైనల్‌తో ముగియనుంది. చదవండి: WC 2023: ఇద్దరూ తుదిజట్టులో ఉంటే తప్పేంటి?: బీసీసీఐ చీఫ్ సెలక్టర్ BCCI President Roger Binny's speech at the PCB Gala Dinner at the Governor's House in Lahore.#AsiaCup2023 pic.twitter.com/Zl2tq5MHxW — Pakistan Cricket (@TheRealPCB) September 4, 2023 BCCI Vice-President Rajeev Shukla's speech at the PCB grand gala dinner at Governor's House, Lahore.#AsiaCup2023 pic.twitter.com/OdOmI4Ddcl — Pakistan Cricket (@TheRealPCB) September 4, 2023 -
పాకిస్తాన్ సూపర్ లీగ్ ఫ్రాంఛైజీ ముల్తాన్ సుల్తాన్స్ యజమాని ఆత్మహత్య!
Alamgir Tareen, Owner Of Pakistan Super League Franchise: పాకిస్తాన్ సూపర్ లీగ్ జట్టు ముల్తాన్ సుల్తాన్స్ శిబిరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ముల్తాన్ సుల్తాన్స్ ఫ్రాంఛైజీ యజమాని ఆలంగిర్ తరీన్ ఆత్మహత్య చేసుకున్నాడు. లాహోర్‌లోని గుల్బర్గ్లో గల తన నివాసంలో బలన్మరణానికి పాల్పడ్డట్లు స్థానిక మీడియా వెల్లడించింది. కాగా ముల్తాన్ సుల్తాన్స్ సీఈఓ హైదర్ అజర్ ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. ఆలంగిర్ కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించాడు. ‘‘మా జట్టులో అత్యంత కీలకమైన, గౌరవనీయులైన వ్యక్తి ఆలంగిర్ తరీన్ హఠాన్మరణం చెందారు. ఈ కష్టకాలంలో ఆ దేవుడు ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం ఇవ్వాలని మనమంతా ప్రార్థిద్దాం’’ అని హైదర్ ప్రకటన విడుదల చేశాడు. ఇక ముల్తాన్ సుల్తాన్స్ సైతం ట్విటర్ వేదికగా స్పందించింది. ప్రైవసీకి భంగం కలిగించకండి ‘‘మా ప్రియమైన యజమాని ఆలంగిర్ ఖాన్ తరీన్ ఇక లేరన్న విషాదకర వార్త జీర్ణించుకోలేకపోతున్నాం. ఆయన కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి. దయచేసి ఎవరూ కూడా తరీన్ కుటుంబ గోప్యతకు భంగం కలిగించే విధంగా వ్యవహరించకూడదని ఈ సందర్భంగా విజ్జప్తి చేస్తున్నాం. ఆయన ఆత్మకు శాంతి కలుగుగాక’’ అని విచారం వ్యక్తం చేసింది. ఇక పీఎస్ఎల్లోని ఇతర ఫ్రాంఛైజీ లాహోర్ ఖలందర్స్ కూడా ఆలంగిర్ మృతి పట్ల సంతాపం తెలిపింది. కాగా 2021లో ముల్తాన్ సుల్తాన్స్ టైటిల్ విజేతగా నిలిచింది. తాజా సీజన్లో ఈ జట్టుకు మహ్మద్ రిజ్వాన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇదిలా ఉంటే.. ఆలంగిర్ ఆత్మహత్యకు కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. ఉన్నత విద్యావంతుడు ఆలంగిర్ తరీన్(63) ప్రఖ్యాత యేల్ యూనివర్సిటీలో విద్యనభ్యసించాడు. దక్షిణ పంజాబ్‌లో మేటి వ్యాపారవేత్తగా ఎదిగిన అతడికి క్రీడల పట్ల ఆసక్తి మెండు. పాకిస్తాన్‌లోనే అత్యంత పెద్దదైన నీటి శుద్ధి కేంద్రాలను నిర్వహిస్తున్న ఆలంగిర్.. పీఎస్ఎల్లో భాగమయ్యే క్రమంలో ముల్తాన్ సుల్తాన్స్ జట్టును కొనుగోలు చేశాడు. ఆ జట్టు ఇప్పటి వరకు ఒకే ఒకసారి ట్రోఫీ గెలిచింది. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com చదవండి: భారత్‌లో అత్యంత ధనవంతుడైన క్రికెటర్ ఎవరో తెలుసా? 'టీమిండియాతో మ్యాచ్ మాకు గొప్పేమి కాదు.. కేవలం ఒక్క గేమ్ మాత్రమే' إنا لله وإنا إليه راجعون It is with deep sadness that we share the news of the passing of our beloved team owner, Alamgir Khan Tareen. Our thoughts and prayers are with Mr. Tareen’s family. We request you all to kindly respect his family’s privacy. May his soul rest in… pic.twitter.com/aISUQtAqI5 — Multan Sultans (@MultanSultans) July 6, 2023 -
పాకిస్థాన్‌లో భారీ వర్షం...రోడ్లన్ని జలమయం (ఫొటోలు)
-
కాటేస్తున్న కాలుష్యం
సాక్షి, అమరావతి : ప్రపంచవ్యాప్తంగా 99 శాతం మంది ప్రజలు కలుషితమైన గాలిని పీలుస్తున్నారు. ఒక్క ఏడాదిలో 66.67 లక్షల మంది శ్వాసకోశ వ్యాధుల బారిన పడి మృత్యువాత పడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా గాలి కాలుష్యం అత్యధికంగా ఉన్న 20 నగరాల్లో మన దేశానికి చెందిన 14 నగరాలు ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నివేదిక వెల్లడించింది. అవన్నీ ఉత్తర భారత దేశ నగరాలే కావడం గమనార్హం. గాలి కాలుష్యంపై డబ్ల్యూహెచ్‌వో 2022లో నిర్వహించిన అధ్యయనంలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాల ప్రకారం క్యూబిక్ మీటర్ గాలిలో కలుషిత పదార్థాలు 2.5 మైక్రో గ్రాములకు మించకూడదు. అయితే అన్ని దేశాల్లో గాలిలో కలుషిత పదార్థాల తీవ్రత నిర్దేశించిన ప్రమాణాల కంటే నాలుగైదు రెట్లు అధికంగా ఉన్నట్లు తేలింది. కలుషితమైన గాలిని పీల్చడం వల్ల శ్వాసకోశ వ్యాధుల బారిన పడి తీవ్రమైన రక్తపోటుతో 2019లో ఏకంగా 66.67 లక్షల మంది మరణించినట్లు వెల్లడైంది. పట్టణాల్లో ప్రమాదకర స్థాయిలో.. గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే పట్టణాలు, నగరాల్లో కాలుష్య తీవ్రత అధికంగా ఉంది. ప్రపంచంలో గాలి కాలుష్య తీవ్రత అధికంగా ఉన్న నగరాల్లో పాకిస్తాన్‌లోని లాహోర్ మొదటి స్థానంలో నిలవగా చైనాలోని హటన్ రెండో స్థానంలో ఉంది. రాజస్థాన్ ఆళ్వార్ జిల్లాలోని బివాడీ కాలుష్య తీవ్రత అత్యధికంగా ఉన్న నగరాల్లో మూడో స్థానంలో నిలిచింది. కాలుష్య తీవ్రత ప్రమాదకర స్థాయిలో ఉన్న నగరాల్లో ఢిల్లీ నాలుగో స్థానంలో ఉండగా న్యూఢిల్లీ తొమ్మిదో స్థానంలో ఉంది. పరిశ్రమలు, వాహనాల పొగ.. గడ్డి కాల్చివేతతో వాహనాల రద్దీ అధికంగా ఉండటం వల్ల వాటి నుంచి వెలువడే పొగ... ప్రమాణాలు పాటించని పరిశ్రమలు... వ్యర్థాలను అడ్డగోలుగా కాల్చేయడం... నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ చేయడం.. పంట కోతల తర్వాత గడ్డిని పొలాల్లోనే కాల్చేయడం వల్ల ఓజోన్ పొరకు తీవ్రనష్టం వాటిల్లుతోంది. కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాౖMð్సడ్, నైట్రోజన్ డయాక్సైడ్ లాంటి విష వాయువుల విడుదలతో గాలి కాలుష్యం ప్రమాదకరస్థాయికి చేరుకుంటున్నట్లు డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. -
విపత్తు దిశగా పాక్.. పిరికిపందల్లా పారిపోను: ఇమ్రాన్ ఖాన్
లాహోర్: పాకిస్తాన్లో నెలకొన్న రాజకీయ అస్థిరతను తొలగించేందుకు ఎన్నికల నిర్వహణ ఒక్కటే మార్గమని పీటీఐ(తెహ్రీక్ ఎ ఇన్సాఫ్) అధినేత ఇమ్రాన్ ఖాన్ అన్నారు. గతంలో మాదిరి మిగతా రాజకీయ నేతల్లా తాను దేశం విడిచి వెళ్లనని, చివరిశ్వాస వరకు ఇదే గడ్డ మీద ఉంటానని గురువారం తన సందేశంలో పేర్కొన్నారు. పాకిస్థాన్ విపత్తు దిశగా వెళ్తోందన్న ఇమ్రాన్ ఖాన్.. తూర్పు పాకిస్తాన్ మాదిరి దేశం విచ్ఛిన్నం అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తన పార్టీకి, ఆర్మీకి మధ్య ఘర్షణ వాతావరణం తెచ్చేందుకు అధికారంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్నారు. తాను ఆర్మీని విమర్శించానంటే తన పిల్లలను మందలించినట్లుగా భావించాలన్నారు. పాక్‌లో నెలకొన్న రాజకీయ అస్థిరతను తొలగించేందుకు ఎన్నికల నిర్వహణ ఒక్కటే మార్గమని చెప్పారు. తాను ఎట్టి పరిస్థితుల్లో దేశం విడిచి వెళ్లేది లేదని, చివరి శ్వాస వరకు ఇక్కడే ఉంటానన్నారు. ఇక్కడి నుండి పరారై లండన్ లో ఉన్న నవాజ్ షరీఫ్ వంటి నేతలు ఈ దేశ రాజ్యాంగం గురించి ఆలోచిస్తున్నారా? అని ప్రశ్నించారు. దేశంలో వ్యవస్థలు, పాక్ ఆర్మీకి వస్తోన్న చెడ్డపేరు గురించి వారికి ఆలోచన ఉందా? అని నిలదీశారు. ఇదిలా ఉంటే.. ఇమ్రాన్ ఖాన్ నివాసాన్ని చుట్టుముట్టిన పారామిలిటరీ దళాలు, పోలీస్ బలగాలు.. ఏ క్షణంలోనైనా ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో పాక్ సుప్రీం కోర్టు, ఇస్లామాబాద్ హైకోర్టులు ఇమ్రాన్ ఖాన్‌కు ఇచ్చిన ఊరట ఆదేశాలను సైతం పక్కన పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోపక్క పాక్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే.. పీటీఐ కార్యకర్తల ఆగడాలను భరించేది లేదని ఆర్మీ ఛీప్ ప్రకటించారు కూడా. -
రైలులో మంటలు..ఏడుగురు సజీవదహనం
కరాచీ: పాకిస్తాన్లో ఎక్స్‌ప్రెస్ రైలులో చెలరేగిన మంటల్లో నలుగురు చిన్నారులు, ఒక మహిళ సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. కరాచీ నుంచి లాహోర్ వెళ్తున్న రైలు ఏసీ బోగీలో బుధవారం అర్ధరాత్రి తర్వాత మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్ వెంటనే టాండో మస్తి ఖాన్ స్టేషన్లో రైలును ఆపేసి, మంటలు అంటుకున్న బోగీని వేరు చేశారు. అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ దుర్ఘటనలో నలుగురు చిన్నారులు, ఒక మహిళ సహా ఏడుగురు సజీవ దహనమయ్యారు. ఆరు మృతదేహాలు గుర్తు పట్టడానికి కూడా వీలు లేనంతగా కాలిపోయాయి. ఘటనపై దర్యాప్తు జరుగుతోందని అధికారులు చెప్పారు. -
ODI WC 1996: అప్పుడు కారు.. ఇప్పుడు మీరు! ఈ క్రికెటర్ని గుర్తుపట్టారా?
Sanath Jayasuriya- “Golden memories”: శ్రీలంక క్రికెట్ దిగ్గజం సనత్ జయసూర్య 1996 ప్రపంచకప్ నాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు. నాటి వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో తన అత్యుత్తమ ప్రదర్శనకు ప్రతిఫలంగా లభించిన కారుతో ఉన్న ఫొటోలు పంచుకున్నాడు. ఇన్‌స్టాలో షేర్ చేసిన ఈ అపురూప చిత్రానికి.. ‘‘మరుపురాని జ్ఞాపకాలు: 27 ఏళ్ల క్రితం.. 1996 వరల్డ్‌కప్ మ్యాన్ ఆఫ్ సిరీస్ కార్‌తో ఇలా’’ అని తన పాత, ప్రస్తుత ఫొటోను జతచేసి క్యాప్షన్ ఇచ్చాడు. సనత్ జయసూర్య అభిమానులను ఆకర్షిస్తున్న ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు అప్పుడు కారు మెరిసింది.. ఇప్పుడు మీరు మెరుస్తున్నారు అంటూ సరదాగా ట్రోల్ చేస్తున్నారు. కంగారూ జట్టును చిత్తుచేసి ప్రపంచకప్- 1996 ఫైనల్లో లాహోర్ వేదికగా శ్రీలంక- ఆస్ట్రేలియా తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో లంక ఆసీస్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. గడాఫీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కంగారూ జట్టును చిత్తు చేసి జగజ్జేతగా అవతరించింది. ఇక ఈ మెగా టోర్నీ ఆసాంతం అద్భుతంగా రాణించి 221 పరుగులు సాధించడంతో పాటు.. ఏడు వికెట్లు తీసిన లంక ఆల్‌రౌండర్ సనత్ జయసూర్య మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. ఈ క్రమంలో అతడికి ఆడి కారు బహుమతిగా లభించింది. ఇదిలా ఉంటే.. సనత్ జయసూర్య తన కెరీర్లో 445 వన్డేల్లో 13,430, 110 టెస్టుల్లో 6973 పరుగులు, 31 టీ20 మ్యాచ్‌లలో 629 పరుగులు సాధించాడు. ఇందులో 42 సెంచరీలు, మూడు ద్విశతకాలు ఉన్నాయి. ఇక ఈ స్పిన్ ఆల్‌రౌండర్ తన కెరీర్ మొత్తంలో వన్డే, టెస్టులు, టీ20లలో వరుసగా.. 323, 98, 19 వికెట్లు పడగొట్టాడు. చదవండి: IPL 2023- Bhuvneshwar Kumar: నువ్వసలు పనికిరావు.. పైగా ఇలా మాట్లాడతావా? చెత్తగా ఆడిందే గాక.. IPL 2023: ధోనికి సరైన వారసుడు.. అతడికి ఎందుకు అవకాశాలు ఇవ్వడం లేదో!: సెహ్వాగ్ View this post on Instagram A post shared by Sanath Jayasuriya (Official) (@sanath_jayasuriya) -
నన్ను చంపేస్తారు.. భద్రత కల్పించండి: ఇమ్రాన్ ఖాన్
లాహోర్: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. ప్రాణ భయం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు భద్రత కల్పించాలంటూ ఆ దేశ చీఫ్ జస్టిస్ బుమర్ అట బండయల్కు ఓ లేఖ రాశారు. పలు కేసుల్లో విచారణ నిమిత్తం కోర్టులకు హాజరయ్యే అవకాశం ఉన్నందున తనకు భద్రత అవసరమంటూ అందులో విజ్ఞప్తి చేశారాయన. నా ప్రభుత్వాన్ని కూలదోసినప్పటి నుంచి పరిస్థితి చాలా దారుణంగా మారింది. నాపై కేసులు నమోదు అవుతున్నాయి. చివరికి.. నన్ను చంపేయత్నం కూడా జరిగింది అని లేఖలో పేర్కొన్నారాయన. తాను దేశ మాజీ ప్రధాని అయినప్పటికీ తగిన భద్రత కల్పించడం లేదని ఇమ్రాన్ ఖాన్.. పాక్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. గతంలో తనపై జరిగిన హత్యాయత్నంలో ప్రస్తుత ప్రధాని షెహబాజ్ షరీఫ్, అంతర్గత వ్యవహారాల మంత్రి ప్రమేయం ఉందని ఆరోపించారు. తనపై మరో హత్యాయత్నం జరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. ఇవాళ్టి వరకు నాపై 74 కేసులు నమోదయ్యాయి. పాకిస్థాన్‌లో అతి పెద్ద రాజకీయ పార్టీకి ఛైర్మన్ నేను. కాబట్టే, నేను ఎక్కడికి వెళ్లినా జనసందోహం ఎక్కువగానే ఉంటుంది. ఇదే అదనుగా నన్నే చంపేందుకు కుట్ర పన్నుతున్నారు. ఇందుకు సంబంధించి స్పష్టమైన సంకేతాలు కూడా అందుతున్నాయి అని లేఖలో పేర్కొన్నారాయన. గతంలో లాహోర్ హైకోర్టుకు వెళ్లినప్పుడు భద్రతా వైఫల్యం తలెత్తిందని ఆయన గుర్తు చేశారు. రాజ్యాంగం ప్రకారం జీవించే హక్కు ప్రాథమిక హక్కు అని, తన ప్రాణాలకు తీవ్రమైన ముప్పు పొంచి ఉందని అన్నారాయన. మరోవైపు తోషాఖానా కేసులో ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా.. ఆదివారం లాహోర్‌లోని ఆయన ఇంటి వద్ద పెద్ద హైడ్రామానే నడిచింది. -
ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్‌కు రంగం సిద్ధం!
లాహోర్: పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకు రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది. ఆదివారం మధ్యాహ్నం లాహోర్‌లోని జమాన్ పార్క్‌లో ఉన్న ఆయన నివాసం వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు. తోషాఖానా కేసులో ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో పీటీఐ కార్యకర్తలు అక్కడికి భారీ ర్యాలీతో చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇదిలా ఉంటే.. పీటీఐ నేత, పాక్ మాజీ మంత్రి ఫవాద్ చౌద్రి, ఇమ్రాన్ ఇంటి వద్దకు భారీగా చేరుకోవాలని కార్యకర్తలకు ట్విటర్ ద్వారా పిలుపు ఇచ్చారు. అంతేకాదు ఖాన్‌ను అరెస్ట్ చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పాక్ ప్రభుత్వాన్ని హెచ్చరించారాయన. ఇదిలా ఉంటే.. తోషాఖానా కేసులో ఇస్లామాబాద్ అడిషనల్ సెషన్స్ జడ్జి జఫర్ ఇక్బాల్ నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను జారీ చేశారు. ఫిబ్రవరి 28వ తేదీతో ఆ వారెంట్ ఉంది. కోర్టుకు గైర్హాజరు అవుతుండడంపై మండిపడ్డ న్యాయస్థానం ఈ వారెంట్ జారీ చేసినట్లు తెలుస్తోంది. పీడీఎం ప్రభుత్వం పాక్‌లో కొలువు దీరాక.. ఇమ్రాన్ ఖాన్ హయాంలో జరిగిన అవినీతి కూపి లాగడం ప్రారంభించింది. ఇందులో భాగంగా.. ప్రభుత్వానికి దక్కిన కానుకలను ఇమ్రాన్ ఖాన్ సొంతంగా ఉపయోగించుకున్నారని, వాటి వివరాలను.. లెక్కలను కూడా ఎక్కడా రికార్డుల్లో భద్రపరచ్చలేదని తేల్చింది. పాక్ ఎన్నికల సంఘం సైతం ఇదే విషయాన్ని నిర్ధారించింది. తోషాఖానా(కేబినెట్ పర్యవేక్షణలోని ప్రభుత్వానికి దక్కిన కానుకలను పర్యవేక్షించే విభాగం) కేసుగా ఇది ప్రాముఖ్యత దక్కించుకుంది. -
సికందర్ రజా సునామీ ఇన్నింగ్స్.. వరుసగా నాలుగో విజయం
Pakistan Super League 2023: పాకిస్తాన్ సూపర్‌లీగ్-2023లో లాహోర్ ఖలండర్స్ వరుసగా నాలుగో విజయం సాధించింది. క్వెటా గ్లాడియేటర్స్‌ను ఓడించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. జింబాబ్వే ఆల్‌రౌండర్ సికందర్ రజా విధ్వంసకర ఇన్నింగ్స్‌తో జట్టుకు గెలుపు అందించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో గురువారం రాత్రి లాహోర్ ఖలండర్స్, క్వెటా గ్లాడియేటర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన క్వెటా గ్లాడియేటర్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ సర్ఫరాజ్ నమ్మకాన్ని నిర్ణయానికి సార్థకత చేకూరుస్తూ.. క్వెటా బౌలర్లు అదరగొట్టారు. ఉమైద్ అసీఫ్ లాహోర్ ఓపెనర్లు మీర్జా బేగ్(2), ఫఖర్ జమాన్(రనౌట్)లను తక్కువ స్కోర్లకే పరిమితం చేసి శుభారంభం అందించాడు. ఇక వన్‌డౌన్ బ్యాటర్ షఫీక్ 15 పరుగులు చేయగా, వికెట్ కీపర్ సామ్ బిల్లింగ్స్ (2) పూర్తిగా నిరాశపరిచాడు. ఐదో స్థానంలో వచ్చిన హుసేన్ తలట్ కూడా కేవలం ఆరు పరుగులు చేసి నిష్క్రమించగా.. ఆరోస్థానంలో వచ్చిన కెప్టెన్ షాహిన్ ఆఫ్రిది 16 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇలా వరుస వికెట్లు కోల్పయి జట్టు కష్టాల్లో కూరుకుపోయిన వేళ సికందర్ రజా తన అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నాడు. 34 బంతుల్లో 8ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 71 పరుగులతో తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖరి వరకు అజేయంగా నిలిచి లాహోర్ 148 పరుగుల మెరుగైన స్కోరు నమోదు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. క్వెటా బౌలర్లలో నసీం షా, ఓడియన్ స్మిత్, ఉమైద్ అసీఫ్ ఒక్కో వికెట్ తీయగా.. నవీన్ ఉల్ హక్, మహ్మద్ నవాజ రెండేసి వికెట్లు పడగొట్టారు. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన క్వెటా గ్లాడియేటర్స్‌ను లాహోర్ బౌలర్లు హారిస్ రవూఫ్(3 వికెట్లు), రషీద్ ఖాన్(2 వికెట్లు) దెబ్బ కొట్టారు. వీరికి తోడు డేవిడ్ వీస్ ఒక వికెట్‌తో రాణించాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసిన క్వెటా గ్లాడియేటర్స్ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇప్పటి వరకు ఒకే ఒక్క గెలుపు నమోదు చేసిన క్వెటా గ్లాడియేటర్స్ పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. చదవండి: Ind Vs Aus 3rd Test: ఎట్టకేలకు బోణీ కొట్టిన ఆస్ట్రేలియా.. రోహిత్ సేనపై 9 వికెట్ల తేడాతో విజయం IND vs AUS: ఒంటి చేత్తో కళ్లు చెదిరే క్యాచ్.. చూస్తే వావ్ అనాల్సిందే! వీడియో వైరల్ View this post on Instagram A post shared by Pakistan Super League (@thepsl) -
ఇమ్రాన్‌ఖాన్‌పై కాల్పులు.. తొలిసారి స్పందించిన పాకిస్తాన్ మాజీ ప్రధాని
లాహోర్: పాకిస్తాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ గురువారం పార్టీ ర్యాలీలో తనపై జరిగిన హత్యాయత్నం అనంతరం పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తొలిసారి స్పందించారు. తనకు దేవుడు మరో జీవితాన్ని(పునర్జన్మ) ఇచ్చాడని వ్యాఖ్యానించారు. అల్లా మరో అవకాశం ఇచ్చారని, తన పోరాటాన్ని తిరిగి కొనసాగిస్తానని పేర్కొన్నారు. అంతేగాక తనపై జరిగిన దాడికి ఎవరినీ నిందించడం లేదని అన్నారు. కాగా ఇమ్రాన్ ఖాన్ పంజాబ్ ప్రావిన్స్‌లోని వజీరాబాద్‌లో జరిగిన నిరసన ప్రదర్శనలో కంటైనర్ ట్రక్కుపై నిల్చొని మాట్లాడుతుండగా గుర్తు తెలియని యువకుడు ఆయనపై తుపాకీతో కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇమ్రాన్ రెండు కాళ్లకు బుల్లెట్ తగిలి గాయం కాగా.. పీటీఐ పార్టీకి చెందిన పలువురికి గాయాలయ్యాయి. వెంటనే వీరిని లాహోర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇమ్రాన్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. చదవండి: సుదీర్ఘకాలంగా కరోనాతో పోరాటం.. 411 రోజుల తర్వాత విముక్తి Footage of the firing. Assassination attempt on Imran Khan. pic.twitter.com/fmSgI2E8jc — Ihtisham Ul Haq (@iihtishamm) November 3, 2022 ఘటన జరిగిన వెంటనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నందుకే ఇమ్రాన్ ఖాన్‌ను చంపేందుకు వచ్చానని నిందితుడు తెలిపాడు. ఇమ్రాన్‌ను మాత్రమే చంపాలని ప్రయత్నించానని.. ఇంకెవరిని కాదని అన్నాడు. తాను ఏ పార్టీకి, ఏ ఉగ్రవాద సంస్థకు చెందినవాడిని కాదని స్పష్టం చేశాడు. ఇదిలా ఉండగా ఇమ్రాన్ ఖాన్ కుడి కాలుకి గాయంతో పట్టి వేసుకొని ఆసుపత్రి బెడ్‌పై పడుకొని ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ సమయంలో అతను కళ్లు తెరిచి ఎవరితోనే చిన్నగా మాట్లాడుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. చదవండి: Imran Khan Rally: ఇమ్రాన్ ఖాన్ ర్యాలీలో ఫైరింగ్.. నలుగురికి గాయాలు -
Pak Vs Eng: పాకిస్తాన్‌కు భారీ షాక్! ఆస్పత్రిపాలైన స్టార్ పేసర్
Pakistan vs England, 5th T20I: ఇంగ్లండ్‌తో ఐదో టీ20 మ్యాచ్ ఆరంభానికి ముందు పాకిస్తాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బౌలర్ నసీం షా అనారోగ్య కారణాల వల్ల జట్టుకు దూరమయ్యాడు. తీవ్రమైన జ్వరం, ఛాతీలో ఇన్ఫెక్షన్ వచ్చిన నేపథ్యంలో నసీం షా ఆస్పత్రి పాలయ్యాడు. లాహోర్‌లోని ఓ ఆస్పత్రిలో అతడు చికిత్స పొందుతున్నాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికార ప్రతినిధి జియో టీవీతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. టీమిండియాతో మ్యాచ్‌తో అరంగేట్రం ప్రస్తుతం నసీం కోలుకుంటున్నాడని.. అయితే మిగతా రెండు మ్యాచ్‌లకు అతడు అందుబాటులో ఉంటాడో లేదో రిపోర్టులు వచ్చిన తర్వాతే తెలుస్తుందన్నారు. కాగా ఆసియా కప్-2022లో టీమిండియాతో మ్యాచ్‌లో అంతర్జాతీయ టీ20లలో అరంగేట్రం చేసిన 19 ఏళ్ల నసీం షా.. ఈ టోర్నీలో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. టోర్నీలో మొత్తంగా ఈ పేసర్ ఏడు వికెట్లు పడగొట్టాడు. అయితే, స్వదేశంలో ఇంగ్లండ్‌తో తొలి టీ20లో మాత్రం తేలిపోయాడు. నసీం షా(PC: PCB) స్వదేశంలో మొదటి టీ20లో మాత్రం నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసిన నసీం షా 41 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఈ క్రమంలో మిగతా మూడు మ్యాచ్‌లలో తుది జట్టులో అతడికి స్థానం దక్కలేదు. ఇక కీలకమైన ఐదో టీ20 ఆడతాడనుకుంటే అనారోగ్యం పాలయ్యాడు. కాగా టీ20 ప్రపంచకప్-2022 జట్టులో నసీం షా చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ మెగా ఈవెంట్ ఆరంభానికి ముందు పాక్.. స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఏడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతోంది. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు జరుగగా ఇరు జట్టు రెండేసి విజయాలతో 2-2తో సమంగా ఉన్నాయి. చదవండి: Ind Vs SA 1st T20: అతడు లేని జట్టు బలహీనం.. టీమిండియా ఓడిపోతుంది: భారత మాజీ క్రికెటర్ LLC 2022: దంచికొట్టిన కింగ్స్ బ్యాటర్లు.. భారీ లక్ష్యాన్ని ఛేదించలేక చతికిల పడ్డ సెహ్వాగ్ సేన -
ఒకప్పుడు ఐసీసీ ఎలైట్ ప్యానెల్ అంపైర్.. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ దుస్తులు అమ్ముతూ!
ICC Elite Panel Umpire Asad Rauf: ఐసీసీ ఎలైట్ ప్యానెల్లో ఒకప్పుడు అంపైర్‌గా ఉన్న పాకిస్తాన్ ఆటగాడు అసద్ రవూఫ్.. ప్రస్తుతం దుకాణం నడుపుతూ జీవనోపాధి పొందుతున్నాడు. క్రికెట్‌కు పూర్తిగా దూరమైన అతడు సెకండ్ హ్యాండ్ దుస్తులు, బూట్లు, ఇతర వస్తువులు అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతడు పాక్‌టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన జీవితంలో చాలా డబ్బు చూశానని, ఇప్పుడు తన షాప్‌లో పనిచేసే వర్కర్ల కోసమే పని చేస్తున్నానని పేర్కొన్నాడు. కాగా 71 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 40 లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడిన ఈ మాజీ బ్యాటర్.. ఆయా మ్యాచ్‌లలో మొత్తం కలిపి 3423, 611 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అంపైర్‌గా మారిన అతడు ఐసీసీ ఎలైట్ ప్యానెల్లో చోటు దక్కించుకుని కెరీర్లో ఉన్నత స్థితికి చేరుకున్నాడు. ఇక 2000-2013 వరకు 98 వన్డేలు, 49 టెస్టులు, 23 టీ20 మ్యాచ్‌లకు అంపైర్‌గా వ్యవహరించిన అసద్ రవూఫ్.. ఐపీఎల్-2013 సందర్భంగా బుకీల నుంచి ఖరీదైన బహుమతులు తీసుకున్నాడనే ఆరోపణల నేపథ్యంలో నిషేధం ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత ఆటకు పూర్తిగా దూరమయ్యాడు. ఈ క్రమంలో లాహోర్‌లోని లాండా బజార్లో షాప్ నడుపుతున్న 66 ఏళ్ల అసద్‌ను స్థానిక మీడియా సంప్రదించగా.. తన జీవితంలో ఏ విషయానికి పశ్చాత్తాప పడటం లేదని పేర్కొన్నాడు. తాను చేస్తున్న పనితో సంతృప్తిగా ఉన్నట్లు తెలిపాడు. తనకు దురాశ లేదని, ఉన్నంతలో సర్దుకుంటానని పేర్కొన్నాడు. ఈ మేరకు.. ‘‘ఇది నాకోసం చేయడం లేదు. నా షాపులో పనిచేసే సిబ్బందికి రోజూ కూలీ చెల్లించాలనే ఉద్దేశంతోనే నేను కూడా పనిలో భాగమవుతున్నా. నా లైఫ్‌లో చాలా డబ్బు చూశాను. ప్రపంచం మొత్తం తిరిగాను. నా కుటుంబం విషయానికొస్తే.. నాకు దివ్యాంగుడైన కుమారుడు ఉన్నాడు. మరో కుమారుడు అమెరికాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. నాకంటూ కొన్ని బాధ్యతలు ఉన్నాయి. నిజానికి నేను ఏ రంగంలో ఉన్నా అందులో తారస్థాయికి చేరుకోవాలని కోరుకుంటాను. క్రికెట్ ఆడే సమయంలో, అంపైరింగ్‌లో టాప్‌లో ఉండేవాడిని. ఇప్పుడు షాప్‌కీపర్‌గా కూడా ఉన్నత స్థితికి చేరుకునేందుకు కృషి చేస్తున్నా. నేను చేస్తున్న పనితో పూర్తి సంతృప్తిగా ఉన్నాను’’ అని అసద్ చెప్పుకొచ్చాడు. ఇక ఐపీఎల్లో ఆ చేదు అనుభవం మినహా మిగతాకాలమంతా ఎంతో అత్యుత్తమంగా గడిచిందని పేర్కొన్నాడు. చదవండి: India Vs Ireland T20I Series Details: ఐర్లాండ్‌తో భారత్ టీ 20 సిరీస్.. ఇరు జట్లు, షెడ్యూల్.. పూర్తి వివరాలు! Jos Buttler ODI Records: వన్డేల్లో చరిత్ర సృష్టించిన జోస్ బట్లర్.. 17 ఏళ్ల ధోని రికార్డు బద్దలు..!