శెభాష్‌ వెంకటేషన్‌.. భుజం తట్టిన సీఎం జగన్‌ | CM YS Jagan Congratulate Kunavaram SI Venkatesan Over Rescue People | Sakshi
Sakshi News home page

సాహసోపేతంగా జనాల్ని రెస్క్యూ చేసిన ఎస్సై.. భుజం తట్టిన సీఎం జగన్‌

Published Mon, Aug 7 2023 9:17 PM | Last Updated on Tue, Aug 8 2023 1:55 PM

CM YS Jagan Congratulate Kunavaram SI Venkatesan Over Rescue People - Sakshi

సాక్షి, అల్లూరి: గతేడాది, ఈ ఏడాది గోదావరి వరదల సందర్భంగా.. సాహసోపేతంగా రెస్క్యూ ఆపరేషన్స్‌ నిర్వహించి ప్రజలను రక్షించిన కూనవరం ఎస్సై వెంకటేశన్‌ను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. 

వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న సీఎం జగన్‌.. సోమవారం కూనవరంలో పర్యటించారు. ఆ సమయంలో సభకు హాజరవుతున్న టైంలో ఒక విజ్ఞాపన కోసం బస్సు దిగారాయన. అయితే.. అక్కడే ఉన్న స్థానికులు.. అధికారులు బాగా పని చేశారని సీఎం జగన్‌కు వివరించారు. ఈ క్రమంలో ఎస్సై వెంకటేశన్‌ రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహించడం.. గతేడాది అయితే దాదాపు 4 నుంచి 5 వేల మంది గ్రామస్తులను తరలించడంలో కీలక పాత్ర పోషించాడని సీఎం జగన్‌కు వివరించారు. 

దీంతో.. సీఎం జగన్‌ ఆయన్ని భుజం తట్టి అభినందించారు. అంతేకాదు ఎస్సై వెంకటేశన్‌కు పోలీస్‌ మెడల్‌ ఇవ్వాలంటూ పక్కనే ఉన్న అధికారులకు సిఫార్సు చేశారాయన.   


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement