![Alleti Maheshwar Reddy Fire On Cm Revnath Reddy Over Crop Loan Waiver](/styles/webp/s3/article_images/2024/08/19/ALLETI%20MAHESHWAR%20REDDY%202.jpg.webp?itok=V4lk-R8l)
60 లక్షల రైతులుంటే.. 22 లక్షల మందికే మాఫీనా?: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
నిర్మల్: రాష్ట్ర ప్రభు త్వం అర్హులైన రైతు లందరికీ రుణమాఫీ వర్తింపజేయాలని బీజేఎల్పీనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. అలా చేయనిపక్షంలో ఈనెల 23న రైతులతో భారీ రైతుదీక్ష చేపడతామని ప్రకటించారు. ఆదివారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుభరోసాకు ఇవ్వాల్సిన నిధులనే రుణమాఫీకి మళ్లించిందని.. ఇప్పటి కే రెండు పంటలకు రైతు భరోసా సాయం ఇవ్వకుండా ఎగ్గొట్టారని ఆరోపించారు.
రాష్ట్రంలో 60 లక్షల మంది అర్హులైన రైతులు ఉండగా.. కేవలం 22 లక్షల మందికే రుణమాఫీ చేయడమేంటని ప్రశ్నించారు. రూ.49 వేల కోట్ల రుణాలకుగాను.. రూ.17 వేల కోట్లే ఇ చ్చారని మండిపడ్డారు. రుణమాఫీ కాని రైతు లను మళ్లీ మోసం చేసేందుకే.. మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని చెబుతున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యే లకు దమ్ముంటే.. గ్రామాలకు వెళ్లి పూర్తిస్థాయి లో రైతులకు రుణాలు మాఫీ అయ్యాయో లేదో ఆరా తీయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న రైతుల రుణాలను త్వరలో మాఫీ చేయాలని.. రైతుభరోసా ఖరీఫ్ సీజన్ డబ్బులను ఈ నెలా ఖరులోగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment