resignation letter
-
నేడే కేజ్రీవాల్ రాజీనామా
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి ఆప్ జాతీయ కనీ్వనర్ అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం రాజీనామా చేయనున్నారు. సాయంత్రం 4.30కు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆయనకు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఆ సందర్భంగా ఎల్జీకి కేజ్రీవాల్ రాజీనామా లేఖ సమరి్పస్తారని ఆప్ మంత్రి సౌరభ్ భరద్వాజ్ సోమవారం మీడియాకు తెలిపారు. రెండు రోజుల్లో రాజీనామా చేస్తానని, ప్రజలు గెలిపించాకే తిరిగి సీఎం కురీ్చలో కూర్చుంటానని కేజ్రీవాల్ ఆదివారం సంచలన ప్రకటన చేయడం తెలిసిందే. ఢిల్లీ అసెంబ్లీకి నవంబర్లోనే ముందస్తు ఎన్నికలు పెట్టాలని కూడా ఆ సందర్భంగా ఆయన ఈసీని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం రోజంతా ఆప్ నేతలతో కేజ్రీ సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. తన ప్రకటనపై స్పందన ఎలా ఉందని పార్టీ అత్యున్నత నిర్ణాయక విబాగమైన రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీలో ఆరా తీశారు. సీఎం అభ్యర్థిపై ఒక్కక్కరి నుంచీ వ్యక్తిగతంగా అభిప్రాయాలు సేకరించారు. అంతకుముందు ఉదయం కీలక నేతలు మనీశ్ సిసోడియా, రాఘవ్ ఛద్దా తదితరులతోనూ ఈ అంశంపై లోతుగా చర్చలు జరిపారు. సీఎం పదవికి మంత్రులు ఆతిశి, గోపాల్ రాయ్, కైలాశ్ గహ్లోత్, సౌరభ్ భరద్వాజ్ తదితరుల పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు స్పీకర్ రాంనివాస్ గోయల్, కేజ్రీవాల్ భార్య సునీత పేర్లపైనా లోతుగా చర్చ జరుగుతున్నట్టు ఆప్ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీలో 12 ఎస్సీ రిజర్వుడు శాసనసభ స్థానాలున్నాయి. కనీసం మరో ఆరు స్థానాల్లో మైనారిటీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎస్సీ, లేదా మైనారిటీ నేతకు చాన్స్ దక్కొచ్చన్న వాదనా ఉంది. దాంతో ఎస్సీ, మైనారిటీ వర్గానికి చెందిన పలువురు ఆప్ ఎమ్మెల్యేల పేర్లు కూడా కొత్తగా తెరపైకి వస్తున్నాయి! మంగళవారం కేజ్రీవాల్ రాజీనామాకు ముందు ఉదయం 11.30కు ఆప్ లెజిస్లేటివ్ పార్టీ సమావేశం జరగనుంది. సీఎం అభ్యర్థిపై ఈ భేటీలో తుది నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. మైనారిటీ వర్గానికి చెందిన ఆప్ ఎమ్మెల్యే ఇమ్రాన్ హుసేన్ పేరు ఖరారైనా ఆశ్చర్యం లేదని ఆప్ ముఖ్య నేత ఒకరు చెప్పడం విశేషం!హరియాణాలో సుడిగాలి ప్రచారం! రాజీనామా అనంతరం కేజ్రీవాల్ హరియాణ అసెంబ్లీ ఎన్నికల్లో సుడిగాలి ప్రచారం చేస్తారని ఆప్ వర్గాలు చెబుతున్నాయి. హరియాణలో అక్టోబర్ 5న పోలింగ్ జరగనుంది. అక్కడ కాంగ్రెస్‌తో ఆప్ పొత్తు పెట్టుకోలేదు. మొత్తం 90 స్థానాల్లో ఒంటరిగానే అభ్యర్థులను బరిలోకి దింపింది. జమ్మూకశ్మీర్‌లో కూడా కేజ్రీవాల్ ప్రచారం చేస్తారని సమాచారం. -
గవర్నర్‌కు కేసీఆర్ రాజీనామా లేఖ
-
దిగ్విజయ్ సింగ్ రాజీనామా.. క్లారిటి
భోపాల్: కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ రాజీనామా లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ మండిపడింది. నకిలీ లేఖ అని పేర్కొంటూ పోలీసుకు ఫిర్యాదు చేసింది. మధ్యప్రదేశ్‌లో ఎన్నికలకు అభ్యర్థుల లిస్టు ప్రకటించిన వెంటనే దుష్ప్రచారం చేయడానికి ప్రతిపక్షాలు ఈ ఘటనకు పాల్పడ్డాయని కాంగ్రెస్ ఆరోపించింది. 'అబద్ధాలు అడటంలో బీజేపీకి మంచి పట్టుంది. 1971లో ఎలాంటి ఆశ లేకుండా కేవలం పార్టీ సిద్ధాంతాల కోసం కాంగ్రెస్ సభ్యత్వాన్ని తీసుకున్నాను. చివరి శ్వాస వరకు కాంగ్రెస్‌లోనే ఉంటాను. రాజీనామాకు సంబంధించి నకిలీ లేఖపై పోలీసులకు ఫిర్యాదు చేశాను' అని దిగ్విజయ్ సింగ్ తెలిపారు. మధ్యప్రదేశ్‌లో నవంబర్ 17న 230 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ 144 మంది అభ్యర్థుల లిస్టును ప్రకటించింది. ఇందులో దిగ్విజయ్ సింగ్ కుమారుడితో సహా సిట్టింగ్ ఎమ్మెల్యే జైవర్ధన్ సింగి పేర్లు కూడా ఉన్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అయిన రాజీనామా లేఖలో తన అనుచరులకు సీట్లు దక్కనందుకు దిగ్విజయ్ విచారం వ్యక్తం చేస్తూ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాసినట్లు దుండగులు పేర్కొన్నారు. భారమైన హృదయంతో పార్టీతో ఉన్న అనుబంధాన్ని తెంచుకోవడానికి నిర్ణయించుకున్నట్లు లేఖలో ఉంది. కాంగ్రెస్ తన మొదటి లిస్టులో పార్టీ చీఫ్ కమల్‌నాథ్‌తో పాటు 69 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అవకాశం ఇచ్చింది. ఇదీ చదవండి: ప్రశ్నలడిగేందుకు లంచం తీసుకున్నారు -
‘వారి టార్గెట్ నేను కాదు.. మీరే!’ రాజీనామా లేఖలో మనీష్ సిసోడియా
న్యూఢిల్లీ: ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తన మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. లిక్కర్ స్కాం కేసులో సీబీఐ అరెస్ట్ చేయడం.. 5 రోజుల జ్యుడీషియల్ కస్టీడికి కోర్టు అనుమతిచ్చిన పరిణామాల నేపథ్యంలో సిసోడియా ఈ నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయి జైలులో ఉన్న మరో ఆప్ నేత, మాజీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ సైతం తన పదవికి రాజీనామా చేశారు. వీరి రాజీనామాలను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆమోదించారు. ఈ క్రమంలో తన రాజీనామా లేఖలో మనీష్ సీసోడియా పలు కీలక అంశాలు ప్రస్తావించారు. తనపై వస్తున్న ఆరోపణలను తప్పుబడుతూ.. గత ఎనిమిదేళ్లుగా నిజాయితీ, నిబద్దతతో పనిచేస్తుంటే అవినీతి ఆరోపణల్లో ఇరికించడం దురదృష్టకరమన్నారు. ‘ఈ ఆరోపణలన్నీ అబద్దాలని నాతోపాటు ఆ దేవుడికి తెలుసు. ఇదంతా అరవింద్ కేజ్రీవాల్ స్వచ్ఛమైన రాజకీయాలకు బయపడి చేస్తున్న కొందరు బలహీనులు పిరికితనంతో చేస్తున్న కుట్ర తప్ప మరేం లేదు. నిజానికి వాళ్ల టార్గెట్ నేను కాదు.. మీరే(కేజ్రీవాల్) వాళ్ల అసలైన టార్గెట్. ఎందుకంటే నేడు కేవలం ఢిల్లీ మాత్రమే కాదు దేశ ప్రజలంతా మిమ్మల్ని గొప్ప విజన్ ఉన్న నాయకుడిగా చూస్తున్నారు. సరికొత్త విధానాలను అమలు చేయడం ద్వారా వాళ్ల జీవితాల్లో పెను మార్పులు తీసుకురాగల సామర్థ్యం మీకు ఉందని ప్రజలు నమ్ముతున్నారు’ అని అరవింద్ కేజ్రీవాల్‌కు సిసోడియా రాసిన తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఆర్థిక సంక్షోభం, పేదరికం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, అవినీతి వంటి సమస్యలను ఎదుర్కొంటున్న కోట్లాది మంది కళ్లల్లో అరవింద్ కేజ్రీవాల్ ఓ ఆశాదీపంగా కనిపిస్తున్నారని ఆయన అన్నారు. కాగా ఢిల్లీ మద్యం కుంభకుణం కేసులో సిసోడియాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అరెస్టు చేసిన విషయం తెలసిందే. ఈ పాలసీని రూపొందించి, అమలు చేయడంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సిసోడియాను సీబీఐ అధికారులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఢిల్లీని రౌస్ అవెన్యూ కోర్టు ఆయనను 5 రోజుల సీబీఐ కస్టడీకి పంపింది. తన అరెస్ఠ్ను సవాల్ చేస్తూ మనీష్ సిసోడియా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఆయన పిటిషన్‌ను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు మంగళవారం నిరాకరించింది. దీనిపై ఢిల్లీ హైకోర్టును సంప్రదించాలని న్యాయస్థానం సూచించింది. చదవండి: కొత్త లుక్‌లో రాహుల్ గాంధీ -
పోప్‌గా ఎన్నికవగానే... రాజీనామా లేఖ రాసిచ్చా
రోమ్: ఆనారోగ్య కారణాలతో విధులు నిర్వర్తించలేని పరిస్థితి ఎదురైతే ఏం చేయాలన్న ఆలోచన తనకు ఎప్పుడో వచ్చిందని పోప్ ఫ్రాన్సిస్ తెలిపారు. ‘‘అందుకే పోప్‌గా ఎన్నికైన వెంటనే త్యాగపత్రం (రాజీనామా లేఖ) రాశా. దాన్ని కార్డినల్ టార్సిసియో బెర్టోనే చేతికిచ్చా. నేను విధులు నిర్వర్తించలేని పరిస్థితి ఎదురైతే పనికొస్తుందని చెప్పా’’ అని చెప్పారు. ఆయన తాజాగా ఓ వార్తా పత్రికతో మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలు, ఆరోగ్య సమస్యలు తదితరాల వల్ల పోప్ విధులు నిర్వర్తించలేకపోతే పరిస్థితి ఏమిటని ప్రశ్నించగా ఈ మేరకు వెల్లడించారు. అలాంటప్పుడు ఏం చేయాలో స్పష్టంగా చెప్పే నిబంధన ఉందని బదులిచ్చారు. రహస్యం బయట పెట్టాను గనుక ఎవరైనా బెర్టోనే దగ్గరికెళ్లి పోప్ రాజీనామా లేఖ చూపించమని అడగవచ్చంటూ చమత్కరించారు. శనివారం 86వ ఏట అడుగు పెట్టిన పోప్ ఫ్రాన్సిస్ కొన్నేళ్లుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతుండటం తెలిసిందే. ఆయనకు 2021లో పేగు శస్త్రచికిత్స జరిగింది. మోకాలి నొప్పి తీవ్రంగా బాధించడంతో కొద్ది నెలలు వీల్‌చైర్‌కు పరిమితమయ్యారు. ఇప్పుడు చేతికర్ర సాయంతో నడుస్తున్నారు. మోకాలి నొప్పి బాధ్యతల నిర్వహణకు అడ్డంకిగా మారిందన్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. మనం తలతో పని చేస్తాం తప్ప మోకాలితో కాదంటూ ఛలోక్తి విసిరారు. వృద్ధాప్య కారణాలతో గతంలో పోప్ బెనెడిక్ట్ రాజీనామా ఫ్రాన్సిస్‌కు ముందు పోప్‌గా ఉన్న బెనెడిక్ట్–16 రాజీనామా చేయడం తెలిసిందే. వృద్ధాప్యం వల్ల బాధ్యతలను సరిగా నిర్వర్తించ లేకపోతున్నానంటూ ఆయన 2013లో రాజీనామా చేసి తప్పుకున్నారు. గత 600 ఏళ్లలో ఇలా బాధ్యతల నుంచి తప్పుకున్న తొలి పోప్‌గా రికార్డు సృష్టించారు. అనంతరం ఫ్రాన్సిస్ పోప్‌గా ఎన్నికయ్యారు. -
ఎన్నికల ముందు బీజేపీకి షాక్..!
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న క్రమంలో అధికార బీజేపీకి మాజీ మంత్రి జయనారాయణ్ వ్యాస్ షాకిచ్చారు. ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి శనివారం రాజీనామా చేశారు. అయితే, ఆయన ఏపార్టీలో చేరతారనే విషయాన్ని వెల్లడించలేదు. కాంగ్రెస్‌లో చేరతారనే వాదనలు బలంగా వినిపిస్తున్నా.. మరోవైపు ఆప్ వైపు సైతం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. తన రాజీనామా లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్‌కు పంపించారు మాజీ మంత్రి. ‘నేను బీజేపీతో విసిగిపోయాను, అందుకే ఆ పార్టీకి రాజీనామా చేశాను. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో సద్ధాపుర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాను. ఏ పార్టీలో చేరటమనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు. వ్యక్తిగత కారణాలతోనే బీజేపీని వీడుతున్నాను.’ అని వ్యాస్ పేర్కొన్నారు. 75ఏళ్ల వ్యాస్ ఇటీవల కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లత్, కాంగ్రెస్ గుజరాత్ ఎన్నికల పరిశీలకులతో వరుసగా సమావేశమయ్యారు. దీంతో ఆయన హస్తం పార్టీలో చేరే అవకాశముందని ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పెద్దలతో వ్యాస్ మంతనాలు జరుపుతున్నట్లు హస్తం పార్టీ నేత ఒకరు పేర్కొనటం ఆ వాదనలకు బలం చేకూర్చుతోంది. 2007లో నరేంద్రమోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యాస్ రాష్ట్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2012, 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా ఓడిపోయారు. రాబోయే ఎన్నికల్లో కాషాయ పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వకూడదని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన వ్యాస్.. పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.మరోవైపు.. ఆయనను పార్టీలోకి తీసుకొచ్చేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ సైతం మంతనాలు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఇదీ చదవండి: ‘మిస్టర్ కేజ్రీవాల్ మీ దృష్టిలో నేను దొంగనైతే.. మరి మీరేంటి?’ -
బీజేపీపై భిక్షమయ్య ఘాటు విమర్శలు.. అందుకే రాజీనామా చేశారా?
సాక్షి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నిక వేళ ఆలేరు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ భారతీయ జనతా పార్టీని వీడుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ అధిష్ఠానానికి లేఖ పంపారు. ఈ సందర్భంగా బీజేపీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు భిక్షమయ్య గౌడ్. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు చేస్తున్న తీవ్ర అన్యాయాన్ని, వివక్షను చూశాక బీజేపీలో కొనసాగడంలో ఏమాత్రం అర్థం లేదని భావిస్తూ రాజీనామా చేస్తున్నానని లేఖలో పేర్కొన్నారు. ‘తెలంగాణ రాష్ట్రానికి అండగా ఉంటామంటూ భారతీయ జనతా పార్టీ చేసిన వాగ్దానాలను నమ్మి ఆ పార్టీలో చేరాను. అయితే మాజీ ఎమ్మెల్యేగా, సీనియర్ నాయకునిగా రాజకీయాల్లో దాదాపు రెండున్నర దశాబ్దాల అనుభవం ఉన్న నాకు ఆ పార్టీలో చేరిన నాటి నుంచి అడుగడుగునా అవమానాలు ఎదురయ్యాయి. పార్టీలో నాలాంటి బీసీ నాయకులను పట్టించుకునే వారే లేరు. పైగా ఈమద్య కాలంలో పదే పదే తెలంగాణ రాష్ట్రానికి, బడుగు బలహీన వర్గాల ప్రయోజనాలకు వ్యతిరేకంగా తీసుకుంటున్న పలు నిర్ణయాలు ఆ పార్టీలో కొనసాగకుండా చేశాయి. కేంద్రం నుంచి వచ్చిన ప్రధాని నుంచి మొదలుకొని కేంద్ర మంత్రుల దాకా ప్రతి ఒక్కరు డబుల్ ఇంజన్ సర్కార్ పేరిట మాటలు చెప్పడమే కానీ ఇప్పటిదాకా ఒక్క పైసా అదనపు సహాయాన్ని తెలంగాణకు చేయలేదు. ఇక్కడ సర్కారు ఉంటేనే నిధులిస్తాము, అప్పటిదాకా తెలంగాణ ఇబ్బందులను పట్టించుకోమన్నట్లు వ్యవహరిస్తున్న తీరు బీజేపీ చెబుతున్న డబుల్ ఇంజన్ సర్కారు మోడల్లోని డొల్లతనానికి అద్దం పడుతోంది. గత రెండున్నర దశాబ్దాల నా రాజకీయ ప్రస్థానంలో బడుగు బలహీన వర్గాల ప్రయోజనాల కోసం కృషి చేశాను. భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత అనేక పర్యాయాలు కేంద్రంలో బలహీన వర్గాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ వచ్చిన ప్రతిసారి ఎంతో ఆశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆశించాను. కానీ ప్రతిసారి నిరాశనే ఎదురైంది. దీంతోపాటు నాతోటి బిసి సోదరులైన నేతన్నల సమాజం భవిష్యత్తును సంక్షోభంలోకి నెట్టేలా, వారికున్న అన్ని సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేశారు. దేశ చరిత్రలో చేనేతపైన తొలిసారి పన్ను వేసిన కేంద్ర నిర్ణయం వెనక్కి తీసుకోవాలని నా పద్మశాలి సొదరులు చేసిన విజ్ఞప్తిని కేంద్రం పెడచెవిన పెట్టి జీఎస్టీని భారీగా పెంచే కుట్రలు చేయడం బాధ కలిగిస్తోంది. ఈ నిర్ణయాలతో పూర్వ నల్లగొండలోని వేలాది నేతన్నల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న స్థానిక నాయకత్వంపైన ఢిల్లీలోని బీజేపీ హైకమాండ్‌కి ఏ మాత్రం పట్టులేదనే విషయం నాకు పార్టీలో చేరిన కొద్ది కాలానికే అర్థమైంది. గత దశాబ్ద కాలంగా తెలంగాణలో ఎలాంటి మత సంఘర్షణలు, ఆందోళనలు లేకుండా కొనసాగుతున్న ప్రశాంతమైన శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టేలా స్థానిక బీజేపీ నాయకులు ఉద్రేకాలు పెంచేలా మాట్లాడినా, బీజేపీ హైకమాండ్ స్పందించకపోవడం నన్ను ఎంతో కలతకు గురిచేసింది. హిందు సమాజం భావోద్వేగాలను రెచ్చగొట్టి, వాటిని రాజకీయాల కోసం ఉపయోగించుకోవడమే పనిగా పెట్టుకున్న బీజేపీ, ఇప్పటిదాకా ఆధునిక భారత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అద్భుతంగా నిర్మించిన యాదాద్రి దేవాలయానికి ఒక్క రూపాయి కూడా సహాయం చేయలేదు. దశాబ్దాల ప్లోరైడ్ రక్కసిని తరిమికొట్టిన తెలంగాణ ప్రభుత్వానికి, మిషన్ భగీరథ కార్యక్రమానికి ఒక్క రూపాయి ఇవ్వకపోగా ఈ 2016లో ప్రస్తుత బీజేపీ అధ్యక్షులు, అప్పటి కేంద్ర ఆరోగ్య మంత్రి జేపి నడ్డా గారు మునుగొడులోని మర్రిగూడలో ప్లోరైడ్ బాధితుల కోసం కట్టిస్తామన్న 300 పడకల ఆసుపత్రికి అతీగతి లేదు. చౌటుప్పల్ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్లోరైడ్ రిసెర్చ్ అండ్ మిటిగేషన్ సెంటర్ కోసం తెలంగాణ ప్రభుత్వం దండుమల్కాపూర్ లో 8.2 ఏకరాల స్ధలం కేటాయించినప్పటికీ కేంద్రం నుంచి ఇప్పటికీ నయాపైసా రాలేదు. దీంతోపాటు ప్లొరైడ్ భాధితులకు అర్దిక సహాయం చేస్తామన్న హమీలపై బీజేపీ స్పందించకపోవడం నల్లగొండ జిల్లా నాయకునిగా తీవ్ర మనస్థాపానికి గురిచేసింది.’ అని బీజేపీపే తీవ్ర విమర్శలు చేశారు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్. ఇదీ చదవండి: ఎన్నికల వేళ ఊహించని ట్విస్ట్.. బీజేపీకి భిక్షమయ్య గుడ్‌బై -
స్టాలిన్‌కు షాక్.. పార్టీకి కీలక నేత గుడ్ బై
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు గట్టి షాక్ తగిలింది. అధికార డీఎంకే పార్టీలో కీలక నేత క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నారు. పార్టీకి రాజీనామా చేస్తూ ముఖ్యమంత్రి స్టాలిన్‌కు మంగళవారం లేఖ రాశారు కేంద్ర మాజీ మంత్రి, డీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రెటరీ సుబ్బలక్ష్మి జగదీశన్. క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు. 1947లో ఎరోడ్ జిల్లాలో జన్మించిన సుబ్బలక్ష్మి జగదీశన్.. ద్రావిడ మున్నెట్ర కజగం(డీఎంకే) పార్టీలో కీలక వ్యక్తిగా ఎదిగారు. తిరుచెంగోడ్ నియోజకవర్గం నుంచి 14వ లోక్‌సభకు ఎన్నికయ్యారు. కేంద్ర ప్రభుత్వంలో సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రిగా 2004-2009 వరకు బాధ్యతలు చేపట్టారు. అంకు ముందు 1977-1980, 1989-1991 వరకు తమిళనాడు ప్రభుత్వంలో పలు మంత్రిత్వ శాఖలను నిర్వర్తించారు. ఇదీ చదవండి: కాంగ్రెస్ అధ్యక్ష బరిలో దిగేది ఆ ఇద్దరే! సోనియా సపోర్ట్ ఎవరికంటే.. -
స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా లేఖ సమర్పించిన రాజగోపాల్ రెడ్డి
-
నేడు స్పీకర్ ను కలవనున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
-
‘కోవిడ్ కూడా ముంచింది’
కొలంబో: శ్రీలంక సంక్షోభానికి ఇతర అంశాలతో పాటు కోవిడ్ మహమ్మారి కూడా ఒక‡ కారణమని మాజీ అధ్యక్షుడు గొటబయా రాజపక్స చెప్పారు. కోవిడ్ వల్ల దేశం చాలా నష్టపోయిందని తాను పంపిన రాజీనామా లేఖలో నిందించారు. కోవిడ్ కారణంగా లాక్డౌన్లు విధించడంతో దేశం ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయిందన్నారు. సంక్షోభం నుంచి దేశాన్ని ఆర్థికంగా గట్టెక్కించేందుకు తన శాయశక్తులా కృషిచేశానన్నారు. సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి అన్ని పార్టీలతో కూడిన ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఎంతో ప్రయత్నం చేశానని తెలిపారు. రాజపక్స రాసిన ఆ లేఖను శనివారం పార్లమెంటు ప్రత్యేక సమావేశంలో సెక్రటరీ జనరల్ ధామ్మిక దస్సనాయకే చదివి వినిపించారు. పార్టీ నాయకుల ఆకాంక్ష మేరకే తాను రాజీనామా చేశానని, భవిష్యత్‌లో దేశానికి ఉత్తమ సేవలు అందించాలని అనుకుంటున్నానని రాజపక్స ఆ లేఖలో రాశారు. తదుపరి అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ షురూ నూతన దేశాధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియను పార్లమెంటు ప్రారంభించింది. జూలై 20న జరగబోయే అధ్యక్ష ఎన్నికకు సంబంధించిన అధికారిక ప్రక్రియను ప్రారంభించడానికి పార్లమెంట్ శనివారం సమావేశమైంది. సమావేశంలో పార్లమెంటు అధ్యక్ష పదవికి ఎన్నికలు 20న జరుగుతాయని, 19న నామినేషన్లు తనకు సమర్పించాలని దస్సనాయకే అన్నారు. ఎక్కువ మంది బరిలో ఉంటే 20న సభలో ఓటింగ్ ఉంటుంది. అధికార పార్టీ తరఫున తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్న రణిల్ విక్రమసింఘె, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సజిత ప్రేమదాస, జేవీపీ నాయకుడు అనుర కుమార దిస్సనాయకె, అధికార ఎస్ఎల్పీపీ చీలికపక్షం నాయకుడు దల్లాస్ అలహప్పెరుమ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. శ్రీలంక జనాభాలో 28శాతం అంటే 60 లక్షల మందికిపైగా ఆహార కొరతని ఎదుర్కొంటున్నారని ఐక్యరాజ్యసమితి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ వెల్లడించింది. రాబోయే రోజుల్లో పరిస్థితులు మరింత దిగజారనున్నాయని హెచ్చరించింది. ఆహారం, మందులు, వంట గ్యాస్, పెట్రోల్ చివరికి టాయిలెట్ పేపర్ దిగుమతి చేసుకోలేని పరిస్థితుల్లోకి దేశం వెళ్లిపోయిందని యూఎన్ తెలిపింది. -
సిద్ధూ రాజీనామాను ఆమోదించని కాంగ్రెస్ అధిష్ఠానం
-
కర్ణాటక సీఎం పదవికి యడియూరప్ప రాజీనామా
-
యడ్డీకి అస్త్ర సన్యాసమే మార్గమా?
సాక్షి, బెంగళూరు: రాష్ట్ర బీజేపీలో రాజకీయాలు ఒక్కరోజులోనే మారిపోయాయి. నిన్నటివరకు సీఎం కుర్చీ నుంచి దిగేది లేదని తెగేసి చెప్పిన యడియూరప్ప స్వరం మార్చారు. అధిష్టానం ఆదేశాలే శిరోధార్యమని గురువారం విధానసౌధలో మీడియా ముందు ప్రకటించడం సంచలనం రేపింది. తదుపరి సీఎంగా ఎవరు ఉండాలో తాను చెప్పలేనన్నారు. పెద్దసంఖ్యలో స్వామీజీలు ఆయన రాజీనామా చేయకూడదని రెండురోజుల నుంచి బెంగళూరులో చర్చలు జరపడం తెలిసిందే. ఈ తరుణంలో యడియూరప్ప అస్త్ర సన్యాస ప్రకటన వెలువడింది. ఆ మంత్రుల మద్దతు.. మరోవైపు యడియూరప్ప మద్దతుదారులైన మంత్రులు, ఎమ్మెల్యేలు ఏం చేయాలా అని వ్యూహ రచనలో నిమగ్నమయ్యారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరి మంత్రులైనవారు రాజీనామా బాట పట్టినట్లు తెలుస్తోంది. వారు యడియూరప్పకు మద్దతుగా నిలిచినట్లు సమాచారం. మంత్రులు కె.సుధాకర్, కె.గోపాలయ్య, భైరతి బసవరాజ్, శివరామ్ హెబ్బార్, బీసీ పాటిల్, ఎస్టీ సోమశేఖర్ తదితరులు సీఎం బీఎస్‌వైతో రహస్య మంతనాలు చేసినట్లు సమాచారం. సీఎం రేసులో లేను: సీటీ బనశంకరి: నేను పార్టీ కార్యకర్తను మాత్రమే. ముఖ్యమంత్రి అభ్యర్థిని కాదు అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి అన్నారు. ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ సీఎం రేసులో లేనని, కానీ తన పేరు మీడియాలో వస్తోందని చెప్పారు. సీఎం నియామకం వెనుక మఠాధీశుల హస్తం ఉందా, లేదా అనేది హైకమాండ్ గమనిస్తుందని అన్నారు. నేను రేసులో ఉన్నా: కత్తి యశవంతపుర: ఎనిమిదిసార్లు ఎమ్మెల్యే అయిన తనకు రాష్ట్రాన్ని పాలించే ఆశ ఉన్నట్లు మంత్రి ఉమేశ్‌కత్తి చెప్పారు. ఆయన బెంగళూరులో విలేకర్లుతో మాట్లాడుతూ నేను యడియూరప్పకు సమానంగా ఉన్నా. నేను సీఎం కావడానికి 15 ఏళ్లు అవకాశం ఉంది. ఏదో ఒక రోజు సీఎం కావటం తథ్యం అన్నారు. సీఎం పదవి నుంచి యడియూరప్పను గౌరవప్రదంగా సాగనంపాలన్నారు. -
ఈటల రాజీనామా ఆమోదం
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాను శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి శనివారం మధ్యాహ్నం ఆమోదించారు. రాజీనామా పత్రం స్పీకర్ ఫార్మాట్లోనే ఉండడంతో ఆమోదానికి ఎలాంటి అడ్డంకులు కలగలేదు. కాగా ఇవాళ ఉదయమే స్పీకర్ ఫార్మాట్లో ఉన్న రాజీనామా పత్రాన్ని అసెంబ్లీ కార్యదర్శికి పంపించారు. అనంతరం గన్‌పార్క్ సందర్శించిన ఈటల తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించారు. కాగా ఈటెల రాజేందర్ జూన్ 14న బీజేపీలో చేరికకు సంబంధించి ఇప్పటికే ముహూర్తం ఖరారైంది. ఈ నెల 14న రాష్ట్రానికి చెందిన బీజేపీ ముఖ్య నేతలతో కలసి ఈటల రాజేందర్ ఢిల్లీకి బయల్దేరి వెళ్తారు. అదేరోజు సాయంత్రం బీజేపీ అగ్రనేతలు అమిత్‌షా, జేపీ నడ్డా, తరుణ్ ఛుగ్ తదితరుల సమక్షంలో ఈటల రాజేందర్ ఆ పార్టీలో చేరుతారు. ఇటీవల రెండు రోజుల పాటు హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించిన ఈటల.. వర్షాల కారణంగా పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చాక హుజూరాబాద్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించేందుకు ఈటల షెడ్యూలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇక, హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ స్థానం ఖాళీ అవ్వటంతో అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు ఆ స్థానానికి సంబంధించి శనివారం మధ్యాహ్నం నోటిఫికేషన్ విడుదల చేశారు. చదవండి: హుజూరాబాద్‌లో జరిగే ఎన్నికలు కురుక్షేత్రమే: ఈటల -
ఉత్తరాఖండ్ సీఎం రాజీనామా
డెహ్రాడూన్: అసమ్మతి వార్తల నేపథ్యంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. ఢిల్లీలో బీజేపీ అగ్రనాయకత్వంతో సమావేశం అనంతరం డెహ్రాడూన్‌కు తిరిగివచ్చిన సీఎం రావత్ రాజ్‌భవన్‌లో గవర్నర్ బేబీ రాణి మౌర్యను కలిసి రాజీనామా పత్రం సమర్పించారు. కొత్త సీఎంను ఎన్నుకునేందుకు బీజేపీ శాసనసభాపక్షం బుధవారం సమావేశమవుతుందని వెల్లడించారు. రాష్ట్ర మంత్రి ధన్సింగ్ రావత్, ఎంపీలు అజయ్‌భట్, అనిల్ బలూనీలు రేసులో ఉన్నప్పటికీ.. ధన్ సింగ్‌కే తదుపరి సీఎం అయ్యే చాన్సుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాజీనామా సమర్పించే ముందు తన అధికార నివాసంలో మంత్రులు ధన్సింగ్, మదన్ కౌశిక్ సహా పలువురు సన్నిహితులతో రావత్ సమావేశమయ్యారు. రాజీనామా అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర పాలనను మరొకరు చేపట్టాలని పార్టీ నిర్ణయించిందని తెలిపారు. మరొకరికి సీఎంగా అవకాశం కల్పించాలన్న పార్టీ నిర్ణయాన్ని శిరసావహిస్తానని, తదుపరి సీఎంకు శుభాకాంక్షలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. అకస్మాత్తుగా సీఎం మార్పునకు కారణమేంటన్న ప్రశ్నకు.. అది ‘పార్టీ నాయకత్వం ఒక్కటిగా తీసుకున్న నిర్ణయం. ఇంకా వివరాలు కావాలంటే ఢిల్లీ వెళ్లి అడగండి’అని సమాధానమిచ్చారు. ముఖ్యమంత్రిగా తాను చేపట్టిన చర్యలను ఈ సందర్భంగా రావత్ మీడియాకు వివరించారు. భర్త తరఫు వారసత్వ ఆస్తిపై భార్యకు కూడా హక్కు కల్పిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్‌ను గుర్తు చేశారు. మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బన్సిధర్ భగత్, ధన్సింగ్ రావత్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అధికార మార్పిడి సజావుగా సాగేందుకు వీలుగా రమణ్ సింగ్, దుష్యంత్ గౌతమ్‌లను పరిశీలకులుగా డెహ్రాడూన్ పంపించాలని బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయించింది. 2000 నవంబర్‌లో ఉత్తర ప్రదేశ్ నుంచి విడిపడి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత ఇప్పటివరకు కాంగ్రెస్ నేత ఎన్డీ తివారీ మినహా ఏ ముఖ్యమంత్రి కూడా పూర్తిగా ఐదేళ్ల పాటు అధికారంలో కొనసాగకపోవడం ఉత్తరాఖండ్ ప్రత్యేకత. 2017, మార్చి 18న రావత్ ఉత్తరాఖండ్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు జరిగిన ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకుగాను 57 సీట్లను బీజేపీ గెలుచుకుంది. సీఎం త్రివేంద్ర సింగ్ రావత్‌పై అసమ్మతి పెరుగుతోందన్న సమాచారంతో పూర్తి వివరాలు తెలుసుకునేందుకు, పార్టీ నేతల నుంచి అభిప్రాయాలను సేకరించేందుకు రమణ్‌సింగ్, దుష్యంత్ గౌతమ్‌లను పార్టీ నాయకత్వం గత శనివారం రాష్ట్రానికి పంపించింది. వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకే.. సీఎం పదవికి రావత్ రాజీనామా చేయడంపై విపక్ష కాంగ్రెస్ స్పందించింది. బీజేపీ ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే రాజీనామా అంశాన్ని తెరపైకి తెచ్చారని విమర్శించింది. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే విషయంలో విఫలం చెందామని ఈ రాజీనామాతో బీజేపీ అంగీకరించిందని ఉత్తరాఖండ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ దేవేంద్ర యాదవ్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలని రాష్ట్రపతిని డిమాండ్ చేశారు. -
పుదుచ్చేరిలో కూలిన కాంగ్రెస్ సర్కార్
సాక్షి, చెన్నై: ఊహించని మలుపులతో రసవత్తరంగా సాగిన పుదుచ్చేరి రాజకీయాలకు తెర పడింది. బల నిరూపణలో నారాయణస్వామి సర్కార్ విఫలమయ్యింది. దాంతో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలింది. సరైనా సంఖ్యబలం లేకపోవడంతో విశ్వాస పరీక్షకు వెళ్లకుండానే సీఎం సభ నుంచి వెళ్లి పోయారు. సభ ప్రారంభమైన తర్వాత సీఎం నారాయణ స్వామి విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిపై ఓటింగ్ జరగకముందే ఆయన తన పార్టీ ఎమ్మెల్యేలతో సభ నుంచి బయటకు వెళ్లి పోయారు. దాంతో విశ్వాసం తీర్మానం వీగిపోయినట్లు స్పీకర్ వీపీ శివకొలందు ప్రకటించారు. బలనిరూపణలో ఓడిపోయిన సీఎం నారాయణ స్వామి రాజీనామా లేఖతో రాజ్‌భవన్‌కు బయల్దేరారు. ఈ సందర్భంగా మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ మీద నిప్పులు చెరిగారు నారాయణ స్వామి. కేంద్రం లెఫ్టినెంట్ గవర్నర్‌తో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నారని ఆరోపించారు. పార్టీని వీడిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వారు ప్రజల ముందుకు ఎలా వెళ్తారని ఆయన ప్రశ్నించారు. 2016 ఎన్నికల్లో ఈ కేంద్ర పాలిత ప్రాంతాన్ని డీఎంకేతో కలిసి కాంగ్రెస్ చేజిక్కించుకుంది. గడిచిన నాలుగున్నరేళ్లు సాఫీగానే సాగింది. ఇలా ఉండగా గతేడాది పార్టీ ఎమ్మెల్యే ధనవేల్ తిగురుబావుటా ఎగురవేశారు. ఇక నాటి నుంచి నారాయణ స్వామికి ఇబ్బందులు మొదలయ్యాయి. 33 మందితో కూడిన పుదుచ్చేరి అసెంబ్లీలో అధికారం చేపట్టేందుకు 17 మంది సభ్యుల మద్దతు అవశ్యం. అయితే, కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత మరొకరు రాజీనామాలు చేస్తూ వెళ్తుండడంతో ప్రభుత్వం మైనారిటీలో ప్రభుత్వం పడింది. ఆరుగురు ఎమ్మెల్యేలు రాజీనామాతో కాంగ్రెస్ సర్కార్ కుప్పకూలింది. ఈ సమయంలో ఊహించని రీతిలో ఆదివారం రాజ్‌భవన్ నియోజకవర్గ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ తన పదవికి రాజీనామా చేయడం, మరికొన్ని గంటల్లోనే మిత్ర పక్షం డీఎంకేకు చెందిన తట్టాన్ చావడి ఎమ్మెల్యే వెంకటేషన్ రాజీనామాతో నారాయణ సర్కారును ఐసీయూలోకి నెట్టినట్టు అయింది. తాజాగా నేడు నిర్వహించని బల పరీక్షలో నారాయణ స్వామి ప్రభుత్వం విఫలం అవడంతో ఆయన రాజీనామా చేశారు. -
టీఆర్ఎస్కు ఝలక్!
సాక్షి, కంటోన్మెంట్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఉపాధ్యక్షుడు రామకృష్ణ టీఆర్ఎస్ అధిష్టానానికి ఝలక్ ఇచ్చారు. ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సిందిగా అధిష్టానం ఆదేశించగా, ఆయన ఏకంగా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తద్వారా ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేయబోనంటూ స్పష్టం చేశారు. దీంతో కంటోన్మెంట్ బోర్డు సభ్యులంతా తమ పార్టీలోనే ఉన్నారంటూ చెప్పుకుంటూ వచ్చిన టీఆర్ఎస్ పెద్దలకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచనల మేరకు ఈ నెల 20వ తేదీ వరకు రామకృష్ణ బోర్డు ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సిందిగా రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పత్రికా ముఖంగా వెల్లడించారు. అయినప్పటికీ సదరు ఆదేశాలను బేఖాతరు చేస్తూ రామకృష్ణ ఉపాధ్యక్ష పదవికి బదులుగా, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీనికి తోడు సోమ వారం బోర్డు కార్యాలయంలో తన అధ్యక్షతన అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయడం సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. తోటి సభ్యులతో పొసగకనే..: రామకృష్ణ స్వతంత్ర అభ్యర్థిగా కంటోన్మెంట్ బోర్డు సభ్యుడిగా ఎన్నికైన తనను టీఆర్ఎస్ పెద్దలు ఆదరించి, ఉపాధ్యక్ష పదవి కట్టబెట్టారని రామకృష్ణ అన్నారు. అయితే తోటి బోర్డు సభ్యుల్లో కొందరితో పొసగని కారణంగానే తాను టీఆర్ఎస్కు దూరం కావాల్సి వస్తోందని రాజీనామా ప్రకటన సందర్భంగా పేర్కొన్నారు. ఇంతకాలం తనకు సహకరించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, ఎమ్మెల్యే సాయన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. ఒకవేళ అధిష్టానం నుంచి బుజ్జగింపులు వచ్చినా తన నిర్ణయంలో మార్పు ఉండకపోవచ్చన్నారు. వార్డు పరిధిలోని కార్యకర్తలు, తన అభిమానులతో చర్చించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. అవిశ్వాసం తప్పకపోవచ్చు బోర్డు ఉపాధ్యక్షుడు రామకృష్ణ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో, మిగిలిన ఏడుగురు టీఆర్ఎస్ బోర్డు సభ్యులు ఆయనపై అవిశ్వాస తీర్మానం పెట్టడం ఖాయమని తెలుస్తోంది. ఈ మేరకు సోమవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో భేటీ అయ్యాక, నేరుగా బోర్డు అధ్యక్షుడు అభిజిత్ చంద్రను కలిసి రాజీనామా సమర్పించనున్నట్లు బోర్డు సభ్యుడొకరు వెల్లడించారు. అధిష్టానం ఆదేశాలకు అనుగుణంగానే తాము నడుచుకుంటామని ఇంతకాలం రామకృష్ణకు మద్దతుదారులుగా నిలిచిన బోర్డు సభ్యులు సైతం పేర్కొంటూ ఉండటం గమనార్హం. -
కడపలో టీడీపీకి మరో బిగ్‌షాక్
సాక్షి, వైఎస్సార్ : జిల్లాలో టీడీపీకి మరో గట్టిషాక్ తగిలింది. కడపకు చెందిన టీడీపీ సీనియర్ మైనార్టీ నేత, మాజీ రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి సుబాన్ బాషా శుక్రవారం పార్టీకి రాజీనామా చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్‌ల తీరు నచ్చకనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం రాష్ట్ర డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, కడప పార్లమెంట్ అధ్యక్షుడు సురేశ్ బాబు ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సుబాన్ బాషాతో తరలివచ్చిన ఆయన అనుచరులకు అంజద్ బాషా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పటికే టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి ఆ పార్టీని వీడి తన కుటుంబ సభ్యులు, పలువురు నేతలు, కార్యకర్తలతో బుధవారం వైఎస్సార్సీపీలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో పాటు టీడీపీ పులివెందుల నియోజకవర్గ ఇన్చార్జ్గా ఉన్న సతీష్ రెడ్డి కూడా వైఎస్సార్సీపీ కండువా కప్పుకున్నారు. దీంతో కడప జిల్లాలో టీడీపీ దాదాపు ఖాళీ అయిన పరిస్థితి కనబడుతోంది. (టీడీపీకి సతీష్‌రెడ్డి రాజీనామా) (బాబు మాకు అన్యాయం చేశాడు: రామసుబ్బారెడ్డి) -
జస్టిస్ ధర్మాధికారి రాజీనామా
ముంబై: బొంబాయి హైకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తుల్లో రెండో వారైన జస్టిస్ సత్యరంజన్ ధర్మాధికారి రాజీనామా చేశారు. కుటుంబపరమైన, వ్యక్తిగత కారణాల వల్ల ముంబైకి వెలుపల తాను విధులు నిర్వర్తించలేనని ఆయన పేర్కొన్నారు. పదోన్నతిపై తనను వేరే రాష్ట్ర హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమించినప్పటికీ.. ముంబై నుంచి బయటకు వెళ్లేందుకు తాను సిద్ధంగా లేనని తెలిపారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు పంపించానన్నారు. ‘పూర్తిగా వ్యక్తిగత, కుటుంబ కారణాలతో మాత్రమే రాజీనామా చేస్తున్నా. ముంబైని విడిచివెళ్లడం నాకు ఇష్టం లేదు. బొంబాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నన్ను నియమించేందుకు వారు సిద్ధంగా లేరు’ అని శుక్రవారం ఆయన మీడియాతో వ్యాఖ్యానించారు. ముంబైలో తాను నిర్వర్తించాల్సిన కొన్ని వ్యక్తిగత బాధ్యతలున్నాయన్నారు. 2003లో జస్టిస్ ధర్మాధికారి బొంబాయి హైకోర్టులో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. -
రాజీనామా చేసిన వర్ల రామయ్య
సాక్షి, విజయవాడ: ఎట్టకేలకు టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఆర్టీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి శనివారం పంపించారు. కాగా ప్రభుత్వం మారి అయిదు నెలలు తర్వాత వర్ల రామయ్య తన పదవికి రిజైన్ చేయడం గమనార్హం. ఆర్టీసీ నిబంధనల ప్రకారం చైర్మన్ పదవీ కాలం కేవలం ఏడాది మాత్రమే ఉంటుంది. కానీ వర్ల రామయ్య పదవీ కాలం ఏప్రిల్ 24, 2019లో ముగిసినా ఆయన మాత్రం పదవి నుంచి వైదొలగలేదు. దీంతో ఏపీఎస్ ఆర్టీసీ 1950 చట్టం సెక్షన్-8లోని ఉప నిబంధన-2 ప్రకారం నెల రోజుల గడువిస్తూ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు సెప్టెంబర్‌లో నోటీసు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నోటీసులు అందుకున్న ఆయన నెల రోజుల తర్వాత ఆర్టీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. -
‘నేను రాజీనామా చేయలేదు’
న్యూఢిల్లీ: తాను రాజీనామా చేయలేదని హరియాణా బీజేపీ అధ్యక్షుడు సుభాష్ బారాలా తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించినమేర ఫలితాలు రాబట్టడంలో విఫలమవడంతో నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్టు వస్తున్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి సీట్లు గణనీయంగా తగ్గాయి. ఈ నేపథ్యంలో సుభాష్ బారాలాపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆయన రాజీనామా చేశారని వార్తలు వచ్చాయి. మరోవైపు అమిత్ షా ఇప్పటికే.. హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌ను ఢిల్లీకి రప్పించి, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై చర్చలు జరిపారు. 75 సీట్లు కచ్చితంగా గెలుస్తామనే నినాదంతో ముందుకెళ్లిన బీజేపీ, ఈసారి లెక్క తప్పింది. బీజేపీకి చెందిన ఏడుగురు మంత్రులు వెనుకంజలో ఉండడంతో.. ప్రస్తుతం మనోహర్ లాల్ ఖత్తర్ ప్రభుత్వం చిక్కుల్లో ఉంది. సుభాష్ పోటీ చేసిన ఫతేహబాద్ జిల్లాలోని తోహన స్థానంలోనూ వెనుకంజలో ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ వచ్చి ఎన్నికల ప్రచారం చేసినా బీజేపీ స్పష్టమైన మెజార్టీ సాధించలేకపోయింది. అక్కడ దుష్యంత్ చౌతాలా నేతృత్వం వహిస్తున్న జన్నాయక్ జనతా పార్టీ ముందంజలో ఉంది. హరియాణా అసెంబ్లీలో మొత్తం 90 సీట్లు ఉండగా.. ప్రభుత్వ ఏర్పాటుకు 46 సీట్లు గెలవాలి. తాజా ఫలితాల్లో బీజేపీ 38 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 33 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జన్ నాయక్ జనతా పార్టీ (జేజేపీ) 10 సీట్లలో విజయం సాధించింది. ప్రభుత్వ ఏర్పాటులో జేజేపీ కీలకంగా మారింది. -
రాహుల్ బాటలో మరో కీలకనేత గుడ్‌బై
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ చీఫ్‌గా రాహుల్ గాంధీ వైదొలిగిన మరుసటి రోజు అసోం కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి పదవికి రాజీనామా చేస్తున్నట్టు మరో కీలక నేత హరీష్ రావత్ ప్రకటించారు. పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ పదవి నుంచి తప్పుకుంటున్నట్టు అసోంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జిగా వ్యవహరించిన హరీష్ రావత్ పేర్కొన్నారు. ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రిగా హరీష్ రావత్ పనిచేసిన సంగతి తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల్లో అసోంలోని లోక్‌సభ ఎన్నికల్లో 14 లోక్‌సభ స్థానాలకు గాను, కేవలం మూడింటిని మాత్రమే కాంగ్రెస్ గెలుచుకొంది. దీంతో హరీష్ రావత్ అస్సాం ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేయనున్నట్లు గురువారం ట్విటర్ వేదికగా వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘోరపరాజయానికి తానే బాధ్యుడినని పేర్కొంటూ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్ గురువారం పేర్కొన్న సంగతి తెలిసిందే. తన రాజీనామాను తక్షణమే ఆమోదించి తదుపరి అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ చేపట్టాలని ఆయన పార్టీ శ్రేణులకు రాసిన నాలుగు పేజీల బహిరంగ లేఖలో పేర్కొన్నారు. మరోవైపు నూతన అధ్యక్షుడి ఎంపిక చేపట్టేవరకూ పార్టీ తాత్కాలిక చీఫ్‌గా మోతీలాల్ వోరాను కాంగ్రెస్ పార్టీ నియమించింది. -
‘రాజీనామా స్పీకర్‌కు పంపలేదు.. సీఎంకే పంపాను’
సాక్షి, అమరావతి : నియోజకవర్గానికి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందంటూ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, బీజేపీ నేత పైడికొండల మాణిక్యాల రావు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆయన దీక్ష కూడా చేపట్టారు. బుధవారం ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ఆయన హాజరయ్యారు. అనంతరం మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు. రాజీనామా పత్రాలను సీఎం చంద్రబాబుకు మాత్రమే పంపానని, స్పీకర్‌కు పంపలేదని స్పష్టం చేశారు. ‘రాజీనామా ఆమోదించాల్సిన బాధ్యత చంద్రబాబుపైనే ఉంది. నియోజకవర్గానికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వాన్ని నిలదీసేందుకే వచ్చాను. నా దీక్ష నియోకవర్గంలోనే కాదు. జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది’ అని చెప్పుకొచ్చారు. -
కాంగ్రెస్‌కు ఝలక్!
హైదరాబాద్: బస్సు యాత్ర కమిటీ కన్వీనర్ పదవికి ఆదిలాబాద్ డీసీసీ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి రాజీనామా చేసినట్లు తెలిపారు. విలేకరులతో మాట్లాడుతూ.. బస్సు యాత్ర బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. ఆ లెటర్‌ను పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి పంపించామని చెప్పారు. ఉత్తర తెలంగాణలో 4 జిల్లాల్లో రెండు సీట్లు మాత్రమే గెలిచామని, వచ్చే ఎన్నికల్లో ఆదిలాబాద్‌లో అత్యధిక సీట్లు గెలిపించుకునేందుకే రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. నాయకులను సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఉందని వ్యాఖ్యానించారు. ఉత్తర తెలంగాణలో పార్టీ చాలా బలహీనంగా ఉందని, బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని ప్రాంతాలను ఏకం చేయడంలో పీసీసీ సమన్వయలోపం ఉన్నట్లు భావిస్తున్నానని అభిప్రాయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వచ్చినపుడు ఉన్న ఊపును కొనసాగించడం లేదని విమర్శించారు.