సల్మాన్‌తో ప్రేమాయణం.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి జింటా | Preity Zinta Clarify If She Ever Dated Salman Khan | Sakshi
Sakshi News home page

సల్మాన్‌కు హీరోయిన్‌ స్పెషల్‌ విషెస్‌.. డేటింగ్‌ రూమర్స్‌పై ఏమందంటే?

Published Sat, Dec 28 2024 12:33 PM | Last Updated on Sat, Dec 28 2024 12:59 PM

Preity Zinta Clarify If She Ever Dated Salman Khan

ఆన్‌స్క్రీన్‌ జంటల్ని జనాలెంతగానో ఇష్టపడతారు. రియల్‌ లైఫ్‌లోనూ ఆ హీరోహీరోయిన్లు జంటగా ఉంటే బాగుంటుందని ఆశపడతారు. కొందరైతే వారి మధ్య స్నేహాన్ని కూడా ప్రేమ అని ప్రచారం చేస్తుంటారు. అలా బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan), హీరోయిన్‌ ప్రీతి జింటా కూడా లవ్‌లో ఉన్నారని అప్పట్లో బోలెడు రూమర్స్‌ వచ్చాయి. ఇన్నాళ్లకు దానిపై క్లారిటీ ఇచ్చింది హీరోయిన్‌.

ఎంతో ప్రేమిస్తున్నా..
డిసెంబర్‌ 27న సల్మాన్‌ ఖాన్‌ బర్త్‌డే సందర్భంగా ప్రీతి జింటా (Preity Zinta) సోషల్‌ మీడియాలో ఓ స్పెషల్‌ పోస్ట్‌ షేర్‌ చేసింది. హ్యాపీ బర్త్‌డే సల్మాన్‌. నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. మిగతాదంతా మనం కలుసుకున్నప్పుడు మాట్లాడుకుందాం. మనిద్దరం మరోసారి ఫోటోలు దిగాలి. లేదంటే ఇదిగో ఇలా పాతవే పోస్ట్‌ చేస్తూ ఉంటాను అంటూ సల్మాన్‌తో కలిసి దిగిన ఫోటోలు షేర్‌ చేసింది. ఇది చూసిన ఓ నెటిజన్‌.. మీరిద్దరూ ప్రేమించుకున్నారా? అని అడిగాడు. 

హీరోతో లవ్‌?
అందుకు ప్రీతి జింటా.. అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చింది. అతడు తనకు క్లోజ్‌ ఫ్రెండ్‌ అని తెలిపింది. అలాగే తన భర్తకు కూడా మంచి స్నేహితుడని, తనకు కుటుంబసభ్యుడిలాంటివాడని చెప్పింది. మీరెంత ఊహించుకున్నా ఇదే నిజం అని రిప్లై ఇచ్చింది. కాగా సల్మాన్‌- ప్రీతిజింటా.. హర్‌ దిల్‌ జో ప్యార్‌ కరేగా, చోరీ చోరీ చుప్‌కే చుప్‌కే, దిల్‌నే జిసే ఆప్నా కహా, జాన్‌ ఎ మన్‌, హీరోస్‌, ఇష్క్‌ ఇన్‌ పారిస్‌ వంటి చిత్రాల్లో కలిసి నటించారు. ప్రీతి తెలుగులో ప్రేమంటే ఇదేరా, రాజకుమారుడు సినిమాల్లో హీరోయిన్‌గా మెరిసింది.

 

 

 చదవండి: గేమ్‌ ఛేంజర్‌ టీమ్‌కు అభిమాని వార్నింగ్‌.. 'ఆ పని చేయకపోతే చస్తా!'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement