సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కొత్త ముఖ్యమంత్రి కోసం కాంగ్రెస్ అధిష్టానం అన్వేషిస్తోందని సంచలన కామెంట్స్ చేశారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. సీఎం రేవంత్‌పై సీనియర్ మంత్రులు, ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తున్నారు. రేవంత్ హాలీడే పీరియడ్ అయిపోయింది. రేవంత్‌కు కౌంట్ డౌన్ మొదలైంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి తాజాగా మీడియా చిట్‌చాట్‌లో.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. రేవంత్ హాలీడే పీరియడ్ అయిపోయింది.. కౌంట్ డౌన్ మొదలైంది. 2025 జూన్ నుంచి డిసెంబర్‌లోపు రేవంత్ పదవి పోవడం ఖాయం. రేవంత్ రెడ్డికి ప్రత్యామ్నాయ కోసం కాంగ్రెస్ అధిష్ఠానం చూస్తోంది. ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు రేవంత్‌పై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తున్నారు. రేవంత్ వ్యతిరేక వర్గం ఢిల్లీలో లాబీయింగ్ చేస్తున్నారు. మేనిఫెస్టోను కాదు అని.. సొంత ఎజెండాను రేవంత్ అమలు చేస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజు.. సోనియా గాంధీకి ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యామ్నాయం ఎవరు అని కాంగ్రెస్ అధిష్ఠానం ఆలోచన చేస్తోంది.
సీనియర్ మంత్రులు హైడ్రా, మూసీ, ల్యాండ్ సెటిల్‌మెంట్ల మీద రేవంత్‌పై ఫిర్యాదు చేసినట్లు మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. సీనియర్ మంత్రులు చేసిన ఫిర్యాదుపై కాంగ్రెస్ అధిష్ఠానం సీరియస్‌గా ఉంది. మూసీ ప్రాజెక్టు కాస్ట్ మూడు వంతులు పెంచి.. రేవంత్ స్వార్థం కోసం కాంగ్రెస్‌ను వాడుకుంటున్నారు. సీఎం రేవంత్ ఏకపక్ష ధోరణికి చాలా మంది నేతలు ఒప్పుకోవడం లేదు. రేవంత్ ఏడు సార్లు ఢిల్లీకి వెళ్లినా రాహుల్ అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదు. 11 నెలలు దాటింది.. ఏడాదిన్నరలోపే కాంగ్రెస్ కొత్త ముఖ్యమంత్రి రావడం ఖాయం.
భట్టి విక్రమార్క నేను సైతం సీఎం రేసులో ఉన్నానని చెప్పడానికి చెరువుల కబ్జాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడమే ఒక ఉదాహరణ. ముగ్గురు మంత్రులు సీఎం రేసులో పోటీ పడుతున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పక్కా సమాచారంతోనే మాట్లాడారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు అని.. నా నాలుకపై పుట్టుమచ్చ ఉందని ముందుగానే పసిగట్టి ఆయన ఇలా మాట్లాడారు. ముఖ్యమంత్రి పదవి రేసులో ఉత్తమ్, కోమటిరెడ్డి, భట్టి విక్రమార్క ముగ్గురూ పోటీ పడుతున్నారు. అలాగే, కాంగ్రెస్‌లో చేరిన ఐదుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కేసీఆర్‌తో టచ్‌లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment