resignation decision
-
నేడే కేజ్రీవాల్ రాజీనామా
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి ఆప్ జాతీయ కనీ్వనర్ అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం రాజీనామా చేయనున్నారు. సాయంత్రం 4.30కు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆయనకు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఆ సందర్భంగా ఎల్జీకి కేజ్రీవాల్ రాజీనామా లేఖ సమరి్పస్తారని ఆప్ మంత్రి సౌరభ్ భరద్వాజ్ సోమవారం మీడియాకు తెలిపారు. రెండు రోజుల్లో రాజీనామా చేస్తానని, ప్రజలు గెలిపించాకే తిరిగి సీఎం కురీ్చలో కూర్చుంటానని కేజ్రీవాల్ ఆదివారం సంచలన ప్రకటన చేయడం తెలిసిందే. ఢిల్లీ అసెంబ్లీకి నవంబర్లోనే ముందస్తు ఎన్నికలు పెట్టాలని కూడా ఆ సందర్భంగా ఆయన ఈసీని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం రోజంతా ఆప్ నేతలతో కేజ్రీ సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. తన ప్రకటనపై స్పందన ఎలా ఉందని పార్టీ అత్యున్నత నిర్ణాయక విబాగమైన రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీలో ఆరా తీశారు. సీఎం అభ్యర్థిపై ఒక్కక్కరి నుంచీ వ్యక్తిగతంగా అభిప్రాయాలు సేకరించారు. అంతకుముందు ఉదయం కీలక నేతలు మనీశ్ సిసోడియా, రాఘవ్ ఛద్దా తదితరులతోనూ ఈ అంశంపై లోతుగా చర్చలు జరిపారు. సీఎం పదవికి మంత్రులు ఆతిశి, గోపాల్ రాయ్, కైలాశ్ గహ్లోత్, సౌరభ్ భరద్వాజ్ తదితరుల పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు స్పీకర్ రాంనివాస్ గోయల్, కేజ్రీవాల్ భార్య సునీత పేర్లపైనా లోతుగా చర్చ జరుగుతున్నట్టు ఆప్ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీలో 12 ఎస్సీ రిజర్వుడు శాసనసభ స్థానాలున్నాయి. కనీసం మరో ఆరు స్థానాల్లో మైనారిటీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎస్సీ, లేదా మైనారిటీ నేతకు చాన్స్ దక్కొచ్చన్న వాదనా ఉంది. దాంతో ఎస్సీ, మైనారిటీ వర్గానికి చెందిన పలువురు ఆప్ ఎమ్మెల్యేల పేర్లు కూడా కొత్తగా తెరపైకి వస్తున్నాయి! మంగళవారం కేజ్రీవాల్ రాజీనామాకు ముందు ఉదయం 11.30కు ఆప్ లెజిస్లేటివ్ పార్టీ సమావేశం జరగనుంది. సీఎం అభ్యర్థిపై ఈ భేటీలో తుది నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. మైనారిటీ వర్గానికి చెందిన ఆప్ ఎమ్మెల్యే ఇమ్రాన్ హుసేన్ పేరు ఖరారైనా ఆశ్చర్యం లేదని ఆప్ ముఖ్య నేత ఒకరు చెప్పడం విశేషం!హరియాణాలో సుడిగాలి ప్రచారం! రాజీనామా అనంతరం కేజ్రీవాల్ హరియాణ అసెంబ్లీ ఎన్నికల్లో సుడిగాలి ప్రచారం చేస్తారని ఆప్ వర్గాలు చెబుతున్నాయి. హరియాణలో అక్టోబర్ 5న పోలింగ్ జరగనుంది. అక్కడ కాంగ్రెస్‌తో ఆప్ పొత్తు పెట్టుకోలేదు. మొత్తం 90 స్థానాల్లో ఒంటరిగానే అభ్యర్థులను బరిలోకి దింపింది. జమ్మూకశ్మీర్‌లో కూడా కేజ్రీవాల్ ప్రచారం చేస్తారని సమాచారం. -
Arvind Kejriwal: రెండ్రోజుల్లో రాజీనామా
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కనీ్వనర్ అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి పదవికి రెండు రోజుల తర్వాత రాజీనామా చేయబోతున్నట్లు వెల్లడించారు. తాను నిజాయతీపరున్ని అని ప్రజలు తీర్పు ఇచ్చేదాకా సీఎం సీట్లో కూర్చోబోనని ప్రతిజ్ఞ చేశారు. ఢిల్లీ అసెంబ్లీకి సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన సీబీఐ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో కేజ్రీవాల్ శుక్రవారం తిహార్ జైలు నుంచి విడుదలవడం తెలిసిందే. ఆదివారం భార్య సునీతతో కలిసి ఆయన ఆప్ ప్రధాన కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. రెండు రోజుల్లో ఆప్ ఎమ్మెల్యేలతో సమావేశమై కొత్త సీఎంంను ఎంపిక చేస్తానని వెల్లడించారు. కేజ్రీవాల్ ఇంకా ఏమన్నారంటే... నేరస్తుడినని భావిస్తే నాకు ఓటేయకండి ‘‘దేశ ప్రజలను, ఢిల్లీవాసులను అడగాలనుకుంటున్నాను. కేజ్రీవాల్ నిజాయితీపరుడా? లేక నేరస్తుడా? ప్రజలే తీర్పు చెప్పాలి. కొద్ది నెలల్లో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలున్నాయి. ప్రతి గల్లీకి, ప్రతి గడపకూ వెళ్తాను. నిజాయితీపరుడని అనుకుంటే నాకు ఓటేయండి. నేరస్తుడినని భావిస్తే వేయకండి. మీరు వేసే ప్రతి ఓటూ నా నిజాయతీకి సర్టిఫికెట్. ఆప్‌కు ఘనవిజయం కట్టబెట్టడం ద్వారా మీరు నన్ను గెలిపించినప్పుడే నేను ముఖ్యమంత్రి పీఠంపై, మనీశ్ సిసోడియా ఉప ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటాం. మా ఇద్దరి విషయంలో నిర్ణయాధికారం ఇక మీ చేతుల్లోనే ఉంది. ఢిల్లీలో వచ్చే ఫిబ్రవరిలో ఎన్నికలు జరగాల్సి ఉంది. వాటిని మహారాష్ట్రతో పాటు వచ్చే నవంబర్లోనే నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరుతున్నా.సీతలా నాకు అగి్నపరీక్ష ‘‘14 ఏళ్ల వనవాసం తర్వాత సీతాదేవి అగి్నపరీక్ష ఎదుర్కోవాల్సి వచి్చంది. జైలు నుంచి వచ్చాక నేను కూడా అగి్నపరీక్షకు సిద్ధంగా ఉన్నాను. కేజ్రీవాల్ చోర్, అవినీతిపరుడు, భరతమాతకు ద్రోహం చేశాడంటూ నిందలేస్తున్నారు. నేను ‘డబ్బుతో అధికారం, అధికారంతో డబ్బు’ అనే ఆటాడేందుకు రాలేదు. దేశానికి మంచి చేద్దామని వచ్చా. ఆప్‌ను విచి్ఛన్నం చేసేందుకే నన్ను జైలుకు పంపించారు. ఎమ్మెల్యేలను డబ్బుతో కొనడం, సీబీఐ, ఈడీలతో భయపెట్టడం, తప్పుడు కేసులు, జైళ్లకు పంపడం, ప్రభుత్వాలను పడగొట్టడం, చివరికి సొంత ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం.. ఇలా ఒక ఫార్మూలా రూపొందించుకున్నారు. నన్ను జైలుకు పంపితే ఢిల్లీలో ఆప్ విచ్ఛిన్నమై ప్రభుత్వం పడిపోతుందని, బీజేపీ ప్రభుత్వం వస్తుందని అనుకున్నారు. కానీ మా పార్టీ, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు విచ్ఛిన్నం కాలేదు. కుట్రలకు వ్యతిరేకంగా పోరాడే సామర్థ్యం ఆప్‌కు ఉంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే జైలులో ఉండగా పీఎం పదవికి రాజీనామా చేయలేదు’’.భార్యను సీఎం చేయడానికే డ్రామాలు: బీజేపీ భార్య సునీతను సీఎం చేయడానికి కేజ్రీవాల్ నాటకాలాడుతున్నారని బీజేపీ ఎద్దేవా చేసింది. ‘‘సమస్యలను అవకాశాలుగా మార్చుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. అందులో భాగంగా రాజకీయంగా లబ్ధి కోసమే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఇలా డ్రామాకు తెర తీశారు’’ అని పార్టీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఆరోపించారు. రాజీనామా చేస్తా అనటమంటే మద్యం కుంభకోణంలో నేరాన్ని ఒప్పుకున్నట్లేనని బీజేపీ నేత సుధాంశు త్రివేది అన్నారు. ఆప్‌లో అంతర్గత ఘర్షణలను తట్టుకోలేకే రాజీనామా ప్రకటన చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.ఆప్ కొత్త సీఎం ఎవరు? కేజ్రీవాల్ రాజీనామా ప్రకటన నేపథ్యంలో ఢిల్లీ కొత్త సీఎం ఎవరన్న దానిపై చర్చ ప్రారంభమైంది. రేసులో కేజ్రీవాల్ భార్య సునీత, మంత్రులు అతిశీ, గోపాల్ రాయ్ ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. దీనిపై ఆప్ వర్గాలు అధికారికంగా స్పందించకున్నా సునీతకే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు పార్టీ నాయకుడొకరు చెప్పారు. కేజ్రీవాల్ మాదిరిగానే ఐఆర్ఎస్ అధికారిగా చేసిన ఆమెకు ప్రభుత్వాన్ని నడిపే విధానం క్షుణ్ణంగా తెలుసన్నారు. ‘‘అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేజ్రీవాల్ నిర్ణయం తీసుకుంటారు. ఢిల్లీలో దళితులు, ముస్లింల ప్రాబల్యంగా అధికం గనుక ఆ వర్గాల నుంచి సీఎంను ఎంచుకున్నా ఆశ్చర్యం లేదు’’ అని పరిశీలకులు అంటున్నారు. -
‘కేజ్రీవాల్ రాజీనామా నిర్ణయం.. 48 గంటల రహస్యం ఏంటి?’
ఢిల్లీ: ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరో రెండు రోజుల్లో తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా ఆదివారం చేస్తానని ప్రకటించారు. ఎన్నికలు జరిగేంత వరకు వేరొకరు సీఎంగా బాధ్యతలు చేపడతారని, ప్రజా కోర్టులో గెలిచిన తర్వాతే తాను మళ్లీ సీఎం పదవిని స్వీకరిస్తానని కేజ్రీవాల్ ప్రతిజ్ఞ చేశారు. కేజ్రీవాల్ రెండు రోజుల తర్వాత రాజీనామా చేస్తానని ప్రకటించటం వెనక ఉన్న ఆంతర్యం ఏంటని ప్రతిపక్ష బీజేపీ ప్రశ్నిస్తోంది.‘‘ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవి రాజీనామాకు కోరుతున్న 48 గంటలు( రెండు రోజులు) సమయం చాలా మిస్టరీగా ఉంది. మరోకరిని సీఎంగా నియమించటం కోసం ఈ రెండురోజులు ప్రయత్నం చేస్తారా? లేదా ఇంకేదైనా వ్యవహారాలు సర్దుబాబు చేసుకుంటారా? అసలు జైలు నుంచి బయటకు రావటంతోనే సీఎం పదవి రాజీనామాకు 48 గంటల సమయం తీసుకోవటం ఎందుకు? ఈ 48 గంటలకు తర్వాత ఏం జరుగుతుంది? 48 గంటల వెనక ఉన్న రహస్యాన్ని ఢిల్లీ, మొత్తం దేశ ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు’’ అని బీజేపీ ఎంపీ సుధాన్షు త్రివేది నిలదీశారు.2021లో ఆప్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎక్సైజ్ పాలసీని ఏడాది తర్వాత ఎందుకు ఉపసంహరించుకున్నారని ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను సూటిగా ప్రశ్నించారు. ‘‘అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ మద్యం పాలసీ స్కామ్‌తో సంబంధం లేకుంటే.. ఏడాది అనంతరం ఆ పాలసీని ఎందుకు ఉపసంహరించుకున్నారు?. మద్యం పాలసీ కుంభకోణంలో మొత్తం ఆప్ పార్టీ ప్రమేయం ఉంది. అందుకే ఆప్ నేతలు జైలుకు వెళ్లారు. మద్యం పాలసీ పేరుతో సీఎం కేజ్రీవాల్ వారిని దోచుకున్నారని ఢిల్లీ ప్రజలకు తెలుసు’’ అని అన్నారు.VIDEO | "This 48-hour time which he (Arvind Kejriwal) has sought is enshrined in mystery that for which he is trying to find a replacement or trying to do some placements. It is ridiculous for a CM who is having overwhelming majority in the Assembly. If he is having an iota of… pic.twitter.com/YR1GnuIZT4— Press Trust of India (@PTI_News) September 15, 2024చదవండి: జార్ఖండ్‌కు ఆ మూడు పార్టీలు శత్రువులు: మోదీ -
ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు ఊహించని షాక్
జైపూర్: లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. రాజస్థాన్‌లో ఒకేసారి 400 మంది కార్యకర్తలు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో, ఈ ఘటన రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. రాజస్థాన్ హస్తం పార్టీ నాయకత్వం ఖంగుతింది. వివరాల ప్రకారం.. రాజస్థాన్‌లో కాంగ్రెస్, రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ(ఆర్ఎల్పీ) మధ్య పొత్తు ఖరారైంది. ఈ నేపథ్యంలో పొత్తులో భాగంగా నాగౌర్ లోక్‌సభ స్థానం నుంచి ఆర్ఎల్పీ చీఫ్ హనుమాన్ బేనివాల్‌ను అభ్యర్థిగా బరిలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ బేనివాల్ పేరును ఖరారు చేసింది. దీంతో, కాంగ్రెస్ నేతలకు బేనివాల్ ఎంపిక నచ్చలేదు. ఈ క్రమంలో కొందరు కాంగ్రెస్ నేతలు.. బీజేపీ అభ్యర్థి జ్యోతి మిర్ధాకు అనుకూలంగా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ విషయం తెలిసి బేనివాల్.. కాంగ్రెస్ నేతలు వ్యవహారాన్ని హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారు. అసలు విషయం తెలుసుకున్న కాంగ్రెస్ హైకమాండ్ దిద్దుబాటులో చర్యలో భాగంగా ముగ్గురు కాంగ్రెస్ నేతలను ఆరేళ్ల పాటు సస్పెండ్ చేసింది. సస్పెండ్ అయిన వారిలో మాజీ ఎమ్మెల్యే భరరామ్, కుచేరా మున్సిపాలిటీ చైర్పర్సన్ తేజ్‌పాల్ మీర్జా, సుఖరామ్ దొడ్వాడియాలు ఉన్నారు. దీంతో, హైకమాండ్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ముగ్గురు కాంగ్రెస్ నేతలు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే వీరికి మద్దతు తెలుపుతూ సుమారు 400 మంది హస్తం కార్యకర్తలు తాజాగా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు సమాచారం. Rajasthan News 🚨 - 400 Congress workers resigned from party and joined BJP to support Jyoti Mirdha against RLP Chief Hanuman Beniwal. Mirdha is getting stronger in Nagaur since last couple of weeks. — The Insert News (@InsertNews) April 13, 2024 ఈ సందర్భంగా తేజ్ పాల్ మీర్జా మీడియతో మాట్లాడుతూ..‘నాగౌర్‌లో కాంగ్రెస్‌ను నాశనం చేయడానికి బేనివాల్ ప్రయత్నిస్తున్నాడు. అలాంటి వ్యక్తితో పొత్తు పెట్టుకోవడం కాంగ్రెస్ కార్యకర్తలకు ఇష్టం లేదు. అందుకే వారంతా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అభ్యర్థిని ఖరారు చేసే ముందు హైకమాండ్ మా అభిప్రాయం తెలుసుకోవాల్సింది. కాంగ్రెస్‌ను ఓడిచేందుకు మాత్రమే ఆర్ఎల్పీ పనిచేస్తుంది’ అని ఆరోపణలు చేశారు. మరోవైపు.. కాంగ్రెస్ నేతలు మాత్రం తమ పార్టీ కార్యకర్తలు రాజీనామా చేయలేదన్నారు. ఇదంతా బీజేపీ నేతలు ఆడుతున్న డ్రామా అని కొట్టిపారేశారు. -
బీచ్‌లో ఎంజాయ్ చేసేందుకే..రూ.5లక్షల కోట్ల కంపెనీకి సీఈవో రాజీనామా!
వృద్దాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటూ కంటికి రెప్పలా కాపాడాల్సిన కొడుకులే పట్టించుకోవడం లేదు. నిట్ట నిలువునా నడిరోడ్డు మీద వదిలిస్తున్నారు. కానీ లక్షల కోట్ల విలువైన ఓ దిగ్గజ కంపెనీ సీఈవో అలా చేయలేదు. తల్లిదండ్రుల కోసం సీఈవో జాబ్‌ను తృణ ప్రాయంగా వదిలేశారు. ప్రస్తుతం ఆయన తీసుకున్న నిర్ణయం తల్లిదండ్రుల పట్ల కాఠిన్యం ప్రదర్శించే కొడుకులకు కనువిప్పును కలిగిస్తుంటే..తోటి సీఈవోలగా ఆదర్శంగా నిలుస్తోంది. బ్లూం బర్గ్ కథనం ప్రకారం..యూకేకి చెందిన జూపిటర్ ఫండ్ మేనేజ్మెంట్ సంస్థ సీఈవోగా ఆండ్రూ ఫార్మికా విధులు నిర్వహిస్తున్నారు. జూపిటర్ ఫండ్ మేనేజ్మెంట్ కంపెనీ వ్యాల్యూ అక్షరాల 5లక్షల కోట్లు. ఆ సంస్థ సీఈవోగా ఉన్న ఆండ్రూ తన జాబ్‌కు రిజైన్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన రిజైన్ కార్పొరేట్ దిగ్గజాలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుండగా.. సీఈవో పదవి నుంచి తప్పుకోవడంపై ఆండ్రూ బ్లూంబర్గ్‌కు వివరణిచ్చారు. బీచ్‌లో కూర్చొని ప్రకృతిని ఎంజాయ్ చేద్దామని అనుకుంటున్నా. నా రాజీనామాకు ఇంతకు మించిన కారణాలు ఏం లేవని అనుకుంటున్నట్లు చెప్పారు. కంపెనీ బోర్డ్‌కు ఏం చెప్పారంటే సీఈవో పదవి నుంచి వైదొలగడంపై ఇప్పటికే ఆ సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లకు ఆండ్రూ స్పష్టత నిచ్చినట్లు (అంచనా మాత్రమే) పలు నివేదికలు చెబుతున్నాయి. వృద్దాప్యంలో ఉన్న తల్లిదండ్రుల సంరక్షణ చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని, వారి కోసం ఈ కఠిన నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆ నివేదికలు పేర్కొన్నాయి. మరోవైపు అతను చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా వైదొలిగినప్పటికీ, ఆండ్రూ ఫార్మికా జూన్ 2023 వరకు వ్యాపారంలో కొనసాగుతారు. కొత్త నాయకత్వంలో వ్యాపార కార్యకలాపాలు సజావుగా ఉండేలా ఆసియా వ్యాపారానికి మద్దతు ఇవ్వడం, ఆస్ట్రేలియన్ మార్కెట్‌పై పట్టసాధించేలా నిర్దేశించిన వ్యూహాత్మక లక్ష్యాల్ని చేరుకునేందుకు సహాయ పడనున్నట్లు జూపిటర్ ఫండ్ మేనేజ్మెంట్ బోర్డ్ సభ్యులు తెలిపారు. ఆండ్రూ వారసుడిగా మాథ్యూ బిస్లీ "మార్కెట్లో మనం చేస్తున్న వ్యాపారం నిలుపుకోవడం సవాలుతో కూడుకుంది. సీఈవో హోదాలో అదే పనిని నేను అద్భుతంగా,అంకితభావంతో చేసినందుకు గర్వపడుతున్నాను" అని ఆండ్రూ తెలిపారు. బోర్డు నా వారసుడిగా మాథ్యూ బీస్లీని నియమించినందుకు సంతోషంగా ఉందని అన్నారు. చదవండి👉 ఎలన్ మస్క్ కొంపముంచిన చైనా.. లక్షల కోట్లు హాంఫట్! -
రెండుసార్లు సీఎం రాజీనామా యోచన.. ఆయన వల్లే వెనక్కి!
ముంబై: ‘అస్లీ శివ సేన’ పంచాయితీతో.. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం మరికొన్ని రోజులపాటు కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయి. కోర్టు తీర్పుతో ఊరట పొందిన షిండే రెబల్స్ వర్గం.. గువాహతి(అస్సాం) హోటల్లో ఉంటూనే రాజకీయ సమీకరణాలు చేస్తోంది. మరోవైపు పార్టీ-అధికారం చేజారిపోనివ్వకుండా ప్రయత్నాలు కొనసాగిస్తోంది శివ సేన. ఈ తరుణంలో తిరుగుబాటు పరిణామాలతో కలత చెందిన సీఎం ఉద్దవ్ థాక్రే.. రెండుసార్లు రాజీనామాకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఏక్నాథ్ షిండే తిరుగుబాటు పరిణామాల తర్వాత ఉద్దవ్ థాక్రే.. ముఖ్యమంత్రి పదవికి రెండుసార్లు రాజీనామా చేయాలనుకున్నారట. జూన్ 21వ తేదీన రాజీనామా చేయాలనుకున్న థాక్రే.. ఆ విషయాన్ని సాయంత్రం ఐదు గంటల సమయంలో ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ప్రకటించాలని భావించారు. అందుకు కారణం.. పార్టీ నుంచి మరింత మంది రెబల్స్ గ్రూప్‌కు వెళ్తారని ఆయన ఆందోళన చెందారు. ఈ విషయం తెలిసిన మహారాష్ట్రకు చెందిన ఓ సీనియర్ నేత ఆ ప్రయత్నాన్ని ఆపేయించినట్లు తెలుస్తోంది. అయితే ఆ మరుసటి రోజే.. థాక్రే మరోసారి రాజీనామా చేయాలనే ఆలోచనను చేశారట. అందుకే ఉన్నతాధికారుల్ని పిలిపించుకుని ఫేర్వెల్ చర్చలు కూడా చేసినట్లు తెలుస్తోంది. సాయంత్రం 4 గంటల సమయంలో ఫేస్బుక్ ద్వారా రాజీనామా ప్రకటించాల్సి ఉంది. అదే సమయంలో.. మళ్లీ ఆ సీనియర్ నేత జోక్యం చేసుకున్నారు. సుమారు గంటపాటు చర్చించి.. థాక్రే చేత ఆ ప్రయత్నాన్ని విరమింపజేశారు. ఇంతకీ ఆ సీనియర్ నేత ఎవరో కాదు.. మహా వికాస్ అగాడి కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్. మౌనంగా, చాకచక్యంగా పోరాటం చేయాలని.. వెన్నుచూపి పారిపోవద్దని థాక్రేకు ఆయన హిత బోధ చేసినట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఆయన ఇచ్చిన ధైర్యంతోనే ఉద్దవ్ థాక్రే.. శివ సేన రెబల్స్‌ను ఎదుర్కొంటానని బహిరంగ ప్రకటన చేశారు కూడా. -
రాజీనామాపై జగ్గారెడ్డి దిమ్మతిరిగే ట్విస్ట్
-
పంజాబ్ కాంగ్రెస్: నవజ్యోత్ సింగ్ సిద్ధూ కీలక నిర్ణయం
చంఢిఘర్: పంజాబ్ రాష్ట్ర పీసీపీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ తన రాజీనామాను వెనక్కి తీసుకున్నారు. ఆయన సెప్టెంబర్ 28న పంజాబ్ రాష్ట్ర పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామాతో పంజాబ్ కాంగ్రెస్‌లో పలు కీలక పరిణామాలు చేటు చేసుకున్నాయి. తాజాగా సిద్ధూ శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన పీసీసీ అధ్యక్ష పదవికి చేసిన రాజీనామా వెనక్కి తీసుకుంటున్నానని ప్రకటించారు. చదవండి: జమ్మూ కశ్మీర్: ఆస్పత్రిలోకి చొరబడి ఉగ్రదాడి తాను తీసుకున్న నిర్ణయం వ్యక్తిగతమైంది కాదని, మళ్లీ పీసీసీ అధ్యక్ష పదని చేపడతానని పేర్కొన్నారు. కొత్త అడ్వకేట్ జనరల్(ఏజీ), డీజీపీ నియామకం త్వరలో జరగనుందని సిద్ధూ తెలిపారు. -
ఎమ్మెల్యే పదవికి రాజీనామా యోచనలో సిద్ధూ !
సాక్షి బెంగళూరు: ఇటీవలే సీఎల్పీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన మాజీ సీఎం సిద్ధరామయ్య త్వరలో శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తారనే ఊహాగానాలు కాంగ్రెస్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. గుండె వ్యాధితో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సిద్ధరామయ్య.. ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేయాలనుకుంటున్నట్లు తన సన్నిహితుల వద్ద చెప్పినట్లు సమాచారం. ఆస్పత్రిలో తనను కలిసేందుకు వచ్చిన నేతలంతా సీఎల్పీ పదవికి చేసిన రాజీనామాను ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేశారు. అయితే, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు సిద్ధరామయ్య తెలిపినట్లు విశ్వసనీయ సమాచారం. ఆయన ఆదివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. -
వెనక్కు తగ్గని రాహుల్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన రాజీనామా నిర్ణయాన్ని వెనక్కు తీసుకోనంటూ పట్టుబట్టడంతో ఆ పార్టీలో అనిశ్చితి బుధవారం కొనసాగింది. మరోవైపు రాహుల్ తన రాజీనామాను వెనక్కు తీసుకోవాల్సిందిగా కోరుతూ పార్టీ కార్యకర్తలు కొందరు ఆయన ఇంటి ఎదుట నిరాహార దీక్షకు దిగారు. అనంతరం పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని వేరే ప్రాంతంలో విడిచిపెట్టారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమి పాలైనందున తాను అధ్యక్ష పదవిలో ఉండనంటూ రాహుల్ రాజీనామా చేస్తాననడం, పార్టీ నేతలు దీనిని వ్యతిరేకించి ఆయనను బుజ్జగిస్తుండటం తెలిసిందే. రాహుల్ తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సిందిగా బుధవారం కూడా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షీలా దీక్షిత్ కోరారు. ఆమెతోపాటు ఢిల్లీ కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు భారీ సంఖ్యలో రాహుల్ నివాసం వద్దకు చేరుకున్నారు. ‘మేమంతా రాహుల్ కోసమే ఉన్నాం. ఆయన తన నిర్ణయంపై పునరాలోచించుకోవాలి. ఆయనే పార్టీకి సారథ్యం వహించాలని పార్టీ నేతలంతా కోరుకుంటున్నందున పార్టీని వీడొద్దని నేను చెప్పాను’ అని షీలా అన్నారు. కర్ణాటక, రాజస్తాన్ పీసీసీలు, పలు రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు రాహుల్ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరారు. జూన్ 1న సీపీపీ భేటీ పార్లమెంటరీ పార్టీ కొత్త నేతను ఎన్నుకునేందుకు తాజా లోక్‌సభ ఎన్నికల అనంతరం తొలిసారిగా కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) భేటీ జూన్ 1న జరగనుంది. ప్రస్తుతం సీపీపీ చైర్మన్‌గా సోనియా గాంధీ ఉన్నారు. కొత్త లోక్‌సభకు ఎన్నికైన 52 మంది ఎంపీలు, రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీలు ఈ భేటీకి హాజరుకానున్నారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కాంగ్రెస్ ఎంపీలు సమావేశమవుతారు. పార్లమెంటు సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన విధానంపై వారు చర్చిస్తారు. -
రాజీనామాకు నేను సిద్ధమే
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలోని కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో విభేదాలు బహిర్గతమయ్యాయి. ఆదివారం బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.సోమశేఖర మాట్లాడుతూ..‘రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదు. అదే సిద్దరామయ్య హయాంలో అయితే, కెంపెగౌడ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు వంటి భారీ పనులు చేశారు’ అని వ్యాఖ్యానించారు. దీనిపై సీఎం కుమారస్వామి స్పందించారు. ‘కాంగ్రెస్ ఎమ్మెల్యేల మాటలను ఆ పార్టీ నేతలు గమనిస్తున్నారు. కాంగ్రెస్ పెద్దలే తమ ఎమ్మెల్యేలను అదుపులో పెట్టుకోవాలి. లేదా వారు ఇలాగే మాట్లాడతామంటే పదవికి రాజీనామా చేయడానికి నేను సిద్ధం. సీఎం కుర్చీపై నాకు మోజు లేదు’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ నుంచి అనేక అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సంకీర్ణ ధర్మం పాటించడంలో కాంగ్రెస్ విఫలం అవుతోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి ప్రకటనపై కేపీసీసీ అధ్యక్షుడు దినేశ్ గుండూరావ్ స్పందిస్తూ..ఎమ్మెల్యే సోమశేఖర తన పరిధిని అతిక్రమించి మాట్లాడారు. తన వ్యాఖ్యలపై కుమారస్వామికి సోమశేఖర క్షమాపణలు చెప్పారని దినేశ్ పేర్కొన్నారు. సిద్ధరామయ్య మాట్లాడుతూ కుమారస్వామితో చర్చించి విభేదాలను పరిష్కరించుకుంటామని తెలిపారు. సిద్దరామయ్య గొప్ప సీఎం అని, ఎమ్మెల్యేలు అలా అనడంలో తప్పు లేదని డిప్యూటీ సీఎం పరమేశ్వర్ వెనకేసుకొచ్చారు. సీఎం పదవికి కుమారస్వామి రాజీనామా చేసినా వచ్చే నష్టంలేదని బీజేపీ నేత, మాజీ సీఎం జగదీశ్ శెట్టర్ అన్నారు. కుమారస్వామికి సిగ్గుంటే పదవికి రాజీనామా చేయాలని బీజేపీ నేత ఈశ్వరప్ప ఎద్దేవా చేశారు. -
కాంగ్రెస్ నిర్ణయంపై నిరసనలు తీవ్రతరం
-
13 మంది మంత్రులు, 20 మంది ఎమ్మెల్యేల రాజీనామాలు!