అనంతపురం :ఓ వివాహిత పై అత్యాచార యత్నానికి ఒడిగట్టారనే ఆరోపణలు ఎదుర్కొన్న అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల ఎస్‌ఐ రాగిరి రామయ్యపై సస్పెన్షన్ వేటు పడింది. వివరాల్లోకి వెళ్తే... రాగిరి రామయ్య బుక్కరాయ సముద్రం ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నారు. అనంతపురం నగర శివారులోని తపోవనంలో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఇదే ఇంట్లో పై అంతస్తులో ఉంటున్న ఓ మహిళను లొంగదీసుకునేందుకు రామయ్య ప్రయత్నం చేశారు. ఆమె భర్త ఉద్యోగరీత్యా మరో ప్రాంతంలో ఉంటున్నారు. నాలుగు రోజుల కిందట రాత్రి 11 గంటల సమయంలో ఎస్‌ఐ రాగిరి రామయ్య పైఅంతస్తుకు వెళ్లి మహిళ ఇంటి తలుపు తట్టారు. ఆమె తలుపు తీయగానే మీ ఆయన ఫోన్ చేశారని సెల్‌ఫోన్ చేతికి ఇవ్వబోయి ఆమెను బలాత్కారం చేసేందుకు యత్నించారు. దీంతో కంగుతిన్న మహిళ బోరున విలపిస్తూ గట్టిగా కేకలు వేసింది. ఇరుగుపొరుగు ఇళ్లలోని వారు వచ్చి ఎస్‌ఐకు దేహశుద్ధి చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై డీఐజీ బాలకృష్ణ విచారణకు ఆదేశించారు. డీఎస్పీ మల్లికార్జున వర్మ ఇచ్చిన నివేదిక ఆధారంగా రామయ్యపై డీఐజీ సస్పెన్షన్ వేటు వేశారు.
వివాహితపై ఎస్‌ఐ అత్యాచారయత్నం...సస్పెన్షన్
Published Thu, Apr 2 2015 10:41 PM | Last Updated on Sat, Sep 2 2017 11:45 PM
Advertisement