Maheshwar Reddy
-
రెండు రోజుల్లో సర్కార్ అవినీతి స్కాం బయటపెడతా: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రూ.వేల కోట్ల కుంభకోణాలు జరుగుతున్నాయని.. 2 రోజుల్లో ప్రభుత్వ అవినీతి కుంభకోణాన్ని బయటపడపెడతానంటూ బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడుతూ, కుంభకోణంలో మంత్రుల హస్తం ఉందని.. పూర్తి అధారాలతో కుంభకోణాన్ని బయటపెడతానన్నారు.‘‘రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయింది. అయినా ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. కనీసం కొత్త సంవత్సరం అయినా గుర్తు తెచ్చుకుని నెరవేర్చాలి. ఏడాది పాటు ప్రజలను ఇబ్బందులు పెట్టి కనీసం ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చడంలేదు. ఈ దుర్మార్గాలను ఇకనైనా వీడి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. గత ఏడాది ఎగవేతల నామ సంవత్సరంగా ముగిసింది’’ అని మహేశ్వర్‌రెడ్డి చెప్పారు.గత ఖరీఫ్‌లో రైతు భరోసా ఇవ్వలేదు.. ఇప్పుడు రబీ సీజన్లో అయినా ఇస్తారా?. మాయమాటలతో మోసం చేయడం తప్పా.. వారికి మంచి చేసే ఆలోచన కాంగ్రెస్‌కు ఉందా?. ఉప ముఖ్యమంత్రి భట్టి స్వయంగా రైతు కూలీలకు ఏడాదికి 12 వేలు ఇస్తామని మాట ఇచ్చారు.. ఆ మాట ఇచ్చి డిసెంబర్ 28తోనే ఏడాది దాటిపోయింది. వారికి ఇవ్వకుండా ఆయన్ను అడ్డుకునేది ఎవరు?. లేదా ఆ డబ్బులు మరెవరికైనా కాంట్రాక్టర్లకు ఇచ్చేందుకు దాచారా?. మంత్రి పొంగులేటి కూడా ఇదే మాట ఇచ్చారు.. ఏమైంది?’’ అంటూ మహేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు.‘‘రైతు భరోసాపై కమిటీ ఏర్పాటు చేసి 15 రోజుల్లో నివేదిక ఇస్తామన్నారు.. ఈ కమిటీ ఏర్పడి 4, 5 నెలలు దాటింది. అయినా దానికి సంబంధించిన విధి విధానాలు ఎందుకు ఇవ్వలేకపోయారు. 4వ తేదీన జరిగే కేబినెట్ భేటీలో రైతు భరోసాపై చర్చించి నిర్ణయం తీసుకోవాలి. ఎప్పటిలోగా ఇస్తారో తేదీ కూడా అదే రోజు ప్రకటించాలి. 15 వేల చొప్పున ఇవ్వాలంటే ఒక్క సీజన్‌కు 23 వేల కోట్లు చెల్లించాల్సి ఉంది. రెండు సీజన్లకు కలిపి 46 వేల కోట్లు బకాయి ఉంది. కానీ సర్కార్ బడ్జెట్లో 15 వేల కోట్లు మాత్రమే కేటాయించింది. మిగిలినవి ఎలా ఇస్తారో కాంగ్రెస్ సర్కార్ సమాధానం చెప్పాలి’ అని మహేశ్వర్‌రెడ్డి నిలదీశారు. -
సైబర్.. సైరన్..!
పెరుగుతున్న సాంకేతికతతో పాటు సైబర్ నేరాలు(Cyber Crime) సైతం పెచ్చుమీరుతున్నాయి. రోజుకొక మోసంతో కేటుగాళ్లు కోట్లలో కొళ్లగొడుతున్నారు. ఒకరికి ఒకరు కనిపించకుండా, ముఖ పరిచయం లేకపోయినా లింక్ సిస్టమ్‌లా వీళ్లు పనిచేస్తున్నారు. సామాన్యుల నుంచి సంపన్న వర్గాలు, యువతీ, యువకుల నుంచి వృద్ధుల వరకు అమాయక ప్రజలంతా వీరి బాధితులే. సెల్లో లింకే కదా అని క్లిక్ చేస్తే మిమ్మల్ని బుక్ చేస్తారు. ఇలాంటి మోసాలతో రూ.లక్షలు పోగొట్టుకుని పరువు సమస్యతో పోలీసులకు ఫిర్యాదులివ్వలేక అనేకమంది సతమతం అవుతున్నారు. ఈ సైబర్ నేరాలపై అవగాహనకు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. – శ్రీకాకుళం క్రైమ్అందమైన వల.. చిక్కారో విలవిలమనుషులను కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేసే పద్ధతి ఎక్స్‌టార్సన్. అలాగే అందమైన అమ్మాయిలను ఎరవేసి, తర్వాత బెదిరించి డబ్బులు దోచుకోవడం సెక్స్‌టార్సన్. వాట్సాప్, ఫేస్బుక్, టిండర్ (డేటింగ్ యాప్), ఇన్‌స్ట్రాగామ్ (Instagram) వంటి సోషల్ మీడియా యాప్‌ల ద్వారా మనలో ఉండే బలహీనతలను క్యాష్ చేసుకుని సైబర్ నేరగాళ్లు సెక్స్‌టార్సన్ పద్ధతిలో మోసాలు చేస్తుంటారు. వీరు బీహార్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) వంటి రాష్ట్రాల నుంచి నెట్వర్క్ నడుపుతున్నట్లు దర్యాప్తు విభాగాలు చెబుతున్నాయి. సంపన్న వర్గాలకు చెందిన వృద్ధులు, యువత అధికంగా ఈ మాయలో పడుతుండటం విశేషం. వీరితో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు, వ్యాపారులు, రాజకీయవేత్తలు సైతం వందల సంఖ్యలో మోసపోతున్నారు.ఎలా చేస్తారంటే.. సైబర్ కేటుగాళ్లు అమ్మాయి పేరుతో ఉన్న నకిలీ ఫేస్బుక్ (ఇతర యాప్స్) ఐడీని క్రియేట్ చేసి సెలెక్ట్ చేసుకున్న వ్యక్తికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడతారు. యాక్సెప్ట్ చేయగానే ముందుగా చాటింగ్.. అలా నంబర్లు ఇచ్చిపుచ్చుకోవడం.. ఆ తర్వాత వాట్సాప్‌లో వ్యక్తిగత సమాచారం (వ్యక్తిది) తెలుసుకుని అడల్ట్ కంటెంట్, న్యూడ్ చాట్ చేసుకునేవరకు కథ తీసుకెళ్తారు. అనంతరం చాట్ నుంచి వీడియో కాల్స్‌లోకి లాగి అవతలివైపు నుంచి రికార్డ్ చేసిన ఓ న్యూడ్ వీడియోను వాట్సాప్ కాల్లో లైవ్లాగా చిత్రీకరించి ఎదుటి వ్యక్తిని న్యూడ్‌చాట్‌లోకి తీసుకొస్తారు. వెంటనే మొత్తం కాల్ రికార్డ్ చేసి అదే వ్యక్తి వాట్సాప్‌కు వీడియోను షేర్ చేసి డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేస్తారు. లేదంటే యూట్యూబ్‌లో పెడతామని బెదిరిస్తారు.అప్రమత్తతే ఆయుధం » సైబర్ మోసానికి గురయ్యేవారు గోల్డెన్ అవర్‌లో తక్షణమే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలి. » www.cybercrime.gov.in పోర్టల్‌లో ఆన్లైన్ ఫిర్యాదివ్వాలి. సంబంధిత బ్యాంకు ప్రతినిధులను సంప్రదించి ఖాతాలను ఫ్రీజ్ చేయించాలి. పరిధి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలి. » ఎవరైనా బ్యాంకులో మ్యూల్ ఖాతా తమకు తెలియకుండా వేరే వ్యక్తులు తెరవాలనుకుంటే వెంటనే 1930 సైబర్ సెల్‌కు ఫిర్యాదు చేయాలి. అంతేకాక ఆర్టీజీఎస్ ద్వారా రూ.2 లక్షల కంటే ఎక్కువ మొత్తాన్ని సేవింగ్స్ అకౌంట్ నుంచి కరెంట్ అకౌంట్‌కు బదిలీ చేస్తే ఖాతాదారులను అప్రమత్తం చేయాలి. ఈ మోసాలు పరిశీలిస్తే.. » శ్రీకాకుళం జిల్లాలో ఓ ప్రముఖ కుటుంబానికి చెందిన వ్యక్తి తనకున్న బలహీనతతో ఫేస్బుక్లో అమ్మా యి పరిచయం కాగానే మాటామాటా కలిపాడు. ఆమె కూడా వీడియో కాల్ మాట్లాడటం, న్యూడ్ గా కనిపించడంతో తనూ న్యూడ్‌గా మారి కొంతకాలం ఆనందం పొందాడు. అక్కడికి కొద్దిరో జులకు ఆ అమ్మాయి న్యూడ్ వీడియోలు బయటపెడతానంటూ భయపెట్టి రూ.5 లక్షలు కావా లని బ్లాక్ మెయిల్ చేసింది. బయట తెలిస్తే పరు వు పోతుందని చేసేదేమీలేక డబ్బులు వేసేశాడు. » జిల్లాలోని ఒక ప్రముఖ వైద్యుడు తెలియని లింక్ క్లిక్ చేయడంతో హాయ్ అని ఓ అమ్మాయి వాట్సాప్ మెసేజ్ పెట్టింది. రిప్లయ్ ఇవ్వడంతో న్యూడ్ వీడియో కాల్స్ తరచూ చేసేది. అక్కడికి కొద్దిరోజులకు వీడియోలు బయటపెడతామంటూ, డిజిటల్ అరెస్టు అవుతావంటూ ఢిల్లీ పోలీస్ సెటప్‌తో కొందరు వ్యక్తులు స్కైప్కాల్లో దర్శనమవ్వడంతో వాళ్లడిగిన రూ.18.50 లక్షలు చదివించేశారు. » శ్రీకాకుళం రూరల్ మండలంలో సంపన్న వర్గానికి చెందిన ఓ వృద్ధుడు అశ్లీల వీడియోలు చూసే అలవాటుండడంతో అందులో ఓ మెసేజ్ రావడంతో ఆన్సర్ చేశాడు. ఓ ఇద్దరు యువతుల ముఖాలతో ఉన్న పురుషులు వీడియో కాల్లో కనిపించి వృద్ధునికి మత్తెక్కే మాటలతో మైమరిపించగా వృద్ధుడు న్యూడ్‌గా మారాడు. తక్షణమే ఆ వీడియోలు వృద్ధునికి పంపించి రూ.10 లక్షలు డిమాండ్ చేయగా. రూ.6 లక్షల వరకు సమర్పించేశాడు. » ఇదే తరహాలో ఏఐ సాయంతో జిల్లాలో ఓ మహిళా అధికారికి మోసం చేసే క్రమంలో ఆమె అప్రమత్తం అవ్వడంతో త్రుటిలో సైబర్ ఉచ్చునుంచి తప్పించుకున్నారు. జాగ్రత్తగా ఉండాలి ఏ బ్యాంకు కూడా ఆన్లైన్ కేవైసీ వివరాలు అడగదు. అపరిచితులు పంపే లింక్‌లు ఓపెన్ చేయరాదు. వాళ్లు మన ఫోన్‌ను హ్యాక్ చేసే సమయంలో మన అకౌంట్లో డబ్బులు ఎంత ఉంటే అంత మాయం చేస్తారు. డబ్బులు లేకపోతే ఏమీ చేయలేరు. ఎప్పటికప్పుడు మన ఖాతాను పరిశీలిస్తుండాలి. సెక్స్‌టార్షన్‌కు గురయ్యేవారు తామేదో తప్పు చేసినట్లు భావించి భయపడి పరువు సమస్యతో ఫిర్యాదు చేయకపోతే సైబర్ నేరగాళ్లకు మీరే బలమైన ఆయుధాన్ని ఇచ్చిన వారవుతారు. తక్షణమే ఫిర్యాదు చేస్తే ఆపద నుంచి బయటపడవచ్చు. – కేవీ మహేశ్వరరెడ్డి, ఎస్పీ, శ్రీకాకుళం జిల్లా -
వైఎస్సార్సీపీ నేతపై టీడీపీ నేతల దౌర్జన్యం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: నీటి సంఘాల ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. పులివెందుల నియోజకవర్గం వేముల మండలంలోని గొల్లల గూడూరు గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నేత ఈసీ మహేశ్వర్ రెడ్డిపై దాడికి పాల్పడ్డారు. నీటి సంఘాల ఎన్నికలలో పోటీ చేసేందుకు తాహసిల్దార్ కార్యాలయంలో నీటి పన్ను కట్టేందుకు వెళ్లగా టీడీపీ నేతలు దౌర్జన్యం చేశారు. పన్ను కట్టేందుకు వెళ్లిన మహేశ్వర్ రెడ్డిని టీడీపీ నేత పేర్ల పార్థసారథి రెడ్డి, అతని అనుచరులు అడ్డుకుని బయటకు పంపించారు. మహేశ్వర్ రెడ్డి చేతిలోని కాగితాలను కూడా లాక్కున్న పార్థసారధిరెడ్డి చించివేశారు.అధికారులు సహకరించడం లేదు: వైఎస్సార్సీపీ ఫిర్యాదుజమ్మలమడుగు ఆర్డీవో, డీఎస్పీని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు గురువారం కలిశారు. ఈ నెల 14న జరగనున్న నీటి సంఘాల ఎన్నికలకు అధికారులు సహకరించడం లేదని ఫిర్యాదు చేశారు. వైఎస్సార్సీపీ నేతలకు సంబంధించిన నో డ్యూ సర్టిఫికెట్లను ఇవ్వకుండా కూటమి వర్గీయులు అడ్డుకుంటున్నారని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి అన్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే నీటి సంఘాల ఎన్నికల్లో లాండ్ ఆర్డర్ అదుపు తప్పే పరిస్థితి ఉంటుందని ఆయన అన్నారు.కాగా, ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న గ్రామాల్లోని సాగునీటి సంఘం ఎన్నికలు ఈ నెల 14న నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. దీనికి సంబంధించి నోటీఫికేషన్‌ను ఆయా ఎన్నికల నిర్వహణ కేంద్రాల వద్ద ప్రదర్శించారు. మండల పరిధిలో 10 సాగునీటి సంఘాలు ఉన్నాయి. కెనాల్ పరిధిలోని దువ్వూరు, చాపాడు, మైదుకూరు, ఖాజీపేట మండలాలతో సంబంధం ఉన్న మండలంలోని నీటి సంఘాలకు సైతం ఒకే రోజున ఎన్నిక నిర్వహించనున్నారు.దువ్వూరు కేసీ కెనాల్ పరిధిలోని 62 అన్నశా్రస్తులపల్లె, 63 మడూరు, 64 చియ్యపాడు, మైదుకూరు కేసీ కెనాల్ పరిధిలో 67 మడూరు, 68 ఉప్పరపల్లె, 69 అనంతపురం, 70 అనంతపురం, 71 సోమాపురం, 74 అల్లాడుపల్లె, 75 మిడుతూరు సాగునీటి సంఘాలు ఉన్నాయి. వీటన్నిటిలో ఒక సంఘానికి ఒక్కో చైర్మన్‌ను ఓటర్లు ఎన్నుకుంటారని, సాగునీటి సంఘాల చైర్మన్లు అందరూ మండల చైర్మన్ ఎన్నుకోనున్నారు.63వ సంఘానికి అన్నవరం జెడ్పీ హైసూ్కల్లో, 64 సంఘానికి చియ్యపాడు జెడ్పీ హైసూ్కల్లో, 67 సంఘానికి మడూరు గ్రామ సచివాలయం, 69వ సంఘానికి చాపాడు ఎంపీడీఓ కార్యాలయం, 70వ సంఘానికి చాపాడు జెడ్పీహైసూ్కల్, 71వ సంఘానికి సోమాపురం గ్రామ సచివాలయం, 74వ సంఘానికి లక్ష్మీపేట జెడ్పీ హైస్కూల్లో ఎన్నిక నిర్వహిస్తారు. 68వ సంఘానికి ప్రొద్దుటూరులో, 75వ సంఘానికి ఖాజీపేట, 62వ సంఘానికి దువ్వూరు మండలంలో ఎన్నిక చేపట్టనున్నారు. -
రెండు మూడ్రోజుల్లో ఆ బాంబు పేలుతుంది: పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్షం మాట్లాడాలి.. ఏదో ఒకటి మాట్లాడకపోతే ప్రతిపక్షం ఎలా అవుతుంది? అంటూ బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సెటైరికల్‌గా కౌంటర్ ఇచ్చారు. ‘‘నేను పేల్చిన బాంబు ఇంకా తుస్సు కాలేదు.. రెండు మూడు రోజుల్లో ఆ బాంబు ఏంటో మీరే చూస్తారు. వచ్చే నాలుగేండ్ల ఒక నెల సీఎంగా రేవంత్‌రెడ్డినే ఉంటారు.’’ అని పొంగులేటి స్పష్టం చేశారు. త్వరలోనే గ్రామ సర్పంచ్‌లు అందుబాటులోకి వస్తారు. సంక్రాంతి లోపు సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయని మంత్రి అన్నారు.ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా గ్రీన్ చానెల్లో ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ జరుగుతుంది. లబ్ధిదారుని ఖాతాలోకి నేరుగా నిధుల జమ చేస్తాం. ప్రారంభంలో లక్ష ఇస్తారు. ఫిల్లర్స్ 1.25 లక్షలు, స్లాబ్ 1.75 లక్షలు ఇళ్లు పూర్తి అయ్యాక 1లక్ష ఇస్తారు. ఇందిరమ్మ ఇళ్లు లబ్ధి కోసం రేషన్ కార్డు తప్పనిసరి కాదు. ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ గురించి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌తో మాట్లాడా. కేంద్రం నుంచి పూర్తిస్థాయిలో సహకారం అందుతుందనే సంకేతాలు ఇప్పటి వరకు ఉంది.’’ అని పొంగులేటి చెప్పారు.‘‘కేంద్రం నుంచి నిధులు వస్తే మంచిది.. లేకపోతే నేను ఇండ్లను కట్టిస్తాను. ప్రారంభానికి కేంద్ర మంత్రులను పిలుస్తాం.. నేన, సీఎం వెళ్లి కేంద్ర మంత్రిని ఆహ్వానిస్తాం. వచ్చే నాలుగేళ్లు 20 లక్షలు ఇండ్లను టార్గెట్ పెట్టుకున్నాం’’ అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.ఇదీ చదవండి: మా దగ్గర ‘బీఆర్ఎస్’ జాతకాలు.. అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు -
రేవంత్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డికి హనీమూన్ పీరియడ్ ముగిసి కౌంట్‌డౌన్ మొదలైందని... వచ్చే ఏడాది జూన్–డిసెంబర్ల మధ్య ఆయన పదవి పోవడం ఖాయమని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌కు ప్రత్యామ్నాయం కోసం కాంగ్రెస్ అధిష్టానం చూస్తోందని..కొత్త సీఎంగా ఎవరిని పెట్టాలనే దానిపై రహస్యంగా ఓ కమిటీ అన్వేషణ సాగిస్తోందన్నారు. సీఎం రేసులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి ఉన్నారని చెప్పారు. మూసీ ప్రాజెక్ట్ వ్యయం ఒకేసారి రూ.50 వేల కోట్ల నుంచి రూ.లక్షన్నర కోట్లకు పెంచి భారీగా అవినీతికి ప్లాన్ చేశారని, ఏకపక్షంగా సొంత ఎజెండాతో సెలక్షన్, కరప్షన్, బ్లాక్‌మెయిలింగ్ వంటి వాటికి దిగడం దీనికి కారణమని ఆరోపించారు.మూసీ, హైడ్రా కూల్చివేతలతో పేదల్లో కాంగ్రెస్ అభాసుపాలు కావాల్సి వస్తోందని హైకమాండ్ ఆందోళన చెందుతోందన్నారు. శుక్రవారం మహేశ్వర్‌రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. కొందరు సీనియర్ మంత్రులు హైడ్రా, మూసీ, ల్యాండ్ సెటిల్మెంట్ల మీద రేవంత్‌పై హైకమాండ్‌కు ఫిర్యాదు చేసినట్టు తమకు సమాచారం ఉందన్నారు. మూసీ ప్రాజెక్టు వ్యయాన్ని మూడొంతులు పెంచి తన స్వార్థం కోసం కాంగ్రెస్‌ను వాడుకుంటున్నారని, ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారని చెప్పారు. రేవంత్ ఏకపక్ష ధోరణిని కూడా పలువురు నేతలు అంగీకరించడం లేదన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో కాకుండా రేవంత్‌రెడ్డి తన సొంత ఎజెండాను అమలు చేస్తున్నారనే ఫిర్యాదులు కూడా హైకమాండ్‌కు చేరాయని తెలిపారు.కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజు కూడా సోనియాగాంధీకి ఫిర్యాదు చేశారని, కూల్చివేతలపై నివేదిక సమర్పించారని చెప్పారు. దీనిపై పరిశీలనకు సోనియా సూచనలతో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రంగంలోకి దిగి ఫోన్ చేస్తే రేవంత్ స్పందించలేదన్నారు. ఫోన్ ఎత్తకపోగా హైకమాండ్‌కు తాను స్పందించలేదని రేవంత్‌రెడ్డి పేర్కొనడాన్ని అధిష్టానం తీవ్రంగా పరిగణిస్తోందని చెప్పారు. సీనియర్ మంత్రులు, పార్టీ నేతల ఫిర్యాదులపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్‌గా ఉందని తెలుస్తోందన్నారు. రేవంత్ వ్యతిరేకవర్గం ఢిల్లీలో అధిష్టానం వద్ద గట్టిగా లాబీయింగ్ నిర్వహిస్తోందన్నారు.ఈ కారణంగానే ఇప్పటికే ఏడుసార్లు ఢిల్లీకి వెళ్లినా, రేవంత్‌కు రాహుల్‌గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే కేబినెట్ విస్తరణ వాయిదా వేస్తూ వస్తున్నారన్నారు. మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటామంటూ ఫిరాయింపులకు రేవంత్‌రెడ్డి తెరతీశారని తెలిపారు. అయితే ఆ పార్టీ నుంచి వచ్చిన పదిమంది ఎమ్మెల్యేల్లో ఐదుగురు మళ్లీ కేసీఆర్‌తో టచ్‌లోకి వెళ్లారన్నారు. దీంతో పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న అంశానికి భిన్నంగా ఫిరాయింపులు చేపట్టడంపై హైకమాండ్ ఆగ్రహంతో ఉందని చెప్పారు. ఈ పరిణామాల నుంచి బీఆర్ఎస్ లాభపడుతుందా అనే ప్రశ్నకు లోక్‌సభ ఎన్నికల్లో డకౌట్ అయ్యి ఏం చేయగలుగుతుందని వ్యంగ్యంగా అన్నారు. కాంగ్రెస్–బీఆర్ఎస్ ఒక్కటైనా.. బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగానే వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. -
‘రేవంత్ కుర్చీకి కౌంట్‌డౌన్.. ఆరు నెలల్లో కొత్త ముఖ్యమంత్రి’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కొత్త ముఖ్యమంత్రి కోసం కాంగ్రెస్ అధిష్టానం అన్వేషిస్తోందని సంచలన కామెంట్స్ చేశారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. సీఎం రేవంత్‌పై సీనియర్ మంత్రులు, ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తున్నారు. రేవంత్ హాలీడే పీరియడ్ అయిపోయింది. రేవంత్‌కు కౌంట్ డౌన్ మొదలైంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి తాజాగా మీడియా చిట్‌చాట్‌లో.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. రేవంత్ హాలీడే పీరియడ్ అయిపోయింది.. కౌంట్ డౌన్ మొదలైంది. 2025 జూన్ నుంచి డిసెంబర్‌లోపు రేవంత్ పదవి పోవడం ఖాయం. రేవంత్ రెడ్డికి ప్రత్యామ్నాయ కోసం కాంగ్రెస్ అధిష్ఠానం చూస్తోంది. ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు రేవంత్‌పై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తున్నారు. రేవంత్ వ్యతిరేక వర్గం ఢిల్లీలో లాబీయింగ్ చేస్తున్నారు. మేనిఫెస్టోను కాదు అని.. సొంత ఎజెండాను రేవంత్ అమలు చేస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజు.. సోనియా గాంధీకి ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యామ్నాయం ఎవరు అని కాంగ్రెస్ అధిష్ఠానం ఆలోచన చేస్తోంది.సీనియర్ మంత్రులు హైడ్రా, మూసీ, ల్యాండ్ సెటిల్మెంట్ల మీద రేవంత్‌పై ఫిర్యాదు చేసినట్లు మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. సీనియర్ మంత్రులు చేసిన ఫిర్యాదుపై కాంగ్రెస్ అధిష్ఠానం సీరియస్‌గా ఉంది. మూసీ ప్రాజెక్టు కాస్ట్ మూడు వంతులు పెంచి.. రేవంత్ స్వార్థం కోసం కాంగ్రెస్‌ను వాడుకుంటున్నారు. సీఎం రేవంత్ ఏకపక్ష ధోరణికి చాలా మంది నేతలు ఒప్పుకోవడం లేదు. రేవంత్ ఏడు సార్లు ఢిల్లీకి వెళ్లినా రాహుల్ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. 11 నెలలు దాటింది.. ఏడాదిన్నరలోపే కాంగ్రెస్ కొత్త ముఖ్యమంత్రి రావడం ఖాయం.భట్టి విక్రమార్క నేను సైతం సీఎం రేసులో ఉన్నానని చెప్పడానికి చెరువుల కబ్జాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడమే ఒక ఉదాహరణ. ముగ్గురు మంత్రులు సీఎం రేసులో పోటీ పడుతున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పక్కా సమాచారంతోనే మాట్లాడారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు అని.. నా నాలుకపై పుట్టుమచ్చ ఉందని ముందుగానే పసిగట్టి ఆయన ఇలా మాట్లాడారు. ముఖ్యమంత్రి పదవి రేసులో ఉత్తమ్, కోమటిరెడ్డి, భట్టి విక్రమార్క ముగ్గురూ పోటీ పడుతున్నారు. అలాగే, కాంగ్రెస్‌లో చేరిన ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేసీఆర్‌తో టచ్‌లో ఉన్నారు. -
అజ్ఞాతంలో తిరుపతి సీఐ
-
కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుతున్న కాంగ్రెస్
-
ఓల్డ్ సిటీలోకి వెళ్లే దమ్ము రేవంత్ సర్కార్‌కు లేదా?: ఏలేటి
సాక్షి, హైదరాబాద్: హైడ్రా పేరుతో లేనిపోని హైక్‌ను సృష్టిస్తున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. హైడ్రా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని.. రంగనాథ్ కమిషనరా..? పొలిటికల్ లీడరా..? అంటూ ఆయన ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేవలం హిందువుల నిర్మాణాలను కూల్చడమే పనిగా పెట్టుకున్నారా..?. ఐపీఎస్ అధికారిగా తనకు తాను మీడియా ముందు బిల్డప్ చేసుకుంటున్నారని దుయ్యబట్టారు.‘‘హైడ్రా పేరుతో పెద్ద ఎత్తున వసూళ్లు నడుస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. సల్కం చెరువులో ఓవైసీ నిర్మాణాలకు ఉన్న కండీషన్లు, పల్ల రాజేశ్వర్ రెడ్డి, మర్తి రాజేశ్వర్‌రెడ్డికి వర్తించవా..?. ఓవైసీకీ ఆరు నెలలు సమయం ఇస్తున్నప్పుడు, మిగతా వారికి, ఎన్ కన్వెన్షన్‌కు ఎందుకు సమయం ఇవ్వలేదు..?. ఓల్డ్ సిటీలోకి వెళ్లే దమ్ము, ధైర్యం ప్రభుత్వానికి లేదా..?. ఓ వైసీని ఢీకొట్టడానికి ధైర్యం సరిపోవడం లేదా..?. ఆయన ఇనిస్టిట్యూషన్‌లో మాత్రమే విద్యార్థులున్నారా..?. రంగనాథ్‌కు ఆఫర్ ఇచ్చారేమో అందుకే ఓల్డ్ సిటీలోకి వెళ్లడం లేదు. కేవలం టార్గెట్ చేసి నిర్మాణాలను కుల్చుతున్నారా అనే అనుమానం కలుగుతుంది’’ అంటూ మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు.‘‘కాంగ్రెస్ సర్కారు స్టీరింగ్ ఓవైసీ చేతిలో ఉంది. వంద శాతం చెరువు కబ్జా అయితే ముట్టుకోమని రంగనాథ్ చెబుతున్నారు. రంగనాథ్ ఏం పొడిచారని ఆయనకు హై సెక్యూరిటీ కల్పిస్తున్నారు. ఈ హైక్ ఏంది..? ఈ హైడ్రా ఏంది అర్థం కావడం లేదు. తీవ్రవాదులను, టెర్రరిస్టులను పట్టుకున్న పోలీస్ అధికారులు ఎంతో మంది ఉన్నారు. వారికిలేని సెక్యూరిటీ రంగనాథ్‌కు ఎందుకు..?. కేవలం హిందువుల నిర్మాణాలను కూల్చడమే టార్గెట్ పెట్టుకుంటే ఊరుకునేది లేదు. ఓల్డ్ సిటీలోకి వెళ్లేందుకు హైడ్రాకు దారి తెలవడం లేదా..?. డిస్క్రిమినేషన్ పద్ధతి మంచిది కాదు. ఇలాంటి పద్ధతులతో వెళ్తే రంగనాథ్ పై ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తాం’’ అంటూ ఏలేటి హెచ్చరించారు.‘‘రంగనాథ్‌కు ఎమ్మెల్సీ ఇచ్చుకోండి, రాజ్యసభ ఇచ్చుకోండి, కానీ ఇంత హైక్ ఎందుకు చేస్తున్నారు?. ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఓవైసీ ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. అందుకే ఓవైసీ నిర్మాణాలను ముట్టుకోలేకపోతున్నారు. సల్కం చెరువులో అక్రమ నిర్మాణాలను కూల్చిన తరువాతే ఇతర చెరువులకు వెళ్ళాలి. పాతబస్తీలో ఎన్ని చెరువులున్నాయి. ఎన్ని ఎకరాల భూములు కబ్జాలకు గురయ్యాయినేది డేటా ప్రభుత్వం సేకరించాలి’’ అని ఏలేటి మహేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
హిందువుల బిల్డింగ్స్ మాత్రమే కూలుస్తారా?
-
రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలి
నిర్మల్ చైన్‌గేట్: రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివ రకు ఎంతమందికి రు ణమాఫీ చేసిందో శ్వేత పత్రం విడుదల చే యాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వ ర్‌రెడ్డి డిమాండ్ చేశా రు. ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరి పంట రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ ఆర్డీవో కార్యాలయం ఎదుట శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేశారు.ఈ సందర్భంగా మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇప్పటి వరకు సగం మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందని చెపుతుంటే, సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం పూర్తిస్థాయిలో రుణమాఫీ జరిగిందని ఒట్లు వేస్తూ దేవుళ్లను కూడా మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ నెలాఖరులోపు రైతులందరికీ రుణమాఫీ చేయకుంటే హైదరాబాద్‌లోని ధర్నాచౌక్‌లో నిరవధిక నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు.కొర్రీలొద్దు.. కోతలొద్దు: రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కొర్రీలు, కోతలు లేకుండా తక్షణమే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ డిమాండ్ చేశారు. రైతు దీక్షలో ఆయన మాట్లాడుతూ, అందరి రుణాలు మాఫీ అయ్యేవరకు రైతుల పక్షాన పోరాడతామన్నారు. కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో ఎంతోమంది రైతులు రుణమాఫీకి దూరమయ్యా రన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు అంజు కుమార్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మోహన్‌రావు పటేల్ పాల్గొన్నారు. -
అందరికీ రుణమాఫీ కోసం 23న రైతుదీక్ష
నిర్మల్: రాష్ట్ర ప్రభు త్వం అర్హులైన రైతు లందరికీ రుణమాఫీ వర్తింపజేయాలని బీజేఎల్పీనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. అలా చేయనిపక్షంలో ఈనెల 23న రైతులతో భారీ రైతుదీక్ష చేపడతామని ప్రకటించారు. ఆదివారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుభరోసాకు ఇవ్వాల్సిన నిధులనే రుణమాఫీకి మళ్లించిందని.. ఇప్పటి కే రెండు పంటలకు రైతు భరోసా సాయం ఇవ్వకుండా ఎగ్గొట్టారని ఆరోపించారు.రాష్ట్రంలో 60 లక్షల మంది అర్హులైన రైతులు ఉండగా.. కేవలం 22 లక్షల మందికే రుణమాఫీ చేయడమేంటని ప్రశ్నించారు. రూ.49 వేల కోట్ల రుణాలకుగాను.. రూ.17 వేల కోట్లే ఇ చ్చారని మండిపడ్డారు. రుణమాఫీ కాని రైతు లను మళ్లీ మోసం చేసేందుకే.. మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని చెబుతున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యే లకు దమ్ముంటే.. గ్రామాలకు వెళ్లి పూర్తిస్థాయి లో రైతులకు రుణాలు మాఫీ అయ్యాయో లేదో ఆరా తీయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న రైతుల రుణాలను త్వరలో మాఫీ చేయాలని.. రైతుభరోసా ఖరీఫ్ సీజన్ డబ్బులను ఈ నెలా ఖరులోగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
ప్రజాసమస్యలపై చర్చించేందుకు ఈ అవినీతి ప్రభుత్వం సిద్ధంగా లేదు
-
షరతులు లేకుండా రుణమాఫీ ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్: ఎలాంటి షరతులు..నిబంధనలు లేకుండా రైతు రుణమాఫీ అమలు చేయా లని బీజేఎల్పీనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. రుణమాఫీకి రేషన్‌కార్డును ప్రామాణికం చేయడం ద్వారా ప్రభుత్వం తప్పించుకోవడానికి ప్రయత్నిస్తోందన్నారు. అందరికీ రుణమాఫీ ఇవ్వలే కనే కాంగ్రెస్ ప్రభుత్వం షరతులతో కొత్తకథలు చెబుతోందని మండిపడ్డారు. దీనిపై గతంలో రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చినప్పుడు ఎలాంటి షరతులు విధించని విషయాన్ని గుర్తుచేశారు.సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏ నిబంధనలు లేకుండా రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి... ఇప్పుడు ఇన్ని కండిషన్స్ ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క కొత్త రేషన్‌కార్డు ఇవ్వలేదన్నారు. కానీ ఇప్పుడు రుణ మాఫీకి మాత్రం రేషన్‌కార్డును లింక్ చేస్తోందని ధ్వజమెత్తారు. చాలామందికి ఇది వర్తించకుండా ఎగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇంట్లో ఒకే రేషన్‌కార్డుపై చాలామంది పేర్లు ఉంటాయని, అందులో నలుగు రికి రుణాలుంటే ఒక్కరికే మాఫీతో మిగతావారు నష్ట పోతారన్నారు. కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవాలంటే వారితో రాజీనామా చేయించి, ఉప ఎన్నికల్లో గెలిపించి చేర్చుకోవాలని సీఎంకు సూచించారు. సీఎం రేవంత్‌కు మరో బహిరంగలేఖ గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని సీఎం రేవంత్‌రెడ్డికి రాసిన బహిరంగలేఖలో మహేశ్వర్‌రెడ్డి కోరారు. పంచాయతీల్లో నిధులు లేక పనులు చేయలేమని ప్రజావాణిలో గ్రామ కార్యదర్శులు వెల్లడించినా.. సర్కార్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తీరులో మార్పు రాకపోతే ప్రజాక్షేత్రంలో సర్కార్ తీరును ఎండగడతామని తెలిపారు. వెంటనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. -
రేవంత్ బాబా 11 మంది దొంగలు
-
రేవంత్ రెడ్డిపై ఫైర్
-
స్కాం జరిగితే ఈడీ దర్యాప్తు చేయడం కామనే: మహేశ్వర్ రెడ్డి
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి. తెలంగాణ ప్రజల్లో బీజేపీ పార్టీ పట్ల విశ్వాసం పెరిగిందని చెప్పుకొచ్చారు. అలాగే, ఇచ్చిన హామీలను తీర్చడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందన్నారు.కాగా, మహేశ్వర్ రెడ్డి శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచినా వృద్దాప్య పింఛన్లను నాలుగు వేలకు పెంచలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుచేయడం లేదు. పెన్షన్ కోసం తీసుకున్న దరఖాస్తులను ఏం చేశారో తెలియదు.కేసీఆర్ పేరు ఉందనే నెపంతో పాఠ్య పుస్తకాలను వెనక్కి తీసుకోవడం వల్ల ప్రభుత్వ ధనం దుర్వినియోగం అవుతుంది. పుస్తకాలను యథావిధిగా పంపిణీ చేయాలి. తెలంగాణలో బీజేపీ పార్టీపై విశ్వాసం పెరిగింది. రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే. కుంభకోణాలు జరిగినప్పుడు ఈడీ దర్యాప్తు చేయడం సహజమే’ అంటూ కామెంట్స్ చేశారు. -
మిల్లర్లను భయపెట్టి టెండర్లు నిర్వహించారు
-
సీఎం రేవంత్‌పై మంత్రి ఉత్తమ్‌కు అనుమానం: బీజేఎల్పీ మహేశ్వర్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కుంభకోణాలు కళ్ల ముందు కనిపిస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. రాష్ట్రంలో సివిల్ సప్లై శాఖ అవినీతిలో కూరుకుపోయిందని సంచలన కామెంట్స్ చేశారు.కాగా, మహేశ్వర్ రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. 19 ప్రశ్నల్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక్కదానికి మాత్రమే సమాధానం ఇచ్చారు. ప్రశ్నలను ఆయన తన పర్సనల్‌గా తీసుకుంటున్నారు. నేను విషయం డీవియేట్ కాకుండా మాట్లాడాను. వ్యక్తిగత విమర్శలు నేను చేయలేదు. నాయకులను తయారు చేసిన చరిత్ర ఉన్న పార్టీ బీజేపీ. ఎమ్మెల్యేలంతా సంతకాలు చేసి బీజేఎల్పీ నేతగా నన్ను ఎన్నుకున్నారు.నేను మీలాగా అపాయింట్మెంట్ అయిన లీడర్‌ను కాదు. పీసీసీ పదవి మీరు ఎలా తెచ్చుకున్నారో నాకు తెలుసు. పుట్టింటి వ్యవహారం మేనమామకు ఎరుక అన్నట్టు.. ఉత్తమ్ వ్యవహారం నాకు తెలుసు. కిషన్‌రెడ్డి ఆదేశాల మేరకు నేను సీఎం రేవంత్‌ను కలిశాను. మీ సీఎంను మీరే అనుమానిస్తున్నారు. ఆర్ ట్యాక్స్, బీ ట్యాక్స్‌పై మాట్లాడినప్పుడు ఎందుకు స్పందించలేదు. యూ ట్యాక్స్‌పై మాట్లాడినప్పుడు మాత్రమే స్పందించారంటే అవినీతి ఎంత జరిగిందో అర్థమవుతోంది. బకాయిలు ఉన్న రైస్ మిలర్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. డీ-ఫాల్టర్ల పేర్లను బయట పెడతారా?. తరుగుపై మంత్రి ఏనాడైనా క్షేత్ర స్థాయిలో ఎపుడైనా పరిశీలించారా?. కుంభకోణాలు కళ్లముందు కనిపిస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. ఏప్రిల్ 18న జలసౌధలో మిల్లర్లతో జరిగిన చర్చల వివరాలను ఎందుకు బయట పెట్టడం లేదు. మిల్లర్లతో 100 రూపాయల బాండ్ పేపర్‌పై సంతకాలు చేసుకున్న మాట వాస్తవం కాదా!. మిల్లర్లను భయపెట్టి రాయించుకున్న వంద రూపాయల బాండ్ పేపర్ డాక్యుమెంట్‌ను నేను బయట పెడుతున్నాను.సన్న బియ్యం టెండర్లు క్యాన్సెల్ చేశామని చెప్పారు. ధ్యానం లిఫ్ట్ చేయని మిల్లర్లకు సమయం ఇచ్చినప్పటికీ ఎందుకు లిఫ్ట్ చేయలేదు. ఎఫ్‌సీఐకి ఒక సంచి కూడా డెలివరీ ఇవ్వలేదు. సివిల్ సప్లై శాఖ అవినీతిలో కూరుకుపోయింది. రేవంత్-ఉత్తమ్ ఒకరినొకరు అనుమానించుకుంటున్నారు. ధాన్యం కొనుగోళ్లపై సిట్టింగ్ జడ్జితో లేదా సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తున్నా. అలాగే, పర్సనల్‌గా మాట్లాడవద్దని ఉత్తమ్‌కు సూచిస్తున్నాను. అవకతవకలపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తాను’ అంటూ కామెంట్స్ చేశారు. -
యరపతినేని శ్రీనివాసరావుకు ఓపెన్ ఛాలెంజ్.. నిరూపిస్తే తక్షణమే తప్పుకుంటా
-
రేవంత్‌ది ఒకే మాట..నా వంతు ఎంత అనే!
సాక్షి, హైదరాబాద్: అవినీతికి పాల్పడ్డ వారిని కటకటాల వెనక్కి పంపిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారని.. కానీ వాస్తవానికి ఎవరైనా రేవంతూ అని మాట్లాడిస్తే తన వంతు ఎంత అని అడుగుతున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎంను కలిసేందుకు వెళ్లిన వాళ్లు కూడా రేవంత్‌ని నీ రేటెంతరెడ్డి అని అడుగుతున్నారంట అని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలకు సంబంధించిన ఆధారాలు ముందు పెట్టుకొని సెటి ల్మెంట్లు చేస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు. గురువారం పార్టీ కార్యాలయంలో మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో జరుగుతున్న లోలోపల సెటిల్మెంట్లు ఇప్పుడు బయటకు వస్తున్నాయన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన దాని కంటే కూడా కాంగ్రెస్ హయాంలోనే అవినీతి, అరాచకాలు ఎక్కువ జరుగుతున్నా యని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ అవినీతి అక్రమా లపై నాలుగు నెలలు దాటినా ఒక్కదాని మీద ఎంక్వైరీ పూర్తి అవ్వలేదన్నారు. గతంలో జరిగిన అవినీతి అక్రమాలను వెలికితీసి సెటిల్మెంట్లు చేస్తున్నారని, ఆ క్రమంలోనే కాళేశ్వరంపై విచారణను సీబీఐకి అప్పజెప్పడం లేదని నిందించారు. రాహుల్ ట్యాక్స్ వసూలు ఎలాగంటే.. రాహుల్‌గాంధీ ట్యాక్స్ వసూలుకు సంబంధించి అనుసరిస్తున్న ఒక విధానాన్ని తాను బయట పెడుతున్నానని మహేశ్వర్‌రెడ్డి వివరించారు. ’’గత ప్రభుత్వం ఓ సంస్థకు నగరం నడిబొడ్డున రూ.1,500 కోట్ల విలువైన 15 ఎకరాల భూమిని 30 ఏళ్ల లీజుకు (నెలకు ఎకరానికి రూ.2లక్షల లీజ్‌కు) ఇస్తే దానిని కాంగ్రెస్ సర్కార్ వచ్చాక రద్దు చేసి అది ప్రభుత్వ స్థలమని బోర్డు పెట్టింది. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ మరో జీవో ద్వారా అదే భూమిని అదే సంస్థకు రేవంత్‌రెడ్డి కేటాయించారు.’’ అని ఆరోపించారు ఇందులో భాగంగా రూ.300 కోట్లు తీసుకుని ఢిల్లీకి పంపించిన మాట వాస్తవమా కాదా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగానే చిత్తశుద్ది ఉంటే వీటికి సంబంధించిన అంశాలను పబ్లిక్ డొమైన్లో పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ భూమికి సంబంధించే ఇంత కుంభకోణం చేస్తే.. కాళేశ్వరం, ధరణిల్లో ఇంకా ఎంత కుంభకోణం చేస్తారోనని అనుమానం వ్యక్తం చేశారు. మరో రెండు రోజుల్లో ఇంకో అవినీతి బయటపెడతా మరో రెండు రోజుల్లో మరో అవినీతి అంశంపై ఆధారాలతో సహా మీడియా ముందుకి వస్తా నని మహేశ్వర్‌రెడ్డి వెల్లడించారు. మహేశ్వర్ రెడ్డికి ఆధారాలు ఎక్కడి నుంచి వస్తున్నాయన్న భయంతో సీఎం రేవంత్‌రెడ్డి సచివాలయం ఆరో ఫ్లోర్‌లోకి ఎవరినీ రానివ్వకుండా సెక్యూ రిటీ పెంచారని ఆరోపించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా సెక్రటేరియట్ సెకండ్ ఫ్లోర్ సెక్యూరిటీ పెంచి ఎవరినీ అనుమతించడం లేదన్న సమాచారం తనకు అందిందన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఇంటికి రేవంత్ వెళ్లడంతో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి భయం పట్టుకుందన్నారు. -
కాంగ్రెస్‌లో ఏక్నాథ్ షిండేలు?.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, నల్గొండ: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అయిదేళ్లే కాదు మరో పదేళ్లు రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటారని తెలిపారు. కాంగ్రెస్‌లో ఏక్నాథ్ షిండేలు లేరని స్పష్టం చేశారు. తమ పార్టీలో గ్రూపులు లేవని అన్నారు. అందరం రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే పనిచేస్తున్నామని చెప్పారు. ఏక్నాథ్ షిండేలను సృష్టించిందే బీజేపీ పార్టీ అని మండిపడ్డారు. కుల, మతాల మధ్య బీజేపీ చిచ్చు పెట్టాలని చూస్తుందని విమర్శించారు. ఈ మేరకు నల్లగొండలో గురువారం మీడియాతో మాట్లాడుతూ.. దళితున్ని ప్రతిపక్ష నేతగా సహించని పార్టీ బీఆర్ఎస్ అని దుయ్యబటారు. ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో తెలీదన్న హరీష్‌రావు మాటల్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్‌లో అయిదు గ్రూపులు ఉన్నాయని బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అనడం తప్పని అన్నారు. బీఆర్ఎస్.. హరీష్ రావు, మహేశ్వర్‌రెడ్డి నోరు అదుపులోకి పెట్టుకొని మాట్లాడాలని, కోమటిరెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వాన్ని పడగొడతామన్న మాటలు బంద్ చేయాలని అన్నారు. ‘ప్రతిసారి మహేశ్వర్ రెడ్డి నా పేరు ప్రస్తావన తీసుకొస్తున్నారు. బండి సంజయ్‌ను దింపి కిషన్ రెడ్డిని ఎందుకు సీట్లో కూర్చోబెట్టారో మహేశ్వర్ రెడ్డికి తెలుసా?. 39 సీట్లకే పరిమితం చేసిన బీఆర్ఎస్ లీడర్లకు జ్ఞానోదయం కావట్లేదా?. ప్రతిపక్ష నేతలు విజ్ఞతతో మాట్లాడాలి. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస 14 సీట్లను గెలవబోతుంది’ అని తెలిపారు. చదవండి: Congress: కాంగ్రెస్‌లో ఆ ముగ్గురు ఎవరు? -
బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ మధ్య మాటల యుద్ధం
-
టచ్ చేసి చూడండి..ఏం జరుగుతుందో!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని మొన్నటివరకు బీఆర్ఎస్ పాట పాడిందని.. ఇప్పుడు బీజేపీ నేతల నోట అదే పాట వినిపిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యా నించారు. తలచుకుంటే 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామన్న బీజేపీ ఎమ్మెల్యే ఏలే టి మహేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యలను తప్పుపట్టారు. ‘కాంగ్రెస్‌ను టచ్ చేసి చూడండి.. ఏం జరుగుతుందో’అని హెచ్చరించారు. తమది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమని, తమను ఎవరూ ఏమీ చేయలేరని పేర్కొన్నారు. పొన్నం శనివారం గాం«దీభవన్‌లో టీపీసీసీ నేతలు నిజాముద్దీన్, కోట్ల శ్రీనివాస్ తదితరులతో కలసి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పడానికి ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఏమైనా జ్యోతిష్యం చదువుకున్నారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్కు బీసీని అధ్యక్షుడ్ని చేయండి లోక్‌సభ ఎన్నికల్లో బీసీలకు టికెట్ల కేటాయింపుపై మంత్రి కేటీఆర్ మాట్లాడటం విడ్డూరమని పొన్నం విమర్శించారు. బీఆర్ఎస్ ఏర్పాటైన 23 ఏళ్లలో ఒక్క బీసీ నేత అయినా ఆ పారీ్టకి అధ్యక్షుడయ్యారా అని ప్రశ్నించారు. కేసీఆర్ సీఎం అయ్యాక అయినా, లేక ఎన్నికల్లో ఓడిపోయాక అయినా బీసీలకు అధ్య క్ష పదవి ఇవ్వాల్సిందని పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడు, శాసనసభాపక్ష నేత, ప్రతిపక్ష నేత, మండలిలో ప్రతిపక్ష నేత.. ఇలా ఏ పదవిని కూడా బీసీలకు ఇవ్వకుండా.. బీసీలను ఉద్ధరిస్తున్నట్టు మాట్లాడటం ఏమిటని నిలదీశారు. తమ ప్రభుత్వం కులగణన తీర్మానాన్ని అసెంబ్లీలో ఆమోదింపజేసి, రూ.150 కోట్లు నిధులు ఇచి్చందని, 17 కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసిందని చెప్పారు. కాంగ్రెస్‌తోనే బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పారీ్టలో బీసీలకు అన్యాయం జరిగితే పారీ్టలో అంతర్గతంగా అడుగుతామని, బీఆర్ఎస్లో అలా అడిగే స్వేచ్ఛ కొంచెమైనా లేదని విమర్శించారు. బీసీని అధ్యక్ష పదవి నుంచి తీసేసి.. బలహీనవర్గాల నాయకుడిని పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తీసేసిన బీజేపీ.. బీసీ నేతను సీఎం చేస్తామని చెప్పడం ఏమిటని పొన్నం నిలదీశారు. అవినీతి చేసినందుకే బండి సంజయ్‌ను తీసేశామని కిషన్‌రెడ్డి వర్గం చెప్తుంటే.. కిషన్‌రెడ్డిని కేసీఆర్ నియమించుకున్నారని బండి సంజయ్ వర్గం అంటోందని వ్యాఖ్యానించారు. కాగా.. మంత్రులు టచ్‌లో ఉన్నారని బీజేపీ నేతలు అంటున్నారని మీడియా ప్రస్తావించగా.. తనను అలాంటి చర్యకు పాల్పడాలని అడిగే ధైర్యం ఎవరికీ లేదని, కలలో కూడా బీజేపీ ఊసెత్తనంటూ మంత్రి పొన్నం మీసం మెలి తిప్పారు. -
ఐదేళ్లకోసారి పార్టీ మారే వ్యక్తా నా గురించి మాట్లాడేది?
సాక్షి, హైదరాబాద్: తనపై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు సత్యదూరమని.. ఐదేళ్లకోసారి పార్టీ మారే వ్యక్తి తన గురించి మాట్లాడటమేమిటని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో ‘కాంగ్రెస్‌లో చేరుతా.. సాయపడు అన్నా’అని మహేశ్వర్‌రెడ్డి తనను కోరారని.. అలాంటిది ఇప్పుడు తనను టార్గెట్ చేసి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఆయన ఓ రాజకీయ జోకర్ అని వ్యాఖ్యానించారు. శనివారం తనపై మహేశ్వర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. అందులోని వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘కాంగ్రెస్‌లోకి వస్తా.. మంత్రి పదవి కావాలన్నా అని అసెంబ్లీ సమావేశాల సమయంలో మహేశ్వర్‌రెడ్డి నన్ను అడిగారు. మాకే పూర్తి మెజారిటీ ఉంది. ఎవరినీ చేర్చుకునే ఉద్దేశం లేదని చెప్పాను. అది మనసులో పెట్టుకుని ఏదేదో మాట్లాడుతున్నారు. కేంద్రంతో ఆరుగురు మంత్రులు టచ్‌లో ఉన్నారంటూనే.. తమకు అవసరం లేదనడం.. కాంగ్రెస్ ప్రభుత్వంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డినే ఏక్నాథ్ షిండే పాత్ర పోషిస్తారనడం మహేశ్వర్‌రెడ్డికి మతిస్థిమితం లేదనడానికి నిదర్శనం. గడ్కరీ, అమిత్ షాలను తాను కలసి షిండే పాత్ర పోషిస్తానని చెప్పినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దీనిపై భాగ్యలక్ష్మి ఆయానికి వారిని తీసుకుని వచ్చి ప్రమాణం చేయాలి. నేను కూడా ప్రమాణం చేస్తా.. బీజేపీతో లాభం లేదన్నారు.. ‘రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామంటే తమ (బీజేపీ)వాళ్లు రామ మందిరాన్ని పట్టుకున్నారని... దానితో తెలంగాణలో ఓట్లు పడతాయా’అని మహేశ్వర్‌రెడ్డి నాతో చెప్పారు. తాను సొంత ఇమేజీతో ఎమ్మెల్యేగా గెలిచానని, బీజేపీతో లాభమేమీ లేదని కూడా అన్నారు. కాంగ్రెస్‌లోనే ఉండుంటే మంత్రిని అయ్యేవాడిననీ చెప్పారు. నేను షిండే అవునో, కాదో తెలియదుగానీ.. మహేశ్వర్‌రెడ్డి మాత్రం కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్‌లకు వెన్నుపోటు పొడిచే నయా గాలి జనార్దనరెడ్డి లాంటివారు. మహేశ్వరరెడ్డి వ్యాఖ్యల వెనుక పెద్ద కుట్ర ఉంది. నేను కాంగ్రెస్‌లోనే పుట్టా.. కాంగ్రెస్‌లోనే పోతా... దిగజారుడు పార్టీ బీజేపీ.. ఈ దేశంలో పార్టీ చేరికల కమిటీ పెట్టిన దిగజారుడు పార్టీ బీజేపీ. చేరికల కమిటీకి చైర్మన్‌ను కూడా నియమించారు. అయినా ఒక్క కార్పొరేటర్ కూడా ఆ పారీ్టలో చేరలేదు. సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి డబ్బు పంపుతున్నారని ఇష్టమొచి్చనట్టు ఆరోపణలు చేస్తున్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల సీఎంలు మోదీకి, నడ్డాకు డబ్బు పంపుతున్నారా? దేశాన్ని అదానీ, అంబానీలకు దోచిపెట్టిన బీజేపీ ఇతరులను విమర్శించడం సిగ్గుచేటు. నిజానికి ఒక్క ఓటు రెండు రాష్ట్రాలంటూ ప్రజలను మోసం చేసిన పార్టీ బీజేపీ. ఆ పార్టీకి తెలంగాణ ఏర్పాటు ఏమాత్రం ఇష్టం లేదు. సోనియాగాంధీ పారీ్టకి నష్టం కలుగుతుందని తెలిసినా తెలంగాణ ఇచ్చారు.’’అని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. -
తెలంగాణ షిండే.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: బీజేపీతో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితోపాటు మరో ఐదుగురు మంత్రులు టచ్‌లో ఉన్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీల వద్దకు మంత్రి వెంకట్‌రెడ్డి వెళ్లి తెలంగాణలో షిండే పాత్ర పోషిస్తానని చెప్పారన్నారు. కానీ ఆయనపై ఎవరికీ నమ్మకం లేదని, అందుకే ఆయనకు షిండే పాత్ర ఇవ్వడం లేదని వ్యాఖ్యానించారు. బీజేపీ హైకమాండ్‌తో ఆయన టచ్‌లో ఉంటూ.. బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నారనడం ఏమిటని పేర్కొన్నారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ.. 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నారని మాట్లాడుతున్నారు. వెంకట్‌రెడ్డితో ఆయన సోదరుడే టచ్‌లో లేరు. అలాంటిది బీజేపీ ఎమ్మెల్యేలు ఎలా టచ్‌లోకి వస్తారు. బీజేపీ ఎమ్మెల్యేల్లో ఎవరికీ అలాంటి చరిత్ర లేదు. మా పార్టీ వారిని ముట్టుకునే సాహసం చేయొద్దు. మా పార్టీ ఎమ్మెల్యేల్లో ఒక్కరిని ముట్టుకున్నా 48 గంటల్లో రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుంది. ప్రజలు ఇచి్చన తీర్పును గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి బీజేపీ ప్రజాస్వామ్యబద్ధంగా సహకరిస్తోంది. వెంకటరెడ్డికి దమ్ముంటే భువనగిరి ఎంపీగా కాంగ్రెస్ అభ్యరి్థని గెలిపించుకోవాలి. భయపెట్టి వసూళ్లు చేస్తున్నారు రేవంత్‌రెడ్డి విపక్షంలో ఉన్నప్పుడు ఒక విధంగా, అధికారంలోకి వచ్చాక మరో విధంగా మాట్లాడటం సమంజసం కాదు. కాంట్రాక్టర్లు, వ్యాపారస్తులను విచారణల పేరుతో భయపెట్టి వసూళ్లకు పాల్పడుతున్నారు. రేవంత్ వసూళ్ల చిట్టా, ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. రాష్ట్రంలో ఆర్ ట్యాక్స్ పేరిట రూ.3 వేల కోట్లు వసూలు చేశారు. ఆ డబ్బును దేశవ్యాప్తంగా రాజకీయాల కోసం కాంగ్రెస్ వినియోగిస్తోంది. తుగ్లక్ చేష్టలు చేస్తున్న రేవంత్‌రెడ్డిపై మా పోరా టం కొనసాగుతుంది. కాంగ్రెస్‌ది అసమర్థ ప్రభుత్వం. వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు ఏదో ఒకఅంశాన్ని తెరపైకి తెచ్చి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తోంది. ఇతర పారీ్టల ఎమ్మెల్యేలు, ఎంపీలను రాజీనామా చేయకుండా కాంగ్రెస్‌లో చేర్చుకుని టికెట్లు ఎలా ఇస్తున్నారు.’’అని ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. రాజీనామాలు చేశాకే ఇతర పారీ్టల వారిని బీజేపీ చేర్చుకుంటోందన్నారు. వాళ్ల మంత్రులే కూల్చుతారు.. మేం గేట్లు తెరిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడానికి 48 గంటలు కూడా పట్టదు. కానీ మేం అలా చేయబోం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరూ కూల్చాల్సిన అవసరం లేదు. వాళ్ల మంత్రులే కూల్చుతారు. ఇప్పటికే పది మంది మంత్రులు సీఎం పీఠంపై కన్నేశారు. ఓటుకు కోట్లు కేసుతోనో, ఇంకో అంశంతోనో తన సీటుకు ప్రమాదం వస్తుందన్న భయంతో సీఎం రేవంత్‌కు నిద్రపట్టడం లేదు. ఎమ్మెల్యేలు రాజీనామా చేయకుండా పార్టీ మారితే వారిని రాళ్లతో కొట్టాలని గతంలో రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎలా కొంటున్నారు? ఇప్పుడు దేనితో వారిని కొట్టాలి. గతంలో బీఆర్ఎస్ ఎంపీ రంజిత్‌రెడ్డిపై అవినీతి ఆరోపణలు చేసిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు ఆయనకు టికెట్ ఎలా ఇచ్చారు? ఆయన తరఫున ప్రచారం ఎలా చేస్తారు? వారి మధ్య ఎలాంటి ఒప్పందం కుదిరిందో బయటపెట్టాలి. -
బీజేఎల్పీ నేత ఎవరు?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ శాసనసభాపక్షనేత ఎన్నికపై ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు. శాసనసభ బడ్జెట్ సమావేశాలు దగ్గరపడుతున్నా, బీజేపీ నేతలు ఎటూ తేల్చలేకపోతున్నారు. గత డిసెంబర్లోనే కేంద్రహోంమంత్రి అమిత్‌షా రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడే బీజేఎల్పీ నేత ఎన్నిక ప్రక్రియ పూర్తవుతుందని అంతా భావించారు. అయితే అప్పుడు తగిన సమయం లేకపోవడంతో తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కొద్దిరోజులకు బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి తరుణ్‌చుగ్ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర నేతలు ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయసేకరణ నిర్వహించారు. ఢిల్లీలో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చర్చించాక బీజేఎల్పీ నేతను ప్రకటిస్తామన్నారు. ఇది జరిగి కొద్దిరోజులు గడుస్తున్నా బీజేఎల్పీనేత ఎవరన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ నెల 8వ తేదీ నుంచి రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో బీజేఎల్పీనేతగా ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై రాజకీయంగా, పార్టీలో చర్చనీయాంశమవుతోంది. శాసనసభ కార్యకలాపాలపై అవగాహన, వివిధ అంశాలపై విషయ పరిజ్ఞానం, రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, అసెంబ్లీ వేదికపై చోటుచేసుకునే ఆయా పరిణామాలకు తగ్గట్టుగా చురుగ్గా స్పందించగలిగే వారికి ఈ బాధ్యతలు అప్పగించాలనే అభిప్రాయంతో పార్టీ నేతలున్నట్టు సమాచారం. ► వరుసగా మూడుసార్లు గెలవడంతోపాటు నగరం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్యే టి.రాజాసింగ్ ఈ పదవి కోరుకుంటున్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరు సీఎం అభ్యర్థులను ఓడించిన కాటిపల్లి వెంకటరమణారెడ్డితోపాటు పాయల్ శంకర్, ధన్పాల్ సూర్యనారాయణగుప్తా, పైడి రాకేష్‌రెడ్డిలు కూడా బీజేఎల్పీ నేత పదవిని ఆశిస్తున్నారు. ► గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తే బీసీ నేతను సీఎం చేస్తామని నాయ కత్వం ప్రకటించిందని, కనీసం బీజేఎల్పీ నేతగా బీసీ ఎమ్మెల్యేకు అవకాశం కల్పించాలనే డిమాండ్ కూడా పార్టీలో అంతర్గతంగా వినిపిస్తోంది. ► ఈ నెల 8న బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ఆ తర్వాత జరిగే బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) సమావేశానికి వివిధ రాజకీయపక్షాల తరఫున నేతలు హాజరై ఎన్ని రోజులు సభ నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే నాటికి లేదా బీఏసీ భేటీ జరిగే నాటికి బీజేఎల్పీనేతను ఎన్నుకుంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.అయితే బీఏసీ భేటీకి శాసనసభాపక్షం ఎవరో ఒకరిని నామినేట్ చేసినా సరిపోతుందని, అందువల్ల దానితో బీజేఎల్పీనేత ఎన్నికకు ముడిపెట్టాల్సిన అవసరం లేదని మరికొందరు వాదిస్తున్నారు. -
నిర్మల్‌లో ‘మాస్టర్’ ఫైట్
నిర్మల్/బాల్కొండ/ఇందల్వాయి/సాక్షి, హైదరాబాద్: మాస్టర్‌ప్లాన్ వ్యవహారంతో నిర్మల్ ఉద్రిక్తంగా మారింది. మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష ఆదివారం ఐదో రోజుకు చేరింది. ఆయన ఆరోగ్యం మరింత క్షీణిస్తుండటంతో బీజేపీ ఆదివారం రెండోరోజూ ఆందోళనకు దిగింది. నిర్మల్ బైల్‌బజార్ చౌరస్తా వద్ద పెద్దసంఖ్యలో మహిళలు, పార్టీ నేతలు, కార్యకర్తలు బైఠాయించారు. మాస్టర్‌ప్లాన్‌ను రద్దు చేయాలని నినదించారు. అనంతరం మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఇంటి ముట్టడికి బయలుదేరారు. మంత్రి ఇంటి సమీపంలోకి రాగానే పోలీసులు వారిని అడ్డుకుని, లాఠీచార్జి చేశారు. దీనితో మహిళలు, కార్యకర్తలకు గాయాలయ్యాయి. మరోవైపు ఏలేటి దీక్షకు సంఘీభావం ప్రకటించేందుకు వెళ్తున్న బీజేపీ నేతలు డీకే అరుణ, ధర్మపురి అర్వింద్‌లను పోలీసులు అడ్డుకున్నారు. కాగా, మంత్రి ఇంటి ముట్టడికి ప్రతిగా తాము సోమవారం బీజేపీ నేత ఏలేటి ఇంటిని ముట్టడిస్తామని బీఆర్ఎస్ ప్రకటించింది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జిల్లా కేంద్రంలో భారీగా బలగాలను మోహరించారు. ఆమరణ దీక్షలోనే ఏలేటి.. నిర్మల్ మున్సిపాలిటీ మాస్టర్‌ప్లాన్ పూర్తిగా రద్దయ్యేవరకూ పోరాటం చేస్తానంటూ మహేశ్వర్‌రెడ్డి ఆమరణ నిరాహారదీక్ష కొనసాగిస్తున్నారు. ఆదివారం ప్రభుత్వ వైద్యులు ఆరోగ్యం పరీక్షించేందుకు వచ్చినా నిరాకరించారు. దీక్షకు సంఘీభావంగా వచ్చిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను నిజామాబాద్–నిర్మల్ జిల్లాల సరిహద్దు వద్దే పోలీసులు నిలిపివేశారు. నిర్మల్ జిల్లా సోన్ వద్ద నిజామాబాద్ జిల్లా మెండోరా, నిర్మల్ పోలీసులు సంయుక్తంగా అరుణను అరెస్టు చేసి హైదరాబాద్‌కు పంపించారు. అరుణ సోన్‌లో, అనంతరం హైదరాబాద్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ఏలేటిని పరామర్శించడానికి వెళ్తున్న తనను ప్రభుత్వం అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు. అమిత్‌షా, కిషన్‌రెడ్డి ఆరా.. మహేశ్వర్‌రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఫోన్‌చేసి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఆమరణ దీక్ష, పోలీసులు లాఠీచార్జి చేయడంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఫోన్లో ఆరా తీశారని తెలిపారు. కాగా సోమవారం కిషన్‌రెడ్డితో పాటు రాష్ట్ర ఇన్చార్జి ప్రకాశ్ జవదేకర్ తదితరులు నిర్మల్ రానున్నట్లు పార్టీ నాయకులు వెల్లడించారు. మరోపక్క మాస్టర్‌ప్లాన్ రద్దు చేసేదాకా రిలే నిరాహార దీక్షలను ఆపేది లేదంటూ బాధిత రైతులు భీషి్మంచుకుని కూర్చున్నారు. ఆర్డీవో కార్యాలయం ఎదుట దీక్షలో ఉన్నవారిని ఆదివారం పలువురు నేతలు పరామర్శించారు. -
బీజేపీలోకి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి? మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, నిర్మల్: ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో అన్ని పార్టీల్లో సీట్ల పంచాయితీ మొదలైంది. టికెట్ ఇస్తారో లేదోనని కొందరు, స్థానికంగా తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో ఓటమి తప్పదని మరికొందరు పార్టీలు మారుతుండటం సహజం. కానీ, మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి వేరే పార్టీలోకి వెళ్తున్నారనే సమాచారం మాత్రం పెద్ద వార్తే అవుతుంది. తాజాగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై బీజేపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇంద్రకరణ్‌రెడ్డి కమలం పార్టీలో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మంత్రి తమ పార్టీలో చేరడానికి ప్రయత్నాలు చేశారని, ఆ మేరకు తనవద్ద ఆధారాలు ఉన్నాయన్నారు మహేశ్వర్ రెడ్డి. (మైనార్టీలకు గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి హరీశ్‌రావు, త్వరలో జీవో!) నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆయన గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బీజేపీలో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన స్నేహితుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారన్నారు. కావాలంటే తనవద్ద రుజువులు ఉన్నాయన్నారు. బీజేపీలో చేరితే ఇంద్రకరణ్‌రెడ్డికి ముథోల్ టిక్కెట్ ఇప్పిస్తామన్నారు. కానీ, ఇతరులపై విమర్శలు చేయవద్దని మంత్రికి మహేశ్వర్ రెడ్డి సూచించారు. ఓటమి తప్పించుకోవడానికి మంత్రి దారులు వెతుకున్నారని మహేశ్వర్ రెడ్డి ఎద్దేవా చేశారు. (అనాగరిక చర్య.. విచారకరం: మణిపూర్ ఘటనపై కేటీఆర్ స్పందన) -
బీజేపీలో చేరిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి
-
కాంగ్రెస్‌తో ఇబ్బంది లేదు కానీ.. : మహేశ్వర్‌రెడ్డి
సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి అధికారికంగా బీజేపీలో చేరిపోయారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, మహేశ్వర్‌రెడ్డికి కండువా కప్పి బీజేపీలోకి స్వాగతించారు. అంతుకు ముందు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ చుగ్ మహేశ్వర్‌రెడ్డికి శాలువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. బండి సంజయ్, ఈటల రాజేందర్, సంగప్ప తదితరులు మహేశ్వర్‌రెడ్డిని వెంట పెట్టుకుని మహేశ్వర్‌ను తరుణ్ చుగ్‌కు కలిపించారు. కాంగ్రెస్ రాజీనామా ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. రేపు(శుక్రవారం) మంచిర్యాలలో కాంగ్రెస్ సభకు ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. ఇంతలోనే మహేశ్వర్‌రెడ్డి తన రాజీనామాను ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు పంపడం గమనార్హం. టీపీసీసీ ఛీప్ రేవంత్‌రెడ్డితో పొసగకపోవడం, నోటీసుల నేపథ్యంలో నొచ్చుకుని ఆయన రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. నా విషయంలోనే ఇలా చేశారు: ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరాక మహేశ్వర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ సమావేశాల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయి. పొత్తులపై నేతలు తలో మాట మాట్లాడుతున్నారు. తెలంగాణాలో కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా ఉంది. కొంతమంది కోవర్టులున్నారని కాంగ్రెస్ నేతలే ఆరోపణలు చేస్తున్నారు. ఎవరు ఎవరికోసం పనిచేస్తున్నారో తెల్వడం లేదు. నా మీద సోషల్ మీడియాలో నిందలు మోపారు. గంటలోపల బదులు ఇవ్వమని నోటీసులు ఇవ్వడం దారుణం. నా ఒక్కడి విషయంలోనే అలా జరిగింది. నాకు కాంగ్రెస్ లో నిత్యం అనుమానాలు, అవమానాలే ఎదురైయ్యాయి. నరేంద్ర మోడీ నాయకత్వంలోనే తెలంగాణ ప్రజలకు విముక్తి వస్తుందనే నమ్మకం ఉంది. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తా. కాంగ్రెస్‌తో నాకు ఇబ్బంది లేదు. ఎప్పుడూ పార్టీ లైన్లోనే పని చేశా. కానీ, ఇటీవల పార్టీలోకి వచ్చిన ఓ వ్యక్తి సీనియర్లను ఇబ్బందులకు గురిచేస్తూ పార్టీని వీడేలా పనిచేస్తున్నారు అని మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. ► మహేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఇన్ని రోజులు పని చేశారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బిజెపిలో చేరారు. బిజెపికి ప్రజలు అవకాశం ఇవ్వాలని చూస్తున్నారు. అందరం కలిసి కట్టుగా నియంత పాలన అంతం చేసేందుకు కృషి చేస్తాం అని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. ► కాంగ్రెస్‌కి చెందిన పెద్ద నేత మహేశ్వర్‌రెడ్డి బీజేపీలో చేరారు. జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో చేరిపోయారు. ఆయన చేరికను స్వాగతిస్తున్నా. మహేశ్వర్ రెడ్డి చేరికతో బీజేపీ మరింత బలోపేతం అవుతుంది అని తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ ఛుగ్ చెప్పారు. -
కాంగ్రెస్‌కు మహేశ్వర్ రెడ్డి షాక్.. బీజేపీలో చేరికపై క్లారిటీ!
సాక్షి, హైదరాబాద్: నిర్మల్ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వ్యవహారం కాంగ్రెస్‌లో రోజుకో చర్చకు దారితీస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో నెలకొన్న విభేదాల నేపథ్యంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా పార్టీ మారబోతున్నారంటూ వస్తున్న ఊహాగానాలను నిజం చేస్తూ.. కాంగ్రెస్‌కు మహేశ్వర్‌రెడ్డి గురువారం రాజీనామా చేశారు. కాంగ్రెస్ సభ్యత్వానికి, పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నానని, త్వరలోనే బీజేపీలో చేరున్నట్లు మహేశ్వర్ రెడ్డి వెల్లడించారు. ఈమేరకు తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపారు. కాగా కాసేపట్లో ఆయన తరుణ్‌చుగ్ ఇంటికి వెళ్లనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు. చదవండి: కారేపల్లి ఘటనలో కుట్ర కోణం?.. కేటీఆర్ ఏమన్నారంటే! -
నా యాత్ర ఎందుకు ఆపారు? ఎవరి ఒత్తిడికి తలొగ్గారు?: మహేశ్వర్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జీ మాణిఖ్ రావు ఠాక్రేకు ఏలేటి మహేశ్వర్ రెడ్డి బహిరంగ లేఖ రాయడం పార్టీలో చర్చనీయాంశమైంది. తన హాత్ సే హాత్ జోడో యాత్రను అర్ధంతరంగా నిలిపివేయాలని ఆదేశించడం తనను తీవ్రంగా బాధించిందని మహేశ్వర్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. యాత్ర ఆగిపోవడం తనను అప్రతిష్టపాలు చేసిందని, ఎవరి ఒత్తిళ్లకో తలొగ్గి నా యాత్రను నిలిపివేశారని అనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్సే సర్వస్వం అనుకుని పని చేస్తున్న తనను ఇలా అవమానించడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. 'నా 18 ఏళ్ల రాజకీయ ప్రస్ధానంలో ఇలా బాధను, అసంతృప్తిని వ్యక్తం చేస్తూ లేఖ రాయడం కూడా ఇదే మొదటి సారి. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా నేను ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు తలపెట్టిన యాత్రను నాలుగు రోజులు నిర్వహించిన అనంతరం అర్ధంతరంగా నిలిపివేయాలని మీరు ఆదేశించడం నన్ను తీవ్రంగా బాధించింది. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ కు తలపెట్టిన నా తెలంగాణ పోరు యాత్రను విరామం అనంతరం తిరిగి ఈ నెల పదో తేదీ నుంచి ప్రారంభించేందుకు నేను అన్ని ఏర్పాట్లు ముందే చేసుకున్నాను. కానీ మీరు నిర్మల్ సభ ముగిసిన అనంతరం, షెడ్యూల్ ప్రకారం నా యాత్రను కొనసాగించడానికి వీల్లేదని, రద్దు చేసుకోవాలని ఆదేశించడం నన్ను షాక్ కు గురిచేసింది. ఈ సందర్భంలో మీరు నాతో మాట్లాడిన తీరు కూడా నన్ను తీవ్రంగా బాధించింది. అదే సమయంలో కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క గారు హాత్ సే హాత్ జోడో యాత్రను ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు నిర్వహిస్తానంటూ ముందుకురావడం, సహకరించాలని నన్ను కోరడంతో నేను నా యాత్రను భట్టి గారి యాత్రలో విలీనం చేస్తున్నట్టు, ఈ యాత్రను ఆయన కొనసాగిస్తారని ప్రకటించాల్సి వచ్చింది. నా యాత్రను మీరు ఉన్న పళంగా అకారణంగా రద్దు చేసిన అంశం వివాదం కావొద్దనే సదుద్దేశంతో నేను భట్టి విక్రమార్క గారి యాత్రకు సహకరిస్తున్నట్టు ప్రకటించాను. అయితే నాయాత్రను ఆపేయాలన్న మీరు అదే సందర్భం లో ఇతర సీనియర్లు కూడా యాత్రలు చేస్తారని చెప్పడం వెనకున్న మతలబేంటి, మరి విజయవంతంగా సాగుతున్న నా యాత్రను అర్ధంతరంగా ఎందుకు నిలిపివేసినట్టు, ఇంతలా నన్ను అవమానించడం ఎంత వరకు సమంజసం? హాత్ సే హాత్ జోడో అభియాన్ అనేది ఏఐసీసీ రూపొందించిన ప్రోగ్రామ్. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ గా తెలంగాణలో హాత్ సే హాత్ జోడో యాత్రలను పర్యవేక్షించాల్సింది నేనే. అలాంటి బాధ్యతలో ఉన్న నన్ను, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ అయినే మీరే అడ్డుకోవడమేంటి? కాంగ్రెస్ ఇమేజ్ ను బలోపేతం చేసేందుకు పార్టీ జెండా పట్టుకుని యాత్ర చేస్తున్నానే తప్ప కొందరిలా సొంత ప్రతిష్ట పెంచు కోవాలనే అజెండాతో కాదే, మరి అలాంటపుడు ఎందుకని నా యాత్రను ఆపేయాలన్నారు? ఏఐసిసి ప్రోగ్రామ్స్ అమలు విషయంలో నన్ను బైపాస్ చేస్తూ, అవమానిస్తున్న అంశాన్ని నేను మీ దృష్టికి తీసుకొచ్చాను. అయితే జరుగుతున్న లోపాలను సరిచేయాల్సిన మీరే అవేమీ పట్టించు కోకుండా ఏక పక్షంగా వ్యవహరించడం ఎంత వరకు సమంజసం. పదవులు నాకు ముఖ్యం కాదు, ప్రజా సేవే నా లక్ష్యం. ఇది నాకు తాత, తండ్రి నుంచి వచ్చిన రక్తగత లక్షణం. ఆత్మాభిమానాన్ని చంపుకుని అవమానాలు, భరిస్తూ పనిచేయడం నా విధానం కాదు. నేను లేవనెత్తిన అంశాలకు సమాధానం ఇస్తారని ఆశిస్తున్నా.' అని మహేశ్వర్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. చదవండి: నా యాత్రలో అందరూ భాగస్వాములు కావాలి: భట్టి విక్రమార్క -
డామిట్.. స్క్రీన్ ప్లే సరిగ్గా లేదా?.. ఎందుకిలా జరిగింది?
పీసీసీ చీఫ్ రేవంత్‌కు దమ్కీ ఇద్దామనుకున్నారు. సొంత జిల్లాలో పాదయాత్ర, సభ నిర్వహించారు. రేవంత్ వ్యతిరేక నేతలందరినీ కూడగట్టారు. ఈ దెబ్బతో పీసీసీ చీఫ్‌కు దడ పుడుతుందని భ్రమించారు. కాని సీన్ రివర్సయింది. నాయకులు చాలా మంది వచ్చారు. కాని జనమే తక్కువ మంది వచ్చారు. నేతల ఉపన్యాసాలు వినేందుకు జనమే కరువయ్యారు. అది ఏ జిల్లా? రేవంత్‌కు పోటీగా పాదయాత్ర నిర్వహించిన ఆ నేత ఎవరు? చేతిలో పోటీ పాదయాత్ర తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్రకు పోటీగా కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ మహేశ్వరరరెడ్డి పాదయాత్ర ప్రారంభమైంది. ఇప్పటికే తన పాదయాత్రలో భాగంగా రాహుల్ గాంధీ సందేశాన్ని, తెలంగాణ సర్కార్ వైపల్యాలను ప్రజల్లోకి తీసుకవెళ్లుతున్నారు టీపీసీసీ చీఫ్. రాబోయే ఎన్నికలలో హస్తం పార్టీకి పట్టం కట్టాలని ప్రజలను కోరుతున్నారు రేవంత్. ఇదిలా ఉంటే మహేశ్వర రెడ్డి నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గంలోని బైంసాలో తన పాదయాత్ర చేపట్టారు. రేవంత్ యాత్రకు సవాలు విసిరే విధంగా ఉందని భావించిన ఆయన వ్యతిరేక ఉద్దండ నేతలంతా మహేశ్వరరెడ్డి పాదయాత్ర ప్రారంభించడానికి హాజరయ్యారు. సీఎల్పీ భట్టి విక్రమార్క, ఉత్తమ కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ తదితర రేవంత్ వ్యతిరేక వర్గం అంతా మహేశ్వరరెడ్డి పాదయాత్రకు మద్దతుగా తరలివచ్చారు. పబ్లిక్ రిపోర్ట్‌లో రిజల్ట్ లేదా? అయితే మహేశ్వర్ రెడ్డి పాదయాత్రకు ప్రజల నుంచి స్పందన కరువైంది. తన పాదయాత్ర అంటే వేలాది మంది ప్రజలు తరలి వస్తారని మహేశ్వర్ రెడ్డి అంచనా వేసుకున్నారు. కాని సభకు కొన్ని వందల మంది మాత్రమే హజరయ్యారు. వచ్చినవారంతా మహేశ్వరరెడ్డి సొంత నియోజకవర్గం నిర్మల్ జనమే ఎక్కువగా ఉన్నారు. సభ నిర్వహించిన ముథోల్ నియోజకవర్గం నుండి జనాన్ని తరలించడంలో మహేశ్వరరెడ్డి అనుచరులు ఫెయిలయ్యారనే టాక్ వినిపిస్తోంది. జనం లేక పాదయాత్ర ప్రారంభ సభలో కాంగ్రెస్ నాయకులకు ప్రోత్సాహం కరువైంది. మహేశ్వరరెడ్డితో సహా సభలో పాల్గొన్న నాయకులంతా నిమిషాల వ్యవధిలోనే తమ ఉపన్యాసాలను ముగించారు. అందరూ మహేశ్వరరెడ్డి పాదయాత్ర చేపట్టినందుకు ప్రశంసించారు. కాంగ్రెస్ ఉద్దండులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఆ సభ ప్రసంగాలు వినే ప్రజలు లేక కేవలం 40 నిమిషాల్లోపే ముగిసింది. ఎందుకిలా జరిగింది? పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పాదయాత్రకు పోటీ పాదయాత్ర అంటే జనం పోటెత్తుతారని భావిస్తే.. అసలు స్పందనే రాకపోవడంతో మహేశ్వరరెడ్డి ఆందోళన చెందుతున్నారట. పార్టీలోని సీనియర్ నాయకుల ముందు పరువు పోయిందని మదన పడుతున్నారట. రేవంత్ పాదయాత్ర కంటే తన పాదయాత్రకు ప్రజలు భారీగా వస్తారని అంచనాలు వేసుకున్నారట మహేశ్వరరెడ్డి. కాని రేవంత్ పాదయాత్రకు వస్తున్న స్పందనలో పది శాతం కూడా తనకు రాకపోయేసరికి తట్టుకోలేకపోతున్నారట. నిర్మల్ లో రాహుల్ గాంధీ పాదయాత్ర విజయవంతం అయింది. బారీ బహిరంగ సభలు సక్సెస్ చేశారు. కాని తన పాదయాత్రకు స్పందన లేకపోవడానికి గల కారణాలను వెతుకుతున్నారట. మొదటగా జనాన్ని తరలించడంలో విఫలమైన అనుచరులపై ఆగ్రహం వ్యక్తం చేశారట మహేశ్వర్ రెడ్డి. ఆ వైఫల్యానికి కారణాలేంటీ? పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని వ్యతిరేకించే సీనియర్ నాయకులంతా వెన్ను తట్టి ప్రోత్సహించడంతో.. అట్టహాసంగా ప్రారంభిద్దామనుకున్న మహేశ్వర్ రెడ్డి పాదయాత్రకు స్పందన రాకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయంటున్నారు. మహేశ్వరరెడ్డి రోడ్డు మీదకు వెళితే తండోపతండాలుగా జనం వచ్చేంత పాపులర్ లీడర్ ఏమీ కాదు. పైగా ఆయన తన సొంత నియోజకవర్గం నిర్మల్ వదిలి పక్క నియోజకవర్గం అయిన ముథోల్‌లో పాదయాత్ర చేపట్టారు. ముథోల్ సెగ్మెంట్‌కు చెందిన డీసీసీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరడంతో.. క్యాడర్ మొత్తం ఆయనతో పాటు కాషాయ తీర్థం తీసుకుంది. కాంగ్రెస్ జెండాలు కట్టేవాళ్లు లేనిచోట మహేశ్వర రెడ్డి పాదయాత్ర చేపట్టడం మైనస్ గా మారిందట. ముథోల్‌లో కాకుండా సొంత నియోజకవర్గం నిర్మల్‌లోనే యాత్ర చేపట్టాలని సన్నిహితులు, సీనియర్లు సూచించినా మహేశ్వరరెడ్డి పట్టించుకోలేదట. కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ హోదాలో ఉండి అత్యుత్సాహం చూపిన ఫలితంగా మహేశ్వర రెడ్డి తన పరువు తానే తీసుకున్నారని ఆయన అనుచరులు, కార్యక్తలు అందోళన చెందుతున్నారట. చదవండి: ఈడీ విచారణకు కవిత.. అరెస్ట్ తప్పదా?.. ఒకవేళ అదే జరిగితే పరిస్థితి ఏంటి? ఆరంభ సభే అట్టర్ ప్లాప్ కావడంతో...ఈ ప్రభావం తర్వాత రోజులలో నిర్వహించే పాదయాత్రపై పడకుండా మహేశ్వరరెడ్డి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారట. భారీగా జనాన్ని తరలించాలని అనుచరులకు మహేశ్వర రెడ్డి ఆదేశాలు జారీచేశారట. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ -
కాంగ్రెస్ తెలంగాణ పోరు ‘యాత్ర’
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ మరో యాత్రకు సిద్ధమవుతోంది. మార్పు కోసం పేరుతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ‘హాథ్‌సే హాథ్ జోడో’ యాత్ర ఓ వైపు కొనసాగిస్తుండగా, మరోవైపు నుంచి ఇంకో యాత్ర ప్రారంభించాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వరకు ఈ యాత్ర కొనసాగనుంది. ఈ యాత్రకు సంబంధించిన వివరాలను ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సోమవారం గాంధీభవన్‌లో వెల్లడించారు. మహేశ్వర్‌రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. మార్చి మూడో తేదీ నుంచి ‘కాంగ్రెస్ తెలంగాణ పోరు యాత్ర’ పేరుతో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. బాసర సరస్వతీ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత భైంసా వరకు తొలి రోజు యాత్ర కొనసాగుతుంది. ఆ తర్వాత నిర్మల్, ఖానాపూర్, ఉట్నూర్, ఆదిలాబాద్, ఇచ్ఛోడ మీదుగా బోథ్ వరకు తొమ్మిదో తేదీవరకు యాత్ర నిర్వహిస్తారు. మధ్యలో మార్చి 7వ తేదీన హోలీ సందర్భంగా యాత్రకు విరామం ప్రకటించనున్నారు. తొమ్మిదో తేదీన బోథ్ వరకు తొలి విడత యాత్ర ముగిసిన తర్వాత రెండో విడత షెడ్యూల్ ఖరారు చేయనున్నారు. మొత్తం మీద బాసర నుంచి హైదరాబాద్ వరకు యాత్రను పూర్తి చేసి, ముగింపు కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నిర్వహించేలా యాత్ర షెడ్యూల్‌ను రూపొందిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో 1,2 రోజుల పాటు యాత్ర కొనసాగేలా షెడ్యూల్ తయారు చేశామని, అధిష్టానం ఆదేశాల మేరకే ఈ యాత్ర జరుగుతోందని, యాత్రలో రాష్ట్ర కాంగ్రెస్‌కు చెందిన ముఖ్య నేతలందరూ పాల్గొంటారని మహేశ్వర్‌రెడ్డి వెల్లడించారు. -
‘హస్తం’లో కొత్త కోణం.. ఏళ్లుగా వైరం.. సేవ్ కాంగ్రెస్‌తో ఒక్కటైన వైనం
సాక్షి,ఆదిలాబాద్: ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీలో నిన్న, మొన్నటి వరకు మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డిలదే పైచేయి. నాలుగు జిల్లాల్లో అయితే ఆ వర్గం లేని పక్షంలో ఈ వర్గం అన్నట్లుగా పార్టీ వ్యవహారాలు సాగుతూ వచ్చాయి. ముఖ్య నాయకులంతా వారి అనుచర వర్గంగానే కొనసాగారు. ఏళ్లుగా ఈ ఇద్దరు నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో వైరం కొనసాగుతూ వచ్చింది. తాజాగా సేవ్ కాంగ్రెస్ నినాదంతో రాష్ట్రంలోని కొంత మంది ముఖ్యనేతలు తిరుగు బావుటా ఎగరవేసిన సంగతి విధితమే. ఇందులో భాగంగా మహేశ్వర్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావు ఒక్కటవడాన్ని పార్టీ కార్యకర్తలు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇదిలా ఉంటే వారి తీరును ఖండిస్తూ కొంత మంది నాయకులు వ్యతిరేకంగా కదలడం పార్టీలో ఇప్పుడు సంచనలం కలిగిస్తోంది. తద్వారా ఈ రెండు వర్గాలకు ధీటుగా మరో వర్గం కీలకంగా తయారవుతుందన్న చర్చ సాగుతోంది. ఇటీవల ఆదిలాబాద్‌లో మీడియా సమావేశంలో ఏఐసీసీ సభ్యులు నరేశ్‌జాదవ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వెడ్మ బొజ్జు కొత్త కమిటీల తరువాత.. ఇటీవల పార్టీ అధిష్టానం కొత్త కమిటీలను నియమించింది. ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడిగా సాజిద్‌ఖాన్‌ను పూర్తి స్థాయిలో నియమించింది. గతంలో ఆయన ఇన్‌చార్జీగా కొనసాగారు. మహేశ్వర్‌రెడ్డి అనుచరుడిగా ఉన్నారు. మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలిగా మరోసారి ప్రేమ్‌సాగర్‌రావు సతీమణి కె.సురేఖనే నియమించారు. నిర్మల్‌లో మహేశ్వర్‌రెడ్డి అనుచరుడు ముత్యంరెడ్డికి అవకాశం కల్పించారు. కుమురం భీం ఆసిపాబాద్‌లో పెండింగ్‌లో పెట్టారు. ఇక ఆదిలాబాద్ జిల్లా నుంచి టీపీసీసీ ఎగ్జిక్యూటీవ్ కమిటీలో మాజీ మంత్రి సి.రాంచంద్రారెడ్డికి చోటు కల్పించారు. ప్రస్తుతం ఆయన వయోభారంతో కీలకంగా వ్యవహరించకపోయినా తనకంటూ ప్రత్యేక అనుచరగణం ఉంది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా గండ్రత్ సుజాతతో పాటు ఉట్నూర్‌కు చెందిన వెడ్మ బొజ్జుకు చోటు కల్పించారు. ఆయన నేరుగా రేవంత్‌రెడ్డి అనుచరుడిగా పేరుంది. తాజా రాజకీయాల నేపథ్యంలో సుజాత సైలెంట్‌గా ఉండగా, బొజ్జు పార్టీలో పట్టుసాధించేందుకు గట్టి యత్నాలు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో మాజీ మంత్రి గడ్డం వినోద్‌కు ఎగ్జిక్యూటీవ్ కమిటీతో పాటు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగానూ నియమించారు. పార్టీ పరిస్థితులపై ప్రస్తుతం ఆయన స్తబ్దుగానే ఉన్నారు. మంచిర్యాల, కుమురంభీం జిల్లాల్లో కొంత మంది నాయకులకు రాష్ట్ర కమిటీల్లో చోటు దక్కింది. వారు ప్రేమ్‌సాగర్‌రావు అనుచరులుగా ఉన్నారు. దీంతో జిల్లా, రాష్ట్ర కమిటీల పరంగా ముఖ్య నేతల అనుచరులకు ప్రాధాన్యత ఇస్తూనే కొత్త నాయకులకు పార్టీ అవకాశం కల్పించింది. చదవండి: కేసీఆర్ డ్రగ్ టెస్ట్ సవాల్‌పై బండి సంజయ్ కౌంటర్ నేతల తీరుపై ధ్వజం.. కాంగ్రెస్‌లో రాష్ట్ర స్థాయిలో కొంత మంది ముఖ్య నేతలు సేవ్ కాంగ్రెస్ నినాదం అందుకోగా అందులో ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరు ముఖ్యనేతలు ఉండటం, వారి తీరును ఖండిస్తూ ఆదిలాబాద్‌లో కొంత మంది కాంగ్రెస్ నాయకులు ప్రెస్‌మీట్ పెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. తద్వారా రానున్న రోజుల్లో ఈ రెండు వర్గాలే కాకుండా వారికి వ్యతిరేకంగా మరో వర్గం తయారైందనేది స్పష్టం అవుతోంది. ఇది ప్రస్తుతం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే సేవ్ కాంగ్రెస్ నినాదం పరిణామాలు ఎలా ఉంటాయనేది కూడా ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్ నాయకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
తెలంగాణ కాంగ్రెస్‌పై హైకమాండ్ ఫోకస్.. రంగంలోకి దిగ్విజయ్ సింగ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌పై హైకమాండ్ ఫోకస్ పెట్టింది. రాష్ట్ర కాంగ్రెస్‌లో నెలకొన్న వివాదాల పరిష్కారానికి అధిష్టానం దూతలు రంగంలోకి దిగారు. సంక్షోభ నివారణ బాధ్యతలు రాజ్యసభ ఎంపీ దిగ్విజయ్ సింగ్‌కు అప్పజెప్పుతూ ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత మహేశ్వర్ రెడ్డికి దిగ్విజయ్ సింగ్ మంగళవారం ఫోన్ చేశారు. సాయంత్రం సీనియర్ల సమావేశాన్ని వాయిదా వేయాలని దిగ్విజయ్ సూచించారు. ఈ మేరకు మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. త్వరలోనే దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్‌కు వస్తున్నారని పేర్కొన్నారు. పార్టీ నేతలతో దిగ్విజయ్ భేటీ కానున్నారని తెలిపారు. సమస్యను పరిష్కరిస్తామని దిగ్విజయ్ చెప్పారని పేర్కొన్నారు. కాగా ముందస్తు నిర్ణయం ప్రకారం మంగళవారం సాయంత్రం మహేశ్వర్ రెడ్డి ఇంట్లో కాంగ్రెస్ సీనియర్లు భేటీకావాల్సి ఉంది. అయితే దిగ్విజయ్ సింగ్ ఫోన్‌తో వారు వెనక్కి తగ్గారు. తాజా పరిణామాల నేపథ్యంలో సాయంత్రం జరగాల్సిన కాంగ్రెస్ సీనియర్ల సమావేశం వాయిదా పడింది. మరోవైపు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో మహేష్ గౌడ్, కోదండరెడ్డి భేటీ అయ్యారు. సాయంత్రం సీనియర్ల సమావేశం వాయిదా వేయాలని కోరారు. చదవండి: తెలంగాణ పీసీసీలో విభేదాలపై ప్రియాంక నజర్ -
Congress Party: అంతా రేవంత్ ఇష్టమేనా? ఇలానే ఉంటే ఎవరూ మిగలరు!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పునర్వ్యవస్థీకరణ, కార్యవర్గ ఏర్పాటుపై తీవ్ర కసరత్తు జరుగుతున్న వేళ.. కాంగ్రెస్ నేతల్లో విభేదాలు భగ్గుమంటున్నాయి. ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఇన్‌చార్జ్‌లకు అనేక ఫిర్యాదులు చేసిన పార్టీ నేతలు తమ ఫిర్యాదుల పరంపరను కొనసాగిస్తున్నారు. మంగళవారం ఢిల్లీలో ఖర్గేను కలిసినప్పుడు సైతం తెలంగాణ కాంగ్రెస్ కమిటీల ఏర్పాటు, రేవంత్ ఏకపక్ష నిర్ణయాలపై నేతలు తీవ్ర అభ్యంతరాలు తెలిపినట్లు సమాచారం. కమిటీల్లో, కార్యవర్గంలో ఇష్టారీతిన సొంతవారికే పదవులు కట్టబెడితే కాంగ్రెస్ పార్టీలో ఎవరూ మిగలరనే విధంగా పార్టీ అధ్యక్షుడు ఖర్గేకు స్పష్టంచేసినట్లు తెలిసింది. సీనియర్లను కాదని సొంత మనుషులకే పెద్దపీట తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, మహేశ్వర్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, షబ్బీర్ అలీ, వంశీచంద్ రెడ్డి మంగళవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో విడివిడిగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పీసీసీ కార్యవర్గ ఏర్పాటుపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలిసింది. కార్యవర్గ ఏర్పాటులో రేవంత్ సొంత నిర్ణయాలు, సీనియర్లపై ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, పార్టీలో నేతల మధ్య సమన్వయలోపం తదితర అనేక విషయాలను ఖర్గే దృష్టికి సీనియర్లు తీసుకెళ్లినట్లు సమాచారం. కమిటీల్లో పార్టీ సీనియర్లను కాదని, జూనియర్ నేతలు, టీడీపీ నుంచి వచ్చిన నేతలు, సొంత మనుషులకే రేవంత్‌రెడ్డి పెద్దపీట వేస్తున్నారన్న విషయం తమకు తెలిసిందంటూ ఖర్గేకు సదరు నేతలు చెప్పినట్టు సమాచారం. ఈ పరిణామాలు తెలంగాణలో పార్టీ భవిష్యత్తుకు ఏమాత్రం క్షేమకరం కాదని ఖర్గేకు స్పష్టంచేసినట్లు తెలిసింది. తెలంగాణలో రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర పూర్తయిన తరువాత... ఇప్పటివరకు కూడా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి గాంధీభవన్‌లో పార్టీ నేతలు, కార్యకర్తలు ఎవరికీ అందుబాటులో లేరని ఫిర్యాదు చేసినట్టు సమాచారం. అలాగే పార్టీకి సంబంధించిన అనేక కీలక విషయాల్లో సీనియర్ల అభిప్రాయాలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోవట్లేదని ఖర్గే దృష్టికి తీసుకెళ్లారు. రేవంత్ తీరుతో పార్టీలో ఎవరూ మిగులరని, ఈ దృష్ట్యా కమిటీల ఏర్పాటు, పార్టీలో నేతల మధ్య సమన్వయం, రేవంత్ ఏకపక్ష నిర్ణయాలపై తక్షణమే జోక్యం చేసుకోవాలని నేతలు పార్టీ అధ్యక్షుడికి మొరపెట్టుకున్నట్లుగా తెలిసింది. దీనిపై స్పందించిన ఖర్గే రేవంత్‌ను పిలిపించుకొని అన్ని అంశాలపై మాట్లాడుతానని హామీ ఇచ్చారని చెబుతున్నారు. అంతర్గత విషయాలు చర్చించాం: భట్టి ఈ భేటీ అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ, మల్లికార్జున ఖర్గేతో పార్టీ అంతర్గత విషయాలు మాత్రమే చర్చించుకున్నామని, కమిటీల అంశం తనకు తెలియదని దాటవేశారు. పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణలో పార్టీ నాయకులందరూ కలిసి పనిచేసేలా చూడాలని ఖర్గేను కోరానని తెలిపారు. షబ్బీర్ అలీ మాట్లాడుతూ, తెలంగాణ కాంగ్రెస్‌లో అంతా బాగుందని.. రేవంత్ నాయకత్వంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పుకొచ్చారు. అంతేగాక పార్టీలోని సీనియర్లలో ఎలాంటి అసంతృప్తి లేదని వ్యాఖ్యానించారు. -
మాణిక్యం ఠాగూర్ ముఖం చాటేశారా.?
-
ప్రజల ప్రాణాలతో టీఆర్ఎస్, బీజేపీ చెలగాటం
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో టీఆర్ఎస్, బీజేపీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. శనివారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ధర్నాలు, రైతుబంధు సంబురా ల పేరుతో టీఆర్ఎస్, బీజేపీలు ప్రజల పట్ల బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నాయన్నారు. ఈ రెండు పార్టీల కార్యక్రమాలపై ఆంక్షలు విధించాలని డిమాండ్ చేశారు. కోవిడ్ వ్యాప్తి కారణంగా ఏఐసీసీ ఆదేశాల మేరకు తమ పార్టీ శిక్షణా కార్యక్రమాలను వాయిదా వేస్తున్నామని, నిర్వహణ తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. -
కలసి పనిచేయండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా నాయకులు సమష్టిగా పనిచేయాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ టీపీసీసీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రజా సమస్యలపై పోరాటాలు చేపడుతూనే.. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని సూచించారు. బుధవారం మధ్యాహ్నం 3:30కు ఢిల్లీలోని తన నివాసంలో పీసీసీ నేతలతో రాహుల్‌గాంధీ సమావేశమయ్యారు. ఈ భేటీలో వివిధ అంశాలపై నేతలందరి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల పార్టీ చేపట్టిన కార్యక్రమాలను, భవిష్యత్తు ప్రణాళికలనూ ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో టీపీసీసీ నూతన కమిటీ ఏర్పాటయ్యాక రాహుల్‌గాంధీతో ఇదే తొలి సమావేశం కావడం గమనార్హం. ఇందులో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాసకృష్ణన్, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యక్రమాల కమిటీ చైర్మన్ మహేశ్వర్‌రెడ్డి, కన్వీనర్ అజ్మతుల్లా హుస్సేన్, వర్కింగ్ ప్రెసిడెంట్లు జె.గీతారెడ్డి, అజారుద్దీన్, మహేశ్‌కుమార్ గౌడ్ పాల్గొన్నారు. కాగా.. ఈ భేటీకి ముందు మాణిక్యం ఠాగూర్, బోసురాజు, శ్రీనివాసకృష్ణన్‌లతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఏఐసీసీ కార్యాలయంలో సమావేశమై పలు అంశాలపై సమీక్షించారు. రాహుల్‌తో సమావేశం తర్వాత రేవంత్‌రెడ్డి బుధవారం రాత్రి పార్టీ రాష్ట్ర నేతలకు తన నివాసంలో విందు ఇచ్చారు. రాష్ట్ర సంపదను మింగేస్తున్నారు: రేవంత్ రాహుల్‌గాంధీతో సమావేశం జరిగిన తర్వాత పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కల్వకుంట్ల కుటుంబం పెద్ద అనకొండలా మారి రాష్ట్ర సంపద మింగేస్తోందని ఆరోపించారు. గత ఏడున్నరేళ్లలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు చీకటిమయం అయ్యాయని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో నిర్మించే టీఆర్ఎస్ కార్యాలయం ఎప్పటికీ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక కాబోదని స్పష్టం చేశారు. కేసీఆర్ ఇప్పటికే జిల్లా, రాష్ట్రస్థాయిలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులు కట్టుకున్నారని.. ఇప్పుడు ఢిల్లీలో కేంద్రం ఇచ్చిన స్థలంలో పార్టీ ఆఫీసు కట్టుకుంటున్నారని రేవంత్ పేర్కొన్నారు. పార్టీ కార్యాలయాలన్నీ కేసీఆర్ కుటుంబ ఆస్తులే తప్ప.. వాటితో తెలంగాణ ప్రజలకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అధికారంలోకి వచ్చి ఏడున్నర ఏళ్లు అయినా.. తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవమైన అమరవీరుల స్థూపాన్ని ఎందుకు నిర్మించలేకపోయారని ప్రశ్నించారు. అమరువీరులను గౌరవించే ఉద్దేశం బీజేపీకి ఉంటే.. అమరవీరుల స్థూపం నిర్మించుకునేందుకు ఎకరం స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. అండగా నిలిచేది కాంగ్రెసే ఉద్యమకారులు, నిరుద్యోగ యువత, రైతులు, దళితులకు కాంగ్రెస్ పార్టీనే అండగా నిలబడి పోరాడుతోందని రేవంత్ అన్నారు. రాష్ట్రంలో సమస్యలు, అవినీతి, ప్రాజెక్టుల్లో కుంభకోణాల వంటి అంశాలను రాహుల్‌గాంధీకి వివరించి భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించామన్నారు. పార్టీ బలోపేతంపై రాహుల్ సూచనలు, సలహాలు తీసుకున్నామని.. మూడు నెలలకోసారి రాష్ట్రంలో పర్యటించాలని ఆయనను కోరామని రేవంత్ వెల్లడించారు. డిసెంబర్ 9న రాష్ట్రంలో కాంగ్రెస్ సభ్యత్వ నమోదు ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించామని వివరించారు. ఈనెల 17న గజ్వేల్‌లో నిర్వహించనున్న తెలంగాణ విమోచన దినోత్సవానికి కాంగ్రెస్ రాజ్యసభాపక్షనేత మల్లికార్జున ఖర్గే హాజరవుతారని తెలిపారు. రాజకీయ లబ్ధి కోసమే మోదీతో భేటీ ప్రధాని మోదీని అడ్డుపెట్టుకొని రాజకీయ లబ్ధి పొందేందుకే సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన చేపట్టారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ టూర్లో రాష్ట్ర విభజన చట్టం లోని అంశాలపై చర్చించలేదని, వాటిపై ప్రధాని నుంచి ఎలాంటి హామీ పొందలేదని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీని ఎన్ని స్థానాల్లో నిలబెట్టాలన్న విషయంగా మోదీ, అమిత్ షాల నుంచి కేసీఆర్ సూచనలు తీసుకొన్నారని..అసదుద్దీన్ ఓవైసీని బరిలో దింపే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. -
ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీ
కరీంనగర్‌టౌన్: కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ.. రెండూ ఒక్కటేనని, ఢిల్లీలో దోస్తీ చేస్తూ గల్లీలో కుస్తీ పడుతున్నట్లు నటిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ విమర్శించారు. ఆదివారం ఆయన కరీంనగర్‌లోని డీసీసీ కార్యాలయంలో పార్లమెంట్ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచేస్తోందని, ఆ కుటుంబ పాలనకు తెర దించాల్సిన అవసరం ఉందని అన్నారు. రాత్రి 8 గంటల తర్వాత రాష్ట్రంలో ఎలాంటి విపత్కర సంఘటనలు జరిగినా ప్రజలకు అందుబాటులో ఉండని మోడ్రన్ ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ అవినీతి, అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు చర్యలెందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పూర్తిస్థాయిలో అవినీతిలో కూరుకుపోయారని ఆరోపించారు. మంత్రి గంగుల కమలాకర్ అక్రమంగా గ్రానైట్ తవ్వకాలు చేస్తూ, కోట్లాది రూపాయల పన్నులు ఎగ్గొట్టినా ఈడీ చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యం ఏమిటన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి చిత్తశుద్ధి ఉంటే గంగుల కమలాకర్ గ్రానైట్‌స్కాంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేయాలని సూచించారు. సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి బోస్ రాజు, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్వర్‌రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఆత్మగౌరవ దండోరా మోగిద్దాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో దళితులు, గిరిజనుల ఆత్మగౌరవాన్ని దక్కించుకునేందుకు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి నుంచి శంఖం పూరిస్తామని టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ ప్రకటించింది. దళితులు, గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని బయటపెడతామని పేర్కొంది. శనివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఈ కమిటీ సమావేశం జరిగింది. ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజు, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, టీపీసీసీ ఎన్నికల కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యక్రమాల చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు గీతారెడ్డి, మహేశ్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్, ప్రచార కమిటీ కన్వీనర్ అజ్మతుల్లా హుస్సేన్ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. అయితే ఇంద్రవెల్లి సభపై చర్చ సందర్భంగా ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి మధ్య స్వల్ప వాగ్వాదం జరిగినట్టు తెలిసింది. తనకు సమాచారం లేకుండా ఇంద్రవెల్లి సభపై ఎలా నిర్ణయం తీసుకుంటారని మహేశ్వర్‌రెడ్డి ప్రశ్నించగా.. పీసీసీ చీఫ్‌గా తనకు అధికారం ఉందని, అయినా అందరితో చర్చించాకే నిర్ణయం తీసుకుంటామని రేవంత్ చెప్పినట్టు సమాచారం. ప్రభుత్వానివి అబద్ధాలు, అక్రమాలే.. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారమంతా అబద్ధాలు, అక్రమాలతోనే సాగుతోందని సమావేశంలో నేతలు విమర్శించారు. రాష్ట్రంలో కొందరు ఐఏఎస్ అధికారులు రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు ఐఏఎస్ ఉద్యోగం చేసే అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిటైర్డ్ ఐపీఎస్ ప్రభాకర్‌రావు ఇంటెలిజెన్స్‌లో ఉంటూ టీఆర్ఎస్ కార్యకర్తగా పనిచేస్తున్నారని.. ఈఎన్సీ మురళీధర్‌రావు రిటైరై ఏళ్లు గడుస్తున్నా కొనసాగించడం ఏమిటన్న దానిపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ఇక ఆదిలాబాద్‌లోని ఇంద్రవెల్లి సభకు దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరాగా పేరు ఖరారు చేశారు. ఈ సభ నిర్వహణకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఇన్చార్జిగా వ్యవహరిస్తారని ప్రకటించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికపై వచ్చే బుధవారం కరీంనగర్ నేతలతో సమావేశం అవుతానని రేవంత్‌రెడ్డి తెలిపారు. కాగా.. పీసీసీ నూతన కార్యవర్గాన్ని మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో సన్మానించారు. రాష్ట్రంలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చి, వారిని విద్య, ఉద్యోగాల్లో అభివృద్ధి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఈ సందర్భంగా రేవంత్ పేర్కొన్నారు. ముస్లింలకు రిజర్వేషన్లు పెంచుతానని కేసీఆర్ హామీ ఇచ్చి మోసం చేశారని విమర్శించారు. -
ట్రైనీ ఐపీఎస్ మహేశ్వర్‌రెడ్డి సస్పెన్షన్ చెల్లదు
సాక్షి, హైదరాబాద్: ట్రైనీ ఐపీఎస్ అధికారి మహేశ్వర్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వులను హైదరాబాద్‌లోని కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్) కొట్టేసింది. మహేశ్వర్‌రెడ్డిని ప్రొబేషనరీ శిక్షణకు అనుమతించాలని కేంద్ర ప్రభుత్వంతోపాటు జాతీయ పోలీస్ అకాడమీలను ఆదేశించింది. మహేశ్వర్‌రెడ్డి భార్య ఫిర్యాదుపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయ డాన్ని కారణంగా చూపించి ఐపీఎస్ శిక్షణ పొందుతున్న సమయంలో సస్పెండ్ చేయడాన్ని క్యాట్ తప్పుపట్టింది. చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా తనను సస్పెండ్ చేశారని మహేశ్వర్‌రెడ్డి సవాల్ చేసిన పిటిషన్‌ను క్యాట్ చైర్మన్ జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి, సభ్యుడు బీవీ సుధాకర్ల ధర్మాసనం మంగళవారం విచారించి ఉత్తర్వులు జారీ చేసింది. బీటెక్‌లో సహ విద్యార్థిని భావనను మహేశ్వర్‌రెడ్డి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారని, ఐపీఎస్‌కు ఎంపిక కావడంతో విడాకులు ఇస్తారనే భయంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారని పిటిషనర్ న్యాయవాది కె.సుధాకర్‌రెడ్డి వాదించారు. ఐపీఎస్‌కు ఎంపిక అయ్యాక అధికారిక పత్రాల్లో కూడా వివాహం జరిగినట్లుగా రాశారని, భార్య పేరు భావన అనే రాశారని వివరించారు. ముస్సోరి శిక్షణా సంస్థ డైరెక్టర్‌కు ఆమె ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేస్తే దానికి మహేశ్వర్‌రెడ్డి జవాబుతో డైరెక్టర్ సంతృప్తిని వ్యక్తపరిచా రంటూ వాటి పత్రాలను నివేదించారు. కేంద్రం తరఫు న్యాయవాది వాదిస్తూ.. ఎఫ్ఐఆర్ నమోదయ్యాక సస్పెండ్ చేసే అధికారం కేంద్రానికి ఉందన్నారు. బెంగళూరు సగం ఖాళీ అవుతుంది.. ఈ వాదనలపై జస్టిస్ నర్సింహారెడ్డి స్పందిస్తూ.. ‘రికార్డుల్లో మహేశ్వర్‌రెడ్డి తన భార్య భావన అని చెప్పారు. ఆరోపణలకు ఇచ్చిన జవాబుతో ముస్సోరి అకాడమీ డైరెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. భార్యాభర్తల మధ్య గొడవ ఉంది. దానిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆరోపణల దశలో ఉండగానే ఏవిధంగా సస్పెండ్ చేస్తారు..’అని ప్రశ్నించారు. బెంగళూరులో అయితే పది ఫ్యామిలీ కోర్టులకు విడాకుల కోసం వచ్చే వారిలో అత్యధికులు ఉన్నత చదువులు చదివిన వారేనని, వాళ్లలో చాలామందిపై ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని, వారందరినీ సస్పెండ్ చేస్తే బెంగళూరు సగం ఖాళీ అవుతుందని వ్యాఖ్యానించారు. కాపురంలో కలహాలు సహజమని, కౌన్సెలింగ్ సరిగ్గా జరిగితే కాపురాలు నిలబడతాయని అభిప్రాయపడ్డారు. ఎఫ్ఐఆర్ ఉందని చెప్పి సస్పెండ్ చేయడం చట్టవ్యతిరేకమని, తుది ఆదేశాలను బట్టి స్పందిస్తే తప్పులేదని ధర్మాసనం అభిప్రాయపడింది. -
మహేశ్వర్‌రెడ్డిని ఎందుకు సస్పెండ్ చేశారు?: క్యాట్
సాక్షి, హైదరాబాద్: ఐపీఎస్ ట్రైనీ కేవీ మహేశ్వర్‌రెడ్డిని ఎందుకు సస్పెండ్ చేశారో బుధవారం తెలియజేయాలని కేంద్ర హోం శాఖను కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) ఆదేశించింది. తనను అన్యాయంగా సస్పెండ్ చేశారని పేర్కొంటూ మహేశ్వర్‌రెడ్డి క్యాట్‌ను ఆశ్రయించారు. ఈ కేసును మంగళవారం క్యాట్ అడ్మినిస్ట్రేటివ్ మెంబర్ బీవీ సుధాకర్ విచారించి హోం శాఖకు నోటీసులు జారీ చేశారు. అఖిల భారత సర్వీస్ రూల్స్ (డీఅండ్‌ఏ)–1969 ప్రకారం సస్పెండ్ చేయడానికి వీల్లేదని, కేంద్రం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని మహేశ్వర్‌రెడ్డి తరఫు న్యాయవాది వాదించారు. ఇప్పటికే మహేశ్వర్‌రెడ్డి ఐపీఎస్ శిక్షణ పూర్తి చేశారని, పోస్టింగ్ అందుకోవాల్సిన దశలో నిరాధార ఆరోపణల ఆధారంగా ఆయనను సస్పెండ్ చేశారని చెప్పారు. నిబంధనల ప్రకారం ఓ క్రిమినల్ కేసు పెండింగ్ ఉందని చెప్పి సర్వీస్ నుంచి సస్పెండ్ చేయడానికి వీల్లేదని, అలాంటి కేసుల్లో 48 గంటల పాటు రిమాండ్‌లో ఉన్నప్పుడు మాత్రమే సస్పెండ్ చేయొచ్చని చట్టంలో ఉందన్నారు. భువన అనే యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పి మహేశ్వర్‌రెడ్డి మోసం చేశారనే ఆరోపణల నేపథ్యంలో కేంద్రం ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. -
ఒవైసీని రావద్దనే శక్తి నాకు లేదు
-
పచ్చీస్ దేతూం బోలా. ఆప్ జర ప్రోగ్రాం రోకో..!
‘భాయ్ నమస్తే.. మై రామారావు పటేల్. మహేశ్వరరెడ్డి అభీ ఆయా.. పచ్చీస్ దేతూం బోలా. ఆప్ జర ప్రోగ్రాం రోకో..’ ‘యే మేరాసే నహీ హోతా సాబ్. ఉనో పచ్చీస్ లాఖ్ నై పచాస్ లాఖ్ బీ దియోతో మై నై కర్సక్తా ఓ సాబ్‌కు నై బోల్ సక్తూబీ.. ’ భైంసా మున్సిపల్ వైస్ చైర్మన్ జాబీర్ అహ్మద్, ముథోల్ కాంగ్రెస్ అభ్యర్థి రామారావు పటేల్ మధ్య సాగిన సంభాషణ ఇది. సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: ‘నేను నిర్మల్ రాకుండా ఉంటే రూ.25 లక్షలు ఇస్తానని కాంగ్రెస్ అభ్యర్థి మహేశ్వర్‌రెడ్డి ఆఫర్ ఇచ్చాడు. నన్ను డబ్బులతో కొనలేరు’అని నిర్మల్ సభలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ నిప్పులు చెరగడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. అసద్ వ్యాఖ్యల నేపథ్యంలో జాబీర్ అహ్మద్, రామారావు పటేల్ మధ్య సాగిన ఫోన్‌కాల్ వాయిస్ రికార్డు మంగళవారం లీక్ అయింది. నాలుగు నిమిషాల పాటు సాగిన ఈ సంభాషణ టీఆర్ఎస్కు మద్దతుగా నిర్మల్‌లో ఏర్పాటు చేసిన సభకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ రాకుండా ఏం చేయాలనే అంశంపై సాగింది. సభకు అసద్ రాకుండా చేస్తే రూ.25 లక్షలు ఇస్తామని మహేశ్వర్‌రెడ్డి ఆఫర్ ఇచ్చినట్లుగా రామారావు పటేల్ ఎంఐఎం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడైన జాబీర్ అహ్మద్‌కు చెప్పడం గమనార్హం. ‘25 లక్షలు కాదు 50 లక్షలు ఇచ్చినా నేనా పని చేయలేను. సాబ్‌ను ఇక్కడికి రా, అక్కడికి పో అని చెప్పేంత శక్తి నాకు లేదు. నేను పార్టీ (ఎంఐఎం)ని నమ్ముకున్నా. మీరు మంచివారు కాబట్టి చెపుతున్నా.. నేనా పని చేయలేను. క్షమించండి’అని జాబీర్ వ్యాఖ్యానించాడు. రూ.25 లక్షలను ఎంఐఎం పార్టీ ఫండ్‌గా జమ చేసేందుకు కూడా సిద్ధమని, ఈ విషయాన్ని అసద్‌కు తెలియజేయాలని రామారావు సూచించినట్లు రికార్డులో ఉంది. అయితే తనతో ఆ పని సాధ్యం కాదని, నేరుగా అసద్ సాబ్ వద్దకే వెళ్లాలని, చాలా మంది కలుస్తుంటారని జాబీర్ సలహా ఇచ్చాడు. విఠల్‌రెడ్డిని ఓడించేందుకు మీకు సహకరిస్తున్నా.. ‘ముథోల్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి విఠల్‌రెడ్డిని ఓడించేందుకు మీకు సహకరిస్తా. ఇక్కడికి (భైంసా) అసద్ రాకుండా ఉండేందుకు చాలా కష్టపడ్డా. మీలాంటి మంచివారు గెలవాలి. విఠల్‌రెడ్డి ఓడిపోవాలి. మీ పని అయిపోతుంది. అంతే తప్ప ఐకే రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి కోసం నేను మధ్యవర్తిత్వం చేయను. అలా అసద్ సాబ్తో పనులు చేసుకుంటే నేను కోటీశ్వరున్ని అయిపోవాలి. నేనా పనులు చేయను. ఆయన దగ్గర నాకు ఇజ్జత్ ఉంది’అని జాబీర్ స్పష్టం చేశాడు. బట్టబయలు చేసిన అసద్ తాను నిర్మల్ సభకు రాకపోతే రూ.25 లక్షలు ఇస్తానని కాంగ్రెస్ అభ్యర్థి మహేశ్వర్‌రెడ్డి ఆఫర్ ఇచ్చాడని, తనను అడ్డుకునే ప్రయత్నం చేశారని అసదుద్దీన్ ఒవైసీ సోమవారం రాత్రి నిర్మల్‌లో వెల్లడించారు. దీనికి సంబంధించిన కాల్ రికార్డులు ఉన్నాయని స్పష్టం చేశారు. డబ్బులతో ఒవైసీని కొనలేరని, మైనారిటీ వర్గాల కోసం పార్టీ పనిచేస్తుందని తేల్చి చెప్పారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఓటేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఇంద్రకరణ్ కుట్ర: మహేశ్వర్‌రెడ్డి మైనార్టీల మద్దతు తనకుందనే కారణంతో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని నిర్మ ల్ కాంగ్రెస్ అభ్యర్థి ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం నామినేషన్ సందర్భంగా వచ్చిన జనాన్ని చూసి మతిభ్రమించిన మంత్రి తప్పుడు ప్రచారానికి దిగుతున్నారని ధ్వజమెత్తారు. అసదుద్దీన్‌ను తాను ఇప్పటి వరకు స్వయం గా చూడలేదని, ఆయన నిర్మల్‌కు వచ్చినా, రాకపోయినా తనకు నష్టమేమిటని ప్రశ్నించారు. ‘నిర్మల్ పట్టణ మైనార్టీలకు నా గురించి తెలుసు. నాకు పూర్తి మద్ధతిస్తున్నారు. ఇలాంటి చీప్ ట్రిక్స్‌తో నా ప్రతిష్టను దిగజార్చలేరు’ అని స్పష్టం చేశారు. -
కాంగ్రెస్‌కు ఝలక్!
హైదరాబాద్: బస్సు యాత్ర కమిటీ కన్వీనర్ పదవికి ఆదిలాబాద్ డీసీసీ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి రాజీనామా చేసినట్లు తెలిపారు. విలేకరులతో మాట్లాడుతూ.. బస్సు యాత్ర బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. ఆ లెటర్‌ను పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి పంపించామని చెప్పారు. ఉత్తర తెలంగాణలో 4 జిల్లాల్లో రెండు సీట్లు మాత్రమే గెలిచామని, వచ్చే ఎన్నికల్లో ఆదిలాబాద్‌లో అత్యధిక సీట్లు గెలిపించుకునేందుకే రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. నాయకులను సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఉందని వ్యాఖ్యానించారు. ఉత్తర తెలంగాణలో పార్టీ చాలా బలహీనంగా ఉందని, బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని ప్రాంతాలను ఏకం చేయడంలో పీసీసీ సమన్వయలోపం ఉన్నట్లు భావిస్తున్నానని అభిప్రాయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వచ్చినపుడు ఉన్న ఊపును కొనసాగించడం లేదని విమర్శించారు. -
రాహుల్ వచ్చిండు..కేసీఆర్ రాలే..!
నిర్మల్: తెలంగాణ ప్రజల కలను సోనియమ్మ నెరవేరిస్తే.. బంగారు రాష్ట్రం చేస్తామని కల్లబొల్లి మాటలతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ అన్నివర్గాల ప్రజలను దగా చేశాడని, రైతు ఆత్మహత్యల తెలంగాణగా మార్చాడని టీపీసీ చైర్మన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రజావ్యతిరేక పాలన సాగి స్తోందని, ఇక కుటుంబ పాలనను గద్దెదించాల్సిందేనని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రజాచైతన్య బస్సుయాత్ర మంగళవారం మధ్యాహ్నం నిర్మల్ చేరుకుంది. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం నుంచి సోన్‌లో ప్రవేశించిన వచ్చిన యాత్రకు జిల్లా నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడినుంచి భారీ వాహన ర్యాలీతో జిల్లాకేంద్రంలోని మినీ స్టేడియంలో గల సభాప్రాంగణానికి చేరుకున్నారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు, బస్సుయాత్ర కన్వీనర్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అధ్యక్షతన సభా కార్యక్రమం కొనసాగింది. ఈసందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నో హామీలతో గద్దెనెక్కిన సీఎం కేసీఆర్ ప్రజలకే చేసిందేమీ లేదన్నారు. రాష్ట్రంలో నాలుగువేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఢిల్లీ నుంచి తమ పార్టీ అధినేత రాహుల్‌గాంధీ వచ్చారన్నారు. నిర్మల్ జిల్లాలో మహేశ్వర్‌రెడ్డితో కలిసి 15 కిలోమీటర్లు పాదయాత్ర చేసి రైతుల కుటుంబాలను పరామర్శించి, రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయాన్ని అందించారన్నారు. కానీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ మాత్రం ఒక్క రైతు కుటుంబం వద్దకు రాలేదని, ఒక్కరినీ పరామర్శించిన పాపాన పోలేదని అన్నారు. నాలుగేళ్లుగా రైతులను పట్టించుకోని సర్కారు ఇప్పుడు ఎన్నికల ముంగిట కరెంట్ ఇస్తున్నామని, ఎకరాకు రూ.4వేలు ఇస్తామని నమ్మబలుకుతోందన్నారు. రైతుల ఓట్లను గంపగుత్తగా కొనేందుకే ఇలాంటి ఎన్నికల స్టంట్లను కేసీఆర్ చేస్తున్నాడని దుయ్యబట్టారు. కేసీఆర్ బీజేపీతో లోపాయికారి ఒప్పందం పెట్టుకునే ఫ్రంట్ నాటకాలు ఆడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ వస్తే అన్ని పంటకు అధిక మద్దతు ధరలను ఇస్తామని చెప్పారు. మహిళలకు డ్డీలేని రుణాలను పెంచుతామని, అభయహస్తం పింఛన్ పునరుద్దరిస్తామని, నిరుద్యోగ భృతి రూ.3వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆదిలాబాద్‌లో రెండు లక్షల ఎకరాలకు ప్రాణహిత–చేవెళ్ల పథకం ద్వారా నీరందిస్తామని, సిర్పూర్ పేపర్ మిల్లును తెరిపిస్తామని హామీ ఇచ్చారు మహేశ్వర్‌రెడ్డి గెలుపు ఖాయం : రేవంత్ నిర్మల్‌లో డీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి గెలుపు ఖాయమని రేవంత్‌రెడ్డి జోస్యం చెప్పారు. ప్రజల సంక్షేమం పట్టని మంత్రి తన స్వప్రయోజనం కోసం ఇప్పటికే ఎన్నో పార్టీలు మారిండన్నారు. 2014లో దళితులు, వెనుకబడిన వర్గాలను ఆదుకుంటానంటూ బీఎస్పీలో చేరాడన్నారు. ఏనుగు బొమ్మపై గెలిచి పీనుగు పార్టీలోకి మారాడన్నారు. దొరలకు అమ్ముడు పోయిన ఘనత ఇంద్రకరణ్‌రెడ్డి అదన్నారు. కల్లు అమ్ముకునే ఇంద్రకరణ్‌రెడ్డిని సీఎం ఇళ్ల మంత్రిని చేశాడన్నారు. జిల్లాలో తన స్వగ్రామం ఎల్లపెల్లిలో తప్ప ఈ మంత్రి ఎక్కడైనా ఇల్లు కట్టించిండా.. అని సభికులను ప్రశ్నించారు. దీనికి ముక్తకంఠంతో లేదు.. అని సమాధానం వచ్చింది. దేవాదాయ మంత్రిగానూ ఇంద్రకరణ్‌రెడ్డి విఫలమయ్యాడని విమర్శించారు. వేములవాడలో లేగదూడలు కబేళాలకు తరలుతుంటే.. భద్రాద్రిలో సీతమ్మ తాళిబొట్టు పోతే.. బాసరలో రోజుకో అపచారం జరుగుతుంటే.. కనీసం పట్టించుకోలేదన్నారు. భద్రాద్రి రాములవారి కల్యాణంలో సీఎం మనుమడు పట్టువస్త్రాలు సమర్పిస్తుంటే మంత్రి బంట్రోతుగా ఆ పిల్లాడి వెంట నడువడం జిల్లా ప్రజలకే అవమానమన్నారు. త్యాగాల పునాదులపై నిర్మాణమైన తెలంగాణను సోనియమ్మ ఇచ్చిందని, దాన్ని కేసీఆర్ దోపిడీ తెలంగాణ మార్చాడన్నారు. థర్డ్ ఫ్రంట్ బీజేపీతో చేసుకున్న ఒప్పందంలో భాగమని అన్నారు. ఏ టెంట్ లేనోళ్లే ఈ ఫ్రంట్ పాట పాడుతున్నారని ఎద్దేవా చేశారు. 2017 డిసెంబర్ లోపల డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించకపోతే, ఇంటింటికీ భగీరథ నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగమని చెప్పిన కేసీఆర్ ఇవ్వాళ ఏ మొఖం పెట్టుకుని ప్రజల ముందుకు వస్తారన్నారు. మైనార్టీలకు మోసం : షబ్బీర్‌అలీ 12శాతం రిజర్వేషన్ల పేరిట మైనార్టీలు, ఎస్టీలను కేసీఆర్ మోసం చేశాడని కాంగ్రెస్ శాసనమండలి పక్షనేత షబ్బీర్‌అలీ మండిపడ్డారు. ఎంఐఎం, టీఆర్ఎస్ కలిసి మైనార్టీల ను మోసం చేస్తున్నాయన్నారు. హైదరాబాద్‌లోని తన మహల్‌పై కూర్చుండే అసదుద్దీన్‌కు కింద గుడిసెల్లో ఉంటూ బండ్లపై పండ్లు అమ్ముకుం టున్న మైనార్టీలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌తోనే అభివృద్ధి : జానా దేశాన్ని అభివృద్ధి బాట పట్టించింది కాంగ్రెస్సేనజానారెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో లక్షల ఎకరాలకు సాగునీరందించేలా ప్రాజెక్టులను నిర్మించామన్నారు. రైతులకు రుణమాఫీ చేయడంతో పాటు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశామని వివరించారు. నామీద గెలిచే దమ్ముందా : ఏలేటి మహేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ముందునుంచీ అండగా నిలిచింది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్ ప్రాంతాలేనని డీసీసీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. తనకు కష్టకాలంలో ప్రజలు అండగా నిలిచారని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్.. కానీ కల్లబొల్లి మాటలతో కేసీఆర్ అధికారంలోకి వచ్చాడన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చేశాడన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చివరి ఒక్క ఏడాదిలో చేసిన అభివృద్ధి అంత కూడా నాలుగేళ్లలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చేయలేదని విమర్శించారు. తన ఊళ్లో తన జీతగాళ్ల కోసమే డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించుకున్నాడని, నాలుగేళ్లలో గృహనిర్మాణశాఖ మంత్రిగా ఉండి జిల్లాలో ఎక్కడా ఒక్క ఇల్లు కూడా కట్టలేదన్నారు. తన తమ్ముడికి వెయ్యికోట్లతో చనఖా,కోర్ట ప్రాజెక్టు పనులు ఇప్పించాడని, కొడుకు భూమి ఉందని జిల్లాకేంద్రంలోని ధర్మసాగర్ చెరువును నాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు. బాసరలో అవినీతి అక్రమాలు జరుగుతుంటే దేవాదాయ శాఖామంత్రి ఏం చేస్తున్నాడని ప్రశ్నించారు. జిల్లాకేంద్రంలో 40ఎకరాల స్థలం ఉన్నా.. తన 300ఎకరాల ప్లాట్ల కోసం ఎల్లపెల్లిలోని చెరువులో కలెక్టరేట్ కట్టిస్తున్నాడని మండిపడ్డారు. ఈ నాలుగేళ్లలో నిర్మల్ నియోజకవర్గానికి మంత్రి ఏం చేశాడని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో నిర్మల్ నియోజకవర్గంలో దమ్ముంటే తనపై గెలవాలని సవాల్ విసిరారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కాకుంటే.. కేసీఆర్, కేటీఆర్ ఎవరైనా సరే నిర్మల్‌లో వచ్చి తనపై పోటీ చేసి గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని చాలెంజ్ చేశారు. నిర్మల్ ప్రజలను నమ్ముకునే తాను ముందుకు సాగుతున్నానన్నారు. నక్సల్స్ ఎజెండా అన్నడు : వీహెచ్ తనది నక్సల్ ఎజెండా అని, పేదోళ్లను ఆదుకుంటానని వచ్చిన కేసీఆర్ ఇప్పుడు వాళ్లనే పిట్టలను కాల్చినట్లు కాల్చేస్తున్నాడని సీనియర్ నేత హనుమంతరావు అన్నా రు. తమను అంతం చేయాలని చూసినోళ్లను వదిలిపెట్టరని, కేసీఆర్ నక్సల్స్ నీ పనిచేస్తరు.. జర హుషారుగ ఉండు అన్నారు. 106 సీట్లు తామే గెలుస్తామని సర్వేలు చెప్పాయన్న సీఎం ఇప్పుడు కాంగ్రెస్ యాత్రను చూసి ఫ్రంట్ పాట పాడుతున్నాడని ఎద్దేవా చేశారు. ఆకట్టుకున్న నాయకులు.. ‘2014లో ఒకవేళ మహేశ్వర్‌రెడ్డినే గెలిపించి ఉంటే.. తానే అందరికీ ఇళ్లు కట్టించి ఇచ్చేవారని..’ మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ అన్నారు. క్రికెట్లో ఒక్కసారి అవుటైతే మళ్లీ తర్వాతి మ్యాచ్ ఉంటుందని, ఇక్కడ ఒక్కసారి ఓడితే మాత్రం ఐదేళ్ల వరకు వేచి చూడాల్సి వస్తుందన్నారు. ప్రజలు ఈసారి కాంగ్రెస్‌ను గెలిపించి, తెలంగాణను అభివృద్ధి చేయడానికి సహకరించాలన్నారు. ‘పోతావ్రో కేసీఆర్.. రైతుల ఉసురు తగిలి.. ఎవరి పాలైందిరో తెలంగాణ.. దొరల, దొంగల పాలైందిరో తెలంగాణ..’ అంటూ పాటలతో మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఆకట్టుకున్నారు. ఆదివాసులకు పట్టాలిచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనన్నారు. ఎస్టీ రిజర్వేషన్లను సాధించుకుందామని లంబాడీ భాషలో మాట్లాడి మాజీ ఎంపీ బలరాం నాయక్ పిలుపునిచ్చారు. కుటుంబ పాలనకు చరమగీతం పాడుదామని ఎమ్మెల్యే రాంమోహన్‌రెడ్డి అన్నారు. తెలంగాణను అభివృద్ధి చేయడం కాంగ్రెస్‌తోనే సాధ్యమని సీనియర్ నేత మల్లు రవి పేర్కొన్నారు. ఈ సభలో పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు సబితారెడ్డి, డి.శ్రీధర్‌బాబు, మల్లు రవి, దానం నాగేందర్, ఎమ్మెల్సీ ఆకుల లలిత, నాయకులు రాంచంద్రారావు, రామారావు పటేల్, గండ్రత్ సుజాత, భార్గవ్ దేశ్‌పాండే, నరేశ్‌జాదవ్, హరినాయక్, జాదవ్ అనిల్, సత్యం చంద్రకాంత్, తక్కల రమణారెడ్డి, వినాయక్‌రెడ్డి, జుట్టు దినేశ్, సంతోష్, చిన్ను, జమాల్, చరణ్, జునైద్, హైదర్, సరికెల గంగన్న, లింగారెడ్డి, ఫక్రుద్దీన్ పాల్గొన్నారు. -
కొత్త డీసీసీలు లేనట్లే
► ఇక నియామకమే అన్న తరుణంలో వాయిదా వేసిన అధిష్టానం ► సభ్యత్వం, సంస్థాగత నిర్మాణం తరువాతే అధ్యక్షుల నియామకం ► అప్పటిదాకా ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా మహేశ్వర్‌రెడ్డి కొనసాగింపు సాక్షి, నిర్మల్: జిల్లాల పునర్వ్యవస్థీకరణ తరువాత కాంగ్రెస్ పార్టీలో కొత్త జిల్లాలకు జిల్లా కాంగ్రెస్ కమిటీ(డీసీసీ) నియామకంలో దోబూచులాట కొనసాగుతోంది. త్వరలో డీసీసీ, బ్లాక్ కాంగ్రెస్ కమిటీల నియామకం జరుగుతుందని చెప్పడం, ఆ తరువాత వాయిదా వేయడం జరుగుతూ వస్తోంది. ఇటీవల మాత్రం నియామకాలు దాదాపు ఖరారయ్యే దశకు వచ్చినట్లు పార్టీలో చర్చ సాగింది. దీంతో ఆశావహుల్లో కొత్త ఉత్సాహం కనిపించింది. ఇలా డీసీసీలపై ప్రకటన ఎప్పుడు వెలువడుతుందని శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో తాజాగా అధిష్టానం ఈ ప్రక్రియను తాతాల్కికంగా వాయిదా వేసింది. దీంతో ఆశవాహుల పదవీ కాంక్షపై నీళ్లు చల్లినట్లైంది. సభ్యత్వం, సంస్థాగత నిర్మాణం తరువాతే కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వ నమోదు, సంస్థాగత నిర్మాణం తరువాతే జిల్లాలకు డీసీసీలను నియమించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ చైర్మన్ ఎం.రామచంద్రన్ ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం సభ్యత్వ నమోదు పూర్తి చేసి సంస్థాగతంగా నిర్మాణం చేయాలనే పార్టీ ఎన్నికల కమిటీ నిర్ణయం మేరకు అధిష్టానం ఈ చర్యలకు దిగినట్లు పేర్కొంటున్నారు. సభ్యత్వ సేకరణ ఇదివరకే జరిగినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో కేవలం 16 లక్షలు సభ్యత్వమే జరగడంతో దానిని మరింత పెంచాలని నిర్ణయించారు. అదేవిధంగా బూత్ లెవల్ నుంచి గ్రామ, మండల, బ్లాక్ కాంగ్రెస్, టీపీసీసీ, ఏఐసీసీ సభ్యుల నియామకాలు జరిపి సంస్థాగత నిర్మాణం చేసిన తరువాతే డీసీసీ అధ్యక్షులను నియమించాలని అధిష్టానం నిర్ణయించినట్లు చెబుతున్నారు. సెప్టెంబర్ 20 వరకు ఈ ప్రక్రియ పూర్తి చేసి డీసీసీలను నియమించనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నారు. పలువురు ఆశవాహులు ఉమ్మడి జిల్లాకు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి డీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. జిల్లా ఇన్చార్జిగా సబితాఇంద్రారెడ్డి వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే కొత్త జిల్లాలు ఏర్పడిన తరువాత ఆయా జిల్లాలకు డీసీసీ అధ్యక్షుల నియామకాల విషయంలో పార్టీ పరంగా గాంధీభవన్‌లో చర్చలు జరిగాయి. తెలంగాణ ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్, కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో జిల్లాల వారీగా చర్చలు చేశారు. మొదట్లో డీసీసీ అ«ధ్యక్షుడిగా నియమితులయ్యే వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదని అధిష్టానం పేర్కొనడంతో పార్టీ నాయకుల్లో వ్యతిరేకత వ్యక్తమైంది. కాగా, తాజాగా ఆ నిబంధన విషయంలో అధిష్టానం దిగివచ్చింది. డీసీసీ అధ్యక్షులు కూడా ఎన్నికల్లో పోటీ చేయవచ్చునని ప్రకటించడంతో ఇప్పుడు జిల్లాల్లో పలువురు ప్రధాన నేతలు కూడా పదవిపై ఆశలు పెంచుకున్నారు. కాగా, అంతకుముందు పలువురు ఉమ్మడి జిల్లా నేతలు ఏలేటి మహేశ్వర్‌రెడ్డినే ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగించాలని అ«ధిష్టానాన్ని కోరారు. అయితే జిల్లాల వారీగా ఎప్పటికైనా అధ్యక్షుల నియామకం చేయాల్సిందేనని, ఈ నేపథ్యంలో మహేశ్వర్‌రెడ్డిని ఉమ్మడి జిల్లా ఇన్చార్జిగా నియమించే విషయంలో అధిష్టానం వద్ద చర్చలు సాగినట్లు నాయకులు పేర్కొంటున్నారు. అదే సమయంలో నిర్మల్ జిల్లాకు రామారావుపటేల్, తక్కల రమణారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాకు భార్గవ్‌దేశ్‌పాండే, గండ్రత్ సుజాత, నరేశ్‌జాదవ్, మంచిర్యాల జిల్లాకు అరవిందరెడ్డి, ప్రేమ్‌సాగర్, కుమురంభీంకు ఆత్రం సక్కు, సిడాం గణపతి పేర్లు పరిశీలనకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి మహేశ్వర్రెడ్డికే పగ్గాలు సెప్టెంబర్ చివరిలో లేనిపక్షంలో అక్టోబర్‌లో కొత్త జిల్లాలకు డీసీసీ అధ్యక్షులను నియమించే అవకాశాలు ఉన్నాయి. అప్పటివరకు ఉమ్మడి జిల్లాలో మహేశ్వర్‌రెడ్డి చేతిలోనే పగ్గాలు ఉండనున్నాయి. ఇదిలాఉంటే జూన్‌లో హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ సభ నిర్వహించనున్నట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీలలో ఎవరైనా ఈ సభకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంటున్నారు. దీంతో ఈ సభను విజయవంతం చేసేందుకు పార్టీ అధిష్టానం పాతకాపులపైనే నమ్మకం పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లా పరంగా ఇదివరకు నిర్మల్ జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను రాహుల్‌గాంధీ పరామర్శించే పర్యటనను విజయవంతం చేయడంతో పాటు ఆదిలాబాద్, నిర్మల్‌లో రైతులు, విద్యార్థుల కోసం నిరాహార దీక్షలు చేపట్టి భారీ సభలు నిర్వహించిన దృష్ట్యా మహేశ్వర్రెడ్డిపైనే భరోసా ఉంచి జిల్లా నుంచి సభకు పెద్ద ఎత్తున శ్రేణులను సమీకరించే బాధ్యత ఉంచినట్లు తెలుస్తోంది. -
ఇచ్చిన హామీలు అమలు చేయాలి
ఏలేటి మహేశ్వర్ రెడ్డి లక్ష్మణచాంద : టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యకు‡్ష్యలు, మాజీ ఎంఎల్ఏ ఏలే టి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని బాబాపూర్ గ్రామంలో మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో బుధవారం ఏర్పాటు చేసిన సÜమావేశంలో బాబాపూర్ ,నర్సాపూర్ గ్రామాల కాంగ్రెస్ పార్టీ కార్యవర్గంను ఎన్నకొని అనంతరం ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలుపరిచే వరకు కాంగ్రెస్ పార్టీ తరపున ప్రజల పక్షాన పోరాటం ఆపమని ఆయన అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఈ ప్రభుత్వం అమలు పరచడంలో విఫలమైందని ఆయన ప్రభుత్వాన్ని విమర్శించారు. కార్యక్రమంలో బాబాపూర్ సర్పంచ్ కొమ్ము శ్రీవిధ్య,నర్సాపూర్ సర్పంచ్ రాజేశ్వర్ ,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యకు‡్ష్యలు పోశెట్టి,మాజీ మండల అధ్యకు‡్ష్యలు సరికెల గంగన్న ,మండల యువజన విబాగం అధ్యకు‡్ష్యలు చిన్నయ్య,ప్రధాన కార్యధర్శి వేణుగౌడ్ ,నాయకులు సాతిరి సాయన్న ,అంజయ్య ,భీమలింగు ,ముత్తన్న ,మోహన్ రెడ్డి ,రాంరెడ్డి ,ముత్యం ,జీవన్ రెడ్డి ,సిందం రమేష్ ,గంగాధర్ గౌడ్ ,అనిల్ ,రాజేశ్వర్ ,ప్రశాంత్ ,లింగన్న ,మోహన్ ,లక్ష్మణ్,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. -
డీసీసీ సారథి మహేశ్వర్‌రెడ్డి
ఆదిలాబాద్ : జిల్లా కాంగ్రెస్ కమిటీ(డీసీసీ) అధ్యక్ష పదవి మహేశ్వర్‌రెడ్డికి వరించింది. మొదట భార్గవ్‌దేశ్ పాండేను ప్రకటించిన తర్వాత పార్టీలో వివాదం చోటుచేసుకోవడం, ఆ తర్వాత తెరపైకి మహేశ్వర్‌రెడ్డి పేరు రావడం తెలిసిందే. ఈ ఇద్దరిలో అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందోనని పార్టీలో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యం లో గురువారం ఏఐసీసీ నుంచి ఏలేటి మహేశ్వర్‌రెడ్డిని ఖరారు చేస్తూ నియామక పత్రాన్ని పీసీసీకి పంపారు. రాత్రి 8గంటల ప్రాంతంలో పీసీసీ అధ్యక్షుడు పొన్నా ల లక్ష్మయ్య, మాజీ మంత్రి షబ్బీర్‌అలీ, నాగయ్య తదితరుల సమక్షంలో మహేశ్వర్‌రెడ్డికి నియామక పత్రాన్ని అందజేశారు. కాగా ప్రేమ్‌సాగర్‌రావు వర్గానికి చెందిన భార్గవ్‌తో పాటు ఆ వర్గంలోని నాయకులతో మహేశ్వర్‌రెడ్డి రాజీ కుదుర్చుకోవడంతోనే పార్టీలో వివాదం సద్దుమణిగిందనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌లో మారుతున్న సమీకరణాలు.. తాజాగా మహేశ్వర్‌రెడ్డిని డీసీసీ అధ్యక్షుడిగా నియమించినప్పటికీ ప్రత్యర్థి వర్గం నుంచి ఎలాంటి వ్యతిరేకత రాకపోవడం వెనక పలు సమీకరణాలు చోటుచేసుకున్నాయనే ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్‌లో గురువారం మహేశ్వర్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావు వర్గీయులైన భార్గవ్‌దేశ్‌పాండే, అనిల్‌జాదవ్, హరినాయక్, తదితరులతో విస్తృతంగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో వారి నాయకత్వంలో పార్టీ అభివృద్ధికి తన హస్తం అందిస్తానని మహేశ్వర్‌రెడ్డి వారికి భరోసానిచ్చినట్లు చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా ఆదిలాబాద్ నియోజకవర్గ రాజకీయ పరిస్థితులపై ఆసక్తి కలిగిస్తోంది. ఇదివరకు డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సి.రాంచంద్రారెడ్డి తనకుతానే అధ్యక్ష పదవి నుంచి వైదొలుగుతూ కొత్తవారికి అవకాశం ఇవ్వాలని పార్టీకి విన్నవించారు. తన నియోజకవర్గంపై తాను దృష్టి సారిస్తానని పార్టీకి తెలిపారు. రాంచంద్రారెడ్డితో మహేశ్వర్‌రెడ్డి సన్నిహితంగా ఉన్నారు. ప్రస్తుతం భార్గవ్‌ను రాజీ కుదుర్చుకునేందుకు ఎలాంటి ఆపన్నహస్తం మహేశ్వర్‌రెడ్డి చూయించారనే దానిపై చర్చ సాగుతోంది. ఏలేటిని వరించిన పగ్గాలు.. 2009లో నిర్మల్ నియోజకవర్గం నుంచి పీఆర్పీ పార్టీ తరఫున బరిలోకి దిగి ప్రధాన ప్రత్యర్థి ఇంద్రకరణ్‌రెడ్డిపై విజయం సాధించిన మహేశ్వర్‌రెడ్డి అప్పట్లో జిల్లాలో సంచలనం సృష్టించారు. ఆ తర్వాత పీఆర్పీ కాంగ్రెస్‌లో విలీనం కావడంతో ఆయన కాంగ్రెస్ పార్టీలోనూ కీలకంగా వ్యవహరించారు. ఐదేళ్లపాటు ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజలకు దగ్గరయ్యారు. కాంగ్రెస్‌లో మాజీ ఎంపీ వివేక్, సి.రాంచంద్రారెడ్డితో కలిసి ప్రత్యర్థి వర్గం ప్రేమ్‌సాగర్‌రావుతో రాజకీయంగా ఢీకొట్టారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగినప్పటికీ ఓటమి చెందారు. రెండు నెలల కిందట డీసీసీ అధ్యక్షుడిగా భార్గవ్‌దేశ్ పాండేను అదిష్టానం ప్రతిపాదించినప్పుడు మహేశ్వర్‌రెడ్డి వర్గం వ్యతిరేకించింది. తాజాగా ఆయన ఆ వర్గంతో రాజీ కుదుర్చుకొని రాజకీయంగా కీలక పదవిని చేపట్టారు. పూర్వ వైభవానికి కృషి.. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవానికి కృషి చేస్తానని డీసీసీ అధ్యక్షుడిగా నియామకమైన ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ‘సాక్షి’తో తెలిపారు. ఇకపై గ్రూపుల్లేని కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుందని, అందరిని కలుపుకొని వెళ్తానని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో జిల్లాలోని పది నియోజకవర్గాల్లో గెలుపొందే దిశగా పార్టీని పటిష్టపరుస్తానన్నారు. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో క్యాడర్‌ను పెంపొందిం చి పటిష్ఠం చేస్తానని, తనపై నమ్మకం ఉంచి పదవిని అప్పగించినందుకు అధినేత సోనియా గాంధీ, పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్‌అలీ, వివేక్, పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. -
బియ్యం నిల్వలు సీజ్
వేముల : ఎట్టకేలకు బెస్తవారిపల్లెలో బియ్యం నిల్వలను తహశీల్దార్ శివరామయ్య గురువారం సీజ్ చేశారు. దీంతో బియ్యం పంపిణీ కొలిక్కిరాలేదు. కాగా బియ్యం పంపిణీ చేయకపోవడంతో బుధవారం సర్పంచ్ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి సంఘీభావంగా పాల్గొన్నారు. ధర్నా సందర్భంగా తహశీల్దార్ శివరామయ్య గురువారం తాము బియ్యం పంపిణీ చేస్తామని హామీనిచ్చారు. ఈ హామీ మేరకు కార్డుదారులకు బియ్యం పంపిణీ చేసేందుకు తహశీల్దార్ శివరామయ్య గురువారం సిబ్బందితో బెస్తవారిపల్లెకు వెళ్లారు. అక్కడ గ్రామంలో టీడీపీ నాయకుని ఇంటిలో అనధికారికంగా ఉన్న బియ్యాన్ని తరలించి దేవాలయం వద్ద బియ్యం పంపిణీ చేయాల్సి ఉంది. అధికారులు బియ్యాన్ని తరలించేందుకు అక్కడికి వెళ్లగా టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. ఇక్కడ నుంచి బియ్యం గింజను కూడా తీసుకపోనివ్వమని తహశీల్దార్‌తో వాగ్వాదానికి దిగారు. ఇంతలో కొందరు తమ నేతలకు ఫోన్ ద్వారా సమాచారమిచ్చారు. మరోవైపు టీడీపీ నేతలు తహశీల్దార్‌కు ఫోన్ చేసి అక్కడ నుంచి బియ్యం తరలిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించే ధోరణిలో మాట్లాడినట్లు తెలిసింది. దీంతో ఆయన టీడీపీ నేతల ఒత్తిళ్లతో ఎటూ తేల్చుకోలేకపోయారు. ఆర్డీవోకు సమాచారమిచ్చారు. ఈ పరిణామాలతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉత్కంఠ నెలకొంది. పులివెందుల సీఐ మహేశ్వరరెడ్డి, వేముల పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మరోపక్క బియ్యం నిల్వలను సీజ్ చేయకపోతే సర్పంచ్ లింగాల పార్వతమ్మ ఆధ్వర్యంలో ధర్నా చేసేందుకు గ్రామస్తులు సిద్ధమయ్యారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆర్డీవో ఆదేశాల మేరకు తహశీల్దార్ బియ్యం నిల్వలను సీజ్‌చేసి వెళ్లిపోయారు. తదుపరి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ తెలిపారు.