Godavari Districts
-
టీచర్ ఎమ్మెల్సీగా పీడీఎఫ్ అభ్యర్థి గోపి మూర్తి విజయం
సాక్షి,కాకినాడ : ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీగా పీడీఎఫ్ అభ్యర్థి గోపి మూర్తి విజయం సాధించారు. గోపి మూర్తికి 8 వేలకు పైగా మొదటి ప్రాధాన్యత ఓట్లు పోలయ్యాయి. పోలైన ఓట్లను బట్టి 7745 తొలి ప్రాధాన్యత ఓట్లు సాధించిన అభ్యర్థిదే గెలుపు కాయం అవుతుంది. కాగా, ఈ ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లు 15,490.జేఎన్టీయూలో ఇవాళ ( (సోమవారం) ఉదయం 8 గంటలకు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. 14 టేబుళ్ళపై 9 రౌండ్లలో ఓట్లను లెక్కించగా.. మొదటి ప్రాధ్యానత ఓట్ల లెక్కింపులో పీడీఎఫ్ అభ్యర్థి గోపి మూర్తిని విజయం వరించింది. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన గెలుపుపై పీడీఎఫ్ అభ్యర్థి గోపి మూర్తి మాట్లాడుతూ.. ‘‘ఇది ప్రజాస్వామ్య విజయం. నా విజయం దివంగత మాజీ ఎమ్మెల్సీ షేక్ షాబ్జీకి అంకితం. నాకు ఓట్లు వేసిన టీచర్లకు కృతజ్ఞతలు.ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను. టీచర్లపై అదనపు భారం తగ్గించాలి. సీపీఎస్ రద్దుపై పోరాటం కొనసాగిస్తాను. పిపుల్స్ రిప్రజెంటీవ్ నుండి పొలిటికల్ రిప్రజెంటీవ్ అయ్యాను’’ అని సంతోషం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు డిసెంబర్ 5న జరిగాయి. ఈ ఎన్నికల్లో 15,490 మంది టీచర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉన్న షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఎన్నికల అధికారులు ఉప ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. ఈ ఎన్నికల్లో ఐదుగురు అభ్యర్థులు బరిలో నిలవగా ప్రధానంగా గంధం నారాయణరావు, బొర్రా గోపిమూర్తిలకు వివిధ ఉపాధ్యాయ సంఘాలు మద్దతు పలికాయి. ఇద్దరి పోరులో గోపిమూర్తి విజయం సాధించారు. -
‘గోదావరి’ జిల్లాల్లో ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతం
సాక్షి ప్రతినిధి, ఏలూరు/కాకినాడ సిటీ: ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా జరిగాయి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉన్న షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఉప ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. ఐదుగురు అభ్యర్థులు బరిలో నిలవగా ప్రధానంగా గంధం నారాయణరావు, బొర్రా గోపిమూర్తిలకు వివిధ ఉపాధ్యాయ సంఘాలు మద్దతు పలికాయి. దీంతో వారిద్దరి మధ్యనే పోరు కొనసాగింది.ఏలూరు జిల్లాలో 2,667 ఓట్లకు గాను 2,443 మంది ఓటు హక్కును వినియోగించుకోవడంతో 91.60 శాతంగా ఓటింగ్ నమోదైంది. పశ్చిమగోదావరి జిల్లాలో 3,729 మంది ఓటర్లకు గాను 3,478 మంది ఓటుహక్కును వినియోగించుకోవడంతో 93.27 శాతంగా నమోదైంది. కాకినాడ కలెక్టరేట్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఏఆర్వో వెంకటరావు ఆధ్వర్యంలో ఓటింగ్ సరళిని పర్యవేక్షించారు. బ్యాలెట్ బాక్సులను కాకినాడ జేఎన్టీయూలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సెంట్రల్ లైబ్రరీ వద్ద ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచారు. మొత్తం ఉమ్మడి తూర్పు–పశ్చిమ గోదావరి జిల్లాల్లో 116 పోలింగ్ కేంద్రాల్లో 16,737 మంది ఓటర్లకు 15,502 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 92.62% పోలింగ్ నమోదైందని కలెక్టర్ షణ్మోహన్ వెల్లడించారు. -
AP: టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పోలింగ్ ప్రారంభం
Teachers MLC Election Updates..పోలింగ్ ప్రారంభం.. ప్రారంభమైన ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరగనున్న పోలింగ్ఏలూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం ఓటర్లు 2667..మొత్తం పోలింగ్ కేంద్రాలు 20..పశ్చిమ గోదావరి జిల్లాలోని 20 మండలాల్లో 20 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుజిల్లాలో మొత్తం ఓటర్లు..3,729పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు.బ్యాలెట్ పద్ధతి ద్వారా జరుగుతున్న పోలింగ్👉గోదావరి జిల్లాల్లో రసవత్తర పోరుకు ఉపాధ్యాయులు సిద్ధమయ్యారు. శాసనమండలిలో ఖాళీ అవుతోన్న ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గురువారం జరగనుంది. ఇందుకు ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు.👉ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఎన్నికల్లో 16,737 మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకోనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం 116 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసినట్టు అధికారులు తెలిపారు. 👉ఇక, సిట్టింగ్ ఎమ్మెల్సీ షేక్‌సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో ఈ స్థానానికి ఎన్నిక జరుగుతోంది. మిగిలి ఉన్న రెండేళ్ల కాలానికి ఈ ఎన్నిక జరుగుతోంది. ఈ స్థానం కోసం ఐదుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. గంధం నారాయణరావు, పులుగు దీపిక, డాక్టర్ నాగేశ్వరరావు కవల, నామన వెంకటలక్ష్మి(విల్ల లక్ష్మి), బొర్రా గోపి మూర్తి బరిలో నిలిచారు. వీరంతా స్వతంత్రంగానే పోటీలో నిలిచారు. వీరిలో ప్రధాన పోటీ గంధం నారాయణరావు, బొర్రా గోపి మూర్తి మధ్యనే ఉండేలా కనిపిస్తోంది. గంధం నారాయణరావు రెండోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గతంలో ఒక పర్యాయం పోటీ చేశారు. ఇప్పుడు మరోసారి పోటీ పడుతున్నారు.👉ఈ శాసనమండలి ఎన్నికలకు నవంబర్ 11న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. 18వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించారు. గురువారం పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నెల 9న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇందుకోసం ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. -
కొత్త అల్లుడికి ‘శత’ పిండి వంటల భోజనం
కిర్లంపూడి: ఆషాఢ మాసం పూర్తయి శ్రావణ మాసం రానేవచ్చింది.. ఎక్కడ చూసినా కొత్త అల్లుళ్ల సందడే సందడి. అల్లుడికి మర్యాదలు చేయడంలో గోదారోళ్ల (గోదావరి జిల్లాలు) తర్వాతే ఎవరైనా అంటారు పెద్దలు. ఈ నానుడికి అద్దం పట్టేలా కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం తామరాడ గ్రామానికి చెందిన ఉద్దగిరి వెంకట రామారావు, రమణి దంపతులు కొత్త అల్లుడికి శనివారం ‘శత’ పిండి వంటల భోజనం స్వయంగా వడ్డించి తమ ప్రేమను చాటుకు న్నా రు. అత్తారింట్లో తమ కుమారుడికి లభించిన మర్యాదలను చూసి కాకినాడకు చెందిన బాదం సతీష్, కుమారి దంపతులు మురిసిపోయారు. -
కూటమికి 'గోదారి'లో ఎదురీతే!
అధికారమే లక్ష్యంగా జెండాలు జతకట్టిన టీడీపీ, జనసేన, బీజేపీ సీట్ల కేటాయింపుతో బొక్కబోర్లా పడ్డాయి. రాష్ట్రంలో ప్రధానంగా గోదావరి జిల్లాలపై గంపెడాశలు పెట్టుకున్న ఆ కూటమికి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. పొత్తులు, సీట్ల సిగపట్లతో బలహీనపడి అసలు ఉనికికే ముప్పు తెచ్చుకున్నాయి. ఈ జిల్లాల్లో కాపు, శెట్టిబలిజ సామాజిక వర్గాలే రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఈ సామాజిక వర్గాలు కూటమి వెంట ఉంటాయని లెక్కలేసుకుని జనసేన, టీడీపీలు తమదే గెలుపంటూ బీరాలు పలికాయి. అదే సమయంలో సీట్ల పంపకాల్లో ఆ పార్టీలు తమకు ప్రాధాన్యమిస్తాయని ఆయా సామాజిక వర్గాలు కూడా ఆశలు పెట్టుకున్నాయి. తీరా టికెట్ల కేటాయింపులో అటు టీడీపీ, ఇటు జనసేన పార్టీలు సరైన ప్రాధాన్యం కల్పించకపోవడంతో వాటి నుంచి కూటమికి ఎదురు దెబ్బ తప్పదన్న సంకేతాలు అందుతున్నాయి. – సాక్షి ప్రతినిధి, కాకినాడ శెట్టిబలిజలను విస్మరించిన జనసేన జనసేన బలం, బలహీనత గోదావరి జిల్లాలే అన్న ధీమా అన్నివర్గాల్లో ఉండేది. తీరా సీట్ల కేటాయింపులో ప్రధానమైన శెట్టిబలిజ సామాజికవర్గాన్ని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో జనసేన పూర్తిగా పక్కన పెట్టేసింది. ఉమ్మడి తూర్పులో ఒక్కటంటే ఒక్కటికూడా వారికి కేటాయించలేదు. ఈ జిల్లాలో జనసేన ఆరు అసెంబ్లీ, కాకినాడ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తుండగా పి.గన్నవరం, రాజోలు ఎస్సీ రిజర్వుడ్ స్థానాలు పోను నిడదవోలు, రాజానగరం, కాకినాడ రూరల్, పిఠాపురం టికెట్లను సొంత సామాజిక వర్గానికే పవన్‌కళ్యాణ్ ఇచ్చుకున్నారు. శెట్టిబలిజలను విస్మరించారు. పార్టీ ఆవిర్భావం నుంచీ ముమ్మిడివరంలో సొంత సొమ్ము తగలేసుకుని అహోరాత్రులు శ్రమిస్తున్న ఆ సామాజికవర్గానికి చెందిన పితాని బాలకృష్ణకు సీటు ఇస్తామని నమ్మించి మోసం చేశారు. బీసీల తోక కత్తిరిస్తానంటూ చిన్నచూపు చూసే చంద్రబాబుతో జతకట్టి శెట్టిబలిజలకు సీటు లేకుండా మోసం చేశారని ఆ సామాజికవర్గం పవన్‌పై నిప్పులు చెరుగుతోంది. ఈ అవమానాన్ని భరించలేకే బాలకృష్ణ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం జగన్‌పై నమ్మకంతో శనివారం ఆ పార్టీలో చేరారు. సీట్ల కేటాయింపులో వివక్షను తట్టుకోలేక కాకినాడ మాజీ మేయర్ సరోజ సైతం జనసేనను వీడారు. టీడీపీకి తప్పని తిప్పలు కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న చంద్రబాబు మూడు పార్టీల కూటమితో బాగా బలపడ్డామని సంబరపడ్డారు. కానీ ఆయన అంచనాలు తూర్పులో తలకిందులయ్యాయి. ఓటమి సంకేతాలు అందిస్తున్నాయి. పొత్తులో సీట్లు కోల్పోయిన నిడదవోలు, రాజోలు, పి.గన్నవరం, పిఠాపురం, రాజానగరం, అనపర్తి నియోజకవర్గాల్లో టీడీపీ నేతల మధ్య అంతర్గత పోరు, అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. వీటితో పాటు తుని, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, అమలాపురం, కొవ్వూరు, గోపాలపురం స్థానాల్లో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. పనిలో పనిగా పలువురు నేతలు టీడీపీకి దూరమవుతున్నారు. ఈ పరిణామాలను చక్కదిద్దలేక చంద్రబాబు తలపట్టుకుంటున్నారు. ఆ రెండు వర్గాలకు బీజేపీ మొండిచేయి ఈ జిల్లాలో సంఖ్యాపరంగా అత్యధికంగా ఉన్న కాపు, శెట్టిబలిజలను బీజేపీ పూర్తిగా విస్మరించిందని ఆ సామాజికవర్గాలు నిప్పులు చెరుగుతున్నాయి. పొత్తులో భాగంగా బీజేపీకి దక్కిన రాజమహేంద్రవరం లోక్‌సభ నియోజకవర్గం, అనపర్తి అసెంబ్లీ స్థానాలను సామాజికంగా బలం లేని వర్గాలకు కేటాయించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసిన సీనియర్ నాయకుడు, కాపు సామాజికవర్గానికి చెందిన సోము వీర్రాజు రాజమహేంద్రవరం పార్లమెంటరీ స్థానం గానీ రాజమహేంద్రవరం సిటీ, రూరల్ అసెంబ్లీ స్థానాల్లో ఒక్కటైనా ఇవ్వాలని కోరారు. కానీ ఆయనకు కాదని స్థానికేతరురాలైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరికి రాజమహేంద్రవరం లోక్‌సభ స్థానం కేటాయించారు. అనపర్తి అసెంబ్లీ స్థానాన్ని కూడా సామాజికంగా బలం లేని శివరామకృష్ణంరాజుకు కేటాయించడాన్ని వారు తప్పుపడుతున్నారు. దాంతో వారు కూటమికి దూరమవుతున్నారు. వైఎస్సార్సీపీలో బీసీలకే పెద్దపీట వైఎస్సార్సీపీ మొదటినుంచీ బీసీలపై ఆదరణ చూపిస్తోంది. ఉమ్మడి జిల్లాలో రాజమహేంద్రవరం లోక్‌సభ స్థానాన్ని శెట్టిబలిజ సామాజికవర్గం నుంచి డాక్టర్ గూడూరి శ్రీనివాస్‌కు, రాజమహేంద్రవరం రూరల్‌ను రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణకు, రామచంద్రపురాన్ని పిల్లి సూర్యప్రకాశ్‌కు కేటాయించింది. వీటితో పాటు బీసీల్లో గౌడ సామాజికవర్గం నుంచి ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ను రాజమహేంద్రవరం సిటీ నుంచి బరిలోకి దింపింది. జనసేనలో తమకు జరిగిన అవమానాన్ని భరించలేక ఈ జిల్లాల్లోని శెట్టిబలిజలతో పాటు చేనేత, మత్స్యకార వర్గాలు రాజకీయంగా బీసీలకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్న వైఎస్సార్ సీపీ వైపు మొగ్గు చూపుతున్నాయి. ఇక్కడ కాపు సామాజిక వర్గానికి కూడా వైఎస్సార్సీపీ సముచిత ప్రాధాన్యమే కల్పించింది. ఉమ్మడి జిల్లాలోని 21 అసెంబ్లీ స్థానాల్లో తొమ్మిదింటితో పాటు సంప్రదాయంగా ఇస్తున్న కాకినాడ లోక్‌సభ స్థానాన్ని కూడా ఆ వర్గానికే కేటాయించింది. దీంతో ఆ సామాజికవర్గం వైఎస్సార్సీపీకి మద్దతుగా నిలుస్తోంది. -
టీడీపీ, జనసేనకు వరుస షాక్‌లు!
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీ, జనసేనలకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఆయా పార్టీల అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలకు మనస్తాపం చెందిన నాయకులంతా వరుసగా గుడ్‌బై చెబుతున్నారు. ఆయా పార్టీల్లో ఎన్నాళ్లుగానో ఉంటూ కోట్లు ఖర్చుచేసి పార్టీ పటిష్టత కోసం పనిచేసినా టిక్కెట్ దక్కకపోవడం, అవమానాలకు గురికావడంతో కూటమిని వీడుతున్నారు. జనసేన, టీడీపీలో డబ్బులే ప్రామాణికంగా తీసుకుని టిక్కెట్లు కేటాయించడంపై వారంతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాడేపల్లిగూడెం టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఈలి వెంకట మధుసూదనరావు(నాని)కు తెలుగుదేశం పార్టీలో సరైన గుర్తింపు లేకపోవడం, పైగా ఆయన్ను అవమానించేలా వ్యవహరించడంతో ఆయన ఆ పార్టీని వీడారు. నియోజకవర్గంలో బలమైన నేతగా ఎదిగిన మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య టికెట్ విషయంలో తనకు అన్యాయం చేయడంతో ఆయన కూడా టీడీపీనుంచి బయటకు వచ్చారు. అవసరానికి తనను వాడుకుని కోట్లాదిరూపాయల ఆస్తులు పార్టీకోసం వెచ్చించిన తనకు చివరి నిమిషంలో ఎంపీ టికెట్ నిరాకరించడంతో ఎన్ఆర్ఐ గొరుముచ్చు గోపాల్‌యాదవ్ టీడీపీని వీడారు. ఇక జనసేన పార్టీకోసం అహర్నిశలు కృషి చేసి... పార్టీ పురోభివృద్ధికి కృషి చేసినప్పటికీ తమను పట్టించుకోకుండా నియంతృత్వ పోకడలు అవలంబిస్తుండటంతో చేగొండి సూర్యప్రకాశ్, నౌడు వెంకటరమణ ఆ పార్టీకి రాంరాం చెప్పారు. కాంగ్రెస్ విధానాలు నచ్చకపోవడంతో శెట్టి గురునాథం ఆ పార్టీని వీడారు. తాజాగా ముమ్మిడివరం నియోజకవర్గానికి చెందిన జనసేన నేత పితాని బాలకృష్ణ కూడా శెట్టిబలిజలకు ప్రాధాన్యం కల్పించకపోవడాన్ని నిరసిస్తూ ఆ పార్టీనుంచి బయటకు వచ్చారు. వారంతా వైఎస్సార్సీపీలో చేరేందుకు క్యూ కట్టారు. ప్రధానంగా తాడేపల్లిగూడెం, ఆచంట, ఉంగుటూరు, నూజివీడు, చింతలపూడి, పోలవరంలో ముఖ్య నేతలు ఇవే కారణాలతో నేరుగా పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకుంటున్నారు. ఇక నియోజకవర్గ స్థాయిలో అయితే నిత్యం పెద్ద సంఖ్యలో వచ్చి చేరుతున్నారు. బీసీలకు పట్టం కట్టడం, గడచిన ఐదేళ్లలో సంక్షేమ పాలన ప్రతి గడపకు చేరడంతో పార్టీకి ఆకర్షితులై పెద్ద ఎత్తున వలసలు కొనసాగుతున్నాయి. ఈలి నానితో మొదలై.. తాడేపల్లిగూడెం టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఈలి వెంకట మధుసూదనరావు(నాని) ఇటీవలే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. నియోజకవర్గంలో ఈలి కుటుంబానికి మంచి పేరుంది. ఆయన తండ్రి ఈలి ఆంజనేయులు రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా, ఆయన భార్య వరలక్ష్మి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా చేశారు. ఆంజనేయులు ఎన్టీఆర్ కేబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. నాని 2009లో ప్రజారాజ్యం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ఒక పర్యాయం పనిచేశారు. రాజకీయంగా నియోజకవర్గంలో మంచి పేరుంది. 2019లో టీడీపీ టికెట్‌పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. సుదీర్ఘ నేపథ్యం ఉన్నప్పటికీ పార్టీ అవమానకర రీతిలో వ్యవహరించడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. ♦ నూజివీడు మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య 2009లో ప్రజారాజ్యం పార్టీలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించి టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. నియోజకవర్గంలో బలమైన నేతగా గుర్తింపు ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన ఆ పార్టీ టికెట్ విషయంలో పరాభవం చెందడంతో వైఎస్సార్సీపీలో చేరారు. ♦ మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య తనయుడు చేగొండి సూర్యప్రకాష్ జనసేన పార్టీలో ఆచంట ఇన్చార్జిగా పనిచేశారు. పార్టీలో ప్రాధాన్యం లేకపోవడం, ఇతర కారణాలతో జనసేనను వీడి ఫ్యాన్ గూటికి చేరారు. ♦ ఉంగుటూరులో జెడ్పీటీసీగా రాజకీయం ప్రస్థానం ప్రారంభించిన నౌడు వెంకటరమణ 2019లో జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తరువాత రాజకీయంగా అక్కడ ప్రాధాన్యమివ్వకపోవడంతో ఇటీవలే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి పార్టీలో చేరారు. ♦ జంగారెడ్డిగూడెంలో బలమైన కాంగ్రెస్ నేతగా గుర్తింపు ఉన్న జెట్టి గురునాథం పోలవరం, చింతలపూడి నియోజకవర్గాల్లో మంచి పట్టు సాధించారు. ఆయన కూడా కాంగ్రెస్ విధానాలు నచ్చక వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి పార్టీలో చేరారు. టీడీపీలో అవమానాలు ఎదుర్కొన్న గోపాల్ టీడీపీ ఎంపీ టిక్కెట్ ఆశావహి, ఎన్ఆర్ఐ గొరుముచ్చు గోపాల్యాదవ్కు టీడీపీలో అడుగడుగునా అవమానాలు ఎదురయ్యాయి. సింగపూర్‌లో వ్యాపారం చేసుకుంటున్న ఆయన్ను పిలిచి మరీ టిక్కెట్ నీదే, ఖర్చుకు వెనుకాడకుండా పనిచేయమని చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేశ్ చెప్పడంతో ఏడాది నుంచి ఏలూరు పార్లమెంట్ సీటు లక్ష్యంగా చేసుకుని విస్తృతంగా పనిచేశారు. యువగళం మొదలుకొని, చంద్రబాబు బహిరంగ సభల వరకు అనేక కార్యక్రమాలకు పెద్ద ఎత్తున ఖర్చుచేశారు. చివరికి హ్యాండ్ ఇచ్చి యనమల అల్లుడు పుట్టా మహేష్ యాదవ్‌కు టిక్కెట్ ఇచ్చారు. మనస్తాపానికి గురైన గోపాల్ యాదవ్ వైఎస్సార్సీపీలో చేరారు. ఎన్నికల వేళ కీలక నేతల రాకతో వైఎస్సార్సీపీ కేడర్‌లో కొత్త జోష్ నెలకొంది. టికెట్లు అమ్ముకున్న పవన్: పితాని ముమ్మిడివరం: జనసేన పార్టీలో కష్టపడినవారికి కాకుండా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్, పార్టీ నాయకుడు నాదెండ్ల మనోహర్ కలసి టికెట్లు అమ్ముకున్నారని తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ జనసేన ఇన్చార్జి పితాని బాలకృష్ణ ఆరోపించారు. ఈ మేరకు ముమ్మిడివరం జనసేన పార్టీ కార్యాలయంలో సానబోయిన మల్లికార్జునరావు అధ్యక్షతన శుక్రవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీకోసం కోట్లాదిరూపాయల ఆస్తిని అమ్ముకున్న తనకు తీరని అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం కోసం పార్టీని ఏర్పాటు చేశానని చెప్పి, శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన ఏ ఒక్కరికీ టికెట్ ఇవ్వకపోవడం తనను తీవ్రంగా కలచివేసిందని వాపోయారు. అందుకే ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సమక్షంలో శనివారం చేరనున్నట్టు ప్రకటించారు. కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషుల అభీష్టం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. నాదెండ్ల మనోహర్ వల్లే జనసేన పార్టీ సర్వనాశనం అయిందన్నారు. సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఆదేశిస్తే ముమ్మిడివరంలో పొన్నాడ సతీ‹Ùకుమార్‌తో పాటు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో పోటీచేస్తున్న బీసీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానని పితాని తెలిపారు. జనసేన పార్టీ అభ్యర్థులను ఓడించడమే తన ధ్యేయమని చెప్పారు. కాకినాడ మాజీ మేయర్ సరోజ కూడా నాదెండ్ల తీరుపై మండిపడ్డారు. -
పవన్‌ను నమ్ముకుంటే గోదారే!
సాక్షి ప్రతినిధి, కాకినాడ/సాక్షి, భీమవరం: ఎన్నికలు నెలన్నర ఉందనగా జనసేనాని అస్త్రసన్యాసంతో గోదావరి జిల్లాల్లో జనసైనికులు, నేతలు డీలా పడ్డారు. వారాహి యాత్రలో ఊగిపోయే ప్రసంగాలు చేసి తమను ఎన్నికల రణరంగంలోకి దూకమని చెప్పి ఇప్పుడు చంద్రబాబుకు దాసోహమని కాడి వదిలేయడంపై ఆ పార్టీ కేడర్ రగిలిపోతుంది. ఉభయ గోదావరి జిల్లాల్లో దున్నేస్తామంటూ హడావుడి చేసిన తమ అధినేత ఎన్నికల సమరం దగ్గర పడుతున్న తరుణంలో పార్టీ నేతలను, కేడర్‌ను డీగ్రేడ్ చేస్తూ మాట్లాడడం, కార్యకర్తల్ని ప్రశ్నించవద్దంటూ ఆదేశించడాన్ని ఆ పార్టీ నాయకులు, పవన్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పి ఇప్పుడు పార్టీ శ్రేణులను అవమానించడంతో తమ మనసుల్లో ఆయన పట్ల ఉన్న ప్రతిష్టను దిగజార్చుకున్నారని స్పష్టం చేస్తున్నారు. జనసైనికులు, కార్యకర్తలు తీవ్ర నిస్పృహలో ఉంటే పవన్ మాత్రం హైదరాబాద్‌లో ఉండి తమాషా చూడడంపై ఆవేదనలో మునిగిపోయారు. తమ అధినేత తీరు ఇలాగే కొనసాగితే పార్టీని, తమను గోదాట్లోకి నెట్టేసినట్లేనని, ఆ పరిస్థితి రాకముందే తట్టాబుట్టా సర్దుకుని జాగ్రత్తపడడం మంచిదని భావిస్తున్నారు. ఇప్పటికే జనసేన నేతలు పార్టీ మారుతుండగా.. మరికొందరు ఆ దారిలో ఉన్నారు. పవన్ ప్రసంగంతో పార్టీలో పెనుదుమారం ఇటీవల టీడీపీ, జనసేన ఉమ్మడిగా తాడేపల్లిగూడెం వద్ద నిర్వహించిన జెండా సభలో పార్టీ శ్రేణులను చిన్నబుచ్చుతూ పవన్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో పెను దుమారాన్నే రేపాయి. ఆయన ప్రసంగాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక కేడర్ అయోమయంలో పడిపోయింది. మరోవైపు ఎన్నికలు తరుముకొస్తున్నా పార్టీ అధ్యక్షుడిగా తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తాడనే అంశంపై స్పష్టత ఇవ్వకపోవడంతో జన సైనికులకు ఎటూ పాలుపోవడం లేదు. 24 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించిన పవన్.. ఇంతవరకూ ఐదు స్థానాల్లో అభ్యర్థులపై స్పష్టత ఇచ్చారు. ఇది జరిగి దాదాపు పదిరోజులవుతున్నా మిగిలిన 19 స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించలేని దయనీయ స్థితిలో పవన్ ఉన్నారు. ఇలాగైతే టీడీపీ ఖాతాలోకి భీమవరం.. ఎన్నికల ప్రచారం మొదలైన తొలినాళ్లలో పవన్ భీమవరం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం బలంగా వినిపించింది. తాజాగా పిఠాపురం పేరు కూడా తెర మీదకు వచ్చింది. ఈ రెండింటిలో ఏ స్థానం నుంచి బరిలోకి దిగుతారనేది తేల్చుకోలేని పరిస్థితుల్లోకి పవన్‌కళ్యాణ్‌ను చంద్రబాబు నెట్టేశారని జనసేన నేతలు అభిప్రాయపడుతున్నారు. భీమవరం నుంచి స్థానికేతరుడిగా ప్రతికూలత ఎదురవుతుందని పవన్‌ను బురిడీ కొట్టించిన చంద్రబాబు భీమవరాన్ని సైతం తన ఖాతాలో వేసుకునే ఎత్తుగడ వేశారని మండిపడుతున్నారు. అక్కడ టీడీపీ మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులును జనసేనలోకి తీసుకుని పోటీ చేయించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పేరుకు జనసేన అయినా టీడీపీ నాయకుడినే పోటీ చేయించడం చంద్రబాబు వ్యూహమంటున్నారు. ఎక్కడి నుంచి పోటీ అన్నదానిపై పవన్ ఇప్పటికీ స్పష్టత ఇవ్వకపోతే.. తమ పరిస్థితి ఏంటని వివిధ నియోజకవర్గాల్లో సీట్లు ఆశించిన ఆశావహులు ఆవేదన చెందుతున్నారు. ఇంకా ఆ పార్టీలో కొనసాగితే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదనే ముందుచూపుతో ఆ పార్టీలోని ముఖ్యమైన నేతలు ప్రత్యామ్నాయదారులు వెదుక్కుంటున్నారు. జనసేన ఆచంట నియోజకవర్గ ఇన్చార్జి చేగొండి సూర్యప్రకాష్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో చేరిపోయారు. తాజా పరిణామాల నేపథ్యంలో గోదావరి జిల్లాల్లో జనసేన గ్రాఫ్ రోజురోజుకూ పడిపోతోందని, పూర్తిస్థాయిలో సీట్ల ప్రకటన జరిగితే ఆ పార్టీకి మరిన్ని తలనొప్పులు తప్పవంటున్నారు. పార్టీలో నెంబర్ 3కే సీటు లేకపోతే ఎలా? రాజమహేంద్రవరం రూరల్ నుంచి పార్టీలో నెంబర్ 3గా ఉన్న దుర్గేష్కే సీటని ఇటీవల రాజమహేంద్రవరం పర్యటనలో పవన్ స్వయంగా ప్రకటించారు. చంద్రబాబు ట్రాప్‌లో పడి ఇప్పుడు దుర్గేష్‌ను నిడదవోలుకు సాగనంపి, రాజమహేంద్రవరం రూరల్ సీటును టీడీపీ నేత గోరంట్లకు కట్టబెట్టేందుకు ప్రయత్నించడంపై జనసేన శ్రేణులు మండిపడుతున్నాయి. పవన్ ఇలా చేస్తారనుకోలేదని దుర్గేష్ వర్గీయులు ఆవేదన చెందుతున్నారు. జగ్గంపేటలో పాటంశెట్టి సూర్యచంద్రరావు తన భార్యతో సహా ఆమరణ దీక్ష చేస్తే పవన్ నుంచి కనీస స్పందన రాలేదు. ఒక్క సీటూ ప్రకటించరా? పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం ఏడు నియోజకవర్గాలకు గాను తణుకు, ఉండి, పాలకొల్లు, ఆచంట నియోజకవర్గాలకు ఇప్పటికే టీడీపీ అభ్యర్థులను ప్రకటించేయగా.. వారు క్షేత్రస్థాయిలో ప్రచారం ప్రారంభించేశారు. మిగిలిన మూడు సీట్లలో ఎన్ని జనసేనకు ఇస్తారో ఇంతవరకూ స్పష్టత లేదు. సొంత సామాజిక వర్గం ప్రాబల్యం అధికంగా ఉన్న ఆ మూడు స్థానాల్లో ఒక్క సీటు కూడా జనసేనాని ప్రకటించకపోవడం కేడర్‌ను తీవ్ర నిరాశకు గురిచేసింది. 2014 ఎన్నికల్లో తాడేపల్లిగూడెం నుంచి బీజేపీ అభ్యర్థి గెలుపొందగా.. పొత్తులో భాగంగా ఈసారి ఆ సీటును బీజేపీ అడిగే అవకాశం ఉందంటున్నారు. ఇక టీడీపీ అభ్యర్థుల్ని ప్రకటించిన సీట్లలో అవమానంతో జనసేన శ్రేణులు రగిలిపోతున్నాయి. తణుకులో టికెట్ ఆశించి భంగపడ్డ జనసేన నేత విడివాడ రామచంద్రరావు, ఆయన వర్గీయులు తాడేపల్లిగూడెం బహిరంగ సభను బహిష్కరించారు. ఇంతవరకూ ఆయనతో ఎవరూ మాట్లాడలేదు. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు చేరికతో నరసాపురం జనసేనలో ముసలం రేగింది. నరసాపురం సీటు మత్స్యకార వర్గానికి చెందిన బొమ్మిడి నాయకర్‌కు ఇస్తారని భావించగా.. ఆ సీటు తమదేనంటూ సుబ్బారాయుడు వర్గం ప్రచారం చేసుకుంటోంది. పవన్‌కు నాయకత్వ పటిమ లేదు సినిమా డైలాగులే తప్ప పవన్‌కళ్యాణ్ వల్ల ఏమీ కాదని అర్థమైంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేటంతటి నాయకత్వ పటిమ, గుండెధైర్యం ఉన్నట్లు అనిపించడం లేదు. ముందు భీమవరం అన్నారు. ఇప్పుడు పిఠాపురం అంటున్నారు. అక్కడి నుండి పోటీ చేస్తే మాత్రం పవన్‌కు పరాభవం తప్పదు. ఈ పరిస్థితులు చూస్తుంటే అసలు పవన్ పోటీలో ఉంటారో లేదో కూడా అనుమానంగా ఉంది. అందుకే భీమవరంలో పులపర్తి అంజిబాబు ఇంటికి వెళ్లి నేను పోటీ చేయకపోతే మీరు చేస్తారా? అని పవన్ బతిమాలారు. ఇవన్నీ చూస్తుంటే పవన్ నాయకత్వ పటిమ, గుండె ధైర్యం ఏపాటివో అర్థమవుతోంది. – చేగొండి సూర్యప్రకాష్, వైఎస్సార్ సీపీ నాయకుడు, పాలకొల్లు జాప్యంతో మరింత చిచ్చు పొత్తులో జనసేనకు టీడీపీ కేటాయించిన 24 సీట్లలో అభ్యర్థులను ప్రకటించడంలో పవన్‌కళ్యాణ్ జాప్యం చేయడం సరి కాదు. ఈ జాప్యం వల్లే పలు నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణుల మధ్య విభేదాలు పెరిగిపోయి, కొందరు బయటకు పోతున్నారు. పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో ప్రకటించకుండా జాప్యం చేయడం మంచిది కాదు. ఓ కాపు నాయకుడిగా ఈ పరిణామాలు నన్ను కొంత బాధిస్తున్నాయి. – పత్తి దత్తుడు, రాష్ట్ర అధికార ప్రతినిధి, కాపు సంక్షేమ సేన, అంబాజీపేట -
పవన్కున్నాయ్.. ప్రత్యేక కారణాలు
సాక్షి, అమరావతి/సాక్షి, భీమవరం: హెలికాప్టర్ లాండింగ్‌కు అనుమతించలేదన్న కారణ0తో ప్రతిపక్ష నాయకుడు ఎవరైనా పార్టీ సమావేశాలను వాయిదా వేసుకుంటారా? కానే కాదు. దాని వెనుక సొంత పార్టీ కారణాలు ఉంటాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాల పర్యటన వాయిదా వెనుక కూడా టీడీపీ–జనసేన కూటమి గొడవలు, ఇతరత్రా కారణాలు ఉన్నాయి. అవి బయటపడకుండా హెలికాప్టర్ లాండింగ్‌కు అనుకూలంగా లేదన్న అధికారుల సూచనను రాజకీయం చేసేసి, అన్ని సమావేశాల్ని మంగళగిరికి మార్చేసుకున్నారు పవన్. ఇదీ అసలు కారణం జనసేన – టీడీపీ పొత్తు నేపథ్యంలో అసెంబ్లీ నియోజకవర్గాలలో రెండు పార్టీ ల నాయకుల మధ్య ఉప్పు– నిప్పుగా ఉంది. ఈ కారణంతోనే ఇటీవలి కాలంలో పవన్ జిల్లా పర్యటనలకు వెళ్లడం లేదు. వారాహి యాత్రా ఆగిపోయింది. చివరాఖరికి ఉభయ గోదావరి జిల్లాల పర్యటనకు ఉపక్రమించారు. బుధవారం నుంచి ఈనెల 17 వరకు మూడు రోజులు భీమవరంలోనే మకాం ఉండి భీమవరం, అమలాపురం, కాకినాడ, రాజమహేంద్రవరంలలో జరిగే జనసేన, టీడీపీ ముఖ్య నాయకుల సమావేశాల్లో పాల్గొనాల్సి ఉంది. అయితే, నియోజకవర్గాల్లో జనసేన, టీడీపీ వర్గాల మధ్య బొత్తిగా పొసగడంలేదు. టీడీపీ పశ్చిమ గోదావరి జిల్లా నేతలు తోట సీతారామలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు), మాజీ ఏఎంసీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు మధ్య వివాదాలు తీవ్రంగా ఉన్నాయి. వీరి గ్రూపు రాజకీయాలు పవన్ పర్యటనకు చేటుచేస్తాయని జనసేన నేతలు భావించినట్టు సమాచారం. దీనికి తోడు పెళ్లిళ్ల ముహూర్తాల కారణంగా పవన్ మకాం చేసేందుకు భీమవరం పరిసర ప్రాంతాల్లో గెస్ట్ హౌస్‌లు, సమావేశాలకు ఫంక్షన్ హాళ్లు దొరకలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో పవన్ పర్యటన వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ప్రభుత్వంపై నెపం వేసి.. టీడీపీ–జనసేన కూటమిలో విభేదాలు, వసతి దొరకలేదన్న కారణాన్ని బయటకు చెప్పలేక, హెలిప్యాడ్‌కు ప్రత్యామ్నాయం చూడాలన్న అధికారుల సూచనను రాజకీయం చేసి, పబ్బం గడిపేసుకుంటున్నారు పవన్. హెలికాప్టర్ లాండింగ్‌కు అనుమతులివ్వడంలేదంటూ ప్రభుత్వంపై బురదజల్లేసి కార్యక్రమాలను మంగళగిరికి మార్చేసుకున్నారు. వాస్తవానికి పట్టణంలోని విష్ణు కళాశాలల వద్ద ఎన్నో ఏళ్ల క్రితం ఏర్పాటుచేసిన హెలిప్యాడ్‌ను జనసేన నాయకులు ఎంచుకున్నారు. ఈ హెలీప్యాడ్ వినియోగించి చాలా కాలమైంది. ఆ ప్రాంతంలో కొత్తగా భవనాలు, అపార్ట్మెంట్స్ నిర్మించడం, చెట్లు పెరిగిపోవడంతో ల్యాండింగ్‌కు సురక్షితం కాదని అనుమతి ఇవ్వలేదని ఆర్ అండ్ బీ ఈఈ ఎస్ లోకేశ్వరరావు తెలిపారు. గత నెలలో సీఎం జగన్ భీమవరం పర్యటన సందర్భంగా విష్ణు కళాశాల హెలీప్యాడ్ అనుకూలంగా ఉండదని భావించడం వల్లే పట్టణంలోని లూథరన్ హైసూ్కల్ ఆవరణలో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. పవన్ హెలికాప్టర్ కోసం కూడా ప్రత్యామ్నాయ స్థలాలు చూడాలని జనసేన నేతలకు సూచించారు. ఈ మేరకు జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు తదితరులు ఉండి సమీపంలోని ఫంక్షన్ హాలుకు ఎదురుగా ఉన్న ఖాళీ స్థలాన్ని పరిశీలించారు. అయినా, అసలు కారణాలను కప్పిపుచ్చుతూ, పవన్‌కళ్యాణ్ ప్రయాణించే హెలికాప్టర్ ల్యాండింగ్‌కు ఆర్ అండ్ బీ అధికారులు అనుమతులు మంజూరు చేయకుండా అడ్డంకులు సృష్టిస్తున్న కారణంగా బుధవారం (14వ తేదీ) నుంచి జరగాల్సిన పర్యటన వాయిదా వేసుకున్నట్టు జనసేన ఓ ప్రకటనలో పేర్కొంది. మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలోనే ఆయా నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశాలు జరగనున్నట్లు తెలిపింది. ఇది కేవలం ఒక వంకేనని, అసలు కారణం టీడీపీ, జనసేన మధ్య విభేదాలేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఐదారు నెలల క్రితం బాబు అరెస్టు సమయంలో తన హెలికాప్టర్ ప్రయాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నారని అప్పట్లో హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా విజయవాడ వచ్చి, మధ్యలో రోడ్డుపైనే పడుకొని హడావుడి చేసిన పవన్.. ఇప్పుడు రోడ్డు మార్గంలో ఎందుకు రాలేరని వారు ప్రశ్నిస్తున్నారు. మంగళగిరి కార్యాలయం నుంచి 150 కి.మీ. లోపే ఉన్న భీమవరానికి రోడ్డు మార్గంలో రావడం సులువైన పని అయినప్పటికీ, హెలికాప్టర్‌కు అడ్డంకుల పేరుతో పర్యటననే వాయిదా వేసుకోవడం విచిత్రంగానే ఉందని జనసేన నేతలు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. -
కొత్త అల్లుడికి వందల రకాల నోరూరించే వంటకాలు
-
బరిలో బౌన్సర్లు
సాక్షి, అమరావతి: సంక్రాంతి బరిలో పందెం కోళ్లతోపాటు బౌన్సర్లు సైతం దిగబోతున్నారు. సెలబ్రిటీలకు రక్షణ కవచంగా ఉండే బౌన్సర్లను షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవాలు, వివాహాలు, వేడుకల సందర్భాల్లో మాత్రమే బౌన్సర్లను ఉపయోగిస్తూ వస్తున్నారు. ఇకపై ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పెద్దఎత్తున సాగే కోడి పందాల జాతరలో ప్రైవేటు సైన్యంగా బౌన్సర్లు సైతం రంగంలోకి దిగనున్నారు. ఇందుకోసం రాష్ట్రంలో ప్రధాన జిమ్ సెంటర్ల నిర్వాహకుల పర్యవేక్షణలో ఏజెన్సీలు సిద్ధమయ్యాయి. శిక్షణ పొందిన బౌన్సర్లు సిద్ధంగా ఉన్నారని, కోడి పందాల నిర్వాహకులు అవసరమైతేనే తమను సంప్రదించాలని సామాజిక మాధ్యమాల్లో ప్రచారానికి తెరలేపారు. బలిష్టమైన శరీరాకృతి, ప్రత్యేక డ్రెస్ కోడ్‌తో బరుల్లో కలియ తిరిగే వారిని చూస్తే పందాల రాయుళ్లు సైతం గొడవలకు వెనుకడుగు వేస్తారు. వారి సహకారంతో బరుల్లో ఎటువంటి వివాదాలు తలెత్తకుండా ప్రశాంతంగా కోడి పందేలు నిర్వహిస్తారు. ప్రధానంగా భీమవరంలో 70 మంది, పాలకొల్లులో 20 మంది, రాజమండ్రిలో 300 మంది, విజయవాడలో 200 మంది, విశాఖపట్నంలో 300 మంది శిక్షణ పొందిన బౌన్సర్లు ఇప్పటికే పేర్లు నమోదు చేసుకున్నారు. వీరికి రోజువారీ వేతనాన్ని మాట్లాడుకుని బరిలో దించితే ఖరీదైన కోడి పందాల్లో సైతం గలీజు గొడవలకు అడ్డుకట్ట పడుతుంది. ఏడాదిపాటు కఠోర తర్ఫీదు సంక్రాంతి కోడి పందేల కోసం పుంజులకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. పుంజుల పోరులో శాంతిభద్రతల సమస్య రాకుండా బౌన్సర్లను వినియోగిస్తున్నారు. ఇందుకోసం బౌన్సర్లకు కూడా ఏడాదిపాటు కఠోర శిక్షణ ఇస్తాం. వారికి ప్రత్యేకమైన ఆహారం, క్రమశిక్షణతో కూడిన జీవనం, తర్ఫీదులో కూడా అత్యంత శ్రద్ధ తీసుకుంటాం. – ఎస్కే ఖాసీం, కే12 జిమ్ అధినేత, భీమవరం స్టేటస్ సింబల్‌గా బౌన్సర్ సెలబ్రిటీ అయినా, ఎటువంటి ఈవెంట్ అయినా నలుగురు బౌన్సర్లు ఒకేచోట యూనిఫామ్‌తో క్రమశిక్షణతో నడిచి రావడం స్టేటస్ సింబల్‌గా మారిపోయింది. బాడీ బిల్డింగ్ పోటీల కోసం తర్ఫీదు పొందుతున్న యువత ఇప్పుడు కోడి పందాల బరుల్లో పహారా కాసేందుకు కూడా వెళ్తున్నారు. సంక్రాంతి మూడు రోజులు పందాల బరుల్లో గస్తీ కాస్తూ ఉపాధి పొందుతారు. – షేక్ నాగూర్, బౌన్సర్, ఉండి బరిలో బౌన్సర్లకు ఉపాధి బౌన్సర్ వృత్తిని యువత ఉపాధి మార్గంగా ఎంచుకుంటున్నారు. పెళ్లిళ్లు, వేడుకల్లో రోజుకు రూ.వెయ్యి నుంచి రూ.1,500 ఇస్తున్నారు. సెలబ్రిటీల రక్షణకు వెళితే రూ.2,500 నుంచి రూ.3 వేలు ఇస్తున్నారు. తాజాగా కోడి పందాల బరుల్లో బౌన్సర్ల కోసం ఏజెన్సీలను సంప్రదించి ఒప్పందాలు చేసుకుంటున్నారు. వీటిలో చిన్న పందాల బరిలో రోజుకు రూ.1,500, భారీ పందాల్లో అయితే రూ.3 వేల చొప్పున ఇచ్చేలా ఒప్పందాలు చేసుకుంటున్నారు. – అడిదెల రిచీ, సీనియర్ కోచ్, భీమవరం -
ప్రాంతానికో ప్రత్యేకం
సాక్షి, అమరావతి: సంక్రాంతి సంబరాలను ఒక్కో ప్రాంత ప్రజలు ఒక్కో తరహాలో నిర్వహిస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. గోదావరి జిల్లాల్లో కోడి పందేలు.. కోనసీమలో ప్రభల తీర్థం.. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఎడ్ల పందేలు.. చిత్తూరు జిల్లాలో జల్లికట్టు విన్యాసాలు.. కొన్నిచోట్ల పతంగులు ఎగురవేయడం వంటివి నిర్వహిస్తుంటారు. హోరాహోరీ తలపడే పందెం కోళ్లు సంక్రాంతి వచ్చిందంటే గోదావరి జిల్లాల్లో కోడి పందేల జాతర మొదలవుతాయి. భోగి రోజున మొదలై çసంక్రాంతి, కనుమ వరకు మూడు రోజులపాటు ఊరువాడా పెద్దఎత్తున జరిగే కోడి పందేల్లో రూ.కోట్లు చేతులు మారతాయి. కోడి పందేల బరుల పక్కనే పేకాట, కోతాట, గుండాట వంటివి ఏర్పాటు చేయడంతో జూదాల జాతరను తలపిస్తాయి. ఏడాదిపాటు పహిల్వాన్ తరహాలో కోళ్లను మేపి.. వాటికి ప్రత్యేక శిక్షణ ఇచ్చిన పందేల బరిలో దించుతారు. కోనసీమ ప్రభల తీర్థం సంక్రాంతి వేళ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ప్రభల తీర్థం కనుల పండువగా జరుగుతుంది. కోనసీమలో 80 వరకు ప్రభల తీర్థాలు నిర్వహిస్తుండగా.. జగ్గన్న తోట ప్రభల తీర్థానికి జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. గతేడాది దేశ రాజధానిలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లోనూ ఇక్కడ ప్రభలను ప్రదర్శించారు. బండ్ల లాగుడు.. పరుగు పందెంలో ఎడ్లు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఎడ్ల పందేలు, బండ లాగుడు పందేలను రైతులు ఉత్సాహంగా నిర్వహిస్తారు. వ్యవసాయంలో ఉపయోగించే ఎడ్ల జతకు బరువైన బండలు కట్టి నిర్దేశించిన ప్రాంతానికి ఏది ముందు చేరితే ఆ ఎడ్ల జతను విజేతగా ప్రకటిస్తారు. దీంతోపాటు పలు విభాగాల్లో ఎడ్లను పరిగెట్టించి ముందుగా గమ్యానికి చేరుకున్న వాటిని విజేతగా ప్రకటిస్తారు. ఉభయ గోదావరి జిల్లాల్లోనూ అక్కడక్కడా ఈ పందేలు జరుగుతాయి. అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లోను ఈ తరహా పోటీలు భోగి రోజున ప్రారంభించి మార్చి వరకు కొనసాగిస్తారు. ‘జల్లికట్టు’తో పశువుల పండుగ తమిళనాడులోని జల్లికట్టు మాదిరిగా చిత్తూరు జిల్లాలో పశువుల పండుగ ఉత్సాహంగా జరుపుకుంటారు. రంకెలేస్తూ పరుగులు తీసే కోడె గిత్తలను పట్టుకోవడానికి యువత ఉత్సాహంగా ఉరకలేస్తుంటారు. ఆ సంస్కృతి చిత్తూరు జిల్లాలోనూ ఎక్కువగా కన్పిస్తుంది. తమిళనాడులో కనుమ రోజున జల్లికట్టు నిర్వహిస్తే.. మన రాష్ట్రంలో సంక్రాంతి ముందు నుంచి పశువుల పండుగ జరపడం ఆనవాయితీగా వస్తోంది. -
ఉభయ గోదావరిలో చంద్ర-సేన సిగపట్లు!
‘పొత్తులతో పోటీ చేస్తే ఉభయ గోదావరులు మనవే’ అని గాలిలో ఈతలు కొడుతున్న టీడీపీ, జనసేన పా ర్టీలకు క్షేత్రస్థాయిలో సిగపట్లు మింగుడుపడడం లేదు. ఇరుపా ర్టీల అధిష్టానాల నుంచి ఎలాంటి సంకేతాలూ రాకముందే పరిస్థితి ఇలా ఉంటే.. సీట్ల ప్రకటన వెలువడే సమయానికి ముదురు పాకాన పడడం ఖాయంగా కనిపిస్తోంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో చాలా నియోజకవర్గాల్లో ఆయా పార్టీల నేతల వ్యవహారాలతో కేడర్ అయోమయంలో పడుతోంది. టీడీపీతో జట్టు కట్టడంపై జనసేన నేతలు, ఆ పార్టీ శ్రేణులు ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై నిప్పులు చెరుగుతున్నారు. తన సామాజికవర్గాన్ని గంపగుత్తగా చంద్రబాబు వద్ద మోకరిల్లేలా చేసి, త్యాగాలకు సిద్ధం కావాలని దిశానిర్దేశం చేయడంపై జనసేన నేతలు, ఆశావహులు కారాలు మిరియాలు నూరుతున్నారు. ఇరుపా ర్టీల్లో కనిపిస్తున్నది మేకపోతు గాంభీర్యమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. –సాక్షి ప్రతినిధి, కాకినాడ/ఏలూరు ఉమ్మడి తూర్పుగోదావరి ♦ కాకినాడ జిల్లా జగ్గంపేట టీడీపీలో సీనియర్‌గా చెప్పుకునే మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జనసేన ఇన్చార్జి పాటంశెట్టి సూర్యచంద్రరావుల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఇటీవల టీడీపీ–జనసేన సమన్వయ సమావేశంలో ఇద్దరూ ఒకరిని ఒకరు ఓడిస్తామంటూ సవాళ్లు – ప్రతిసవాళ్లు చేసుకున్నారు. ♦ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని జనసేన నిర్ణయించింది. కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం స్థానికేతరుడైన టీ టైమ్ అధినేత తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఇన్చార్జిగా వ్యవహరిస్తూ టికెట్ రేసులో ఉన్నారు. స్థానికేతరుడైన అతడికి టికెట్ ఇస్తే ఓడిస్తామని స్థానిక జనసేన నేతలు హెచ్చరిస్తున్నారు. మరోవైపు పొత్తులో టీడీపీ ఈ సీటు కోల్పోవాల్సి వస్తే ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే వర్మ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగే ఏర్పాట్లలో ఉన్నారు. ♦ కాకినాడ రూరల్ సీటు జనసేనకేనని ఆ పార్టీ నాయకులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఆ పార్టీ అభ్యర్థిగా నిన్నమొన్నటి వరకూ పంతం నానాజీకి లైన్ క్లియర్ అయ్యిందని ప్రచారం జరగగా, మారిన రాజకీయ పరిణామాల్లో నానాజీకి కాకుండా ఆర్థికంగా స్థితిమంతుడైన నాయకుడికి కట్టబెట్టే ఆలోచనలో ఉన్నారనే సమాచారంతో ఆ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జనసేనకు కేటాయిస్తే స్వతంత్రంగా పోటీ చేస్తామని టీడీపీ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్షి్మ, టీడీపీలో మరో వర్గం నుంచి జెడ్పీటీసీ పేరాబత్తుల రాజశేఖర్ కూడా బరిలో ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ♦ కాకినాడ సిటీ కోసం జనసేన ఇన్చార్జి ముత్తా శశిధర్, టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు టికెట్ ఆశిస్తున్నారు. కొండబాబుకు ఇస్తే పార్టీ నష్టపోతుందని మిగిలిన నాయకులు మోకాలడ్డుతున్నారు. జనసేన నుంచి కాకినాడ లోక్‌సభ స్థానానికి పోటీ చేయాలనుకుంటున్న పారిశ్రామికవేత్త సానా సతీష్ కూడా కొండబాబు అభ్యర్థి త్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ పరిణామాలతో టీడీపీ రెండు గ్రూపులుగా విడిపోయింది. ♦ తూర్పు గోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం రూరల్ సీటు తమదంటే తమదేనని జనసేన నుంచి కందుల దుర్గేష్ ఒకపక్క, టీడీపీ నుంచిæ సిటింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మరోపక్క ప్రచారం చేసుకుంటున్నారు. రెండు పార్టీల శ్రేణుల మధ్య విభేదాలు రచ్చకెక్కుతూ పొత్తు చిత్తవ్వడం ఖాయమంటున్నారు. ♦రాజానగరం సెగ్మెంట్ కోసం టీడీపీ మాజీ ఎమ్మెల్సీ దివంగత బొడ్డు భాస్కర రామారావు కుమారుడు వెంకట రమణ చౌదరి ప్రచారంలో ఉన్నారు. అయితే ఈ సీటు జనసేనకేనని, అభ్యర్థిని తానేనని అంటూ బత్తుల బలరామకృష్ణ చేస్తున్న ప్రచారం రెండు వర్గాల మధ్య చిచ్చు రేపుతోంది. ♦ ఎస్సీలకు రిజర్వ్ చేసిన జనసేనకు బలమైన కేడర్ ఉన్న అమలాపురం సీటు తమకే ఇవ్వాలని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి శెట్టిబత్తుల రాజబాబు పట్టుబడుతున్నారు. టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ఇప్పటికే పోటీ పడుతూండగా, ఆయనను కాకుండా మాజీ ఎంపీ బుచ్చిమహేశ్వరరావు కుమార్తె పాము సత్యశ్రీని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తెర మీదకు తీసుకువచ్చారు. దీంతో ఇరు వర్గాలూ నువ్వా నేనా అనే స్థాయిలో తలపడుతున్నాయి. ఈ రెండు పా ర్టీల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. ♦ గత ఎన్నికల్లో జనసేన గెలుపొందిన ఏకైక నియోజకవర్గం రాజోలు నుంచి బొంతు రాజేశ్వరరావు సీటు కోసం పోటీ పడుతున్నారు. ఈ స్థానాన్ని టీడీపీకే కేటాయించాలని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు పట్టుబడుతున్నారు. ♦డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం టీడీపీకే ఖాయమైందని మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు ప్రచారం చేసుకుంటూండగా.. ఆవిర్భావం నుంచీ లక్షల రూపాయలు తగలేసుకున్న తమను విస్మరించి, టీడీపీకి కేటాయిస్తే తమ సత్తా చాటుతామని జనసేన ఇన్చార్జి, బీసీ నాయకుడు పితాని బాలకృష్ణ వర్గం బాహాటంగానే చెబుతోంది. ♦ కొత్తపేట నియోజకవర్గంలో జనసేన–టీడీపీల మధ్య సీటు కోసం సిగపట్లు నడుస్తున్నాయి. టీడీపీ, జనసేన తరఫున అన్నదమ్ములైన బండారు సత్యానందరావు (టీడీపీ), బండారు శ్రీనివాస్ (జనసేన) పోటీ పడుతున్నారు. దీంతో తెలుగు తమ్ముళ్ల పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా మారింది. బండారు సత్యానందరావుకు పోటీగా మాజీ ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యానికి కేటాయించాలని బీసీ సామాజికవర్గం డిమాండ్ చేస్తోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి ♦ కొవ్వూరు కోసం టీడీపీ మాజీ మంత్రి జవహర్, జనసేన నుంచి మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు వర్గాలు కత్తులు దూసుకుంటున్నాయి. ♦ ఏలూరులో జనసేన నుంచి రెడ్డి అప్పలనాయుడు 2019 నుంచి పని చేస్తూండగా, ప్రస్తుతం 2024 ఎన్నికల్లో టికెట్ కోసం ఇద్దరు ముగ్గురు నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. చివరకు అప్పలనాయుడుకి టికెట్ ఇస్తారా లేదా అనేది ప్రశ్నార్థకమే. కాపు సామాజిక వర్గానికి చెందిన, వ్యాపారవేత్త నారా శేషు, మామిళ్ళపల్లి జయప్రకాష్ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. వీరిలో ఎవరికి టికెట్ ఇచ్చినా మరొకరు సహకరించే పరిస్థితి లేదు. టీడీపీ అభ్యర్థిగా బడేటి రాధాకృష్ణ (చంటి), ఇడా చైర్‌పర్సన్‌గా పని చేసిన మధ్యాహ్నపు ఈశ్వరి భర్త బలరాం టికెట్‌కు ప్రయత్నాలు సాగిస్తూ నువ్వా నేనా అన్నట్టు తలపడుతున్నారు. ♦ కైకలూరు నియోజకవర్గంలో టీడీపీ, జనసేనల పరిస్థితి ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంది. జనసేన నుంచి బీవీ రావు ఒకపక్క, కొల్లి వరప్రసాద్ మరోపక్క పోటీ పడుతున్నారు. కొల్లి మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌కు మద్దతు ఇస్తుంటే.. బీవీ రావు టీడీపీ నాయకులకు మద్దతుగా ఉన్నారు. జనసేన నాయకులను టీడీపీ నేతలు అసలు పట్టించుకోవడం లేదనే ఆవేదనతో ఇరు వర్గాలూ కత్తులు దూస్తున్నాయి. ♦ ఉంగుటూరు నియోజకవర్గంలో జనసేన నుంచి పశ్చమట్ల ధర్మరాజుకు టికెట్ ఇస్తారనే ప్రచారం జరుగుతుండగా, టీడీపీ నుంచి గన్ని వీరాంజనేయులు టికెట్ ఖాయమైందని ఆయన వర్గీయులు ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో రెండు పా ర్టీల మధ్య వైషమ్యాలు నేతలకు తలపోటుగా మారాయి. ♦ పోలవరం సీటు కోసం జనసేన నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన సిర్రా బాలరాజు మరోసారి టికెట్ ఆశిస్తుండగా, టీడీపీలో మాజీ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్, ప్రగడపల్లి కార్యదర్శి కొవ్వాసి జగదీశ్వరి టికెట్ ఆశిస్తున్నారు. ఇక్కడ కూడా సీట్ల సిగపట్లతో పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. ♦ దెందులూరు టికెట్ రేసులో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌తో టీడీపీ రాష్ట్ర సాధికారత చైర్మన్ అశోక్‌గౌడ్, ఈడ్పుగంటి శ్రీనివాస్ తలపడుతున్నారు. చింతమనేనికి వ్యతిరేకంగా ముఖ్య నేతలు చంద్రబాబును కలిసి టికెట్ ఇవ్వవద్దని ఫిర్యాదులు చేశారు. ఆ సామాజికవర్గం నుంచి ఈడ్పుగంటి శ్రీనుకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేయడంతో టీడీపీలో ఇరువర్గాల వైషమ్యాలూ ఆ పార్టీని రోడ్డున పడేశాయి. ♦ పాలకొల్లు సీటు టీడీపీకి కేటాయించనున్నారని ప్రచారం చేసుకుంటున్న సిటింగ్ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆ టికెట్ తనదేని అంటున్నారు. ఈ స్థానం టీడీపీని కాదని జనసేనకు కేటాయిస్తే నిమ్మల ఇండిపెండెంట్‌గా వెళ్లడం తప్పదని చెబుతున్నారు. ♦నూజివీడులో జనసేన నుంచి బర్మా ఫణిబాబు, టీడీపీ నుంచి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు పోటీ పడుతున్నారు. ♦ తణుకులో టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రా«ధాకృష్ణ, జనసేన నుంచి విడివాడ రామచంద్రరావు టికెట్ ఆశిస్తున్నారు. రామచంద్రరావుకు ఈసారి న్యాయం చేస్తానని, ఇతనే అభ్యర్థని పవన్‌కళ్యాణ్ హామీ ఇచ్చినట్టు బెబుతున్నారు. ఆమేరకు ఆయన ప్రచారం కూడా చేసుకుంటున్నారు. మరోవైపు ఎట్టిపరిస్థితుల్లో టికెట్ వదలబోమని టీడీపీ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ హడావుడి చేస్తోంది. ♦ నర్సాపురం టీడీపీలో మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, ప్రస్తుత ఇన్చార్జి పొత్తూరి రామరాజు, ఎన్నారై కొవ్వలి యతిరాజు రామ్మోహన్ నాయుడు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు పోటీ పడుతున్నారు. జనసేన నుంచి బొమ్మిడి నాయకర్‌కు టికెట్ ఖాయం అయ్యిందనే ప్రచారంతో టీడీపీ ఆశావహులు రోడ్డెక్కేందుకు సిద్ధంగా ఉన్నారు. ♦ తాడేపల్లిగూడెంలో టీడీపీ నుంచి వలవల మల్లికార్జునరావు (బాబ్జీ) రేసులో ఉంటే మరోపక్క ఈలి నాని కూడా టికెట్ తనదే అని ప్రచారం గట్టిగా చేసుకుంటుండటంతో విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఇక్కడ బలంగా ఉన్న జనసేనకే సీటు కేటాయించాలని ఇన్చార్జి బొలిశెట్టి శ్రీనివాస్ డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తమ సత్తా చూపిస్తామంటున్న పరిస్థితులు రెండు పా ర్టీలకూ మింగుడుపడటం లేదు. ♦ భీమవరం టీడీపీలో గ్రూపు రాజకీయాలు భగ్గుమంటున్నాయి. ఇక్కడ టీడీపీ ఇన్చార్జి తోట సీతారామలక్షి్మపై కేడర్‌లో తీవ్ర అసంతృప్తి ఉంది. పార్టీ పిలుపు మేరకు చేపట్టిన కార్యక్రమాలు కూడా మొక్కుబడిగా చేస్తున్న తోటను కాకుండా మెంటే పార్థసారథి, కోళ్ల నాగేశ్వరరావును ప్రతిపాదిస్తున్న పరిస్థితులు.. పా ర్టీలోని అంతర్గత విభేదాలను రోడ్డున పడేసే పరిస్థితి కనిపిçస్తోంది. ఇక్కడ జనసేన నుంచి పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ పోటీ చేసే అవకాశం ఉండటంతో ఆశావహులు దిక్కుతోచని స్థితిలో ప్రత్యామ్నాయ ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు. పవన్ కాకుంటే ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు (చినబాబు) కూడా రేసులో ఉన్నారు. జనసేన నుంచి ఎవరు బరిలోకి దిగినా మద్దతు ఇచ్చేది లేదని టీడీపీ నేతలు చెబుతున్నారు. ♦ఉండి సీటు కోసం జనసేన ఇన్చార్జి జుత్తిగ నాగరాజు గట్టిగా పట్టుబడుతుండగా.. టీడీపీకే ఇవ్వాలని ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు డిమాండ్ చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు వర్గం ఎమ్మెల్యే రామరాజుతో విభేదిస్తోంది. ఇక్కడ జనసేన, టీడీపీ పైకి ఐక్యతగా కనిపిస్తున్నా.. అంతర్గత విభేదాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. -
ఓం ప్రథమం... ఎదురైంది దుశ్శకునం
మనకున్నది బలం కాదు వాపని తేల్చేసిన నాయకులు కాకినాడ సమీక్షలో పవన్ కు షాకిచ్చిన క్యాడర్ టీడీపీతో కలిసి పని చేయలేమని స్పష్టీకరణ మాకు బాగా పట్టున్న జిల్లాలివి.. ఇక్కడ ఎంతటి కొమ్ములు తిరిగిన నాయకుడిని అయినా ఓడిస్తాం.. మేము దిగనంతవరకే.. దిగితే ఆట మారిపోతుందన్న భ్రమల్లో ఉన్న పవన్ కళ్యాణ్ కు ఇప్పుడిప్పుడే వాస్తవ పరిస్థితి అవగతం అవుతోంది. వెక్కిరించేవాళ్ల ముందరే కాలు జారిపడిపోయే పరిస్థితులు గోచరిస్తున్నాయి. గోదావరి జిల్లాల్లో పవన్ ప్రభంజనం.. తుపాను రాబోతోంది.. మొత్తం ఈస్ట్.. వెస్ట్.. పవన్ ఈజ్ బెస్ట్ అన్నట్లుగా ఊదరగొట్టిన జనసైనికులు జనసేన ప్రధాన నాయకులుగా చెప్పుకున్నవాళ్లకు గత రెండు రోజులుగా వాస్తవాలు అర్థం అవుతున్నాయి. జనాన్ని పోగేసి సభలు.. మీటింగులు పెట్టడం వేరు.. జనాన్ని తనవెంట నడిపించి వాళ్లతో ఓట్లు వేయించడం వేరు అన్నది అర్థం అర్థం అవుతోంది. కాకినాడ జిల్లాతో నియోజకవర్గం రివ్యూలు మొదలు పెట్టిన పవన్‌కు మొదట్లోనే గొంతులో అడ్డం పడిపోయింది. క్యాడర్ నుంచి.. ఓ మోస్తరు నాయకులవరకూ చెబుతున్న ఫీడ్ బ్యాక్ చూసి దిమ్మెత్తిపోయింది. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ను చెడ్డీ మీద కొట్టుకుంటూ నడిపిస్తాను అని అప్పట్లో వార్ణింగ్ ఇవ్వడం ఐతే ఇచ్చారు కానీ అక్కడ జనసేనకు అభ్యర్థే లేరు. కాపులు మొత్తం చంద్రశేఖర్ వెంట ఉండడంతో పవన్ తరఫున పోటీ చేసి చేతులు కాల్చుకునేందుకు అభ్యర్థి కరువయ్యారు. రెండు జిల్లాల్లోని మొత్తం 34 స్థానాల్లో జనసేన దాదాపు పాతికపైగా సీట్లు గెలుస్తుంది అని భ్రమల్లో ఉంటూవచ్చిన వారికి ఇప్పుడు పట్టుమని పదిమంది అభ్యర్థులు కనిపించడం లేదు. ఎదురులేదని చెప్పుకున్న ఈస్ట్, వెస్ట్ గోదావరిలోనే ఇలా ఉంటె మిగతా జిల్లాల్లో పరిస్థితి ఏమిటన్నది పార్టీ పెద్దలకు అంతుపట్టడం లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ టికెట్ రాదని తెలుసుకున్న జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కూడా జనసేనలో చేరారు. ఈ క్రమంలోనే పవన్‌తో సమీక్షకు హాజరయ్యారు. అయన కూడా గ్రామ స్థాయిలో పార్టీకి ఏమీ బలం లేదని.. ఉన్నదంతా వాపేనని తేల్చి చెప్పారు. దీంతోబాటు తెలుగుదేశం కోసం సీట్లు త్యాగం చేసే పరిస్థితి లేదని, అలాగని టీడీపీతో పొత్తు పెట్టుకున్నా ఆ పొత్తు కలవదని, నిలవదని ఓట్ల బదలాయింపు జరగదని తేల్చి చెప్పేసారు. రెండు పార్టీల పొత్తు పొసగదని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా జిల్లా.. మండల కార్యవర్గాలను ఎందుకు వేయలేదని పవన్ ప్రశ్నించగా.. మీరెళ్ళి చంద్రబాబుకు ఊడిగం చేస్తుంటే మేము పార్టీని ఎలా మోస్తాం.. మేమెలా నిర్ణయాలు తీసుకుంటాం అని ఎదురు ప్రశ్నించడంతో పవన్ నోట మాట రాలేదని తెలిసింది. చిత్తూరులో నాయకుల చిటపట ఇదిలాఉంటే శనివారం కుప్పం పర్యటనకు వెళ్లిన చంద్రబాబు జనసేన జిల్లా సమావేశానికి హయారయ్యారు. చంద్రబాబును సీఎం చేసేందుకు అందరం కష్టపడాలి అని పార్టీ జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్ చేసిన ప్రసంగం అక్కడ గలాటా రేపింది. కాసేపు ఉండి సమావేశం నుంచి చంద్రబాబు బయటకు వెళ్ళిపోగానే జనసైనికులు హరిప్రసాద్ మీద ప్రశ్నల దాడి చేశారు. చంద్రబాబుకు మనం ఎందుకు ఊడిగం చేయాలి.. మనం పవన్ కోసం కదా పని చేస్తున్నాం. మీరు అలా మాట్లాడితే ఎలా అంటూ కుప్పం జనసైనికులు ప్రశ్నించేసరికి హరిప్రసాద్ నిరుత్తరుడయ్యారు. అధికారంలో సైతం జనసేనకు వాటా ఇవ్వాల్సిందేనని, ఆలాగైతేనే పొత్తు ఉంటుందని జనసైనికులు తేల్చి చెప్పేసారు. - సిమ్మాదిరప్పన్న -
పుంజు భలే రంజుగా!
సాక్షి, భీమవరం: ఆంధ్రుల అతిపెద్ద పండుగ సంక్రాంతికి దాదాపు ఇంకా కొద్ది సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో సంక్రాంతి సందడిని తెచ్చే కోడి పందేలకు అప్పుడే తెర లేచింది. రాష్ట్రంలో కోస్తా జిల్లాల్లో ఏటా సంక్రాంతి పండుగ మూడు రోజులు పెద్ద ఎత్తున కోడి పందేలు నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు కోడి పందేలకు పెట్టింది పేరు. ప్రధానంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం, పరిసర ప్రాంతాల్లో నిర్వహించే కోడి పందేలను వీక్షించడానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు కూడా వస్తారంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలో కోడి పందేల నిర్వాహకులు తమ పుంజులను పందెం బరిలో నిలపడానికి సిద్ధం చేస్తున్నారు. కోడి పుంజుల ఎంపిక, వాటికి ప్రత్యేక శిక్షణ, మంచి పౌష్టికాహారం, శారీరక పటుత్వానికి ప్రత్యేక వ్యాయామాలు చేయిస్తూ పందెం బరిలో నిలపడానికి సై అంటున్నారు. మేత, శిక్షణ.. పెద్ద కసరత్తే ఏ వ్యక్తితో అయినా గొడవ పడి, కోపం వచ్చి నప్పుడు నిన్ను పందెం పుంజును మేపినట్టు మేపానని దెప్పడం గోదావరి జిల్లాల్లో సర్వసాధారణం. దీనినిబట్టి పందెం కోళ్లను ఇక్కడ ఏ విధంగా పెంచుతారో అర్థం చేసుకోవచ్చు. పది నిమిషాల పాటు ఉండే పందెం బరిలో ప్రత్యర్థి పుంజును మట్టికరిపించేందుకు కోళ్ల పెంపకందారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. సంక్రాంతికి మూడు నెలల ముందు నుంచే వాటికిచ్చే మేత, శిక్షణలో పెద్ద కసరత్తే చేస్తారు. పండుగ సమయంలో భీమవరం, కోనసీమ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కోడిపందేల కోలాహలమే కనిపిస్తుంది. ఆ మూడు రోజులు కోట్లాది రూపాయలు చేతులు మారతాయి. భీమవరం పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసే భారీ బరులు, గ్యాలరీలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. పందేలను చూడటానికి సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు భారీ ఎత్తున వస్తుంటారు. వారితో ముందుగానే హోటళ్లు, లాడ్జిలు నిండిపోతాయి. మటన్ నుంచి డ్రైప్రూట్స్ వరకు.. శిక్షణలో పుంజుకు శక్తి, సామర్థ్యం పెంచేందుకు, దాని శరీరంలో కొవ్వు చేరకుండా సులువుగా ఎగురుతూ ప్రత్యర్థిపై విరుచుకుపడేందుకు మూడు నెలలపాటు ప్రత్యేక మేతను అందిస్తారు. కోడి పరిమాణాన్ని బట్టి ఉదయం పూట 20 నుంచి 40 గ్రాముల వరకు ఉడకబెట్టిన మటన్, మూడు నుంచి ఐదు వరకు బాదం పప్పులు, రెండు వెల్లుల్లి, ఒక ఎండు ఖర్జూరం, ఉడికించిన కోడిగుడ్డు ముక్కలు పెడతారు. సాయంత్రం.. చోళ్లు, గంటులు, మెరికలు మొదలైన వాటిని ఆహారంగా అందిస్తారు. పుంజుకు నొప్పులు తగ్గేందుకు ప్రత్యేక శిక్షణ.. పండుగ దగ్గర పడుతున్నకొద్దీ పుంజు శరీరం గట్టిపడేందుకు, నొప్పులేమైనా ఉంటే తగ్గేందుకు ప్రత్యేక ట్రైనర్లతో నీళ్లపోతలు, శాఖలు చేయిస్తారు. ఇందుకు వేప, జామాయిల్, కుంకుడు, వెదురు, వాయిల తదితర ఆకులు, తుమ్మ బెరడు, తోక మిరియాలు, పసుపు కొమ్ములు తదితర 20 రకాల వాటిని నీటిలో వేసి గంటల కొద్దీ మరిగిస్తారు. ఈ ద్రావణాన్ని చిన్న తొట్టెలో కోడి తట్టుకునే వేడి వరకు చల్లార్చుతారు. ఆ తర్వాత అందులో పుంజును ఉంచి పైనుంచి ద్రావణం పోస్తూ వారం రోజుల వ్యవధిలో ఒకటి రెండుసార్లు నీళ్లపోతలు చేయిస్తారు. చివరిగా శాఖల కోసం పొయ్యిపై మూకుడిని వేడి చేస్తూ.. అందులో చీప్ లిక్కర్ చిమ్మినప్పుడు వచ్చిన ఆవిరిని మెత్తటి గుడ్డకు పట్టించి దాన్ని కోడి శరీరమంతా అద్దుతారు. వారానికి ఒకసారి చొప్పున, కొందరు.. రెండు మూడుసార్లు కూడా ఈ శాఖలు చేయిస్తుంటారు. ఏ ప్రక్రియ అయినా కోడి సామర్థ్యాన్ని బట్టి మూడు నుంచి ఐదు నిమిషాల పాటు ఉంటుంది. ఇవే కాకుండా పందెం పుంజు అనారోగ్యం, వైరస్ల బారిన పడకుండా తరచూ పశువైద్యుడిని తీసుకొచ్చి పరీక్షలు చేయిస్తారు. ఆయుర్వేద పద్ధతులను అనుసరించేవారూ ఉన్నారు. పందేలకు ముందు అలసిపోకుండా నాలుగైదు రోజుల ముందు నుంచి పుంజుకు పూర్తి విశ్రాంతిని ఇచ్చి మకాంలో కట్టేసి ఉంచుతారు. రూ.కోట్లలో వ్యాపారం మకాంల వద్ద పనిచేసే వారికి నెలకు రూ.15 వేలు నుంచి రూ.20 వేల వరకు జీతాలుంటాయి. ఒక్కొక్కరు 12 నుంచి 15 పుంజులను మాత్రమే పర్యవేక్షిస్తారు. నీళ్లపోతలు, శాఖల కోసం వచ్చే ట్రైనర్లు కొంత మొత్తం మాట్లాడుకుంటారు. ఇవికాకుండా కోడికి అందించే ప్రత్యేక మేత, మందులతో ఒక్కో పందెం పుంజును సిద్ధం చేసేందుకు మూడు నెలల్లో రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చవుతుంది. ఈ విధంగా పెంచిన పుంజులను వాటి రంగు, ఎత్తు, పోరాట పటిమను బట్టి రూ.50 వేల నుంచి లక్షల్లో అమ్ముతుంటారు. వీటిపై భారీస్థాయిలో పందేలు జరుగుతుంటాయి. మామూలుగా ఇళ్ల వద్ద పెంచిన పుంజులు రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు ఉంటాయి. పండుగల కోసం రెండు వేలకు పైగా పందెం కోళ్లు అమ్మకాలు జరుగుతుంటాయి. వీటి ద్వారా రూ.12 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుందని అంచనా. పండుగకు నెలరోజులు మాత్రమే గడువుండటంతో ఇప్పటికే భీమవరం, కోనసీమ ప్రాంతాల్లో పందెంకోళ్ల పెంపకం జోరుగా సాగుతోంది. పుంజుల ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ.. బరిలో ప్రత్యర్థి కోడిని ఓడించడమే లక్ష్యంగా పందెంరాయుళ్లు పుంజుల పెంపకంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. కొందరు తమ ఇళ్లు, చెరువులు, పొలాల వద్ద పుంజులను పెంచితే అధిక శాతం మంది నాటుకోళ్ల కేంద్రాల్లో పుంజులను కొనుగోలు చేసి వాటిని పందేలకు సిద్ధం చేసే పనిని పెంపకందారులకు అప్పగిస్తారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర నగరాలతో పాటు విదేశాల నుంచి సంక్రాంతికి స్వస్థలాలకు వచ్చే ఔత్సాహికులు ఆన్లైన్లో పుంజులను ఎంపిక చేసుకుని పెంపకందారులకు ముందుగానే అడ్వాన్స్‌లు చెల్లిస్తుండటం విశేషం. పందెం పుంజులకు ఉన్న డిమాండ్‌తో ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే 150కి పైగా నాటుకోళ్ల పెంపకం కేంద్రాలు ఉన్నట్టు అంచనా. కాకి, నెమలి, పచ్చకాకి, కేతువ, డేగ.. వివిధ రంగుల్లో కాకి, నెమలి, అబ్రాస్, డేగ, పచ్చకాకి, కేతువ తదితర జాతుల నుంచి రెండేళ్ల వయసు కలిగిన పుంజులను పందేలకు సిద్ధం చేస్తారు. ఎంపిక చేసుకున్న పుంజుకు పోరాట పటిమ, శరీర పటుత్వం, శక్తిని పెంచేందుకు మూడు నెలల ముందు నుంచి ఎవరికి వారు ఎన్నో సంప్రదాయ, ఆధునిక పద్ధతులు అవలంబిస్తారు. వాటికిచ్చే ఆహారం, మందుల నుంచి శిక్షణ వరకు ప్రతి విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. తాము ఎలా పెంచుతున్నది.. తమ పుంజు బలం, బలహీనత ఇతరులకు తెలియకుండా చాలా జాగ్రత్తలు పాటిస్తారు. పందెం పుంజు దినచర్య ఇలా.. ఉదయాన్నే పుంజును బయటకు తెచ్చి కొద్దిగా వేడి నీటిని పట్టిస్తారు. కాళ్లల్లో పటుత్వానికి, ఆయాసం రాకుండా ఉండేందుకు, అనారోగ్య సమస్యలుంటే గుర్తించేందుకు దాదాపు నెల పాటు రోజు విడిచి రోజు ఈత కొట్టిస్తారు. తదుపరి ప్రక్రియగా ‘వి’ ఆకారంలో నెట్లు కట్టి పుంజు అందులోనే తిరిగేలా బేటా (ని ర్ణీత పద్ధతిలో వాకింగ్) చేయిస్తారు. మరికొందరు ఖాళీ జాగాలో వాటి వెనుకే ఉండి తరుముతూ నడిచేలా చేస్తారు. కోడి నోటి నుంచి వచ్చే కఫాన్ని తొలగించి శుభ్రం చేయిస్తారు. తర్వాత మేత పెట్టి ఉదయం 11 గంటల వరకు ఎండలో కట్టేసిన తర్వాత మకాంలోకి మారుస్తారు. -
తుపాను బాధితులకు అండగా ఉండాలి
సాక్షి, అమరావతి/తిరుపతి అర్బన్/రాజమహేంద్రవరం: రాష్ట్రంలోని తుపాను ప్రభావిత జిల్లాల్లో కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ సాంకేతిక నిపుణుల బృందం గురువారం పర్యటించింది. బాపట్ల, పశ్చిమ, తూర్పు గోదావరి, తిరుపతి జిల్లాల్లో వర్షాల కారణంగా దెబ్బతిన్న ధాన్యాన్ని పరిశీలించి నమూనాలు సేకరించింది. శుక్రవారం మిగిలిన జిలా్లల్లో పర్యటన అనంతరం నమూనాలను విశ్లేషించి కేంద్రానికి నివేదిక పంపనుంది. పౌరసఫరాల శాఖ కమిషనర్ హెచ్.అరుణ్ కుమార్ సాక్షితో మాట్లాడుతూ.. కేంద్ర బృందం పరిశీలనలో వచ్చిన ఫలితాల ఆధారంగా ధాన్యం సేకరణలో ప్రత్యేక సడలింపులు కోరతామన్నారు. తద్వారా ధాన్యం రైతులకు ఎటువంటి తగ్గింపులు లేకుండా సంపూర్ణ మద్దతు ధర అందిస్తామన్నారు. ఆహార అవసరాలకు పనికిరాని ధాన్యాన్ని ఇథనాల్ ఉత్పత్తికి కోసం కొనుగోలు చేసేలా కేంద్రాన్ని కోరతామన్నారు. మిచాంగ్ తుపాను బాధితులకు అండగా ఉండాలంటూ గూడూరు, సూళ్లూరుపేట ఎమ్మెల్యేలు వెలగపల్లి వరప్రసాద్‌రావు, కిలివేటి సంజీవయ్య కేంద్రబృందాన్ని కోరారు. గురువారం తిరుపతి జిల్లాలోని గూడూరు, సూళ్లూరుపేట నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో తుపాను నష్టాన్ని కేంద్ర బృందం పరిశీలించింది. కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మీనా హోడాతో కూడిన బృందం ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రధానంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించింది. రాష్ట్రం నుంచి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేంద్ర రత్నూ, రోడ్డు, భవనాల మంత్రిత్వశాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ రాకే‹Ùకుమార్, ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ పెంచల కిశోర్, ఆర్డీఓలు కిరణ్‌కుమార్, చంద్రముని తుపానుతో దెబ్బతిన్న ప్రాంతాలను తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన సాయాన్ని ముంపు ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు, భోజన వసతుల గురించి వివరించారు. ఒక్కో వ్యక్తికి రూ.1,000, కుటుంబానికి రూ.2500 ఇవ్వడమే కాకుండా నిత్యావసర సరకులను అందించామని వివరించారు. పెద్ద ఎత్తున ఆస్తుల నష్టం జరిగినా, ప్రాణ నష్టం లేకుండా పటిష్ఠ చర్యలు చేపట్టినట్టు స్పష్టం చేశారు. విద్యుత్, రోడ్లు, ఇరిగేషన్, మత్స్యశాఖ, పంచాయతీరాజ్‌లకు తీవ్రమైన నష్టం జరిగినట్లు తెలియజేశారు. స్థానిక రైతులు, అధికారులు, ఎమ్మెల్యేలు చెప్పిన అన్ని అంశాలను కేంద్ర బృందం నమోదు చేసుకుంది. ఆ మేరకు కేంద్రానికి నష్టాల నివేదికను సమర్పించి అందరికి పూర్తిస్థాయిలో సాయం చేసేలా కృషి చేస్తామని తెలిపింది. ఉమ్మడి తూర్పు గోదావరిలో.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని మిచాంగ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందాలు గురువారం పర్యటించాయి. తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం, సంగాయగూడెం, కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కాకరాపల్లి, కేఈ చిన్నయ్యపాలెం, కోటనందూరు, అల్లిపూడి, తొండంగి మండలం ఎ.కొత్తపల్లి, రావికంపాడు, పీఈ చిన్నాయపాలెం, ఏవీ నగరం, గొల్లప్రోలు మండలం మల్లవరం, కొత్తపల్లి మండలం రమణక్కపేట, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం అనాతవరం గ్రామాల్లో తుపానుకు దెబ్బ తిన్న వరి, అరటి తదితర ఉద్యాన పంటలు, ఇళ్లను బృందం అధికారులు పరిశీలించారు. రైతులు, బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. నష్టాల వివరాలు నమోదు చేశారు. పలు ప్రాంతాల్లో ధాన్యం నమూనాలు సేకరించారు. తుపాను నష్టాలపై కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేస్తామని కేంద్ర బృందం తెలిపింది. -
తెరమరుగవుతున్న గోదారి
సాక్షి డెస్్క, రాజమహేంద్రవరం: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఒకప్పుడు ఏదో ఒకచోట తరచుగా సినిమా షూటింగులు జరుగుతుండేవి. ఆ పరిసరాల ప్రజలకు కొన్నాళ్ల పాటు ఇదే ముచ్చటగా ఉండేది. కమెడియన్‌ను చూశామనో.. విలన్‌ను పలకరించామనో.. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉండేవారు. ఇప్పుడిది గత వైభవంగా మిగిలిపోతోంది. వెండితెరపై నాడు విరిసిన జిల్లా అందాలు నేడు అంతగా కనిపించడం లేదు. సహజసిద్ధ స్టూడియోగా పేరు సంపాదించిన ఇక్కడి ప్రకృతి అందాలు ఇప్పుడు చిన్నబోతున్నాయి. వ్యయ ప్రయాసలకు భయపడి నిర్మాతలు ఔట్‌డోర్ షూటింగులకు చాప చుట్టేయడమే ఇందుకు కారణంగా నిలుస్తోంది. ఎందుకిలా అయిందంటే.. చాలా రంగాలను ప్రభావితం చేసిన ఆధునిక సాంకేతికత సినిమాను కూడా తాకింది. గతంలో మాదిరిగా ఆర్టిస్టులందరినీ లొకేషనుకు తీసుకువెళ్లే రోజులు పోయాయి. అందరినీ తీసుకుని వెళ్లాలంటే బస, రవాణా వంటి ఖర్చులతో చాలా బడ్జెట్ అయ్యేది. ఇప్పుడు నిర్మాతలు ఈ విషయంలో పొదుపు పాటిస్తున్నారు. పాత రోజుల్లో సినిమా తీస్తూంటే మొత్తం ఆరి్టస్టులందరూ వచ్చేవారు. ఈ వ్యయం నిర్మాతలకు చాలా భారమయ్యేది. దీనికి తోడు ఎక్కువ సినిమా కథల నేపథ్యం పట్టణాలతో, నగరాలతో ముడిపడి ఉంటోంది. పల్లె కథలు తగ్గిపోతున్నాయి. 90 ఏళ్ల క్రితమే స్టూడియో సుమారు 90 ఏళ్ల క్రితమే జిల్లాలో సినిమా షూటింగులకు స్టూడియో ఏర్పాటైంది. 1936లో నిడమర్తి దుర్గయ్య ధవళేశ్వరం వద్ద 12 ఎకరాల విస్తీర్ణంలో దుర్గా మూవీ టోన్ స్టూడియో నిర్మించారు. చల్‌మోహన్‌రంగా వంటి చిత్రాలు ఇక్కడ తీశారు. ఆరేళ్ల తర్వాత ఆర్థిక ఇబ్బందులతో ఇది మూత పడింది. కానీ జిల్లాలో షూటింగులు మాత్రం కొనసాగాయి. జిల్లా నుంచి ఎందరికో చాన్స్ జిల్లాలో సినిమా షూటింగుల ప్రభావం ఫలితంగా చాలామంది ఈ రంగానికి వెళ్లాలని ఉత్సాహపడేవారు. దర్శక నిర్మాతలు తరచూ వస్తూండటంతో ఉమ్మడి జిల్లాలోని ఎంతోమంది ఔత్సాహికులకు సినిమా చాన్సులు దక్కాయి. అంజలీదేవి, జయప్రద, సుకన్య, జరీనా వహాబ్, వహీదా రెహమాన్, లలితారాణి వంటి వారు హీరోయిన్లుగా వెలుగొందారు. ఈ జిల్లా నుంచే చెన్నై వెళ్లిన భానుప్రియ మీద కూడా జిల్లాలో జరిగిన సినిమా షూటింగుల ప్రభావమే ఉంది. బాల నటుడిగా ఆలీకి అవకాశమొస్తే ఇప్పుడు అగ్రశ్రేణి కామెడీ నటుడయ్యారు. ఆయనకు ముందు రాజబాబు కూడా కామెడీలో రాణించారు. రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లో టికెట్ కలెక్టర్‌గా పని చేసిన రంగనాథ్ ఇక్కడి నుంచే సినిమా రంగంలోకి అడుగు పెట్టారు. ఆదుర్తి సుబ్బారావు, క్రాంతికుమార్, వంశీ, కాశీ విశ్వనాథ్, బాపు, శోభన్, ఎస్వీ కృష్ణారెడ్డి, సుకుమార్ నుంచి మేజర్ డైరెక్టర్ శశికిరణ్ తిక్కా వరకూ ఎందరో ఈ ప్రాంత వాసులు దర్శకులయ్యారు. నట వర్గం గురించి చెప్పుకుంటే జిల్లాకు చెందిన చాలామంది వెండితెరపై బలమైన ముద్ర వేసుకుంటున్నారు. నెమ్మది నెమ్మదిగా షూటింగులు తగ్గిపోవడంతో సినిమాల్లో జిల్లా ప్రాతినిధ్యం కూడా పలుచబడిందనే చెప్పాలి. ఆదుర్తి నుంచి వంశీ వరకూ.. గోదావరి అందాలను పూర్తి స్థాయిలో వెండితెరకెక్కించిన ఘనత రాజమహేంద్రవరానికి చెందిన ప్రఖ్యాత దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుకు దక్కుతుంది. 1963లో ఆయన తీసిన మూగమనసులు గోదావరి నేపథ్యంలోనే సాగింది. ఈ సినిమా హిట్ కావడంతో తర్వాత ఏదో ఒక విధంగా వెండితెరపై గోదావరి కనువిందు చేస్తూ వచ్చింది. 1963లో దర్శకుడు బాపు సాక్షి సినిమాకు జిల్లాలో ఎక్కువ లొకేషన్లు ఎంపిక చేసుకున్నారు. కృష్ణ హీరోగా నటించిన తొలి చిత్రమిది. 1969లో బుద్ధిమంతుడు, 1973లో అందాల రాముడు తీశారు. మూగమనసులు సినిమాతో గోదావరితో పరిచయమేర్పడిన కె.విశ్వనాథ్‌కు ఈ నదీ తీర ప్రాంతాల్లో షూటింగ్ అంటే ఎంతో ఇష్టం. 1973లో శారద సినిమాను గోదావరి పరిసరాల్లోనే నిర్మించారు. అక్కడి నుంచి వరుసగా తన చిత్రాలన్నింటిలోనూ గోదావరి అందాలను విశ్వనాథ్ తెరకెక్కించారు. దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు, బాలచందర్ సహా ఎందరో దర్శకులు పోటీ పడి మరీ గోదావరి జిల్లాలో చిత్రాలను నిర్మించారు. దేశంలోని ఇతర భాషా చిత్రాల షూటింగులకు కూడా మన ఉమ్మడి జిల్లా వేదికగా నిలిచింది. వంశీ కేరాఫ్ గోదావరి రాయవరం మండలం పసలపూడికి చెందిన సుప్రసిద్ధ దర్శకుడు వంశీకి గోదావరి అంటే ప్రాణం. అందుకే ఆయన చిత్రాల్లో గోదావరి అందాలే కాదు భాష, యాస కూడా కనిపిస్తూ మనసును గిలిగింతలు పెడతాయి. కనకమహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్ సినిమా పూర్తిగా గోదావరి ప్రాంతంతో ముడిపడిన వినోదభరిత చిత్రం. గోదావరి లేకుండా ఆయన ఏ సినిమా తీయలేదేమో అనిపించేలా జిల్లా లొకేషన్లన్నీ చూపించారాయన. -
ధర వరించేలా!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ధాన్యం కోతలు ప్రారంభమయ్యాయి. దిగుబడులు సైతం ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో నవంబర్ మొదటి వారం నుంచి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. దీంతో రైతులకు సంపూర్ణ మద్దతు ధర కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం 3,500 ఆర్బీకే క్లస్టర్లలో ధాన్యం కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఆర్బీకేల్లో ఈ–క్రాప్ సోషల్ ఆడిట్ పూర్తయిన వెంటనే షెడ్యూల్ ఇచ్చి రైతుల నుంచి ధాన్యం సేకరించనుంది. ఏ–గ్రేడ్ ధాన్యం క్వింటాల్‌కు రూ.2,203, సాధారణ రకానికి రూ.2,183 చొప్పున మద్దతు ధర చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈసారి జిల్లాలకు ఎటువంటి లక్ష్యం నిర్ధేశించకుండా ఎంత ధాన్యం వచ్చినా కొనుగోలు చేసేలా ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. మార్కెట్లోనూ మంచి ధర ఖరీఫ్‌లో 67.43 లక్షల టన్నుల ధాన్యం వస్తుందని వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ఇందులో 50 శాతం వరకు ఏ–గ్రేడ్ (ఫైన్ వెరైటీలు) ఉండటం విశేషం. వీటికి బహిరంగ మార్కెట్లో మంచి ధర లభిస్తుంది. ఇప్పటికే గోదావరి జిల్లాల్లో పంజాబ్ రైస్–126 రకాన్ని ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. మొత్తం దిగుబడుల్లో విత్తనాలకు, గృహ అవసరాలతోపాటు బహిరంగ మార్కెట్లో విక్రయిస్తుండగా.. 50–60 శాతం ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. కాగా.. అంతర్జాతీయ మార్కెట్లో బియ్యానికి డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలోనే ఫైన్ వెరైటీలతోపాటు సాధారణ ధాన్యం రకాలను కూడా వ్యాపారులు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక్కడ ప్రభుత్వం రైతులకు పారదర్శకంగా సంపూర్ణ మద్దతు ధర అందించడంతో పాటు ఆరి్థక భారాన్ని తగ్గిస్తూ రవాణా, హమాలీ, గన్నీ చార్జీల కింద టన్నుకు రూ.2,523 అందిస్తోంది. తద్వారా బయటి వ్యాపారులు తమకు కావాల్సిన ధాన్యాన్ని మద్దతు ధర కంటే ఎక్కువ ఇచ్చి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. పకడ్బందీగా రవాణా ఏర్పాట్లు రవాణా శాఖ, లారీ ఓనర్స్ అసోసియేషన్ల సమన్వయంతో జాప్యం లేకుండా కళ్లాల్లోని ధాన్యాన్ని తరలించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రతి ఆర్బీకే పరిధిలో 10–15 వాహనాలకు జీపీఎస్ పరికరాలను అమర్చి ధాన్యం రవాణాను పర్యవేక్షించనున్నారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు, కాకినాడ, కృష్ణా జిల్లాల్లో నవంబర్ తొలి రెండు వారాల్లో ధాన్యం అధికంగా వచ్చే అవకాశం ఉంది. మూడవ వారంలో ఎన్టీఆర్, నాలుగో వారంలో పార్వతీపురం మన్యం, చివరి వారంలో శ్రీకాకుళం, విజయనగరంలో పంట వస్తుందని అంచనా వేస్తున్నారు. డిసెంబర్ మొదటి రెండు వారాల్లో విశాఖపట్నం, అనకాపల్లితో పాటు డిసెంబర్ నెలాఖరు నుంచి పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, కడప జిల్లాల్లో కొనుగోళ్లు ఊపందుకోనున్నాయి. చాలా ప్రాంతాల్లో లేట్ ఖరీఫ్‌తో కోతలు ఆలస్యం అవుతున్నాయి. దళారులతో పని లేకుండా.. ధాన్యం సేకరణలో ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. దళారీ వ్యవస్థను రూపుమాపి చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. మిల్లర్ల ప్రమేయం లేకుండా పకడ్బందీ చర్యలు చేపడుతోంది. 21 రోజుల్లోనే మద్దతు ధర జమ చేసేలా ఏర్పాట్లు చేపట్టింది. ఈ క్రమంలోనే ధాన్యం కొనుగోళ్లలో నిబంధనలను వివరిస్తూ రైతుల్లో చైతన్యం తీసుకొస్తోంది. రైతులు ఆర్బీకేలో ధాన్యం ఇచ్చిన తర్వాత ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ (ఎఫ్‌టీవో) వచ్చేలా ఏర్పాట్లు చేసింది. అందులో ధాన్యం వివరాలు, ప్రభుత్వం నుంచి వచ్చే మద్దతు ధర నమోదై ఉంటాయి. ఎఫ్‌టీవో జనరేట్ అయితే రైతుకు, ధాన్యానికి సంబంధం ఉండదు. పూర్తి మద్దతు ధర ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. రవాణా, దిగుమతి, మిల్లర్‌కు సరుకు వచ్చినట్టు ఇచ్చే క్లియరెన్స్‌ను మిల్లుల వద్ద ప్రభుత్వం నియమించే కస్టోడియన్ (డిప్యూటీ తహసీల్దార్ స్థాయి) అధికారులు చూసుకుంటారు. తేమ, ఇతర నాణ్యత విషయంలో ఆర్బీకేలో ధ్రువీకరించిన ప్రమాణాలను మిల్లరు ఫైనల్‌గా పరిగణించాల్సిందే. రైతులకు మిల్లర్ నుంచి ఎటువంటి ఒత్తిడి/డిమాండ్ వచ్చినా ప్రభుత్వ కాల్‌సెంటర్ 1967కు సంప్రదిస్తే వెంటనే చర్యలు చేపట్టేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కొనుగోళ్లకు సిద్ధం గోదావరి జిల్లాల్లో కోతలు మొదలయ్యాయి. వచ్చే వారంలో 150 ఆర్బీకేల్లో పంట కొనుగోళ్లు ప్రారంభమవుతాయి. ఇప్పటికే కోతలు పూర్తయిన చోట రైతులు పంటను ఆరబెడుతున్నారు. మార్కెట్లో ధాన్యానికి గిరాకీ పెరుగుతోంది. అందుకే గోదావరి జిల్లాల్లో ఫైన్ వెరైటీలతో పాటు సాధారణ రకాలను కూడా ప్రైవేటు వ్యాపారులు మంచి ధరకు కొంటున్నట్టు తెలుస్తోంది. రైతుకు పూర్తి మద్దతు ధర అంటే ఎక్కువ రేటు తీసుకురావడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోంది. పెద్ద మిల్లుల్లో ధాన్యం ఆరబోతకు డ్రయర్లు పెట్టేలా ప్రోత్సహిస్తున్నాం. తొలుత వంద మిల్లుల్లో పెట్టాలని కోరాం. – జి.వీరపాండియన్, ఎండీ, పౌర సరఫరాల సంస్థ ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత పంట ఉత్పత్తులు బాగుండటంతో మార్కెట్లో ధర కూడా బాగా పలుకుతోంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ఎంత ధాన్యం వచ్చినా తీసుకుంటాం. రైతులు ఆర్బీకేల్లో ధాన్యం ఇచ్చిన తర్వాత పూర్తి బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుంది. ఆర్బీకేల వారీగా అవసరమైన సంచులను అందుబాటులో ఉంచాం. సీఎంఆర్ కేటాయించిన ప్రకారం మిల్లర్లు సంచులు అందిస్తారు. ధాన్యం రవాణా కోసం ముందస్తుగానే వాహనాలను రిజిస్ట్రేషన్ చేశాం. – హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్, పౌర సరఫరాల శాఖ మద్దతు ధరల చెల్లింపు ఇలా.. ఏ–గ్రేడ్ ధాన్యం: రూ.2,203 (క్వింటాల్‌కు) రవాణా, హమాలీ, గన్నీ చార్జీలు:రూ.2,523 (టన్నుకు) సాధారణ రకాలకురూ.2,183 (క్వింటాల్‌కు) -
కొబ్బరికి మహర్దశ
సాక్షి అమలాపురం: ఒకవైపు పరిశ్రమల లోటు తీర్చడం.. మరోవైపు స్థానికంగా పండే పంటలను ఉప ఉత్పత్తులుగా తయారు చేస్తే రైతుకు లాభసాటి ధర వస్తుందనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు రైతుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఉమ్మడి ఉభయ గోదావరిజిల్లాల్లో వరి తరువాత అతి పెద్ద సాగు కొబ్బరి. దశాబ్దాల కాలం నుంచి సాగవుతున్నా.. వీటి విలువ ఆధారిత పరిశ్రమలు స్థానికంగా లేకపోవడంతో కొబ్బరి మార్కెట్ తరచు ఒడుదొడుకులకు లోనవుతోంది. రాష్ట్రంలో సుమారు మూడులక్షల ఎకరాల్లో కొబ్బరి సాగవుతుండగా.. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోనే 1.78 లక్షల ఎకరాల్లో సాగులో ఉంది. దీన్లో ఒక్క డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోనే సుమారు 1.10 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగవుతోంది. గోదావరి జిల్లాలోనే ఏడాదికి 124.72 కోట్ల కాయల దిగుబడి వస్తున్నట్లు అంచనా. ఇంత పెద్ద దిగుబడి వస్తున్నా తరచు కొబ్బరి సంక్షోభంలో కూరుకుపోవడాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక జిల్లా.. ఒక ఉత్పత్తి (వన్ డి్రస్టిక్ట్.. వన్ ప్రొడక్ట్)కు కొబ్బరిని ఎంపిక చేసింది. ఈ పథకం కింద జిల్లాలో ఏయే పరిశ్రమలు ఏర్పాటు చేయాలనేదానిపై జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఒక జిల్లా.. ఒక ఉత్పత్తి ప్రోత్సాహంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇన్వెస్ట్ ఇండియా బృందం గురువారం డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిలా్లలో క్షేత్రస్థాయిలో పర్యటించనుంది. హరిప్రీత్ సింగ్ నేతృత్వంలోని బృందం సభ్యులు ముమ్మిడివరం వద్ద ఉన్న వర్జిన్ కోకోనట్ ఆయిల్ యూనిట్‌ను, పేరూరులో మహిళా స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీల) ఆధ్వర్యంలోని కొబ్బరి తాడు పరిశ్రమను, మామిడికుదురు మండలం పాశర్లపూడిలో క్వాయర్ బొమ్మల దుకాణం, క్వాయర్ మాట్ యూనిట్, చీపుర్ల యూనిట్, కోప్రా యూనిట్, చార్కోల్ యూనిట్లను సందర్శించనున్నారు. ఉద్యానశాఖతోపాటు జిల్లా పరిశ్రమలశాఖ, డీఆర్డీఏ, కేవీఐబీ, హ్యాండ్లూమ్ అధికారులు వారికి జిల్లాలో కొబ్బరి పరిశ్రమల అవసరాన్ని, అవకాశాలను వివరించనున్నారు. వందకుపైగా ఉప ఉత్పత్తులు కొబ్బరి నుంచి వందకుపైగా ఉప ఉత్పత్తులను తయారు చేసే అవకాశం ఉంది. కానీ ఉమ్మడి గోదావరి జిల్లాల్లో చెప్పుకొనే స్థాయిలో పెద్ద పరిశ్రమలు లేవు. ఒకటి రెండు ఉన్నా అవి కేవలం క్వాయర్ పరిశ్రమలు మాత్రమే. ఇక్కడ పలు రకాల ఉత్పత్తులను తయారు చేసే పరిశ్రమలను ఏర్పాటు చేయవచ్చని ప్రణాళిక సిద్ధం చేశారు. పరిశ్రమలు ఏర్పాటైతే స్థానికంగా యువతతోపాటు మహిళా స్వయంశక్తి సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు అధికంగా మేలు జరుగుతుంది. కొబ్బరికి స్థానికంగా డిమాండ్ పెరిగి మంచి ధర లభిస్తుందని రైతులు ఆశిస్తున్నారు. -
వలంటీర్లే ‘రక్షణ’ కవచాలు
సాక్షి అమలాపురం: తమ వ్యవస్థపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు సేవలతోనే వలంటీర్లు బదులిస్తున్నారు. ప్రమాదకరంగా ప్రవహిస్తున్న గోదావరి ఏటిగట్లు తెంచుకుని ఊళ్లపై పడిపోకుండా తీసుకునే రక్షణ చర్యల్లో వారు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఏటిగట్లను రేయింబవళ్లు పర్యవేక్షిస్తూ ప్రజల ప్రాణాలకు రక్షణ కవచంగా నిలుస్తున్నారు. గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తున్నపుడు ఏటిగట్ల రక్షణ చాలా ముఖ్యం. ఆ ఏటిగట్లకు గండ్లు పడి ప్రాణ, ఆస్తి నష్టాలు భారీగా సంభవించిన సందర్భాలు గోదావరి జిల్లాల్లో గతంలో ఎన్నో ఉన్నాయి. వరదల సమయంలో ఉమ్మడి గోదావరి జిల్లాల్లో 534.73 కి.మీల పొడవునా ఉన్న ఏటిగట్ల పరిరక్షణ గతంలో ప్రభుత్వ యంత్రాంగానికి తలకుమించిన భారంగా ఉండేది. తక్కువ మంది సిబ్బంది ఉండటంతో ఇంత పొడవున ఏటిగట్లను పర్యవేక్షించడం సాధ్యం అయ్యేది కాదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వందలాది మంది వలంటీర్లు ఏటిగట్లను పర్యవేక్షిస్తూ పైఅధికారులకు నిరంతరం సమాచారం అందిస్తున్నారు. సమాచారం తక్షణం చేరవేత గత ఏడాది భారీ వరదలకు రాజోలులోని నున్నవారిబాడవ వద్ద గట్టు దాటి నీరు ప్రవహిస్తున్న విషయాన్ని తొలిసారిగా గుర్తించింది వలంటీర్లే. వారిచ్చిన సమాచారంతో అధికారులు వేగంగా రక్షణ చర్యలు చేపట్టడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. ఈ అనుభవాల దృష్ట్యా ఈ ఏడాది కూడా ఏటిగట్ల పర్యవేక్షణ బాధ్యతలను 740 మంది వలంటీర్లకు అప్పగించారు. ప్రతి అర కిలో మీటర్‌కు ఒక వలంటీర్‌ను నియమించారు. వీరు ఏటిగట్ల వద్ద రేయింబవళ్లు కాపలాగా ఉంటూ వరద ఉద్ధృతి, గట్ల పటిష్టతకు సంబంధించిన సమాచారాన్ని నిరంతరం పైఅధికారులకు అందిస్తున్నారు. ముంపు గ్రామాల్లో సేవలు ఏటిగట్ల పర్యవేక్షణ ఒక్కటే కాకుండా వరద ముంపుబారిన పడిన లంక గ్రామాల్లో వలంటీర్లు పలు రకాల సేవలందిస్తున్నారు. ముంపు బాధితులను గుర్తించి, బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించడంలో సహాయపడుతున్నారు. వారికి భోజన సదుపాయల కల్పన, నిత్యావసర వస్తువుల పంపిణీ విషయంలో చొరవ చూపుతున్నారు. పి.గన్నవరం, మామిడికుదురు, ముమ్మిడివరం, అయినవిల్లి వంటి వరద ప్రభావం అధికంగా ఉన్న మండలాల్లోని లంక గ్రామాల్లో వీరు చురుగ్గా సేవలందిస్తున్నారు. కష్టసమయంలో ఆసరాగా నిలబడి ప్రజల మన్ననలు పొందుతున్నారు. నాడు తక్కువగా సిబ్బంది గతంలో గోదావరి వరద సమయంలో ధవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన తరువాత ఇరిగేషన్ అధికారులకు రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు సహాయంగా ఉండేవారు. ఒక హెడ్‌వర్క్స్ ఏఈ తన పరిధిలో సుమారు 10 నుంచి 15 కి.మీ.ల పొడవున ఏటిగట్టు బాధ్యత చూసేవారు. వీరికి లష్కర్లు సహాయం అందించేవారు. ఇరిగేషన్ శాఖలో కొన్నేళ్లుగా లష్కర్ల కొరత ఉంది. అప్పట్లో ఏటిగట్లకు కన్నాలు పడినా, కుంగిపోయినా, గండ్లు పడే అత్యవసర సమయాల్లో సమాచారం ఉన్నతాధికారులకు చేరడంలో ఆలస్యమయ్యేది. ఈ కారణంగానే 2006 గోదావరి వరదలకు అయినవిల్లి మండలం శానపల్లిలంక, పి.గన్నవరం మండలం మొండెపులంక వద్ద ఏటిగట్లకు గండ్లు పడి స్థానికులు పెద్దఎత్తున నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. నిరంతరం అప్రమత్తంగా.. గోదావరి ఏటిగట్ల వద్ద వలంటీర్లు నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు వారి పరిధిలోని ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తున్నారు. గతేడాది వారిచ్చిన సమాచారంతో పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టారు. ఈ ఏడాది కూడా వారు పర్యవేక్షణ పనిలో నిమగ్నమయ్యారు. – పువ్వాడ విజయ్ థామస్, డీడీవో, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా -
గోదావరి జిల్లాలకు రూ.12 కోట్ల అత్యవసర నిధులు
సాక్షి, అమరావతి: తీవ్ర వర్షాలు, వరదలతో ప్రభావితమైన గోదావరి జిల్లాలకు అత్యవసర సహాయక చర్యల కోసం రూ. 12 కోట్లు నిధులు మంజూరు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అల్లూరి జిల్లా, కోనసీమ, ఏలూరు జిల్లాలకు 3 కోట్ల చొప్పున.. పశ్చిమ గోదావరికి రూ.2 కోట్లు.. తూర్పుగోదావరి కోటి.. మొత్తం 12 కోట్లు నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు రెవెన్యూ (డిజాస్టర్ మేనేజ్మెంట్) స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.సాయిప్రసాద్ పేరిట జీవో విడుదలయ్యింది. అత్యవసర సహాయక కేంద్రాల ఏర్పాటుకు, ముంపు గ్రామాల నుంచి ప్రజలను తరలించేందుకు, వరద బాధితులకు ఆహారం, నీరు, పాలు అందించేందుకు.. అలాగే హెల్త్ క్యాంపు నిర్వాహణతో పాటు శానిటేషన్ కోసం ఈ నిధులు మంజూరు చేసినట్లు ప్రభుత్వం తరపున ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అంతా సిద్ధం తాడేపల్లి: గోదావరి వరద ఉధృతి మరో రెండు రోజులు కొనసాగే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నివారణ సంస్ధ డైరెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వెల్లడించారు. ‘‘ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఇంకా రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. బ్యారేజ్ నుంచి 13.63 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నాం. గోదావరి వరద ప్రభావం తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఎఎస్ఆర్ , కోనసీమ, ఏలూరు జిల్లాలలో ఎక్కువగా ఉంది. అల్లూరి జిల్లాలో ఐదు మండలాలలో 155 గ్రామాలు, ఏలూరు జిల్లాలోని మూడు మండలాలలో 49 గ్రామాలు, కోనసీమలో 20 మండలాలలో 141 గ్రామాలు, తూర్పుగోదావరి జిల్లాలో ఎనిమిది మండలాలలో 47 గ్రామాలు, పశ్చిమగోదావరి జిల్లాలో నాలుగు మండలాలు, 17 గ్రామాలపై గోదావరి వరద ప్రభావం ఉంది. వరద ప్రభావిత సహాయ చర్యలకోసం సీఎం జగన్ రూ. 12 కోట్లు మంజూరు చేశారు. గోదావరి వరద ప్రభావిత మండలాలలో, జిల్లాలలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం. ఈ రోజు సాయంత్రానికి భద్రాచలంలో గోదావర వరద పెరిగే అవకాశాలున్నాయి. ఈనెల 30 నుంచి గోదావరి వరద తగ్గుముఖం పడుతుందని అంచనా వేస్తున్నాం. వరద సహాయక చర్యలలో జిల్లా యంత్రాంగం నిమగ్నమై ఉంది. వరద సహాయక చర్యల కోసం మూడు NDRF, నాలుగు SDRF బృందాలు పనిచేస్తున్నాయి అని వెల్లడించారాయన. -
కోనసీమ నుంచి తమిళ సీమకు.. అరటిపండ్లలో ఈ అరటి వేరయా..!
‘అరటిపండ్లలో ఎర్ర చక్కెరకేళి అరటి వేరయా..’ అంటారు పండించే రైతులు, వైద్యనిపుణులు. సాధారణ అరటి కన్నా మిన్నగా అరుదైన పోషకాలు ఉండే ఈ పండును ఆరోగ్యదాయినిగా భావిస్తారు. పండించే రైతుకు నిలకడైన ఆదాయాన్ని అందించే ఈ రకం అరటికి చెన్నై మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. గోదావరి లంకల్లో పండే ఈ రకం అరటి తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు ఎగుమతి అవుతోంది. ఈ ఎగుమతుల విలువ ఏటా కోట్లలో ఉంటోంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం పరిధిలో ఎర్ర చక్కెరకేళి సాగు అధికం. కొత్తపేట, ఆత్రేయపురం, రావులపాలెం, అలమూరుతో పాటు అయినవిల్లి, అంబాజీపేట మండలాల్లో ఈ రకం పంటను సాగుచేస్తారు. తూర్పు గోదావరి జిల్లా పెరవలి, పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ, తణుకు ప్రాంతాల్లో కూడా ఈ రకం అరటి సాగు ఎక్కువే. ఈ మూడు జిల్లాల్లో సుమారు రెండువేల ఎకరాల్లో ఈ పంట సాగవుతోందని అంచనా. ఎకరాకు 700 నుంచి 800 చెట్ల వరకు పెంచుతారు. అధికంగా గోదావరి లంక భూముల్లో ఈ పంటను సాగుచేస్తారు. ఇక మైదాన ప్రాంతంలోని కొబ్బరి తోటల్లో అంతరపంటగా కూడా వేస్తారు. – సాక్షి, అమలాపురం ధర ఘనం ఎర్ర చక్కెరకేళి అరటిపండుకు మంచి డిమాండ్ ఉంది. దీని గెల ధర ఏడాదిలో సగటున రూ.350 వరకు ఉంటోంది. డిమాండ్ అధికంగా ఉన్నప్పుడు రూ.400 నుంచి రూ.500 వరకు పలుకుతోంది. ప్రస్తుతం రావులపాలెం మార్కెట్లో గెల సైజును బట్టి రూ.200 నుంచి రూ.500 వరకు ధర ఉంది. అప్పుడప్పుడు ధరలు నేల చూపులు చూసినా సీజన్లో ఢోకా ఉండదని చెబుతున్నారు. కర్పూరం, చక్కెరకేళి, అమృతపాణి వంటి రకాలతో పోలిస్తే ఎర్ర చక్కెరకేళీకి నిలకడైన ధర ఉంటోంది. రావులపాలెం కేంద్రంగా.. ఈ మూడు జిల్లాల్లో పండే అరటిపంటను రావులపాలెం మార్కెట్ యార్డు నుంచి ఎగుమతి చేస్తుంటారు. ఇక్కడి నుంచే ఎర్ర చక్కెరకేళి అధికంగా తమిళనాడు, తక్కువ మొత్తంలో కేరళకు ఎగుమతి అవుతోంది. సాధారణంగా ఫిబ్రవరిలో మొదలయ్యే సీజన్ ఆగస్ట్ వరకు ఉంటుంది. ప్రస్తుతం రోజుకు 6 నుంచి 10 వ్యాన్ల గెలలు ఎగుమతి అవుతున్నాయి. ఒక్కో వ్యాన్‌లో 350 వరకు గెలలుంటాయి. వీటివిలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందని అంచనా. ఏటా రూ.52 కోట్ల మేర ఎర్ర చక్కెరకేళి ఎగుమతులు జరుగుతాయి. సీజన్లో యార్డు వద్దకు రాకుండా నేరుగా రైతు తోటల వద్ద నుంచే రవాణా చేస్తుంటారు. పోషకాలు అధికం ఎర్ర చక్కెరకేళి అరటిలో ఎక్కువగా ఉన్న పొటాషియం ఎంతో మేలు చేస్తుంది. ఈ అరటి శరీరంలో క్యాల్షియం పెంచుతుంది. ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. సాధారణ అరటిపండ్లలో కన్నా దీన్లో పోషకాలు అధికం. ఖనిజాలు, విటమిన్లు, పీచు పదార్థాలు, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ఇతర అరటిపండ్ల కన్నా బీటా కెరోటిన్ అధికం. ఇది గుండె ధమనుల్లో రక్తం గడ్డకట్టకుండా చూస్తుంది. తక్కువ కేలరీలు ఉన్నందున బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆహారం. విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం. హిమోగ్లోబిన్ శాతాన్ని గణనీయంగా పెంచుతుంది. సాగులో ప్రతికూలతలు ఎర్ర చక్కెరకేళి సాగుకు కొన్ని ప్రతికూలతలున్నాయి. సాధారణ అరటి దిగుబడి ఎనిమిది నెలలకే మొదలవుతుంది. ఇది ఏడాదిన్నర సమయం పడుతుంది. కార్శి తోటగా సాగుచేయడం పెద్ద ప్రయోజనకరం కాదు. బలమైన పోషకాలున్న నేలలు అవసరం. ఇతర అరటి రకాల కన్నా ఎరువులు, పురుగుమందులు అధికంగా వినియోగించాలి. పెట్టుబడి సైతం ఎకరాకు రూ.లక్ష అవుతుంది. చెట్టు ఎత్తు పెరుగుతున్నందున తుపాన్లు, భారీ వర్షాలు, వరదల సమయంలో పడిపోయే ప్రమాదం ఎక్కువ. తమిళనాడు ఎగుమతులపైనే వ్యాపారం రావులపాలెం మార్కెట్ యార్డ్‌కు వచ్చే అరటిగెలల్లో 10 శాతం ఎరుపు చక్కెరకేళి అరటి గెలలు ఉంటాయి. ఇవి ఎక్కువగా తమిళనాడుకు, తక్కువగా కేరళకు ఎగుమతి అవుతాయి. స్థానికంగా కొనుగోలు చేయడం చాలా తక్కువ. తమిళనాడు మార్కెట్‌పైనే ఇక్కడ వ్యాపారం ఆధారపడి ఉంటోంది. కానీ దీనికి నిలకడైన ధర మాత్రం దక్కుతోంది. – కోనాల చంద్రశేఖరరెడ్డి, అరటి వ్యాపారి, రావులపాలెం పెట్టుబడి అధికం ఎర్ర చక్కెరకేళి సాగులో పెట్టుబడి అధికం. ఇతర అరటి రకాల సాగు కన్నా ఎకరాకు రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు అధికం. పంటకాలం కూడా ఎక్కువ. ఒకసారి మాత్రమే మంచి దిగుబడి వస్తుంది. కార్శి పంట దిగుబడి పెద్దగా రానందున గిట్టుబాటు కాదు. కానీ ధర మాత్రం లాభసాటిగా ఉంటోంది. మంచి దిగుబడి వచి్చ, రికార్డుస్థాయి ధర ఉన్నప్పుడు మాత్రం ఎకరాకు రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు లాభం వస్తోంది. – పెదపూడి బాపిరాజు, రైతు, వాడపాలెం, కొత్తపేట మండలం ఆరోగ్యానికి ఎంతో మేలు ఎరుపు రకం అరటిపండ్లలో చక్కెరకేళి రకంలో ఇతర రకాల అరటిపండ్ల కన్నా వైవిధ్యకరమైన పోషకాలున్నాయని గుర్తించారు. బీటా కెరోటిన్ అనే పిగ్మెంట్ మిగిలిన పండ్ల కన్నా ఎక్కువగా ఉంటుంది. అధికంగా పొటాషియం, విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. రక్తపోటు, ఒబేసిటీ బాధితులకు ఇది మంచిది. – వడ్డాది సురేశ్, ఎండీ జనరల్, వడ్డాది ఆస్పత్రి, రాజమహేంద్రవరం -
నిస్తేజం.. గందరగోళం.. జనసేన శ్రేణుల్లో అయోమయం!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: దశ, దిశ నిర్దేశం లేకుండానే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ముగిసింది. తూర్పు సెంటిమెంట్‌గా ఈ నెల 14న అన్నవరం సత్యదేవునికి పూజలు నిర్వహించి, పవన్ ఈ యాత్రను ప్రారంభించారు. ఈ యాత్రలో పార్టీ నిర్దిష్ట అజెండా గురించి తన నాయకుడు వివరిస్తారని భావించిన ఆయన అభిమానులకు నిరాశే ఎదురైంది. కాకినాడ జిల్లా కత్తిపూడి మొదలు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురంలో ఆదివారం జరిగిన ముగింపు సభ వరకూ వరుసగా వివాదాలు మూటగట్టుకున్నారు. సహజంగా ఏ రాజకీయ పార్టీ అయినా ఇటువంటి యాత్రలు చేసేటప్పుడు పార్టీ విధానపరమైన ప్రణాళికలను ప్రజల ముందు ఉంచుతుంది. తమకు ఓటేస్తే ప్రజలకు ఏం చేయదలుచుకున్నారో అర్థమయ్యేలా వివరిస్తూ.. వారి మనసు చూరగొనే ప్రయత్నం చేస్తుంది. పవన్ అభిమానులు, ఆ పార్టీ నేతలు ఆయన నుంచి ఇవే ఆశించారు. కానీ అందుకు పూర్తి భిన్నంగా వన్‌మేన్ ఆర్మీ మాదిరిగా ఉమ్మడి తూర్పు గోదావరిలో పవన్ తన యాత్రకు ముగింపు పలికారు. పార్టీకి ఒక అజెండా అంటూ లేకపోవడం జనసేన నేతలకు రుచించ లేదు. ద్వారంపూడి, ముద్రగడపై విమర్శలతో పెనుదుమారం వారాహి యాత్రలో పవన్ వ్యాఖ్యలపై పెనుదుమారం రేగింది. రెండవ సారి గెలుపొందిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి వంటి నేతలే లక్ష్యంగా పవన్ ప్రసంగం సాగడం సొంత సామాజిక వర్గ నేతల నుంచే అసంతృప్తి వ్యక్తమైంది. అలాగే, కాపు ఉద్యమాన్ని ముందుండి నడిపించిన నేత ముద్రగడ పద్మనాభం లక్ష్యంగా పరోక్ష విమర్శలు చేయడం రాష్ట్ర స్థాయిలో పెను దుమారాన్నే రేపింది. అటు ద్వారంపూడి, ఇటు ముద్రగడ సంధించిన అనేక ప్రశ్నలకు, వచ్చే ఎన్నికల్లో పోటీపై విసిరిన సవాళ్లకు పవన్ సమాధానం చెప్పకుండానే తోక ముడిచారనే విమర్శను మూటగట్టుకోవాల్సి వచ్చింది. గుండె ధైర్యం ఎక్కువని పదేపదే చెప్పుకునే ఆయన.. వారి సవాళ్లకు సరైన సమాధానం చెబుతారని ఎదురు చూశామని, తీరా చివరకు తల దించుకునేలా చేశారని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు వాపోతున్నారు. ఒకపక్క జనసేనకు కులాల అంతరాలు లేవంటూనే మరోపక్క తన ప్రసంగాల్లో కులాల ప్రస్తావనతో యువతలో పవన్ భావోద్వేగాలు రెచ్చగొట్టిన తీరును మేధావి వర్గం తప్పు పడుతోంది. పవన్ వాడిన పదజాలంపై రాజకీయాల్లో మూడు దశాబ్దాల అనుభవం ఉన్న కాకినాడ ఎంపీ వంగా గీత ‘రాజకీయాల్లోకి రావాలనుకునే యువతకు ఇదేనా మీరిచ్చే సందేశం’ అంటూ చురకలు అంటించడం గమనార్హం. అయినా.. మారలేదు రీల్ లైఫ్‌కు, రియల్ లైఫ్‌కు చాలా తేడా ఉంటుందని చెబుతూనే ప్రసంగాలు, హావభావాల్లో ఫక్తు సినిమా స్టైల్‌ను ప్రదర్శించడంలో పవన్ ఔచిత్యాన్ని విజ్ఞులు ప్రశ్నిస్తున్నారు. తాను సీఎం అయ్యేందుకు సిద్ధంగా ఉన్నానని కత్తిపూడిలో చెప్పుకున్న పవన్.. పచ్చ మీడియా ఇంటర్వ్యూల్లో ఏదో అభిమానులు అలా అంటూంటే వారిని ఉత్సాహ పరిచేందుకు అలా మాట్లాడాననడం ఒక పార్టీకి నాయకత్వం వహించే నాయకుడి లక్షణమా అని వివిధ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. మార్పు రావాలని గొంతెత్తిన జనసేనాని తాను మారలేదనే విషయాన్ని వారాహి యాత్ర ద్వారా చెప్పకనే చెప్పారని ఆ వర్గాలు అంటున్నాయి. గోదావరి నేలను వదిలేది లేదని, ఈ జిల్లాలు రాజకీయ మార్పునకు నాంది పలుకుతాయని చెప్పిన పవన్.. వచ్చే ఎన్నికల్లో పోటీపై గత ఎన్నికల్లో మాదిరిగానే ఇప్పుడు కూడా పూటకో మాటతో అభిమానులను గందరగోళంలో పడేశారు. ఆ పార్టీ నేతలే పెదవి విరుపు మంగళగిరిలో తెలుగుదేశంతో పొత్తు అనగానే గోదావరి జిల్లాల్లో పవన్ గ్రాఫ్ పడిపోయింది. 80వ దశకంలో వంగవీటి మోహన్ రంగా హత్యోదంతం నుంచి.. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కుటుంబం పైన, కాపు సామాజికవర్గం పైన చంద్రబాబు ప్రభుత్వం సాగించిన దమనకాండను గుర్తుకు తెచ్చుకుని.. సామాజిక మాధ్యమాల్లో పలువురు పవన్ తీరును ఏకి పారేశారు. ఆ వ్యతిరేకతను తగ్గించుకునేందుకో లేక కాస్తో కూస్తో బలం ఉన్న గోదావరి జిల్లాల్లో బలప్రదర్శన ద్వారా పొత్తుల్లో సీట్లు పెంచుకునేందుకో వారాహి యాత్రను ఇక్కడి నుంచే ప్రారంభించి ఉంటారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ యాత్రలో తమకు కనీస ప్రాధాన్యం ఇవ్వలేదని ఆ పార్టీ నేతలు పలువురు తీవ్ర ఆవేదనతో ఉన్నారు. పుష్కర కాలంగా పార్టీ కోసం లక్షల రూపాయలు తగలేసుకుంటున్న ఇన్చార్జిలకు సైతం వారాహిపై వేదిక పంచుకునే అవకాశం ఇవ్వకుండా దూరం పెట్టడంపై నిప్పులు చెరుగుతున్నారు. మొత్తంగా ఉమ్మడి ‘తూర్పు’న వారాహి యాత్ర అనేక వివాదాలు, అసంతృప్తులతో ఆ పార్టీ అభిమానులకు తీవ్ర నిరాశ మిగిలి్చంది. -
కాలు దువ్విన కోడి పుంజులు
సాక్షి,అమరావతి/కాకినాడ/భీమవర/పెనమలూరు: సంక్రాంతి సంబరాల తొలి రోజునే కోడి పందేల జాతర మొదలైంది. భోగి రోజైన శనివారం మొదలైన ఈ పందేలు మూడు రోజులపాటు నిర్వహించేలా ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేసుకున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఊరూ వాడా కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని అనేకచోట్ల పందేలు మొదలయ్యాయి. ఈ సారి భారీ బరుల వద్ద కోడి పందేల్లో పాల్గొనే వారి కోసం ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ ద్వారా నగదు చెల్లింపులకు వీలుగా ఏర్పాట్లు చేశారు. విశాలమైన మైదానాలు, తోటల్లో బరులను ఏర్పాటు చేశారు. భారీ టెంట్లు వేసి కూర్చునేందుకు వీవీఐపీ, వీఐపీ, సాధారణ గ్యాలరీలను సైతం ఏర్పాటు చేశారు. రాత్రి వేళలోనూ పందేలు కొనసాగేలా బరుల వద్ద ఫ్లడ్ లైట్లను అమర్చారు. కేరవాన్లు.. స్పెషల్ పాస్‌లు కోడి పందేలకు పెట్టింది పేరైన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రాంతంలో భారీ ఏర్పాట్ల నడుమ కోడి పందేలు నిర్వహిస్తున్నారు. కాకినాడ రూరల్ పరిధిలోని వలసపాకలో పందేలు వీక్షించేందుకు పాస్‌లు జారీ చేశారు. కొన్నిచోట్ల పందేల్లో గెలిచిన వారికి బుల్లెట్ వాహనం, కారు బహుమతిగా ప్రకటించారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం అంపాపురంలో భారీ ఏర్పాట్లతో ఒక్కో కోడి పందెం రూ.లక్షల్లో నిర్వహించారు. పందేల్లో పాల్గొనే వారికి వీవీఐపీ పాస్ ధర రూ.60 వేలు.. వీఐపీ పాస్ రూ.40 వేలుగా నిర్ణయించారు. పందేల రాయుళ్ల కోసం క్యూఆర్ కోడ్ నగదు చెల్లింపుల సౌకర్యం కల్పించారు. కొన్నిచోట్ల వీవీఐపీల కోసం బరులకు సమీపంలో కేరవాన్లు (బస చేసే వాహనాలు) కూడా ఏర్పాటు చేశారు. అతిథి మర్యాదలకు లోటు లేకుండా.. పందేలను చూసేందుకు, పందేలు ఒడ్డేందుకు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వారి అభిలాషకు అనుగుణంగా పలుచోట్ల బరుల నిర్వాహకులు అతిథి మర్యాదలు సిద్ధం చేశారు. ప్రత్యేకంగా హోటళ్లు, అతిథి గృహాలు, చేపల చెరువులపై మకాంలను కేటాయించి ప్రత్యేకంగా మాంసాహార వంటకాలు, విదేశీ మద్యంతో అతిథి మర్యాదల్లో ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ‘పశ్చిమ’లో 270 బరులు పశ్చిమ గోదావరి, జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో చిన్నాపెద్దా అన్నీ కలిపి కోడి పందేల బరులు దాదాపు 270 వరకు ఏర్పాటయ్యాయి. ఉండి, ఆచంట, పాలకొల్లు నియోజకవర్గాల్లో ఎక్కువ కోడి పందేలు గెలిచిన వారికి బుల్లెట్ మోటార్ సైకిల్ బహుమతిగా ప్రకటించారు. దుంపగడప బరిలో ఏలూరు జిల్లా తాడినాడకు చెందిన వ్యక్తి 9 పందేలకు గాను 5 పందేలు గెలిచి బుల్లెట్ మోటార్ సైకిల్ బహుమతి అందుకున్నాడు. ఏలూరు జిల్లా పరిధిలోనూ సంక్రాంతి సంబరాలు కొనసాగుతున్నాయి. పెనమలూరు నియోజకవర్గం పరిధిలోని ఈడుపుగల్లులో కోడిపందేల బరి ‘తూర్పు’ పందేలు డీలా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కోడి పందేలు నిర్వహించినప్పటికీ.. గుండాటలను పోలీసులు అడ్డుకోవడంతో జూదరులు డీలా పడ్డారు. తూర్పు గోదావరి, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో దాదాపు 300 చోట్ల కోడి పందేల బరులు వెలిశాయి. గత సంక్రాంతితో పోల్చితే ఈ సారి కోడి పందేలు సాధారణంగా జరిగాయే తప్ప భారీ ఎత్తున ఎక్కడా జరగలేదు. ప్రత్యేక వాహనాల్లో రాక ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కోడి పందేల బరులను సిద్ధం చేశారు. పెనమలూరు, గన్నవరం, మచిలీపట్నం, పామర్రు, ఎన్టీఆర్ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా సిద్ధం చేసిన బరుల్లో సంప్రదాయంగా, రైతువారీగా కోడిపందేలు నిర్వహించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ముంబై, పంజాబ్, తమిళనాడు, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి పందెంరాయుళ్లు ప్రత్యేక వాహనాల్లో తరలివచ్చారు. వారి కోసం బరుల నిర్వాహకులు ప్రత్యేక వసతి సదుపాయాలను సమకూర్చారు. -
ఉభయగోదావరి జిల్లావాసులకు గుడ్‌న్యూస్..
సాక్షి, రాజమహేంద్రవరం/మధురపూడి: ఉభయగోదావరి జిల్లాల వాసులకు గగనతల ప్రయాణ సేవలందిస్తున్న (రాజమహేంద్రవరం) మధురపూడి విమానాశ్రయానికి భవిష్యత్తులో అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకువచ్చేందుకు కసరత్తు ప్రారంభమైంది. ఇప్పటికే 3,165 మాటర్ల పొడవున్న రన్‌వే, 11 పార్కింగ్ బేస్‌తో కూడిన ఏఫ్రాన్, 11 విమాన సర్వీసులు ఏకకాలంలో నిలుపుదలకు అవకాశం ఉండటం సానుకూలత కలిగిన అంశం. అంతర్జాతీయ స్థాయికి అవసరమైన సదుపాయాలు ఉండటంతో విమానాశ్రయం సేవలను విస్తృతం చేసేందుకు భారత పౌర విమానయాన శాఖ కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తోంది. భవిష్యత్ అవసరాల దృష్యా చర్యలు చేపడుతోంది. టెర్మినల్ భవన సామర్థ్యం పెంపు.. - విమాన ప్రయాణికుల రాకపోకల సందర్భంలో స్టే చేయడానికి ఉన్న టెర్మినల్ భవనం సామర్థ్యం విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ప్రస్తుతం 4,065 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న భవనంలో ఏకకాలంలో 225 మంది ప్రయాణికులు ఉండేందుకు సరిపోతుంది. - భవిష్యత్ అవసరాల రీత్యా భవనాన్ని మరో 16,000 చదరపు గజాలకు విస్తరించేందకు కొత్త భవన నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఇందుకు రూ.280 కోట్లు వెచి్చంచనున్నారు. - ఒకేసారి 1,400 మంది ప్రయాణికులుండే సామర్థ్యానికి విస్తరించనున్నారు. ఐదు - విమానాలు ఒకేసారి చేరినా ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. - విమానాల్లో రాక, పోకలు సాగించే ప్రయాణికుల లగేజీ తనిఖీ వ్యవస్థను వివిధ రకాల్లో ఆధునీకరించనున్నారు. - ఇన్లైన్ బ్యాగేజీ సిస్టం తీసుకురానున్నారు. - ప్రయాణికుల భద్రత, రక్షణ విషయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనున్నారు. సీసీ టీవీ నిఘా ఏర్పాటు చేస్తారు. కియోస్క్ ద్వారా ఆధునీకరణ పద్ధతుల్లో ప్రయాణ వివరాలు తెలుసుకునే వెసులుబాటు కల్పించనున్నారు. 3 ఎయిరో బ్రిడ్జిలు ప్రయాణికుల సౌకర్యార్థం మూడు ఎయిరోబ్రిడ్జిలు నిర్మిచేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ బ్రిడ్జిల ద్వారా విమానాశ్రయం నుంచి నేరుగా విమాన సర్వీసులోకి ప్రయాణికులు వెళ్లే అవకాశం ఉంటుంది. దీంతో ప్రయాణికులకు ఆలస్యం జరగదు. టెర్మినల్ భవనం నుంచి విమాన సర్వీసు వరకూ వెళ్లేందుకు సమయం వృథాకాదు. ప్రస్తుతం జరుగుతున్న విధానంతో ఆలస్యాన్ని నివారించే వీలుంది.ప్రస్తుతం ఉన్న 6 ఇండిగో విమానాల జాబితాలో మరో ఎలెన్స్ ఎయిర్ సంస్థకు చెందిన విమానం చేరనుంది. రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు నడవనుంది. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి సాయంత్రం 4.50 గంటల చేరుతుంది. తిరిగి హైదరాబాద్‌కు 5.20కు బయలు దేరుతుంది. ఉడాన్.. ఒక లైన్ కేంద్ర ప్రభుత్వం విమాన సేవల విస్తృతిలో భాగంగా ప్రవేశపెట్టిన ఉడాన్ రాజమహేంద్రవరం నుంచి విశాఖపట్నం, తిరిగి విశాఖ నుంచి రాజమహేంద్రవరానికి మాత్రమే నడుస్తోంది. తక్కువ ధరకే టికెట్టు లభిస్తుండటంతో మంచి డిమాండ్ నెలకొంది. మధురపూడి విమానాశ్రయం నుంచి ప్రస్తుతం 6 విమానాలు 12 సరీ్వసులు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విశాఖపట్నంకు రాకపోకలు సాగిస్తున్నాయి. 90 శాతం ఆక్యుపెన్సీతో విమాన సరీ్వసులు నడుస్తున్నాయి. ప్రతి రోజూ 1,200 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఎయిర్పోర్ట్ ఆధునీకరణకు కృషి విమానాశ్రయం ఆధునీకరణకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నాం. ప్రస్తుతం ఇండిగో సర్వీసులు నడుస్తున్నాయి. వచ్చే వారం హైదరాబాద్‌కు ఎలెన్స్ ఎయిర్ సంస్థకు చెందిన మరో విమానం ప్రారంభం కానుంది. బోయింగ్ విమాన రాకపోకలకు అనువైన రన్‌వే, పార్కింగ్ ఉండటం రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్ట్‌కు సానుకూలం. దీన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తు అవసరాల దృష్ట్యా అంతర్జాతీయ ఖ్యాతి తీసుకువచ్చేందుకు çకృషి చేస్తున్నాం. ఇందులో భాగంగానే టెరి్మనల్ విస్తరణ చేపడుతున్నాం. అత్యంత భద్రత, సౌకర్యవంతమైన ప్రయాణం అందిచాలన్న ఉద్దేశంతో వ్యవహరిస్తున్నాం. కార్గో విమానాలు లేకవడంతో బెల్లీ కార్గో సేవలు అందుబాటులోకి తీసుకువచ్చాం. ఒక విమాన సరీ్వసుకు 500 కేజీల లగేజీ అనుమతిస్తున్నాం. కార్గో విమానాలకు ప్రతిపాదనలున్నాయి. - ఎస్.జ్ఞానేశ్వరరావు, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ -
‘పులస’ ప్రియులకు ఈ ఏడాది నిరాశేనా?
ఏదీ ఆ రుచి? ఆ అమోఘమైన రుచి ఏమైనట్టు? అద్భుతమైన ఆ రుచి ఎటు పోయినట్టు? పుస్తెలు అమ్మైనా పులస తినాలంటారే.. అసలు ఈ ఏడాది పులసల జాడేది? అవి లేకుంటే జిహ్వ చాపల్యం తీరేదెలా? మైమరపించే ఆ రుచిపై మోజు తీరేదెలా? పులసమ్మా.. పులసమ్మా.. ఏమైతివే? ఎటు పోతివే? కాసింత కానరావే..! సాక్షిప్రతినిధి, కాకినాడ: గోదావరి వరద ఉధృతి పులసను ఓడించింది. లక్షలాది క్యూసెక్కుల ప్రవాహానికి ఎదురీదలేక పులస తలవంచింది. సముద్రంలో ఇలసలు గోదావరికి ఎదురీదుతూ పులసలుగా మారతాయి. జూలై – ఆగస్టు నెలల మధ్య పులసల సీజన్. ఆగస్టు వచ్చి మూడు వారాలు గడచినా గోదావరి తీరంలో పులసల జాడ లేదు. మత్స్యకారుల వలకు చిక్కడం లేదు. దీంతో పులసలంటే పడిచచ్చే మాంసాహార ప్రియులు ఉసూరుమంటున్నారు. పులసల సీజన్లో మూడొంతులు గోదావరికి వరదలతోనే గడిచిపోయింది. మునుపెన్నడూ లేని స్థాయిలో జూలైలో వరదలు గోదావరిని ముంచెత్తాయి. అదే వరద ఒరవడి ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. దీంతో సముద్రంలోని ఇలసలు గోదావరికి ఎదురీదలేక వెనక్కి పోతున్నాయని మత్స్యకారులు చెబుతున్నారు. గోదావరిలో ఆగస్టు 10 నుంచి మొదటి, రెండో ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. వరద ఉధృతి తీవ్రంగా ఉండటమే పులసలు రాకపోవడానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. సముద్రంలో ఉండే ఇలస(హిల్స)చేప పునరుత్పత్తి కోసం ఎదురీదుతూ గోదావరికి వచ్చే సరికి పులస అవుతుంది. గోదావరి నుంచి సముద్రానికి వచ్చే నీటి ప్రవాహాన్ని తట్టుకుని ఈదుకుంటూ రావాలి. లక్షన్నర నుంచి మూడు లక్షల క్యుసెక్కులు స్థాయిలో గోదావరి నుంచి సముద్రానికి నీటి విడుదల ఉంటే.. సముద్రం వైపు నుంచి విలసలు గోదావరికి రాగలుగుతాయి. ఆగస్టులో వరదలు మొదటి పది రోజులు మూడు లక్షలు, అప్పటి నుంచి 20–8–2022 వరకు ఏ రోజూ 10 లక్షల క్యుసెక్కులకు తక్కువ కాకుండా మిగులు జలాల (వరద నీరు)ను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. అలా రోజూ లక్షల క్యుసెక్కుల నీరు సముద్రానికి చేరుతుంటే.. ఆ నీటి ఉధృతిని తట్టుకుని విలసలు సముద్రం నుంచి గోదావరికి ఎదురీదలేకపోతున్నాయి. అలాగే గోదావరి, బంగాళాఖాతం కలిసే సీ మౌత్(నదీ ముఖద్వారం వద్ద)లు మొగలు పూడుకుపోవడం కూడా పులస రాకకు అడ్డుగా మారి ఉండొచ్చని మత్స్యశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో విలసలు గోదావరి వైపు రాకుండా పశ్చిమ బెంగాల్, ఒడిశా వైపు తరలిపోతున్నాయి. ఆ రుచికి.. ఈ రుచికి అసలు పొంతనే లేదు గోదావరిలో పులసలు లభించకపోవడంతో ఒడిశా సముద్ర జలాల్లో లభిస్తున్న విలసలను గోదావరి జిల్లాలకు తెచ్చి జోరుగా విక్రయిస్తున్నారు. ఒడిశా నుంచి ఎదుర్లంక, యానాం, కోటిపల్లి తదితర ప్రాంతాలకు వ్యాన్లలో తీసుకొచ్చి మరీ అమ్ముతున్నారు. అరకిలో విలస రూ.1,000 నుంచి రూ.1,500 పలుకుతోంది. అంతగా రుచి లేకున్నా పులస ప్రియులు అలా సర్దుకుపోతున్నారు. గోదావరిలో లభించే పులస రుచికి, ఈ విలస రుచికి అసలు పొంతనే లేదంటున్నారు. గత సీజన్లో పులసలు ఒక్కోటి కిలో నుంచి నాలుగైదు కిలోల పరిమాణంలో లభించేవి. ధర రూ.10 వేలకు పైనే పలికేది. ఎదురీదలేక.. గోదావరికి ఉధృతంగా వరదలు రావడంతో పులసలు ఎదురీదలేకపోతున్నాయి. దీంతో గోదావరిలో పులసలు కానరావడం లేదు. ప్రస్తుతానికి ఒడిశాలో దొరికిన విలసలను అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాం. – నాటి పార్వతి, మత్స్యకార మహిళ, యానాం. విచక్షణ రహిత వేటతో పులసలకు ప్రమాదం విచక్షణ రహితంగా సాగుతున్న వేట కారణంగానే గోదావరిలో పులసల సంఖ్య నానాటికీ తగ్గిపోతుంది. గతంలో దాదాపు ఆరు కిలో మీటర్ల మేర మాత్రమే సముద్రంలో వేట సాగేది. ప్రస్తుతం ఆధునిక బోట్లు, వలల కారణంగా వంద కిలో మీటర్లు కూడా వేట సాగుతోంది. ఫలితంగా పలు రకాల చేపలు అంతరించిపోతున్నాయి. అందులో పులస జాతి కూడా ఉంది. – పీవీ కృష్ణారావు, అసిస్టెంట్ డైరెక్టర్, ఫిషరీస్, రాజమహేంద్రవరం