ఏలేటి మహేశ్వర్ రెడ్డి
లక్ష్మణచాంద : టీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యకు‡్ష్యలు, మాజీ ఎంఎల్‌ఏ ఏలే టి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని బాబాపూర్ గ్రామంలో మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో బుధవారం ఏర్పాటు చేసిన సÜమావేశంలో బాబాపూర్ ,నర్సాపూర్ గ్రామాల కాంగ్రెస్ పార్టీ కార్యవర్గంను ఎన్నకొని అనంతరం ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలుపరిచే వరకు కాంగ్రెస్ పార్టీ తరపున ప్రజల పక్షాన పోరాటం ఆపమని ఆయన అన్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఈ ప్రభుత్వం అమలు పరచడంలో విఫలమైందని ఆయన ప్రభుత్వాన్ని విమర్శించారు. కార్యక్రమంలో బాబాపూర్ సర్పంచ్ కొమ్ము శ్రీవిధ్య,నర్సాపూర్ సర్పంచ్ రాజేశ్వర్ ,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యకు‡్ష్యలు పోశెట్టి,మాజీ మండల అధ్యకు‡్ష్యలు సరికెల గంగన్న ,మండల యువజన విబాగం అధ్యకు‡్ష్యలు చిన్నయ్య,ప్రధాన కార్యధర్శి వేణుగౌడ్ ,నాయకులు సాతిరి సాయన్న ,అంజయ్య ,భీమలింగు ,ముత్తన్న ,మోహన్ రెడ్డి ,రాంరెడ్డి ,ముత్యం ,జీవన్ రెడ్డి ,సిందం రమేష్ ,గంగాధర్ గౌడ్ ,అనిల్ ,రాజేశ్వర్ ,ప్రశాంత్ ,లింగన్న ,మోహన్ ,లక్ష్మణ్,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.