‘మమల్ని దేశం నుంచి వెళ్లగొడుతున్నారు’ | Pakistan Forcefully Evicting Sikh Community | Sakshi
Sakshi News home page

సిక్కులను పాక్‌ నుంచి వెళ్లగొడుతున్నారు

Published Wed, Jul 11 2018 4:06 PM | Last Updated on Wed, Jul 11 2018 4:50 PM

Pakistan Forcefully Evicting Sikh Community - Sakshi

గులాబ్‌ సింగ్‌ కుటుంబం (ఫైల్‌ ఫోటో)

ఇస్లామాబాద్‌ : సిక్కులను పాకిస్తాన్‌ నుంచి బలవంతగా గెంటివేస్తున్నారని పాక్‌కు చెందిన గూలాబ్‌ సింగ్‌ అనే వ్యక్తి పేర్కొన్నారు. సిక్కుల నుంచి పాక్‌ మొదటి పోలీసు అధికారిగా నియమితులైన గులాబ్‌ సింగ్‌ లాహోర్‌కు సమీపంలోని దేరా చహల్‌ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. పోలీసు అధికారులు తనను దేశం విడిచివెళ్లాలని దౌర్జన్యం చేస్తున్నారని తెలిపారు. గులాబ్‌ సింగ్‌ బుధవారం మాట్లాడుతూ ‘మా కుటుంబం 1947 నుంచి పాక్‌లోనే ఉంటుంది. పాక్‌లో ఎన్ని అల్లర్లు జరిగినా మేం దేశం విడిచిపోలేదు. ఇప్పుడు ప్రభుత్వం సిక్కులను బలవంతంగా దేశం నుంచి తరివేయాలని చుస్తోంది. ఇంటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నెత్తికి చుట్టుకున్న పాగాను బలవంతంగా లాగారు. గత కొంత కాలంగా నన్ను చిత్రహింసలకు గురిచేస్తున్నారు’ అని గులాబ్‌ సింగ్ పేర్కొన్నారు.

ఇంటిని ఖాళీ చేయాడానికి తమకు కొంత సమయం అడిగిన పోలీసులు ఇవ్వలేదని గులాబ్‌ సింగ్‌ తెలిపారు. కాందిశీకులకు చెందిన ఓ ట్రస్ట్‌ బోర్డు తమను అక్కడి నుంచి ఖాళీ చెయించిందని, ఆ సంస్థ చైర్మన్‌ సయ్యద్‌ ఆసీఫ్‌ ఆక్తర్‌పై స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో గులాబ్‌ సింగ్‌ ఫిర్యాదు చేశాడు. గురుద్వార్‌కు సంబంధించిన స్థలాన్ని 2011లో గులాబ్‌ సింగ్‌ అక్రమంగా కొనుగోలు చేశారని, దానిని స్వాధీనం చేసుకునే బాధ్యతను పాక్‌ సుప్రీంకోర్టు ట్రస్ట్‌ చైర్మన్‌కు అప్పగించినట్లు బోర్డు సభ్యులు తెలిపారు.

My house is sealed with all belongings including my slippers inside. Even this 'patka' on my head is an old rag which I just wrapped. I was harassed, beaten and my faith was disrespected: Gulab Singh, Pakistani Policeman who was forcibly evicted from his house in Lahore pic.twitter.com/va1tOGk3UM

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement