వైఎస్సార్‌సీపీ నేతపై టీడీపీ నేతల దౌర్జన్యం | Tdp Leaders Attack Ysrcp Leader Ec Maheshwar Reddy | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ నేతపై టీడీపీ నేతల దౌర్జన్యం

Published Thu, Dec 12 2024 7:35 PM | Last Updated on Thu, Dec 12 2024 8:20 PM

Tdp Leaders Attack Ysrcp Leader Ec Maheshwar Reddy

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: నీటి సంఘాల ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. పులివెందుల నియోజకవర్గం వేముల మండలంలోని గొల్లల గూడూరు గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నేత ఈసీ మహేశ్వర్ రెడ్డిపై దాడికి పాల్పడ్డారు. నీటి సంఘాల ఎన్నికలలో పోటీ చేసేందుకు తాహసిల్దార్ కార్యాలయంలో నీటి పన్ను కట్టేందుకు వెళ్లగా టీడీపీ నేతలు దౌర్జన్యం చేశారు. పన్ను కట్టేందుకు వెళ్లిన మహేశ్వర్ రెడ్డిని టీడీపీ నేత పేర్ల పార్థసారథి రెడ్డి, అతని అనుచరులు అడ్డుకుని బయటకు పంపించారు. మహేశ్వర్ రెడ్డి చేతిలోని కాగితాలను కూడా లాక్కున్న పార్థసారధిరెడ్డి చించివేశారు.

అధికారులు సహకరించడం లేదు: వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు
జమ్మలమడుగు ఆర్డీవో, డీఎస్పీని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు గురువారం కలిశారు. ఈ నెల 14న జరగనున్న నీటి సంఘాల ఎన్నికలకు అధికారులు సహకరించడం లేదని ఫిర్యాదు చేశారు. వైఎస్సార్‌సీపీ నేతలకు సంబంధించిన నో డ్యూ సర్టిఫికెట్లను ఇవ్వకుండా కూటమి వర్గీయులు అడ్డుకుంటున్నారని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి అన్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే నీటి సంఘాల ఎన్నికల్లో లాండ్ ఆర్డర్ అదుపు తప్పే పరిస్థితి ఉంటుందని ఆయన అన్నారు.

కాగా, ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న గ్రామాల్లోని సాగునీటి సంఘం ఎన్నికలు ఈ నెల 14న నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. దీనికి సంబంధించి నోటీఫికేషన్‌ను ఆయా ఎన్నికల నిర్వహణ కేంద్రాల వద్ద ప్రదర్శించారు. మండల పరిధిలో 10 సాగునీటి సంఘాలు ఉన్నాయి. కెనాల్‌ పరిధిలోని దువ్వూరు, చాపాడు, మైదుకూరు, ఖాజీపేట మండలాలతో సంబంధం ఉన్న మండలంలోని నీటి సంఘాలకు సైతం ఒకే రోజున ఎన్నిక నిర్వహించనున్నారు.

దువ్వూరు కేసీ కెనాల్‌ పరిధిలోని 62 అన్నశా్రస్తులపల్లె, 63 మడూరు, 64 చియ్యపాడు, మైదుకూరు కేసీ కెనాల్‌ పరిధిలో 67 మడూరు, 68 ఉప్పరపల్లె, 69 అనంతపురం, 70 అనంతపురం, 71 సోమాపురం, 74 అల్లాడుపల్లె, 75 మిడుతూరు సాగునీటి సంఘాలు ఉన్నాయి. వీటన్నిటిలో ఒక సంఘానికి ఒక్కో చైర్మన్‌ను ఓటర్లు ఎన్నుకుంటారని, సాగునీటి సంఘాల చైర్మన్లు అందరూ మండల చైర్మన్‌ ఎన్నుకోనున్నారు.

63వ సంఘానికి అన్నవరం జెడ్పీ హైసూ్కల్‌లో, 64 సంఘానికి చియ్యపాడు జెడ్పీ హైసూ్కల్‌లో, 67 సంఘానికి మడూరు గ్రామ సచివాలయం, 69వ సంఘానికి చాపాడు ఎంపీడీఓ కార్యాలయం, 70వ సంఘానికి చాపాడు జెడ్పీహైసూ్కల్, 71వ సంఘానికి సోమాపురం గ్రామ సచివాలయం, 74వ సంఘానికి లక్ష్మీపేట జెడ్పీ హైస్కూల్‌లో ఎన్నిక నిర్వహిస్తారు. 68వ సంఘానికి ప్రొద్దుటూరులో, 75వ సంఘానికి ఖాజీపేట, 62వ సంఘానికి దువ్వూరు మండలంలో ఎన్నిక చేపట్టనున్నారు.  
 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement