మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి(పాత చిత్రం)
హైదరాబాద్: బస్సు యాత్ర కమిటీ కన్వీనర్ పదవికి ఆదిలాబాద్ డీసీసీ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి రాజీనామా చేసినట్లు తెలిపారు. విలేకరులతో మాట్లాడుతూ.. బస్సు యాత్ర బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. ఆ లెటర్‌ను పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి పంపించామని చెప్పారు. ఉత్తర తెలంగాణలో 4 జిల్లాల్లో రెండు సీట్లు మాత్రమే గెలిచామని, వచ్చే ఎన్నికల్లో ఆదిలాబాద్‌లో అత్యధిక సీట్లు గెలిపించుకునేందుకే రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.
నాయకులను సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఉందని వ్యాఖ్యానించారు. ఉత్తర తెలంగాణలో పార్టీ చాలా బలహీనంగా ఉందని, బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని ప్రాంతాలను ఏకం చేయడంలో పీసీసీ సమన్వయలోపం ఉన్నట్లు భావిస్తున్నానని అభిప్రాయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వచ్చినపుడు ఉన్న ఊపును కొనసాగించడం లేదని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment