Sikh community
-
అకాల్ తఖ్త్.. ఆదేశిస్తే ఏదైనా చేయాల్సిందే!.. మరి ఉల్లంఘిస్తే?
అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో చేసిన పాపాలకుగానూ(తప్పిదాలు).. ఏకంగా డిప్యూటీ సీఎంగా పని చేసిన ఓ వ్యక్తికి శిక్షలు విధించింది సిక్కు మతానికి చెందిన అకాల్ తఖ్త్. బాత్రూంలు, వంటగదులు, వరండాలు కడగడం.. షూలు, చెప్పులను శుభ్రం చేయడం లాంటి పనులు చేయాలని హుకుం జారీ చేసింది. ఆ ఆదేశాల్ని ఉల్లంఘించకుండా సుఖ్బీర్ సింగ్ బాదల్ శిరసావహించారు. ఈ క్రమంలోనే ఆయనపై జరిగిన హత్యాయత్నం తీవ్ర చర్చనీయాంశమైంది. అదే సమయంలో.. అకాల్ తఖ్త్ విధించిన ఈ శిక్షల గురించి తెలిసి చాలామంది ముక్కున వేలేసుకున్నారు.సిక్కు మత సమగ్రతను కాపాడుకోవడంతో పాటు తప్పు చేసిన వ్యక్తికి తన తప్పును సరిదిద్దుకునేందుకు అవకాశం ఇచ్చి.. తద్వారా మత సిద్ధాంతాలకు అనుగుణంగా ఆ వ్యక్తిని మార్చుకోవడమే అకాల్ తఖ్త్ ఉద్దేశం. అయితే.. ఇక్కడే కొన్ని సందేహాలు కలగకమానవు. అసలు అకాల్ తఖ్త్‌ను నడిపించేదెవరు?. ఒకవేళ ఆ శిక్షకు తలొగ్గకపోతే ఏం చేస్తారు?. నిజంగానే తీవ్ర పరిణామాలు ఉంటాయా?. సాధారణంగా అకాల్ తఖ్త్ విధించే శిక్షలను పరిశీలిస్తే..బహిరంగ క్షమాపణలు.. తప్పు చేసినవాళ్లతో సిక్కు ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పిస్తారుపాప పరిహారం కింద.. సేవా కార్యక్రమాల్లో(బాత్రూంలు, వంటగది, వరండాలు శుభ్రం చేయడం.. వంట చేర్చి వార్చడం, కాపలా పని, వగైరా) ద్వారా పాప పరిహారం చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. బహిష్కరణ.. నేర తీవ్రతను బట్టి సిక్కు సమాజం నుంచి వాళ్లను వెలివేస్తారు. ఇది కొంత కాలపరిమితితో ఉంటుంది. తద్వారా.. మతపరమైన కార్యక్రమాల్లో వాళ్లు భాగం కాలేరు. మరి ఈ శిక్షలను ఉల్లంఘిస్తే..?ఎవరైనా అకాల్ తఖ్త్ శిక్షలను గనుక ఉల్లంఘిస్తే.. పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది.శాశ్వత బహిష్కరణ.. అకాల్ తఖ్త్ శిక్షలకు తలొగ్గనివాళ్లను శాశ్వతంగా సిక్కు సమాజం నుంచి వెలివేస్తారు.సామాజిక బహిష్కరణలో భాగంగా.. సిక్కు కమ్యూనిటీ నుంచి వాళ్లకు ఎలాంటి సంబంధాలు ఉండవు. ఎలాంటి సాయం అందించరు. తద్వారా.. వాళ్లను ఒంటరిని చేసేస్తారు.ఆధ్యాత్మిక సయోధ్య.. దండించడం బదులు ఆధ్యాత్మిక మార్గంలో ప్రయత్నం చేస్తారు. కౌన్సెలింగ్‌లాంటివి ఇప్పించి.. వాళ్లను మళ్లీ దారిలో పెట్టే ప్రయత్నం చేశారు.పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చితం మరొకటి ఉండదంటారు కదా. ఒత్తిడి చేయడం ద్వారా వాళ్లు తమ తప్పులను ఒప్పకుని సేవా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రయత్నిస్తారు.ఇవేవీ పని చేయని క్రమంలో.. సిక్కు సంఘాలే రంగంలోకి దిగుతాయి. సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాయి. అయితే.. ఇన్నేళ్ల కాలంలో పరిస్థితి ఇంతదాకా ఏనాడూ రాలేదు.అకాల్ తఖ్త్ ద్వారా శిక్షించబడిన వాళ్లు ఎందరో.. వాళ్లలో కొందరు ప్రముఖులూ ఉన్నారు.మహారాజా రంజిత్ సింగ్సిక్కుల తొలి చక్రవర్తి. పరమతానికి చెందిన నృత్యకారిణిని వివాహం చేసుకున్నారనే నేరం కింద అకాల్ తఖ్త్ ఆయనకు కొరడాతో దెబ్బలు తినాలని శిక్ష విధించింది. అయితే ఆయన క్షమాపణలు చెప్పడంతో మన్నించి వదిలేసింది తఖ్త్.జ్ఞానీ జైల్సింగ్భారత మాజీ రాష్ట్రపతి. 1984లో ఆపరేషన్ బ్లూ స్టార్ టైంలో ఆయన రాష్ట్రపతిగా ఉన్నారు. స్వర్ణ దేవాలయంలోకి ఆర్మీని అనుమతించారనే నేరం కింద ఆయన్ని అకాల్ తఖ్త్ శిక్షించింది. అయితే రాత పూర్వకంగా క్షమాపణలు కోరుతూ ఆయన లేఖ రాశారు.బూటా సింగ్కేంద్ర మాజీ మంత్రి. ఈయన్ని కూడా ఆపరేషన్ బ్లూ స్టార్ కిందే శిక్షించింది అకాల్ తఖ్త్. శిక్షను అంగీకరించిన ఆయన.. కమ్యూనిటీ సేవలో పాల్గొన్నారు కూడా.సుర్జిత్ సింగ్ బర్నాలాపంజాబ్ మాజీ ముఖ్యమంత్రి. ఆపరేషన్ బ్లాక్ థండర్(అమృత్సర్ గోల్డెన్ టెంపుల్‌లోకి బ్లాక్ క్యాట్ కమాండోలను అనుమతించడంలో ఈయన పాత్ర ఎంతో ఉంది. అందుకే ఆయన్ని కాస్త కఠినంగానే శిక్షించారు. అకాల్ తఖ్త్కు జరిమానా కట్టడంతో బూట్లు శుభ్రం చేసి.. సిక్కు ప్రార్థనల్లో పాల్గొని తన పాపపరిహారం చేసుకున్నారాయన. సుఖ్వీర్సింగ్ బాదల్పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం. శిరోమణి అకాలీదళ్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో సుఖ్బీర్ సింగ్ బాదల్ మతపరమైన తప్పిదాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. 2007-17 మధ్య కాలంలో పార్టీతోపాటు వారి ప్రభుత్వం రాజకీయంగా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నట్లు అకాల్ తఖ్త్ నిర్ధారించింది. ఇందులో డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు మద్దతు ఇవ్వడం కూడా ఉంది. ఈ విషయంలో పార్టీ చీఫ్ సుఖ్బీర్ను దోషిగా తేల్చింది. అయితే తాను చేసిన తప్పులను అంగీకరించిన(మూడు నెలల కిందటే) సుఖ్బీర్ బేషరతు క్షమాపణలు చెప్పారు. ఆపై కాలు ఫఫ్రాక్చర్ అయ్యి వీల్ చైర్‌కు పరిమితమైనా సరే.. అభియోగాలు ఎదుర్కొంటున్న తోటి పార్టీ నేతలతో కలిసి ఇప్పుడు అకాల్ తఖ్త్ విధించిన శిక్షలను అనుభవించారు. అకాల్ తఖ్త్.. ఒరిజినల్ పేరు అకాల్ బుంగా. సిక్కులు పవిత్రంగా భావించే ఐదు తఖ్త్‌లలో ఇది ఒకటి. పంజాబ్ అమృత్సర్ దర్బార్ సాహిబ్ కాంప్లెక్స్‌లో ఉంది. సిక్కులు అత్యున్నత ఆధ్యాత్మిక విభాగం. సిక్కు మతగురువు గురు హరగోవింద్ జూన్ 15, 1606లో దీనిని అమృత్ సర్‌లోని గోల్డెన్ టెంపుల్ కాంప్లెక్స్‌లో నెలకొల్పారు. ఆ ప్రాంతంలోనే ఆయన బాల్యమంతా గడిచిందన్న వాదన ఒకటి ఉంది. 👉పిరి-మిరి అంటే.. ఆధ్యాత్మికంగానే కాకుండా సిక్కు సమాజానికి ఎదురయ్యే ఆందోళనల మీద చర్చ జరిపే ఉద్దేశంతో ఒక తాత్కాలిక అధికార వేదికను గురు హరగోవింద్ స్థాపించారు. పిరి-మిరికి ప్రతీకగా ఈ వేదికపై రెండు కత్తులను ఉంచారాయన. హర్గోవింద్తో పాటు బాబా బుద్ధా, భాయ్ గురుదాస్లు అకాల్ తఖ్త్ ఏర్పాటులో భాగమయ్యారు. 👉సిక్కుల అత్యున్నత విభాగంగా అకాల్ తఖ్త్కు పేరుంది. సర్బత్ ఖాల్సా యావత్ సిక్కు సంఘాలకు అత్యున్నత అధికారి కాగా.. జతేదార్(లీడర్)ను అకాల్ తఖ్త్ అధికార ప్రతినిధిగా గుర్తిస్తారు. సిక్కులకు మతపరమైన అధికారానికి కేంద్రంగా ఉన్న అకాల్ తఖ్త్‌ను అభివర్ణిస్తారు. 👉 పంజాబ్‌తో పాటు పాట్నా, బీహార్, మహారాష్ట్రలలో ఇలాంటి అధికార కేంద్రాలే ఉన్నాయి. అకాల్ తఖ్త్ నుంచి జారీ అయ్యే హుకామ్నామా(ఆదేశాలను).. ప్రతీ సిక్కు పాటించడం తప్పనిసరి. 👉 అకాల్ తఖ్త్ అనేది.. ఆకాలంలో అణచివేతకు వ్యతిరేకంగా చేసిన సిక్కులు చేసిన పోరాటానికి గుర్తు. అయితే ఈ సిక్కుల సార్వభౌమాధికార ప్రతీకపై దాడులు జరిగాయి. 18వ శతాబ్దంలో అహ్మద్ షా అబ్దాలీ దాడులతో మొదలై.. 1984లో ఆపరేషన్ బ్లూ స్టార్‌లో అకాల్ తఖ్త్ దెబ్బ తింది. ఆ తర్వాత ప్రభుత్వ ఆధ్వర్యంలో తాత్కాలికంగా అకాల్ తఖ్త్ నిర్మాణం జరిగినప్పటికీ.. దానిని ప్రభుత్వ వ్యతిరేక వర్గం ధ్వంసం చేసి.. పునఃనిర్మించుకున్నారు. ఆపరేషన్ బ్లూస్టార్‌లో.. దామ్‌దామి తక్సల్ 14వ జతేదార్ అయిన జర్నైల్ సింగ్ భింద్రన్వాలేపై.. పంజాబ్‌లో అతివాద సంస్థను నడిపిస్తున్నాడనే అభియోగాలు ఉన్నాయి. 1983 జులైలో.. అకాలీదళ్ అధ్యక్షుడు హర్చరణ్ సింగ్ లాంగోవాల్, అప్పటి అకాల్ తఖ్త్ జతేదర్ల ఆహ్వానం మేరకు బింద్రాన్‌వాలే గోల్డెన్ టెంపుల్ కాంప్లెక్స్‌కి చేరుకున్నాడు. అక్కడ అరెస్ట్‌కు భయపడి అకాల్ తఖ్త్‌లో తలదాచుకున్నాడు. అయితే.. అతని జాడ కనిపెట్టిన అప్పటి ఇందిరా గాంధీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. భారత సైన్యానికి అనుమతి ఇచ్చింది. 1984 జూన్ 3 నుంచి జూన్ 5వ తేదీల మధ్యలో.. గోల్డెన్ టెంపుల్లో ఆపరేషన్ బ్లూ స్టార్ నడిచింది. ఈ ఆపరేషన్‌లో అకాల్ తఖ్త్ భారీగా డ్యామేజ్ అయ్యింది. మిలిటెంట్లకు, ఆర్మీకి మధ్య జరిగిన కాల్పుల్లో భింద్రాన్వాలే చనిపోయాడు.ఆపరేషన్ బ్లూ స్టార్ తర్వాత.. అకాల్ తఖ్త్‌ను తిరిగి నిర్మించేందుకు అప్పటి జతేదార్ బాబా సంతా సింగ్ తీవ్రంగా ప్రయత్నించాడు. ఇందుకు కేంద్రం నుంచి నిధుల సమీకరణ కూడా చేయాలనుకున్నాడు. అయితే.. అందుకు సిక్కుల సంఘాల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం అయ్యింది. అయినా కూడా సర్బత్ ఖాల్సా సహకారంతో జతేదార్ నెలన్నర వ్యవధిలోనే(1984, ఆగష్టు 11) అకాల్ తఖ్త్ నిర్మాణం పూర్తి చేశారు. అయితే.. అదే సర్బత్ ఖాల్సా కూల్చేయాలని తీర్మానం చేసింది. జనవరి 1986లో కూల్చేసి.. బాబా సంతా సింగ్‌ను సిక్కు మర్యాదను దెబ్బ తీశాడనే కారణం చూపించి వెలివేసింది. 2001లో తిరిగి ఆయన్ని సిక్కు కమ్యూనిటీలో చేర్చుకుంది. అయితే.. సిక్కులకు న్యాయ పీఠంగా అకాల్ తఖ్త్ కొనసాగుతున్నప్పటికీ.. కాలక్రమంలోని పరిణామాలు(నిర్మాణాలపరంగా) మాత్రం ఆ సాంస్కృతిక వారసత్వాన్ని మాత్రం బాగా దెబ్బతీసింది. -
రాహుల్ గాంధీ భారతీయుడు కాదు: కేంద్ర మంత్రి
ఢిల్లీ: ఇటీవల అమెరికా పర్యటనలో లోక్‌సభ ప్రతిపక్షనేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సిక్కులపై చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు ఘాటుగా స్పందించారు. అసలు రాహుల్ భారతీయుడే కాదని మండిపడ్డారు. రాహుల్ అధిక సమయం విదేశాల్లోనే గడుపుతారని అన్నారు. కేంద్ర మంత్రి బిట్టు.. ఆదివారం మీడియాతో మాట్లాడారు.‘‘ రాహుల్ గాంధీ భారతీయుడు కాదు. ఎక్కువ సమయంలో విదేశాల్లో ఉంటారు. విదేశాలకు వెళ్లినప్పుడు మన దేశం మీద తప్పుడు, అసత్య వ్యాఖ్యలు చేస్తారు. మన దేశం మీద రాహుల్‌కు అసలు ప్రేమే లేదు. రాహుల్ చేసే వ్యాఖ్యలను కేవలం మోస్ట్ వాంటెడ్ పీపుల్స్, వేర్పాటువాదులు, బాంబులు, గన్నులు తయారు చేసే వాళ్లు మాత్రమే ప్రశంసిస్తారు. రాహుల్ గాంధీ చేసిన అసత్య వ్యాఖ్యలు ప్రపంచ దేశాల్లో ఉండే సిక్కు సమాజంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. విమానాలు, రైళ్లు, రోడ్లు పేల్చివేయడానికి ప్రయత్నించే దేశ శత్రువులు రాహుల్ గాంధీకి మద్దతుగా ఉన్నారు. ఒక నంబర్ వన్ ఉగ్రవాదిని, దేశానికి శత్రువును పట్టుకుంటే అవార్డు వస్తుందంటే.. అది రాహుల్ గాంధీనే’’ అని తీవ్రంగా మండిపడ్డారు.#WATCH | Bhagalpur, Bihar: On Lok Sabha LoP Rahul Gandhi's recent statements, Union Minister Ravneet Singh Bittu says, "Rahul Gandhi is not an Indian, he has spent most of his time outside. He does not love his country much because he goes abroad and says everything in a wrong… pic.twitter.com/uZTvtSuhGj— ANI (@ANI) September 15, 2024బిట్టు వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత సందీప్ దీక్షిత్ స్పందిస్తూ.. ‘‘మేము బిట్టు వంటి వ్యక్తులపై పట్ల జాలి మాత్రమే చూపిస్తాం. ఆయన కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు రాహుల్ గాంధీని పొగిడేవారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన తర్వాత ఆ పార్టీకి తన విధేయతను చూపిస్తున్నాడు’’ అని అన్నారు. ఇక.. బిట్టు సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. బీజేపీలో చేరారు.ఇటీవల అమెరికా రాహుల్ మాట్లడుతూ.. ‘‘సిక్కులు తలపాగాలు, కడియాలు ధరించవచ్చా, వారు గురుద్వారాకు వెళ్లగలుగుతున్నారా అనేవాటిపైనే భారత్‌లో ఘర్షణలు జరుగుతున్నాయి. అన్ని మతాలకూఈ పరిస్థితి తప్పడం లేదు’ అని అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలను తీవ్ర దుమారం రేపాయి. రాహుల్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా తప్పుపట్టిన విషయం తెలిసిందే.చదవండి: ‘కేజ్రీవాల్ రాజీనామా నిర్ణయం.. 48 గంటల రహస్యం ఏంటి?’ -
సిక్కులపై వ్యాఖ్యలు.. రాహుల్ నివాసం ఎదుట భారీ నిరసనలు
ఢిల్లీలోని రాహుల్ గాంధీ నివాసం ఎదుట సిక్కులు భారీ ఎత్తున నిరసనలు చేపట్టారు. జనపథ్ రోడ్డులోని ఆయన నివాసం వద్ద పోలీసుల బారికేడ్లు ఏర్పాటు చేయగా.. వాటిని బద్దలు కొట్టేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారు.ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ.. భారత్ లో సిక్కులు తలపాగా, కడియాలు ధరించేందుకు అనుమతి ఉందా అంటూ ఆయన వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. గురుద్వారాలను సందర్శించడానికి అనుమతిస్తారా అని ప్రశ్నించారు. ప్రస్తుతం దేశంలో ఇదే పోరాటం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. అయితే దేశంలో సిక్కుల భద్రత గురించి మాట్లాడిన మాటలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.#WATCH | Delhi: Sikh Prakoshth of BJP Delhi holds protest against Lok Sabha LoP & Congress MP Rahul Gandhi outside his residence over his statement on the Sikh community. pic.twitter.com/JWateZ1J9B— ANI (@ANI) September 11, 2024ఈ క్రమంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై పలు సిక్కు సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఢిల్లీలోని రాహుల్ గాంధీ నివాసం ఎదుట బీజేపీ మద్దతు కలిగిన పలు సిక్కు గ్రూపులు నిరసనలు చేపట్టారు. సిక్కుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడితే ఊరుకునేది లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే రాహుల్ శిక్కులకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.Sikhs protest outside Rahul Gandhi's house over his statement regarding Sikhs.Rahul Gandhi murdabad slogans were raised! 👏🏻👏🏻 pic.twitter.com/hx0ILP89YK— Mr Sinha (@MrSinha_) September 11, 2024 ఈ వ్యాఖ్యలను ఇప్పటికే బీజేపీ తీవ్రంగా తప్పుబట్టింది. విదేశాల వేదికగా రాహుల్ ఎల్లప్పుడూ భారత్‌ను అవమానించేలా మాట్లాడుతున్నారని మండిపడుతోంది. -
సిక్ చౌహానీలో సిక్కు కమ్యూనిటీతో సీపీ స్టీఫెన్ సమావేశం
-
AP: సిక్కులకు కార్పొరేషన్
సాక్షి, అమరావతి: సిక్కుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమోదం తెలిపారు. గురుద్వారాలకు ఆస్తి పన్ను నుంచి మినహాయింపు కల్పించాలన్న సిక్కు మతపెద్దల విజ్ఞప్తిపై అప్పటికప్పుడు సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు గురుద్వారాలపై ఆస్తి పన్నును తొలగించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రానికి చెందిన సిక్కు మత పెద్దలతో సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ సమావేశమయ్యారు. ఏపీ స్టేట్ మైనార్టీస్ కమిషన్ సభ్యుడు జితేందర్‌జిత్‌సింగ్ నేతృత్వంలో సిక్కు మతపెద్దలు ముఖ్యమంత్రిని కలిశారు. శతాబ్దం క్రితం నుంచి సిక్కులు రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారని సిక్కుమత పెద్దలు తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అర్హులకు ప్రభుత్వ పథకాలు, ప్రయోజనాలు అందుతున్నాయని ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియచేశారు. సిక్కుల కోసం ఒక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి నవరత్నాలను మరింత సమర్థంగా అందించాలని కోరగా ముఖ్యమంత్రి అందుకు అంగీకరించారు. గురుద్వారాల్లో పూజారులైన గ్రంథీలకు ప్రయోజనాలు గురుద్వారాల్లో పూజారులైన గ్రంథీలకు పూజారులు, పాస్టర్లు, మౌల్వీల మాదిరిగానే ప్రయోజనాలు కల్పించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. గురునానక్ జయంతి రోజైన కార్తీక పౌర్ణమి నాడు సెలవురోజుగా ప్రకటించేందుకు అంగీకారం తెలిపారు. ఓ మైనార్టీ విద్యాసంస్థను నెలకొల్పేందుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. వచ్చే మంత్రివర్గ సమావేశంలో దీనికి సంబంధించి తీర్మానం కూడా చేస్తామని ప్రకటించారు. వివిధ సామాజిక వర్గాలకు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే క్రమంలో సిక్కులకు అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వివిధ సామాజిక వర్గాలకు చెందినవారు నిర్వహిస్తున్న ఎంఎస్ఎంఈల వ్యాపారాలను పెంచే క్రమంలో ఈ చర్యలు ఉండాలని నిర్దేశించారు. పది రోజుల్లోగా ఇవన్నీ కొలిక్కి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు, మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి ఎండీ ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు. -
అమెరికాలో.. న్యాయ పీఠంపై తొలి సిక్కు మహిళ
ఆస్టిన్: భారత సంతతికి చెందిన మన్‌ప్రీత్ మోనికా సింగ్ అరుదైన ఘనత సాధించారు. హ్యారిస్ కౌంటీ(టెక్సాస్) జడ్జిగా ఆమె ప్రమాణం చేశారు. తద్వారా అమెరికాలో ఈ ఘనత సాధించిన తొలి సిక్కు మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. 70వ దశకంలో తొలినాళ్లలో మోనికా సింగ్ తండ్రి అమెరికాకు వలస వెళ్లారు. హ్యూస్టన్‌లో పుట్టి పెరిగిన ఆమె.. ప్రస్తుతం బెల్లయిరేలో నివాసం ఉంటున్నారు. ఆమె వివాహిత. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. శుక్రవారం టెక్సాస్‌లోని హ్యారిస్ కౌంటీ సివిల్ కోర్టులో(లా నెంబర్ 4) ఆమె జడ్జిగా ప్రమాణం చేశారు. హ్యూస్టన్లోనే ట్రయల్ లాయర్‌గా 20 ఏళ్లపాటు పని చేసిన ఆమె.. పౌర హక్కులకు సంబంధించిన పిటిషన్లతో పాటు, జాతీయ స్థాయిలో వ్యవహారాలకు సంబంధించిన కేసుల్ని సైతం వాదించారు. తనకు దక్కిన గౌరవంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఇద్దరు పిల్లలతో మోనికా సింగ్ సిక్కు వర్గానికి ఇవి మరిచిపోలేవని క్షణాలని ఇండో-అమెరికన్ న్యాయమూర్తి రవి సందిల్ పేర్కొన్నారు. మోనికా సింగ్ ప్రమాణ కార్యక్రమానికి హాజరైన ఆయన.. టెక్సాస్‌కు జడ్జిగా ఎన్నికైక తొలి సౌత్ ఏషియా వ్యక్తిగా ఘనత దక్కించుకున్నారు. అమెరికాలో దాదాపు ఐదు లక్షల మంది సిక్కు జనాభా ఉందని ఒక అంచనా.. అందులో 20వేల మంది హ్యూస్టన్‌లో ప్రాంతంలోనే స్థిరపడినట్లు గణాంకాలు చెప్తున్నాయి. -
మీ దేశానికి వెళ్లిపోండి.. అమెరికాలో ఎన్నారైపై దాడి
అమెరికాలో ట్యాక్సీ డ్రైవర్‌గా పని చేస్తోన్న ఓ ప్రవాస భారతీయుడిపై న్యూయార్క్‌లో దాడి జరిగింది. అంతేకాదు ఎన్నారైని ఉద్దేశించి జాత్యాహాంకర వ్యాఖ్యలకు దిగాడు. దీంతో దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు అవగా బాధితుడికి అండగా భారతీయ సంఘాలు నిలబడ్డాయి. ఈ ఘటకు సంబంధించిన వివరాలు ఆలస్యంగా వెలుగు చూశాయి. అమెరికాలో దాడికి సంబంధించిన వివరాలను హిందూ పత్రిక ప్రచురించింది. హిందూ తెలిపిన వివరాల ప్రకారం.. పంజాబ్‌కి చెందిన ఓ యువకుడు అమెరికాలో ట్యాక్సీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. జనవరి 3న జాన్ ఎఫ్ కెన్నడీ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 4 దగ్గర తన కారును పార్క్ చేశారు. ఇంతలో కస్టమర్ రావడంతో కారును ముందుకు కదిపేందుకు ప్రయత్నించగా అక్కడ మరో ట్యాక్సీ నిలిపి ఉంది. వెంటనే కారు దిగిన సింగ్.. తన కారు వెళ్లేందుకు వీలుగా ముందున్న కారును పక్కకు తీయాలంటూ అందులో ఉన్న వ్యక్తిని కోరాడు. సింగ్ కారు దిగడం ఆలస్యం కారులో ఉన్న వ్యక్తి ఒక్కసారిగా దాడికి దిగాడు. ముఖం, ఛాతిపై పంచ్‌లు విసిరాడు. దాడికి పాల్పడుతూనే సింగ్ తలకు ఉన్న టర్బన్‌ను తీసేందుకు ప్రయత్నించాడు. ‘ టర్బనేడ్ పీపుల్, గో బ్యాక్ టూ యువర్ కంట్రీ ’ అంటూ జాత్యాంహార వ్యాఖ్యలకు పాల్పడ్డాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లి పోయాడు. జరిగిన ఘటనపై సింగ్ వెంటనే ఎయిర్‌పోర్టు ప్రాంగణంలో ఉన్న పోర్టు అథారిటీ పోలీస్ డిపార్ట్మెంట్కి ఫిర్యాదు చేశాడు. అయితే సింగ్‌పై దాడి చేసిన వ్యక్తి ఎవరనేది స్పష్టంగా తెలియడం లేదు. దీంతో ఈ విషయాన్ని స్థానికంగా ఉన్న సిక్కు కమ్యూనిటీల దృష్టికి తీసుకెళ్లాడు. ఈ విషయంలో బాధితుడికి న్యాయం జరిగేందుకు వీలుగా ఒక డిటెక్టివ్, న్యాయవాదిని నియమించారు. చదవండి: దేశమేదైనా అండగా మేమున్నాం -
పాక్ మోడల్ ఫొటోలు వైరల్.. సిక్కు మతస్థుల ఆగ్రహం..
Pakistan Model Apologises After Her Photos Went Viral: సిక్కు మతస్థులు తమ మతాన్ని, సంస్కృతిని, ఆచార్యవ్యవహారాలను ఎంతో గౌరవిస్తారు. ఆలయాల్లో వారి ఆచారాలు పాటించకుండా, అగౌర్వపరిస్తే అస్సలు ఊరుకోరు. ఎదుటివారు ఎలాంటివారైనా తమదైన స్టైల్లో విరుచుకుపడతారు. ఇటీవల ఒక పాకిస్థాన్ మోడల్‌పై ఆ దేశ సిక్కు మతస్థులు గరంగరంగా ఉండడంతో క్షమాపణలు చెప్పింది. పంజాబ్‌లోని కర్తార్‌పూర్ గురుద్వారా దర్బార్ సాహిబ్‌లో మోడల్ సౌలేహ ఒట్టి తలతో (హెడ్ కవర్ లేకుండా) ఉన్న ఫొటోలను ఇన్‌స్టా గ్రామ్‌లో పంచుకుంది. అది చూసిన మతస్థులు తమ మనోభావాలు దెబ్బతీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వారికి క్షమాపణలు చెబుతూ అదే ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్ పెట్టింది ఆ మోడల్. 'ఇటీవల నేను ఇన్‌స్టాలో ఒక ఫొటోను పోస్ట్ చేశాను. నేను చరిత్ర, సిక్కు సమాజం గురించి తెలుకోవడానికి కర్తార్‌పూర్‌కి వెళ్లాను. అంతేగానీ ఎవరి మనోభావాలను దెబ్బతీయాలని అనుకోలేదు. నేను ఎవరినైనా బాధపెట్టి ఉంటే, వారి సంస్కృతిని అగౌరపరిచానని భావిస్తే నన్ను క్షమించండి. అక్కడ ఫొటోలు తీసే ప్రజలను చూశాను. నేను సిక్కు మతానికి సంబంధించిన ఫొటోలు కూడా తీసుకున్నాను. అక్కడ అలా చేయాల్సింది కాదు. నేను సిక్కు సంస్కృతిని చాలా గౌరవిస్తాను. ఈ ఫొటోలు నేను అక్కడికి వెళ్లనట్లుగా జ్ఞాపకంలో భాగం మాత్రమే. అంతకు మించి ఏమి లేదు. భవిష్యత్తులో వీటి గురించి మరింత అవగాహనతో ఉంటాను. ఇలాంటి చర్యలకు దూరంగా ఉంటాను. అలాగే నేను ఇది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని ప్రజలు తప్పక తెలుసుకోవాలి. అది అందరికీ తెలిసేలా చేయండి.' అని మోడల్ సౌలేహ సంజాయిషీ ఇచ్చుకుంది. View this post on Instagram A post shared by Sauleha صالحہ امتیاز 🇵🇰 (@swalaaa_lala) అయితే కర్తార్‌పూర్ సాహిబ్ గురుద్వారా ఆలయం లోపల సోమవారం మోడల్ తల చుట్టూ ఎలాంటి వస్త్రం లేకుండా ఫోజులిచ్చిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో శిరోమణి అకాలీదళ్ అధికార ప్రతినిధి మంజీందర్ సింగ్ సిర్సా కూడా సౌలేహను విమర్శించారు. 'శ్రీ గురునానక్ దేవ్ జీ పవిత్ర స్థలంలో ఇలాంటి ప్రవర్తన, చర్య పూర్తిగా ఆమోదయోగ్యం కాదు. ఆమె పాకిస్థాన్‌లోని తన మత స్థలంలో కూడా ఇలాగే చేస్తుందా ? అలా చేయడానికి ధైర్యం ఉందా ? కర్తార్‌పూర్ సాహిబ్ పిక్నిక్ స్పాట్ అనుకుంటున్న పాకిస్థాన్ ప్రజలు ధోరణిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంటుంది.' అని మంజీందర్ సింగ్ సిర్సా ట్వీట్ చేశారు. అయితే పాకిస్థాన్ పంజాబ్‌లోని కర్తార్‌పూర్ సాహిబ్ గురుద్వారా సిక్కులకు పవిత్రస్థలం. Such behaviour & act at pious place of Sri Guru Nanak Dev Ji is totally unacceptable! Can she dare to do the same at her religious place in Pakistan?@ImranKhanPTI @GovtofPakistan shd tk immed action to stop this trend of treating Sri Kartarpur Sahib as picnic spot by Pak people pic.twitter.com/AwyIkmqgbC — Manjinder Singh Sirsa (@mssirsa) November 29, 2021 -
‘అదేమన్నా పిక్నిక్ స్పాటా’.. మోడల్‌పై ప్రధానికి ఫిర్యాదు
న్యూఢిల్లీ: సిక్కులు పవిత్రంగా భావించే కర్తార్‌పూర్ గురుద్వారా దర్బార్ సాహిబ్ వద్ద ఫోటోషూట్ చేయడమే కాక.. తలపై వస్త్రం ధరించనందుకు గాను పాకిస్తాన్ మోడల్ని ట్రోల్ చేస్తున్నారు నెటిజనులు. ఆ వివరాలు.. పాకిస్తాన్‌కు చెందిన దుస్తుల కంపెనీ మన్నత్ కర్తార్‌పూర్ సాహిబ్ గురుద్వారా వద్ద ఓ యాడ్‌ని షూట్ చేసింది. దీనిలో నటించిన మోడల్ తలపై వస్త్రం ధరించకుండా షూట్లో పాల్గొని.. ఫోటోలకు పోజులిచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో సదరు కంపెనీ, మోడల్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజనులు. ముఖ్యంగా సిక్కు సామాజిక వర్గం వారు ఈ యాడ్‌పై చాలా గుర్రుగా ఉన్నారు. ‘‘మేం ఎంతో పవిత్రంగా భావించే స్థలంలో మీరు యాడ్ షూట్ చేస్తారా.. ఇదేమైనా పిక్నిక్ స్పాట్ అనుకుంటున్నారా ఏంటి’’ అంటూ విమర్శిస్తున్నారు. (చదవండి: కుక్క హెయిర్ డై కోసం 5 లక్షలు.. మోడల్‌ను ఆడేసుకుంటున్న నెటిజన్లు.!) ఈ నేపథ్యంలో శిరోమణి అకాళీ దల్ నేత (ఎస్ఏడీ), ఢిల్లీ సిక్కు గురుద్వారా పర్బంధక్ కమిటీ అధినేత మంజిందర్ సింగ్ సిర్సా దీనిపై చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని, ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను కోరారు. ఈ క్రమంలో పాకిస్తాన్ మినిస్టర్ పవాద్ చౌదరి స్పందిస్తూ.. సదరు దుస్తుల కంపెనీ, మోడల్ తమ చర్యలకు గాను క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. (చదవండి: తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని ఫొటోకు ఫోజులు.. మండిపడుతన్న నెటిజన్లు) వివాదం కాస్త పెద్దదవడంతో మన్నత్ కంపెనీ క్షమాపణలు చెప్పింది. అంతేకాక ‘‘సోషల్ మీడియాలో వైరలవుతోన్న ఫోటోల ప్రకారం కర్తార్‌పూర్ కారిడార్ వద్ద ఫోటో షూట్ చేసింది తాము కాదని.. థర్డ్ కంపెనీ వారు తమ మన్నత్ వస్త్రాలు ధరించి.. అక్కడ యాడ్ షూట్ చేశారని’’ తెలిపారు. The Designer and the model must apologise to Sikh Community #KartarPurSahib is a religious symbol and not a Film set….. https://t.co/JTkOyveXvn — Ch Fawad Hussain (@fawadchaudhry) November 29, 2021 చదవండి: మోడల్ దారుణ హత్య: గొంతు కోసి.. నగ్నంగా మార్చి -
అమెరికాలో కాల్పులు: మృతుల్లో నలుగురు సిక్కులు
వాషింగ్టన్: అమెరికాలోని ఇండియానా పొలిస్‌లో ఉన్న ఫెడ్ఎక్స్ ఫెసిలిటీ వద్ద గురువారం రాత్రి జరిగిన కాల్పుల్లో మొత్తం 8 మంది మరణించగా వారిలో, నలుగురు సిక్కులు ఉన్నట్లు పోలీసులు శనివారం ప్రకటించారు. ఈ దాడికి పాల్పడింది 19 ఏళ్ల బ్రాండన్ స్కాట్ హోల్గా గుర్తించారు. స్కాట్ గతేడాది వరకు ఫెడ్‌ఎక్స్‌లో పని చేశాడని తెలిపారు. 2012లో విస్కాన్సిన్లో సిక్కులపై జరిగిన దాడి అనంతరం తిరిగి అదే వర్గంపై జరిగిన అతిపెద్ద దాడి ఇదే కావడం గమనార్హం. మరణించిన సిక్కులను అమర్జీత్ జోహాల్ (66), జస్విందర్ కౌర్ (64), అమర్జీత్ స్కోన్ (48), జస్విందర్ సింగ్‌లుగా గుర్తిం చారు. వీరిలో మొదటి ముగ్గురు మహిళలే కావడం గమనార్హం. అదే వర్గానికి చెందిన హర్‌ప్రీత్ సింగ్ గిల్ (45)కు బుల్లెట్ గాయ మైందని, ప్రస్తుతం చికిత్స పొందుతు న్నట్లు అధికారులు వెల్లడించారు. జరిగిన ఘటనపై భారత రాయబార కార్యాలయం స్పందిం చింది. బాధిత కుటుంబాలతో మాట్లాడినట్లు తెలిపింది. వారికి అవసరమైన సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు భరోసా ఇచ్చింది. సిక్కు నేత గురిందర్ సింగ్ ఖల్సా మాట్లాడుతూ.. ఈ ఘటనతో సిక్కు సమాజ మంతా ఉలిక్కిపడిందన్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్పందిస్తూ.. కాల్పులు జరిగిన విషయం పోలీసులు చెప్పారన్నారు. మరణించిన వారికి నివాళిగా వైట్ హౌజ్ సహా అన్ని ఫెడరల్ భవనాలపై జాతీయ జెండా ఎత్తును సగానికి దించనున్నట్లు తెలిపింది. చదవండి: అఫ్జల్‌గంజ్‌లో భారీ అగ్ని ప్రమాదం -
అమెరికాలో చరిత్ర సృష్టించిన సిక్కు యువతి
వాషింగ్టన్: భారత సంతతికి చెందిన ఆన్మోల్ నారంగ్ అరుదైన ఘనత సాధించింది. వెస్ట్‌పాయింట్‌లోని ప్రఖ్యాత అమెరికా మిలిటరీ అకాడమీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మొదటి సిక్కు యువతిగా చరిత్ర సృష్టించింది. వెస్ట్‌పాయింట్‌లో నాలుగేళ్ల శిక్షణ పూర్తిచేసుకున్న అన్మోల్.. ఓక్లహామ్‌లోని లాటెన్ ఫోర్ట్ సిల్లో బేసిక్ ఆఫీసర్ లీడర్షిప్ కోర్పు అభ్యసించనుంది. ఈ శిక్షణ పూర్తైన తర్వాత వచ్చే ఏడాది జనవరిలో జపాన్‌లోని ఒకినావాలో ఆమెకు తొలి పోస్టింగ్ లభించే అవకాశం ఉంది. ఈ విషయం గురించి సెకండ్ లెఫ్టినెంట్ అన్మోల్ నారంగ్ మీడియాతో మాట్లాడుతూ.. వెస్ట్‌పాయింట్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలన్న నా కల శనివారంతో తీరింది. (చదవండి: భూ అంతర్భాగంలో భారీ నిర్మాణం) నాకు దక్కిన ఈ గౌరవం నన్నెంతో ఉద్వేగానికి గురిచేస్తోంది. జార్జియాలోని సిక్కు కమ్యూనిటీ సభ్యులు నాకు మద్దతుగా నిలిచారు. ఈ లక్ష్యాన్ని సాధించడం ద్వారా సిక్కు అమెరికన్లు ఎలాంటి సవాలునైనా ఎదుర్కోగలరని నిరూపించాను. ఇష్టమైన కెరీర్లో ఎదగాలన్న బలమైన ఆకాంక్ష ఉంటే అసాధ్యం అనేది ఏదీ ఉండదు’’అని పేర్కొన్నారు. కాగా జార్జియాలోని రోస్వెల్లో పుట్టిపెరిగిన అన్మోల్.. తన తాతయ్య(భారత ఆర్మీలో పనిచేశారు) స్ఫూర్తితో మిలిటరీలో సేవలు అందించాలని నిర్ణయించుకున్నారు. జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో న్యూక్లియర్ ఇంజనీరింగ్ అండర్గ్రాడ్యుయేట్ అయిన ఆమె.. హవాయిలోని హోనలులులో ఉన్న పెరల్ హార్బర్ నేషనల్ మెమొరియల్ సందర్శించిన అనంతరం వెస్ట్‌పాయింట్‌లో చేరాలన సంకల్పించి తన ఆకాంక్ష నేటితో నెరవేర్చుకున్నారు.(హెచ్1బీ వీసా రద్దుకు ట్రంప్ ఆలోచన) -
‘ద్వేషపూరిత దాడుల్లో సిక్కులు’
అమెరికాలో 2018లో జరిగిన ద్వేషపూరిత దాడుల్లో బాధితులుగా సిక్కులు మూడో స్థానంలో ఉన్నారని యుఎస్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వార్షిక నివేదికలో వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం సిక్కులపై 60 దాడులు చోటు చేసుకున్నాయని పేర్కొంది. గత ఏడాది అమెరికాలో మొత్తం ద్వేషపూరితమైన దాడులు 7,120 జరిగాయని.. 2017తో పోల్చతే కొంచం తగ్గాయిని ఎఫ్‌బీఐ నివేదిక తెలిపింది. ద్వేషపూరితమైన దాడులు ముఖ్యంగా మతం ఆధారంగా యూదులు(835), ముస్లింలు(188), సిక్కులు (60)పై జరిగాయని పేర్కొంది. ఇతర మతాలపై ఇటువంటి దాడులు 91 అయ్యాయని తెలిపింది. ఇందులో భాగంగా హిందువులపై 12 దాడులు, బుద్ధులపై పది చోటుచేసుకున్నట్టు వెల్లడించింది. జాతి అధారంగా మొత్తం 4,047 దాడులు జరిగితే.. అందులో అత్యధికంగా అమెరికాలోని నల్లజాతి అఫ్రికన్లపై సుమారు 1,943 దాడులు చోటుచేసుకుంటున్నాయని వెల్లడించింది. తరువాత తెల్ల జాతివారైన అమెరికన్లపై కూడా 762 దాడులు.. లాటిన్లపై 485 దాడులు జరిగాయని ఆ నివేదికలో వెల్లడైంది. కాగా 2018లో ఆసియన్లపై 148, అరబ్బులపై 82, అలాస్కా ప్రజలపై 194 ద్వేషపూరిత దాడులు జరిగినట్టు ఎఫ్‌బీఐ నివేదిక వెల్లడించింది. అయితే మిగతా మతస్తులపై దాడులు సాధారణ స్థాయిలో ఉన్నప్పటికీ సిక్కులపై మాత్రం పెరుగుతున్నాయని.. దుండగులు దాడులకు లక్ష్యం చేసుకున్న మతాల్లో సిక్కులు మూడో స్థానంలో ఉన్నారని ఎఫ్‌బీఐ నివేదిక వెల్లడించింది. -
పాకిస్తాన్లో మరో దురాగతం
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్లో మరో దురాగతం చోటుచేసుకుంది. మైనార్టీ వర్గమైన సిక్కు పూజారి కుమార్తెను ముస్లిం యువకుడు బలవంతంగా వివాహం చేసుకున్న ఘటన మరువక ముందే మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. సింధు ప్రావిన్స్‌లో ఓ హిందూ యువతిని బలవంతంగా మత మార్పిండి చేయించి ఓ ముస్లిం యువకుడు వివాహం చేసుకున్నాడు. యువతి తండ్రి తెలిపిన వివరాల ప్రకారం.. బీబీఏ చదువుతున్న తన కుమార్తె ఆగస్ట్ 29న ఇంటినుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదన్నారు. అయితే సదరు యువతిని తన క్లాస్‌మెట్స్ బాబార్ అమర్, మీర్జా దిల్వార్ కలిసి అపహరించుకుపోయారని, ఆ తరువాత మత మార్పిడి చేయించి అమర్ వివాహం చేసుకున్నారని స్థానిక మీడియాలో వార్తలు వచ్చినట్ల తెలిపారు. దీనిపై యువతి తండ్రి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆ యువతి మాట్లాడుతూ... అమర్, మీర్జా తనను కిడ్నాప్ చేశారని, అనంతరం ఇస్లాం మతంలోకి మార్పించి బలవంతంగా పెళ్లి చేకున్నాడని తెలిపింది. ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తామని స్థానిక పోలీసులు తెలిపారు. అయితే మీర్జా దిల్వార్ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ (పీటీఐ) సభ్యురాలిగా తెలింది. కాగా గడిచిన వారం రోజుల్లోనే ఇలాంటి ఘటనలు రెండు జరగడం గమన్హారం. యువతలను ఎత్తుకెళ్లి మతం మార్చి ముస్లిం యువకులకు ఇచ్చి పెళ్లి చేయడం లాంటి ఘటనలు పాక్‌లో ఇటీవల బాగా పెరిగాయి. తాజా ఘటన వారంలో రెండోది కాగా, రెండు నెలల్లో ఇది మూడోదని పాకిస్తాన్‌కు చెందిన హిందూ ఎన్జీవో ఆల్ పాకిస్తాన్ హిందూ పంచాయత్ తెలిపింది. చదవండి: పాక్‌లో సిక్కు యువతి మత మార్పిడి! -
ఆ అమ్మాయి తిరిగి వచ్చేసిందా?!
నాంకానా సాహిబ్/ఇస్లామాబాద్ : తన ఇష్ట ప్రకారమే ముస్లిం యువకుడిని వివాహం చేసుకున్నానని చెప్పిన సిక్కు యువతి జగ్జీత్ తిరిగి తల్లిదండ్రుల వద్దకు వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసుతో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. అయితే ఈ వార్తలన్నీ అవాస్తవాలని జగ్జీత్ కుటుంబ సభ్యులు కొట్టిపడేశారు. తను ఇంటికి తిరిగి రాలేదని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కులు తమకు అండగా ఉండాలని ఈ సందర్భంగా కోరారు. ఈ మేరకు శిరోమణి అకాళీదళ్ ఎమ్మెల్యే మజీందర్ సింగ్ ట్విటర్లో ఓ వీడియోను షేర్ చేశారు. కాగా పాకిస్తాన్లో మైనార్టీ వర్గమైన సిక్కు మతానికి చెందిన పూజారి భగవాన్ సింగ్ కుమార్తె జగ్జీత్ కౌర్(19)ను ఓ ముస్లిం యువకుడు కిడ్నాప్ చేసినట్లు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. అమ్మాయిని ఎత్తుకువెళ్లిన అనంతరం మతం మార్చి ఆమెను పెళ్లి చేసుకున్నాడని మజీందర్ సింగ్ గురువారం ఓ వీడియోను విడుదల చేశారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్, భారత్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సిక్కులు ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై పంజాబ్ (భారత్) ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్.. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలని విదేశాంగ మంత్రి జై శంకర్‌ను కోరారు. అలాగే పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు ఈ వీడియోను ట్వీట్ చేస్తూ తగిన చర్యలు తీసుకోవాలని విఙ్ఞప్తి చేశారు. అదే విధంగా కేంద్రమంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్.. పాక్‌లో మైనార్టీల దుస్థితికి నిదర్శనం అని విమర్శించారు. భారత విదేశాంగ కూడా ఈ విషయంపై స్పందించాల్సిందిగా పాక్‌ను కోరింది. This is the recent video of the brother of Jagjit Kaur who is still not safely returned to her family in Pakistan We assure our Sikh brothers in Pakistan that we will stand with them until justice is served. Share maximum with all 🙏🏻 @ANI @Republic_Bharat @ABPNews @PTI_News pic.twitter.com/g2J9H6dVyL — Manjinder S Sirsa (@mssirsa) August 31, 2019 ఈ నేపథ్యంలో శుక్రవారం ఆ యువతి వీడియో ఒకటి బయటికొచ్చింది. అందులో తన పేరు జగ్జీత్ కౌర్ అనీ, తాను ఇష్ట ప్రకారమే ముస్లిం యువకుడిని పెళ్లాడానని.. ఇందులో ఎవరి బలవంతం లేదని ఆ యువతి చెప్పుకొచ్చింది. ఆ సమయంలో ముస్లిం భర్త ఆమె పక్కనే కూర్చుని ఉన్నాడు. కాగా తన కూతురిని ఎవరో కిడ్నాప్ చేశారని జగ్జీత్ తండ్రి ఫిర్యాదు చేయడం, యువతికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పంజాబ్ (పాకిస్తాన్) ముఖ్యమంత్రి సర్దార్ ఉస్మాన్ బుజ్డార్ స్పందించి విచారణకు ఆదేశించారు. ఇక గత మార్చిలో పాకిస్తాన్‌లోని సింధు ప్రావిన్స్‌లో ఇద్దరు హిందూ మైనర్ బాలికలను అపహరించి ముస్లిం యువకులతో బలవంతంగా పెళ్లి చేశారు. ఆ ఘటనపై నాటి విదేశాంగ మంత్రి, దివంగత నేత సుష్మాస్వరాజ్ చొరవ తీసుకొని నిష్పాక్షిక విచారణ జరిపించాలని పాకిస్థాన్ విదేశాంగ మంత్రిని కోరిన విషయం తెలిసిందే. అయితే బాలికల కుటుంబీకులు కోర్టులో కేసు వేసినప్పటికీ తీర్పు వారికి ప్రతికూలంగా వచ్చింది. -
పాక్‌లో సిక్కు యువతి మత మార్పిడి !
-
పాక్‌లో కలకలం; భారత్ ఆందోళన
ఇస్లామాబాద్ : పాకిస్తాన్లో మైనార్టీ వర్గమైన సిక్కు పూజారి కుమార్తె ఒకరు ముస్లిం యువకుడిని వివాహం చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బలవంతంగా పెళ్లి చేసి మత మార్పిడి చేశారని యువతి కుటుంబీకులు ఆరోపిస్తుండగా, అలాంటిదేమీ లేదని, తన ఇష్ట ప్రకారమే ముస్లిం యువకుడిని వివాహం చేసుకున్నాననీ ఆ యువతి చెప్తున్న వీడియో బయటికి రావడం సంచలనం రేపింది. ఈ ఘటనపై భారత్‌లో ఆగ్రహం వ్యక్తం అవుతుండటంతో పాకిస్తాన్ విచారణకు ఆదేశించింది. తమ కుమార్తె జగ్జీత్ కౌర్ గత మూడు రోజులుగా కనిపించడం లేదని లాహోర్‌లోని నంకనా సాహెబ్‌లోని సిక్కు పూజారి ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే శుక్రవారం ఆ యువతి వీడియో ఒకటి బయటికొచ్చింది. అందులో తన పేరు జగ్జీత్ కౌర్ అనీ, తాను ఇష్ట ప్రకారమే ముస్లిం యువకుడిని వివాహం చేసుకున్నానని.. ఇందులో ఎవరి బలవంతం లేదని ఆ యువతి చెప్పుకొచ్చింది. వీడియోలో ముస్లిం భర్త ఆమె పక్కనే ఉన్నారు. ఈ మేరకు యువతి వీడియో సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో పాకిస్తాన్‌లోని మైనార్టీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. పంజాబ్ (పాకిస్తాన్) ముఖ్యమంత్రి సర్దార్ ఉస్మాన్ బుజ్డార్ స్పందించి విచారణకు ఆదేశించారు. మరోవైపు ఈ ఘటనపై పంజాబ్ (భారత్) ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ తీవ్రంగా స్పందించారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలని విదేశాంగ మంత్రి జై శంకర్‌ను కోరారు. అలాగే పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు ఈ వీడియోను ట్వీట్ చేస్తూ తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. గత మార్చిలో సింధు ప్రావిన్స్‌లో ఇద్దరు హిందూ మైనర్ బాలికలను అపహరించి ముస్లిం యువకులతో బలవంతంగా పెళ్లి చేశారు. ఆ ఘటనపై నాటి విదేశాంగ మంత్రి, దివంగత నేత సుష్మాస్వరాజ్ చొరవ తీసుకొని నిష్పాక్షిక విచారణ జరిపించాలని పాకిస్థాన్ విదేశాంగ మంత్రిని కోరారు. బాలికల కుటుంబీకులు కోర్టులో కేసు వేసినప్పటికీ తీర్పు వారికి ప్రతికూలంగా వచ్చింది. ఇరు దేశాల మధ్య ఇప్పటికే కశ్మీర్ అంశంపై ఉద్రిక్తతలు నెలకొన్న ప్రస్తుత సందర్భంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో పర్యవసానాలు ఎలా ఉంటాయోనని ఇరు దేశాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. -
వివాదంలో షారుఖ్ ‘జీరో’
ముంబై : బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ప్రధాన పాత్రలో ప్రేక్షకుల మందుకు రాబోతున్న ‘జీరో’ చిత్రం వివాదంలో చిక్కుకుంది. తమ మనోభావాలు కించపరిచే సన్నివేశాలు ఈ మూవీలో ఉన్నాయని సిక్కులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఢిల్లీ సిక్కు గురుద్వార్ కమిటీ జనరల్ సెక్రటరీ మజిందర్ సింగ్ సిర్సా ఢిల్లీ పోలీస్ స్టేషన్లో షారుఖ్‌తో పాటు చిత్ర దర్శకుడు ఆనంద్ ఎల్.రాయ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మూవీ ట్రైలర్లో షారుక్ ఖాన్.. సిక్కులు పవిత్రంగా భావించే గట్రాకిర్పాన్ ధరించాడని, అది సిక్కుల మనోభావాలు కించపరిచడమేన్నారు. ‘జీరో మూవీ ట్రైలర్లో సిక్కుల మనోభావాలు కించపరిచే సన్నివేశాలున్నాయని చాలా మంది నా దృష్టికి తీసుకువచ్చారు. సిక్కులు పవిత్రంగా భావించే గట్రాకిర్పాన్ను షారుక్ ధరించినట్లు మూవీ టీజర్లో కనిపించింది. సిక్కుల సంప్రదాయం ప్రకారం అమ్రిత్ధరి సిక్కులు మాత్రమే అది ధరిస్తారు. కానీ ఈ మూవీలో ధరించి మా సెంటిమెంట్స్‌ను కించపరిచారు. వెంటనే ఈ సన్నివేశాలను తొలగించి, చిత్ర దర్శకుడు, హీరోపై చర్యలు తీసుకోవాలి’ అని మజిందర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. మరగుజ్జు పాత్రలో షారుఖ్ నటిస్తుండగా, కుర్చీకే పరిమితమైన దివ్యాంగురాలిగా అనుష్క శర్మ.. అతిధి పాత్రలో కత్రినా నటిస్తుండటంతో ఈమూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. -
‘మమల్ని దేశం నుంచి వెళ్లగొడుతున్నారు’
ఇస్లామాబాద్ : సిక్కులను పాకిస్తాన్ నుంచి బలవంతగా గెంటివేస్తున్నారని పాక్‌కు చెందిన గూలాబ్ సింగ్ అనే వ్యక్తి పేర్కొన్నారు. సిక్కుల నుంచి పాక్ మొదటి పోలీసు అధికారిగా నియమితులైన గులాబ్ సింగ్ లాహోర్‌కు సమీపంలోని దేరా చహల్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. పోలీసు అధికారులు తనను దేశం విడిచివెళ్లాలని దౌర్జన్యం చేస్తున్నారని తెలిపారు. గులాబ్ సింగ్ బుధవారం మాట్లాడుతూ ‘మా కుటుంబం 1947 నుంచి పాక్‌లోనే ఉంటుంది. పాక్‌లో ఎన్ని అల్లర్లు జరిగినా మేం దేశం విడిచిపోలేదు. ఇప్పుడు ప్రభుత్వం సిక్కులను బలవంతంగా దేశం నుంచి తరివేయాలని చుస్తోంది. ఇంటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నెత్తికి చుట్టుకున్న పాగాను బలవంతంగా లాగారు. గత కొంత కాలంగా నన్ను చిత్రహింసలకు గురిచేస్తున్నారు’ అని గులాబ్ సింగ్ పేర్కొన్నారు. ఇంటిని ఖాళీ చేయాడానికి తమకు కొంత సమయం అడిగిన పోలీసులు ఇవ్వలేదని గులాబ్ సింగ్ తెలిపారు. కాందిశీకులకు చెందిన ఓ ట్రస్ట్ బోర్డు తమను అక్కడి నుంచి ఖాళీ చెయించిందని, ఆ సంస్థ చైర్మన్ సయ్యద్ ఆసీఫ్ ఆక్తర్పై స్థానిక పోలీస్ స్టేషన్లో గులాబ్ సింగ్ ఫిర్యాదు చేశాడు. గురుద్వార్‌కు సంబంధించిన స్థలాన్ని 2011లో గులాబ్ సింగ్ అక్రమంగా కొనుగోలు చేశారని, దానిని స్వాధీనం చేసుకునే బాధ్యతను పాక్ సుప్రీంకోర్టు ట్రస్ట్ చైర్మన్‌కు అప్పగించినట్లు బోర్డు సభ్యులు తెలిపారు. My house is sealed with all belongings including my slippers inside. Even this 'patka' on my head is an old rag which I just wrapped. I was harassed, beaten and my faith was disrespected: Gulab Singh, Pakistani Policeman who was forcibly evicted from his house in Lahore pic.twitter.com/va1tOGk3UM — ANI (@ANI) July 11, 2018 -
జలంధర్‌లో ఉద్రిక్తత
జలంధర్: సిక్కు,హిందూ మత పవిత్ర గ్రంథాలను గుర్తుతెలియని వ్యక్తులు కాలువలో పడేయడంతో పంజాబ్ లోని జలంధర్ లో సిక్కు, హిందూ సంస్థలు ఆందోళనకు దిగాయి. గురుసాహిబ్ గ్రంథ్‌లోని 200 పేజీలు, భగవద్గీతలోని పేజీలను జలంధర్ కపుర్తలా చౌక్‌లోని కాలువలో పడేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న సిక్కులు అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎటువంటి అసాంఘీక సంఘటనలు జరుగకుండా చూస్తున్నారు. ఘటను పంజాబ్ సీఎం సుఖ్బీర్ సింగ్ బాదల్ తీవ్రంగా ఖండించారు.