అరుణ్‌కుమార్‌కు మిఠాయి తినిపిస్తున్న తల్లిదండ్రులు
మహేశ్వరం: తండ్రి ట్రాక్టర్ డ్రైవర్ అయినా.. పేదరికం వెంటాడుతున్నా కృషి పట్టుదలతో రేయింబవళ్లు కష్టపడి చదివి పోలీస్ శాఖలో ఎస్‌ఐ ఉద్యోగం సాధించారు. మండల పరిధిలోని సిరిగిరిపురం గ్రామానికి చెందిన కాసుల అరుణ్‌కుమార్ ఏఆర్ ఎస్‌ఐగా ఎంపికయ్యారు. అంబర్‌పేట్‌లో పోలీస్ కానిస్టెబుల్‌గా విధులు నిర్వహిస్తూనే ఎస్‌ఐ పరీక్షలకుసిద్ధమై ఏఆర్ ఎస్‌ఐగా ఎంపికయ్యారు. తల్లిదండ్రులు పద్మ, భాస్కర్ దంపతులకు అరుణ్‌కుమార్ పెద్ద కుమారుడు. తల్లి రోజువారి వ్యవసాయ కూలీ, తండ్రి ట్రాక్టర్ డ్రైవర్‌గా గ్రామంలో పని చేస్తున్నారు. అరుణ్‌కుమార్ 1వ తరగతి నుండి 10 తరగతి వరకు మహేశ్వరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఇంటర్ తుక్కుగూడలోని వి/êన్‌కాలేజ్ జూనియర్ కాలేజ్, హైదరాబాద్‌లోని ప్రభుత్వ సిటీ కాలేజ్‌లో డిగ్రీ పూర్తి చేశారు. కష్టపడి చదివి ఏలాగైనా ఉన్నతమైన ఉద్యోగం సాధించి గ్రామానికి, తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని పోటీ పరీక్షలకు సిద్ధమయ్యాడురు. తల్లిదండ్రులు రోజు వారి కూలీలు.
వారి కష్టాలను తీర్చాలన్న ఉద్దేశంతో ఉన్నతమైన ఉద్యోగం సాధించాలని నిర్ణయించుకున్నారు. డిగ్రీ పూర్తి 2016లో ఏఆర్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించారు. అటు ఉద్యోగం చేస్తూనే ఎస్‌ఐ పరీక్షలకు సిద్ధమయ్యారు. ఈ నెల 12న విడుదలైన ఎస్‌ఐ పరీక్ష ఫలితాల్లో పోలీస్ ఎగ్జిక్యూటివ్ కోటాలో 219 మార్కులు సాధించి ఏఆర్ ఎస్‌ఐగా ఎంపికయ్యారు. కాసుల అరుణ్‌కుమార్ ఏఆర్ ఎస్‌ఐగా ఎంపిక కావడంతో తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్తులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేశారు. ఎస్‌ఐగా అరుణ్‌కుమార్ సెలెక్ట్ కావడం గర్వంగా ఉందని గ్రామ సర్పంచ్ కాసు సురేశ్ అన్నారు. అరుణ్‌కుమార్‌ని చిన్నప్పటి నుంచి చదువుల్లో ప్రోత్సహించేవాడినని, ఉద్యోగం సాధించడం మండలానికే గర్వకారణంగా ఉందని సర్పంచ్ సురేశ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment