ఢిల్లీ: ఇటీవల అమెరికా పర్యటనలో లోక్‌సభ ప్రతిపక్షనేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సిక్కులపై చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టు ఘాటుగా స్పందించారు. అసలు రాహుల్ భారతీయుడే కాదని మండిపడ్డారు. రాహుల్ అధిక సమయం విదేశాల్లోనే గడుపుతారని అన్నారు. కేంద్ర మంత్రి బిట్టు.. ఆదివారం మీడియాతో మాట్లాడారు.
‘‘ రాహుల్ గాంధీ భారతీయుడు కాదు. ఎక్కువ సమయంలో విదేశాల్లో ఉంటారు. విదేశాలకు వెళ్లినప్పుడు మన దేశం మీద తప్పుడు, అసత్య వ్యాఖ్యలు చేస్తారు. మన దేశం మీద రాహుల్‌కు అసలు ప్రేమే లేదు. రాహుల్ చేసే వ్యాఖ్యలను కేవలం మోస్ట్ వాంటెడ్ పీపుల్స్, వేర్పాటువాదులు, బాంబులు, గన్నులు తయారు చేసే వాళ్లు మాత్రమే ప్రశంసిస్తారు.
రాహుల్ గాంధీ చేసిన అసత్య వ్యాఖ్యలు ప్రపంచ దేశాల్లో ఉండే సిక్కు సమాజంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. విమానాలు, రైళ్లు, రోడ్లు పేల్చివేయడానికి ప్రయత్నించే దేశ శత్రువులు రాహుల్ గాంధీకి మద్దతుగా ఉన్నారు. ఒక నంబర్ వన్ ఉగ్రవాదిని, దేశానికి శత్రువును పట్టుకుంటే అవార్డు వస్తుందంటే.. అది రాహుల్ గాంధీనే’’ అని తీవ్రంగా మండిపడ్డారు.
#WATCH | Bhagalpur, Bihar: On Lok Sabha LoP Rahul Gandhi's recent statements, Union Minister Ravneet Singh Bittu says, "Rahul Gandhi is not an Indian, he has spent most of his time outside. He does not love his country much because he goes abroad and says everything in a wrong… pic.twitter.com/uZTvtSuhGj
— ANI (@ANI) September 15, 2024
బిట్టు వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత సందీప్ దీక్షిత్ స్పందిస్తూ.. ‘‘మేము బిట్టు వంటి వ్యక్తులపై పట్ల జాలి మాత్రమే చూపిస్తాం. ఆయన కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు రాహుల్ గాంధీని పొగిడేవారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన తర్వాత ఆ పార్టీకి తన విధేయతను చూపిస్తున్నాడు’’ అని అన్నారు. ఇక.. బిట్టు సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. బీజేపీలో చేరారు.
ఇటీవల అమెరికా రాహుల్ మాట్లడుతూ.. ‘‘సిక్కులు తలపాగాలు, కడియాలు ధరించవచ్చా, వారు గురుద్వారాకు వెళ్లగలుగుతున్నారా అనేవాటిపైనే భారత్‌లో ఘర్షణలు జరుగుతున్నాయి. అన్ని మతాలకూఈ పరిస్థితి తప్పడం లేదు’ అని అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలను తీవ్ర దుమారం రేపాయి. రాహుల్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా తప్పుపట్టిన విషయం తెలిసిందే.
చదవండి: ‘కేజ్రీవాల్ రాజీనామా నిర్ణయం.. 48 గంటల రహస్యం ఏంటి?’
Comments
Please login to add a commentAdd a comment