గోదావరి వరద ఉధృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీశారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని ప్రస్తుత పరిస్థితులపై ఆయన సమాచారం కోరారు. సీఎం కార్యాలయ అధికారులు.. ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రికి ఉభయ గోదావరి ప్రాంత పరిస్థితులను వివరించారు. అధికారులు ఎప్పటికప్పుడు నివేదికలు పంపిస్తున్నారు.