సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్షం మాట్లాడాలి.. ఏదో ఒకటి మాట్లాడకపోతే ప్రతిపక్షం ఎలా అవుతుంది? అంటూ బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సెటైరికల్‌గా కౌంటర్ ఇచ్చారు. ‘‘నేను పేల్చిన బాంబు ఇంకా తుస్సు కాలేదు.. రెండు మూడు రోజుల్లో ఆ బాంబు ఏంటో మీరే చూస్తారు. వచ్చే నాలుగేండ్ల ఒక నెల సీఎంగా రేవంత్‌రెడ్డినే ఉంటారు.’’ అని పొంగులేటి స్పష్టం చేశారు. త్వరలోనే గ్రామ సర్పంచ్‌లు అందుబాటులోకి వస్తారు. సంక్రాంతి లోపు సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయని మంత్రి అన్నారు.
ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా గ్రీన్ చానెల్‌లో ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ జరుగుతుంది. లబ్ధిదారుని ఖాతాలోకి నేరుగా నిధుల జమ చేస్తాం. ప్రారంభంలో లక్ష ఇస్తారు. ఫిల్లర్స్ 1.25 లక్షలు, స్లాబ్ 1.75 లక్షలు ఇళ్లు పూర్తి అయ్యాక 1లక్ష ఇస్తారు. ఇందిరమ్మ ఇళ్లు లబ్ధి కోసం రేషన్ కార్డు తప్పనిసరి కాదు. ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ గురించి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌తో మాట్లాడా. కేంద్రం నుంచి పూర్తిస్థాయిలో సహకారం అందుతుందనే సంకేతాలు ఇప్పటి వరకు ఉంది.’’ అని పొంగులేటి చెప్పారు.
‘‘కేంద్రం నుంచి నిధులు వస్తే మంచిది.. లేకపోతే నేను ఇండ్లను కట్టిస్తాను. ప్రారంభానికి కేంద్ర మంత్రులను పిలుస్తాం.. నేన, సీఎం వెళ్లి కేంద్ర మంత్రిని ఆహ్వానిస్తాం. వచ్చే నాలుగేళ్లు 20 లక్షలు ఇండ్లను టార్గెట్ పెట్టుకున్నాం’’ అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.
ఇదీ చదవండి: మా దగ్గర ‘బీఆర్‌ఎస్’ జాతకాలు.. అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment