లిఫ్టులను అడ్డుకోకపోతే..డెల్టా ఎడారే...
సాక్షి, కాకినాడ :పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమవుతుం దనే సాకుతో గోదావరికి ఇరువైపులా ఒక్కొక్కటి రూ.2 వేల కోట్లతో ప్రతిపాదించిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల ను అడ్డుకోకపోతే ‘గోదావరి జిల్లాలు’ ఏడారిగా మిగి లిపోతాయని శాసనసభ ఉపనేత, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే గోదావరిపై తెలంగాణలో 11 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం తుదిదశకు చేరుకున్నాయని, ఇవి పూర్తయితే ఏకంగా 71 క్యూసెక్కుల నీటిని కోల్పోనున్నామన్నారు. ప్రస్తుతం గోదావరిపై మరో రెండు లిఫ్ట్‌లు తలపెడితే సెప్టెంబర్ నుంచి చుక్క నీరు కూడా వచ్చే అవకాశం ఉండదని, తద్వారా రెండో పంటకు నీరుండదని హె చ్చరించారు. జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు అధ్యక్షతన ఆదివారం జరిగిన జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ఇరిగేషన్, వ్యవసాయం, ఆర్‌డబ్ల్యూఎస్, ఉపాధి హా మీ, గ్రామీణాభివృద్ధి శాఖలపై వాడీవేడిగా చర్చ సాగిం ది.
నెహ్రూ మాట్లాడుతూ గోదావరిపై లిఫ్ట్‌ల నిర్మాణాన్ని అడ్డుకునేందుకు తీర్మానం చేయాలని పట్టుబట్ట గా, ఈ నెల 28న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి, చర్చిద్దామని జెడ్పీ చైర్మన్ హామీ ఇచ్చారు. ఇంకా పుష్క ర ఎత్తిపోతల పథకం 60 శాతం పనులు కూడా పూర్తి కాలేదని నెహ్రూ అన్నారు. విద్యుత్ శాఖాధికారుల నిర్లక్ష్యం వల్ల ఏడు గంటలు కూడా సరఫరా ఇవ్వడం లేద న్నారు. ఇతర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల వల్ల రైతులకు పూర్తి స్థాయిలో ప్రయోజనం చేకూరడం లేదన్నారు. ఈ సీజన్‌లో కేవలం 195 మి.మీ. మాత్రమే నమోదైందన్నారు. కనీవినీ ఎరుగని కరువును ఎదుర్కోబోతున్నామన్నారు. ముందస్తు కార్యాచరణ లేకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఇరిగేషన్, వ్యవసాయ, విద్యుత్ శాఖలు సమన్వయంతో పనిచేస్తే రై తులకు మేలు జరుగుతుందన్నారు.
నూతన విత్తనాన్ని సరఫరా చేయడం, ఆరుతడి పంటలను ప్రోత్సహించ డం వంటి చర్యలు చేపట్టాలన్నారు. డెల్టా ఆధునికీకర ణ కోసం ఒక పంటకాలాన్ని త్యాగం చేయడంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. డీఆర్డీఏ పీడీ చంద్ర శేఖరరాజు మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 3.98 లక్షల మందికి సంబంధించి ఆధార్ లింకప్ పూర్తయిందన్నారు. ఇంకా 60 వేల మందిని అనుసంధానం చేయాల్సి ఉందన్నారు. నెహ్రూ స్పందిస్తూ.. పరిశీలన లో అనర్హులెందరిని గుర్తించారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయ నాయకుల్లా అధికారులు ఉపన్యాసాలివ్వడం సరికాదన్నారు. రేషన్‌కార్డులను అనుసంధానం చేయడం ద్వారా ఏటా రూ.100 కోట్లకుపైగా ఆదా కానుందని కలెక్టర్ నీతూ ప్రసాద్ చెప్పగా, ఆ సొ మ్ముతో మరిన్ని ప్రజోపయోగ కార్యక్రమాలు చేయాల ని సభ్యులు సూచించారు.
డ్వామా పీడీ పి.భవాని మా ట్లాడుతూ ఉపాధిహామీ పనులపై గ్రామ సమాచార బో ర్డులు ప్రదర్శించనున్నట్టు చెప్పారు. ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు మాట్లాడుతూ స్టేట్ ఫస్ట్‌లో ఉన్నామంటూ గొప్పలకు పోకుండా ప్రతీ ఇంటికీ మరుగుదొడ్డి నిర్మాణంపై దృష్టి పెట్టాలన్నారు. నాగరికతకు అద్దంపట్టే మ రుగుదొడ్ల నిర్మాణంపై నిర్లక్ష్యంతగదని ఎమ్మెల్యే గోరం ట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ గత వారం మనమే రాష్ర్టంలో మొదటి స్థానంలో ఉండేవారమని, ఇప్పుడు ప్రకాశం ఉందన్నారు. సర్పంచ్‌లు భాగస్వాములైతే జిల్లాలో లక్ష మరుగుదొడ్లు నిర్మించ డం కష్టం కాదన్నారు. ప్రతీ ఇంటికీ మరుగుదొడ్డి తప్పనిసరిగా నిర్మించేలా చర్యలు తీసుకోవాలని ఉప ము ఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అధికారులను ఆదేశించారు. జేడీఏ విజయ్‌కుమార్ మాట్లాడుతూ జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నమాట వాస్తవమేనన్నారు. 29 వేల హెక్టార్లలో ప్ర త్యామ్నాయ పంటలకు విత్తనాలు సిద్ధం చేశామన్నారు. రైతులకు రూ.4 వేల కోట్ల రుణాలు మాఫీ కానున్నాయ న్నారు.
ఈ జీఓ 174లో తక్షణమే సవరణ చేయాలని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి డిమాండ్ చేశారు. 13వ ఆర్థిక సంఘం నిధులు రాక మరమ్మతులు కూడా చేపట్టలేదని ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ నందారావు చెప్పగా, ఏజెన్సీలో పర్యటించి పైపులైన్లకు మరమ్మతులు చేపట్టాలని ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి కోరారు. తమ ప్రాంతాల్లో కార్యక్రమాలు చేపట్టడం లేదని ఖమ్మం నుంచి తూర్పు గోదావరిలో విలీనమైన చింతూరు, వీఆర్‌పురం, కూనవరం జెడ్పీటీసీలు సోయపు అరుణ, ముత్యాల కుసుమాంబ, ఎడవల్లి కన్యకాపరమేశ్వరి సభలో ఆవేదన వ్యక్తం చేశారు. ఫైనల్ నోటిఫికేషన్ రాగానే ఆయా ప్రాంతాల్లో పర్యటించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఎంపీ పండుల రవీంధ్రబాబు, ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, డీసీసీబీ చైర్మన్ వరుపుల రాజా, డీసీఎంఎస్ చైర్మన్ కేవీవీ సత్యనారాయణరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అల్లు బాబీ పాల్గొన్నారు.