![Preity Zinta Makes Comeback in Bollywood After 7 Years With Sunny Deol Lahore 1947 - Sakshi](/styles/webp/s3/filefield_paths/preeti-zintaa.jpg.webp?itok=MGf1tv7F)
ఆరేళ్ల తర్వాత సినిమా సెట్స్‌లోకి అడుగుపెట్టారు బాలీవుడ్ నటి ప్రీతీ జింటా. సన్నీడియోల్ హీరోగా రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘లాహోర్ 1947’. హీరో ఆమిర్‌ఖాన్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం మహారాష్ట్ర సరిహద్దులోని లొకేషన్స్ లో ఈ సినిమా నైట్ షూట్ జరుగుతోందని సమాచారం. తాజాగా ఈ సినిమాలో తాను ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు వెల్లడించి, చిత్రీకరణలో పాల్గొన్నట్లు సోషల్‌మీడియా వేదికగా వెల్లడించారు ప్రీతీ జింటా.
ఈ సంగతి ఇలా ఉంచితే... 2018లో రిలీజైన హిందీ చిత్రం ‘భయ్యాజీ సూపర్‌హిట్’ మూవీలో సన్నీడియోల్, ప్రీతీ జింటా జోడీగా నటించారు. ఆ సినిమా తర్వాత మరో మూవీలో నటించలేదు ప్రీతీజింటా. మళ్లీ ఇప్పుడు ‘లాహోర్ 1947’కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారామె. ఇక ప్రీతీ జింటా తిరిగి సినిమాలు చేస్తుండటంతో ఆమె అభిమానులు ‘ప్రీతి ఈజ్ బ్యాక్’, ‘ప్రీతి రిటర్న్స్’ అంటూ పోస్ట్‌లు షేర్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment