నా జీవితంలో ఈ సినిమా చాలా ప్రత్యేకం: ప్రీతీ జింటా | Preity Zinta Comments On Lahore 1947 | Sakshi
Sakshi News home page

నా జీవితంలో ఈ సినిమా చాలా ప్రత్యేకం: ప్రీతీ జింటా

Published Mon, Jun 3 2024 6:50 AM | Last Updated on Mon, Jun 3 2024 8:48 AM

Preity Zinta Comments On Lahore 1947

ఆరేళ్ల తర్వాత బాలీవుడ్‌ నటి ప్రీతీ జింటా మళ్లీ తెరపై కనిపించనుంది. సన్నీడియోల్‌ హీరోగా రాజ్‌కుమార్‌ సంతోషి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్‌ యాక్షన్ డ్రామా ‘లాహోర్‌ 1947’. హీరో ఆమిర్‌ఖాన్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. అయితే,  తాజాగా ఈ సినిమాలోని ప్రీతీ జింటా పాత్రకు సంబంధించిన షూటింగ్‌ పూర్తి కావడంతో ఆమె ఈ విషయాన్ని చెబుతూ  ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఓ వీడియోను షేర్‌ చేసింది.

'లాహోర్‌ 1947'లో ప్రీతీ ఓ కీలక పాత్రలో నటిస్తుంది. ఆరేళ్ల తర్వాత వెండితెరపై కనిపించనున్నడంతో ఆమె ఇలా చెప్పింది.  'ఈ సినిమాలో నా పాత్రకు సంబంధించి  నా షూటింగ్‌ ముగిసింది. నా జీవితంలో చాలా సినిమాల్లో నటించాను అయితే, ఈ సినిమా చాలా ప్రత్యేకం. ఇప్పటి వరకు నేను నటించిన ప్రాజెక్టుల కన్నా కఠినమైన సినిమా ఇదే. లాహోర్‌లో 1947లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. అభిమానులందరికీ సినిమా తప్పకుండా నచ్చుతుంది. నాకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు.' అని ఆమె తెలిపింది.

ఈ సంగతి ఇలా ఉంచితే... 2018లో రిలీజైన హిందీ చిత్రం ‘భయ్యాజీ సూపర్‌హిట్‌’ మూవీలో సన్నీడియోల్, ప్రీతీ జింటా జోడీగా నటించారు. ఆ సినిమా తర్వాత మరో మూవీలో నటించలేదు ప్రీతీజింటా. మళ్లీ ఇప్పుడు ‘లాహోర్‌ 1947’కు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చారామె. ఇక ప్రీతీ జింటా తిరిగి సినిమాలు చేస్తున్నట్లు తెలిసిన రోజు నుంచి ఈ సినిమా కోసం ఆమె అభిమానులు ఎదురుచూస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement