kunavaram
-
తామర పంటకాదు.. పూల్ మఖానా!
నిరుపయోగంగా ఉన్న చెరువులు, కుంటలను వినియోగంలోకి తెచ్చి గిరి రైతులకు ఆదాయ వనరుగా మార్చేందుకు అల్లూరి సీతారామరాజు జిల్లా (alluri sitarama raju district) చింతూరు ఐటీడీఏ అడుగులు వేస్తోంది. డివిజన్ పరిధిలోని చింతూరు, కూనవరం, ఎటపాక, వీఆర్‌పురం మండలాల్లో నిరుపయోగంగా ఉన్న చెరువులు, కుంటల్లో చేపల పెంపకానికి అనుబంధంగా పూల్ మఖానా (phool makhana) సాగు చేపట్టేందుకు సంకల్పించింది. ఇప్పటికే చింతూరు డివిజన్లో మఖానా సాగు సాధ్యాసాధ్యాలను నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ మఖానాకు చెందిన శాస్త్రవేత్తలు డాక్టర్ ఇందుశేఖర్ సింగ్, డాక్టర్ పడాల వినోద్ కుమార్ పరిశీలించారు. ఈ సాగుకు కీలకమైన గాలి, ఉష్ణోగ్రత, వర్షపాతం అనుకూలంగా ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. డివిజన్ పరిధిలోని చెరువులు, కుంటలను పరిశీలించారు. స్థానిక గిరిజన రైతులతో కూడా మాట్లాడారు. ఇక్కడి చెరువులు, కుంటల్లోని మట్టి, నీటిని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. పరీక్షల నివేదిక ఆధారంగా ఈ ప్రాంతంలో మఖానా సాగు చేపట్టేందుకు వారు ఏర్పాట్లు చేస్తున్నారు. స్థిరమైన శాశ్వత నీటి వనరుల్లో.. మఖానా అనేది జలపంట. దీనిని సాధారణంగా పూల్ మఖానా, గోర్గాన్ నట్ (gorgon nut) అని కూడా పిలుస్తుంటారు. ఇది సరస్సులు, చెరువులు, చిత్తడి నేలలు, కుంటల వంటి స్థిరమైన శాశ్వత నీటి వనరుల్లో పెరుగుతుంది. తేలియాడే ఆకులతో మెత్తని ఆకృతి, ప్రకాశవంతమైన నీలిరంగు, స్టార్చ్వైట్ గింజలతో ఉత్పత్తి చేస్తుంది. చూసేందుకు తామర ఆకులను పోలిఉండటంతో దీనిని అందరూ తామర పంటగానే భావిస్తారు. తామర ఆకు మృదువుగా ఉంటే మఖానా ఆకు (Prickly Water Lily) మాత్రం పైకి ముళ్ల మాదిరిగా కనిపిస్తుంది. ప్రతిమొక్క 15 నుంచి 20 పండ్లను ఉత్పత్తి చేస్తుంది. ఇవి గుండ్రంగా మెత్తగా ఉంటాయి. ప్రతి పండులో 20 నుంచి 200 గింజల వరకు ఉంటాయి. మార్కెట్లో వీటి ధర కిలో రూ.800 నుంచి రూ.1200 వరకు ఉంటుంది. మఖానా పంట సగటు దిగుబడి హెక్టారుకు 1.4 నుంచి 1.6 టన్నుల వరకు ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆరోగ్య ప్రయోజనాలెన్నో.. మఖానాలో ఉన్న ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్లు, మినరల్స్, విటమిన్లు వల్ల జీర్ణవ్యవస్థ మెరుగు, బరువు తగ్గడం, మెదడు పనితీరు మెరుగు పరచడం, గుండె సంబంధిత వ్యాధులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని నిపుణులు చెబుతున్నారు. మఖానాను నేరుగా తినడంతో పాటు వంటకాల్లో ఉపయోగించడం వల్ల స్థానికంగా మార్కెటింగ్ అందుబాటులో ఉంటుంది.ల్యాబ్ నివేదిక ఆధారంగా చర్యలు దక్షిణాది రాష్ట్రాల్లో కూడా మఖానా సాగును ప్రోత్సహిస్తున్నాం. దీనిలో భాగంగా ఇటీవల ఆంధ్రాలోని చింతూరు ఐటీడీఏ పరిధిలో పర్యటించాం. సాగులో కీలకమైన ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు అవుతుండాలి. మట్టి, నీరు కూడా పంట దిగుబడులపై ప్రభావం చూపిస్తాయి. చింతూరు ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు కావడాన్ని గుర్తించాం. సాగుకు అనుకూల పరిస్థితులపై కసరత్తు ప్రారంభించాం. దీనిలో భాగంగానే మట్టి, నీటిని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించాం.– డాక్టర్ ఇందుశేఖర్ సింగ్, శాస్త్రవేత్త, నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ మఖానాచదవండి: అందాల దీవిలో కడలి కల్లోలంఆర్థిక పరిస్థితి మెరుగుకు దోహదంమఖానా సాగు గిరి రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుకు దోహదపడుతుందని భావిస్తున్నాం. చేపల పెంపకం చేపట్టే చెరువుల్లోనే వాటికి అనుబంధంగా మఖానాను కూడా సాగు చేయవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ప్రాంతంలో నమోదయ్యే అధిక ఉష్ణోగ్రతలు సాగుకు అనుకూలిస్తాయని ఆశిస్తున్నాం. దీనిలో భాగంగానే శాస్త్రవేత్తలు ఇటీవల ఈప్రాంతంలో పర్యటించారు. ల్యాబ్ నివేదిక రాగానే వారు సాగుకు క్లియరెన్స్ ఇచ్చిన వెంటనే సాగుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తాం. రైతులకు అవగాహన కల్పించి తరువాత శిక్షణ ఇస్తాం. – అపూర్వభరత్, ప్రాజెక్ట్ అధికారి, ఐటీడీఏ, చింతూరు -
అడవిలో 15 కిమీ నడిస్తే గాని మా ఊరు రాదు..జగన్ వచ్చాకే మా జీవనం మెరుగ్గా..
-
శెభాష్ వెంకటేషన్.. భుజం తట్టిన సీఎం జగన్
సాక్షి, అల్లూరి: గతేడాది, ఈ ఏడాది గోదావరి వరదల సందర్భంగా.. సాహసోపేతంగా రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహించి ప్రజలను రక్షించిన కూనవరం ఎస్సై వెంకటేశన్‌ను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న సీఎం జగన్.. సోమవారం కూనవరంలో పర్యటించారు. ఆ సమయంలో సభకు హాజరవుతున్న టైంలో ఒక విజ్ఞాపన కోసం బస్సు దిగారాయన. అయితే.. అక్కడే ఉన్న స్థానికులు.. అధికారులు బాగా పని చేశారని సీఎం జగన్‌కు వివరించారు. ఈ క్రమంలో ఎస్సై వెంకటేశన్ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించడం.. గతేడాది అయితే దాదాపు 4 నుంచి 5 వేల మంది గ్రామస్తులను తరలించడంలో కీలక పాత్ర పోషించాడని సీఎం జగన్‌కు వివరించారు. దీంతో.. సీఎం జగన్ ఆయన్ని భుజం తట్టి అభినందించారు. అంతేకాదు ఎస్సై వెంకటేశన్‌కు పోలీస్ మెడల్ ఇవ్వాలంటూ పక్కనే ఉన్న అధికారులకు సిఫార్సు చేశారాయన. -
నిలదీయడానికి రాలేదు.. శభాష్ అని చెప్పడానికే వచ్చా: సీఎం జగన్
సాక్షి, అల్లూరి సీతారామరాజు: కూనవరం వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రాంతాల్లో పర్యటించి, సహాయక చర్యలపై కూనవరం, వీఆర్‌పురం మండలాల బాధిత గ్రామాల ప్రజలతో మాట్లాడారు. వరద బాధితులందరికీ సాయం అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని సీఎం జగన్ తెలిపారు. సహాయక చర్యల కోసం అధికారులకు తగిన సమయం ఇచ్చామని..నష్ట పరిహారం పక్కాగా అందేలా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. అధికారులు వారంపాటు గ్రామాల్లోనే ఉండి.. వరద బాధితులకు నిత్యవసరాలు అందించారని పేర్కొన్నారు. డబ్బులు మిగుల్చుకోవాలనే ఆరాటం ప్రభుత్వానికి లేదు వరదల వల్ల ఇళ్లు దెబ్బతిన్న వారికి రూ10 వేలు ఇవ్వాలని , ఇళ్లలోకి నీరు వచ్చినన వారికి రూ. 2 వేలు ఆర్థికసాయం ఇచ్చామని సీఎం జగన్ పేర్కొన్నారు. వరద సాయం అందకుంటే ఇక్కడికి వచ్చి తనకు చెప్పాలని సూచించారు. అధికారులు నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వరద సాయం అందలేదని ఒక్క ఫిర్యాదు రాలేదని, ఏ ఒక్క బాధితుడు మిగిలిపోకుండా సాయం అందించారని తెలిపారు. ప్రతి ఒక్కరికి మంచి జరగాలన్నదే మా తాపత్రయమని.. డబ్బులు మిగుల్చుకోవాలనే ఆరాటం తమ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. సీఎం జగన్ ఇంకేం మాట్లాడరంటే.. ‘కొన్ని రోజుల కిందట గోదావరి నది పొంగి వరద వచ్చిన పరిస్థితుల్లో దాదాపు 16 లక్షల క్యూసెక్కుల పరివాహంతో నీళ్లు వచ్చాయి. మన ప్రాంతాలకు ఎక్కడెక్కడ దెబ్బ తగిలి నష్టం జరిగిందో ఆ నష్టానికి సంబంధించి కలెక్టర్‌కు వరద వచ్చినప్పుడే ఆదేశాలు ఇచ్చాం. మొట్టమొదటి సారిగా వరదలు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు గతానికంటే భిన్నంగా చూశారు. సాయం అందలేదనే మాట రావొద్దని ఆదేశించాం మనందరి ప్రభుత్వంలో ఎవరికి ఎప్పుడు ఏ నష్టం వచ్చినా కూడా అది ఏ ఫొటోల కోసమో లేకపోతే అప్పటికప్పుడు వచ్చి అధికార యంత్రాంగం అంతా నా చుట్టూ తిరుగుతున్నట్లు చేయడమో చేయలేదు. అధికారులకు కావాల్సిన వనరులు ఇచ్చి వారం రోజుల పాటు సహాయ కార్యక్రమాలకు ఏ మాత్రం అలసత్వం లేకుండా చేయాలని చెప్పాం. కలెక్టర్లకు సదుపాయాలు ఇచ్చి, గ్రామ సచివాలయాల దగ్గర నుంచి వలంటీర్ల నుంచి యాక్టివేట్ చేశాం. వారం రోజుల తర్వాత నేను వస్తాను, గ్రామాల్లో తిరిగినప్పుడు మాకు రావాల్సిన సాయం అందలేదనే మాట ఎవరైనా అంటే అది బాగుండదని ఆదేశాలు ఇచ్చాం’ అని పేర్కొన్నారు. చదవండి: పోలవరం నిర్మాణంలో మా ప్రభుత్వం క్రెడిట్ కోసం ఆలోచించదు: సీఎం జగన్ సాయం అందకుంటే నాకు చెప్పండి ► గొప్పగా, ట్రాన్స్పరెంట్గా ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని తాపత్రయ పడే ప్రభుత్వం మనది. ►మనందరి ప్రభుత్వంలో డబ్బులు ఎలా మిగిలించుకోవాలనే తాపత్రయం లేదు. ► ఏ ఒక్కరూ మిగిలిపోకూడదనే తపన, తాపత్రయం ఉంది. ►ఇళ్లలోకి నీళ్లు వచ్చిన పరిస్థితుల్లో ఏ కుటుంబానికైనా ఆ ఇంటికి నిత్యావసర సరుకులన్నీ ఇవ్వడమే కాకుండా రూ.2 వేలు ఇవ్వకపోయి ఉంటే తప్పే. ►అలా జరగకపోతే ఎవరైనా నాకు చెప్పవచ్చు. ప్రతి ఇంటికీ 10 వేలు ఇవ్వాలని ఆదేశం ► ఇళ్లలోకి నీళ్లు రాకపోయినా మన గ్రామాలు కటాఫ్ అయిపోయి ఉంటే, ఆ ఇళ్లకు రేషన్ ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ►25 కేజీల బియ్యం, కందిపప్పు, పామాయిల్, పాలు, కూరగాయలు ఇటువంటివన్నీ 5 రకాలు కలిపి ఇచ్చే కార్యక్రమం చేయాలని ఆదేశించాం. ► అటువంటివి ఎవరికైనా దక్కకపోయి ఉంటే ఇక్కడ చెప్పొచ్చు. దానికి ప్రభుత్వం జవాబుదారీ తనం తీసుకుంటుంది. ►కచ్చా ఇళ్లుగానీ, ఇళ్లు దెబ్బతినడం గానీ జరిగితే పార్షియల్లీ దెబ్బతినిందని, పూర్తిగా దెబ్బతినిందని వ్యత్యాసం వద్దు. ►పేదవాడికి ఎటువంటి వ్యత్యాసం చూపించవద్దని, పూర్తిగా ప్రతి ఇంటికీ 10 వేలు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చాం. ►ఎన్యుమరేషన్ చేసే ఖాతాలోకి రాకపోయి ఉంటే అది కూడా తప్పే. అందరికీ మేలు జరగాలి ► ప్రతి అడుగులోనూ, గ్రామ సచివాలయాల్లోనే అర్హుల జాబితాలు పెడుతున్నాం. అందరికీ మేలు జరగాలని పెట్టాం. ►పొరపాటున నష్టం జరిగి ఉండి జాబితాలో పేరు లేకపోతే వెంటనే జాబితాలోకి పేరు చేర్చి మంచి జరిగించే కార్యక్రమం చేయడం కోసమే మీ జగన్ మీ దగ్గరకు వచ్చాడు. ►ఈ ప్రభుత్వం మీది అని తెలియజేస్తున్నా. మీరంతా తోడుగా ఉన్నారు కాబట్టే మీ బిడ్డ ఈరోజు సీఎం స్థానంలో కూర్చున్నాడు. ►మీలో ఏ ఒక్కరికి ఏ కష్టమొచ్చినా దానికి తీర్చడం కోసం ఎళ్లవేలళా కృషి చేస్తాడు. ► మీలో కొంత మందికి మాట్లాడటానికి మైక్ ఇస్తా. మాట్లాడొచ్చు. పోలవరం పునరావాస ప్యాకేజీ ►ఈ ప్రాంతానికి జనరల్ ఇష్యూ ఉంది. పోలవరం ప్యాకేజీకి సంబంధించింది. ►ఇంతకు ముందు కూడా మీ అందరికీ ఇదే చెప్పాం.. ►మీ జగన్‌లో కల్మషం లేదు. మీ జగన్ ఎప్పుడైనా మంచి చేయడం కోసమే ఆరాటం, పోరాటం చేస్తాడని తెలియజేస్తున్నా. ► గతంలో నేను ఇక్కడికి వచ్చినప్పుడు 41.05లో కాంటూర్‌లెవల్‌లో మావి లేనప్పటికీ కటాఫ్ అయిపోయిన గ్రామాల్లో మేము ఉండిపోతామని చెప్పడం జరిగింది. ► అటువంటి గ్రామాలకు మంచి చేయడం కోసం నేను ఇక్కడికి వచ్చి వెళ్లిన తర్వాత సర్వే చేయించాం. ►32 గ్రామాలు 48 హ్యాబిటేషన్లను 41.15 దాకా మొదటి స్టేజ్ కింద నిలబెట్టినా కూడా ఆ మొదటి దఫా నిలబెట్టినప్పుడు కూడా కటాఫ్ అయిపోయిన గ్రామాల్లోకి నీళ్లు నిలబడటం వల్ల మరో 48 గ్రామాలు చేరుతాయి. ►ఈ గ్రామాలకు వెళ్లడానికి దారి ఉండదు. కాబట్టి వాటిని చేర్చాలని సర్వే చేయించి, దాని ద్వారా ఇందులోకి సైంటిఫిక్‌గా, ట్రాన్స్పరెంట్గా ఆయా గ్రామాలను తీసుకొచ్చాం. చదవండి: స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకొన్న భూమన మూడు దశల్లో పోలవరం డ్యాంలో నీళ్లు నింపుతాం ►ఆ గ్రామాలన్నిటినీ కేంద్ర ప్రభుత్వానికి పంపాం. ►41.15 మీటర్ల దాకా నీళ్లు నింపాలంటే 3 దఫాలుగా నింపాలి. ► ఒకటే స్టేజీలో నింపితే లీకేజీ అవుతుందనే ఉద్దేశంతో 3 ఫేజుల్లో నింపాలి. ► మూడు సంవత్సరాల్లో 3 ఫేజుల్లో డ్యామ్‌ను నింపాలని సీడబ్ల్యూసీ నిబంధనల్లో ఉంది. ►డ్యామ్ కట్టిన తర్వాత నీళ్లు నింపేది 41.15కు నింపుతారు. ►కాంటూర్ లెవల్లో వచ్చే ప్రతి నిర్వాసిత కుటుంబాలకు కూడా వాళ్లందరికీ ఇవ్వాల్సిన ప్యాకేజీ ఇచ్చి, అందరికీ న్యాయం చేయడం జరుగుతుంది. సెంట్రల్ వాటర్ కమిషన్ ఆదేశాల ప్రకారమే ముందుకు ► నిర్వాసితులను చూసుకోవంతో పాటు సర్వే ద్వారా 32 గ్రామాలకు సంబంధించి 48 హ్యాబిటేషన్లు కూడా ఫస్ట్ ఫేజ్‌లోకి తీసుకురావడం జరుగుతోంది. ► దాని వల్ల 41.15 మీటర్లకు సంబంధించి ఎవరెవరికి ఏమేం రావాలో ఫస్ట్ ఫేజ్‌లోనే ఇవ్వడం జరుగుతుంది. ►మనం అధికారంలోకి వచ్చిన తర్వాతే లిడార్ సర్వే పూర్తి చేశాం. కేంద్రానికి పంపి ఒప్పించడం జరిగింది. ►దేవుడి దయతో ఈ నెలాఖరుకల్లా కేబినెట్ దాకా పోయే కార్యక్రమం జరుగుతోంది. ►పోలవరం ప్రాజెక్టు అథారిటీ వాళ్లు సంతకాలు పెట్టడం జరిగింది. ► సీడబ్ల్యూసీ వాళ్లకు చేరింది. మరో వారం దాటేలోపు కేంద్ర జలశక్తి వాళ్లు క్లియర్ చేసి పంపుతారు. కేంద్రంమే స్వయంగా పరిహారం చెల్లించినా పర్వాలేదు. ► ప్రధాని మోదీకి నేను రాసిన లేఖలో ఒకటే చెప్పా.. అయ్యా మీరే బటన్ నొక్కండి నేరుగా మీరే బ్యాంకు అకౌంట్లలోకి డబ్బులు పంపించండి. ► మేమే చెయ్యాలని ఆరాట పడటం లేదు. ప్రజలకు మంచి జరగాలని తాపత్రయ పడుతున్నాం. ►క్రెడిట్ ఎవరికి వచ్చినా పర్వాలేదు. నాకు కావాల్సిందల్లా మంచి జరగాలి. ఇంతకన్నా నాకు వేరే అవసరం లేదని చెప్పా. ►ఆర్అండ్ ఆర్ కింద ఇవ్వాల్సినవన్నీ జరిగిపోతాయి. లిడార్ సర్వేలో వచ్చిన 48 హేబిటేషన్ష్ కూడా కవర్ అవుతాయి. ► ఇక్కడి ప్రజలు సంతోష పడాలంటే ఇదొక్కటి జరిగించాలి. కేంద్రంపై ఒత్తిడి ►కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రూ.6.8 లక్షల పునరావాస ప్యాకేజీకి తోడు 3.9 లక్షల ప్యాకేజీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనమే ఇస్తాం. జీవో ఇష్యూ చేశాం. ►మీ బిడ్డ కట్టుబడి ఉన్నాడని తెలియజేస్తున్నా. ►దేవుడు ఆశీర్వదిస్తే మీకు రావాల్సిన ప్యాకేజీపై మంచే జరుగుతుంది. ఎన్నికలకు వెళ్లేలోపు కేంద్రం ఇవ్వాల్సినవి, రాష్ట్రం నుంచి ఇవ్వాల్సినవి వచ్చే ఆరేడు నెలల్లో మీకు అందేలా చేస్తాం ► ఇక్కడ మీ బిడ్డ మీ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. గట్టిగా కృషి చేస్తున్నాడు. ► వైఎస్సార్ హయాంలోనే లిడార్ సర్వే, దీని ద్వారా అందరికీ న్యాయం జరుగుతుంది. ►సైంటిఫిక్‌గా జరిగింది. ఎవరకీ అన్యాయం జరగదు. ►మా సంకల్పం అంతా ప్రజలకు న్యాయం చేయడమే. ►పోలవరంపై ఎప్పటికప్పుడు కేంద్రంపై ఎప్పటికప్పుడు ఒత్తిడి తెస్తున్నాం. చంద్రబాబు పట్టించుకోలేదు ►పోలవరం నిర్మాణంలో మా ప్రభుత్వం క్రెడిట్ కోసం ఆలోచించదు. ప్రజలకు న్యాయం చేయడమే మా సంకల్పం ►ఇంతకు ముందు పాలకుల మాదిరిగా ఇంత ఇస్తే సరిపోతుంది, పోలవరం కట్టే అధికారం ఇస్తే సరిపోతుందని అనుకోలేదు. ► గతంలో పాలకులు చెప్పింది మార్పు చేస్తూ, వాళ్లరందరికీ జ్ఞానోదయం అయ్యటట్లుగా చేశాం. ►2013, 2014కు సంబంధించిన రేట్లు ఇచ్చి 2022లో ఇస్తే ప్రాజెక్టు ఎలా చేయగలుగుతారు మీరే ఆలోచించండి చెప్పాం. ►పోలవరం బాధితుల గురించి గత ప్రభుత్వం పట్టించుకోలేదు ►పోలవరం నిర్మా ణంలో చంద్రబాబు బుద్ధి లేకుండా వ్యవహరించారు. ► మీరైనా ఆలోచన చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే కార్యక్రమం చేశాడు మీ బిడ్డ. శభాష్ అని చెప్పి, వెన్ను తట్టడానికే వచ్చా ►పోలవరానికి సంబంధించిన ఈ విషయాలన్నీ ఈ పద్ధతిలో జరిగిపోతాయి. ►ఈ వరదకు సంబంధించి మీకు ఏ మంచి జరిగింది? కలెక్టర్ ఏ విధంగా చేయించాడు. ►కూనవరం ఎస్ఐ వెంకటేశ్ గురించి మంచి వార్త విన్నా.. గొప్పగా ఆదుకున్నాడు, నిలబడ్డాడని విన్నా. ►కలెక్టర్‌కు చెప్పా ఆగస్టు 15న ఇచ్చే మెడల్స్‌లో ఆయన పేరు ఉండాలని సూచించాను. ►నేను అధికారులను నిలదీయడానికి రాలేదు. ► అధికారులకు శభాష్ అని చెప్పి, వెన్ను తట్టి బాగా చేశాడు అని చెప్పడం కోసం, మీ దగ్గర నుంచి ఆ రకంగా మంచి సమాధానాలు వస్తాయని వినడం కోసం వచ్చా. నష్టపోయామనే మాట ఎక్కడా వినపడకూడదు ►ఎక్కడైనా పొరపాటు జరిగి ఉంటే అధికారులు, ముఖ్యమంత్రి కూడా ఇక్కడే ఉన్నాడు. ►ఏదైనా పరిష్కరించడం కోసమేనని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ►పోలవరం ప్రాజెక్టు మొదట్లో దివంగత వైఎస్సార్ హయాంలో ల్యాండ్ అక్విజేషన్ జరిగినప్పుడు లక్ష, లక్షన్నరకు కొనుగోలు చేశారు. ►దాన్ని నేను 5 లక్షలు ఇస్తానని చెప్పాను. ►ఆ మిగిలిన 3.5 లక్షలు కూడా కచ్చితంగా ఇచ్చేస్తాం. ►మీ బిడ్డ వల్ల నష్టపోయామనే మాట ఎక్కడా వినపడదని చెబుతున్నా. ►మీ బిడ్డ మంచే చేస్తాడు. చెడు మాత్రం ఎప్పుడూ మీ బిడ్డ చేయడని గుర్తు పెట్టుకోండి’ అంటూ సీఎం జగన్ వ్యాఖ్యానించారు. -
గల్ఫ్ వల.. విలవిల.. 4 నెలలుగా జైలులో మగ్గిపోతున్న మహిళలు
సాక్షి, కోనసీమ(అమలాపురం): గల్ఫ్ దేశాల్లో ఉపాధి కల్పిస్తామంటూ మాయమాటలు చెప్పి, అమాయక మహిళలపై కొందరు ఏజెంట్లు వల విసురుతున్నారు. వారి నుంచి రూ.లక్షల్లో వసూలు చేసి నకిలీ వీసాలతో విమానాలు ఎక్కిస్తున్నారు. ఇమ్మిగ్రేషన్ తనిఖీల సమయంలో ఆ అమాయక మహిళలు నకిలీ వీసాలతో పోలీసులకు పట్టుబడి జైళ్లపాలవుతున్నారు. ఇదే తరహాలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 30 మంది మహిళలు మోసపోయిన వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది. వీరిలో జిల్లాకు చెందిన మహిళలు ముగ్గురు ఉన్నారని అధికారులు చెబుతున్నారు. అయితే మరింత మంది జిల్లా మహిళలు అక్కడి జైలులో చిక్కుకున్నారని ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు చెబుతున్నారు. మోసపోయారిలా.. ఉప్పలగుప్తం మండలం కూనవరానికి చెందిన రాంబాబు అనే ఏజెంటు గల్ఫ్‌లో ఉపాధి కల్పించే పేరుతో అమాయకులపై వల విసిరాడు. గల్ఫ్‌లో ఉపాధి పొందడం ద్వారా కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుందన్న ఆశతో పలువురు అతడికి రూ.లక్షలు సమర్పించుకున్నారు. అతడి ద్వారా వివిధ ప్రాంతాలకు చెందిన 30 మంది మహిళలు గత మే నెలలో గల్ఫ్‌కు బయలుదేరారు. వీరిలో మన జిల్లా మహిళలూ ఉన్నారు. వారికి ఏజెంటు రాంబాబు వీసాలు ఇచ్చి, గల్ఫ్కని చెప్పి, తొలుత హైదరాబాద్ పంపించాడు. అక్కడ రాజు అనే వ్యక్తి వారిని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానం ఎక్కించాడు. ఆ విమానం కేరళ రాష్ట్రం కొచ్చి ఎయిర్‌పోర్టుకు చేరింది. అక్కడ చేసిన తనిఖీల్లో ఈ 30 మంది మహిళల వీసాలూ నకిలీవని ఇమ్మిగ్రేషన్ అధికారులు గుర్తించారు. గత మే 8వ తేదీన వారిని అరెస్టు చేశారు. అప్పటి నుంచీ ఆ మహిళలు అక్కడి జైళ్లలోనే మగ్గుతున్నారు. ఏజెంట్ తమను మోసగించినట్టు గుర్తించిన బాధితులు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మహిళా విభాగాన్ని ఆశ్రయించారు. అరెస్టయిన 30 మంది మహిళల్లో ఐదుగురికి హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ బెయిల్ ఇప్పించింది. మిగిలిన 25 మంది మహిళలనూ విడిపించేందుకు చర్యలు చేపట్టాలని హ్యూమన్ రైట్స్ మహిళా విభాగం వైస్ చైర్పర్సన్ ఎన్.భవాని సారథ్యంలోని ప్రతినిధులు, బాధిత కుటుంబ సభ్యులు కలెక్టర్ హిమాన్షు శుక్లాకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కలెక్టరేట్లో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో విజ్ఞాపన అందించారు. దీనిపై కలెక్టర్ శుక్లా, జిల్లా ఎస్పీ సీహెచ్ సుధీర్‌కుమార్‌రెడ్డి తక్షణమే స్పందించారు. సంబంధిత ఏజెంటుపై చర్యలు తీసుకోవడంతో పాటు, కేరళ జైలులో ఉన్న మహిళలను విడిపించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. గోదావరి జిల్లాల వారే ఎక్కువ కేరళలో జైలు పాలైన వారిలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. దడాల వెంకటలక్ష్మి (బందనపూడి, కాజులూరు మండలం), గీతారాణి (చల్లపల్లి, ఉప్పలగుప్తం మండలం), శాంతి (తాడికోన, అల్లవరం మండలం), లక్ష్మణరావు (ఆదుర్రు, మామిడికుదురు మండలం), రేలంగి జానకి (రామచంద్రపురం), గెల్లా మంగాదేవి (సుంకరపాలెం, తాళ్లరేవు మండలం), యలమంచిలి పార్వతి (దేవగుప్తం, అల్లవరం మండలం), గుబ్బల శ్రీలక్ష్మి (రావులపాలెం), ఇనగల శిరీష (కోరుకొండ), కోడి బేబీ (నిడదవోలు శివారు సుబ్బరాజుపేట) తదితరులున్నారు. కేరళకు అధికారుల బృందం ఏజెంట్ల మోసాలు, నకిలీ వీసాలు, మహిళల అరెస్టు తదితర అంశాలపై కలెక్టర్, ఎస్పీ చర్చించుకుని, కేరళలో అరెస్టయిన మహిళలను విడిపించేందుకు చర్యలు చేపట్టారు. కేరళ రాష్ట్రం ఎర్నాకుళం జిల్లా ఎస్పీతో కోనసీమ జిల్లా ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి ఫోనులో మాట్లాడారు. నకిలీ వీసాల విషయమై కొన్ని కేసులు నమోదైనట్టు ఎర్నాకుళం ఎస్పీ బదులిచ్చారు. అక్కడి జైళ్లలో చిక్కుకున్న జిల్లా మహిళలను విడిపించేందుకు కోనసీమ నుంచి ఒక పోలీసు అధికారి, ఒక ఐసీడీఎస్ అధికారితో కూడిన బృందాన్ని కేరళకు ఎస్పీ పంపించారు. నిలువునా మోసపోయాం నకిలీ వీసాలతో ఏజెంటు రాంబాబు, హైదరాబాద్‌లో రాజు అనే వ్యక్తుల చేతిలో తాము నిలువునా మోసపోయామని రావులపాలేనికి చెందిన బాధిత మహిళ శ్రీలక్ష్మి వాపోయింది. కలెక్టరేట్ వద్ద ఆమె విలేకర్లతో తన గోడు వెళ్లబోసుకుంది. కొచ్చి ఎయిర్‌పోర్టులో అరెస్టయిన 30 మంది మహిళల్లో శ్రీలక్ష్మి ఒకరు. అక్కడ జైలులో ఉండగా శ్రీలక్ష్మి భర్త చనిపోయాడు. హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ బెయిల్ ఇప్పించి, విడిపించడంతో ఆమె స్వగ్రామం రావులపాలెం చేరుకుంది. కొచ్చి జైలులో తాను రెండు వారాలు ఉన్నానని.. డబ్బులు లేక.. సరైన తిండి, నిద్ర లేక నరకం చూశామని ఆవేదన వ్యక్తం చేసింది. అక్కడ పడిన అవçస్థలను హ్యూమన్ రైట్స్ మహిళా ప్రతినిధులతో కలిసి కలెక్టర్‌కు శ్రీలక్ష్మి వివరించింది. ఐదుగురికి బెయిల్ ఇప్పించాం కొచ్చి విమానాశ్రయంలో నకిలీ వీసాలతో పట్టుబడి అరెస్టయిన 30 మంది మహిళల్లో ఐదుగురికి బెయిల్ మంజూరయ్యేలా మా హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ మహిళా విభాగం కృషి చేసింది. బెయిలో పొందిన వారిలో శ్రీలక్ష్మి (రావులపాలెం), పార్వతి (అల్లవరం మండలం దేవగుప్తం), జానకి (రామచంద్రపురం), మంగాదేవి (యానాం), సౌజన్య (ఏలూరు) ఉన్నారు. ఇంకా కొంత మంది మహిళలు కేరళ రాష్ట్ర జైలులో ఉన్నట్లు మాకు సమాచారం వచ్చింది. – నల్లబోతుల భవాని, ఏపీ రాష్ట్ర వైస్ చైర్మన్, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ వుమెన్ సెల్, రాజమహేంద్రవరం ఏజెంట్లపై చర్యలు గల్ఫ్‌లో ఉపాధి పేరుతో మహిళలను మోసగిస్తున్న ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకుంటాం. కేరళలో నకిలీ వీసాలతో అరెస్టయిన జిల్లా మహిళలున్నారన్న ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నాం. అక్కడ జిల్లా మహిళలు ముగ్గురు మాత్రమే ఉన్నారని తెలిసింది. వీరిలో ఒకరు బెయిల్‌పై వచ్చారు. మిగిలిన ఇద్దరినీ విడిపించేందుకు అక్కడికి ప్రత్యేక బృందాన్ని పంపించాం. – సీహెచ్ సుధీర్‌కుమార్‌రెడ్డి, జిల్లా ఎస్పీ -
వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందాల పరిశీలన
చింతూరు/పోలవరం రూరల్: ఇటీవల గోదావరి వరదలతో ప్రభావితమైన ప్రాంతాల్లో బుధవారం కేంద్రబృందాలు పర్యటించాయి. నష్టాలను పరిశీలించాయి. రవినేష్‌కుమార్, మురుగానందం సభ్యులుగా ఉన్న బృందం అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం, చింతూరు మండలాల్లోను, కె.మనోహరన్, పి.దేవేందర్, అరవింద్‌కుమార్ సోని సభ్యులుగా ఉన్న బృందం ఏలూరు జిల్లా పోలవరం గ్రామంలోను పర్యటించాయి. ఆయా జిల్లాల కలెక్టర్లు సుమిత్‌కుమార్, ప్రసన్నవెంకటేష్ వరద నష్టాలను ఆయా బృందాల సభ్యులకు వివరించారు. బృందం సభ్యులు వరదలకు కూలిన ఇళ్లను పరిశీలించి బాధితులతో మాట్లాడారు. అలాగే ఏలూరు జిల్లా పోలవరం గ్రామంలోని నెక్లెస్‌బండ్ కోతకు గురైన ప్రాంతాన్ని, యడ్లగూడెం ప్రాంతంలో నెక్లెస్‌బండ్‌ను వారు పరిశీలించారు. -
పర్ర భూములను చెరబడుతున్న ఆక్వా చెరువులు
సాక్షి, అమలాపురం(కోనసీమ జిల్లా): వేలాది ఎకరాల పంట భూముల నుంచి ముంపు నీరు, ఇతర డ్రెయిన్ల నీరు దిగడానికి సముద్రపు మొగలు ఎంతో అవసరం. సరిగ్గా ఇక్కడే సహజసిద్ధంగా ఏర్పడిన పర్ర భూములను కొంతమంది స్వార్థపరులు కబ్జా చేసి, అక్రమంగా ఆక్వా చెరువులు ఏర్పాటు చేయడంతో మొగలు పూడుకుపోతున్నాయి. ఫలితంగా ఏటా వేలాది ఎకరాల్లో పంటలు ముంపు బారిన పడి, కోనసీమ రైతులు భారీగా నష్టపోతున్నారు. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్‌జెడ్), మద్రాస్ కన్జర్వెన్స్ యాక్టులను తోసిరాజని మరీ పర్ర భూముల్లో ఆక్వా చెరువులు తవ్వేస్తున్నా.. వేలాది ఎకరాల వరి ఆయకట్టు ముంపునకు కారణమవుతున్నా పట్టించుకునే వారే లేకుండా పోయారు. కొల్లేరు ఆపరేషన్ తరహాలో అక్రమ చెరువులను ధ్వంసం చేసి, రెగ్యులేటర్లు నిర్మిస్తేనే ఇక్కడ ముంపు సమస్యకు మోక్షం కలుగుతుందని ఇరిగేషన్ నిపుణులు, రైతులు చెబుతున్నారు. పులికాట్, కొల్లేరు తరహాలోనే కోనసీమలోని కాట్రేనికోన మండలం వృద్ధ గౌతమి నదీపాయ నుంచి అల్లవరం మండలం వైనతేయ నదీపాయ వరకూ సుమారు 6 వేల ఎకరాల్లో పర్ర భూములున్నాయి. మధ్య డెల్టాలో 1.72 లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతోంది. రామేశ్వరం, కూనవరం మొగల ద్వారా సుమారు 65 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో 45 వేల ఎకరాలు వరి ఆయకట్టు ఉంది. మిగిలింది ఆక్వా చెరువులుగా మారిపోయింది. మొత్తం 45 వేల ఎకరాల ఆయకట్టు ముంపు నీరు ఈ మొగల ద్వారానే దిగాల్సి ఉంది. అయితే మొగలు పూడుకుపోవడం, వీటిని తెరచినా ముంపునీరు దిగకపోవడంతో రైతులు ఏటా రూ.60 కోట్ల మేర పంటలు నష్టపోతున్నారని అంచనా. పర్ర భూముల కబ్జా మొగల ద్వారా నేరుగా సముద్రంలోకి నీరు దిగే అవకాశం తక్కువ. భారీ వర్షాల సమయంలో ముంపునీరు రామేశ్వరం, కూనవరం డ్రెయిన్ల నుంచి పర్ర భూముల్లోకి వెళ్లేది. కూనవరం డ్రెయిన్ నీరు చిర్రయానం పర్ర భూమి ద్వారా వెళ్లి పల్లం, నీళ్లరేవు, ఏటిమొగ వద్ద సముద్రంలోకి వెళ్లేది. దీనివల్ల భారీ వర్షాల సమయంలో చేలు ముంపు బారిన పడినా రెండు మూడు రోజుల్లోనే నీరు తీసేది. కొన్నేళ్లుగా పర్ర భూముల్లో పెద్ద ఎత్తున ఆక్వా చెరువులు ఏర్పాటయ్యాయి. రామేశ్వరం పర్ర భూముల్లో 480 ఎకరాలు, ఎస్.యానాం, చిర్రయానాం పర్ర భూముల్లో సుమారు 1,650 ఎకరాల విస్తీర్ణంలో అక్రమ ఆక్వా సాగు జరుగుతున్నట్టు అంచనా. సుమారు 2,130 ఎకరాల భూమి కబ్జాల బారిన పడటంతో డ్రెయిన్ల ద్వారా వస్తున్న ముంపునీరు పర్ర భూముల్లోకి వెళ్లే సామర్థ్యం పడిపోయింది. ఆక్వా చెరువుల వల్ల ముంపునీరు పర్రభూముల ద్వారా కాకుండా మొగల ద్వారానే సముద్రంలో కలవాల్సి వస్తోంది. ఇసుక మేటలు వేయడంతో మొగల వెడల్పు కుదించుకుపోతోంది. కూనవరం స్ట్రెయిట్ కట్ ద్వారా 25 క్యూమిక్స్ (క్యూబిక్ మీటర్ పర్ సెకన్) నీరు సముద్రంలోకి దిగాల్సి ఉండగా, మొగ తెరచిన తరువాత కూడా 10 క్యూమిక్స్ కూడా దిగడం లేదు. కొల్లేరు తరహాలోనే.. పూర్వపు పశ్చిమ, కృష్ణా జిల్లాల సరిహద్దులో ఉన్న కొల్లేరు సరస్సులో కబ్జాలు చేసి, ఏర్పాటు చేసిన ఆక్వా చెరువులను నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ధ్వంసం చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో అక్కడ రూ.412 కోట్లతో మూడుచోట్ల రెగ్యులేటర్లు నియమిస్తున్నారు. ఇదేవిధంగా పర్ర భూముల్లోని ఆక్రమణలను సైతం తొలగించాలని ఇక్కడి రైతులు కోరుతున్నారు. మొగల పరిస్థితిపై గతంలో కూనా ఓషనోగ్రఫీ, ఉస్మానియా ఓషనోగ్రఫీ విభాగాలు సర్వేలు చేశాయి. డ్రెయిన్ నుంచి మొగ దాటుకుని సముద్రంలోకి 200 మీటర్ల మేర లాంగ్ రివిట్మెంట్లు నిర్మించాలని సూచించాయి. వీటికి ఆటోమెటిక్ రెగ్యులేటర్లు నిర్మించాలని సిఫారసు చేశాయి. డ్రెయిన్‌లో నీరు ఎక్కువగా ఉన్నప్పుడు తెరచుకునేలా.. సముద్రం పోటు సమయంలో మూసుకుపోయేలా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ప్రకారం రెగ్యులేటర్లు నిర్మించాలని రైతులు కోరుతున్నారు. అనధికార చెరువులపై చర్యలు పర్ర భూముల్లో అనధికారికంగా ఆక్వా చెరువులు సాగు చేస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. అలాగే పంచనదిని ఆనుకుని కూడా చెరువులున్నాయి. వీటిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. – ఆర్.నాగార్జున,డీఈఈ, డ్రెయిన్ అమలాపురం మొగల స్వరూపమిదీ.. కూనవరం ప్రధాన మురుగు కాలువ ద్వారా ఉప్పలగుప్తం, కాట్రేనికోన, ముమ్మిడివరం, అమలాపురం మండలాల్లోని సుమారు 35 వేల ఎకరాల్లోని ముంపునీరు దిగాల్సి ఉంది. రంగరాజు, ఓల్డ్ సమనస, అయినాపురం, గొరగనమూడి మీడియం డ్రెయిన్ల నీరు కూడా దీని ద్వారానే వస్తోంది. 1996 తుపాను సమయంలో దీనికి గండి పడింది. తరువాత ఏప్రిల్ నుంచి జూలై వరకూ పూడుకుపోయి, మిగిలిన సమయంలో అప్పుడప్పుడు కొద్దిమేర తెరచుకుంటోంది. అల్లవరం మండలం రామేశ్వరం మొగ ద్వారా వాసాలతిప్ప, పంచనది డ్రెయిన్ల నుంచి వస్తున్న ముంపునీరు దిగుతోంది. అమలాపురం, ఉప్పలగుప్తం, అల్లవరం మండలాలకు చెందిన సుమారు 25 వేల ఎకరాల్లోని ముంపునీరు దీని ద్వారా దిగాల్సి ఉంది. ముంపునీరు రామేశ్వరం మొగ వద్దకు వచ్చి ఇక్కడున్న పర్ర భూమిలోకి చేరుతోంది. అక్కడి నుంచి కిలోమీటరు ప్రవహించి సముద్రంలో కలుస్తోంది. (క్లిక్: పంట కాలువను కబ్జా చేసిన అయ్యన్న) -
ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో మెరిసిన మన్యం బిడ్డ
పచ్చని కొండ కోనల్లో.. అమాయకంగా జీవించే ఆదివాసీల బిడ్డ ఘనత సాధించింది. కట్టెలమ్ముకునే ఇంట పుట్టిన ఆమె.. జాతీయ వేదికపై పసిడి పతకంతో మెరిసింది. అంతులేని ఆత్మవిశ్వాసంతో ఖేలో ఇండియా యూత్‌గేమ్స్‌లో పాల్గొని.. బంగారు పతకాన్ని సాధించింది. తనతోటి ఆదివాసీ బిడ్డలకు స్ఫూర్తిదాయకంగా నిలిచి.. అల్లూరి జిల్లా మన్యాన్ని మురిపించింది. ఆమే కుంజా రజిత. – కూనవరం(రంపచోడవరం) కారడవిలో కుగ్రామం కూనవరం మండలం పోచవరం పంచాయతీ పరిధిలోని దట్టమైన అడవిలో ఉన్న కుగ్రామం రామచంద్రాపురం. రజిత స్వగ్రామం. 35 ఏళ్ల కిందట పొరుగున ఉన్న చత్తీస్‌గఢ్ నుంచి రజిత తండ్రి మారయ్య కుటుంబం ఇక్కడకు వలస వచ్చింది. రెక్కాడితేగాని డొక్కాడని దయనీయ స్థితి మారయ్య కుటుంబానిది. కుంజా మారయ్య, భద్రమ్మ దంపతులకు ఐదుగురు సంతానం. ముగ్గురు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు. చివరి సంతానమే కుంజా రజిత. భర్త చనిపోయాక కుటుంబ భారం భద్రమ్మ పైనే పడింది. అడవికెళ్లి కట్టెలు మోపు తెచ్చుకొని అమ్ముకోవడం ద్వారా కుటుంబాన్ని పోషించుకునేది. రజిత ప్రతి రోజూ 12 కిలోమీటర్లు దూరం కాలిబాటన చింతూరు మండలం కాటుకపల్లి వెళ్లి లీడ్స్ పాఠశాలలో చదువుకోవడం.. తిరిగి 12 కిలోమీటర్లు నడిచి ఇంటికి చేరుకునేది. అలా ఒకటి నుంచి 8 వరకు అక్కడే చదివింది. సెలవుల్లో తల్లి వెంట కట్టెలకు వెళ్లి చేదోడుగా ఉండేది. చిన్నప్పటి నుంచి పరుగు పందాలంటే రజితకు భలే ఇష్టం. పరుగులో రజితలోని వేగాన్ని ఆమె పెద్దన్న జోగయ్య గమనించాడు. స్థానిక పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహించాడు. పతకాల పంట 2019 అసోంలో నిర్వహించిన జాతీయ ఖేలిండియా అథ్లెటిక్స్ పోటీల్లో 400 మీటర్ల పరుగు విభాగంలో ప్రత్యేక ప్రతిభ కనబరిచి వెండి పతకం సాధించింది. ఇటీవల గుజరాత్లో జరిగిన జాతీయ ఖేలో ఇండియా అథ్లెటిక్ పోటీలో కాంస్యం గెలుపొందింది. జాతీయ ఓపెన్ 400 మీటర్ల అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణంతో మెరిసింది. హర్యానాలో మంగళవారం జరిగిన జాతీయ ఖేలో ఇండియా అథ్లెటిక్ పోటీల్లో అండర్–20 విభాగంలో 400 మీటర్ల పరుగు పోటీల్లో విశేష ప్రతిభ కనబరిచింది. రజిత 56.07 సెకన్లలో గమ్యాన్ని చేరి బంగారు పతకం దక్కించుకుంది. ఆగని పరుగు కాటుకపల్లి పాఠశాలలో 8వ తరగతి వరకే ఉండేది. అనంతరం నెల్లూరు ఆశ్రమ పాఠశాలలో సీటు రావడంతో రజిత 9, 10 అక్కడే పూర్తి చేసింది. ఆ సమయంలో పరుగులో శిక్షణకు బీజపడింది. నెల్లూరు సుబ్బారెడ్డి స్టేడియంలో వంశీసాయి కిరణ్ ఆధ్వర్యంలో ఆమె శిక్షణ పొందింది. మంగళగిరిలో ఇంటర్మీయట్ చదువుతూ గుంటూరు శాప్ ద్వారా గురువులు కృష్ణ మోహన్, మైకే రసూల్ వద్ద అథ్లెటిక్స్ శిక్షణ తీసుకుంది. ఓ పక్క చదువు, సాధన చేస్తూనే పోటీల్లో పాల్గొనేది. అక్కడే తన ఆటలోని బలాలు, బలహీనతలు తెలుసుకుని మరింత రాటుదేలింది. అంతర్జాతీయ స్థాయికి చేరాలంటే అత్యుత్తమ శిక్షణ అవసరమని భావించి.. ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగుబండి రమేష్‌ను సంప్రదించింది. ఆయన శిక్షణ ఇవ్వడానికి అంగీకరించారు. ఆమె పరిస్థితిని గమనించిన ఆయన పుల్లెల గోపీచంద్ ఆధ్వర్యంలోని మైత్రీ ఫౌండేషన్‌కు దృష్టికి తీసుకెళ్లారు. వారు ఫిజియోథెరపీ, అవసరమైన దుస్తులు, బూట్లు వంటివన్నీ అందిస్తున్నారు. ఆమె ఆటతీరు, కుటుంబ పరిస్థితి గమనించిన లెక్కల మాస్టార్ నాగేంద్ర ప్రతి నెలా కొంత మొత్తం అందజేస్తున్నారు. -
కోడి కూరతో అన్నం పెట్టమన్నాడు.. ఆ మాటకు గొడ్డలితో నరికేశాడు
కూనవరం (తూర్పుగోదావరి): కోడి కూర వండలేదని చెల్లెలిని హతమార్చాడో అన్న కూనవరం మండలం కన్నాపురంలో గురువారం రాత్రి ఈ ఘోరం జరిగింది. ఎస్సై వెంకటేష్ కథనం ప్రకారం.. కన్నాపురానికి కొవ్వాసి నందా కూలి పనులు చేసుకొని కుటుంబాన్ని పోషించుకుంటాడు. అతడి సోదరి సోమమ్మ(20)ను చాన్నాళ్ల క్రితం మరొకరికి దత్తత ఇచ్చారు. వారం రోజుల క్రితం ఆమె తన అన్న నందా ఇంటికి వచ్చింది. కోడి కూర వండాలని సోదరికి చెప్పి గురువారం నందా బయటకు వెళ్లాడు. మద్యం తాగి అర్ధరాత్రి ఇంటికి వచ్చి, కోడి కూరతో అన్నం పెట్టాలని చెల్లెలికి చెప్పాడు. కోడి కూర వండలేదని ఆమె చెప్పడంతో కోపోద్రిక్తుడై బయటకు వెళ్లిపోయాడు. తెల్లవారుజామున వచ్చి మళ్లీ ఆమెతో గొడవ పడ్డాడు. అక్కడే ఉన్న గొడ్డలితో ఆమెను నరికేశాడు. సంఘటన స్థలంలోనే సోమమ్మ మృతి చెందింది. ఎటపాక సీఐ గజేంద్రకుమార్ సంఘటన స్థలాన్ని సందర్శించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు నందా పరారీలో ఉన్నాడు. చదవండి: (లక్షలాది రూపాయలు వడ్డీకిచ్చి.. మనోవేదనతో) -
ఊహించని అద్భుతం: తల్లి దక్కదు, బిడ్డనైనా సేవ్ చేద్దామనుకున్నారు..
కూనవరం (తూర్పుగోదావరి): తల్లి దక్కదు, బిడ్డనైనా సేవ్ చేద్దామంటూ ముందుకు వచ్చిన వైద్య బృందానికి ఊహించని అద్భుతం తారసపడంతో వారి ఆనందానికి అవధులు లేవు. తెలంగాణ రాష్ట్రం భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో మంగళవారం జరిగిన అరుదైన ఈ ఘటన ఆస్పత్రి చరిత్రలోనే లిఖించదగినదిగా పలువురు ప్రసంశిస్తున్నారు. వివరాల్లోకి వెళ్లితే కూనవరం మండలం టేకులబోరు గ్రామానికి చెందిన జోడె నాగమణి నిండు గర్భిణి. వచ్చే నెల 4వ తేదీన ఆమెకు కాన్పు కావలసి ఉంది. ప్రస్తుతం బీపీకి మందులు వాడుతోంది. దానికితోడు ఆయాసం ఎక్కువైంది. నొప్పులు రావడంతో కూనవరం మండలం కోతులగుట్ట సీహెచ్‌సీకి వెళ్లింది. చదవండి: (అనారోగ్యంతో సినీ నటుడు శ్రీను మృతి) అక్కడ పరీక్షలు నిర్వహించిన వైద్యులు పరిస్థితి చాలా సీరియస్‌గా ఉందని గ్రహించి భద్రాచలం ఏరియా ఆస్పత్రికి రిఫర్ చేస్తూ ఆ విషయాన్ని కోతులగుట్ట సీహెచ్‌సీ సూపరింటెండెంట్ డాక్టర్ కోటిరెడ్డికి సమాచారం ఇచ్చారు. డాక్టర్ కోటిరెడ్డి ఈ విషయాన్ని చింతూరు ఐటీడీఏ పీఓ ఆకుల వెంకటరమణకు, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ పుల్లయ్యకు చేరవేశారు. అప్పటికే నాగమణి కోమాలోకి వెళ్లింది. భద్రాచలం ఏరియా ఆస్పత్రి వైద్యులు ఎంత ప్రయత్నించినా ఆమెలో చలనం కనిపించలేదు. మృత్యువు ఒడిలోకి జారుకున్న ఆ మహిళను చూసి మదనపడుతున్న వైద్యుల వద్దకు డాక్టర్ కోటిరెడ్డి, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ పుల్లయ్య వెళ్లి కనీసం కడుపులో ఉన్న బిడ్డనైనా సేవ్ చేయాలని భద్రాచలం ఏరియా ఆస్పత్రి సూపరిం టెండెంట్ రామకృష్ణను కోరారు. చదవండి: (ఒకే కూర.. ఒకే స్వీటు.. మత పెద్దల సంచలన నిర్ణయం) గర్భిణి సోదరుడు జోడె నాగేశ్వరరావు, భర్త సత్యనారాయణకు పరిస్థితి వివరించి అంగీకరింపజేశారు. డాక్టర్ రామకృష్ణ ఆధ్వర్యంలో గైనకాలజిస్ట్ నరసయ్య, ఎనస్తీషియన్ కిషన్, ఐసీయూ సిబ్బంది, ఆస్పత్రి సిబ్బంది బృందంగా ఏర్పడి ఆపరేషన్ చేసి మగబిడ్డను బయటకు తీశారు. అనంతరం కొద్దిసేపటికి తల్లిలో కూడా కదలికలు గమనించిన వైద్యులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ అద్భుతం చూసిన వైద్యులు ఆమెకు వెంటనే వైద్య సేవలు ప్రారంభించారు. ప్రస్తుతం తల్లీబిడ్డా క్షేమం. ప్రస్తుతం భద్రాచలం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. భద్రాచలం ఏరియా ఆస్పత్రిలోనే ఇది అరుదైన సంఘటన అని అక్కడి సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణ అన్నారు. వైద్యబృందం కృషిని ఐటీడీఏ పీఓ ఆకుల వెంకటరమణ మెచ్చుకున్నారు. -
జర్నలిస్టుల వెల్ఫేర్ స్కీమ్ ఏర్పాటుకు కృషి
కూనవరం: జర్నలిస్టులకు వెల్ఫేర్ స్కీమ్ ఏర్పాటు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చేస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా వీఆర్ పురం మండలం శ్రీరామగిరిలోని సుందర సీతారామచంద్రస్వామి ఆలయాన్ని కుటుంబ సమేతంగా దర్శించుకునేందుకు వెళ్తూ.. కూనవరం ప్రెస్‌క్లబ్‌లో ఆయన నిన్న (ఆదివారం) విలేకరులతో మాట్లాడారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందన్నారు. జర్నలిస్టుల వృత్తి నైపుణ్యం పెంచేందుకు త్వరలోనే శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. గత 20 ఏళ్ల నుంచి వివిధ పత్రికల్లో పని చేస్తున్నప్పటికీ గిరిజన చట్టాల మూలంగా తమకు ఇంటి స్థలాలు మంజూరు కావడం లేదని ఏజెన్సీ ప్రాంత విలేకరులు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని, ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్రూమ్ల నిర్మాణంపై సంబంధిత అధికారులతో చర్చించి, పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు. కూనవరం పాత్రికేయులు శ్రీనాథ్‌ను సత్కరించారు. -
ఆరిన దీపం
అగ్నిప్రమాదంలో అన్నదమ్ములకు తీవ్ర గాయాలు అన్నయ్య మృతి.. చికిత్స పొందుతున్న తమ్ముడు ఫ్యాన్సీ షాపు గోడౌ¯ŒSలో సంఘటన దీపావళి రోజున కూనవరంలో విషాదం ఎటుచూసినా దీపావళి సందడి. చిన్నాపెద్దా రాత్రి బాణసంచా కాల్చేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. పండగ ఆనందాన్ని అమ్మమ్మ, తాతయ్యతో పంచుకోవాలని అమ్మతో కలిసి ఆ చిన్నారి అన్నదమ్ములు ఊరొచ్చారు. ఆటల్లో మునిగి ఉన్న ఆ చిన్నారులను మంటలు కబళించాయి. అభంశుభం ఎరుగని ఆ పిల్లలు తీవ్ర గాయాల పాలయ్యారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ అన్నయ్య సోమవారం తెల్లవారుజామున చనిపోయాడు. – ఉప్పలగుప్తం ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లి గ్రామానికి చెందిన వాలా సత్యనారాయణమూర్తి(సత్తిబాబు) చిరు వ్యాపారి. గ్రామంలోనే ఫ్యాన్సీ వ్యాపారం నిర్వహిస్తున్నారు. అతడికి భార్య దుర్గ, కుమారులు తారక రామప్రసాద్ (సాయి)(7), వీరవెంకట దామోదర నాయుడు (వీరేంద్ర)(5) ఉన్నారు. ప్రైవేట్ కాన్వెంట్లో సాయి రెండో తరగతి చదువుతుండగా, వీరేంద్రను కొంతకాలం క్రితం ఒకటో తరగతిలో చేర్పించారు. తండ్రి సత్తిబాబు ఇటీవల అయ్యప్ప మాలధారణ చేశారు. దీపావళి సందర్భంగా పాఠశాలకు సెలవు కావడంతో తల్లి దుర్గతో కలిసి సాయి, వీరేంద్ర అమ్మమ్మ ఊరైన ఉప్పలగుప్తం మండలం కూనవరం వెళ్లారు. కూనవరంలో తాతయ్య సుందరనీడి సుబ్బారావు ఫ్యాన్సీ వ్యాపారం చేస్తున్నారు. ఇంటి ముందు భాగంలో షాపు నిర్వహిస్తూ, ఇంటిలోనే ఓ గదిలో గోడౌ¯ŒS ఏర్పాటు చేసుకున్నారు. అందులో ఎలక్ట్రికల్ వస్తువులు, పెయింట్లు, ఇతర జనరల్ సామగ్రి ఉన్నాయి. షార్ట్సరŠూక్యట్తో.. ఇలాఉండగా ఆదివారం ఉదయం 10.30 సమయంలో సరకు నిల్వ ఉన్న గదిలో షార్ట్‌సర్క్యూట్ సంభవించింది. గదిలో నిల్వ ఉన్న సామగ్రికి మంటలు వ్యాపించాయి. అదే గదిలో ఆడుకుంటున్న సాయి, వీరేంద్ర మంటల్లో చిక్కుకుని, తీవ్రంగా గాయపడ్డారు. సంఘటన స్థలానికి చేరుకున్న అమలాపురం అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు మంటలను అదుపుచేశారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్నారులను అమలాపురంలోని ఓ ప్రెవేట్ ఆస్పత్రికి తరలించారు. డిప్యూటీ సీఎం సందర్శన సంఘటన స్థలాన్ని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, ఎమ్మె ల్యే అయితాబత్తుల ఆనందరావు పరిశీలించారు. మెరుగైన వైద్యం కోసం చిన్నారులను కాకినాడకు తరలించాలని చినరాజప్ప ఆదేశించారు. పిల్లలను కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున సాయి మరణించాడు. అతడి త మ్ముడు వీరేంద్రను జీజీహెచ్ నుంచి కాకినాడలోని ప్రెవేట్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతున్నాడు. తాత సుబ్బారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై ఆర్.భీమరాజు తెలిపారు. సంఘటన స్థలాన్ని తహసీల్దార్ వి.సత్యవతి, ఎంఆర్ఐ వినాయక వర్మ సందర్శించారు. ‘మా ఇంటి దీపం ఆరింది’ ‘దీపావళి పండగ నాడు మా ఇంటి దీపం ఆరిపోయింది’ అంటూ సాయి తల్లి దుర్గ రోదించిన తీరు చూపరులను కం టతడి పెట్టించింది. కాలిన గాయాలతో చికిత్స పొందు తూ, మరణించిన సాయిని చూసి ఆమె తల్లడిల్లిపోయింది. ‘నా కుమారుడిని బతికించాలంటూ ప్రాథేయపడిన ఆమె ను సముదాయించడం బంధువులకు కష్టమైంది. సమాచారం అందుకున్న వెంటనే అయ్యప్ప మాలలో ఉన్న సత్తిబాబు హుటాహుటిన ఇక్కడకు చేరుకున్నాడు. అల్లారుముద్దుగా పెంచిన కుమారులు సాయి, వీరేంద్ర ఇలా ప్రమా దం బారిన పడడాన్ని సత్తిబాబు, దుర్గ జీర్ణించుకోలేక పోతున్నారు. -
పదో తరగతి తెలుగు పశ్నాపత్రం లీక్?
కూనవరం (తూర్పు గోదావరి జిల్లా) : కూనవరంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ పరీక్ష కేంద్రం-ఎలో సోమవారం పదవ తరగతి తెలుగు పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం లీక్ అయింది. ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా ప్రశ్నాపత్రం 10.23 గంటలకు వాట్సప్ లో హల్చల్ చేసింది. ప్రశ్నలు తెలిసిపోవడంతో పరీక్షా కేంద్రం బయట ఉన్న కొందరు సంబంధించిన జవాబులను పుస్తకాల నుంచి సేకరించబోయారు. ఇంతలో విలేకరులు అక్కడకు చేరుకోగా కంగారుగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ హడావుడిలో ఓ వ్యక్తి వదిలి వెళ్లిన సెల్‌ఫోన్‌ను పరిశీలించగా ప్రశ్నాప్రత్రం వాట్సప్ ద్వారా వెల్లడైన వైనం బయటపడింది. ఈ విషయం చానళ్లలో ప్రసారం కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఏజెన్సీ ఇన్చార్జి డీఈఓ టీవీఎస్‌జీ కుమార్ మధ్యాహ్నం 3 గంటల అనంతరం పరీక్షా కేంద్రాన్ని సందర్శించి విచారణ చేపట్టారు. కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ అందుబాటులో లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. ప్రశ్నాపత్రం లీకవడంపై డిపార్ట్మెంటల్ ఆఫీసర్ బాబూరావు, సిట్టింగ్ స్క్వాడ్ సీతారాములు, ఇన్విజిలేటర్లను విచారించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రశ్నాపత్రం వాట్సప్ ద్వారా వెల్లడైన విషయమై సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తున్నామని, నివేదికను కలెక్టర్‌కు అందచేస్తామని తెలిపారు. -
డెంగ్యూతో వ్యక్తి మృతి
కూనవరం (తూర్పుగోదావరి) : డెంగ్యూతో వ్యక్తి మృతిచెందిన సంఘటన విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మంగళవారం చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా భద్రాచలంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వారం రోజులుగా ఎరకం శరమయ్య(40) అనే వ్యక్తి చికిత్స పొందుతున్నాడు. అక్కడి వైద్యుల సూచన మేరకు రోగిని విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి సోమవారం తరలించారు. చికిత్స పొందుతూ శరమయ్య మంగళవారం మృతిచెందారు. శరమయ్య సొంతూరు కూనవరం మండలం బోదునూరు గ్రామం. -
మతిస్థిమితం లేని మహిళపై లైంగిక దాడి
కూనవరం : మతిస్థిమితం లేని మహిళపై ఓ ప్రబుద్ధుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన మండలంలోని వెంకటాయపాలెంలో మంగళవారం జరిగింది. ఎస్సై రాజేష్ కథనం ప్రకారం.. వెంకటాయపాలెం గ్రామానికి చెందిన బేతి శ్రీను అదే గ్రామానికి చెందిన మతిస్థిమితం లేని మహిళ ఇంట్లో ఒంటరిగా ఉండగా.. లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ మహిళ సోదరి ఫిర్యాదు మేరకు నిర్భయ కేసు నమోదు చేశామని, నిందితుని బుధవారం రిమాండ్‌కు పంపనున్నామని ఎస్సై తెలిపారు. -
వరద బాధితుల ఆక్రందన
కూనవరం,న్యూస్‌లైన్: వరద బాధితులతో ఆక్రందనలతో మండల కేంద్రమైన కూనవరం మిన్నంటుతోంది. అర్హులకు పరిహారం ఎందుకు మంజూరు చేయలేదంటూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. వరద పట్టనివారికి పరిహారం ఇచ్చి, మూడుసార్లు ముంపుకు గురైనవారికి మొండిచేయిచూపిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరదభాదితులు శుక్రవారం తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. అనంతరం ఆర్అండ్బీ రోడ్డుపైకివచ్చి సుమారు గంటపాటు రాస్తారోకో నిర్వహించారు. వాహనాలు నిలిచిపోయి రాకపోకలు స్తంభించడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.తహశీల్దార్ కమల, వీఆర్‌పురం ఎస్సై శ్రీధర్ ఆందోళన వద్దకు వచ్చి అర్హుల గుర్తింపునకు రీ సర్వే నిర్వహిస్తామని హామీ ఇవ్వడంతో బాధితులు ఆందోళన విరమించారు. సర్వేలో అవకతవకలు మండల కేంద్రంలో వరద బాధితులు ఐదు రోజుల నుంచి ఆందోళనలు చేస్తున్నారు. సర్వేలో అవకతవకలు చోటుచేసుకోకపోవడంత వరదముంపు బాధితులకు తీవ్ర అన్యాయం జరిగింది. ఎన్యూమరేషన్ సర్వే సమయంలోనే రెవెన్యూధికారులు లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. వరదపట్టని ప్రదేశాలకు చెందిన కొందరు ఎన్యూమరేషన్ జాబితాలో తమపేర్లు చేర్చినట్లైతే పరిహారం మంజూరయ్యాక చెరిసగం పంచుకుందామంటూ ఒప్పందం చేసుకున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఇళ్ళసర్వేకి వచ్చిన రెవెన్యూ సిబ్బంది రాత్రి సమయంలో తహశీల్దార్ కార్యాలయంలో బస చేసినప్పుడు వారికి స్థానిక సిబ్బంది తోడై ఈ తతంగం నడిపినట్లు తెలుస్తోంది. ఇలాంటివి సమర్థించుకునేందుకు సదరు అధికారులు పక్కాభవనాలకు, దుకాణాలకు, రెండుమూడు పోర్షన్‌ల్లో ఉన్నవారికి నష్టపరిహారం రాదని చెబుతున్నారు. అయితే ఇటీవల పంపిణీ చేసిన వరద నష్టపరిహారం చెక్కుల్లో పూరిగుడిసెల్లో వారికంటే పైన పేర్కొన్నవారే అధికంగా ఉండటం గమనార్హం. వాస్తవానికి గత ఆగస్టులో సంభవించిన గోదావరి వరదలు మూడో ప్రమాదస్థాయి హెచ్చరికలు దాటిప్రవహించింది. తద్వారా మండలంలో మూడువంతులు పైగాగ్రామాలు వరద ముంపునకు గురయ్యాయి. ఉదయభాస్కర్ కాలనీలో పక్కాగృహాలు సైతం కుప్పకూలాయి. పూరిళ్ల సంగతి చెప్పనక్కర లేదు. మండలవ్యాప్తంగా సుమారు 2000 ఇళ్లకుపైగా వరదలకు దెబ్బతిన్నాయి. సదరు అధికారులు నెలరోజుల తరువాత సర్వే నిర్వహించి కేవలం 599 ఇళ్లు మాత్రమే వరద తాకిడికి దెబ్బతిన్నట్లు తేల్చారు. టేకుబాకలో ఒకే ఒక ఇల్లు వరద ముంపునకు గురైనట్లు గుర్తించారు. అధికారులు నిర్లక్ష్యం వీడి రీ సర్వే చేసి అర్హులకు పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. మొదట మునిగేది మా ఇల్లే .. వరదొస్తే మొదట మునిగేది మా ఇల్లే. ఆ సమయంలో రెవెన్యూ అధికారులు మా ఇంటి ముందు నుంచే లాంచీ ఎక్కి అటూ ఇటూ తిరుగుతారు. ఇల్లంతా మునిగిపోయి, పై నుంచి లాంచీలు తిరిగినా నాకు నష్టపరిహారం ఇవ్వలేదు . - దగ్గుబల్లి భద్రమ్మ, కూనవరం మధ్యనున్న ఇల్లు మునగలేదంట మాంటి ముందు, వెనుక, పక్కనున్న ఇళ్లకు పరిహారం వచ్చింది. మధ్యనున్న నా ఇల్లు ముంపుకు గురికాలేదట. అధికారుల సర్వేలో అన్నీ అవకతవకలే. ఇదీ రెవెన్యూ అధికారుల నిర్వాకం. - నాసుపల్లి రాజమ్మ, కూనవరం మూడు సార్లు మునిగినా పరిహారం ఇవ్వలేదు కొద్దిపాటి వ రద వచ్చినా మొదట మునిగేది ఉదయ భాస్కర కాలనీయే. అందులో మొట్ట మొదట మునిగే ఇల్లు కూడా మాదే. ఇప్పటికి మూడు సార్లు వరదలు వచ్చాయి. అయినా అధికారులు పరిహారం ఇవ్వలేదు. - చిలకా వెంకటలక్ష్మి, ఉదయభాస్కర కాలనీ -
వరద మిగిల్చిన మరో విషాదం
కూనవరం, న్యూస్‌లైన్: వరద కష్టాలు మరో ప్రాణాన్ని బలిగొన్నాయి. కూనవరం మండలం టేకులబోరు గ్రామానికి చెందిన కుంజా రాజులు (35) జ్వరంతో బాధపడుతూ సమయానికి వైద్యం అందక బుధవారం మృతి చెందాడు. మృతుడి తల్లి కుంజా లాలమ్మ కథనం ప్రకారం... పది రోజుల క్రితమే రాజుకు జ్వరం వచ్చింది. ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ఏమాత్రం తగ్గలేదు. మూడు రోజుల క్రితం పరిస్థితి మరింత విషమించింది. చుట్టూ వరద నీరు చేరుకోవడంతో స్థానిక ప్రభుత్వాస్పత్రికి కూడా తల్లి తీసుకెళ్లలేకపోయింది. తాను ఒంటరిగా ఉండ డం వల్లే కొడుకును తరలించలేకపోయాయనని, వైద్యం అందక అతడు మృత్యువాత పడ్డాడని లాలమ్మ కన్నీరుమున్నీరయ్యింది. ఒక్కగానొక్క కుమారుడు తనవుచాలించడంతో దిక్కులేని దానినయ్యాయని బోరున విలపిస్తోంది. నాలుగురోజుల్లో నలుగురు... వరద నీరు చుట్టుముట్టడంతో మండలంలో నాలుగురోజుల్లో నలుగురు మృత్యువాతపడ్డారు. కూనవరంలో షేక్ మీరా ఉద్దీన్ మృతిచెందిన మర్నాడు నుంచి టేకులబోరులో వరసగా సూరం కమల, ఏడ్ల వేదవతి, కుంజా రాజులు మృత్యువాత పడ్డారు. ఇలా వరుస మరణాలతో మండల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఉన్నతాధికార్లు తక్షణం స్పందించి విస్తృతంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.