Crop loan waiver
-
అందరికీ రుణమాఫీ కోసం 23న రైతుదీక్ష
నిర్మల్: రాష్ట్ర ప్రభు త్వం అర్హులైన రైతు లందరికీ రుణమాఫీ వర్తింపజేయాలని బీజేఎల్పీనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. అలా చేయనిపక్షంలో ఈనెల 23న రైతులతో భారీ రైతుదీక్ష చేపడతామని ప్రకటించారు. ఆదివారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుభరోసాకు ఇవ్వాల్సిన నిధులనే రుణమాఫీకి మళ్లించిందని.. ఇప్పటి కే రెండు పంటలకు రైతు భరోసా సాయం ఇవ్వకుండా ఎగ్గొట్టారని ఆరోపించారు.రాష్ట్రంలో 60 లక్షల మంది అర్హులైన రైతులు ఉండగా.. కేవలం 22 లక్షల మందికే రుణమాఫీ చేయడమేంటని ప్రశ్నించారు. రూ.49 వేల కోట్ల రుణాలకుగాను.. రూ.17 వేల కోట్లే ఇ చ్చారని మండిపడ్డారు. రుణమాఫీ కాని రైతు లను మళ్లీ మోసం చేసేందుకే.. మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని చెబుతున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యే లకు దమ్ముంటే.. గ్రామాలకు వెళ్లి పూర్తిస్థాయి లో రైతులకు రుణాలు మాఫీ అయ్యాయో లేదో ఆరా తీయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న రైతుల రుణాలను త్వరలో మాఫీ చేయాలని.. రైతుభరోసా ఖరీఫ్ సీజన్ డబ్బులను ఈ నెలా ఖరులోగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
అరకొర రుణమాఫీ.. ఆపై దుర్భాషలా
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సమయంలో రూ.2లక్షలు రుణమాఫీ చేస్తామని ప్రక టించిన రేవంత్‌రెడ్డి ప్రభు త్వం అరకొరగా అమలు చేసిందని ఇదే విషయాన్ని ప్రశ్నించిన బీఆర్ఎస్ నేతలపై సీఎం నోరు పారేసుకుని దుర్భాషలాడతారా అని బీఆర్ఎస్ మాజీమంత్రి ఎస్.నిరంజన్‌రెడ్డి తీవ్రంగా విమ ర్శించారు. మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, పార్టీ నేత ఇంతియాజ్ ఇషాక్‌తో కలసి నిరంజన్‌రెడ్డి శుక్రవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు.రుణమాఫీ తోపా టు ఆరు గ్యారంటీలను రేవంత్ చెప్పిన గడువు లోగా అమలు చేస్తే పదవికి రాజీనామా చేస్తాన ని హరీశ్ అన్నారని అయితే రేవంత్ మాత్రం రుణమాఫీ అమలు పూర్తయిందని దబాయిస్తు న్నారని మండిపడ్డారు. ఆగస్టు 15 నాటికి రైతు లందరికీ రూ.31వేల కోట్ల రుణమాఫీ జరుగు తుందని చెప్పి, ప్రస్తుతం రూ.17వేల కోట్లకే ఎందుకు పరిమితం చేశారని నిలదీశారు. రాష్ట్రంలో ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన హరీశ్‌రావును రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందని తెలిపారు. రుణమాఫీపై బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన కాల్ సెంటర్‌కు ఇప్పటివరకు 1,11,027 ఫిర్యాదులు వచ్చాయని వెల్లడించారు. -
రేవంత్‌పై చీటింగ్ కేసు పెట్టాలి
సాక్షి, హైదరాబాద్: ‘రుణమాఫీ అంటూ రైతులను మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై చీటింగ్కేసు నమోదు చేయాలి. కొడంగల్‌లో మీడియా సమక్షంలో వందశాతం రుణమాఫీ జరిగినట్టుగా రేవంత్ నిరూపిస్తే రాజకీయాలను వది లేస్తా. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జ్‌లు నియోజకవర్గాల్లో రుణమాఫీ అంశాన్ని పరిశీలించి రైతుల కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతాం. రూ.2లక్షల రుణమాఫీ సంపూర్ణంగా జరగకపోతే అవసరమైతే కోర్టుకు కూడా వెళతాం’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, సత్యవతిరాథోడ్, ఎమ్మెల్యే కేపీ.వివేకానందలతో కలిసి శుక్రవారం తెలంగాణభవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే..‘రుణమాఫీపై దగా, మోసం చేసిన రేవంత్ సెక్యూరిటీ లేకుండా ప్రజల్లోకి వెళితే చెడుగుడు ఆడటం ఖాయం. రుణమాఫీ పేరిట కాంగ్రెస్ అతిపెద్ద మోసం చేసింది. రుణమాఫీకి తొలుత రూ.40వేల కోట్లు అవసరమని ప్రకటించడం, ఆ తర్వాత రూ.31వేల కోట్లు కావాలని కేబినెట్ తీర్మానించడం, బడ్జెట్లో రూ.26వేల కోట్లు ప్రతిపాదించడం, చివరకు 22లక్షల మందికి రూ.17,934 కోట్ల మేర మాత్రమే మాఫీ చేయడం రైతులను మోసగించడమే. ప్రచార ఆర్భాటమే.: ‘రుణమాఫీలో నిబంధనల పేరిట కోతలు విధించి చిల్లర ప్రచారంతో రేవంత్ రంకెలు వేస్తూ హరీశ్‌రావు రాజీనామా చేయాలంటున్నాడు. కేవలం 46శాతం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగింది. రేవంత్ చేస్తున్న మోసాలకు గిన్నిస్ బుక్ నిర్వాహకులు కూడా ఆశ్చర్యపోతున్నారు. రేవంత్ ప్రసంగం ఆయన అసహనానికి అద్దం పడుతోంది. ఇటీవలి కాలంలో ఆయన చేస్తున్న ప్రసంగాలు, వాడుతున్న భాష చూస్తే రేవంత్ మానసిక సంతులనం దెబ్బతిన్నట్టుగా కనిపిస్తోంది.రేవంత్ కుటుంబసభ్యులు ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళితే మంచిది. రుణమాఫీ అయ్యిందంటూ కొంతమంది చిల్లరగాళ్లు పోస్టర్లు పెట్టారు. మాజీ మంత్రి హరీశ్‌రావు సవాలు చేసినట్టుగా సంపూర్ణ రుణమాఫీ, ఆరు గ్యారంటీల అమలు జరిగిందా. సాక్షాత్తూ సీఎం, డిప్యూటీ సీఎం రాష్ట్రం దివాలా తీసిందని చెబుతుండటంతో పెట్టుబడులు తరలివెళుతున్నాయి. ఎన్నికల హామీలు నెరవేర్చని రేవంత్ ఎనిమిదినెలల కాలంలో 19 సార్లు ఢిల్లీకి వెళ్లాడు. ఇంకా ఎన్నిసార్లు వెళ్లాల్సి వస్తుందో కూడా తెలియదు. ప్రాంతీయ పారీ్టలపై అధ్యయనం: ‘ఉద్యమ పారీ్టగా 24 ఏళ్ల క్రితం ప్రస్థానం ప్రారంభించి పదేళ్లపాటు అధికారంలో కొనసాగాం. ప్రతిపక్షపాత్ర తొలిసారి పోషిస్తున్న బీఆర్ఎస్ పార్టీని మరింత దృఢంగా చేసేందుకు ప్రాంతీయ పారీ్టల పనితీరుపై అధ్యయనం చేస్తాం. డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, బిజూజనతాదళ్ వంటి పార్టీల నిర్మాణాన్ని పరిశీలించేందుకు సెప్టెంబర్‌లో నాతోపాటు కొందరు సీనియర్ నేతలు ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తాం. మంచి ఎక్కడ ఉన్నాసరే స్వీకరించి ఇక్కడ పార్టీ బలోపేతానికి వినియోగించుకుంటాం. ఆరీ్టసీలో మహిళల ప్రయాణంపై నేను యథాలాపంగా మాట్లాడిన మాటలకు క్షమాపణ చెప్పాను. రేవంత్‌కు అదే సంస్కారం ఉంటే అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలి’అని కేటీఆర్ డిమాండ్ చేశారు. -
రుణం తీరలే..
2023–24కు సంబంధించి మార్చి 31 వరకు ఎస్ఎల్బీసీ పంట రుణాల కింద పెట్టుకున్న లక్ష్యం రూ. 73,437 కోట్లు.. అందులో డిసెంబర్ ఆఖరు నాటికి æరూ. 49,500 కోట్లు, మార్చి ఆఖరుకు రూ. 64,940 కోట్లు రైతులకు మంజూరు అయ్యాయి.ఈ ఫోటోలో కనిపిస్తున్న యువరైతు పేరు జెల్ల మహేశ్. నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలం తొండకూర్ గ్రామం. 2017లో కుద్వాన్పూర్ స్టేట్ బ్యాంకులో రూ. 1.10 లక్షలు రుణం తీసుకున్నారు. అర్హత ఉన్నా ఇంతవరకు రుణమాఫీ జరగలేదు. మూడో విడతలోనూ పేరు రాలేదు. కారణమేంటని వ్యవసాయ అధికారులను అడిగితే రేషన్‌కార్డు లేకపోవడంతో కుటుంబ నిర్ధారణ కాలేదని సమాధానం ఇచ్చారు. విచారణ చేసి ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పారు. అంటే ఇక తన బ్యాంకు రుణం తీరనట్టేనా? అని ఆయన ఆందోళనలో పడిపోయారు.ఈయన పేరు పాతకుంట వెంకటరెడ్డి. నల్లవెల్లి గ్రామం, నిజామాబాద్ జిల్లా. ఒకే రేషన్‌కార్డుపై ఉన్న వెంకటరెడ్డికి, ఆయన తల్లికి నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం సిర్నాపల్లి ఇండియన్ బ్యాంకులో రూ.1.40 లక్షల పంట రుణం ఉంది. ప్రభుత్వం ప్రకటించిన మూడో విడత రుణమాఫీ జాబితాలోనూ ఆయన పేరు రాలేదు. అర్హత ఉన్నా మాఫీ ఎందుకు కాలేదని అధికారులను అడిగితే సమాధానమేదీ రావడం లేదని ఆయన వాపోతున్నారు.నల్లగొండలోని గొల్లగూడకు చెందిన జక్కుల యాదయ్య.. 2022 మార్చిలో రూ.99 వేలు రుణం తీసుకున్నారు. 2023 మార్చిలో రూ.6,800 వడ్డీ చెల్లించి రుణాన్ని రెన్యువల్ చేసుకున్నారు. ఈ ఏడాది మార్చిలో రూ.7 వేల వడ్డీ చెల్లించి మళ్లీ రెన్యువల్ చేయించుకున్నారు. నిజానికి యాదయ్యకు తొలివిడతలోనే రుణమాఫీ జరగాల్సి ఉన్నా.. జాబితాలో పేరు రాలేదు. దీంతో నల్లగొండ వ్యవసాయశాఖ ఏర్పాటు చేసిన గ్రీవెన్స్‌సెల్‌లో ఫిర్యాదు చేశారు. వెబ్సైట్లో బ్యాంకు వివరాలు లేవని అధికారులు చెప్పారు. దీనితో యాదయ్య బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకెళ్లి ఇచ్చారు. అయినా మాఫీ కాలేదు.సూర్యాపేట జిల్లా ఏపూరుకు చెందిన మున్నా ముత్తిలింగం ఏపీజీవీ బ్యాంకులో 2023లో రూ.64 వేల రుణం తీసుకున్నారు. మార్గదర్శకాల ప్రకారం ఆయనకు రుణమాఫీకి పూర్తి అర్హత ఉంది. ఆయన కుటుంబంలో ఎవరికీ బ్యాంకులో రుణాలేవీ లేవు. అయినా మాఫీ కాలేదు. వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని వాపోతున్నారు.జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలోని ఇప్పగూడెంకు చెందిన పిట్ట రాజేందర్‌కు రూ.1.10 లక్షల వ్యవసాయ రుణం ఉంది. రుణమాఫీ జాబితాలో ఆయన పేరు రాలేదు. ఇదేమని వ్యవసాయ అధికారులను అడిగితే రేషన్‌కార్డు సమస్య అని చెప్పారు. రాజేందర్‌కు ఐదేళ్ల క్రితమే వివాహమైంది. విడిగా తన కుటుంబానికి కొత్త రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనితో అధికారులు తల్లిదండ్రులతో ఉన్న రేషన్కార్డులోంచి ఆయన పేరును తొలగించారు. కొత్త కార్డు మాత్రం జారీ కాలేదు. దీనితో రుణమాఫీ కాలేదు....వీరే కాదు.. ఇలా రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు తమకు రుణమాఫీ జరగలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రుణమాఫీకి ఎలాంటి నిబంధనలు లేవని, గతంలో జరిగినట్టుగానే చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించినా.. తమకెందుకు రుణమాఫీ కాలేదని ప్రశ్నిస్తున్నారు. అటు బ్యాంకుల చుట్టూ, ఇటు వ్యవసాయ అధికారుల చుట్టూ తిరుగుతూ.. తమకు రుణమాఫీ కాకపోవడానికి కారణాలేమిటని నిలదీస్తున్నారు. ఎలాంటి షరతులు లేకుండా రూ. 2 లక్షలలోపు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్... ఇప్పుడు ఏవేవో కొర్రీలు పెడుతూ మాఫీ చేయకపోవడం ఏమిటంటూ మండిపడుతున్నారు. మాఫీ సొమ్ము తగ్గిందెందుకు..? ఏటా బ్యాంకుల నుంచి పంట రుణాలు తీసుకునే రైతుల సంఖ్య, రుణాల సొమ్ము పెరుగుతూనే ఉన్నాయి. కానీ ప్రభుత్వం రుణమాఫీ చేసిన రైతుల సంఖ్య, సొమ్ము భారీగా తగ్గిపోవడం ఏమిటనే అనుమానాలు వస్తున్నాయి. ఆర్థిక భారం తగ్గించుకునేందుకు ప్రభుత్వం నిబంధనల పేరుతో కొర్రీలు పెట్టిందని రైతులు, సంఘాల నేతలు మండిపడుతున్నారు. గత ఏడాది డిసెంబర్ నాటికి రాష్ట్రంలో రైతులు తీసుకున్న రుణాల మొత్తంతో పోలిస్తే.. మాఫీ చేసినది మూడో వంతు మేర మాత్రమే ఉండటం ఏమిటని నిలదీస్తున్నారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) లెక్కల ప్రకారం.. 2023–24 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు రైతులకు రూ.64,940 కోట్ల పంట రుణాలు ఇచ్చాయి. ఆ ఏడాది డిసెంబర్ వరకే లెక్కలోకి తీసుకుంటే.. రూ.49,500 కోట్ల రుణాలు ఇచ్చాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తంగా మూడు దశల్లో కలిపి 22.37 లక్షల మందికి.. మొత్తంగా రూ. 17,933 కోట్లు బ్యాంకుల్లో జమ చేసింది. దీనిపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నిరకాల అర్హత ఉన్నప్పటికీ కొందరికి రుణమాఫీ ఎందుకు జరగలేదో తమకు కూడా అంతుబట్టడంలేదని వ్యవసాయశాఖ వర్గాలే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. ఏటేగా పెరుగుతూపోతున్న రుణాలు రైతులకు ఇస్తున్న పంట రుణాలు ఏటేటా పెరుగుతున్నట్లు ఎస్ఎల్బీసీ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. 2014–15లో రూ.17,019 కోట్లు పంట రుణాలు ఇవ్వగా.. 2023–24కు వచ్చేసరికి రూ.64,940 కోట్లకు పెరిగాయి. గత ప్రభుత్వ హయాంలోని లెక్కలను చూసినా.. 2014–18 మధ్య 36.68 లక్షల మంది రైతులకు రూ.లక్ష వరకు రుణమాఫీ కోసమే రూ.19,198 కోట్లు అయినట్టు లెక్క తేల్చారు. అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షల రుణమాఫీకి అర్హుల సంఖ్యను 22.37 లక్షలకు, మాఫీ సొమ్మును రూ.17,933 కోట్లకే పరిమితం చేయడం వెనుక మాయ ఏమిటన్న ప్రశ్నలు వస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రుణమాఫీ పరిస్థితి ఇదీ⇒ నల్లగొండ జిల్లాలో తమకు రుణమాఫీ కాలేదంటూ వ్యవసాయ శాఖకు ఇప్పటివరకు 4 వేలకుపైగా ఫిర్యాదులు అందాయి. ⇒ జనగామ జిల్లా కేంద్రం యూనియన్ బ్యాంక్ బ్రాంచీ లో రుణాలు తీసుకున్న లింగాల ఘణపురం, రఘునాథపల్లి, జనగామ, దేవరుప్పుల తదితర మండలాలకు చెందిన 317 మంది రైతుల పేర్లు జాబితాలో లేవు. ⇒ జగిత్యాల జిల్లాలో గల్ఫ్ వెళ్లిన కుటుంబాల్లో చాలా వరకు రుణమాఫీ అందలేదు. కలెక్టరేట్లో ఇప్పటివరకు 1,145 మంది మాఫీ కాలేదని ఫిర్యాదు చేశారు. ⇒ కామారెడ్డి జిల్లాలో రుణమాఫీ రాలేదంటూ 2,898 ఫిర్యాదులు వచ్చాయి. ఆధార్, బ్యాంక్ ఖాతాల్లో పేర్లు వేర్వేరుగా ఉన్న 1,127 మంది ఆర్జీ పెట్టుకున్నారు. పారదర్శకంగా రుణమాఫీ జరగడం లేదు రైతు రుణమాఫీ అందరికీ కావడం లేదు. రేషన్‌కార్డు, పీఎం కిసాన్ నిబంధనలతో అర్హులను తగ్గిస్తూ వచ్చారు. బ్యాంకు ఖాతాలు కూడా పెరిగాయి. గత వ్యవసాయ సీజన్ నాటికే 60 లక్షల రైతు బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు ఇంత తక్కువ మంది ఎలా ఉంటారు? పారదర్శకంగా రుణమాఫీ జరగడం లేదు. ఇచ్చామని మభ్యపెడుతున్నారు. బ్యాంకులు, ప్రభుత్వం రైతుల వాస్తవ రుణమాఫీ డేటాను దాస్తున్నాయి. ఎంత అప్పుంది? ఇంత తీర్చారన్నది స్పష్టంగా చెప్పడం లేదు. ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడం కోసం కొర్రీలు పెడుతున్నారు. ఎవరికి, ఎందుకు రుణమాఫీ జరగలేదో స్పష్టతనివ్వడం లేదు. – దొంతి నర్సింహారెడ్డి, జాతీయ వ్యవసాయ నిపుణుడురూ. 49,500 కోట్లు(గత ఏడాది డిసెంబర్ నాటికి ఇచి్చన వ్యవసాయ రుణాలపై బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ) లెక్క)రూ. 31,000 కోట్లు(జూన్ 21న కేబినెట్ భేటీ తర్వాత రైతులకు చేసే రుణమాఫీపై సీఎం రేవంత్ స్వయంగా చెప్పిన లెక్క ఇది. జూలై 18న సచివాలయంలో రుణమాఫీ ప్రక్రియను ప్రారంభిస్తూ.. మరోసారి ఈ విషయాన్ని స్పష్టం చేశారు.)రూ. 26,000 కోట్లు(బడ్జెట్లో రైతులకు పంట రుణాల మాఫీ కోసం కేటాయించిన మొత్తం ఇది. ఇందులో నేరుగా 15,470 కోట్లు చూపగా.. మరో రూ.7,410 కోట్లను ఎస్సీ ఫండ్ కింద, రూ.3,120 కోట్లను ఎస్టీ ఫండ్ కింద కేటాయించారు)రూ. 17,933.18 కోట్లు(మొదటి విడతలో రూ.6,098.93 కోట్లు, రెండో విడత రూ.6,190.01 కోట్లు, మూడో విడత రూ.5,644.24 కోట్లు కలిపి మొత్తంగా రూ.17,933.18 కోట్లు రుణ మాఫీ చేశారు) అలా అలా తగ్గిపోతూనే... రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ) లెక్కల ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరం 2023–24 మార్చి 31 నాటికి రైతులకు ఇచి్చన మొత్తం పంట రుణాలు రూ.64,940 కోట్లు. ఇందులో డిసెంబర్ నాటికి ఇచ్చిన రుణాలు రూ.49,500 కోట్లు. ఆ నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతీ రైతుకు రూ.2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచి్చంది. అధికారంలోకి వచ్చాక కసరత్తు చేపట్టి.. రూ.2 లక్షల రుణమాఫీ కోసం రూ.40 వేల కోట్లు అవుతాయని ప్రాథమిక అంచనా వేసింది. కానీ మంత్రివర్గ సమావేశంలో రూ.31 వేల కోట్లుగా నిర్ణయించింది. బడ్జెట్ కేటాయింపులకు వచ్చేసరికి ఈ ‘లెక్క’రూ.26 వేల కోట్లకు తగ్గిపోయింది. చివరికి రుణమాఫీ మూడు విడుతల్లో కలిపి రూ. 17,933 కోట్లు విడుదల చేసింది. -
తెలంగాణలో నేటి నుంచి రైతుల పంట రుణమాఫీ
-
మాఫీ ‘లెక్క’ మారిందా?
సాక్షి, హైదరాబాద్: రైతుల పంట రుణాల మాఫీ అంశంలో గందరగోళం కనిపిస్తోంది. రుణమాఫీ ‘లెక్క’ తప్పిందని.. రైతులకు ఇవ్వాల్సిన మొత్తం తగ్గిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తొలి విడతగా రూ.లక్షలోపు రుణాలను మాఫీ చేస్తున్నామని, 11.5 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7 వేల కోట్లు జమకానున్నాయని కాంగ్రెస్ సర్కారు చేసిన ప్రకటన సందేహాలకు తావిస్తోంది. గతంలో బీఆర్ఎస్ సర్కారు రూ.లక్షలోపు పంట రుణాల మాఫీకోసం రూ.19,198.38 కోట్ల నిధులు లెక్కతేల్చితే.. ఇప్పుడు రేవంత్ సర్కారు అదే రూ.లక్షలోపు రుణాల మాఫీకి కేవలం రూ.7 వేల కోట్లు అవుతున్నట్టు పేర్కొనడంపై రైతు సంఘాల నేతలు, వ్యవసాయ రంగ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి ఇస్తున్న పంట రుణాలు ఏటేటా పెరుగుతున్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. పైగా గత ఐదేళ్లలో రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది కూడా. అయినా రుణమాఫీ సొమ్ము మూడో వంతుకు తగ్గడం ఏమిటన్న ప్రశ్నలు వస్తున్నాయి. జిల్లాలకు ‘మాఫీ’ రైతుల జాబితాలు రాష్ట్ర ప్రభుత్వం తొలి విడతలో రూ.లక్ష వరకు రుణమాఫీ సొమ్మును గురువారం రోజున రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించింది. 11.50 లక్షల మంది రైతులకు దాదాపు రూ.7 వేల కోట్లు జమ చేస్తామని తెలిపింది. ఈ మేరకు రైతుల జాబితాను జిల్లాలకు పంపించింది. వీరంతా లక్ష రూపాయల వరకు రుణాలు తీసుకున్న రైతులే. ఉదాహరణకు రంగారెడ్డి జిల్లా అధికారులకు అందిన సమాచారం ప్రకారం.. రూ.లక్ష మాఫీ అవుతున్న రైతులు 459 మంది ఉన్నారు. మిగతావారికి అంతకన్నా తక్కువ రుణాలు ఉన్నాయి. గత సర్కారు రుణమాఫీ లెక్కలతో.. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో రూ.లక్ష వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని బీఆర్ఎస్ (టీఆర్ఎస్) హామీ ఇచ్చింది. ఇందుకోసం మొత్తంగా 36.68 లక్షల మంది రైతులకు రూ.19,198.38 కోట్ల మేర అవసరమని తేల్చింది. అంతకుముందు 2014లోనూ అప్పటి టీఆర్ఎస్ సర్కారు రూ.లక్ష రుణమాఫీ ప్రకటించి.. 35.31 లక్షల మంది రైతులకు రూ.16,144 కోట్లు మాఫీ చేసింది. మరోవైపు ఈసారి రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మొత్తం 39లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసేందుకు సుమారు రూ.31 వేల కోట్లు అవసరమని అంచనా వేసింది. అయితే.. 2018 నాటి రూ.లక్ష రుణమాఫీ కోసం రూ.19 వేల కోట్లకుపైగా అవసరమవగా.. ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు అదే రూ.లక్ష వరకు రుణమాఫీ కోసం కేవలం రూ.7 వేల కోట్లనే లెక్క వేయడం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గత ఐదేళ్లలో భారీగా పెరిగిన పంట రుణాలు గత ఐదేళ్లలో పంట రుణాలు భారీగా పెరిగినట్టు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ) నివేదిక స్పష్టం చేస్తోంది. 2020–21లో రూ.41,200 కోట్లు, 2021–22లో రూ.42,853 కోట్లు, 2022–23లో రూ.59,060 కోట్లు, 2023–24లో రూ.64,940 కోట్లు రుణాలు ఇచి్చనట్టు తెలిపింది. సర్కారు రుణమాఫీకి నిర్ణయించిన కటాఫ్ ప్రకారం చూస్తే.. 2023–24 ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ నాటికి రైతులు తీసుకున్న రుణాలు రూ.49,500 కోట్లు కావడం గమనార్హం. బ్యాంకర్లు చెప్తున్న వివరాల ప్రకారం ఏటా రైతుల నుంచి రుణాల రికవరీ దాదాపు 90శాతం వరకు ఉంటుంది. కానీ తాము గెలిస్తే రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ 2022లోనే ప్రకటించిన నేపథ్యంలో.. 2023–24లో తీసుకున్న రుణాలను రైతులు చెల్లించి ఉండరని వ్యవసాయ నిపుణులు అంటున్నారు. అంటే 2022–23లో తీసుకున్న రుణాల్లో కొంత మేరకు, 2023–24లో డిసెంబర్ వరకు తీసుకున్న రుణాల్లో చాలా వరకు చెల్లించకుండా ఉన్నాయని బ్యాంకుల సిబ్బంది చెప్తున్నారు. అంటే ఏ రకంగా చూసుకున్నా.. దాదాపు రూ.49 వేల కోట్ల మేరకు పంట రుణాల బకాయిలు ఉంటాయని అంచనా. రాష్ట్ర సర్కారు మాత్రం రూ.2 లక్షల వరకు రుణాల మాఫీ కోసం రూ.31 వేల కోట్లే అవసరమని అంచనా వేసింది. పీఎం కిసాన్ నిబంధనలు, పాస్‌బుక్కులు, రేషన్‌కార్డుల నిబంధనల వల్ల అర్హులైన రైతుల సంఖ్య బాగా తగ్గి ఉంటుందని.. మాఫీ సొమ్ము అందుకు తక్కువై ఉంటుందని రైతు సంఘాల నేతలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. రైతులందరికీ రూ.2 లక్షలు మాఫీ చేస్తామన్న సర్కారు.. ఇప్పుడు నిబంధనలు ఎందుకు పెడుతోందని ప్రశ్నిస్తున్నారు. రుణమాఫీకి నిధుల అన్వేషణలో సర్కారు! ఆగస్టు 15వ తేదీలోపు రుణమాఫీ చేస్తామన్న సర్కారు.. అందుకు అవసరమైన నిధుల సమీకరణ కోసం అన్నిరకాల మార్గాలను అన్వేíÙస్తోంది. నిధులు పూర్తి స్థాయిలో సమకూరకపోవడంతోనే మూడు దశల్లో మాఫీ నిర్ణయానికి వచి్చనట్టు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (టీజీఐఐసీ)కు చెందిన భూములు అభివృద్ధి చేసి, తనఖా పెట్టి రూ.10 వేల కోట్లు సమీకరించుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే మర్చంట్ బ్యాంకర్ల నుంచి రుణాల కోసం రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పీ)ను జారీ చేసింది. ఇక రాష్ట్రంలోని డీసీసీబీలు, ప్యాక్స్‌కు మూలధనం సమకూర్చి బలోపేతం చేసుకుంటామని చెప్పి జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్సీడీసీ) నుంచి రూ.5 వేల కోట్ల రుణం కోసం తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్) దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. మద్యం డిస్టిలరీలకు బ్రూవరీస్ కార్పొరేషన్ చెల్లించాల్సిన బిల్లులను ఐదు నెలలుగా ఆపి ఉంచినట్టు తెలిసింది, ఈ సొమ్మును రుణమాఫీకి మళ్లించాలని భావిస్తున్నట్టు సమాచారం. ఆ మొత్తం ఐదారు వేల కోట్లు ఉంటుందని అంచనా. మరోవైపు ఈసారి రైతుభరోసా కింద చెల్లించాల్సిన నిధులను కూడా రుణమాఫీకి మళ్లించినట్లు చర్చ జరుగుతోంది. ఎఫ్ఆర్బీఎం పరిధిలో తీసుకోగలిగిన రుణాలను కూడా ముందస్తుగా సేకరించడం ద్వారా రూ.ఐదు వేల కోట్లు సమీకరించే ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. రుణాల మొత్తం భారీగా పెరిగినా.. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి లెక్కల ప్రకారం.. ఈ ఏడాది మార్చి 31వరకు మొత్తం రూ.64,940 కోట్లు స్వల్పకాలిక పంట రుణాలు మంజూరు చేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ కోసం గత ఏడాది డిసెంబర్ 9వ తేదీని కటాఫ్‌గా తీసుకుంది. రూ.2 లక్షల వరకు రుణాలను మాఫీ చేయడానికి రూ.31 వేల కోట్లు అవసరమని లెక్కలు వేసింది. -
పాస్‌బుక్ రుణాలు మాఫీ
సాక్షి, హైదరాబాద్: రైతుల పంట రుణాల మాఫీపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టతనిచ్చారు. భూమి పాస్‌బుక్కుపై రుణం ఉన్న ప్రతి రైతు కుటుంబానికి రూ.2 లక్షల రుణమాఫీ వర్తిస్తుందని తెలిపారు. కేవలం కుటుంబ నిర్ధారణకే రేషన్ కార్డును పరిగణనలోకి తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డులు ఉంటే రైతు రుణ ఖాతాలు 70 లక్షలేనని చెప్పారు. రేషన్ కార్డులు లేని 6.36 లక్షల మందికి రుణాలు ఉన్నాయని, వారికి కూడా రుణమాఫీ వర్తిస్తుందని స్పష్టం చేశారు. 18వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు రూ.లక్ష వరకు రుణమాఫీ నిధులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయని తెలిపారు. ప్రజా సంక్షేమంతో పాటు అభివృద్ధిని సమతుల్యం చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని, ప్రభుత్వ ప్రాధాన్యతలతో పాటు ప్రజల ప్రయోజనాలను అర్థం చేసుకుని పని చేయాలంటూ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు దిశానిర్దేశం చేశారు. మంగళవారం సచివాలయంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సదస్సు నిర్వహించారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించగా, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రారం¿ోపన్యాసం చేశారు. 9 గంటలకు పైగా సాగిన సుదీర్ఘ సమావేశానంతరం సీఎం మాట్లాడారు. ప్రభుత్వ నిధులు రుణమాఫీకే వాడాలి ‘18వ తేదీ ఉదయం 11 గంటలకు కలెక్టర్లు జిల్లా బ్యాంకర్లతో సమావేశం నిర్వహించాలి. రుణమాఫీకి ప్రభుత్వం విడుదల చేసే నిధులను రైతు రుణమాఫీకే వాడాలి. వ్యక్తిగత, ఇతర రుణాల మాఫీకి వినియోగించొద్దని సూచించాలి. గతంలో కొందరు బ్యాంకర్లు అలా చేస్తే కేంద్రం చర్యలు తీసుకుంది. ఇప్పుడు మేం కూడా అలాగే చేస్తాం. రుణమాఫీ జరిగే రైతులను 18వ తేదీ రైతు వేదికల వద్దకు తీసుకురావాలి. ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు రైతులతో ఆ సంతోషాన్ని పంచుకోవాలి. రైతు రుణమాఫీకి సంబంధించి సచివాలయంలో రెండు ఉమ్మడి జిల్లాలకు ఒక ఉన్నతాధికారి చొప్పున అందుబాటులో ఉంచుతాం. కలెక్టర్లకు ఏవైనా సందేహాలు వస్తే వారితో సంప్రదించి నివృత్తి చేసుకోవాలి..’ అని ముఖ్యమంత్రి సూచించారు. ప్రభుత్వానికి కళ్లు, చెవులు కలెక్టర్లు, ఎస్పీలే ‘ప్రభుత్వానికి కళ్లు, చెవులు .. కలెక్టర్లు, ఎస్పీలే. జిల్లా స్థాయిలో ప్రభుత్వానికి, ప్రజలకు వారధులు, సారథులు మీరే. ఐఏఎస్‌ల కెరీర్లో జిల్లా కలెక్టర్లుగా పనిచేయడమే కీలకం. కలెక్టర్లుగా ఉన్నప్పుడే అన్ని అంశాలపై అవగాహన వస్తుంది. ప్రతి పథకం చివరి లబ్ధిదారు వరకు చేరవేసే బాధ్యత మీదే. ఇటీవల రాష్ట్రంలో కొందరు టీచర్లు బదిలీపై వెళుతున్నప్పుడు విద్యార్థులు అడ్డుపడి కన్నీళ్లు పెట్టుకున్న సంఘటనలు చూశా. జిల్లాల్లో కలెక్టర్లు బదిలీ అయినా ప్రజల నుంచి అలాంటి స్పందన వచ్చేలా మీ పనితీరు ఉండాలి. ఇక్కడి భాషతో పాటు సంస్కృతిలో కూడా కలెక్టర్లు మమేకం కావాలి. మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకోవాలి. కలెక్టర్లు ఏసీ గదులకే పరిమితమైతే పనిలో సంతృప్తి ఉండదు. ఒక శంకరన్, ఒక శ్రీధరన్ లాగా సామాన్య ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకునేలా పనిచేయాలి. కలెక్టర్లందరూ క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందే. ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులను పర్యవేక్షించే బాధ్యతలు తీసుకోవాలి. తనిఖీలకు వెళ్లినప్పుడు ప్రజలతో మాట్లాడి చిన్న చిన్న సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలి. 10 మంది చేసిన పని 33 మంది చేయలేరా? గతంలో ఉమ్మడి జిల్లాలను 10 మంది కలెక్టర్లే అద్భుతంగా నడిపించారు. ఇప్పుడు జిల్లాల పరిధి, జనాభా తగ్గింది. కానీ అధికారాలు, బాధ్యతల్లో తేడా లేదు. అప్పుడు 10 మంది చేసిన పనిని ఇప్పుడు 33 మంది చేయలేరా? పనితీరుతో సమర్థతను చాటుకోవాలి. ప్రజల్లో విశ్వాసం కల్పించే బాధ్యత కలెక్టర్లదే. ప్రజావాణిలో వచ్చే దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి. ఆరు గ్యారంటీల అమలు బాధ్యత మీదే..’ అని రేవంత్ చెప్పారు. ధరణి దరఖాస్తు తిరస్కరిస్తే కారణం చెప్పాలి ‘పెండింగ్‌లో ఉన్న ధరణి సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలి. కొత్తగా 1,15,308 దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తులను ఆగస్టు 15లోగా పరిష్కరించండి. ధరణిలో దరఖాస్తులను తిరస్కరిస్తే అందుకు గల కారణాలను చెప్పాలి. మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుంది. ప్రస్తుతం ఈ సంఘాల్లో ఉన్న 64 లక్షల మంది సభ్యులను కోటి మందిని చేసేలా స్పెషల్ డ్రైవ్ చేపట్టాలి. ఐదేళ్లలో లక్ష కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలిప్పించే లక్ష్యంతో పనిచేయాలి. ఆర్టీసీ అద్దె బస్సులను కూడా మహిళా సంఘాలకు ఇచ్చే విషయాన్ని పరిశీలించాలి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలి. అవసరాన్ని బట్టి జియో ట్యాగింగ్ లాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానం చేసి నిఘా ఉంచాలి..’ అని సీఎం సూచించారు. ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ‘రేషన్‌కార్డుకు, ఆరోగ్యశ్రీ కార్డుకు లింకు పెట్టొద్దు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ తయారు చేయాలి. ఆర్ఎంపీలు, పీఎంపీలకు శిక్షణనిచ్చి సర్టిఫికెట్ ఇచ్చే అంశాన్ని పరిశీలించండి. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ప్రతి బెడ్‌కు సీరియల్ నంబర్ ఇవ్వాలి. గిరిజన ప్రాంతాల్లో సరైన వైద్య సదుపాయం అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. ఆసుపత్రుల నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. మీ ముద్ర ఉండాలి.. జిల్లాల్లో ఉన్న వనరులు, అక్కడి పరిస్థితుల ఆధారంగా ప్రతి కలెక్టర్ ఒక ఫ్లాగ్షిప్ కార్యక్రమానికి రూపకల్పన చేయాలి. ఆయా కార్యక్రమాలపై కలెక్టర్ల ముద్ర స్పష్టంగా ఉండాలి. గిరిజనులకు పండ్ల మొక్కలతో ఆదాయం వచ్చేలా చేయాలి. అటవీ ప్రాంతాల్లో ఎకరాల కొద్దీ ఖాళీగా ఉన్న భూమిని డ్రోన్ల ద్వారా సర్వే చేయించాలి. వికారాబాద్ అటవీ ప్రాంతంలో గతంలో మాదిరి ఔషధ మొక్కలు నాటాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టళ్లు ఒకేచోట ఉండేలా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల కోసం ప్రతి నియోజకవర్గంలో 20–25 ఎకరాల భూమి ఎంపిక చేయాలి. రహదారుల పక్కనే ఉండే గ్రామాలు, పట్టణాల్లో ఎవరు ముందు స్థలాలు ఎంపిక చేస్తే వారికే నిధులిస్తాం..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు రాజీపడొద్దు ‘రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో పోలీసులు రాజీపడొద్దు. ఫ్రెండ్లీ పోలీసింగ్ బాధితులతోనే కానీ నేరస్తులతో కాదు. పబ్బుల విషయంలో టైమింగ్ పెట్టండి. స్ట్రీట్‌ఫుడ్ వ్యాపారులను ఇబ్బంది పెట్టకండి. ఐటీ రంగ ఉద్యోగులు రాత్రివేళల్లో పనిచేస్తారన్న విషయాన్ని గుర్తుంచుకోండి. పోలీసులు రహదారులపై కనిపించాలి. క్రమం తప్పకుండా సమీక్షలు చేయాలి. క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టాలి. డ్రగ్స్, సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపండి. డ్రగ్స్ కేసుల్లో పట్టుబడుతున్న విదేశీయులపై దృష్టి సారించండి. కొల్లాపూర్ బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్‌రెడ్డి హత్య కేసులో అవసరమైతే ప్రత్యేక బృందం వేయాలి..’ అని సీఎం ఆదేశించారు. పథకాలు కిందివరకు వెళ్లడం లేదు: డిప్యూటీ సీఎం కలెక్టర్లు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి సమస్యలు పరిష్కరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. ప్రజలు, ప్రభుత్వానికి మధ్య కలెక్టర్లు వారధి లాంటివారని అన్నారు. కొత్త ప్రభుత్వం అమలు చేస్తున్న ఐదు సంక్షేమ పథకాలు కొన్ని జిల్లాల్లో కింది స్థాయి వరకు వెళ్లడం లేదన్నారు. ఇటీవల రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా జిల్లాల పర్యటనకు వెళ్లినప్పుడు ఇది తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంపు, మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, రూ.500కే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలను విస్తృతంగా ప్రచారం చేయడంతో పాటు అర్హులందరికీ అవి అందేలా చూడాలని ఆదేశించారు. ‘కల్తీ’పై కఠినంగా వ్యవహరించాలి: వ్యవసాయ మంత్రి వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ కల్తీ పురుగు మందులు, ఎరువులు, విత్తనాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని చెప్పారు. రాష్ట్రానికి అవసరమైన ఎరువులు, యూరియా సిద్ధంగా ఉన్నాయని, సరఫరాలో సమస్యలు తలెత్తకుండా కలెక్టర్లు జాగ్రత్త వహించాలన్నారు. సమావేశంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖ, రాష్ట్ర ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సీఎస్ శాంతికుమారితో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖల అధిపతులు, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు. -
కుటుంబం యూనిట్‌గా రుణమాఫీ!
సాక్షి, హైదరాబాద్: కుటుంబం యూనిట్‌గా పంటల రుణమాఫీని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఒక కుటుంబంలోని వారి పేరిట బ్యాంకుల్లో పంట రుణాలు ఎంత ఉన్నా.. గరిష్టంగా రూ.2 లక్షల వరకు మాత్రమే మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు కసరత్తు పూర్తయిందని.. నేడో, రేపో మార్గదర్శకాలు విడుదల కావొచ్చని తెలిపాయి. ఒక కుటుంబాన్ని ఎలా లెక్కలోకి తీసుకోవాలన్న దానిపై అధికారులు ప్రాథమికంగా నిర్ణయానికి వచి్చనట్టు తెలిసింది. రేషన్‌కార్డుగానీ, గ్రామ పంచాయతీ రికార్డుగానీ, వ్యవసాయశాఖ వద్ద ఇప్పటికే ఉన్న డేటాను ఆధారం చేసుకొనిగానీ కుటుంబాలను అంచనా వేయాలని భావిస్తున్నట్టు సమాచారం. అనంతరం ఒక రైతు కుటుంబానికి ఎన్ని బ్యాంకు ఖాతాలు, వాటిలో ఎన్ని పంట రుణాలు ఉన్నప్పటికీ.. మొత్తం రూ.2 లక్షల వరకే మాఫీ చేయనున్నారు. రుణాలు ఉన్న కుటుంబ సభ్యుల మధ్య దామాషా ప్రకారం ఈ మాఫీ సొమ్మును విభజిస్తారు. ఒక కుటుంబం అంటే.. భర్త, భార్య, వారిపై ఆధారపడి ఉన్న పిల్లలను పరిగణనలోకి తీసుకుంటారు. ఈ మార్గదర్శకాలు విడుదలైన వెంటనే గ్రామాల వారీగా రైతుల జాబితా తయారు చేస్తారు. బ్యాంకుల అధికారులతో కలసి రుణాలున్న వారి జాబితా తయారు చేస్తారు. చివరగా గ్రామసభలో చర్చించి తుది జాబితాను సిద్ధం చేయనున్నారు. పీఎం కిసాన్ నిబంధనల అమలు యోచన! వచ్చే నెల 15వ తేదీ నాటికి పంట రుణాలను మాఫీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకోసం రూ.31 వేల కోట్లు అవసరమని అంచనా వేశారు. 2018 డిసెంబర్ 12వ తేదీ నుంచి 2023 డిసెంబర్ 9 వరకు ఐదేళ్లలో రాష్ట్ర రైతులు తీసుకున్న రూ.2 లక్షల మేరకు పంట రుణాలను మాఫీ చేయనున్నారు. దాదాపు 47 లక్షల మంది రైతులకు దీనితో లబ్ధి జరుగుతుందని అంచనా. అయితే రుణమాఫీ కోసం పీఎం కిసాన్ పథకంలోని మార్గదర్శకాలను అమలు చేసే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. పీఎం కిసాన్ పథకంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జెడ్పీ చైర్మన్లు, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అధిక ఆదాయం ఉండి ఐటీ పన్ను చెల్లించేవారిని మినహాయించారు. అదే తరహాలో ఇప్పుడు రుణమాఫీని మినహాయించే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఆదాయ పన్ను చెల్లించే అందరినీ కాకుండా అధిక ఆదాయం ఉన్నవారిని మాత్రమే మినహాయించే ఆలోచన ఉన్నట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో అందరినీ మినహాయించకుండా.. అటెండర్లు వంటి చిన్నస్థాయి ఉద్యోగులకు రైతు రుణమాఫీ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు. అయితే ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించాలని.. మిగిలే మొత్తం ఎక్కువగా ఉంటేనే పీఎం కిసాన్ నిబంధనలు అమలు చేయాలని, లేకుంటే ఉదారంగానే రుణమాఫీ ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఏదేమైనా పంటలు పండించే ప్రతి రైతుకు ప్రయోజనం కలిగించేలా పథకం అమలు జరుగుతుందని అధికారులు అంటున్నారు. బంగారం పెట్టి తీసుకున్న రుణాలు కూడా..! బంగారం తాకట్టు పెట్టి పంట రుణాలు తీసుకున్న రైతులకు కూడా రుణమాఫీ పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. గ్రామీణ బ్యాంకుల్లో పట్టాదారు పాస్‌బుక్‌ను జతచేసి, పంటల కోసం తీసుకున్న బంగారం రుణాలకు మాత్రమే రుణమాఫీ చేయాలని భావిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో తీసుకున్న బంగారు రుణాలను మాఫీ నుంచి మినహాయించాలనే యోచన ఉన్నట్టు సమాచారం. గతంలోనూ ఇదే తరహా నిబంధనలు అమలు చేశారు. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్‌లు, కో–ఆపరేటివ్ క్రెడిట్ సంస్థలు (అర్బన్ కో–ఆపరేటివ్ బ్యాంకులు సహా), ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు రైతులకు పంపిణీ చేసిన రుణాలు, బంగారం తాకట్టుపెట్టి తీసుకున్న పంట రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. -
రుణమాఫీకి రేవంత్ రెడ్డి సర్కార్ గ్రీన్ సిగ్నల్
-
రైతు రుణమాఫీపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు
-
సోనియా బర్త్‌డే కటాఫ్?
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ పుట్టిన తేదీ అయిన డిసెంబర్ 9ని పంట రుణ మాఫీకి కటాఫ్ తేదీగా ప్రకటించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు వెల్లడించాయి. అదేరోజు తెలంగాణ ప్రకటన తేదీ కూడా కావడంతో దీన్ని సెంటిమెంట్‌గా కూడా ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన డిసెంబర్ 7ను రుణ మాఫీకి కటాఫ్ తేదీగా చేయాలనే చర్చ కూడా జరుగుతోందని చెబుతున్నారు. ఈ రెండు తేదీల్లోనూ సోనియా పుట్టిన రోజునే కటాఫ్ తేదీగా తీసుకునే అవకాశం ఎక్కువగా ఉందని అంటున్నారు. గతంలో డిసెంబర్ 11వ తేదీ కటాఫ్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా లక్ష రూపాయల రుణమాఫీ చేసిన సంగతి తెలిసిందే. అప్పుడు 2019 డిసెంబర్ 11వ తేదీని కటాఫ్‌గా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆ తేదీ నుంచి 2023 డిసెంబర్ 9వ తేదీ వరకున్న రైతుల వ్యవసాయ పంట రుణాలను మాఫీ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అంటే సరిగ్గా నాలుగేళ్ల మధ్య కాలంలో రైతులు తీసుకున్న పంట రుణాలు మాఫీ చేస్తారని, దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉందని అంటున్నారు. గత డిసెంబర్ 9 తర్వాత నుంచి ఇప్పటివరకు రైతులు తీసుకున్న పంట రుణాలు మాఫీ కాబోవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మాఫీ కసరత్తు ముమ్మరం రుణమాఫీపై ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. తాము అధికారంలోకి వస్తే రూ.2 లక్షల వరకు రైతు రుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒకేసారి రుణమాఫీ చేస్తామని కూడా స్పష్టం చేసింది. అంతేకాదు ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీలోపుగా హామీ నెరవేరుస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. దీంతో విధివిధానాలపై కసరత్తు వేగంగా జరుగుతోంది. వడ్డీపై తర్జనభర్జన రైతు యూనిట్‌గా కాకుండా, రైతు కుటుంబం యూనిట్‌గా రుణమాఫీని అమలు చేస్తారని అధికారులు చెబుతున్నారు. రూ.2 లక్షల వరకు రుణమాఫీ కాబట్టి రైతుల సంఖ్య పెరుగుతుందని అంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో మొత్తంగా 36.68 లక్షల మంది రైతులకు చెందిన రూ.19,198.38 కోట్ల రుణాలను మాఫీ చేయాల్సి ఉంటుందని అప్పట్లో అంచనా వేశారు. 2020లో రూ.25 వేల లోపు రుణాలు మాఫీ (రూ.408.38 కోట్లు) చేశారు. ఆ తర్వాత రూ.25 వేల నుంచి రూ.37 వేల లోపు రైతులకు చెందిన కొందరికి రూ.763 కోట్ల రుణాలను మాఫీ చేశారు. ఇలా విడతల వారీగా మాఫీ చేశారు.తాజాగా కటాఫ్ తేదీని డిసెంబర్ 9వ తేదీగా ప్రకటిస్తే..అప్పటివరకు రైతులు తీసుకున్న 2 లక్షల రూపాయలలోపు రుణాలను మాఫీ చేస్తారు. అయితే రుణ బకాయిలకు వడ్డీ కూడా తోడు కానుంది. అంటే బ్యాంకులకు వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై ఏం చేయాలన్న దానిపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. వాస్తవ రుణ బకాయిలు రూ.30 వేల కోట్లు ఉంటే, వడ్డీతో కలిపి దాదాపు రూ.40 వేల కోట్ల వరకు అవ్వొచ్చని అంచనా వేస్తున్నారు. దీనిపై స్పష్టత రావాల్సి ఉంటుంది. కటాఫ్ తేదీని బట్టి ఇది మారుతుందని అంటున్నారు. బంగారం కుదవబెట్టి, సాగు చేయని భూములకు రుణాలు తీసుకుంటే..? బంగారం కుదువబెట్టి తీసుకున్న పంట రుణాలకు కూడా మాఫీ వర్తింపచేయాలా వద్దా అన్నదానిపై చర్చ జరుగుతోంది. రైతుబంధు సొమ్మును అందరికీ ఇచ్చి దురి్వనియోగం చేశారంటూ విమర్శలు వచి్చన నేపథ్యంలో రుణమాఫీని కూడా సమగ్రంగా పరిశీలించాకే వర్తింప జేయాలనే ఆలోచన ఉన్నట్లు చెబుతున్నారు. కొందరు రైతులు సాగు చేయని భూములకు, కొండలు గుట్టలకు కూడా పంట రుణాలు తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.సొంత అవసరాలకు కూడా ఏదో రకంగా పంట పేరుతో రుణాలు తీసుకున్నారనే చర్చ జరుగుతోంది. ఇటువంటి వారికి కూడా రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తారా? అనే సందేహం వ్యక్తమవుతోంది. అయితే గత ఐదేళ్లలో ఎవరు సాగు చేశారో చేయలేదో ఇప్పుడు తెలుసుకోవడం కష్టం అవుతుందని, కొండలు గుట్టల పేరుమీద రుణాలు తీసుకుని ఉంటే వాటిని గుర్తించగలమా లేదా అనే చర్చ అధికారుల్లో జరుగుతోంది. ప్రధానంగా ఒకేసారి రుణమాఫీ అనేది ఎలా జరుగుతుందోనన్న చర్చ కూడా వ్యవసాయ శాఖ, బ్యాంకు అధికారుల మధ్య జోరుగా సాగుతోంది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ రుణమాఫీకి మార్గదర్శకాలను ఖరారు చేసే పనిలో వ్యవసాయ శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. గత ప్రభుత్వ హయాంలో రుణమాఫీకి సంబంధించిన వివరాలు లక్ష లోపు రుణాలు రైతులు రుణాలు 0– రూ.25 వేలు 2.96 లక్షలు రూ.408.38 కోట్లు రూ.25 వేలు– రూ.50 వేలు 5.72 లక్షలు రూ.1790 కోట్లు రూ.50 వేలు– రూ.75 వేలు 7 లక్షలు రూ.4000 కోట్లు రూ.75 వేలు – రూ.లక్ష 21లక్షలు రూ. 13000కోట్లు మొత్తం 36.68 లక్షలు రూ. 19,198.38 కోట్లు -
రైతులకు భారీ ఊరట: రుణ మాఫీ
సాక్షి, చెన్నై: తమిళనాడు ప్రభుత్వం రైతులు భారీ ఊరట కల్పించింది. పెద్ద మొత్తంలో వ్యవసాయ రుణాలను రద్దు చేస్తూ రైతులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి పళనిస్వామి శుక్రవారం దీనికి సంబంధించిన ప్రకటన చేశారు. రూ .12,110 కోట్ల వ్యవసాయ రుణ మాఫీని ప్రకటించారు. తద్వారా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 16.43 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 2వ వారంలో నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ భావిస్తోందన్న అంచనాల నడుమ సీఎం ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది. సహకార బ్యాంకుల నుండి రైతులు తీసుకున్న సుమారు రూ .12,110 కోట్ల రుణాలను మాఫీ చేయనున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. కాగా అకాలవర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా దెబ్బతిన్న పంటలకు రూ.1,117 కోట్ల పరిహారాన్ని సీఎం ఇంతకుముందే ప్రకటించారు. దీంతో సుమారు 11 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు. తమిళనాడులో ఎడతెరిపి లేని వర్షాలతో భారీగా పంట నష్టానికి దారితీసింది. గతేడాది సాధారణ స్థాయిలతో పోలిస్తే రాష్ట్రంలో 708 శాతం అధిక వర్షపాతం నమోదైంది. పంటకోత దశలో ఉండగా కురిపిన వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు అతలాకుతలమైన సంగతి తెలిసిందే. -
పంట రుణాల మాఫీ లెక్కలు తేల్చండి
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రూ.లక్ష లోపు పంట రుణాలను మాఫీ చేయనుందని, దీనికి సంబంధించిన లెక్కలను తేల్చాలని బ్యాంకర్లను ఆర్థిక మంత్రి హరీశ్‌రావు కోరారు. గతంలో నిబంధనలను అనుసరించి అర్హులైన రైతుల జాబితాను వచ్చె నెల 10లోగా సిద్ధం చేయాలని సూచించారు. 2018 డిసెంబర్ 11 కటాఫ్ తేదీగా లక్ష లోపు రుణాలు, వాటికి సంబంధించిన వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని స్పష్టం చేశారు. అయితే మాఫీ ఎలా చేయాలనే విధానంపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని బ్యాంకర్లకు చెప్పారు. సోమవారం బేగంపేటలోని ఒక ప్రైవేట్ హోటల్లో 25వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల త్రైమాసిక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన హరీశ్‌రావు బ్యాంకర్లు, ఉన్నతాధికారులతో అరగంట పాటు అంతర్గత సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు బంధు పథకం కింద జమ చేసిన మొత్తంలో రైతులకు చెల్లించింది పోగా మిగిలిన మొత్తాన్ని వెంటనే తిరిగి 15 రోజుల్లోగా ప్రభుత్వానికి చెల్లించాలని చెప్పినట్లు తెలిపారు. జనవరి 10లోగా వివరాలు అందించండి ప్రభుత్వ వివిధ శాఖల్లో, వివిధ స్థాయి అధికారుల అకౌంట్లలో ఉన్న డిపాజిట్లపై జనవరి 10లోగా వివరాలు అందించాలని హరీశ్ తెలిపారు. మొదటి విడత రైతుల రుణమాఫీ చేయగా బ్యాంకుల్లో మిగిలిన మొత్తాన్ని తిరిగి ప్రభుత్వానికి చెల్లించాలని ఆదేశించారు. సామాజిక పెన్షన్ చెల్లింపులో భాగం గా లబ్ధిదారుల ఖాతాలో జమ చేసిన తర్వాత ఆ ఖాతా ఉపయోగం లేదని బ్లాక్ చేయాలని సూచించారు. మహిళా సంఘాలకు 13 శాతం, 14 శాతం నుండి వడ్డీ రేట్లను తగ్గించాలని పేర్కొన్నారు. గత రుణమాఫీలో ఆడిట్ సందర్భంగా తెలిపిన అంశా లు బ్యాంకర్స్‌కు మంత్రి వివరించారు. ఈ సమావేశంలో ఆర్థిక ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ కమిషనర్ రాహుల్ బొజ్జా, కేంద్ర ప్రభుత్వ జాయింట్ సెక్రటరీ లలిత్ కుమార్, ఆర్బీఐ రీజినల్ డైరెక్టర్ సుబ్రతా దాస్, ఆర్బీఐ జనరల్ మేనేజర్ సుందరం శంకర్, ఇతర బ్యాంకు అధికారులు పాల్గొన్నారు. రుణమాఫీ అర్హతలపై చర్చ! ⇒ ఉన్నతాధికారులతో బ్యాంకర్లు జరిపిన అంతర్గత సమావేశంలో రుణమాఫీకి అర్హులను ఎలా గుర్తించాలనే దానిపై వాడివేడిగా చర్చ జరిగినట్లు తెలిసింది. 2018 డిసెంబర్ 11ని కటాఫ్ తేదీగా ప్రకటించినప్పటికీ, ఎప్ప టి నుంచి అనే దానిపై స్పష్టత కొరవడింది. ⇒ కుటుంబంలో ఒక రైతుకే మాఫీ వర్తించాలి. ఆ రైతుకు ఒక చోటనే మాఫీ చేస్తారు. మిగతా ఎక్కడా పంట రుణం తీసుకున్నా మాఫీ వర్తించదు. ⇒ బంగారంపై వ్యవసాయ పంట రుణాలు తీసుకున్న వారికి వర్తింపుపై సీఎంతో చర్చించాకే తుది నిర్ణయం తీసుకోనున్నారు. ⇒ మాఫీపై ప్రభుత్వం పలు రకాల విధానాలను యోచిస్తుంది. సీఎం ఆదేశాలకు అనుగుణంగా విడతల వారీగా రైతుకు చెక్కు ఇవ్వడమా? బ్యాంకు ఖాతాలో జమ చేయడమా? అనే దానిపై నిర్ణయం తీసుకుంటారు. -
వ్యవసాయ రుణ మాఫీ మంచిది కాదు: వైవీ రెడ్డి
న్యూఢిల్లీ: వ్యవసాయ రుణాల మాఫీ ఆర్థిక ప్రగతికి సరి కాదని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ వైవీ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇలాంటి రాజకీయ నిర్ణయాలు దీర్ఘకాలంలో సమర్ధనీయం కాదని ఆయన పేర్కొన్నారు. దేశీయంగా ప్రతి రాజకీయ పార్టీ ఏదో ఒక రాష్ట్రంలో లేదా జాతీయ స్థాయిలోనో రుణాల మాఫీ హామీలు ఇస్తూనే ఉన్నాయని వైవీ రెడ్డి చెప్పారు. ‘ఆర్థిక ప్రగతికి గానీ రుణాల సంస్కృతికి గాని రుణ మాఫీ విధానాలు సరికావు. దేశంలోని ప్రతీ రాజకీయ పార్టీ ఏదో ఒక రాష్ట్రంలోనో లేదా జాతీయ స్థాయిలోనో వ్యవసాయ రుణాల మాఫీ హామీలు ఇచ్చాయి. ఇది అంతిమంగా రాజకీయ అంశాలపరమైన నిర్ణయమే. దీర్ఘకాలంలో ఇది సమర్ధనీయం కాదు‘ అని ఇన్‌క్లూజివ్ ఫైనాన్స్ ఇండియా సదస్సు–2017లో పాల్గొన్న సందర్భంగా వైవీ రెడ్డి చెప్పారు. మరోవైపు, వ్యవసాయ రుణాలను పూర్తిగా మాఫీ చేసే బదులుగా వాటిని తిరిగి చెల్లించేందుకు మరింత అధిక వ్యవధినిచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించవచ్చని రిజర్వ్ బ్యాంక్ మరో మాజీ గవర్నర్ సి. రంగరాజన్ అభిప్రాయపడ్డారు. కావాలంటే ఓ ఏడాది వాయిదాలను, వడ్డీని మాఫీ చేయొచ్చని పేర్కొన్నారు. ఇవేవీ పనిచేయనప్పుడు మాత్రమే వ్యవసాయ రుణాల మాఫీపై దృష్టి పెట్టొచ్చని తెలిపారు. -
గతవారం బిజినెస్
ఎంఫసిస్ బైబ్యాక్‌కు వాటాదారుల ఆమోదం ఎంఫసిస్ సంస్థ షేర్ల బైబ్యాక్‌కు వాటాదారుల ఆమోదం లభించింది. 1.73 కోట్ల షేర్లను (8.26 శాతం వాటా) బైబ్యాక్ చేయడానికి తమ కంపెనీ వాటాదారులు ఆమోదం తెలిపినట్లు సంస్థ ఎక్సే్చంజీలకు తెలిపింది. ఒక్కో షేర్‌ను రూ.635 ధరకు మించకుండా బైబ్యాక్ చేస్తామని, ఈ బైబ్యాక్ విలువ రూ.1,103 కోట్లని పేర్కొంది. గత ఏడాది డిసెంబర్ నాటికి ఈ కంపెనీలో ప్రమోటర్, ప్రమోటర్ గ్రూప్‌కు 60.42 శాతం వాటా ఉంది. ప్రజల వద్ద 39.58 శాతం వాటా ఉంది. నిఫ్టీ.. రికార్డులు చెరిగిపోయాయ్! ఎన్ఎస్ఈ నిఫ్టీ... మంగళవారం కొత్త రికార్డును సృష్టించింది. ఐదు రాష్ట్రాల్లో.. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ ఘన విజయం ముఖ్య ఇంధనంగా పనిచేయటంతో నిఫ్టీ రాకెట్లా దూసుకుపోయింది. సుస్థిర ప్రభుత్వం మరిన్ని సంస్కరణలు తెస్తుందనే ఆశలతో కొనుగోళ్ల జోరు పెరిగింది. నిఫ్టీ...ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయి..9,123 పాయింట్లను తాకి జీవిత కాల గరిష్ట స్థాయి.. 9,087 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక సెన్సెక్స్ రెండేళ్ల గరిష్ఠానికి ఎగసింది. 496 పాయింట్ల లాభంతో 29,443 పాయింట్ల వద్ద ముగిసింది. మొత్తమ్మీద భారతీయ స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్ల సంపద ఈ ఒక్కరోజే ఏకంగా లక్షన్నర కోట్ల రూపాయల మేర పెరిగింది. అలాగే డాలర్‌తో పోలిస్తే తగ్గుతూ వస్తున్న రూపాయి మారకం విలువ కూడా ఒక్కసారిగా ఏడాదిన్నర గరిష్టానికి ఎగిసింది. 78 పైసలు బలపడి 65.82 వద్ద ముగిసింది. పంట రుణాల మాఫీ సరికాదు: అరుంధతీ రైతులకు ఇచ్చిన సాగు రుణాలను ప్రభుత్వాలు మాఫీ చేయడం మంచి సంప్రదాయం కాదని ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య అన్నారు. ఇటువంటి ప్రోత్సాహకాలు రుణాలు తిరిగి చెల్లించే తీరును దెబ్బతీసే అవకాశముందని అభిప్రాయపడ్డారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో రైతులకు రుణ మాఫీ హామీని బీజేపీ ఇచ్చిన నేపథ్యంలో అరుంధతీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ’’రుణాలను మాఫీ చేస్తే రుణాలు తిరిగి చెల్లించే అలవాటు తగ్గుతుంది. ఎందుకంటే రుణ మాఫీ పొందిన వారు భవిష్యత్తులోనూ రుణాల మాఫీపై ఆశలు పెట్టుకుంటారు. దాంతో భవిష్యత్తులో ఇచ్చే రుణాల చెల్లింపులు నిలిచిపోతాయి’’ అని భట్టాచార్య పేర్కొన్నారు. ఎగుమతుల జోరు ఎగుమతులు ఫిబ్రవరిలో పరుగులు తీశాయి. గత ఆరు నెలల కాలంలో అత్యధిక స్థాయిలో 17.48 శాతం వృద్ధిని నమోదు చేశాయి. 24.5 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరిగాయి. పెట్రోలియం, ఇంజనీరింగ్, రసాయనాల ఎగుమతులు ఈ వృద్ధిలో కీలక పాత్ర పోషించాయి. అదే సమయంలో దిగుమతులు సైతం పెరగడంతో దేశ వాణిజ్య లోటు 8.89 బిలియన్ డాలర్లకు విస్తరించింది. గతేడాది సెప్టెంబర్ తర్వాత మొదటి సారి ఎగుమతుల్లో రెండంకెల సానుకూల వృద్ధి నమోదైందని వాణిజ్య శాఖ తన ప్రకటనలో పేర్కొంది. ఇక దిగుమతులు ఫిబ్రవరిలో 21.76 శాతం అధికంగా 33.38 డాలర్ల మేర జరిగాయి. ఫండ్ పరిశ్రమ ప్రచారకర్తలుగా సెలబ్రిటీలు! మ్యూచువల్ ఫండ్స్‌పై ఇన్వెస్టర్లలో అవగాహన పెంచే దిశగా స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కొత్త అడ్వర్టై జింగ్ కోడ్‌కు ఆమోదముద్ర వేసింది. దీనితో ఇకపై మ్యూచువల్ ఫండ్స్ రంగానికి సెలబ్రిటీలు కూడా ప్రచారకర్తలుగా వ్యవహరించవచ్చు. అయితే ఇది మొత్తం పరిశ్రమకు ప్రచారం కల్పించేలా ఉండాలే తప్ప ఏ ఒక్క పథకాన్నో లేదా ఏ ఒక్క అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ (ఏఎంసీ) ప్రమోట్ చేసేలా ఉండకూడదు. ఇలా సెలబ్రిటీలతో జారీ చేసే ప్రకటనలకు మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ ముందుగా సెబీ ఆమోదముద్ర తీసుకోవాలి. ఫెడ్ రేట్లు పావు శాతం పెంపు అంచనాలకు అనుగుణంగానే అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీ రేట్లు పావు శాతం పెంచింది. ఫెడ్ ఫండ్స్ వడ్డీ రేట్ల శ్రేణి 0.75–1 శాతం మేర ఉం టుందని వెల్లడించింది. ఈ ఏడాది మరో రెండు విడతలు, వచ్చే ఏడాది మూడు విడతల మేర వడ్డీ రేట్ల పెంపు ఉంటుందని ఫెడ్ కమిటీ అంచనా వేసింది. మరోవైపు ద్రవ్యోల్బణం లకి‡్ష్యంచిన రెండు శాతం స్థాయికి పెరగగలదని ఫెడరల్ రిజర్వ్ పేర్కొంది. అటు జీడీపీ, ద్రవ్యోల్బణం అంచనాలు యథాతథంగా కొనసాగిస్తున్నట్లు వివరించింది. ఉద్యోగ గణాంకాలు, ఇన్వెస్టర్లు సహా వ్యాపార వర్గాల విశ్వాసం గణనీయంగా మెరుగుపడటం వంటి తదితర అంశాలు రేట్ల పెంపునకు తోడ్పడ్డాయి. కాగా, రేట్ల పెంపు అనంతరం అంచనాలకు భిన్నంగా డాలర్ ఇండెక్స్ తగ్గడం విశేషం. ఎయిర్టెల్ రూ.10 వేల కోట్ల సమీకరణ టెలికం దిగ్గజ కంపెనీ భారతీ ఎయిర్టెల్ రూ.10,000 కోట్ల నిధుల సమీకరణకు ఆ కంపెనీ వాటాదారులు ఆమోదం తెలిపారు. సెక్యూర్డ్ లేదా అన్సెక్యూర్డ్ రిడీమబుల్ నాన్‌కన్వర్టబుల్ డిబెంచర్లు/బాండ్లను ప్రైవేట్ ప్లేస్మెంట్ ద్వారా జారీ చేయడానికి తమ వాటాదారులు ఆమోదం తెలిపారని భారతీ ఎయిర్టెల్ తెలిపింది. అంతే కాకుండా తమ పూర్తి అనుబంధ సంస్థ, భారతీ ఎయిర్టెల్ ఇంటర్నేషనల్ (మారిషస్)లిమిటెడ్‌లోని ఇన్వెస్ట్‌మెంట్‌ను మరో అనుబంధ సంస్థ, నెట్వర్క్ ఐ2ఐలోకి బదిలీ చేసే ప్రతిపాదనకు కూడా వాటాదారులు ఆమోదం తెలిపారని పేర్కొంది. ‘యంగ్ గ్లోబల్ లీడర్స్’ జాబితాలో మనోళ్లు వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) వంద మంది యంగ్ గ్లోబల్ లీడర్స్ జాబితా–2017లో ఐదుగురు భారతీయులు స్థానం దక్కించుకున్నారు. జాబితాలో పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మ.. హాస్పిటాలిటీ బ్రాండ్ తమర కూర్జ్ డైరెక్టర్ శ్రుతి శిబులాల్ ఉన్నారు. వీరితోపాటు బ్లిప్పర్ వ్యవస్థాపకుడు అంబరీశ్ మిత్రా, ఫార్చూన్ ఇండియా ఎడిటర్ హిందోల్ సేన్‌గుప్తా, స్వానిటీ ఫౌండేషన్ సీఈవో రిత్విక భట్టాచార్య కూడా జాబితాలో స్థానం పొందారు. కాగా డబ్ల్యూఈఎఫ్ ప్రతి ఏడాది 40 ఏళ్లలోపు వయస్సున్న 100 మందితో ఈ జాబితాను విడుదల చేస్తూ ఉంటుంది. వినూత్నమైన ఆవిష్కరణలతో ప్రపంచంలోని క్లిష్టమైన సవాళ్లకు పరిష్కారం చూపిన వారికి సంస్థ ఈ జాబితాలో స్థానం కల్పిస్తుంది. రూ.10 ప్లాస్టిక్ నోట్లు వచ్చేస్తున్నాయ్..! భవిష్యత్‌లో పది రూపాయల ప్లాస్టిక్ నోట్లు మనకు దర్శనమివ్వనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.10 ప్లాస్టిక్ నోట్ల ప్రింట్కు తన అనుమతిని ఆర్బీఐకి చేరవేసింది. ఆర్బీఐ దేశంలోని ఐదు ప్రాంతాల్లో ప్లాస్టిక్ నోట్ల వాడకంపై ట్రయల్స్ నిర్వహించనుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేగ్వాల్ తెలిపారు. డీల్స్.. చిప్ తయారీ దిగ్గజం ఇంటెల్ తాజాగా ఇజ్రాయెల్‌కి చెందిన సెన్సర్ కంపెనీ మొబైల్ఐని కొనుగోలు చేయనుంది. ఈ డీల్ విలువ సుమారు 15.3 బిలియన్ డాలర్లు. మొబైల్ఐ .. కార్ల తయారీ సంస్థలకు సెల్ఫ్ డ్రైవింగ్ సిస్టమ్స్ ను సరఫరా చేస్తుంది. ఇండస్ఇండ్ బ్యాంక్... ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్)కు చెందిన సెక్యూ రిటీస్ సర్వీసెస్ అనుబంధ కంపెనీ, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ సెక్యూరిటీస్ సర్వీసెస్ (ఐఎస్‌ఎస్‌ఎల్)ను కొనుగోలు చేస్తోంది. ఈ సంస్థలో నూరు శాతం వాటాను కొనుగోలు చేస్తున్నట్లు ఇండస్ఇండ్ తెలిపింది. విమాన ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించే దిశగా జెట్ ఎయిర్వేస్, ట్యాక్సీ సర్వీసుల సంస్థ ఉబెర్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం జెట్ ఎయిర్వేస్ యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే ప్రయాణికులు ఉబెర్ ట్యాక్సీని కూడా బుక్ చేసుకోవచ్చు. సన్ ఫార్మాస్యూటికల్స్ గ్రూప్‌కు చెందిన టారో కంపెనీ కెనడాకు చెందిన థల్లియన్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీని 27 లక్షల కెనడా డాలర్లకు కొనుగోలు చేసింది. -
ఆ పోరాటం వల్లే రైతులకు రుణమాఫీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు కనీసం రూ. 10 వేల కోట్ల రుణమాఫీ అయినా జరిగిందంటే.. అది కేవలం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన పోరాటం వల్లేనని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు ధర్మాన ప్రసాదరావు అన్నారు. వైఎస్ ఆశయ సాధన కోసం వైఎస్ఆర్సీపీ పనిచేస్తుందని ఆయన అన్నారు. గుంటూరు జిల్లా బాపట్లలో జరిగిన పార్టీ బహిరంగ సభలో ధర్మానతో పాటు వై. విశ్వేశ్వరరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తదితర నేతలు పాల్గొని ప్రసంగించారు. టీడీపీ అబద్ధాలతోనే అధికారంలోకి వచ్చిందని, రాష్ట్రంలో ప్రతి కుటుంబం వైఎస్ పాలన కావాలని కోరుకుంటున్నారని ధర్మాన అన్నారు. ఈ ప్రభుత్వం రైతుల రుణమాఫీ చేయడానికి బదులు రైతులను అప్పుల ఊబిలోకి నెడుతోందని మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ నిరాహార దీక్ష చేస్తే.. ముఖ్యమంత్రి దాన్ని పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఇచ్చిన హామీలు నెరవర్చలేదని ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాపట్ల తహసిల్దారుకు వైఎస్ఆర్సీపీ నేతలు వినతిపత్రం సమర్పించారు. -
రైతుల జీవితాలతో కేసీఆర్ ఆటలు
పీసీసీ కిసాన్ సెల్ అధ్యక్షుడు కోదండరెడ్డి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం పంట రుణాల మాఫీకి మూడోవిడత నిధులను విడుదల చేయకుండా రైతుల జీవితాలతో ఆటలాడుకుంటోందని పీసీసీ కిసాన్ సెల్ అధ్యక్షుడు ఎం.కోదండరెడ్డి విమర్శించారు. గాంధీభవన్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కరువు నుంచి ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం 1,000 కోట్లు ఇచ్చినట్లు ఒకసారి, 791 కోట్లు విడుదల చేసినట్టు మరోసారి ప్రకటన చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం 1,791 కోట్లు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం దేనికోసం ఖర్చు చేసిందని ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీని ఆగం చేసిన కేసీఆర్: మల్లు రవి పేదలకు వైద్యంకోసం ఎంతో భరోసాగా ఉన్న ఆరోగ్యశ్రీని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగం చేశారని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శించారు. పుష్కరాలకు, పండుగలకు, పబ్బాలకు, గుళ్లకు, వ్యక్తిగత అవసరాలకు కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్న ప్రభుత్వం పేదల వైద్యానికి 300 కోట్లు ఖర్చు చేయడానికి వెనుకాడుతున్నదని విమర్శించారు. ఆరోగ్యశ్రీని నీరుగారిస్తే పెద్ద ఎత్తున పోరాడుతామన్నారు. -
'లక్ష ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్'
కరీంనగర్: తెలంగాణ రాష్ట్రంలో త్వరలో లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు తెలంగాణ ఐటీ, మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. గురువారం ఆయన కరీంనగర్లో విలేకరులతో మాట్లాడారు. రైతులకు మూడో విడత పంట రుణమాఫీ నిధులు విడుదల చేస్తామన్నారు. ఖరీఫ్‌కు 9 గంటల విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రాజెక్టు భూ నిర్వాసితుల పట్ల ప్రతిపక్షాలు ముసలికన్నీరు కార్చుతున్నాయని విమర్శించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సొంత ఊరు ప్రాజెక్టులో ముంపుకు గురవుతుంటే.. ఆ బాధ ఏంటో సీఎంకు తెలియదా? అని అన్నారు. అందరికీ సీఎం కేసీఆర్ న్యాయం చేస్తారని మంత్రి కేటీఆర్ చెప్పారు. -
మరోసారి జేసీ సంచలన వ్యాఖ్యలు
-
మరోసారి జేసీ సంచలన వ్యాఖ్యలు
అనంతపురం: టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు రూ.లక్షన్నర రుణమాఫీ చేస్తామని హామీ యిచ్చి.. ఇప్పటికీ చేయకపోవడంతో రైతులు ఆయనను తిట్టుకుంటున్నారని అన్నారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తే రుణమాఫీ దశలవారీగా చేస్తామని చెప్పారన్నారు. చంద్రన్న సంక్రాంతి కానుక, రూపాయికే కిలో బియ్యం పథకాలు వృథా అని కొట్టిపారేశారు. ఈ పథకాల వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది కానీ ప్రజల్లో పార్టీకి గుర్తింపు రావడం లేదన్నారు. ఉపాధి హామీ పథకంతో కూలీల కంటే ఫీల్డ్ అసిస్టెంట్లకే లాభం చేకూరుతోందని ఆయన కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. మనం మహాత్మా శిష్యులం కాదని.. డబ్బు లేనిదే రాజకీయాల్లో మనుగడ లేదంటూ వ్యాఖ్యానించారు. సర్పంచ్ పదవి నుంచి ప్రధాని వరకు జరిగే ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెడితేనే గెలుస్తారని ఈ సందర్భంగా జేసీ చెప్పారు. -
'హైదరాబాద్ లో ఆధార్ ఉన్నా రుణమాఫీ'
హైదరాబాద్: పంట రుణాల మాఫీ వ్యవహారంపై ఇప్పటివరకు 3 లక్షల ఫిర్యాదులు అందాయని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఉన్నతాధికారులతో గురువారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. రుణమాఫీ సమస్యలు, సాంకేతిక లోపాలపై సమావేశంలో చర్చించామని ఆయన తెలిపారు. హైదరాబాద్ లో ఆధార్ కార్డు ఉంటే ఇక్కడున్న వారికి కూడా రుణమాఫీ వరిస్తుందని చెప్పారు. అయితే ఏపీలో ఓటు హక్కు కలిగి వుండాలని స్పష్టం చేశారు. కాగా, రుణమాఫీకి కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదని ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. -
రుణమాఫీపై శ్వేతపత్రానికి సీపీఎం డిమాండ్
సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీ అమలుపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని సీపీఎం ఏపీ రాష్ట్రకమిటీ డిమాండ్ చేసింది. తొలి విడత ఖాతాల్లో ఎంతమందికి రుణమాఫీ అమలు జరిగిందో వివరించాలని కోరింది. ఈమేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు లేఖ రాశారు. ఇంతవరకు ఎంత మొత్తాన్ని బ్యాంకులకు జమ చేశారో, రెండో విడతలో ఎంతమొత్తంలో మాఫీ చేయబోతున్నారో ప్రజలకు వివరించాలని విజ్ఞప్తి చేశారు. బినామీ రుణాలు పేరిట సహకార బ్యాంకుల్లో 400 కోట్లు, వాణిజ్య బ్యాంకుల్లో 400 కోట్ల రూపాయల మాఫీ జరగలేదు. ‘రాజధాని ప్రాంత రైతులకు కూడా నామమాత్రంగానే విడుదల అయ్యాయి. రుణమాఫీకి సంబంధించి జీవో విడుదల చేసి ఐదు నెలలు గడుస్తున్నా ఇంతవరకు తొలివిడత ప్రక్రియే పూర్తి కాలేదు. పెండింగ్‌లో 43 లక్షల మంది ఉన్నారని ప్రభుత్వ వర్గాలే తెలుపుతున్నాయి. కౌలురైతులకు, రైతుమిత్ర, జాయింట్ లయబులిటీ గ్రూపు సభ్యులన్నింటికీ కలిపి ఎంత రుణమాఫీ జరిగిందో ప్రభుత్వం వద్దనే లెక్కలు లేవు. సన్న,చిన్నకారు రైతులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారే తప్ప వొనగూడిన ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పటికైనా గందరగోళానికి తెరదించి స్పష్టత ఇవ్వండి. రుణమాఫీపై శ్వేతపత్రాన్ని విడుదల చేయండి’ అని మధు కోరారు. -
రుణమాఫీ కాలేదని బ్యాంకులోనే ఆగిన గుండె
తనకు రుణమాఫీ రాలేదన్న ఆవేదనతో ఓ రైతు బ్యాంకులోనే గుండె పోటుతో మరణించాడు. బాధితులు తెలిపిన వివరాలు మేరకు బుక్కరాయసముద్రం మండలం రేకులకుంట గ్రామానికి చెందిన గోసల పూజారి నాగన్న(65), అతడి భార్య రామలక్ష్మి వ్యవసాయం చేసుకుంటూ జీవనం గడిపేవారు. నాగన్నకు రేకులకుంటలో 10 ఎకరాల పొలం ఉంది. వీటిపై సహకార బ్యాంకులో రూ. 6 వేలు, బీకేయస్ స్టేట్ బ్యాంక్‌లో బంగారంపై రూ. 50 వేలు, క్రాప్ లోను మరో రూ. 50 వేలు రుణాలున్నాయి. అయితే ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీలో రెండు జాబితాల్లోను నాగన్న పేరు రాలేదు. దీంతో నాగన్నకు ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. వీటిపై తమ తండ్రి రెండు దపాలుగా బ్యాంక్ అధికారులకు, రెవెన్యూ అధికారులకు పత్రాలన్నీ అందజేసినట్లు నాగన్న కుమారులు పెద్ద నారాయణస్వామి, సన్న నారాయణస్వామి, శివయ్య తెలిపారు. సోమవారం ఉదయాన్నే 9 గంటలకు నాగన్న సహకార సంఘం సొసైటి కార్యాలయానికి చేరుకుని మరోసారి తన రుణమాఫీ ఏమైందో కనుక్కుందామని వచ్చాడు. ఉదయమే సొసైటీ అధికారులు ఎవ్వరూ రాకపోవడంతో కార్యాలయం ఎదుట ఉన్న కట్టపై కూర్చుని మనోవేదనతో పడిపోయాడు. స్థానికులు చేరుకుని ఏమైందో అని తెలుసుకునేసరికి చనిపోయాడని నిర్ధారించుకుని బంధువులకు సమాచారం అందించారు. -
బ్యాంకు అధికారులే బాధ్యులు
రుణ విముక్తిలో పొరపాట్లపై సర్కారు సర్క్యులర్ ‘‘రుణం విషయంలో గానీ, ప్రభుత్వం విధించిన షరతుల విషయంలో గానీ, రుణ విముక్తికి అర్హత పొందిన మొత్తంలో గానీ ఎటువంటి తేడాలు జరిగినా, తప్పులు దొర్లినా ఆయా బ్యాంకు ఆఫీసర్లే బాధ్యత వహించాలి. అర్హత లేని రైతుల ఖాతాలకు గానీ లేదా అర్హత పొందిన సొమ్ముకు మించి గానీ జమ చేసిన పక్షంలో వెంటనే ఆ సొమ్మును ఆయా రైతుల ఖాతాల నుంచి ఉపసంహరించాలి.’’ సాక్షి, హైదరాబాద్: రైతుల రుణ విముక్తిలో ఏవైనా తప్పులు జరిగితే సంబంధిత బ్యాంకు ఆఫీసర్లను బాధ్యులను చేస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బ్యాంకర్లకు ఆర్థికశాఖ మరో సర్క్యులర్ జారీ చేసింది. రుణ విముక్తిలో రైతులు తీసుకున్న రుణం విషయంలో గానీ, ప్రభుత్వం విధించిన షరతుల విషయంలో గానీ, రుణ విముక్తికి అర్హత పొందిన మొత్తం లో గానీ ఎటువంటి తేడాలు జరిగినా, ఆయా బ్యాంకు ఆఫీసర్లే బాధ్యత వహించాలని ఈ సర్క్యులర్‌లో ప్రభుత్వం స్పష్టం చేసింది. బ్యాంకు ఆఫీసర్లు రుణ విముక్తి వివరాలను మరోసారి తనిఖీ చేయాలని, అన్నీ సవ్యంగా ఉన్నట్లు సంతృప్తి చెందితేనే ఆయా రైతుల ఖాతాలకు నిధులు జమ చేయాలని నిర్దేశించింది. పొరపాటు జరిగి అర్హత లేని రైతుల ఖాతాలకు గానీ లేదా అర్హత పొందిన సొమ్ముకు మించి గానీ జమ చేస్తే వెంటనే ఆ సొమ్మును ఆయా రైతుల ఖాతాల నుంచి ఉపసంహరించడంతో పాటు ఆ విషయాన్ని తమకు తెలపాలని ప్రభుత్వం పేర్కొంది. అర్హత పత్రాలను బాగా పరిశీలించాలి అలాగే రైతుల దగ్గర నుంచి అక్నాలెడ్జ్మెంట్ తీసుకుని.. వారు విముక్తికి అర్హత పొందిన సొమ్మును వారి వారి ఖాతాలకు జమ చేయాలని సర్క్యులర్‌లో సూచించారు. రైతులు ఏదైనా కారణంతో అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వకున్నా అర్హత పొందిన సొమ్మును ఆ రైతుల ఖాతాలకు జమ చేయడంతో పాటు బ్యాంకు అధికారి ఆ రైతులకు సమాచారం పంపించాలని చెప్పారు. ఆ రైతుల ఖాతాలకు ఎంత మొత్తం జమ అయిందో బ్యాంకు అధికారులు ధృవీకరణ పత్రం ఇవ్వాలన్నారు. ఏదైనా నిబంధన కారణంగా రైతుల ఖాతాల రుణ విముక్తి పెండిం గ్లో ఉంచితే.. ఆయా రైతులు ఆ నిబంధనకు సంబంధించిన పత్రాలను తీసుకొస్తే పరిశీ లించి అర్హత గల సొమ్మును వారి ఖాతాలకు జమ చేయడంతో పాటు రైతులకు సమాచారమివ్వాలని సర్క్యులర్‌లో స్పష్టం చేశారు. సగానికి కోసి.. ఐదో వంతు జమ.. అధికారంలోకి వస్తే తొలి సంతకంతోనే రాష్ట్రం లోని వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నికలకు ముందిచ్చిన హామీ. ఏపీలో వ్యవసాయ రుణాలు తీసుకున్న మొత్తం కోటి మందికి పైగా రైతు ఖాతాలకు సంబంధించి 87,612 కోట్ల రూపాయల రుణాలున్నాయి. అధికారంలోకి వచ్చి ఏడున్నర నెలలు దాటుతుండగా ఇప్పటివరకు చంద్రబాబు చెల్లించింది ఎంత అంటే.. కేవలం రూ. 1,900 కోట్ల రూపాయలే. ఈ మొత్తమంతా రైతుల రుణాల వడ్డీకి కూడా సరిపోలేదు. తొలి దశలో రుణ విముక్తికి అర్హులుగా తేల్చిన రైతుల ఖాతాల రుణాలు మొత్తం రూ. 24,001 కోట్లుండగా.. ప్రభుత్వం అనేక షరతుల ద్వారా దానిని రూ. 14,320 కోట్లకు కుదించింది. అందులోనూ ఈ ఏడాది తీర్చేది (20 శాతం) కేవలం రూ.4,663 కోట్లే. ఇందులో ఇప్పటివరకు రూ.1,900 కోట్లను రైతుల ఖాతాలకు జమ చేశారు. ప్రభుత్వం ఒకసారి రైతుల ఖాతాలను వడపోసిన తరువాత కూడా బ్యాంకులను బాధ్యులను చేస్తూ మళ్లీ పరిశీలించాలని ఆదేశించడంతో బ్యాంకు అధికారులు ఒకటికి రెండుసార్లు వివరాలను పరిశీలిస్తుండటంతో తొలి దశ 20 శాతం రుణ విముక్తి నిధుల జమ నత్తనడకన సాగుతోంది. -
'రుణమాఫీ పేరుతో మోసపోయాం'
నూజెండ్ల: వ్యవసాయ రుణమాఫీ పేరుతో మోసపోయామని గుంటూరు జిల్లా నూజెండ్ల రైతులు వాపోయారు. ఎన్నికల్లో హామీయిచ్చిన విధంగా వ్యవసాయ రుణలు మాఫీ చేయాలని ఎంపీ రాయపాటి సాంబశివరావు, ఎమ్మెల్యే ఆంజనేయులను మంగళవారమిక్కడ నిలదీశారు. బ్యాంకు అధికారులతో మాట్లాడతామని ఎంపీ, ఎమ్మెల్యే ఎస్ బీఐ లోనికి వెళ్లారు. న్యాయం జరిగే వరకు కదిలేది లేదంటూ అన్నదాతలు బ్యాంకు ఎదుట బైఠాయించారు. రుణమాఫీ చేసే వరకు పోరాడతామని రైతులు స్పష్టం చేశారు. -
'జగన్ మా నేత అని గర్వపడుతున్నాం'
-
'జగన్ మా నేత అని గర్వపడుతున్నాం'
హైదరాబాద్: వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ నాయకుడని చెప్పుకోవడానికి గర్వపడుతున్నామని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ రంగారావు అన్నారు. రుణమాఫీపై సోమవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... బేషరతుగా రుణమాఫీ చేస్తామని హామీయిచ్చిన టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చిందని విమర్శించారు. రేషన్ కార్డుకు ఒక్క రుణమాఫీ మాత్రమే చేస్తామనడం సరికాదన్నారు. రుణమాఫీపై మాట్లాడే అర్హత తమ పార్టీకి లేదని ప్రభుత్వం అనడం చాలా దురదృష్టకరమన్నారు. ఎన్నికల సమయంలో రుణమాఫీపై టీడీపీ హామీయిచ్చినప్పడు మనం కూడా ప్రకటన చేద్దామని తమ నాయకుడు జగన్ ను అడిగామన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో రుణమాఫీ సాధ్యపడదని జగన్ భావించారని చెప్పారు. రుణమాఫీపై హామీయిస్తే ఎన్నికల్లో లబ్ది పొందేవాళ్లమని, కానీ అలా చేయలేదన్నారు. సాధ్యపడదని హామీ ఇవ్వనందుకు జగన్ తమ నాయకుడని చెప్పుకోవడానికి గర్వపడుతున్నామని సుజయ్ కృష్ణ రంగారావు అన్నారు. -
తొలివిడత రుణమాఫీకి 15వేల కోట్లు
-
కొత్త కష్టాలు తెచ్చిపెడుతోన్న రుణమాఫీ
-
రుణమాఫీ రెండో జాబితా రిలీజ్
-
‘స్కేల్ ఆఫ్ ఫైనాన్స్’లోనూ కత్తెర..!
విజయనగరం అర్బన్ : పంట రుణమాఫీ అమలు కోసం ఇన్నాళ్లూ సవా‘లక్ష’న్నర నిబంధనలు పెట్టి అర్హుల సంఖ్యను భారీగా కుదించిన ప్రభుత్వం, తాజాగా ‘స్కేల్ ఆఫ్ ఫైనాన్స్’ కొలమానం ప్రకారం పండించిన పంటకు ఇచ్చే రుణంలోనూ పరిమితులు విధించి, రుణమాఫీ మొత్తానికి భారీస్థాయిలో కతెక్తర వేసింది. ఆ మేరకు తొలి అర్హులజాబితాను తాజాగా విడుదల చేసింది. దీంతో చాలా మంది రైతులు నష్టపోతున్నారు.‘స్కేల్ ఆఫ్ ఫైనాన్స్’ పట్టిక మేరకు నిర్ణయించిన రుణ మంజూరు పరిమితులను విస్మరించి,తమకు తోచినట్టుగా కుదించారు. 2012-13 వార్షిక స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ నిబంధన మేరకు చెరుకు పంటకు ఎకరాకు రూ.35 వేల నుంచి రూ.40 వేల (అగ్రికల్చర్ టెక్నికల్ కమిటీ అధికారికంగా నిర్ణయించిన పట్టిక ప్రకారం) వరకు రుణ అర్హత ఉంది. అయితే తొలి జాబితాలోని చెరుకు పంట రుణాలకు ఎకరాకు కేవలం రూ.15 వేలు మాత్రమే పరిధిని నిర్ణయించి రుణమాఫీ లెక్కలు కట్టారు. దీంతో దాదాపు మూడొంతులలో రెండొంతుల రుణాన్ని మాఫీకి దూరం చేశారు. ఆ సొమ్మును రైతులు కచ్చితంగా బ్యాంకులకు చెల్లించుకోవాల్సి ఉంటుంది. రోజుకో ప్రకటన చేస్తూ రైతులను మభ్యపెడుతూ వచ్చిన ప్రభుత్వం తీరా నగదును రైతుల ఖాతాల్లో జమ చేసే ముందు ఈ విధంగా కుట్రచేసింది. రైతన్నలకు ఝలక్.. రుణాలు మాఫీ అవుతాయని కొండంత ఆశగా ఎదురుచూస్తున్న రైతులకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ రూపంలో ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. దీంతో అధికంగా రుణాలు వాడిన చెరుకు రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. తాజాగా విడుదల చేసిన అర్హుల తొలి జాబితాను పరిశీలిస్తే అది స్పష్టం అవుతోంది. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ) పరిధిలోని ఎస్.కోట శాఖలో పడాల వెంకట విశ్వనాథం అనే రైతు రుణమాఫీ ఖాతాను పరిశీలిస్తే ఈ విషయం బయటపడింది. నాలుగు ఎకరాల్లో చెరకు పంట వేసేందుకు 2013 జూన్ 22న రుణం పొందే సమయానికి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పట్టిక ప్రకారం ఎకరాకు రూ. 40 వేల చొప్పున రూ. లక్షా 20 వేల రూపాయల వరకు అప్పుతీసుకునే అర్హత ఉంది. అయితే ఆయన ఎకరాకు రూ.15 వేల చొప్పున నాలుగు ఎకరాలకు రణ పరిధిని నిర్ణయించినట్లు ఆన్లైన్ జాబితా పట్టికలో స్పష్టంగా తెలుస్తోంది. ఇదే తీరులో జిల్లాలోని 20 వేల మంది చెరకు రైతుల రుణపరిమితిని కుదించి మాఫీ అమలు చేయనున్నారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కత్తెర వల్ల ఒక్క డీసీసీబీలోనే రూ. 14 కోట్ల మేరకు మాఫీ నిధిని కుదించారు. డీసీసీబీలో తొలిజాబితాలోని 39,259 మంది రైతులకు రూ.104 కోట్ల మేర రుణం ఉండగా, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పట్టిక మేరకు అమలు చేయడం వల్ల రూ.90.23 కోట్ల మేర మాత్రమే రుణమాఫీ కానుంది. రుణమాఫీ పరిధిని తగ్గించడంతో చెరకు రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రూ.50 వేల లోపు రుణం తీసకున్న రైతుల ఖాతాల్లో రూ.47.23 కోట్లు జమ అయినట్టు డీసీసీబీ అధికారులు చెప్పారు. అర్హుల తొలి జాబితాలో 1,43,808 మంది రైతులు ప్రభుత్వం ఆన్లైన్లో విడుదల చేసిన అర్హుల తొలి జాబితాలో 1,43,808 మంది రైతులున్నారని సమాచారం. రెండుమూడు అకౌంటులున్న రైతులను కలుపుకొంటూ ఈ జాబితా తయారయినట్టు అధికారులు ప్రకటించారు. అదే విధంగా ఖాతాదారుల జాబితాలను మండలాల వారీగా ఆయా మండలాల వ్యవసాయ శాఖలకు నేరుగా పంపారు. దీనిలో రూ.50 వేలు లోపు రుణం ఉన్న రైతులను విభజించకపోవడం వల్ల ఖాతాదారులకు వివరణ ఇవ్వలేని పరిస్థితిలో బ్యాంక్ అధికారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. పలుప్రాంతాలలో రూ.50 వేలలోపు రుణం తీసుకున్న రైతులకు పూర్తి స్థాయిలో నగదు జమ కాలేదు. బాడంగి, తెర్లాం, ఎస్.కోట, గంట్యాడ మండలాలల్లో రైతులకు ఇలా జరగడం వల్ల ఎవరిని అడిగి వివరాలు తెలుకోవాలో తెలియక ఆందోళనలో రైతులు పడ్డారు. -
వంద శాతం రుణమాఫీ అయిపోయినట్లే: జేసీ
అనంతపురం: వంద శాతం రైతుల రుణమాఫీ అయిపోయినట్లేనని అనంతపురం ఎంపీ జేసీ దివాకరరెడ్డి వ్యాఖ్యానించారు. రైతు రుణమాఫీ అమల్లోకి వచ్చినందున ఈ అంశంపై విపక్షాలు రాద్ధాంతం చేయడం మానుకోవాలని సూచించారు. సోమవారం అనంతపురంలోని తన నివాసంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన విధంగా రుణమాఫీ అమలు చేశారన్నారు. ఇందులో పెద్ద రైతులకు అన్యాయం జరిగి ఉండొచ్చని, అంత మాత్రాన విమర్శలు గుప్పించడం భావ్యం కాదన్నారు. చంద్రబాబు ఆరు మాసాల పాలన ముగిసిందని, ఏ ప్రభుత్వానికైనా రెండేళ్ల సమయం ఇచ్చి తరువాత ఫలితాలు ఆశించాలన్నారు. విభజన నేపథ్యంలో అనేక సమస్యలు ఉన్నాయన్నారు. -
రుణమాఫీ జాబితా అస్పష్టం
-
ఆన్లైన్ లో రుణమాఫీ అర్హుల జాబితా
-
ఆన్లైన్ లో రుణమాఫీ అర్హుల జాబితా
హైదరాబాద్: తొలిదశ పంటల రుణమాఫీ అర్హుల జాబితాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకరోజు ఆలస్యంగా ఆన్లైన్ లో ఉంచింది. అర్హుల జాబితా http://apcbsportal.ap.gov.in/loanstatus లో చూడొచ్చు. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, లోన్ ఎకౌంట్ నంబర్ల ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు. ఈ మూడింటిలో ఏదో ఒక నంబర్ ఉంటనే అర్హుల వివరాలు వెల్లడవుతాయి. తొలి దశ రుణ మాఫీ అర్హుల జాబితాను శనివారం ప్రచురిస్తామని, ఆన్లైన్లో పెడతామని, అందరూ చూసుకోవచ్చునని ఈ నెల 4వ తేదీన విలేకరుల సమావేశంలో చంద్రబాబు ప్రకటించారు. అయితే ఒకరోజు ఆలస్యంగా 7వ తేదీ మధ్యాహ్నానికి జాబితాను ఆన్లైన్ లో పెట్టారు. -
రైతులపై రూ. 9,679 కోట్లు భారం
సర్కారు పూర్తి రుణ మాఫీ చేయని ఫలితం సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పూర్తి స్థాయిలో వ్యవసాయ రుణాలను మాఫీ చేయనందున ఇప్పుడు తొలి దశలో 14.23 లక్షల కుటుంబాలకు చెందిన రైతులు రూ.9,679 కోట్లను బ్యాంకులకు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. ఆ మొత్తంపై 14 శాతం వడ్డీని బ్యాంకులు వసూలు చేయనున్నాయి. 14.23 లక్షల కుటుం బాలకు చెందిన రైతులు రూ.50 వేల కన్నా ఎక్కువగాను, రూ.లక్షన్నర కన్నా ఎక్కువగాను బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. ఆ కటుంబాల ఖాతాలకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ (అర్హత మేరకే రుణం) నిబంధనను, వడ్డీతో కలిసి రూ.లక్షన్నర వరకే సీలింగ్‌ను ప్రభుత్వం విధించింది. దీంతో ఆయా రైతు కుటుంబాలు తీసుకున్న రుణాలు పూర్తి స్థాయిలో మాఫీ జరగడం లేదు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్, లక్షన్నర సీలింగ్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసిన నివేదిక ప్రకారం 14.23 లక్షల కుటుంబాలున్నట్లు తేల్చి ఈ పరిస్థితి తలెత్తింది. ప్రభుత్వం రూపొందించిన లెక్క ప్రకారం రూ. 50 వేలకు పైబడి రూ.లక్ష వరకు రుణాలు తీసుకున్న రైతుల కుటుంబాల సంఖ్య 8.68 లక్షలు ఉన్నాయి. ఈ కుటుంబాలకు చెందిన వారు తీసుకున్న మొత్తం రుణాలు రూ.7,178 కోట్లుగా ప్రభుత్వం తేల్చింది. మిగతా మొత్తాన్ని రైతులే భరించాలి. అలాగే రూ.లక్షన్నరకు పైబడి రుణాలు తీసుకున్న రైతుల కుటుంబాల సంఖ్య 5.55 లక్షలుగా ప్రభుత్వం తేల్చింది. ఆ రైతు కుటుంబాలు మొత్తం 14,573 కోట్ల రూపాయలను రుణాలు తీసుకున్నారు. దీనిలో కేవలం 6,490 కోట్ల రూపాయలను మాత్రమే ప్రభు త్వం చెల్లించనుంది. -
'ఊరికే కథలు చెప్పకు నాకు అన్నీ తెలుసు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఏ రైతు కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం లేదని సీఎం చంద్రబాబు అన్నారు. రైతులను ఆదుకునేందుకు అన్ని చేస్తున్నామని చెప్పుకొచ్చారు. పంటల రుణమాఫీపై గురువారం ఆయన విధాన ప్రకటన చేశారు. ఈ సందర్భంగా రైతు ఆత్మహత్యలపై విలేకరులు ప్రశ్నించగా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఊరికే కథలు చెప్పకు నాకు అన్నీ తెలుసు. రాజకీయాలు చేయొద్దు' అంటూ మండిపడ్డారు. మీరు మళ్లీ అధికారంలోకి వచ్చాక 90 మంది వరకు అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారని విలేకరులు అడగ్గా... రైతులు ఎక్కడ ఆత్మహత్య చేసుకున్నారు చెప్పండంటూ విలేకరులను ఎదురు ప్రశ్నించారు. అనంతపురం కరువు జిల్లా కాబట్టి అక్కడ సమస్యలున్న మాట వాస్తవమేనన్నారు. అనంతపురం జిల్లా రైతులకు ఇన్‌ఫుట్ సబ్సిడీ ఇస్తామని హామీయిచ్చారు. కర్ణాటక సీఎంను ఒప్పించి హంద్రీనీవా ప్రాజెక్టు నుంచి అనంతపురంకు నీళ్లు తీసుకొస్తున్నామని, తమ నిబద్దతకు ఇది నిదర్శనమన్నారు. -
సగం మందికే.. రుణమాఫీ
పంట రుణాల మాఫీ హామీ అమలులో ప్రతిపాదనల దశలోనే సగం మంది రైతులకు ప్రభుత్వం టోపీ పెట్టింది. 4.73 లక్షల మంది రైతులకు రుణమాఫీ వర్తింపజేయాలని బ్యాంకర్లు పంపిన ప్రతిపాదనలపై ప్రభుత్వం ఆమోదముద్ర వేయకపోవడం సందేహాలకు తావిస్తోంది. నిబంధనల మేరకు రుణం తీసుకున్న రైతులకే మాఫీ వర్తింపజేస్తామని ప్రభుత్వం సరికొత్త మెలిక పెట్టడంపై బ్యాంకర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఒక్క సంతకంతో పంట రుణాలను మాఫీ చేసి.. రైతులకు ఉపశమనం కల్పిస్తామని ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ఊరూవాడ ఊదరగొట్టిన విషయం విదితమే. జూన్ 8న సీఎంగా ప్రమాణస్వీకారం చేశాక చంద్రబాబు చేసిన తొలి సంతకమే అపహాస్యం పాలైంది. పంట రుణాల మాఫీ విధి విధానాల రూపకల్పనకు కోటయ్య కమిటీని నియమిస్తూ సీఎం తొలి సంతకం చేశారు. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు ఒక్కో కుటుంబానికి రూ.1.5 లక్షల రుణం(రూ.లక్ష పంట రుణం, రూ. 50 వేలు బంగారం కుదవ పెట్టి తీసుకున్న పంట రుణం) మాఫీ చేస్తామన్నారు. ఆ మేరకైనా చేశారా అంటే అదీ లేదు.. ఒక్కో కుటుంబానికి గరిష్టంగా మాఫీ చేసే రూ.1.5 లక్షను ఐదు దశల్లో అందిస్తామంటూ చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలోనే పంట రుణాల మాఫీకి లబ్ధిదారుల వివరాలు పంపాలని బ్యాంకర్లను ఆగస్టు 14న ప్రభుత్వం ఆదేశించింది. రుణ విముక్తికి ప్రతిపాదనలు పంపడానికి 30అంశాలతో కూడిన ప్రొఫార్మాను బ్యాంకర్లకు అందజేసింది. ప్రతిపాదనల్లోనే వడపోత.. జిల్లాలో 40 జాతీయ, ప్రాంతీయ, సహకార బ్యాంకుల కింద ఉన్న 478 బ్రాంచుల్లో డిసెంబర్ 31, 2013 నాటికి 8,70,321 మంది రైతులు రూ.11,180.25 కోట్లను పంట రుణాలుగా తీసుకున్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఆ రుణాలన్నీ మాఫీ చేయాలి. కానీ.. ఆ మేరకు రుణ మాఫీ చేయలేమని చేతులెత్తేశారు. ప్రభుత్వం నిర్ధేశించిన నిబంధనల మేరకు జిల్లాలో 3.73 లక్షల మంది రైతుల పట్టాదారు పాసు పుస్తకాలు, బ్యాంకు ఖాతా నెంబరు, ఆధార్ కార్డు, రేషన్‌కార్డు తదితరాలను అనుసంధానం చేసి బ్యాంకర్లు అక్టోబర్ 31 నాటికి ప్రభుత్వానికి నివేదించారు. ప్రభుత్వం గడువును పొడిగించడంతో శనివారం నాటికి మరో 90 వేల మంది రైతుల వివరాలు పంపారు. అంటే.. రెండు దశల్లోనూ 4.73 లక్షల మంది రైతులకు రుణ మాఫీ వర్తింపజేయాలని బ్యాంకర్లు ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు స్పష్టమవుతోంది. ప్రభుత్వం విధించిన నిబంధనల వల్ల ప్రతిపాదనల దశలోనే 3.97 లక్షల మంది రైతులకు రుణమాఫీ వర్తించలేదన్నది విశదమవుతోంది. రోజుకో మాట.. పూటకో విధానం.. బ్యాంకర్లు పంపిన ప్రతిపాదనలను పరిశీలించి.. లబ్ధిదారుల జాబితాను ఖరారు చేసి, ప్రకటించాల్సిన ప్రభుత్వం దాటవేత ధోరణి అవలంబిస్తోంది. నిబంధనల మేరకు బ్యాంకర్లు రుణాలు ఇచ్చిన రైతులకే రుణ విముక్తి కల్పిస్తామంటూ రెండు రోజల క్రితం వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు స్పష్టీకరించారు. అంటే.. ఎస్ఎల్బీసీ(రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ)లో చేసిన తీర్మానం మేరకు మెట్ట, మాగాణి భూములు.. రైతులు సాగుచేసే పంటలను బట్టి ఏ మేరకు రుణాలు ఇవ్వొచ్చన్నది ఎస్ఎల్బీసీ నిర్ణయిస్తుంది. ఆ మేరకే బ్యాంకర్లు రుణాలు ఇవ్వాలి. ఎస్ఎల్బీసీ నిర్ణయించిన మొత్తం కన్నా బ్యాంకర్లు అధిక మొత్తం రుణం ఇచ్చి ఉంటే.. ఆ రుణాలను మాఫీ చేయలేమని వ్యవసాయశాఖ మంత్రి ప్రకటించారు. రోజుకో మాట.. పూటకో విధానాన్ని ప్రభుత్వం అవలంబిస్తోండడంతో బ్యాంకర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రుణ విముక్తి లబ్ధిదారుల జాబితాలో తమ పేరు ఉంటుందో లేదోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
జన్మభూమి కమిటీలకు కీలక బాధ్యతలు !
విజయనగరం అర్బన్ : పంట రుణమాఫీకి సంబంధించిన రైతు జాబితాలను ప్రభుత్వం విడుదల చేసింది. జాబితాను జిల్లా కేంద్రానికి కాకుండా నేరుగా తహశీల్దార్లకు పంపింది. ప్రభుత్వం ఇచ్చిన పాస్వర్డ్తోనే అక్కడి అధికారులు ఓపెన్ చేసేలా ఏర్పాటు చేశారని బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. జాబితాను పునఃపరిశీలించడం వంటి కీలకమైన బాధ్యతలను గ్రామ జన్మభూమి కమిటీలకు అప్పగించారు. ఈ జాబితాలను గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శించారు. జన్మభూమి కమిటీలకు ఈ బాధ్యతలను అప్పగించడం వల్ల మిగతా పార్టీల మద్దతుదారులు నష్టపోయే ప్రమాదం ఏర్పడింది. రుణమాఫీ నిబంధనల మేరుకు జిల్లాలో 2,79,139 మంది రైతుల పేర్లను అన్లైన్లో అప్లోడ్ చేశారు. అయితే వివిధ కారణాలతో వీరిలో 28,700 వేల మంది రైతులు తిరస్కరణ జాబితాలో చేరారు. ప్రధానంగా ఆధార్, రేషన్‌కార్డులు లేకపోవడంతో వీరందర్నీ తిరస్కరణ జాబితాలో పెట్టారు. అయితే రుణమాఫీ జాబితాపై ప్రభుత్వం పునర్విచారణకు ఆదేశించింది. బ్యాంకర్లు పంపిన వివరాలు సరిగా ఉన్నాయో. ..? లేవో ?విచారణ చేపట్టాలని రెవెన్యూ శాఖకు సూచించింది. వీఆర్వోల ద్వారా గ్రామ గ్రామానికి వెళ్లి జాబితాలపై పునర్విచారణ చేసి, నివేదిక సమర్పించాలని ఆదేశాలలొచ్చినట్లు తెలుస్తోంది. మరో వైపు తిరస్కరణ జాబితాలోని రైతుల అర్హతులను పునఃపరిశీలించే బాధ్యతను గ్రామస్థాయి జన్మభూమి కమిటీలకు అప్పగించింది. దీంతో రాజకీయ కక్షసాధింపు చర్యలకు అవకాశం ఇచ్చినట్టు అయిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. సోమవారం నుంచి పునర్విచారణ ప్రారంభమైనట్టు తెలిసింది. రుణమాఫీ పొందే రైతుతోపాటు కుటుంబసభ్యుల్లో మేజర్లయిన అయిన ఇద్దరి వివరాలు సేకరించాలి. రైతుపై ఆధారపడిన ఇద్దరు కుటుంబ సభ్యుల పూర్తి వివరాలు, ఇంటిపేరుతో బంధుత్వం, డోర్ నంబర్, ఓటరు ఐడీకార్డు, రేషన్ కార్డు, ఆధార్‌కార్డు వివరాలను వీఆర్వోలు సేకరించాలి. సేకరించిన వివరాలపై జన్మభూమి కమి టీలతో సంతకం చేయించి తహశీల్దార్‌కు అందిస్తే ఆయన ఆధ్వర్యంలో ప్రభుత్వానికి పంపాలి. ఈ తంతును మూడు రోజుల్లోగా ముగించి, ఈ నెల 13వ తేదీలోగా తిరిగి బ్యాంకుల్లో తాజా జాబితాను అప్లోడ్ చేయాలని ఆదేశాలొచ్చాయి. రుణమాఫీ తాజా జాబితాను బ్యాంకర్లకు పంపలేదు రైతు రుణమాఫీ జాబితా సవరణ కోసం నేరుగా తహశీల్దార్ కార్యాలయాలకు ప్రభుత్వం పంపిందని లీడ్‌బ్యాంక్ మేనేజర్ వి.శివబాబు తెలిపారు. గ్రామ జన్మభూమి కమిటీ పునఃపరిశీలన కోసం నేరుగా రెవెన్యూఅధికారులకు పంపింది. అర్హతలను మరోసారి కమిటీ పరిశీలించి, తిరస్కరణ జాబితాలోనే నిజమైన అర్హులుంటే అర్హత కల్పిస్తారు. సవరించిన జాబితాను ఈ నెల 13వ తేదీ సాయంత్రం 5.00 గంటలోపు ఆప్‌లోడ్ చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్టు తెలిపారు. -
గిరిజనేతర రైతులకూ మాఫీ
* ఎస్టీ ఎమ్మెల్యేల డిమాండ్‌పై సీఎం సానుకూల స్పందన * నాలుగు జిల్లాల శాసన సభ్యులు, కలెక్టర్లతో సమీక్ష * మాఫీకి రూ.100 కోట్ల నుంచి రూ.120 కోట్లు కావాలని అంచనా సాక్షి, హైదరాబాద్: గిరిజనేతర రైతులకూ పంట రుణ మాఫీ వర్తింపజేయాలన్న డిమాండ్‌పై సీఎం కె.చంద్రశేఖర్‌రావు సానుకూలంగా స్పం దించారు. మంగళవారం అసెంబ్లీలో గిరిజన ఎమ్మెల్యేలు, నాలుగుజిల్లాల కలెక్టర్లు, సంబంధి త ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గిరిజన ప్రాంతాల్లో ఏళ్ల తరబడి భూములు సాగు చేస్తున్న గిరిజనేతర రైతులు కూడా ఉన్నారు. అయితే వీరి పేర పట్టాలు కానీ, ఇతర రికార్డులు కానీ ఉండవు. 1/70 యాక్టు మేరకు గిరిజన ప్రాంతాల్లో గిరిజనేతరుల పేరు న అధికారికంగా ఎలాంటి పంట భూములు ఉండవు. దీంతో వీరంతా రుణ మాఫీ పరిధిలోకి రాకుండా పోయారు. ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఈ సమస్యను గుర్తించి, ఆయా జిల్లాల కలెక్టర్లను భేటీకి పిలి పించారు. ఆ నాలుగు జిల్లాలకు చెందిన ఎస్టీ ఎమ్మెల్యేలు ఇందులో పాల్గొన్నారు. పంటరుణాలిచ్చిన బ్యాంకులు.. అదే తరహాలో మాఫీ చేయాల్సిందేనని, దీనిపై బ్యాంకర్లను పిలిపించి మాట్లాడాలని సీఎం కలెక్టర్లను ఆదేశించారు. అవసరమైతే ఆర్బీఐ అధికారులతో తాను మాట్లాడుతానని పేర్కొన్నట్లు ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేల ద్వారా తెలిసింది. మాఫీకి రూ.100 కోట్ల నుంచి రూ.120 కోట్లు అవసరం అవుతాయని ప్రాథమికంగా అంచనా వేశారు. 2009-11 మధ్య కరువు వల్ల బ్యాంకుల్లో రీషెడ్యూలు చేసిన రుణాలను రద్దు చేయాలని, పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న వారికి పట్టాలివ్వాలని ఎమ్మెల్యేలు సూచించారు. ఖమ్మం జిల్లాలో పామాయిల్ ఫ్యాక్టరీ సమస్య, రైతుల సమస్యను ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు చెప్పారు. ఛత్తీస్‌గఢ్ నుంచి వలస వస్తున్న గొత్తికోయల వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఖమ్మం కలెక్టర్ సీఎం దృష్టికి తీసుకువెళ్లగా.. అటవీ అధికారులతో మాట్లాడతానని చెప్పారు. -
'దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయండి'
కాకినాడ: ఉనికి కోల్పోతామన్న భయంతోనే తమ పార్టీ ఎమ్మెల్యేలపై రౌడిషీట్లు తెరిచే సంస్కృతికి అధికార టీడీపీ దిగజారిందని వైఎస్సార్ సీపీ నాయకుడు జ్యోతుల నెహ్రు విమర్శించారు. ఉనికి చాటుకోవాల్సిన అవసరం తమ పార్టీకి లేదన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి బలమైన రాజకీయ నేతగా రాష్ట్ర ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించారని అన్నారు. టీడీపీకి దమ్ముంటే సంపూర్ణ వ్యవసాయ, డ్వాక్రా రుణమాఫీ నిరుద్యోగ భృతి పథకాలను ఏవిధంగా అమలు చేస్తారనే దానిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
రుణాలు చెల్లించొద్దు!
-
ఇప్పుడు రుణమాఫీ లేదంటే ఎలా?
-
జిల్లాలో రూ.427 కోట్ల రుణమాఫీ
ఖమ్మం జడ్పీసెంటర్: జిల్లా రైతులకు పంట రుణమాఫీ కోసం రూ. 427 కోట్లు విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ ఇలంబరితి తెలిపారు. ప్రభుత్వం విడుదల చేసిన రుణమాఫీని వివిధ నోడల్ బ్యాంకుల ద్వారా సంబంధిత బ్యాంకులకు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఆర్డీవోలు, తహశీల్దార్లు, బ్యాంక్మేనేజర్లతో సోమవారం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. రుణమాఫీ పంపిణీపై కలెక్టర్ బ్యాంకర్లు, అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. రెవిన్యూ అధికారులు, బ్యాంకు అధికారులు సంయుక్తంగా ఆమోదించిన ఎనెగ్జర్-ఈ తుది జాబితా ప్రకారమే రుణమాఫీ అందించాలని ఆదేశించారు. పట్టాదారుపాస్ పుస్తకాలు క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ఒక్కో బ్యాంకుకు ముగ్గురు వీఆర్వోలు, ఒక ఆర్ఐ లేదా డిప్యూటీ తహశీల్దార్ ప్రత్యేకాధికారులుగా వ్యవహరించాలన్నారు. మండల ప్రత్యేకాధికారి తహశీల్దార్ వ్యవహరిస్తారన్నారు. ప్రతినియోజకవర్గానికో డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారిని నియమించామన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీలకు ప్రత్యేక బృందాలను అధికారులుగా నియమించామన్నారు. అర్హులైన రైతులకు ఏమాత్రం అన్యాయం జరగడానికి వీల్లేదన్నారు. ఆధార్‌నంబర్‌ను నమోదు చేసి ఆన్లైన్ ద్వారా రుణమాఫీ నివేదిక పంపాలని ఆదేశించారు. రైతుల ఖాతా నంబర్లు, భూ సర్వేనంబర్, భూమి విస్తీర్ణం, రైతుల నివాస స్థితి, పట్టాదారు పాస్‌పుస్తకం వివరాలు ప్రత్యేక టీమ్‌లు, బ్యాంకు అధికారులు సంయుక్తంగా పరిశీలించిన తర్వాతే రుణమాఫీ ఇవ్వాలని ఆదేశించారు. రుణమాఫీకి ఆధార్ నంబర్ తప్పనిసరి అన్నారు. రుణమాఫీ విషయంలో ఎలాంటి ఒత్తిడికి తలొగ్గొద్దని సూచించారు. ఈ సమావేశంలో జేసీ సురేంద్రమోహన్, జేడీఏ భాస్కరరావు, లీడ్‌బ్యాంకు మేనేజర్ ఎం.శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆధార్ నంబర్ ఇవ్వండి.. ఆధార్ నంబర్ అనుసంధానం చేస్తేనే రుణమాఫీ వర్తిస్తుందని కలెక్టర్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. వీఆర్వోలు, బ్యాంకులకు రైతులు తమ ఆధార్ నంబర్లను రెండురోజుల్లో అందజేయాలని సూచించారు. లేనిపక్షంలో రుణమాఫీ వర్తించదని తెలిపారు. -
ప్రభుత్వం వెనుకడుగు వేస్తే...
హైదరాబాద్: ఏపీలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో ఏపీ రైతు విభాగం రాష్ట్రస్థాయి సమావేశం ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు రుణమాఫీ చేయకుండా హామీలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులు గడిచినా ఒక్క రూపాయి కూడా రుణమాఫీ చేయలేదని ఆరోపించారు. జిల్లాల్లో సాగుబడి గణనీయంగా పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం బేషరతుగా పంట రుణాలు మాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలన్నారు. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం వెనుకడుగు వేస్తే రైతాంగానికి తమ పార్టీ అండగా ఉంటుందని నాడిరెడ్డి భరోసాయిచ్చారు. -
నేరుగా నగదు రూపంలో చెల్లిస్తాం: యనమల
హైదరాబాద్: బ్యాంకర్లతో సీఎం భేటీ తర్వాత పంట రుణమాఫీపై విధివిధానాలు రూపొందిస్తామని ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. రుణమాఫీ కోసం బడ్జెట్ లో రూ. 5వేల కోట్లు కేటాయించామని చెప్పారు. అదనంగా మరికొంత చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. ఎర్రచందనం అమ్మకాలపై హైకోర్టులో పిటిషన్ వేస్తామన్నారు. గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పును సవాల్ చేస్తామని తెలిపారు. అక్టోబర్ 2 నుంచి అమలు చేయనున్న కొత్త ఫించన్ల పథకంకు రూ. 5400 కోట్లు అవసరమన్నారు. కేంద్రం నుంచి రూ. 400 కోట్లు వస్తాయని వెల్లడించారు. అక్టోబర్ లో ఫించన్లు నేరుగా నగదు రూపంలో చెల్లిస్తామని యనమల చెప్పారు. -
'కిరణ్‌కుమార్ రెడ్డి చాలా ద్రోహం చేశారు'
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి మాజీ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి చాలా ద్రోహం చేశారని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరా రెడ్డి విమర్శించారు. రాష్ట్ర విభజన జరుగుతుందని కిరణ్ కుమార్ రెడ్డికి ముందే స్పష్టంగా తెలుసునని అన్నారు. విభనకు అన్ని పార్టీలూ కారణమన్నారు. ప్రజల కోసం తమ పార్టీ పోరాడుతుందన్నారు. అన్నివర్గాల ప్రజలకు కాంగ్రెస్ మాత్రమే న్యాయం చేయగలదని చెప్పారు. ప్రజల తరపున నిలబడి కాంగ్రెస్ కుపూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. పంట పొలాల్లో ఏపీ రాజధాని ఏర్పాటు చేయొద్దని కోరారు. ప్రభుత్వ భూముల్లోనే రాజధాని ఏర్పాటు చేయాలని సూచించారు. వ్యవసాయ రుణమాఫీ విషయంలో టీడీపీ సర్కారు పూటకో మాట మాట్లాడుతోందని రఘువీరా రెడ్డి విమర్శించారు. -
చంద్రబాబుకు రఘువీరా లేఖ
హైదరాబాద్: జన్మభూమి కార్యక్రమాన్ని స్థానిక ప్రజా ప్రతినిధుల అధ్యక్షతనే నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరా రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు ఆయన లేఖ రాశారు. రుణమాఫీ ద్వారా లబ్ది పొందే రైతులు, డ్వాక్రా, చేనేత కార్మికుల వివరాలు గ్రామస్థాయిలో వెల్లడించాలని ఆయన సూచించారు. ఆదర్శ రైతులు, ఫీల్డ్ అసిస్టెంట్ లు, రేషన్‌షాపు డీలర్లు, అంగన్వాడీ, ఔట్సోర్సింగ్, రైతులకు ఇన్‌ఫుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్, ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగభృతిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. తనిఖీల పేరుతో అర్హులకు రేషన్ కార్డులు తొలగించడం సరికాదన్నారు. సంక్షేమ పథకాలకు ఆధార్ తో లింక్ చేయొద్దని రఘువీరా రెడ్డి కోరారు. -
రుణమాఫీ అమలు ప్రక్రియ నత్తనడక
-
'ఎలా చేస్తారో తెలియదు.. కానీ చేస్తారు'
అనంతపురం: అన్నా క్యాంటీన్లు, పెన్షన్ల కంటే పంట రుణాల మాఫీకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. చంద్రబాబు రుణమాఫీ ఎలా చేస్తారో తనకు తెలియదు కానీ చేస్తారన్న నమ్మకం ఉందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ తీవ్ర ఆర్థికలోటులో ఉంది. మూడు నెలల్లోనే హామీలు నెరవేర్చాలని అనడం సరికాదన్నారు. ఏపీలో కాంగ్రెస్ లో భవిష్యత్ లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే 80 టీఎంసీల నీళ్లు అదనంగా అందుబాటులోకి వస్తాయని జేసీ చెప్పారు. -
'నంగనాచి నాయకులను నమ్మొద్దు'
-
'నంగనాచి నాయకులను నమ్మొద్దు'
హైదరాబాద్: పంట రుణాల మాఫీపై తమ ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందని తెలంగాణ మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, ఈటెల రాజేందర్ అన్నారు. రుణమాఫీపై మంత్రివర్గ సబ్ కమిటీ చేసిన ప్రతిపాదనలకు సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారని వారు వెల్లడించారు. రుణమాఫీ కోసం రూ.4,250 కోట్లు చెల్లించనున్నట్టు తెలిపారు. తెలంగాణ రైతుల కళ్లలో ఆనందం చూడడం కోసమే రుణమాఫీ చేస్తున్నామని చెప్పారు. ప్రతి రైతుకు దశలవారీగా రూ. లక్ష వరకు రుణమాఫీ చేస్తామన్నారు. రేపు బ్యాంకర్లతో చర్చలు జరపనున్నట్టు తెలిపారు. నంగనాచి మాటలు మాట్లాడే ఇతర పార్టీల నేతల మాటలను పట్టించుకోవద్దని తెలంగాణ ప్రజలను పోచారం, ఈటెల కోరారు. -
'మొట్టికాయ వేసే రోజు త్వరలోనే వస్తుంది'
అనంతపురం: ప్రజా వ్యతిరేకతతో చంద్రబాబు ప్రభుత్వం కొట్టుకుపోయే రోజు దగ్గరలోనే ఉందని ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. టీడీపీ సర్కారుకు దేవుడు మొట్టికాయ వేసే రోజు త్వరలోనే వస్తుందని వ్యాఖ్యానించారు. అనంతపురం జిల్లాలో నిర్వహించిన పార్టీ సమీక్షా సమావేశాలు ముగిసిన తర్వాత శుక్రవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నా ఈ ప్రభుత్వానికి పట్టడం లేదని విమర్శించారు. రుణమాఫీకి ఇప్పటివరకు దమ్మిడి కూడా విదల్చలేదని చెప్పారు. అబద్దాలు, మోసాలతో చంద్రబాబు పరిపాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తి చేయకపోవడంతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 2 లక్షల ఎకరాలకు నీరు అందేదని చెప్పారు. రుణమాఫీ కోసం అక్టోబర్ 16న చేపట్టనున్న మండల కార్యాలయాల ముట్టడి ఆందోళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. -
రుణమాఫీ పట్టించుకోవడం లేదు
-
రుణమాఫీపై మంత్రివర్గ ఉపసంఘం
హైదరాబాద్: వ్యవసాయ రుణమాఫీపై విధివిధానాలను ఖరారు చేసేందుకు ఏడుగురు మంత్రులతో తెలంగాణ ప్రభుత్వం ఉప సంఘాన్ని నియమించింది. వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ కమిటీలో మంత్రులు ఈటెల రాజేందర్, హరీష్‌రావు, కేటీఆర్, జగదీశ్వర్‌రెడ్డి, జోగు రామన్న, మహేందర్‌రెడ్డి సభ్యులుగా ఉంటారు. ఈనెల 20కల్లా రుణమాఫీ విధివిధానాలపై మంత్రివర్గ ఉప సంఘం నివేదిక ఇవ్వనుంది. పంటల రుణమాఫీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం కేసీఆర్ మంగళవారం పునరుద్ఘాటించారు. రుణమాఫీకి బ్యాంకర్లు సహకరించకుంటే రైతలుకు నేరుగా బాండ్లు ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
రుణమాఫీకి సవాలక్ష మెలికలు
రైతుల రుణ మాఫీ అమలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సవాలక్ష మెలికలు పెడుతూ సరికొత్త ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వెల్ఫేర్ కార్పొరేషన్ ఒకదాన్ని ఏర్పాటుచేసి, దానిద్వారా ఈ పథకాన్ని అమలుచేయాలని నిర్ణయించింది. వివిధ శాఖలనుంచి వచ్చే సెస్సును ఈ కార్పొరేషన్‌కు బదిలీచేయాలని సోమవారం నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. ఈ నెలాఖరు నాటికి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారు. కార్పొరేషన్ నిధులు, ఆస్తులు తనఖాపెట్టి బ్యాంకులకు సెక్యూరిటీలు ఇవ్వాలని నిర్ణయించారు. పెన్షనర్ల ఎంపికకు జిల్లాస్థాయి కమిటీలను ఏర్పాటుచేస్తారు. ఇన్‌ఛార్జి మంత్రి నేతృత్వంలో ఈ కమిటీలు ఉంటాయి. అందులో మంత్రితోపాటు జిల్లా కలెక్టర్, డీఆర్డీఏ పీడీలను చేర్చాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. అనర్హుల తొలగింపు, లబ్ధిదారుల ఎంపిక లాంటి వ్యవహారాలన్నీ ఈ కమిటీయే చూసుకుంటుంది. ఇక కౌన్సెలింగ్ ద్వారా టీచర్ల బదిలీలు చేపట్టాలని నిర్ణయించారు. -
'వందరోజుల పాలనలో ఒరిగిందేమీ లేదు'
అనంతపురం: సీఎం చంద్రబాబుపై కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మండిపడ్డారు. చంద్రబాబు రైతు వ్యతిరేకి అంటూ ధ్వజమెత్తారు. వ్యవసాయ రుణాల మాఫీ పేరుతో అధికారం చేపట్టి రైతుల్నే మోసం చేశారని విమర్శించారు. బంగారం వేలం పాటలను అడ్డుకుంటామని అన్నారు. వందరోజుల చంద్రబాబు పాలనలో ప్రజలకు ఒరిగిందేమి లేదని చెప్పారు. ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన రైతు రుణ మాఫీని అమలు చేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారని ఆరోపించారు. -
కేసీఆర్ సర్కారును బతుకమ్మ క్షమిస్తుందా?
హైదరాబాద్: వందరోజుల్లో సీఎం కేసీఆర్ వెయ్యి అబద్ధాలు ఆడారని కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి ఆరోపించారు. రైతు రుణమాఫీపై ఇప్పటికీ స్పష్టతలేదని విమర్శించారు. 178 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. రైతులను ఆదుకోని ఈ ప్రభుత్వాన్ని బతుకమ్మ తల్లి క్షమిస్తుందా అని ప్రశ్నించారు. జలవిహార్‌లో జరిగిన హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఎంఐఎంతో సంబంధం లేకుండా గ్రేటర్ హైదరాబాద్‌లో కాంగ్రెస్ సొంతంగానే ఎదగాలని ఆమె ఆకాంక్షించారు. హైదరాబాద్‌లో కల్లు దుకాణాల ఏర్పాటుకు వ్యతిరేకంగా హైదరాబాద్ కాంగ్రెస్ కార్యకర్తలు పోరాడాలని రేణుకా చౌదరి పిలుపునిచ్చారు. -
'100 రోజుల్లోనే అన్ని చేయడం కుదరదు'
న్యూఢిల్లీ: రెండు తెలుగు రాష్ట్రాల్లో విమానాయాన అభివృద్ధి చాలా ముఖ్యమని పౌర విమానయాన శాఖ పూసపాటి అశోక్‌గజపతిరాజు అన్నారు. 100 రోజుల పాలనలోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్ని చేయడం సాధ్యంకాదని చెప్పారు. రైతు, డ్వాక్రా రుణాల మాఫీ దిశగా ఆయన అడుగులేస్తున్నారని తెలిపారు. రుణమాఫీపై టీడీపీ ప్రభుత్వం అసలేమి చేయలేదనడం సబబు కాదని అన్నారు. అంతకుముందు అశోక్‌గజపతిరాజుతో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సమావేశమయ్యారు. -
సిఎం సారూ వింటున్నారా..!
-
మాఫీకి రూట్‌మ్యాప్ ఏదీ?
-
హెడ్ లైన్ షో చర్చ
-
తిలోదకాలిచ్చిందని టీడీపీయే: రఘువీరా
విజయవాడ: ఎవరైనా మరణిస్తే వచ్చే ఉప ఎన్నికల్లో ఇతర పార్టీల అభ్యర్థులను పోటీకి నిలబెట్టని సంప్రదాయానికి తిలోదకాలిచ్చిందని టీడీపీయేనని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి అన్నారు. నందిగామ ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిని పోటీకి నిలపడాన్ని ఆయన సమర్థించుకున్నారు. రాష్ట్రంలో ఎన్నికలకు ముందు టీడీపీ, బీజేపీ మేనిఫెస్టోలో పొందుపర్చిన హామీలు అమలుచేయడం లేదని ఆయన ఆరోపించారు. రుణమాఫీ, ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక అమలు చేయడం లేదన్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ లోనూ నిధులు కేటాయించలేదని గుర్తు చేశారు. -
సొంత సామాజిక వర్గానికి లాభం చేకూరేలా..
-
సొంత సామాజిక వర్గానికి లాభం చేకూరేలా..
కాకినాడ: పంటల రుణమాఫీ విషయంలో టీడీపీ ప్రభుత్వం రోజుకో మాట మాట్లాడుతూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తోందని పీపీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాణ విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాలికొదిలేస్తోందని ఆరోపించారు. కాకినాడలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో చిరంజీవి, రఘువీరారెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రాజధాని విషయంలో సొంత సామాజిక వర్గానికి, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లాభం చేకూరేలా టీడీపీ సర్కారు వ్యవహరిస్తోందని అన్నారు. ఈ సమావేశంలో మాజీ కేంద్రమంత్రులు పళ్లంరాజు, జేడీ శీలం కూడా పాల్గొన్నారు. -
రూ.30వేల వరకు వెంటనే మాఫీ
-
రూ.30వేల వరకు వెంటనే మాఫీ
సాక్షి, హైదరాబాద్: రైతుల రుణ మాఫీపై తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోంది. ఈ విషయంలో ఆర్బీఐ నుంచి అరకొర సాయమే అందుతున్న నేపథ్యంలో సర్దుబాట్లు చేసుకుంటూ రుణమాఫీని అమలు చేసేందుకు ప్రయత్నిస్తోంది. అర్హులకే రుణ మాఫీ జరిగేలా చూసేందుకు ఒకవైపు సామాజిక తనిఖీలు చేపడుతూనే.. చిన్న మొత్తం రుణాలను వెంటనే పూర్తిగా చెల్లించాలని, పెద్ద రుణాల విషయంలో హామీ పత్రాలివ్వాలని సర్కారు భావిస్తోంది. రుణమాఫీ చేసే మొత్తాన్ని నేరుగా రైతుల ఖాతాలో జమ చేయాలని కూడా యోచిస్తోంది. ఒకవేళ రైతులకు చెక్కులిస్తే వాటిని వినియోగించుకుని బ్యాంకులకు చెల్లించకుండా ఉండే అవకాశముందని, అలాగైతే వారికి కొత్త రుణాలు మంజూరు కావని ఆర్థిక శాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అందుకే మాఫీ మొత్తాన్ని రైతుల ఖాతాలో జమచేస్తే ఆ నిధులను బ్యాంకు లు తీసుకుని కొత్త రుణాలిస్తాయిని పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు సరాసరి రూ. 58 వేలలోపు ఉన్నట్లు ప్రభుత్వం అంచనాకు వచ్చింది. దీంతో రూ. 10 వేల నుంచి రూ. 30 వేల వరకు ఉన్న రుణాలను వెంటనే మాఫీ చేయడం వల్ల వాటిని తీసుకున్న చిన్న, సన్నకారు రైతులకు తక్షణ ప్రయోజనం కలుగుతుందని విశ్లేషించుకుంది. వారికి కొత్త రుణాలు అందడం వల్ల ఈ ఏడాది పెట్టుబడికి ఇబ్బంది ఉండదని భావిస్తోంది. ఇక ఎక్కువ మొత్తం రుణాలున్న రైతులు ఆ రుణా న్ని బ్యాంకులకు చెల్లించి ఎన్వోసీ తీసుకుని వస్తే.. వారికి తిరిగి వడ్డీతో సహా చెల్లించేలా హామీ పత్రాన్నివ్వాలన్న ఆలోచన చేస్తోంది. రుణమాఫీకి చెల్లించే డబ్బును బడ్జెట్లోనూ పెట్టనుంది. -
రుణమాఫీ కోసం జీవో జారీ చేశాం: యనమల
-
'తాత్కాలిక రాజధాని అంటూ నాటకాలు'
తిరుపతి: రైతులకిచ్చిన హామీల అమలులో టీడీపీ ప్రభుత్వం తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కె. నారాయణ డిమాండ్ చేశారు. పంటరుణాల మాఫీపై అనవసరమైన జాప్యం చేయొద్దని సూచించారు. ఆంధ్రప్రదేశ్ కు తాత్కాలిక రాజధాని అంటూ టీడీపీ ప్రభుత్వం నాటకాలాడుతోందని విమర్శించారు. రాజధాని కోసం కమిటీల పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. రుయా ఆస్పత్రిలో ఆందోళన చేస్తున్న మెడికోలకు నారాయణ మద్దతు ప్రకటించారు. రాజకీయంగా తమ తమ స్థానాలను బలోపేతం చేసుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు ప్రజలను రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నారని అంతకుముందు నారాయణ ధ్వజమెత్తారు. -
'స్వలాభాల కోసం అన్యాయం చేయొద్దు'
కడప: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి సి. రామచంద్రయ్య ఫైర్ అయ్యారు. రైతుల వ్యవసాయ రుణాలు మాఫీ చేసేందుకు రిజర్వు బ్యాంకు నిధులు ఎలా ఇస్తుందని ఆయన ప్రశ్నించారు. తొమ్మిదేళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు ఈ విషయం తెలియదా అంటూ ఎద్దేవా చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ మీ చేతుల్లో ఉండే ఆర్బీఐకి చెప్పి ఫండ్ రిలీజ్ చేయించాలని సూచించారు. ఏపీకి రాజధాని నిర్మించే హక్కు చంద్రబాబుకు లేదన్నారు. రాజకీయ స్వలాభాల కోసం ప్రజలకు అన్యాయం చేయొద్దని రామచంద్రయ్య కోరారు. -
హామీలు మాఫీ చేస్తున్న చంద్రబాబు
కళ్యాణదుర్గం: రైతు రుణాల మాఫీ ఫైలుపై తొలి సంతకం అని చెప్పి, పూటకో మాట చెబుతున్న చంద్రబాబు.. రుణమాఫీ మాటేమిటో గానీ ఇచ్చిన హామీలను మాఫీ చేస్తున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే రైతాంగం అయోమయంలో ఉందని, గత ఏడాది పంట నష్టానికి సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ, బీమా కలిపి రూ. 2,174 కోట్లు వెంటనే విడుదల చేయించాలని డిమాండ్ చేశారు. ఎకరాకు రూ. 4 వేల చొప్పున రూ. 1,374 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ, వాతావరణ బీమా రూ. 800 కోట్లు వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలన్నారు. ఎన్నికల ముందు టీడీపీ నాయకులు చేసిన డిమాండ్ మేరకు ఎకరాకు రూ. 10 వేల ప్రకారం ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేయించాలన్నారు. ప్రస్తుతం రైతులు కనీసం రుణాలు రెన్యూవల్ చేసుకోవడానికి ప్రభుత్వం వడ్డీ భరించలేదా అని నిలదీశారు. గతంలో 98 శాతం మహిళా రుణాల రికవరీ ఉండేదని, రుణమాఫీ హామీతో అప్పు చెల్లించలేక పోయారని తెలిపారు. బ్యాంకులు బంగారాన్ని వేలం వేసే పరిస్థితి వచ్చిందన్నారు. ఉద్యోగాలు తొలగించే విషయంలో శ్రద్ధ చూపిన పాలకులు.. పనులు కల్పించడంలో మాత్రం దృష్టి సారించలేకపోతున్నారని విమర్శించారు. -
ఏజెన్సీలో బాక్సైట్ తవ్వుతాం
-
120మండలాలకే రీ షెడ్యూల్
-
120మండలాలకే రీ షెడ్యూల్ వర్తింపు
* ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్బీఐ లేఖ సాక్షి, హైదరాబాద్: ఏపీలో వ్యవసాయ రుణాల రీ షెడ్యూల్‌కు రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) పరిమితంగానే అనుమతి ఇచ్చింది. 4 జిల్లాల పరిధిలోని 120 మండలాల రుణాల రీ షెడ్యూల్‌కే అంగీకరించింది. ఇందుకు సైతం కొన్ని పరిమితులు విధించింది. ఏపీలో రుణాల రీ షెడ్యూల్‌కు అనుమతిస్తున్నట్టు ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ దీపాలీ పంత్ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో తెలిపారు. రాష్ట్రంలో 653 మండలాలు ఉండగా కరువు, తుపాను వంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా 575 మండలాల్లో రుణాలను రీ షెడ్యూల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐని కోరిన విషయం తెలిసిందే. దాంతో గత ఖరీఫ్‌లో ఆహార ఉత్పత్తుల వివరాలను అందించాలని ఆర్బీఐ రాష్ట్రాన్ని కోరింది. రాష్ట్ర ప్రభుత్వం ఆ సమాచారం ఇవ్వకపోవడంతో ఆంధ్రప్రదేశ్ అర్థగణాంక విభాగం విడుదల చేసిన లెక్కలను పరిగణనలోకి తీసుకున్న ఆర్బీఐ వాటిని తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి జవాబిచ్చింది. ఆహార ఉత్పత్తులు 50 శాతంకన్నా తక్కువగా వచ్చిన పక్షంలోనే వ్యవసాయ రుణాల రీ షెడ్యూల్‌కు ఆర్బీఐ నిబంధనలు అనుమతిస్తాయంటూ, ఆ వివరాలతో కూడిన సమాచారాన్ని కూడా రాష్ట్రానికి పంపింది. తాజాగా రాష్ట్రంలో ఎక్కడైతే ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా పరిస్థితులు ఉన్నాయో.. ఆ ప్రాంతాల్లోని వ్యవసాయ రుణాల రీ షెడ్యూల్‌కు అనుమతిస్తూ లేఖ రాసింది. పరిమిత రీ షెడ్యూల్‌పై ఆర్బీఐ ఏమన్నదంటే... * బంగారంపై తీసుకున్న పంట రుణాలకు రీ షెడ్యూల్ వర్తించదు. * పంటలను కుదవ పెట్టి తీసుకున్న పంట రుణాలకు రీ షెడ్యూల్ వర్తించదు. * చెరకు, పొగాకు తదితర వాణిజ్య పంటల రుణాలకు, మూసేసిన పంట రుణాల ఖాతాలకు రీ షెడ్యూల్ వర్తించదు. * ప్రామాణిక ప్రాతిపదిక మేరకు రీ షెడ్యూల్‌ను 4 జిల్లాలకు మాత్రమే పరిమితం. * శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లోని వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో తీసుకున్న రుణాలకే రీ షెడ్యూల్ వర్తిస్తుంది. * కేవలం స్వల్పకాలిక పంట రుణాలకు మాత్రమే వర్తింపు. * రీ షెడ్యూల్ మూడేళ్లకే పరిమితం. తొలి ఏడాది మారిటోరియం ప్రకటనకు, తర్వాత రెండేళ్లలో రీ షెడ్యూల్‌కు అనుమతి. * మూడేళ్లలో రైతులు రుణాలు చెల్లించకపోతే బ్యాంకులు ఆ బకాయి మొత్తాలను వడ్డీతో సహా రైతుల నుంచి వసూలు చేస్తాయి. * గత ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు తీసుకున్న పంట రుణాలకే రీ షెడ్యూల్ వర్తిస్తుంది. ఈ ఏడాది మార్చి 31వ తేదీ వరకు వడ్డీతో కలిపి ఒక్కో రైతుకు లక్ష రూపాయల వరకు మాత్రమే పంట రుణం రీ షెడ్యూల్ వర్తిస్తుంది. వడ్డీతో కలిపి రుణం లక్ష రూపాయల కంటే ఎక్కువ ఉంటే ఆ మొత్తాన్ని ప్రభుత్వం నగదు రూపంలో రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమచేయాలి. * ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో వ్యవసాయ పనుల విషయంలో రైతులు ఇక్కట్లకు గురికాకూడదని, రుణాల విషయంలో ఇబ్బందులు ఎదుర్కోకుండా చూడాలనే సానుభూతితో రుణాల రీషెడ్యూల్కు నిర్ణయం తీసుకున్నాం. -
రీషెడ్యూల్ 3 జిల్లాలకే!
* రుణాలపై ప్రభుత్వానికి ఆర్బీఐ లేఖ * గత ఏడాది ఏప్రిల్-అక్టోబర్ మధ్య తీసుకున్న ఖరీఫ్ రుణాలకే వర్తింపు * అది కూడా వడ్డీతో కలిపి లక్ష వరకే.. బంగారం తాకట్టు రుణాలు, పాత బకాయిలకు వర్తించదు * తొలి ఏడాది మారటోరియం, తర్వాతి రెండేళ్లలో చెల్లింపునకు గడువు * సర్కారుకు మహా అయితే వెయ్యి కోట్ల వరకే వెసులుబాటు సాక్షి, హైదరాబాద్: రుణమాఫీపై ఇప్పటివరకు నాన్చుతూ వచ్చిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) తాజాగా తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వానికి ఝలక్ ఇచ్చింది. రైతుల రుణాలను రీషెడ్యూల్ చేయించుకుని వీలైనంత వెసులుబాటు పొందాలని భావించిన సర్కారుకు నిరాశే ఎదురైంది. కేవలం మూడు జిల్లాల్లోని మండలాలకే రీషెడ్యూల్‌ను వర్తింపజేస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. పైగా అసలు, వడ్డీ కలిపి లక్ష వరకు రుణాలకే దీన్ని పరిమితం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి శుక్రవారం రిజర్వ్ బ్యాంక్ నుంచి లేఖ అందింది. తొమ్మిది జిల్లాల్లో గత ఏడాది కరువు, తుపాను బారిన పడిన 415 మండలాల్లో రైతు రుణాలను రీషెడ్యూల్ చేయాలని రాష్ర్ట ప్రభుత్వం ఆర్బీఐని కోరిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన రుణ మాఫీని సాఫీగా అమలు చేసేందుకు ఎక్కువ మొత్తం రుణాలను రీషెడ్యూల్ చేయించుకోవాలని అధికార యంత్రాంగం విశ్వ ప్రయత్నాలు చేసింది. దాదాపు నెలన్నర రోజులుగా ఈ అంశంపై ఆర్బీఐతో సంప్రదింపులు జరుపుతూనే ఉంది. మొదట 337 మండలాలు, తర్వాత మరో 78 ప్రభావిత మండలాల జాబితాను అధికారులు పంపించారు. అయితే రుణ మాఫీ వంటి పథకాలతో బ్యాంకులు దివాళా తీస్తాయని ముందు నుంచీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ఆర్బీఐ.. రీషెడ్యూల్‌పై గట్టిగానే కసరత్తు చేసింది. కరువు, తుపాను ప్రభావం ఆయా మండలాల్లో పంట ఉత్పత్తులపై ఏ మేరకు ఉందో అధ్యయనం చేసింది. గత ఏడాది సాగు పరిస్థితిని, పంటల దిగుబడుల వివరాలను సేకరించి చివరకు మూడు జిల్లాలకే రీషెడ్యూల్‌ను పరిమితం చేసింది. మెదక్, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని కరువు మండలాల రైతుల రుణాలను మాత్రమే రీషెడ్యూల్ చేయడానికి నిర్ణయించింది. అదికూడా 2013 ఏప్రిల్-అక్టోబర్ మధ్య తీసుకున్న ఖరీఫ్ పంట రుణాలకు మాత్రమే ఇది వర్తిస్తుందని... అలాగే అసలు, వడ్డీతో కలిపి లక్ష రూపాయల వరకే దీన్ని పరిమితం చేస్తున్నామని ఆర్బీఐ కార్యనిర్వాహక సంచాలకులు డాక్టర్ దీపాలీపంత్ జోషి తన లేఖలో స్పష్టం చేశారు. బంగారం తాకట్టు రుణాలు, వ్యవసాయ ఉత్పత్తులను ముందస్తుగా తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలు, పాత బకాయిలు, దీర్ఘకాలికంగా చెల్లించని(క్లోజ్డ్ లోన్స్) వాటిని రీషెడ్యూల్ చేసేది లేదని కూడా తేల్చి చెప్పారు. మూడు జిల్లాల్లోని వాణిజ్యబ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు, సహకారబ్యాంకులు ఇచ్చిన రుణాలు రీ షెడ్యూలవుతాయని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనల ఆధారంగా.. రిజర్వ్‌బ్యాంకు ప్రామాణిక నిబంధనలను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రీషెడ్యూల్ అయిన రుణాలపై తొలి ఏడాది మారటోరియం విధిస్తామని, తర్వాతి రెండేళ్లలో వాయిదాల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మూడేళ్ల గడువు తర్వాత కూడా రుణం చెల్లించనిపక్షంలో బ్యాంకులు తమ రుణాన్ని రైతుల నుంచి వసూలు చేసుకునే హక్కు కలిగి ఉంటాయని వివరించారు. ఒకవేళ ఈ మొత్తాన్ని రైతులు కాకుండా ప్రభుత్వమే చెల్లించాలనుకుంటే.. రైతుల పేరిట పూర్తి నగదు రూపంలో బ్యాంకులకు ఇవ్వాల్సి ఉంటుందని దీపాలీపంత్ స్పష్టం చేశారు. ప్రస్తుత సీజన్లో రైతులకు వ్యవసాయ పనుల్లో ఇబ్బందులు తలెత్తకూడదన్న ఉద్దేశంతో రీషెడ్యూల్కు సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. రీషెడ్యూల్ అయిన జిల్లాల్లో రైతులకు కొత్త రుణాలు అందుబాటులోకి వస్తాయని లేఖలో పేర్కొన్నారు. రీషెడ్యూల్ అయ్యేది అంతంతే! ఆర్బీఐ తాజా నిర్ణయంతో రీషెడ్యూలయ్యే పంట రుణాలు రూ. వెయ్యి కోట్ల కు మించవని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. కనీసం 337 మండలాల్లో రుణాలు రీ షెడ్యూల్ అవుతాయని ఇప్పటివరకు అధికారులు విశ్వాసంతో ఉన్నారు. కానీ ఆర్బీఐ తాజా లేఖతో హతాశులయ్యారు. నిజానికి ప్రతిపాదిత కరువు మండలాలన్నింటికీ కలిపి కనీసం ఐదారు వేల కోట్ల మేరకు రుణాలు రీషెడ్యూల్ అవుతాయని భావించారు. కానీ ఆర్బీఐ పలు ఆంక్షలు విధిస్తూ.. 50 శాతం కంటే తక్కువ దిగుబడి వచ్చిన మండలాలనే పరిగణనలోకి తీసుకుంటామని నిబంధనలను తెరపైకి తేవడంతో పరిస్థితి తలకిందులైంది. లక్ష వరకు పంట రుణాలు మాఫీ చేస్తామన్న సీఎం కేసీఆర్ హామీ మేరకు ఖజానాపై దాదాపు రూ. 17,337 కోట్ల భారం పడుతుందని అంచనా. ఇప్పుడు వెయ్యి కోట్ల రుణాలకే రీషెడ్యూల్ అమలు కానున్న నేపథ్యంలో మిగిలిన రూ. 16 వేల కోట్లను ఎక్కడి నుంచి తీసుకురావాలన్నది ప్రభుత్వం ముందు న్న సవాలు. 3 జిల్లాల్లోనే రీ షెడ్యూల్ చేసి మిగి లిన జిల్లాల్లోని రైతులకు కొత్త రుణాలు రాకపోతే.. ఎదురయ్యే పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలనే దానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇంతకాలం ఆర్బీఐ రీషెడ్యూల్ కోసం నిరీక్షిస్తున్న కారణంగా రుణమాఫీ అమలు ప్రక్రియ ముందుకు సాగలేదు. మరోవైపు త్వరలోనే దీన్ని అమలు చేస్తామని గురువారం నిజామాబాద్ జిల్లా పర్యటనలో కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇక రుణ మాఫీపై మార్గదర్శకాలను విడుదల చేసి.. తక్షణ చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. -
ఆర్బీఐ అవాంతరాలు సృష్టిస్తోంది: పరకాల
హైదరాబాద్: సమైక్య ఉద్యమంలో కేసులన్నీ ఎత్తేస్తున్నామని ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ తెలిపారు. 952 కేసుల్లో 106 కేసులు ఇప్పటికే ఎత్తేశామని, 4482 మందికి ఊరట లభించిందని వెల్లడించారు. మిగిలినవి త్వరలో ఎత్తేస్తామని చెప్పారు. రుణాల రీషెడ్యూల్కు ఆర్బీఐ అవాంతరాలు సృష్టిస్తోందని వాపోయారు. ఆర్బీఐ సహకరించకపోయినా రుణమాఫీ చేస్తామని చెప్పారు. రుణాలు రీషెడ్యూల్ జరగకపోవడానికి గత ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ఆర్బీఐకి కరువు, వరదలపై లేఖ రాయకుండా విస్మరించిందన్నారు. కొత్త రుణాలపై స్పష్టత ఇవ్వలేమని, నిధులు సమీకరణకు కొంత సమయం పడుతుందని పరకాల తెలిపారు. -
'యూజ్ లెస్ ఫెలో' అంటూ రైతుపై చంద్రబాబు ఆగ్రహం!
రుణమాఫీ గురించి నిలదీసిన రైతుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణ మాఫీ ఎప్పుడంటూ ఓ రైతు ప్రశ్నించడంతో సహనం కోల్పోయిన చంద్రబాబు 'ఏయ్ యూజ్ లెస్ ఫెలో..ముందు విను అంటూ కసురుకున్నారు. ముందు విను. ఒక్కరు అరిస్తే సమస్య పరిష్కారం కాదు. పదిమంది మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుంది అంటూ హెచ్చరించే ధోరణిలో చంద్రబాబు స్పందించడంతో రైతులు అవాక్కయ్యారు. చంద్రబాబు పరిస్థితి ఇలా ఉంటే.. ఆయన కుమారుడు లోకేశ్ బాబు వ్యవహారం మరోలా ఉంది. రైతు రుణమాఫీ గురించి అడిగిన ప్రశ్నకు మీడియాపై రుసరుసలాడారు. అంతేకాక ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంబంధించిన వ్యవహారం.. రైతు రుణమాఫీ గురించి తనకు సంబంధం లేదని లోకేశ్ తప్పించుకోవడానికి చూశారు. రుణమాఫీ ఎప్పడవుతుందా అనే ఆశతో ఎదురు చూస్తున్న రైతులకు చంద్రబాబు తాజా హెచ్చరికలు అయోమయానికి గురిచేస్తున్నాయి. -
మాట తప్పం!
* త్వరలోనే రుణ మాఫీ అమలు చేస్తామన్న సీఎం కేసీఆర్ * 39 లక్షల మంది రైతులకు19 వేల కోట్ల రూపాయల లబ్ధి * దళిత కుటుంబాలకు ఆగస్టు 15న భూ పంపిణీ * ఫైలుపై సంతకం కూడా చేశా * తాగునీటి గ్రిడ్ కోసం ఏర్పాట్లు * నాలుగేళ్ల తర్వాత రాష్ర్టంలో నల్లాలేని ఇల్లుండదు * మూడున్నర లక్షలైనా డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మిస్తాం * 19న సెలవు, ఆ రోజున సర్వేలో లేకుంటే జనాభా లెక్కల్లో లేనట్లే * నిజామాబాద్ జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి వెల్లడి * అంకాపూర్ గ్రామానికి వరాలు, ఆసియా ఖండానికే ఆదర్శం కావాలని పిలుపు సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే రైతులకు రుణ మాఫీ అమలు చేస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. దీనిపై ఇప్పటికే ఆర్బీఐకి తీర్మానం చేసి పంపించామని, 39 లక్షల మందికి రూ. 19 వేల కోట్ల మేర రుణాలు మాఫీ అవుతాయని పేర్కొన్నారు. త్వరలోనే బ్యాంకుల్లో డబ్బులు జమవుతాయని అన్నదాతలకు కే సీఆర్ భరోసా ఇచ్చారు. సీఎంగా అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత గురువారం ఆయన తొలిసారిగా నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా రుణ మాఫీతో పాటు దళితులకు భూ పంపిణీ, పేదలకు ఇళ్ల నిర్మాణంపై స్పష్టతనిచ్చారు. ఆర్మూరులో రూ. 114.11 కోట్లతో నిర్మించ తలపెట్టిన రక్షిత మంచినీటి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్మూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారు. ‘‘ఎన్నికల్లో ప్రకటించిన విధంగా పేద దళితులకు భూ పంపిణీ పథకాన్ని ఆగస్టు 15న ప్రారంభించేందుకు అంతా సిద్ధం చేశాం. మొదటి విడతలో అవకాశమున్న ప్రతిచోటా అర్హులైన దళితులకు పట్టాలు అందజేస్తాం. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను గురువారం ఉదయమే జిల్లా కలెక్టర్లకు అందించాం. భూ పంపిణీ ఫైలుపై కూడా సంతకం చేశాను’’ అని సీఎం వెల్లడించారు. భూమి లేని దళితులకు మూడెకరాలు, రెండు ఎకరాలు ఉన్నవారికి ఒక ఎకరం, ఎకరం భూమి ఉన్న వారికి రెండెకరాలు అందజేస్తామని వివరించారు. భూమితో పాటు విద్యుత్ సరఫరా, మోటార్, ఒక ఏడాది పంట పెట్టుబడిని కూడా ప్రభుత్వమే అందిస్తుందని కూడా చెప్పారు. ఈ సందర్భంగా తమ ప్రభుత్వం చేపడుతున్న పలు ప్రభుత్వ పథకాలను గుర్తు చేస్తూ.. పలు వర్గాలకు సంక్షేమ వరాలు కురిపిస్తూ కేసీఆర్ ప్రసంగం సాగింది. నాలుగేళ్లలో ఇంటింటికీ నల్లా రాష్ట్రంలో నాలుగేళ్ల తర్వాత నల్లా లేని ఇల్లే ఉండదు. శాశ్వతంగా నీటి కొరతను తీర్చేందుకు ‘తెలంగాణ డ్రింకింగ్ వాటర్ గ్రిడ్’కు రూపకల్పన చేశాం. కరీంనగర్ పర్యటన సందర్భంగా ప్రకటించిన ఈ పథకాన్ని అమలు చేసేందుకు రెండు రోజుల్లోనే అంతా సిద్ధం చేశాం. ఇప్పటికే ఆయా జిల్లాల్లో ఉన్న రక్షిత మంచినీటి పథకాలను ఈ గ్రిడ్‌కే అనుసంధానం చేసి రాష్ట్ర ప్రజలందరికీ పెపులైన్ల ద్వారా తాగునీటిని అందిస్తాం. ఇంటిం టికీ నల్లా కనెక్షన్ ఇస్తాం. ఆదివాసీ, దళిత, గిరిజన యువతుల వివాహాలకు ‘కల్యాణలక్ష్మి’ పథకం కింద రూ. 50 వేల సాయం అందిస్తాం. 19న సర్వేకు సహకరించండి గత ప్రభుత్వాల హయాంలో ఎన్నో అక్రమాలు, అవినీతులు జరిగాయి. ఆ ప్రభుత్వాలను ఇప్పుడు విమర్శించదలచుకోలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ప్రస్తుత తరుణంలో సమగ్ర సర్వే అవసరమైంది. ఈ నెల 19న దీన్ని చేపట్టనున్నాం. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. ఆ రోజు బస్సులు, ప్రైవేట్ వాహనాలు కూడా నడవవు. ఆ రోజు సెలవు దినం. ప్రతి ఒక్కరు ఇళ్లలోనే ఉండాలి. ఎలాంటి కార్యక్రమాలు ఉన్నా రద్దు చేసుకోవాలి. పెళ్లిళ్లు ఉన్నా రద్దు చేసుకోవాలని కోరుతున్నా. ఈ సమగ్ర సర్వే ఎంతో ముఖ్యమైనది. ఆ లెక్కల్లోకి ఎక్కకపోతే జనాభా లెక్కల్లో కూడా లేనట్లే. అధికారులకు ప్రతి ఒక్కరు సహకరించాలి. స్కూల్ పిల్లలను రోడ్డెక్కించకండి మంత్రులు, ముఖ్యమంత్రుల సభల కోసం విద్యార్థులను రోడ్లెక్కిస్తే ఇకపై చర్యలు తీసుకుంటాం. ఆర్మూరు పర్యటనలో పిల్లలను సభకు తరలించడం చాలా బాధకు గురి చేసింది. స్కూల్ పిల్లలను ఎండలో నిలబెట్టడం అధికారులు, ప్రజాప్రతినిధులకు మంచిది కాదు. సభలు, కార్యక్రమాలకు వారిని రోడ్ల మీదకు తీసుకురావద్దు. రాష్ట్రవ్యాప్తంగా ఇది వర్తిస్తుంది. ఇలాంటి చర్యలను నిషేధిస్తాను. దసరా, దీపావళిలోగా కొత్త పింఛన్లు అన్ని రకాల పెన్షనర్లకు దసరా, దీపావళి మధ్య రూ. వెయ్యి పింఛన్ అందిస్తాం. వికలాంగులకు రూ.1500 ఇస్తాం. సర్వే ముగియగానే బీడీ కార్మికులకు రూ.1000 భృతిని చెల్లిస్తాం. గృహ నిర్మాణంలో ఇదివరకే చాలా అవినీతి జరిగింది. పైరవీకారులే లాభపడ్డారు. దీనిపై సీబీసీఐడీ ద్వారా విచారణ చేపడుతున్నాం. ఇది పూర్తికాగానే బడుగు, బలహీన వర్గాలకు రెండు పడక గదులతో కూడిన ఇళ్లను నిర్మిస్తాం. ఈ మోడల్ ఇల్లు వ్యయం రూ. 3 లక్షల నుంచి మూడున్నర లక్షలకు పెరిగింది. అయినప్పటికీ నిర్మించి తీరుతాం. ఆర్మూర్‌లోనే తొలి మోడల్ కాలనీని ఏర్పాటు చేస్తాం. వారం రోజుల్లో ఆర్మూరులోని ఎర్రజొన్న రైతుల ఇళ్ల వద్దకే అధికారులు వెళ్లి వారికి రావాల్సిన 11 కోట్ల రూపాయల బకాయిలను అందజేయాలని ఆదేశిస్తున్నా. -
రుణాలపై దిక్కుతోచని స్థితిలో రైతాంగం...
-
ఇది వంచన కాదా?
* రుణ మాఫీపై పూటకో మాట చెప్తూ ప్రభుత్వం అదను దాటించేసిందని రైతాంగం ఆవేదన * మరో రెండు మూడు మాసాల్లో రుణ మాఫీ చేస్తామంటున్నారు.. ఇప్పుడు అప్పులు పుట్టడం లేదు..ఈలోగా సీజన్ దాటిపోతుంది * మీరే రుణాలు చెల్లించుకోండి అని రైతులకు వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి సలహా ఇస్తున్నారు * మాకు స్తోమత లేదనేగా మీరు రుణ మాఫీ వాగ్దానం చేసింది.. ఆ వాగ్దానాన్ని నమ్మే కదా మేం ఓట్లేసింది.. ఇప్పుడిలా మాటమార్చడమేమిటని ప్రశ్నిస్తున్న రైతులు * ఈ ప్రభుత్వాన్ని నమ్ముకున్నందుకు వడ్డీ భారం మీద పడింది * ఆ వడ్డీ ఎవరు కడతారో కూడా స్పష్టత లేదంటూ రైతన్నల ఆవేదన సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రైతులకు ఖరీఫ్ సీజన్ కష్టాలు తప్పలేదు. అప్పుల బాధ తీరుతుందని గంపెడాశతో ఎదురుచూసిన రైతులకు ఈ సీజన్లో అసలు అప్పులే లేని పరిస్థితుల్లోకి నె ట్టేశారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు రైతులకు రుణాలు లభించే అవకాశాలు పూర్తిగా సన్నగిల్లాయి. రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని, వాటి కష్టాలను ప్రత్యక్షంగా చూశానని.. తాను అధికారంలోకి వస్తే వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కమిటీలు, రీషెడ్యూలు అంటూ కాలయాపన చేయడంతో రైతులకు అసలు రుణాలే దక్కని పరిస్థితి ఏర్పడింది. పాత అప్పులు చెల్లించి కొత్త రుణాలు తీసుకోవాలని స్వయంగా వ్యవసాయశాఖ మంత్రి చెప్పడంతో రైతులు దిగ్భ్రాంతికి లోనవుతున్నారు. ‘రుణాలు చెల్లించలేని స్థితిలో ఉన్నామనే కదా చంద్రబాబు రుణమాఫీ హామీ ఇచ్చింది... ఆయన మాటలు నమ్మే కదా మేము ఓటేసింది. తీరా.. ఏరు దాటాక ఇదేం పద్ధత’ంటూ రైతన్నలు వాపోతున్నారు. మరోవైపు బ్యాంకులు సైతం పాతవి కట్టనిదే కొత్త రుణాలు ఇవ్వబోమని తేల్చిచెప్తున్నాయి. ఆలస్యంగానైనా వర్షాలు కురుస్తుంటే సాగు కోసం అవసరమైన పెట్టుబడికి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జూలైలో మొదలయ్యే ఖరీఫ్ కొంత ఆలస్యమైనప్పటికీ చివరగా ఈ నెల 15 లోపు పంటలు వేయకపోతే ఇక ఈ సీజన్‌పై రైతులు ఆశలు వ దులుకోవలసిందేనని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనాల కారణంగా వర్షాలు కురిసినప్పటికీ రుణాలు లేక పంట వేయలేని నిస్సహాయ స్థితిలో రైతులున్నారు. బ్యాంకులకు సమాధానం ఎవరు చెప్పాలి? రుణ మాఫీ భారాన్ని తగ్గించుకోవాలని చూస్తున్న ప్రభుత్వం వాటిపై ఇప్పట్లో ఎటూ తేల్చే పరిస్థితి కనిపించడం లేదు. రుణాల రీషెడ్యూలు విషయంలో కూడా రిజర్వు బ్యాంకు అడిగిన వివరాలు అందించడంలో మీనమేషాలు లెక్కిస్తున్న కారణంగా రీషెడ్యూలు కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఈ సీజన్లో రుణాల రీషెడ్యూలు అయ్యే అవకాశాలే లేవని బ్యాంకర్లు ఇప్పటికే ప్రకటించారు. పైగా ప్రభుత్వం ఏదో ఒకటి తేల్చకుండా కొత్త రుణాలు ఇవ్వలేమని కూడా బ్యాంకర్లు చాలా స్పష్టంగా చెప్పారు. మొత్తంమీద ఈ దోబూచులాట మధ్య రైతులకు కొత్త రుణాలు లేకపోగా వారి నెత్తిన అదనంగా 13 శాతం వడ్డీ భారం పడింది. అంటే లక్ష రూపాయలు అప్పు తీసుకున్న రైతుకు గడచిన ఏడాదికే 13,000 రూపాయల వడ్డీ పడింది. ఈ సంవత్సరానికి మళ్లీ అంతే వడ్డీ చెల్లించాలి. చంద్రబాబు మాటలు నమ్మి సకాలంలో అప్పు చెల్లించని పాపానికి వడ్డీ రూపంలో మా నడ్డి విరిగిందని రైతులు వాపోతున్నారు. రుణాలను మాఫీ చేస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు వాటిని చెల్లించాలని చెప్తుంటే.. అదనపు వడ్డీ కట్టాల్సిందేనంటున్న బ్యాంకులకు సమాధానం ఎవరు చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. రుణాలపై దిక్కుతోచని స్థితిలో రైతాంగం... ఇదిలావుంటే.. కృష్ణా వాటర్ బోర్డు సమావేశంలో నిర్ణయించిన మేరకు డెల్టా నారుమళ్లకు నీటిని విడుదల చేయాలని నిర్ణయించి ఆ మేరకు నీటి విడుదల ప్రక్రియ ప్రారంభం కాగా 13 లక్షల ఎకరాల్లో సాగుకు పరిస్థితి సానుకూలమైంది. ఈ పరిస్థితుల్లో రైతాంగానికి పెట్టుబడి చాలా కీలకంగా మారింది. ఈ అదను తప్పిన తరువాత రుణాలిస్తామన్నా ప్రయోజనం ఉండదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని 87,617 కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలు, 14,208 కోట్ల డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రెండు నెలలు కావస్తున్నా ఆ హామీలపై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. పైగా ఇప్పుడు సీజన్ దాటిపోయే పరిస్థితుల్లో చివరి అంకంలో కూడా రుణాలు ఇచ్చే పరిస్థితి కూడా కల్పించకపోవడంతో రైతాంగం దిక్కుతోచని స్థితిలో ఉంది. ఆర్బీఐ పైకి నెపం నెడుతూ సర్కారు కాలక్షేపం... పైగా రుణాల రీషెడ్యూలు కూడా కనీసంగా మరో రెండు నెలలు పడుతుందని ప్రభుత్వం తాజాగా చెప్పడంతో ఇక ఈ సీజన్లో రైతులకు బ్యాంకుల నుంచి అప్పులు పుట్టవని తేలిపోయింది. వనరుల సమీకరణ కోసం ప్రభుత్వం నియమించిన కమిటీ మరో రెండు నెలల వరకు నివేదిక ఇచ్చే పరిస్థితులు లేవని అధికారవర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే నాబార్డు మాజీ చైర్మన్ కోటయ్య నేతృత్వంలో వేసిన కమిటీ కోసం నెలన్నర గడువు తీసుకున్న ప్రభుత్వం ఇప్పుడు వనరుల సమీకరణ కోసం వేసిన కమిటీ నివేదిక కోసం, మరోవైపు రీషెడ్యూలు కోసం ఆర్బీఐపై నెపం నెడుతూ కాలయాపన చేస్తుండటాన్ని బట్టి ఈసారి ఏపీ రైతులకు బ్యాంకుల నుంచి కొత్త అప్పులు ఉండవని పరోక్షంగా తేల్చిచెప్పినట్టేనని అధికారులు చెప్తున్నారు.