సాక్షి,కాకినాడ : ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీగా పీడీఎఫ్ అభ్యర్థి గోపి మూర్తి విజయం సాధించారు. గోపి మూర్తికి 8 వేలకు పైగా మొదటి ప్రాధాన్యత ఓట్లు పోలయ్యాయి. పోలైన ఓట్లను బట్టి 7745 తొలి ప్రాధాన్యత ఓట్లు సాధించిన అభ్యర్థిదే గెలుపు కాయం అవుతుంది. కాగా, ఈ ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లు 15,490.
జేఎన్టీయూలో ఇవాళ ( (సోమవారం) ఉదయం 8 గంటలకు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. 14 టేబుళ్ళపై 9 రౌండ్లలో ఓట్లను లెక్కించగా.. మొదటి ప్రాధ్యానత ఓట్ల లెక్కింపులో పీడీఎఫ్ అభ్యర్థి గోపి మూర్తిని విజయం వరించింది.
టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన గెలుపుపై పీడీఎఫ్ అభ్యర్థి గోపి మూర్తి మాట్లాడుతూ.. ‘‘ఇది ప్రజాస్వామ్య విజయం. నా విజయం దివంగత మాజీ ఎమ్మెల్సీ షేక్ షాబ్జీకి అంకితం. నాకు ఓట్లు వేసిన టీచర్లకు కృతజ్ఞతలు.ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను. టీచర్లపై అదనపు భారం తగ్గించాలి. సీపీఎస్ రద్దుపై పోరాటం కొనసాగిస్తాను. పిపుల్స్ రిప్రజెంటీవ్ నుండి పొలిటికల్ రిప్రజెంటీవ్ అయ్యాను’’ అని సంతోషం వ్యక్తం చేశారు.
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు డిసెంబర్ 5న జరిగాయి. ఈ ఎన్నికల్లో 15,490 మంది టీచర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉన్న షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఎన్నికల అధికారులు ఉప ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. ఈ ఎన్నికల్లో ఐదుగురు అభ్యర్థులు బరిలో నిలవగా ప్రధానంగా గంధం నారాయణరావు, బొర్రా గోపిమూర్తిలకు వివిధ ఉపాధ్యాయ సంఘాలు మద్దతు పలికాయి. ఇద్దరి పోరులో గోపిమూర్తి విజయం సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment