
వాషింగ్టన్: అమెరికాలోని ఇండియానా పొలిస్‌లో ఉన్న ఫెడ్‌ఎక్స్ ఫెసిలిటీ వద్ద గురువారం రాత్రి జరిగిన కాల్పుల్లో మొత్తం 8 మంది మరణించగా వారిలో, నలుగురు సిక్కులు ఉన్నట్లు పోలీసులు శనివారం ప్రకటించారు. ఈ దాడికి పాల్పడింది 19 ఏళ్ల బ్రాండన్ స్కాట్ హోల్‌గా గుర్తించారు. స్కాట్ గతేడాది వరకు ఫెడ్‌ఎక్స్‌లో పని చేశాడని తెలిపారు. 2012లో విస్కాన్సిన్‌లో సిక్కులపై జరిగిన దాడి అనంతరం తిరిగి అదే వర్గంపై జరిగిన అతిపెద్ద దాడి ఇదే కావడం గమనార్హం. మరణించిన సిక్కులను అమర్జీత్ జోహాల్ (66), జస్విందర్ కౌర్ (64), అమర్జీత్ స్కోన్ (48), జస్విందర్ సింగ్‌లుగా గుర్తిం చారు. వీరిలో మొదటి ముగ్గురు మహిళలే కావడం గమనార్హం. అదే వర్గానికి చెందిన హర్‌ప్రీత్ సింగ్ గిల్ (45)కు బుల్లెట్ గాయ మైందని, ప్రస్తుతం చికిత్స పొందుతు న్నట్లు అధికారులు వెల్లడించారు.
జరిగిన ఘటనపై భారత రాయబార కార్యాలయం స్పందిం చింది. బాధిత కుటుంబాలతో మాట్లాడినట్లు తెలిపింది. వారికి అవసరమైన సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు భరోసా ఇచ్చింది. సిక్కు నేత గురిందర్ సింగ్ ఖల్సా మాట్లాడుతూ.. ఈ ఘటనతో సిక్కు సమాజ మంతా ఉలిక్కిపడిందన్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్పందిస్తూ.. కాల్పులు జరిగిన విషయం పోలీసులు చెప్పారన్నారు. మరణించిన వారికి నివాళిగా వైట్ హౌజ్ సహా అన్ని ఫెడరల్ భవనాలపై జాతీయ జెండా ఎత్తును సగానికి దించనున్నట్లు తెలిపింది.
చదవండి: అఫ్జల్‌గంజ్‌లో భారీ అగ్ని ప్రమాదం
Comments
Please login to add a commentAdd a comment