‘కేజ్రీవాల్‌ రాజీనామా నిర్ణయం.. 48 గంటల రహస్యం ఏంటి?’ | BJP attack on Kejriwal decision resign as CM secret of 48 hours | Sakshi
Sakshi News home page

‘కేజ్రీవాల్‌ రాజీనామా నిర్ణయం.. 48 గంటల రహస్యం ఏంటి?’

Published Sun, Sep 15 2024 4:55 PM | Last Updated on Sun, Sep 15 2024 5:14 PM

BJP attack on Kejriwal decision resign as CM secret of 48 hours

ఢిల్లీ: ఆప్‌ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మరో రెండు రోజుల్లో తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా  ఆదివారం చేస్తానని ప్రకటించారు. ఎన్నికలు జరిగేంత వరకు వేరొకరు సీఎంగా బాధ్యతలు చేపడతారని, ప్రజా కోర్టులో గెలిచిన తర్వాతే తాను మళ్లీ సీఎం పదవిని స్వీకరిస్తానని కేజ్రీవాల్‌ ప్రతిజ్ఞ చేశారు. కేజ్రీవాల్ రెండు రోజుల తర్వాత  రాజీనామా చేస్తానని ప్రకటించటం వెనక ఉన్న ఆంతర్యం  ఏంటని ప్రతిపక్ష  బీజేపీ ప్రశ్నిస్తోంది.

‘‘ సీఎం  అరవింద్‌ కేజ్రీవాల్‌ ముఖ్యమంత్రి పదవి రాజీనామాకు కోరుతున్న 48 గ​ంటలు( రెండు రోజులు) సమయం చాలా మిస్టరీగా ఉంది.  మరోకరిని సీఎంగా నియమించటం కోసం ఈ రెండురోజులు ప్రయత్నం చేస్తారా? లేదా  ఇంకేదైనా వ్యవహారాలు సర్దుబాబు చేసుకుంటారా? అసలు జైలు  నుంచి బయటకు రావటంతోనే సీఎం పదవి రాజీనామాకు  48 గంటల సమయం తీసుకోవటం ఎందుకు? ఈ 48 గంటలకు తర్వాత ఏం జరుగుతుంది? 48 గంటల  వెనక ఉన్న రహస్యాన్ని ఢిల్లీ, మొత్తం దేశ ప్రజలు  తెలుసుకోవాలనుకుంటున్నారు’’ అని  బీజేపీ ఎంపీ సుధాన్షు త్రివేది నిలదీశారు.

2021లో  ఆప్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎక్సైజ్ పాలసీని ఏడాది తర్వాత ఎందుకు ఉపసంహరించుకున్నారని ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను సూటిగా ప్రశ్నించారు. ‘‘అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఢిల్లీ మద్యం పాలసీ స్కామ్‌తో సంబంధం లేకుంటే.. ఏడాది అనంతరం ఆ పాలసీని ఎందుకు ఉపసంహరించుకున్నారు?. మద్యం పాలసీ కుంభకోణంలో మొత్తం ఆప్‌ పార్టీ ప్రమేయం ఉంది. అందుకే ఆప్ నేతలు జైలుకు వెళ్లారు. మద్యం  పాలసీ పేరుతో సీఎం కేజ్రీవాల్‌ వారిని దోచుకున్నారని ఢిల్లీ ప్రజలకు తెలుసు’’ అని అన్నారు.

చదవండి: జార్ఖండ్‌కు ఆ మూడు పార్టీలు శత్రువులు: మోదీ

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement