subinspector
-
శెభాష్ వెంకటేషన్.. భుజం తట్టిన సీఎం జగన్
సాక్షి, అల్లూరి: గతేడాది, ఈ ఏడాది గోదావరి వరదల సందర్భంగా.. సాహసోపేతంగా రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహించి ప్రజలను రక్షించిన కూనవరం ఎస్సై వెంకటేశన్‌ను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న సీఎం జగన్.. సోమవారం కూనవరంలో పర్యటించారు. ఆ సమయంలో సభకు హాజరవుతున్న టైంలో ఒక విజ్ఞాపన కోసం బస్సు దిగారాయన. అయితే.. అక్కడే ఉన్న స్థానికులు.. అధికారులు బాగా పని చేశారని సీఎం జగన్‌కు వివరించారు. ఈ క్రమంలో ఎస్సై వెంకటేశన్ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించడం.. గతేడాది అయితే దాదాపు 4 నుంచి 5 వేల మంది గ్రామస్తులను తరలించడంలో కీలక పాత్ర పోషించాడని సీఎం జగన్‌కు వివరించారు. దీంతో.. సీఎం జగన్ ఆయన్ని భుజం తట్టి అభినందించారు. అంతేకాదు ఎస్సై వెంకటేశన్‌కు పోలీస్ మెడల్ ఇవ్వాలంటూ పక్కనే ఉన్న అధికారులకు సిఫార్సు చేశారాయన. -
మాములోడు కాదు.. ఎస్ఐ డేంజర్ ప్లాన్ తెలిసి పోలీసు శాఖ అలర్ట్!
సాక్షి ప్రతినిధి, వరంగల్: మావోయిస్టు రహిత రాష్ట్రంగా మార్చేందుకు పోలీస్ శాఖ చర్యలు చేపడుతుండగా.. అదేశాఖలో పనిచేసే ఓ అధికారి మావోయిస్టుల తరహాలో దళాన్ని ఏర్పాటు చేసేందుకు పన్నిన కుట్ర వెలుగులోకి వచ్చింది. తాడ్వాయి అడవుల్లో ట్రయల్ కూడా నిర్వహించినట్లు సమాచారం. సదరు వ్యక్తులు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే.. వరంగల్‌లో ఓ హెడ్‌కానిస్టేబుల్‌ను కాల్చి చంపించి మావోయిస్టులు ఉన్నారనే భ్రమ కల్పించాలని పక్కా స్కెచ్ వేసినట్లు సమాచారం. ఈ కుట్ర వెనుక ములుగు జిల్లాలో పనిచేసే ఓ ఏఆర్ ఎస్ఐ కీలక పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. పకడ్బందీగా జరిగిన ఈ కుట్రకోణాన్ని పసిగట్టిన హైదరాబాద్‌లోని పోలీస్ నిఘా విభాగం.. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఆధారాలతో కూడిన కొన్ని వివరాలు సేకరించినట్లు సమాచారం. ఈ మేరకు ములుగు పోలీస్ అధికారుల సహకారంతో రంగంలోకి దిగిన స్పెషల్ ఇన్విస్టిగేషన్ బృందం.. సదరు ఏఆర్ ఎస్ఐతో పాటు మరో ఇద్దరిని రెండు రోజుల కిందట అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు.. ఈ విచారణలో సాయుధ దళం ఏర్పాటుతోపాటు వరంగల్‌లో హెడ్‌కానిస్టేబుల్ హత్యకు సంబంధించిన వివరాలను సేకరించి.. సదరు హెడ్‌కానిస్టేబుల్‌ను సైతం అప్రమత్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదిలాఉండగా ఈ కుట్రకోణం వెనుక భారీ ప్రణాళిక దాగి ఉందన్న ప్రచారం కూడా జరుగుతోంది. సాయుధ దళం ఏర్పాటు చేసి.. ఆ సభ్యులతో యాక్షన్లు చేయించి.. తిరిగి వారిని ఎన్కౌంటర్ పేరిట హతమార్చి పోలీస్‌శాఖలోనూ పేరు తెచ్చుకోవాలన్న మరో కోణం దాగి ఉన్నట్లు కూడా ప్రచారంలో ఉంది. వరంగల్‌లో హెడ్‌కానిస్టేబుల్‌ను కాల్చి చంపే యాక్షన్‌టీమ్ తనను కలిసేందుకు ములుగు ప్రాంతానికి వచ్చే క్రమంలో ఎన్కౌంటర్ చేయాలన్న కుట్ర పన్నినట్లు సమాచారం. ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్లు.. ఇటు హెడ్‌కానిస్టేబుల్‌ను కాల్చి చంపి మావోయిస్టులు ఉన్నట్లు భ్రమలు కల్పించడంతోపాటు మరోవైపు ఎన్కౌంటర్ చేసి పోలీసు అధికారులు మెప్పు పొందవచ్చని భావించి ఈ కుట్రకు తెర లేపినట్లు సమాచారం. ముందే ఈ వివరాలన్నీ సేకరించి విచారిస్తున్న ప్రత్యేక నిఘా విభాగం.. వీటన్నింటిపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది. -
రక్షకుడే భక్షకుడై దారుణకాండ
బనశంకరి: నగరంలో పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ టీఆర్ శ్రీనివాస్‌పై అత్యాచారం, బెదిరింపులు ఆరోపణలతో నమోదైన కేసును సీబీఐ విచారణకు అప్పగించాలని ఆ ఎస్ఐ భార్య ముబషిరా హైకోర్టును ఆశ్రయించింది. కేసు విచారించిన న్యాయమూర్తి జస్టిస్ ఎం.నాగప్రసన్నతో కూడిన ఏకసభ్యపీఠం ప్రతివాదులైన డీజీపీ, నగర పోలీస్‌కమిషనర్, సీబీఐ, జేసీ నగర పోలీస్‌స్టేషన్ సీఐకి, అలాగే ఎస్ఐ టీఆర్ శ్రీనివాస్‌కు నోటీసులు జారీచేసింది. రాజీకి రావాలని బెదిరించారు జూన్ 1వ తేదీనే తన భర్త దాష్టీకాలపై ఫిర్యాదు చేసినప్పటికీ జేసీ నగర సీఐ దర్యాప్తు చేపట్టలేదని, పైగా ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని బెదిరించారని, అప్పటికీ లొంగలేదని డబ్బు ఆశచూపించి రాజీ చేసుకోవాలని ఒత్తిడి చేశారని ఆమె ఆరోపించారు. ప్రస్తుతం ఈ ఉదంతం నగరంలో చర్చనీయాంశమైంది. 5వ తేదీన డీసీపీ జోక్యం చేసుకోవడంతో శ్రీనివాస్‌పై అత్యాచారం, బెదిరింపులు, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అదేరోజు జేసీ నగర సీఐ, ఎస్ఐ శ్రీనివాస్ కలిపి ఫిర్యాదుదారులపై బ్లాక్మెయిల్ అని ఎదురు కేసు పెట్టారు. ఏమిటీ కేసంటే.. కేసు ఏమిటంటే... టీఆర్ శ్రీనివాస్ వసంతనగర పోలీస్ కమిషనరేట్ ఆఫీసులో ఎస్ఐగా ఉద్యోగం చేస్తున్నారు. 2005లో అల్లాబకాష్ అనే వ్యక్తితో ముబ షిరాకు పెళ్లయింది. భర్త వేధిస్తున్నాడని శివాజీనగర మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేసింది. తరువాత ఇద్దరూ విడిపోగా, ముబషిరాకు ఎస్ఐ శ్రీనివాస్‌తో స్నేహం ఏర్పడింది. మంచి జీవితం కల్పిస్తానని ఆశ చూపి 2013లో తనను పెళ్లి చేసుకున్నాడని ముబషిరా పేర్కొంది. 2014 నుంచి 2022 వరకు టీఆర్ శ్రీనివాస్ తనపై పాల్పడిన దౌర్జన్యాలను ఫిర్యాదులో వివరించింది. మొదటి భర్త ద్వారా కలిగిన తన ఇద్దరు కుమార్తెలపై శ్రీనివాస్ అత్యాచారానికి పాల్పడేవాడని ఆరోపించింది. అంతేగాక తన సహోదరిపై కూడా లైంగికదాడికి ఒడిగట్టాడని, దీంతో ఆమె గర్భం దాల్చిందని తెలిపింది. తాను గర్భవతిగా ఉండగా తీవ్రంగా కొట్టాడని, దీంతో గర్భస్రామైందని తెలిపింది. ఈ అరాచకాలపై ప్రశ్నించానని దాడికి పాల్పడ్డారని ఆమె ఆరోపించింది. అమానుషంగా ప్రవర్తించేవాడని, నీలిచిత్రాలు చూడాలని ఒత్తిడి చేసేవాడన్నారు. అలాంటివి చూడొద్దని చెప్పగా, చేతులు కట్టేసి కొట్టాడని వాపోయింది. (చదవండి: మహారాష్ట్రలో కెమిస్ట్ దారుణ హత్య) -
వాటే ఏ పోలీస్! ఏం చేసావయ్యా.. హీరో మాదిరి...
సినిమాల్లో హీరో పై విలన్ దాడి చేస్తున్న సీన్లు చూస్తుంటాం. అందులో విలన్ చేతిలో పెద్ద ఆయుధం ఉండి, హీరో వద్ద ఏ ఆయుధం లేకపోయిన ధైర్యంగా ఫైట్ చేస్తుంటాడు. అబ్బా గ్రేట్ అని మురిసిపోతుంటాం. నిజజీవితంలో అలా ఫైట్ చేయటానికి చాలా గట్స్ ఉండాలి. కానీ ఇక్కడోక పోలీసు మాత్రం అచ్చం హీరో మాదిరి ఫైట్ చేశాడు. వివరాల్లోకెళ్తే...కేరళలోని ఒక రహదారిపై పోలీసు వాహనం ఒకవైపు ఆగుతుంది. ఇంతలో డోర్ ఓపెన్ చేసుకుని అధికారి దిగుతుంటాడు. అంతే ఇంతలో అక్కడే ఉన్న ఒక వ్యక్తి పెద్ద కొడవలితో దాడి చేస్తాడు. దీంతో సదరు పోలీసు అధికారి ఆయుధం లేకపోయినా ఏ మాత్రం భయపడకుండా అతన్ని ఎదుర్కొంటాడు. చివరికి ఆ వ్యక్తిని కిందపడేసి అతని చేతిలోంచి ఆయుధాన్ని లాక్కుంటాడు. అంతేకాదు అక్కడే ఉన్న కొంతమంది కూడా ఆ అధికారికి సాయం చేస్తారు. ఐతే ఆ అధికారి అలప్పజ నూరనాడ్ పోలీస్టేషన్లో పనిచేస్తున్నా సబ్ ఇన్స్పెక్టర్ అరుణ్ కుమార్‌గా గుర్తించారు. ఈ ఘటన పారాజంక్షన్ సమీపంలో చోటు చేసుకుంది. ఆ వ్యక్తి దాడి కారణంగా అధికారి చేతికి గాయమవ్వడంతో ఏడు కుట్లు కూడా పడ్డాయి. కొడవలితో దాడి చేసిన వ్యక్తి సుగతన్గా గుర్తించారు. ఈ వీడియోని పోలీస్ సర్వీస్ అధికారి స్వాతి లక్రా ట్విట్టర్లో 'అసలైన హీరో ఇలా ఉంటాడు' అనే క్యాప్షన్‌ని జోడించి మరీ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. How a real #hero looks like…👨🏽✈️💪🏽 Kudos to this Sub Inspector of Police from Kerala @TheKeralaPolice pic.twitter.com/UZfX5Wya7J — Swati Lakra (@SwatiLakra_IPS) June 19, 2022 (చదవండి: షాకింగ్ వీడియో.. మ్యాన్‌హోల్‌లో పడిపోయిన జంట.. ఆ తర్వాత..) -
ఎస్సైని చితక్కొట్టిన యువకుడు..
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో ఒక యువకుడు పోలీసు అధికారిపై దాడిచేసిన ఘటన కలకలం రేపింది. ఈ సంఘటన లఖన్‌పూర్‌లో చోటుచేసుకుంది. లఖన్‌పూర్‌లోని హసన్గంజ్కు పనిమీద వచ్చిన ఎస్సై వినోద్‌పై.. నడిరోడ్డు మీద ఒక యువకుడు చెంప ఛేళ్లు మనిపించాడు. పిలిభిత్ ప్రాంతానికి వచ్చిన ఎస్సై వినోద్.. ఒక వాహనాన్ని తప్పించపోయి పక్కనే పార్కింగ్‌లో ఉన్న ఒక కారును ఢీకొట్టారు. దీంతో స్థానికులు ఎస్సైను చుట్టుముట్టారు. ఈ క్రమంలో ఆశిష్ అనే యువకుడు ఎస్సైతో వాగ్వాదానికి దిగాడు. అందరు చూస్తుండగానే ఎస్సై వినోద్‌ను కొట్టాడు. ఈ క్రమంలో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆశిష్‌ను అదుపులోనికి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
Tamilnadu: సీఐ సమక్షంలో ఎస్ఐల డిష్యుం..డిష్యుం
సాక్షి, తిరువొత్తియూరు(తమిళనాడు): బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకోవడంలో ఇద్దరు ఎస్ఐల మధ్య వివాదం చెలరేగింది. ఇన్స్పెక్టర్ సమక్షంలోనే ముష్టియుద్ధం చేసుకున్నారు. తంజై జిల్లా ఒరత్తనాడు పోలీసుస్టేషన్లో ఈ నెల 13వ తేదీ ఎస్ఐ కామరాజ్ డ్యూటీలో ఉన్నారు. ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడానికి వచ్చారు. అయితే కామరాజ్ ఫిర్యాదు తీసుకోకుండా మరుసటి రోజు రావాలని తెలిపాడు. మరుసటి రోజు వచ్చిన ఆ వ్యక్తి ఎస్ఐ దురైకన్నుకు ఫిర్యాదు చేసి ముందు రోజు జరిగిన విషయం చెప్పాడు. ఈ క్రమంలో ఇన్స్పెక్టర్ వెంకటేశన్ సమయంలో ఎస్ఐలు ఇద్దరూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ విషయం ఎస్పీ రవళిప్రియ దృష్టికి వెళ్లడంతో సోమవారం ఇద్దరిని పిలిపించి విచారణ చేశారు. వారిని తంజావూరు సాయుధ దళం విభాగానికి బదిలీ చేశారు. -
ఫిర్యాదు చేసేందుకు వెళ్తే ఎస్సై ఫోన్ లాక్కున్నారు..
సాక్షి, చివ్వెంల (నల్లగొండ) : ప్రాణభయం ఉందని ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే తన ఫోన్‌ను ఎస్ఐ లాక్కున్నాడని ఓ మహిళ గురువారం సోషల్‌మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. సూర్యాపేట పట్టణానికి చెందిన పిడమర్తి సునీత చివ్వెంల మండల పరిధిలోని దురాజ్‌పల్లి గ్రామానికి చెందిన పొట్టపెంజర వీరయ్య దగ్గర గ్రామంలోని సర్వేనంబర్ 330/రు/2 గల 11 గుంటల భూమిని 2019లో కొనుగోలు చేసింది. దీనికి సంబంధించి అదే సంవత్సరంలో తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకొని పట్టాదారు పాస్‌పుస్తకం పొందింది. ఈక్రమంలో భూమిని విక్రయించిన వీరయ్య అదే భూమి ఎదుట హోటల్ పెట్టుకుని ఇబ్బందులకు గురిచేస్తున్నాడని, ఇదేంటని ప్రశ్నిస్తే తనను తన్నడంతోపాటు, అసభ్య పదజాలంతో దూషించి, చంపుతానని బెదిరించాడని ఆరోపించింది. ఈమేరకు ప్రాణభయంతో వీరయ్యపై కేసు పెట్టేందుకు స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. పరిష్కరించాల్సిన ఎస్ఐ తన ఫోన్ లాక్కున్నాడని, అంతేకాకుండా పొట్ట పెంజర వీరయ్యకు ఫోన్ చేసి నీపై ఫిర్యాదు వచ్చిందని, వచ్చి ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తానని వీరయ్యకు చెప్పాడని ఆరోపించింది. సంఘటనా స్థలం వద్ద జరిగిన ఘర్షణకు సంబంధించిన వీడియోలు డిలీట్ చేసేందుకే తన ఫోన్ లాక్కున్నారని ఆరోపించింది. ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని బాధితురాలు సోషల్ మీడియాలో విషయాన్ని పోస్టు చేసింది. ఈ విషయమై ఎస్ఐ విష్ణుమూర్తిని వివరణ కోరగా ఇద్దరు అన్నదమ్ములు, ఆమె సోదరికి మధ్య భూమి విషయంలో జరిగిన ఘర్షణ గురించి వివరాలు అడిగి తెలుసుకుంటుండగా, సునీత వెంట వచ్చిన మరో మహిళ ఫోన్లో తాము మాట్లాడుతున్న విషయాన్ని రికార్డు చేస్తుండడంతో లాక్కున్నట్లు పేర్కొన్నారు. ఆమె తీసిన వీడియో కూడా ఫోన్లో ఉందని చెప్పారు. చదవండి: ఉస్మానియా.. 3 ప్రపంచ రికార్డులు -
ఎస్సైతో గొడవపడిన మహిళ..
సాక్షి, యశవంతపుర(కర్ణాటక): మొబైల్ఫోన్లో మాట్లాడుతూ కారు నడుపుతున్న మహిళను ఎస్సై ఆపి జరిమానా కట్టమనడంతో గొడవకు దిగింది. ఉడుపిలో శనివారం ఎస్సై ఖాదర్ ఆ మహిళను గమనించి అడ్డగించారు. ఆ సమయంలో ఆమె ఎస్సైతో గట్టిగా మాట్లాడుతుండగా ఓ కానిస్టేబుల్ వీడియో తీయసాగాడు. దీంతో మహిళకు చిర్రెత్తిపోయింది. అధికారం ఉందని వీడియో తీయటం సరికాదని, జరిమానా చెల్లిస్తానని కేకలు వేసింది. పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. -
పేదరికం వెంటాడినా.. పట్టుదల నిలబెట్టింది
మహేశ్వరం: తండ్రి ట్రాక్టర్ డ్రైవర్ అయినా.. పేదరికం వెంటాడుతున్నా కృషి పట్టుదలతో రేయింబవళ్లు కష్టపడి చదివి పోలీస్ శాఖలో ఎస్ఐ ఉద్యోగం సాధించారు. మండల పరిధిలోని సిరిగిరిపురం గ్రామానికి చెందిన కాసుల అరుణ్‌కుమార్ ఏఆర్ ఎస్ఐగా ఎంపికయ్యారు. అంబర్‌పేట్‌లో పోలీస్ కానిస్టెబుల్‌గా విధులు నిర్వహిస్తూనే ఎస్ఐ పరీక్షలకుసిద్ధమై ఏఆర్ ఎస్ఐగా ఎంపికయ్యారు. తల్లిదండ్రులు పద్మ, భాస్కర్ దంపతులకు అరుణ్‌కుమార్ పెద్ద కుమారుడు. తల్లి రోజువారి వ్యవసాయ కూలీ, తండ్రి ట్రాక్టర్ డ్రైవర్‌గా గ్రామంలో పని చేస్తున్నారు. అరుణ్‌కుమార్ 1వ తరగతి నుండి 10 తరగతి వరకు మహేశ్వరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఇంటర్ తుక్కుగూడలోని వి/êన్‌కాలేజ్ జూనియర్ కాలేజ్, హైదరాబాద్‌లోని ప్రభుత్వ సిటీ కాలేజ్‌లో డిగ్రీ పూర్తి చేశారు. కష్టపడి చదివి ఏలాగైనా ఉన్నతమైన ఉద్యోగం సాధించి గ్రామానికి, తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని పోటీ పరీక్షలకు సిద్ధమయ్యాడురు. తల్లిదండ్రులు రోజు వారి కూలీలు. వారి కష్టాలను తీర్చాలన్న ఉద్దేశంతో ఉన్నతమైన ఉద్యోగం సాధించాలని నిర్ణయించుకున్నారు. డిగ్రీ పూర్తి 2016లో ఏఆర్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించారు. అటు ఉద్యోగం చేస్తూనే ఎస్ఐ పరీక్షలకు సిద్ధమయ్యారు. ఈ నెల 12న విడుదలైన ఎస్ఐ పరీక్ష ఫలితాల్లో పోలీస్ ఎగ్జిక్యూటివ్ కోటాలో 219 మార్కులు సాధించి ఏఆర్ ఎస్ఐగా ఎంపికయ్యారు. కాసుల అరుణ్‌కుమార్ ఏఆర్ ఎస్ఐగా ఎంపిక కావడంతో తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్తులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేశారు. ఎస్ఐగా అరుణ్‌కుమార్ సెలెక్ట్ కావడం గర్వంగా ఉందని గ్రామ సర్పంచ్ కాసు సురేశ్ అన్నారు. అరుణ్‌కుమార్‌ని చిన్నప్పటి నుంచి చదువుల్లో ప్రోత్సహించేవాడినని, ఉద్యోగం సాధించడం మండలానికే గర్వకారణంగా ఉందని సర్పంచ్ సురేశ్ తెలిపారు. -
నీకు గతంలోనే చెప్పాను.. అయినా వినవా?
కమలాపురం: మండల పరిధిలోని లేటపల్లెకు చెందిన ఆటో డ్రైవర్‌పై కమలాపురం ఎస్ఐ మహమ్మద్ రఫీ దాడి చేశారు. వంగబెట్టి వీపుపై పిడిగుద్దులు గుద్దడంతో స్పృహ కోల్పోయిన ఆయనను రిమ్స్‌కు తరలించారు. బాధితుడి సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఆటో డ్రైవర్ రాపూరి చంద్ర శుక్రవారం ఎటూరు సమీపంలో వ్యవసాయ పనులు ముగించుకొని తిరిగి వస్తున్న కూలీలను తన ఆటోలో ఎక్కించుకిని వస్తుండగా.. కుందూ వంతెనపై ఉన్న కమలాపురం ఎస్ఐ ఆపాడు. ‘నీకు గతంలోనే చెప్పాను.. కూలీలను ఎక్కించుకొని రావద్దని. అయినా వినవా?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిమితికి మించి కూలీలను తీసుకు వచ్చావని నెపం పెడుతూ.. జుట్టు పట్టుకొని వంగ బెట్టి వీపుపై పిడి గుద్దులు గుద్దుతూ, వంతెన రక్షణ గోడకు తగిలించి కొట్టడంతో స్పృహ తప్పి పడి పోయాడు. కేవలం నలుగురే ప్రయాణికులు ఉన్నా.. ఎందుకు కొడుతున్నావని ఆటో డ్రైవర్ భార్య ఎస్ఐని ప్రశ్నించగా.. ఎక్కువ మాట్లాడితే నిన్ను ఏట్లో పడేస్తా అని బెదిరించాడు. దీంతో భయాందోళనకు గురైన వారు ఏమీ మాట్లాడలేకపోయారు. బాధితుడిని చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతున్న ఆటో డ్రైవర్ శనివారం మీడియాకు పలు విషయాలు వెల్లడించారు. తనపై గతంలో రెండు సార్లు దాడి చేశాడని, ఇది మూడో సారి అని వాపోయాడు. అసలు తనపై ఎందుకు దాడి చేస్తున్నాడో అర్థం కావడం లేదని కన్నీటి పర్యంతమయ్యాడు. ఇప్పటికైనా ఈ ఎస్ఐ పై తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఇలాగే ప్రవర్తిస్తే పోలీసులకు చెడ్డ పేరు వస్తుందని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కమలాపురం ఎస్ఐపై తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఈ విషయంపై ఎర్రగుంట్ల సీఐ కొండారెడ్డిని వివరణ కోరగా విచారణచేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎస్ఐ ప్రవర్తన సరికాదు కమలాపురం అర్బన్ : కమలాపురం ఎస్ఐ మహమ్మద్‌రఫీ ప్రవర్తన సరికాదని ఎమ్మెల్యే పి.రవీంద్రనా«థ్‌రెడ్డి ధ్వజమెత్తారు. అధికార పార్టీ నేతల అండదండలతో ఎస్సై సామాన్య ప్రజలపై ప్రవర్తిస్తున్న తీరు పట్ల ఆయన ఆక్షేపించారు. రోజురోజుకు ఎస్ఐ వ్యవహరిస్తున్న తీరు పట్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారని విమర్శించారు. సివిల్ పంచాయతీలలో తలదూర్చి దళితుల పట్ల దురుసుగా వ్యవహరించి.. వారిపై చెయ్యి చేసుకోవడంతో గాయపడి ఆస్పత్రి పాలయ్యారన్నారు. ఇటీవల గంగవరంలో దళిత మహిళ అయిన గంగాదేవిపై చెయ్యి చేసుకోవడంతో మనస్థాపానికి గురై అవమాన భారంతో విషద్రావణం తాగి ఆసుపత్రి పాలైందన్నారు. అయితే టీడీపీ నేతలు ఆ కేసును బలహీన పరచారన్నారు. అలాగే మీరాపరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రామిరెడ్డి ఛాతిపై బూటుకాలతో తన్ని, చిత్ర హింసల పాలు చేశారన్నారు. అంతేకాక శుక్రవారం పట్టణానికి సమీపంలో కుందూ నదీ వద్ద వినాయక నిమజ్జనం చేసేందుకు వచ్చిన లేటపల్లె గ్రామానికి చెందిన దళిత యువకుడి ఆటోను ఆపి.. డ్రైవర్‌ను చితక బాదడంతో తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలడంతో కడప రిమ్స్‌కు తరలించారన్నారు. లేటపల్లెకు చెందిన ఆటో డ్రైవర్ చంద్ర రిమ్స్ ఔట్‌పోస్ట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. ఆ కేసును బలహీన పరిచేందుకు కడప డివిజన్‌కు చెందిన ఒక పోలీసు ఉన్నతాధికారి, టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఆటో డ్రైవర్‌పై ఎస్సై దాడి చేసిన సంఘటనకు సంబంధించి.. వెంటనే ఎస్సైని సస్పెండ్ చేసి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇది ఇలా ఉండగా ఆటో డ్రైవర్ల యూనియన్, వామపక్షాల నేతలు స్థానిక మూడు రోడ్ల కూడలిలో ఆందోళనకు దిగారు. దీంతో సీఐ కొండారెడ్డి ఆటో యూనియన్ నేతల్ని స్టేషన్‌కు పిలిపించి.. ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని తెలిపారు. పరామర్శించిన ఎమ్మెల్యే ఎస్సై దాడిలో గాయపడిన లేటపల్లెకు చెందిన ఆటో డ్రైవర్ చంద్రను ఎమ్మెల్యే పి.రవీంద్రనాధ్‌రెడ్డి కడప రిమ్స్‌కు వెళ్లి పరామర్శించారు. కాగా పోలీసుల సంఘటనతో ఆందోళన చెందవద్దని, తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు సంబటూరు ప్రసాద్‌రెడ్డి, పిచ్చిరెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు క్రిష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. -
అవనిగడ్డలో ఎస్ఐ జులుం
కృష్ణా: అవనిగడ్డ సెంటర్లో టీచర్‌పై పోలీస్ జులుం చూపించాడు ఓ ఎస్ఐ. బైక్ పై వస్తున్న టీచర్‌ను ఆపి ఎస్ఐ వెంకటకుమార్ దాడి చేశారు. ఈ దాడిలో గాయాలై సొమ్మసిల్లి పడిపోయిన టీచర్‌ను వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎస్ఐ వెంకటకుమార్ తీరుకు వ్యతిరేకంగా బంధువులు ఆందోళ చేశారు. -
వివాహితపై ఎస్ఐ అత్యాచారయత్నం...సస్పెన్షన్
అనంతపురం :ఓ వివాహిత పై అత్యాచార యత్నానికి ఒడిగట్టారనే ఆరోపణలు ఎదుర్కొన్న అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల ఎస్ఐ రాగిరి రామయ్యపై సస్పెన్షన్ వేటు పడింది. వివరాల్లోకి వెళ్తే... రాగిరి రామయ్య బుక్కరాయ సముద్రం ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. అనంతపురం నగర శివారులోని తపోవనంలో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఇదే ఇంట్లో పై అంతస్తులో ఉంటున్న ఓ మహిళను లొంగదీసుకునేందుకు రామయ్య ప్రయత్నం చేశారు. ఆమె భర్త ఉద్యోగరీత్యా మరో ప్రాంతంలో ఉంటున్నారు. నాలుగు రోజుల కిందట రాత్రి 11 గంటల సమయంలో ఎస్ఐ రాగిరి రామయ్య పైఅంతస్తుకు వెళ్లి మహిళ ఇంటి తలుపు తట్టారు. ఆమె తలుపు తీయగానే మీ ఆయన ఫోన్ చేశారని సెల్‌ఫోన్ చేతికి ఇవ్వబోయి ఆమెను బలాత్కారం చేసేందుకు యత్నించారు. దీంతో కంగుతిన్న మహిళ బోరున విలపిస్తూ గట్టిగా కేకలు వేసింది. ఇరుగుపొరుగు ఇళ్లలోని వారు వచ్చి ఎస్ఐకు దేహశుద్ధి చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై డీఐజీ బాలకృష్ణ విచారణకు ఆదేశించారు. డీఎస్పీ మల్లికార్జున వర్మ ఇచ్చిన నివేదిక ఆధారంగా రామయ్యపై డీఐజీ సస్పెన్షన్ వేటు వేశారు. -
'నేను ఎస్సైని... నన్నడిగేవాడెవడు'
వరంగల్: పదేళ్ల గా ఒక ఎస్సై ఒక బాలునిపై అమానుషంగా ప్రవర్తించాడు. అతన్ని కరడుగట్టిన నేరస్థుడితో సమానంగా చూశాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట పోలీస్‌స్టేషన్‌లో జరిగింది. జిల్లాలోని తొర్రూరు మండలం, అమ్మాపురం గ్రామానికి చెందిన గంధం వీరన్న(10) వర్ధన్నపేటలోని చిన్నారుల సంక్షేమ వసతిగృహంలో ఉంటూ పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. అయితే, వసతిగృహం పక్కనే ఉన్న ఓ డబ్బాకొట్టులో వీరన్న దొంగతనం చేశాడంటూ కొందరు ఆ బాలున్ని పోలీసులకు శనివారం సాయంత్రం అప్పగించారు. అప్పటి నుంచీ వీరన్నను ఎస్ఐ కృష్ణకుమార్ పోలీస్ స్టేషన్లో ఉంచాడు. బాలున్ని స్టేషన్లో ఓ మొద్దుకు కట్టేసి ఉండడాన్ని చూసిన కొందరు ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో మీడియాకు సమాచారం అందించారు. దీంతో ఎస్ఐ బాలున్ని వదిలేశాడు. అయితే, ఎస్ఐ తీరుపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. (వర్ధన్నపేట)