బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి డిమాండ్
నిర్మల్‌లో బీజేపీ ఆధ్వర్యంలో రైతుధర్నా
నిర్మల్ చైన్‌గేట్: రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివ రకు ఎంతమందికి రు ణమాఫీ చేసిందో శ్వేత పత్రం విడుదల చే యాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వ ర్‌రెడ్డి డిమాండ్ చేశా రు. ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరి పంట రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ ఆర్డీవో కార్యాలయం ఎదుట శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేశారు.
ఈ సందర్భంగా మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇప్పటి వరకు సగం మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందని చెపుతుంటే, సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం పూర్తిస్థాయిలో రుణమాఫీ జరిగిందని ఒట్లు వేస్తూ దేవుళ్లను కూడా మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ నెలాఖరులోపు రైతులందరికీ రుణమాఫీ చేయకుంటే హైదరాబాద్‌లోని ధర్నాచౌక్‌లో నిరవధిక నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు.
కొర్రీలొద్దు.. కోతలొద్దు: రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కొర్రీలు, కోతలు లేకుండా తక్షణమే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ డిమాండ్ చేశారు. రైతు దీక్షలో ఆయన మాట్లాడుతూ, అందరి రుణాలు మాఫీ అయ్యేవరకు రైతుల పక్షాన పోరాడతామన్నారు. కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో ఎంతోమంది రైతులు రుణమాఫీకి దూరమయ్యా రన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు అంజు కుమార్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మోహన్‌రావు పటేల్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment