ఎల్జీకి సమర్పించనున్న కేజ్రీవాల్
కొత్త సీఎంపై సర్వత్రా ఉత్కంఠ
రోజంతా నేతలతో మల్లగుల్లాలు
నేడు ఎమ్మెల్యేల భేటీలో నిర్ణయం
ఎస్సీ, మైనారిటీ నేతల పేర్లు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి ఆప్ జాతీయ కనీ్వనర్ అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం రాజీనామా చేయనున్నారు. సాయంత్రం 4.30కు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆయనకు అపాయింట్‌మెంట్ ఇచ్చారు. ఆ సందర్భంగా ఎల్జీకి కేజ్రీవాల్ రాజీనామా లేఖ సమరి్పస్తారని ఆప్ మంత్రి సౌరభ్ భరద్వాజ్ సోమవారం మీడియాకు తెలిపారు. రెండు రోజుల్లో రాజీనామా చేస్తానని, ప్రజలు గెలిపించాకే తిరిగి సీఎం కురీ్చలో కూర్చుంటానని కేజ్రీవాల్ ఆదివారం సంచలన ప్రకటన చేయడం తెలిసిందే.
ఢిల్లీ అసెంబ్లీకి నవంబర్లోనే ముందస్తు ఎన్నికలు పెట్టాలని కూడా ఆ సందర్భంగా ఆయన ఈసీని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం రోజంతా ఆప్ నేతలతో కేజ్రీ సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. తన ప్రకటనపై స్పందన ఎలా ఉందని పార్టీ అత్యున్నత నిర్ణాయక విబాగమైన రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీలో ఆరా తీశారు. సీఎం అభ్యర్థిపై ఒక్కక్కరి నుంచీ వ్యక్తిగతంగా అభిప్రాయాలు సేకరించారు. అంతకుముందు ఉదయం కీలక నేతలు మనీశ్ సిసోడియా, రాఘవ్ ఛద్దా తదితరులతోనూ ఈ అంశంపై లోతుగా చర్చలు జరిపారు.
సీఎం పదవికి మంత్రులు ఆతిశి, గోపాల్ రాయ్, కైలాశ్ గహ్లోత్, సౌరభ్ భరద్వాజ్ తదితరుల పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు స్పీకర్ రాంనివాస్ గోయల్, కేజ్రీవాల్ భార్య సునీత పేర్లపైనా లోతుగా చర్చ జరుగుతున్నట్టు ఆప్ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీలో 12 ఎస్సీ రిజర్వుడు శాసనసభ స్థానాలున్నాయి. కనీసం మరో ఆరు స్థానాల్లో మైనారిటీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు.
ఈ నేపథ్యంలో ఎస్సీ, లేదా మైనారిటీ నేతకు చాన్స్ దక్కొచ్చన్న వాదనా ఉంది. దాంతో ఎస్సీ, మైనారిటీ వర్గానికి చెందిన పలువురు ఆప్ ఎమ్మెల్యేల పేర్లు కూడా కొత్తగా తెరపైకి వస్తున్నాయి! మంగళవారం కేజ్రీవాల్ రాజీనామాకు ముందు ఉదయం 11.30కు ఆప్ లెజిస్లేటివ్ పార్టీ సమావేశం జరగనుంది. సీఎం అభ్యర్థిపై ఈ భేటీలో తుది నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. మైనారిటీ వర్గానికి చెందిన ఆప్ ఎమ్మెల్యే ఇమ్రాన్ హుసేన్ పేరు ఖరారైనా ఆశ్చర్యం లేదని ఆప్ ముఖ్య నేత ఒకరు చెప్పడం విశేషం!
హరియాణాలో సుడిగాలి ప్రచారం!
రాజీనామా అనంతరం కేజ్రీవాల్ హరియాణ అసెంబ్లీ ఎన్నికల్లో సుడిగాలి ప్రచారం చేస్తారని ఆప్ వర్గాలు చెబుతున్నాయి. హరియాణలో అక్టోబర్ 5న పోలింగ్ జరగనుంది. అక్కడ కాంగ్రెస్‌తో ఆప్ పొత్తు పెట్టుకోలేదు. మొత్తం 90 స్థానాల్లో ఒంటరిగానే అభ్యర్థులను బరిలోకి దింపింది. జమ్మూకశ్మీర్‌లో కూడా కేజ్రీవాల్ ప్రచారం చేస్తారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment