godavari floods
-
బాధితులకు బాబు మొండిచెయ్యి
-
కోనసీమలో ముంపులోనే లంక గ్రామాలు
-
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం
-
భయం గుప్పెట్లో నెల్లిపాక
-
సాయంలో కొత్త ఒరవడి
వరద కష్టాల్లో ఉన్న ప్రజలకు తక్షణ సాయం అందాలి. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. భోజనం, నీరు, వైద్యం అందించాలి. తొలుత ఆ పని చేయండి. ఆ తర్వాతే ఆయా గ్రామాల్లో ఉన్న నా అన్నదమ్ములను, అక్కచెల్లెమ్మలను నేనే స్వయంగా వచ్చి అడుగుతాను. ఏ ఒక్కరి నుంచి కూడా నాకు అందాల్సింది అందలేదు.. కలెక్టర్ సరిగా స్పందించ లేదు.. వ్యవస్థలు సరిగా పని చేయలేదన్న మాట ఎక్కడా వినపడకూడదని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చాం. ఇందులో భాగంగానే ఇప్పుడు పరిశీలించడానికి వచ్చాను. దీన్నొక సరికొత్త విధానంగా అమలు చేస్తూ కొత్త ఒరవడి సృష్టించాం. తక్షణ సాయం పట్ల మీరు సంతృప్తిగా ఉన్నందుకు ఆనందంగా ఉంది. – లంక వాసులతో సీఎం జగన్ సాక్షి అమలాపురం: ‘గతంలో చాలాసార్లు వరదలు వచ్చాయి. నాయకులు అప్పటికప్పుడు రావడం, అధికారులంతా వారి చుట్టూ తిరగటం జరిగేది. పేపర్లలో.. టీవీల్లో ఫొటోల కోసం పోజులిచ్చి వెళ్లిపోయేవారు. ప్రతి ఒక్కరికీ మంచి జరగాలి. కానీ వారు మంచి జరిగిందా లేదా అని చూడలేదు. మన ప్రభుత్వం వచ్చాక ఆ పరిస్థితిని మార్చాం. ప్రతి బాధితునికి సాయం అందుతోంది. నాలుగేళ్లుగా ఈ మార్పు కనిపిస్తోంది. సాయం చేయడం, ఆదుకోవడం అంటే ఇదీ..’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గోదావరి వరదల బారిన పడిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో మంగళవారం ఆయన పర్యటించారు. ముమ్మిడివరం, పి.గన్నవరం నియోజకవర్గ పరిధిలోని గురజాపులంక, లంకాఫ్ ఠానేల్లంక, కొండుకుదురులంకల్లో బాధితులతో మమేకమయ్యారు. వారి కష్టనష్టాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారిని ఉద్దేశించి మాట్లాడుతూ.. ఇలాంటి ప్రతి సందర్భంలో కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. ప్రజలకు తక్షణ సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు కావాల్సిన డబ్బులు వారి చేతుల్లో పెట్టామని చెప్పారు. వరద నష్టం ఎక్కువా, తక్కువా అని చూడకుండా బాధితులను ఉదారంగా ఆదుకోండని చెప్పామని తెలిపారు. ‘ఆయా జిల్లాల్లో కలెక్టర్లకు వారం రోజుల సమయం ఇచ్చాం. ప్రతి గ్రామంలోకి వెళ్లాలని, ప్రతి గ్రామంలో ఉన్న వ్యవస్థను చైతన్యం చేయాలని చెప్పాం. ఆ తర్వాత నేను స్వయంగా వచ్చి బాధితులకు సాయం అందిందీ లేనిదీ చూస్తానని చెప్పాను. నేను వచ్చినప్పుడు నాకు సహాయం అందలేదని ఏ ఒక్కరి నోటి నుంచి రాకూడదు’ అని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చానని చెప్పారు. వరదలు వచ్చినప్పుడే మిమ్మల్ని పలకరించేందుకు వస్తే సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని భావించే ఇలా చేశానని వివరించారు. కష్టాలలో ఉన్నప్పుడు మీ బిడ్డ వేగంగా ఆదుకుంటాడని పునరుద్ఘాటించారు. తొత్తరమూడివారిపేటలో స్థానికులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉదారంగా ఉండాలన్నాను.. పేదలకు సాయం అందించడంలో ఉదారంగా ఉండాలన్న తన సూచన మేరకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో యంత్రాంగం పనిచేసిందని సీఎం కొనియాడారు. ఈ రోజు ప్రతి వ్యక్తికి పరిహారం అందించామంటే అందుకు మీ బిడ్డ జగన్ గ్రామీణ స్థాయిలో గొప్ప వ్యవస్థను ఏర్పాటు చేయడమేనన్నారు. సచివాలయాలు, విలేజ్ హెల్త్ క్లినిక్‌లు, ఆర్బీకేలు, వలంటీర్ల వ్యవస్థ వల్ల వరదల సమయంలో వేగంగా సాయం అందించడానికి మార్గం సుగమం అయిందన్నారు. ఈ వ్యవస్థ వల్లే ప్రతి పనిలోను పారదర్శకత చూపిస్తున్నామని తెలిపారు. నెలాఖరుకు పంట నష్ట పరిహారం పంట నష్టపోయిన రైతులకు నెలాఖరుకు పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటామని సీఎం జగన్ రైతుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ‘రైతులకు ఏ సీజన్లో పంట నష్టం జరిగితే అదే సీజన్లో పరిహారం ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మనదే’ అని అన్నారు. మూడు నాలుగు రోజుల్లో జాబితా సిద్ధమవుతుందని, రైతుల పేరు, విస్తీర్ణం, పంట నష్టం వివరాలు ఆర్బీకేలలో ఉంటాయన్నారు. ఎవరి పేరు అయినా కనిపించకపోతే ఆర్బీకేలో ఫిర్యాదు చేస్తే, తిరిగి పరిశీలిస్తారని చెప్పారు. నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందిస్తామన్నారు. అనంతరం గురజాపులంక, కూనలంకల్లో నష్టపోయిన వంగ, మునగ, బెండ, ఇతర కూరగాయ పంటలను పరిశీలించారు. అక్కడి రైతులతో మాట్లాడారు. విలేజ్ క్లినిక్‌ల ద్వారా గ్రామీణుల ముంగిటకే వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. పశువులకు కూడా మెరుగైన వైద్యం అందిస్తున్నామని, టీఎంఆర్ (టోటల్ మిక్స్డ్ రేషన్–సమగ్ర పశు దాణా) దాణా అందిస్తున్నామని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని సచివాలయం, వలంటీర్ వ్యవస్థలు, విలేజ్ క్లినిక్‌లు మన కళ్లెదుటే కనిపిస్తున్నాయని వివరించారు. ‘ఓఎన్జీసీ పరిహారం గురించి మీ అందరికీ తెలుసు. మీ బిడ్డ ప్రభుత్వం వచ్చాక అది మీకు అందింది. అన్ని విధాలా మీకు మంచి చేసే విషయంలో దేవుడు మరింత అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను’ అని సీఎం జగన్ అన్నారు. సీఎం జగన్‌ను చూసేందుకు మహిళలు, యువత ఆసక్తి చూపించారు. సీఎం.. సీఎం.. అంటూ నినా దాలు చేశారు. గురజాపులంకలో పలువురు యువ కులు జగన్‌ను చూసి ‘వైనాట్ 175 జగనన్నా..’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సీఎం జగన్ చిరునవ్వుతో అభివాదం చేస్తూ ముందుకు సాగారు. గురజాపులంకలో ఓ కుటుంబంతో మాట్లాడుతున్న సీఎం జగన్ సీఎంకు ఘన స్వాగతం జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం వైఎస్ జగన్‌కు ప్రజలు, నేతల నుంచి ఘన స్వాగతం లభించింది. సీఎం వెంట రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి జోగి రమేష్, మంత్రులు పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, తానేటి వనిత, ప్రభుత్వ విప్, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, అమలాపురం ఎంపీ చింతా అనూరాధ, ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, బొమ్మి ఇజ్రాయెల్, కుడుపూడి సూర్యనారాయణరావు, ఎమ్మెల్యేలు పొన్నాడ వెంకట సతీష్ కుమార్, కొండేటి చిట్టిబాబు, రాపాక వరప్రసాద్, పెండెం దొరబాబు, కలెక్టర్ హిమాన్షు శుక్లా, జేసీ నపూర్ అజయ్‌లు పాల్గొన్నారు. నేరుగా జనం మధ్యకే.. మంగళవారం ఉదయం సీఎం వైఎస్ జగన్ నేరుగా గురజాపులంకకు హెలికాప్టర్లో చేరుకున్నారు. సాధారణంగా వరదల సమయంలో బాధితులను పరామర్శించేందుకు గతంలో చాలా మంది ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు జిల్లాకు వచ్చారు. అప్పట్లో డివిజన్ కేంద్రమైన అమలాపురం, వరద ప్రభావిత ప్రాంతాల మండల కేంద్రాలలో వరద నష్టంపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించి, ఎంపిక చేసిన బాధితులను పరామర్శించి వెనుదిరిగేవారు. సీఎం జగన్ ఇందుకు భిన్నంగా నేరుగా లంక గ్రామాలలోకే రావడం బాధి తులను, పంట నష్టపోయిన రైతులను పరా మర్శించడంతోపాటు జరిగిన నష్టాన్ని స్వయంగా వీక్షించడం గమనార్హం. ఐదారు గంటలపాటు లంకవాసులతో సీఎం మమేకమ య్యారు. ఇదే విషయాన్ని లంకవాసులు, వరద బాధితులు గొప్పగా చెప్పుకున్నారు. తమ బాధలను తెలుసుకునేందుకు వచ్చిన తొలి ముఖ్యమంత్రి వైఎస్ జగనే అని వారు సంబర పడ్డారు. 1996లో పెను తుపానుకు తమ గ్రామాలు ధ్వంసమైనప్పుడు అప్పటి సీఎం చంద్రబాబు తమ గ్రామాలకు రానేలేదని వారు గుర్తు చేశారు. తమనే ఠానేలంకకు పిలిపించి మాట్లాడారని చెప్పారు. గత ఏడాది గోదావరికి రికార్డు స్థాయిలో వరద వచ్చిన సమయంలో కూడా సీఎం జగన్ జిల్లాలోని పి.గన్నవరం మండలంలోని జి.పెదపూడిలంక, ఉడుముడిలంక, అరిగెలవారిపేట, బూరుగులంక గ్రామాల్లో పర్యటించారని గుర్తు చేశారు. -
రాజమహేంద్రవరానికి సీఎం జగన్
సాక్షి, రాజమహేంద్రవరం: గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండు రోజుల పర్యటనలో భాగంగా సీఎం వైఎస్ జగన్ తొలి రోజు సోమవారం అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో పర్యటించారు. మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో వరద బాధితులను పరామర్శించిన అనంతరం సీఎం వైఎస్ జగన్ సోమవారం సాయంత్రం 6.24 గంటలకు హెలికాప్టర్లో రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. అక్కడ సీఎం వైఎస్ జగన్‌కు మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి సీఎం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌కు చేరుకొన్నారు. రాత్రి అక్కడే బస చేశారు. బాధితులకు అండగా.. హెలిపాడ్ నుంచి గెస్ట్ హౌస్‌కు వచ్చే మార్గంలో సీఎం వైఎస్ జగన్‌ను చూసేందుకు ప్రజలు బారులు తీరారు. రోడ్లకు ఇరువైపులా నిలుచొని ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. సీఎం జగన్ వారికి అభివాదం చేశారు. దారిలో ఇద్దరు అనారోగ్య బాధితులను పలకరించారు. వారి సమస్య విని తక్షణం సహాయం చేయాలని జిల్లా కలెక్టర్ మాధవిలతను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో కలెక్టర్ ఆ కుటుంబాలకు వైద్య సేవల నిమిత్తం ఒక్కొక్కరికీ రూ. లక్ష సాయం అందజేశారు. కోనసీమ జిల్లాలో పర్యటన ఇలా.. సీఎం జగన్ మంగళవారం ఉదయం 9 గంటలకు రాజమహేంద్రవరంలోని ఆర్ అండ్ బి అతిథి గృహం నుంచి అర్ట్స్ కళాశాలకు చేరుకుంటారు. 9.10కి ఆర్ట్స్ కళాశాల వద్ద హెలికాప్టర్లో బయలుదేరి 9.40కి బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా గురజపులంక చేరుకుంటారు. 10.25 వరకు గ్రామంలో వరద ప్రభావిత గ్రామాల ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తారు. 10.35కు రామాలయపేటకు రోడ్డు మార్గానికి చేరుకుని, 11.10 వరకు రామాలయపేటలో వరద బాధితులతో మాట్లాడతారు. 11.10 గంటలకు అక్కడి నుంచి అయినవిల్లి మండలం కొండుకుదురు గ్రామానికి చేరుకుంటారు. 11.20 నుంచి 11.50 గంటల వరకు అక్కడ వరద బాధితులతో మాట్లాడతారు. 11.50 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి రోడ్డు మార్గంలో గురజపు లంక గ్రామానికి 12.15 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో తాడేపల్లికి వెళతారు. -
వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమ, మంగళవారాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. సోమవారం అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో.. మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించి, వరద ప్రభావిత గ్రామాల ప్రజలతో నేరుగా మాట్లాడనున్నారు. వరద సహాయ, పునరావాస చర్యలు అమలు చేసిన తీరుపై స్వయంగా బాధిత కుటుంబాలను అడిగి తెలుసుకోనున్నారు. గోదావరి వరదలతో అల్లూరి సీతారామరాజు, ఏలూరు, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో ఇటీవల పలు ప్రాంతాలు వరద ముంపునకు గురైన విషయం తెలిసిందే. అయితే సహజంగా అలాంటి సమయంలో ముఖ్యమంత్రి ఆ ప్రాంతాల్లో పర్యటించడం పరిపాటి. గత ప్రభుత్వాల్లో అలానే చేసేవారు. అలా చేస్తే అధికార యంత్రాంగం అంతా సీఎం వెంట ఉంటుందని, అప్పుడు బాధితులకు సహాయ కార్యక్రమాలు అందించడానికి ఇబ్బంది ఎదురవుతుందని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచించారు. హడావుడి, ఫొటో సెషన్ వల్ల ఒరిగేదేమీ ఉండదని భావించారు. బాధితులందరికీ సాయం అందాలంటే తను చేయాల్సింది అలా కాదని, తొలుత సహాయ కార్యక్రమాల కోసం అవసరమైన నిధులు విడుదల చేశారు. బాధితుల తరలింపు, పునరావాసశిబిరాల ఏర్పాటు, ఆహారం, మంచినీరు, మందులు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు. తద్వారా ఉన్నతాధికారులు, సచివాలయ వ్యవస్థ, వలంటీర్ల సహకారంతో సాయం అందలేదన్న మాటకు తావు లేకుండా చేశారు. ప్రస్తుతం పరిస్థితి కుదుటపడింది. శిబిరాల నుంచి ప్రజలు ఇళ్లకు వెళ్లిపోయారు. అన్ని ప్రాంతాలకు రాకపోకలను పునరుద్ధరించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో పర్యటించి సాయం అందిన తీరు గురించి ప్రజలతో స్వయంగా మాట్లాడటానికి రెండు రోజుల పర్యటన తలపెట్టారు. ఇలా తను సీఎం అయినప్పటి నుంచి సరికొత్త సంప్రదాయాన్ని కొనసాగిస్తూ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. వరద ప్రభావిత ప్రాంత ప్రజలతో నేడు మాటామంతి సోమవారం ఉదయం 9.30 గంటలకు సీఎం వైఎస్ జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి, అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం కోతులగుట్ట చేరుకుంటారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై అధికారులతో మాట్లాడతారు. కూనవరం బస్టాండ్ సెంటర్లో కూనవరం, వీఆర్ పురం మండలాల వరద బాధితులతో సమావేశం అవుతారు. అనంతరం ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం గొమ్ముగూడెం చేరుకుంటారు. అక్కడ వరద నష్టంపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలిస్తారు. ఆ తర్వాత వరద బాధిత కుటుంబాలతో సమావేశమవుతారు. సాయంత్రానికి రాజమహేంద్రవరం ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం కానున్నారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. మంగళవారం ఉదయం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం గురజాపులంక చేరుకుంటారు. అక్కడ వరద బాధితులతో మాట్లాడిన అనంతరం తానేలంక రామాలయంపేట గ్రామం వెళతారు. అక్కడ వరద బాధితులతో సమావేశమవుతారు. ఆ తర్వాత అయినవిల్లి మండలం తోటరాముడివారిపేట, కొండుకుదురు చేరుకుంటారు. అక్కడ వరద బాధితులతో మాట్లాడిన అనంతరం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. -
లంక గ్రామాల ప్రజలకు అండగా సీఎం జగన్
-
డయాఫ్రమ్ వాల్ సామర్థ్యం తేల్చే పరీక్షలకు శ్రీకారం
సాక్షి, అమరావతి/పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యామ్ గ్యాప్–2లో గోదావరి వరదలకు దెబ్బతిన్న పునాది డయాఫ్రమ్ వాల్ సామర్థ్యాన్ని తేల్చే పరీక్షలకు నేషనల్ హైడ్రోపవర్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌పీసీ) నిపుణుల బృందం శ్రీకారం చుట్టింది. పోలవరం ప్రాజెక్టు వద్ద బుధవారం పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవో శివ్‌నందకుమార్, సభ్య కార్యదర్శి ఎం.రఘురాం, పోలవరం సీఈ సుధాకర్‌బాబు, ఎస్ఈ నరసింహమూర్తిలతో ఎన్‌హెచ్‌పీసీ ఈడీ ఎస్.ఎల్.కపిల్, సీనియర్ మేనేజర్లు ఎ.విపుల్ నాగర్, ఎన్.కె.పాండే, ఎం.పి.సింగ్ సమావేశమయ్యారు. డయాఫ్రమ్ వాల్ సామర్థ్యాన్ని తేల్చేందుకు హైరెజల్యూషన్ జియోఫిజికల్ రెసిస్టివిటీ ఇమేజింగ్, సెస్మిక్ టోమోగ్రఫీ విధానాల్లో పరీక్షలు నిర్వహించడంపై చర్చించారు. తర్వాత గ్యాప్–2 డయాఫ్రమ్ వాల్‌పై ప్రతి మీటరుకు ఒకచోట 20 మిల్లీమీటర్ల (ఎంఎం) వ్యాసంతో 1.5 అడుగుల లోతువరకు జలవనరుల శాఖ అధికారులు వేసిన రంధ్రాల్లోకి ఎలక్ట్రోడ్లను అమర్చి హైరెజల్యూషన్ జియోఫిజికల్ రెసిస్టివిటీ ఇమేజింగ్ విధానంలో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఈ పనులకు సమాంతరంగా డయాఫ్రమ్ వాల్‌కు ఒక మీటరు ఎగువన, ఒక మీటరు దిగువన 60 ఎంఎం వ్యాసంతో 30 నుంచి 40 అడుగుల లోతువరకు ప్రతి 40 మీటర్లకు ఒకటి చొప్పున తవ్విన బోరు బావుల్లోకి ఎలక్ట్రోడ్లను పంపి సెస్మిక్ టోమోగ్రఫీ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. గురువారం ప్రారంభించే ఈ పరీక్షలు పూర్తవడానికి కనీసం 15 రోజుల సమయం పడుతుంది. ఆ తర్వాత ఈ రెండు పరీక్షల ఫలితాలను విశ్లేషించడానికి కనీసం 30 రోజుల సమయం పడుతుందని అధికారవర్గాలు వెల్లడించాయి. మొత్తంమీద 45 రోజుల్లోగా డయాఫ్రమ్ వాల్ భవితవ్యం వెల్లడికానుందని తెలిపాయి. -
ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. 28న అకౌంట్లలో నగదు జమ
సాక్షి, అమరావతి: 2022 ఖరీఫ్ సీజన్లో వివిధ వైపరీత్యాల వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు ఆ సీజన్ ముగియక ముందే పంట నష్ట పరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది ఆగస్టులో సంభవించిన గోదావరి వరదలతో పాటు సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు కురిసిన ఆకాల వర్షాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 45,998 మంది రైతులకు చెందిన 60,832 ఎకరాల్లో పంటలు దెబ్బ తిన్నట్టుగా గుర్తించింది. ఇందులో 20 జిల్లాల పరిధిలో 21,799 మంది రైతుల 34,292 ఎకరాల్లో వ్యవసాయ పంటలు, 14 జిల్లాల పరిధిలో 24,199 మంది రైతుల 26,540 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బ తిన్నాయి. అత్యధికంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 12,886 ఎకరాల్లో, అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 42.5 ఎకరాల్లో రైతులు నష్టపోయారు. వ్యవసాయ పంటల్లో 11,742 ఎకరాల్లో వరి, 5,205 ఎకరాల్లో పత్తి, 4,887 ఎకరాల్లో వేరుశనగ, 3,915 ఎకరాల్లో పెసర.. ఉద్యాన పంటల్లో 7 వేల ఎకరాల్లో ఉల్లి, 1,525 ఎకరాల్లో మిరప, 439 ఎకరాల్లో కూరగాయలు, 399 ఎకరాల్లో అరటి పంటలు దెబ్బతిన్నాయి. వ్యవసాయ పంటలకు 18.95 కోట్లు, ఉద్యాన పంటలకు 20.44 కోట్లు చొప్పున మొత్తంగా రూ.39.39 కోట్లు పంట నష్ట పరిహారం చెల్లించాలని అధికారులు లెక్క తేల్చారు. ఈ మేరకు రైతుల జాబితాలను ఇప్పటికే జిల్లాల వారీగా ఆర్బీకేల్లో ప్రదర్శిస్తున్నారు. గత మూడేళ్లలో రూ.1,795.4 కోట్లు వరదలు, ఆకాల వర్షాలు వంటి వివిధ వైపరీత్యాల వల్ల 2019–20 సీజన్లో 1.47 లక్షల మందికి రూ.116.63 కోట్లు, 2020–21 సీజన్లో 12.15 లక్షల మందికి రూ.932.07కోట్లు, 2021–22 సీజన్లో 6.32 లక్షల మందికి రూ.564 కోట్లు చొప్పున గత మూడేళ్లలో 20.85 లక్షల మందికి రూ.1,795.4 కోట్ల పంట నష్టపరిహారం అందించారు. ప్రస్తుతం 2022–23లో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి 45,998 మంది రైతులకు ఈ నెల 28న రూ.39.39 కోట్లు ఇవ్వనున్నారు. అదే రోజు 2020–21 రబీ సీజన్‌కు సంబంధించి 2.54 లక్షల మందికి రూ.45.22 కోట్లు, 2021 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి 5.68 లక్షల మందికి రూ.115.33 కోట్లు చొప్పున మొత్తంగా 8.22 లక్షల మందికి రూ.160.55 కోట్లు సున్నా వడ్డీ జమ చేయనున్నారు. పంట నష్టపరిహారం, సున్నా వడ్డీ కలిసి మొత్తం రూ.199.94 కోట్లను సీఎం వైఎస్ జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్లో బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. -
కృష్ణాలో పెరుగుతున్న వరద..
సాక్షి, అమరావతి/శ్రీశైలంప్రాజెక్ట్/విజయపురిసౌత్/సత్రశాల(రెంటచింతల)/ధవళేశ్వరం/చింతూరు/పోలవరం రూరల్: పరివాహక ప్రాంతం (బేసిన్)లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణానదిలో వరద ప్రవాహం మరింత పెరగ్గా.. బేసిన్లో వర్షాలు తగ్గడంతో గోదావరిలో వరద ఉద్ధృతి తగ్గుతోంది. జూరాల, సుంకేశుల బ్యారేజ్‌ల నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి గురువారం సాయంత్రం 6 గంటలకు 3,54,343 క్యూసెక్కులు చేరుతున్నాయి. ప్రాజెక్టులో 884.8 అడుగుల్లో 214.36 టీఎంసీలను స్థిరంగా నిల్వ చేస్తూ.. స్పిల్ వే పదిగేట్లను 12 అడుగులు ఎత్తి 3,19,350, కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 62,348.. కలిపి 3,81,698 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. నాగార్జునసాగర్‌లోకి 3,40,387 క్యూసెక్కులు చేరుతున్నాయి. జలాశయంలో 589 అడగుల్లో 309.05 టీఎంసీలను నిల్వచేస్తూ స్పిల్‌వే 18 గేట్లు ఎత్తి, విద్యుత్ కేంద్రం ద్వారా మొత్తం 3,00,774 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులోకి 2,56,309 క్యూసెక్కులు చేరుతోంది. 169.72 అడగుల్లో 37.95 టీఎంసీల నీటిని నిల్వచేస్తూ స్పిల్‌వే గేట్లు, విద్యుత్ కేంద్రం ద్వారా 2,62,583 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్‌లోకి 2,86,684 క్యూసెక్కులు చేరుతుండగా.. 2,74,150 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. శుక్రవారం కూడా కృష్ణాలో ఇదేరీతిలో వరద కొనసాగనుంది. ధవళేశ్వరం వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక గోదావరిలో పోలవరం ప్రాజెక్టు నుంచి ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి 13,20,635 క్యూసెక్కుల వరద చేరుతోంది. గురువారం రాత్రి 7 గంటలకు నీటిమట్టం 13.90 అడుగులకు చేరింది. ఇక్కడ రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. 13,11,835 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. భద్రాచలంలో నీటిమట్టం 42.50 అడుగులకు చేరింది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద నీటిమట్టం గురువారం సాయంత్రానికి 33.510 మీటర్లకు చేరింది. -
AP: వరద గోదావరి
సాక్షి, అమరావతి/ధవళేశ్వరం/చింతూరు/పోలవరం రూరల్/శ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురిసౌత్: ధవళేశ్వరం వద్ద గోదావరి వరద ప్రవాహం మరింత పెరిగింది. బుధవారం ఉదయం 10 గంటలకు నీటిమట్టం 13.75 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీచేసిన అధికారులు.. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. సాయంత్రం 6 గంటలకు బ్యారేజ్‌లోకి 13,74,840 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటిమట్టం 14.40 అడుగులకు చేరింది. గోదావరి తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టా కాలువలకు 8,800 క్యూసెక్కులు విడుదల చేస్తూ మిగిలిన 13,66,040 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. పరివాహక ప్రాంతం (బేసిన్)లో ఎగువన వర్షాలు తగ్గడంతో గోదావరిలో వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. వరదను పోలవరం వద్ద ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్న అధికారులు.. 48 గేట్ల ద్వారా 11,62,898 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద నీటిమట్టం 33.930 మీటర్లకు చేరుకుంది. ప్రకాశం బ్యారేజ్ నుంచి 2.74 లక్షల క్యూసెక్కులు కడలిలోకి పశ్చిమ కనుమల్లో వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా, ఉపనదుల్లో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్, ఉజ్జయిని, జూరాల, తుంగభద్రల్లోకి వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి బుధవారం సాయంత్రం 6 గంటలకు 3,51,446 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. ఈ ప్రాజెక్టు స్పిల్ వే పదిగేట్లను పదడుగులు ఎత్తి 2,79,830, కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 62,374.. కలిపి 3,42,204 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. నాగార్జునసాగర్‌లోకి 2,80,397 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. జలాశయం 16 గేట్లను పదడుగులు ఎత్తి 2,36,400, క్యూసెక్కులు, విద్యుదుత్పాదనతో 32,480.. కలిపి 2,68,880 క్యూసెక్కులు దిగువకు వదిలేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్‌లోకి 2,85,181 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టాకు 11,031 క్యూసెక్కులు విడుదల చేస్తూ మిగిలిన 2,74,150 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
భారీ వర్షాల కారణంగా గోదావరికి వరద ఉధృతి ( ఫొటోలు)
-
గోదావరి ఉగ్రరూపం.. అధికారులను హెచ్చరించిన విపత్తుల శాఖ
సాక్షి, రాజమండ్రి: భారీ వర్షాల కారణంగా గోదావరికి వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో, ధవళేశ్వరం వద్ద ప్రస్తుత నీటి మట్టం 13.70 అడుగులకు చేరింది. ఈ క్రమంలో 12.74 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి చేరుతోంది. వరద ఉధృతి పెరుగుతున్న కారణంగా అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ఇక, ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి వరదతో గౌతమి, వశిష్ట, వైనతేయ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో.. కనకాయలంక, టేకిశేట్టిపాలెం, ఎదురుబిడియం, అప్పనపల్లి కాజేవేలు నీట ముగిగాయి. ఇక ఏజెన్సీ ప్రాంతంలో కొండ వాగులు, శబరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ కారణంగా కూనవరం, వీఆర్ పురం, ఎటపాక మండలాలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఈ నేపథ్యంలో విపత్తుల శాఖ ముంపు ప్రాంతాల అధికారులను అప్రమత్తం చేసింది. నిరంతరం స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి వరద ఉధృతిపై పర్యవేక్షణ జరుగుతోంది. వరద ప్రభావిత జిల్లాల్లోని గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి అధికారులు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు. మరోవైపు.. గోదావరి పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ అధికారులు హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. శ్రీశైలం జలాశయానికి సైతం వరద కొనసాగుతోంది. దీంతో, అధికారులు 9 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఇక, శ్రీశైలానికి ఇన్‌ఫ్లో 3.23 లక్షలుగా ఉండగా.. ఔట్ ఫ్లో 3.13 లక్షల క్యూసెక్కులుగా ఉంది. దీంతో.. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో కరెంట్ ఉత్పత్తి కొనసాగుతోంది. -
ధవళేశ్వరం వద్ద గోదావరి దూకుడు
సాక్షి, అమరావతి/ధవళేశ్వరం/పోలవరం/కూనవరం(అల్లూరి సీతారామరాజు జిల్లా): తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి వరద ఉద్ధృతి మరింతగా పెరిగింది. మంగళవారం రాత్రి 9 గంటలకు 11,58,927 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. నీటిమట్టం 13 అడుగులకు చేరింది. గోదావరి డెల్టాకు 3,900 క్యూసెక్కులు విడుదల చేస్తూ మిగిలిన 11,55,027 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు నీటిమట్టం 11.75 అడుగులు దాటడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేసిన అధికారులు దిగువన లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఎగువ నుంచి భద్రాచలం వద్దకు మంగళవారం రాత్రి 7 గంటలకు 13,55,586 క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండటంతో నీటిమట్టం 51.7 అడుగులకు చేరుకుంది. దీంతో రెండో ప్రమాద హెచ్చరికను జారీచేశారు. నీటిమట్టం 53 అడుగులను దాటితే మూడో ప్రమాద హెచ్చరికను జారీచేస్తారు. మంగళవారం వర్షాలు కొనసాగడంతో గోదావరి బేసిన్లో ఎగువన వరద స్థిరంగా కొనసాగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ నుంచి 9,89,625 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తుండగా దుమ్ముగూడెం సమీపంలోని సీతమ్మసాగర్ వద్దకు 13,11,731 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. సీతమ్మసాగర్ నుంచి వచ్చిన వరదను వచ్చినట్లు దిగువకు వదిలేస్తున్నారు. వాటికి వాగులు, వంకల వరద తోడవుతుండటంతో భద్రాచలం వద్దకు బుధవారం 17 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో పోలవరం వద్ద 24 గంటలు అప్రమత్తంగా ఉంటున్న అధికారులు వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తూ.. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పోలవరం వద్ద 33.380 మీటర్లకు నీటిమట్టం పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద మంగళవారం సాయంత్రానికి గోదావరి నీటిమట్టం 33.380 మీటర్లకు చేరుకుంది. స్పిల్‌వే 48 గేట్ల నుంచి నీటిని దిగువకు వదిలేస్తున్నారు. ప్రాజెక్టు ప్రాంతానికి వెళ్లే ప్రధాన రోడ్డుమార్గంలోని కడెమ్మ వంతెనకు ఇరువైపులా వరదనీరు చేరింది. కాగా, గోదావరి ఉద్ధృతికి శబరి నది తోడవడంతో విలీన మండలాలు ముంపునకు గురయ్యాయి. కూనవరంలో ఉదయ్‌భాస్కర్ కాలనీ, గిన్నెలబజారు మంగళవారం ముంపునకు గురయ్యాయి. ముందస్తు చర్యల్లో భాగంగా అధికార యంత్రాంగం సోమవారం అర్ధరాత్రే ఇళ్లను ఖాళీ చేయించి బాధితులను కోతులగుట్ట పునరావాస కాలనీకి తరలించింది. కూనవరం వద్ద గోదావరి మట్టం 48 అడుగులకు చేరింది. చరిత్రలో ఏడో అతి పెద్ద వరద ఈ ఏడాది జనవరి 1 నుంచి మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు 4,734 టీఎంసీల గోదావరి జలాలు బంగాళాఖాతంలో కలిశాయి. బంగాళాఖాతంలో ఈ ఏడాది ఇప్పటివరకు కలిసిన గోదావరి జలాలను పరిగణలోకి తీసుకుంటే.. ధవళేశ్వరం బ్యారేజ్ చరిత్రలో గోదావరికి ఈ ఏడాది వచ్చిన ప్రవాహం ఏడో అతిపెద్ద వరద ప్రవాహం. ధవళేశ్వరం బ్యారేజ్ చరిత్రలో గరిష్టంగా 1990లో 7,092.285 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలవగా.. ఆ తర్వాత 1994లో 5,959.228 టీఎంసీలు, 2013లో 5,921.9 టీఎంసీలు, 1984లో 4,879.693 టీఎంసీలు, 2006లో 4,841.84 టీఎంసీలు, 1988లో 4,800.839 టీఎంసీలు సముద్రంలో కలిశాయి. గోదావరికి 1986లో ఆగస్టు 16న గరిష్టంగా 36 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చినప్పుడు ఆ ఏడాదిలో ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 3,213.371 టీఎంసీలే సముద్రంలో కలవడం గమనార్హం. -
గోదావరి మళ్లీ ఉగ్రరూపం
సాక్షి, అమరావతి/పోలవరం రూరల్: గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. పరీవాహక ప్రాంతం (బేసిన్)లో మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మన రాష్ట్రంలోని ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో విస్తృతంగా శనివారం, ఆదివారం వర్షాలు కురువడంతో ప్రధాన పాయతోపాటు ఉపనదులు మంజీర, మానేరు, ప్రాణహిత, ఇంద్రావతి, వాగులు, వంకలు ఉప్పొంగుతుండటంతో గోదావరిలో వరద ఉద్ధృతి పెరుగుతోంది. గోదావరి ప్రధానపాయపై జైక్వాడ్ నుంచి బాబ్లీ వరకు అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తేయడం, వాటికి మంజీర వరద తోడవుతుండటంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ఉద్ధృతి పెరిగింది. వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తుండటం.. వాటికి కడెం వాగు, ఇతర వాగుల వరద తోడవుతుండటంతో ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పెరుగుతోంది. ఎల్లంపల్లి నుంచి దిగువకు విడుదల చేసిన వరదకు ప్రాణహిత, ఇంద్రావతి జలాలు తోడవుతుండటంతో కాళేశ్వరంలో అంతర్భాగమైన మేడిగడ్డ, దానికి దిగువన తుపాకులగూడెం బ్యారేజీలలోకి వరద ఉద్ధృతి పెరుగుతోంది. తుపాకులగూడెం, సీతమ్మసాగర్లలోకి వచ్చిన వరద వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తుండటంతో భద్రాచలం వద్ద వరద ప్రవాహం గంటగంటకు పెరుగుతోంది. రాత్రి 7 గంటలకు 10.36 లక్షల క్యూసెక్కుల ప్రవాహం రావడంతో నీటిమట్టం 45.6 అడుగులకు చేరింది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీచేశారు. భద్రాచలం నుంచి పోలవరం వద్దకు వచ్చిన వరదను వచ్చినట్టుగా 48 గేట్ల నుంచి దిగువకు వదిలేస్తున్న అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద నీటిమట్టం సోమవారం 32.1 మీటర్లకు చేరుకుంది. ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి 7,08,251 క్యూసెక్కులు చేరుతోంది. గోదావరి డెల్టాకు 2,600 క్యూసెక్కులను విడుదల చేస్తూ, 175 గేట్లను పూర్తిగా ఎత్తేసి 7,05,651 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. మంగళవారం ఉదయానికి ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి చేరే వరద 10.50 లక్షల క్యూసెక్కులకు చేరుకునే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల గోదావరి బేసిన్లో మరో రెండురోజులు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో మరో మూడురోజులు గోదావరికి వరద ఉద్ధృతి కొనసాగనుంది. -
కృష్ణా, గోదావరిలో మరింత తగ్గిన వరద
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురిసౌత్: పరివాహక ప్రాంతాల్లో (బేసిన్లో) వర్షపాత విరామంతో నదుల్లో వరద ప్రవాహం క్రమేణ తగ్గుతోంది. జూరాల, సుంకేశుల నుంచి సోమవారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరుతున్న కృష్ణాజలాల ప్రవాహం 1,76,232 క్యూసెక్కులకు తగ్గింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, కల్వకుర్తి, హంద్రీ–నీవా ద్వారా 21,288 క్యూసెక్కులను తరలిస్తున్నారు. ప్రాజెక్టులో 884.4 అడుగుల్లో 211.95 టీఎంసీలను నిల్వ చేస్తున్నారు. కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ, స్పిల్ వే మూడు గేట్లను పదడుగులు ఎత్తి మొత్తం 1,46,469 దిగువకు వదులుతున్నారు. సాగర్‌లోకి 97,724 క్యూసెక్కులు చేరుతుండగా.. కుడి, ఎడమ కాలువలు, ఏఎమ్మార్పీ, వరద కాలువల ద్వారా 20,039 క్యూసెక్కులు తరలిస్తున్నారు. ప్రధాన విద్యుత్కేంద్రం, స్పిల్ వే గేట్ల ద్వారా 76,305 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రస్తుతం సాగర్‌లో 587.7 అడుగుల్లో 305.92 టీఎంసీల నీరు ఉంది. పులిచింతల ప్రాజెక్టులోకి 85 వేల క్యూసెక్కుల నీరు చేరుతోంది. ఇక్కడ 171.14 అడుగుల్లో 38.55 టీఎంసీలను నిల్వచేస్తూ.. స్పిల్ వే గేట్లు, విద్యుత్కేంద్రం ద్వారా 58,562 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ప్రకాశం బ్యారేజ్‌లోకి 1,10,527 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణాడెల్టాకు 15,037 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. మిగిలిన 95,490 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. సాధారణ స్థాయికి గోదావరి వర్షాలు తెరపి ఇవ్వడంతో ఉపనదుల్లో వరద తగ్గి గోదావరిలో ప్రవాహం సాధారణ స్థాయికి చేరుకుంది. ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి 4,89,531 క్యూసెక్కులు చేరుతుండగా, గోదావరి డెల్టాకు 9,467 క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగిలిన 4,80,064 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. స్థిరంగా వంశ‘ధార’ వంశధార నదిలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. గొట్టా బ్యారేజ్‌లోకి 24,399 క్యూసెక్కులు చేరుతుండగా, వంశధార ఆయకట్టుకు 2,231 క్యూసెక్కులను, 19,636 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. నాగావళి నుంచి తోటపల్లి బ్యారేజ్‌లోకి 8,649 క్యూసెక్కులు చేరుతుండగా, ఆయకట్టుకు 1,520 క్యూసెక్కులను విడుదల చేస్తూ, 1,851 క్యూసెక్కులను వదిలేస్తున్నారు. -
గోదావరి, కృష్ణాలో వరద తగ్గుముఖం
సాక్షి, అమరావతి/ధవళేశ్వరం/చింతూరు/శ్రీశ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురిసౌత్(మాచర్ల): పరీవాహక ప్రాంతాల(బేసిన్)లో వర్షాలు తగ్గడంతో గోదావరి, కృష్ణా నదుల్లో వరద ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది. శనివారం సాయంత్రం 6 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 39.8 అడుగులకు తగ్గడంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. పోలవరం ప్రాజెక్టు 48 గేట్ల నుంచి విడుదల చేస్తున్న ప్రవాహంలో ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి 13,05,222 క్యూసెక్కులు వస్తోంది. ఇక్కడి నుంచి గోదావరి డెల్టాకు 11 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మిగులుగా ఉన్న 12,94,222 క్యూసెక్కులను 175 గేట్ల ద్వారా దిగువకు వదిలేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. వచ్చిన వరద వచ్చినట్టు దిగువకు కృష్ణాలో వరద ప్రవాహం తగ్గింది. కృష్ణా ప్రధాన పాయపై ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్రపై ఉన్న తుంగభద్ర డ్యామ్, భీమాపై ఉన్న ఉజ్జయిని డ్యామ్‌లు నిండుగా ఉండటంతో వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తున్నారు.ప్రస్తుతం శ్రీశైలంలో 884.4 అడుగుల్లో 212.43 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. నాగార్జునసాగర్‌లోకి 2,25,787 క్యూసెక్కులు చేరుతుండగా.. కుడి కాలువ ద్వారా 9,104, ఎడమ కాలువ ద్వారా 8,108, ఏఎమ్మార్పీ ద్వారా 2,400, వరద కాలువ ద్వారా 400, ప్రధాన విద్యుత్కేంద్రం ద్వారా 32,195 క్యూసెక్కులు, స్పిల్ వే 22 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 1,73,580 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రస్తుతం సాగర్‌లో 586 అడుగుల్లో 301.1 టీఎంసీలను నిల్వ చేస్తున్నారు. సాగర్ నుంచి వదులుతున్న జలాల్లో పులిచింతలలోకి 2,01,752 క్యూసెక్కులు చేరుతుండగా.. స్పిల్ వే 5 గేట్లను 3.5 అడుగుల మేర ఎత్తి 1,31,213 క్యూసెక్కులు, విద్యుత్ కేంద్రం ద్వారా 8 వేలు వెరసి 1,39,213 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులో 169.71 అడుగుల్లో 37.95 టీఎంసీలను నిల్వ చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్‌లోకి 1,36,531 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టా కాలువలకు 12,901 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. 1,23,630 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. వంశధార, నాగావళి పోటాపోటీ: వంశధార, నాగావళి నదులు పోటాపోటీగా ప్రవహిస్తున్నాయి. వంశధార నుంచి గొట్టా బ్యారేజ్‌లోకి 48,583 క్యూసెక్కులు వస్తున్నాయి. ఆయకట్టుకు 1,665 క్యూసెక్కులు, కడలిలోకి 38,307 క్యూసెక్కులను వదిలేస్తున్నారు. నాగావళి నుంచి తోటపల్లి బ్యారేజ్‌లోకి 23,330 క్యూసెక్కులు చేరుతుండగా.. ఆయకట్టుకు 1,520 క్యూసెక్కులు, మిగులుగా ఉన్న 21,256 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. -
‘పులస’ ప్రియులకు ఈ ఏడాది నిరాశేనా?
ఏదీ ఆ రుచి? ఆ అమోఘమైన రుచి ఏమైనట్టు? అద్భుతమైన ఆ రుచి ఎటు పోయినట్టు? పుస్తెలు అమ్మైనా పులస తినాలంటారే.. అసలు ఈ ఏడాది పులసల జాడేది? అవి లేకుంటే జిహ్వ చాపల్యం తీరేదెలా? మైమరపించే ఆ రుచిపై మోజు తీరేదెలా? పులసమ్మా.. పులసమ్మా.. ఏమైతివే? ఎటు పోతివే? కాసింత కానరావే..! సాక్షిప్రతినిధి, కాకినాడ: గోదావరి వరద ఉధృతి పులసను ఓడించింది. లక్షలాది క్యూసెక్కుల ప్రవాహానికి ఎదురీదలేక పులస తలవంచింది. సముద్రంలో ఇలసలు గోదావరికి ఎదురీదుతూ పులసలుగా మారతాయి. జూలై – ఆగస్టు నెలల మధ్య పులసల సీజన్. ఆగస్టు వచ్చి మూడు వారాలు గడచినా గోదావరి తీరంలో పులసల జాడ లేదు. మత్స్యకారుల వలకు చిక్కడం లేదు. దీంతో పులసలంటే పడిచచ్చే మాంసాహార ప్రియులు ఉసూరుమంటున్నారు. పులసల సీజన్లో మూడొంతులు గోదావరికి వరదలతోనే గడిచిపోయింది. మునుపెన్నడూ లేని స్థాయిలో జూలైలో వరదలు గోదావరిని ముంచెత్తాయి. అదే వరద ఒరవడి ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. దీంతో సముద్రంలోని ఇలసలు గోదావరికి ఎదురీదలేక వెనక్కి పోతున్నాయని మత్స్యకారులు చెబుతున్నారు. గోదావరిలో ఆగస్టు 10 నుంచి మొదటి, రెండో ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. వరద ఉధృతి తీవ్రంగా ఉండటమే పులసలు రాకపోవడానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. సముద్రంలో ఉండే ఇలస(హిల్స)చేప పునరుత్పత్తి కోసం ఎదురీదుతూ గోదావరికి వచ్చే సరికి పులస అవుతుంది. గోదావరి నుంచి సముద్రానికి వచ్చే నీటి ప్రవాహాన్ని తట్టుకుని ఈదుకుంటూ రావాలి. లక్షన్నర నుంచి మూడు లక్షల క్యుసెక్కులు స్థాయిలో గోదావరి నుంచి సముద్రానికి నీటి విడుదల ఉంటే.. సముద్రం వైపు నుంచి విలసలు గోదావరికి రాగలుగుతాయి. ఆగస్టులో వరదలు మొదటి పది రోజులు మూడు లక్షలు, అప్పటి నుంచి 20–8–2022 వరకు ఏ రోజూ 10 లక్షల క్యుసెక్కులకు తక్కువ కాకుండా మిగులు జలాల (వరద నీరు)ను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. అలా రోజూ లక్షల క్యుసెక్కుల నీరు సముద్రానికి చేరుతుంటే.. ఆ నీటి ఉధృతిని తట్టుకుని విలసలు సముద్రం నుంచి గోదావరికి ఎదురీదలేకపోతున్నాయి. అలాగే గోదావరి, బంగాళాఖాతం కలిసే సీ మౌత్(నదీ ముఖద్వారం వద్ద)లు మొగలు పూడుకుపోవడం కూడా పులస రాకకు అడ్డుగా మారి ఉండొచ్చని మత్స్యశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో విలసలు గోదావరి వైపు రాకుండా పశ్చిమ బెంగాల్, ఒడిశా వైపు తరలిపోతున్నాయి. ఆ రుచికి.. ఈ రుచికి అసలు పొంతనే లేదు గోదావరిలో పులసలు లభించకపోవడంతో ఒడిశా సముద్ర జలాల్లో లభిస్తున్న విలసలను గోదావరి జిల్లాలకు తెచ్చి జోరుగా విక్రయిస్తున్నారు. ఒడిశా నుంచి ఎదుర్లంక, యానాం, కోటిపల్లి తదితర ప్రాంతాలకు వ్యాన్లలో తీసుకొచ్చి మరీ అమ్ముతున్నారు. అరకిలో విలస రూ.1,000 నుంచి రూ.1,500 పలుకుతోంది. అంతగా రుచి లేకున్నా పులస ప్రియులు అలా సర్దుకుపోతున్నారు. గోదావరిలో లభించే పులస రుచికి, ఈ విలస రుచికి అసలు పొంతనే లేదంటున్నారు. గత సీజన్లో పులసలు ఒక్కోటి కిలో నుంచి నాలుగైదు కిలోల పరిమాణంలో లభించేవి. ధర రూ.10 వేలకు పైనే పలికేది. ఎదురీదలేక.. గోదావరికి ఉధృతంగా వరదలు రావడంతో పులసలు ఎదురీదలేకపోతున్నాయి. దీంతో గోదావరిలో పులసలు కానరావడం లేదు. ప్రస్తుతానికి ఒడిశాలో దొరికిన విలసలను అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాం. – నాటి పార్వతి, మత్స్యకార మహిళ, యానాం. విచక్షణ రహిత వేటతో పులసలకు ప్రమాదం విచక్షణ రహితంగా సాగుతున్న వేట కారణంగానే గోదావరిలో పులసల సంఖ్య నానాటికీ తగ్గిపోతుంది. గతంలో దాదాపు ఆరు కిలో మీటర్ల మేర మాత్రమే సముద్రంలో వేట సాగేది. ప్రస్తుతం ఆధునిక బోట్లు, వలల కారణంగా వంద కిలో మీటర్లు కూడా వేట సాగుతోంది. ఫలితంగా పలు రకాల చేపలు అంతరించిపోతున్నాయి. అందులో పులస జాతి కూడా ఉంది. – పీవీ కృష్ణారావు, అసిస్టెంట్ డైరెక్టర్, ఫిషరీస్, రాజమహేంద్రవరం -
భద్రాచలం వద్ద ఉధృతంగా ప్రవహిస్తోన్న గోదావరి
-
నదుల్లో స్థిరంగా వరద
సాక్షి, అమరావతి/శ్రీశ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురిసౌత్/ధవళేశ్వరం: పరీవాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి నదుల్లో వరద స్థిరంగా కొనసాగుతోంది. జూరాల, సుంకేశుల బ్యారేజ్‌ల నుంచి సోమవారం సాయంత్రం శ్రీశైలం ప్రాజెక్టులోకి 4,16,834 క్యూసెక్కులు చేరుతున్నాయి. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 14 వేలు, హంద్రీ–నీవా ద్వారా 1,688, కల్వకుర్తి ద్వారా 1,222 క్యూసెక్కులు తరలిస్తున్నారు. ప్రాజెక్టులో 884.4 అడుగుల్లో 212.43 టీఎంసీలను నిల్వ చేస్తూ.. పది గేట్లను 12 అడుగుల మేర ఎత్తి 3,76,670 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి చేస్తూ కుడి కేంద్రం ద్వారా 30,674, ఎడమ కేంద్రం ద్వారా 31,874 క్యూసెక్కులు దిగువకు వదలుతున్నారు. ► నాగార్జునసాగర్‌లోకి 3,41,072 క్యూసెక్కులు చేరుతుండగా.. కుడి కాలువకు 8,604, ఎడమ కాలువకు 8,541, ఏఎమ్మార్పీకి 2,400, వరద కాలువకు 300 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రాజెక్టులో 585.4 అడుగుల్లో 298.58 టీఎంసీలు నిల్వ చేస్తున్నారు. ప్రధాన కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 32,485, 26 గేట్ల ద్వారా 2,88,382 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ► పులిచింతల ప్రాజెక్టులోకి 2,83,921 క్యూసెక్కులు చేరుతుండగా గేట్లు, విద్యుదుత్పత్తి ద్వారా 2,58,838 క్యూసెక్కులు వదిలేస్తున్నారు. ప్రసుత్తం పులిచింతలలో 45.77 టీఎంసీలకు గాను 35.90 టీఎంసీలను నిల్వ చేస్తున్నారు. ► ప్రకాశం బ్యారేజ్‌లోకి 2,85,055 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టాకు 14,955 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మిగులుగా ఉన్న 2,70,100 క్యూసెక్కులను 70 గేట్ల ద్వారా సముద్రంలోకి వదిలేస్తున్నారు. ► పశ్చిమ కనుమల్లో వర్షాలు తగ్గడంతో ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర డ్యామ్‌లలోకి చేరుతున్న వరద తగ్గుతోంది. దాంతో మంగళవారం నుంచి శ్రీశైలంలోకి వచ్చే వరద తగ్గనుంది. గోదావరిలో కొద్దిగా తగ్గిన వరద గోదావరిలో వరద నిలకడగా కొనసాగుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి వరద ఉధృతి కొంతమేర తగ్గింది. సోమవారం రాత్రి 8 గంటలకు కాటన్ బ్యారేజ్ వద్ద 14.20 అడుగులకు నీటి మట్టం చేరింది. బ్యారేజ్ నుంచి 13,54,329క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. డెల్టా కాలువలకు 10,500 క్యూసెక్కులు వదిలారు. భద్రాచలం వద్ద నీటి ఉధృతి మరింత తగ్గింది. వంశధార, నాగావళి పోటాపోటీ ఒడిశా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు వంశధార, నాగావళి పోటాపోటీగా ప్రవహిస్తున్నాయి. గొట్టా బ్యారేజ్‌లోకి 82,575 క్యూసెక్కులు చేరుతుండగా.. వంశధార ప్రాజెక్టు ఆయకట్టుకు 2,500 క్యూసెక్కులు వదులుతూ మిగులుగా ఉన్న 80,075 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. తోటపల్లి బ్యారేజ్ నుంచి నారాయణపురం ఆనకట్టలోకి 28 వేల క్యూసెక్కుల నాగావళి ప్రవాహం చేరుతుండగా.. అంతే స్థాయిలో సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
తృటిలో తప్పిన పెద్ద పడవ ప్రమాదం
పి.గన్నవరం: అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలంలో పెద్ద పడవ ప్రమాదం త్రుటిలో తప్పింది. ఈ సీజన్లో గోదావరికి రెండోసారి వరదలు వచ్చిన నేపథ్యంలో.. మానేపల్లి నుంచి సుమారు రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న శివాయలంకలోని వరద బాధితులకు సర్పంచ్ పితాని చంద్రకళ భర్త నరసింహారావు రోజూ పడవపై వాటర్ టిన్నులు తీసుకువెళ్లి అందిస్తున్నారు. ఇదేవిధంగా నరసింహారావు, వలంటీర్లు కౌరు నందు, షేక్ రెహ్మాన్, చిన్నం రవీంద్ర 40 వాటర్ టిన్నులు తీసుకుని ఆదివారం శివాయలంకకు బయల్దేరారు. ఆ పడవలో కౌరు శ్రీను, పుచ్చకాయల సత్యనారాయణ, పడవ నడిపే వ్యక్తులు మల్లాడి ఏడుకొండలు, రామకృష్ణ ఉన్నారు. ఏటిగట్టు నుంచి 300 మీటర్ల దూరం వెళ్లేసరికి కేబుల్ టీవీ మెయిన్ లైన్ వైరు పడవకు అడ్డం పడింది. దానిని తప్పించే క్రమంలో అదుపుతప్పిన పడవ వైనతేయ గోదావరి నదిలో బోల్తా పడింది. ఆ ప్రాంతంలో నది సుమారు 10 అడుగుల లోతు ఉంది. అందులో ఉన్న 8 మంది అతికష్టం మీద సమీపంలోని మెరక ప్రాంతంలోని రోడ్డు పైకి చేరుకుని వరద నీటిలో నిలుచున్నారు. విషయం తెలుసుకున్న సచివాలయ సిబ్బంది హుటాహుటిన మరో పడవను పంపించి, నదిలో చిక్కుకున్న వారిని ఒడ్డుకు తరలించారు. వలంటీర్ రవీంద్ర నదిలో మునిగి నీరు తాగడంతో అస్వస్థతకు గురయ్యాడు. ఆ ప్రాంతంలో వరద ప్రవాహం పెద్దగా లేకపోవడంతో ప్రమాదం తప్పింది. -
‘కృష్ణా’లో స్థిరంగా వరద ఉధృతి
సాక్షి, అమరావతి/ధవళేశ్వరం/విజయపురిసౌత్ (మాచర్ల)/అచ్చంపేట/పోలవరం రూరల్: పరీవాహక ప్రాంతంలో ఎగువన ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా నదిలో వరద ఉధృతి స్థిరంగా కొనసాగుతుండగా గోదావరిలో క్రమంగా తగ్గుతోంది. జూరాల నుంచి కృష్ణా, సుంకేశుల నుంచి తుంగభద్ర ద్వారా శనివారం సా.6 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 4,25,563 క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండగా.. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా 14 వేలు, హంద్రీ–నీవా ద్వారా 1,688 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తి చేస్తూ కుడి కేంద్రం ద్వారా 30,252, ఎడమ కేంద్రం ద్వారా 31,784 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రాజెక్టులో 884.3 అడుగుల్లో 211.47 టీఎంసీలను నిల్వచేస్తూ.. పది గేట్లను 15 అడుగుల మేర ఎత్తి 3,76,170 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. సాగర్‌లోకి 4.09 లక్షల క్యూసెక్కులు అలాగే, నాగార్జునసాగర్‌లోకి 4,09,963 క్యూసెక్కులు చేరుతుండగా.. 586.3 అడుగుల్లో 301.87 టీఎంసీలను నిల్వచేస్తూ.. 3,58,120 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. పులిచింతల్లోకి 3,77,117 క్యూసెక్కులు చేరుతుండగా.. 168.01 అడుగుల్లో 35.59 టీఎంసీలను నిల్వచేస్తూ.. 17 గేట్లు, విద్యుదుత్పత్తి ద్వారా 3,40,827 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ఇక పులిచింతల నుంచి దిగువకు వదిలేస్తున్న నీటికి పాలేరు, మున్నేరు వరద తోడవుతుండడంతో ప్రకాశం బ్యారేజ్‌లోకి 4,15,036 క్యూసెక్కులు చేరుతోంది. మిగులుగా ఉన్న 4,02,944 క్యూసెక్కులను 70 గేట్ల ద్వారా సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఎగువన విస్తారంగా వర్షాలు కురుస్తుండటంలో ఆల్మట్టి, నారాయణపూర్‌లలోకి వచ్చిన నీటిని వచ్చిట్లుగా 2.30 లక్షల క్యూసెక్కులను, తుంగభద్ర డ్యామ్ నుంచి 1.05 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం కూడా శ్రీశైలం, సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్‌లలోకి ఇదే రీతిలో వరద కొనసాగనుంది. గోదావరిలో క్రమంగా తగ్గుముఖం మరోవైపు.. గోదావరిలోనూ వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. ఆదివారం నాటికి మరింత తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. భద్రాచలం వద్ద నీటిమట్టం 52 అడుగుల్లో కొనసాగుతోంది. పోలవరం ప్రాజెక్టులోకి వచ్చిన వరదను వచ్చినట్టుగా 48 గేట్ల ద్వారా దిగువకు వదిలేస్తున్నారు. దీంతో శనివారం రాత్రి 9 గంటలకు ధవళేశ్వరం బ్యారేజి వద్ద నీటి మట్టం 14.90 అడుగులకు చేరింది. మిగులుగా ఉన్న 14,74,377 క్యూసెక్కులను 175 గేట్ల ద్వారా సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
కడలి ఒడిలోకి
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: విస్తారంగా కురుస్తున్న వర్షాలు.. పోటెత్తుతున్న ప్రవాహాలతో ప్రాజెక్టులన్నీ నిండిపోయి గేట్లు ఎత్తి వేయడంతో కడలి వైపు నదులు పరుగులు పెడుతున్నాయి. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ప్రకాశం బ్యారేజ్ నుంచి 4,28,120 (36.99 టీఎంసీలు) క్యూసెక్కుల కృష్ణా జలాలు, ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 14,76,919 (127.62 టీఎంసీలు) క్యూసెక్కుల గోదావరి జలాలు, గొట్టా బ్యారేజ్ నుంచి 14 వేల క్యూసెక్కుల (1.20 టీఎంసీలు) వంశధార జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. నాగార్జునసాగర్, భద్రాచలం దిగువన కృష్ణమ్మ, గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ప్రవాహాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద శుక్రవారం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కృష్ణాలో స్థిరంగా వరద.. ► జూరాల, సుంకేశుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ఉద్ధృతి స్థిరంగా కొనసాగుతోంది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం జలాశయంలోకి 4,55,614 క్యూసెక్కులు చేరుతున్నాయి. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 14 వేలు, హంద్రీ–నీవా ద్వారా 1,688 క్యూసెక్కులను తరలిస్తున్నారు. కల్వకుర్తి ద్వారా 400 క్యూసెక్కులను తెలంగాణ తరలిస్తోంది. శ్రీశైలంలో పది గేట్లను 15 అడుగుల మేర ఎత్తి 3,77,650 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. విద్యుదుత్పత్తి చేస్తూ కుడి గట్టు కేంద్రం ద్వారా 26,825, ఎడమ గట్టు కేంద్రం ద్వారా 31,784 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో 884.6 అడుగుల్లో 213.40 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ► శ్రీశైలం నుంచి వదులుతున్న జలాల్లో నాగార్జునసాగర్‌లోకి 4,11,932 క్యూసెక్కులు చేరుతుండగా కుడి కాలువకు 6,766, ఎడమ కాలువకు 7,937, ఏఎమ్మార్పీకి 2,400, వరద కాలువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. సాగర్‌లో 24 గేట్లను పది అడుగులు, రెండు గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి 3,61,602 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రధాన కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 32,927 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్‌లో 587 అడుగుల్లో 305.56 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. భారీ వరద నేపథ్యంలో సాగర్ టెయిల్‌పాండ్‌లో రెండు యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి నిలిపి వేసినట్లు అధికారులు తెలిపారు. ► నాగార్జునసాగర్ నుంచి పులిచింతల ప్రాజెక్టులోకి 3,93,029 క్యూసెక్కులు చేరుతున్నాయి. 14 గేట్లను 3.5 అడుగుల మేర ఎత్తి 3,52,352 క్యూసెక్కులను, విద్యుదుత్పత్తి చేస్తూ 6 వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. పులిచింతలలో 165.94 అడుగుల్లో 32.83 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ► పులిచింతల నుంచి దిగువకు వస్తున్న నీటికి పాలేరు, మున్నేరు వరద తోడవుతుండటంతో ప్రకాశం బ్యారేజ్‌లోకి 4,42,083 క్యూసెక్కులు చేరుతున్నాయి. కృష్ణా డెల్టా కాలువలకు 13,963 క్యూసెక్కులు వదులుతూ మిగులుగా ఉన్న 4,28,120 క్యూసెక్కులను బ్యారేజీ 70 గేట్లను పూర్తిగా ఎత్తివేసి సముద్రంలోకి వదిలేస్తున్నారు. బ్యారేజీకి వరద నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వరద సమయంలో గతంలో దాదాపు 20 వేల కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాసం కల్పించాల్సి వచ్చేదని, కనకదుర్గ వారధి నుంచి దిగువకు కాంపౌండ్ వాల్ నిర్మాణం వల్ల ముంపు నుంచి రక్షణ కలిగిందని జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. ► ఎగువన కృష్ణా, తుంగభద్రలో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ఆల్మట్టి నుంచి 2.25 లక్షలు, నారాయణపూర్ నుంచి 2.33 లక్షలు, తుంగభద్ర డ్యామ్ నుంచి 88,896 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. శనివారమూ శ్రీశైలంలోకి వరద ఇదే రీతిలో కొనసాగనుంది. వంశధార, నాగావళి పరవళ్లు.. ఉత్తరాంధ్రలో వంశధార, నాగావళిలో వరద కొనసాగుతోంది. గొట్టా బ్యారేజ్‌లోకి 16,814 క్యూసెక్కుల వంశధార జలాలు చేరుతుండగా 2,814 క్యూసెక్కులను ఆయకట్టుకు విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 14 వేల క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. తోటపల్లి ప్రాజెక్టు నుంచి నారాయణపురం ఆనకట్టలోకి 3,600 క్యూసెక్కుల నాగావళి జలాలు చేరుతుండగా ఆయకట్టుకు 600 క్యూసెక్కులు వదులుతూ మిగులుగా ఉన్న 3 వేల క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. వరద గోదారి.. కాళేశ్వరంలో అంతర్భాగమైన పార్వతి, సరస్వతి, లక్ష్మీ బ్యారేజ్‌లు, తుపాకులగూడెం వద్ద ఉన్న సమ్మక్క బ్యారేజ్, దుమ్ముగూడెం వద్ద ఉన్న సీతమ్మసాగర్‌లోకి వచ్చిన వరద వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తుండటంతో భద్రాచలం వద్ద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు నీటి మట్టం 52.1 అడుగుల్లో ఉండగా రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టులోకి 12,17,365 క్యూసెక్కులు చేరుతుండటంతో స్పిల్ వేకు ఎగువన 34.13 మీటర్లు, దిగువన 25.72 మీటర్ల మేర వరద మట్టం నమోదైంది. ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి 14,85,919 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి మట్టం 15 అడుగులకు చేరుకుంది. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు. గోదావరి డెల్టా కాలువలకు 9 వేల క్యూసెక్కులను విడుదల చేస్తూ బ్యారేజ్ 175 గేట్లను పూర్తిగా ఎత్తివేసి 14,76,919 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
ఉదారంగా సాయం అందించండి.. కేంద్ర బృందానికి రాష్ట్ర అధికారుల వినతి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత నెలలో వచ్చిన గోదావరి వరదలు మునుపెన్నడూ లేని రీతిలో ప్రభావం చూపాయని, సాయం అందించే విషయంలో ఉదారంగా స్పందించాలని విపత్తుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ కేంద్ర బృందాన్ని కోరారు. హోంమంత్రిత్వ శాఖ ఆరి్థక సలహాదారు (ఎన్డీఎంఏ) రవినేష్ కుమార్ నేతృత్వంలోని బృందం రెండు రోజులపాటు గోదావరి వరదలకు ముంపునకు గురైన అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా, ఏలూరు జిల్లా, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో పర్యటించింది. అనంతరం గురువారం రాష్ట్ర అధికారులతో సమావేశమైంది. రవినేష్ కుమార్‌తోపాటు బృందం సభ్యులు డాక్టర్.కె.మనోహరన్, శ్రావణ్ కుమార్ సింగ్, పి.దేవేందర్ రావు, ఎం.మురుగునాధన్, అరవింద్ కుమార్ సోని ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో వరదల ప్రభావం, క్షేత్ర స్థాయిలో జరిగిన నష్టాన్ని సాయిప్రసాద్, విపత్తుల సంస్థ ఎండీ బి.ఆర్.అంబేడ్కర్ కేంద్ర బృందానికి వివరించారు. రాష్ట్ర కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు వరద ఉధృతిపై జిల్లా కలెక్టర్లకు సూచనలిచి్చనట్లు తెలిపారు. ముందుస్తుగానే జిల్లాల్లోకి సహాయక బృందాలను పంపించా మని వివరించారు. 10 ఎన్డీఆర్ఎఫ్, 11 ఎస్డీఆర్ ఎఫ్, 3 ఇండియన్ నేవీ బృందాలతో ముంపులో చిక్కుకున్న 183 మందిని రక్షించి, మరో 9 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. సహాయక బృందాలు కూడా చేరుకోలేని ఏలూరు జిల్లా కుకునూరు, వేలేరుపాడు మండలాల్లోని గ్రామాలకు హెలికాప్టర్ల ద్వారా ఆరు రోజుల పాటు ఆహారం, నిత్యావసరాలను అందించినట్లు తెలిపారు. గర్భిణుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించామన్నారు. ప్రభుత్వ స్పందన భేష్ రవినేష్‌కుమార్ మాట్లాడుతూ మూడు జిల్లాల్లో వరదలకు దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించామన్నారు. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు ఎక్కువగా నష్టం వాటిల్లిందని చెప్పారు. వరద సమయంలో ప్రభుత్వ చర్యలు, యంత్రాంగం సత్వర స్పందనను అభినందించారు. ముఖ్యం గా వలంటీర్ వ్యవస్థ సేవలు బాధితులకు అండగా నిలిచాయని ప్రశంసించారు. అత్యవసర సరీ్వసులను వెంటనే పునరుద్ధరించడంలో అధికారులు సమయస్ఫూర్తితో పనిచేశారని కొని యాడారు. కలెక్టర్లకు వెంటనే నిధులు మంజూ రు చేయడంతో వేగంగా సహాయక చర్యలు చేపట్టినట్టు గుర్తించామన్నారు. తమ నివేదికను త్వ రగా కేంద్ర ప్రభుత్వానికి అందిస్తామని, వీలైనంత మేర సహాయం అందించడానికి సహకారాన్ని అందిస్తామని తెలిపారు. సమావేశంలో విద్యుత్ శాఖ డైరెక్టర్ రమేష్ ప్రసాద్, ఇరిగేషన్ ఈఎన్సీ నారాయణరెడ్డి, ఆర్ అండ్ బీ ఈఎన్సీ నయిమ్ఉల్లా, ఆర్డబ్ల్యూఎస్ సీఈ హరేరాము, ఫిషరీస్ జేడీ హీరానాయక్, విపత్తుల సంస్థ ఈడీ సి.నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో కేంద్ర బృందం పర్యటన సాక్షి అమలాపురం: గోదావరి వరదల వల్ల కలిగిన నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం నియమించిన ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్ (ఐఎంసీటీ) గురువారం డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించింది. రావులపాలెం మండలం గోపాలపురం, పి.గన్నవరం మండలం నాగుల్లంక, రాజోలు మండలం నున్నవారిబాడవలో నష్టాన్ని పరిశీలించింది. పంట నష్టం, రైతులు, మత్స్యకారుల అభిప్రాయాలు, సాంకేతిక అంచనాలను సేకరించింది. వివిధ వర్గాలవారికి, రోడ్లు, విద్యుత్, ఇతర మౌలిక సదుపాయాలకు కలిగిన నష్టాన్ని పరిశీలించింది. ఫొటో ఎగ్జిబిషన్ తిలకించింది. జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా, రాష్ట్ర ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి వరదల వల్ల జరిగిన నష్టాన్ని, బాధితులకు అందించిన సాయాన్ని, దెబ్బతిన్న పంటల వివరాలను, రోడ్లు, విద్యుత్ లైన్లకు జరిగిన నష్టాన్ని ఛాయాచిత్రాలు చూపిస్తూ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో ఆదుకుంది ఆపదలో ఉన్న తమను రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో ఆదుకుందని అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని వరద బాధిత రైతులు, మత్స్యకారులు, ప్రజలు కేంద్ర బృందానికి తెలిపారు. పునరావాసం కలి్పంచిందని, ఆహారం, తాగు నీరు అందించిందని వివరించారు. నిత్యావసర వస్తువులు, నగదు సాయం అందజేసిందన్నారు. కేంద్రంతో మాట్లాడి పంటలకు ఇచ్చే నష్ట పరిహారాన్ని పెంచేలా చూడాలని రైతులు ఈ బృందాన్ని కోరడం విశేషం. కేంద్ర బృందంలో రవినేష్ కుమార్‌తోపాటు వ్యవసాయ సహకార రైతు సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ కె.మనోహరం, రోడ్డు రవాణా జాతీయ రహదారుల విభాగం ఎస్ఈ శరవన్ కుమార్ సింగ్, కేంద్ర జలశక్తి, జల వనరుల శాఖ సంచాలకులు పి.దేవేందర్ రావు, కేంద్ర ఆరి్థక శాఖ సహాయ కార్యదర్శి మురుగన్ నాదమ్, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి అరవింద్ ఉన్నారు. -
లక్ష్మీ పంపుహౌస్‌లో బయటపడిన మోటార్లు! 28 రోజుల తర్వాత
కాళేశ్వరం: భారీ వర్షాలు, గోదావరి వరదతో నీట మునిగిన కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్మీ పంపుహౌస్‌లో మోటార్లు పైకి తేలాయి. నిజానికి పంపుహౌస్ నీట మునిగినప్పటి నుంచీ మీడియాను, బయటి వ్యక్తులెవరినీ అనుమతించ డం లేదు. పరి స్థితి ఏమిటన్న ది గోప్యంగా ఉంచారు. అయి తే మోటార్లు, పంపులు నీటి లోంచి బయటికి తేలిన, దెబ్బతిన్న వీడి యోలు గురువారం బయటికి వచ్చాయి. అధికారులు ఈ నెల 6వ తేదీ నాటికి నీటిని తోడేసే పని పూర్తయిందని, బురద తొలగింపు, క్లీనింగ్ పనులు చేస్తున్నారని తెలిసింది. అతి భారీ వరదతో.. చరిత్రలో ఎన్నడూ లేనంతగా గత నెల 14న గోదావరి, ప్రాణ హిత నదులు ఉగ్రరూపం దాల్చి.. కాళేశ్వరం వద్ద 16.90 మీటర్ల ఎత్తులో, 28.90 లక్షల క్యూసెక్కుల భారీ ప్రవాహం నమోదైన విషయం తెలిసిందే. దీనితో అప్రోచ్ కెనాల్ నుంచి వచ్చిన వరద హెడ్ రెగ్యులేటరీ గేట్ల లీకేజీ కారణంగా ఒక్కసారిగా ఫోర్‌బేకు చేరింది. ఈ ఒత్తిడికి ఫోర్‌బే రిజర్వాయర్‌కు, పంపుహౌస్‌కు మధ్య ఉన్న బ్రెస్ట్ వాల్ (రక్షణ గోడ) కూలిపోయి మోటార్లు, పంపులపై పడింది. అదే సమయంలో పైన బరువులు ఎత్తేందుకు అమర్చిన 220 టన్నుల బరువైన రెండు ఈఓటీ క్రేన్లు, రెండు లిఫ్ట్‌లు, రెండు ఫుట్‌పాత్ ఐరన్ నిచ్చెనలు విరిగిపడ్డాయి. దీంతో ఆరు మోటార్లు పూర్తిగా, మరికొన్ని పాక్షికంగా దెబ్బతిన్నట్టు తెలిసింది. ఈ మోటార్లను విదేశాల నుంచి ఆయా సంస్థల ఇంజనీర్లు వచ్చి పరిశీలించాల్సి ఉంది. అయితే పూర్తిగా దెబ్బతిన్న ఆరు మోటార్ల స్థానంలో కొత్తవి అమర్చాలని.. మిగతా వాటికి మరమ్మతులు అవసరమని రాష్ట్ర ఇంజనీర్లు ప్రతిపాదించినట్టు తెలిసింది. ఇక వరదలు తగ్గుముఖం పడితే రక్షణ గోడ నిర్మాణానికి అనువుగా ఉంటుందని ఇంజనీర్లు భావిస్తున్నారని.. రక్షణ గోడను పంపుహౌస్ పొడవునా నిర్మించేందుకు డిజైన్లు సిద్ధం చేస్తున్నారని తెలిసింది. -
వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందాల పరిశీలన
చింతూరు/పోలవరం రూరల్: ఇటీవల గోదావరి వరదలతో ప్రభావితమైన ప్రాంతాల్లో బుధవారం కేంద్రబృందాలు పర్యటించాయి. నష్టాలను పరిశీలించాయి. రవినేష్‌కుమార్, మురుగానందం సభ్యులుగా ఉన్న బృందం అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం, చింతూరు మండలాల్లోను, కె.మనోహరన్, పి.దేవేందర్, అరవింద్‌కుమార్ సోని సభ్యులుగా ఉన్న బృందం ఏలూరు జిల్లా పోలవరం గ్రామంలోను పర్యటించాయి. ఆయా జిల్లాల కలెక్టర్లు సుమిత్‌కుమార్, ప్రసన్నవెంకటేష్ వరద నష్టాలను ఆయా బృందాల సభ్యులకు వివరించారు. బృందం సభ్యులు వరదలకు కూలిన ఇళ్లను పరిశీలించి బాధితులతో మాట్లాడారు. అలాగే ఏలూరు జిల్లా పోలవరం గ్రామంలోని నెక్లెస్‌బండ్ కోతకు గురైన ప్రాంతాన్ని, యడ్లగూడెం ప్రాంతంలో నెక్లెస్‌బండ్‌ను వారు పరిశీలించారు. -
వరదొచ్చి నెల.. బతికేదెలా? రూ.10 వేల తక్షణ సాయానికి సాంకేతిక చిక్కులు
తాండ్ర కృష్ణగోవింద్ ఉవ్వెత్తున ఎగిసిన గోదావరి వరద తీరప్రాంతాలను ముంచెత్తింది. ఉగ్ర గోదావరి ధాటికి వేలాది మంది ఇల్లూవాకిలి వదిలి సహాయక శిబిరాలకు వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నారు. నెల రోజులు గడిచినా ఇప్పటికీ బాధితుల్లో సగం మంది సొంతింటికి దూరంగానే ఉన్నారు. ఓ వైపు ఆస్తులు కోల్పోయి, మరోవైపు పనుల్లేక ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ తోడ్పాటు, దాతలు అందించే సాయంతోనే ఇంకా బతుకు బండి నెట్టుకొస్తున్నారు. జూలైలోనే వచ్చింది.. సాధారణంగా గోదావరికి ఆగస్టులో వరదలు వస్తుంటాయి. కానీ ఈసారి జూలై ఆరంభంలోనే ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా వర్షాలు కురిశాయి. వాగులు, వంకలు పొంగాయి. గత నెల 11న భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 53 అడుగులకు చేరింది. దీంతో పాత రికార్డులు చెరిపేస్తూ జూలైలోనే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ముంపు ప్రాంతాల ప్రజలను శిబిరాలకు తరలించడం మొదలెట్టారు. ఆ తర్వాత జూలై 16 వరకు గోదావరి నీటిమట్టం అంతకంతకు పెరుగుతూ 71.35 అడుగులకు చేరింది. ఒక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే సుమారు 25 వేల కుటుంబాలను శిబిరాలకు తరలించారు. జూలై 17 నుంచి వరద తగ్గుముఖం పట్టడంతో క్రమంగా బాధితులు ఇళ్లకు చేరుకున్నారు. కానీ వరద విలయంతో వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. పక్కా ఇళ్లు సైతం ముగినిపోవడంతో అందులో ఉన్న మంచాలు, బీరువాలు, ఫ్రిడ్జ్, వాషింగ్ మెíషీన్, టీవీలు, పరుపులు, బట్టలు ఇలా సమస్తం పనికి రాకుండా పోయాయి. చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు మండలాల్లో 17 వేలకు పైగా కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయి. కట్టుబట్టలతోనే మిగిలాయి. డబ్బులకు కటకట వరదలు ముగిసినా వరుసగా వర్షాలు కురుస్తుండటంతో కూలీలకు పనులు దొరకడం లేదు. పాడైన ఇళ్లను మరమ్మతు చేయించుకునేందుకూ డబ్బుల్లేక చాలామంది అలాగే వదిలేస్తున్నారు. వరద సాయంగా ప్రభుత్వం అందించిన రేషన్ బియ్యం, పప్పు, నూనెలతోపాటు దాతలు ఇస్తున్న సరుకులతోనే కుటుంబాలను నెట్టుకొçÜ్తున్నారు. మరికొన్ని రోజులు వర్షాలు ఇలాగే కొనసాగితే ముంపు ప్రాంత ప్రజలకు ఆకలి బాధలు తప్పేలా లేవు. 1986, 1991లో గోదావరికి భీకరంగా వరదలు వచ్చినా.. ఆ రోజుల్లో అభివృద్ధి, ప్రజల జీవనశైలి సాధారణమే కాబట్టి కట్టుబట్టలతో ప్రాణాలు నిలుపుకున్నా ఆస్తినష్టం పెద్దగా లేదు. కానీ తాజా వరదలు ఇళ్లను, అందులోని సామగ్రిని నాశనం చేయడంతో భారీ ఎత్తున నష్టపోయారు. ఎప్పుడూ మోకాళ్లలోతు మించని వరద ఈసారి ఇంటి పైకప్పులను సైతం ముంచే స్థాయిలో రావడం, స్థానికులకు పీడకలగా మారింది. అందని సాయం వరదల్లో నష్టపోయిన వారికి తక్షణ సాయంగా సీఎం కేసీఆర్ రూ.10 వేల చొప్పున ప్రకటించారు. వరద తగ్గుముఖం పట్టగానే అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి 17వేలకుపైగా కుటుంబాలను గుర్తించారు. వీరి ఖాతాల్లో ఇటీవల రూ.10 వేలు జమ అవుతున్నాయి. అయితే బా«ధితుల గుర్తింపు సందర్భంగా చేపట్టిన సర్వేలో జరిగిన తప్పులతో ఇప్పటికీ వేలాది మందికి సాయం అందలేదు. దీంతో బా«దితులు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతు న్నారు. బ్యాంకుల విలీనం కారణంగా ఐఎఫ్ ఎస్సీ కోడ్ మారడంతో చాలామందికి ఆర్థిక సాయం అందలేదు. సత్వరమే చర్యలు తీసు కుని ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఈయన కొక్కిరేణి సాంబశివరావు. బూర్గంపాడు నివాసి. కూలి చేసుకుని కుటుంబాన్ని పోషించుకునేవాడు. అతను నిల్చున్న చోట ఓ ఇల్లు ఉండేది. అందులో భార్య, ఇద్దరు పిల్లలతో జీవించేవాడు. జూలైలో వచ్చిన వరదలకు ఇల్లు నామరూపాల్లేకుండా పోవడంతో కుటుంబానికి గూడు కరువైంది. బంధువుల ఇళ్లలో భార్యాపిల్లలను ఉంచాడు. కూలిపోయిన ఇంటిని ఎలా నిర్మించుకో వాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. ఈమె పేరు ముదిగొండ చంద్రమ్మ. గోదావరి వరదలు ఊరిని చుట్టేసిన సమయంలో ఆమె ఇల్లు నాలుగు రోజులపాటు వరద నీటిలో నానింది. ఇప్పుడు పనికిరాకుండా పోయింది. ఎప్పుడు కూలుతుందో తెలియని ఇంట్లో ఉండలేక కూతురు వద్ద తలదాచుకుంటోంది. 1986, 1991లో వచ్చిన వాటి కన్నా మొన్న వచ్చిన వరదలే చాలా ప్రమాదకరంగా ఉన్నాయని అంటోంది. డబ్బులు రాలేదు వరదల సమయంలో మా ఇల్లు పూర్తిగా మునిగి పాడైపోయింది. రిపేరు చేయించుకుందామంటే డబ్బుల్లేవు. సర్వేలో అ«ధికారులు మా పేరు రాసుకున్నారు. కానీ ఇంకా డబ్బులు రాలేదు. నాలుగు రోజుల నుంచి తహసీల్దార్ ఆఫీసుకు వస్తున్నా. ఎవరూ సరైన వివరాలు చెప్పడం లేదు. – రమణయ్య, భాస్కర్‌నగర్, బూర్గంపాడు మండలం పని మానుకుని వచ్చా.. వరదలకు ఇల్లు కొట్టుకుపోయింది. వర్షాలతో అసలు పనులే దొరకడం లేదు. రెండు రోజుల నుంచే కూలికి పోతున్నా. సీఎం ఇస్తానన్న రూ.ç³ది వేలు మాకు రాలేదు. ఆ డబ్బు వస్తే కష్టకాలంలో కొంత ఆసరా ఉంటది. దాని కోసమే పని వదిలి తహసీల్దార్ ఆఫీసుకు వచ్చాను. –పేట్ల కుమారి, బూర్గంపాడు -
కృష్ణా, గోదావరి పోటాపోటీ
సాక్షి, అమరావతి/పోలవరం రూరల్/శ్రీశైలం ప్రాజెక్ట్/ధవళేశ్వరం/విజయపురిసౌత్/గాంధీనగర్(విజయవాడ సెంట్రల్)/: నైరుతి రుతుపవనాలు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల పరీవాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా, గోదావరి నదులు వరద ఉధృతితో పోటాపోటీగా ప్రవహిస్తున్నాయి. కృష్ణా ప్రధాన ఉపనది తుంగభద్ర మంత్రాలయం వద్ద ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుండడంతో అధికారులు ప్రమాద హెచ్చరికను ఎగురవేసి ప్రజలను అప్రమత్తం చేశారు. అలాగే.. మహారాష్ట్ర, తెలంగాణ, చత్తీస్‌గఢ్, ఒడిశాలలో కురుస్తున్న వర్షాలకు పెన్ గంగ, ప్రాణహిత, ఇంద్రావతి నదులు ఉరకలెత్తుతుండటంతో గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద గంట గంటకూ ప్రవాహం పెరుగుతోంది. ఇక్కడ మంగళవారం సా.6 గంటలకు 9,74,666 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి మట్టం 44 అడుగులకు చేరుకుంది. దాంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఎగురవేశారు. మరోవైపు..కృష్ణా, గోదావరి నదుల్లో బుధవారం వరద ఉధృతి మరింతగా పెరిగే అవకాశం ఉందని బేసిన్ పరిధిలోని రాష్ట్రాలను కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అప్రమత్తం చేసింది. శ్రీశైలం ప్రాజెక్టు ఏడు గేట్లు ఎత్తివేత.. కృష్ణా, తుంగభద్రల నుంచి భారీ వరదకు తోడు వాగులు, వంకల వరద తోడవవుతుండటంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి వస్తున్న వరద ప్రవాహం గంట గంటకూ పెరుగుతోంది. మంగళవారం సా.6 గంటలకు 2,72,943 క్యూసెక్కులు చేరుతుండటంతో.. ఏడు గేట్లను పది అడుగుల మేర ఎత్తి 1,95,559 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 62,617 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో 884.7 అడుగుల్లో 213.88 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఇక సాగర్‌లోకి 1,91,646 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 577.6 అడుగుల్లో 276.09 టీఎంసీలకు చేరుకుంది. మరో 36 టీఎంసీలు వస్తే రెండ్రోజుల్లో సాగర్ నిండిపోతుందని అధికారవర్గాలు తెలిపాయి. ప్రకాశం బ్యారేజ్‌లోకి భారీ వరద సాగర్‌లో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు వదులుతున్న నీటికి మూసీ, వైరా జలాలు తోవడవుతండటంతో పులిచింతలలోకి 30,197 క్యూసెక్కులు చేరుతున్నాయి. ముప్పు నివారణ కోసం ప్రాజెక్టులో కొంతభాగాన్ని ఖాళీచేస్తూ.. స్పిల్‌వే గేట్లు, విద్యుదుత్పత్తి ద్వారా 51,831 క్యూసెక్కులు దిగువకు వదిలేస్తున్నారు. ప్రస్తుతం పులిచింతలలో 40.07 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. పులిచింతల నుంచి దిగువకు వదిలేస్తున్న నీటికి.. పాలేరు, మున్నేరు, కట్టలేరు వరద తోడవుతుంటంతో ప్రకాశం బ్యారేజ్‌లోకి 1,07,985 క్యూసెక్కులు చేరుతోంది ఇక్కడ నుంచి 70 గేట్లు ఎత్తి 1,00,590 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. వరదెత్తిన వంశధార.. ఇక ఒడిశా, పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో వంశధారలో వరద ఉధృతి మరింతగా పెరిగింది. గొట్టా బ్యారేజ్‌లోకి 21,004 క్యూసెక్కులు చేరుతుండగా.. ముంపు ముప్పును నివారణకు 22,040 క్యూసెక్కులను బంగాళాఖాతంలోకి వదిలేస్తున్నారు. నాగావళి నది నుంచి నారాయణపురం ఆనకట్టలోకి 10,200 క్యూసెక్కులు చేరుతుండగా.. అంతేస్థాయిలో సముద్రంలోకి వదిలేస్తున్నారు. పోలవరం వద్ద అప్రమత్తం ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో పోలవరం ప్రాజెక్టు వద్ద జలవనరుల శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. గంట గంటకూ వరద ప్రవాహాన్ని అంచనావేస్తూ.. వచ్చిన వరదను వచ్చినట్లుగా దిగువకు వదిలేస్తూ వరదను సమర్థవంతంగా నియంత్రిస్తున్నారు. మంగళవారం సా.6 గంటలకు పోలవరం ప్రాజెక్టులోకి 6,92,948 క్యూసెక్కులు చేరుతుండటం.. ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద నీటి మట్టం 33.06, దిగువ కాఫర్ డ్యామ్ వద్ద నీటి మట్టం 23.14 మీటర్లకు చేరుకుంది. వచ్చిన నీటిని వచ్చినట్లుగా 48 గేట్ల ద్వారా దిగువకు వదిలేస్తున్నారు. మరోవైపు.. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 7,81,627 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
9 నుంచి వరద ప్రభావిత ప్రాంతాలకు కేంద్ర బృందాలు
సాక్షి, అమరావతి: గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందాలు ఈ నెల 9 నుంచి రాష్ట్రంలో పర్యటించనున్నాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆర్థిక సలహాదారు (ఎన్డీఎంఏ) రవినేష్ కుమార్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులు రెండు బృందాలుగా వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరిగి నష్టాలను అంచనా వేయనున్నారు. 9 మధ్యాహ్నం సభ్యులు ఢిల్లీ నుంచి నేరుగా విశాఖపట్నం చేరుకోనున్నారు. ఆరోజు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమావేశమై వరద పరిస్థితులు, జరిగిన నష్టాలకు సంబంధించి వివరాలు సేకరిస్తారు. రాత్రికి విశాఖలోనే బస చేసి 10, 11 తేదీల్లో అల్లూరి సీతారామరాజు, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు జిల్లాల్లో పర్యటిస్తారు. ఆ తర్వాత రెండు బృందాలు కలిసి విజయవాడ చేరుకుంటాయి. అనంతరం సీఎం వైఎస్ జగన్‌తో కేంద్ర బృందాలు సమావేశమవుతాయి. 11 రాత్రి విజయవాడలోనే బస చేసి 12న తిరిగి ఢిల్లీకి వెళ్తాయి. కేంద్ర బృందంలో డాక్టర్ కె.మనోహరన్, శ్రావణ్‌కుమార్ సింగ్, పి.దేవేందర్ రావు, ఎం.మురుగునాథన్, అరవింద్ కుమార్ సోని సభ్యులుగా ఉన్నారని విపత్తుల సంస్థ ఎండీ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. -
పెరుగుతున్న సాగర్ నీటిమట్టం
సాక్షి, అమరావతి/విజయపురిసౌత్/శ్రీశ్రీశైలం ప్రాజెక్టు: నాగార్జున సాగర్ నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. సోమవారం సాయంత్రం 6 గంటలకు 575 అడుగుల్లో 269.12 టీఎంసీలకు చేరుకుంది. శ్రీశైలం నుంచి విడుదల చేస్తున్న జలాల్లో సాగర్‌లోకి 70,359 క్యూసెక్కులు చేరుతున్నాయి. సాగర్ నిండాలంటే ఇంకా 42.88 టీఎంసీలు అవసరం. కృష్ణా, తుంగభద్ర నుంచి వరద తగ్గడంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కాస్త తగ్గింది. సోమవారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 1,38,436 క్యూసెక్కులు చేరుతుండటంతో రెండు గేట్లను మూసివేశారు. ఒక గేటు ద్వారా 27,846 క్యూసెక్కులు, కుడి, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాల ద్వారా మరో 63,332 క్యూసెక్కులు.. వెరసి 91,178 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరిలో మళ్లీ పెరుగుతున్న వరద గోదావరిలో మళ్లీ వరద పెరుగుతోంది. సోమవారం సాయంత్రం ధవళేశ్వరం బ్యారేజ్‌కి వచ్చే ప్రవాహం పెరిగింది. ఇక్కడి నుంచి డెల్టాకు 6,900 క్యూసెక్కులు విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 4,68,278 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. సోమవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్దకు 6,46,715 క్యూసెక్కులు వస్తోంది. నీటి మట్టం 36.6 అడుగులకు పెరిగింది. ఈ నేపథ్యంలో అధికారులు పోలవరం వద్దకు వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. భారీ వర్షాలతో వంశధారలోనూ వరద ఉద్ధృతి మరింతగా పెరిగింది. గొట్టా బ్యారేజ్‌లోకి 10,465 క్యూసెక్కులు చేరుతోంది. ఆయకట్టుకు 1,897 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 8,568 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. పులిచింతలలో 40.632 టీఎంసీలు కృష్ణా డెల్టాలో నీటి అవసరాలు లేకున్నా.. కృష్ణా బోర్డు అనుమతి లేకుండానే సాగర్‌లో తెలంగాణ జెన్కో విద్యుదుత్పత్తి చేస్తూ 30,640 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తోంది. సాగర్‌లో నీటిని నిల్వ చేయకుండా తెలంగాణ సర్కార్ విద్యుదుత్పత్తి చేస్తుండటంతో ఈ నీరంతా వృథాగా సముద్రంలో కలుస్తోంది. సాగర్ నుంచి కుడి, ఎడమ కాలువలు, ఏఎమ్మార్పీకి 4,844 క్యూసెక్కులు వదులుతున్నారు. సాగర్ నుంచి తెలంగాణ విడుదల చేస్తున్న నీటికి మూసీ, హాలియా జలాలు తోడవడంతో 42,705 క్యూసెక్కులు పులిచింతలలోకి చేరుతున్నాయి. పులిచింతలలో 40.632 టీఎంసీలకు నీటి నిల్వ చేరుకుంది. దీంతో పులిచింతల గేట్లు, విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా 42,705 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. వాటికి మున్నేరు, పాలేరు, వాగులు, వంకల వరద తోడవడంతో ప్రకాశం బ్యారేజ్‌లోకి 77,603 క్యూసెక్కులు చేరుతోంది. ఇక్కడి నుంచి కృష్ణా డెల్టాకు 8,513 క్యూసెక్కులు విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 69,990 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
పశురక్షణకు ఏపీ సర్కారు దీక్ష.. 94 బృందాలు 20 రోజులుగా సేవలు
సాక్షి, అమరావతి: ‘ఏమ్మా.. మిమ్మల్నే కాదు.. మీ పశువులను కూడా బాగా చూసుకున్నారు కదా..’ అంటూ ఇటీవల వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించినప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరాతీస్తే అక్కడున్న ప్రతి పాడి రైతు ఆనందంతో అవునంటూ బదులివ్వడం గోదావరి వరదల సందర్భంగా మూగజీవాల రక్షణ విషయంలో ప్రభుత్వం స్పందించిన తీరుకు అద్దంపట్టింది. సాధారణంగా వైపరీత్యాల వేళ పెద్దసంఖ్యలో మృత్యువాతకు గురయ్యేవి మూగజీవాలే. ప్రభుత్వం ఈసారి ఆ పరిస్థితి రానివ్వలేదు. దాదాపు 26 లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తినప్పటికీ ఈసారి వేళ్లమీద లెక్కపెట్టదగినన్ని పశువులే ప్రాణాలు కోల్పోయాయంటే.. వాటి రక్షణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలే కారణం. 509 మంది సిబ్బందితో ఏర్పాటు చేసిన 94 బృందాలు 20 రోజులుగా సేవలందిస్తున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేవరకు సహాయ, పునరావాస చర్యలు కొనసాగించాలంటూ ప్రభుత్వం ఆదేశించడంతో యంత్రాంగం అహరహం శ్రమిస్తోంది. పాడి రైతులకు అండగా.. వరద ప్రభావానికి గురైన అల్లూరి సీతారామరాజు, బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో వరదల్లో చిక్కుకున్న 32 వేల పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీటికోసం 102 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశారు. మృత్యువుతో పోరాడుతున్న 7,574 పశువులకు సకాలంలో వైద్యసేవలందించి వాటి ప్రాణాలను రక్షించారు. 243 వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి 7,945 పశువులకు అత్యవసర చికిత్స చేశారు. రూ.11.82 లక్షల విలువైన మందులను ఉచితంగా అందించారు. పశుపోషకులకు రూ.3.84 కోట్ల విలువైన 2,430 మెట్రిక్ టన్నుల సంపూర్ణ మిశ్రమ దాణా (టీఎంఆర్)తో పాటు రూ.1.96 లక్షల విలువైన మినరల్ మిక్చర్, ఇతర పోషకాలను ఉచితంగా పంపిణీ చేశారు. 30,770 పశువులకు వ్యాక్సిన్ వేశారు. ఈ ఐదు జిల్లాల పరిధిలో ఇటీవల అందుబాటులోకి వచ్చిన వైఎస్సార్ సంచార పశువైద్య సేవారథాలు వరద సహాయక చర్యల్లో విశేష సేవలందించాయి. మారుమూల వల్లెల్లో సైతం వీటిద్వారా వ్యాక్సినేషన్, అత్యవసర వైద్యసేవలు అందించగలిగారు. 700 పశువుల ప్రాణాలను కాపాడాం వరదల సందర్భంగా మూగజీవాల రక్షణ కోసం ప్రభుత్వం çస్పందించిన తీరు నిజంగా ప్రశంసనీయం. రాజమహేంద్రవరం–కొవ్వూరు మధ్య గోదావరి నదీగర్భంలోని లంకభూముల్లో 700కు పైగా పశువులు చిక్కుకున్నాయని సమాచారం ఇవ్వగానే పశుసంవర్ధకశాఖ తూర్పుగోదావరి జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించింది. లేగదూడలు, పాలిచ్చే గేదెలు, ఆవులను ప్రత్యేక బోట్ల ద్వారా ఒడ్డుకు చేర్చి అక్కడినుంచి బొబ్బర్లంక గోశాలకు తరలించింది. మిగిలిన వాటికి పశుగ్రాసం, తాగునీరు, వైద్యసహాయం అందించింది. ఈసారి లంకల్లో చిక్కుకున్న ఏ ఒక్క పశువు మృత్యువాతపడలేదు. – తేజోవంత్, రాష్ట్ర జంతుసంక్షేమ బోర్డు సభ్యుడు నిజంగా అభినందనీయం లంకభూముల్లో దూడలు మేపుకొంటాం. 1986లో గోదావరి వరదలు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం. చాలా పశువులు చనిపోయాయి. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. వరదలకు ముందుగానే ప్రభుత్వం మమ్మల్ని అప్రమత్తం చేయడంతో మా పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించాం. పదిరోజుల ముందుగానే పశువులకు వ్యాక్సిన్ వేశారు. సంపూర్ణ మిశ్రమ దాణా అందిస్తున్నారు. మనుషులతో సమానంగా మూగజీవాల పరిరక్షణ కోసం ప్రభుత్వం పనిచేసిన విధానం నిజంగా అభినందనీయం. – పుచ్చకాయల నరసింహమూర్తి, పి.గన్నవరం సీఎం ఆదేశాల మేరకు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు సహాయ, పునరావాస కార్యక్రమాలను నేటికీ కొనసాగిస్తున్నాం. వరద ప్రభావిత గ్రామాల్లోని పశువులకు నూరుశాతం వ్యాక్సిన్ వేశాం. అవసరమైన దాణా, పశుగ్రాసం ఉచితంగా అందిస్తున్నాం. – ఆర్.అమరేంద్రకుమార్, డైరెక్టర్ పశుసంవర్ధకశాఖ -
36 సంవత్సరాల అనంతరం గోదావరికి భారీగా వరదలు: మంత్రి అమర్నాథ్
-
మాది మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం: మంత్రి బొత్స
సాక్షి, అమరావతి: వరద బాధితులకు అధికార యంత్రాంగం అండగా నిలిచిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గురువారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సహాయక శిబిరాలను ఏర్పాటు చేసి వసతులు కల్పించామని పేర్కొన్నారు. ప్రతి బాధిత కుటుంబానికి రూ.2 వేలు అందించామన్నారు. నగదుతో పాటు నిత్యావసరాలు ఉచితంగా ఇచ్చామన్నారు. చదవండి: డాన్ చీకోటి వ్యవహారంపై స్పందించిన కొడాలి నాని చంద్రబాబులా మాది మాటల ప్రభుత్వం కాదన్నారు. వరద ప్రాంతాల్లో చంద్రబాబు రాజకీయ ఉపన్యాసాలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. చంద్రబాబు పాలనలో కరువు తప్ప వరదలు వచ్చాయా?. పోలవరం ప్రాజెక్ట్ ఆలస్యమవడానికి కారణం ఎవరు?. మూడేళ్లలో చంద్రబాబు పిడికెడు మట్టైనా వేశారా?. ప్రాజెక్టుల కంటే కాంట్రాక్టులకే చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చారని మంత్రి బొత్స మండిపడ్డారు. -
27 రోజులు.. 2,192 టీఎంసీలు
సాక్షి, అమరావతి: ఈ నెలలో కేవలం 27 రోజుల్లోనే 2,192.93 టీఎంసీల గోదావరి జలాలు ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సముద్రంలో కలిశాయి. 1861 నుంచి అందుబాటులో ఉన్న రికార్డులను పరిశీలిస్తే.. ఈ ఏడాది జూలైలో రికార్డు స్థాయిలో గోదావరి జలాలు కడలి పాలవడం గమనార్హం. ఈ నెల ముగియడానికి మరో నాలుగు రోజులు మిగిలి ఉన్నాయి. ప్రస్తుత ప్రవాహాలను పరిగణనలోకి తీసుకుంటే రోజుకు 75 చొప్పున నాలుగు రోజుల్లో మరో 300 టీఎంసీలు సముద్రంలో కలుస్తాయని జల వనరుల శాఖ అంచనా వేసింది. అంటే.. జూలై ముగిసే నాటికి కనీసం 2,492.93 టీఎంసీలు సముద్రంలో కలవనున్నాయి. సాధారణంగా జూలైలో గోదావరికి భారీ వరదలు రావు. ఈ నెలలో సాధారణంగా 100 నుంచి 500 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలుస్తాయి. ఇంతకంటే అధికంగా గోదావరి జలాలు కడలి పాలయ్యే అవకాశాలు తక్కువ. 2013 జూలైలో తొలి సారిగా గోదావరికి భారీ వరదలు వచ్చాయి. అది కూడా జూలై ద్వితీయార్థంలో రావడంతో 2,033.86 టీఎంసీలు కడలి పాలయ్యాయి. ఇప్పటివరకూ అదే అత్యధిక రికార్డు. కానీ.. ఈ ఏడాది చరిత్రలో ముందెన్నడూ లేని రీతిలో జూలై ప్రథమార్థంలోనే గోదావరికి భారీ వరదలు వచ్చాయి. ద్వితీయార్థంలోనూ కొనసాగుతున్నాయి. కేవలం 27 రోజుల్లోనే 2,192.93 టీఎంసీలు సముద్రంలో కలవడం ద్వారా 2013 జూలైలో సృష్టించిన రికార్డును తొమ్మిదేళ్ల తర్వాత గోదావరి ఈ ఏడాది బద్దలు కొట్టడం గమనార్హం. మూడుసార్లు గరిష్ట ప్రవాహం వచ్చినా.. సాధారణంగా గోదావరి నదికి ఆగస్ట్ నెలలో మాత్రమే గరిష్ట ప్రవాహం వస్తుంటుంది. అందుకు భిన్నంగా.. గోదావరి చరిత్రలో 1861, 1988, 1989 సంవత్సరాల్లో జూలై నెలలో గరిష్టంగా 15 లక్షల క్యూసెక్కుల చొప్పున వరద ప్రవాహాలు వచ్చాయి. కానీ.. ఈ ఏడాది జూలై 16న ధవళేశ్వరం బ్యారేజీలో 26.9 లక్షల క్యూసెక్కుల ప్రవాహం రావడం గమనార్హం. ధవళేశ్వరం బ్యారేజీ చరిత్రలో జూలైలో వచ్చిన గరిష్ట వరద ప్రవాహం ఇదే కావడం గమనార్హం. 1861 నుంచి ఇప్పటివరకూ గోదావరికి 1986లో ఆగస్టు 16న గరిష్టంగా 35,06,338 క్యూసెక్కుల ప్రవాహం రాగా.. అంతే స్థాయిలో సముద్రంలోకి వదిలేశారు. ఆ తర్వాత 2006 ఆగస్టు 6న అత్యధికంగా 28,05,773 క్యూసెక్కుల ప్రవాహం ధవళేశ్వరం బ్యారేజీలోకి రాగా.. గోదావరి చరిత్రలో ఇది రెండో అత్యధిక వరద ప్రవాహంగా నమోదైంది. వరద జలాల మళ్లింపునకు సర్కారు యత్నం ధవళేశ్వరం బ్యారేజీ నుంచి ఏటా సగటున 3 వేల టీఎంసీల గోదావరి జలాలు కడలిలో కలుస్తున్నాయి. సముద్రం పాలవుతున్న ఈ నీటిని గరిష్ట స్థాయిలో వినియోగించుకుని.. రాష్ట్రంలో దుర్భిక్ష ప్రాంతాలకు మళ్లించి వాటిని సుభిక్షం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజీలోకి.. అక్కడి నుంచి కొత్తగా నిర్మించే బొల్లాపల్లి రిజర్వాయర్‌లోకి.. అక్కడి నుంచి వెలిగొండ ప్రాజెక్టులోకి గోదావరి జలాలను తరలించి.. అక్కడి నుంచి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్‌లోకి పోసి.. సోమశిల (పెన్నా)కు తరలించేందుకు ప్రణాళిక రచించింది. ఇచ్చంపల్లి నుంచి నాగార్జున సాగర్ (కృష్ణా), సోమశిల (పెన్నా), గ్రాండ్ ఆనకట్ట (కావేరి) అనుసంధానం ద్వారా 247 టీఎంసీల గోదావరి జలాలను తరలించడానికి ఎన్‌డబ్ల్యూడీఏ (జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ) ప్రణాళిక రచించింది. -
గోదావరి వరదలకు శాశ్వత పరిష్కారం
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: ఏటా గోదావరికి వచ్చే వరదలకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. గోదావరి వరద ప్రభావిత జిల్లాల మంత్రులు, కలెక్టర్లు, అధికారులతో మంగళవారం రాత్రి సీఎం రాజమహేంద్రవరంలో సమీక్షించారు. 1986 వరదల తర్వాత ఆ స్థాయిలో గోదావరికి దాదాపుగా 28 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం ఈ ఏడాది వచ్చిందని.. భవిష్యత్తులో ఇందుకు అనుగుణంగా నియంత్రణ చర్యలు ఉండాలని సీఎం ఆదేశించారు. ఏటిగట్లు ఎక్కడెక్కడ బలహీనంగా ఉన్నాయో గుర్తించాలని, శాశ్వత చర్యలపై దృషిŠ?ట్పట్టి నవంబరుకల్లా టెండర్లు పూర్తిచేస్తే పనులు మొదలుపెడదామన్నారు. కరకట్టల ఆధునీకరణపై కూడా వెంటనే ప్రతిపాదనలు సిద్ధంచేయాలన్నారు. డెల్టా ఆధునీకరణ, గోదావరి వరదల నుంచి శాశ్వత పరిష్కారం కోసం అందజేసిన డీపీఆర్‌పై టెక్నికల్ ఎస్టిమేట్స్ తయారుచేసి వెంటనే నివేదించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే, అన్ని లంక గ్రామాలలో కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం చేస్తే విపత్తు సమయంలో వాటిని పునరావాస కేంద్రాలుగా వినియోగించుకోవచ్చునని సూచించారు. పారదర్శకంగా నష్టాల నమోదు ఇక నష్టాల నమోదు వెంటనే ప్రారంభించాలని.. ఈ విషయంలో అంతా పారదర్శకంగా ఉండాలని సీఎం ఆదేశించారు. ఈ ప్రక్రియ పూర్తిచేశాక సామాజిక తనిఖీ నిర్వహించాలని, దీనివల్ల అర్హత ఉండి సాయాన్ని అందుకోలేని వారికి తిరిగి దరఖాస్తు చేసుకునే అవకాశం లభిస్తుందన్నారు. రెండు వారాల్లో నష్టాల నమోదును పూర్తిచేద్దామన్నారు. పారదర్శకంగా ఉండడంలో దేశానికే రోల్‌మోడల్‌గా నిలుస్తున్నామన్నారు. ఏ సీజన్లో జరిగిన నష్టం ఆ సీజన్ ముగిసేలోగా ఇవ్వగలిగితే ప్రజలు మరింత సంతోషిస్తారని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. మరోవైపు సచివాలయ సిబ్బంది, వలంటీర్లు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి ముంపు ప్రమాదం ఉన్నవారిని అప్రమత్తం చేశారంటూ సీఎం ప్రశంసించారు. వలంటీర్, సచివాలయం వ్యవస్థ ఫలితాలు ఇప్పుడు అందరికీ అందుతున్నాయన్నారు. అధికారులకు సీఎం అభినందనలు లంక గ్రామాల్లో నష్టతీవ్రత వివరాలను సీఎం అధికారులను అడిగి తీసుకున్నారు. గతంలో ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలప్పుడు కొంతమంది అధికారులను బాధ్యులుగా చేసి సస్పెండ్‌చేసి హడావిడి చేసేవారని ఆయన గుర్తుచేశారు. విపత్తుల సమయంలో అధికారులు నాయకుల చుట్టూ తిరుగుతుండడంవల్ల పునరావాస పనుల్లో జాప్యం జరుగుతుందన్నారు. కానీ, అన్నీ జరిగాక తాను రావడంవల్ల అవి సవ్యంగా జరిగాయా? లేదా? అని తెలుసుకుంటున్నానని.. తాను కూడా వరదల సమయంలో వచ్చి, మిమ్మల్ని నా చుట్టూ తిప్పుకుని నలుగురిని సస్పెండ్ చేస్తే ఏమవుతుంది? ఫైనల్‌గా ప్రజలకు మంచి జరగాలి, వారికి సాయం అందాలి కదా అని ముఖ్యమంత్రి అన్నారు. అధికారులంతా బ్రహ్మండంగా పనిచేశారు కాబట్టే ‘చాలా బాగా చూసుకున్నార’న్న మాట ఈరోజు ప్రజల నుంచి వినిపిస్తోందంటూ సీఎం జగన్ వారికి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఈ మంచి పేరు నిలబెట్టుకునేలా ముందుకెళ్దామన్నారు. ఇందులో ప్రజాప్రతినిధులను కూడా మమేకం చేసినప్పుడే ప్రజలకు మరింత దగ్గరవుతారన్నారు. వరద ప్రాంతాల్లో శానిటేషన్, ప్రజారోగ్యంపై దృష్టిపెట్టాలని సీఎం సూచించారు. విద్యుత్‌పై దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి వరద ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణపైనా అధికారులతో సీఎం జగన్ సమీక్షించారు. ఈ విషయంలో ఎక్కడైనా జాప్యం జరిగిందా అని అడిగి తెలుసుకున్నారు. ఒకవేళ తప్పులు జరిగితే సరిదిద్దుకోవాలని.. లేదంటే ఆ వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. మనం యుద్ధం చేస్తున్నది టీడీపీ, చంద్రబాబుతో కాదని.. నెగిటివ్ మీడియాతో యుద్ధం చేస్తున్నామని వైఎస్ జగన్ వారికి గుర్తుచేశారు. ఆ మీడియా సంస్థలు కూడా చొక్కాలిప్పుకుని ఒక పార్టీ అధికారం కోసం పనిచేస్తున్నాయని, వాస్తవాలను ప్రజలకు వివరించి వాటి దుష్ప్రచారాలను తిప్పికొట్టాలన్నారు. రాజమహేంద్రవరంలోకి వరదనీరు రాకుండా.. ఇక రాజమహేంద్రవరం అవ డ్రెయిన్ ఏర్పాటుచేయడంపై నిపుణుల అభిప్రాయాలు తీసుకుని అంచనాలు సిద్ధంచేయాలని సీఎం జగన్ ఆదేశించారు. పట్టణంలోకి ఎలాంటి వరదనీరు రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమగ్రమైన నివేదిక రాగానే చర్యలు ప్రారంభిస్తామన్నారు. నిపుణులతో కూడిన టెక్నికల్ కమిటీని నియమించి ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామన్నారు. మీ తోడ్పాటుతోనే నాణ్యమైన సేవలు.. సహాయక కార్యక్రమాల కోసం నిధులను వెంటనే సమకూర్చడంతో నాణ్యమైన సేవలందించగలిగామని అధికారులు సీఎంకు వివరించారు. పశువులకు కూడా వెంటనే గ్రాసం అందజేశామన్నారు. వైద్య శిబిరాలు ముందుగా ఏర్పాటుచేయడంతో జ్వరాలు వంటి వాటిని నివారించగలిగామని, బాధితులకు సహాయం చేయడంలో ఉదారంగా ఉండాలన్న సీఎం సూచనలవల్లే ఎక్కువ సాయం చేయగలిగామన్నారు. గ్రామ సచివాలయ, వలంటీర్ వ్యవస్థ లేకుండా ఉంటే ఈ రకమైన సేవలు అందించలేకపోయే వాళ్లమన్నారు. ఇక పునరావాస కేంద్రాల్లో బాధితులకు నాణ్యమైన భోజనం అందజేశామన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు మీలా ముందస్తుగా పునరావాసాల కోసం సాయం అందించలేదన్నారు. సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, తానేటి వనిత, కారుమూరి నాగేశ్వరరావు, దాడిశెట్టి రాజా, గుడివాడ అమర్నాథ్, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం సీఎం జగన్ రాజమహేంద్రవరం ఆర్ అండ్ బి అతిథిగృహంలో రాత్రి బసచేశారు. -
ఇంటింటికీ కాలి నడకన
కోనసీమ నుంచి సాక్షి ప్రతినిధి: కోనసీమ లంక గ్రామాల్లో పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వయంగా బాధితులను కలుసుకుని భరోసా కల్పించారు. వారి ఇబ్బందులను సావధానంగా ఆలకించారు. కొన్ని సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారాన్ని చూపారు. షెడ్యూల్ ప్రకారం సీఎం మంగళవారం ఉ.10.30 గంటలకు పి.గన్నవరం మండలం జి.పెదపూడి చేరుకున్నారు. అక్కడ నుంచి వశిష్ట నదిపై పంటు దాటి జి.పెదపూడి లంక వెళ్లారు. ప్రతి బాధితుడికి తన గోడు చెప్పుకునే అవకాశాన్నిచ్చారు. మీకు సాయం అందిందా? లేదా? అని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. రైతులను చూడగానే ట్రాక్టర్ దిగి.. సీఎం పర్యటన సందర్భంగా జి.పెదపూడిలంకకు ట్రాక్టర్‌పై వెళుతుండగా దారిలో ఉద్యానవన రైతులు పొలాల్లో కుళ్లిపోయిన అరటి, వంగ, మిరప, దొండ, మునగ పంటలతో కనిపించారు. రైతులను చూడగానే ట్రాక్టర్ ఆపాలని ఆదేశించి సీఎం జగన్ కిందకు దిగారు. భద్రతా సిబ్బంది వారిస్తున్నా రైతుల మధ్యకు వెళ్లి వారు చెప్పింది విన్నారు. అధైర్యపడొద్దు.. ‘గోదావరికి ఆగస్టు 15 తరువాత వరదలు వస్తాయి. ఈసారి నెల రోజులు ముందే రావడంతో చేతికి వచ్చిన పంట కోల్పోయాం’ అని జి.పెదపూడి లంకకు చెందిన రైతులు వారా వెంకట్రావు, చీకురమల్లి సంతోషరావు, పల్లి సత్యనారాయణ, అడ్డాల నరసన్న, దొడ్డా శ్రీనివాస్, కటికిరెడ్డి నాగరాజు సీఎం ఎదుట తమ ఆవేదన వ్యక్తం చేశారు. ‘మూడు ఎకరాల్లో మిర్చి సాగుకు రూ.రెండు లక్షలు పెట్టుబడి పెట్టా. కేవలం రూ.36 వేలు మాత్రమే వచ్చింది. మిగిలిందంతా వరదలో కొట్టుకుపోయింది’ అని కంటతడి పెట్టిన రైతు పల్లి సత్యనారాయణను సీఎం జగన్ ఓదార్చారు. అక్కడే ఉన్న ఉద్యానశాఖ, వ్యవసాయ అధికారులను పంట నష్టంపై ఆరా తీశారు. ‘రైతులు పంట నష్టపోతే ఆదుకోవడంలో మన ప్రభుత్వ స్పందన వేరు. ఏ సీజన్లో నష్టపోతున్నారో అదే సీజన్ ముగిసేలోగా పెట్టుబడి రాయితీఅందజేస్తున్నాం. అధైర్యపడొద్దు. అధికారులు నష్టం అంచనాలు రూపొందిస్తారు. నివేదిక అందాక పెట్టుబడి రాయితీ మీ ఖాతాలకు జమ అవుతుంది’ అని రైతులకు ధైర్యం చెప్పారు. పంటుపై ప్రయాణిస్తూ గోదావరి ఉధృతిని పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి వీధుల్లో కాలి నడకన.. జి.పెదపూడిలంకలో ట్రాక్టర్ దిగి రెండు వీధులు నడుచుకుంటూ బాధితుల ఇళ్ల వద్దకు వెళ్లి సీఎం జగన్ పరామర్శించారు. ప్రతి ఒక్కరితోనూ కలసిపోయారు. వరదల్లో వారు పడిన ఇబ్బందులను తెలుసుకున్నారు. ‘వరద వచ్చినప్పుడు మీ కలెక్టర్ వచ్చారా? అధికారులు వచ్చారా? సాయం అందించారా? పాలు ఇచ్చారా? బియ్యం పంపిణీ చేశారా? పప్పులు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, ఆయిల్ ప్యాకెట్లు అందించారా? లేదా’ అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇచ్చిన రూ.రెండు వేల సాయం అందిందా? లేదా? అని ఇంటింటికీ వెళ్లి అడిగారు. ట్రాక్టర్‌పై ప్రయాణిస్తూ వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అప్పటికప్పుడే ఆదేశాలు... సీఎం జగన్ కాలి నడకన పర్యటిస్తున్న సమయంలో అనారోగ్యంతో ఉన్న తన భర్త మాతా సత్యనారాయణను ఆదుకోవాలని ఓ మహిళ కోరడంతో నేరుగా ఆ ఇంటికి వెళ్లి పలకరించారు. వైద్యానికి సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. జీవనోపాధి కోల్పోయిన తమ కుటుంబాన్ని ఆదుకోవాలని మాతా జ్యోతి వేడుకోవడంతో ఆమెను వలంటీర్‌గా నియమించాలని సూచించారు. సీఎం పర్యటన పూర్తయ్యే లోపు ఆమెకు నియామక ఉత్తర్వులు అందడంతో కృతజ్ఞతలు తెలిపింది. పూరిల్లు వరద నీట మునిగిన బాధితుడు కాకర కృష్ణకు పక్కా ఇల్లు మంజూరు చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. సరెళ్ల సూర్యారావు అనే వృద్ధుడిని వరద సాయంపై సీఎం ఆరా తీయగా.. అన్నీ అందాయి, అందరూ బాగా పని చేశారని చెప్పారు. ప్రతి ఒక్కరినీ పలుకరిస్తూ.. ‘వరద కష్టాల్లో కూడా ఏ పూటా పస్తులు ఉండలేదు. ఏ లోటు రానివ్వకుండా మీ ప్రభుత్వం జాగ్రత్తగా చూసుకుంది. మనస్ఫూర్తిగా తిన్నాం. మాకు అన్నీ అందాయి. అధికారులు మావద్దకు వచ్చారు’ అని బాధితులు సీఎం జగన్‌కు తెలిపారు. ప్రతి ఇంటి వద్ద ఆగుతూ ప్రతి ఒక్కరి పేరు కనుక్కుని పలుకరిస్తూ సీఎం కదిలారు. -
అల్లూరి, ఏలూరు జిల్లాల పర్యటనకు సీఎం జగన్
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/సాక్షి ప్రతినిధి, ఏలూరు: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 27న (బుధవారం) అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. రెండోరోజు కూడా ఆయన గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులతో నేరుగా మాట్లాడతారు. ఉ.8.30కు రాజమహేంద్రవరం ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్ నుంచి ముఖ్యమంత్రి బయల్దేరి ఏఎస్ఆర్ జిల్లా చింతూరు చేరుకుంటారు. 9.30కు చింతూరు మండలం కుయుగూరు, చట్టి గ్రామాల్లో వరద బాధితులతో సమావేశమవుతారు. ఆక్కడి నుంచి మ.12 గంటలకు ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కన్నయగుట్ట గ్రామం చేరుకుని వరద బాధిత గ్రామాలకు సంబంధించిన ఫొటోగ్యాలరీని పరిశీలిస్తారు. అనంతరం.. తిరుమలాపురం, నార్లవరం గ్రామాలకు చెందిన వరద బాధితులతో సమావేశమవుతారు. మ.1 గంటకు తాడేపల్లికి బయల్దేరుతారు. వరద బాధితులకు అండగా.. మరోవైపు.. వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పూర్తిస్థాయిలో సాయమందించింది. వారి యోగక్షేమాల్ని తెలుసుకుని ఇంకా సాయమందించాల్సిన అవసరం ఏమైనా ఉందా అని అడిగి తెలుసుకుని వారిని ఓదార్చేందుకు సీఎం వైఎస్ జగన్ బుధవారం ఈ రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు. -
‘బురద జల్లుదాం ఛలో ఛలో’
ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు భావన చూడండి. ఆంధ్రప్రదేశ్ అప్పుడే శ్రీలంకలా మారిందట. అయినా ప్రజలు ఇంకా తిరుగుబాటు చేయడం లేదట. శ్రీలంక ప్రజలకన్నా ఏపీ ప్రజలకే ఎక్కువ ఓర్పు ఉందట. ఎప్పుడు ఏపీ శ్రీలంకలా మారి ప్రజలలో తిరుగుబాటు వస్తే అప్పుడు తాను గద్దె ఎక్కవచ్చన్న అత్యాశతో ఆయన ఉండవచ్చు. కానీ పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నందున అవేవీ తమకు వద్దని ప్రజలు జగన్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాలా? అమ్మ ఒడి, చేయూత, విద్యాకానుక వంటి వాటి కింద ఆర్థిక సాయం చేస్తున్నందుకు తిరగబడాలా? అది సాధ్యం కాదని తెలిసినా, చంద్రబాబు తనను తాను మోసం చేసుకుంటూ, ప్రజలను మోసం చేయడానికి చేస్తున్న ప్రయత్నంగా ఇది కనబడుతోంది. గోదావరి వరద బాధితులను పరామర్శించ డానికి ఆయన పశ్చిమ గోదావరి, కోనసీమ లకు వెళ్లారు. తన పర్యటనను రాజకీయ దండయాత్ర మాదిరి, ఎన్నికల ప్రచారం మాదిరి చేశారే తప్ప పరామర్శించడానికి చేసినట్లు కనిపించదు. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా, పదిహేనేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు ఇలా వ్యవహరించవచ్చా? ఆయన పాత తరహా ఫ్యూడల్ రాజకీయాలకు అలవాటు పడి పోయారు. ఏపీ, శ్రీలంకలా కావాలని ఎవరైనా కోరుకుంటారా? కొన్ని విషయాలలో శత్రువుకు కూడా ఇలాంటి కష్టం రాకూడదని అను కుంటాం. అలాంటిది ఒక రాష్ట్రం మొత్తానికి ఆ పరిస్థితి రావాలని అభి లషిస్తున్నారంటే, తన ఓటమిని ఇంకా ఎలా జీర్ణించుకోలేకపోతు న్నారో స్పష్టం అవుతోంది. తన హయాంలో లక్షా పదకొండు వేల కోట్లకు సంబంధించి లెక్కలు ఎందుకు ఇవ్వలేదన్నదానికి చంద్ర బాబు సమాధానం చెప్పాలి. ఆ తర్వాత శ్రీలంక గురించి మాట్లాడాలి. కరోనా సమయంలో అప్పో సప్పో చేసి ఆదుకున్నందుకు నిరసనగా ప్రజలు ఉద్యమించాలా? రైతు భరోసా కేంద్రాల ద్వారా సేవలు అందిస్తున్నందుకు రైతులు తిరగబడాలా? గ్రామాలలో సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి పాలన అందిస్తున్నందుకు నిరసన చెప్పాలా? తమ ఇళ్ల వద్దకే పెన్షన్ ఎందుకు తెస్తున్నారని ప్రజలు నిలదీయాలా? ముప్పై లక్షల ఇళ్ల పట్టాలు ఎందుకు ఇస్తున్నారని లబ్ధిదారులు పోరాడాలా? పోనీ ఆ స్కీములకు తాను వ్యతిరేకిననీ, వాటివల్ల నష్టం జరుగు తున్నదనీ చంద్రబాబు చెప్పరు. పైగా ముఖ్యమంత్రి జగన్ కంటే తాను ఇంకా ఎక్కువగా సంక్షేమం అమలు చేస్తానంటారు. అప్పుడు ఏపీ శ్రీలంక కాదా? ఇది సింపుల్ లాజిక్ కదా! అసలు వరద బాధితు లకూ, శ్రీలంకకూ సంబంధం ఏమిటి? అర్థం పర్థం లేకుండా ఆయన మాట్లాడడం, అదేదో భగవద్గీత మాదిరి టీడీపీ అనుబంధ మీడియా ప్రచారం చేయడం... ఆ మాటకు వస్తే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓటుకు నోటు కేసులో చిక్కుకుని ఆంధ్రుల పరువు తీసినందుకూ, పదేళ్ల రాజధాని హైదరాబాద్‌ను వదలుకున్నందుకూ, గోదావరి పుష్కరాలలో తన ప్రచార యావకు 29 మంది బలయి నందుకూ... ఇలా ఆయన హయాంలో అనేక విషయాలలో జనం తిరగబడి ఉండాలి కదా? చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే తనకు సన్నిహితులుగా ఉన్న కొందరు ప్రముఖులు బ్యాంకులకు ఎగవేసిన డబ్బును చెల్లించేలా చూడవచ్చు కదా! ఆ డబ్బును ఏపీలో వ్యయం చేయమని బ్యాంకు లను కోరవచ్చు కదా. అది జరిగితే ఆయనకు మంచి పేరు వస్తుంది కదా. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ నలభై ఐదువేల కోట్లు, సుజనా చౌదరి ఏడు వేల కోట్లు, రాయపాటి సాంబశివరావు ఎనిమిది వేల కోట్లు, రఘురాజు వెయ్యి కోట్ల మేర బ్యాంకులకు బాకీ పడిన సంగతి తెలియదా? ఇలా పలువురు ఆయనతో రాజకీయ సంబం ధాలు ఉన్నవారే కదా? ఏపీలో పేదలకు ఇస్తున్న పథకాల వల్ల పేద లకు వేల కోట్ల వ్యయం అవుతోందని బాధపడేవారికి ఇది ఒక జవాబే. నిజంగానే వరద బాధితులకు ప్రభుత్వ పరంగా సాయం అందకపోతే ఆ విషయాన్ని ప్రస్తావించి తగు న్యాయం చేయాలని కోరవచ్చు. అలాకాకుండా ఉన్నవి లేనివి మాట్లాడడం టీడీపీకే చెల్లింది. ఎంత రెచ్చగొట్టినా ఆయన ఆశించిన విధంగా ప్రజలలో ప్రభుత్వంపై వ్యతిరేకత రాకపోవడంతో నిరాశతో ఆయన ప్రసంగాలు చేస్తున్నారు. మిగిలిన ప్రభుత్వాలకూ, ఈ ప్రభుత్వానికీ తేడా ఏమిటంటే, క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగాన్ని జగన్ ప్రభుత్వం సమర్థంగా ఏర్పాటు చేసుకోగలిగింది. గతంలో పదుల సంఖ్యలో ఉన్న సహాయ సిబ్బంది ఇప్పుడు వందల సంఖ్యకు పెరిగారు. తన హయాంలో వచ్చిన ప్రకృతి వైపరీత్యాలకు బాగా స్పందించేవాడినని చంద్రబాబు సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు. తిత్లి తుపాను సమయంలో వరద బాధితులను ఎలా గదిమింది సోషల్ మీడియాలో వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. కేంద్ర జల సంఘం ముందస్తుగా హెచ్చరిం చినా వరదలను నియంత్రించలేకపోయారని విమర్శించారు. ఇంకా నయం... తనకు మాదిరి తుపానును ఆపలేకపోయారనీ, అమరావ తిలో ఎండలు తగ్గించాలని తన మాదిరి అధికారులను ఆదేశించ లేకపోయారనీ అనలేదు. గోదావరి వరద ఆరంభం కాగానే అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుంటారు. అందుకే 36 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చినా ఎక్కడా పెద్దగా ఇబ్బంది రాలేదు. ఈ స్థాయిలో వరద వచ్చినప్పుడు లంక గ్రామాలు మునిగిపోవడం సర్వసాధారణం. 1986లో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇదే స్థాయిలో వరద వస్తే గోదావరి గట్లకు గండ్లు పడి రెండు జిల్లాల్లో పెద్ద నగరాలు, పట్టణాలతో సహా వందలాది గ్రామాలు నీట మునిగాయి. రోజుల తరబడి ప్రజలు తీవ్ర కష్టాలు పడ్డారు. 1996, 98లలో వచ్చిన తుపానుల కారణంగా పలువురు మరణించారు. ఆ విషయాలు మర్చిపోతే ఎలా! ప్రజలకు మంచి నీళ్లు కూడా ఇవ్వలేదనీ, మరో రెండు రోజుల్లో ఇవ్వకపోతే టీడీపీ అందిస్తుందనీ ఆయన అన్నారట. నిజంగానే ప్రభుత్వం నీరు అందిం చకపోతే వెంటనే తన పార్టీ ద్వారా సాయం చేస్తానని అనాలి కానీ, మరో రెండు రోజులు గోదావరి బురద నీరు తాగండి, ఆ తర్వాత నీరు తెస్తాం అన్నట్లు మాట్లాడడాన్ని ఏమనుకోవాలి? రాజంపేట ప్రాంతంలో పర్యటించినప్పుడు చంద్రబాబు, సహాయ కార్యక్రమాలపై ప్రజలు తిరుగుబాటు చేయరా? మీరు సంతృప్తి చెంది జగన్‌కు జేజేలు పలుకుతారా అని కుళ్లుకున్నారు. వరద బాధితులకు రెండువేల రూపాయల సాయం కాదు, తెలంగా ణలో మాదిరి పదివేలు ఇవ్వాలని అన్నారు. తెలంగాణలో ప్రకటన వచ్చింది కానీ ఇంకా మొదలు కాలేదు. జగన్ తాను చెప్పిన మేరకు సహాయ శిబిరాల నుంచి ఇళ్లకు వెళ్లేవారికి రెండువేల రూపాయలు అందించి పంపుతున్నారు. పోనీ తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరదలు, కరువులు వచ్చినప్పుడు ఒక్కొక్కరికి ఎంత ఇచ్చారో చెప్పి, ఆ తర్వాత చంద్రబాబు డిమాండ్లు పెట్టవచ్చు. ఆ పని చేయరు. ఎందుకంటే ఆయన ఏమీ ఇవ్వలేదు కదా! లంకల్లో నష్టపోయిన ప్రతి రైతుకు ఏభై వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేయరాదు. అదే సమయంలో అందరికీ వేలకు వేల సాయం చేయాలి. ఇలాంటి వింత వాదనలతో చంద్రబాబు తన పరువు తానే తీసుకుంటున్నారు. చివరికి చంద్రబాబు టీమ్ పడవ లలో పర్యటించినప్పుడు అధికారులు వారించినా వినకుండా, అధిక సంఖ్యలో వాటిలో ఎక్కడం, ఆ తర్వాత ప్రమాదం సంభవించడం, అదృష్టవశాత్తూ ముప్పు తప్పడం జరిగింది. కానీ దీనిపై కూడా టీడీపీ నేత వర్ల రామయ్య యధాప్రకారం భద్రతా ఏర్పాట్లలో ప్రభుత్వ వైఫల్యం అని విమర్శించారు. ఇంకా నయం. జగన్ ప్రభుత్వ కుట్ర వల్లే పడవ నుంచి టీడీపీ నేతలు పడిపోయారని చెప్పలేదు. చివరిగా ఒక మాట. పార్టీ తరపున చంద్రబాబు సాయం చేసినా, చేయకపోయినా ఫర్వాలేదు. కానీ శక్తివంచన లేకుండా సహాయ చర్యలు చేపట్టిన ప్రభుత్వంపై బురద చల్లకుండా ఉండగలిగితే మంచిది. సొంత ఖర్చులతో బాధితులకు సాయం చేస్తున్న రంగనాథ రాజు వంటి ఎమ్మెల్యేలపై దూషణలకు దిగకుంటే అదే పదివేలు. అధికారం పోయిందన్న దుగ్ధతో ఉన్న చంద్రబాబు విచక్షణ, విజ్ఞత కోల్పోయి వ్యవహరించడమే దురదృష్టకరం. కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
సీఎం సహాయనిధికి విరాళం అందించిన APDMC
-
కోనసీమ జిల్లాలో సీఎం జగన్ పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే..
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(మంగళవారం) కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. గోదావరి వరద ప్రాంతాల్లో పర్యటించి, బాధితులతో నేరుగా మాట్లాడనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం, 10.30 గంటలకు పి.గన్నవరం మండలం జి.పెదపూడి గ్రామానికి చేరుకుని అక్కడి నుంచి 11 గంటలకు పుచ్చకాయలవారిపేటలో వరద బాధితులతో సమావేశమవుతారు. చదవండి: చంద్రబాబు ఏం చేశాడో తెలుసా?.. వాస్తవాలు చెప్పిన మంత్రి అంబటి ఆ తర్వాత అరిగెలవారిపేట చేరుకుని అక్కడ బాధితులను కలుస్తారు, అక్కడి నుంచి ఉడిమూడిలంక చేరుకుని అక్కడ వరద బాధితులతో సమావేశమవుతారు. అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2.05 గంటలకు పి.గన్నవరం మండలం వాడ్రేవుపల్లి చేరుకుని అక్కడి నుంచి రాజోలు మండలం మేకలపాలెం చేరుకుంటారు. అక్కడ వరద బాధితులతో సమావేశం అనంతరం సాయంత్రం 4.05 గంటలకు రాజమండ్రి చేరుకుంటారు. అక్కడి ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో వరద ప్రభావం అనంతరం తీసుకున్న సహాయక చర్యలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అనంతరం రాత్రికి అక్కడే బస చేస్తారు. -
వరద బాధితుల సహాయార్థం ఏపీఎండీసీ రూ.5 కోట్ల విరాళం
సాక్షి, అమరావతి: గోదావరి వరదల వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎండీసీ) రూ.5 కోట్ల విరాళం అందజేసింది. విరాళానికి సంబంధించిన చెక్‌ను సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, డైరెక్టర్ వీజీ.వెంకటరెడ్డి అందజేశారు. చదవండి: మరోసారి అడ్డంగా బుక్కైన టీడీపీ నేతలు.. అసలు రహస్యం బట్టబయలు -
గోదావరిలో వరద తగ్గుముఖం
సాక్షి, అమరావతి/పోలవరం రూరల్/ధవళేశ్వరం: పరీవాహక ప్రాంతం(బేసిన్)లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఆదివారం గోదారమ్మ శాంతించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ(లక్ష్మీ) బ్యారేజ్‌లోకి వస్తున్న వరద 6,68,560 క్యూసెక్కులకు తగ్గింది. దాని దిగువన తుపాకులగూడెం వద్ద ఉన్న సమ్మక్క బ్యారేజ్‌లోకి వస్తున్న ప్రవాహం 8,82,330 క్యూసెక్కులకు, సీతమ్మసాగర్‌లోకి చేరుతున్న వరద 8,94,998 క్యూసెక్కులకు తగ్గింది. దాంతో భద్రాచలం వద్ద రాత్రి 7 గంటలకు 8,28,701 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. నీటి మట్టం 40.60 అడుగులకు చేరుకోవడంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. ఎగువ నుంచి వస్తున్న వరద తగ్గడం.. శబరి కూడా శాంతించడంతో పోలవరం ప్రాజెక్టులోకి 6,63,660 క్యూసెక్కులు చేరుతున్నాయి. దాంతో పోలవరం ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద నీటి మట్టం 34.39 మీటర్లకు, దిగువ కాఫర్ డ్యామ్ వద్ద నీటి మట్టం 23.62 మీటర్లకు తగ్గింది. పోలవరంలోకి వచ్చిన వరదను వచ్చినట్టుగా 48 గేట్ల ద్వారా అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరి వరద పెరుగుతూ.. తగ్గుతూ ప్రవహిస్తోంది. పోలవరం ప్రాజెక్టు వద్ద కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. గోదావరి వరద ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలుచోట్ల కొండవాగుల నీరు నదిలోకి వెళ్లే పరిస్థితి లేదు. ప్రాజెక్టు దిగువన వరద నీటి ప్రవాహంతో కడెమ్మ స్లూయిజ్ నుంచి కొండవాగు నీరు నదిలోకి చేరే పరిస్థితి లేదు. కాగా, ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రవాహం 9,70,218 క్యూసెక్కులకు, వరద మట్టం 11.70 అడుగులకు తగ్గింది. దాంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. సముద్రంలోకి 9,65,018 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. -
మరోసారి అడ్డంగా బుక్కైన టీడీపీ నేతలు.. అసలు రహస్యం బట్టబయలు
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: నిజాన్ని అబద్ధంగా చెప్పించే ప్రయత్నం చేసి మరోసారి టీడీపీ నేతలు అడ్డంగా బుక్కయ్యారు. అసలు రహస్యం వీరమ్మ కుమారుడు బయటపెట్టాడు.దీంతో మీడియా సాక్షిగా పచ్చనేతలు దొరికిపోయారు. చదవండి: ఇదే చివరి అవకాశం.. ఇలా చేయకపోతే డబ్బులు పడవు అయోధ్య లంక మర్రిమూలలో వరద నీరు బాటిల్లో పట్టించి ఇప్పటికే నవ్వుల పాలైన టీడీపీ నేతలు.. వీరమ్మ కుమారుడు వీరాంజనేయులతో మీడియా సమావేశం పెట్టించి.. వైఎస్సార్సీపీ నేతలు బెదిరించి చెప్పమన్నారంటూ టీడీపీ నేతలు చెప్పించే ప్రయత్నం చేశారు. వైఎస్సార్సీపీ నాయకులు బెదిరించలేదని వీరాంజనేయులు మీడియా సమావేశంలో చెప్పడంతో టీడీపీ నేతలు అవాక్కయ్యారు. నిజాన్ని అబద్ధంగా చిత్రీకరించాలని చూసి మరోసారి టీడీపీ నేతలు అభాసు పాలయ్యారు. -
మళ్లీ గోదా‘వడి’!
సాక్షి, అమరావతి/ధవళేశ్వరం/పోలవరం రూరల్: పరివాహక ప్రాంతం (బేసిన్)లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో గోదారమ్మ మళ్లీ ఉగ్రరూపం దాలుస్తోంది. మహారాష్ట్ర, తెలంగాణ, చత్తీస్‌గఢ్, ఒడిశాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ప్రధాన పాయతోపాటు.. ప్రాణహిత, ఇంద్రావతి, తాలిపేరు, శబరి పోటెత్తి ప్రవాహిస్తుండటంతో గోదావరిలో శనివారం వరద ఉధృతి పెరిగింది. తాలిపేరు ఉప్పొంగడంతో రాత్రి 7 గంటలకు భద్రాచలం వద్ద 9,96,976 క్యూసెక్కుల వరద ప్రవహిస్తోంది. దాంతో భద్రాచలం వద్ద నీటి మట్టం 44.50 అడుగులకు చేరడంతో మళ్లీ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకు 43 అడుగుల కంటే దిగువకు వరద మట్టం చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించిన విషయం తెలిసిందే. ఎగువన బేసిన్లో కురిసిన వర్షాల ప్రభావం వల్ల శనివారం సాయంత్రం 6 గంటలకు కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ(లక్ష్మీ) బ్యారేజ్‌లోకి 5,15,460 క్యూసెక్కులు, తుపాకులగూడెం (సమ్మక్క) బ్యారేజ్‌లోకి 7,20,120 క్యూసెక్కులు చేరుతుండగా.. సీతమ్మసాగర్‌లోకి 10,97,072 క్యూసెక్కులు చేరుతున్నాయి. ఆ మూడు బ్యారేజ్‌లలోకి వస్తున్న నీటిని వస్తున్నట్లుగా దిగువకు వదిలేస్తున్నారు. మరో 48 గంటలు బేసిన్లో ప్రధానంగా తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, ఒడిశాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఆదివారం గోదావరిలో వరద ఉధృతి మరింతగా పెరగనుంది. పోటెత్తిన శబరి భద్రాచలం నుంచి దిగువకు వస్తున్న గోదావరి వరదకు శబరి ప్రవాహం తోడవడంతో పోలవరం వద్ద వరద ప్రవాహం 7,79,341 క్యూసెక్కులకు పెరిగింది. నీటి మట్టం 32.910 మీటర్లకు చేరుకుంది. దాంతో జల వనరుల శాఖ అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తూ, వరదను సమర్థవంతంగా నియంత్రిస్తున్నారు. ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రాత్రి 9 గంటలకు నీటి మట్టం 12.30 అడుగులకు చేరింది. దాంతో మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. గోదావరి డెల్టాకు 5,200 క్యూసెక్కులు వదులుతూ మిగులుగా ఉన్న 10,48,887 క్యూసెక్కులను ధవళేశ్వరం బ్యారేజ్ 175 గేట్లు ఎత్తి సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. -
ఒక్క ప్రాణమూ పోవద్దు.. సీఎం కేసీఆర్ ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: గోదావరి నది తన జన్మస్థానమైన మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరం నుంచి బంగాళాఖాతం వరకు ఉధృతంగా ప్రవహిస్తోందని, ఉప నదులు సైతం భారీ వరదతో పోటెత్తుతున్నాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. ప్రకృతి విపత్తుల నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడుకోవడం.. ప్రభుత్వ యంత్రాంగానికి పరీక్షా కాలమని స్పష్టం చేశారు. ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకుండా అప్రమత్తంగా ఉంటూ సహాయక చర్యలు చేపట్టాలని, రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల పరిస్థితులపై శనివారం ఆయన ప్రగతి భవన్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఎక్కడా వరద నీటిని ఆపొద్దు ‘ఎగువ నుంచి వచ్చిన వరదను వచ్చినట్టే ప్రాజెక్టుల గేట్లను ఎత్తి కిందికి విడుదల చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో నీటిని ఆపకూడదు. గేట్లు లేకుండా మత్తడి దూకి ప్రవహించే డిండి, పాకాల, వైరా, పాలేరు రిజర్వాయర్ల విషయంలో మరింత అప్రమ త్తంగా ఉండాలి. అత్యవసర సేవలందించే శాఖలతో పాటు, వానలు వరదల సందర్భంగా సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన అన్ని శాఖల అధికారులు వారి వారి ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న కేంద్రాలను వదిలి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లకూడదు. ఈ మేరకు సీఎస్ తక్షణమే సర్క్యులర్ జారీ చేయాలి..’ అని సీఎం సూచించారు. ప్రజా ప్రతినిధులూ అప్రమత్తంగా ఉండాలి ‘వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పుడు కురిసే వానలతో గోదావరి నది ఆదివారం మధ్యాహ్నం నాటికి ఉధృతంగా మారే ప్రమాదముంది. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులంతా అప్రమత్తంగా ఉండాలి. అన్నిశాఖల సిబ్బంది, అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ మొన్నటి మాదిరిగానే వరద ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అప్రమత్తమై ఉండాలి. ఇప్పటికే నేను అన్ని జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి తగు సూచనలు ఇచ్చా. ఆగస్టు తొలివారం వరకు భారీ వర్షాలు కొనసాగే సూచనలున్నాయి..’ అని కేసీఆర్ తెలిపారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవాలి ‘మిషన్ భగీరథ తాగునీరు ఎక్కడా కలుషితం కాకుండా చూసుకోవాలి. వైద్య, పంచాయతీరాజ్, విద్యుత్, ఆర్ అండ్ బీ, మున్సిపల్, మిషన్ భగీరథ తదితర శాఖలు ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలి. ఎస్ఐ, సీఐలతో పాటు, పోలీసు సిబ్బంది హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్లకుండా డీజీపీ ఆదేశాలు జారీ చేయాలి..’ అని సీఎం చెప్పారు. వరదల అంచనాకు సరికొత్త సాఫ్ట్వేర్ వరదల ముందస్తు అంచనాకు, నిర్వహణకు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ ప్రత్యేకంగా రూపొందించిన ‘ఫ్లడ్ ఫోర్కాస్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ’ అనే సాంకేతిక పరిజ్ఞానాన్ని సీఎం కేసీఆర్ పరిశీలించారు. వర్షాలకు అనుగుణంగా గోదావరి నదీ ప్రవాహాన్ని, గంట గంటకూ మారే వరద పరిస్థితిని శాటిలైట్ ఆధారంగా రికార్డు చేసి విశ్లేషించే విధానాన్ని ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్‌కుమార్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానానికి రూపకల్పన చేయడం దేశంలోనే తొలిసారి అని వివరించగా, సీఎం అభినందించారు. జీహెచ్ఎంసీలో పరిస్థితిపై ఆరా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వరద కాల్వల పరిస్థితిని, నగరంతో పాటు జల్పల్లి, పీర్జాదిగూడ వంటి ప్రాంతాల్లో వరదలకు ఉప్పొంగే చెరువుల పరిస్థితిని ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. ప్రాణ నష్టం జరగకుండా, ప్రజలకు తలెత్తే అసౌకర్యాలను వీలైనంతగా తగ్గించే విధంగా చర్యలు తీసుకోవడంలోనే ప్రభుత్వ యంత్రాంగం ప్రతిభ ఇమిడి ఉంటుందని సీఎం పేర్కొన్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తతపై, అధికారులు తీసుకున్న చర్యలపై ఆరా తీశారు. భద్రాచలంలో బాగా పనిచేశారు భద్రాచలం వరద ముంపు ప్రాంతాల్లో వైద్యాధికారులు, సిబ్బంది బాగా పనిచేశారని, ఆరోగ్యశాఖ డైరెక్టర్ సహా అధికారులను సీఎం కేసీఆర్ అభినందించారు. డెంగ్యూ ప్రతి ఐదేండ్లకోసారి సైకిల్‌గా వస్తోందని, ఇలాంటి వ్యాధులను ముందస్తుగానే గుర్తించి, తగు చర్యలు తీసుకోవడం ద్వారా అరికట్టాలని మంత్రిని, వైద్యాధికారులను ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్లు, జెడ్పీ సీఈవోలు, ఎంపీడీఓలు, ఆరోగ్యశాఖ, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులు, ఈ రెండు రోజులు సెలవులు అని అలసత్వంగా వ్యవహరించవద్దని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. వానలు వరదల కారణంగా కొట్టుకుపోతున్న రోడ్లను, రవాణా వ్యవస్థను ఎప్పటికప్పుడు పునరుద్ధరించాలని ఆదేశించారు. హైదరాబాద్ సహా రాష్ట్రం వ్యాప్తంగా రోడ్ల పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. -
మళ్లీ గోదావరి పోటు!
సాక్షి, హైదరాబాద్/భద్రాచలం: మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశాల్లో భారీ వర్షాల కారణంగా గోదావరితో పాటు దాని ఉప నదులు ప్రాణహిత, ఇంద్రావతి, తాలిపేరు, శబరి పోటెత్తి ప్రవహిస్తున్నాయి. దీంతో గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాల్చుతోంది. శనివారం రాత్రి 7 గంటలకు భద్రాచలం వద్ద 9,96,976 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. నీటి మట్టం 45.10 అడుగులకు చేరడంతో మళ్లీ మొదటి ప్రమాద హెచ్చరికను జారీచేశారు. ఎగువన బేసిన్లో కురిసిన వర్షాల ప్రభావం వల్ల శనివారం సాయంత్రం 6 గంటలకు కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీలోకి 5,15,460 క్యూసెక్కులు, తుపాకులగూడెం (సమ్మక్క) బ్యారేజీలోకి 7,20,120 క్యూసెక్కులు చేరుతుండగా.. సీతమ్మసాగర్‌లోకి 10,97,072 క్యూసెక్కులు చేరుతున్నాయి. ఆ మూడు బ్యారేజీలలోకి వస్తున్న నీటిని వస్తున్నట్లుగా దిగువకు వదిలేస్తున్నారు. స్లూయిజ్‌లు లీక్ కావడంతో శనివారం భద్రాచలం కొత్తకాలనీలోని ఇళ్లను ముంచెత్తిన వరద నీరు పెరగనున్న వరద ఉధృతి: మరో 48 గంటల పాటు గోదావరి బేసిన్లో ప్రధానంగా తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఆదివారం గోదావరిలో వరద ఉధృతి మరింతగా పెరగనుంది. దీంతో ఏజెన్సీ వాసులు ఆందోళనకు గురవుతున్నారు. భద్రాచలం కరకట్టకు దిగువన ఉన్న అశోక్ నగర్, కొత్త కాలనీ వాసుల పరిస్థితి మళ్లీ దయనీయంగా మారింది. ఇటీవలి వరద నీటిని రెండురోజుల క్రితం మోటార్లతో గోదావరిలోకి ఎత్తిపోశారు. అయితే శుక్రవారం భారీ వర్షం రాగా స్లూయిజ్‌ల లాక్‌లను దించకపోవడంతో పెరిగిన గోదావరి నీటి ప్రవాహం మళ్లీ కొత్తకాలనీలోని ఇళ్లను చుట్టుముట్టింది. శుక్రవారమే తాము ఇళ్లను శుభ్రం చేసుకున్నామని, ఇప్పుడు మళ్లీ వరద రావడానికి అధికారుల వైఖరే కారణమని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
‘గోదారమ్మ శాంతించింది కాబట్టే.. టీడీపీ నేతలు బతికి బయటపడ్డారు’
సాక్షి, పశ్చిమ గోదావరి జిల్లా: వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు చీప్ పాలిట్రిక్స్ చేద్దామని చూశారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గోదారమ్మకు చంద్రబాబు అంటే ఎందుకో ఆగ్రహం అంటూ ఎద్దేవా చేశారు. చదవండి: వరద బాధితులను ఇలా పరామర్శిస్తారా? ‘‘పుష్కరాల్లో బాబు లెగ్ పెట్టాడు. 29 మందిని పొట్టన పెట్టుకొన్నాడు. నిన్న కూడా గోదావరి జిల్లాల్లో అడుగు పెట్టాడు. పడవ ప్రమాదం జరిగింది. గోదారమ్మ దయతో శాంతించింది కాబట్టి టీడీపీ నేతలు బతికి బయట పడ్డారు. సీఎం జగన్ పాలనలో గోదావరి ప్రాంత ప్రజలు సస్యశ్యామలంగా ఉన్నారన్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నపుడు చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని మంత్రి దుయ్యబట్టారు. వరదలు సంభవించినప్పటి నుంచి సీఎం జగన్, మంత్రులు, అధికారులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు అంతా ప్రజలతోనే ఉన్నాం. ప్రజలు మంచి కోసం ఆలోచించే వ్యక్తి సీఎం జగన్ అని మంత్రి అన్నారు. -
దూరదృష్టితో గట్టెక్కించారు!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: పది రోజులపాటు మహోగ్రంగా పోటెత్తిన గోదావరి లంక గ్రామాలకు కంటిపై కునుకు లేకుండా చేసింది. ఎగువన భద్రాచలం వద్ద 71 అడుగులు, దిగువన ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 21 అడుగులతో క్షణక్షణం వణికించింది. మూడు రోజుల పాటు మూడో నంబర్ ప్రమాద హెచ్చరికతో ప్రమాద ఘంటికలు మోగించింది. అయితే ఈ స్థాయిలో వరద వచ్చినా గోదావరి తీరాన ఉన్న నాలుగు జిల్లాల్లో ఎక్కడా గండ్లు పడ్డ దాఖలాలు లేవు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముందుచూపే దీనికి కారణమని నీటిపారుదల రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. వైఎస్సార్ హయాంలో దూరదృష్టితో రూ.600 కోట్లతో 535 కిలోమీటర్లు మేర గోదావరి గట్లను ఆధునికీకరించడం, ఎత్తు పెంచడం వల్లే వరద ఉగ్రరూపం దాల్చినా ప్రాణనష్టం జరగకుండా కాపాడగలిగినట్లు పేర్కొంటున్నారు. యుద్ధ ప్రాతిపదికన చర్యలు... వైఎస్సార్ సీఎంగా ఉండగా 2006 ఆగస్టు 7న గోదావరికి వరదలు వచ్చాయి. నాడు ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 22.80 అడుగుల నీటిమట్టంతో 28,50,664 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేశారు. నాటి వరదల ఉధృతికి వశిష్ట ఎడమ గట్టుకు పి.గన్నవరం మండలం మొండెపులంక, గౌతమి కుడిగట్టుకు అయినవిల్లి మండలం శానపల్లిలంక వద్ద భారీగా గండ్లు పడ్డాయి. ఏటిగట్లకు పడ్డ గండ్లతో పలు మండలాల్లో పంటలు ముంపునకు గురై రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో చలించిపోయిన వైఎస్సార్ యుద్ధప్రాతిపదికన చర్యలకు ఆదేశించారు. నాడు నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న పొన్నాల లక్ష్మయ్య ఆధ్వర్యంలో ఒక బృందాన్ని గోదావరి జిల్లాలకు పంపి వాస్తవ పరిస్థితిపై నివేదిక తెప్పించుకున్నారు. రిటైర్డ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ సీతాపతిరావు సారథ్యంలో వరదలు, ఏటిగట్ల ఆధునీకరణపై సాంకేతిక బృందంతో సర్వేచేసి సమగ్ర నివేదిక సిద్ధం చేయించారు. ఎటు చూసినా 8 మీటర్ల ఎత్తుతో.. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో 535 కిలోమీటర్ల మేర గోదావరి ఏటిగట్ల పటిష్టం కోసం వైఎస్సార్ రూ.548 కోట్లు మంజూరు చేశారు. పనులు పూర్తయ్యేసరికి అంచనాలు రూ.600 కోట్లు దాటిపోయాయి. 1986 నాటి వరదల సమయంలో ఏటిగట్లు ఆరు మీటర్ల ఎత్తు ఉండగా మరో రెండు అడుగులు పెంచి ఆధునీకరించారు. గోదావరి బండ్ ఎత్తు ఎక్కడ చూసినా ఎనిమిది మీటర్లు ఉండేలా పెంచారు. నాలుగు మీటర్లు వెడల్పున్న ఏటిగట్లను ఆరున్నర మీటర్లకు పెంచి విస్తరించారు. ఏటిగట్లు కోతకు గురికాకుండా మరో రూ.112 కోట్లతో నదీ పరీవాహకం వెంట గ్రోయిన్స్ కూడా నిర్మించారు. పటిష్టమైన చర్యల ద్వారా 1986 నాటి పరిస్థితులు పునరావృతం కాకుండా నివారించారు. తద్వారా గోదావరి జిల్లాల ప్రజలకు వైఎస్ రాజశేఖరరెడ్డి దార్శనికుడిగా నిలిచారు. ముందుచూపు ఫలితమే.. 1986 ఆగస్టు 16న ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 20.10 అడుగులతో రికార్డు స్థాయిలో 35,06,380 క్యూసెక్కుల మిగులు జలాలు సముద్రంలోకి విడుదల చేశారు. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద అత్యధికంగా నమోదైన 1986 వరదలనే ప్రామాణికంగా తీసుకుని ఏటిగట్లు పటిష్టం చేయాలని వైఎస్సార్ నిర్ణయించారు. దూరదృష్టితో ఎత్తు పెంపు, వెడల్పు, పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకోవడంతో తాజా వరదల్లో ఏటిగట్లకు ఎక్కడా చిన్న గండి కూడా పడలేదు. ఆనాడు ముందుచూపుతో ఆయన తీసుకున్న నిర్ణయాలే గోదావరి ప్రజల ప్రాణాలకు భరోసాగా నిలిచాయి. గాలికొదిలేసిన చంద్రబాబు సర్కారు వైఎస్సార్ హయాంలో చేపట్టిన రక్షణ చర్యల్లో కొన్ని ప్యాకేజీలను ఆయన హఠాన్మరణం తరువాత చంద్రబాబు సర్కార్ గాలికొదిలేసింది. వశిష్ట కుడి గట్టు నరసాపురం, వశిష్ట ఎడమగట్టు పరిధిలో 48వ కిలోమీటరు నుంచి 90వ కిలోమీటరు వరకు మూడు ప్యాకేజీలు నిలిచిపోయాయి. అప్పట్లో పనులు నిలిచిపోయిన ప్రాంతాల్లోనే తాజాగా అధికార యంత్రాంగం, స్థానికులు నిద్రాహారాలు మాని గట్లకు కాపలా కాయాల్సి వచ్చింది. రాజోలు పరిధిలోని తాటిపాక మఠం నుంచి అంతర్వేది, రాజోలు నుంచి అంతర్వేది వరకు మానేపల్లి వద్ద గోదావరి వరద ఉధృతి భయపెట్టింది. సఖినేటిపల్లి లంక, టేకిశెట్టిపాలెం, దిండి, రామరాజులంక, ఎల్ గన్నవరం, మానేపల్లి ప్రాంతాల్లో వరద భీతిగొల్పింది. వైఎస్సార్ హయాంలో చేపట్టిన ఈ పనులను తరువాత ప్రభుత్వాలు పూర్తి చేసి ఉంటే ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదని పేర్కొంటున్నారు. ఆ నిర్ణయమే కాపాడింది.. ఈరోజు గోదావరి జిల్లాలు సురక్షితంగా బయటపడ్డాయంటే ఆ రోజు వైఎస్సార్ తీసుకున్న నిర్ణయాలే కారణం. ఆయన దూరదృష్టితో కరకట్ట పటిష్టం చేయకుంటే ఈ వరదలకు ఏం జరిగేదో ఊహించలేం. ఎప్పుడూ లేనిది జూలైలో ఇంత ఉధృతంగా రావడం ప్రమాదకరమే. 2006లో వైఎస్సార్ సీఎంగా ఉండగా ధవళేశ్వరం హెడ్‌వర్క్స్ ఈఈగా ఏటిగట్ల అంచనాలు రూపొందించే ప్రక్రియలో భాగస్వామి కావడం నాకెంతో సంతృప్తినిచ్చింది. – విప్పర్తి వేణుగోపాలరావు, రిటైర్డ్ ఎస్ఈ, జలవనరులశాఖ, జెడ్పీ చైర్మన్, ఉమ్మడి తూర్పుగోదావరి -
అప్రమత్తతతో తప్పిన గోదావరి ముప్పు
సాక్షి, అమరావతి: ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలకు తోడు నదీ పరివాహక ప్రాంతంలో విస్తారంగా కురిసిన వానలతో కొండ వాగులు, వంకలు, ఉప నదులు ఉప్పొంగడంతో గోదావరి ఉగ్రరూపం దాల్చిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లోని ఆరు జిల్లాల్లో వరద ప్రభావం చూపింది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద 2006లో 28.50 లక్షల క్యూసెక్కులు నమోదు కాగా.. ఆ తర్వాత ఈ ఏడాది 25.80 లక్షల క్యూసెక్కులు రికార్డైంది. ఈ వరద విపత్తు నుంచి ప్రజలను గట్టెక్కించడంలో సీఎం వైఎస్ జగన్ ఆదేశాలను అమలు చేస్తూ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కీలకపాత్ర పోషించింది. గోదావరి వరద ముప్పు నుంచి ప్రజలను తప్పించేందుకు వారిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వచ్చింది. వివిధ విభాగాలకు చెందిన 40 వేల మంది సిబ్బంది వరద ప్రభావిత జిల్లాల్లో ప్రజలకు అండగా నిలిచారు. వారిని రక్షించడం నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించడం వరకు విశేష సేవలందించారు. ఇందుకు సంబంధించిన వివరాలను గురువారం ఒక ప్రకటన ద్వారా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ముందుగానే అంచనా.. ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతుండటంతో వరద ప్రవాహాన్ని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ముందుగానే అంచనా వేసింది. వరద ప్రారంభానికి ముందుగానే సంస్థలోని ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్లో 24 గంటలు అందుబాటులో ఉండేలా స్టేట్ కంట్రోల్ రూమ్‌ను జూలై 9న ప్రారంభించింది. జిల్లాల్లో కూడా కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది. అంతేకాకుండా టోల్ ఫ్రీ నంబర్లతో ప్రజలకు అందుబాటులో ఉండి.. వెంటనే స్పందించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. ఆ తర్వాత వరద ప్రవాహాన్ని అంచనా వేస్తూ.. ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలోని అధికారులకు గంట గంటకు సమాచారం చేరవేస్తూ వచ్చింది. తద్వారా ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా గట్టెక్కించింది. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి విపత్తుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, ఎండీ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, దాదాపు వంద మంది సిబ్బంది నిరంతరం పనిచేస్తూ సేవలు అందించారు. ప్రజలకు అండగా వేలమంది సిబ్బంది.. ఓ వైపు వరద ఉ«ధృతిని అంచనా వేసి మొదటి ప్రమాద హెచ్చరిక నుంచి మూడో ప్రమాద హెచ్చరిక వరకు ప్రతిక్షణం గమనిస్తూ ఆరు జిల్లాల ప్రజలను అప్రమత్తం చేశారు. కీలక సమయంలో గోదావరి పరివాహక ప్రాంతంలోని 23 లక్షల మంది ప్రజలకు వరద ఉధృతిని తెలుపుతూ అలెర్ట్ మెసేజ్‌లు పంపించారు. ఎన్ని లక్షల క్యూసెక్కులకు ఎన్ని మండలాలు ప్రభావితమవుతాయి? ఎన్ని గ్రామాలు ముంపునకు గురవుతాయి?.. వంటివాటిపై అంచనా వేసి జిల్లాల అధికారులకు సమాచారం అందించారు. తద్వారా వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించి పెనుప్రమాదాన్ని తప్పించగలిగారు. ఓవైపు అధికారులు, ప్రజలను అప్రమత్తం చేస్తూనే.. మరోవైపు వరద ప్రభావిత జిల్లాల్లో సహాయక బృందాలను రంగంలో దింపారు. 10 ఎన్డీఆర్ఎఫ్, 11 ఎస్డీఆర్ఎఫ్, 3 ఇండియన్ నేవీ బృందాలు శ్రమించి ప్రాణాపాయంలో ఉన్న 183 మందిని రక్షించారు. సహాయక బృందాలు చేరలేని విపత్కర స్థితిలోనూ ఏలూరు జిల్లా కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు హెలికాప్టర్ల ద్వారా ఆరు రోజులపాటు ఆహారం, నిత్యావసర సరుకులను అందించారు. గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వారిని సురక్షితంగా తరలించారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 40 వేల రెవెన్యూ, జలవనరులు, వైద్య, గ్రామ సచివాలయాలు, పారిశుధ్యం, ఇతర విభాగాల సిబ్బంది బాధితులకు సేవలు అందించారు. క్రమంగా తగ్గుతున్న గోదా‘వర్రీ’ పోలవరం రూరల్ / నరసాపురం: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, నరసాపురం ప్రాంతాల్లో గోదావరి నీటిమట్టం గురువారం మరింత తగ్గింది. దీంతో గోదావరి పొడవునా ఏటిగట్టు వెంట ముంపు ప్రాంతాల్లో పరిస్థితులు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. వరద కారణంగా నీట మునిగిన పొన్నపల్లి, లాకుపేట, నందమూరి కాలనీ, స్టేషన్‌పేట, చినమామిడిపల్లి ప్రాంతాల్లో ఇంకా పూర్తిగా నీరు లాగలేదు. ముంపు ప్రాంతాల్లో నీటిని అధికారులు ఇంజన్లతో తోడిస్తున్నారు. పొన్నపల్లి ఏటిగట్టు ప్రాంతాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, జిల్లా జాయింట్ కలెక్టర్ జేవీ మురళి పరిశీలించి అక్కడ జరుగుతున్న చర్యలను పర్యవేక్షించారు. ముంపు తొలగిన ప్రాంతాల్లో సిబ్బంది పారిశుధ్య పనులు చేపట్టారు. వరదలకు నీట మునిగిన ఆలయాల్లో శుద్ధి కోనసీమ, కాకినాడ, ఏలూరు, తూర్పు గోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో గోదావరి వరద ఉధృతి సమయంలో నీట మునిగిన ఆలయాలన్నింటిలోనూ యుద్ధప్రాతిపదికన శుద్ధి నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆలయ సంప్రదాయాలకు అనుగుణంగా క్లీనింగ్, బ్లీచింగ్, క్లోరినేషన్, ఫాగింగ్, ధూపం తదితర కార్యక్రమాలు చేపట్టాలని దేవదాయ శాఖ కమిషనర్ హరిజవహర్‌లాల్ గురువారం ఉత్తర్వులిచ్చారు. -
శాంతించిన గోదావరి
సాక్షి, అమరావతి/ధవళేశ్వరం/పోలవరం రూరల్: గోదావరి శాంతించింది. పరివాహక ప్రాంతంలో వర్షాలు తెరిపి ఇవ్వడం, ఉప నదుల్లో ప్రవాహం తగ్గుతుండటంతో గురువారం గోదావరిలో వరద మరింత తగ్గింది. ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి గురువారం సాయంత్రం 6 గంటలకు 13,46,852 క్యూసెక్కులు వస్తుండటంతో నీటిమట్టం 14.20 అడుగులకు తగ్గింది. నీటిమట్టం 13.75 అడుగు లకంటే దిగువకు చేరుకునే వరకు బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగనుంది. బ్యారేజ్ లోకి చేరుతున్న నీటిలో 7,700 క్యూసెక్కులను గోదావరి డెల్టాకు విడుదల చేస్తున్నారు. మిగులుగా ఉన్న 13,39,152 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. శుక్రవారం బ్యారేజ్‌లోకి వచ్చే వర ద మరింత తగ్గనుంది. వర్షాలు తెరిపి ఇవ్వడంతో ప్రాణహిత, ఇంద్రావతి, కడెంవాగు తదితర ఉప నదుల నుంచి గోదావరికి వచ్చే వరద తగ్గింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ ్డ(లక్ష్మీ) బ్యారేజ్‌లోకి వస్తున్న వరద 7,83,460 క్యూసెక్కులకు, తుపాకులగూడెం (సమ్మక్క) బ్యా రేజ్‌లోకి చేరుతున్న ప్రవాహం 8,92,340 క్యూసె క్కులకు తగ్గింది. దాంతో వాటి దిగువనున్న సీత మ్మసాగర్‌లోకి వస్తున్న వరద 10,67,705 క్యూసె క్కులకు తగ్గింది. గురువారం సాయంత్రం 6 గంట లకు భద్రాచలం వద్ద వరద నీటి మట్టం 46.30 అడుగులకు తగ్గింది. దాంతో రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించారు. పోలవరం వద్దకు గురువారం 6 గంటలకు 11,37,103 క్యూసెక్కులు చేరుతోంది. స్పిల్ వే వద్ద నీటిమట్టం 33.47 మీటర్లకు చేరింది. స్పిల్ వేకు దిగువన నీటిమట్టం 25.15 మీటర్లు ఉంది. -
Kaleshwaram Project: వందల కోట్ల నష్టమనే ప్రచారం అవాస్తవం: రజత్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన అన్నారం, మేడిగడ్డ పంపుహౌస్‌లు నీట మునగడంతో రూ.వందల కోట్ల నష్టం వాటిల్లిందంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని.. వరదలతో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.20 కోట్ల నుంచి రూ.25 కోట్ల మేరకు మాత్రమే నష్టం జరిగిందని నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ తెలిపారు. ఒప్పందం మేరకు ఈ నష్టాన్ని కూడా నిర్మాణ సంస్థలే భరిస్తాయని, ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పారు. 45 రోజుల్లోగా కాళేశ్వరం పంపుహౌస్‌లకు మరమ్మతులు పూర్తి చేస్తామని.. సెప్టెంబర్‌లోగా పూర్తిగా పునరుద్ధరిస్తామని చెప్పారు. రాష్ట్రంలో వరదల కారణంగా సాగునీటి ప్రాజెక్టులకు వాటిల్లిన నష్టంపై రజత్‌కుమార్ బుధవారం జలసౌధలో సమీక్షించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. భవిష్యత్తు వరదల ప్రభావాన్ని సరిగా అంచనా వేయకుండానే కాళేశ్వరం ప్రా జెక్టు నిర్మించడంతో పంపుహౌస్‌లు నీటమునిగాయన్న ఆరోపణలు అవాస్తవమన్నారు. ఎవరూ సరిగా అంచనా వేయలేదు వాతావరణంలో అనూహ్య మార్పుల కారణంగా క్లౌడ్ బరస్ట్ వంటి పరిస్థితులు ఉత్పన్నం కావడంతో పంపుహౌస్‌లు నీటమునిగాయని రజత్‌కుమార్ పేర్కొన్నారు. కేంద్ర జల సంఘంలోని 18 విభాగాల నుంచి అనుమతులు లభించాకే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించామన్నారు. భారత వాతావరణ శాఖ, యూరోపియన్ శాటిలైట్ ఏజెన్సీలు సైతం వర్షాలు, వరదల తీవ్రతను సరిగ్గా అంచనా వేయలేక పోయాయని చెప్పారు. జలవనరుల శాఖలో ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ విభాగాన్ని ఏర్పాటు చేసి కడెం ప్రాజెక్టుకు ఇటీవలే మరమ్మతులు చేశామని.. అందువల్లే రికార్డు స్థాయిలో వరద వచ్చినా ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్పారు. గత వందేళ్లలో ఎన్నడు లేని విధంగా ఆదిలాబాద్ జిల్లాలోని నాలుగు మండలాల్లో 30 సెంటీమీటర్ల కుండపోత వర్షం కురవడంతోనే కడెంకు భారీ వరద వచ్చిందన్నారు. పోలవరంతో తెలంగాణలో భారీ ముంపు గోదావరి నదిపై ఏపీ నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌తో తెలంగాణలో లక్ష ఎకరాల మేర ముంపు బారినపడతాయని రజత్‌కుమార్ పేర్కొన్నారు. భద్రాచలం, పర్ణశాలతోపాటు పలు చారిత్రాక ప్రదేశాలు మునిగిపోతాయన్నారు. పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంపై అధ్యయనం జరపాలని కేంద్రానికి ఎన్నిసార్లు లేఖలు రాసినా ఇప్పటివరకు స్పందన లేదని విమర్శించారు. -
ధవళేశ్వరం, పోలవరం వద్ద తగ్గిన వరద
సాక్షి, తూర్పుగోదావరి: ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి వరద నీరు తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం(బుధవారం ఉదయం నాటికి) 16.50 అడుగులకు చేరుకుంది వరద నీటిమట్టం. సుమారు 17 లక్షల 15 వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఏలూరు: పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద ఉధృతి బాగా తగ్గింది. ప్రాజెక్ట్స్ స్పీల్వే వద్ద 34.6 మీటర్లకు చేరుకుంది వరద నీరు. 48 గేట్ల ద్వారా దిగువకు 15.58 లక్షల క్యూసెక్కుల వరద నీరు వదులుతున్నారు. నంద్యాల: శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. ఇన్ ఫ్లో : 2,52,967 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో : 19,070 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్దాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 876.00 అడుగుల వద్ద ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుతం : 168.2670 టీఎంసీలుగా ఉంది. ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. -
TS: భద్రాచలం వద్ద తగ్గిన నీటిమట్టం.. మిగతా చోట్ల వరద ఉధృతి
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం 48 అడుగులకు చేరింది. ఎగువ నుంచి గోదావరిలోకి వస్తున్న 12 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. ఇప్పుడిప్పుడే ముంపునకు గురైన కాలనీలలో సాధారణ పరిస్థితిలు కనిపిస్తున్నాయి. దీంతో శానిటేషన్ ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. వరదలతో సర్వం కోల్పోయిన భద్రాచలం స్థానికులు.. భరించలేని దుర్వాసనతో ఇళ్లలో ఉండలేకపోతున్నారు. ఒక పక్క సిబ్బంది.. మరోవైపు ప్రజలూ మాస్కులు ధరించి రంగంలోకి దిగారు. ఇంకోపక్క గోదావరి వరద లతో విద్యుత్ శాఖకు భారీ నష్టం వాటిల్లింది. భద్రాచలం, పినపాక నియోజక వర్గాల్లోని ఏడు మండలాల్లో 630కి పైగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు దెబ్బ తిన్నాయి. వారం రోజుల పాటు వరద నీటిలోనే ఉండిపోయింది పర్ణశాల సబ్‌స్టేషన్. సమారు 16 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు అధికారుల అంచనా వేస్తున్నారు. అలాగే 143 గ్రామాల్లో 5,620 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. సహాయక చర్యలు.. భద్రాచలం వరదలు తగ్గుముఖం పట్టాక వేగంగా వ్యర్థాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇతర జిల్లాలో నుంచి వచ్చి విధుల్లో చేరిన 4,100 మంది పారిశుద్ధ్య సిబ్బంది పనులు చేస్తున్నారు. శిల్పినగర్, విస్తా కాంప్లెక్స్‌తోపాటు ఆలయ ఉత్తర ద్వారం వైపునకు వస్తున్న భద్రాచలం కరకట్ట వద్ద ఉన్న స్లూయిస్ల ద్వారా నీరు లీకవుతోంది. దీంతో.. ఇరిగేషన్ శాఖ ఏర్పాటు చేసిన ఐదు మోటార్లకు అదనంగా మరో 15 మోటర్లు తెప్పించించింది సింగరేణి. మొత్తం 20 మోటార్ల ద్వారా వరదనీటిని తోడి తిరిగి గోదావరిలోకి ఎత్తిపోసే ప్రక్రియ నడుస్తోంది. ఉన్నతాధికారిపై వేటు భద్రాచలం డిప్యూటీ డీఎం అండ్ హెచ్ ఓ డా. కె. రాజ్ కుమార్ పై సస్పెన్షన్ వేటు పడింది. గోదావరి వరదల సమయంలో హెడ్ క్వార్టర్లో లేకుండా, ఉన్నతాధికారుల అనుమతి లేకుండా పోవడం సర్కార్ దృష్టికి వెళ్లింది. దీంతో రాజ్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: పాల్వంచ కిన్నెరసాని జలాశయానికి వరదనీరు పొటెత్తింది. డ్యాం పూర్తి సామర్థ్యం 407 అడుగులు కాగా.. ప్రస్తుతం 402.40 అడుగులు చేరింది. ఇన్ ఫ్లో 4వేల క్యూసెక్కులు కాగా 4 గేట్లు ఎత్తి 18వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కిన్నెరసాని పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరికలు జారీ చేశారు. నిజామాబాద్ జిల్లా: శ్రీరాంసాగర్ కు వరద ఉధృతి కొనసాగుతోంది. ఇన్ ఫ్లోస్ 59 వేల క్యూసెక్కులుగా ఉంది. పద్దెనిమిది గేట్లెత్తి 50 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. మొత్తం 90 టీఎంసీలకుగాను ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 77 టీఎంసీలు.. 1091 అడుగులకుగాను.. నీటిమట్టం 1088 అడుగులుగా ఉంది. భూపాలపల్లి జిల్లా: కాళేశ్వరం వద్ద 12.600 మీటర్ల ఎత్తులో క్రమంగా పెరుగుతూ ప్రవహిస్తోంది గోదావరి. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ లక్ష్మీ బ్యారేజ్ మొత్తం 85 గేట్లు ఎత్తి 10,71,720 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ ప్లో, ఔట్ ఫ్లో 10,71,720 క్యూసెక్కులుగా ఉంది. లక్ష్మీ బ్యారేజ్ పూర్తిస్థాయి నీటినిలువ సామర్థ్యం 16.17 టీఎంసిలు. అన్నారం సరస్వతీ బ్యారేజ్ సరస్వతీ బ్యారేజ్ మొత్తం 66 గేట్లు ఎత్తి 1,46,,353 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ ప్లో, ఔట్ ఫ్లో 1,46,353 క్యూసెక్కులు గా ఉంది. సరస్వతీ బ్యారేజ్ పూర్తి నీటి సామర్ధ్యం 10.87 టీఎంసిలు.. ప్రస్తుత నీటి సామర్ధ్యం 0.33 టిఎంసిలుగా ఉంది. నల్లగొండ జిల్లా: నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కు కొనసాగుతున్న వరద. ఇన్ ఫ్లో : 29,365 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో: 4,138 క్యూసెక్కులు. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం: 312.0450 టిఎంసీ లు, ప్రస్తుత నీటి నిలువ: 173.6640 టిఎంసి లు. పూర్తిస్థాయి నీటిమట్టం: 590 అడుగులు, ప్రస్తుత నీటిమట్టం: 532.80 అడుగులు, -
శాంతించిన గోదావరి
సాక్షి, అమరావతి/ధవళేశ్వరం: ఎగువన వర్షాలు తెరిపివ్వడం.. ఉప నదుల్లో ప్రవాహం తగ్గుతుండటంతో గోదావరి వరద ప్రవాహం మంగళవారం మరింతగా తగ్గింది. మంగళవారం రాత్రి 8 గంటలకు ధవళేశ్వరం బ్యారేజీలోకి 18,59,913 క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండగా.. నీటి మట్టం 17.40 అడుగులకు తగ్గింది. దాంతో మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించుకున్నారు. ధవళేశ్వరం వద్ద నీటిమట్టం 13.75 అడుగుల దిగువకు వచ్చే వరకు రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగించనున్నారు. బ్యారేజీ నుంచి గోదావరి డెల్టాకు 5,400 క్యూసెక్కులను విడుదల చేస్తూ.. మిగులుగా ఉన్న 18,54,413 క్యూసెక్కులను 175 గేట్లు ఎత్తి సముద్రంలోకి వదిలేస్తున్నారు. భద్రాచలంలోనూ తగ్గుముఖం ఎగువ భద్రాచలం వద్దకు వచ్చే వరద కూడా క్రమేణ తగ్గుతోంది. మంగళవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద 12,51,999 క్యూసెక్కులకు ప్రవాహం తగ్గడంతో నీటిమట్టం 49.6 అడుగులకు తగ్గింది. దాంతో అక్కడ కూడా మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు. భద్రాచలం వద్ద నీటి మట్టం 48 అడుగుల కంటే దిగువకు తగ్గే వరకూ రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగించనున్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఎగువన కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీలోకి వచ్చే వరద 8,62,200 క్యూసెక్కులకు తగ్గింది. దాని దిగువన తుపాకులగూడెం (సమ్మక్క) బ్యారేజీలోకి చేరుతున్న వరద 9,10,400 క్యూసెక్కులకు, సీతమ్మ సాగర్‌లోకి వస్తున్న వరద 11,65,362 క్యూసెక్కులకు తగ్గింది. వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. బుధవారం నాటికి భద్రాచలం వద్ద 43 అడుగుల కంటే దిగువకు గోదావరి ప్రవాహం చేరుకునే అవకాశం ఉంది. అప్పుడు మొదటి ప్రమాద హెచ్చరికను కూడా అధికారులు ఉపసంహరించుకుంటారు. వరద ప్రవాహం తగ్గినా పోలవరం ప్రాజెక్టు వద్ద అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు విడుదల చూస్తూ.. వరదను సమర్థవంతంగా నియంత్రిస్తున్నారు. -
సహాయం.. శరవేగం
సాక్షి, అమరావతి: గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వరద తీవ్రత తగ్గినా ఇంకా కొనసాగుతుండటంతో సహాయక చర్యల విషయంలో ప్రభుత్వం రాజీ పడకుండా ముందుకెళుతోంది. బాధితులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటోంది. 6 జిల్లాల్లో పరిధిలోని 62 మండలాలు, 727 గ్రామాల్లో అధికార యంత్రాంగం విరామం లేకుండా.. విశ్రమించకుండా పని చేస్తూనే ఉంది. 324 గ్రామాలు పూర్తిగా ముంపు బారినపడగా.. 403 గ్రామాల్లోకి వరద నీరు చేరింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యధికంగా 143 గ్రామాలు ముంపులో ఉండగా, 165 గ్రామాల్లోకి వరద నీరు చేరింది. ఏలూరు జిల్లాలో 76 గ్రామాలు ముంపులో ఉండగా, 93 గ్రామాల్లోకి నీరు చేరింది. కోనసీమ జిల్లాలో 61 గ్రామాలు మునిగిపోగా, 74 గ్రామాల్లో వరద ప్రభావానికి గురయ్యాయి. వీటితోపాటు తూర్పు, పశ్చిమ గోదావరి, కాకినాడ జిల్లాల్లో సహాయక చర్యలు చురుగ్గా కొనసాగుతున్నాయి. సురక్షిత ప్రాంతాలకు 1.42 లక్షల మంది 324 ముంపు గ్రామాల నుంచి మొత్తం 1,42,655 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అందులో 1,22,920 మంది ప్రభుత్వం ఏర్పాటు చేసిన 217 సహాయక శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. అల్లూరి జిల్లాలోనే 103 సహాయక శిబిరాల్లో 69,112 మంది ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 24,152 మంది, ఏలూరు జిల్లాలో 18,707 మంది, కోనసీమ జిల్లాలో 9,236 మంది, కాకినాడ జిల్లాలో 1,243 మంది, తూర్పుగోదావరి జిల్లాలో 470 మంది సహాయ శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. సహాయక శిబిరాలు, వరద నీరు చేరిన గ్రామాల్లో 297 వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అనారోగ్యానికి గురైన వారికి చికిత్స అందిస్తున్నారు. ముంపు ప్రాంతాల్లో ఇప్పటివరకు 5 లక్షల ఆహార పొట్లాలు, 25 లక్షల మంచినీళ్ల ప్యాకెట్లు పంపిణీ చేశారు. 321 మంది గర్భిణుల తరలింపు ముంపు ప్రాంతాల్లోని గర్భిణులు ఇబ్బందులు పడకుండా వైద్య శాఖ చర్యలు చేపట్టింది. వీరిని ముందే గుర్తించి సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రులు, సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఇప్పటివరకూ నాలుగు జిల్లాల్లో 321 మంది గర్భిణులను ఆస్పత్రులు, సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీరికి వైద్య సేవలు అందించడం కోసం గైనకాలజిస్ట్, అనస్తీషియా, ఇతర స్పెషాలిటీ వైద్యులను ఇతర జిల్లాల నుంచి తరలించారు. రూ.41.50 కోట్లు విడుదల ముంపు ప్రాంతాల్లో తక్షణ అవసరాల కోసం ప్రభుత్వం రూ.41.50 కోట్లు విడుదల చేసింది. అల్లూరి జిల్లాకు రూ.10.50 కోట్లు, కోనసీమ జిల్లాకు రూ.12 కోట్లు, తూర్పు గోదావరికి రూ.4 కోట్లు, ఏలూరు జిల్లాకు రూ.9 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాకు రూ.6 కోట్లు విడుదల చేయగా.. ఆయా జిల్లాల కలెక్టర్లు వాటిని సహాయక చర్యలకు వినియోగిస్తున్నారు. ముంపు బారిన పడిన కుటుంబాలకు రూ.వెయ్యి నుంచి రూ.2 వేల సహాయాన్ని అందిస్తున్నారు. బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ చురుగ్గా సాగుతోంది. ఇందుకోసం ఇప్పటివరకు 944 టన్నుల బియ్యం, 89.89 టన్నుల కందిపప్పు, 60,051 లీటర్ల పామాయిల్, 80,685 లీటర్ల పాలు, 97,701 కేజీల ఉల్లిపాయలు, 97,701 కేజీల బంగాళా దుంపలు వినియోగించారు. మూగజీవాలకు రక్షణగా.. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తినప్పటికీ ఆరు జిల్లాల పరిధిలో మృత్యు వాత పడిన పశువులు కేవలం ఆరు మాత్రమే. పైగా 24 గంటల్లోనే పరిహారం కూడా అందించి పాడి రైతులకు ప్రభుత్వం అండగా నిలిచింది. 6 జిల్లాల పరిధిలో 84,592 పశువులుండగా, వరద ప్రభావానికి గురైన 226 గ్రామాల్లో చిక్కుకున్న దాదాపు 30 వేల పశువులను పశు సంవర్థక శాఖ అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పునరావాస చర్యల కోసం 124 ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు 594.95 టన్నుల దాణాను ఉచితంగా పంపిణీ వేశారు. పశువుల ఆరోగ్య పరిరక్షణ కోసం 111 ప్రత్యేక పశువైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. వ్యాధులు సోకకుండా 27,297 పశువులకు హెచ్ఎస్, బీక్యూ, బీటీ, ఈటీ వ్యాక్సినేషన్స్ చేశారు. వరదల వల్ల గాయపడిన 2,254 పశువులకు ప్రత్యేక వైద్య సహాయం అందించారు. రూ.14 లక్షల విలువైన మందులను ఉచితంగా అందించారు. పశువుల దాణా కోసం కోసం పశు సంవర్థక శాఖ రూ.2.41 కోట్లు విడుదల చేసింది. వరద ఉధృతి తగ్గినప్పటికీ ప్రభావిత లంక గ్రామాల్లో వైద్య శిబిరాలను కొనసాగిస్తున్నారు. కనీసం వారం రోజులకు సరిపడా దాణా, పశుగ్రాసం అందించేందుకు ఏర్పాట్లు చేశారు. సహాయక చర్యల్లో 40 వేల మంది గతంలో ఎన్నడూ లేని విధంగా గోదావరి వరద సహాయక చర్యల్లో 40 వేల మందికిపైగా అధికారులు, సిబ్బంది పాలు పంచుకుంటున్నారు. ఇంతకుముందు వరదలు, ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఏ ప్రభుత్వం కూడా ఈ స్థాయిలో సహాయక చర్యలకు యంత్రాంగాన్ని వినియోగించిన దాఖలాలు లేవు. కానీ ఈసారి వరద హెచ్చరికలు మొదలైనప్పటి నుంచి సీఎం సహా ప్రభుత్వ యంత్రాంగమంతా హుటాహుటిన అప్రమత్తమైంది. ఆరు జిల్లాల్లో ఆరుగురు కలెక్టర్లు, ఆరుగురు జాయింట్ కలెక్టర్లు, ఆరుగురు ఎస్పీలు పక్కా ప్రణాళికతో వరద విపత్తును ఎదుర్కొన్నారు. రెవెన్యూ అధికారులు, సిబ్బంది కలిసి 1,235 మంది విధుల్లో పాలు పంచుకుంటున్నారు. గ్రామ సచివాలయ సిబ్బంది 8,960 మంది, గ్రామ వలంటీర్లు 13,241 మంది, పారిశుధ్య సిబ్బంది 2,650 మంది, వైద్య సిబ్బంది 1,294 మంది, బోట్ల డ్రైవర్లు, సహాయకులు 631 మంది ప్రత్యక్షంగా వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. వీరంతా కలిపి మొత్తం 28,029 మంది సహాయక చర్యల్లో అలుపు లేకుండా పనిచేస్తున్నారు. వీరుకాకుండా పోలీసులు, ఫైర్ సర్వీసెస్, పశు సంవర్థక, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ తదితర శాఖల అధికారులు, సిబ్బంది మరో 10 వేల మందికిపైగా సహాయక చర్యల్లో నిరంతరాయం సేవలు అందిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర స్థాయిలో విపత్తుల నిర్వహణ శాఖ ఆధ్వర్యంలో నడిచే స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి విపత్తుల నిర్వహణ సంస్థ ముఖ్య కార్యదర్శి, సీసీఎల్ఏ సాయిప్రసాద్, ఎండీ అంబేడ్కర్‌తో కలిసి ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని అంచనా వేస్తూ కలెక్టర్లు, యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఇలా సీఎం నుంచి గ్రామ వలంటీర్ వరకు వరద సహాయక చర్యల్లో నిమగ్నమై పనిచేయడంతో ప్రాణ నష్టాన్ని నివారించగలిగారు. -
కడుపు మంటతోనే చంద్రబాబు, ఎల్లో మీడియా దుష్ప్రచారం
సాక్షి, తాడేపల్లి: చరిత్రలో గోదావరి వరదలు ఇంతలా రావడం ఎప్పుడూ చూడలేదన్నారు పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రభుత్వం తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలను సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు తీసుకున్నట్లు చెప్పారు. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, వారికి కావాల్సినవన్నీ సమకూర్చామని చెప్పారు. కానీ చంద్రబాబు, ఎల్లో మీడియా ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. కడుపుమంటతో చంద్రబాబు, ఆ పత్రికలు బాధపడుతున్నాయని విమర్శించారు. అధికారం కోసం వాళ్ళు గిలగిలా కొట్టుకుంటున్నారని విరుచుకుపడ్డారు. 'చంద్రబాబు కోనసీమ వెళ్లే క్రమంలో.. మాకు ఏమీ అందలేదని వరద బాధితులతో చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు కోసం ఎల్లో మీడియా రోడ్ మ్యాప్నీ తయారు చేస్తోంది. ఇటువంటి పకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు సీఎం జగన్ చేపట్టిన వ్యవస్థల్లో మార్పులు ఎలా ఉపయోగపడ్డాయి అనేది స్పష్టం అవుతోంది. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్, సచివాలయం, 26 జిల్లాల కలెక్టర్ల వ్యవస్థ ఉంది. వాహనాలు వెళ్లలేని ప్రాంతాల్లో హెలికాప్టర్లు, బోట్ల ద్వారా అన్ని నిత్యావసరాలు అందిస్తున్నాం. ప్రతి కుటుంబానికి రూ.2000 ఇవ్వమని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. చేయాల్సింది చేస్తారు తప్ప మా నాయకుడికి ప్రచారం ఇష్టం లేదు' అని అమర్నాథ్ అన్నారు. 'హుద్‌హుద్ తుఫాను సమయంలో చంద్రబాబు ఎంత పబ్లిసిటీ చేసుకున్నాడో చూశాం. చివరికి ఆ తుఫాన్ ఈయన్ని చూసి పారిపోయింది. మొన్నటికి మొన్న నేను ముఖ్యమంత్రిగా ఉంటే కోవిడ్ వచ్చేదా? అంటారు. చంద్రబాబుని పైకి లేపాలి అని ఆ పత్రికలు తెగ తాపత్రయ పడుతున్నాయి. నేరుగా ప్రతి ఒక్కటి ఇంటివద్దకు తీసుకెళ్ళి ఇస్తున్నాం. మనం ఏ అబద్దం చెప్పినా ప్రజలు నమ్మేస్తారు అనుకోవడం పొరపాటు. ఒక అబద్ధాన్ని పది సార్లు చెప్తే నమ్ముతారు అనే సిద్ధాంతాన్ని నమ్ముతున్నారు. అధికారం లేక డొక్కలు ఎండుతుంది చంద్రబాబుకి, లోకేష్‌కి, ఆ పత్రికలకి. పశువులకు కాదు. వీరికి అధికారం లేదనే ఆవేదనను ఇలా వ్యక్తపరుస్తున్నారు. ఎక్కడా వీళ్ళకి శవం దొరకలేదు. దొరికితే వేరేలా ఉండేది. ఈ రకంగా ప్రజల్ని నమ్మించాలనే మీ ఆలోచన సక్సెస్ కాదు. ప్రజలకి సేవ చేయాల్సిన బాధ్యతను మీరు సీఎం జగన్‌కు చెప్పాల్సిన అవసరం లేదు. చూసి ఓర్వలేక, భవిష్యత్తు ఉండదని భయపడి ప్రజల్ని మోసం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు' అని మంత్రి పేర్కొన్నారు. 'ఇటువంటి సందర్భాల్లో అయినా రాజకీయాలు మానుకోవాలి. చట్టంలో ఏదైతే ఉందో దాని ప్రకారమే చేస్తాం. బ్యాక్ వాటర్స్ వల్ల వరద వస్తే... వాళ్ళు కట్టే ప్రాజెక్టులు కూడా తీసేయండి. పోలవరం ఎత్తు పెంచడానికి వీల్లేదనడం సరైంది కాదు. విలీన గ్రామాలను పట్టించుకోలేదని ఆయన చెప్తే ఎలా..? ముందు ఖమ్మం జిల్లాను పట్టించుకోమనండి. అలా అయితే ఏపీని తెలంగాణాలో కలపమనండి. హోదాపై వాళ్ళు ఏది చెప్పినా సరే మా పోరాటం కొనసాగుతుంది. మా డిమాండ్ కొనసాగిస్తాం. వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. ఏ పరిస్థితుల్లో రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇచ్చామో స్పష్టంగా చెప్పాం. ఒక గిరిజన మహిళను ఎంపిక చేయడం వల్లే మద్దతు పలికాం. అలా అని మా డిమాండ్ వెనక్కి పోయిందని కాదు' అని మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యానించారు. చదవండి: అధికారం అంటే అజమాయీషీ కాదు.. అందరికీ సంక్షేమం: సీఎం జగన్ -
క్లౌడ్ బరస్ట్‌పై గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు
యానాం: క్లౌడ్ బరస్ట్‌పై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు వచ్చిన గోదావరి వరదలు క్లౌస్ బరస్ట్ వల్ల కాదని ఆమె అన్నారు. ఇవి ఎగువ ప్రాంతంలో ఎప్పుడూ వచ్చే వరదలే అని.. కాకపోతే ఈసారి కాస్త ఎక్కువ వరదలు వచ్చాయని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. యానాంలో వరద పరిస్థితిపై సమీక్ష నిర్వహించిన అనంతరం మంగళవారం మీడియాతో మాట్లాడుతూ తమిళిసై ఈ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అలా.. గవర్నర్ ఇలా.. ఇటీవల వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించిన తెలంగాణ సీఎం కేసీఆర్.. క్లౌడ్ బరస్ట్ వల్లే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ వరదలు సంభవించి ఉంటాయని అనుమానం వ్యక్తం చేశారు. విదేశాలే ఈ కుట్ర చేసి ఉంటాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మాటలకు పూర్తి విరుద్ధంగా ఇప్పుడు గవర్నర్ తమిళిసై మాట్లాడటం గమనార్హం. ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి భద్రాచలంలో గోదావరి నీటిమట్టం 51.8అడుగులకు చేరింది. ఎగువ నుంచి 13 లక్షల 50వేలు క్యూసెక్కుల వరద నీరు గోదావరిలోకి వస్తోంది. భద్రాచలం టౌన్‌లోని ముంపునకు గురైన కాలనీలు ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి వస్తున్నాయి. ఇప్పటికీ రామాలయం పురవీధులు చెరువులను తలపిస్తున్నాయి. 53 అడుగుల లోపు వచ్చిన మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదిప్ దురిశెట్టి తెలిపారు. చదవండి: వరదలు విదేశీ కుట్రే.. సీఎం కేసీఆర్ సంచల వ్యాఖ్యలు -
భద్రాచలంలో వరద నష్టం.. బాధితుల కష్టం (ఫొటోలు)
-
ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మూడో ప్రమాద హెచ్చరిక
-
CM YS Jagan: 48 గంటల్లో సాయం
వరద బాధితులను ఆదుకోవడంలో విరామం లేకుండా అవిశ్రాంతంగా పని చేస్తున్నప్పటికీ కొందరి రాజకీయ ప్రయోజనాల కోసం జరుగుతున్న దురుద్దేశపూర్వక ప్రచారాన్ని తిప్పికొట్టాలని అధికార యంత్రాంగానికి ముఖ్యమంత్రి జగన్ సూచించారు. ‘మీరు చేస్తున్న మంచి పనులు కళ్ల ముందు కనిపిస్తున్నప్పటికీ ఉద్దేశపూర్వకంగా బురద జల్లుతుంటే వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. ముందడుగు వేసి అలాంటి వాటి పట్ల దూకుడుగా వ్యవహరించాలి’ అని నిర్దేశించారు. –ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: గోదావరి వరద బాధిత కుటుంబాలకు 48 గంటల్లోగా రూ.రెండు వేల సాయం అందించడంతోపాటు రేషన్ పంపిణీని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ముంపు బారిన పడిన గ్రామాల్లో ఏ ఒక్క ఇల్లూ మిగిలిపోకుండా అందరికీ సాయం అందించాలని అధికార యంత్రాంగానికి నిర్దేశించారు. ఎక్కడా రూ.2 వేల సాయం, రేషన్ అందలేదనే మాటే వినిపించడానికి వీల్లేదని, కలెక్టర్లు, సీనియర్ అధికారులు దీన్ని సవాల్‌గా తీసుకుని పనిచేయాలని స్పష్టం చేశారు. 25 కిలోలు బియ్యం, కిలో కందిపప్పు, కిలో బంగాళాదుంపలు, కిలో ఉల్లిపాయలు, కిలో పామాయిల్‌తో రేషన్ సరుకుల పంపిణీ జరగాలన్నారు. బాధితులు శిబిరాలకు వచ్చినా రాకున్నా.. ముంపునకు గురైన చోట్ల ప్రతి కుటుంబానికీ రూ.2 వేలు, రేషన్ సరుకులు అందాలని స్పష్టం చేశారు. నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ఆయన సూచించారు. వరద నీరు క్రమంగా తగ్గుముఖం పడుతున్నందున సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేయాలని సూచించారు. స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు దురుద్దేశపూరితంగా చేస్తున్న అవాస్తవ ప్రచారాన్ని తిప్పికొట్టాలని అధికార యంత్రాంగానికి సూచించారు. గోదావరి వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సోమవారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హోం, విపత్తుల నిర్వహణశాఖ మంత్రి తానేటి వనిత, సీఎస్ సమీర్‌శర్మ, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, విపత్తుల నిర్వహణశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.సాయి ప్రసాద్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. సీఎం సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎలాంటి సాయానికైనా సిద్ధం.. మీకు ఇంకా ఏమైనా అవసరమైతే అన్ని రకాలుగా సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నాం. నిధుల సమస్య లేనే లేదు. చురుగ్గా ముందుకు వెళ్లండి. ఎలాంటి సమస్య ఎదురైనా పరిష్కారానికి ఫోన్ కాల్ చేస్తే చాలు. బాధిత కుటుంబాల పట్ల మానవతా ధృక్పథంతో వ్యవహరించండి. ఇప్పటివరకూ ఒకరు మాత్రమే మరణించినట్లు సమాచారం ఉంది. బాధిత కుటుంబానికి వెంటనే పరిహారం అందించండి. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ సహాయ శిబిరాలు కొనసాగించాలి. బాధిత కుటుంబాలకు మంచి ఆహారం, తాగునీరు అందించాలి. పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా ఉండాలి. వరద తగ్గగానే పంట నష్టం అంచనా వరద తగ్గుముఖం పట్టిన వెంటనే 10 రోజుల్లో పంట, ఆస్తి నష్టాలపై అంచనాలు పూర్తి చేయాలి. పశువులకు పశుగ్రాసం, దాణా సక్రమంగా అందించాలి. పశు సంపదకు నష్టం వాటిల్లితే అంచనాలు రూపొందించాలి. గర్భిణుల పట్ల ప్రత్యేక శ్రద్ధ గర్భిణిలు పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి ఆస్పత్రులకు తరలించాలి. వైద్యాధికారులు, స్పెషలిస్టులు సేవలు అందేలా చర్యలు తీసుకోవాలి. ముంపు తగ్గగానే అంటువ్యాధులు ప్రబలే అవకాశాలున్నందున ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలి. ఆస్పత్రుల్లో తగినంత మంది సిబ్బంది, మందులను సిద్ధంగా ఉంచాలి. రక్షిత తాగునీటి సరఫరాను అవసరమైన ప్రాంతాలకు కొనసాగించాలి, క్లోరినేషన్ కొనసాగించండి. అన్ని మంచినీటి పథకాలను ఒకసారి పరిశీలించడంతో పాటు మరమ్మతులు అవసరమైతే వెంటనే చేయించండి. అదనపు సిబ్బంది తరలింపు.. వరద బాధిత ప్రాంతాలకు పక్క జిల్లాల నుంచి పారిశుద్ధ్య సిబ్బందిని తరలించి ముమ్మరంగా పనులు చేపట్టాలి. ఇతర జిల్లాల నుంచి తరలించేటప్పుడు సిబ్బంది వసతి, భోజన సదుపాయాలకు లోటు రాకుండా చూసుకోవాలి. పంచాయతీరాజ్, మునిసిపల్ శాఖల విభాగాధిపతులు దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి. మురుగునీటి కాలువల్లో పూడిక తీత కార్యక్రమాలు చేపట్టాలి. నీరు తగ్గగానే కల్వర్టులు, బ్రిడ్జిలను క్షుణ్నంగా పరిశీలించి అవసరమైన మరమ్మతులు, నిర్మాణాలు చేపట్టాలి. కరకట్ట పరిశీలన.. పూడికతీత గోదావరి కరకట్ట బలహీనంగా ఉన్నచోట ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పెట్రోలింగ్ నిరంతరం కొనసాగాలి. అన్ని డ్రెయిన్ల ముఖద్వారాలు మూసుకుపోయే అవకాశం ఉన్నందున పూడిక తొలగింపు పనులు చేయాలి. గట్లు, కాల్వలకు ఎక్కడైనా గండ్లు పడితే వెంటనే పూడ్చి వేయాలి. తక్షణం విద్యుత్తు పునరుద్ధరణ వరద బాధిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ, మరమ్మతుల పనులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. వచ్చే 48 గంటల్లో ఈ సమస్యను పరిష్కరించాలి. పలు స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో శిబిరాలను నిర్వహిస్తున్నందున తిరిగి అప్పగించేటప్పుడు పరిశుభ్రంగా అప్పగించాలి. అందుబాటులో అత్యుత్తమ వ్యవస్థ.. గతంలో రెండు జిల్లాలకు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఎస్పీలు ఇద్దరు చొప్పున మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం కాకినాడతో కలిపి ఆరుగురు కలెక్టర్లు, ఆరుగురు జేసీలు, ఆరుగురు ఎస్పీలున్నారు. సచివాలయాల వ్యవస్థ కూడా మీకు అందుబాటులో ఉంది. ప్రతి సచివాలయంలో 10 మంది ఉద్యోగులున్నారు. ప్రతి 50 ఇళ్లకూ ఒక వలంటీర్ ఉన్నారు. అందుబాటులో ఉన్న ఇలాంటి అత్యుత్తమ వ్యవస్థ ద్వారా నాణ్యమైన సేవలు అందించాలి. పంపిణీ ముమ్మరం చేయాలి. ఈ వ్యవస్థ ద్వారా ఎప్పుడూ జరగని విధంగా సహాయ కార్యక్రమాలు చేస్తున్నాం. గతంలో ఎప్పుడూ రూ.2 వేలు ఆర్థిక సాయం చేయలేదు. మన నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీసేందుకు చంద్రబాబు, ఈనాడు, టీవీ–5, ఆంధ్రజ్యోతి, పవన్‌కళ్యాణ్ లాంటివారు బురద జల్లుతున్నారు. వీరంతా రాష్ట్ర ప్రతిష్ట, అధికారుల ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు. కొందరికి రాజకీయ ప్రయోజనాలు చేకూర్చేందుకు ఇలాంటి ప్రచారాలు చేస్తారు. బురద జల్లడానికి నానా రకాలుగా ప్రయత్నిస్తున్నారు. మీరు మంచి చేస్తున్నప్పుడు వెనకడుగు వేయాల్సిన అవసరంలేదు. ఇలాంటి వాటిని తిప్పికొట్టాలి. దురుద్దేశ పూర్వకంగా చేసే ప్రచారాన్ని తిప్పికొట్టాలి. వదంతులను కూడా తిప్పికొట్టాలి. -
TS: తక్షణ సాయమందాలి
సాక్షిప్రతినిధి, వరంగల్: రాష్ట్రవ్యాప్తంగా వరద బాధితులకు తక్షణ సాయం అందించాలని.. ఇందుకోసం పంటలు, ఇళ్లు, ఇతర ఆస్తి నష్టంపై వెంటనే సర్వే నిర్వహించాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. దెబ్బతిన్న రహదారులు, చెరువులకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా ములుగు, ఏటూరునాగారం ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని స్పష్టం చేశారు. శని, ఆదివారాల్లో గోదావరి ముంపు ప్రాంతాల్లో పర్యటించిన సీఎం కేసీఆర్ ఆదివారం రాత్రి హనుమకొండలోనే బస చేశారు. సోమవారం హైదరాబాద్‌కు బయలుదేరే ముందు ఉమ్మడి వరంగల్ మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఇతర అధికారులతో సమీక్షించారు. సత్వరమే చర్యలు చేపట్టండి భవిష్యత్‌లో గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ముంపు ప్రమాదం ఏర్పడకుండా శాశ్వత పరిష్కారం చూపుతామని సమీక్ష సందర్భంగా సీఎం కేసీఆర్ చెప్పారు. ఈసారి దెబ్బతిన్న ప్రాంతాల్లో సత్వరమే మౌలిక వసతులు కల్పించేలా ప్రభుత్వ యంత్రాంగం చొరవ తీసుకోవాలని సూచించారు. భారీ వర్షాలు కురిసి, వరదలు వచ్చినా ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్న అధికార యంత్రాంగాన్ని, ప్రజాప్రతినిధులను అభినందించారు. పరిస్థితి చక్కబడే వరకు ప్రతీశాఖ అధికారులు 3 షిఫ్టులుగా పనిచేసి.. లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించేందుకు, సహాయ కార్యక్రమాలకు అవసరమైన చర్య లు చేపట్టాలని సీఎం కేసీఆర్ సూచించారు. గత ప్రభుత్వాలు తాత్కాలిక నిర్మాణాలు మాత్రమే చేపట్టాయని.. ఎన్ని నిధులు ఖర్చయినా శాశ్వత నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు. ములుగు, ఏటూరునాగారం ప్రాంతాల్లో పరిస్థితి చక్కబడే వరకు మంత్రి సత్యవతి రాథోడ్ ఏజెన్సీ ప్రాంతంలోనే ఉండి పర్యవేక్షించాలని సూచించారు. ఈ రెండు ప్రాంతాల్లో అవసరమైన పనులు, సహాయ చర్యలకు ఇన్చార్జులుగా హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు రాజీవ్‌గాంధీ హన్మంతు, డాక్టర్ గోపిలను నియమిస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. ఈ సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, చీఫ్ విప్ వినయ్‌భాస్కర్, చీఫ్ సెక్రెటరీ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు నరేందర్, వెంకటరమణారెడ్డి, వొడితెల సతీశ్‌కుమార్, ఆరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బండా ప్రకాశ్, బస్వరాజు సారయ్య, కలెక్టర్లు రాజీవ్‌గాంధీ హన్మంతు, డాక్టర్ గోపి, మరికొందరు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. వరంగల్‌లో ‘సూపర్ స్పెషాలిటీ’పై ఆరా వరంగల్‌లో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులపై కేసీఆర్ ఆరా తీశారు. ఆస్పత్రి నిర్మాణ పనులను పరిశీలించి, పరిస్థితిని వివరించాలని మంత్రులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం ఉదయం మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, తదితరులు వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులను పరిశీలించారు. రోడ్డుమార్గంలో హైదరాబాద్‌కు.. శనివారం సాయంత్రం రోడ్డుమార్గంలో హనుమకొండకు చేరుకున్న సీఎం కేసీఆర్.. సోమవారం అదే రోడ్డుమార్గంలో తిరిగి హైదరాబాద్‌కు చేరుకున్నారు. సీఎం కేసీఆర్ సోమవారం మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో మాట్లాడిన అనంతరం కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసం నుంచే ప్రత్యేక బస్సులో హైదరాబాద్‌కు బయలుదేరారు. రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఓటేయాల్సి ఉన్నందున ఆయనతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అదే బస్సులో హైదరాబాద్‌కు వచ్చారు. -
వరద కుమ్మేసింది.. బురద కమ్మేసింది!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: గోదావరి వరద మోసుకొచ్చిన ఒండ్రుమట్టి, బురద ముంపు గ్రామాలను కమ్మేసింది. వరద వెనక్కి తగ్గగానే తమ ఊళ్లు, ఇళ్లను చూసుకుని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రాణాలు తప్ప సమస్తం కోల్పోయామంటూ కన్నీటిపర్యంతమవుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 11 మండలాల ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు పునరావాస శిబిరాలకు తరలించారు. ఆ తర్వాత అంచనాలకు మించి వరద రావడంతో ఊళ్లకు ఊళ్లే నీళ్లలో మునిగిపోయాయి. దీంతో ఇళ్లలో ఉన్న సమస్తం మట్టికొట్టుకుపోయాయి. వరద కొద్దిగా నెమ్మదించడంతో క్రమంగా ఇళ్లకు చేరుకుంటున్న జనం తిండితిప్పలు మాని ఇళ్లల్లోంచి బురదను తొలగిస్తున్నారు. వరదలో నాని కుళ్లిన చెట్లు, జంతువులు, చేపల కళేబరాలు, ఇతర వ్యర్థాల కారణంగా ముంపు ప్రాంతాల్లో దుర్గంధం నెలకొంది. వరద కారణంగా జిల్లాలో మొత్తం 12,277 ఇళ్లు నీట మునగగా సోమవారం సాయంత్రానికి 11,061 ఇళ్లు ముంపు నుంచి బయటపడ్డాయి. 2,330 మంది శానిటేషన్ సిబ్బంది నిర్విరామంగా బురద తొలగింపు పనుల్లో నిమగ్నమయ్యారు. ఇప్పటికే 4,434 గ్రామాలు బురద నుంచి బయటపడ్డాయి. ఆయా గ్రామాల్లో దోమలు వ్యాప్తిచెందకుండా ఫాగింగ్ చేస్తున్నారు. వరద కారణంగా ముంపు ప్రాంత ప్రజల్లో తొంభైశాతం మంది వ్యక్తిగత ఆస్తులను నష్టపోయారు. వరద ముంచుకొస్తుండటంతో కట్టుబట్టలు, విలువైన సామగ్రి మాత్రమే తీసుకుని పునరావాస కేంద్రాలకు వెళ్లారు. దీంతో ఇళ్లలో ఉన్న ఇతర సామగ్రి, దుస్తులు, బియ్యం, నిత్యావసరాలు, వంట పాత్రలు.. ఇలా ఒకటేమిటి అన్నీ బురదలో కొట్టుకుపోయాయి. ‘తేలని’నష్టం లెక్క! వరద తగ్గితే కానీ ఎంత మేరకు పంట నష్టం వాటిల్లిందనేది తెలియని పరిస్థితి. లోతట్టు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు మునకలోనే ఉన్నాయి. చాలాచోట్ల రోడ్లు పూర్తిగా కొట్టుకుపోయాయి. కాగా ఎగువ నుంచి 9 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండటం, స్థానికంగా వర్షాలు జోరుగా కురుస్తుండటంతో గోదావరి నీటిమట్టం తగ్గుదల ఆగింది. సోమవారం మ«ధ్యాహ్నం నుంచి రాత్రి వరకు 56 అడుగుల వద్ధ స్థిరంగా కొనసాగుతోంది. దీంతో పలుచోట్ల వరద సహాయ శిబిరాల్లోనే ప్రజలు తలదాచుకుంటున్నారు. గ్రూప్స్‌కు ప్రిపేరయ్యేదెలా? గ్రూప్ నోటిఫికేషన్ వెలువడింది మొదలు బూర్గంపాడుకు చెందిన రాజేష్ పుస్తకాలతో కుస్తీ పడుతున్నాడు. ఎలాగైనా మంచి ఉద్యోగం సాధించి తన కుటుంబానికి ఆసరాగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. గత వారం గ్రూప్స్ ప్రిపరేషన్స్‌కు సంబంధించి సన్నాహాక పరీక్షకూ హాజరయ్యాడు. ఇంతలోనే వరదలు వచ్చాయి. పైసాపైసా కూడబెట్టిన డబ్బుతో కొనుగోలు చేసిన పుస్తకాలే కాదు.. ఆయన కుటుంబం సమకూర్చుకున్న సామగ్రి ఎందుకూ పనికిరాకుండా పోయాయి. తడిసిన పుస్తకాలతో రాజేష్ కంటతడి పెడుతున్నాడు. ఈమె పేరు ఇమాంబీ. భద్రాచలం సుభాష్‌నగర్‌కు చెందిన ఈమె నెలనెలా వచ్చే వృద్ధాప్య ఫించను జమచేసుకుంటూ రూ.12 వేలు వెచ్చించి తన గుడిసెపై రేకులు వేయించుకుంది. ఇటీవలి వరదల్లో ఆమె గుడిసె నామరూపాల్లేకుండాపోయింది. కొడుకులున్నా తనకు నిలువ నీడలేదని.. కనిపించిన వారికల్లా తన బాధ చెప్పుకుంటోంది. ప్రస్తుతం ప్రభుత్వ డిగ్రీ కళాశాల పునరావాస కేంద్రంలో బతుకీడుస్తోంది. ఇది ఒక్క ఇమాంబీ బాధ మాత్రమే కాదు గోదావరి వరదల్లో చిక్కున్న 12 వేల కుటుంబాల వ్యథ. -
వైరల్ వీడియో: దవాఖానాలో పాముల హల్చల్
-
మంచిర్యాల: దవాఖానాలో పాముల హల్చల్.. వీడియో వైరల్
సాక్షి, మంచిర్యాల: భారీ వర్షాలు, వరదలతో తల్లడిల్లుతున్న ముంపు ప్రాంత ప్రజలను చీడపీడలు దడపుట్టిస్తున్నాయి. పరిసర ప్రాంతాలు జలమయం కావడం, చుట్టూరా చలి వాతావరణం నెలకొనడంతో పాములు, తేళ్లు ఇళ్లల్లోకి, ఆఫీసుల్లోకి చొరబడుతున్నాయి. తాజాగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాత శిశు ఆసుపత్రిలో పారిశుద్య కార్మికురాలు సునీత పాముకాటుకు గురయ్యారు. ఆసుపత్రికి వరద తాకిడికి గురికావడంతో ఆసుపత్రి ఆవరణలో పారిశుద్ధ్య పనులు చేస్తున్నారు. పనుల్లో సునీత కూడా పాల్గొన్నారు. అదే సమయంలో పాము కాటు వేయడంతో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. సునీత అరోగ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కిటీకీ, ఫ్లోర్‌పై పాములు కదులుతున్న వీడియోలు వైరల్‌గా మారాయి. ఆపరేషన్ థియేటర్, దాని చుట్టుపక్కల పదుల సంఖ్యలో పాములు కనిపించాయని పారిశుద్ధ్య కార్మికులు చెప్పారు. వాటిని బయటకు తరిమేశామని వెల్లడించారు. -
చంద్రబాబు చీప్ పాలిటిక్స్: మంత్రి కారుమూరి
సాక్షి, అమరావతి: గోదావరికి ఎన్నడూ లేనంతగా ఉధృతంగా వరదలు వచ్చాయని.. ముందుగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వరదలపై అధికారులను అలర్ట్ చేశారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. సోమవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎక్కడికక్కడ క్యాంపులు పెట్టి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారన్నారు. చదవండి: ప్రతిపక్షాలు బురద రాజకీయం చేస్తున్నాయి: మంత్రి వేణు ‘‘ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అనేక చర్యలు తీసుకున్నాం. గతంలో జిల్లాకు ఒక కలెక్టర్, ఒక జేసీ ఉండేవారు. ఇప్పుడు జిల్లాల విభజన వల్ల అధికారుల సంఖ్య పెరిగింది. వలంటీర్లు, గ్రామ సెక్రటేరియట్ ఉద్యోగులు, మంత్రులు సమన్వయంతో పని చేశారు. జిల్లాకు రెండు కోట్లు, నాలుగు కోట్లు చొప్పున కేటాయించారు. నిత్యావసర వస్తువులు, బిస్కెట్లు, పాలు, కిరోసిన్ అందించాం. సీఎం ఏరియల్ సర్వే నిర్వహించారు. అధికారులతో రెగ్యులర్‌గా మానిటరింగ్ చేశారని’’ మంత్రి అన్నారు. గతంలో చంద్రబాబు ఏరియల్ సర్వే విహార యాత్రలా చేసేవారని మంత్రి దుయ్యబట్టారు. టీడీపీ కార్యకర్తలు, అభిమానులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఈనాడు పత్రికలో పిల్లలకు పాలు లేవు, పెద్దలకు తిండి లేదంటూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబును జాకీలు పెట్టి ఎల్లో మీడియా లేపుతోందని మండిపడ్డారు. ఎల్లో పత్రికల్లో రాసినవి.. చంద్రబాబు ప్రెస్ మీట్లు, పవన్ ట్వీట్లు పెడుతున్నారు. రామోజీ దిగజారి చీప్‌గా ప్రవర్తిస్తున్నారని మంత్రి కారుమూరి నిప్పలు చెరిగారు. చంద్రబాబు పాలనలో వర్షాలు కూడా పడలేదు. సీఎం జగన్ పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. నా రాజకీయ జీవితంలో వైఎస్సార్సీపీ ప్లీనరీకి వచ్చిన జనాల్ని ఎప్పుడూ చూడలేదు. చంద్రబాబు చేసేవన్నీ చీప్ పాలిటిక్స్. సీఎం జగన్ ముందుచూపు వల్లే వరదల్లో ఒక్క ప్రాణనష్టం జరగకుండా చూశాం. అదనంగా బోట్లు, హెలికాఫ్టర్లు సిద్ధం చేస్తున్నామని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. -
గోదావరి వరదలు.. ఏ హెచ్చరిక ఎప్పుడు జారీ చేస్తారు?
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: వరదల వేళ ముందస్తుగా చేస్తున్న హెచ్చరికలే ప్రజలకు శ్రీరామరక్షగా నిలుస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ఈ హెచ్చరికల ఆధారంగానే ప్రభుత్వ యంత్రాంగం వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు అవసరమైన సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపడుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్దదైన గోదావరి నదికి జూలై నెలలో వచ్చే వరదలు సాధారణంగా పెద్దగా ప్రభావం చూపవు. చదవండి: 48 గంటల్లోపు ప్రతీ ఒక్కరికీ సాయం అందించాలి: సీఎం జగన్ అందుకు భిన్నంగా ఈసారి గోదావరి మహోగ్రరూపమెత్తి ప్రజలను భయపెడుతోంది. ఎగువన మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ఉప నదులైన మంజీరా, ప్రాణహిత, వార్ధా, ఇంద్రావతి, కిన్నెరసాని, శబరి, పెన్‌గంగ వంటివి పొంగి ప్రవహిస్తున్నాయి. ఆ వరద నీరంతా చేరడంతో గోదావరి కూడా ఉప్పొంగిపోతోంది. మూడున్నర దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా భద్రాచలం నుంచి ధవళేశ్వరం బ్యారేజీ వరకూ గత ఎనిమిది రోజులుగా గోదావరి ఉగ్రరూపం దాలి్చంది. శనివారం నాటికి కాటన్ బ్యారేజీ వద్దకు 25 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు చేరింది. ఆదివారం నిలకడగా ఉన్నప్పటికీ దాదాపు అదే స్థాయిలో కొనసాగింది. రాత్రి నుంచి వరద క్రమేపీ తగ్గుముఖం పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. బ్యారేజీ నిర్మించినప్పటి నుంచీ.. ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయడంలో వరద ప్రమాద హెచ్చరికలు ఎంతో తోడ్పడుతున్నాయి. గోదావరిపై ధవళేశ్వరం వద్ద 1847 – 1852 మధ్య సర్ ఆర్థర్ కాటన్ ఆనకట్ట నిర్మించిన బ్రిటిష్ పాలకులు 1855లో రివర్ కన్జర్వెన్సీ చట్టం తీసుకువచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ దీని ఆధారంగానే వరద పరిస్థితిని అంచనా వేస్తున్నారు. తెలంగాణలో పేరూరు నుంచి ధవళేశ్వరం బ్యారేజీ వరకూ నీటి ప్రవాహాలను అధికారికంగా గంటగంటకూ ప్రకటిస్తూంటారు. గోదావరి ప్రవాహ వేగాన్ని బట్టి ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తూంటారు. వీటి ఆధారంగానే బ్యారేజీకి దిగువన ప్రజలను అప్రమత్తం చేస్తారు. పునరావాస కేంద్రాలకు తరలిస్తారు. ఈ ప్రక్రియ బ్యారేజీ నిర్మించినప్పటి నుంచీ జరుగుతోంది. మొదటి ప్రమాద హెచ్చరిక ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి నీటిమట్టం 11.75 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక ప్రకటిస్తారు. ఆ సమయంలో బ్యారేజీ నుంచి 10 లక్షల క్యూసెక్కులకు మించి మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెడతారు. ఫ్లడ్ కన్జర్వేటర్‌గా హెడ్ వర్క్స్ ఈఈ వ్యవహరిస్తారు. గోదావరిలో నాటు పడవల రాకపోకలను నిషేధిస్తారు. శాశ్వత, తాత్కాలిక ఫ్లడ్ స్టోర్స్‌లో సామగ్రిని చెక్ చేసుకుంటారు. ఫ్లడ్ డ్యూటీ అధికారులు హెడ్ క్వార్టర్స్‌లో అందుబాటులో ఉంటారు. రెండో ప్రమాద హెచ్చరిక బ్యారేజీ వద్ద నీటిమట్టం 13.75 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. 13 లక్షల క్యూసెక్కులకు మించి మిగులు జలాలను విడుదల చేస్తారు. బ్యారేజీ దిగువన ఉన్న వందలాది లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తారు. ఫ్లడ్ డ్యూటీ అధికారులు వెంటనే విధుల్లో చేరాలి. మూడో ప్రమాద హెచ్చరిక బ్యారేజీ వద్ద గోదావరి నీటిమట్టం 17.75 అడుగులకు చేరుకుంటే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ఆ సమయంలో బ్యారేజీ నుంచి 17.50 లక్షలు ఆపైన వచ్చిన మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేస్తారు. మూడో ప్రమాద హెచ్చరిక జారీ అయితే బ్యారేజీ దిగువన గోదావరి లంకలు నీట మునుగుతాయి. ఈ హెచ్చరిక ప్రకటించిన వెంటనే ఫ్లడ్ డ్యూటీ అధికారులు వారికి కేటాయించిన ప్రదేశాల్లో 24 గంటలూ డ్యూటీ నిర్వహించాలి. గోదావరిపై రాకపోకలను పూర్తిగా నిషేధిస్తారు. ఫ్లడ్ కన్జర్వేటర్‌గా ఇరిగేషన్ సర్కిల్ ఎస్ఈ వ్యవహరిస్తారు. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో వరద బాధితుల పునరావాసం, ప్రమాద నివారణ చర్యలు ఆరంభిస్తారు. రివర్ కన్జర్వెన్సీ చట్టంతోనే.. బ్యారేజీ నిర్మించినప్పటి నుంచీ వరద ప్రమాద హెచ్చరికల జారీకి బ్రిటిష్ కాలం నాటి రివర్ కన్జర్వెన్సీ చట్టాన్నే అనుసరిస్తున్నారు. భద్రాచలం, పోలవరం, ధవళేశ్వరం వద్ద గోదావరి ప్రవాహ వేగాన్ని బట్టి ఈ హెచ్చరికలు జారీ చేస్తారు. వీటి వల్లే ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేయడం సాధ్యమవుతోంది. మూడో ప్రమాద హెచ్చరికను రెడ్ అలర్ట్‌గా చెప్పవచ్చు. – విప్పర్తి వేణుగోపాలరావు, జెడ్పీ చైర్మన్, రిటైర్డ్ ఎస్ఈ, హెడ్‌వర్క్స్, ధవళేశ్వరం -
AP: వరద బాధితులకు సాయం..హెలికాప్టర్ల ద్వారా ఆహార పంపిణీ
గోదావరి ఉగ్రరూపం కారణంగా కోనసీమ లంక గ్రామాలు ఇంకా వరద ముంపులోనే ఉన్నాయి. పునరావాస కేంద్రాల్లో వరద బాధిత కుటుంబాలకు రూ. 2వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నారు. లంక గ్రామాల ప్రజలకు తాగునీరు, రేషన్, పశుగ్రాసాన్ని అధికారులు అందిస్తున్నారు. ఇక, అల్లూరి సీతారామారాజు జిల్లాలో పెద్ద ఎత్తున సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. వరద బాధితులకు హెలికాప్టర్ల ద్వారా ఆహార పొట్లాలను పంపిణీ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతానికి ధవళేశ్వరం వద్ద గోదావరి వదర ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. ధవళేశ్వరం బ్యారేజి వద్ద గోదావరి ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 23.30 లక్షల క్యూసెక్కులుగా కొనసాగుతోంది. పూర్తిస్థాయిలో వరద తగ్గే వరకు గోదావరి పరివాహాక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల శాఖ అధికారులు హెచ్చరించారు. స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. ఇక, సహాయక చర్యల్లో 10 ఎన్డీఆర్ఎఫ్, 10 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొన్నాయి. ఆరు జిల్లాల్లోని 62 మండలాల్లో 385 గ్రామాలు వరద ప్రభావితమయ్యాయి. ఇప్పటివరకు 97,205 మందిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 256 మెడికల్ క్యాంప్స్ నిర్వహించి.. 1,25,015 ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు. మరోవైపు.. పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద ఉధృతి తగ్గుతోంది. ప్రాజెక్ట్స్ స్పీల్వే వద్ద 36.1 మీటర్లకు వరద నీరు చేరుకుంది. 48 గేట్ల ద్వారా దిగువకు 19.58లక్షల క్యూసెక్కుల వరద నీరు వెళ్తోంది. కాగా, పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పొన్నపల్లి వద్ద గోదావరి ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ఏటిగట్టు ఫుట్‌పాత్ రెయిలింగ్ కోతకు గురైంది. ఈ క్రమంలో ఫుట్‌పాత్ రెయిలింగ్ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అధికారులు ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక, వశిష్ట గోదావరి వరద ప్రవాహం స్వల్పంగా తగ్గింది. కానీ, ఇంకా ముంపులోనే 33 లంక గ్రామాలు ఉన్నాయి. -
వరదలతో అతలాకుతలం.. ఏపీని ఆదుకోండి
సాక్షి, న్యూఢిల్లీ : గోదావరికి కనీవినీ ఎరుగని రీతిలో సంభవించిన వరదలతో పెద్ద ఎత్తున ఆస్తి, పంట నష్టం వాటిల్లినందున తక్షణమే సాయం చేసి ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవాలని వైఎస్సార్సీపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఆదివారం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి వైఎస్సార్సీపీ తరఫున పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, లోక్‌సభా పక్ష నేత మిథున్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం మిథున్‌రెడ్డితో కలిసి విజయసాయిరెడ్డి ఏపీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వరదల నేపథ్యంలో ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ, కృష్ణా జిల్లాల్లో అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని తెలిపామన్నారు. ఆయా ప్రాంతాల్లో మూడు దశాబ్దాలుగా లేనంతగా ప్రస్తుతం వర్షాలు కురవడంతో జనజీవనం అస్తవ్యస్థమైందని, వందలాది గ్రామాలు నీట మునిగాయని, విపరీతమైన ఆస్తి, పంట నష్టం జరిగిందని సమావేశం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఆయా జిల్లాల్లో జరిగిన నష్టానికి తక్షణమే పరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశామన్నారు. వరద బాధితుల కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయ, పునరావాస చర్యలు చేపట్టిందని తెలిపామని వివరించారు. ఎంపీ విజయసాయిరెడ్డి ఇంకా ఏం చెప్పారంటే.. పోలవరం నిధులు విడుదల చేయాలి ► ఏపీ పునర్విభజన చట్టంపై కేంద్రం ఇప్పటికైనా స్పష్టమైన ప్రకటన చేయాలి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని అప్పటి ప్రధాని పార్లమెంట్లో స్పష్టమైన ప్రకటన చేసినప్పటికీ ఆ హామీ ఇంకా అమలు చేయలేదు. ► పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి నిధుల విడుదలలో అసాధారణ జాప్యం జరుగుతోంది. అందువల్ల ప్రాజెక్ట్ పనులు ఆలస్యం అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్న సొంత నిధులను రీయింబర్స్ చేయడంలో జాప్యం నివారించాలి. రాష్ట్రాలకు ఇచ్చే జీఎస్టీ నష్ట పరిహారం మరో అయిదేళ్ల పాటు పొడిగించాలి. ► విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు కొన్నేళ్లుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. ఎందుకు కాలయాపన జరుగుతోంది? త్వరగా నిర్ణయం తీసుకోవాలి. ► రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టులైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులకు అనుమతులు మంజూరు చేయడంలో, కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన అనుమతులు ఇవ్వడంలో జరుగుతున్న జాప్యానికి కారణాలు వివరించాలి. ఈ విషయాల గురించి గతంలో సంబంధిత విమానయాన, స్టీల్ మంత్రిత్వ శాఖల మంత్రులకు కూడా విజ్ఞప్తి చేశాం. ► అమెరికన్ డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.79.72కు పడిపోవడంపై కేంద్ర ప్రభుత్వం వెంటనే తగిన దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి. పార్లమెంట్లో మహిళా బిల్లు ప్రవేశపెట్టాలి ► ఉపాధిలో మహిళల ప్రాతినిధ్యం బాగా తగ్గిపోయిన విషయాన్ని కేంద్రం గమనించాలి. మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే ఏపీ ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశ పెట్టాలి. మహిళల హక్కులు కాపాడాలి. మహిళల విద్య, జీవన ప్రమాణాల పెంపు, శిశు సంరక్షణకు చర్యలు తీసుకోవాలి. ► పార్లమెంటులో వినియోగించకూడని పదాల (అన్ పార్లమెంటరీ) జాబితాను లోక్‌సభ కార్యాలయం అన్ని రాష్ట్రాలకు పంపింది. 1954 నుండి ఇది ఆనవాయితీగా వస్తోంది. పార్లమెంట్ ప్రాంగణంలో నిరసనలు, ధర్నాలపై ఆంక్షలు విధిస్తూ ఇచ్చిన ఆదేశాలు ఆనవాయితీగా ఇచ్చినవే. కొత్త మెడికల్ కాలేజీలకు అనుమతులివ్వాలి ► రాష్ట్రంలో కొత్తగా 26 జిల్లాలు ఏర్పాటయ్యాయి. జిల్లాకో మెడికల్ కాలేజీ, జిల్లా ఆస్పత్రి ఏర్పాటులో భాగంగా కొత్తగా 12 వైద్య కళాశాలల మంజూరు ప్రతిపాదన ఇప్పటికీ పెండింగ్‌లో ఉంది. ► ఇటీవల ఉక్రెయిన్ – రష్యా యుద్ధం కారణంగా అనేక మంది తెలుగు విద్యార్థులు రాష్ట్రానికి తిరిగి వచ్చారు. వారు తిరిగి చదువు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలి. ఇతర మెడికల్ కాలేజీలలో చదువుకోడానికి అనుమతులు ఇవ్వాలి. ► కోవిడ్ కారణంగా మూడేళ్లుగా జనాభా లెక్కల సేకరణ జరగలేదు. దీంతో 2011 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకోవడంతో రాష్ట్రం అనేక విధాలుగా నష్టపోతోంది. పౌర సరఫరాల విషయంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది. త్వరితగతిన జనాభా లెక్కలు సేకరించాలి. -
ముంపు ప్రాంతాల్లో మంత్రుల ఏరియల్ సర్వే
సాక్షి, రాజమహేంద్రవరం/పాడేరు: భారీ వర్షాలు, గోదావరి వరద కారణంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ముంపునకు గురైన ప్రాంతాల్లో రాష్ట్ర బీసీ సంక్షేమ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆదివారం ఏరియల్ సర్వే నిర్వహించారు. హెలికాప్టర్ ద్వారా తూర్పు గోదావరి, ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా గోదావరి ఉగ్రరూపం దాల్చిందన్నారు. వరద బాధితులను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటోందన్నారు. క్షేత్రస్థాయిలో వరద పరిస్థితిని అంచనా వేసేందుకు ఏరియల్ సర్వే నిర్వహించామన్నారు. ఇప్పటికే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏరియల్ సర్వే చేశారని, వరదలకు సంబంధించి సమగ్రమైన నివేదికను అధికారుల ద్వారా రూపొందించి ముఖ్యమంత్రికి అందజేస్తామని చెప్పారు. ఏరియల్ సర్వే నిర్వహిస్తున్న మంత్రి వేణు, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పోలవరం ప్రాజెక్టు, ధవళేశ్వరం బ్యారేజీ, లంక గ్రామాల్లో ముంపు పరిస్థితులపై అధికారులను అప్రమత్తం చేశామన్నారు. మరో 48 గంటలు ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. లంక గ్రామాల్లో చిక్కుకున్న 65 మందిని ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృంధాలు రక్షించాయని చెప్పారు. ప్రజలను ముందస్తుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించి ప్రాణనష్టం లేకుండా చర్యలు తీసుకున్నట్టు మంత్రులు తెలిపారు. బాధిత ప్రజలందరికీ సహాయ, పునరావాస కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. వరద పూర్తిగా తగ్గే వరకు సహాయక చర్యలు కొనసాగించాలని, బియ్యం, ఇతర నిత్యావసరాలన్నింటిని పంపిణీ చేయాలని, వైద్య ఆరోగ్య కార్యక్రమాలు విస్తృతం చేయాలని సీఎం ఆదేశించారని తెలిపారు. అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో విధులు నిర్వహించే విధంగా అప్రమత్తం చేసామని మంత్రులు తెలిపారు. ఏరియల్ సర్వేలో మంత్రులతో పాటు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పాల్గొన్నారు. -
పునరావాసం.. అలుపెరగని యంత్రాంగం
సాక్షి, అమరావతి: మహోగ్ర రూపం దాల్చిన గోదావరి ఎగువన ఏజెన్సీ.. దిగువన లంక గ్రామాలను ముంచెత్తింది. ఇళ్ల చుట్టూ నీరు చేరి దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం వారం రోజులుగా అనేక చర్యలు చేపడుతూనే ఉంది. ఓ వైపు ముంపులో చిక్కుకున్న వారిని రక్షించడం.. నిలువ నీడ లేకుండా పోయిన వారిని పునరావాస శిబిరాలకు తరలించడం.. వారికి ఎలాంటి ఇబ్బంది రాకుండా భోజన, వసతి సౌకర్యాలు కల్పించడం.. ఇళ్లను వదిలి బయటకు రావడానికి ఇష్టపడకుండా మేడలు, మిద్దెలపైనే ఉంటున్న కుటుంబాలకు బియ్యం, పప్పులు, పాలు, మంచినీరు వంటి నిత్యావసర సరుకుల్ని బోట్ల ద్వారా చేరవేయడం.. పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా కంటికి రెప్పలా కాపాడటం.. ముంపులోనూ ఇళ్లను వదిలి రానివారు అనారోగ్యం బారినపడితే అక్కడికే వెళ్లి వైద్య సేవలు అందించడం.. నెలలు నిండిన గర్భిణులను హెలికాప్టర్లలో సైతం ఆస్పత్రులకు తరలించడం.. మిగిలిన గర్భిణులకు ఎప్పటికప్పుడు వైద్య సేవలు అందించడం.. చివరకు లంకల్లో చిక్కుకుపోయిన పశువులను రక్షించడమే కాకుండా వాటికి కూడా ప్రత్యేక రక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి మేత సమకూర్చడం వంటి ఎన్నో రకాల సహాయ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతూనే ఉంది. తూర్పు గోదావరి జిల్లాలోని ముంపు గ్రామాల వారిని పడవల ద్వారా సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్న విపత్తు నిర్వహణ సిబ్బంది ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బృందాల కీలకపాత్ర వరద బాధితులను, ప్రాణాపాయ స్థితిలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, రెవెన్యూ, ఇతర ప్రభుత్వ శాఖలు కీలకపాత్ర పోషించాయి. అల్లూరి, ఏలూరు జిల్లాల్లోని పలు గ్రామాలకు హెలికాప్టర్లలో వెళ్లి సహాయక చర్యలు అందించారు. కాగా, బాధితులకు 1.25 లక్షల ఆహార పొట్లాలు, సుమారు 13 లక్షల వాటర్ ప్యాకెట్లను ప్రభుత్వం పంపిణీ చేసింది. ఇవికాకుండా ఎక్కడికక్కడ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, నాయకులు తమ పరిధిలోని బాధిత ప్రాంతాలకు రెండు పూటలా భోజనాలు పంపించారు. బాధితులకు ఇబ్బందులు లేకుండా చూశారు. సహాయక చర్యలు పకడ్బందీగా, ఒక ప్రణాళిక ప్రకారం అందిస్తుండటంతో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. 10,757 ఎకరాల్లో పంట నష్టం వరద తీవ్రతకు ఆరు జిల్లాల్లో పంటలు, మౌలిక వసతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆయా ప్రాంతాల్లో అధికారులు ప్రాథమికంగా నష్టాన్ని అంచనా వేశారు. 6 జిల్లాల్లో 10,757 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు గుర్తించారు. 3,375 ఎకరాల్లో వ్యవసాయ పంటలు, 7,382 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. కోనసీమ జిల్లాలో 5,253 ఎకరాలు, తూర్పు గోదావరి జిల్లాలో 1,802 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. దాదాపు వెయ్యి కిలోమీటర్ల మేర రోడ్లు వరద ప్రభావానికి ధ్వంసమయ్యాయి. 156 చోట్ల రోడ్లకు గండ్లు పడ్డాయి. 35 రోడ్లపై వరద నీరు ప్రవహించింది. 34,749 ట్రాన్స్ఫార్మర్లు పాడయ్యాయి. ఇవి ప్రాథమిక అంచనాలు మాత్రమే. వరద తీవ్రత పూర్తిగా తగ్గిన తర్వాత అధికారులు పూర్తి స్థాయి నష్టాలను అంచనా వేయనున్నారు. రూ.30 కోట్ల వినియోగం వరద సహాయక చర్యల కోసం 6 జిల్లాల్లో అత్యవసరంగా రూ.30 కోట్లు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసింది. తొలుత రూ.2 కోట్ల చొప్పున వినియోగానికి అనుమతి ఇచ్చినా.. వరద తీవ్రత పెరగడంతో ఆ పరిమితిని పెంచారు. అల్లూరి జిల్లాలో రూ.7 కోట్లు, కోనసీమ జిల్లాలో రూ.8 కోట్లు, ఏలూరు జిల్లాలో రూ.7 కోట్లు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రూ.4 కోట్ల చొప్పున ఖర్చు చేసేందుకు అత్యవసర అనుమతిచ్చారు. వరద హెచ్చరికలు మొదలైన నాటినుంచీ.. వరదల్లో చిక్కుకున్న వారి కోసం ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి యంత్రాంగం అలుపెరగకుండా సహాయక చర్యలు అందిస్తోంది. ముందస్తు వరద హెచ్చరికలు మొదలైనప్పటి నుంచి వారం రోజులుగా అధికారులు, అన్ని శాఖల సిబ్బంది కంటిమీద కునుకు లేకుండా వరద ప్రభావిత ప్రాంతాల్లో పని చేస్తున్నారు. ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను తరలించడం, సహాయ శిబిరాల్లో వారికి ఆశ్రయం కల్పించడం, అక్కడ ఆహారం, మంచినీరు అందించడం, వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకు రావడం వంటి పనుల్ని యంత్రాంగం ఒక యజ్ఞంలా నిర్వహిస్తోంది. ఫలితంగానే వరద ప్రభావానికి గురైన 6 జిల్లాల్లోని 62 మండలాల పరిధిలోని 626 గ్రామాల నుంచి 97,205 మందిని సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. వారి కోసం పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లు, ఇతర ప్రదేశాల్లో 191 సహాయ శిబిరాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ శిబిరాల్లో 84,734 మంది తల దాచుకుంటున్నారు. ఒక్క అల్లూరి జిల్లాలోనే 290 గ్రామాలకు చెందిన 53,107 మంది 103 సహాయ శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. గోదావరి మధ్యలో, గోదావరి ఒడ్డున ఉన్న జిల్లాల్లోని గ్రామాల ప్రజలను చాలా శ్రమకోర్చి సాహసోపేతంగా ఈ శిబిరాలకు తీసుకువచ్చారు. ఏలూరు జిల్లాలోని 169 గ్రామాల నుంచి 18,707 మందిని 23 సహాయ శిబిరాలకు తరలించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని 74 లంక గ్రామాల నుంచి 9,290 మందిని 29 సహాయ శిబిరాలకు తీసుకువచ్చారు. నిత్యావసర సరుకుల పంపిణీ వరద బాధితులకు 25 కేజీల బియ్యం, కేజీ చొప్పున పప్పు, పామాయిల్, ఉల్లిపాయలు, బంగాళా దుంపలను ప్రభుత్వం పంపిణీ చేసింది. 729.67 మెట్రిక్ టన్నుల బియ్యం, 50 మెట్రిక్ టన్నుల కందిపప్పు, 22,390 లీటర్ల పామాయిల్, 54,766 లీటర్ల పాలు, 13,564 కేజీల ఉల్లిపాయలు, 11,564 కేజీల బంగాళా దుంపలను ముంపు ప్రాంతాల్లో పంపిణీ చేసింది. -
శాంతిస్తున్న గోదారమ్మ
సాక్షి, అమరావతి, పాడేరు/సాక్షిప్రతినిధి, రాజమహేంద్రవరం, ఏలూరు: పరీవాహక ప్రాంతం(బేసిన్)లో వర్షాలు తెరపివ్వడం.. ఉప నదుల్లో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో గోదారమ్మ శాంతిస్తోంది. ఉప నదులు ఉప్పొంగడంతో గోదారమ్మ విశ్వరూపం ప్రదర్శించటాన్ని చూసి చిగురుటాకుల్లా వణికిపోయిన ప్రజలకు ఇప్పుడు కాస్త ఊరట కలుగుతోంది. ఆదివారం రాత్రి 8 గంటలకు ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి వస్తున్న వరద ప్రవాహం 24,84,356 క్యూసెక్కులకు తగ్గడంతో నీటి మట్టం 21.10 అడుగులకు పడిపోయింది. గోదావరి డెల్టాకు 9,500 క్యూసెక్కులు విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 24,74,856 క్యూసెక్కుల (213.87 టీఎంసీలు)ను బ్యారేజ్ 175 గేట్లు ఎత్తి సముద్రంలోకి వదిలేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మూడో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. ఎగువన వరద ప్రవాహం తగ్గిన నేపథ్యంలో సోమవారం నుంచి ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి వచ్చే వరద క్రమేణ తగ్గనుంది. మహారాష్ట్ర, తెలంగాణ, చత్తీస్‌గఢ్, ఒడిశాల్లో వర్షాలు తెరపినిచ్చాయి. దాంతో ఉప నదులు ప్రాణహిత, ఇంద్రావతి, కడెంవాగు, శబరి తదితరాలలో వరద తగ్గుముఖం పట్టింది. ఇది గోదావరిలో వరద తగ్గుముఖం పట్టేలా చేస్తోంది. కాళేశ్వరంలో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజ్‌లోకి వచ్చే వరద 9.28 లక్షల క్యూసెక్కులకు, దానికి దిగువన తుపాకులగూడెం (సమ్మక్క) బ్యారేజ్‌లోకి వచ్చే వరద 9.45 లక్షల క్యూసెక్కులకు, ఆ బ్యారేజ్‌కు దిగువన సీతమ్మసాగర్‌లోకి వస్తున్న వరద 16.68 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. భద్రాచలంలో తగ్గుతున్న వరద మట్టం ఎగువ నుంచి వస్తున్న వరద తగ్గుతుండటంతో భద్రాచలం వద్ద వరద మట్టం తగ్గుతోంది. ఆదివారం రాత్రి 8 గంటలకు 17,58,166 క్యూసెక్కులకు వరద ప్రవాహం తగ్గడంతో భద్రాచలం వద్ద వరద మట్టం 59.40 అడుగులకు తగ్గింది. వరద మట్టం 53 అడుగులకు తగ్గే వరకు మూడో ప్రమాద హెచ్చరికను కొనసాగించనున్నారు. సోమవారం వరద మట్టం 48 లేదా అంతకంటే దిగువకు చేరుకునే అవకాశం ఉంది. భద్రాచలం వద్ద వరద మట్టం 43 అడుగుల కంటే దిగువకు చేరుకుంటేనే ప్రమాద హెచ్చరికలను అధికారులు ఉపసంహరించుకుంటారు. మంగళవారానికి భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను కూడా ఉపసంహరించుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. పోలవరం వద్ద అప్రమత్తం పోలవరం ప్రాజెక్టులోకి ఎగువ నుంచి వచ్చే వరద గంట గంటకూ తగ్గుతోంది. అయినప్పటికీ సీఈ సుధాకర్ బాబు, ఎస్ఈ నరసింహ మూర్తి నేతృత్వంలో జల వనరుల శాఖ అధికారులు 24 గంటలూ అప్రమత్తంగా ఉంటూ వరదను సమర్థవంతంగా నియంత్రిస్తున్నారు. ఆదివారం రాత్రి 8 గంటలకు పోలవరంలోకి వచ్చే వరద ప్రవాహం 20,83,779 క్యూసెక్కులకు తగ్గింది. దాంతో ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద నీటి మట్టం 38.29 మీటర్లకు, దిగువ కాఫర్ డ్యామ్ వద్ద 27.54 మీటర్లకు తగ్గింది. సోమవారం పోలవరం ప్రాజెక్టులోకి వచ్చే వరద ప్రవాహం 17 నుంచి 17.50 లక్షల క్యూసెక్కులకు తగ్గే అవకాశం ఉంది. వరద గండం గట్టెక్కినట్లే ఎగువ ప్రాంతాల్లో వరద తగ్గుముఖం పట్టడంతో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ప్రజల గుండెలపై కుంపటి దిగినట్టయ్యింది. మరో రెండు రోజుల్లో అంటే మంగళవారం సాయంత్రానికి గోదావరి లంక గ్రామాలు ఊపిరి పీల్చుకునే అవకాశముంది. వారం రోజులుగా వీడని వరద ముంపుతో లంక గ్రామాల్లో చిక్కుకున్న బాధితులను ఆదుకుని వారికి బాసటగా నిలిచే దిశగా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపకదిన చర్యలు తీసుకుంది. మామిడికుదురు మండలం పెదపట్నం లంక గ్రామంలో బాధితులకు సహాయం అందజేసేందుకు వెళుతున్న పడవ గోదావరిలో అదుపు తప్పి తిరగబడింది. వీఆర్వో లక్ష్మితో పాటు వీఆర్ఏలు ప్రమాదం నుంచి బయటపడ్డారు. లంక గ్రామాల్లో పునరావాస కేంద్రాల ఏర్పాటుతో పాటు సహాయక చర్యల్లో రాష్ట్ర మంత్రులు తానేటి వనిత, పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగోపాల్, జోగి రమేష్, గుడివాడ అమర్నాథ్లు, ఎమ్మెల్యేలు స్వయంగా పాల్గొంటున్నారు. కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలకు ప్రత్యేకాధికారులుగా నియమితులైన సీనియర్ ఐఏఎస్ అధికారులు మురళీధర్‌రెడ్డి, అరుణ్‌కుమార్‌లు ముంపు ప్రాంతాల్లో తిరుగుతూ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించి తగు సూచనలిస్తున్నారు. ముంపు గ్రామాల్లో ఎన్డీఆర్ఎఫ్ సేవలు కొనసాగుతున్నాయి. బోట్లపై రాకపోకలు సాగించే వారికి సాయం చేస్తున్నారు. బాధితులకు నిత్యావసర వస్తువులు అందజేయడంలో వలంటీర్లు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. వరద ఉధృతితో రాజమహేంద్రవరం రోడ్డు వంతెనలో భారీ వాహనాల రాకపోకలు నిలిపివేశారు. నిత్యావసర సరుకుల పంపిణీ వేగవంతం వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతున్నాయి. 3, 5, 6, 9, 16 బెటాలియన్లకు చెందిన 10 బృందాల్లోని 356 మంది సిబ్బంది రక్షణ చర్యల్లో నిమగ్నమయ్యారు. ఆదివారం వరద ముంపు జిల్లాల్లోని 950 మంది బాధితులను రక్షించి, సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీరిలో పలువురు గర్భిణులు, వృద్ధులు ఉన్నారు. లంక ప్రాంతాల్లోని ప్రజలకు ఆహారం, నీరు, కొవ్వొత్తులను పంపిణీ చేశారు. కుక్కునూరు, వేలేరుపాడు, పశ్చిమగోదావరిలో ఆచంట, నర్సాపురం, యలమంచిలి మండలాల్లోని లంక గ్రామాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ వేలేరుపాడు మండలంలో పర్యటించారు. పోలవరం ముంపు మండలాల్లోని 61 గ్రామాల్లో 18,707 మందిని పునరావాస కేంద్రాలకు తరలించి, భోజన వసతి ఏర్పాటు చేశారు. ఆచంట మండలంలోని లంక గ్రామాల్లో మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ప్రతిరోజు వెయ్యి మందికి తన సొంత నిధులతో భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. నర్సాపురం పట్టణం, మండలంలో చీఫ్ విప్, ఎమ్మెల్యే ముదునూరు ప్రసాదరాజు వరద తీవ్రతను పరిశీలించారు. విలీన మండలాల్లో వరద నీరు కాస్త తగ్గడంతో అధికార యంత్రాంగం, స్థానికులు ఊపిరి పీల్చుకుంటున్నారు. చింతూరు నుంచి ముంపు గ్రామాలకు లాంచీల ద్వారా బియ్యం, ఇతర నిత్యావసర సరకుల రవాణాను వేగవంతం చేశారు. అంటు వ్యాధులు సోకకుండా చర్యలు తీసుకుంటున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు నెల్లిపాక వీఆర్వో కట్టం వెంకటేశ్వర్లు, విస్సాపురం వీఆర్వో ముచ్చిక వీర్రాజులపై జేసీ సూరజ్ గనోరే చర్యలకు ఆదేశించారు. -
సీఎం జగన్ ఆదేశాలు.. మంత్రులు ఏరియల్ సర్వే
-
తగ్గేదేలే.. ఎవరికి వారే.. అటు గవర్నర్.. ఇటు కేసీఆర్ పోటాపోటీగా..
సాక్షి, ఖమ్మం జిల్లా: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఓ వైపు సీఎం కేసీఆర్, మరో వైపు గవర్నర్ తమిళిసై పర్యటనలు కొనసాగుతున్నాయి. భద్రాచలంలో వరద ముంపు ప్రాంతాలను గవర్నర్ పరిశీలిస్తున్నారు. తమిళిపై పర్యటనలో కలెక్టర్, జిల్లా ఎస్పీ కనిపించలేదు. గవర్నర్ వెంట ఏఎస్పీ, ఆర్డీవో మాత్రమే ఉన్నారు. పోటోకాల్ వివాదంపై నో కామెంట్ అంటూ గవర్నర్ మాట దాట వేశారు. బాధితుల సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తానని ఆమె పేర్కొన్నారు. చదవండి: వర్షంలోనే సీఎం కేసీఆర్ పర్యటన.. గోదారమ్మకు శాంతి పూజలు 36 ఏళ్ల తర్వాత గోదావరి రికార్డు స్థాయి నీటి ప్రవాహంతో రావడంతో భద్రాచలం నీట మునిగింది. వరద ముంపు ప్రాంతాలలో సీఎం, గవర్నర్ పర్యటిస్తున్నారు. రోడ్డు మార్గాన హనుమకొండ నుంచి భద్రాచలంకు సీఎం వచ్చారు. మరో వైపు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మణుగూరు చేరుకుని అక్కడ నుంచి అశ్వాపురంలోని వరద ముంపు ప్రాంతాలలో పర్యటిస్తున్నారు. భద్రాచలంలో సీఎం కేసీఆర్, అశ్వాపురంలో గవర్నర్ తమిళ్ సై పర్యటనలు పోటా పోటీగా సాగుతున్నాయి. -
సీఎం జగన్ ఆదేశాలు.. మంత్రులు ఏరియల్ సర్వే
సాక్షి, అమరావతి: అల్లూరి సీతారామరాజు జిల్లాలో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. గోదావరి వరదలపై మంత్రులు, అధికారులు, అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. ఈ మేరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు గుడివాడ అమర్నాథ్, వేణు గోపాలకృష్ణ ఏరియల్ సర్వే చేపట్టారు. చదవండి: ధవళేశ్వరం బ్యారేజీ వద్ద విశ్వరూపం సీఎం ఆదేశాలతో ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. మందులు, ఆహార సరఫరా తాగునీరు,పాలు అందుబాటులో ఉండే విధంగా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఎటపాక, చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, దేవీపట్నం మండలాల్లో ఏరియల్ వ్యూ ద్వారా పరిస్థితులను మంత్రులు సమీక్షించారు. -
తప్పుల వల్లే తిప్పలు
సాక్షి, అమరావతి: బుధవారం 129.98 టీఎంసీలు.. గురువారం 132.98 టీఎంసీలు.. శుక్రవారం 161.99 టీఎంసీలు.. శనివారం 204.20 టీఎంసీలు.. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సముద్రంలో కలిసిన గోదావరి జలాలు. జూన్ ఒకటి నుంచి ఇప్పటివరకు ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 800.75 టీఎంసీల నీరు సముద్రంలో కలిసింది. దీన్లో ఈ నాలుగు రోజుల్లోనే 629.15 టీఎంసీలు కడలిలో కలిశాయంటే గోదావరి ఏ స్థాయిలో విశ్వరూపం చూపిందో అర్థం చేసుకోవచ్చు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 1862 నుంచి అందుబాటులో ఉన్న రికార్డులను పరిశీలిస్తే.. గత 160 ఏళ్లలో జూలైలో అదీ ప్రథమార్థంలో కేవలం నాలుగు రోజుల్లోనే ఈ స్థాయిలో గోదావరి వరద జలాలు కడలిలో కలిసిన దాఖలాల్లేవు. ఆకస్మిక వరదలతో గోదావరి విశ్వరూపం ప్రదర్శించటానికి వాతావరణ మార్పులు ఎంత కారణమో అడవుల నరికివేత, ఇసుక కోసం నదీ గర్భాన్ని ఎడాపెడా తవ్వేయడం వంటి మానవతప్పిదాలు కూడా అంతే కారణమయ్యాయని వాతావరణ, సాగునీటిరంగ నిపుణులు చెబుతున్నారు. కర్బన ఉద్గారాల వల్ల కాలుష్యం పెరిగిపోవడంతో వాతావరణంలో భారీమార్పులు జరుగుతున్నాయి. భూమి, సముద్ర ఉష్ణోగ్రతల్లోను అంతేస్థాయిలో మార్పులు వస్తున్నాయి. దక్షిణ అమెరికా పశ్చిమ తీరంలో పెరు దేశం వద్ద పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతల్లో మార్పుల వల్ల ఏర్పడే ఎల్‌నినో (సముద్రం ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటం), లానినో (సముద్ర ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోవడం) పరిస్థితుల ప్రభావం వల్ల పసిఫిక్ మహాసముద్రం, బంగాళఖాతం, హిందూమహాసముద్రం మీదుగా దేశంలోకి వీచే గాలులు రుతుపవనాలను.. ప్రధానంగా నైరుతి రుతుపవనాల క్రమం, లయను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఎల్‌నినో ప్రభావం వల్ల దేశంలో తక్కువ రోజుల్లోనే అత్యధిక వర్షం కురిసి అతివృష్టికి దారితీస్తే.. లానినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడి అనావృష్టికి దారితీస్తోంది. కుంభవృష్టి మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో నాసిక్‌కు సమీపంలో త్రయంబకేశ్వర్ వద్ద జన్మించే గోదావరి.. తూర్పు కనుమల మీదుగా 1,465 కిలోమీటర్లు ప్రవహించి అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. గోదావరి పరీవాహక ప్రాంతం 3,12,150 చదరపు కిలోమీటర్లు. దీన్లో మహారాష్ట్రలో 48.5 శాతం, తెలంగాణ, ఏపీల్లో 23.30, ఛత్తీస్‌గఢ్‌లో 12.5, మధ్యప్రదేశ్‌లో 8.6, ఒడిశాలో 5.70, కర్ణాటకలో 1.40 శాతం ఉంది. దేశ విస్తీర్ణంలో ఇది 9.5 శాతంతో సమానం. గోదావరి బేసిన్లో గత 30 ఏళ్ల వర్షపాతం ఆధారంగా.. కనిష్టంగా 877 మిల్లీమీటర్లు, గరిష్టంగా 1,493 మిల్లీమీటర్లు, సగటున 1,117 మిల్లీమీటర్ల వర్షం కురుస్తుందని కేంద్ర జలసంఘం అంచనా వేసింది. ఇందులో నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల జూన్ 12 నుంచి సెప్టెంబరు 30 వరకు సగటున 824 మి.మీ. వర్షం కురుస్తుందని అంచనా. గోదావరికి ఉన్న తొమ్మిది సబ్ బేసిన్లలో ఎల్లి సబ్ బేసిన్ (జి–2) (మహారాష్ట్ర)లో కనిష్టంగా 758.34.. కుంట సబ్ బేసిన్ (జి–7) (శబరి–ఒడిశా, ఆంధ్రప్రదేశ్)లో గరిష్టంగా 1,503 మి.మీ. వర్షం కురుస్తుంది. జూలై ప్రథమార్థంలో ప్రాణహిత (జి–2 టెక్రా), గోదావరి (జి–4 మంచిర్యాల), ఇంద్రావతి (జి–5 పాతగూడెం), శబరి (జి–7 కొంటా)లలో సగటున 526 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అంటే.. రుతుపవనాల వల్ల కురవాల్సిన వర్షంలో 63.84 శాతం పది రోజుల్లోనే కురిసింది. సుమారు 60 రోజుల్లో కురవాల్సిన వర్షం పది రోజుల్లోనే పడింది. భూమిలోకి ఇంకని నీరు గోదావరి బేసిన్ విస్తరించిన పశ్చిమ కనుమలు, తూర్పు కనుమల్లో దశాబ్దాలుగా భారీ ఎత్తున అడవులను నరికేస్తున్నారు. ఇటీవల అడవుల నరికివేత మరింత తీవ్రమైంది. దీనివల్ల గరిష్టంగా వర్షం కురిసినప్పుడు.. భూమిపై పడిన వర్షపు నీరు అదే రీతిలో నదిలోకి చేరుతోంది. అడవులు నరికివేయకపోతే వర్షపు నీరు భూమిలోకి పూర్తిగా ఇంకిన తరువాత మిగిలినది వాగులు, వంకల ద్వారా ఉప నదుల్లోకి చేరి తర్వాత గోదావరిలోకి చేరేది. ఇక గోదావరిలో ఎగువన అనుమతి తీసుకున్న దానికంటే అధికంగా ఇసుకను తవ్వేయడంతో నదీగర్భం గట్టినేలగా మారిపోయింది. దీంతో నదిలోకి వచ్చిన నీరు వచ్చినట్టుగా ప్రవహిస్తోంది. ఇవే ప్రస్తుతం గోదావరి ఆకస్మిక వరదలకు దారితీశాయని యాక్షన్ పెటర్నా ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ వై.వి.మల్లారెడ్డి చెప్పారు. -
మేమున్నామని.. మీకేం కాదని..
నట్రా సత్యవతి గర్భిణి.. పురిటి కోసం పది రోజుల క్రితం లంకాఫ్ ఠాణేలంకలోని పుట్టింటికి వచ్చింది. ఊహించని రీతిలో గోదావరి వరద ఇంట్లోకి వచ్చి, మోకాలు లోతున చేరింది. ఈ ఇంట్లో గర్భిణి ఉందన్న వార్త శనివారం అధికారులకు అందింది. పీహెచ్సీ వైద్యాధికారులు వెంటనే ప్రత్యేక బోటులో అక్కడకు చేరుకున్నారు. డాక్టర్ జాకబ్, వైద్య సిబ్బంది సత్యవతిని పరీక్షించారు. మందులు ఇచ్చారు. ఆమెకు ధైర్యం చెప్పారు. గ్రామం నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఊహించనంతగా విరుచుకుపడిన వరదతో వణికిపోతున్న లంక గ్రామాల ప్రజలకు ప్రభుత్వం ఇస్తున్న భరోసాకు ఇది ఒక నిదర్శనం. కోనసీమ నుంచి సాక్షి ప్రతినిధులు వడ్డాది శీనివాసరావు, పంపాన వరప్రసాద్: ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా సహాయ, పునరావాస చర్యలు చేపడుతోంది. బాధిత ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. వరద నీటిలో చిక్కుకున్న గ్రామాలకు అధికారులే వెళ్లి ప్రజలకు ధైర్యం చెబుతున్నారు. వారికి కావల్సిన నిత్యావసరాలు, వైద్య సహాయం అందిస్తున్నారు. సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్లకు చెందిన 25 బృందాలు, 1,200 మంది గజ ఈతగా>ళ్లు, మత్స్య శాఖకు చెందిన 750 బోట్లను వినియోగిస్తున్నారు. పక్కా ప్రణాళికతో ప్రజలకు రక్షణ గోదావరి వరదలో చిక్కుకున్న బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వరద అంతకంతకూ పెరుగుతుండటంతో ప్రభుత్వం ముందుగానే అప్రమత్తమైంది. వివిధ ప్రభుత్వ శాఖలతో పాటు వైఎస్ జగన్ సర్కారు ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్లు, ఆర్బీకే వంటి ప్రత్యేక వ్యవస్థలను కూడా ఉపయోగించుకొని చక్కటి ప్రణాళిక రచించింది. గ్రామాలవారీగా రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, వైద్య, పశు సంవర్ధక శాఖల అధికారులతో బృందాలను ఏర్పాటు చేసింది. వలంటీర్లు, సచివాలయ, ఆర్బీకే సిబ్బంది ఇంటింటికీ వెళ్లారు. ఇంట్లో ఎంత మంది ఉన్నారు, వారి స్థితిగతులు, ఆరోగ్యం ఇతర సమాచారాన్ని నమోదు చేశారు. దీంతో గ్రామాలవారీగా చేపట్టాల్సిన సహాయక చర్యలపై అధికార యంత్రాంగానికి స్పష్టత వచ్చింది. ప్రణాళిక ప్రకారం ప్రజలను, మూగజీవాలను సకాలంలో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ కారణంగా రికార్డు స్థాయిలో వరద ముంచెత్తినప్పటికీ ఎలాంటి ప్రాణనష్టం, పశునష్టం జరగలేదు. లంకలను విడిచి రాని వారిని కూడా కంటికిరెప్పలా చూసుకుంటూ వలంటీర్ల ద్వారా వారికి కావాల్సిన నిత్యావసరాలు, మంచినీరు, మందులు సరఫరా చేస్తున్నారు. మనిషికి 5 కిలోల బియ్యం, కుటుంబానికి కిలో చొప్పున కందిపప్పు, ఉల్లిపాయలు, దుంపలు, లీటర్ వంటనూనె, పాలు, కొవ్వొత్తులు సరఫరా చేశారు. మొత్తం 3 వేల టన్నుల బియ్యం, 1.2 టన్నుల చొప్పున కందిపప్పు, ఉల్లిపాయలు, టమాటా, వంటనూనె, 1150 లీటర్ల పాలు, 32 వేల కొవ్వొత్తులు అందించారు. పునరావాస శిబిరాల నిర్వహణ కోనసీమ జిల్లాలో 65 పంచాయతీలకు 84 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 14, ఏలూరు జిల్లాలో 58, పశ్చిమ గోదావరి జిల్లాలో 18 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు 50 వేల మందిని ఈ కేంద్రాలకు తరలించారు. వీరికి భోజనం, అల్పాహారం అందిస్తున్నారు. తాగునీరు, మందులు, దుస్తులు మొదలైనవి సరఫరా చేస్తున్నారు. చిన్న పిల్లలు కలిగిన కుటుంబాలకు 2 లీటర్లు, ఇతర కుటుంబాలకు లీటర్ చొప్పున 1.40 లక్షల పాల ప్యాకెట్లు పంపిణీ చేశారు. శిబిరాల్లో ఉన్న పిల్లలు, వృద్ధుల కోసం మొత్తం 33 వేల బిస్కెట్ ప్యాకెట్లు, 13వేల బ్రెడ్ ప్యాకెట్లను అందించారు. పూర్తి స్థాయిలో వైద్య సేవలు లంక గ్రామాలను ఆనుకొని ఉన్న వరద గట్ల పక్కనే ప్రభుత్వం 160 ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసింది. గ్రామాల నుంచి తీసుకొస్తున్న ప్రజలకు అక్కడే ప్రాధమిక వైద్య పరీక్షలు చేసి, మందులు ఇస్తున్నారు. మెరుగైన వైద్యం అవసరమైన వారిని ఆస్పత్రులకు తరలిస్తున్నారు. మరికొన్ని వైద్య బృందాలు ప్రత్యేక బోట్లలో లంక గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ప్రతి వ్యక్తినీ పరీక్షిస్తున్నాయి. వారికి అవసరమైన వైద్య సహాయం అందిస్తున్నాయి. పునరావాస శిబిరాల్లో కూడా వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. వేలాది పశువులను ప్రత్యేక బోట్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వాటికి సంపూర్ణ మిశ్రమదాణా, పచ్చి గడ్డిని అందుబాటులో ఉంచారు. పశువులు వ్యాధుల బారిన పడకుండా వ్యాక్సిన్లు, మందులు ఇస్తున్నారు. అప్రమత్తంగా అధికార యంత్రాంగం మరో 24 గంటలు వరద తీవ్రంగా ఉంటుందన్న అంచనాతో యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. ఎగువ ప్రాంతాల అధికారులతో సమన్వయం చేసుకుంటూ తీవ్రతను అంచనా వేస్తోంది. కాలువ గట్లకు గండి పడకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. గట్ల వెంబడి ఇసుక బస్తాలు సిద్ధం చేసింది. ప్రత్యేక బృందాలతో గట్లను 24 గంటలూ పర్యవేక్షిస్తోంది. అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు నాకు 87 ఏళ్లు. ఎన్నో వరదలను చూశా. ఇంత పెద్ద వరద ఎప్పుడూ చూడలేదు. ఊళ్లో ఉండలేక అందరం పునరావాస కేంద్రాలకు వచ్చేశాం. అధికారులు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. – పొల్నాటి కొండమ్మ, అయినవిల్లిలంక సత్వరమే వైద్యసహాయం అందిస్తున్నాం లంక గ్రామాల్లో ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పర్యటిస్తున్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. ముంపు గ్రామాల్లో 5,063మంది ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాం. – డాక్టర్ ఎస్.జాకబ్, కొత్తలంక పీహెచ్సీ వైద్యుడు పునరావాస కేంద్రాలకు వెళ్తున్నాం వరద ఇంత వస్తుందని ఊహించలేదు. అర్ధరాత్రి తర్వాత ఇంట్లోకి నీరు చొచ్చుకు రావడంతో ఆందోళన చెందాం. అధికారులు మంచినీరు, ఆహారం అందిస్తున్నారు. అధికారుల సూచనల మేరకు పునరావాస కేంద్రాలకు వెళ్తున్నాం. – అంగాడి ముత్యాలరావు, లంకాఫ్ ఠానేలంక -
మరో 24 గంటలు.. అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ ఆదేశం
సాక్షి, అమరావతి: గోదావరి వరద నేపథ్యంలో మరో 24 గంటల పాటు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా అవసరమైన ముందస్తు జాగ్రత్తలన్నీ చేపట్టాలని స్పష్టం చేశారు. గోదావరి వరదలు, సహాయ కార్యక్రమాలపై సీఎం జగన్ శనివారం ఉదయం సమీక్షించారు. గోదావరి ప్రవాహం, తాజా పరిస్థితిపై ఆరా తీశారు. సహాయ బృందాలను వినియోగించుకుంటూ శిబిరాలు ఏర్పాటు చేసి బాధితులకు నాణ్యమైన సేవలు అందించాలని నిర్దేశించారు. రేషన్ సరుకులు.. నగదు సాయం వరద బాధిత కుటుంబాలకు యుద్ధ ప్రాతిపదికన రేషన్ పంపిణీ చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రతి కుటుంబానికీ 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, కిలో బంగాళాదుంపలు, కిలో పామాయిల్, కిలో ఉల్లిపాయలు అందించాలన్నారు. ప్రతి కుటుంబానికి రూ.2 వేలు లేదా వ్యక్తికైతే రూ.వెయ్యి చొప్పున వెంటనే నగదు సాయం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమాలకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ వరద పరిస్థితిపై గంట గంటకూ తనకు నివేదించాలని అధికారులను ఆదేశించారు. -
భద్రాద్రి జిల్లాలో గవర్నర్ పర్యటన.. ఢిల్లీ పర్యటన రద్దు చేస్కొని మరీ..
సాక్షి, హైదరాబాద్: కనీవినీ ఎరుగనిరీతిలో గోదావరి మహోగ్రరూపంతో గోదావరి తీర ప్రాంతాల్లో కలిగించిన నష్టాన్ని అంచనా వేయడానికి, వరద ప్రభావిత భద్రాద్రి–కొత్తగూడెం జిల్లాలో ఆదివారం గవర్నర్ తమిళిసై పర్యటించనున్నారు. శనివారంరాత్రి ఆమె రైలుమార్గం ద్వారా కొత్తగూడెంకు బయలుదేరివెళ్లారు. ఆదివారం తెల్లవారుజామున మణుగూరుకు చేరుకోనున్నారు. గవర్నర్ పర్యటనను అధికార టీఆర్ఎస్ వ్యతిరేకిస్తుండగా, వరదబాధితులను కలుసుకుని వారి కష్టాలను అడిగి తెలుసుకోవడానికి ఈ పర్యటన జరుపుతున్నట్టు ఆమె వెల్లడించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం ముగుస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసిన వీడ్కోలు విందులో పాల్గొనడానికి గవర్నర్ తమిళిసై ఆదివారంరాత్రి ఢిల్లీకి వెళ్లాల్సింది. కానీ, భద్రాచలం పరిసర ప్రాంతాల ప్రజల దీనస్థితిని చూసి చలించిన గవర్నర్ తన ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుని కొత్తగూడెం జిల్లాకు వెళ్లాలని నిర్ణయించినట్టు రాజ్‌భవన్ ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలోని వరద పరిస్థితులను తమిళిసై రాష్ట్రపతికి ఫోన్లో వివరించి, తాను అత్యవసరంగా కొత్తగూడెం జిల్లా పర్యటనకు వెళ్లాల్సి ఉందని విన్నవించారని పేర్కొంది. పునరావాస శిబిరాలను సందర్శించనున్న గవర్నర్ కొత్తగూడెం జిల్లా పర్యటనలో భాగంగా గవర్నర్ పునరావాస కేంద్రాలను సందర్శించి వరదబాధితులను కలుసుకోనున్నారు. రెడ్‌క్రాస్, ఇతర స్వచ్ఛంద సంస్థలు, దాతల నుంచి వచ్చిన విరాళాలు, సామగ్రిని బాధితులకు పంపిణీ చేయనున్నారు. బాధితుల సహాయార్థం విరివిగా విరాళాలు అందజేయాలని, సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పునరావాస కేంద్రాలు, ఇతర ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు వైద్య, ఇతర సహాయాన్ని అందించాలని తమిళిసై ఈఎస్ఐ వైద్య కళాశాల, రెడ్‌క్రాస్ సంస్థలను కోరారు. కాగా, వరద ప్రాంతాల్లో ప్రభుత్వ యంత్రాంగం సహాయ చర్యలకు గవర్నర్ పర్యటనతో ఆటంకం కలగనుందని టీఆర్ఎస్ వర్గాలు విమర్శిస్తున్నాయి. గవర్నర్ పర్యటన రాజకీయమేనని ఆరోపిస్తున్నాయి. ప్రతిఒక్కరూ తప్పక బూస్టర్ తీసుకోవాలి: గవర్నర్ అమీర్‌పేట (హైదరాబాద్): కరోనా నివారించాలంటే ప్రతిఒక్కరూ తప్పక బూస్టర్ డోస్ తీసుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా శనివారం అమీర్‌పేట 50 పడకల ప్రభుత్వ ఆస్పత్రిలో ఆమె బూస్టర్ డోస్ తీసుకున్నారు. మధ్యాహ్నం 1.45 గంటల సమయంలో ఆస్పత్రికి వచ్చిన గవర్నర్‌కు వైద్య సిబ్బంది టీకా వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షాలు కురుస్తున్నందున సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
MLA Seethakka: సీతక్కకు తప్పిన ప్రమాదం
ఏటూరునాగారం: ములుగు ఎమ్మెల్యే సీతక్కకు ప్రమాదం తప్పింది. వరద ముంపు ప్రాంతాల్లోని ప్రజలను పరామర్శించేందుకు శనివారం ఆమె ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం ఎలిశెట్టిపల్లి గ్రామానికి జంపన్నవాగు మీదుగా పడవలో వెళ్లారు. ముంపు బాధితులకు నిత్యావసర సరుకులు, కూరగాయలను పంపిణీ చేసి కార్యకర్తలతో కలసి తిరిగి వస్తున్న క్రమంలో పెట్రోల్ అయిపోయి వాగుమధ్యలో పడవ ఇంజిన్ ఆగిపోయింది. వరద ఉధృతికి పడవ వాగు ఒడ్డుకు కొట్టుకువచ్చి చెట్టును ఢీకొట్టి ఆగిపోయింది. దీంతో ఆమె వెంట ఉన్న నాయకులు చెట్టు కొమ్మల సాయంతో సీతక్కను సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు. పడవ ఆగిపోయిన సమయంలో సీతక్క ఎటువంటి ఆందోళనకు గురికాకుండా ధైర్యంగా ఉన్నారని, వరద ఉధృతికి పడవ చెట్టును ఢీకొట్టి ఆగిపోవడం వల్ల ఎలాంటి ప్రమాదం జరగలేదని ఆమె వెంట ఉన్న వారు తెలిపారు.