
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో ఒక యువకుడు పోలీసు అధికారిపై దాడిచేసిన ఘటన కలకలం రేపింది. ఈ సంఘటన లఖన్‌పూర్‌లో చోటుచేసుకుంది. లఖన్‌పూర్‌లోని హసన్‌గంజ్‌కు పనిమీద వచ్చిన ఎస్సై వినోద్‌పై.. నడిరోడ్డు మీద ఒక యువకుడు చెంప ఛేళ్లు మనిపించాడు. పిలిభిత్ ప్రాంతానికి వచ్చిన ఎస్సై వినోద్.. ఒక వాహనాన్ని తప్పించపోయి పక్కనే పార్కింగ్‌లో ఉన్న ఒక కారును ఢీకొట్టారు. దీంతో స్థానికులు ఎస్సైను చుట్టుముట్టారు.
ఈ క్రమంలో ఆశిష్ అనే యువకుడు ఎస్సైతో వాగ్వాదానికి దిగాడు. అందరు చూస్తుండగానే ఎస్సై వినోద్‌ను కొట్టాడు. ఈ క్రమంలో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆశిష్‌ను అదుపులోనికి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment