Parking
-
‘అఫ్జల్‌గంజ్’ కేసులో పురోగతి
హైదరాబాద్, సాక్షి: అఫ్జల్‌గంజ్ కాల్పుల కేసులో పురోగతి చోటు చేసుకుంది. దోపిడీ కాల్పులకు పాల్పడింది అమిత్, మనీష్‌లుగా పోలీసులు గుర్తించారు. అంతేకాదు.. నిందితులిద్దరి బీహార్ లేదంటే జార్ఖండ్ పారిపోయి ఉంటారని ఓ అంచనాకి వచ్చారు. ఈ క్రమంలో హైదరాబాద్ బీదర్ పోలీసులు జాయింట్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి.తొలుత తిరుమలగిరి నుంచి ఆటోలో షామీర్పేట వరకు వెళ్లిన దుండగులు.. అక్కడి నుంచి షేరింగ్ ఆటోలో వెళ్లినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. ఆపై గజ్వేల్ నుంచి అదిలాబాదు వరకు లారీలో ప్రయాణించినట్లు గుర్తించారు.అదిలాబాద్ నుంచి మధ్యప్రదేశ్ మీదుగా బీహార్‌కు వెళ్ళినట్లు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో జాయింట్ ఆపరేషన్‌లో భాగంగా బీదర్-హైదరాబాదు పోలీసుల ప్రత్యేక బృందాలు బీహార్‌తో పాటు జార్ఖండ్‌కు చేరుకున్నాయి. ‘కాల్పుల’ వాహనం దొరికిందిసాక్షి, సిటీబ్యూరో: కర్ణాటకతో పాటు నగరంలో తుపాకీతో కాల్పులకు తెగబడిన దుండగులు వినియోగించిన వాహనాన్ని హైదరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అఫ్జల్‌గంజ్‌లోని మహాత్మా గాంధీ బస్టేషన్ (ఎంజీబీఎస్) పార్కింగ్ నుంచి ఈ వాహనాన్ని మంగళవారం రికవరీ చేశారు. నిందితుల ఆదిలాబాద్ మీదుగా మహారాష్ట్రలోకి ప్రవేశించినట్లు అనుమానిస్తున్న అధికారులు.. ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే 750 సీసీ కెమెరాల్లో నమోదైన ఫుటేజ్‌ను వడపోసిన సిటీ పోలీసులు మరిన్ని కెమెరాల ఫీడ్‌ను అధ్యయనం చేయడంపై దృష్టి పెట్టారు. నేరం జరిగిన తీరు, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలను పరిగణనలోకి తీసుకున్న దుండగులు.. హైదరాబాద్‌లోనే షెల్డర్ తీసుకుని, బీదర్‌లో నేరం చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. బీదర్‌లోని శివాజీ జంక్షన్ వద్ద ఎస్బీఐ ఏటీఎం కేంద్రాల్లో డబ్బు నింపే సీఎంఎస్ ఏజెన్సీ వాహనాన్ని కొల్లగొట్టడానికి దుండగులు బైక్‌పై వెళ్లారు. ఈ వాహనానికి ‘ఏపీ’ రిజి్రస్టేషన్‌తో కూడిన నకిలీ నంబర్ ప్లేట్ ఉంది. దీన్ని హైదరాబాద్ లేదా శివారు ప్రాంతాల్లో చోరీ చేసి ఉంటారని భావిస్తున్న అధికారులు.. ఆ కోణంలో ఆరా తీస్తున్నారు. బీదర్‌లో నేరం చేసిన తర్వాత రాయ్‌పూర్ వెళ్లడానికి అఫ్జల్‌గంజ్‌కు వచి్చన దుండగులు.. రోషన్ ట్రావెల్స్ వద్దకు ఎంజీబీఎస్ వైపు నుంచి ఆటోలో వచ్చారు. దీని ఆధారంగా ముందుకు వెళ్లిన దర్యాప్తు అధికారులు మంగళవారం ఎంజీబీఎస్ పార్కింగ్‌లో ఉన్న అనుమానాస్పద వాహనాలను పరిశీలించారు. గురువారం పార్క్ చేసిన వాటి వివరాలు ఆరా తీసి నిందితులు వాడింది గుర్తించారు. నిందితులు సికింద్రాబాద్‌లోని అల్ఫా హోటల్ వద్ద ఎక్కిన ఆటోలో గజ్వేల్ వెళ్లాలని ప్రయత్నించి, తిరుమలగిరిలో దిగిపోయారు. అక్కడ నుంచి శుక్రవారం మధ్యాహా్ననికి ఆదిలాబాద్ చేరుకున్న దుండగులు సరిహద్దులు దాటించి మహారాష్ట్రలో ప్రవేశించినట్లు పోలీసులకు ఆధారాలు లభించినట్లు తెలిసింది. ఆద్యంతం అత్యంత అప్రమత్తంగా వ్యవహరించిన నిందితుల ఆచూకీ కనిపెట్టడానికి పోలీసు విభాగానికి చెందిన ప్రత్యేక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. -
పార్కింగ్ కష్టాలకు చెక్
నాంపల్లి: మెట్రో రైలు ప్రయాణికులకు పార్కింగ్ తిప్పలు తప్పనున్నాయి. నాంపల్లిలో నిర్మిస్తున్న అధునాతన మల్టీ లెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్ మరో నెల రోజుల్లో అందుబాటులోకి రానుంది. ఈ పార్కింగ్ కాంప్లెక్స్ పనులు తుది దశకు చేరుకున్నాయి. అన్ని పనులు పూర్తయితే ఫిబ్రవరి మొదటి వారంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ట్రయల్స్ కూడా నిర్వహించారు. ఈ భవన సముదాయం అందుబాటులోకి వస్తే నాంపల్లి ప్రాంతంలో టూ వీలర్, ఫోర్ వీలర్ పార్కింగ్ సమస్య నుంచి గట్టెక్కడమే కాకుండా ట్రాఫిక్ సమస్యకు కూడా శాశ్వత పరిష్కారం లభించనుంది. దీనికితోడు నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగే నుమాయిషి కు వచ్చే సందర్శకులు పార్కింగ్ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడే ప్రభుత్వ, ప్రభుత్వేతర కార్యాలయాలు, వివిధ పారీ్టలకు చెందిన కార్యాలయాలు ఉన్నాయి. ఆయా కార్యాలయాలకు వచ్చే నేతలు, కార్యకర్తలు నిత్యం పార్కింగ్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఏవైనా సభలు, సమావేశాలు జరిగినా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. బహుళ అంతస్తుల్లో.. నాంపల్లి కేంద్రంగా కంప్యూటరైజ్డ్ మల్టీ లెవెల్ పార్కింగ్ నిర్మాణం కోసం 2018లో శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వ హయాంలోనే పూర్తి కావాల్సిన కాంప్లెక్స్ నిర్మాణ పనుల్లో తీవ్ర జాప్యం జరిగింది. ఈ పనులను ఢిల్లీకి చెందిన ఓ ప్రైవేట్ సంస్థ చేపడుతోంది. పూర్తి జర్మన్ టెక్నాలజీతో నగరంలో తొలి మల్టీ లెవల్ పార్కింగ్ కావడం గమనార్హం. ఈ కాంప్లెక్స్‌లో మొత్తం 15 అంతస్తులు ఉన్నాయి. 10 అంతస్తులను పార్కింగ్‌కు కేటాయించారు. మిగతా ఐదు అంతస్తుల్లో రెండు సినిమా స్క్రీన్లతో ఒక థియేటర్, రెస్టారెంట్లు, ఇతరత్రా వ్యాపార సముదాయాలను అందుబాటులోకి తెస్తున్నారు. ఈ పార్కింగ్ అందుబాటులోకి వస్తే 250 కార్లు, 200 ద్విచక్రవాహనాలను పార్కింగ్ చేసుకునే వీలుంది. కారుకు గంటకు రూ.30, టూ వీలర్‌కు గంటకు రూ.10 చొప్పున వసూలు చేయనున్నారు. మల్టీ లెవల్ పార్కింగ్ కాంప్లెక్స్‌లో బీ1, బీ2, బీ3 అండర్ గ్రౌండ్ అంతస్తులు ఉంటాయి. 5 నుంచి 11 అంతస్తుల వరకు పార్కింగ్ కోసం కేటాయించారు. గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్‌కు సంబంధించి నాలుగు ఎంట్రీ ఎగ్జిట్ టెర్మినల్స్ ఉంటాయి. ఆయా టెరి్మనల్స్ వద్ద ఉన్న టర్న్ టేబుల్స్‌పై వాహనాలను వదిలితే లిప్టుల ద్వారా నిరీ్ణత అంతస్తుకు చేరుకుంటాయి. సైజును బట్టి తగిన ప్లాట్లలో పార్కింగ్ చేస్తారు. పార్కింగ్ ప్రక్రియకు కేవలం ఒక్క నిమిషం మాత్రమే సమయం పట్టనుంది. కార్లను తిరిగి తీసుకోవడానికి టర్న్ టేబుల్స్ వద్దనున్న కార్లను రీడర్ల వద్ద స్మార్ట్ కార్డును స్వైప్ చేస్తే.. కారు నిరీ్ణత టర్న్ టేబుల్ వద్దకు చేరుకుంటుంది. టర్న్ టేబుల్‌పై ఉన్న కారును రివర్స్ చేసే బాధ లేకుండా టర్న్ టేబులే మన వాహనాన్ని కావాల్సిన దిక్కుకు రొటేట్ చేస్తుంది. దీంతో పార్కింగ్ నుంచి కారును రెండు నిమిషాల్లోనే బయటికి తీసేందుకు వీలవుతుంది. ఇక పార్కింగ్ చార్జీలు చెల్లించేందుకు స్మార్ట్ కార్డులను ఉపయోగించాల్సి ఉంటుంది. రెగ్యులర్‌గా పార్కింగ్ చేసేవారికి ఆర్ఎఫ్ఐడీ స్మార్ట్ కార్డులను జారీ చేయనున్నారు. మెట్రో ఎండీ ఎనీ్వఎస్ రెడ్డి ప్రత్యేక చొరవతో ప్రారం¿ోత్సవానికి సన్నాహాలు ముమ్మరం చేశారు. -
నిద్రించడానికి స్థలం లేదని వాహనాలకు నిప్పంటించాడు
హైదరాబాద్: రెండ్రోజుల క్రితం చాదర్‌ఘాట్ మెట్రోస్టేషన్ పార్కింగ్ స్థలంలో నిలిపిన వాహనాలు దగ్ధం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. మహా రాష్ట్రకు చెందిన జాకీర్ మహ్మద్ (32) ఎనిదేళ్ల క్రితం నగరానికి వచ్చి కూలీ పనులు చేస్తున్నాడు. మద్యానికి అలవాటు పడి ఫుట్‌పాత్‌లపైనే నిద్రిస్తున్నాడు. తాను నిద్రించడానికి పార్కింగ్ వాహనాలు ఇబ్బందిగా మారాయని వాటికి నిప్పంటించాడు. సీసీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు ఆదివారం అక్బర్‌బాగ్ వద్ద అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. మెట్రో స్టేషన్.. మెరిసెన్..ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాలను హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ ఘనంగా నిర్వహిస్తోంది. తెలంగాణ తల్లి విగ్రహ నమూనా చిత్రాన్ని రద్దీ ఎక్కువగా ఉండే మెట్రో స్టేషన్లలో ప్రదర్శిస్తున్నారు. ‘జయ జయహే తెలంగాణ.. జననీ జయ కేతనం’ అంటూ తెలంగాణ స్ఫూర్తిని అంది పుచ్చుకుంటూ హైదరాబాద్‌లోని మొత్తం 25 మెట్రో స్టేషన్లలో కొత్తగా రూపొందించిన ‘తెలంగాణ తల్లి’ చిత్రాలను ఏర్పాటు చేసినట్లు హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ప్రజాపాలన విజయోత్సవాలను హైదరాబాద్ మెట్రో స్టేషన్ల పరిధిలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అందమైన విద్యుద్దీపాల అలంకరణతో ప్రధానం మెట్రో మార్గాలు నగరవాసులను విశేషంగా అలరిస్తున్నాయి. -
బాప్రే.. పార్కింగ్ జరిమానా రూ.11 లక్షలా?
లండన్: మూడేళ్ల నుంచి నిత్యం తాను పార్కింగ్ చోటే కదా అనుకుంది. ఎప్పటిలాగే ఆరోజూ తన వాహనాన్ని నిలిపింది. తీరా చూస్తే అధికారులు.. కొత్త రూల్ పేరుతో ఆమెకు పెద్ద షాకిచ్చారు. వాళ్లు పంపిన జరిమానా చూసి ఆమె కళ్లు బయర్లు కమ్మాయి. యూకేలోని కౌంటీ దుర్హంలో హెన్నా రాబిన్సన్కు చేదు అనుభవం ఎదురైంది. ఫీథమ్స్ లీజర్ సెంటర్లో ఐదు నిమిషాల పార్కింగ్ రూల్ కారణంగా.. ఆమె 11 వేల పౌండ్లు(మన కరెన్సీలో రూ.11 లక్షలు) చెల్లించుకోవాల్సి వచ్చింది. అయితే పర్మిట్ కోసం తాను డబ్బులు చెల్లించినప్పటికీ.. ఈ జరిమానాను అందుకోవాల్సి వచ్చిందని ఆమె వాపోతున్నారు. 2021 నుంచి ఆమె ఆ పార్కింగ్ సేవల్ని ఉపయోగించుకుంటున్నారు. అయితే కొత్త రూల్ అమలయ్యాక.. అప్పటి నుంచి ఆమె కారు కదలికలను అధికారులు లెక్కేశారు. అలా మొత్తం 67 చలాన్లకు.. ఒక్కో చలాన్‌కు 170 పౌండ్లు(1,800రూ.) చొప్పున ఇప్పుడు జరిమానా విధించారు. యూకేలో ఎక్సెల్ పార్కింగ్ సర్వీసెస్(EPS) తాజాగా ఈ ఐదు నిమిషాల నిబంధనను అమల్లోకి తెచ్చింది. కొందరు డ్రైవర్లు పార్కింగ్ ఏరియాల దగ్గర ఉత్తపుణ్యానికి వెయిట్ చేయడం, డబ్బులు చెల్లించకుండా కార్ పార్కింగ్‌లను పికప్ ఏరియాలుగా ఉపయోగించుకుంటుండడంతోనే ఈ రూల్‌ను తేవాల్సి వచ్చిందని ఈపీఎస్ చెబుతోంది. ఐదు నిమిషాల రూల్ ప్రకారం.. కార్క్ పార్కింగ్ దగ్గర ఏర్పాటు చేసే ఏఎన్పీఆర్ కెమెరాలు ఎంట్రీని, ఎగ్జిట్‌ను రికార్డు చేసి.. ఛలానాను జనరేట్ చేస్తాయి. అయితే.. కస్టమర్స్ అక్కడికి చేరుకున్న ఐదు నిమిషాల్లోపే టికెట్ కొనాల్సి ఉంటుంది. కానీ, కార్ పార్క్ వద్ద ఇంటర్నెట్ సదుపాయం లేకపోవడంతో ట్రాన్జాక్షన్స్ తాను చేయలేకపోయానని హెన్నా రాబిన్సన్ చెబుతోంది. ఆమె మాత్రమే కాదు.. ఇలా పార్కింగ్ వద్ద ఐదు నిమిషాల నిబంధన కారణంగా తామూ చలాన్లు అందుకున్నామంటూ పలువురు వాపోతున్నారు ఇప్పుడు. -
ఆస్కార్ లైబ్రరీలో పార్కింగ్
తమిళ చిత్రం ‘పార్కింగ్’కు అరుదైన గౌరవం లభించింది. ఆస్కార్ లైబ్రరీలో ‘పార్కింగ్’ సినిమా స్క్రీన్‌ప్లేకు చోటు దక్కింది. హరీష్ కల్యాణ్, ఎమ్ఎస్ భాస్కర్, ఇందుజా రవిచంద్రన్ లీడ్ రోల్స్‌లో నటించిన తమిళ చిత్రం ‘పార్కింగ్’. రామ్‌కుమార్ బాలకృష్ణన్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ, సుధన్ సుందరం–కేఎస్ సినీష్ నిర్మించిన ఈ చిత్రం 2023 డిసెంబరు 1న విడుదలై, మంచి విజయం సాధించింది. ప్రేక్షకులతో పాటు విమర్శకుల మెప్పు కూడా పొందింది.తాజాగా ‘పార్కింగ్’ సినిమా స్క్రీన్‌ప్లేకు ఆస్కార్ లైబ్రరీలో శాశ్వతంగా చోటు కల్పిస్తున్నామని ఆస్కార్ మేనేజింగ్ లైబ్రేరియన్ ఫిలిఫ్ గార్సియా నుంచి ఇ–మెయిల్ వచ్చిందని చిత్రనిర్మాత కేఎస్ సినీష్ సోషల్ మీడియాలో పేర్కొని, ఆనందం వ్యక్తం చేశారు. ఇక ఈ చిత్రకథ విషయానికి వస్తే... ఒకే ఇంట్లో అద్దెకు ఉండే ఐటీ ఉద్యోగి ఈశ్వర్, ప్రభుత్వోద్యోగి ఎస్. ఇళంపరుతి పార్కింగ్ విషయంలో ఈగోలకు పోయి ఒకరికి ఒకరు ఎలా హాని చేసుకున్నారు? ఆ తర్వాత తమ తప్పులను ఎలా తెలుసుకున్నారు? అనే అంశాల నేపథ్యంతో ‘పార్కింగ్’ కథ సాగుతుంది.రూ. 3 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా రూ. 15 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లుగా కోలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ తమిళ ‘పార్కింగ్’ సినిమాను తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషలతో పాటు ఓ విదేశీ భాషలోనూ రీమేక్ చేయడానికి చిత్ర దర్శక–నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారని కోలీవుడ్ సమాచారం. -
వివాదంలో రఘువరన్ బీటెక్ నటి.. !
కోలీవుడ్ ధనుశ్ నటించిన చిత్రం రఘువరన్ బీటెక్. ఈ చిత్రంలో అతనికి జోడీగా అమలా పాల్ నటించింది. ఇంజినీరింగ్ చదివిన నిరుద్యోగుల బాధలను చూపే నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలో రఘువరన్‌కు తల్లిగా నటి శరణ్య పొన్వన్నన్ నటించారు. అమాయకపు తల్లి పాత్రలో మెప్పించారు. తాజాగా ఆమె ఓ వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. చెన్నైలోని వారు నివాసముండే విరుంగబాక్కంలో పార్కింగ్ గొడవ ఏకంగా పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్లింది. పార్కింగ్ విషయంలో పొరుగింటి వారితో వివాదం తలెత్తింది. దీంతో పక్కింటి వారు శరణ్య పొన్వన్నన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమను నటి బెదిరించిందని పేర్కొంటూ శ్రీదేవి అనే మహిళ పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభినట్లు తెలుస్తోంది. అయితే శరణ్య రఘువరన్ బీటెక్‌తో పాటు 24, వేదం, గ్యాంగ్ లీడర్, మహాసముద్రం, ఖుషి లాంటి సినిమాల్లోనూ కనిపించారు. -
OTT లోకి హిట్ మూవీ
-
ఓటీటీలోకి వచ్చేసిన ఆ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలోకి మరో క్రేజీ మూవీ వచ్చేసింది. మనలో చాలామందికి తెలిసిన సమస్యని సినిమాగా తీశారు. తక్కువ బడ్జెట్‌తో చాలా సింపుల్ కాన్సెప్ట్‌తో తీసిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. హిట్ అయిపోయింది. ఇప్పుడీ సినిమానే నెలరోజుల్లో ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. తాజాగా ఇది డిజిటల్ ఆడియెన్స్‌కి కూడా అందుబాటులోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటా సినిమా? ఏ ఓటీటీలో రిలీజైంది? (ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) ఓటీటీలో ఆ సినిమా జనాభా పెరిగిపోయింది. అందరి దగ్గర టూ-ఫోర్ వీలర్స్ ఉంటున్నాయి. వాడకం బాగానే ఉంది గానీ ప్రతి ఒక్కరికీ పార్కింగ్ ప్రాబ్లమ్ వస్తుంది. ఇప్పుడు ఇదే అంశాన్ని తీసుకుని తమిళంలో 'పార్కింగ్' పేరుతో ఓ మూవీ తీశారు. 'జెర్సీ'లో నాని కొడుకుగా చేసిన హరీశ్ కల్యాణ్.. ఇందులో హీరోగా చేశాడు. డిసెంబరు 1న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అయిపోతుంది. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. ఈ వీకెండ్ దీన్ని చూస్తూ టైమ్ పాస్ చేసేయొచ్చు. కథేంటి? సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసే హీరో. ఓ ఇంట్లో అద్దెకు ఉంటాడు. పెళ్లయిన తర్వాత కొత్త కారు కొంటాడు. అయితే ఉంటున్న ఇంట్లో పార్కింగ్ సమస్య వస్తుంది. హౌస్ ఓనర్-హీరో ఒకరినొకరు రక్తాలొచ్చేలా కొట్టుకునేంతవరకు.. ఇంకా చెప్పాలంటే పోలీస్ కేసుల వరకు వెళ్తారు. మరి ఈ పార్కింగ్ సమస్యని వీరిద్దరూ ఎలా పరిష్కరించారు? చివరకు ఏమైందనేదే స్టోరీ. (ఇదీ చదవండి: అనుకున్న టైమ్ కంటే ముందే ఓటీటీలోకి 'హాయ్ నాన్న'.. స్ట్రీమింగ్ డేట్?) -
అలాంటి వాళ్లు రాజకీయాల్లోకి రావాలి: యంగ్ హీరో
దళపతి విజయ్.. రాజకీయాల్లోకి రావడం తన వ్యక్తిగత కోరిక అని, ఎవరు వచ్చినా సుపరిపాలన అందిస్తే బాగుంటుందని.. అలాంటి వాళ్లే పాలిటిక్స్‌లోకి రావాలని యంగ్ హీరో హరీశ్ కల్యాణ్ అన్నాడు. తాజాగా 'పార్కింగ్' మూవీతో థియేటర్లలోకి వచ్చాడు. ఈ క్రమంలోనే తమిళనాడు వ్యాప్తంగా థియేటర్లని సందర్శిస్తున్నాడు. ఈరోడ్‌లోని అన్నా థియేటర్లో ప్రేక్షకులతో కలిసి హీరో హరీశ్ కల్యాణ్ తన మూవీ చూశాడు. తమిళ యాక్టర్స్.. వర్ష ప్రభావ బాధితులకు వీలైనంత సాయం చేస్తున్నారని చెప్పాడు. వరద బాధితుల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి తన వంతు సాయంగా లక్ష రూపాయలు, 'పార్కింగ్' మూవీ టీమ్ తరఫున రూ.2 లక్షలు ఇచ్చినట్టు హరీస్ చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: సెన్సార్ పూర్తి చేసుకున్న సలార్.. పిల్లలకు థియేటర్లలోకి నో ఎంట్రీ!) -
అందరికీ ఉన్న సమస్యే.. ఏకంగా సినిమా తీసేశారు!
'జెర్సీ' ఫేమ్ హరీష్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమా 'పార్కింగ్'. ఇందూజ హీరోయిన్. రామ్ కుమార్ బాలకృష్ణన్ దర్శకత్వం వహించారు. ఫ్యాషన్ స్టూడియోస్, సోల్జర్స్ ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకుని డిసెంబర్ 1న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా శుక్రవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. (ఇదీ చదవండి: Bigg Boss 7: అశ్విని ఎలిమినేట్.. ఏడు వారాలకు రెమ్యునరేషన్ ఎంత తెలుసా?) ఈ కార్యక్రమంలో దర్శకుడు లోకేష్ కనకరాజ్, అరుణ్ రాజ్ కామరాజా, రవికుమార్, రతన్ కుమార్, రంజిత్ జయకొడి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఇక హీరో హరీష్ కల్యాణ్ మాట్లాడుతూ.. చిత్ర జయాపజయాలు ప్రేక్షకుల చేతుల్లోనే ఉంటాయని, 'పార్కింగ్' లాంటి మంచి కథని వదులుకుంటే కచ్చితంగా తాను బాధపడేవాడినని చెప్పుకొచ్చాడు. లోకేష్ మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని తాను ఇంతకుముందే చూశానని, పార్కింగ్ అనే పేరుతో ఒక పెద్ద సమస్యను ఈ చిత్రంలో చూపించారని దర్శకుడిని అభినందించారు. చిత్రంలో అందరూ చాలా బాగా నటించారని పేర్కొన్నారు. కథేంటి? ట్రైలర్ బట్టి చూస్తే.. సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసే హీరో. ఓ ఇంట్లో అద్దెకు ఉంటాడు. పెళ్లయిన తర్వాత కొత్త కారు కొంటాడు. అయితే ఉంటున్న ఇంట్లో పార్కింగ్ సమస్య వస్తుంది. ఓనర్-హీరో ఒకరినొకరు రక్తాలొచ్చేలా కొట్టుకునేంతవరకు వెళ్తుంది. పోలీస్ కేసుల వరకు వెళ్తారు. మరి ఈ పార్కింగ్ సమస్యని ఎలా పరిష్కరించారు? చివరకు ఏమైందనేదే సినిమా స్టోరీ. (ఇదీ చదవండి: Bigg Boss 7: రైతుబిడ్డ వల్ల రెండోసారి రతిక ఎలిమినేట్.. వేరే లెవల్ రివేంజ్!)\ -
36 రోజుల్లో పూర్తయిన సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే?
వైవిధ్యభరిత కథా చిత్రాలను ఎంపిక చేసుకుని నటిస్తున్న యువనటుడు హరీష్‌కల్యాణ్. ఈయన ఇటీవల ఎల్జీఎం చిత్రంతో ప్రేక్షకులను అలరించి తాజాగా పార్కింగ్తో తెరపైకి రావడానికి సిద్ధం అవుతున్నారు. నటి ఇందుజా నాయకిగా నటించిన ఇందులో ఎంఎస్.భాస్కర్, రమా, ఇళవరసు, ప్రార్థన ముఖ్యపాత్రలు పోషించారు. రామ్‌కుమార్ బాలకృష్ణన్ అనే నవ దర్శకుడిని పరిచయం చేస్తూ ఫ్యాషన్ స్టూడియోస్, సోల్జర్స్ ఫ్యాక్టరీ సంస్థలు నిర్మించిన చిత్రం ఇది. శామ్.సీఎస్ సంగీతాన్ని, జిజు సన్ని ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకుని డిసెంబర్ ఒకటో తేదీన విడుదలకు సిద్ధమఅవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ చైన్నెలో సమావేశం ఏర్పాటు చేసింది. లాక్డౌన్ సమయంలో జరిగిన సంఘటనలను ఆధారంగా చేసుకుని రాసుకున్న కథతో తెరకెక్కించిన చిత్రమే పార్కింగ్ అని దర్శకుడు రామ్‌కుమార్ బాలకృష్ణన్ చెప్పారు. ఆ సమయంలో జరిగిన పలు సంఘటనలు ఈ చిత్రంలో చోటుచేసుకుంటాయన్నారు. ఇప్పుడు ప్రతి వ్యక్తి ఎప్పుడో, ఎక్కడో ఎదుర్కొనే సంఘటనలే నేపథ్యమని పేర్కొన్నారు. ముఖ్యంగా ఈగో అనే అంశాన్ని ఇతివృత్తంగా తీసుకుని పార్కింగ్ చిత్రాన్ని రూపొందించినట్లు చెప్పారు. ఇందులో హరీష్ కల్యాణ్ ఒక ఐటీ కంపెనీలో ఉద్యోగిగానూ.. ఆయనకు భార్యగా ఇందుజా నటించారని తెలిపారు. మరో ముఖ్యపాత్రలో నటుడు ఎంఎస్.భాస్కర్ నటించారని తెలిపారు. చిత్రంలో రెండు పాటలు ఉంటాయని చెప్పారు. ప్రీ ప్రొడక్షన్స్‌కు అధిక సమయం కేటాయించి షూటింగ్‌ను చైన్నె పరిసర ప్రాంతాల్లో 36 రోజుల్లో పూర్తిచేసినట్లు తెలిపారు. మానవతావాదం ముఖ్యం అని చెప్పే చిత్రంగా పార్కింగ్ ఉంటుందని దర్శకుడు తెలిపారు. తనకు కథను చెప్పిన దానికంటే బెటర్‌గా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరపై ఆవిష్కరించారని నటుడు హరీశ్‌కల్యాణ్ పేర్కొన్నారు. -
కలెక్టరేట్లకు సౌర సొబగులు
జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లో సోలార్ పార్కింగ్ షెడ్ల ఏర్పాటు దిశగా తెలంగాణ రెడ్కో (రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్) అడుగులు వేస్తోంది. ఇప్పటికే రెండు జిల్లాల్లోని కలెక్టర్ కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా సోలార్ పార్కింగ్ షెడ్లను ఏర్పాటు చేయగా తాజాగా ఇతర జిల్లాల్లోనూ వాటి ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం సూర్యా పేట, ఖమ్మం జిల్లా కలెక్టరేట్ల క్యాంపస్‌లలో సోలార్ పార్కింగ్ షెడ్ల నిర్మాణం పూర్తయింది. 20న సూర్యాపేట ప్లాంటును సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.– సాక్షి, హైదరాబాద్ ఖమ్మంలో 200 కేవీ సామర్థ్యంతో.. ఖమ్మం జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయాల సముదాయంలో 200 కేవీ (కిలోవాట్ల) గ్రిడ్ అనుసంధానిత సోలార్ విద్యుత్ ప్లాంటును తెలంగాణ రెడ్కో ఏర్పాటు చేసింది. పార్కింగ్ స్థలాన్ని సద్వినియోగం చేసుకొనేలా పార్కింగ్ ప్రాంత పైభాగంలో సోలార్ ప్యానల్స్‌ను అమర్చింది. ప్రస్తుతం కలెక్టరేట్ కాంప్లెక్స్‌లో హైటెన్షన్ సర్వీస్‌లో నెలకు 14 వేల యూనిట్లకుపైగా విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. లోటెన్షన్ సర్వీస్‌లో మరో 14 వేల యూనిట్లకుపైగా విద్యుత్ ఖర్చవుతోంది. తాజాగా 200 కేవీ సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుతో 24 వేల యూనిట్ల వరకు సోలార్ విద్యుత్ ఉత్పత్తి జరగనుంది.దీనివల్ల రెండు సర్వీసుల్లో కలిపి నెలకు 4–5 వేల యూనిట్ల వరకు మాత్రమే గ్రిడ్ నుంచి వినియోగించుకున్నా సరిపోనుంది. అంతమేర మాత్రమే విద్యుత్ బిల్లు చెల్లించాల్సి రానుంది. ప్రస్తుతం నెలకు రూ. 1.80 లక్షల వరకు విద్యుత్ బిల్లులను కలెక్టరేట్ కార్యాలయాలు చెల్లిస్తుండగా సోలార్ ప్లాంట్ ఏర్పాటుతో 80% వరకు విద్యుత్ బిల్లు తగ్గనుంది. సోలార్ విద్యుత్ వినియోగం వల్ల ఏటా రూ. 20 లక్షల వరకు చార్జీల భారం తగ్గనుంది. ఈ లెక్కన 200 కిలోవాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి అయిన ఖర్చు ఆరున్నరేళ్లలో తీరనుంది. మరో రెండు జిల్లాల్లో... రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కాంప్లెక్స్‌లో 100 కేవీ సామర్థ్యంతో సోలార్ ప్లాంట్, కామారెడ్డి కలెక్టరేట్ కాంప్లెక్స్‌లో 100 కేవీ సామర్థ్యంగల ప్లాంట్ పనులు పురోగతిలో ఉన్నాయి. మరోవైపు ఇతర కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాలు సైతం సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు చొరవ చూపా లని తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీశ్‌రెడ్డి సూచించారు. ఈ ప్రాజెక్టు ఏర్పాటుతో సంప్రదాయ విద్యుత్ ఉత్పత్తి వల్ల జరిగే కాలుష్యాన్ని తగ్గించడంతోపాటు విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకోవచ్చని వివరించారు. ప్లాంట్ ఏర్పాటుకు అయ్యే ఖర్చు కూడా గరిష్టంగా ఆరున్నర ఏళ్ల లో తిరిగి వస్తుందన్నారు. ఈ ప్లాంట్ల నిర్వహణ బాధ్య తను 20 ఏళ్లపాటు తెలంగాణ రెడ్కో పర్యవేక్షించనుంది. సూర్యాపేటలో 100 కేవీ సామర్థ్యంతో.. సూర్యాపేట జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయాల సముదాయంలో 100 కిలోవాట్ల సోలార్ రూఫ్ టాప్ విద్యుత్ ప్లాంటును ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఏటా 1.44లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దీని ద్వారా ఏటా రూ.11.23లక్షల మేర ఆదా కానున్నట్లు రెడ్కో అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మించడానికి అయిన వ్యయం ఐదున్నర ఏళ్లలో తీరనున్నట్లు వివరిస్తున్నారు. -
పార్కింగ్ కోసం గొడవ.. వీడియో వైరల్..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో దారుణం జరిగింది. ఆదివారం రాత్రి ఫ్లోరా హెరిటేజ్ హౌసింగ్ సొసైటీ వద్ద స్థానికులు గొడవకు దిగారు. ఒకరిపై మరొకరు దాడికి దిగి చేతికి దొరికిన వస్తువుతో ఘర్షణకు దిగారు. హౌసింగ్ సొసైటీలో పార్కింగ్ వద్ద వాగ్వాదం కాస్త గొడవకు దారితీసిందని స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని గొడవను సద్దుమణిగించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో చొరవ తీసుకున్న పోలీసులపై కూడా నిందితులు దాడి చేశారు. ఈ వీడియో స్థానికంగా వైరల్‌గా మారింది. ఘర్షణకు దిగిన నిందితులను పోలీసు వ్యాన్‌లోకి ఎక్కించడానికి ప్రయత్నించగా.. వారు నిరాకరించారు. పోలీసులు హౌసింగ్ సొసైటీలోకి రాకుండా నిందితులు అడ్డుకున్నారు. మరికొంత మంది స్థానికులు పోలీసులపై దాడికి ప్రయత్నించారు. పోలీసులు కూడా తమపై విచక్షణా రహితంగా దాడి చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తమ మహిళల మొబైల్ ఫోన్లను కూడా లాక్కెళ్లారని చెబుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. pic.twitter.com/iTA7e29Hu6 — POLICE COMMISSIONERATE GAUTAM BUDDH NAGAR (@noidapolice) August 14, 2023 ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు. ఇద్దరిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఈ ఏడాది ఆరంభంలో ఇలాంటి ఘటనే నోయిడాలో జరిగింది. పార్కింగ్ విషయంలో వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. అప్పట్లో ఈ దృశ్యాలు వైరల్‌గా మారాయి. ఇదీ చదవండి: హిమాచల్ ప్రదేశ్‌లో జల ప్రళయం.. 29 మంది మృతి.. -
ఖరీదైన బైకు.. కంట పడిందో మాయం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జల్సాలకు అలవాటు పడిన ఆ యువకులు సులువుగా డబ్బులు సంపాదించేందుకు చోరీలే మార్గంగా ఎంచుకున్నారు. గతంలో ఆటో మొబైల్ రంగంలో పనిచేసి ఉండటంతో, ద్విచక్ర వాహనాల చోరీలు మొదలుపెట్టారు. చివరకు పోలీసులకు పట్టుబడ్డారు. స్థానిక టూ టౌన్ పోలీస్ స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దక్షిణ మండలం డీఎస్పీ ఎం.శ్రీలత, టూటౌన్ సీఐ టి.గణేష్ ఈ వివరాలు తెలిపారు. వారి కథనం ప్రకారం.. రాజమహేంద్రవరం రూరల్ ధవళేశ్వరానికి చెందిన గుడి పవన్‌కుమార్, నగరంలో తాడితోట వీరభద్రనగర్కు చెందిన ఎర్రారపు సత్యనారాయణ, గుత్తాల నవీన్ కుమార్ స్నేహితులు. వీరికి గతంలో ఆటోమొబైల్ మెకానిక్‌లుగా పనిచేసిన అనుభవం ఉంది. జల్సాలకు, చెడు అలవాట్లకు బానిసలైన వీరు సులువుగా డబ్బులు సంపాదించేందుకు బైకుల చోరీలు మొదలు పెట్టారు. కురక్రారు ఎక్కువగా మక్కువ పడే ఖరీదైన స్పోర్ట్స్ బైకులను లక్ష్యంగా ఎంచుకుని చోరీలు చేసేవారు. తాళం వేసి ఉన్న బైకులను చిటికెలో దొంగిలించేవారు. పలుమార్లు పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లి వచ్చినా నేరాల బాట వీడలేదు. ఇటీవల నగరంలో ద్విచక్ర వాహన చోరీలు ఎక్కువగా జరుగుతూండటంతో ఎస్పీ సీహెచ్.సుధీర్ కుమార్‌రెడ్డి ఆదేశాల మేరకు క్రైమ్ అదనపు ఎస్పీ జి.వెంకటేశ్వరరావు, డీఎస్పీ శ్రీలత పర్యవేక్షణలో సీఐ గణేష్ దర్యాప్తు చేశారు. పాత నేరస్తుల కదలికలపై నిఘా పెట్టి, నిందితులు ముగ్గురినీ అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో వారి నేరాల చిట్టా బయటపడింది. ఇటీవల రాజమహేంద్రవరం, కాకినాడ, మండపేట, అనపర్తి, అమలాపురం ప్రాంతాల్లోనే కాకుండా భీమవరం, గుంటూరు నగరాల్లో కూడా వారు దొంగిలించిన 31 బైకులను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.25 లక్షల వరకూ ఉంటుందని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు, వాహనాల రికవరీలో ప్రతిభ చూపిన ఎస్సైలు జీవీవీ సత్యనారాయణ, కేఎం జోషీ, హెడ్ కానిస్టేబుళ్లు సీహెచ్ శ్రీనివాసరావు, ఎస్.రాజశేఖర్, కానిస్టేబుళ్లు కె.ప్రదీప్ కుమార్, వీరబాబు, బీఎస్కే నాయక్, ఎస్‌వీవీఎస్‌ఎన్ మూర్తి, కె.కామేశ్వరరావు, కరీమ్ బాషా, కె.సత్యనారాయణ, డి.శ్రీనివాస్‌లను డీఎస్పీ అభినందించారు. వేసవి చోరీలపై జాగ్రత్త ప్రస్తుతం వేసవి కాలం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ శ్రీలత ప్రజలకు సూచించారు. పాఠశాలలకు సెలవుల నేపథ్యంలో ఇళ్లకు తాళాలు వేసి, కుటుంబ సమేతంగా బంధువుల ఇళ్లకు, విహార యాత్రలకు వెళ్తూంతుంటారని, అటువంటి సమయంలో చోరీలు జరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇలా ఇల్లు విడిచి వెళ్లేవారు సమీప పోలీసు స్టేషన్లో సమాచారం ఇస్తే గస్తీ పోలీసులు ఆయా ఇళ్లపై నిఘా పెడతారని చెప్పారు. -
Telangana: సచివాలయం కింద చెరువు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కొత్త సచివాలయం సకల హంగులతో సిద్ధమవుతోంది. భవనం భూగర్భంలో ఏకంగా ఓ మినీ రిజర్వాయర్‌ను నిర్మించారు. రెండున్నర లక్షల లీటర్ల సామర్ధ్యంతో ఈ స్టోరేజీ ట్యాంకును సిద్ధం చేశారు. మరోవైపు సచివాలయంలో వినియోగించే దీపాలకు అవసరమైన విద్యుత్తును సోలార్ పద్ధతిలో ఉత్పత్తి చేయబోతున్నారు. ఇందుకోసం భవనం రూఫ్ టాప్‌లో భారీ సౌర ఫలకాలను ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే సచివాలయం ప్రధాన ద్వారం ముందు వంద అడుగుల వెడల్పుతో రోడ్డు నిర్మిస్తున్నారు. వేయి అడుగుల పొడవుండే ఈ రోడ్డు చివరలో రెండు వరసల్లో ఏకంగా 300 కార్లను నిలిపి ఉంచేలా పార్కింగ్ వసతి అందుబాటులోకి రానుంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త సచివాలయ భవనం వచ్చే నెల 17న ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. నిర్మాణంలో ఎన్నో ప్రత్యేకతలుండగా, ప్రాంగణంలోనూ మరిన్ని ప్రత్యేకతలు జోడించారు. వెరసి ఇదో ప్రత్యేక నిర్మాణంగా నిలవనుంది. వాన నీటిని ఒడిసిపట్టేలా.. వాన నీటిని ఒడిసి పట్టేందుకు వీలుగా సచివాలయం కింద రిజర్వాయర్ నిర్మించారు. భవనం నలువైపుల నుంచి వాన నీటిని ఇందులోకి తరలించేందుకు ప్రత్యేక పైప్‌లైన్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. సచివాలయంలో దాదాపు 9 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో పచి్చక బయళ్లుంటాయి. భవనం ముందు వైపు రెండు వైపులా మూడెకరాల చొప్పున రెండు, మధ్య కోర్ట్‌యార్డు, ఇతర ప్రాంతాల్లో కలిపి మరో మూడెకరాల మేర లాన్లుంటాయి. వాటి నిర్వహణకు భారీగా నీటి వినియోగం అవసరమవుతుంది. భూగర్భ నీటిని పొదుపు చేసే క్రమంలో పచి్చకబయళ్లకు వాననీటిని వాడే ఉద్దేశంతో ఈ ఏర్పాటు చేశారు. బయట రోడ్డు లెవల్ కంటే సచివాలయం ప్రాంగణం బేస్ ఐదడుగుల ఎత్తున ఉంటుంది. దాని మీద భవన నిర్మాణం జరిగింది. దీంతో ఎక్కడా వాననీరు నిలిచిపోయే పరిస్థితి ఉండదు. పార్కింగ్‌కు వీలుగా రోడ్డు విస్తరణ సచివాలయ ప్రధాన ద్వారం ముందున్న రోడ్డును వంద అడుగులకు విస్తరించేందుకు వీలుగా ఫుట్‌పాత్‌పై ఉన్న దాదాపు 40 చెట్లను తొలగించనున్నారు. ఈ మేరకు సంబంధిత కమిటీ అనుమతి ఇచ్చింది. ఆ చెట్లను సంజీవయ్య పార్కులో (ట్రాన్స్‌లొకేట్) తిరిగి నాటనున్నారు. కాగా సచివాలయానికి వివిధ పనులపై వచ్చే వారి వాహనాలు నిలిపేందుకు లోపల విశాలమైన పార్కింగ్ యార్డులున్నాయి. అవి సరిపోని పక్షంలో, ఈ వంద అడుగుల రోడ్డు చివరలో నిలిపేందుకు వీలుగా ఏర్పాట్లు చేయనున్నారు. ఇక సాయంత్రం వేళ సాగర తీరానికి వచ్చే పర్యాటకులకు ప్రస్తుతం పార్కింగ్ ఇబ్బందులున్నాయి. దీన్ని కూడా దృష్టిలో ఉంచుకుని ఆ కొత్త రోడ్డులో రెండు వరుసల్లో 300 కార్లు నిలిపేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. సౌర వెలుగులు పది లక్షల చదరపు అడుగుల సువిశాల భవనంలో వేల సంఖ్యలో విద్యుత్ దీపాల వినియోగం ఉంటుంది. దీంతో కరెంటు ఖర్చు ఎక్కువే అవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కొంతమేర పొదుపు చేసేందుకు సౌర విద్యుత్తు వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. భవనం రూఫ్‌టాప్‌లో సౌర ఫలకాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. భవనాన్ని ప్రారంభించిన తర్వాత వీటి ఏర్పాటు మొదలు పెడతారు. ఇందుకోసం ఓ కన్సల్టెంటును కూడా నియమిస్తున్నారు. చదవండి: భారత జాతి విముక్తి కోసమే బీఆర్ఎస్! -
ఘోర అగ్ని ప్రమాదం... 21 కార్లు దగ్ధం
ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. బహుళ అంతస్తుల భవనంలోని పార్కింగ్ ప్రదేశంలో ఈ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 21 కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటన ఢిల్లీలోని సుభాష్ నగర్లో సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు చోటు చేసుకుంది. ఈ ఘటనకు గల కారణాలేంటో తెలియరాలేదని అధికారులు చెబుతున్నారు. అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లు పరిశీలించగా..ఒక అపరిచిత వ్యక్తి పార్కింగ్ ప్రదేశంలో సంచరించినట్లు కనిపించిందని అదికారులు తెలిపారు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే ఆరు అగ్నిమాపక దళాలు సంఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ని చేపట్టినట్లు తెలిపారు. రెస్క్యూ సిబ్బంది ఉదయం సుమారు 6.10 నిమిషాలకు మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు బృందాలుగా ఏర్పడి ముమ్మరంగా ఈ ఘటనపై దర్యాప్తు చేయడం ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు. ఆ ఘటనకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతోంది. मेरे वॉर्ड #SubhashNagar में सुबह 3 बजे के आस-पास किसी असामाजिक तत्व ने MCD की मल्टी लेवल कार पार्किंग में आग लगा दी जिसमें लगभग 30-35 गाड़ियाँ जलकर ख़ाक हो गई हैं। मैं सुबह से ही मौक़े पर मौजूद हूं और दोषी को पकड़वाने के लिए हर संभव प्रयास कर रहा हूं pic.twitter.com/itbGV2wQ7U — Aditya Goswami (@AdityaGoswami_) December 26, 2022 (చదవండి: ఇంట్లో ఆయుధాలు లేదా పదునైనా కత్తులైనా ఉంచుకోండి: బీజేపీ ఎంపీ షాకింగ్ వ్యాఖ్యలు) -
కర్కశత్వం: పార్కింగ్ వివాదం...ఇటుకతో కొట్టి చంపేశాడు
న్యూఢిల్లీ: కారు పార్కింగ్ విషయంతో తలెత్తిన వివాదం హత్యకు దారి తీసింది. ఈ ఘటన ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది. బాధితుడు వరణ్ రోడ్డు వద్ద ఉండే తినుబండారాలకు సమీపంలో తన కారుని పక్కగా ఆపాడు. ఐతే వరుణ్ పార్కింగ్ వద్ద నిందితుడి కారు కూడా ఉంది. వరుణ్ అక్కడే పార్కింగ్ చేయడం వల్ల కారు డోర్లు ఓపెన్ చేయడం కుదరదు. దీంతో సదరు వ్యక్తి కోపంతో వరుణ్‌తో పార్కింగ్ విషయమై గొడవపడ్డాడు. ఆ వాగ్వాదం కాస్త ఘర్ణణకు దారితీసింది. దీంతో నిందితుడు కోపంతో ఇటుకతో వరుణ్ తలను పగలుగొట్టి చంపి పారిపోయాడు. అందుకు సంబంధించిన ఘటనను ఒక పాదాచారి రికార్డు చేయడంతో వెలుగు చూసింది. దీంతో పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడు తండ్రి రిటైర్డ్ పోలీస్ అధికారి అని, వరుణ్ డైరీ బిజినెస్ చేస్తుంటాడని చెబుతున్నారు పోలీసులు. అంతేగాదు అదే సమయంలో బాధితుడి స్నేహితుడు దీపక్ కూడా అక్కడే ఉన్నట్లు పేర్కొన్నారు. ఇంత దారుణంగా శత్రువులను కూడా హతమార్చరంటూ బాధితుడి స్నేహితుడు దీపక్ కన్నీటి పర్యంతమయ్యాడు. పోలీసులు ఐదు బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. (చదవండి: అన్నదమ్ములిద్దరూ ఇద్దరే!...ఒకరు కిడ్నాప్, మరోకరు అఘాయిత్యాలు) -
పార్క్ చేసిని కారులో ఏకంగా 47 పిల్లులు ! ఫోటో వైరల్
ఎవరికైన ఒకటో రెండో లేక మహా అయితే నాలుగు పెంపుడు జంతువులు ఉంటాయి. అంతేగానీ ఎవరు పెద్ద మొత్తంలో జంతువులను పెంచుకోరు. పైగా వాటి ఆలనాపాలన చూసుకోవడం కష్టమవుతుంది కూడా. ఐతే ఇక్కడోక యజమాని దగ్గర ఉన్న పెంపుడు జంతువుల సంఖ్యను చూసి ఆశ్చర్యపోతారు! పైగా వాటితో ఎక్కడ నివశిస్తున్నాడో వింటే నోరెళ్లబెడతారు. వివరాల్లోకెళ్తే...అమెరికాలోని మిన్నెసోటాలోని ఒక ప్రదేశంలో పార్క్ చేసిన కారులో ఏకంగా 47 పిల్లులు ఉన్నాయి. భారత్‌లో 40 ఉంటే అధిక ఉష్ణోగ్రతలు అంటాం. కానీ అమెరికాలో కేవలం 30 డిగ్రిల ఉష్ణోగ్రత నమోదైతే చాలు ప్రజల గగ్గోలు పెట్టేస్తారు. ప్రస్తుతం అక్కడ మిన్నెసోటాలో సుమారు 32 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ అధిక ఉష్ణోగ్రతలు కారణంగా ప్రలెవ్వరూ బయటకు అడుగుపెట్టను కూడా పెట్టడం లేదు. ఐతే ఒక వ్యక్తికి 47 పెంపుడు పిల్లులు ఉన్నాయి. ఈ మధ్య అతనికి కొన్ని కారణాల వల్ల ఉండేందుకు ఇల్లు కూడా లేకుండా పోయింది. ఐతే తన పెంపుడు పిల్లులను విడిచిపెట్టేందకు ఇష్టపడలేదు. దీంతో అతను ఆ 47 పిల్లులను తీసకుని తన కారులోనే నివశిస్తున్నాడు. ఈ మేరకు ఒకతను కారు కిటికి తట్టినప్పుడూ ఆ యజమాని విషయమంతా చెప్పాడంతో ఈ ఘటన వెలుగు చూసింది. దీంతో యానిమల్ హ్యూమన్ సొసైటీ(ఏహెచ్ఎస్) రంగంలోకి దిగి ఆ 47 పిల్లులను స్వాధీనం చేసకుని వాటికి అవసరమైన సంరక్షణను అందించింది. అవన్నీ ఒకచోట చాలా రోజులుగా ఉన్నప్పటికీ ఆరోగ్యంగానే ఉన్నాయని ఏహెచ్ఎస్ తెలిపింది. (చదవండి: టిఫిన్ ప్లేట్లో బల్లి...కస్టమర్‌కి ఎదురైన చేదు అనుభవం) -
చలో మేడారం: రూట్‌మ్యాప్, వాహనాల పార్కింగ్ వివరాలు
తెలంగాణ కుంభమేళా.. వనదేవతల జాతర ఇప్పటికే భక్తజనంతో పోటెత్తుతోంది. ఈ నెల 16నుంచి 19వ తేదీ వరకు జాతర జరగనుంది. ఈ నాలుగు రోజుల పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సొంత వాహనాల్లో వస్తుంటారు. ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకుని పోలీసులు పోయేదారి.. వచ్చేదారి అంటూ వన్‌వే చేశారు. జాతరకు భక్తులు ఎక్కువగా అటవీ ప్రాంతంలోని చిన్నచిన్న పల్లెల మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. వాహనాల పార్కింగ్, తిరుగు ప్రయాణం ఎలా అన్న అనుమానాలు చాలామందిలో ఉంటాయి. భక్తుల అవసరార్థం.. ప్రయాణం సాఫీగా సాగేందుకు పోలీసులు రూట్‌మ్యాప్‌ను విడుదల చేశారు. ఆ మ్యాప్‌ను మరింత సరళతరం చేసి ‘సాక్షి’ మీకు అందిస్తోంది. – సాక్షిప్రతినిధి, వరంగల్ హైదరాబాద్.. హైదరాబాద్ నుంచి మేడారం వెళ్లే భక్తులు నేషనల్ హైవే–163 ద్వారా జనగామ మీదుగా రఘునాథపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సమీపంలో భువనగిరి–ఆరెపల్లి బైపాస్ ఎక్కాలి. ఆరెపల్లి నుంచి నేరుగా ఆత్మకూరు, మల్లంపల్లి, ములుగు, పస్రా.. నార్లాపూర్ నుంచి మేడారం చేరుకుంటారు. తిరుగు ప్రయాణంలో బయ్యక్కపేట, దూదేకులపల్లి, భూపాలపల్లి, రేగొండ, పరకాల, గూడెప్పాడ్, హనుమకొండ మీదుగా వెళ్లాలి. పార్కింగ్ : నార్లాపూర్ ఖమ్మం, నర్సంపేట, ఇల్లెందు, మానుకోట ఖమ్మం, ఇల్లెందు, మహబూబాబాద్,నర్సంపేట, మల్లంపల్లి , పస్రా నుంచి నార్లాపూర్ చేరుకోవాల్సి ఉంటుంది. వీరు తిరుగు ప్రయాణంలో బయ్యక్కపేట, రేగొండ, పరకాల మీదుగా గుడెప్పాడు, వరంగల్ నుంచి పోవాల్సి ఉంటుంది. పార్కింగ్ : వెంగ్లాపూర్, నార్లాపూర్ ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ హుజూరాబాద్, పరకాల, రేగొండ, గణపురం, వెంకటాపురం(ఎం), జగాలపల్లి క్రాస్ నుంచి పస్రా మీదుగా మేడారం చేరుకుంటారు. తిరుగు ప్రయాణంలో బయ్యక్కపేట, భూపాలపల్లి, గారెపల్లి నుంచి మంథని, గోదావరిఖని, మంచిర్యాల నుంచి ఆదిలాబాద్ చేరుకుంటారు. పార్కింగ్ : నార్లాపూర్, కొత్తూరు లింగాల, గుండాల ఇల్లెందు, రొంపేడు, గంగారం, పూనుగొండ్ల, లింగాల, పస్రా, నార్లాపూర్, మేడారం చేరుకోవాల్సి ఉంటుంది. వీరు తిరుగు ప్రయాణంలో బయ్యక్కపేట, దూదేకులపల్లి, పరకాల, రేగొండ మీదుగా గూడెప్పాడ్, వరంగల్ నుంచి నర్సంపేట చేరుకోవాల్సి ఉంటుంది. పార్కింగ్ : వెంగ్లాపూర్ రామగుండం, మంథని రామగుండం, గోదావరిఖని, మంథని, కాటారం, గారెపల్లి ఎడమవైపు నుంచి కాల్వపల్లి మీదుగా మేడారం చేరుకుంటారు. తిరుగు ప్రయాణంలో వచ్చిన రూట్లోనే వెళ్లాలి. పార్కింగ్ : కాల్వపల్లి, నార్లాపూర్ కాళేశ్వరం, మహారాష్ట్ర.. కరీంనగర్, కాళేశ్వరం ఆపై ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు కాటారం, పెగడపల్లి, కాల్వ పల్లి మీదుగా ఊరట్టం చేరుకోవాలి. తిరుగు ప్రయాణంలో బయ్యక్కపేట, దూదేకులపల్లి మీదుగా కరీంనగర్ చేరుకోవాలి. పార్కింగ్ : ఊరట్టం వాజేడు, ఛత్తీస్‌గఢ్ వెంకటాపురం(కె) ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చే ప్రైవేటు వాహనాలు వాజేడు, జగన్నాథపురం నుంచి ఏటూరునాగారం, చిన్నబోయినపల్లి, కొండాయి, మల్యాల, ఊరట్టం నుంచి మేడారం చేరుకోవాల్సి ఉంది. తిరుగు ప్రయాణంలో వచ్చిన రూట్‌మీదుగా వెళ్లాలి. పార్కింగ్ : ఊరట్టం మణుగూరు, భద్రాచలం, కొత్తగూడెం కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు, మంగపేట, ఏటూరునాగారం నుంచి చిన్నబోయినపల్లి, కొండాయి, ఊరట్టం వరకు ప్రైవేటు వాహనాల్లో చేరుకోవాలి. అదే మార్గంలో తిరుగు ప్రయాణం చేయాల్సి ఉంది. ఈ రూట్లో ఏదైనా ట్రాఫిక్ సమస్య వస్తే అత్యవసరంగా ఏటూరునాగారం జెడ్పీహెచ్ఎస్ పార్కింగ్ ప్రాంతాన్ని చేరుకోవాల్సి ఉంటుంది. పార్కింగ్ : ఊరట్టం ఆర్టీసీ బస్సులు హనుమకొండ, ములుగు రోడ్డు, గూడెప్పాడ్, పస్రా, తాడ్వాయి నుంచి నేరుగా మేడారం వెళ్తాయి. ప్రైవేట్ వాహనాలు మాత్రం పస్రానుంచి నార్లాపూర్, మేడారం వెళ్లాలి. తాడ్వాయి మీదుగా అనుమతి లేదు. పొరపాటున వెళ్లినా వెనక్కి పంపుతారు. తిరుగు ప్రయాణం మేడారం నుంచి తిరిగి వరంగల్ ఆపై ప్రాంతాలకు వెళ్లే వాహనాలు నార్లాపూర్ క్రాస్, బయ్యక్కపేట, కమలాపురం క్రాస్, భూపాలపల్లి, పరకాల, అంబాల క్రాస్, కిట్స్ కాలేజీ, వరంగల్ బైపాస్, పెండ్యాల మీదుగా తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. (క్లిక్: మేడారానికి పోటెత్తిన భక్తులు.. ఫొటోలు) అందుబాటులో హెలికాప్టర్ సేవలు మేడారం జాతరకు వచ్చే భక్తుల కోసం పర్యాటక శాఖ హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చింది. బెంగళూరుకు చెందిన తుంబి ఏవియేషన్ సంస్థ ట్యాక్సీ హెలికాప్టర్‌ను నడుపుతోంది. ఈ సేవలు సోమవారం నుంచి ప్రారంభమవుతాయి. కాజీపేటలోని సేయింట్ గాబ్రియల్ స్కూల్ గ్రౌండ్ నుంచి మేడారం వరకు సేవలందిస్తోంది. చార్జీలు ఇలా.. ఒక్కో ప్రయాణికుడికి (అప్ అండ్ డౌన్) రూ.19,999 జాతరలో ఏరియల్ వ్యూ రైడ్ ఒక్కొక్కరికి రూ.3,700 బుకింగ్ ఇలా.. హెలికాప్టర్ టికెట్ బుకింగ్, ఇతర వివరాల కోసం 94003 99999, 98805 05905 సెల్‌నంబర్లలో లేదా info@helitaxi.com ద్వారా చేసుకోవచ్చు. -
అభ్యర్థి ఒక కంపెనీలో ఉద్యోగం కోసం ఏం చేసాడో తెలుసా?
లండన్: ఉద్యోగం సాధించడంలో రెజ్యూమ్ ఎంతో కీలకమైంది. అభ్యర్థి ఉద్యోగం కోసం.. కంపెనీ మెయిల్స్, లింక్డ్ ఇన్, నౌకరీ డాట్ కామ్.. రకరకాల మాధ్యమాలతో కంపెనీలకు తమ రెజ్యుమ్‌ను పంపుతుంటారు. ఒక వ్యక్తి రెజ్యూమ్ చూసి.. అతని పట్ల కంపెనీలు కొంత అవగాహనకు వస్తాయి. రెజ్యూమ్‌లలో వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు, వారు సాధించిన అంశాలు దానిలో పొందుపరుస్తూ ఉంటారు. అయితే, చాలా కంపెనీలు వాటిని వ్యక్తికరించడంలో కొంత సృజనాత్మకతను కొరుకుంటాయి. అయితే, ఇక్కడ యూకేకి చెందిన ఒక వ్యక్తి ఉద్యోగం కోసం వినూత్నంగా ఆలోచించాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పూర్తి వివరాలు.. యూకే కు చెందిన జోనాథన్ స్విఫ్ట్ అనే వ్యక్తి ఇన్స్టాంట్ ప్రింట్ ఉద్యోగం కోసం.. తన రెజ్యూమ్ ప్రింట్‌ను సదరు కంపెనీ పార్కింగ్ స్థలంలో ఉన్న ప్రతి ఒక్క కారుకు అంటించాడు. అయితే, యార్క్‌షైర్ కు చెందిన ప్రిటింగ్ హౌస్ కంపెనీలో చేరడానికి అతను.. ఈ విధంగా చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆ కంపెనీలో సదరు వ్యక్తి చేసిన పని చర్చనీయాంశంగా మారింది. ఆనోట.. ఈనోట.. చివరకు ఆ కంపెనీ మార్కెటింగ్ మేనేజర్ వరకు వెళ్లింది. దీంతో ఆయన సదరు వ్యక్తి ఉద్యోగం పట్ల చూపిన ఆసక్తికి ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత.. అతడిని కంపెనీవారు కాల్ చేసి ఇంటర్వ్యూకి పిలిచారు. దీనిపై కంపెనీ మేనేజర్ స్పందించారు. ‘సదరు వ్యక్తి పార్కింగ్ ఉన్న కార్లకు రెజ్యూమ్‌ను అతికించిడం కిటికీలో నుంచి చూసినట్లు వాసెల్ అనే మేనేజర్ తెలిపారు’. అయితే, ఆ ఉద్యోగానికి 140 అప్లికేషన్లు వచ్చినట్లు కంపెనీ మేనేజర్ తెలిపారు. జోనాథన్ స్విఫ్ట్ ను ఉద్యోగానికి ఎంపిక చేసినట్లు కూడా ప్రకటించారు. Here’s some CCTV footage of the #jobseeker in action! He’s been the talk of the office since covering everyone's cars in CVs. I love it when we get a #creativejobapplication - Craig, Marketing Manager pic.twitter.com/OmE5puQgwI — instantprint (@instantprintuk) January 18, 2022 చదవండి: ఇంటి నుంచి కిడ్నాప్ చేసి.. అమానుషంగా ప్రవర్తించారు! -
'పార్కింగ్ ఫీజు వసూలు చేస్తే మాల్స్‌కే ప్రమాదం'
పార్కింగ్ రుసుము వసూలు చేసే హక్కు ప్రాథమికంగా మాల్స్‌కు లేదని కేరళ హైకోర్టు శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు పార్కింగ్ ఫీజుల వసూళ్లను నిలిపివేయాలని ఆదేశించటం లేదు కానీ అలా వసూల్ చేస్తే మాల్స్‌కే ప్రమాదం అని కేరళ హైకోర్టు న్యాయమూర్తి కున్హి కృష్ణన్ పేర్కొన్నారు. ఈ మేరకు కలమస్సేరి మునిసిపాలిటీ ఎర్నాకులంలోని లులు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్‌కు ఏదైనా లైసెన్స్ జారీ చేసిందా అని కూడా ప్రశ్నించింది. "బిల్డింగ్ రూల్స్ ప్రకారం, భవనం నిర్మించడానికి పార్కింగ్ స్థలం కోసం తగినంత స్థలం అవసరం. పార్కింగ్ స్థలం భవనంలో భాగం. పార్కింగ్ స్థలం ఉండాలనే షరతులతో భవన నిర్మాణ అనుమతి జారీ చేయబడుతుంది. కాబట్టి భవనం యజమాని పార్కింగ్ రుసుము వసూలు చేయడం సమంజసం కాదని భావిస్తున్నాం అని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే మాల్స్ తమ పూర్తి రిస్క్‌తో పార్కింగ్ ఫీజు వసూలు చేసుకోవచ్చు అని కోర్టు పేర్కొంది. ఈ మేరకు వడక్కన్ అనే వ్యక్తి డిసెంబర్ 2న లులు మాల్‌ను సందర్శించినప్పుడు అతని నుండి పార్కింగ్ ఫీజు రూ. 20 వసూలు చేసినందుకు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. పైగా ఆయన తాను డబ్బు చెల్లించేందుకు నిరాకరించడంతో మాల్ సిబ్బంది ఎగ్జిట్ గేట్లను మూసివేసి బెదిరించారని కూడా ఆరోపించారు. ఈ మేరకు కోర్టు ఈ సమస్యకు సంబంధించిన వివరణను దాఖలు చేయవల్సిందిగా మున్సిపాలిటీని కోరడమే కాక ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. -
ఎస్సైని చితక్కొట్టిన యువకుడు..
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో ఒక యువకుడు పోలీసు అధికారిపై దాడిచేసిన ఘటన కలకలం రేపింది. ఈ సంఘటన లఖన్‌పూర్‌లో చోటుచేసుకుంది. లఖన్‌పూర్‌లోని హసన్గంజ్కు పనిమీద వచ్చిన ఎస్సై వినోద్‌పై.. నడిరోడ్డు మీద ఒక యువకుడు చెంప ఛేళ్లు మనిపించాడు. పిలిభిత్ ప్రాంతానికి వచ్చిన ఎస్సై వినోద్.. ఒక వాహనాన్ని తప్పించపోయి పక్కనే పార్కింగ్‌లో ఉన్న ఒక కారును ఢీకొట్టారు. దీంతో స్థానికులు ఎస్సైను చుట్టుముట్టారు. ఈ క్రమంలో ఆశిష్ అనే యువకుడు ఎస్సైతో వాగ్వాదానికి దిగాడు. అందరు చూస్తుండగానే ఎస్సై వినోద్‌ను కొట్టాడు. ఈ క్రమంలో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆశిష్‌ను అదుపులోనికి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
షాకింగ్: పార్కింగ్ టిక్కెట్లు విక్రయిస్తున్న యువ బాక్సర్
సాక్షి, న్యూఢిల్లీ: ఒకపక్క దేశంలో టోక్యో ఒలింపిక్స్ లో భారత ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శనతో పతకాలను సాధించి దేశ పతాకాన్ని రెపరెపలాడిస్తున్నారు. విజేతలపై ప్రశంసలు, బహుమతుల వర్షం కురుస్తోంది. మరోవైపు పొట్ట కూటికోసం యువ బాక్సర్ రోడ్డున పడిన వైనం క్రీడాభిమానుల్లోనూ, క్రీడాకారుల్లోనూ కలకలం రేపింది. (Mirabai Chanu: మరోసారి మనసు దోచుకున్న చాను, ప్రాక్టీస్ షురూ, ఫోటో వైరల్) చండీగఢ్‌లో యువ బాక్సర్ రీతు పార్కింగ్ టిక్కెట్లను విక్రయిస్తోంది. తనకు ప్రోత్సాహం లేకపోవడంతో బాక్సింగ్‌ను వదిలి వేసింది. చివరకి గత్యంతరం లేక తన కుటుంబానికి అండగా ఉండేందుకు చండీగఢ్‌లో పార్కింగ్ టిక్కెట్లను విక్రయిస్తోంది. తాను జాతీయ స్థాయిలో చాలా మ్యాచ్‌లు ఆడి, పతకాలు సాధించానని రీతూ తెలిపింది. క్రీడాకారిణిగా తనకు తన కుటుంబం చాలా అండగా నిలిచిందని తెలిపింది. కానీ తనకు ఎలాంటి ప్రోత్సాహకాలు, స్కాలర్షిప్లు రాలేదని తెలిపింది. అనారోగ్యంతో ఉన్న తన తండ్రిని కాపాడుకునేందుకు, ఆర్థిక అవసరాలకోసం తనకెంతో ఇష్టమైన క్రీడలను విడిచిపెట్టాల్సి వచ్చిందని వాపోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం సహాయం చేస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. (Vandana Katariya: ఉత్తరాఖండ్ డాటర్‌కు భారీ నజరానా) Ritu, a young boxer, sells parking tickets in Chandigarh to run her household "I've played many matches at national level&won medals. Family supported me but I got no support/scholarships from institutions. My father's unwell, so I had to leave sports. Hope govt helps," she says pic.twitter.com/yn06NoZCPs — ANI (@ANI) August 7, 2021 -
ప్రపంచంలోనే అతి పెద్ద సైకిల్ పార్కింగ్, ఎక్కడో తెలుసా
మన దేశంలో సైకిల్ వినియోగం చాలా తగ్గిపోయింది కానీ, నెదర్లాండ్స్‌లో మాత్రం ప్రజలు సైకిల్‌పై సవారీకే ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. ఆఫీసులకు వెళ్లడానికి దగ్గర నుంచి షాపింగ్ మాల్స్‌లో వస్తువుల కొనుగోలు వరకూ సైకిల్‌నే వినియోగిస్తారు. పర్యావరణంపై వాళ్లకు ఉన్న ప్రేమ అలాంటిది. మోటార్ సైకిళ్లు వినియోగిస్తే కాలుష్యం ఎక్కువ అవుతుందనే స్పృహతోనే డచ్ ప్రజలు సైక్లింగ్‌కు మొగ్గుచూపుతారు. మన దేశంలో మోటార్ సైకిల్ పార్కింగ్లు కనబడ్డట్లే నెదర్లాండ్స్‌లో చాలా చోట్ల సైకిల్ పార్కింగ్లు ఉంటాయి. అలాంటి వాటిల్లో ఉట్రెచ్ నగరంలోని స్టేషన్స్ప్లీన్లో ఉన్న సైకిల్ పార్కింగ్ ప్రపంచంలోనే అతి పెద్దది. 2019 ఆగస్టు 19న దీనిని ప్రారంభించారు. దీనిని ఉట్రెట్ మునిసిపాలిటీ, ప్రోరైల్, ఎన్ఎస్ (డచ్ రైల్) సంయుక్తంగా నిర్వహిస్తాయి. రైల్ ప్రయాణం చేసేవారు తమ సైకిల్‌ను సురక్షితంగా పార్క్ చేసుకోవడానికి ఈ భారీ పార్కింగ్ బిల్డింగ్‌ను నిర్మించారు. ఆ పార్కింగ్ ప్లేస్ విశేషాలు.. ► ఇక్కడ 12,500 సైకిళ్లను పార్క్ చేయవచ్చు. ► దానిలో కొంత జాగా రెంట్ సైకిల్స్‌కు కూడా ఉంటుంది. ► ఉట్రెచ్ రైల్వే స్టేషన్‌కు చేరువలో ఉంటుంది. 24 గంటలూ తెరిచే ఉంటుంది. ► పెద్ద బిల్డింగ్‌లో ఉంటుంది కాబట్టి సైకిళ్లకు ఎండ, వానల నుంచి రక్షణ ఉంటుంది. ► 24 గంటల వరకూ ఫ్రీ పార్కింగ్ సదుపాయం కల్పించారు. ► పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చిప్‌కార్డు సహాయంతో పార్కింగ్ చేసుకోవచ్చు. ► ఇక్కడి కారిడార్లను సైకిల్ తొక్కడానికి అనువుగా రూపొందించారు. ► రెండు ఎంట్రన్స్‌లు ఉండే బిల్డింగ్‌లో వన్‌వే అమల్లో ఉంటుంది. ► మూడు అంతస్తులో ఉండే బిల్డింగ్‌లో ప్రతి చోట బాయ్‌లతో పర్యవేక్షణ ఉంటుంది. ► విభిన్నంగా ఉండే సైకిళ్లు.. అంటే పెద్ద హ్యాండిల్ బార్, డెలివరీ బ్యాగ్‌లను తీసుకెళ్లే సైకిళ్ల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ స్థలం ఉంటుంది. ► ఇక్కడ సైకిల్ రిపేరింగ్‌తో పాటు కావాల్సిన సామానులు కూడా అందుబాటులో ఉంటాయి. -
ఫ్లై ఓవర్ల కింద స్మార్ట్ పార్కింగ్.. ప్రస్తుతానికి వీరికే అవకాశం
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ నగరంలో పార్కింగ్ అవస్థల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. దశాబ్దాలుగా వివిధ పేర్లతో ఆయా ప్రాంతాల్లో కొత్త పార్కింగ్ సిస్టమ్స్ అందుబాటులోకి తెస్తామని నేతలు ప్రకటిస్తున్నా ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదు. ఓవైపు ప్రజలకు సదుపాయంతో పాటు మరోవైపు ఉన్న స్థలాన్నే సద్వినియోగం చేసుకొని జీహెచ్ఎంసీకి ఆదాయం కూడా సమకూరేలా స్మార్ట్‌పార్కింగ్ త్వరలో అందుబాటులోకి రానుంది. గ్లోబల్‌సిటీగా ఎదుగుతున్న హైదరాబాద్‌లో అందుబాటులోకి రానున్న స్మార్ట్ పార్కింగ్ సిస్టమ్‌తో గందరగోళం ఉండదు. వేచి ఉండాల్సిన పరిస్థితులుండవు. వృద్ధులు, మహిళలు, వికలాంగులకు సౌకర్య వంతంగా ఉంటుంది. వీరి కోసం కొన్ని స్లాట్స్ రిజర్వుగా ఉంటాయి. యాప్‌లోనే ముందస్తుగా స్లాట్ బుకింగ్ అవకాశం ఉండటంతో దూరం నుంచి వచ్చేవారికి సదుపాయం. ఆన్లైన్ పేమెంట్ విధానంతో ‘చిల్లర’ గొడవలుండవు. జీహెచ్ఎంసీ కూకట్పల్లి జోన్‌లోని సుజనా ఫోరం మాల్ ఎదుట ఫ్లైఓవర్ కింద వాహనాలు పార్కింగ్ చేస్తుండటాన్ని గుర్తించిన అధికారులు.. ఆ స్థలంలోనే స్మార్ట్ పార్కింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అదే స్మార్ట్ పార్కింగ్. పీపీపీ విధానంలో పనులు పూర్తయ్యాయి. త్వరలో ప్రారంభోత్సవం జరగనుంది. ప్రత్యేకతలివీ.. పార్కింగ్ ప్రదేశంలోనే అయినా ఎక్కడ పడితే అక్కడ అడ్డగోలుగా పార్కింగ్ చేయడం కుదరదు. పార్కింగ్ ప్రదేశానికి గేట్‌వేతో పాటు బొల్లార్డ్స్, సెన్సార్లు ఉండటంతో నిరీ్ణత ప్రదేశంలోనే పార్కింగ్ చేస్తారు. వాహనం వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు స్కానింగ్ జరుగుతుంది. వాహనం పోతుందనే.. దొంగల భయం ఉండదు. వాహనాల రాకపోకలకు సంబంధించిన వివరాలు ఏడాది వరకు క్లౌడ్ స్టోరేజిలో ఉంటాయి. జీహెచ్ఎంసీకి ఆదాయం లభిస్తుంది. సిస్టమేటిక్ పార్కింగ్తో రద్దీ సమయాల్లో రోడ్లపై ట్రాఫిక్‌జామ్ తగ్గుతుంది. గ్రీన్ ఎనర్జీ వినియోగంతో çపర్యావరణ పరంగా మేలు. పైలట్ ప్రాజెక్టుగా దీని అనుభవంతో మరిన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయడంతో పాటు అన్నింటినీ అనుసంధానం చేసే వ్యవస్థ ఏర్పాటుకు ఆలోచనలున్నాయి. -
కూకట్‌పల్లిలో ‘స్మార్ట్’ పార్కింగ్, గంటకు రూ.10 మాత్రమే!
కేపీహెచ్‌బీకాలనీ: విశ్వనగరం దిశగా అడుగులు వేస్తున్న భాగ్యనగరంలో పార్కింగ్ ఓ సవాల్‌గా మారింది. ముఖ్యంగా షాపింగ్ మాళ్లు కొలువుదీరిన ప్రాంతాల్లోనైతే పార్కింగ్ కోసం పరేషాన్ కావాల్సిందే. ఈ క్రమంలో ట్రాఫిక్ సమస్య సైతం ఉత్పన్నమై అటు వాహన చోదకులతో పాటు ట్రాఫిక్ పోలీసులకూ తలనొప్పిగా మారుతోంది. రోజురోజుకు పెరుగుతున్న వాహనాల కారణంగా పార్కింగ్ సమస్య గుదిబండగా మారిన దృష్ట్యా ‘స్మార్ట్’ పార్కింగ్ దిశగా జీహెచ్ఎంసీ ముందడుగు వేసింది. ఒకప్పుడు ఫ్లైఓవర్ నిర్మాణం అంటే ట్రాఫిక్ రద్దీ, ప్రయాణ దూరాన్ని తగ్గించడం కోసం నిరి్మంచేవారు. కానీ.. నేడు ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం ఆధునిక సాంకేతికతకు అద్దం పట్టడంతో పాటు ఆధునిక హంగులకు నిలయంగా మారింది. రద్దీకి చిరునామైనా కూకట్పల్లి హౌసింగ్‌బోర్డు ఫోరం మాల్ ఎదురుగా ఫ్లైఓవర్ కింద నగరంలోనే మొదటిసారిగా చేపట్టిన సెన్సార్ బేస్డ్ స్మార్ట్ పార్కింగ్ కేంద్రమే ఇందుకు నిదర్శనం. ► దాదాపుగా రూ. 48 లక్షలతో ఏర్పాటు చేసిన సెన్సార్ బేస్డ్ స్మార్ట్ పార్కింగ్‌లో 200 ద్విచక్ర వాహనాల పార్కింగ్ చేసుకునే అవకాశం ఉంది. ► అక్కడ పార్కింగ్ చేసుకోవాలంటే ముందుగా ప్రత్యేకంగా రూపొందించి యాప్ ద్వారా పార్కింగ్ వసతి కోసం బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ► నేరుగా స్మార్ట్ పార్కింగ్ కేంద్రానికి వెళ్లినా స్లాట్ ఖాళీగా ఉంటేనే అనుమతి లభిస్తోంది. ► పార్కింగ్ కేంద్రం వద్దకు వెళ్లగానే ముందుగానే యాప్‌లో పొందుబర్చిన వివరాల ఆధారంగా వాహన నెంబర్‌ను సెన్సార్ స్కానర్లు ఆటోమేటిక్‌గా స్కాన్ చేస్తాయి. ► కేటాయించిన పార్కింగ్ గడిలో వాహనాన్ని పార్క్ చేసినప్పటి నుంచి మళ్లీ వాహనం తీసుకెళ్లే సమయాన్ని ఆటోమేటిక్‌గా సెన్సార్ స్మార్ట్ పార్కింగ్ సిస్టమ్ గణించి గంటకు రూ.10ల చొప్పున చెల్లించాలని సూచిస్తుంది. ఆ మేరకు చెల్లింపు పూర్తి కాగానే వాహనంతో బయటకు వెళ్లేందుకు గేటు ఓపెన్ అవుతుంది. ► ఇందులో మహిళలతో పాటు దివ్యాంగుల కోసం ప్రత్యేక స్లాట్లను సైతం ఏర్పాటు చేశారు. ► ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి కాగా త్వరలోనే టెండర్ ప్రక్రియను పూర్తి చేసి నిర్వహణ బాధ్యతల కేటాయింపు ప్రక్రియను చేపట్టనున్నట్లు ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. ► స్మార్ట్ పార్కింగ్ కేంద్రానికి ఎదురుగానే ఫోరం సుజనామాల్, పక్క వీధిలో డీ–మార్ట్ వంటి షాపింగ్ కేంద్రాలు అందుబాటులో ఉండగా గంటకు రూ.10 చొప్పున స్మార్ట్ పార్కింగ్ కేంద్రాన్ని వాహనదారులు ఏ మేరకు వినియోగించుకుంటారనేది సందేహంగానే ఉంది. ► షాపింగ్ మాల్స్‌లో మొదటి అరగంట ఉచిత పార్కింగ్ అవకాశం ఉండడంతో పాటు ఏదైనా షాపింగ్ చేసినా బిల్లు చూపిస్తే మిగతా సమయానికి పార్కింగ్ ఉచితంగానే లభిస్తుంది. ► ఈ నేపథ్యంలో స్మార్ట్ పార్కింగ్ కేంద్రంలో గంటకు రూ.10కి బదులు 2, 3 గంటలకు రూ.10 చొప్పున వసూలు చేస్తే ఉపయోగం ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ► మరో వైపు ప్లైఓవర్ బ్రిడ్జి పిల్లర్లపై వేయించిన చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. -
సిటీలో పార్కింగ్ దందా.. ఇక బంద్!
సాక్షి, సిటీబ్యూరో: మాల్స్, మల్టీప్లెక్సులు, తదితర వాణిజ్య సంస్థల్లో అడ్డగోలు పార్కింగ్ ఫీజులను కట్టడి చేసేందుకు మూడేళ్ల క్రితం ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. ఈ నిబంధనలు తొలినాళ్లలో అమలైనప్పటికీ.. క్రమేణా తిరిగి పార్కింగ్దందా మొదలైంది. ప్రజలు ఫిర్యాదు చేసినా పట్టించుకునేవారు కరువయ్యారు. దీంతో పెద్దయెత్తున ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఈవీడీఎం(ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్) విభాగం నిబంధనల ఉల్లంఘనులపై చర్యలకు సిద్ధమైంది. అక్రమ హోర్డింగులు, ఫ్లెక్సీల తరహాలోనే ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించనుంది. అక్రమంగా ఫీజు వసూలు చేసినట్లు తగిన ఆధారంతో ఫొటోను ఆన్లైన్ ద్వారా ఈవీడీఎంలోని ‘సెంట్రల్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌సెల్’కు షేర్ చేస్తే పరిశీలించి ఉల్లంఘనులకు పెనాల్టీ విధించనుంది. వీటితోపాటు తగిన పార్కింగ్ సదుపాయం కల్పించని వాణిజ్యసంస్థల పైనా చర్యలు తీసుకోనుంది. ఈ చర్యల అమలుకు ముందుగా మాల్స్, మల్టీప్లెక్సులు, వాణిజ్యసంస్థలకు శుక్రవారం నుంచి నోటీసులు జారీ చేయనుంది. నోటీసు మేరకు.. అన్ని వాణిజ్య సంస్థలు నిర్ణీత నమూనాలో పార్కింగ్ టిక్కెట్లను ముద్రించాలి. టిక్కెట్లపై పార్కింగ్ నిర్వహణ ఏజెన్సీ పేరు, చిరునామా, మొబైల్నెంబర్ ఉండాలి. పార్కింగ్ ఫీజు చెల్లించనవసరం లేని వారికి సైతం పార్కింగ్ టిక్కెట్ ఇవ్వాలి. ఫీజు వసూలు చేస్తే ‘పెయిడ్’ అని, ఉచితమైతే ‘ఎగ్జెంపె్టడ్’ అని స్టాంపు వేయాలి. పార్కింగ్ ఇన్చార్జి సంతకంతో కూడిన పార్కింగ్ టిక్కెట్లను వాహనాలు నిలిపిన అందరికీ ఇవ్వాలి. ఈవీడీఎం విభాగం నుంచి నోటీసు అందిన 15రోజుల్లోగా ఈమేరకు ఏర్పాట్లు చేసుకోవాలి. అనంతరం ఈవీడీఎం విభాగం తనిఖీలు చేపడుతుంది. ఉల్లంఘనలు గుర్తిస్తే, ఉల్లంఘనకు రూ. 50వేల వంతున పెనాల్టీ విధిస్తుంది. ప్రజలనుంచి అందే ఫిర్యాదులను పరిశీలించి పెనాల్టీలు విధిస్తుంది. పార్కింగ్ టికెట్ ఇలా.. నోటీసుతోపాటు పార్కింగ్ టిక్కెట్ ఎలా ఉండాలో నమూనాను కూడా పంపుతారు. నమూనా మేరకు.. టిక్కెట్‌పై వాహనం నెంబరు, పార్కింగ్ చేసిన సమయం, తిరిగి వెళ్లే సమయం రాయాలి. ఎంతసేపు పార్కింగ్చేసింది (30ని లోపు, 30 ని–1గం.లోపు, 1గం.కంటే ఎక్కువ) టిక్ చేయాలి. షాపింగ్ చేసిన బిల్లు మొత్తం ఎంతో వేయాలి. ఏజెన్సీ పేరు, తదితర వివరాలు. టికెట్ వెనుక వైపు.. పార్కింగ్ టిక్కెట్ వెనుకవైపు 20 మార్చి 2018న ప్రభుత్వం జారీ చేసిన జీఓ మేరకు ఫీజు ఉచితం, చెల్లింపు ఎలానో ఆ వివరాలు ముద్రించాలి. అవి.. 30 నిమిషాల వరకు: ఎలాంటి పార్కింగ్ ఫీజు లేదు. 30 నిమిషాల నుంచి గంట వరకు: మాల్, వాణిజ్యప్రదేశంలో ఏమైనా కొనుగోలు చేసినట్లు బిల్లు చూపిస్తే ఫ్రీ. లేని పక్షంలో అక్కడ వసూలు చేసే నిర్ణీత పార్కింగ్ ఫీజు చెల్లించాలి. గంట కంటే ఎక్కువ సేపు వాహనాన్ని పార్కింగ్‌లో ఉంచే వారు కొనుగోలు చేసిన బిల్లును కానీ, మూవీ టిక్కెట్‌ను కానీ చూపించాలి. బిల్లు, మూవీ టిక్కెట్ ధర పార్కింగ్ ఫీజు కంటే ఎక్కువగా ఉంటే ఎలాంటి ఫీజు వసూలు చేయరు. పార్కింగ్ ఫీజు కంటే తక్కువుండే పక్షంలో నిరీ్ణత పార్కింగ్ ఫీజు చెల్లించాల్సిందే. చదవండి: బెంగళూరు తరహాలో పార్కింగ్ పాలసీ 2.o బెటరేమో! -
బెంగళూరు తరహాలో పార్కింగ్ పాలసీ 2.o బెటరేమో!
హైదరాబాద్: ప్రస్తుతం నగరంలో వాహనాల సంఖ్య 70 లక్షలు దాటింది. వాటిలో 80 శాతం వ్యక్తిగత వాహనాలే. గతంలో ప్రతిరోజూ 600 చొప్పున కొత్త వాహనాలు రోడ్డెక్కేవి. అయితే కరోనా ప్రభావం, లాక్డౌన్ తదనంతర పరిస్థితుల నేపథ్యంలో ఈ సంఖ్య 1,500 దాటింది. ఒకప్పుడు ఇంటికి ఒక వాహనం చొప్పున ఉండేవి. అయితే ప్రస్తుతం ప్రతి ఇంటికి/ఫ్లాట్‌కు కనిష్టంగా రెండు ద్విచక్రవాహనాలు, కుటుంబానికి ఒక కారు చొప్పున ఉంటున్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వంటి సంపన్నులు ఉండే ప్రాంతాలతోపాటు మరికొన్ని చోట్ల కుటుంబంలో ఒక్కోక్కరికీ ఒక్కో కారు ఉంటోంది. కానీ వాహనాలకు సరిపడా స్థాయిలో పార్కింగ్ స్పేస్ మాత్రం వారి ఇళ్లలో అందుబాటులో ఉండట్లేదు. దీంతో ఆయా వాహనాలను ఇళ్ల ముందుండే పబ్లిక్ ప్లేస్ లేదా రోడ్డే పార్కింగ్ ఏరియాగా మారిపోతోంది. ఈ సమస్య నానాటికీ తీవ్రమవుతూ వస్తోంది. కాగితాల్లోనే పార్కింగ్ ప్లేస్‌లు... కమర్షియల్ భవనాలు, అపార్ట్‌మెంట్స్‌లో ఉన్న పార్కింగ్ ప్లేస్‌లు కేవలం నో అబ్జక్షన్ సర్టిఫికెట్, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ పొందే వరకే అందుబాటులో ఉంటున్నాయి. ఆ తర్వాత వాటి రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయి. అపార్ట్‌మెంట్స్‌లో ఫ్లాట్‌కు ఒక వాహనానికే పార్కింగ్ ఉంటుండగా... ఆ కుటుంబానికి రెండు మూడు వెహికల్స్ వచ్చి చేరుతున్నాయి. మిగిలిన ప్రాంతంలోనూ వాచ్‌మన్ గది, స్టోర్ రూమ్స్, అసోసియేషన్ రూమ్స్ తదితరాలు వచ్చి చేరుతున్నాయి. వాణిజ్య భవనాల్లో ఉన్న సెల్లార్ పార్కింగ్ ఏరియాల్లో కొత్త దుకాణాలు పుట్టుకువస్తున్నాయి. ఫలితంగా వాటిల్లో ఉండాల్సినవాహనాలు ఫుట్‌పాత్‌లపైకి, రోడ్డు మీదకు వస్తున్నాయి. బెంగళూరులో వినూత్న విధానం... కాలనీల్లో ఇదే తరహా పార్కింగ్ సమస్యను ఎదుర్కొంటున్న బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ కొత్త పార్కింగ్ పాలసీ 2.0ను అ మలులోకి తెస్తోంది. దీని ప్రకారం ఆన్ స్ట్రీట్ పార్కింగ్‌కు రేట్లు నిర్దేశించింది. నెలకు చిన్న కార్లకు రూ. వెయ్యి, మధ్య తరహా కార్లకు రూ. 3 వేలు, ఎంయూవీ/ఎస్‌యూవీలకు రూ. 4వేలు, మిగిలిన వాటికి రూ. 5వేలు చొప్పున చార్జీలు నిర్దేశించింది. ఈ రేట్లు కమర్షియల్ వాహనాలకు వర్తించవు. వ్యక్తిగత వాహనాలకూ త్రైమాసికం, వార్షికం చొప్పున చెల్లించి ఇళ్లు, అపార్ట్మెంట్ల ముందు పార్కింగ్ ప్లేస్ పొందవచ్చు. అయితే ఇలా అనుమతి తీసుకున్న వారు సైతం నిర్దేశించిన ప్రాంతం, సమయాల్లోనే వాహనాలను పార్క్ చేయాల్సి ఉంటుంది. వచ్చే నెల నుంచి ఈ విధానం అమలుకానుంది. ముందుకు సాగని కసరత్తు... రాజధానిలో పార్కింగ్ ఇబ్బందులు తీర్చడానికి ప్రభుత్వం, పోలీసు విభాగం 2018లోనే కసరత్తు చేసింది. ప్రత్యేక పార్కింగ్ పాలసీలు అమలులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరిగాయి. వాటికి సంబంధించి జీవోలు వచ్చినా ఫలితాలు రాలేదు. కాలనీలతోపాటు వాణిజ్య ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించడంతోపాటు ప్రైవేటు స్థలాలను సేకరించి వర్టికల్ పార్కింగ్ ఏరియాలు ఏర్పాటు చేయాలని భావించారు. వాటిని నిర్మించడానికి బీఓటీ పద్ధతిలో రెండుసార్లు టెండర్లు ఆహ్వానించగా కొన్ని సంస్థలు తొలుత ముందుకొచ్చాయి. కానీ ఆయా స్థలాల్లో వర్టికల్ పార్కింగ్స్‌ను ప్రభుత్వం నిర్మించి ఇస్తే తాము లీజుకు తీసుకొని నిర్వహిస్తామని లేదా తాము నిర్మించిన ప్రాంతాల్లో అక్రమ పార్కింగ్‌పై చలాన్లు జారీ చేసి జరిమానాలు వసూలు చేసుకొనే అవకాశం ఇవ్వాలని షరతు పెట్టా యి. ఇందుకు ప్రభుత్వం అంగీకరించకపోవడంతో ఇప్పటికీ ఈ సమస్యకు పరిష్కారం కనిపించట్లేదు. -
ఈ స్కూటర్ ఎవరిదో!
రంగారెడ్డి,శంషాబాద్ రూరల్: మండల పరిధిలోని కేబీదొడ్డి–రాయన్నగూడ రోడ్డు పక్కన ఓ స్కూటర్ పది రోజులుగా అనుమానాస్పదంగా పార్క్ చేసి ఉంది. ఏపీ 28 ఏఫ్ 9124 నంబర్ గల బజాజ్ చేతక్ వాహనం కేబీ దొడ్డి వైపు వచ్చే మార్గంలో నిలిపి ఉంది. సుమారు పది రోజులవుతున్నా వాహనాన్ని ఎవరూ తీసుకెళ్లడం లేదని స్థానికులు చెబుతున్నారు. -
చిన్న విషయం... పెద్ద గొడవ
సాక్షి, హైదరాబాద్: చిన్న పార్కింగ్ విషయం ఇద్దరు వ్యక్తులు కొట్టుకొని హాస్పటల్ పాలయ్యేలా చేసింది. హైదరాబాద్‌లోని మొయినబాగ్లో పార్కింగ్ విషయంలో ఇద్దరు ఇరుగు పొరుగు వారి మధ్య అర్ధరాత్రి సమయంలో గొడవజరిగింది. ఆ గొడవ కాస్తా చినికి చినికి గాలి వానలా మారి కొట్టుకొని గాయాలపాలయ్యి ఆసుపత్రిలో చేరాలా చేసింది. భవని నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. దీనిపై సంతోష్ నగర్ డివిజన్ ఏసీపీ శివరామ్ శర్మ మాట్లాడుతూ...‘ గొడవ తరువాత ఇద్దరు వ్యక్తులు కొట్టుకున్నారు. దీంతో అక్కడ ఉంటున్న వారందరూ గొడవ చూడటానికి గుమిగూడారు. ఇండియన్ పీనల్ కోడ్ కింద దీనికి సంబంధించిన కేసు నమోదు చేశాం. ఇద్దరికి గాయాలు కావడంతో వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనిపై మరింత దర్యాప్తు చేపడతాం ’అని తెలిపారు. (వలస కార్మికుల బస్సుకు తప్పిన ప్రమాదం) -
ప్రపంచ కుబేరుడి కార్లకు ‘ఫైన్’
వాషింగ్టన్ : ప్రపంచ కుబేరుడు, ఈ కామర్స్ దిగ్గజ సంస్థ ‘అమెజాన్’ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ కూడా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి కార్లను పార్కింగ్ చేసినందుకు గానూ స్థానిక ప్రజా పన్నుల శాఖకు దాదాపు 18 వేల డాలర్లు బకాయి పడ్డారు. 2016 అక్టోబర్ నుంచి 2019 అక్టోబర్ వరకు ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా కార్లు పార్కింగ్ చేసినందుకు మొత్తం 564 చలాన్ల రూపంలో మొత్తం 16,840 డాలర్ల జరిమానా పడింది. వాటిని ఆయన సకాలంలో చెల్లించక పోవడంతో ఆ మొత్తం విలువ 18 వేల డాలర్లకు చేరుకుంది. వాటిలో ఆయన ఇటీవల కొన్ని చలాన్లను చెల్లించినప్పటికీ ఇంకా 5,600 డాలర్లను చెల్లించాల్సి ఉందని మోటారు వాహనాల విభాగం వెబ్సైట్ ద్వారా తెలుస్తోంది. వాషింగ్టన్ డీసీ నగరంలో ఆయన 34 వేల చదరపు అడుగుల్లో ఆయన విశాలమైన భవంతిని నిర్మించిన సమయంలో అలాగే 2016లో టెక్స్టైల్ మ్యూజియంను కొనుగోలు చేసి దానికి మరమ్మతు చేసిన సమయంలో రెండు భవనాల వద్ద కార్లను అక్రమంగా పార్కింగ్ చేయడం ఈ జరిమానాలు పడ్డాయి. వాషింగ్టన్ డీసీలో ప్రస్తుతం అతి విశాలమైన భవనం 2,700 చదరపు అడుగులు కాగా, అంతకంటే విశాలంగా 34 వేల చదరపు గజాల స్థలంలో జెఫ్ భవంతిని నిర్మించారు. అందులో 11 పడక గదులు, ఒక బాల్ రూమ్, ఒక వైన్ సెల్లార్, విస్కీ టేస్టింగ్ రూమ్, ఓ సినిమా థియేటర్, సిట్టింగ్ స్థలాలు దాదాపు వెయ్యి ఉన్నాయి. ప్రస్తుతం ఆయన ఆస్తి 12900 కోట్ల డాలర్లని అంచనా. -
ప్రైవేట్ స్థలాల్లో మల్టీ లెవల్ పార్కింగ్
సాక్షి,సిటీబ్యూరో: వాణిజ్య ప్రాంతాల్లోకొత్త తరహా ప్రైవేట్ పార్కింగ్ ఏర్పాట్లకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. గతంలో ప్రైవేట్ స్థలాల్లో పార్కింగ్ లాట్ల ఏర్పాటు ప్రయత్నం వికటించడంతో ఇప్పుడుమల్టీ లెవల్ పార్కింగ్ ఏర్పాటుకుప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులోనైపుణ్యం గల సంస్థలను టెక్నాలజీపార్టనర్గా తీసుకోనున్నారు. అందుకు అనువుగా తగిన సామర్థ్యం, అనుభవం, నైపుణ్యం గల సంస్థల జాబితా రూపొందించి అంతర్జాతీయ స్థాయిలో టెండర్లు íపిలుస్తారు. ఎంపికైన సంస్థల యజమానులతో వాణిజ్య ప్రాంతాల్లోనిఖాళీ స్థలాల్లో మల్టీ లెవల్ పార్కింగ్‌కు ఒప్పందం చేసుకుంటారు. రెడీమేడ్‌గా మల్టీ లెవల్ పార్కింగ్ ఏర్పాట్లు చేయడంతో పాటు పార్కింగ్ ఫీజులు ఎంత వసూలు చేయాలనేది ఆయా ప్రాంతాల్లోని డిమాండ్‌ను బట్టి నిర్ణయిస్తారు. అందులో టెక్నికల్ పార్టనర్‌కు ఎంత వాటా.. ఏరకంగా పంపకం వంటివన్నీ ప్లాట్ యజమాని, టెక్నికల్ పార్టనరే చూసుకుంటారు. అందులో జీహెచ్ఎంసీకి ఎలాంటి సంబంధం ఉండదు. పార్కింగ్ సమస్యనుఅధిగమించేందుకు.. స్థలం యాజమాన్య హక్కుల పరిశీలన, నిర్మాణానికి అనుమతి వంటివి జీహెచ్ఎంసీ వైపునుంచి ఉంటాయి. మల్టీ లెవెల్ పార్కింగ్ ఏర్పాట్లకు ముందుకొచ్చే వారికి ఆస్తి పన్ను, వేకెంట్ ల్యాండ్ టాక్స్, సెట్బ్యాక్లు వంటి వాటిలో కొన్ని మినహాయింపులిచ్చే ఆలోచన ఉంది. నగరంలో తీవ్రమవుతున్న పార్కింగ్ సమస్యను అధిగమించేందుకు జీహెచ్ఎంసీ ఇందుకు సిద్ధమైంది. గ్రేటర్ పరిధిలో వంద మల్టీ లెవల్ పార్కింగ్ కాంప్లెక్స్‌ల ఏర్పాటు లక్ష్యంగా నిర్ణయించారు. ఈ మల్టీ లెవల్ పార్కింగ్ సిస్టంకు సంబంధించి సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను పది రోజుల్లో రూపొందించాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేశ్‌కుమార్ సంబంధిత అధికారులకు సూచించారు. శుక్రవారం ఈ అంశంపై సమావేశం నిర్వహించిన ఆయన మాట్లాడుతూ.. దేశంలోని పుణె, ముంబై, బెంగళూరు, ఢిల్లీ తదితర నగరాల్లోని మల్టీ లెవల్ పార్కింగ్ విధానాలను అధ్యయనం చేయడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన నగరాల్లోని విధానాలను ఆన్లైన్ ద్వారా సేకరించాలన్నారు. మల్టీ లెవల్ పార్కింగ్‌కు ఆసక్తి కనబరిచే స్థల యజమానులతో టెక్నాలజీ పార్టనర్‌ను అనుసంధానించడమే జీహెచ్ఎంసీ కర్తవ్యమన్నారు. కువైట్‌కు చెందిన కేజీఎల్ ఏజెన్సీ నుంచి మల్టీ లెవల్ పార్కింగ్ నిబంధనలను తెప్పించుకోవాలని సూచించారు. పార్కింగ్ నిర్మాణాలు ప్రీ అసెంబుల్డ్గా ఉంటాయని, భూయజమాని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తన స్థలాన్ని కోరుకున్న విధంగా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. వీటిపై ఆసక్తి గల భూ యజమానుల వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. నియమ నిబంధనల అమలును జీహెచ్ఎంసీ మానిటరింగ్ చేస్తుందని వివరించారు. మల్టీ లెవల్ పార్కింగ్ ప్రాంతాలు, పార్కింగ్‌కు స్థల లభ్యత వంటి వివరాలు వాహనదారులకు తెలిసేలా మొబైల్ పార్కింగ్ యాప్‌ను జీహెచ్ఎంసీ రూపొందిస్తుంది. అవసరమైతే ఈ యాప్ నిర్వహణను గూగుల్ లాంటి ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగిస్తారు. సమావేశంలో జీహెచ్ఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ ఎస్.దేవేందర్‌రెడ్డి, అడిషనల్ కమిషనర్లు జె.శంకరయ్య, ఎన్.యాదగిరిరావు, హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఎల్.ఎస్. చౌహాన్ తదితరులు పాల్గొన్నారు. ‘‘మల్టీ లెవల్ పార్కింగ్ నిర్మాణాలు ఖర్చుతో కూడుకున్నవి కావడంతో వీటికి ఎందరు ముందుకొస్తారన్నది అంతుబట్టడం లేదు. గతంలో ప్రైవేట్ స్థలాల్లో పార్కింగ్ లాట్ల ఏర్పాటుకు ఎంతో డిమాండ్ ఉంటుందని భావించినా, కేవలం మూడు దరఖాస్తులే వచ్చాయి. మల్టీ లెవల్ పార్కింగ్‌కు ఒక కారు పట్టేందుకు చేసే ఏర్పాట్లకు దాదాపు రూ.3 లక్షలు ఖర్చవుతుందని అంచనా. మల్టీ లెవల్ పార్కింగ్‌లో దాదాపు ఇరవై కార్లుపట్టే ఏర్పాట్లు చేసినా రూ. 60 లక్షలు ఖర్చవుతుంది. నగరంలో మైక్రోసాఫ్ట్, ఐకియా, జీవీకే, సిటీసెంట్రల్ వంటి కొన్ని సంస్థలు తమ అవసరార్థం మల్టీ లెవల్ పార్కింగ్ ఏర్పాట్లు చేసుకున్నాయి. పబ్లిక్ పార్కింగ్ కోసం ప్రభుత్వ శాఖలకు చెందిన ఇరవై స్థలాల్లో మల్టీ లెవల్ పార్కింగ్ ఏర్పాట్లకు హెచ్ఎంఆర్ఎల్కు బాధ్యతలు అప్పగించి ఎంతో కాలమైనా అమలు సాధ్యం కాలేదు.’’ -
ప్రారంభమైన ‘ఫాస్టాగ్ కార్ పార్కింగ్’
శంషాబాద్: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ‘ఫాస్టాగ్’ కార్ పార్కింగ్ విధానం ఆదివారం నుంచి అందుబాటులోకి వచ్చింది. దీంతో నగదు రహిత లావాదేవీలతోపాటు కాలయాపన లేకుండా పర్యావరణ హితంగా మొత్తం ప్రక్రియ వేగంగా పూర్తవుతుంది. ‘ప్యాసింజర్ ప్రైమ్’లో ప్రయాణికుల సౌకర్యార్థం దేశంలోనే తొలిసారిగా శంషాబాద్ విమానాశ్రయంలో దీనిని ప్రారంభించారు. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) సహకారంతో దీనిని మొదలుపెట్టారు. ప్రస్తుతం ఐసీఐసీఐ ఫాస్టాగ్‌లతో ప్రారంభమవుతున్న ఈ ప్రక్రియ క్రమంగా ఇతర బ్యాంకులకు విస్తరించనున్నట్లు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టు సీఈవో ఎస్జీకే కిశోర్ మాట్లాడుతూ.. ఈ ప్రక్రియ ద్వారా కార్ల పార్కింగ్ సులభతరం కానుందన్నారు. డిజిటలైజేషన్లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ ప్రక్రియ కాలుష్యాన్ని నివారించడంతోపాటు పర్యావరణ సుస్థిరతకు దోహదం చేస్తుందని తెలిపారు. తమకు భాగస్వాములుగా చేరిన ఎన్‌పీసీఐకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇలా ఉపయోగించుకోవాలి.. ‘ఫాస్టాగ్ కార్ పార్కింగ్’ను ఉపయోగించుకోవడానికి రీలోడబుల్ ఎలక్ట్రానిక్ ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్ ఉంటుంది. ఈ ట్యాగ్‌లో రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీ ఉంటుంది. వినియోగదారులు ముందుగా ఈ ఫాస్టాగ్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అనంతరం ఈ ఫాస్టాగ్‌ను సదరు వినియోగదారుడి ప్రీపెయిడ్ బ్యాంకు ఖాతాకు లింక్ చేస్తారు. ట్యాగ్ ఖాతా యాక్టివేట్ అయిన తర్వాత దానిని కారుకు సంబంధించిన విండ్ స్క్రీన్‌పై అమర్చుకోవాలి. ప్రయాణికులు, వినియోగదారులు పార్కింగ్‌కు వచ్చినపుడు లావాదేవీల కోసం ఆగకుండా ఈ ట్యాగ్ నుంచి ఆటోమేటిక్‌గా చెల్లింపులు పూర్తవుతాయి. ఈ విధానాన్ని సబ్‌స్క్రైబ్ చేసిన వాహనదారులు ఎలాంటి మానవ ప్రమేయం లేకుండా క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించకుండా ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. వీటి కోసం పార్కింగ్ వెళ్లే చోట, నిష్క్రమణల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
మరిన్ని భద్రతా ఫీచర్లతో ఈకోలో అప్డేటెడ్ వేరియంట్
న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ ఇండియా కంపెనీ మల్టీపర్పస్ వెహికల్, ఈకోలో అప్డేటెడ్ వేరియంట్‌ను మార్కెట్లోకి తెచ్చింది. రివర్స్ పార్కింగ్ అసిస్ట్, కో డ్రైవర్ సీట్ బెల్ట్ రిమైండర్ తదితర భద్రత ఫీచర్లతో(ఇవి స్టాండర్డ్) ఈ కొత్త వేరియంట్‌ను అందుబాటులోకి తెచ్చామని మారుతీ సుజుకీ తెలిపింది. స్పీడ్ అలెర్ట్ సిస్టమ్, ఏబీఎస్, ఎయిర్‌బ్యాగ్ వంటి అదనపు ఫీచర్లు కూడా ఉన్నాయని పేర్కొంది. ప్రస్తుతం ఈకో కారు ధర రూ.3.37 లక్షల నుంచి రూ.6.33 లక్షల రేంజ్(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)లో ఉందని, ఫీచర్లను బట్టి కొత్త వేరియంట్ ధర ప్రస్తుత ధర కంటే రూ.400–23,000 అధికమని వివరించింది. -
ఆటోలకు అడ్డా...ఆర్టీసీ బస్టాండ్
సాక్షి, ముక్కామల (అంబాజీపేట): స్థానిక సెంటర్లో నిర్మించిన బస్టాండ్ ఆటోలకు అడ్డాగా మారిందని ప్రయాణికులు, స్థానికులు విమర్శిస్తున్నారు. వేలాది రూపాయలు ఖర్చు చేసి బస్టాండ్‌ను రూ.లక్షలు వెచ్చించి 1996లో నిర్మించారు. అప్పటి నుంచి బస్టాండ్‌లోకి బస్‌లు లోపలకు రాకుండా బయట నుంచి వెళ్లిపోవడంతో ప్రయాణికులు రోడ్లపైనే జాగారం చేస్తున్నారు. దాంతో స్థానికుడు వనచర్ల పండు అమలాపురం ఆర్టీసీ డిపో మేనేజర్‌కు ఫిర్యాదు చేశారు. ఆర్టీసీ బస్‌లు లోపలకు రాకుండానే బయట నుంచి వెళ్లిపోతున్నాయని, లక్షలాది రూపాయలతో నిర్మించిన బస్టాండ్ నిరుపయోగంగా తయారైందని డిపో మేనేజర్‌కు వివరించినట్లు పండు తెలిపారు. బస్టాండ్‌లో ఆర్టీసీ బస్‌లు రాకుండా ఆటోలు అడ్డుగా నిలుపుదల చేస్తున్నారని గతం నుంచి ఆరోపణలు వస్తున్నా ఆర్టీసీ అధికారుల పట్టించుకోలేదనే విషయాన్ని గుర్తు చేశారు. దాంతో ఆర్టీసీ బస్‌లను లోపలకు వచ్చేలా చూడాలని వారం రోజులపాటు బస్టాండ్ వద్ద ఉండాలని అధికారులు సూచించారని పండు తెలిపారు. దాంతో ఆర్టీసీ బస్‌లను బస్టాండ్ లోపలకు తీసుకుని వస్తున్నారని, అయితే బస్‌లు వచ్చే సమయంలో ఆటోలను అడ్డుగా పెడుతున్నారని వాపోయాడు. పసుపల్లి గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు బస్టాండ్ ఆవరణలో హల్‌చల్‌చేసి భయబ్రాంతులకు గురిచేశాడని ఈ విషయాన్ని అంబాజీపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశానన్నాడు. బస్‌లకు అడ్డుగా నిలుపుదల చేయవద్దని కోరితే ఆటో డ్రైవర్లు గొడవకు వస్తున్నారని ఈ విషయాన్ని డిపో మేనేజర్‌కు తెలియజేశామన్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు స్పందించి ఆర్టీసీ బస్‌లను లోపలకు వచ్చేలా చూడాలని కోరారు. -
మేల్కోకుంటే ముప్పే..!
సాక్షి,సిటీబ్యూరో: బెంగుళూరులో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంతో దేశంలోని పలు ముఖ్య నగరాలు మేల్కొంటున్నాయి. అయితే హైదరాబాద్‌లో ఆపరిస్థితి కానరావటం లేదు. బెంగళూరులోని ఏరో ఇండియా వైమానిక ప్రదర్శన జరుగుతున్న యలహంక ఎయిర్‌బేస్ స్టేషన్ సమీపంలో పార్కింగ్ ప్రాంతంలో శనివారం అగ్ని ప్రమాదం సంభవించి దాదాపు 3 వందల కార్లు కాలిపోయాయి.. భాగ్యనగరంలోనూ ఈ తరహా ముప్పు పొంచి ఉంది. నగరంలోని అనేక పార్కింగ్ ప్రాంతాల్లో ఆయా ప్రాంతాల్లో రక్షణ వ్యవస్థలు లేకపోవడంతో అనుకోని ఘటన సంభవిస్తే భారీగా ఆస్తినష్టం వాటిల్లేందుకు ఆస్కారం ఉంది. ముఖ్య ప్రదేశాల్లోనూ సేఫ్టీ కరువు.. నగరంలో ప్రధాన కేంద్రాలైన రవీంద్రభారతి, బస్‌స్టేషన్, రైల్వేస్టేషన్, పాటు వివిధ పార్కులు, వాణిజ్య సముదాయాల భవనాల్లో వాహనాల్లో పార్కింగ్ ప్రదేశాల్లో నిర్వాహకులు 8 గంటల సమయానికి నిర్ణీత రుసుము వసూలు చేస్తుంటారు. ధరల విషయంలో కచ్చితంగా ఉంటున్న సంబంధిత కాంట్రాక్టర్లు వాహనాల భద్రత విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు. కొందరు వ్యక్తులు చోరీ చేసిన వాహనాలను పార్కింగ్ ప్రదేశాల్లో ఉంచుతున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి వారిని కట్టడి చేసేందుకు వీలుగా ఇటీవల పోలీసులు పార్కింగ్ ప్రదేశాల్లో నిఘా కెమెరాలు ఏర్పాటు చేయించారు. ఈ విషయంలో కొంతవరకు భద్రత ఉన్నా.. ఆయా ప్రాంతాల నిర్వహణ మాత్రం అత్యంత ఘోరంగా ఉంటోంది. ♦ నగరంలోని రవీంద్రభారతి, మహాత్మాగాంధీ బస్‌స్టేషన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదుట, ఎన్టీఆర్ గార్డెన్, సంజీవయ్య పార్క్, జలవిహార్, సెక్రటరియేట్ తదితర ప్రాంతాలతో పాటు చాలాచోట్ల పార్కింగ్ ప్రాంగణాలకు ఎలాంటి షెడ్లు ఉండడం లేదు. ఎండైనా, వానైనా వాహనాలు పాడైపోవాల్సిందే. వేసవిలో ఎండల కారణంగా వాహనాలు వేడెక్కి తగలబడే ప్రమాదం ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ♦ కొన్ని పార్కింగ్ ప్రదేశాల్లో మొక్కుబడిగా కొంత ప్రాంగణానికి మాత్రం షెడ్లను ఏర్పాటు చేస్తున్నారు. ♦ పార్కింగ్ ప్రదేశాల్లో సాధ్యమైనన్ని ఎక్కువ వాహనాలను ఉంచేందుకు వీలుగా ఏ మాత్రం ఖాళీ లేకుండా వాహనాలతో నింపేస్తున్నారు. దీంతో ఒక్క వాహనం ప్రమాదానికి గురైనా పక్కనున్నవి కూడా వేగంగా తగలబడేందుకు అవకాశం ఉంది. ♦ పార్కింగ్ ప్రదేశాల్లో అగ్నిప్రమాదాలు సంభవిస్తే మంటలను అదుపులోకి తెచ్చేందుకు వీలుగా ఎలాంటి ముందస్తు ఏర్పాట్లు చేయడం లేదు. నీటిసంపులుగానీ, ఫైర్ ఎక్స్ట్వింగ్విషర్లు, కనీసం ఇసుకబక్కెట్లు కూడా అందుబాటులో ఉంచడం లేదు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో పార్కింగ్ ప్రదేశాల నిర్వహణ కాంట్రాక్టును దక్కించుకున్నవారు వారికి కేటాయించిన ప్రదేశంతోపాటు దానికి సమీపంలో వాహనాలను నిలిపినా అడ్డగోలుగా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. అగ్నిప్రమాద నిరోధక వ్యవస్థలు మాత్రం ఏర్పాటు చేసుకోవడంలేదు. రోడ్లపైనే పార్కింగ్ .. నగరంలోని అనేకచోట్ల పార్కింగ్ ప్రాంతాలున్నా.. రుసుముల కారణంగా చాలామంది వాటిని వినియోగించడం లేదు. పలు సందర్భాల్లో రహదారి పక్కనే నిలిపేస్తున్నారు. అనధికారిక పార్కింగ్‌ల కారణంగా ట్రాఫిక్‌కు తరచూ అవాంతరాలు ఏర్పడుతున్నాయి. లుంబినీ పార్కు పార్కింగ్ స్థలంలో మృతువీరుల స్మృతి భవనం నిర్మాణ పనుల నేపథ్యంలో ఎన్టీఆర్ గార్డెన్లో పార్కింగ్‌కు అవకాశం కల్పించారు. పర్యాటకులు అంతదూరంలో వాహనాలు నిలిపి లుంబినీ పార్కుకు రాలేక పార్కు ముందుభాగంలోని పుట్‌పాత్‌పైనే వాహనాలు నిలుపుతున్నారు. -
పార్కింగ్ ప్రాబ్లమే!
సాక్షి, సిటీబ్యూరో: ‘సందర్శకుల వాహనాలు లోనికి అనుమతించబడవు...’ నగరంలోని అనేక అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీల వద్ద వాటి పేర్ల కంటే ప్రముఖంగా ఈ బోర్డులు కనిపిస్తుంటాయి. ఇది కూడా పరోక్షంగా ట్రాఫిక్ ఇబ్బందులకు కారణమవుతోంది. ఇప్పటికే ఉన్న వేలాది అపార్ట్‌మెంట్స్‌కు తోడు ఏటేటా కొత్తగా భారీ సంఖ్యలో పుట్టుకొస్తున్నాయి. అందులో నివసించే కుటుంబాలకు దాదాపు సమానంగా అనునిత్యం విజిటర్స్ వస్తుంటారు. అపార్ట్మెంట్ వాసులకు ఉన్నట్లు వీరికి పార్కింగ్ ఉండకపోవడంతో రోడ్లే ఆధారం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పెద్ద అపార్ట్‌మెంట్స్‌కు నిర్ణీత మొత్తం పార్కింగ్ స్థలం ఉండాలనే నిబంధనలు అమలులోకి రావాలని కొన్నేళ్లుగా వినిపిస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. సిటీతో పాటు శివార్లలో అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. వీటిలో నివసిస్తున్న లక్షల మందిని కలవడానికి నిత్యం వేల సంఖ్యలో సందర్శకులు వస్తుంటారు. అయితే అనేక ప్రాంతాల్లో ఉంటున్న నివాస సముదాయాల్లోకి సందర్శకుల వాహనాలను అనుమతించట్లేదు. ఈ మేరకు యాజమాన్యం/నిర్వాహకులు భారీ బోర్డులు సైతం ఏర్పాటు చేస్తున్నారు. అంతటితో ఆగకుండా సెక్యూరిటీ గార్డులు, వాచ్మెన్లకు ఆ బాధ్యతల్ని అప్పగిస్తున్నాయి. అదేమంటే గుర్తుతెలియని వ్యక్తులకు చెందిన వాహనాలను ప్రాంగణంలోకి అనుమతిస్తే భద్రత పరమైన ఇబ్బందులు వస్తాయని చెప్తుంటారు. ఆయా అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీల్లో సందర్శకుల వాహనాలు నిలుపుకోవడానికి అవసరమైన స్థలం లేకపోవడమూ ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా మారుతోంది. వాటిలో నివసించే వారికి మాత్రమే టూ వీలర్, ఫోర్ వీలర్ అంటూ స్థలాన్ని లెక్కకట్టి ఇస్తున్న బిల్డర్లు, యజమానులు సందర్శకుల విషయం పట్టించుకోవట్లేదు. ‘ప్రత్యామ్నాయ’ ట్రాఫిక్ ఇబ్బందులు... నగరంలో వాహనాల సంఖ్యతో పాటు రహదారుల వినియోగం కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో ప్రధాన రహదారులతో పాటే ప్రత్యామ్నాయ మార్గాలు, గల్లీలు వినియోగించుకునే వారి సంఖ్య నానాటికీ ఎక్కువ అవుతోంది. వీరితో పాటు ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలు ఉన్నప్పుడు వాహన చోదకులు ప్రధాన రహదారుల్ని వదలాల్సిందే. మెయిన్ రోడ్స్‌లో ఉంటున్న ట్రాఫిక్‌ను తప్పించుకోవడానికి, వీలైనంత తక్కువ సమయంలో గమ్యం చేరుకోవడానికి వాహనచోదకులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుంటున్నారు. భారీ వాహనాలు కాకున్నా ద్విచక్ర, తేలికపాటి వాహనాలు ఈ మార్గాలను అనుసరిస్తున్నాయి. ఈ రూట్స్ అన్నీ ఎక్కువగా కాలనీల లోపల నుంచే ఉంటున్నాయి. ఆయా ప్రాంతాల్లోని నివాస సముదాయాలకు వచ్చే సందర్శకుల తమ వాహనాలను వాటి ప్రాంగణాల్లో కాకుండా రోడ్ల పైనే ఉంచేస్తున్నారు. వీటి కారణంగా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్తున్న వాహనచోదకులకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పట్లేదు. కమర్షియల్ ‘స్పేస్’ ఇలా... వాణిజ్య సముదాయాలు, కేఫ్‌లు, దుకాణాల నిరాహకులు సరైన పార్కింగ్ వసతులు కల్పించడం తప్పనిసరి. ఒకప్పుడు అన్ని రకాలైన వాణిజ్య సయుదామాలకూ 25 శాతం పార్కింగ్ స్థలం కచ్చితం. వాటిని వస్తున్న వినియోగదారుల తాకిడిని తట్టుకోవడానికి ఈ స్థలం చాలట్లేదని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ భావించింది. దీంతో 2006లో జీవో నెం. 86 జారీ చేసింది. నగరంలోని వాణిజ్య సముదాయాలు, వ్యాపార సంస్థలకు పార్కింగ్ స్థలాలు ఎంత శాతం ఉండాలన్నది ఇందులో స్పష్టంగా పేర్కొన్నారు. మల్టీప్లెక్స్‌తో కూడిన సినిమా హాళ్లకు, మల్టీప్లెక్స్‌లకు మెుత్తం విస్తీర్ణంలో 60 శాతం, హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లకు 40 శాతం పార్కింగ్ స్థలం తప్పనిసరిగా ఉండాలి. వాణిజ్య సముదాయాలు తదితరాలకు కనీసం 25 శాతం ఉండాలి. అలా లేని వాటికి లైసెన్స్ రెన్యువల్ చేయవద్దని ఆ జీవోలో స్పష్టంగా పేర్కొన్నారు. అవసరానికి తగ్గట్టు ‘రెసిడెన్షియల్’... కమర్షియల్ నిర్మాణాల విషయంలో పార్కింగ్ స్థలాన్ని కచ్చితం చేస్తూ కేటాయించాల్సిన స్థలాన్నీ నిర్దేశించినట్లే నివాస సముదాయాలకూ విజిటర్స్ పార్కింగ్ కచ్చితం చేయాలని ట్రాఫిక్ విభాగం అధికారులు కొన్నేళ్లుగా వాదిస్తున్నారు. గతంలో జీహెచ్ఎంసీ అధికారులతో జరిగిన అనేక సమావేశాల్లో ఈ విషయాన్ని ప్రాథమింకంగా చర్చించారు. జీహెచ్ఎంసీ, పోలీసు ఇతర విభాగాల ఉన్నతాధికారులతో ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీలో దీనిపై ఓ నిర్ణయం తీసుకోవాలని భావించారు. ఏ తరహా అపార్ట్మెంట్/గేటెడ్ కమ్యూనిటీలకు ఎంత శాతం పార్కింగ్ స్థలం ఉండాలన్నది ఖరారు చేయాలనీ యోచించారు. అయితే ఇతర యంత్రాంగాలు పట్టించుకోకపోవడంతో ఈ అంశానికి బ్రేక్ పడింది. నగరంలో నానాటికీ పెరుగుతున్న వాహనాల సంఖ్య నేపథ్యంలో భవిష్యత్తులో ప్రత్యామ్నాయ మార్గాల వినియోగం పెరుగుతుందని, ఈ నేపథ్యంలోనే విజిటర్స్ పార్కింగ్‌పై నిర్ణయం తీసుకోవాలని ఓ ట్రాఫిక్ ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు. -
హే గాంధీ.. ఇదేందీ
గాంధీఆస్పత్రి : సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో వాహనాల పార్కింగ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. ప్రాణాపాయస్థితిలో ఉన్న రోగులను తీసుకువచ్చే అంబులెన్స్‌లకు దారి లేకుండా అత్యవసర విభాగం ఎదుట అడ్డదిడ్డంగా వాహనాలను పార్క్ చేస్తున్నారు. ఓపీ విభాగం ఎదుట కూడా ఇష్టారాజ్యంగా ఆటోలు పార్క్ చేస్తుండడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పెయిడ్ పార్కింగ్‌ను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవోతో ఇక్కడ కూడా పెయిడ్ పార్కింగ్ రద్దయింది. ప్రతిరోజు సుమారు పదివేల మంది రోగులు వారి బంధువులు రాకపోకలు సాగిస్తారు. గతంలో పెయిడ్ పార్కింగ్ కాంట్రాక్టుదారు సుమారు 25 మంది సిబ్బందిని ఏర్పాటు చేసి పార్కింగ్ వ్యవస్థను క్రమబద్ధీకరించేవారు. పెయిడ్ పార్కింగ్ రద్దు కావడంతో వాహనదారులు ఆస్పత్రి ప్రాంగణంలో ఇష్టానుసారం వాహనాలను నిలుపుతున్నారు. ఇదేమని అడిగిన వారితో వాహనదారులు గొడవలకు దిగుతున్నాన్నారు. అంబులెన్స్‌కు దారేదీ గాంధీ ఆస్పత్రి ప్రధాన ద్వారం నుంచి ఓపీ విభాగం మీదుగా అత్యవసర విభాగానికి వెళ్లే దారిలో రోడ్డుకు అడ్డంగా ద్విచక్ర వాహనాలతో పాటు ఆటోలను నిలుపడంతో అంబులెన్స్‌లకు దారిలేకుండా పోతోంది. అవుట్ పేషెంట్ విభాగం వద్ద స్ట్రెచర్లు, వీల్చైర్లపై రోగులకు తరలించేందుకు వీలు లేకుండా ర్యాంపుకు అడ్డంగా వాహనాలు పార్కింగ్ చేయడంతో రోగులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. అడ్డంగా పార్కింగ్ చేసిన వాహనదారులు తమతో గొడవకు దిగడంతోపాటు దాడులకు పాల్పడుతున్నారని సెక్యూరిటీ సిబ్బంది వాపోతున్నారు. ఆదాయానికి గండి..పెరిగిన పార్కింగ్ సమస్యలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పెయిడ్ పార్కింగ్‌ను రద్దు చేయడం మంచి విషయమే అయినప్పటికీ పార్కింగ్ కాంట్రాక్టు ద్వారా ఆస్పత్రి అభివృద్ధి నిధికి వచ్చే ఆదాయానికి గండి పడింది. దీంతో పాటు పార్కింగ్ సమస్యలు తీవ్రస్థాయిలో పెరిగాయి. సమస్య పరిష్కారానికి ప్రత్యేక ప్రణాళిక గాంధీ ఆస్పత్రిలో పార్కింగ్ సమస్య తీవ్రంగా ఉందనేది వాస్తవం. సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తాం. ఈ సమస్యను ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాము. పార్కింగ్ కోసం ఆరుగురు సెక్యూరిటీ సిబ్బందిని నియమించాం. వాహనదారులు కూడా విచక్షణా రహితంగా తమ వాహనాలను పార్కింగ్ చేయడం మానుకోవాలి. శ్రవణ్‌కుమార్, గాంధీఆస్పత్రి సూపరింటెండెంట్ -
సెల్లార్లపై సమరం
అందాల నగరిగా.. ఆర్థిక రాజధానిగా.. స్మార్ట్ సిటీగా విస్తరిస్తున్న విశాఖ నగరంపైనే అందరి చూపు. నగరం విస్తరిస్తున్నట్లుగానే.. జనాభా, వారు వినియోగిస్తున్న వాహనాలూ పెరుగుతున్నాయి. ఫలితంగా ట్రాఫిక్ సమస్య జఠిలంగా మారింది. విశాలంగా ఉన్న విశాఖ రహదారుల్లో ట్రాఫిక్ సమస్య ఉండేది కాదు.. కానీ గడిచిన మూడేళ్లలో బహుళ అంతస్తుల వాణిజ్య సముదాయాలు ఇబ్బడిముబ్బడిగా పెరగడంతో ట్రాఫిక్ రద్దీ నెలకొంది. బహుళ అంతస్తుల్లో పార్కింగ్ సదుపాయం సరిగ్గా కల్పించక రోడ్డుపైనే వాహనాలను పార్క్ చేయాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విశాఖ సిటీ: మహా విశాఖ నగరంలో పార్కింగ్ సమస్య జఠిలమైపోతోంది. ఓ వైపు బహుళ అంతస్తుల వాణిజ్య సముదాయాలు పెరిగిపోతుండగా.. వాటి సెల్లార్లలో నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ సౌకర్యానికి బదులు వ్యాపార లావాదేవీలకు ఉపయోగిస్తుండడంతో సమస్య రోజు రోజుకీ తీవ్రమవుతోంది. దీనిని అధిగమించడానికి జీవీఎంసీ, ట్రాఫిక్ పోలీసు విభాగం సంయుక్తంగా రంగంలోకి దిగాయి. సమస్య ఎక్కువగా ఉన్న వన్‌టౌన్ ఏరియాలో డ్రైవ్ చేపట్టి సెల్లార్లను పార్కింగ్ కోసం ఉపయోగించేలా చర్యలకు ఉపక్రమిస్తున్నారు. జీవీఎంసీ పరిధిలో దాదాపు 500కు పైగా బహుళ అంతస్తుల వాణిజ్య సముదాయాలుండగా వీటిలో 50 భవనాల వరకూ మాత్రమే సెల్లార్లను పూర్తిగా పార్కింగ్‌కు ఉపయోగిస్తున్నాయి. మరో 50 దుకాణాలు తూతూ మంత్రంగా పార్కింగ్ కోసం సెల్లార్లను వినియోగిస్తుండగా.. మిగిలిన 400కి పైగా సముదాయాలు మాత్రం వాటిని కమర్షియల్‌గా వినియోగించుకుంటున్నాయి. జీవీఎంసీలో ప్లాన్ తీసుకునేటప్పుడు మాత్రం సెల్లార్లను పార్కింగ్‌కు వినియోగిస్తామని పేర్కొంటారు. కానీ భవనం వినియోగంలోకి వచ్చాక దాన్ని వ్యాపార, వాణిజ్యానికి ఉపయోగించి, వాహనాలను రోడ్లపైనే పార్క్ చేస్తున్నారు. జీవీఎంసీతో కలిసి ‘ట్రాఫిక్’ నియంత్రణ కోసం.. నగరంలో వాణిజ్య ప్రాంతాలైన జగదాంబ, డాబాగార్డెన్స్, పూర్ణామార్కెట్, ద్వారకానగర్, అశీల్‌మెట్ట, మద్దిలపాలెం, జిల్లా పరిషత్, కేజీహెచ్, గాజువాక, అక్కయ్యపాలెం, ఎంవీపీ కాలనీ, కంచరపాలెం, ఎన్ఏడీ కొత్తరోడ్డు, మర్రిపాలెం, సూర్యాబాగ్, మాధవధార తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఇక్కడ ఉన్న వాణిజ్య సముదాయాల్లో 90 శాతం వరకూ సెల్లార్లను పార్కింగ్‌కు కాకుండా ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు. ఈ కారణంగానే రద్దీ ఎక్కువైపోతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు జీవీఎంసీతో కలిసి ట్రాఫిక్ పోలీసులు నడుంబిగించారు. రెండు శాఖలు సంయుక్తంగా పార్కింగ్ సమస్యకు సరైన పరిష్కారం కోసం సమన్వయంగా పనిచేయాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా డ్రైవ్ చేపట్టారు. తొలి విడతలో భాగంగా ప్రధాన రద్దీ ఉన్న వన్ టౌన్ ప్రాంతంలో వాణిజ్య సముదాయాలకు తాఖీదులివ్వడం ప్రారంభించారు. శుక్రవారం జీవీఎంసీ, ట్రాఫిక్ పోలీస్ అధికారులు వాల్తేర్ రోడ్డులో వాణిజ్య సముదాయాల్ని పరిశీలించారు. సెల్లార్లను పార్కింగ్‌కు ఉపయోగించకుండా ఇతర అవసరాలకు వినియోగిస్తున్న భవన యజమానులకు హెచ్చరికలతో కూడిన నోటీసులు జారీ చేశారు. సెల్లార్లను పార్కింగ్‌కు మాత్రమే వినియోగించకపోతే భవనాల్ని సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఫ్రీ పార్కింగ్ జోన్స్ ఎక్కడ? నగరాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తున్న జీవీఎంసీ.. పార్కింగ్ విషయంలో మాత్రం సరైన చర్యలు తీసుకోలేకపోతోందన్న విమర్శ ఉంది. చాలా నగరాల్లో ఫ్రీ పార్కింగ్ జోన్లు ఎక్కువగా ఉంటాయి. మహా విశాఖ నగరంలో మాత్రం అక్కడక్కడా ఇవి కనిపిస్తున్నాయి. రైతుబజార్లు, పూర్ణామార్కెట్, మల్టీప్లెక్స్‌లలో పార్కింగ్ ఫీజుల దందా కొనసాగుతోంది. అక్కడ ఐదు నిమిషాల పని ఉన్నా రూ.10 నుంచి రూ.40 వరకూ వసూలు చేస్తున్నారు. ఆ డబ్బులు చెల్లించేందుకు ఇష్టపడక వాహనదారులంతా ఎక్కడపడితే అక్కడ పార్క్ చేసేస్తున్నారు. ఈ కారణంగానే సమస్య పెరిగిపోతోంది. మరోవైపు నోపార్కింగ్ జోన్లలో వాహనాలు నిలపడం ట్రాఫిక్ పోలీసులకు తలనొప్పిగా మారింది. ఫ్రీ పార్కింగ్ విషయంలో జీవీఎంసీ కాస్తా ప్రణాళికలు రూపొందించి. ప్రతి అర కిలోమీటర్ లేదా కిలోమీటర్ దూరంలో ఒక ఫ్రీ పార్కింగ్ జోన్ ఏర్పాటు చేస్తే ఈ సమస్యకు కొంత పరిష్కారం దొరుకుతుందని సర్వత్రా అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్కింగ్ కష్టాలు తీర్చేందుకే ప్రత్యేక డ్రైవ్ నగరంలో వ్యక్తిగత వాహన వినియోగం పెరుగుతోంది. ఫలితంగా ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్కింగ్ చేసేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. స్మార్ట్ నగరంలో ప్రజలు పార్కింగ్ కోసం అవస్థలు పడకుండా ఉండేందుకు కమిషనర్, చీఫ్ సిటీ ప్లానర్ సూచనల మేరకు ట్రాఫిక్ పోలీసులతో కలిపి చర్యలకు ఉపక్రమిస్తున్నాం. అన్ని ప్రధాన రహదారుల్లోనూ డ్రైవ్ చేపడుతున్నాం. ప్రతి వాణిజ్య సముదాయంలోనూ సెల్లార్‌ను పార్కింగ్‌కు మాత్రమే వినియోగించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నాం. –సురేష్, జీవీఎంసీ డిప్యూటీ సిటీ ప్లానర్ -
బిహారీల దాదాగిరి
సికింద్రాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఎదుట బిహారీ యువకులు దాదాగిరీ చేశారు. పార్కింగ్ సిబ్బంది వారిని అడ్డుకున్నందుకు ఆందోళనకు దిగారు. దీంతో గురువారం సాయంత్రం కొద్ది సేపు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఎదుట వాహనాల రాకపోకలు స్తంభించి గందరగోళం నెలకొంది. ఆర్మీ, ఆర్పీఎఫ్, జీఆర్పీతోపాటు గోపాలపురం పోలీసులు జోక్యం చేసుకుని వారిని అక్కడినుంచి పంపివేశారు. వివరాల్లోకి వెళితే..రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పరీక్ష రాసేందుకు బిహార్‌కు చెందిన యువకులు వందల సంఖ్యలో నగరానికి వచ్చారు. పరీక్ష ముగిసిన అనంతరం స్వస్థలాలకు తిరిగి వెళ్లేందుకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. ట్రైన్ వచ్చేందుకు సమయం ఉండడంతో స్టేషన్ ముందు ఉన్న పెయిడ్ పార్కింగ్ స్థలంలో సేదతీరే ప్రయత్నం చేశారు. ఇందుకు అభ్యంతరం చెప్పి పార్కింగ్ సిబ్బంది స్టేషన్‌లోపలికి వెళ్లి వెయిటింగ్‌రూంలో వేచి ఉండాలని సూచించాడు. రైలు వచ్చే వరకు ఇక్కడే కూర్చుంటామని భీష్మించుకున్న ఓ యువకుడు పార్కింగ్ సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. దీంతో మాటామాటా పెరిగి ఇరువురి మధ్య తోపులాట జరిగింది. దీంతో బిహారీ యువకులందరూ అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు. గొడవకు కారణమైన యువకుడిని గోపాలపురం పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తీసుకువెళ్లేందుకు ప్రయత్నించగా, వారు పోలీసు వాహనానికి అడ్డుగా నిల్చుని నినాదాలు చేశారు. దీంతో వాహనాల రాకపోకలు స్తంభించడంతో గందరగోళం నెలకొంది. ఆర్మీ సిబ్బంది. వివిధ విభాగాల పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. రైలు వచ్చేవరకు 6వ నంబర్ ప్లాట్‌ఫామ్‌పై ఆసీనులు కావాలని రైల్వే అధికారులు అనుమతించడంతో వారు స్టేషన్‌లోపలికి వెళ్లిపోయారు. -
సిటీలో కొత్తగా పార్కింగ్ కాంప్లెక్స్‌లు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని వాహనదారులకు పార్కింగ్ కాంప్లెక్స్‌లను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం యోచిస్తోంది. మోండా మార్కెట్ ఓల్డ్ జైలు, పంజగుట్ట శ్మశానవాటిక, ఖిల్వత్ దగ్గరి పెన్షన్ ఆఫీస్, ఖైరతాబాద్ పార్కింగ్ యార్డు తదితర ప్రాంతాల్లో మల్టీలెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్‌లు రానున్నాయి. ప్రసిద్ధి చెందిన హరిహర కళాభవన్, చిక్కడపల్లి, చిలకలగూడ మున్సిపల్ మార్కెట్ తదితర ప్రాంతాల్లోనూ ఆధునిక పార్కింగ్ కాంప్లెక్సులను నిర్మించనున్నారు. నూతన పార్కింగ్ పాలసీ మేరకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో స్మార్ట్ పార్కింగ్ సిస్టమ్‌ను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకుగాను నగరంలో పార్కింగ్ కాంప్లెక్సులు నిర్మించేందుకు తగిన స్థలాల్ని ఎంపిక చేయాల్సిందిగా వివిధ ప్రభుత్వ విభాగాలకు సూచించింది. జీహెచ్ఎంసీతోపాటు హెచ్ఎండీఏ, టీఎస్ఐఐసీ, హెచ్ఎంఆర్ఎల్, హెచ్ఎండీఏ తదితర ప్రభుత్వ విభాగాలు తమ పరిధిలో పార్కింగ్ ఏర్పాట్లకు అనువుగా ఉన్న ప్రాంతాల జాబితాను రూపొందించాయి. జీహెచ్ఎంసీ పదహారు ప్రాంతాలను అనువైనవిగా గుర్తించింది. మోండా మార్కెట్, పాతజైలు ప్రాంతంలో ఖాళీగా ఉన్న ఎకరం స్థలంలో, చట్నీస్ ఎదురుగా పంజగుట్ట శ్మశానవాటికకు చెందిన దాదాపు ఎకరం స్థలంలో, పురానాపూల్ దగ్గరి చుడీబజార్‌లో ఒకటిన్నర ఎకరాల స్థలంలో మల్టీలెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్‌లను అధికారులు నిర్మించనున్నారు. చాదర్‌ఘాట్ దగ్గర దాదాపు 900 చదరపుగజాలస్థలంలో, చార్మినార్ పాదచారుల పథకంలో భాగంగా ఉన్న చార్మినార్ బస్టాండ్, చందానగర్, లాలాపేట, దూద్‌బావి, రాణిగంజ్ దగ్గర పర్యాటక శాఖ స్థలం ఎదుట, ఖిల్వత్దగ్గరి పాత పెన్షన్ కార్యాలయం ప్రాంతాల్లో దాదాపు 2 వేల చదరపు గజాల నుంచి 5 వేల చదరపు గజాల వరకు విస్తీర్ణమున్న స్థలాల్లో పార్కింగ్ కాంప్లెక్సులు నిర్మించనున్నారు. ఇంకా దారుల్షిఫాలో కులీకుతుబ్‌షా ఆవరణలోని ఎకరం స్థలంలో, బంజారాహిల్స్ జగన్నాథ ఆలయం దగ్గర 2 వేల చదరపు గజాల స్థలంలో, ఖైరతాబాద్‌లో జీహెచ్ఎంసీకి చెందిన వాహన పార్కింగ్ యార్డు, దాని పక్కన ఉన్న స్థలంతో కలిపి దాదాపు 3 వేల చదరపుగజాల్లో, బంజారాహిల్స్ సినీమాక్స్ వెనుక 2 వేల చదరపు గజాల స్థలం పార్కింగ్ కాంప్లెక్స్‌లకు అనువుగా ఉంటాయని గుర్తించారు. వీటితోపాటు ఇతర ప్రభుత్వ విభాగాల స్థలాల్లో మొత్తం 42 పార్కింగ్ కాంప్లెక్స్లతోపాటు అవకాశం ఉన్న ఇతర ప్రాంతాల్లో ఇతర సదుపాయాల కాంప్లెక్స్‌లు కూడా నిర్మించే యోచనలో ఉన్నారు. హరిహర కళాభవన్ స్థానే.. హరిహర కళాభవన్‌లో ప్రస్తుతం సభలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఆడిటోరి యంతోపాటు, వివిధ మడిగెల్లో దుకాణాలు, ఒక భవనంలో వివిధ ప్రభుత్వ కార్యాలయాలున్నాయి. వీటన్నింటినీ కూల్చివేసి మల్టీలెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్, మల్టీపర్పస్ మోడరన్ కాంప్లెక్స్ నిర్మించేందుకు కసరత్తు చేస్తున్నారు. దాదాపు 70% స్థలాన్ని పార్కింగ్ కాంప్లెక్స్‌కు వినియోగించనున్నారు. సికింద్రాబాద్‌లోని రైల్వేస్టేషన్, హాస్పిటళ్లు, పలు వాణిజ్య కేంద్రాలను, అక్కడకు వచ్చే భారీ రద్దీని దృష్టిలో ఉంచుకొని అక్కడ భారీ పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి హరిహరకళాభవన్ అనువైన ప్రదేశంగా భావించారు. 15 అంతస్తుల్లో కొత్త కాంప్లెక్స్‌ను నిర్మించే యోచనలో ఉన్నారు. ఆదాయం ఆయా విభాగాలకే... పార్కింగ్ కాంప్లెక్స్‌లకు సంబంధించి హెచ్ఎంఆర్ఎల్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. ఆయా ప్రభుత్వశాఖల స్థలాల్లో నిర్మించే పార్కింగ్ కాంప్లెక్స్‌ల వల్ల వచ్చే ఆదాయం ఆయా శాఖలకే చెందుతుందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. పీపీపీ పద్ధతిలో పార్కింగ్ కాంప్లెక్స్‌లను నిర్మించనున్నారు. ఈ పార్కింగ్ ప్రాంతాల్లో స్మార్ట్ పార్కింగ్ íసిస్టమ్‌ను అమలు చేయనున్నారు. వీటికి సంబంధించి ప్రత్యేకంగా మొబైల్ యాప్ రూపకల్పన తదితర చర్యలు చేపడతారు. పార్కింగ్ కాంప్లెక్సుల ఏర్పాటుకు వీటిల్లో కొన్నింటికి ఎలాంటి ఆటంకాలు లేనప్పటికీ, కొన్నింటికి ఆయా విభాగాల నుంచి అనుమతులు పొందాల్సి ఉంది. -
ఎండలో కారు పార్క్ చేస్తే ప్రాణాలకు ముప్పు
లాస్ ఎంజిలస్: కారును ఎండలో పార్క్ చేసిన గంటలో దాని లోపలి ఉష్ణోగ్రత 46 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటుందని, దీంతో కారు లోపల చిక్కుకున్న చిన్నారుల ప్రాణాలకు ముప్పు ఉంటుందని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, శాన్ డియాగో–అరిజోనా స్టేట్ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. వేసవికాలంలో ఎకానమీ, మిడ్ సెడాన్, లగ్జరీ సెగ్మెంట్లకు చెందిన 6 కార్లను వీరు అధ్యయనం చేశారు. కారులో ఉష్ణోగ్రత మార్పు కారణంగా రెండేళ్ల చిన్నారులపై పడే ప్రభావాన్ని పరీక్షించారు. ఇందులో కారును ఎండలో పార్క్ చేసిన గంటలో స్టీరింగ్ వద్ద 52, సీట్ల దగ్గర 50 డిగ్రీలు, డాష్ బోర్డు వద్ద 69 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నీడలో నిలిపిన గంటలో కారు లోపల 37డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు గుర్తించారు. -
రైల్వే స్టేషన్లో జరిమానాల దందా.!
విజయవాడ రైల్వే స్టేషన్లో జరిమానాల దందా యథేచ్ఛగా సాగుతోంది. నో పార్కింగ్ జోన్లో వాహనాలు పెట్టిన వారి నుంచి అక్కడి ప్రీమియం స్టాండ్ కాంట్రాక్టర్ ముక్కు పిండి జరిమానాలు వసూలు చేస్తున్నారు. ఈ ఫైన్‌కు ఒక లెక్కా పత్రం ఉండదు.. రశీదు ఇవ్వరు.. దీంతో వాహనదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆదివారం ఇదే విధంగా కాంట్రాక్టర్‌కు, వాహనయజమానులకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. సాక్షి, విజయవాడ: విజయవాడ రైల్వే స్టేషన్ సౌత్ టెర్మినల్ వద్ద వాహనాల పార్కింగ్ కాంట్రాక్టర్, పోర్టర్ల హవా నడుస్తోంది. సౌత్ టెర్మినల్‌కు సమీపంలోని ఫ్లాట్‌ఫారాలపైకి పార్సిళ్లను తీసుకువెళ్లేందుకు ఒక ప్రత్యేక గేటు ఉంది. ఈ గేటులోంచి ఫ్లాట్‌ఫారాలపై వెళ్లడం సులభంగా ఉండటంతో ఎక్కువ మంది ప్రయాణికులు ఈ గేటులోంచి లోపలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతారు. అయితే కేవలం ట్రాలీలతో పార్సిళ్లు, సరుకు తీసుకువెళ్లేందుకు మాత్రమే ఈ గేటు ఉందని, ప్రయాణికులు వెళ్లేందుకు వీలు లేదంటూ పోర్టర్లు అడ్డుకుంటున్నారు. నో పార్కింగ్ జోన్.. ఈ గేటు ప్రక్కనే ఒక టూ వీలర్ ప్రీమియం స్టాండ్‌ను అధికారులు ఏర్పాటు చేశారు. ఇక్కడ వాహనాన్ని పార్క్ చేస్తే గంటకు రూ.10 చెల్లించాల్సి ఉంటుంది. దీంతో టెర్మినల్ పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశాన్ని అధికారులు నో–పార్కింగ్ జోన్‌గా ప్రకటించారు. అయితే సౌత్ టెర్మినల్ వైపు తమ బంధువుల్ని రైలు ఎక్కించేందుకు వచ్చే వారు హడావుడిగా నో పార్కింగ్ బోర్డును చూసుకోకుండా అక్కడ తమ ద్విచక్ర వాహనాన్ని పార్కింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఉదయం ఆరు గంటలకు నగరం నుంచి బయలుదేరే రత్నాచల్, శాతవాహన, పినాకిని రైళ్లు ఎక్కించేందుకు వచ్చే వారు హడావుడిగా ఇక్కడే వాహనాలను ఇక్కడ పార్కింగ్ చేస్తున్నారు. కాంట్రాక్టర్ ‘ప్రత్యేక జరిమానా’ వాస్తవంగా ఇక్కడ వాహనాన్ని పార్కింగ్ చేస్తే రూ.500 జరిమానా వేస్తామని అధికారులు బోర్డులు ఏర్పాటు చేశారు. దీనిని ఇక్కడి కాంట్రాక్టర్ అదునుగా చేసుకుని దందాకు తెరలేపారు. హడావుడిగా వచ్చి ఇక్కడ వాహనం పార్కింగ్ చేయగానే వాహనాలన్నింటిని కలిపి చైన్ వేస్తున్నారు. చైన్ తీయడానికి ఒక్కొక్క వాహనానికి రూ.100 నుంచి రూ.150 వరకూ వసూలు చేస్తున్నారు. ఈ వసూలుకు ఏ విధమైన రశీదు ఇవ్వడం లేదు. అదేమని ప్రశ్నిస్తే రూ.500 బోర్డు చూపించి అది ఇస్తే రశీదు ఇస్తామని చెబుతుండటం గమనార్హం. వాగ్వివాదం.. ఆదివారం ఉదయం తమ వాహనాలకు చైన్ వేయడంపై కొంతమంది వాహన యజమానులు కాంట్రాక్టర్‌తో తీవ్రంగా ఘర్షణ పడ్డారు. అయితే జరిమానా చెల్లించాల్సిందేనని కచ్చితంగా చెప్పడంతో కొంతమంది గత్యంతరం లేక జరిమానా చెల్లించి వాహనాలను తీసుకున్నారు. రూ.150 చెల్లించా.. మా బంధువులను రైలు ఎక్కించేందుకు వచ్చా. రైలు వెళ్లిపోతుందేమోనన్న హడావుడిలో నో పార్కింగ్ బోర్డు చూసుకోకుండా స్కూటర్ పార్క్ చేసి వెళ్లాను. తిరిగి ఐదు నిమిషాల్లో వచ్చాను. అయినా నా వద్ద రూ.150 వసూలు చేశారు.– రామాంజనేయులు, వాహనదారుడు -
ట్రాఫిక్ ‘లాక్’.. పబ్లిక్ ‘లాస్’..!
‘‘వీల్ లాక్.. దీనిని ట్రాఫిక్ పోలీసులు ఇటీవల తీసుకొచ్చారట. మా పనిలో మేముండగానే, మా కారు వీల్‌కు లాక్ వేసి వెళుతున్నారు. అది తీయాలంటే వేయి రూపాయలు ఫైన్ కట్టాలట. ట్రాఫిక్ ‘లాక్’తో పబ్లిక్ ‘లాస్’ అవుతున్నారు’’.. నగరంలోని నాలుగు చక్రాల వాహన చోదకులు/యజమానుల నుంచి వినిపిస్తున్న మాట ఇది. ఈ ‘లాక్’–‘లాస్’ ఏమిటో అర్థమవాలంటే.. ఇటీవల ఖమ్మంలో కారు యజమాని ఒకరికి ఎదురైన అనుభవాన్ని తెలుసుకోవాల్సిందే. ఖమ్మంక్రైం: మధిరకు చెందిన అతని పేరు సంతోష్‌కుమార్. పెళ్లి బట్టలు కొనేందుకని ఇటీవల ఒక రోజు రాత్రి 10 గంటల సమయంలో తన కుటుంబీకులతో కలిసి కారులో ఖమ్మం వచ్చారు. కస్పాబజార్లోని వస్త్ర దుకాణం సమీపంలో దానిని పార్కింగ్ చేసి లోపలికి వెళ్లారు. బయటకొచ్చేసరికి 11 గంటలైంది. అందరూ కారులో కూర్చున్నారు. అది ముందుకు కదల్లేదు. ఏమైందో తెలియదు. అందరూ దిగి చూశారు. ముందు టైరుకు ఏదో వస్తువుతో లాక్ చేసి ఉంది. వారు ఆశ్చర్యపోయారు. అటూ ఇటూ చూశారు. ఇంతలో ఎవరో వచ్చి, ‘‘కొద్దిసేపటి కిందట ట్రాఫిక్ పోలీసులొచ్చారు. మీ కారుకు వీల్ లాక్ వేశారు’’ అని చెప్పారు. ఏం చేయాలో సంతోష్‌కుమార్‌కు అర్థమవలేదు. తను అప్పటివరకూ షాపింగ్ చేసిన దుకాణంలోకి వెళ్లాడు. ‘‘సర్, మా కారుకు ట్రాఫిక్ పోలీసులు వీల్ లాక్ వేశారు. కాస్త, తీయమని చెప్పగలరా.. ప్లీజ్’’’ రిక్వెస్ట్ చేశాడు. షాపు యజమాని కాస్త అసహనంగా కదులుతూ, మొహమంతా చిరాగ్గా పెట్టి.. ‘‘మాకు సంబంధం లేద్సార్. మీరే మాట్లాడుకోండి’’ అంటూ సీట్లోంచి లేచి, ‘మీరిక దయచేయొచ్చు’ అన్నట్టుగా లైట్లు ఆర్పేయసాగాడు. తమ వద్ద దాదాపుగా లక్ష రూపాయల విలువైన దుస్తులు తీసుకున్న సంతోష్‌కుమార్‌ను అప్పటివరకూ ఎంతో మర్యాదగా, గౌరవంగా చూసిన ఆ షాపు యజమాని, కేవలం రెండు నిముషాల తర్వాత ఇలా మారిపోవడాన్ని చూసిన సంతోష్‌కుమార్‌కు నవ్వాలో, ఏడ్వాలో తెలియలేదు. వీరు బయట ఉండగానే, ఆ షాపు యజమాని వెళ్లిపోయాడు. ఆ వెంటనే షట్టర్‌ను సిబ్బంది మూసివేసి వెళ్లారు. ఆ వీల్ లాక్‌పై ఫోన్ నెంబర్లు ఉన్నాయి. వాటికి ఫోన్ చేశాడు. అరగంట తరువాత ట్రాఫిక్ పోలీసులు వచ్చారు. ‘‘ట్రాఫిక్ రూల్స్‌కు విరుద్ధంగా రోడ్డుపై కారు పెట్టారు. అందుకే వీల్ లాక్ వేశాం. వెయ్యి రూపాయలు ఫైన్ కడితే తీస్తాం’’ అని చెప్పారు. ఆ కారు యజమాని ఇచ్చిన నగదును తీసుకుని వీల్ లాక్ తీశారు. ‘‘ఈసారి ఖమ్మానికి ఎట్టి పరిస్థితుల్లోనూ కారులో రాను. బస్సులోనో, రైల్లోనో వస్తాను. కారులో వచ్చి ఇలా ‘లాస్’ చేసుకునేబదులు అదే బెటర్’’ అనుకుంటూ మధిరకు తిరుగు పయనమయ్యారు. ఇది, ఒక్క సంతోష్ సమస్యే కాదు. ఖమ్మంలోని అనేకమంది అనుభవాలు కూడా ఇలాంటివే. ‘‘అమ్మ పెట్టదు.. అడుక్కోనివ్వదు... ...అనేది సామెత. మున్సిపాలిటీ నుంచి నగర కార్పొరేషన్ వరక ఎదిగిన ఖమ్మంలోని మెయిన్ సెంటర్లలో ఎక్కడా కూడా కార్లు నిలిపేందుకు పార్కింగ్ స్థలమంటూ లేదు. రోడ్డు పక్కన కాకుండా ఎక్కడ పెట్టుకోవాలి? ఫలానా చోట పెట్టమంటే అక్కడే పెడతాం. అది చెప్పరు. ఎక్కడో ఒకచోట అనువైన ప్రదేశంలో మేం పార్కింగ్ చేస్తే.. ఎందుకిక్కడ నిలిపావని ప్రశ్నిస్తారు. ఇంకెక్కడ పెట్టాలి..? అసలు కారులోనే రావద్దా..? ట్రాఫిక్ పోలీసులు ఉద్దేశ్యమేమిటి..? ఇదెక్కడి చోద్యం..?’’ అని ప్రశ్నిస్తున్నారు నున్నా శ్రీకాంత్. వీల్ లాక్ బాధితులు అనేకమందిలో ఈయన ఒకరు. లాక్.. షాక్.. వీక్..! ‘‘ట్రాఫిక్ నియంత్రణకు వీల్ లాక్ వేస్తున్నామని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. మంచిదే..! ఎవరు మాత్రం కాదంటారు..?! కానీ, అదెప్పుడు..? పార్కింగ్‌కు నిర్ణీత ప్రదేశం ఉండాలి. వాటిని సూచిస్తూ బోర్డులు పెట్టాలి. ప్రధాన సెంటర్లలో/రోడ్లలో టూవీలర్ పార్కింగ్‌కు నిర్ణీత స్థలం (కొన్నిచోట్ల పార్కింగ్ ప్లేస్, ఇంకొన్నిచోట్ల రోడ్డుకు ఒక పక్కన) చూపిస్తున్నారు. మరి, కార్లకు కూడా అలా చూపించాలి కదా! ఇదేమీ చేయకుండా ట్రాఫికోళ్లు తమ ఇష్టానుసారంగా ఇలా చక్కాలకు తాళాలేసి వెళితే.. వాహన చోదకుల్లో వ్యతిరేకత క్రమేణా పెరుగుతుంది. ఇదంతా చూస్తుంటే.. ‘జబ్బొకటి.. మందొకటి..’ అన్నట్టుగా ఉంది. ఈ వీల్ ’లాక్‘.. మాకు ‘షాక్’లాగా తగులుతోంది. నీరసాన్ని, నిస్సత్తువను (‘వీక్’.. వీక్నెస్) తెప్పిస్తోంది. ఆస్పత్రి పనికో, ఇంకేదైనా అత్యవసర పనికో వచ్చినవారి పరిస్థితేమిటి? ఇవేవీ ఆలోచించరా..?!’’ అని, నిరసన స్వరం వినిపించారు ఫోర్ వీలర్ యజమానులైన అనిల్, గుడా సంజీవ్‌రెడ్డి. -
హా...ర్టీసీలో... అన్నీ అవస్థలే...
సాక్షి, రాజమహేంద్రవరం: ప్రగతి రథ చక్రాలకు వేదికైన ఆర్టీసీ బస్సు కాంపెక్సుల్లో సమస్యలు తిష్టవేశాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ) రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని తొమ్మిది కాంప్లెక్సుల్లోనూ సమస్యలు తాండవిస్తున్నాయి. సరిపడా మరుగుదొడ్లు, కూర్చునేందుకు, అవసరమైనన్ని బెంచీలు, వాహనాల పార్కింగ్ సౌకర్యం లేకపోవడం, దుకాణాల్లో ఎమ్మార్పీ ఉల్లంఘనలు, క్యాంటీన్లలో బెంబేలెత్తించేలా టీ, టిఫిన్ల ధరలు, తాగడానికి మంచినీరు కూడా కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు నెలకొన డంతో ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు. జిల్లాలోని ఆర్టీసీ కాంప్లెక్సుల్లో చోటుచేసుకున్న లోపాలు ‘సాక్షి’ పరిశీలనలో వెలుగుచూశాయి. ముక్కు మూసుకోవాల్సిందే... గోకవరం, రావులపాలెం కాంప్లెక్సుల్లో ప్రయాణికులకు సరిపడా మరుగుదొడ్లు, మూత్ర శాలలు లేకపోవడంతో ఆరుబయటే మూత్రశాలగా మారింది. ప్రయాణికులు ఆరుబయటే మూత్ర విసర్జన చేస్తుండడంతో డిపో ఆవరణల్లో దుర్గంధం వెదజల్లుతోంది. రావులపాలెంలో మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. గోకవరంలోని మూత్రశాల వద్ద నీటి సమస్య నెలకొంది. నీరు రాకపోవడంతో మూత్రశాలలో దుర్వాసన వస్తోంది. అమలాపురంలో పార్కింగ్ స్టాండ్ పక్కన డ్రైనేజీ నీరు ఆవరణలో నిల్వ ఉంటుండడంతో ఆ పరిసరాలు మురికికూపంలా మారాయి. ప్రమాదం జరిగితే బూడిదే... గోకవరం బస్టాండ్‌లో తాటాకుల పందిరిలో ద్విచక్ర వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. ప్రమాదవశాత్తూ అగ్ని ప్రమాదం జరిగితే భారీ ఆస్తినష్టం వాటిల్లుతుంది. రావులపాలెం డిపోలో రద్దీకి అనుగుణంగా పార్కింగ్ సౌకర్యం లేదు. బస్టాండ్ ఆవరణంతా ఆటోలు, వ్యాన్ల స్టాండ్లతో ఆక్రమణలో ఉంది. పార్కింగ్ సదుపాయం సరిపోకపోవడంతో డిపో చుట్టూ మూడు ప్రైవేటు పార్కింగ్ స్టాండ్లు వెలిశాయి. జాతీయ రహదారి, లొల్ల ప్రధాన కాలువ ఆధునికీకరించడంతో బస్టాండ్ వర్షాకాలంలో చెరువును తలపిస్తోంది. ఆ సయమంలో రెండు మోటార్లు పెట్టి వర్షపు నీటిని తోడుతారు. ప్రయాణికులు కూర్చునేందుకు సరిపడా సదుపాయం లేదు. డీలక్స్ ఫ్లాట్‌ఫాంపై సరిపడా బల్లలు లేవు. బస్సులు ఆగేందుకు సరైన ఫ్లాట్‌ఫాం లేదు. డ్రైవర్ ఆదమరిచినా, బస్సు బ్రేక్ విఫలమైనా ప్రయాణికులపై దూసుకొచ్చే ప్రమాదం ఉంది. రామచంద్రపురంలో పార్కింగ్ స్టాండ్ నిర్వహించడం లేదు. ఒక్కో కాంప్లెక్సులో ఒక్కోలా పార్కింగ్ రుసుం వసూలు చేస్తున్నారు. రాజమహేంద్రవరం, కాకినాడ కాంప్లెక్సుల్లో ప్రతి నాలుగు గంటలకు రూ.5 లెక్కన రోజుకు రూ.30 వసూలు చేస్తున్నారు. గోకవరం, రాజోలు డిపోల్లో రోజుకు రూ.20లñ చొప్పున తీసుకుంటున్నారు. చూసేందుకు చిన్న సమస్యలున్నా ప్రయాణికులను పట్టి పీడిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు. దడపుట్టిస్తున్న ధరలు.... అన్ని ఆర్టీసీ కాంప్లెక్సుల్లోని దుకాణాల్లో తినుబండారాలు, కూల్ డ్రింకులు, కంపెనీ చిప్స్ ఎమ్మార్పీకి మించి అమ్ముతున్నారు. అర లీటర్ కూల్ డ్రింక్ ఎమ్మార్పీ రూ.38 ఉంటే రూ.42, రూ.18 లేస్చిప్స్ రూ.20, రూ.15 గుడ్ డే బిస్కట్ ప్యాకెట్ రూ.18 చొప్పున విక్రయిస్తున్నారు. ఇక క్యాంటీన్లలో టీ తాగినా, టిఫిన్ చేసినా జేబులు గుల్ల అవ్వాల్సిందే. రాజమహేంద్రవరం కాంప్లెక్సులోని క్యాంటిన్లో టిఫిన్ ధరలు ఆకాశంలో ఉన్నాయి. రెండు ఇడ్లీ రూ.30, చపాతి రూ.40, దోసె రూ.35, మైసూర్ బజ్జీ రూ.30 (నాలుగు), పేపర్ కప్పులో టీ రూ.15 లెక్కన విక్రయిస్తున్నారు. కాకినాడ కాంప్లెక్సులోని క్యాంటీన్లో రెండు ఇడ్లీ రూ.25, చపాతి రూ.30, దోసె రూ.30, మైసూర్ బజ్జీ రూ.25, టీ రూ.10 లెక్కన అమ్ముతున్నారు. హోటళ్లు, ఆర్టీసీ డిపో ఎదరుగా ఉన్న హోటళల్లో కన్నా డిపోల్లో 25 నుంచి 35 శాతం అధికంగా ధరలున్నాయి. మౌలిక సౌకర్యాలు మాటుమాయం... ఆర్టీసీ కాంప్లెక్సుల్లో ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కరువయ్యాయి. నిర్వహణకు వివిధ పేర్లతో టికెట్లపై అదనంగా వసూలు చేస్తున్నా ఆర్టీసీ ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. రాజమహేంద్రవరం, కాకినాడ, రామచంద్రపురం, అమలాపురం, రావులపాలెం, తుని, ప్రత్తిపాడు, గోకవరం, రాజోలు కాంప్లెక్సుల్లో తాగునీటి సదుపాయం లేదు. మంచినీరు కావాలంటే అక్కడ దుకాణాల్లో రూ.20 వెచ్చించి బాటిల్ కొనుగోలు చేయాల్సిందే. అది కూడా స్థానికంగా తయారు చేసే సంస్థ బాటిళ్లు విక్రయిస్తున్నారు. రావులపాలెం, గోకవరంలలో ప్రయాణికులు కూర్చునేందుకు సరిపడా కుర్చీలు లేవు. ప్రత్తిపాడు, రామచంద్రపురాల్లో ఫ్యాన్లు తిరగడం లేదు. రామచంద్రపురం డిపోలో ఫ్యాన్లు తిరగకపోవడంతో పగటి పూటే ప్రయాణికులపై దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. -
‘టోల్’ తీస్తున్నారు
బాల్కొండ : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ సందర్శనకు వస్తున్న పర్యాటకులు ప్రాజెక్ట్ వద్ద పార్కు నిర్వాహకుల దోపిడిని చూసి శ్రీరామా.. ఇదేమీ దోపిడి అంటు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ సందర్శనకు రావాలంటే జంకుతున్నారు. శ్రీరాంసాగర్‌ప్రాజెక్ట్ పర్యాటక అభివృద్ధిలో భాగంగా గత నాలుగేళ్ల క్రితం 6 కోట్ల నిధులతో పార్కు నిర్మించారు. పార్కు నిర్వహణనను యువజన సంఘాల పేరుతో అధికార పార్టీ నేతలు దక్కించుకున్నారు. ప్రాజెక్ట్ సందర్శనకు వస్తున్న పర్యాటకుల వద్ద పార్కింగ్ వసూలు కోసం కౌంటర్ ఏర్పాటు చేసుకున్నారు. నిబంధనల ప్రకారం పార్కు నిర్వహణ చేపడుతూ.. పార్కు సందర్శనకు వచ్చే పర్యాటకుల వద్ద నిర్ణయంచిన రుసుం ప్రకారం టికెట్ తీసుకోవాలి. కాని ప్రాజెక్ట్ సందర్శనకు వస్తున్న ప్రతి పర్యాటకుని వద్ద వాహనాలకు పార్కింగ్ ఫీజు పేరిట ద్విచక్ర వాహనానికి 10 రూపాయాలు, కారులకు 20 రూపాయాల చొప్పున వసూలు చేస్తున్నారు. దీంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. స్థానికులనూ వదలడం లేదు... శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ వద్ద నుంచే సోన్‌పేట్ గ్రామస్తులు రాకపోకలు సాగిస్తుంటారు. అంతే కాకుండా లెఫ్ట్ పోచంపాడ్ వాసులు ఎస్సారెస్పీ డ్యాం పై నుంచే వెళ్లాలి. వాళ్లను కూడా వదలకుండా టోల్ వసూలుకు పాల్పడుతున్నారు. ఫలాన గ్రామం అని చెప్పినా వినకుండా వాహనాలను ఆపుతున్నారు. గ్రామ నివాసి అని గుర్తింపు కార్డు చూపాలంటున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేసేదే దోపిడి దానికి గుర్తింపు కార్డులు చూపాలనడం విడ్డూరంగా ఉందని పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు. ఫోటోలకూ ఫీజు వసూలు..! పార్కు ఎంట్రీ ఫీజుకు తోడు పార్కులో ఫోటోలు దిగాలంటే నిర్వహకులకు 350 రూపాయాల నుంచి 500 రూపాయాలు సమర్పించుకుంటేనే ఫోటోలు దిగే అవకాశం ఇస్తారు. ఈ విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు పోయినా ప్రయోజనం లేదని పర్యాటకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అధికారులు వారికి అండగా ఉంటున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి దోపిడిని అరికట్టాలని పర్యాటకులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నోటీసులు అందించాం: శ్రీనివాస్‌రెడ్డి,ఎస్ఈ శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ వద్ద పార్కులో వసూళ్లకు పాల్పడుతున్నారని దృష్టికి రావడంతో నిర్వహకులకు నోటీసులను జారీ చేశాం. వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటాం. -
ప్రైవేటుకు పార్కింగ్!
సాక్షి, హైదరాబాద్: రాజధానిలో ప్రైవేటు వ్యక్తుల ప్లాట్లు, ఖాళీ స్థలాల్లో పెయిడ్ పార్కింగ్ ప్రదేశాల ఏర్పాటుకు ఔత్సాహిక స్థల యజమానుల నుంచి ప్రతిపాదనలు ఆహ్వానించాలని పురపాలక శాఖ నిర్ణయించింది. హైదరాబాద్‌లో పార్కింగ్ సదుపాయం కల్పించేందుకు స్థలాల లభ్యత కష్టమైన నేపథ్యంలో ప్రైవేటు వ్యక్తుల స్థలాల్లో పెయిడ్ పార్కింగ్ సదుపాయాన్ని ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. గత జూలైలో ప్రకటించిన నూతన పార్కింగ్ విధానంలో ఈ అంశాన్ని పొందుపరిచింది. పెయిడ్ పార్కింగ్ ప్రదేశాల ఏర్పాటుకు ప్రైవేటు స్థల యజమానులకు జీహెచ్ఎంసీ లైసెన్స్‌లు జారీ చేయనుంది. జీహెచ్ఎంసీ నిర్ణయించిన పార్కింగ్ ఫీజు వసూలు చేసుకోవడం ద్వారా ప్రైవేటు స్థల యజమానులు ఆదాయాన్ని పొందనున్నారు. రోడ్లు/మాల్స్/వాణిజ్య సంస్థల సమీపంలోని ఖాళీ స్థలాల్లో పార్కింగ్ స్లాట్ ఏర్పాటుకు అనుమతి ఇవ్వనుంది. జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ (ఎస్టేట్స్ అండ్ హౌసింగ్) జి.రమేశ్‌కు ప్రభుత్వం వీటి ఏర్పాటు బాధ్యతలు అప్పగించింది. ఆసక్తి ఉన్న యజమానులు సెల్‌నంబర్ 9949546622కు గానీ, acestatehousing @gmail.com మెయిల్ ద్వారా గానీ సంప్రదించవచ్చు. ప్రతిపాదనలు అందాక పార్కింగ్ స్లాట్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై పరిశీలించి 3 నెలలు, లేదా 6 నెలల కాల వ్యవధితో లైసెన్స్‌లు జారీ చేయనున్నారు. జీహెచ్ఎంసీ నిర్ణయించిన పార్కింగ్ ఫీజులను అమలు చేయడంతో పాటు లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇటీవల నిర్వహించిన ఓ సమావేశంలో హైదరాబాద్‌లో పార్కింగ్ స్థలాల కొరతపై ఆందోళన వ్యక్తం చేశారు. కేటీఆర్ ఆదేశాల మేరకు ప్రైవేటు పార్కింగ్ సదుపాయం కల్పించేందుకు చర్యలు ప్రారంభించామని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ తెలిపారు. ట్రాఫిక్ బేజారు.. అధికారిక లెక్కల ప్రకారం రోజూ సుమారు 700 కొత్త కార్లు, ద్విచక్ర వాహనాలు హైదరాబాద్ రోడ్లపైకి వస్తున్నాయి. ఇప్పటికే సరైన పార్కింగ్ సదుపాయాల్లేక ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. రోజు రోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ ఇబ్బందికరంగా మారుతోంది. మల్టీలెవల్ పార్కింగ్ సదుపా యం కల్పించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కార్యరూపం దాల్చేందుకు మరికొంత సమయం పట్టనుంది. సరైన పార్కింగ్ సదుపాయాల్లేక రోడ్లపై వాహనాలను అస్తవ్యస్తంగా నిలిపేస్తుండటంతో ట్రాఫిక్ రాకపోకలకు అంతరాయంతో పాటు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. పార్కింగ్ సదుపాయం కల్పించేందుకు స్థలాల లభ్యత లేకపోవడం, స్థలాలు విలువైనవి కావడంతో ప్రభుత్వం ప్రైవేటు పార్కింగ్ స్లాట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటోంది. అత్యవసరంగా పార్కింగ్ సదుపాయాలను పెంచాల్సిన అవసరముందని, తక్షణమే కనీసం 10 మల్టీ లెవల్ కార్ పార్కింగ్ స్లాట్లను ఏర్పాటు చేయాల్సిన అవసరముందని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ పేర్కొన్నారు. -
సిటీలో ఇక‘స్టాక్’ పార్కింగ్!
గ్రేటర్ నగరంలో వాహనాల పార్కింగ్ సమస్యకు చెక్ పెట్టాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ప్రస్తుతం సరైన వసతి లేక వాహనదారులు పడరానిపాట్లు పడుతున్నారు. మెట్రోరైలు అందుబాటులోకి వచ్చినప్పటికీ పలు స్టేషన్ల వద్ద పార్కింగ్ సదుపాయం లేదు. వీటిని పరిగణనలోకి తీసుకున్న జీహెచ్ఎంసీ వీలైనన్ని ప్రాంతాల్లో, వీలైనన్ని పద్ధతుల్లో పార్కింగ్ కల్పించాలని భావిస్తోంది. అందులో భాగంగా తక్కువ స్థలంలోనే ఎక్కువ కార్లు పార్కింగ్ చేయడానికి అనువైన ‘స్టాక్ పార్కింగ్’ విధానంపై దృష్టి సారించింది. జీహెచ్ఎంసీకి చెందిన ఖాళీ స్థలాలతోపాటు నగరంలో వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన ఖాళీ స్థలాల్లోనూ పార్కింగ్ కాంప్లెక్స్‌లు నిర్మించాలని భావిస్తోంది. ముఖ్యంగా మెట్రో స్టేషన్లకుసమీపంలో ఉన్న ఖాళీ ప్రదేశాలపై ప్రత్యేక దృష్టి సారించింది. సాక్షి, సిటీబ్యూరో: తక్కువ స్థలంలో ఎక్కువ వాహనాలు పార్కింగ్ చేసేలా కొత్త కాంప్లెక్సులు నిర్మించాలని జీహెచ్ఎంసీ భావిస్తోంది. ఈమేరకు స్టాక్ పార్కింగ్ విధానాన్ని ఎంచుకుంది. ఈ విధానంలో రెండు కార్లు పట్టే స్థలంలోనే 12 కార్లను పార్కింగ్ చేయవచ్చు. ఒక కారుపై మరో కారు ఉండేలా నిలువుగా పార్కింగ్ ఏర్పాట్లు చేస్తారు. ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో ఉన్న ఈ విధానం ద్వారా తక్కువ స్థలంలోనే ఎక్కువ కార్లు నిలిపి ఉంచొచ్చు. నగరంలో ఈ విధానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు తొలుత జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం తో పాటు జోనల్, సర్కిల్ కార్యాలయాల్లోని స్థలాలను వినియోగించుకోవాలని భావిస్తున్నారు. బీఓటీ (బిల్ట్, ఆపరేట్, ట్రాన్స్ఫర్) పద్ధతిలో స్టాక్ పార్కింగ్ కాంప్లెక్సులు ఏర్పాటు చేసే ఆలోచన ఉందని మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. ప్రయోగాత్మకంగా తొలుత జీహెచ్ఎంసీ కార్యాలయాల్లో వీటిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. పార్కింగ్ ఫీజును మాత్రం జీహెచ్ఎంసీయే నిర్ణయిస్తుందన్నారు. ఈ విధానం అమల్లోకి వస్తే.. తగిన స్థలమున్న ప్రైవేట్ వ్యక్తులు సైతం ఇలాంటి పార్కింగ్ ఏర్పాట్లు చేసుకోవచ్చునన్నారు. తద్వారా మెట్రో స్టేషన్లతోపాటు రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పార్కింగ్ సమస్యలు తగ్గుతాయన్నారు. జీహెచ్ఎంసీ, ప్రభుత్వ స్థలాల్లో.. జీహెచ్ఎంసీకి వివిధ ప్రాంతాల్లో ఉన్న ఖాళీ ప్రదేశాల్లో, నగరంలో వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఖాళీ స్థలాల్లోనూ పార్కింగ్ కాంప్లెక్సులు నిర్మించాలని జీహెచ్ఎంసీ భావిస్తోంది. ఇందుకుగాను ప్రైమ్, నాన్ ప్రైమ్, మిడిల్ ప్రైమ్ ప్రాంతాలుగా వర్గీకరించి మూడు ప్రాంతాలతో కలిపి ఒక ప్యాకేజీగా టెండర్లు ఆహ్వానించాలని యోచిస్తున్నారు. పాతబస్తీలోని ఖిల్వత్ వద్ద మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ కాంప్లెక్స్ కోసం ఏళ్లతరబడి టెండర్లు పిలుస్తున్నప్పటికీ, గిట్టుబాటు కాదని ఎవరూ ముందుకు రావ డం లేరు. ఇలాంటి పరిస్థితి నివారించేందుకు రద్దీ ఎక్కువగా ఉండి, బాగా డిమాండ్ ఉండే ప్రాంతాలను ప్రైమ్ ఏరియాలుగా, డిమాండ్ లేని వాటిని నాన్ప్రైమ్ ఏరియాగా, తక్కువ డిమాండ్ ఉండేవాటిని మిడిల్ ప్రైమ్ ఏరియాగా వర్గీకరించి ఒకే ప్యాకేజీలో మూడు ప్రాంతాలూ ఉండేలా టెండర్లు పిలవాలని భావిస్తున్నారు. తద్వారా పార్కింగ్ కాంప్లెక్సుల నిర్మాణాలకు ముందుకొస్తారని భావిస్తున్నారు. ఇందుకుగాను ఇప్పటికే కొన్ని ప్రాంతాలను గుర్తించినట్లు మేయర్ రామ్మోహన్ తెలిపారు. చిక్కడపల్లి మార్కెట్లో దాదాపు రెండెకరాల స్థలం ఉంది. అక్కడ మార్కెట్‌తోపాటు పార్కిం గ్ కాంప్లెక్స్‌కూ వీలుందన్నారు. మెట్రోస్టేషన్కూ దగ్గరగా ఉంటుందని దాన్ని ఎంపిక చేశారు. చుడీబజార్‌లో జీహెచ్ఎంసీ బీటీ మిక్సింగ్ ప్లాంట్ వద్ద దాదాపు 2000 గజాల స్థలం ఉంది. అక్కడ నాలుగైదు అంతస్తుల్లో నిర్మించే కాంప్లెక్స్‌లో ఒక అంతస్తులో చార్మినార్ పరిసరాల్లోని వీధి వ్యాపారులకు దుకాణాలు కేటాయించే ఆలోచన కూడా ఉంది. చార్మినార్ పాదచారుల పథకం, అమృత్సర్ స్వర్ణదేవాలయం తరహా లో చార్మినార్ దగ్గరి వీధి వ్యాపారులను తరలించాల్సి ఉన్నందున ఇక్కడ వారికి సదుపాయం కల్పించవచ్చునని భావిస్తున్నారు. ఖైరతాబాద్ జీహెచ్ఎంసీ వాహనాల పార్కింగ్ యార్డు వద్దే మెట్రో స్టేషన్ ఉంది. బస్టాప్ కూడా ఉంది. అక్కడి స్థలంలో పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మించడం ద్వారా ఎన్నో విధాలుగా ఉపయుక్తంగా ఉం టుందని అంచనా వేశారు. ఖిల్వత్ దగ్గర, శాలిబండ వద్ద కూడా పార్కింగ్కాంప్లెక్స్ల నిర్మా ణం ఆలోచనలున్నాయి. వీటితోపాటు జీహెచ్ఎంసీకి చెందిన దాదాపు పది స్థలాల్లో, ఇతర ప్రభుత్వ శాఖలకు చెందిన 15 ఖాళీస్థలాలు పార్కింగ్ కాంప్లెక్సుల నిర్మాణానికి అనువుగా ఉన్నాయని గుర్తించారు. మున్సిపల్ మంత్రి కేటీఆర్ ద్వారా ఆయా శాఖలనుంచి పార్కింగ్ కోసం స్థలాలు పొందాలని భావిస్తున్నారు. కోఠి మహిళా కళాశాల, కొత్తపేట పండ్ల మార్కెట్, రంగారెడ్డి జిల్లా కోర్టులు తదితర ప్రదేశాల్లో వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన çస్థలాలున్నట్లు గుర్తించారు. అక్కడ పార్కింగ్ కాంప్లెక్స్‌ల నిర్మాణానికి అవకాశముంటుందని అంచనా వేశారు. -
ఇలా మాత్రం పార్కింగ్ చెయ్యకండి
-
ఇలా మాత్రం పార్కింగ్ చెయ్యకండి
సాక్షి, బెంగళూర్ : కాస్త సందు దొరికితే చాలూ పార్కింగ్ చేసేద్దామని తాపత్రయపడే వాహనాదారుల కోసం ఈ వీడియో. పోస్ట్ చేసింది ఎవరో కాదు.. ఐపీఎస్ అధికారిణి డీ రూప. ఓ వ్యక్తి తన బైక్‌ను సందులో దూర్చేయాలని యత్నించాడు. బైక్ స్టాండ్ వేసే సమయంలో పక్కకు ఒరిగి కిందకు పడిపోయాడు. బైక్‌తోసహా కింద పడ్డ ఆ దృశ్యం చాలా భయానకంగా ఉంది. అయితే అదృవశాత్తూ అతని ప్రాణాలకు ముప్పు ఏం వాటిల్లలేదు. స్థానికులు వచ్చి అతన్ని లేపారు. గత నెల 20వ తేదీన ఓ కిరాణ షాపు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. దయచేసి సురక్షిత ప్రాంతంలో పార్కింగ్ చెయ్యండి.. నిర్లక్ష్యంగా ఇలా చేయకండి రూప వీడియోను తన ట్విట్టర్లో నిన్న ఈ వీడయోను పోస్ట్ చేయగా.. అనూహ్య స్పందన వస్తోంది. -
జీహెచ్ఎంసీ వాహనదారులకు శుభవార్త
గ్రేటర్ హైదరాబాద్‌లోని వాహనదారులకు శుభవార్త. ఇకపై నగరంలో ఎక్కడకు వెళ్లినా పార్కింగ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు. షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లతో పాటు వివిధ వాణిజ్య సంస్థల్లో వాహనాలకు పార్కింగ్ ఫీజును వసూలు చేయరు. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని కార్పొరేషన్లలో పార్కింగ్ పాలసీపై మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా నగరంలో సినిమాహాళ్లు, షాపింగ్ మాల్స్‌లో పార్కింగ్ దోపిడీ అంశం ప్రస్తావనకు రాగా, ఇకపై ఎలాంటి ఫీజు వసూలు చేయరాదని నిర్ణయించినట్లు తెలిసింది. పార్కింగ్ పాలసీలో ఈ ఉచిత అంశం లేకపోయినా.. దీనికి సంబంధించి త్వరలోనే ప్రత్యేక జీవో జారీ కానున్నట్లు మున్సిపల్ శాఖ అధికారి ఒకరు తెలిపారు. కొత్త సంవత్సరంలోగా ఈ ఫ్రీ పార్కింగ్ అమలులోకి వచ్చే అవకాశం ఉంది. – సాక్షి, హైదరాబాద్ బిల్లులో మినహాయింపు.. నగరంలో పార్కింగ్ జులుంపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రూ.పది సరుకు కొన్నా రూ.20 నుంచి రూ.50 పార్కింగ్ ఫీజు చెల్లించాల్సి వస్తోంది. ఈ దోపిడీపై కొందరు పోలీస్ స్టేషన్లను ఆశ్రయించారు. వీటిని పరిగణనలోకి తీసుకుని తాజా నిర్ణయం తీసుకున్నారు. ఆయా వాణిజ్య సంస్థల్లో కొనుగోళ్లకు వెళ్లిన వారికే ఈ ఉచిత సదుపాయం కల్పించేందుకు, ఇతరులు పార్కింగ్ ప్రదేశాల్లో గంటల తరబడి పార్కింగ్ చేయకుండా ఉండేందుకు ఆయా దుకాణాలకు వెళ్లిన వారికి బిల్లులో పార్కింగ్ ఫీజు మేరకు మినహాయింపు ఇవ్వనున్నారు. నగరంలోని కొన్ని మాల్స్‌లో ఇప్పటికే ఈ పద్ధతి అమలులో ఉంది. సెల్లార్లో పార్కింగ్ చేయగానే ఫీజు వసూలు చేసి రసీదు ఇస్తారు. షాపింగ్ ముగిశాక బిల్లు చెల్లించేటప్పుడు రసీదు చూపిస్తే ఆ మేరకు బిల్లులో మినహాయింపు ఇస్తున్నారు. సినిమా థియేటర్లలో సినిమా టికెట్‌ను చూపిస్తే సరిపోతుంది. ఈ విధానాన్ని నగరంతోపాటు రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లలో అమలు చేయనున్నారు. ఆర్టీసీ.. రైల్వే స్టేషన్లలో..? ప్రైవేట్ వాణిజ్య సంస్థలే ఉచిత పార్కింగ్ కల్పిస్తున్నప్పుడు ఆర్టీసీ, రైల్వే, మెట్రో రైలు స్టేషన్లలోనూ ఫ్రీ పార్కింగ్ కల్పించాలనే డిమాండ్ వస్తోంది. రైల్వే ప్లాట్ఫారం టికెట్ కొనుగోలు చేసినవారు దాన్ని చూపితే సరిపోతుందని, ఆర్టీసీ బస్టాండ్లలో రోజుల తరబడి పార్కింగ్ చేయకుండా ఉండేలా తగిన విధానాలు రూపొందించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 134 పార్కింగ్ లాట్లలో ఇప్పటికే అమలు పార్కింగ్ సమస్యల పరిష్కారానికి జీహెచ్ఎంసీలో ఇప్పటికే పలు చర్యలు చేప ట్టారు. రోడ్ల వెంబడి పార్కింగ్ లాట్లలో ఫీజుల్ని ఎత్తివేశారు. గత ఏడాది అక్టోబర్ నుంచి 134 పార్కింగ్ లాట్లలో ఫీజును ఎత్తేశారు. జీహెచ్ఎంసీ నిబంధనల మేరకు వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించే సముదాయాల్లో కొనుగోళ్లకు వచ్చేవారికి ఉచిత పార్కింగ్ కల్పించాల్సి ఉండటంతో సినిమాహాళ్లతోపాటు హోటళ్లు, రెస్టారెంట్లు, వినోద కేంద్రాలు తదితర ప్రాంతాల్లోనూ ఫ్రీ పార్కింగ్‌ను అమలు చేసే దిశలో అధికారులు ఉన్నారు. కమ్యూనిటీ పార్కింగ్.. నగరంలోని ప్రధాన రహదారుల్లో పార్కింగ్ సమస్యను తీర్చడానికి ట్రాఫిక్ పోలీసులు కమ్యూనిటీ పార్కింగ్ విధానాన్ని ప్రతిపాదించారు. షాపింగ్ కాంప్లెక్స్‌లు, వాణిజ్య ప్రాంతాలు ఎక్కువగా ఉన్న చోట ఖాళీ ప్రాంతాన్ని గుర్తించి, కమ్యూనిటీ పార్కింగ్ ప్రాంతంగా ప్రకటిస్తారు. ఆ ప్రాంతంలో అవసరమైన మౌలిక వసతుల కల్పన, మూడు షిఫ్టుల్లో పని చేసేలా సెక్యూరిటీ ఏర్పాటు, ఆ ప్రాంతం నిర్వహణ బాధ్యతల్ని స్థానిక వర్తక సంఘాలకు అప్పగించాలి. దీనిపై త్వరలో తగు చర్యలు తీసుకోనున్నారు. -
బెంగళూరులో ఇక స్మార్ట్ పార్కింగ్
సాక్షి, బెంగళూరు: మెట్రో పాలిటన్ నగరాల్లో నేడు పార్కింగ్ సమస్య పెద్ద తలనొప్పిగా మారిన విషయం తెల్సిందే. ఎక్కడ మోటారు బైక్‌ను ఆపాలో, ఎక్కడ కారు పార్కింగ్ చేయాలో తెలియక నగర జీవి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ సమస్యను సమూలంగా పరిష్కరించేందుకు బహత్ బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపీ) త్వరలో స్మార్ట్ పార్కింగ్ విధానాన్ని ప్రవేశపెడుతోంది. దీని కోసం ప్రత్యేకంగా ఓ యాప్‌ను కూడా అభివద్ధి చేసింది. ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుంటే చాలు పార్కింగ్ సమస్య తీరినట్లే. యాప్ ద్వారా ఎక్కడ పార్కింగ్ స్థలం ఉందో, అందులో ఎన్ని ఖాళీ స్లాట్లు ఉన్నాయో ఇట్టే తెలుసుకోవచ్చు. అంతేకాకుండా అడ్వాన్స్‌గా కూడా పార్కింగ్ స్థలాన్ని బుక్ చేసుకోవచ్చు. స్మార్ట్ పార్కింగ్ విధానం కింద నగరంలో 85 ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో ఎక్కడికక్కడ ఎలక్ట్రానిక్ సెన్సర్లను ఏర్పాటు చేస్తున్నారు. కార్లపై నిఘా ఉంచేందుకు సీసీటీవీ కెమేరాలను ఏర్పాటు చేస్తున్నారు. సెన్సర్ల ద్వారా ఏ కారు ఎన్నిగంటలకు వచ్చిందో, ఎన్నిగంటలకు వెళుతుందో గుర్తించవచ్చు. ఎలక్ట్రానిక్ యంత్రాల ద్వారా పార్కింగ్ చార్జీలు చెల్లించవచ్చు. క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా కూడా చెల్లింపులు జరపొచ్చు. టూ వీలర్ బైకులకు, కార్లకు వేర్వేరు చార్జీలు వసూలు చేస్తారు. నగరంలో పార్కింగ్ స్థలాలను ఏ, బీ, సీ అంటూ మూడు కేటగిరీలుగా విభజిస్తున్నారు. కేటగిరీని బట్టి పార్కింగ్ చార్జీలు మారుతుంటాయి. తొలుత మూడువేల కార్లు, ఆరువేల మోటారు బైకులకు పార్కింగ్ స్లాట్లను ఏర్పాటు చేస్తున్నారు. మనం వెళ్లే ప్రాంతాన్నిబట్టి అక్కడి పార్కింగ్ స్థలాన్ని, అందులోని ఖాళీ స్లాట్లను యాప్ ద్వారా ముందుగా గుర్తించవచ్చు. అవసరమైతే అడ్వాన్స్‌గా బుకింగ్ చేసుకోవచ్చు. -
రైల్వే స్టేషన్ టు సీఐ హౌస్
-
రైల్వే స్టేషన్ టు సీఐ హౌస్
► పార్కింగ్‌లో ఉంచిన బైక్ నేరుగా సీఐ ఇంటికి ► బండిని దర్జాగా వాడుకుంటున్న సీఐ ► బాధితుని ద్వారా విషయం వెలుగులోకి ఆదోని(కర్నూలు): రూల్ అమలు చేసేది తామే కదా.. ఎవరేం చేస్తారనుకున్నారో ఏమో తెలియదు కానీ ఆదోని టూ టౌన్ సీఐ గంటా సుబ్బారావు స్థానిక రైల్వే స్టేషన్ పార్కింగ్‌లో ఉంచిన బైక్‌ను ఏకంగా తన ఇంటికి తరలించారు. అంతేనా దానికి పోలీస్æ స్కిక్కర్ అతికించి మరీ దర్జాగా వినియోగించుకుంటున్నా రు. బాధితుని ద్వారా విషయం సోమవారం మీడియాకు తెలియడంతో హడావుడిగా బైక్‌పై ఉన్న పోలీస్ స్టిక్కర్ తీయించేసి దాంతో సంబంధం లేదని బుకాయించారు. ఇందుకు సంబంధించి బాధితుడు బోయ నరేష్ అందించిన వివరాల మేరకు.. ఆదోని బోయ గేరికి చెందిన బోయ నరేష్ మే నెల చివరి వారంలో తన మిత్రుడు ప్రకాష్‌తో కలిసి చెన్నై వెళ్లాడు. ఈ సమయంలో తన హీరో హొండా బైక్(ఏపీ 21 ఎఎ 0622)ను రైల్వే స్టేషన్ స్టాండ్‌లో పార్కింగ్ చేసి వెళ్లాడు. పక్షం రోజుల తర్వాత తిరిగొచ్చి న నరేష్ బైక్ కోసం స్టాండు నిర్వాహకుడిని ఆరా తీశాడు. చాలా రోజులుగా స్టాండ్‌లోనే ఉండడంతో టూటౌన్ పోలీసులకు అప్పగించినట్లు తెలుసుకుని బైక్‌ను తీసుకెళ్లిన కానిస్టేబుల్ సింగ్‌తో మాట్లాడగా సీఐని కలవాలని సూచించా రు. ఈ మేరకు అతడు సీఐ గంటా సుబ్బారావును కలిసి ఫిర్యాదు చేయగా పొంతనలేని ప్రశ్నలతో పదేపదే తిప్పించుకోవడంతో అనుమానం వచ్చిన నరేష్ నెల తర్వాత అతని ఇంటికి వెళ్లి చూడగా బైక్ కనిపించింది. విషయాన్ని మీడియాతోపాటు డీఎస్పీ దృష్టికి తీసుకెళ్లిన కొద్దిసేపటికే సీఐ సదరు బైక్‌పై అంటించిన పోలీస్ స్టిక్కర్‌ను తీయించి ఇంటి నుంచి స్టేషన్‌కు తెప్పించారు. మూడు రోజుల క్రితమే నా వద్దకు వచ్చాడు బైక్ పోయిందంటూ నరేష్ నా వద్దకు మూడు రోజుల క్రితం వచ్చాడు. అయితే ఆ బైక్ కర్నూలుకు చెందిన భాస్కర్ అనే వ్యక్తి పేరుపై ఉండడంతో రికార్డులు తీసుకురమ్మన్నాను. పర్చేజింగ్ డీడ్ ఉందని చూపించగా ఒరిజినల్స్ చూపించాలని చెప్పాను. తెస్తే పరిశీలించి బైక్ అప్పగిద్దామనుకున్నా. ఆలోగా ఇలా జరిగింది. (బైక్ ఎక్కడుందని విలేకరులు ప్రశ్నించగా ఎక్కడో ఒక చోట ఉంటుందిలే అంటూ బయటకు వెళ్లిపోయారు). – గంటా సుబ్బారావు, సీఐ వాస్తవమైతే చర్యలు తప్పవు... బైక్‌ను ఇంట్లో పెట్టుకోవడం, సొంత అవసరాలకు వాడుకోవడం సరికాదు. బండి యజమాని ఎవరో తెలియకపోతే రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలి. బాధితుడు సంప్రదిస్తే రికార్డులు పరిశీలించి, అవసరమైతే కేసు నమోదు చేసి న్యాయం చేయాలి. అయితే సీఐ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించారనే ఆరోపణలపై పూర్తి స్థాయి విచారణ చేస్తాం. వాస్తవమని తేలితే చట్టపరమైన చర్యలకు ఎస్పీకి సిఫారసు చేస్తాం. కేసు నమోదు చేసి విచారించిన తరువాత బాధితుడికి బైక్ అప్పగిస్తాం. – కొల్లి శ్రీనివాసరావు, ఆదోని డీఎస్పీ -
భవన యజమానులపై చర్యలేం తీసుకున్నారు?
పార్కింగ్‌కు అవకాశం లేకుండా చేయడంపై హైకోర్టు సీరియస్ సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అనేక భవనాలను వాణిజ్య సము దాయాలుగా మార్చి, పార్కింగ్‌కు అవ కాశం లేకుండా చేస్తున్న భవన యజ మానులపై ఏం చర్యలు తీసుకుంటు న్నారో వివరించాలని హైకోర్టు మంగళ వారం పురపాలకశాఖ, జీహెచ్ఎంసీలను ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ తదుపరి విచారణ ను 2 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకరనారాయణ ఉత్త ర్వులు జారీ చేశారు. జీహెచ్ఎంసీ పరిధి లో పలు భవనాల్లోని పార్కింగ్ ప్రాంతా లను వాణిజ్య సముదాయాలుగా మార్చే శారని, దీంతో చాలామంది వాహనాల్ని రోడ్లపై పార్క్ చేస్తుండటంతో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయంటూ పత్రి కల్లో కథనాలు వచ్చాయి. హైకోర్టు, వీటిని సుమోటోగా పిల్‌గా పరిగణించి విచారిం చింది. పురపాలకశాఖ, జీహెచ్ఎంసీ తదితరులకు నోటీసులు జారీ చేసింది. -
ఇష్టారాజ్యంగా పార్కింగ్ చేస్తే చర్యలు
సైదాబాద్: ఎక్కడ పడితే అక్కడ ఇష్టారాజ్యంగా వాహనాలను పార్కింగ్ చేస్తే చర్యలు తప్పవని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నరహరి అన్నారు. సైదాబాద్ మండల పరిధిలోని సుబ్రహ్మణ్యనగర్‌లో శనివారం సైదాబాద్ ఇన్స్పెక్టర్ సత్తయ్యతో కలిసి ఆయన వాహనాలను తనిఖీ చేశారు. సుబ్రహ్మణ్య నగర్లో ఎక్కడ పడితే అక్కడ ఆటోలను నిలుపుతున్నారని స్థానికులు ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అక్కడ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు ఆటో డ్రైవర్లకు పార్కింగ్‌పై అవగాహన కల్పించారు. సుబ్రహ్మణ్యనగర్ పార్కు వద్ద వాహనాలను నిలుపుకోవాలని కానీ కాలనీలో ఇళ్ల ముందు ఆటోలను పార్క్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. దీంతో పాటు ఆటో డ్రైవర్లు ఎక్కువ కిరాయి తీసుకున్నా తమకు ఫిర్యాదు చేయాలని ఆయన ఫోన్నెంబర్లను అక్కడి గోడలపై రాశారు. ప్రతి వాహనదారుడు రోడ్డు, రవాణ చట్టాలపై అవగాహన కల్గి ఉండాలని సూచించారు. పోలీసు సేవలకు సంబంధించి యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని ఇన్స్పెక్టర్ సత్తయ్య తెలిపారు. దాని ద్వారా ఫిర్యాదుతో పాటు అత్యవసర సమయాల్లో కూడా వినియోగించుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ సభ్యులు సత్యనారాయణరాజు, ప్రసాద్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
లారీ, టైర్ల దొంగల అరెస్ట్
– రూ.17లక్షల విలువైన లారీ, టైర్లు స్వాధీనం రామసముద్రం: పార్కింగ్ చేసిన లారీలను అపహరించి టైర్లను చోరీ చేస్తున్న దొంగల ముఠాను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. పలమనేరు డీఎస్పీ శంకర్, పుంగనూరు రూరల్ సీఐ రవీంద్ర, ఎస్ఐ సోమశేఖర్ విలేకరులతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రం ముళబాగిల్ తాలూకా బాలసంద్ర గ్రామానికి చెందిన శివరాజ్(32), అమిడిగల్‌కు చెందిన హనుమప్ప(32), విజయ్‌కుమార్ అలియాస్ భద్ర(26) కొంతకాలంగా చిత్తూరు, వి.కోట తదితర ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద నిలిపి ఉన్న లారీలను చోరీ చేస్తున్నారు. వాటి టైర్లను తీసుకుని లారీలను వదిలేసి వెళ్లిపోయేవారు. ఈ నెల 23న యూరియా లోడ్‌ను రామసముద్రం మండలం చెంబకూరులో దింపి రామసముద్రం బస్టాండ్‌లో లారీని పెట్టి డ్రైవర్ గురునాథరెడ్డి భోజనానికి వెళ్లాడు. దుండగులు లారీని చోరీ చేశారు. డ్రైవర్ ఈ నెల 26న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో లారీ అమిడిగల్ చెరువు వద్ద ఉన్నట్టు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. విచారణలో రెడ్డెప్ప, వెంకటప్ప, ఉమేష్, రాజేంద్ర టైర్లు కొనుగోలు చేసినట్లు తేలింది. వారిని విచారించగా లారీ చోరీ చేసే ముఠా విషయం వెలుగులోకి వచ్చింది. శనివారం ఉదయం బరిడేపల్లె బస్టాప్ వద్ద ఉన్న శివరాజ్, హనుమప్ప, విజయ్‌కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.17 లక్షల విలువైన లారీ, 31 టైర్లు, జాకీలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సహకరించిన కానిస్టేబుల్ నాగార్జునను డీఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో సీఐ చంద్రశేఖర్, ఎస్ఐ సోమశేఖర్, హెడ్ కానిస్టేబుల్ దామోదర్, సిబ్బంది అర్జున్, వెంకటాచలం పాల్గొన్నారు. -
భక్తుల వాహనాలకు భద్రత
పార్కింగ్ స్టాండ్ల ఏర్పాటు రూ.61 వేలకు వేలం ఖరారు అన్నవరం : అన్నవరం దేవస్థానం ఎట్టకేలకు వాహన పార్కింగ్ స్టాండ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. సత్యదేవుని సన్నిధికి వచ్చిన భక్తుల వాహనాలు ‘బండి’పోటు ముఠా బారిన పడకుండా భద్రత కల్పిస్తుంది. భక్తులు తమ వాహనాలను భద్ర పర్చుకునేందుకు గాను దేవస్థానం టీటీడీ సత్రం స్థలంలో కార్ల స్టాండ్, సీఆర్ఓ కార్యాలయం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో బైక్ స్టాండ్లను ఏర్పాటు చేయడానికి దేవస్థానం నిర్ణయించింది. స్టాండ్ల ఏర్పాటుకు వేలంపాట కూడా నిర్వహించింది. బైక్ పార్కింగ్‌కు రూ.ఐదు, కారు పార్కింగ్‌కు రూ. పది రుసుం వసూలు చేయడానికి వేలం నిర్వహించగా నెలకు రూ.61 వేలకు హెచ్చు పాట ఖరారైందని దేవస్థానం ఇన్చార్జి ఈఓ ఈరంకి జగన్నాథరావు తెలిపారు. -
సర్వీస్ రోడ్ లా? పార్కింగ్ ప్లేస్‌లా?
పటాన్చెరు: నిత్యం ఎక్కడో ఒక చోటు రోడ్డు ప్రమాదం.. రక్తపుటేరులవుతున్న రహదారులు. మృత్యుదేవత ఆవాసంగా రోడ్లు. ఇటువంటి సంఘటలను మనం నిత్యం వింటూనే ఉంటాం. రోడు ప్రమాదాల్లో అభాగ్యులు ప్రాణాలు కోల్పోతూ వారి కుటుంబాల్లో శోకాన్ని మిగులుస్తున్నారు. ఈ ప్రమాదాలకు నిర్లక్ష్యమే కారణమని నిపుణులు సైతం విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంల సాక్షి పటాన్చెరు జాతీయ రహదారిపై అసలు ప్రమాదాలకు కారణాలేమిటో అన్వేషించింది. పటాన్చెరు పట్టణం నుంచి వెళుతున్న జాతీయ రహదారి నిత్యం వేలాది వాహనాలతో రద్దీగా ఉంటుంది. అంతేకాదు ఇక్కడ ఉన్న రింగ్ రోడ్‌పై కూడా నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే జాతీయ రహదారితోపాటూ, రింగ్ రోడ్‌కు అనుబంధంగా సర్వీస్‌రోడ్లు ఉన్నాయి. ఇవి ఇప్పుడు పార్కింగ్ ప్లేస్‌లుగా మారిపోతున్నాయి. ప్రధానంగా పటాన్చెరు నుంచి రుద్రారం వరకు జాతీయ రహదారి వెంబడే ఉన్న సర్వీస్‌రోడ్‌లలో వాహనాలు ఎక్కడంటే అక్కడ నిలిపివేస్తున్నారు. కిలోమీటర్ల మేర వాహనాలు సర్వీస్‌రోడ్‌లలో గంటల తరబడి నిలిచిపోతున్నాయి. రాత్రి 7 గంటల నుంచి తెల్లవారుజాము వరకు వందలాది లారీలె సర్వీస్రోడ్లోనే నిలిచిఉంటున్నాయంటే అతిశయోక్తికాదు. రింగ్ రోడ్‌కు అనుకుని ఉన్న సర్వీస్ రోడ్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా రింగ్‌రోడ్ నుంచి వాహనాలు దిగే కూడలి వద్ద ఉన్న సర్వీస్‌రోడ్‌లో అయితే వందల సంఖ్యలో లారీలో గంటల తరబడి నిలిచిపోతున్నాయి. హెవీ వెహికల్స్‌ను కూడా సర్వీస్రోడ్లలోనే పార్క్ చేస్తున్నారు. పటాన్చెరు నుంచి వెళ్లే జాతీయ రహదారిపై కానీ, రింగ్ రోడ్ సర్వీస్ రోడ్లపై కాని లైటింగ్ వ్యవస్థ ఉండదు. దీంతో రాత్రి వేళల్లోసర్వీస్రోడ్లలో ప్రయాణించే వారు ఆగి ఉన్న లారీలను ఢీకొని నిత్యం ప్రమాదాలకు గురవుతున్నారు. కొంత మంది అయితే ప్రాణాలను కోల్పోతున్నారు. మరికొంత మంది తీవ్రగాయాలతో ఆసుపత్రుల పాలవుతున్నారు. రింగ్‌రోడ్‌కు అనుబంధంగా ఉన్న సర్వీస్ రోడ్లో వివిధ గ్రామాలకు నిత్యం వందలాది మంది టూ వీలర్, ఫోర్ వీలర్లలో వెళుతుంటారు. వీరికి సర్వీస్‌రోడ్‌లలో పార్క్ చేసి ఉన్న వాహనాలు రాత్రివేళల్తో కనిపించక, ప్రమాదాలు జరుగుతున్నాయి. సాధారణంగా అయితే సర్వీస్‌రోడ్‌లలో వాహనాలు నిలపకూడదు. ఈ నిబంధనను తుంగలో తొక్కి కొంత మంది లారీల యజమానులు సర్వీస్ రోడ్లనే పార్కింగ్ ప్లేస్‌లుగా మార్చేస్తున్నారు. ముత్తంగి రింగ్‌రోడ్‌కు అనుకున్న ఉన్న సర్వీస్‌రోడ్ వెంబడే హోటళ్లు విచ్చలవిడిగా వెలియడంతో వాహనాల పార్కింగ్ అక్కడ మరింత ఎక్కువైంది. దీంతో ఇక్కడ గంటల తరబడి ట్రాఫిక్ జామ్ కూడా అవుతోంది. దీనినే అదునుగా చేసుకుని కొంత మంది దళారులు పార్కింగ్‌కు ఫీజులు కూడా వసూలు చేస్తుండటం ఆశ్చర్యకరమైన విషయం. ప్రమాదాలకు హేతువుగా ఉన్న ఈ పార్కింగ్‌ను నిత్యం పోలీసులు చూస్తున్నా, నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. దళారులు, పోలీసులు కుమ్మకై సర్వీస్రోడ్లను పార్కింగ్ ప్లేస్‌లుగా మార్చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై స్థానికులు మాట్లాడుతూ జాతీయ రహధారితోపాటూ, రింగ్‌రోడ్‌కు అనుబంధంగా ఉన్న సర్వీస్ రోడ్లలో లారీలను నిలిపివేస్తుండటంతో ప్రమాదాలు నిత్యకృత్యమవుతున్నాయని అంటున్నారు. హెల్మెట్లేదని,ఆర్సీ లేదని మాటిమాటికి ఎక్కడంటే అక్కడ వాహనాలు నిలిపివేసి చలానాలు రాసే పోలీసులకు సర్వీస్‌రోడ్‌లలో పార్కింగ్ చేస్తు్న వాహనాలు కనిపించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలకు వాహనచోదకుల కన్నా, పోలీసులు నిర్లక్ష్యమే అధికంగా ఉందని, పోలీసులు లంచాలకు మరిగి చేస్తున్న నిర్లక్ష్యం అభాగ్యుల ప్రాణాలను హరిస్తుందని ఆగ్రహిస్తున్నారు. ఇప్పటికైనా జాతీయ రహదారి, రింగ్ రోడ్ సర్వీస్ రోడ్లలో వాహనాలు పార్క్ చేయకుండా చూడాలని, మరీ ముఖ్యంగా ముత్తంగి రింగ్ రోడ్ వద్ద వందలాదిగా వాహనాలు పార్క్ చేయబడుతున్నాయని, దీనిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
పుష్కర భక్తుల జేబులకు 'పార్కింగ్' చిల్లు
అమరావతి (పట్నంబజారు) : అక్రమాలకు కాదేదీ అనర్హం అన్నట్లుంది అధికార పార్టీ నేతల తీరు. ప్రశాంత వాతావరణంలో పుష్కర స్నానాలు చేసేందుకు వస్తున్న భక్తులను ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాపిస్తున్నారు. పార్కింగ్ ప్రదేశాల్లో యథేచ్ఛగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. గుంటూరు నుంచి అమరావతికి వచ్చే దారిలో ఏర్పాటు చేసిన పుష్కరనగర్ వద్ద పార్కింగ్‌లకు స్థలాన్ని కేటాయించారు. ద్విచక్ర వాహనాలు, వృద్ధులు, వికలాంగులున్న వాహనాలను మాత్రం లోపలికి అనుమతించాలని జిల్లా ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయి. ఇవన్నీ పట్టని పార్కింగ్ నిర్వాహకులు ఇష్టానుసారంగా వాహనాలను పార్కింగ్‌లో పెట్టాల్సిందేనంటూ... దందా చేస్తున్నారు. రశీదుల్లో ఒక రేటు ఉంటే..అదనంగా తీసుకుంటున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. ద్విచక్ర వాహనానికి రూ 20, కారు, జీపు, ఆటోలకు రూ.50, బస్సులు, లారీలకు రూ.100 వసూలు చేస్తున్నారు. ఈ వ్యవహారం గురించి పోలీసు ఉన్నతాధికారులకు తెలిసినప్పటీకీ పట్టించుకోవడం లేదనే విమర్శలొస్తున్నాయి.lఅధికారి పార్టీకి చెందిన జెడ్పీటీసీ బంధువు పార్కింగ్ నిర్వహిస్తుండటంతోనే నోరు మెదపడం లేదని సమాచారం. పార్కింగ్ ప్రదేశాల్లో వాహనాలు నిలిపేందుకు నిర్వాహకులకు పోలీసులు సహకరించటంపై అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పుష్కర నగర్ నుంచి ఉచిత బస్సుల్లో అమరావతి చేరుకున్నప్పటీకీ కిలోమీటకు పైగా నడవాల్సి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పార్కింగ్ దందాను అరికట్టాలని భక్తులు కోరుతున్నారు. -
కొడుకుకు...ప్రేమతో..!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: నాన్నకు ప్రేమతో అనే సినిమా చూశాం... ఈ కొడుకుకు ప్రేమతో ఏమిటని అనుకుంటున్నారా? ఇది సినిమా కాదు. జిల్లాలోని ముఖ్యనేత తన కొడుకు మీద ప్రేమతో నడుపుతున్న అధికారిక వ్యవహారం. సినిమాలో నాన్నమీద ప్రేమతో నాన్న కోరిక కొడుకు తీర్చగా... ఇక్కడ కొడుకు కోరిన మీదటే తన అధికారాన్ని ఉపయోగించుకుని ఒక తండ్రి నెరవేర్చిన కథ. అధికార పార్టీకి చెందిన ముఖ్యనేత ఒకరు ఏకంగా ప్రభుత్వ కార్యాలయాన్నే మార్చేందుకు చేస్తున్న ప్రయత్నం ఇది. విశాలంగా, పార్కింగ్‌కు సౌకర్యం ఉండి, తక్కువ అద్దెలు ఉన్న భవనాన్ని కాదని..ఇరుకు ఇరుకుగా..పార్కింగ్‌కు సౌకర్యం లేని, అధిక అద్దె ఉన్న ప్రాంతానికి రిజిస్ట్రేషన్‌శాఖ కార్యాలయానికి తరలించేందుకు అధికార పార్టీ నేత ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ మేరకు త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. జెడ్పీకి ఎదురుగా...! ప్రస్తుతం జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయం గుత్తి పెట్రోలు బంకుకు సమీపంలో ఉంది. ఇది ప్రజలకు కొంత దూరంగా ఉన్న మాట వాస్తవమే. అయితే, అక్కడ పార్కింగ్‌కు పెద్దగా సమస్య లేదు. అంతేకాకుండా అద్దె కూడా తక్కువే. దీనిని అధికార పార్టీ ముఖ్యనేత కుమారుడు కొన్న భవనంలోకి మార్చేందుకు యత్నాలు ప్రారంభమయ్యాయి. ముఖ్యనేత కుమారుడు కొన్న భవనం జిల్లా పరిషత్ కార్యాలయానికి ఎదురుగా ఉంది. అక్కడ పార్కింగ్‌కు సదుపాయం ఏ మాత్రమూ లేదు. పైగా అద్దెలు కూడా అక్కడితో పోలిస్తే చాలా ఎక్కువ. ఇక రిజిస్ట్రేషన్ కార్యాలయంలో వ్యవహారాలన్నీ చక్కదిద్దేందుకు ఉన్న డాక్యుమెంటు రైటర్లు (దస్తావేజు లేఖరులు) అందరూ ఇక్కడకు తరలిరావాలంటే వారికీ అద్దె రూపంలో భారంగా మారనుంది. అంతేకాకుండా ఈ శాఖ ఇక్కడకు రావడంతో నగరంలోని ఇక్కడకు వచ్చే ఇతర ప్రజలకు కూడా అసౌకర్యంగా మారనుంది. మొత్తం మీద అధికార పార్టీ నేతలు చేస్తున్న ఈ ప్రయత్నం కాస్తా ఇప్పుడు రిజిస్ట్రేషన్‌శాఖలో హాట్‌టాపిక్‌గా మారింది. ఆగని అవినీతి దందా మరోవైపు రిజిస్ట్రేషన్‌శాఖలో అవినీతి వ్యవహారాలు మాత్రం ఆగడం లేదు. ఇప్పటికీ రిజిస్ట్రేషన్ చేయాలంటే.. ఇంత మొత్తాన్ని నిర్ణయించి వసూలు చేస్తున్నారు. అంతేకాకుండా రియల్ ఎస్టేట్వ్యాపారులతో నేరుగా సంబంధాలు నెరుపుకుంటూ... వాస్తవిక ధర కంటే తక్కువ ధర పేర్కొంటూ తమ బొక్కసాలు నింపుకుంటున్నారు. జిల్లాకు చెందిన మంత్రి ఈ శాఖకు నేతత్వం వహిస్తున్నా ఇక్కడ మాత్రం అవినీతి దందా యథేచ్ఛగా కొనసాగుతూనే ఉంది. ఈ అవినీతి వ్యవహారంతో ఆదాయం కోల్పోతున్న రిజిస్ట్రేషన్‌శాఖ కాస్తా... తాజాగా కార్యాలయం మార్పుతో అదనపు అద్దె రూపంలో మరింత భారం మోయాల్సి రానుంది. -
రూ.3 కోట్లతో పార్కింగ్‌ల ఏర్పాటు
మట్టపల్లి (మఠంపల్లి) : కృష్ణా పుష్కరాల నేపథ్యంలో మట్టపల్లి పుష్కర ఘాట్ వచ్చే భక్తుల కోసం రూ.3 కోట్లతో పార్కింగ్‌ల ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఆర్ అండ్ బీ స్పెషల్ ఆఫీసర్ వెంకట్ తెలిపారు. మంగళవారం ఆయన మట్టపల్లి సమీపంలోని సుల్తాన్‌పూర్‌తండా రోడ్డు వద్ద ఏర్పాటు చేయనున్న పార్కింగ్ నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.3 కోట్ల వ్యయంతో ఒక్కొక్కటి 25 ఎకరాల విస్తీర్ణంలో ఆరు పార్కింగ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మట్టపల్లిలోని కృష్ణా జలాల పంప్ హౌస్ వద్ద ఒక పార్కింగ్, సుల్తాన్పూర్ తండా రోడ్డు సమీపంలో ప్రధాన రహదారికి ఇరువైపులా నాలుగు పార్కింగ్లు, మండల కేంద్రమైన మఠంపల్లి సమీపంలో మరో పార్కింగ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఈ నెలాఖరు నాటికి పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆర్ అండ్ బీ డీఈ వెంకటయ్య, ఏఈ రాజశేఖర్, మాజీ ఎంపీపీలు కొండానాయక్, లక్ష్మీవెంకటనారాయణ పాల్గొన్నారు. -
ఢిల్లీలో స్ట్రీట్ ఫైట్
-
విమానాశ్రయంలో చోరీలు: బాలుడు అరెస్ట్
పార్కింగ్ చేసి ఉన్న వాహనాలను టార్గేట్‌గా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న బాలుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్ విమానాశ్రయంలోని పార్కింగ్ స్థలంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న బాలుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా.. అసలు విషయం బయటపడింది. పార్క్ చేసి ఉన్న వాహనాలలోని సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, నగదు దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకోవడంతో.. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రూ. 23 వేల నగదు, రెండు ల్యాప్‌టాప్‌లు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. -
కారు పార్కింగ్‌లో కూలిన చిన్న విమానం
-
ఎండ నుంచి వాహనాలకు రక్షణ ఇలా..
రాయవరం : భానుడు రోజు రోజుకు విశ్వరూపం చూపిస్తున్నాడు. మండే ఎండలను తట్టుకునేందుకు ప్రజలు రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నారు. నేడు మారిన జీవనశైలిలో భాగంగా వాహనాల పట్ల కూడా కాస్త జాగ్రత్తలు వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. వేసవి వచ్చిందంటే వాహనదారులు వివిధ రకాల సమస్యలు ఎదుర్కొంటుంటారు. ముఖ్యంగా పార్కింగ్ లేకపోవడంతో ఎండలోనే వాహనాలు ఉంచడం ద్వారా రంగు వెలిసిపోతాయి. ఇంజన్ నుంచి పొగలు రావడం, పెట్రోల్ ఆవిరైపోవడం, టైర్ పంక్చర్ కావడం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. వీటిని అరికట్టేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. ఇంజన్ ఆయిల్ మార్పిడిలో అప్రమత్తం .. వేసవిలో వాహనాల ఇంజన్ ఆయిల్ మార్పిడి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వేడి కారణంగా ఇంజన్ ఆయిల్ ఆవిరయ్యే అవకాశం ఉంది. వాహనాలు నడుపుతున్నప్పుడు వచ్చే వేడి .. ఎండ వేడి కలిసి ఇంజన్ ఓవర్‌హీట్ అయ్యే అవకాశం ఉంది. దీంతో ఇంజన్ నుంచి పొగలు వస్తుంటాయి. దీంతో పాటు ఎయిర్ లాక్ ఏర్పడి వాహనం స్టార్ట్ కాక మొరాయించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇంజన్ ఆయిల్‌ను ఎప్పటికప్పుడు మార్చుకుంటే ఇబ్బందులు తప్పుతాయి. సాధారణంగా 2వేల కి.మీలకు ఒకసారి మార్చే ఇంజన్ ఆయిల్‌ను వేసవిలో 1,000 నుంచి 1,500 కిలో మీటర్లకు మార్చుకోవడం మంచిది. రక్షణ నిచ్చే సీట్ కవర్లు.. క్లాత్ కవర్లు ఎండ తీవ్రతను తగ్గించడంలో సీట్ కవర్లది ప్రముఖ పాత్ర ఉంటుంది. కేవలం సీటుకే కాకుండా పెట్రోల్ ట్యాంక్‌కు కూడా కవర్లు వేయడం మరింత సురక్షితం. వేడిని తగ్గించే వెల్వెట్, పోస్ట్క్లాత్ వంటి సీట్ కవర్లు వేయిస్తే మంచిది. వాకడం విషయంలో జాగ్రత్తలు వేసవిలో ద్విచక్ర వాహనాలను అవసరం ఉంటే తప్ప అదేపనిగా వినియోగించకుండా ఉంటే మంచిది. దూర ప్రాంతాలకు వాహనా ల్లో ప్రయాణం చేసే వారు ద్విచక్ర వాహనాన్ని పక్కన పెట్టి బస్సులో ప్రయాణిస్తే మంచిది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వచ్చిన మార్గమధ్యంలో కాస్త చల్లటి ప్రదేశాల్లో ఆగి కాసేపు విశ్రాంతి తీసుకోవాలి. ఇలా చేయడం ద్వారా వాహనం ఇంజన్ కండిషన్లో ఉంటుంది. పార్కింగ్ ముఖ్యం.. వాహనాలను ఎండ తీవ్రత నుంచి కాపాడుకునేందుకు ముఖ్యంగా స్థల సేకరణ అవసరం. పార్కింగ్ స్థలాలు లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దుకాణాల వద్ద పార్కింగ్ చేస్తుండడంతో పాటు ఎటువంటి నీడలేని రహదారుల పైనే పార్కింగ్ వచేయాల్సి వస్తుంది. దీంతో ఎండ అధికంగా ఉండే సమయంలో వాహనాల్లోని పెట్రోల్ ఆవిరైపోతుంది. రాత్రి వేళల్లో ఒకసారి ట్యాంక్ మూతను తీసి మళ్లీ పెట్టడం ద్వారా వేడికారణంగా ట్యాంక్‌లో ఏర్పడ్డ గ్యాస్ బయటకు వెళ్లి ఇంజన్‌లోకి ఆయిల్ సులువుగా వెళ్తుందని నిపుణులు తెలుపుతున్నారు. వేసవిలో వాహనాలపై జాగ్రత్త అవసరం వేసవిలో వాహనాలపై జాగ్రత్త అవసరం. వీలైనంత మేరకు వాహనాలను నీడలోనే పార్కింగ్ చేసేందుకు ప్రయత్నం చేయాలి. వాహనాలను ఎండ నుంచి కాపాడేందుకు క్లాత్ కవర్లు ఉపయోగపడతాయి. ఇక ఇంజన్ ఆయిల్‌ను మిగతా సమయంలో కంటే వే సవిలో కాస్త ముందుగానే మార్చుకుంటే మంచిది. - కె.విజయకుమార్, సీనియర్ మెకానిక్, రాయవరం -
హ్యాపీ జర్నీ
⇒అరచేతిలోనే పార్కింగ్ ప్రాంతాలు.. ⇒నీరు నిలిచే ఏరియాలు సైతం ప్రత్యక్షం ⇒‘ట్రాఫిక్ లైవ్’కు కొత్త హంగులు ⇒వారం రోజుల్లో అందుబాటులోకి.. సిటీబ్యూరో: దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రమేష్ షాపింగ్ కోసం తన కారులో బేగంబజార్‌కు వచ్చారు. నిత్యం రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో వాహనం ఎక్కడ పార్క్ చేయాలో.. ఫ్రీ పార్కింగ్ ప్రాంతాలు ఎక్కడున్నాయో తెలియడం లేదు. వర్షం వచ్చిందంటే నగరంలోని రహదారులు చెరువులను తలపిస్తాయి. కీలక రోడ్డులో ఉన్న నీరు నిలిచే ప్రాంతాలు (వాటర్ లాగింగ్ ఏరియా) ట్రాఫిక్ జామ్‌కు కారణమవుతాయి. అత్యవసర పనులపై వెళ్లే వారు తీవ్ర ఇబ్బందికి గురవడం చూస్తుంటాం. ఇలాంటి సమస్యలు ప్రతి ఒక్కరికీ అనుభవమే. ఈ సమస్యలకు నగర ఐటీ సెల్ పరిష్కారం చూపిస్తోంది. ఇప్పటికే సిటిజన్ ఫ్రెండ్లీ విధానాల్లో భాగంగా ట్రాఫిక్ విభాగం అందుబాటులోకి తెచ్చిన ‘హైదరాబాద్ ట్రాఫిక్ లైవ్’ యాప్‌లో ప్రత్యేక విభాగాలకు పొందుపరుస్తోంది. ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ అదనపు హంగులు మరో వారం రోజుల్లో సెల్‌ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. పార్కింగ్.. నో పార్కింగ్.. నగరంలోని అన్ని రహదారులు, ప్రాంతాలను పరిగణలోకి తీసుకుని అక్కడి పరిస్థితుల్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన అధికారులు ఈ విభాగాలను రూపొందించారు. హై ఎండ్ ఫోన్ ఉన్న వాహన చోదకుడుకు ఓ ప్రాంతానికి వెళ్లినప్పుడు తన వాహనాన్ని ఎక్కడ నిలుపుకోవాలో తెలుసుకోవాలంటే ‘లైవ్’ యాప్‌లోకి వెళ్తే చాలు. జీపీఎస్ ఆధారంగా పనిచేసే ఈ పరిజ్ఞానం.. సదరు వాహనం ఉన్న ప్రాంతాన్ని గుర్తించడంతో పాటు సమీపంలో ఉన్న ‘పెయిడ్, ఫ్రీ పార్కింగ్’ వివరాలు అందిస్తుంది. దీంతో పాటు అవి ద్విచక్ర వాహనాల కోసమా? తేలికపాటి వాహనాల కోసమా? వాటి కెపాసిటీ ఎంత? తదితర వివరాలను మార్కింగ్, పాప్అప్స్ రూపంలో అందిస్తుంది. ఆయా ప్రాంతాల్లో ఉన్న నో పార్కింగ్ ఏరియాలను స్పష్టంగా చూపిస్తుంది. దీనిద్వారా వాహనదారులు ‘పోలీస్ చలాన్’కు, ‘టోవింగ్స్’కు గురయ్యే అవకాశం తప్పుతుంది. ‘వాటర్ లాగింగ్’ ఏరియాలూ.. వర్షాకాలంతో పాటు ఓ మాదిరి వర్షానికీ నగరంలోని అనేక రహదారులపై నీరు నిలవడం పరిపాటి. ఇలాంటి ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయో.. ఆయా మార్గాల్లో ప్రయాణించే వాహన చోదకులకు తెలియదు. దీంతో సదరు వ్యక్తి ఆయా ప్రాంతాలకు వచ్చి ట్రాఫిక్‌లో ఇరుక్కుపోతుంటారు. దీనికి పరిష్కారంగా ఈ యాప్‌లో నగర వ్యాప్తంగా ఉన్న వాటర్ లాగింగ్ ఏరియాలను డిజిటల్ మ్యాపింగ్ ద్వారా మార్కింగ్ చేశారు. గడిచిన కొన్నేళ్ల పరిస్థితుల్ని అధ్యయనం చేసి వీటిని రూపొందించారు. తద్వారా వాహనదారుడు వర్షం కురిసినప్పుడు తాను ప్రయాణిస్తున్న మార్గంలో ఉన్న వాటర్ లాగింగ్ ఏరియాలను తెలుసుకోవడంతో పాటు ప్రత్యామ్నాయ మార్గాలనూ ఎంచుకోవడానికి యాప్‌లోని ‘వాటర్ లాగింగ్’ ఏరియాల సమాచారం ఉపకరిస్తుంది. పాదచారులకు ఉపయుక్తంగా.. ఐటీ సెల్ ఇన్చార్జ్ శ్రీనాథ్‌రెడ్డి పర్యవేక్షణలో రూపొందుతున్న ఈ ప్రత్యేక విభాగంలో కేవలం వాహన చోదకులకే కాక.. పాదచారులు, సాధారణ ప్రయాణికులకు ఉపయుక్తమైన సమాచారం పొందుపరుస్తున్నారు.నగరంలోని తూర్పు మండలంలో నివసించే వ్యక్తికి దక్షిణ మండలంలో బస్టాప్స్ ఎక్కడ ఉన్నాయో, ఆటో స్టాండ్లకు ఎలా చేరుకోవాలో అర్థం కాదు. పద్మవ్యూహాన్ని తలపించే రోడ్లపై పలువురిని పదేపదే అడిగితే తప్ప ఈ ‘గమ్యం’ చేరుకోలేరు. సామాన్యులకు ఈ సమస్యలు రాకూడదన్న ఉద్దేశంతో ఐటీ సెల్ ఈ విభాగంలో ప్రాంతాల వారీగా బస్టాండ్లు, ఆటో స్టాండ్ల వివరాలు మార్కింగ్ చేసింది.కొత్త ప్రాంతానికి వెళ్లిన వ్యక్తి ఈ యాప్ ద్వారా దారి చూసుకుంటూ అవసరమైన చోటుకు చేరుకోవచ్చు. -
ఈ కారు ఎవరిది..?
మొయినాబాద్: పదిహేను రోజులుగా ఒకే చోట ఉన్న ఓ కారు స్థానికంగా కలకలం రేపుతోంది. కారు ఎవరిదో..?ఎవరు పార్కు చేశారో తెలియదు? కానీ పదిహేను రోజు లుగా మొయినాబాద్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో మండల మహిళా సమాఖ్య భవనం ముందు నిలిపి ఉంది. ఏపీ 21 ఎం 2979 నెంబరుగల అంబాసిడర్ కారు పదిహేను రోజులుగా అక్కడే ఉండటంతో ఐకేపీ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పదిహేను రోజుల నుంచి కారు అక్కడే ఉందని, ఎవరూ తీసుకుపోవడం లేదని చెబుతున్నారు. కారు వెనక అద్దంపై ‘జై తెలంగాణ’ అని రాసి ఉంది. పోలీస్టేషన్‌కు పక్కనే ఉన్న ఈ కారు గురించి పోలీసులు కూడా పట్టించుకోవడం లేదు. ఇప్పటికే ఓసారి ఐకేపీ సిబ్బంది విషయాన్ని పోలీసులకు చెప్పారు. అయినా పోలీసులు కారు గురించి పట్టించుకోకపోవడం గమనార్హం. -
చౌక ధరలకే ఇల్లు సొంతం చేసుకోండి..
అద్దె ఇంట్లో అరకొర సౌకర్యాలతో ఇబ్బందులు పడేవారెవరైనా సొంత ఇల్లు తమకు కలగానే భావిస్తారు. చిన్న పొదరిల్లైనా చాలు సొంతగా తమకు ఉండాలని కోరుకుంటారు. అటువంటి వారికి బ్రిటన్ కు చెందిన ఓ సంస్థ సభ్యులు బంగారు అవకాశం కల్పిస్తున్నారు. కేవలం 15 వేల యూరోలకు(భారత కరెన్సీలో దాదాపు 11.45 లక్షల రూపాయలు) ఫ్లాట్ మీ సొంతం చేసుకోండంటూ ఆఫర్లు ఇచ్చేస్తున్నారు. కారు పార్కింగ్ తో సహా అనేక వసతులున్న ఆ ఇళ్ళ వివరాలేంటో ఓసారి చూద్దాం. చాలా తక్కువ ధర ఉన్న ఫ్లాట్ మీ సొంతం చేసుకోండంటూ బ్రిటన్ బేరగాళ్ళు ప్రత్యేక ఆఫర్లతో ముందుకొస్తున్నారు. లక్షల యూరోలు పోసి కొనలేని మధ్య తరగతి వారికోసం అక్కడి ఏజెంట్లు ఆధునిక పద్ధతులను అవలంబిస్తున్నారు. కొత్త పద్ధతిలో ఇళ్ల అమ్మకాలు చేపట్టి చౌక ధరకే అందిస్తున్నారు. చైకైన ఇంటికోసం వెతుక్కునేవారికి ఆ కష్టాలు లేకుండా.. పార్కింగ్ స్థలంతో పాటు... సింగిల్ బెడ్ రూం ఫ్లాట్ ను కేవలం 15000 యూరోలకే అందిస్తున్నారు. సగటు వివాహ ఖర్చుకంటే కూడ తక్కువ ధరకు వారు ఇళ్లను ట్యాగ్ చేస్తున్నట్లు చెప్తున్నారు. లండన్ లాంక్ షైర్ ప్రెస్టన్ ప్రాంతంలో మధ్య తరగతి వారికోసం ఈ నూతన ప్రక్రియను ప్రత్యేకంగా ప్రవేశపెట్టారు. ఇటువంటి 24 ఇళ్లను పలు ప్రాంతాల్లో గుర్తించి ఇప్పుడు ఆన్ లైన్ ఎస్టేట్ ఏజెంట్లు ఒక్కోటి అమ్మకానికి పెట్టారు. మాల్దీవులకు ఓసారి వెళ్ళి వస్తే అయ్యేంత ఖర్చుతో నాలుగు సింగిల్ బెడ్ రూం ఫ్లాట్లు సొంతం చేసుకోవచ్చని హౌస్ సింపుల్ డాట్ కామ్ కు చెందిన ఆన్ లైన్ ఎస్టేట్ ఏజెంట్లు చెబుతున్నారు. లండన్ లో ఓ కొత్త ఇంటికి అడ్వాన్స్ ఇవ్వాలంటే కనీసం 31000 యూరోలు(భారత కరెన్సీలో దాదాపు 22.5 లక్షల రూపాయలు) ఖర్చవుతుందని, అయితే అందులో కేవలం సగం కట్టినా ఈ సింగిల్ బెడ్ ఫ్లాట్.. పార్కింగ్ తో సహా సొంతం చేసుకునే అవకాశం ఉందని ఆన్ లైన్ ఏజెంట్లు వివరిస్తున్నారు. తక్కువ ధరలో ఇళ్లను గుర్తించేందుకు సంస్థ సభ్యులు బ్రిటన్ వ్యాప్తంగా ఓ సర్వే నిర్వహించారు. అందులో భాగంగా అక్కడి కనీస గృహాల ఖరీదు 300.000 యూరోలు ఉన్నట్లుగా తెలుసుకున్నారు. అందుకే మధ్య తరగతి వారికి అందుబాటులో ఉండేందుకు వారు నిర్వహించిన సర్వేలో భాగంగా అత్యంత చౌక అయిన ఇళ్లను గుర్తించి అందించే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని వసతులతో ఉన్నా... ఈ చిన్న ఇల్లు నివాసానికి సరిపోదని ఫీలయ్యేవారు పెట్టుబడిగానైనా కొనొచ్చని సలహా ఇస్తున్నారు. ఆన్ లైన్ బ్రోకర్లు, ఏజెంట్లు ప్రతిచోటా ఉన్నా వారికి దొరికిన ఇళ్లు మాత్రమే అమ్మకానికి పెడుతుంటారు. కానీ బ్రిటన్ బేరగాళ్లు మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండే ధరల్లో ఎంపిక చేసి మరీ ఇళ్లను అమ్మకానికి పెట్టడం ఇప్పుడు ప్రత్యేకతను సంతరించుకుంటోంది. -
ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ దగ్ధం
యాలాల(రంగారెడ్డి): రాత్రి ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ తెల్లారి లేచి చూసేసరికి కాలి బూడిదైంది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా యాలాల మండలం అచ్యుతాపురం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన గొళ్ల అంజిలయ్య శుక్రవారం రాత్రి యాలాలకు వెళ్లి తిరిగి వచ్చి హీరోహోండా బైక్‌ను ఇంటి ముందు ఉన్న పాకలో పార్క్ చేసి పడుకున్నాడు. ఉదయం లేచి చూసేసరికి బైక్‌తో సహా పాక పూర్తిగా కాలిపోయింది. దీంతో అంజిలయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
ట్రాఫిక్ మళ్లింపులు ఇలా....
నగరంలో గణేశ్ నిమజ్జనయాత్రను సాఫీగా నిర్వహించేందుకు నగర, సైబరాబాద్ పోలీసులు సిద్ధమవుతున్నారు. మెట్రో నిర్మాణ పనులతో శోభాయాత్రకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ట్రాఫిక్ మళ్లింపులు, పార్కింగ్ ప్రాంతాలు, నిమజ్జనం తర్వాత వెళ్లాల్సిన మార్గాలను నగర పోలీసు కమిషనర్ శుక్రవారం విడుదల చేశారు. ట్యాంక్‌బండ్ వద్ద వైభవంగా జరిగే నిమజ్జన దృశ్యాలను తిలకించేందుకు వచ్చే భక్తుల కోసం కూడా బస్సులు ఉంటాయని, అయితే నిర్ణీత సూచించిన ప్రదేశంలో వాటిని నిలుపనున్నారని చెప్పారు. సౌత్ జోన్: కేశవగిరి, మహబూబ్‌నగర్ ఎక్స్ రోడ్స్, ఇంజిన్ బౌలి, నాగుల్ చింత, హిమ్మాత్పుర, హరిబౌలి, అస్రా హాస్పిటల్, మొఘుల్పుర, లక్కడ్ కోటే, మదీనా ఎక్స్ రోడ్డు, ఎంజే బ్రిడ్జి, దార్ ఉల్ సిఫా ఎక్స్ రోడ్స్, సిటీ కాలేజ్ ఈస్ట్ జోన్: చంచల్‌గూడ జైలు ఎక్స్ రోడ్స్, మూసారం బాగ్, చాదర్‌ఘాట్ బ్రిడ్జి, సలర్జంగ్ బ్రిడ్జి(శివాజీ బ్రిడ్జి), అఫ్జల్‌గంజ్, పుతిలిబౌలి ఎక్స్ రోడ్స్, ట్రూప్ బజార్, జామ్‌బాగ్ ఎక్స్ రోడ్స్, ఆంధ్రా బ్యాంక్ కోఠి వెస్ట్ జోన్: టోప్‌ఖానా మసీద్, అలస్కా హోటల్ జంక్షన్, ఉస్మాన్‌గంజ్, తాజ్ ఐలాండ్, బర్తన్ బజార్, ఏఆర్ పెట్రోల్ పంప్ సెంట్రల్ జోన్: చాపెల్ రోడ్డు ఎంట్రీ, జీపీఓ, శాలిమార్ థియేటర్, గన్‌ఫౌండ్రీ, స్కైలైన్ రోడ్డు, దోమలగూడలోని భరత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సెంటర్ జంక్షన్, కంట్రోల్ రూమ్, లిబర్టీ సెంటర్, ఎంసీహెచ్ ఆఫీస్ వై జంక్షన్, బీఆర్కే భవన్ జంక్షన్, ఇక్బల్ మినార్, రవీంధ్ర భారతి, ద్వారకా హోటల్ జంక్షన్, ఖైరతాబాద్ జంక్షన్, చిల్డ్రన్స్ పార్క్, వైశ్రాయ్ హోటల్ జంక్షన్, కవాడిగూడ జంక్షన్, ముషీరాబాద్ ఎక్స్ రోడ్డు, ఆర్టీసీ ఎక్స్ రోడ్డు, కట్టమైసమ్మ టెంపుల్, ఇందిరా పార్క్ జంక్షన్ నార్త్‌జోన్: సీటీవో, వైఎంసీఏ, ప్యారడైస్ ఎక్స్ రోడ్డు, ప్యాట్నీ ఎక్స్ రోడ్డు, బాటా ఎక్స్ రోడ్డు, అదవయ్య ఎక్స్ రోడ్డు, గన్స్ మంది ఎక్స్ రోడ్డులు. కర్బలా మైదాన్, బుద్ధభవన్, సైలింగ్ క్లబ్, నల్లగుట్ట జంక్షన్ నుంచి నెక్లెస్‌రోడ్డు, అప్పర్ ట్యాంక్ బండ్‌లోని అనుమతి లేదు. (ఆదివారం ఉదయం ఆరు నుంచి సోమవారం ఉదయం ఎనిమిది గంటల వరకు ఈ ఆంక్షలు ఆమల్లో ఉంటాయి) పార్కింగ్ ఇక్కడ చేయండి ఖైరతాబాద్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్, ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్, ఆనంద్ నగర్ కాలనీ నుంచి ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ జెడ్సీ ఆఫీసు, బుద్ధభవన్ వెనకల, గోసేవా సదన్, లోయర్ ట్యాంక్ బండ్, కట్టమైసమ్మ టెంపుల్, ఎన్టీఆర్ స్టేడియం, నిజామ్ కాలేజ్, పబ్లిక్ గార్డెన్స్ నిమజ్జనం తర్వాత ఇలా వెళ్లాలిలా... *ఎన్టీఆర్ మార్గ్ ఘాట్: నెక్లెస్ రోటరీ, ఖైరతాబాద్ ఫ్లైఓవర్, వీవీ విగ్రహం, కేసీపీ మీదుగా వాహనాలు వెళ్లాలి. తెలుగు తల్లి, మింట్ కాంపౌండ్ మీదుగా అనుమతించరు. *అప్పర్ ట్యాంక్ బండ్ ఘాట్: చిల్డ్రన్స్ పార్క్, డీబీఆర్ మిల్స్, కవాడి గూడ, ముషీరాబాద్ మీదుగా వెళ్లాలి. బ్రిడ్జ్‌పై నుంచి బైబిల్ హూస్ రైల్ మీదుగా అనుమతి లేదు. భారీ వాహనాలకు నో పర్మిషన్... అంతర్రాష్ట్ర, ఇతర జిల్లాల నుంచి వచ్చే భారీ వాహనాల(లారీ)లను 27 రాత్రి నుంచి 28వ తేదీ వరకు రాకపోకలు నిషేధించారు. నిమజ్జనం పూర్తయ్యే వరకు శివారు ప్రాంతాల్లోనే ఉండాలి. ఎంజీబీఎస్‌కు వెళ్లే అంతర్రాష్ట్ర, జిల్లా బస్సులను కూడా 27వ తేదీ ఉదయం పది నుంచి 28వ తేదీ ఉదయం ఆరు గంటల వరకు అనుమతి లేదు. ప్రత్నామ్యాయ మార్గాల్లో బస్సులు నిలిపాల్సి ఉంటుంది. ప్రైవేట్ బస్సులకు నగరంలోకి అనుమతి ఉండదు. ప్రయాణికులు ఈ మార్గాల్లో రావద్దు ఎయిర్‌పోర్టుకు వెళ్లేవారు, అక్కడి నుంచి వచ్చేవారు నెక్లెస్‌రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్‌బండ్ రోడ్డు, అంబేద్కర్ విగ్రహం నుంచి ఫలక్‌నుమా ప్రధాన రహదారి వరకు మార్గాలకు రావద్దు. రైల్వేస్టేషన్, బస్టాండ్ల నుంచి వచ్చేవారు కూడా ఇదే నిబంధనను పాటించాలి. హైదరాబాద్ శోభయాత్ర మార్గాలివే... -కేశవగిరి నుంచి ప్రధాన శోభయాత్ర మొదలై అలియాబాద్, నాగుల్ చింత, చార్మినార్, మదీనా, అఫ్జల్‌గంజ్, ఎంజే మార్కెట్, అబిడ్స్, బషీర్‌బాగ్, లిబర్టీ, అప్పర్‌ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్ వరకు చేరుకుంటుంది. కొన్ని జంక్షన్ల వద్ద ఇతర ప్రాంతాల నుంచి వచ్చే గణనాథులు కూడా కలిసి ఈ మార్గాల్లోనే హుస్సేన్‌సాగర్‌కు చేరుకుంటాయి. -సికింద్రాబాద్ నుంచి వచ్చే విగ్రహలను ఆర్పీ రోడ్డు, ఎంజీ రోడ్డు, కర్బలా మైదాన్, కవాడిగూడ, ముషీరాబాద్ ఎక్స్ రోడ్డు, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, నారాయణగూడ ఎక్స్ రోడ్డు, హిమాయత్‌నగర్ వై జంక్షన్, లిబర్టీ మీదుగా ట్యాంక్‌బండ్ చేరకుంటాయి. ఉప్పల్, రామాంతపూర్, అంబర్పేట్, ఓయూలోని ఎన్సీసీ, దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ ఆస్పత్రి నుంచి వచ్చే వాహనాలు ఆర్టీసీ క్రాస్ రోడ్డు మీదుగా ట్యాంక్‌బండ్ చేరుకుంటాయి. వెస్ట్‌జోన్ నుంచి వచ్చే కొన్ని గణనాథులు ఎంజే మార్కెట్, సెక్రటేరియట్-తెలుగు తల్లి విగ్రహం వద్ద కలుసుకొని నిమజ్జన ఘాట్‌కు చేరుకుంటాయి. ఆదివారం ఉదయం తొమ్మిది నుంచి సోమవారం ఉదయం ఎనిమిది గంటల వరకు ఈ ప్రధాన శోభయాత్ర ఆయా మార్గాల్లో జరగనుంది. -
పార్క్ చేసిన నాలుగు కార్లలో చోరీ
నిజామాబాద్ టౌన్ : పార్క్ చేసి ఉంచిన నాలుగు కార్ల అద్దాలు పగులగొట్టి విలువైన టేప్ రికార్డర్లు, స్పీకర్లను ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన నిజామాబాద్ నగరంలోని మహలక్ష్మీనగర్‌లో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మహాలక్ష్మీనగర్‌లోని ఒక రోడ్డులో డ్రైనేజీ పనులు జరుగుతుండటంతో కార్ల యజమానులు వీధిలోకి వెళ్లే అవకాశం లేకపోవడంతో శనివారం కార్లను పక్కనే రోడ్డుపై పార్క్ చేసి వెళ్లారు. కాగా ఆదివారం తెల్లవారుజామున వచ్చి చూడగా కార్ల అద్దాలు పగులగొట్టి ఖరీదైన టేప్ రికార్డర్లు, స్పీకర్లు మాయమైనట్లు గుర్తించారు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
బ్యాగులో పట్టే కారు
ఈ కారుకు పార్కింగ్ అక్కర్లేదు. ఇంధనం సమస్య కాదు. ఆఫీసుకు చేరుకున్నాక ఎంచక్కా బ్యాగులో పెట్టేసుకోవచ్చు. ల్యాప్‌టాప్‌ను చార్జింగ్ పెట్టినట్లు మన డెస్క్మీదే చార్జింగ్ పెట్టేసుకోవచ్చు. నగరాల్లో సులభమైన రాకపోకలు సాగించడం ఎలా అని ఆలోచిస్తున్న 26 ఏళ్ల జపాన్ ఇంజనీర్ కునైకో సైటోకు తట్టిన ఐడియా ఇది. అల్యూమినియంతో చేసిన దీని బరువు జస్ట్ మూడు కిలోలే. పైకి స్కేటింగ్ బల్లలా (దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది) ఉండే దీనికి కిందివైపు నాలుగు చక్రాలు ఉంటాయి. లిథియం బ్యాటరీతో పనిచేసే ఈ ఎలక్ట్రికల్ కారును మూడు గంటలు చార్జ్ చేస్తే... 12 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. 120 కేజీల బరువు వరకు మోయగలదు. నడపడమంటూ ఏమీలేదు. ఎక్కి నిలబడితే కదులుతుంది. రైడ్ చేసే వాళ్లు శరీరబరువును ఎటువైపు వేస్తే అటు మలుపు తిరుగుతుంది. కిందికి దిగితే ఆగిపోతుంది. గంటకు 10 కిలోమీటర్ల గరిష్ట వేగంతో వెళ్లగలదు. ఇదేదో బాగుంది కదూ! -
రామంతపూర్ లో దుండగుల దారుణం
హైదరాబాద్: నగరంలోని రామంతపూర్‌లో దుండగులు దారుణానికి పాల్పడ్డారు. ఓ ఇంటి ముందు పార్కింగ్ చేసిన రెండు బైక్‌లను తగలబెట్టారు. బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో బైక్ లు పూర్తిగా కాలిపోయాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బాధితులు విషయాన్ని పోలీసులకు చేరవేశారు. -
మేల్కొంటున్నారు!
నగరంలో తగ్గిన ట్రాఫిక్ ఉల్లంఘనలు వాహనదారుల్ల పెరిగిన అవగాహన జరిమాన పెంపు, చార్జీషీట్లే కారణం సిటీబ్యూరో: నగరంలో ట్రాఫిక్ ఉల్లంఘనలు తగ్గాయి. సిగ్నల్ జంప్‌లు, రాంగ్‌రూట్, త్రిబుల్ రైడింగ్, రాంగ్ పార్కింగ్ చేసేందుకు వాహనదారులు జంకుతున్నారు. ఒకపక్క జరిమానాలు పెంపు, మరోపక్క పెండింగ్ చలానా దారులపై చార్జిషీటు దాఖలు చేసి, కోర్టులో హాజరుపర్చడమే ఇందుకు ప్రధాన కారణం. వాహనదారుల్లో అవగాహన పెరగడం వల్లనే ఉల్లంఘనలు తగ్గాయని అధికారులు భావిస్తున్నారు.గత ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు 8,79,251 నమోదుకాగా ఈ ఏడాది మూడు నెలల్లో 7,17,528 కేసులు నమోదు అయ్యాయి. అంటే గతేడాది కంటే ఈ ఏడాది 1,61,723 కేసులు తగ్గాయి. ఒకపక్క నగరంలో వాహనాల సంఖ్య పెరిగినా..ఉల్లంఘన కేసులు తగ్గడం గమనార్హం. మూడు నెలల నుంచి పెండింగ్ చలానాలు వసూలుపై ట్రాఫిక్ అదనపు పోలీసు కమిషనర్ జితేందర్, డీసీపీలు రంగనాథ్, ఎస్.కె.చౌహాన్లు దృష్టి సారించి చార్జిషీట్ విధానాలకు తెరలేపడం మూలంగా 5,15,643 చలానాలను వాహనదారులు క్లియర్ చేశారు. తద్వారా ప్రభుత్వానికి జరిమానాల రూపంలో రూ.9,86,44,160 వచ్చాయి. ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ కూడా పెరగడంతో వాహనదారుల్లో ట్రాఫిక్‌పై అవగాహన పెంచగలిగారు. ప్రధాన కారణాలు ఇవే... నాలుగేళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న రూ.80 కోట్ల బకాయిలు వసూలు చేసే ప్రక్రియ ప్రారంభం మూడు కన్న ఎక్కువ చలానాలు ఉన్నవారిని కోర్టులో హాజరుపర్చడం కూడళ్లలో మైక్‌ల ద్వారా ట్రాఫిక్‌పై అవగాహన కల్పించడం సీసీ కెమెరాల ద్వారా ఉల్లంఘనుల భరతం పట్టడం త్వరలో ఉల్లంఘనులపై డేగకన్న పెట్టేందుకు ఇంటర్‌సెప్టర్ వాహనాలు రంగంలోకి దిగనున్నాయి. -
పార్కింగ్ వివాదం... ఎంపీ కొడుకుపై దాడి
న్యూఢిల్లీ: పార్కింగ్ విషయమై తలెత్తిన వివాదంలో ఓ ఎంపీ కొడుకుపై దాడి జరిగింది. ఈ ఘటన ఢిల్లీలోని సౌత్‌ఎక్స్‌టెన్షన్ ప్రాంతంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. బీహార్‌లోని జహానాబాద్ పార్లమెంటు సభ్యుడు అరుణ్ కుమార్ తనయుడు రితురాజ్ వృత్తిరీత్యా న్యాయవాది. సోమవారం రాత్రి 9 గంటల సమయంలో రితురాజ్ తన సోదరుడు రిషబ్‌తో కలసి ఇంటికి చేరుకున్నాడు. అయితే, ఇంటి గేట్ ముందు ఓ స్కూటీ పార్క్ చేసి ఉండడంతో దాన్ని తీయాలని యజమానిని కోరాడు. స్కూటీ తీసిన తర్వాత ఆ స్థలంలో రితురాజ్ తన కారు పార్క్ చేసి ఇంట్లోకి వెళ్లాడు. కొంత సమయం తర్వాత రితురాజ్ బయటకు వచ్చి చూడగా మళ్లీ గేటు ముందు స్కూటీ పార్క్ చేసి ఉంది. దాన్ని తీయాలని మరోసారి కోరడంతో వారి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత స్కూటీ యజమాని మరికొందరితో కలసి వచ్చి తనపై, తన సోదరుడిపై దాడికి పాల్పడినట్టు రితురాజ్ హౌజ్‌ఖాస్ పోలీసులకు ఫిర్యాదు చేయగా... వారు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఒకరి దారుణహత్య
నరికి చంపిన దుండగులు మృతదేహం పూడ్చిపెట్టిన వైనం.. బాసర : బాసర గ్రామంలోని పోచమ్మ కాలనీకి చెందిన మెట్టు భీమన్న(50)ను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. కాళ్లు, చేతులు నరికి మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెట్టు భీమన్న రెండ్రోజుల క్రితం కూలీ పని నిమిత్తం వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి వెళ్లాడు. తిరిగి రాకపోవడంతో కుమారుడు ఎర్రన్న బాసర పరిసర ప్రాంతాల్లో వెతికాడు. కిర్గుల్(బి) రోడు సమీపంలోని వ్యవసాయ పొలంలో భీమన్నకు సంబంధించిన చెప్పలు, దుస్తులు కనిపించాయి. ఈ విషయమై మంగళవారం సాయంత్రం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బుధవారం పరిసర ప్రాంతాల్లో గాలించగా పాడుబడిన బావి సమీపంలోని సంపు వద్ద మృతదేహాన్ని పూడ్చిపెట్టినట్లు గుర్తించారు. శవాన్ని బయటకు తీయగా భీమన్నగా నిర్దారించారు. గుర్తు తెలియని వ్యక్తులు భీమన్న చేతులు, కాళ్లు, మెడ నరికి పూడ్చి పెట్టినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. నిందితులను త్వరలో పట్టుకుంటామని డీఎస్పీ తెలిపారు. సంఘటన స్తలాన్ని ముథోల్ సీఐ జాదవ్ గణపతి, బాసర ఎస్సై బి.అనిల్, తహశీల్దార్ నారాయణ పరిశీలించి పంచనామా చేశారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు, కూతురు ఉన్నారు. వరుస హత్యలతో భయం.. భయం.. బాసర గ్రామంలో వరుస హత్యలతో ప్రజలు భయం భయంగా కాలం వెళ్లదీస్తున్నారు. బాసర, మైలాపూర్ గ్రామాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 2013లో బాసర గ్రామానికి చెందిన అశోక్, మణికంఠతోపాటు మరొకరిని ఒకే ఇంట్లో దుండగులు కత్తులతో చంపిన విషయం తెలిసిందే. వారం రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తిని బాసర-నిజామాబాద్ రహదారి సమీపంలో దారుణంగా హత్య చేశారు. ఆ సంఘటనను ప్రజలు మరవకముందే భీమన్న హత్యకు గురికావడం కలకలం రేపుతోంది. -
పోలీస్‌స్టేషన్‌పై ఆర్మీ జవాన్ల దాడి
నాసిక్: మహారాష్ట్రలోని ఉపానగర్ పోలీస్‌స్టేషన్‌పై ఆర్మీ జవాన్లు బుధవారం విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు గాయపడగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. స్టేషన్ ఆవరణలో తమ వాహనాన్ని పార్కింగ్ చేసుకోవడానికి మంగళవారం రాత్రి పోలీసులు అనుమతించకపోడంతో దాదాపు 150 మంది జవాన్లు బుధవారం ఉదయం పోలీస్‌స్టేషన్‌పై దాడి చేశారు. అక్కడున్న మహిళా పోలీసుపై అసభ్యంగా ప్రవర్తించారు. అడ్డొచ్చిన పోలీసులందరినీ చితకబాదారు. ఈ ఘటనపై ఆర్మీ విచారణకు ఆదేశించింది. ఈ కేసులో ఆరుగురు జవాన్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
అంతా మా ఇష్టం..
ఆగని ‘కళ్యాణలక్ష్మి’ కబ్జా నిబంధనలు హుష్‌కాకి కార్పొరేషన్ అధికారుల నిద్రమత్తు పార్కింగ్ కోసం నాలాపై స్లాబ్ నిర్మాణం విమర్శలు వెల్లువెత్తుతున్న వైనం హన్మకొండ : వరంగల్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చేపడుతు న్న పనుల్లో పారదర్శకత లోపిస్తోంది. ప్రభుత్వ నిబంధనలను కార్పొరేషన్ అధికారులు తమ ఇష్టానుసారంగా ఉపయోగించుకుంటున్నారనే ఆరోపణలకు కళ్యాణలక్ష్మి షాపిం గ్‌మాల్ ఎదుట ఉన్న నాలాపై జరుగుతున్న స్లాబ్ నిర్మాణమే అద్దం పడుతోంది. కేవలం పద్దెనిమిది రోజుల వ్యవధిలోనే బల్దియా అధికారులు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేయడం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. హన్మకొండ న గర నడిబొడ్డున ‘కళ్యాణలక్ష్మి నాలా స్లాబ్’ వ్యవహారంపై బల్దియా అధికారులు స్పందించిన తీరు ఇలా ఉంది. ఆగష్టు 2వ తేదీ.. ఫండ్ యువర్ సిటీలో నిబంధనల ప్రకారం.. ప్రైవేట్ వ్య క్తులు నగరంలో ఏదైనా పని చేపట్టాలంటే ముందుగా నగరపాలక సంస్థకు దరఖాస్తు చేసుకోవాలి. దీనిపై కార్పొరేష న్ బహిరంగ నోటీసులు జారీ చేస్తుంది. సదరు పనిపై ప్ర జాభిప్రాయ సేకరణ కూడా ఉంటుంది. అభ్యంతరాలు, సూచనలు పరిశీలించి అనుమతి ఇవ్వాలా లేదా అనేది నిర్ణయిస్తాం. అనుమతి ఇస్తేనే నిర్మాణాలు జరపాలి. అనుమతి రాకుండా నిర్మాణం చేపడితే కూల్చివేస్తాం. కళ్యాణలక్ష్మి షా పింగ్ మాల్ ఎదురు నాలాపై నిర్మాణం కోసం కొందరు దరఖాస్తు చేశారు. అయితే అనుమతి ఇవ్వకముందే పను లు ప్రారంభించినందున నిర్మాణాన్ని నిలిపివేశాం. ఆగష్టు 20వ తేదీ.. ఫండ్ యువర్సిటీ కార్యక్రమంలో భాగంగా కళ్యాణలక్ష్మి షాపింగ్‌మాల్ ఎదురు నాలాపై స్లాబ్ నిర్మాణం చేపట్టేందు కు బల్దియా కమిషనర్ సువర్ణపండాదాస్ అనుమతించారు. దాని ప్రకారమే వారు నిర్మాణం చేపడుతున్నారు. అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. హన్మకొండ బస్‌స్టేషన్ నుంచి కాంగ్రెస్ భవన్‌కు వెళ్లే దారి నిత్యం ర ద్దీగా ఉంటుంది. అయితే ఈ మార్గంలో ఉన్న కళ్యాణలక్ష్మి షాపింగ్‌మాల్ యాజమాన్యం తమ దుకాణానికి వచ్చే కస్టమర్లు వాహనాలు పార్కింగ్ చేసేందుకు వీలుగా నాలాపై స్లాబ్ నిర్మాణం చేపట్టింది. దీంతో ట్రాఫిక్ సమస్య లు పెరుగుతాయని తెలిసినా పట్టించుకోకుండా తమ వ్యా పారం సాఫీగా సాగితే చాలనే విధంగా 2012లో సదరు యాజమాన్యం స్లాబ్ నిర్మాణాన్ని ప్రారంభించింది. అయితే నిబంధనలకు విరుద్ధమంటూ అప్పటి కలెక్టర్ రాహుల్బొ జ్జా, మునిసిపల్ కమిషనర్ వివేక్‌యాదవ్ యాజమాన్యం పై కన్నెర్ర జేశారు. అనంతరం అక్రమంగా చేపట్టిన నిర్మాణాన్ని కూల్చి వేయించారు. ఇదిలా ఉండగా, సరిగ్గా రెండేళ్ల తర్వాత ఈ ఏడాది నవంబర్ 30వ తేదీన కళ్యాణలక్ష్మి షాపింగ్ మాల్ యాజమాన్యం మరోసారి పనులు ప్రారంభించింది. కాగా, ఈ నిర్మాణంపై నగర పాలక సంస్థ సిటీ ప్లానింగ్ అధికారి రమేష్‌బాబును ‘సాక్షి’ వివరణ కోరగా... ఫండ్ యువర్ సిటీ పథకం ద్వారా నాలాపై స్లాబ్ నిర్మాణం చేపట్టేందుకు కళ్యాణలక్ష్మి షాపింగ్‌మాల్ యాజమాన్యం కార్పొరేషన్‌కు దరఖాస్తు చేసిందన్నారు. దీనిపై ప్రజాభి ప్రాయ సేకరణ చేపట్టి అభ్యంతరాలు స్వీకరిస్తామని, ఆ తర్వాత సంతృప్తి చెందినేతే నిర్మాణానికి అనుమతి ఇస్తామ ని పేర్కొన్నారు. కళ్యాణలక్ష్మి షాపింగ్‌మాల్ యాజమాన్యా నికి కార్పొరేషన్ అనుమతి రాకముందే నిర్మాణం ప్రారంభించినందున పనులు నిలిపేశామని చెప్పారు. కాగా, సరిగ్గా పద్దెనిమిది రోజుల తర్వాత కళ్యాణలక్ష్మి షాపింగ్‌మాల్ యాజమాన్యం నాలాపై తిరిగి స్లాబ్ నిర్మాణం చేపట్టడం గమనార్హం. ప్రజాభిప్రాయ సేకరణకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వకుండా... ఎవరి నుంచి అభ్యంతరాలు స్వీకరిం చకుం డా పనులు ప్రారంభించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా, ఈ నిర్మాణంపై సిటీ ప్లానింగ్ అధికారిని ‘సాక్షి’ మరోసారి వివరణ అడగగా... ప్రజాభిప్రాయ సేకరణ.. అభ్యంతరాల స్వీకరణపై స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. కమిషనర్ సువర్ణపండాదాస్ అ నుమతి ప్రకారమే పనులు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. -
తప్పు చేసింది కాక.. ఇలా చిందులు తొక్కింది..!