సూర్య 'కంగువా'.. ఆ క్రేజీ సాంగ్ వచ్చేసింది! | Kollywood Star Hero Suriya Latest Movie Kanguva Lyrical Song Out Now | Sakshi
Sakshi News home page

Suriya: 'కంగువా' నాయక సాంగ్.. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్‌!

Published Wed, Oct 30 2024 1:36 PM | Last Updated on Wed, Oct 30 2024 1:36 PM

Kollywood Star Hero Suriya Latest Movie Kanguva Lyrical Song Out Now

కోలీవుడ్ సూపర్ స్టార్ సూర్య నటించిన భారీ పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ 'కంగువా'. ఈ చిత్రాన్ని శివ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ భారీ బడ్జెట్‌ చిత్రంలో దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ వచ్చేనెల థియేటర్లలో సందడి చేయనుంది. ప్రస్తుతం కంగువా టీమ్ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు.

కంగువా విడుదలకు మరో రెండు వారాలు ఉండడంతో చిత్రయూనిట్ వరుసగా అప్‌డేట్స్‌ ఇస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి నాయకా..' లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందించగా.. రాకేందు మౌళి లిరిక్స్ అందించారు. కాగా.. ఈ సినిమాను నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేయబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 14న విడుదల కానుంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement