వైవిధ్యభరిత కథా చిత్రాలను ఎంపిక చేసుకుని నటిస్తున్న యువనటుడు హరీష్‌కల్యాణ్. ఈయన ఇటీవల ఎల్‌జీఎం చిత్రంతో ప్రేక్షకులను అలరించి తాజాగా పార్కింగ్‌తో తెరపైకి రావడానికి సిద్ధం అవుతున్నారు. నటి ఇందుజా నాయకిగా నటించిన ఇందులో ఎంఎస్.భాస్కర్, రమా, ఇళవరసు, ప్రార్థన ముఖ్యపాత్రలు పోషించారు. రామ్‌కుమార్ బాలకృష్ణన్ అనే నవ దర్శకుడిని పరిచయం చేస్తూ ఫ్యాషన్ స్టూడియోస్, సోల్జర్స్ ఫ్యాక్టరీ సంస్థలు నిర్మించిన చిత్రం ఇది. శామ్.సీఎస్ సంగీతాన్ని, జిజు సన్ని ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకుని డిసెంబర్ ఒకటో తేదీన విడుదలకు సిద్ధమఅవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ చైన్నెలో సమావేశం ఏర్పాటు చేసింది.
లాక్‌డౌన్ సమయంలో జరిగిన సంఘటనలను ఆధారంగా చేసుకుని రాసుకున్న కథతో తెరకెక్కించిన చిత్రమే పార్కింగ్ అని దర్శకుడు రామ్‌కుమార్ బాలకృష్ణన్ చెప్పారు. ఆ సమయంలో జరిగిన పలు సంఘటనలు ఈ చిత్రంలో చోటుచేసుకుంటాయన్నారు. ఇప్పుడు ప్రతి వ్యక్తి ఎప్పుడో, ఎక్కడో ఎదుర్కొనే సంఘటనలే నేపథ్యమని పేర్కొన్నారు. ముఖ్యంగా ఈగో అనే అంశాన్ని ఇతివృత్తంగా తీసుకుని పార్కింగ్ చిత్రాన్ని రూపొందించినట్లు చెప్పారు.
ఇందులో హరీష్ కల్యాణ్ ఒక ఐటీ కంపెనీలో ఉద్యోగిగానూ.. ఆయనకు భార్యగా ఇందుజా నటించారని తెలిపారు. మరో ముఖ్యపాత్రలో నటుడు ఎంఎస్.భాస్కర్ నటించారని తెలిపారు. చిత్రంలో రెండు పాటలు ఉంటాయని చెప్పారు. ప్రీ ప్రొడక్షన్స్‌కు అధిక సమయం కేటాయించి షూటింగ్‌ను చైన్నె పరిసర ప్రాంతాల్లో 36 రోజుల్లో పూర్తిచేసినట్లు తెలిపారు. మానవతావాదం ముఖ్యం అని చెప్పే చిత్రంగా పార్కింగ్ ఉంటుందని దర్శకుడు తెలిపారు. తనకు కథను చెప్పిన దానికంటే బెటర్‌గా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరపై ఆవిష్కరించారని నటుడు హరీశ్‌కల్యాణ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment