'దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయండి'
కాకినాడ: ఉనికి కోల్పోతామన్న భయంతోనే తమ పార్టీ ఎమ్మెల్యేలపై రౌడిషీట్లు తెరిచే సంస్కృతికి అధికార టీడీపీ దిగజారిందని వైఎస్సార్ సీపీ నాయకుడు జ్యోతుల నెహ్రు విమర్శించారు. ఉనికి చాటుకోవాల్సిన అవసరం తమ పార్టీకి లేదన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి బలమైన రాజకీయ నేతగా రాష్ట్ర ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించారని అన్నారు.
టీడీపీకి దమ్ముంటే సంపూర్ణ వ్యవసాయ, డ్వాక్రా రుణమాఫీ నిరుద్యోగ భృతి పథకాలను ఏవిధంగా అమలు చేస్తారనే దానిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.