జీవితాల్లోని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన చిత్రాల్లో జీవం ఉంటుంది. అలాంటి కథలకు కాస్త సినిమా టిక్ సన్నివేశాలను కలిపితే అది మరింత జనరంజక చిత్రంగా మారుతుంది. ఈ తరహా చిత్రాలకు పెద్దగా క్యాస్టింగ్ గురించి పట్టించుకోరు. కథ, కథనాలు బిగువుగా ఉంటే చాలు.. అలాంటి కథాంశంతో తెరకెక్కిన చిత్రం వెప్పమ్ కుళీర్ మళై. హాష్ ట్యాగ్ ఎఫ్‌డీఎఫ్‌ఎస్ పతాకంపై ధీరవ్ కథానాయకుడిగా నటిస్తుండగా.. ఇస్మత్ భాను హీరోయిన్‌గా పరిచయమవుతోంది. పస్కల్ వేదముత్తు ఈ సినిమాతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నారు.
ముఖ్యంగా పిల్లల పుట్టుక గురించి ఆవిష్కరించిన చిత్రమిది. పెళ్లి తరువాత ఆ దంపతులకు పిల్లలు పుట్టక పోతే కుటుంబ సభ్యుల నుంచి, ఊరు జనం వరకూ ఎలాంటి అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఆధునిక సమాజంలో ప్రకృతికి విరుద్ధంగా కలిగి సంతానం కారణంగా ఎలాంటి మనోవేదనకు గురవుతారు? వంటి అంశాలను, సహజ సిద్ధంగా పిల్లలు పుట్టడానికి కారణాలు అంటూ పలు ఆసక్తికరమైన అంశాలతో తెరకెక్కిన చిత్రమే వెప్పమ్ కళీర్ మళై.
ఈ సినిమాలో ఎంఎస్ భాస్కర్, నటి రమ, మాస్టర్ కార్తీకేయన్, దేవ్‌హబిబుల్లా తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. శంకర్ రంగరాజన్ సంగీతాన్ని, పృధ్వీ రాజేంద్రన్ ఛాయాగ్రహణం అందించారు. దర్శకుడు ఒక గ్రామీణ నేపథ్యాన్ని తీసుకుని వైవిధ్యంగా తెరకెక్కించారు. ఆధ్యంతం ఆసక్తిని రేకెత్తించేలా రూపొందిన ఈ చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది.
Comments
Please login to add a commentAdd a comment