వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందాల పరిశీలన | Monitoring of central teams in flood affected areas Andhra Pradesh | Sakshi
Sakshi News home page

వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందాల పరిశీలన

Published Thu, Aug 11 2022 4:23 AM | Last Updated on Thu, Aug 11 2022 3:16 PM

Monitoring of central teams in flood affected areas Andhra Pradesh - Sakshi

నెక్లెస్‌బండ్‌ను పరిశీలిస్తున్న కేంద్ర బృందం

చింతూరు/పోలవరం రూరల్‌: ఇటీవల గోదావరి వరదలతో ప్రభావితమైన ప్రాంతాల్లో బుధవారం కేంద్రబృందాలు పర్యటించాయి. నష్టాలను పరిశీలించాయి. రవినేష్‌కుమార్, మురుగానందం సభ్యులుగా ఉన్న బృందం అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం, చింతూరు మండలాల్లోను, కె.మనోహరన్, పి.దేవేందర్, అరవింద్‌కుమార్‌ సోని సభ్యులుగా ఉన్న బృందం ఏలూరు జిల్లా పోలవరం గ్రామంలోను పర్యటించాయి.

ఆయా జిల్లాల కలెక్టర్లు సుమిత్‌కుమార్, ప్రసన్నవెంకటేష్‌ వరద నష్టాలను ఆయా బృందాల సభ్యులకు వివరించారు. బృందం సభ్యులు వరదలకు కూలిన ఇళ్లను పరిశీలించి బాధితులతో మాట్లాడారు. అలాగే ఏలూరు జిల్లా పోలవరం గ్రామంలోని నెక్లెస్‌బండ్‌ కోతకు గురైన ప్రాంతాన్ని, యడ్లగూడెం ప్రాంతంలో నెక్లెస్‌బండ్‌ను వారు పరిశీలించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement